గత రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయకిగా బహుభాషల్లో రాణిస్తున్న నటి త్రిష. నాలుగు పదుల వయసులోనూ క్రేజీ కథానాయకిగా వెలుగొందడం సాధారణ విషయం కాదు. ఒక దశలో ఈమె నటించిన హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రాలు నిరాశపరచడంతో త్రిష పని అయ్యిపోయింది. తట్టా బుట్టా సర్దుకోవాల్సిసిందే అనే కామెంట్స్ వచ్చాయి. అయితే పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో త్రిష సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో,అదీ అగ్రహీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా కొందరు ప్రముఖ హీరోయిన్ల మాదిరిగానే త్రిష కూడా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.
అక్కడ 'కట్టా మిఠా' అనే చిత్రంలో నటించారు. అయితే అదే ఆమె నటించిన తొలి, చివరి చిత్రంగా మారింది. ఇటీవల ఒక భేటీలో తొలి హిందీ చిత్రం ప్లాప్ కావడంతో బాలీవుడ్‌లో అవకాశాలు రాలేదా? అన్న ప్రశ్నకు త్రిష బదులిస్తూ తాను 2010లో కట్టా మిఠా చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యానన్నారు. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఆ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడని చెప్పారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందన్నారు.
దీంతో బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ప్లాప్ కావడంతో అవకాశాలు రాలేదని, తాను బాలీవుడ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి తాను తన కుటుంబాన్ని ముంబాయికి మార్చడానికి సిద్ధంగా లేనన్నారు. బాలీవుడ్‌కు వెళ్లాలంటే దక్షిణాదిలో చాలా మందిని వదులుకోవాలన్నారు. అలాగే బాలీవుడ్‌లో తన కెరీర్‌ను మళ్లీ కొత్తగా మొదలెట్టాల్సి ఉంటుందన్నారు. అంత ఆసక్తి తనకు అప్పట్లో లేదన్నారు. అందుకే హిందీ చిత్రాల్లో కంటిన్యూగా నటించలేదని త్రిష స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ అజిత్ సరసన విడాముయర్చి, కమలహాసన్‌కు జంటగా థగ్ లైఫ్ చిత్రాలతో పాటు తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment