కునాల్‌ కపూర్‌ విడాకులు : భార్య అంత వేధించిందా? | Chef Kunal Kapur Alleges Wife Disrespected Parents whis is ektakapur | Sakshi
Sakshi News home page

కునాల్‌ కపూర్‌ విడాకులు : భార్య అంత వేధించిందా?

Published Thu, Apr 4 2024 10:20 AM | Last Updated on Thu, Apr 4 2024 1:15 PM

Chef Kunal Kapur Alleges Wife Disrespected Parents whis is ektakapur - Sakshi

సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు ఢిల్లీ  హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించిందంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానాలు వెల్లువెత్తాయి. భర్తను అప్రతిష్టపాలు చేసేలా  ఆరోపణలు ,నిరాధారమైన వాదనలు, అతని ప్రతిష్టపై ప్రభావం చూపుతాయని  క్రూరత్వానికి సమానమని కోర్టు పేర్కొంటూ ఆయనకు విడాకుల పిటీషన్‌ను కోర్టు సమర్ధించింది. అసలు ఇంతకీ  కునాల్ కపూర్ మాజీ భార్య ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది నిజంగానే క్రూరంగా ప్రవర్తించింది లాంటి వివరాలను పరిశీలిద్దాం..!

పలు మీడియా నివేదికల ప్రకారం  2008, ఏప్రిల్‌లో కునాల్  ఏక్తాను వివాహం చేసుకున్నాడు.  వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వారి పెళ్లయిన తొలిరోజులో, లగ్జరీ కారు లేదనీ, ఉన్న కారు చిన్న కారంటూ ఎగతాళి చేసింది. ఏమీ లేదంటూ ఎద్దేవా చేసేదట. అతనికి చెప్పకుండానే తన ఉద్యోగాన్ని వదిలేసింది. అతనిపై కక్షసాధించేందుకే ఇంట్లో పనిలేకుండా కూర్చుంది. ఏక్తా కపూర్‌ భర్తపట్ల, అతని తల్లి దండ్రుల పట్ల  చాలా క్రూరంగా ప్రవర్తించేదని, ఒకటిరెండుసార్లు అతనిపై  చేయి కూడా చేసుకుంది అనేది ప్రధాన ఆరోపణ. (భార్య క్రూరత్వం : సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు భారీ ఊరట)

కానీ కునాల్‌ భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాడు.  ఫారిన్‌ టూర్లు తీసుకెళ్లాడు. కానీ ఆమె ఎప్పుడూ కావాలనే తగాదా పడేది. ఈ వివాదాల నేపథ్యంలో  కౌన్సెలింగ్‌ కోసం ప్రయత్నించాడు. ఆమె  ఏమీ మారలేదు. టీవీ షో మాస్టర్ చెఫ్‌కి ఎంపికైనప్పుడు వీరిద్దరి మరిస్థితులు మరింత దారుణంగా మారాయి. అతనికి మంచి పేరు రావడం కూడా  ఆమె తట్టుకోలేకపోయింది.  యష్‌రాజ్ స్టూడియోస్‌లో షో షూట్‌లో ఉండగా  కొడుకుతో కలిసి  స్టూడియోకు వచ్చి గొడవ చేసింది. టీవీ షో జడ్జ్‌గా  పాపులర్ అయిన తర్వాత, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని నిరంతరం బెదిరించేంది.షూట్‌కి ఒకరోజు ముందు చెంపదెబ్బ కొట్టిందని కునాల్‌ ఆరోపించాడు. (గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్‌ యాక్టర్‌)

కొడుకు పుట్టిన తర్వాత బిడ్డను కూడా సరిగ్గా పట్టించు కోలేదు. పిల్లాడిని పనిమనిషికి వదిలేసి మాల్స్‌కు వెళ్లిపోయేది. 2013లో కునాల్‌ని కొట్టింది కూడా. దీన్ని కునాల్‌ తండ్రి  రికార్డ్ చేశాడు. దీంతో ఆమె ఆ ఫోన్ లాక్కొని వృద్ధుడని కూడా చూడకుండా  కర్రతో కొట్టడానికి కూడా ప్రయత్నించింది. ఈ వ్యవహారం పోలీసుల దాకా పోయింది. 

2014లో జరిగిన మరో సంఘటనలో,  కునాల్‌ తండ్రిని ప్లాస్టిక్ కుర్చీతో  దాడి చేయడంతో విభేదాలు మరింత  రాజుకున్నాయి.  2015లో మళ్లీ  గొడవ జరిగింది. దీంతో ఆమె ఇంటిముందు గలాటా చేసింది. చివరికి విసిపోయిన కునాల్‌ ఆమెనుంచి దూరంగా వెళ్లాడు. అప్పటినుంచి  కునాల్ , అతని భార్య విడివిడిగా ఉంటున్నారు. కుమారుడు మాత్రం తల్లితోనే ఉంటున్నాడు.  అయితే బిడ్డను కలవడానికి లేదా మాట్లాడటానికి కూడా ఏక్తా అనుమతించేది కాదు. ప్రతిదానికీ డబ్బులు డిమాండ్‌ చేసేదని కునాల్‌ చాలా సార్లు వాపోయాడు.

 ఏక్తా కపూర్‌ వాదన: వివాహేతర సంబంధాలు
అయితే  ఈ ఆరోపణలన్నింటినీ ఏక్తా కపూర్‌ గతంలోనే  ఖండించింది.  తనకు విడాకులు ఇవ్వడానికి పన్నిన పన్నాగమని ఆరోపించింది.  బాగా పేరు సంపాదించిన తర్వాత భర్తకు వివాహేతర సంబంధాలు  కూడా  ఉన్నాయని ఆమె  ఆరోపించింది. అయితే భర్తను కొడుతున్న వీడియోను ఫ్యామిలీ కోర్టు తీరస్కరించింది. ఆమె నిగ్రహం కోల్పేయాలా కునాల్‌ ప్రవర్తించాడని కోర్టు ఈ వీడియోను తోసిపుచ్చింది. వరకట్న ఆరోపణలు చేసింది, అయితే, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో వీటిని ధృవీకరించలేకపోయింది. అయితే ఫ్యామిలీ కోర్టు విడాకులకు అంగీకరించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.  ఈ కేసు విచారణలో భార్య  క్రూరత్వాన్ని  గుర్తించిన ఢిల్లీ హైకోర్టు  కునాల్‌కు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే  కోర్టు తీర్పుపై ఏక్తా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement