'విశ్వంభర'లో విలన్‌ ఎంట్రీ.. అధికారిక ప్రకటన Chiranjeevi stars in Vishwambhara, directed by Mallidi Vasishta. Kunal Kapoor plays the antagonist. Sakshi
Sakshi News home page

'విశ్వంభర'లో విలన్‌ ఎంట్రీ.. అధికారిక ప్రకటన

Published Fri, Jun 14 2024 11:00 AM | Last Updated on Fri, Jun 14 2024 1:33 PM

Director Vasishta Announced Vishwambhara Villain

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ' విశ్వంభర'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంటర్వెల్‌ సమయంలో వచ్చే ఒక భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను కూడా చిత్ర యూనిట్‌ పూర్తి చేసింది. రామ్‌ - లక్ష్మణ్‌ నేతృత్వంలో ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే, తాజాగా 'విశ్వంభర' విలన్‌ పాత్రలో కనిపించేది ఎవరో చిత్ర యూనిట్‌ తెలిపింది. తాజాగా డైరెక్టర్‌ వశిష్ఠ ఒక ఫోటో కూడా షేర్‌ చేశాడు.

విశ్వంభరలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు కునాల్ కపూర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన పేరును అధికారికంగా మేకర్స్‌ ప్రకటించారు. కునాల్‌ కపూర్‌ గతంలో నాగార్జున,నాని నటించిన దేవదాస్‌ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించాడు. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు విశ్వంభరలో అడుగుపెట్టాడు. వాస్తవంగా ఈ చిత్రంలో విలన్‌గా నటించే ఛాన్స్‌ మొదట రానా దగ్గుబాటికి దక్కింది. అయితే, రానా తన తదుపరి చిత్రంలో నటించబోయే పాత్రకు కాస్త దగ్గరగా ఉండటంతో విశ్వంభరకు నో చెప్పాడని వార్తలు వచ్చాయి. 

దీంతో కునాల్‌ కపూర్‌కు ఆ ఛాన్స్‌ దక్కింది. ఇప్పటికే ఆయనతో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌ సోదరుడి కూతురు నైనా బచ్చన్‌ను కునాల్‌ వివాహం చేసుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విశ్వంభర విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, అశికా రంగనాథ్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement