సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు భారీ ఊరట లభించింది. విడిపోయిన భార్యనుంచి ఢిల్లీ హైకోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది. భార్య తన పట్ల క్రూరత్వం ప్రదర్శిస్తుందనే వాదనను సమర్ధించిన కోర్టు కునాల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కునాల్ జీవిత భాగస్వామి ప్రవర్తన అగౌరపరిచేలా ఉందని, సానుభూతి లేని విధంగా ఉందని కోర్టు పేర్కొంది.
ప్రతి వివాహంలో విబేధాలు అనివార్యమే అయినప్పటికీ, ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం నమ్మకంలేనపుడు ఆ వేదనను భరిస్తూ సహజీనం చేయాల్సిన అవసరం లేదని, కపూర్ కేసులో బాధల్ని భరిస్తూ భార్యతో కలిసి ఉండేందుకు అతని ఒక్క కారణం కూడా లేదని జస్టిస్ సురేష్ కుమార్ కైత్, నీనా బన్సల్ కృష్ణతో కూడిన న్యాయమూర్తుల బెంచ్ పేర్కొంది. (ఇక ఆ బాధలు నావల్ల కాదు..చిన్న వయసులోనే కఠిన నిర్ణయం)
తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కపూర్ చేసిన అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు తాజాగా అతనికి విడాకులు మంజూరు చేసింది. భర్తను అప్రతిష్టపాలు చేసేలా ఆరోపణలు ,నిరాధారమైన వాదనలు, అతని ప్రతిష్టపై ప్రభావం చూపుతాయని ఇది క్రూరత్వానికి సమానమని కోర్టుపేర్కొంది. అంతేకాదు పెళ్లయిన రెండు సంవత్సరాలలోపే, అప్పీలుదారు తనను తాను సెలబ్రిటీ చెఫ్‌గా నిలబెట్టుకోవడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉందనీ, ఇది అతని కృషి సంకల్పానికి నిదర్శనమని కూడా వ్యాఖ్యానించింది.
కాగా 2008, ఏప్రిల్‌లో కునాల్, నటి ఏక్తా కపూర్ జంట వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో ఒక కుమారుడు జన్మించాడు. తన భార్య తన తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించలేదని, తనను అవమానించిందని ఆరోపిస్తూ టెలివిజన్ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’ న్యాయనిర్ణేతగా ఉన్న సమయంలో కపూర్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే కోర్టును తప్పుదోవ పట్టించేందుకు కునాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఏక్తా వాదించింది. తన నుంచి విడిపోయేందుకు కునాల్ కట్టుకథ అల్లాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. (తైవాన్‌ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు)
Comments
Please login to add a commentAdd a comment