పవర్‌ఫుల్‌ విశ్వంభర | Vishwambhara: Makers share new poster on Chiranjeevi birthday | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ విశ్వంభర

Aug 23 2024 12:20 AM | Updated on Aug 23 2024 12:20 AM

Vishwambhara: Makers share new poster on Chiranjeevi birthday

హీరో చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు ‘విశ్వంభర’ మూవీ మేకర్స్‌. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లు. కునాల్‌ కపూర్‌ ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఫస్ట్‌ లుక్‌ చూస్తే చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని చేత పట్టుకుని పవర్‌ఫుల్‌గా కనిపించారు. చిరంజీవి లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరుపులతో కూడిన ఈ ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌ అంటున్నారు మెగా అభిమానులు. ‘‘క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’. తన అభిమాన హీరో చిరంజీవితో ‘విశ్వంభర’ను ప్రతిష్టాత్మక ్రపాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు వశిష్ఠ. 

ఈ సినిమా కోసం ఓ ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించాం. అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్, హై యాక్షన్, చక్కని డ్రామాతో విజువల్‌ వండర్‌గా ఈ మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 2025 జనవరి 10న  విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement