Kunal Kapoor
-
విశ్వంభర యాక్షన్
చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ అ¯Œ్ల అరసు నేతృత్వంలో ‘విశ్వంభర’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ‘‘చిరంజీవి చరిష్మాటిక్ ప్రెజెన్స్ తో ‘విశ్వంభర’ మునుపెన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న రిలీజ్ కానుంది. చిరంజీవి కోటి విరాళం కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్‌లో భారీ ఎత్తున ్ర΄ాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన నటీనటులు తమవంతుగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా హీరో చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ కోటి రూ΄ాయలు విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ 25లక్షల విరాళంవయనాడ్ వరద బాధితుల సహాయార్థం హీరో అల్లు అర్జున్ కూడా 25 లక్షలు విరాళం ప్రకటించారు.సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఆ మొత్తాన్ని అందించనున్నట్లు ఆయన తెలి΄ారు. -
'విశ్వంభర'లో విలన్ ఎంట్రీ.. అధికారిక ప్రకటన
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ' విశ్వంభర'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా చిత్ర యూనిట్ పూర్తి చేసింది. రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే, తాజాగా 'విశ్వంభర' విలన్ పాత్రలో కనిపించేది ఎవరో చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా డైరెక్టర్ వశిష్ఠ ఒక ఫోటో కూడా షేర్ చేశాడు.విశ్వంభరలో విలన్‌గా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన పేరును అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కునాల్ కపూర్ గతంలో నాగార్జున,నాని నటించిన దేవదాస్ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించాడు. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు విశ్వంభరలో అడుగుపెట్టాడు. వాస్తవంగా ఈ చిత్రంలో విలన్‌గా నటించే ఛాన్స్ మొదట రానా దగ్గుబాటికి దక్కింది. అయితే, రానా తన తదుపరి చిత్రంలో నటించబోయే పాత్రకు కాస్త దగ్గరగా ఉండటంతో విశ్వంభరకు నో చెప్పాడని వార్తలు వచ్చాయి. దీంతో కునాల్ కపూర్‌కు ఆ ఛాన్స్ దక్కింది. ఇప్పటికే ఆయనతో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని సమాచారం. అమితాబ్ బచ్చన్ సోదరుడి కూతురు నైనా బచ్చన్‌ను కునాల్ వివాహం చేసుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విశ్వంభర విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, అశికా రంగనాథ్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు. View this post on Instagram A post shared by Vashistaa Mallidi (@vassishta_006) -
కునాల్ కపూర్ విడాకులు : భార్య అంత వేధించిందా?
సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు ఢిల్లీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించిందంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వెల్లువెత్తాయి. భర్తను అప్రతిష్టపాలు చేసేలా ఆరోపణలు ,నిరాధారమైన వాదనలు, అతని ప్రతిష్టపై ప్రభావం చూపుతాయని క్రూరత్వానికి సమానమని కోర్టు పేర్కొంటూ ఆయనకు విడాకుల పిటీషన్‌ను కోర్టు సమర్ధించింది. అసలు ఇంతకీ కునాల్ కపూర్ మాజీ భార్య ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది నిజంగానే క్రూరంగా ప్రవర్తించింది లాంటి వివరాలను పరిశీలిద్దాం..! పలు మీడియా నివేదికల ప్రకారం 2008, ఏప్రిల్‌లో కునాల్ ఏక్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వారి పెళ్లయిన తొలిరోజులో, లగ్జరీ కారు లేదనీ, ఉన్న కారు చిన్న కారంటూ ఎగతాళి చేసింది. ఏమీ లేదంటూ ఎద్దేవా చేసేదట. అతనికి చెప్పకుండానే తన ఉద్యోగాన్ని వదిలేసింది. అతనిపై కక్షసాధించేందుకే ఇంట్లో పనిలేకుండా కూర్చుంది. ఏక్తా కపూర్ భర్తపట్ల, అతని తల్లి దండ్రుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేదని, ఒకటిరెండుసార్లు అతనిపై చేయి కూడా చేసుకుంది అనేది ప్రధాన ఆరోపణ. (భార్య క్రూరత్వం : సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు భారీ ఊరట) కానీ కునాల్ భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాడు. ఫారిన్ టూర్లు తీసుకెళ్లాడు. కానీ ఆమె ఎప్పుడూ కావాలనే తగాదా పడేది. ఈ వివాదాల నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం ప్రయత్నించాడు. ఆమె ఏమీ మారలేదు. టీవీ షో మాస్టర్ చెఫ్‌కి ఎంపికైనప్పుడు వీరిద్దరి మరిస్థితులు మరింత దారుణంగా మారాయి. అతనికి మంచి పేరు రావడం కూడా ఆమె తట్టుకోలేకపోయింది. యష్‌రాజ్ స్టూడియోస్‌లో షో షూట్లో ఉండగా కొడుకుతో కలిసి స్టూడియోకు వచ్చి గొడవ చేసింది. టీవీ షో జడ్జ్‌గా పాపులర్ అయిన తర్వాత, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని నిరంతరం బెదిరించేంది.షూట్‌కి ఒకరోజు ముందు చెంపదెబ్బ కొట్టిందని కునాల్ ఆరోపించాడు. (గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ యాక్టర్) కొడుకు పుట్టిన తర్వాత బిడ్డను కూడా సరిగ్గా పట్టించు కోలేదు. పిల్లాడిని పనిమనిషికి వదిలేసి మాల్స్‌కు వెళ్లిపోయేది. 2013లో కునాల్‌ని కొట్టింది కూడా. దీన్ని కునాల్ తండ్రి రికార్డ్ చేశాడు. దీంతో ఆమె ఆ ఫోన్ లాక్కొని వృద్ధుడని కూడా చూడకుండా కర్రతో కొట్టడానికి కూడా ప్రయత్నించింది. ఈ వ్యవహారం పోలీసుల దాకా పోయింది. 2014లో జరిగిన మరో సంఘటనలో, కునాల్ తండ్రిని ప్లాస్టిక్ కుర్చీతో దాడి చేయడంతో విభేదాలు మరింత రాజుకున్నాయి. 2015లో మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆమె ఇంటిముందు గలాటా చేసింది. చివరికి విసిపోయిన కునాల్ ఆమెనుంచి దూరంగా వెళ్లాడు. అప్పటినుంచి కునాల్ , అతని భార్య విడివిడిగా ఉంటున్నారు. కుమారుడు మాత్రం తల్లితోనే ఉంటున్నాడు. అయితే బిడ్డను కలవడానికి లేదా మాట్లాడటానికి కూడా ఏక్తా అనుమతించేది కాదు. ప్రతిదానికీ డబ్బులు డిమాండ్ చేసేదని కునాల్ చాలా సార్లు వాపోయాడు. ఏక్తా కపూర్ వాదన: వివాహేతర సంబంధాలు అయితే ఈ ఆరోపణలన్నింటినీ ఏక్తా కపూర్ గతంలోనే ఖండించింది. తనకు విడాకులు ఇవ్వడానికి పన్నిన పన్నాగమని ఆరోపించింది. బాగా పేరు సంపాదించిన తర్వాత భర్తకు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించింది. అయితే భర్తను కొడుతున్న వీడియోను ఫ్యామిలీ కోర్టు తీరస్కరించింది. ఆమె నిగ్రహం కోల్పేయాలా కునాల్ ప్రవర్తించాడని కోర్టు ఈ వీడియోను తోసిపుచ్చింది. వరకట్న ఆరోపణలు చేసింది, అయితే, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో వీటిని ధృవీకరించలేకపోయింది. అయితే ఫ్యామిలీ కోర్టు విడాకులకు అంగీకరించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణలో భార్య క్రూరత్వాన్ని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు కునాల్‌కు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పుపై ఏక్తా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
భార్య క్రూరత్వం : సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు భారీ ఊరట
సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు భారీ ఊరట లభించింది. విడిపోయిన భార్యనుంచి ఢిల్లీ హైకోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది. భార్య తన పట్ల క్రూరత్వం ప్రదర్శిస్తుందనే వాదనను సమర్ధించిన కోర్టు కునాల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కునాల్ జీవిత భాగస్వామి ప్రవర్తన అగౌరపరిచేలా ఉందని, సానుభూతి లేని విధంగా ఉందని కోర్టు పేర్కొంది. ప్రతి వివాహంలో విబేధాలు అనివార్యమే అయినప్పటికీ, ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం నమ్మకంలేనపుడు ఆ వేదనను భరిస్తూ సహజీనం చేయాల్సిన అవసరం లేదని, కపూర్ కేసులో బాధల్ని భరిస్తూ భార్యతో కలిసి ఉండేందుకు అతని ఒక్క కారణం కూడా లేదని జస్టిస్ సురేష్ కుమార్ కైత్, నీనా బన్సల్ కృష్ణతో కూడిన న్యాయమూర్తుల బెంచ్ పేర్కొంది. (ఇక ఆ బాధలు నావల్ల కాదు..చిన్న వయసులోనే కఠిన నిర్ణయం) తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కపూర్ చేసిన అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు తాజాగా అతనికి విడాకులు మంజూరు చేసింది. భర్తను అప్రతిష్టపాలు చేసేలా ఆరోపణలు ,నిరాధారమైన వాదనలు, అతని ప్రతిష్టపై ప్రభావం చూపుతాయని ఇది క్రూరత్వానికి సమానమని కోర్టుపేర్కొంది. అంతేకాదు పెళ్లయిన రెండు సంవత్సరాలలోపే, అప్పీలుదారు తనను తాను సెలబ్రిటీ చెఫ్‌గా నిలబెట్టుకోవడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉందనీ, ఇది అతని కృషి సంకల్పానికి నిదర్శనమని కూడా వ్యాఖ్యానించింది. కాగా 2008, ఏప్రిల్‌లో కునాల్, నటి ఏక్తా కపూర్ జంట వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో ఒక కుమారుడు జన్మించాడు. తన భార్య తన తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించలేదని, తనను అవమానించిందని ఆరోపిస్తూ టెలివిజన్ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’ న్యాయనిర్ణేతగా ఉన్న సమయంలో కపూర్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే కోర్టును తప్పుదోవ పట్టించేందుకు కునాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఏక్తా వాదించింది. తన నుంచి విడిపోయేందుకు కునాల్ కట్టుకథ అల్లాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. (తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు) -
ఒకప్పుడు పండ్లు అమ్ముకుంటూ బతికాడు.. సినిమాల్లోకి వచ్చాక..
రజనీకాంత్ నేరుగా సినిమాల్లోకి రాలేదు. ముందు బస్ కండక్టర్‌గా పని చేశాడు, తర్వాత సినిమాల్లోకి వచ్చి సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా మొదట్లో ఫుడ్ స్టాల్లో పని చేశాడు. మోడలింగ్ చేస్తూ చిన్నా చితకా పాత్రలు పోషిస్తూ నేడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. అలా చాలామంది సినిమాల్లోకి రావడానికి ముందు అనేక పనులు చేశారు. ఇప్పుడు చెప్పుకునే వ్యక్తి కూడా మొదట్లో పండ్లు అమ్మాడు. ఆ తర్వాతే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇప్పుడు కోట్లు విలువ చేసే కంపెనీ నడుపుతున్నాడు. అతడే కునాల్ కపూర్. సినిమాకే అంకితమయ్యేవాడిని.. కునాల్ 18 ఏళ్ల వయసులో పండ్లు అమ్మేవాడట. ఈ విషయాన్ని అతడే గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'ఒక్కసారి నేను సినిమా ఒప్పుకున్నాక.. అబ్బా, ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని ఎన్నడూ అనుకోలేదు. సినిమాకే అంకితమయ్యేవాడిని. ఏదో ఒక పని చేయాలనుకుంటే సినిమాల్లోకి రాకముందు ఎలాగైతే పండ్లు ఎగుమతి చేసేవాడినో అదే పని కొనసాగించేవాడిని. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న డాలర్ రేటుతో పోలిస్తే ఈ వ్యాపారం మరింత లాభాలు తెచ్చిపెడుతుంది. కానీ నాకు సినిమా అంటేనే ఇష్టం' అని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటుడిగా.. 'అక్స్' అనే మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు కునాల్. తర్వాత నసీరుద్దీన్ షా నడిపిన యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు. 'మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్' అనే సినిమాలో తొలిసారి నటించాడు. తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'రంగ్‌దే బసంతి'. ఈ మూవీలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కాలేజీ విద్యార్థిగా నటించాడు. ఈ సినిమా తర్వాత అతడు అవకాశాల కోసం వెంపర్లాడే పనిలేకుండా పోయింది. ఆయనను వెతుక్కుంటూ బోలెడన్ని ఛాన్సులు వచ్చిపడ్డాయి. డాన్ 2, ఆజ నచ్లే, బచ్నాయే హసీనో, డియర్ జిందగీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. ఎంతోమంది ప్రాణం నిలబెట్టిన 'కెట్టో' ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు ఓ ఎంటర్ప్రెన్యూర్ కూడా! క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ కెట్టో స్థాపకుల్లో ఈయన ఒకరు. కెట్టో అనేది.. ఆపదలో ఉన్నవారి కోసం విరాళాలు సేకరించే ప్లాట్‌ఫామ్. 2012లో జహీర్ అదెన్వాలా, వరుణ్ సేత్‌లతో కలిసి కునాల్ ఈ కెట్టోను ప్రారంభించాడు. ఇది ఎంత బాగా హిట్టయిందంటే.. ఇప్పటివరకు రూ.1249 కోట్ల విరాళాలాను సేకరించి ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ఈ ప్లాట్‌ఫామ్ వల్ల సంస్థ వ్యవస్థాపకులకు దాదాపు రూ.110 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. కాగా కునాల్ కపూర్.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కూ బంధువే! అమితాబ్ సోదరుడు అజితాబ్ కూతురు నైనాను కునాల్ పెళ్లాడాడు. అలా వరుసకు అమితాబ్‌కు అల్లుడయ్యాడు. కునాల్ చివరగా ద ఎంపైర్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించాడు. చదవండి: ఆ దర్శకుడు నేను సినిమాల్లోకి పనికి రానన్నాడు.. ఇప్పుడు రెండు చోట్లా.. -
మనిషిని చంపడమే దేశభక్తా..: కునాల్ కపూర్
ఛండీగఢ్: దేశభక్తిపై బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీధుల్లో ఒకరిని చంపడం, లేకపోతే సోషల్ మీడియాలో ఒకరి మీద మరోకరు విమర్శలు చేసుకోవడమే దేశభక్తా అని ప్రశ్నించారు. దేశభక్తి అంటే ఇండియా-పాక్ మ్యాచ్‌ల్లో గంతులేయడం కాదన్నారు. దేశభక్తి అంటే ఒక సిద్ధాంతం అని, దేశ నిర్మాణం దానిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. దేశంలో ప్రతిఒక్కరూ సమానమేనని అందరికీ సమాన హక్కులు ఉంటాయని కపూర్ అన్నారు. పంజాబ్ యూనివర్సిటీలో తను ప్రధాన పాత్రపోషించిన సినిమా 'రాగ్దేశ్' ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎర్రకోటలో భారతీయ ఆర్మీనేపథ్యంలో ఈచిత్రం తెరకెక్కింది. ఇందులో కునాల్ ఆర్మీ మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్ ప్రాత పోషిస్తున్నారు. రాజ్యసభ టీవీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాకిస్తాన్ నటులను బాలీవుడ్ లో నటించడానికి అనుమతినివ్వాలన్నారు. కరణ్ జోహార్ నటించిన ఏ దిల్ హై ముస్కిల్ చిత్రంలో పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ ఉన్నాడని చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. కానీ తర్వాత రోజుల్లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో పాకిస్తాన్ నటుడు ఉన్నా ఎందుకు అభ్యంతరం తెలపలేదు. అందరికీ ఒకే న్యాయం ఉండాలన్నారు. -
అతను నాకు ఎప్పటికీ స్ఫూర్తి: హృతిక్
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్‌ను మరో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయన తనకు స్ఫూర్తి అని చెప్పారు. సినీ పరిశ్రమలో తనకు తెలిసిన అతికొద్దిమంది మంచివాళ్లలో కునాల్ కపూర్ ముందుంటారని తెలిపారు. రంగ్ దే బసంతి అనే ఒక్క చిత్రం ద్వారా కునాల్ అంటే ప్రపంచం మొత్తానికి తెలిసిందని, ఆయన నటన అద్భుతం అని కొనియాడారు. కునాల్ కపూర్ తాజాగా నటించిన చిత్రం 'కౌన్ కిత్నే పానీ మెయిన్'. ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన హృతిక్ కాసేపు మీడియాతో మాట్లాడారు. తాను నటనలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నా నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడని పేర్కొన్నారు. ఈ చిత్రం కునాల్‌కు ఘన విజయాన్ని అందించాలని ఆశిస్తున్నానని అన్నారు. -
గెటింగ్ మ్యారీడ్!
‘రంగ్ దే బసంతి, మీనాక్షి’ వంటి సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్న నటుడు కునాల్ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడట. అమితాబ్‌బచ్చన్ మేనకోడలు నైనా బచ్చన్‌తో ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ ఫార్ములా 3 రేసర్, ట్రైన్డ్ పైలట్ కునాల్.. త్వరలోనే వెడ్డింగ్ డేట్ ప్రకటిస్తామన్నాడు. ‘ప్రస్తుతం షూటింగ్‌లు, రేస్‌లు, స్క్రిప్ట్ రైటింగ్ల వంటి పనులతో తీరిక లేకుండా ఉన్నా. నైనా పరిస్థితీ అదే. మా ఫ్యామిలీస్ చర్చించి పెళ్లి రోజుపై త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తాయి’ అంటూ చెప్పాడు ఈ మల్టీ టాలెంటెడ్ నటుడు. -
చేతనైనంత సాయం చేద్దాం!
వరదల కారణంగా సర్వస్వాన్ని కోల్పోయిన కాశ్మీరీల కోసం బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విరాళాల సేకరణ ప్రారంభించాడు. స్వచ్ఛంద సంస్థ కేర్ ఇండియాతో కలిసి కాశ్మీర్ ప్రజలను ఆదుకోవాలంటూ ప్రచారం కూడా చేస్తున్నాడు. ఆర్థిక సాయం చేయాలనుకేవారి కోసం కేర్ ఇండియాకు సంబంధించిన ఓ వెబ్సైట్ లింక్‌ను కూడా ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘హాయ్.. నేను మీ కునాల్ కపూర్‌ను..! కాశ్మీర్ వరదల గురించి మీడియా ద్వారా తెలుసుకున్నాను. అక్కడి భీకర పరిస్థితిని మీడియా కళ్లకుగట్టినట్లు చూపించింది. ఇప్పటిదాకా 215 మంది మరణించారట. వేలాదిమంది సర్వస్వాన్ని కోల్పోయారట. ఈ దృశ్యాలు నన్ను ఎంతగానో కదిలించాయి. అందుకే కాశ్మీరీల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అక్కడి ప్రజలు కూడా మనలాంటివారే. అందుకే అందరినీ అభ్యర్థిస్తున్నాను. నాతో చేతులు కలపండి. కాశ్మీరీల సహాయం కోసం విరాళాలు సేకరిద్దాం. దేశ ప్రజలుగా వారికి మనమందరం ఉన్నామనే భరోసా కల్పిద్దాం. అందుకోసం చేతనైనంత సాయం చేద్దాం. ఈ సందేశంతోనే నేను మీకో వెబ్సైట్ లింక్‌ను పంపుతున్నాను. దీనిద్వారా మీరు విరాళాలను అందజేయవచ్చు. కేర్ ఇండియా సంస్థ ఈ విరాళాలతో కాశ్మీర్ ప్రజల కోసం అవసరమై సామగ్రిని కొనుగోలు చేసి, పంపుతుంది. పాలిథిన్ కవర్లు, మ్యాట్స్, సబ్సు, టూత్ బ్రష్ వంటివేకాకుండా దుప్పట్లు వంటివి పంపుతారు. రూ. 5000 విలువజేసే వంద కిట్లను పంపుతారు. కనీసం వంద కుటుంబాలకైనా మనం సాయం చేసినవారమవుతాం. వరదల్లో చిక్కుకున్న 76,500 మందిని సహాయ శిబిరాలకు చేర్చారు. వారిలో ఎంతమందికి అన్ని సదుపాయాలు అందుతున్నాయో చెప్పలేం. మనలాంటివారు చేసే సాయం కూడా ప్రభుత్వ సాయానికి తోడైతే బాధితుల్లో మనమంతా ఉన్నామనే భరోసా పెరుగుతుంద’ని కునాల్ తన ట్విటర్ సందేశంలో పేర్కొన్నాడు. -
చేతనైనంత సాయం చేద్దాం!
న్యూఢిల్లీ: వరదల కారణంగా సర్వస్వాన్ని కోల్పోయిన కాశ్మీరీల కోసం బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విరాళాల సేకరణ ప్రారంభించాడు. స్వచ్ఛంద సంస్థ కేర్ ఇండియాతో కలిసి కాశ్మీర్ ప్రజలను ఆదుకోవాలంటూ ప్రచారం కూడా చేస్తున్నాడు. ఆర్థిక సాయం చేయాలనుకేవారి కోసం కేర్ ఇండియాకు సంబంధించిన ఓ వెబ్సైట్ లింక్‌ను కూడా ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘హాయ్.. నేను మీ కునాల్ కపూర్‌ను..! కాశ్మీర్ వరదల గురించి మీడియా ద్వారా తెలుసుకున్నాను. అక్కడి భీకర పరిస్థితిని మీడియా కళ్లకుగట్టినట్లు చూపించింది. ఇప్పటిదాకా 215 మంది మరణించారట. వేలాదిమంది సర్వస్వాన్ని కోల్పోయారట. ఈ దృశ్యాలు నన్ను ఎంతగానో కదిలించాయి. అందుకే కాశ్మీరీల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అక్కడి ప్రజలు కూడా మనలాంటివారే. అందుకే అందరినీ అభ్యర్థిస్తున్నాను. నాతో చేతులు కలపండి. కాశ్మీరీల సహాయం కోసం విరాళాలు సేకరిద్దాం. దేశ ప్రజలుగా వారికి మనమందరం ఉన్నామనే భరోసా కల్పిద్దాం. అందుకోసం చేతనైనంత సాయం చేద్దాం. ఈ సందేశంతోనే నేను మీకో వెబ్సైట్ లింక్‌ను పంపుతున్నాను. దీనిద్వారా మీరు విరాళాలను అందజేయవచ్చు. కేర్ ఇండియా సంస్థ ఈ విరాళాలతో కాశ్మీర్ ప్రజల కోసం అవసరమై సామగ్రిని కొనుగోలు చేసి, పంపుతుంది. పాలిథిన్ కవర్లు, మ్యాట్స్, సబ్సు, టూత్ బ్రష్ వంటివేకాకుండా దుప్పట్లు వంటివి పంపుతారు. రూ. 5000 విలువజేసే వంద కిట్లను పంపుతారు. కనీసం వంద కుటుంబాలకైనా మనం సాయం చేసినవారమవుతాం. వరదల్లో చిక్కుకున్న 76,500 మందిని సహాయ శిబిరాలకు చేర్చారు. వారిలో ఎంతమందికి అన్ని సదుపాయాలు అందుతున్నాయో చెప్పలేం. మనలాంటివారు చేసే సాయం కూడా ప్రభుత్వ సాయానికి తోడైతే బాధితుల్లో మనమంతా ఉన్నామనే భరోసా పెరుగుతుంద’ని కునాల్ తన ట్విటర్ సందేశంలో పేర్కొన్నాడు.