Celebrity chef
-
కునాల్ కపూర్ విడాకులు : భార్య అంత వేధించిందా?
సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు ఢిల్లీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించిందంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వెల్లువెత్తాయి. భర్తను అప్రతిష్టపాలు చేసేలా ఆరోపణలు ,నిరాధారమైన వాదనలు, అతని ప్రతిష్టపై ప్రభావం చూపుతాయని క్రూరత్వానికి సమానమని కోర్టు పేర్కొంటూ ఆయనకు విడాకుల పిటీషన్‌ను కోర్టు సమర్ధించింది. అసలు ఇంతకీ కునాల్ కపూర్ మాజీ భార్య ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది నిజంగానే క్రూరంగా ప్రవర్తించింది లాంటి వివరాలను పరిశీలిద్దాం..! పలు మీడియా నివేదికల ప్రకారం 2008, ఏప్రిల్‌లో కునాల్ ఏక్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వారి పెళ్లయిన తొలిరోజులో, లగ్జరీ కారు లేదనీ, ఉన్న కారు చిన్న కారంటూ ఎగతాళి చేసింది. ఏమీ లేదంటూ ఎద్దేవా చేసేదట. అతనికి చెప్పకుండానే తన ఉద్యోగాన్ని వదిలేసింది. అతనిపై కక్షసాధించేందుకే ఇంట్లో పనిలేకుండా కూర్చుంది. ఏక్తా కపూర్ భర్తపట్ల, అతని తల్లి దండ్రుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేదని, ఒకటిరెండుసార్లు అతనిపై చేయి కూడా చేసుకుంది అనేది ప్రధాన ఆరోపణ. (భార్య క్రూరత్వం : సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు భారీ ఊరట) కానీ కునాల్ భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాడు. ఫారిన్ టూర్లు తీసుకెళ్లాడు. కానీ ఆమె ఎప్పుడూ కావాలనే తగాదా పడేది. ఈ వివాదాల నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం ప్రయత్నించాడు. ఆమె ఏమీ మారలేదు. టీవీ షో మాస్టర్ చెఫ్‌కి ఎంపికైనప్పుడు వీరిద్దరి మరిస్థితులు మరింత దారుణంగా మారాయి. అతనికి మంచి పేరు రావడం కూడా ఆమె తట్టుకోలేకపోయింది. యష్‌రాజ్ స్టూడియోస్‌లో షో షూట్లో ఉండగా కొడుకుతో కలిసి స్టూడియోకు వచ్చి గొడవ చేసింది. టీవీ షో జడ్జ్‌గా పాపులర్ అయిన తర్వాత, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని నిరంతరం బెదిరించేంది.షూట్‌కి ఒకరోజు ముందు చెంపదెబ్బ కొట్టిందని కునాల్ ఆరోపించాడు. (గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ యాక్టర్) కొడుకు పుట్టిన తర్వాత బిడ్డను కూడా సరిగ్గా పట్టించు కోలేదు. పిల్లాడిని పనిమనిషికి వదిలేసి మాల్స్‌కు వెళ్లిపోయేది. 2013లో కునాల్‌ని కొట్టింది కూడా. దీన్ని కునాల్ తండ్రి రికార్డ్ చేశాడు. దీంతో ఆమె ఆ ఫోన్ లాక్కొని వృద్ధుడని కూడా చూడకుండా కర్రతో కొట్టడానికి కూడా ప్రయత్నించింది. ఈ వ్యవహారం పోలీసుల దాకా పోయింది. 2014లో జరిగిన మరో సంఘటనలో, కునాల్ తండ్రిని ప్లాస్టిక్ కుర్చీతో దాడి చేయడంతో విభేదాలు మరింత రాజుకున్నాయి. 2015లో మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆమె ఇంటిముందు గలాటా చేసింది. చివరికి విసిపోయిన కునాల్ ఆమెనుంచి దూరంగా వెళ్లాడు. అప్పటినుంచి కునాల్ , అతని భార్య విడివిడిగా ఉంటున్నారు. కుమారుడు మాత్రం తల్లితోనే ఉంటున్నాడు. అయితే బిడ్డను కలవడానికి లేదా మాట్లాడటానికి కూడా ఏక్తా అనుమతించేది కాదు. ప్రతిదానికీ డబ్బులు డిమాండ్ చేసేదని కునాల్ చాలా సార్లు వాపోయాడు. ఏక్తా కపూర్ వాదన: వివాహేతర సంబంధాలు అయితే ఈ ఆరోపణలన్నింటినీ ఏక్తా కపూర్ గతంలోనే ఖండించింది. తనకు విడాకులు ఇవ్వడానికి పన్నిన పన్నాగమని ఆరోపించింది. బాగా పేరు సంపాదించిన తర్వాత భర్తకు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించింది. అయితే భర్తను కొడుతున్న వీడియోను ఫ్యామిలీ కోర్టు తీరస్కరించింది. ఆమె నిగ్రహం కోల్పేయాలా కునాల్ ప్రవర్తించాడని కోర్టు ఈ వీడియోను తోసిపుచ్చింది. వరకట్న ఆరోపణలు చేసింది, అయితే, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో వీటిని ధృవీకరించలేకపోయింది. అయితే ఫ్యామిలీ కోర్టు విడాకులకు అంగీకరించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణలో భార్య క్రూరత్వాన్ని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు కునాల్‌కు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పుపై ఏక్తా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
భార్య క్రూరత్వం : సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు భారీ ఊరట
సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు భారీ ఊరట లభించింది. విడిపోయిన భార్యనుంచి ఢిల్లీ హైకోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది. భార్య తన పట్ల క్రూరత్వం ప్రదర్శిస్తుందనే వాదనను సమర్ధించిన కోర్టు కునాల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కునాల్ జీవిత భాగస్వామి ప్రవర్తన అగౌరపరిచేలా ఉందని, సానుభూతి లేని విధంగా ఉందని కోర్టు పేర్కొంది. ప్రతి వివాహంలో విబేధాలు అనివార్యమే అయినప్పటికీ, ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం నమ్మకంలేనపుడు ఆ వేదనను భరిస్తూ సహజీనం చేయాల్సిన అవసరం లేదని, కపూర్ కేసులో బాధల్ని భరిస్తూ భార్యతో కలిసి ఉండేందుకు అతని ఒక్క కారణం కూడా లేదని జస్టిస్ సురేష్ కుమార్ కైత్, నీనా బన్సల్ కృష్ణతో కూడిన న్యాయమూర్తుల బెంచ్ పేర్కొంది. (ఇక ఆ బాధలు నావల్ల కాదు..చిన్న వయసులోనే కఠిన నిర్ణయం) తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కపూర్ చేసిన అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు తాజాగా అతనికి విడాకులు మంజూరు చేసింది. భర్తను అప్రతిష్టపాలు చేసేలా ఆరోపణలు ,నిరాధారమైన వాదనలు, అతని ప్రతిష్టపై ప్రభావం చూపుతాయని ఇది క్రూరత్వానికి సమానమని కోర్టుపేర్కొంది. అంతేకాదు పెళ్లయిన రెండు సంవత్సరాలలోపే, అప్పీలుదారు తనను తాను సెలబ్రిటీ చెఫ్‌గా నిలబెట్టుకోవడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉందనీ, ఇది అతని కృషి సంకల్పానికి నిదర్శనమని కూడా వ్యాఖ్యానించింది. కాగా 2008, ఏప్రిల్‌లో కునాల్, నటి ఏక్తా కపూర్ జంట వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో ఒక కుమారుడు జన్మించాడు. తన భార్య తన తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించలేదని, తనను అవమానించిందని ఆరోపిస్తూ టెలివిజన్ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’ న్యాయనిర్ణేతగా ఉన్న సమయంలో కపూర్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే కోర్టును తప్పుదోవ పట్టించేందుకు కునాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఏక్తా వాదించింది. తన నుంచి విడిపోయేందుకు కునాల్ కట్టుకథ అల్లాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. (తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు) -
హిజాబ్ హీట్: పోలీసు కస్టడీలో సెలబ్రిటీ చెఫ్ ‘జామీ ఆలివర్’ మృతి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు తీవ్రంగా కొట్టటం వల్ల ప్రముఖ చెఫ్ మెహర్షాద్ షాహిదీ అలియాస్ ‘జామీ ఆలివర్’ మృతి చెందటం కలకలం సృష్టించింది. ఆయన అంత్యక్రియలకు శనివారం వేలాది మంది హాజరయ్యారు. మెహర్షాద్ షాహిదీ 20వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. అరక్ సిటీలో మెహర్షద్ షాహిదీని అదుపులోకి తీసుకున్నారు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. వారు తీవ్రంగా కొట్టటం ద్వారా మెహర్షద్ షాహిదీ పుర్రె దెబ్బతిని బుధవారం మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘అరెస్ట్ చేసిన తర్వాత లాఠీతో కొట్టటం ద్వారానే మా కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. అధికారుల ఒత్తిడి కారణంగా గుండె పోటుతో మరణించాడని చెప్పాల్సి వచ్చింది.’ అని బాధితుడి బంధువు ఒకరు ఇరాన్ ఇంటర్నేషనల్ టీవీకి తెలిపారు. మెహర్షద్ షాహిదీ గుండెపోటుతోనే మరణించాడని చెప్పాలని అధికారులు ఒత్తిడి చేశారని ఆయన కుటుంబం సభ్యులు సైతం వెల్లడించారు. మెహర్షద్ షాహిదికి ఇన్‌స్టాగ్రామ్‌లో 25వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన చేసిన వంటలు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది. ఇదీ చదవండి: హిజాబ్ ధరించలేదని పోలీసుల టార్చర్?.. కోమాలోంచే కన్నుమూసిన యువతి -
వంటల డాక్టర్.. యోగమ్బాళ్ సుందర్
లంచ్ బాక్సులో రోజుకో రకం పెట్టాలి. ఎన్ని రకాలని వండను? ఈ గృహిణికి పరిష్కారం యోగమ్బాళ్ చానెల్లో దొరుకుతుంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఏమేమి తినాలి? ఏం తినాలో డాక్టర్ చెబుతుంది... ఎలా వండాలో యోగమ్బాళ్ చెబుతుంది. యోగమ్బాళ్ సుందర్... సెలబ్రిటీ షెఫ్. అంటే ఆమె సెలబ్రిటీల షెఫ్ కాదు, చక్కగా వండుతూ సెలబ్రిటీ అయ్యారు. రెండేళ్ల కిందట మొదలైన ఆమె సొంత యూ ట్యూబ్ చానెల్‌కు ఈ రోజు మూడు లక్షల ఎనభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్లున్నారు. వాళ్లు ఆమె కొత్తగా విడుదల చేసే వంట కోసం ఎదురు చూస్తుంటారు. మరికొందరు కామెంట్ బాక్సులో తమ ఆరోగ్య సమస్యను తెలియచేస్తూ ఏం తినాలో, ఎలా వండాలో చెప్పమని అడుగుతుంటారు. గర్భిణిగా ఉన్నప్పుడు ఏం తినాలో, ఎలా వండాలో చేసి చూపిస్తారామె. అలాగే పాలిచ్చే తల్లి తినాల్సిన ఆహారాన్ని కూడా చెప్తారు, చేసి చూపిస్తారు. సాధారణంగా పాలిచ్చే తల్లి అనగానే పాలు సమృద్ధిగా ఉండడానికి తగిన ఆహారం మీదనే దృష్టి పెడతారు. కానీ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ దేహం తిరిగి శక్తి పుంజుకోవడం మీద ఇంట్లో వాళ్లు కూడా పెద్దగా ఆసక్తి చూపించరు. యోగమ్బాళ్ అందుకు కూడా వంటలను సూచిచస్తారు. దీంతో ఒకప్పుడు ఆమెను తమిళ టీవీలో వంటల ప్రోగ్రామ్‌లో చూసి ‘తెర నిండుగా’ అని పరిహసించిన వాళ్లు కూడా ఆమె వంటల చానెల్‌కు అభిమానులయ్యారు. బాడీ షేమింగ్‌ను తట్టుకుని నిలబడడం కష్టమైనందని, అందుకు తగిన మానసిక స్థిరత్వాన్ని సాధించడానికి ఎంతగానో ప్రయాసపడినట్లు చెప్పారు యోగమ్బాళ్. తననీ రోజు సెలబ్రిటీగా నిలబెట్టింది నాలుగు వందల రకాలు వండగలిగిన పాకనైపుణ్యం కంటే షేమింగ్‌ను తట్టుకోగలిగిన మానసిక స్థయిర్యమేనన్నారామె. యాభై ఐదేళ్లకు కొత్త మలుపు యోగమ్బాళ్ సొంతూరు తమిళనాడులోని తిరువన్మియూర్. తండ్రి న్యూస్ పేపర్ ఏజెంట్, తల్లి గృహిణి. స్కూలు, సంగీతం ఈ రెండే ఆమె బాల్యంలో ఉన్నవి. సంగీత ప్రముఖుల దగ్గర వీణాగానంలో శిక్షణ తీసుకున్నది. ఆ శిక్షణ అలాగే కొనసాగి ఉంటే ఆమె సంగీతంలో సెలబ్రిటీ అయ్యేవారేమో. పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేశారు, భర్త ఉద్యోగం ముంబయిలో కావడంతో ఆమె జీవితం గొప్ప మలుపు తీసుకోవడంలో తడబడింది. భర్త భోజన ప్రియుడు కావడంతో రకరకాల ప్రయోగాలతో ఆమె జీవితం వంటగది కే అంకితమైపోయింది. దక్షిణాది, ఉత్తరాది వంటల్లో చెయ్యి తిరిగింది. ఒంటిచేత్తో అరవై మందికి వండగలిగే నైపుణ్యం సాధించింది యోగమ్బాళ్. భర్తకు ఇష్టమైన వంటను, తనకు ఇష్టమైన వీణసాధననూ కొనసాగిస్తూ వచ్చింది. హటాత్తుగా భర్త కాలం చేశాడు. జీవితం ఊహించని స్తబ్ధత. విపరీతమైన శూన్యత. ఆ శూన్యతను ఏదో ఒక వ్యాపకంతో భర్తీ చేయడానికి యోగమ్బాళ్ చెల్లెలు ఓ ప్రయత్నం చేసింది. అలా యోగమ్బాళ్ 2017లో టీవీలో వంటల ప్రోగ్రామ్‌లో కనిపించింది. రుచి రాగం ‘‘నా దేహాకృతిని చూసి హేళన చేసినప్పుడు కలిగిన ఆవేదనను మాటల్లో చెప్పలేను. సంగీత సాధనతో బాధను మరిచిపోదామన్నా కూడా సాధ్యమయ్యేది కాదు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. నా పిల్లలు ఓ సలహా ఇచ్చారు. టీవీలో వండడానికి కొన్ని పరిమితులుంటాయి. ఆ ప్రోగ్రామ్ రూపకర్తలు నిర్దేశించినట్లు వండాల్సి ఉంటుంది. ఆ టీవీ వీక్షకులు మాత్రమే నీ వంటల ప్రోగ్రామ్‌ను చూస్తారు. అలా కాకుండా నువ్వే సొంత వంటల చానెల్లో వంటల కాన్సెప్ట్‌ను నీకు నచ్చినట్లు, వీక్షకులకు ప్రయోజనం ఉండేటట్లు రూపొందించుకోవచ్చు. నీ వంటలను ఇష్టపడే వాళ్లే నీ చానెల్ చూస్తారు. కాబట్టి కాలక్షేపంగా టీవీ ముందు కూర్చుని నోటి దురుసుతో మాటలు తూలే వాళ్ల బాధ నీకు ఉండదు... అని చెప్పారు. అదే జరిగింది. నా చానెల్‌ను చూసే వాళ్లు నన్ను అభిమానిస్తున్నారు. నాలో మేనత్తను, పిన్నిని చూసుకుంటున్నారు. సంగీత సాధనలో కూడా సాధించలేని ఆత్మీయత ను ఇందులో పొందగలుగుతున్నాను’’ అన్నారు యోగమ్బాళ్ సంతోషంగా. -
‘మరణంలోనూ బంధం కొనసాగింది’
‘నిళంగ చాలా స్మార్ట్. ప్రతిభావంతురాలు. నిజానికి ఈ లక్షణాలు కలిగి ఉండటం కంటే కూడా వాళ్ల అమ్మ శాంతా మయదున్నె కారణంగానే కాలేజీలో తను పాపులర్ అయింది. వాళ్లిద్దరు ఇకలేరనే విషయం తెలియగానే షాక్ గురయ్యాను. నిళంగా నీకు.. మీ అమ్మ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అంటూ శ్రీలంక బాంబు పేలుళ్లలో మరణించిన తన స్నేహితురాలికి రాధా అనే యువతి నివాళులు అర్పించారు. ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లలోని విదేశీయులే లక్ష్యంగా బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా షాంగ్రీ లా హోటల్లో సంభవించిన పేలుళ్లలో శ్రీలంక టీవీ సెలబ్రిటీ చెఫ్ శాంతా మయదున్నెతో పాటు, ఆమె కూతురు కూడా మృత్యువాత పడ్డారు. మరణించడానికి కొన్ని నిమిషాల ముందు కూతురుతో కలిసి ఆమె తీసుకున్న సెల్ఫీ చూసి వారి బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్నేహితుల్లా మెలిగే తల్లీకూతుళ్లు మరణంలోనూ అనుబంధాన్ని కొనసాగించారంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా శ్రీలంకలో లైవ్ టెలివిజన్ కుకింగ్ షో నిర్వహించిన మొదటి మహిళగా శాంత మయదున్నె నిలిచారు. తమ అభిమాన సెలబ్రిటీ దుర్మరణం పట్ల పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇక ఆదివారం జరిగిన శ్రీలంక వరుస పేలుళ్లలో మృతులు సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎనిమిది చోట్ల జరిగిన ఈ బాంబు పేలుళ్లలో 290 మంది మరణించగా, 450 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో భారతదేశానికి చెందిన పలువురు మహిళలు, జేడీఎస్ నాయకులు కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. -
నీ హృదయం... దయా సముద్రం!
మగానుభావులు అమెరికన్స్‌కు ‘చైనీస్ ఫుడ్’లోని మజాని పరిచయం చేశాడు కెన్ హమ్. సెలబ్రిటీ చెఫ్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన కెన్ ఎంతో డబ్బు సంపాదించాడు. ఏ పనీ చేయకుండా కాలు మీద కాలేసుకొని సుఖించేంత సంపద ఉంది. అయితే కెన్ మాత్రం అలా కోరుకోవడం లేదు. తన యావత్ సంపదను దానధర్మాలకు వినియోగించాలనుకుంటున్నాడు. అరవై నాలుగు సంవత్సరాల ఈ మాజీ బిబిసి స్టార్ తాను ప్రస్తుతం నివసిస్తున్న పెద్ద ఎస్టేటును కూడా అమ్మే ప్రయత్నాలు ప్రారంభించాడు.‘‘నేను చనిపోయాక నాకు సంబంధించిన సమస్త ఆస్తులూ వేలానికి వెళతాయి. ఆ డబ్బు పేదల సంక్షేమానికి వెళుతుంది’’ అంటున్న కెన్ హమ్ ‘‘నాలాగే సంపన్నులు ఎందుకు చేయరు?’’ అని ప్రశ్నిస్తున్నాడు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన కెన్ హమ్కు పేదరికంలోని బాధలు ఏమిటో తెలుసు. కెన్ ఎనిమిది నెలల వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు.తల్లే కుటుంబ భారాన్ని తలకెత్తుకుంది. అష్టకష్టాలు పడింది. చికాగోలోని చైనాటౌన్‌లో ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఆమె పనిచేసేది.‘బిల్‌గేట్స్,వారెన్ బఫెట్లను అభిమానించే హమ్ ‘‘ప్రతి మనిషీ ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా తమ పరిధిలో ఇతరులకు సహాయపడాలి’’ అంటున్నాడు.