wife
-
ప్రతీక్ యాదవ్: ‘సయోధ్య’ కుదిరిన వేళ.. సాగనంపిన కాలం!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయ దిగ్గజం, దివంగత ములాయం సింగ్ యాదవ్ ద్వితీయ కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) బుధవారం తెల్లవారుజామున లక్నోలో కన్నుమూశారు. అఖిలేష్ యాదవ్ సోదరుడైన ప్రతీక్, మే 13న అస్వస్థతకు గురికావడంతో లక్నోలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 5:55 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ప్రతీక్ మృతిపై సందేహాలు వెల్లువెత్తున్న నేపథ్యంలో పోస్ట్‌మార్టం నిర్వహించి, విష ప్రయోగం లాంటి కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నారు.వార్తల్లో వైవాహిక జీవితంప్రతీక్ మరణం యూపీలో కలకలం రేపగా, ఆయన వైవాహిక జీవితం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. 2011లో అపర్ణ యాదవ్‌ను వివాహం చేసుకున్న ప్రతీక్, ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన భార్య అపర్ణ ఒక ‘స్వార్థపరురాలు’ అని, కేవలం కీర్తి ప్రతిష్టల కోసమే పాకులాడుతూ తన కుటుంబ బంధాలను నాశనం చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రులు, సోదరునితో కూడా దూరం పెరగడానికి ఆమెనే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.‘ఆమె అతిపెద్ద అబద్ధాలకోరు’అప్పట్లో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. అపర్ణకు వీలైనంత త్వరగా విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రతీక్ ప్రకటించారు. ఆమె ప్రవర్తన కారణంగా తన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని, తన జీవితంలో చూసిన అతిపెద్ద అబద్ధాలకోరు ఆమె అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకురాలిగా, ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అపర్ణపై భర్త చేసిన ఈ వ్యాఖ్యలు ములాయం కుటుంబంలో పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే, ఈ ఆరోపణలపై అపర్ణ గానీ, రాజకీయ పార్టీలు గానీ బహిరంగంగా ఎప్పుడూ స్పందించలేదు.భార్యతో కలిసి సంతోషంగా..విచిత్రమేమిటంటే, ఆ తీవ్రమైన ఆరోపణల తర్వాత కొద్దిరోజులకే వారి మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించింది. ప్రతీక్ తన విడాకుల పోస్టులను తొలగించడమే కాకుండా, భార్యతో కలిసి సంతోషంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి బంధం మళ్లీ గాడిలో పడిందని అంతా భావిస్తుండగా, అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.ఇది కూడా చదవండి: అమెరికా కొలువుల స్కామ్.. భారత్‌లో మూలాలు? -
విజయ్ భార్య పిల్లలు ఎక్కడ..?
-
బెల్లంకొండ సతీమణి ఆదాయం నెలకు రూ.90 లక్షలా.. ఏం చేస్తారంటే?
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే కొత్త జీవితాన్ని ప్రారంభించాడు . తను ప్రేమించిన కావ్యా రెడ్డిని పెళ్లాడారు. తిరుమలలో ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. రెండు కుటుంబాల సమక్షంలో తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది.అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సతీమణి కావ్య హైదరాబాద్‌కు చెందిన అమ్మాయేనని మనందరికీ తెలుసు. ఆమె తాత జడ్జి కాగా తండ్రి లాయర్ అని తెలుస్తోంది. అంతకుమించి ఆమె వ్యక్తిగత వివరాలు పెద్దగా తెలియదు. కానీ తాజాగా కావ్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.బిజినెస్‌తో రూ.90 లక్షలు..ఆమె బిజినెస్ ద్వారానే నెలకు ఏకంగా రూ.90 లక్షలు రూపాయలు సంపాదిస్తుందని సమాచారం. అరటి మొక్కల నుంచి వచ్చే నారతో శారీలు తయారు చేసే బిజినెస్ చేస్తున్నారట. వీటికి విదేశాల్లో అధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిజినెస్ ద్వారా కావ్య రెడ్డి నెలకు దాదాపు రూ.90 లక్షలు సంపాదిస్తున్నారని లేటేస్ట్ టాక్. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మార్చిలో కావ్యాతో నిశ్చితార్థం చేసుకోగా.. ఏప్రిల్ 29వ తేదీన తిరుమలలో సింపుల్‌గా పెళ్లి పీటలెక్కారు. -
IPS భార్య హత్య కేసులో నిందితుల గాలింపు
-
నడిరోడ్డుపై భార్యపై భర్త దాడి, కాపాడిన జనం, కానీ కోదాడలో
దేశంలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో దాదాపు ఒకే సారి మహిళలపై జరిగిన హత్యా, హత్యాయత్నానికి సంబంధించిన ఘటనలు నెట్టింట చర్చకు దారి తీసాయి. తెలంగాణ లో కోదాడలో జరిగిన ఘటనలో, మహిళ ప్రాణాలు కోల్పోగా, బెంగళూరులోని మదనాయకనహళ్లిలో పట్టపగలే నడిరోడ్డుపై మాజీ భార్యపై కత్తితో దాడిచేసిన ఘటనలో భార్య తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దీంతో ప్రజలు ముఖ్యంగా స్పందించాల్సిన తీరుపై చర్చ జరుగుతోంది.ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బీహార్‌కు చెందిన 35 ఏళ్ల నిందితుడు సంజయ్, తన భార్య సోనాలి ఇంటి నుంచి బయటకు వస్తుండగా అడ్డగించాడు. అతను హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చి, గుర్తు తెలియని దుండగుడిలా నటిస్తూ సోనాలి మెడపై కత్తి పెట్టి దాడి చేయడానికి ప్రయత్నించాడు.ఈ ఘటనను చూసిన ఒక యువకుడు వెంటనే జోక్యం చేసుకుని, సంజయ్‌ను అదుపులోకి తీసుకుని ఆ మహిళను రక్షించాడు. సోనాలి కేకలు విన్న స్థానికులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిపై దాడి చేసి, అనంతరం అతడిని మదనాయకనహళ్లి పోలీసులకు అప్పగించారు.#Shocking incident in #Bengaluru.A man identified as Sanjay allegedly tried to #attack his ex-wife with a knife in the middle of the road. Alert youngsters overpowered him & rescued the woman. Madanayakanahalli Police are probing.@timesofindia pic.twitter.com/5rR4eo6sqa— TOI Bengaluru (@TOIBengaluru) May 7, 2026 గత కొన్ని నెలలుగా వీరిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం అని సమాచారం. సంజయ్‌కు మద్యపాన వ్యసనం అలవాటు కావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని, తిరిగి కలవడానికి సోనాలి నిరాకరించడమే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నారు. కోదాడ కేసుతెలంగాణాలోని కోదాడ బస్టాండ్ దగ్గర జరిగిన అందరూ చూస్తుండగా భార్య శిరీషని కత్తితో పొడిచి చంపాడు భర్త మణిదీప్. ఈ రెండు ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయినాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై నెటిజన్లు భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిదని కొంతమంది అంటే, కానీ అప్రమత్తంగా ఉండాలి, మన ప్రాణాల మీదకు వస్తే ఎలా? అందుకే ముందుగా ఆయుధం చేతిలో ఉన్నవారి దృష్టిని మరలించి, కలిసికట్టుగా, చాక చక్యంగా ఎదుర్కోవాలని కొందరు సూచించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలాంటి దుర్ఘటనలు కొన్నైనా ధైర్యంగా నిలువరించే గలిగితే, ఇలాంటి ఘోరాలకు తెగబడరని అభప్రాయపడుతున్నారు. విభేదాలు ఎంత తీవ్రమైనవైనా, పరిష్కరించుకోవాలిగానీ, ఇలా హత్యలకు తెగబడకూదని హితవు పలుకుతున్నారు. ఇదీ చదవండి: క్రికెటర్ సూర్యకుమార్ లగ్జరీ ఇల్లు, కార్లు, విలువ ఎంతో తెలుసా? -
రిటైర్డ్ డీజీపీ భార్య కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ డీజీపీ భార్య హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పని మనిషే హత్య చేసినట్లు అనుమానిస్తున్నామని.. నేపాలీ పని మనుషులతో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ డీజీపీ భార్య తనూజాను రాత్రి రెండు గంటలకు దుండగులు హత్య చేశారన్నారు. నేపాలి గ్యాంగ్ పనిగా ప్రాథమికంగా తాము ఒక అంచనాకు వచ్చామన్న సజ్జనార్.. కొన్ని క్లూస్ లభించాయని.. ఆ క్లూస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘‘నేపాలి పని వాళ్ళ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. నేపాలి పని మనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడతారు. రాత్రి మాజీ డీజీపీ ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ మరికొందరితో కలిసి ఈ క్రైమ్ చేసింది. ఘటన సమయంలో తనూజ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న కల్పనతో బయట వ్యక్తులు కాంటాక్ట్ పెట్టుకొని ఈ క్రైమ్ చేశారు. నిందితులను అతి త్వరలో ఖచ్చితంగా పట్టుకుంటాం’’ అని సజ్జనార్ పేర్కొన్నారు.ఇంట్లో ఏడాది, రెండేళ్లు పనిచేసిన నేపాలి మనుషులపై కూడా నిఘా ఉండాలి. ఈ కేసును చాలా సీరియసగా తీసుకుంటున్నాం. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను ఈ గ్యాంగ్ హత్య చేసింది. మాజీ డిజీపి వాళ్ల మదర్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు. ఇటీవల మరణించారు. అప్పటినుండి మృతురాలు తనూజ ఇక్కడే ఉంటుంది. ఎంత బంగారం నగదు పోయింది అన్న అంశాలపై ఆరా తీస్తున్నాము. నిందితులు బ్యాక్ గేట్ నుండి ఇంట్లోకి ప్రవేశించారు. క్రైమ్ అనంతరం వెనక నుండి పారిపోయారు’’ అని సజ్జనార్ వివరించారు. -
ప్రియుడి మోజులో పడి.. రూ.12 లక్షలు ఇచ్చి..
సాక్షి, ఏలూరు: జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం సుపారీ ఇచ్చిన భార్య.. భర్తను హత్య చేయించింది. గత నెల 17న హత్యకు గురైన ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సులేమాన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భార్యే అసలు సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో దుర్గారాణిని సులేమాన్ రాజు తరచూ వేధించేవాడు. భర్త పెట్టే బాధలు పడలేక చనిపోవాలనుందంటూ దుర్గామణి ప్రియుడికి చెప్పింది. సులేమాన్ రాజు అడ్డు తప్పించాలని దుర్గామణి ప్లాన్ వేసింది.తన బంధువుల సాయంతో సులేమాన్ రాజు హత్యకు వెంకన్నబాబు సుపారీ ఇచ్చారు. రూ.12 లక్షలు ఇచ్చిన దుర్గామణి, వెంకన్నబాబు.. సులేమాన్ రాజు అడ్డు తొలగించుకున్నారు. సెల్‌ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్‌తో సులేమాన్ రాజును నిందితులు హత్య చేశారు. హత్య అనంతరం ఉప్పులూరు రైవస్ కాలువలో సులేమాన్ రాజు మృతదేహాన్ని పడేశారు. సులేమాన్ రాజు భార్య దుర్గామణి, వెంకన్నబాబు, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్ ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్, కారు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు ఖాళీ బీరు సీసాలు, రూ. 75 వేలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
లావుగా ఉందని భార్యను చంపిన భర్త
-
మానసికంగా కుంగిపోయేలా.. ముందస్తు ప్రణాళిక?
హైదరాబాద్: హుసేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీతారాం కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ముందస్తు పథకం ప్రకారమే భార్య రేణుక భర్తను మానసికంగా కుంగిపోయేలా చేసిందనే అనుమానాలను కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధానికి సంబంధించి ప్రైవేటు వీడియోలు ఉద్దేశ్యపూర్వకంగానే భర్తకు చేరేలా చేశారనే అంశంపై కూడా విచారణ జరుగుతోందని తెలిసింది. ఇదిలా ఉండగా జనవరి 26నే రేణుక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. భార్య అదృశ్యమైన విషయంపై సీతారాం.. బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ ఘటన ఉండేది కాదని మృతుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం 11 మందిపై కేసు నమోదు కాగా పోలీసులు మృతుడి భార్య రేణుక, నిందితుడు రమణారెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
నరుకుతా బిడ్డా.. నువ్వు మంత్రివైతే నాకేంటి.. ఎవడిని వదిలిపెట్టను..!
-
దారుణం.. నలుగురు పిల్లలను, భార్యను చంపి.. ఆపై
హర్యానా: గురుగ్రామ్ వజీర్‌పూర్‌లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో పాటు తన భార్యని చంపారు. అనంతరం తాను ఆత్మహత్యకు యత్నించగా ప్రాణాలతో బయిటపడ్డారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితేఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్‌కు ఓ వ్యక్తి కుటుంబం గత కొంతకాలంగా వజీర్‌పూర్‌లో నివాసం ఉంటుంది. ఇతను స్థానికంగా సెలూన్ నడుపుతాడు. అయితే శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో అతని సోదరుడు ఇంటికి వచ్చేసరికి కుటుంబ సభ్యులంతా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తీసుకెళ్లగా మహిళ మరియు నలుగురు పిల్లలు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో 35 ఏళ్ల భార్య, 14, 12, 10 ఏళ్ల వయస్సు గల ముగ్గురు కుమార్తెలు మరియు 8 ఏళ్ల కుమారుడు మృతిచెందారు. అయితే వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా గృహ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు తొలుతగా కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి అనంతరం కత్తితో తన మణికట్టును కోసుకున్నాడని తెలిపినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యులు జీవించడానికి ఇష్టపడలేదని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు.. విషం ఇచ్చారా లేక గొంతు నులిమి చంపారా అనేది దర్యాప్తులో తేలుతుందని, ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. -
భార్య మరొక పురుషునితో.. తట్టుకోలేక భర్త..!
తుమకూరు(కర్ణాటక): రాష్ట్రంలో కుటుంబాల్లో సామూహిక ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోలారు జిల్లాలో ఇద్దరు కూతుళ్లతో తల్లి బావిలోకి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన మరువక ముందే మరో విషాదం వెలుగుచూసింది. భార్య మరొక పురుషునితో పరారు కావడంతో తీవ్ర వ్యథ చెందిన భర్త ఘోర కృత్యానికి ఒడిగట్టాడు. ఇద్దరు కొడుకును గొంతు పిసికి చంపి, ఆపై ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా ఆల్కెరె గ్రామంలో జరిగింది. శివణ్ణ (40), పిల్లలు జీవన్ (11), ప్రాణేష్ (6) మృతులు. ఇంటికి వచ్చినట్టే వచ్చి.. వివరాలు.. శివణ్ణ గ్రామంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా ఉంటూ, ఓప్రైవేట్ కంపెనీలో కూడా పని చేస్తుండేవారు. భార్య కావ్య, ఇద్దరు పిల్లలతో ప్రశాంత జీవితం గడుపుతుండగా, వారం రోజుల కిత్రం కావ్య వేరే వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పరారైంది. ఈ పరిణామంతో భర్త తీవ్రంగా ఆవేదన చెందాడు. భార్య మిస్సింగ్‌పై పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కావ్య మళ్లీ ఇంటికి వచ్చింది. మరుసటి రోజు భర్త పనిమీద వెళ్లగా, కావ్య ఇంటిలోని లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు, డబ్బుతో మళ్లీ పరారైంది. దీంతో విరక్తి చెందిన శివణ్ణ శుక్రవారం రాత్రి తన ఇంటిలోనే ఇద్దరు మగ పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపి, తర్వాత తానూ ఉరి వేసుకున్నాడు. ఆమె కోసం గాలింపు శనివారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించగా ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా పోలీసు అధికారులు, కుణిగల్ పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మరణోత్తర పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కావ్య కోసం గాలింపు చేపట్టారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు కారణమైన కావ్య, ఆమె ప్రియున్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
ఆరుగురితో కాదు 36 మందితో చాటింగ్.. సీతారాం పెన్ డ్రైవ్ లో సంచలనాలు..
-
భార్య పాపులారిటీ తట్టుకోలేక నరికి చంపిన భర్త
-
దారి తప్పిన భార్య.. ముగ్గురితో వివాహేతర సంబంధం
-
పదవీచ్యుత దక్షిణ కొరియా అధ్యక్షుడి భార్యకు అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష
సియోల్: దక్షిణ కొరియా పదవీచ్యుత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీకి అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. తిరుగుబాటు ఆరోపణలను ఎదుర్కొంటున్న యూన్‌కు కోర్టు జీవిత కాల జైలు శిక్ష విధించింది. యూనిఫికేషన్ చర్చికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రతిగా ఖరీదైన బహుమతులను అందుకున్నట్లు రుజువు కావడంతో ఓ కోర్టు కిమ్ కియోన్ హీకి 20 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసిన మరో కేసు నుంచి ఆమె బయటపడ్డారు. అయితే ఈ రెండు తీర్పులపై ఇరుపక్షాలు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాయి. విచారించిన కోర్టు.. కిమ్ కియోన్ హీ శిక్షను నాలుగేళ్లకు పెంచుతూ తీర్పు వెలువరించింది. -
భార్య ఎఫైర్లు, ప్రైవేట్ వీడియోలు : టెకీ ఆత్మహత్యకేసులో కీలక పరిణామం
ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీతారాం సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.సంచలనం రేపిన ఈ కేసులో సీతారం భార్య రేణుక వివాహేతర సంబంధాలు, ప్రైవేట్ వీడియోలు బయటపడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ట్యాంక్‌బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్టెకీ సీతారాం తన లేఖలో ప్రస్తావించిన విషయాలు సంచలనంగా మారాయి.. ‘‘నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ.. ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అంతేకాకుండా.. ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకుంది. వాటిన ఓ లవర్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది చూసి ఎలా తట్టుకోగలగాలి.. రేణుకకు అసలు ఏం కావాలి?’’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోలు అవి చూశాకే నా భార్య నిజస్వరూపం తెలిసింది. ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది. తాను ఎంత నచ్చజెప్పినా ఆమెలో మార్పు రాలేదని, పైగా చచ్చిపోతానని బెదిరింపులు’’ అంటూ సూసైడ్ లెటర్లో సీతారాం ఆవేదన వ్యక్తంచేశాడు. అంతేకాదు తాను నెలకు రూ.2 లక్షల జీతం సంపాదిస్తూ కుటుంబాన్ని చాలా బాగా చూసుకున్నానని, అయినప్పటికీ భార్య తనకు తెలియకుండా ఇలా సంబంధాలు పెట్టుకోవడం తట్టుకోలేకపోయానంటూ వాపోయాడు. చివరికి అతను ప్రాణం తీసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు.కాగా ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగాల రీత్యా బాచుపల్లిలో నివాసం ఉండేవారు. ఈ క్రమంలో కాపురంలో కలతలు, భార్య వివాహేతర సంబంధాలు,ఇన్‌స్టాలో వీడియోలు బయటపడటంతో గత ఫిబ్రవరిలో ట్యాంక్‌బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత!
సాక్షి, చెన్నై: చెన్నైలోని నంగనల్లూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భార్య, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదుగుదలను ఓర్వకోలేక, ఆమె భర్తే దారుణంగా హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 27న వారి చిన్న కుమారుడు ఇంటికి వచ్చేసరికి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.పోలీసుల కథనం ప్రకారం, మృతులను సుబ్రమణియన్ (52), అతని భార్య నాగలక్ష్మి (42)గా గుర్తించారు. కుటుంబ కలహాలు, మనస్పర్థల కారణంగా వీరి కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. సుబ్రమణియన్ మధురైలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. మరోవైపు నాగలక్ష్మి చెన్నైలో ఉంటూనే స్వతంత్రంగా జీవిస్తోంది. భర్తతో విభేదాల నేపథ్యంలో తనకాళ్ల మీద నిలబడాలనే ఉద్దేశంతో, నాగలక్ష్మి 'శ్రీ సాయి సిల్క్స్' పేరుతో చీరల వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా తన వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఫలితంగా వ్యాపారం బాగా వృద్ధి చెందడంతో నంగనల్లూరులో పెద్ద స్టోర్‌ను కూడా ప్రారంభించింది. అంతేకాదు పెద్ద కుమారుడు హరీష్ భరద్వాజ్ (21)ను రష్యాలో మెడిసిన్ చదివిస్తుండగా, చిన్న కుమారుడు శైలాష్ (18) చెన్నైలో డెంటిస్ట్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.అయితే ఇటీవల చెన్నైకి తిరిగి వచ్చిన సుబ్రమణియన్ తాను మారిపోయానని, తన గత ప్రవర్తనకు క్షమాపణ చెప్పి నాగలక్ష్మితో రాజీపడినట్లు సమాచారం. ఇంతలోనే ఇంత ఘోరానికి పాల్పడ్డాడు.ఏప్రిల్ 27న సుబ్రమణియన్ తన చిన్న కుమారుడు శైలాష్‌కు ఒక ఆందోళనకరమైన మెసేజ్ పంపాడు. కంగారుగా ఇంటికి చేరుకున్న శైలాష్‌కు తన తల్లి రక్తపు మడుగులో శవమై కనిపించింది. తండ్రి మరో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. ఇదీ చదవండి: శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్ సంచలన హెచ్చరికపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, దంపతుల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగిందని, ఆ ఆవేశంలోనే సుబ్రమణియన్ తన భార్యను నరికి చంపి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్ -
మహిళతో వివాహేతర సంబంధం.. రోడ్డుపై తన్నుకున్న యువకులు
-
ఎస్ఐ భార్య ఆత్మహత్య
బెంగళూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సజావుగా సాగిపోతున్న కుటుంబంలో చిన్న గొడవలే పెద్దవయ్యాయి. కుటుంబ కలహాలతో ఎస్ఐ భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా బీరూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. బీరూరు ఎస్ఐ తిప్పేశ్ భార్య పద్మ (35) మంగళవారం రాత్రి ఇంటిలో ప్రాణాలు తీసుకుంది. బీరూరు పట్టణంలో బాడుగ ఇంటిలో తిప్పేశ్ కుటుంబం ఉంటోంది. పద్మది తుమకూరు జిల్లా కాగా, తిప్పేశ్ది దావణగెరె జిల్లా. వీరిద్దరూ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కానీ పిల్లలను ఎక్కడ చదివించాలి, సెలవుల గురించి గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. పోలీసులు విచారణ చేపట్టారు. -
అంబులెన్స్‌లో రోగి వాంతి : భార్యతో కడిగించిన వైనం, వీడియోవైరల్
మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.గాయపడిన రోగిని తరలించేందుకు అతని భార్యతో అంబులెన్స్‌ను శుభ్రం చేయించిన అమానుష ఘటనపై అంబులెన్స్ సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆరోగ్య శాఖ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.శుక్రవారం సాయంత్రం ఉమరియా-బర్హి రోడ్డులోని ఖితౌలి సమీపంలో ఉన్న కరేలా గ్రామానికి చెందిన 32 ఏళ్ల రాహుల్ బర్మన్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రాహుల్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. డయల్ 112 సహాయంతో అతడిని మొదట బర్హి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. కానీ రాహుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని కట్నీ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. బర్హి నుంచి కట్నీకి తీసుకువస్తుండగా, నొప్పి, గాయం కారణంగా రోగి రాహుల్ అంబులెన్స్ కిటికీలోంచి వాంతి చేసుకున్నాడు.దీంతో ఉద్యోగి మోహిత్ నాయక్ రోగి భార్యపై అంబులెన్స్‌ను శుభ్రం చేయమని ఒత్తిడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రోగి భార్య నీళ్లు పోస్తూ అంబులెన్స్‌ను శుభ్రం చేస్తూ కనిపిస్తుంది.ప్రత్యక్ష సాక్షుల ప్రకారం,ఈ సమయంలో అంబులెన్స్ సిబ్బంది సున్నితత్వం లేకుండా ప్రవర్తించారు. ఆ మహిళకు ఏమాత్రం సహాయం చేయలేదు.ఆ తర్వాత జబల్పూర్కు తరలించారు: కట్నీ జిల్లా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత, రాహుల్ పరిస్థితి మరింత విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం అతడిని జబల్పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. View this post on Instagram A post shared by The Trending India 🇮🇳 (@thetrendingindian) ఈ మొత్తం విషయంపై చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్ఓ) డాక్టర్ రాజ్ సింగ్ ఠాకూర్ చేసిన ప్రాథమిక ప్రకటన వివాదాస్పదంగా ఉంది. అంబులెన్స్‌లో రక్తస్రావం జరిగి ఉండవచ్చని, దానిని ఆ మహిళ శుభ్రం చేసి ఉండవచ్చని ఆయన అన్నారు. అంబులెన్స్ మేనేజర్‌తో మాట్లాడిన తర్వాత సమగ్ర విచారణ జరిపి తెలిపారు. -
ప్రియుడి ఇంటికెళ్లి.. టీవీ సౌండ్ పెంచేసి..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి.. అతని ఇంటిలోకి చొరబడి భార్య, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో కానిస్టేబుల్ భార్య, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం కానిస్టేబుల్ లలితేష్ యాదవ్ తన కుటుంబంతో కలిసి సొంతూరికి వెళ్లేందుకు టిక్కెట్లు కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో నిందితురాలు సరోజినీ భరద్వాజ్.. దుర్గ్‌లోని ఆయన ఫ్లాట్‌కు చేరుకుని కానిస్టేబుల్ భార్య రీనా యాదవ్‌తో గొడవకు దిగింది,గొడవ బయటకు వినిపించకుండా టీవీ వాల్యూమ్‌ను పెంచిన సరోజినీ భరద్వాజ్.. అనంతరం కత్తి తీసుకుని మొదట నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల కుమారుడు ఆదిత్యపై విచక్షణారహితంగా దాడి చేసింది. తర్వాత నిందితురాలు మిగిలిన ఇద్దరు కుమార్తెలు నైనా, తానియాపై దాడికి ప్రయత్నించగా... తీవ్రంగా గాయపడిన రీనా యాదవ్ తన బిడ్డలను వదిలేయమని ప్రాధేయపడింది. నిందితురాలి కాళ్లు పట్టుకుని తన కూతుళ్లను పారిపోమని కోరింది. దీంతో ఒక కుమార్తె బాత్రూమ్లో దాక్కుంది, మరొకరు బయటకు పరుగెత్తి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశారు.కేకలు విని పొరుగువారు వచ్చేసరికి.. నిందితురాలు రక్తంతో తడిసిన కత్తితో తలుపు దగ్గర నిలబడి ఉంది. స్థానికులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రికి తరలించే లోపే రీనా యాదవ్, ఆమె కుమారుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.భరద్వాజ్, లలితేష్ యాదవ్ మధ్య సంబంధం ఉన్నట్లు తేలింది. శుక్రవారం కూడా ఆమె ఇంటికి రాగా, కానిస్టేబుల్ ఆమెను పంపించివేశారు. కానీ శనివారం ఆయన ఇంట్లో లేని సమయం చూసి ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. నిందితురాలిని అరెస్టు చేశామని.. ఈ ఘటనపై విచారణ చేపట్టామని పోలీసులు వెల్లడించారు. -
భార్యతో కలిసి ప్రియదర్శి హిమాలయ ట్రిప్ (ఫొటోలు)
-
రెండేళ్లుగా నరకం : పెళ్లంటేనే భయం భయ్యా, వైరల్ వీడియో
గృహ హింస, వేధింపులు బాధితులు కేవలం మహిళలు మాత్రమే కాదు. పురుషులు కూడా అనేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా భార్య చేతిలో వేధింపులకు గురవుతున్న ఒక వ్యక్తి, తన ల్యాప్‌టాప్ ద్వారా ఆ దాడులను రికార్డ్ చేసి బయట పెట్టాడు. ఇది నెట్టింట ఫెమినిజంపై చర్చకు దారి తీసింది .ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయిఏం జరిగింది అంటే?ఒక వ్యక్తి తన భార్య చేతిలో దారుణ హింసను ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండేళ్లపాటు వేధింపులు తరువాత తన ల్యాప్‌టాప్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో ప్రకారం మహిళ తన భర్తతో తీవ్రంగా వాదిస్తోంది. ఆమె అతడిని చెంపదెబ్బలు కొట్టడం, జుట్టు పట్టుకుని లాగడం వంటి దృశ్యాలు ల్యాప్‌టాప్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ‘‘పెళ్లి చేసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో నెట్టింట షేర్ అయింది. దీంతో హాట్ టాపిక్‌గా మారింది.నెటిజన్ల స్పందనఈ వీడియో పురుషులపై జరుగుతున్న గృహహింస గురించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. "పెళ్లి అంటేనే భయం వేస్తోంది" భయ్యా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు ఇది 'గృహ ఉగ్రవాదం' అని అభివర్ణించారు. అంతేకాదు పనిలో పనిగా ఫెమినిజంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ ఫెమినిస్టులు ఎక్కడ ఉన్నారు? ఈ మహిళను కూడా సమర్థిస్తారా?" అని కొందరు ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇది నిజమైన ఫెమినిజం కాదని, హింస అని విమర్శించారు. ఈ ఘటన వెనుక ఉన్న మహిళ బెంగాలీ అని పేర్కొంటూ, కొందరు బెంగాలీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇతర వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పురుషులు కూడా బాధితులుగా మారుతున్నారని, వారి కోసం కూడా కఠిన చట్టాలు ఉండాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: 3 అపార్ట్మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్ మేనేజర్నోట్ : సాధారణంగా గృహహింస అంటే మహిళలపై జరిగేది అనే భావన ఉంటుంది స్త్రీ-పురుషులతో సంబంధంలేకుండా వేధింపులు, గృహహింస (Domestic Violence) ఎవరు అనుభవించినా అది నేరమే. హింస ఎక్కడ ఉన్నా తప్పే. జెండర్‌తో సంబంధం లేకుండా హింసను ఎదుర్కోవడం ముఖ్యం అనే అవగాహన పెరగాలి. తమపై దౌర్జన్యాలకు అన్యాయానికి వ్యతిరేకంగా సంబంధిత చట్ట వ్యవస్థలకు ఫిర్యాదు చేయడం, రక్షణ పొందడం అవసరం. After being abused for the past two years bro recorded these clips on his laptop Think twice before getting married 🙏 pic.twitter.com/1AQLGWjooU— Vishal (@VishalMalvi_) April 23, 2026 -
వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కిరాయి హంతకుతో కలిసి భర్తను అంతం చేసేందుకు భార్య పన్నిన కుట్రను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డికి 15 ఏళ్ల క్రితం శిల్పారెడ్డితో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న సుధీర్ అనే వ్యక్తి శిల్పారెడ్డికి పరిచయమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత వారి పరిచయం వివాహేతర బంధంగా మారింది.ఈ విషయం కొన్ని రోజుల క్రితం శిల్పారెడ్డి భర్త ఈశ్వర్‌రెడ్డికి తెలిసింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో శిల్పారెడ్డి ఈ విషయాన్ని ప్రియుడు సుధీర్‌కు తెలిపింది. ‘అలాగైతే నీ భర్తను చంపేద్దాం ఆస్తితోపాటు ఉన్న బంగారు, డబ్బు అంతా మనకే వస్తుందని’ సుదీర్ ఆమెతో అన్నాడు. అందుకు శిల్పారెడ్డి కూడా అంగీకరించింది. ఆమె రాజుపాళెంలోని రౌడీషీటర్ నవీన్ ద్వారా హిందూపురంలో ఉంటున్న లిల్లీ గ్యాంగ్‌ను ఆశ్రయించింది.తన భర్త ఈశ్వర్‌రెడ్డిని చంపేయాలని అందుకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని శిల్పారెడ్డి వారితో రూ.10 లక్షల సుపారీ కుదుర్చుకుంది. ఈ క్రమంలో రూ.5 లక్షలు ఇవ్వడంతో హిందూపురానికి చెందిన కిరాయి గ్యాంగ్ బుధవారం ప్రొద్దుటూరు చేరుకున్నారు. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఈశ్వర్‌రెడ్డిని కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. వెంటనే వన్‌టౌన్ పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వ్యూహం బెడిసికొట్టడంతో నిందితులు.. పోలీసులకు చిక్కారు. భార్య శిల్పారెడ్డి, ప్రియుడు సుధీర్, రౌడీ షీటర్ వినయ్, హిందూపురం కిరాయి ముఠాతో పాటు 10 మందిని అరెస్టు చేశారు. నిందితుల వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విబూకృష్ణ పోలీసులు వెల్లడించారు. -
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాకు మరోసారి చుక్కెదురైంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గువాహతి హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. గురువారం ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ కేసు నేపథ్యం ఏప్రిల్ 5న గువాహటిలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కి సంబంధించినది. ఆ సమయంలో పవన్ ఖేరా.. అసోం సీఎం భార్య రింకీ భుయాన్ శర్మకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని, దుబాయ్‌లో ఆస్తులతో పాటు విదేశీ కంపెనీలలో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు మీడియాకు ప్రదర్శించారు. అయితే..ఆ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన రింకీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆయనపై అసోం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాదు.. ఆయన ప్రదర్శించింది ఫేక్ డాక్యుమెంట్లుగా పేర్కొంటూ ఫోర్జరీ అభియోగాలు కూడా చేర్చారు. ఈ కేసు అసోం పోలీసులు ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసంలో తనిఖీలు జరిపారు.అయితే ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య హైదరాబాద్ నుంచి(సనత్ నగర్) పోటీ చేసిందని.. తనకు ఆధార్ కూడా ఇక్కడే ఉందని.. కాబట్టి ఈ కేసు విచారణే ఇక్కడే జరగాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఆయనకు అరెస్ట్ నుంచి తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. ఈలోపు..అసోం పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు.. ముందస్తు బెయిల్ కోసం గువాహతి హైకోర్టులోనే పిటిషన్ వేయాలని సూచించింది. అయితే కోర్టుకు సెలవులు ఉన్నాయని.. తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు అందుకు ఒప్పుకోలేదు. గువాహతి కోర్టునే ఆశ్రయించమని చెప్పింది. తాజాగా.. ఇవాళ(ఏప్రిల్ 24న) గువాహతి హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ పరిణామంతో పవన్ ఖేరా అరెస్ట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే.. కాంగ్రెస్ వర్గాలు దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నాయి. అసోం సీఎం హిమంత బిస్వా శర్మ మాత్రం.. “అసత్య ఆరోపణలు చేసినందుకు ఆయన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని.. ఎక్కడున్నా వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవాలని” అంటున్నారు. -
భర్త అక్రమ సంబంధం.. బట్టబయలు చేసిన భార్య!
సాక్షి, నిజామాబాద్: భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్‌పై శ్రవణ్‌కుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
భార్యకు ఆస్తి ఉన్నా భర్త భరణం ఇవ్వాలా?
నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నా భార్య ఇంజినీరింగ్ చేసింది కానీ కావాలనే ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టునే ఉంటోంది. ఇటీవల కొంతకాలంగా నా భార్య – ఆమె కుటుంబ సభ్యులతో నాకు తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఆమె నాపై కేసులు వేస్తానని, నా ఆస్తులను, డబ్బును తీసుకుంటానని హెచ్చరిస్తోంది. ఒకవేళ నిజంగానే భవిష్యత్తులో అలాంటిదేమైనా జరిగితే, నా ఆర్థిక వనరులను రక్షించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను. నా సంపాదన ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లు, పీఎఫ్ రూపంలో దాచుకున్నాను. కొంత భూమి కూడా కొన్నాను. స్టాక్ పెట్టుబడులను భరణం/మెయింటెనెన్స్ నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటారా? ముందుగా నా తల్లితండ్రులకు నగదు, స్థిరాస్తులు అన్నీ బదిలీ చేస్తే సరిపోతుందని, వీలైతే జీతం కూడా వేరే అకౌంట్లోకి తీసుకుంటే భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మిత్రులు చెప్తున్నారు. నిజానికి నా భార్యకి చాలా ఆస్తి ఉంది కానీ ప్రస్తుతం వాళ్ళ నాన్న పేరిట ఉంది. తన తదనంతరం నా భార్యకేనని రిజిస్టర్డ్ వీలునామా కూడా ఉంది. అయినా నేను భరణం ఇవ్వాలా?– రఘురామ్, విజయవాడ ఆస్తులను/నగదును దాచిపెట్టే ఉద్దేశంతో చేసే ఏ విధమైన నిధుల బదిలీలు అయినా బ్యాంకింగ్ రికార్డుల ద్వారా సులభంగా గుర్తించబడతాయి. కోర్టులకు బ్యాంకులనుండి, కంపెనీల నుండి, ఇతర సంస్థల నుండి కూడా ఆర్థిక వివరాలను సమీకరించే అధికారాలు ఉన్నాయి. వివాహ సంబంధిత కేసుల్లో, కోర్టు సాధారణంగా వివాహం జరిగిన తేదీ నుండి మీ ఆదాయం, ఆస్తులు ఆర్థిక ప్రవర్తనను పరిశీలిస్తుంది. మెయింటెనెన్స్/భరణం కోరిన తేదీ నుండి గత మూడు సంవత్సరాల ఆర్థిక వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్, ఆస్తుల వివరాలు, ఖర్చులు, ఐటీ చరిత్ర మొదలగు అంశాలు వెలువరిస్తూ ఆస్తులు– అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్ కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. జీతాన్ని ఇతరుల ఖాతాలకు మళ్లించడం వంటి ప్రయత్నాలు వంటివి చేసినా, అనవసర ఆస్తి బదిలీ చేసినా, సులభంగా దొరికి΄ోతారు. అవి దురుద్దేశపూర్వక చర్యలుగా పరిగణించబడతాయి. పీఎఫ్, పీపీఎఫ్, ఫిక్స్డ్ డి΄ాజిట్లు, స్టాక్ పెట్టుబడులు వంటి అన్ని ఆర్థిక ఆస్తులను భరణం లేదా మెయింటెనెన్స్ నిర్ణయించేటప్పుడు సాధారణంగా పరిగణనలోకి తీసుకుంటారు. కోర్టు మీ నిజమైన ఆర్థిక స్థితి, సంపాదన సామర్థ్యాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా చేసుకుంటుంది. ఆస్తులను దాచడం లేదా మాయ మాటలు చెప్పడం చట్టపరంగా ప్రమాదకరం, మీ కేసులో హానికరం. ఆస్తుల గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం కోర్టు ముందు మీ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా, ఒక నిపుణుడైన కుటుంబ న్యాయవాదిని సంప్రదించి చట్టబద్ధమైన వ్యూహాన్ని రూపొందించాలి. మీపై మెయింటెనెన్స్ క్లెయిమ్ వస్తే, మీరు కింది అంశాల ఆధారంగా దాన్ని వ్యతిరేకించవచ్చు.మీ భార్య విద్యార్హతలు, ఉద్యోగం చేసే సామర్థ్యం ∙ఆమె సంపాదించగలగడం, ఉద్యోగం చేయాల్సిన అవసరం కావాలని ఉద్యోగం మానేయటం గురించిన వివరాలు మీ ఆర్థిక బాధ్యతలు, అప్పులు, మొత్తం ఆర్థిక పరిస్థితి స్పష్టతతో, చట్టబద్ధంగా వ్యవహరించడం ద్వారా మీ ప్రయోజనాలను మెరుగ్గా రక్షించుకోవచ్చు. మైనర్ పిల్లలు, పెళ్లికాని అమ్మాయిలు ఉంటే మాత్రం, మీరు ఎంత ప్రయత్నించినా కాస్తో కూస్తో తగ్గవచ్చు గానీ మెయింటెనెన్స్ మాత్రం కట్టాల్సిందే. -
కావాలనే నా భర్తని.. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి భార్య ఎమోషనల్
-
ఒకప్పుడు స్టార్ లీడర్.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్య
వాషింగ్టన్ : వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ (Justin Fairfax) (47)హత్య, ఆత్మహత్య ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు, మితిమీరిన మద్యం, ఆర్థిక సమస్యలు, మరోవైపు భార్యతో మనస్పర్థలు, విడాకుల కేసుతో నిరాశకు లోనైన ఫాక్స్ గురువారం తెల్లవారు జామున భార్యను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వాషింగ్టన్ శివారులోని అన్నేన్డేల్లో ఉన్న వారి నివాసంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. డెమొక్రటిక్ పార్టీలో ఒకప్పుడు స్టార్‌గా వెలిగిన జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్ ఈ దారుణానికి పాల్పడ్డారు. తన భార్య, డెంటల్ డాక్టర్ సెరినా ఫెయిర్‌ఫ్యాక్స్‌ను (49) కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.పోలీసులు అందించిన వివరాల ప్రకారం, హత్య-ఆత్మహత్య జరిగిన సమయంలో ఆ దంపతుల ఇద్దరు టీనేజ్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నేలపై రక్తసిక్తమైన మృతదేహం పడి ఉండటాన్ని చూసిన వారి 16 ఏళ్ల కుమారుడు, కాల్పుల గురించి తెలియజేయడానికి 911కి ఫోన్ చేశాడు. దీనికి సంబంధించి హృదయవిదారక ఆడియో వైరల్‌గా మారింది. ఇంట్లోని బేస్మెంట్లో తన భార్యను కాల్చి చంపి, అనంతరం పై అంతస్తులోని బెడ్రూమ్లోకి వెళ్లి తన ప్రాణాలు తీసుకున్నారు.జస్టిన్ సెరినా గతేడాది విడాకులకు దరఖాస్తు చేశారు. వచ్చే వారం కోర్టు విచారణలో జైలు శిక్ష, కుటుంబ ఇంటి నుండి బహిష్కరణను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కేసు విచారణలో భాగంగా బాధ్యతారహితమైన ప్రవర్తన ఫలితంగా, ఏప్రిల్ 30 లోగా ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని జస్టిన్ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ అవమానభారంతోనే ఆయన ఈ దారుణానికి ఒడిగట్టినట్టు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్ పతనం2019లో జస్టిన్ ఫెయిర్ఫ్యాక్స్పై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక ఆరోపణలు చేయడంతో ఉన్నతమైన అతని జీవితం క్రమంగా పతనంలోకి జారీ పోయింది. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉంటూ, గవర్నర్ పదవికి పోటీ చేయాలని చూస్తున్న అతని రాజకీయభవిష్యత్తును ప్రభావితం చేసింది. మానసిక ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత, 2022లో ఆయన పదవినుండి వైదొలగడంతో కుటుంబానికి మరింత దూరమయ్యారు. దీంతో తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి జారుకోవడంతోపాటు, మద్యానికి బానిసయ్యారు. ఎంతలా అంటే తనను తాను హోమ్ ఆఫీస్‌లో బంధించుకునేవాడు. అక్కడ ఖాళీ వైన్ సీసాలు, చెత్త, మురికి బట్టల కుప్పల మధ్య దయనీయమైన స్థితిలో నివసించేవాడు. కేవలం ఆహారం, సిగరెట్ల కోసం మాత్రమే బయటకు వచ్చేవాడట.ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా ఆయన వృత్తి జీవితం చిన్నాభిన్నం చేశాయి. 2022లో తన పిల్లల గుర్రపు స్వారీ పాఠాల కోసం ఉద్దేశించిన డబ్బును దొంగిలించి ఒక హ్యాండ్‌గన్ కొన్నాడని, సంచలనాత్మక విడాకుల పత్రాల ద్వారా తెలుస్తోంది. -
భార్యకు భరణం భర్త నిరంతర బాధ్యత
న్యూఢిల్లీ: భార్యకు భర్త ఇచ్చే భరణం నామమాత్రంగా ఉండరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భార్య పోషణ భర్త ప్రాథమిక, నిరంతర బాధ్యత అంటూ స్పష్టత ఇచ్చింది. భార్య గౌరవప్రదంగా జీవించేలా భర్త ఈ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుందని పేర్కొంది. భరణం న్యాయబద్ధంగా, సహేతుకంగా ఉండాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్‌ల ధర్మాసనం గురువారం తెలిపింది. ఇరుపక్షాల సామాజిక హోదాకు, భర్త ఆర్థిక సామర్థ్యానికి తగినట్లుగా ఉండాలని పేర్కొంది. వివాహ బంధంలో ఉండగా భార్య ఎలాంటి జీవన ప్రమాణాలను అనుభవించిందో, విడిపోయిన తర్వాతా అదే స్థాయి గౌరవంతో జీవించేలా భర్త భరణం చెల్లించాలని తెలిపింది. అదే సమయంలో, భరణాన్ని నిర్ణయించడంలో ఇరుపక్షాల అవసరాలను బేరీజు వేస్తూ సమతూకం పాటించాలని సూచించింది. ఒక మహిళకు ఇస్తున్న నెలవారీ వేతనం మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ జంటకు 2023 మే 7వ తేదీన హిందూ ఆచారం ప్రకారం వివాహమైంది. అత్తవారింట్లో వేధింపులతో ఏడాదికే పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి ఆ దంపతులు వేరుగానే ఉంటున్నారు. తనకు ఎటువంటి ఆదాయ వనరులు లేనందున భరణం ఇప్పించాలంటూ ఆమె చంపావత్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో, న్యాయస్థానం నెలకు రూ.8 వేలు భరణంగా నిర్ణయించింది. బాధితురాలు ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లారు. ఆ న్యాయస్థానం రూ.15 వేలకు భరణం మొత్తాన్ని పెంచింది. ఆపైన బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా పైవిధంగా తీర్పు వచ్చింది. -
తినడానికి కూడా లేనప్పుడే నా చేయి పట్టుకుంది: కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఈ మూవీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన సతీమణి రహస్య గోరఖ్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు తినడానికి కూడా డబ్బులు లేని సమయంలో తనను నమ్మిందని కిరణ్ అబ్బవరం కొనియాడారు. మూవీ ఆఫర్ల కోసం నేను తిరుగుతున్న రోజుల్లో ఇంటి నుంచి నాకోసం లంచ్ బాక్స్ తెచ్చేదని వెల్లడించారు. నా భార్య నా దగ్గర ఏమీ లేనప్పుడే నా చేయి పట్టుకుందని ఎమోషనల్ అయ్యారు.ఆ తర్వాత రహస్య గోరఖ్ తన భర్త గురించి మాట్లాడారు. నేను మాత్రం పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో అని.. కానీ పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడ్ని అని కామెంట్స్ చేసింది. పెళ్లయ్యాక తను కష్టపడతాడు.. నేను ఖర్చు పెడతాను అనుకున్నానని తెలిపింది. కానీ అతనికి చుట్టూ జనం ఉండాలి.. సందడి సందడిగా కనిపించాలని అన్నారు. లైఫ్‌లో ఇలాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటారని రహస్య గోరఖ్ ప్రశంసలు కురిపించింది. -
ఆలుమగల స్ఫూర్తి గాథ.. జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!
జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!.. ఇదొక శీర్షిక మాత్రమే కాదు.. ఆలుమగలకు ఆదర్శమైన ప్రధాన విషయం. ప్రస్తుత రోజుల్లో భార్యా భర్తల సంబంధాల్లో ప్రేమలు ఎంతవరకూ ఉంటున్నాయనే దానికి ఈ తరహా ఘటనలు ప్రేరణగా నిలుస్తాయి. ఒకరికోసం ఒకరు జీవించే క్షణాలు చాలా అల్పమై స్వల్పమైపోయిన ఈ రోజుల్లో నిజంగా ఇదొక స్ఫూర్తిగానే నిలుస్తుంది. ఏదో యాంత్రిక జీవితంలో ముందుకు సాగుతూ.. ఏదో బ్రతికేస్తున్నాం అని కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలుస్తేనే ఆ దాంపత్యానికి అర్ధం ఉంటుందనేది తాజా ఎపిసోడ్ చెప్పకనే చెప్పేసింది. ఇలా ఒకరికోసం ఒకరు అనే జంట ఉండటమే ఇప్పుడు వార్త అయ్యింది. వార్తా వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన డెంగ్ యుకై అనే మహిళకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. నడవలేని స్థితి. బెడ్‌కే పరిమితమై కృంగిపోయింది. తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా భర్తను ప్రాధేయ పడింది. భర్తకు తనవల్ల కష్టం రాకూడదని ఆమె చనిపోవాలని అనుకుంది. తాను చనిపోతే భర్త సుఖంగా ఉంటాడని భావించింది. భర్త నో అన్నాడు. ‘నేను ఉండగా నీకేం కాదు’ అన్నాడు,. భార్యకు అండగా నిలబడ్డాడు. విధితో పోరాడాడు. తన సంకల్పం ఎంత గట్టిదో చూపించాడు. భార్యను పూర్వపు స్థితికి తీసుకురావడానికి సుమారు రూ. 2 కోట్ల వరకూ ఖర్చు పెట్టాడు. అదే సమయంలో ప్రతీ రోజూ ప్రతీ క్షణం భార్య అలా బెడ్‌కే పరిమితమైన భార్య ముందు డ్యాన్స్‌లు చేస్తూ నవ్వించే యత్నం చేశాడు. చివరకు ఆమె కోలుకుంది. మళ్లీ తన పాత రోజుల్లోకి వచ్చేసింది. ప్రేమ శక్తితో భార్య తిరిగి జీవం పోసుకుంది.. లౌకిక జీవితాన్ని మళ్లీ చూడసాగింది. View this post on Instagram A post shared by History Facts & Stories (@howhistorylooks) Crazy what having someone who won't give up on you can do for you. This is will forever be a beautiful story https://t.co/UH7Jzd0TEL— Bhuti Olishayayo Ikhekhe (@BantuMthabela_) April 11, 2026 -
నల్లగా ఉన్నాడని భర్తని ప్రియుడితో చంపించిన భార్య
-
నల్లగా ఉన్నాడని లవర్‌తో మొగుణ్ణే లేపించేసింది
-
తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేరాకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో.. తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు, అలాగే విచారణకు సహకరించాలని పవన్ ఖేరాను ఆదేశించింది.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్శర్మపై పవన్ ఖేరా(Pawan Khera) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయిన సంగతి తెలిసే ఉంటుంది. రిణికి భూయాన్శర్మ వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది.పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది రవీందర్‌రెడ్డిలు వాదనలు వినిపిస్తూ.. రాజకీయంగా ఎదుర్కోలేక, ఊహాజనిత కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పిటిషనర్ గురించి అస్సాం సీఎం అనుచితంగా మాట్లాడంతోపాటు 100 మందికిపైగా పోలీసులను ఢిల్లీలోని ఆయన నివాసానికి పంపడంలో దురుద్దేశం ఉందన్నారు. అయితే పిటిషనర్ భార్య ఇక్కడ నగరంలోని సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, అందువల్ల స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని.. ఈ పిటిషన్‌పై విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందని తెలిపారు. అస్సాం ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దేవజిల్ షైకీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై నమోదైన కేసు సాధారణమైన పరువు నష్టం కేసు కాదన్నారు. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయన్న ఆరోపణలు చేయడానికి నకిలీపత్రాలను వినియోగించారని తెలిపారు. నిందితుడు ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి సంబంధించిన ఆధార్‌కార్డు ఉందన్నారు. హైదరాబాద్ నివాసినంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన.. పిటిషనర్ పవన్ ఖేరాకు మధ్యంతర ఊరట ఇస్తూ ఈలోపు సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. -
మాజీ భార్యపై లైంగిక దాడి కేసు రద్దు కాదు: హైకోర్టు తీర్పు
బెంగళూరు: భార్య నుంచి విడిపోయాక, ఆమైపె బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడితే ఆ కేసును రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ దంపతులు 2019లో విడిపోయారు. 2021లో ఆమె ఇంటికి వచ్చిన మాజీ భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ కేసులో ఆ మహిళే స్వయంగా వాదించారు. తనపై దౌర్జన్యం జరిగిందని, అతని పిటిషన్‌ను తిరస్కరించాలని కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలను ఆలకించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న కేసు మాఫీకి తిరస్కరించారు. -
మాకు టైం వస్తది.. అప్పుడు నీ నాశనమే ABN రాధాకృష్ణకు రాచమల్లు భార్య స్ట్రాంగ్ వార్నింగ్
-
క్యూఆర్ కోడ్.. కాగితం ముక్కలు.. ఇవే పట్టించాయి!
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ నెల ఏప్రిల్ 1న రాత్రి ఆగ్రాలోని సైయాన్ ప్రాంతంలో సగం కాలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులకు ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతదేహాన్ని గుర్తించడం సవాలుగా మారింది. అయితే, మృతుడి చేతిపై ఉన్న 'లోకేంద్ర' అనే పేరు గల టాటూ (పచ్చబొట్టు) మాత్రం చెరిగిపోకుండా ఉంది.మరుసటి రోజు లోకేంద్ర సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన సోదరుడు రాత్రి ఇంటికి రాలేదని.. చివరిగా మహేష్ ప్రజాపతితో కలిసి కనిపించాడని పోలీసులకు తెలిపాడు. హత్య కేసును ఛేదించడానికి పోలీసులు ఐదు బృందాలతో విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలంలో పోలీసులకు మద్యం బాటిళ్లతో పాటు కొన్ని కాగితం ముక్కలు లభించాయి. ఆధారాలు సేకరించిన అనంతరం పోలీసులు లోకేంద్ర భార్యను, ఆమె ప్రియుడు మహేష్ ప్రజాపతి, అతని స్నేహితుడు ధరమ్ వీర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.మహేష్‌కు లోకేంద్ర భార్యతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఇటీవల వీరి వ్యవహారం.. లోకేంద్రకు తెలియడంతో అతను భార్యను నిలదీశాడు. దీంతో తమ అడ్డు తొలగించుకోవాలని వీరిద్దరూ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 1న లోకేంద్ర ఇంటి నుంచి బయలుదేరగానే.. అతని భార్య మహేష్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దారిలో లోకేంద్రను కలిసిన మహేష్, మద్యం తాగుదామని ఆహ్వానించాడు. పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో లోకేంద్ర అంగీకరించాడు. వీరితో పాటు ధరమ్ వీర్ కూడా చేరాడు. పొలాల్లో మద్యం తాగుతున్న సమయంలో మహేష్, ధరమ్ వీర్ కలిసి లోకేంద్ర గొంతు నులిమి స్పృహ తప్పేలా చేశారు. ఆపై అతనిపై పెట్రోల్ పోసి.. గడ్డి కప్పి నిప్పు పెట్టినట్లు మహేష్ పోలీసులకు వివరించాడు.పశ్చిమ ఆగ్రా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య కుమార్ మాట్లాడుతూ.. ఘటనా స్థలంలో దొరికిన కాగితం ముక్కల ద్వారా దర్యాప్తు మొదలైందని.. ఆ ప్రాంతంలోని ఒక పండ్ల వ్యాపారి అటువంటి కాగితాలను వాడుతుంటాడని తెలిసిందని చెప్పారు. అలాగే, మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ల ఆధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారో గుర్తించి.. అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన బృందాలను ఆయన అభినందించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. -
హిందూమహిళ వారసత్వ ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు
సాక్షి, అమరావతి: హిందూమహిళకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిపై ఆమె భర్తకు ఎలాంటి హక్కు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మహిళ సంతానం లేకుండా చనిపోతే ఆ ఆస్తి తిరిగి ఆమె తండ్రి వారసులకే చెందుతుందని చెప్పింది. తన సోదరి శ్రీవిరిత మరణం నేపథ్యంలో ఆమెకు వారసత్వంగా తమ నాయనమ్మ నుంచి సంక్రమించిన భూమి తాలూకు రెవెన్యూ రికార్డుల్లో తన పేరును నమోదు చేయాలని కోరుతూ దేవిక మానస దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తూ రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో) జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమరి్థంచింది. ఆర్డీవో ఉత్తర్వులను రద్దుచేస్తూ జాయింట్ కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టింది. జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను రద్దుచేసింది. రికార్డుల్లో దేవిక మానస పేరు చేర్చాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు చెప్పారు. మనుమరాళ్లకు ఆస్తి ఇచ్చిన నాయనమ్మ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన చిక్కాల వెంకాయమ్మ తన మనుమరాలు (కుమారుడు దత్తాత్రేయ కుమార్తె) శ్రీవిరితకు 1.50 ఎకరాల భూమిని 2002లో గిఫ్ట్‌డీడ్ కింద ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు రికార్డుల్లో శ్రీవిరిత పేరు మీద మార్పులు చేశారు. 2005లో శ్రీవిరిత మరణించడంతో ఆ గిఫ్ట్‌డీడ్‌ను వెంకాయమ్మ 2007లో రద్దుచేశారు. ఆ భూమిని 2011లో మరో మనుమరాలు దేవిక మానసకు గిఫ్ట్‌డీడ్ ద్వారా ఇచ్చిన వెంకాయమ్మ 2012లో కన్నుమూశారు. అనంతరం ఆ 1.50 ఎకరాల భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో తనపేరు చేర్చాలని దేవిక మానస తహసీల్దార్‌ను కోరారు. దీనికి శ్రీవిరిత భర్త బదిరెడ్డి నాగవీరవెంకట శ్రీరామదొర అభ్యంతరం తెలిపారు.ఆ భూమి తన భార్యదని, దానిపై తనకే హక్కులున్నాయని పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్ ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సవాలు చేస్తూ దేవిక మానస రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ఆర్డీవో.. తహసీల్దార్ ఉత్తర్వులను తప్పుబట్టి, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలని 2017లో ఆదేశించారు. దీనిపై శ్రీరామదొర జాయింట్ కలెక్టర్ (జేసీ) ముందు రివిజన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జేసీ 2017లో ఆర్డీవో జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టారు. ఒకసారి గిఫ్ట్‌డీడ్ ఇచ్చిన తరువాత దాన్ని రద్దుచేయడానికి వీల్లేదని, సివిల్ కోర్టు ద్వారా మాత్రమే ఆ డీడ్‌ను రద్దుచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య
బెంగళూరులో పెను విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన యువ టెకీ దంపతులు బెంగళూరులో విషాదకరమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భానుచందర్ రెడ్డి కుంట (32), సోమవారం తన అపార్ట్మెంట్లోని ఒక గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాను చందర్ ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎంలో పనిచేస్తున్నాడు. అతని భార్య బీబీ షాజియా సిరాజ్ (31) తమ ఇంటి తలుపు తాళం వేసి ఉండటాన్ని గమనించింది. ఆమె పదేపదే తలుపు తట్టినా లోపల ఉన్న భర్త స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె భద్రతా సిబ్బందిని, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. వారు బలవంతంగా తలుపు తెరిచి చూడగా, భాను మృతదేహం కనిపించింది. ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యంకొన్ని నిమిషాల తర్వాత, షాజియా అదే నివాస సముదాయంలోని 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇరుకుటుంబాల్లో విషాదంలో మునిగి పోయాయి. తెలంగాణలో కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా రెండు వేర్వేరు బలవంతపు మరణాలు కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మృతదేహాలనుపోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. వీరి మరణాలకు ప్రేరేపించిన అంశాలు ఆరోగ్య సమస్యలా? మానసిక క్షోభ? ఇతర కారణాలపై ఆరాతీస్తున్నారు. ఈ జంట ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు! -
పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు!
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతికర ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్ చేయ లేదన్న కోపంతో, ఒక భర్త తన భార్యను నడుస్తున్న బైక్ మీద నుండి నెట్టివేశాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలోరికార్డైనాయి. నిందితుడు, భార్యతో కలిసి బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తూ గొడవ పడ్డారు. అక్కడ పార్టీలో డ్యాన్స్ చేయడానికి డ్యాన్స్ చేయడానికి నిరాకరించడంతో భార్యపై ఆగ్రహాన్ని పెంచుకున్నాడు. వేడుక ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా దారిలో ఆమెతో మళ్లీ గొడవకు దిగాడు. బైక్ వేగంగా వెళ్తుండగాగానే భర్త భార్యను కిందకు నెట్టివేశాడు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యంకుటుంబ సభ్యుల ఆరోపణలుఅయితే ఈఘటనపై మృతురాలి పుట్టింటి వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది కోపంతో జరిగింది కాదనీ, పథకం ప్రకారమే తన కూతుర్ని హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లయినప్పటి నుండి అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆమెను హతమార్చారని వారు కన్నీరు పెట్టుకున్నారు.ఇదీ చదవండి: పింక్ ఏనుగు ఫోటోషూట్, మృతి వివాదం : అటవీ అధికారుల రియాక్షన్ चलती बाइक से पति ने पत्नी को दिया धक्का, महिला की हुई मौत यूपी के रामपुर में पति-पत्नी एक बर्थडे पार्टी से लौट रहे थे. पार्टी में पत्नी ने डांस नहीं किया. इससे पति नाराज हो गया. इसी बात को लेकर दोनों के बीच रास्ते में कहासुनी शुरू हो गई, गुस्से में आकर पति ने चलती बाइक से पत्नी… pic.twitter.com/TDkcZ0wY03— Priya singh (@priyarajputlive) March 30, 2026 -
భర్త బతికుండగానే వితంతు పింఛన్ తీసుకున్న భార్య..!
బెంగళూరు: బతికున్న వ్యక్తి చనిపోయాడని పాలికె అధికారులు డెత్ సరి్టఫికెట్ ఇచ్చారు. ఆ పత్రం ద్వారా అతని భార్య రేషన్ కార్డు, ఇతరత్రా ప్రయోజనాల కోసం కిద్వాయి ఆస్పత్రిని మోసం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన మహబూబ్ బాషా (39), షబానా దంపతులు గొడవలు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. నా భర్త చనిపోయాడంటూ షబానా ప్రచారం చేసుకుని గతేడాది ఏప్రిల్ 23న డెత్ సర్టిఫికెట్‌ను తెచ్చుకుంది. వితంతు మహిళగా ప్రభుత్వం నుంచి వస్తున్న అన్నీ సౌకర్యాలను తీసుకుంటోంది.ఇది తెలిసి మహబూబ్ బాషా లబోదిబోమంటూ కోర్టుకెళ్లారు. చిక్కపేటలోని జనన–మరణ రిజి్రస్టార్ ఈ డెత్ సర్టిఫికెట్‌ను జారీ చేశారని తేలింది. కోర్టు ఆదేశాల మేరకు బీబీఎంపీ అధికారులు విచారణ చేశారు. షబానా తన భర్త పేరుపై ఉన్న బీపీఎల్, ఆధార్ కార్డును ఉపయోగించి కిద్వాయి ఆస్పత్రిలో మరో వ్యక్తికి చికిత్సలు చేయించింది. అయితే అతడు చనిపోయాడు. అతడు తన భర్తేనని సిబ్బందికి తెలిపింది. అతని పత్రాలన్నీ బాషా పేరుపైనే ఉన్నాయి. దీనితో ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రాలతో ఆమె సులభంగా డెత్ సర్టిఫికెట్‌ను సంపాదించింది. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా!
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఒక ఘోర హత్య ఉదంతం కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అక్కసుతో భర్తనే కడతేర్చింది. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లానికి మెహ్రాజ్. తాపీ పనిచేసేవాడు. ఇతని భార్య రూహి. తన సొంత సోదరి బావ ఫర్మాన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ జంట కలిసి జీవించాలని కోరుకున్నారు.దీనిని మెహ్రాజ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. మెహ్రాజ్ ఆహారంలో మత్తుమందు కలిపి, ఆ తర్వాత రాత్రి సమయంలో ఫర్మాన్, అతని స్నేహితుడు అద్నాన్‌లను ఇంటికి పిలిపించింది.అందరూ కలిసి మెహ్రాజ్ కాళ్లను తాడుతో కట్టివేసి, పదునైన కత్తితో అతని గొంతు కోసి హత్య చేశారు. ఆ ఘోరమైన కృత్యం చేసిన తర్వాత, రూహి తన భర్త శవం పక్కనే ఉన్న మంచం మీద రాత్రంతా నిద్రపోయింది. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ జరిగిందని కట్టుకథ అల్లింది.ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్మరుసటి రోజు ఉదయం మెహ్రాజ్ తండ్రి తన కొడుకు ఇంటికి వచ్చినప్పుడు, అతని చేతులు, కాళ్లు ఇంకా కట్టేసి ఉన్న స్థితిలో, వరండాలోని మంచం మీద పడి ఉండటాన్ని చూశాడు. దీంతో ఇదంతా దొంగల పని అని, ఎవరో దుండగులు వచ్చి తనపై దాడి చేశారని మొసలి కన్నీళ్లు కార్చింది. కానీ కోడలి మాటలపై అనుమానం వచ్చిన మెహ్రాజ్ తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది.పోలీసులు నిందితులైన రూహి, ఫర్మాన్ , అద్నాన్‌ను అరెస్ట్ చేశారు. హత్యకు పయోగించిన రెండు కత్తులతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ జైలుకు పంపారు, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి : ట్రంప్‌కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశం -
భార్య నుంచి విముక్తి : 12 గంటల పొర్లు దండాల మొక్కు
పెళ్లి కావాలని, పిల్లలు పుట్టాలని, ఇలా అ నేక కోరికలు నెరవేర్చమని దేవుడికి మొక్కుకోవడం, ఆ తరువాత మొక్కులు చెల్లించుకోవడం చాలా కామన్. దయచేసి భార్య నుంచి కాపాడు తల్లీ అని మొక్కుకున్న 25 ఏళ్ల యువకుడి మొర ఆలకించిందట అమ్మవారు. అందుకే వినూత్న రీతిలో ఆ దేవికి కృతజ్ఞతలు తెలిపాడు. అసలు కథ ఏంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.విడాకులను వేడుకగా జరుపుకోవడం లేటెస్ట్ ట్రెండ్. ఉత్తర ప్రదేశలోని బస్తీ జిల్లా, సోన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. భార్యతో ఇబ్బందుల పడిన భర్త, ఆమెనుంచి తన విముక్తి కల్పనించమని దేవుడికి మొక్కుకున్నాడు. ఆ మొక్కు నెరవేరడంతో, వైవాహిక బంధానికి ముగింపు పలికిన సందర్భంగా స్థానిక ఆలయానికి 9 కిలోమీటర్ల 'దండావత్ యాత్ర'ను చేపట్టిన వైనం, చుట్టు పక్కల గ్రామాల్లో చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: ట్రంప్‌కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశంనార్ఖోరియా గ్రామంలోని మైనిహవాన్ టోలా నివాసి జోగేష్. 2022లో సమీప గ్రామానికి చెందిన పూజను వివాహం చేసుకున్నాడు. ఇతని తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు గ్రామంలోనే నివసిస్తున్నారు. జోగేష్ తండ్రి జగదీష్ ఒక రైతు. అతనేమో ఢిల్లీలోని పిఓపి (POP) ఫ్యాక్టరీలలో పనిచేసేవాడు. పెళ్లైన రెండేళ్లకే వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. నిరంతరం ఏదో ఒక గొడవ. ఈ ఘర్షణలు, మానసిక ఒత్తిడితో విసిగి పోయిన భర్త, కోర్టును ఆశ్రయించాడు. అదే సమయంలో భార్య బారి నుండి విముక్తి లభిస్తే, తన ఇంటి నుండి ఆలయం వరకు దండావత్ యాత్ర చేస్తానని ‘మా బైదా సమయ్ మాతా’ ఆలయంలో మొక్కుకున్నాడు. రెండేళ్ల న్యాయ పోరాటం తర్వాత, ఈ ఏడాది జనవరిలో అతనికి విడాకులు మంజూరైనాయి. దీంతో అతనితో పాటు,అతని కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. అయిత జోగేష్ ఉండేది ఢిల్లీలో ఉన్నందున మొక్కు తీర్చుకోవడం ఆలస్యమైంది.అయితే, పవిత్ర నవరాత్రులు సందర్భంగా మొక్కు తీర్చుకునేందుకు మార్చి 27వ తేదీన, దండావత్ యాత్ర చేయడానికి భాన్పూర్ ఎస్‌డిఎం హిమాంశు కుమార్‌నుంచి అనుమతి తీసుకుని మరీ మాతా ఆలయం వరకు 12 గంటల్లో 9 కిలోమీటర్ల దండవత్ యాత్రను పూర్తి చేశాడు.చట్టపరంగా, సామాజికంగా తన భార్య నుండి విముక్తి లభించడంతో మొక్కును తీర్చుకోవాలని ఉదయాన్నే అన్నపానీయాలు ముట్టుకోకుండా, తన గ్రామం నుండి భాన్పూర్లోని అమ్మవారి ఆలయానికి పొర్లు దండాలు పెడుతూ ఆలయానికి చేరుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రయాణంలో అతని తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామానికి చెందిన అనేకమంది ప్రజలు డప్పులు వాయిస్తూ, అమ్మవారి నామాన్ని జపిస్తూ ఊరేగింపుగా వెళ్లారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా వారితో పాటు ఉన్నారు.సాయంత్రం 6 గంటలకు, రక్తసిక్తమైన మోకాళ్లతో, అలసిపోయిన శరీరంతో గుడికి చేరుకున్న అతను, అమ్మవారి దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపాడు. వైవాహిక జీవిత నరకం నుండి బయటపడ్డాక ఇప్పుడు తనకు ప్రశాంతంగా ఉందని అతను మీడియాతో చెప్పాడు. -
ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)
-
భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
భార్యకు యూజ్డ్ కార్ స్పెషల్ గిప్ట్ ఇచ్చిన దర్శకుడు, ధర?
ప్రముఖ సినీ దర్శకుడు, ఏక్ థా టైగర్ ఫేమ్ కబీర్ ఖాన్ తన భార్య ప్రముఖ యాంకర్ మినీ మాథుర్‌కు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేసేలా (EV), స్టైలిష్‌గా , స్పోర్టీగా ఉండే ఈ కారు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు ఫోటోలను మినీ ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ కారు విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.బహుమతిగా యూజ్డ్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారుకబీర్ ఖాన్ తన భార్యకు మినీ కూపర్ SE (MINI Cooper SE) ఆల్-ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను మినీ మాథుర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కారు అయినప్పటికీ, కేవలం 2,200 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన 2023 మోడల్ కావడం విశేషం.ఫీచర్లుఇందులో 32.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.కేవలం 7.3 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కి.మీ. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 50kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 36 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అవుతుంది. నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్‌తో ఇది లభ్యం. 8.8 అంగుళాల టచ్ స్క్రీన్, ఆపిల్ కార్ప్లే (Apple CarPlay) , స్టీరింగ్ వెనుక 5.5 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేలాంటి ఫీచర్లతో ఈ కారు ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. ప్రీమియం హర్మాన్ కార్డాన్ (Harman Kardon) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ (సన్‌రూఫ్), నాప్పా లెదర్ స్టీరింగ్ వీల్ దీనికి మరింత అందాన్ని ఇస్తాయి. మొత్తానికి పర్యావరణాన్ని కాపాడుతూనే,గో-కార్ట్ హ్యాండ్లింగ్‌తో ఎలక్ట్రిక్ వెర్షన్లో మినీ కూపర్ కార్ మజాతో స్పోర్ట్స్ కార్ అనుభూతిని ఇచ్చే కారు ఇది.ధర ఎంత?భారతదేశంలో ఈ కారు కొత్తది కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 47.20 లక్షలు. అయితే, కబీర్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ యూజ్డ్ కార్ ధర సుమారు రూ. 32 లక్షలు ఉంటుందని అంచనా. కాగా కబీర్ ఖాన్ , మినీ మాథుర్ 1998, ఫిబ్రవరి 28న వివాహం చేసుకున్నారు. డైరెక్టర్‌గా కబీర్ 'ఏక్ థా టైగర్' 'బజరంగీ భాయ్‌జాన్' పాపులర్ అవ్వగా, మినీ ఒక ప్రముఖ టెలివిజన్ హోస్ట్‌గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. వీరికి వివాన్ ఖాన్ అనే కుమారుడు , సైరా అనే కుమార్తె ఉన్నారు. -
పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)
-
భార్య జీవిత భాగస్వామి.. పనిమనిషి కాదు!
న్యూఢిల్లీ: భార్య వంట చేయని కారణం చూపుతూ విడాకుల కోసం వచ్చిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు తనదైన శైలిలో కౌన్సెలింగ్ చేసింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనుల్లో భార్యతోపాటు భర్తకు కూడా సమాన బాధ్యతుందని హితవు పలికింది. ఈ పనుల్లో భర్త కూడా పాలుపంచుకోవాలని పేర్కొంది. ‘భార్య జీవిత భాగస్వామి.. పని మనిషి కాదు’అంటూ వ్యాఖ్యానించింది. క్రూరత్వం ఆరోపణల ఆధారంగా దిగువ కోర్టు విడాకులు మంజూరు చేయగా, కర్నాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ భర్త వేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఈ దంపతులకు 2017 మేలో వివాహమవగా, 2019 నుంచి వేరుగా ఉంటున్నారు. వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. క్రూరత్వం ఆరోపణలపై దిగువ కోర్టువిడాకులు మంజూరు చేయగా, హైకోర్టు కొట్టివేసిందన్నారు. క్రూరత్వం ఆరోపణలేంటని ప్రశ్నించగా, ‘భార్య ప్రవర్తన బాగోలేదు, ఆమెకు వంటరాదు’అని లాయర్ చెప్పారు. ‘అయితే, హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైందే. దానిని క్రూరత్వంగా భావించలేం. అంతేకాదు, మీరు పెళ్లి చేసుకున్నది వంట మనిషిని కాదు, జీవిత భాగస్వామిని’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘వారిద్దరినీ కలిసి ఇక్కడికి రమ్మనండి. వారితో మేం మాట్లాడుతాం’అని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు దంపతులను తమ ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. -
పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)
-
టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)
-
కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య
కరీంనగర్‌క్రైం: కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుందని వన్‌టౌన్ సీఐ రాంచందర్‌రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం నగరంలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటూ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్ చంద్రశేఖర్ భార్య దివ్య(30) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బాధ భరించలేక మంగళవారం మధ్యాహ్నం గన్నేరుపువ్వుల రసం తాగింది. ఈ విషయం పోలీసుస్టేషన్‌కు వెళ్లిన చంద్రశేఖర్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వెంటనే నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. దివ్య తండ్రి తెడ్ల చిన్నసమ్మయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు -
భార్య, మామను హత్య చేసి పెట్రోల్‌తో తగలబెట్టిన అల్లుడు
హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లాలోని కడిపికొండ రాజీవ్ గృహాకల్పలో ఒక వ్యక్తి తన భార్యను, మామను అత్యంత కిరాతకంగా చంపి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు ప్రవీణ్‌కు, అతని భార్య రాజశ్రీకి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. చిన్నపాటి మనస్పర్థలు కాస్తా ముదిరి పెద్ద గొడవలకు దారితీశాయి. ఈ క్రమంలోనే బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రవీణ్, తన భార్య రాజశ్రీతో పాటు మామ రాజశేఖర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. వారు స్పృహ కోల్పోయిన తర్వాత, పక్కా పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వారిపై పోసి నిప్పంటించాడు.ఈ ఘటనలో ఇద్దరూ పూర్తిగా కాలిపోయి బూడిదగా మారినట్లు సమాచారం.అనంతరం నిందితుడు తన కుమారుడు, కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. -
భార్య మాట... బంగారు బాట!
టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగు పెట్టడం... సొంతగడ్డపై విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు లేకుండా వరల్డ్‌కప్ ఆడటం... మెగా టోర్నమెంట్‌కు ముందు అనూహ్యంగా ఇషాన్ కిషన్‌పై భరోసా పెట్టడం... కీలక మ్యాచ్‌ల్లో సంజూ సామ్సన్‌కు అండగా నిలవడం నుంచి మొదలుకొని... భార్య సలహాలతో ఆలోచన విధానాన్నే మార్చుకొని టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే వరకు... టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లోని పలు కీలక దశలపై ‘పీటీఐ’ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఐపీఎల్‌తోనే సరిపెట్టుకోవాలనుకున్న తాను... భార్య సూచనలతో భారత జట్టు కెప్టెన్‌గా ఎదగడం... తరగతి గదిలో సాధించలేనిది మైదానంలో చేసి చూపడం ఇలా సూర్యకుమార్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే... న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న సమయంలో దివిశతో నా వివాహం జరిగింది. జీవితం సాఫీగా సాగిపోతున్నట్లే అనిపించింది. రెండేళ్ల తర్వాత 2018లో ముంబై ఇండియన్స్‌తో జతకట్టా. అదే సమయంలో నా భార్య ఒక ప్రశ్న వేసింది. ‘ఏజ్ గ్రూప్ క్రికెట్లో నీతో కలిసి ఆడిన వాళ్లు చాలా మంది ఇప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నీ మనసులో ఏం ఉంది’ అని సీరియస్‌గా అడిగింది. ఆ సమయంలో నాకు కూడా టీమిండియా తరఫున ఆడాలని ఉంది అని చెప్పా. అయితే అందుకు నీ ప్రయత్నాలు ఏవి అని నేరుగా ప్రశ్నించింది. ఇలా ఇద్దరి మధ్య ఒక చిన్న సంభాషణ నా ఆలోచన ధోరణి ని మార్చింది. అప్పటి నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించే విషయంపై మరింత దృష్టి సారించా. ఆలోచనల నుంచి ఆహారం వరకు మొత్తం మార్చేశా. సినిమాలు, షికార్లు అన్నీ పక్కన పెట్టి తీవ్రంగా శ్రమించా. ఆ ఫలితం త్వరలోనే కనిపించింది. 2018లో ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబర్చా... అలాగే దేశవాళీల్లోనూ భారీగా పరుగులు చేశా. అలా వరుసగా మూడేళ్ల పాటు ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడా. 2020లో ఫినిషర్‌గా బాగా రాణించా... దీంతో మరుసటి ఏడాది టీమిండియా తరఫున పిలుపు వచ్చింది. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మరవలేను. భార్య అడిగిన చిన్న ప్రశ్న నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. అలా అని తను నా కెరీర్లో జోక్యం చేసుకోదు. ఎలా ఆడాలి అనే విషయాల గురించి అసలు మాట్లాడదు. కానీ నా ఆలోచన విధానాల్లో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపుతుంది. అందుకే నా విజయాల్లో అగ్రభాగం ఆమెకే దక్కుతుంది. అలా అని ఇంట్లో ఎప్పుడూ క్రికెట్ చర్చే జరుగుతుంది అనుకుంటే పొరబాటే. ఆటను గేటు బయటే పట్టి ఇంట్లోకి రమ్మని అంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు సూర్యకుమార్ యాదవ్ కాదు... కేవలం సూర్య మాత్రమే అంటూ చమత్కరిస్తుంది. అప్పటికి ఇప్పటికి అదే తేడా... 2024లో టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో... తాజాగా ట్రోఫీ చేజిక్కించుకున్న జట్టులో చిన్న చిన్న తేడాలు మాత్రమే ఉన్నాయి. 2024 టీమ్‌లో అనుభవంతో కూడిన జోరు ఉండేది... ఇప్పుడు జట్టులో యువరక్తం ఉరకలు వేస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రూపంలో జట్టులో అనుభవజు్ఞలు ఉండేవారు. ఎవరి బాధ్యతలు వారికి పక్కాగా ఉండేవి. ప్రస్తుత జట్టులో అనుభవం ఎక్కువగా లేకున్నా... ఉత్సాహం మాత్రం కావల్సినంత ఉంది. స్వదేశంలో ఆడటంపై... ప్రపంచకప్ అంటే అంచనాలు భారీగా ఉండటం సహజం. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఉత్తమ ప్రదర్శన చేస్తుండటంతో పాటు... డిఫెండింగ్ చాంపియన్‌గా మాపై విపరీతమైన అంచనాలు ఉంటాయని మాకూ తెలుసు. టీమిండియాపై అది ఎప్పుడైనా సహజమే. భావోద్వేగాల విషయంలో గత టోర్నీకి ఇప్పటకీ పెద్ద తేడా లేదు. కానీ... సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడుతుండటంతో అది మరి కాస్త ఎక్కువైనట్లు అనిపించింది. టి20ల్లో చేయితిరిగిపోయింది జీవితంలో ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. దేశవాళీల్లో 10–12 ఏళ్లు ఆడాను. ముంబైలో క్రికెట్ ప్రారంభించిన వాళ్లు ఎవరైనా... ఎర్ర బంతితోనే ప్రాక్టీస్ చేస్తారు. నేను అంతే! అయితే టీమిండియా తరఫున ఏకైక టెస్టు మ్యాచ్ ఆడా. వన్డేల్లో నిలదొక్కుకునేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ అదీ సాధ్యపడలేదు. టి20 ఫార్మాట్లో మాత్రం చేయితిరిగిపోయింది. టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు జితేశ్ శర్మను కాదని ఇషాన్‌ను ఎంపిక చేశాం. అప్పుడే అతడితో ట్రోఫీ గెలిపిస్తావా అని అడిగాను. ముందు నమ్ము అని అన్నాడు. అదే జరిగింది. సామ్సన్ను తుది జట్టులోకి తీసుకున్న తర్వాత టోర్నమెంట్లో మా జట్టు ఆటతీరే మారిపోయింది. -
ఉరి వేసుకునేలా ప్రేరేపించింది భర్తే
రాజంపేట: ఉరి ఎలా వేసుకోవాలో చెప్పి భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని వైఎస్సార్ కడప జిల్లా మన్నూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ లింగప్ప కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నందలూరుకు చెందిన రైల్వే లోకో పైలెట్ శ్రీరాం శ్రీనివాస్ 2017లో కృష్ణవేణి(30)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరు బోయనపల్లెలోని శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉండేవారు. శ్రీరాం మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈనెల 11న కారు మరమ్మతుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శ్రీరాం శ్రీనివాస్ కృష్ణవేణిని బెల్టుతో కొట్టాడు. ఆమెను చనిపోవాలని తీవ్రంగా ప్రేరేపించాడు. మనోవేదనకు గురైన మృతురాలు బెడ్రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకొని ఉరి వేసుకుంటుండగా, నిందితుడు ఆమెను కాపాడకపోగా , ఆ దృశ్యాన్ని కిటికీలో నుంచి భార్య సెల్ఫోన్లోనే వీడియో తీశాడు. ఉరి అలా కాదు.. కృష్ణా.. సరిగ్గా వేసుకో అంటూ వికృతంగా నవ్వుతూ పైశాచికత్వం ప్రదర్శించాడు. ఆమె ఉరివేసుకుని మరణించిన తర్వాత ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టి, మరుసటి రోజు తన తల్లిదండ్రులు వచి్చన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం సెక్షన్ 108 బీఎన్ఎస్ కింద కేసుగా మార్చి నిందితుడు శ్రీరాం శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
భార్య వేధింపులకు మరో భర్త బలి
-
అతడు c/o ఆమె
ఆమె నా బాబా భవానీ: డా.గురవారెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులుబాగా అరిగిపోయిన ఓ రొటీన్ సూక్తితోనే మొదలుపెట్టాలంటే ‘ప్రతి పురుషుడి విజయం వెనక ఓ మహిళ హస్తం తప్పక ఉంటుంద’ంటారు. నా విజయాలూ, ఉత్థానాలూ, జీవితమూ అన్నింటి వెనక నా లైఫ్ పార్ట్నర్ భవానీవి రెండు హస్తాలూ, పాదాలూ... ఆ మాటకొస్తే మొత్తంగా తానే ఉంటుంది. జోక్స్ అపార్ట్... భవానీ నా పట్ల తన ప్రేమను ప్రకటించేనాటికి నేనో మామూలు మెడికల్ స్టూడెంట్‌ని. వాళ్లది ఆర్థికంగా, సామాజికంగా చాలా ఎత్తున ఉన్న కుటుంబం. ఆ టైమ్‌లో ఆమె నా గురించి వాళ్ల నాన్నకు ఓ లెటర్ రాసింది. ‘ఇవాళ అతడో మామూలు వ్యక్తి కావచ్చు.కానీ రేపు తన జీవితంలో ఓ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. చాలా ఎత్తులకు ఎదుగుతాడు. అంతకు మించి మంచివాడు. నా భాగస్వామిగా చాలా కరెక్ట్’ అంటూ తన లేఖలో నా గురించి చెప్పింది. నా మీద నాకూ ఆత్మవిశ్వాసం ఉండేది. అయితే భవానీకి మాత్రం నా మీద నాకు ఉన్న దాని కంటే కూడా నా సామర్థ్యాల మీద ఆమెకు ఉన్న నమ్మకం చాలా చాలా ఎక్కువ. మామూలుగానైతే ఫలానావాడు నాకు తగినవాడా కాదా అంటూ అమ్మాయిలు ప్రేమపరీక్షలు పెడుతుంటారు. తమ గీటురాయి మీద ఒకటికి నాలుగుసార్లు పరీక్షించి చూస్తూ ఉంటారు. కానీ నా విషయంలో అంతా డిఫరెంట్. నేను భవానీకి ప్రేమ పరీక్షలు పెట్టాను. కారుల్లో తిరిగే అమ్మాయిని సిటీబస్సుల్లో ఇరికిస్తే ఎలా తట్టుకుంటుందో తెలుసుకోడానికి గుంటూరు శ్రీనివాసకాలనీ నుంచి నాజ్ సెంటర్ వరకు సిటీబస్సుల్లో తిప్పేవాణ్ణి. అలా మా సిటీబస్సు టైర్ల జాడల్లో పయనించగలదా లేదా అని ఆమెనుటెస్ట్ చేస్తూ ఉండేవాణ్ణి. తనకున్న ఆర్థిక సామాజిక నేపథ్యం కారణంగా భవానీకి అన్ని సదుపాయాలూ సమకూరి ఉండేవి. ఓ చిన్నకూతురుగా ఆమె ఆ ఇంటి గారాలపట్టి. నేను అప్పట్లో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాణ్ణి. అలాంటిది తాను తన ప్రివిలేజెస్ అన్నింటినీ వదులుకొని ఓ పెద్దకోడలు హోదాలో ఇంటి బాధ్యతలన్నింటినీ తలకెత్తుకుంది. వాటిని ఎంతో బాధ్యతాయుతంగా నిభాయించింది కూడా. ఆ సమయంలో నా ఆర్థికలేమిని ఏమాత్రం లెక్కచేయకుండా నా వెంటనడిచింది. ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నానంటే... నా చదువు పూర్తయ్యాక పూణేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో నా జీతం కేవలం రూ.1,800 మాత్రమే! అలాంటి మా ఇంటికి వచ్చిన భవాని ఇంటి పెద్దకోడలుగా నా పెద్ద ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుని మా తమ్ముళ్లకు వదినగా... మా అమ్మనూ, నాన్ననూ చూసుకుంటూ వాళ్ల కూతురిగా ఉండిపోయింది. ఇంగ్లాండ్‌లో నేను ఉద్యోగాల కోసం పరుగెత్తుతూ ఉన్నప్పుడు నా కుటుంబం పర్యవేక్షణ ఆమె కనుసన్నల్లోనే సాగింది. నేనెక్కడో సుదూరతీరాల్లో ఉన్నప్పుడు ఇంటి పెద్ద్దకొడుకు స్థానాన్నీ ఆమే భర్తీ చేసింది. అలా నా కలలను తరుముతూ వాటిని అందుకునేందుకు వాటి వెంట నేను పరుగెత్తుతున్నప్పుడు నా వెన్నంటే ఉంది. అప్పుడూ... ఇప్పుడూ... ఎప్పుడూ!!నేను ఆమెను సరదాగా ‘బాబా భవానీ’ అంటూ పిలుస్తుంటా. ఈమాట ఎందుకు చె΄్పాల్సి వస్తుందంటే ఈ 40 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఏరోజూ తనని ఆనందంలో ఎగరడం గానీ... దిగులులో తరగడంగానీ చూడలేదు. ఎప్పుడూ ఒకేలా ఉండటం మహర్షులకే కదా సాధ్యమయ్యేది. అందుకే నాకెప్పుడూ ఆమె మా ‘బాబా భవానీ’యే! నేను తీసుకునే నిర్ణయాలను చాలా నిశితంగా పరిశీలిస్తుంది. నా తప్పులను విమర్శనాత్మకంగా చూస్తుంది. ఎక్కడైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాన్ని పెద్దమనసుతో భరిస్తుందీ... సరిచేస్తుంది. నా ఆనందాలూ, నా అభిరుచులూ, నాకు నచ్చే విషయాలూ ఆమెకు నచ్చకపోయినా నా స్పేస్‌లో నన్ను ఉండనిస్తుంది. అలా ఉండనిచ్చినంత సేపూ ఉండనిచ్చి... తాను ముందుకెళ్తూ నన్నూ తీసుకెళ్తుంది.తీరని రుణం: చంద్రబోస్, ప్రముఖ గీతరచయితమన వెనకాల నిశ్శబ్దంగా కొంతమంది శ్రమిస్తూ ఉంటారు. అది ప్రపంచానికి తెలియదు. మనం మన వెలుగులో ఉంటాం. రాణిస్తుంటాం. గుర్తింపునకు నోచుకుంటాం. అందరి అభినందనలూ, సన్మానాలు మనం పొందుతుంటాం కానీ.. మనం ఇంత దూరం రావడానికి వెనకాల నిశ్శబ్దంగా, నిరంతరం పని చేస్తూనే ఉంటారు. శ్రమిస్తుంటారు. వారే ఇంటి ఇల్లాళ్లు. మా ఆవిడ (ప్రముఖ కొరియోగ్రాఫర్–డైరెక్టర్ సుచిత్ర) నిరంతరం తెర వెనకాల పని చేస్తూ, కష్టపడుతూ నా గురించి ఆలోచిస్తూ నన్ను ఇంకా బాగా రాసే విధంగా ప్రోత్సహిస్తూ ఉండటం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. దీని వెనకాల ఉన్నదంతా ఒక స్త్రీ మూర్తి, స్త్రీ శక్తి. తనను గుర్తు చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందం. నిజానికి తను ఎన్నో సాధించింది. ఎన్నో వందల సినిమాల్లో వేల పాటలు కంపోజ్ చేసింది. ఎంతో గుర్తింపు పొందింది. తను ఒక పెద్ద టెక్నీషియన్ అయినా, తను నా కన్నా సీనియర్ అయినా నా జీవితంలోకి వచ్చాక నా జీవితం కోసం, నా భవిష్యత్తు కోసం పాటు పడిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఇదేదో అనుబంధం కాదు... రుణానుబంధమే అయ్యుంటుంది. ఎందుకంటే ఎక్కడో చెన్నైలో పుట్టిన తను, వరంగల్‌లో పుట్టిన నేను.. మేమిద్దరం కలిసేలాగా చేసింది విధి. ఇదంతా కూడా భగవంతుడి లీలేమో అనుకుంటుంటాను. ఈ మహిళా దినోత్సవం రోజు మన జీవితంలోని మహిళలు... వాళ్లెంత గొప్పవాళ్లు, మన కోసం ఎన్ని త్యాగాలు చేస్తారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారు, మన క్షేమం కోసం, సౌభాగ్యం కోసం, ఆనందం కోసం, మన విజయం కోసం ఎంత శ్రమిస్తారు, ఎంత చెమటోడుస్తారు, ఎన్ని కన్నీళ్లు కూడా కారుస్తారు అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్లకు మనం ఏమిచ్చినా ఆ రుణానుబంధం రుణం తీర్చుకోలేం. స్త్రీలు మొత్తం ఉన్నదంతా మనకిచ్చేసి తిరిగి వాయిదాల పద్ధతిలో చిన్నచిన్నగా కొంత కొంత అడుగుతారు. మనం ఇవ్వాల్సింది ప్రేమ, గౌరవం, గుర్తింపు, కాస్త మన సమయం, తనకు కావలసిన సమయం ఇచ్చి, ఎప్పుడు వెనకాల ఉంటూ వాళ్లు మన విజయాలను చూసి ఆనందించేలాగా మనం విజయపథంలో నడవడం వాళ్లకు నిజంగా గొప్ప బహుమతి అని భావిస్తున్నాను.నాలో మార్పు తీసుకొచ్చిందిచాలా విషయాల్లో నాలో మార్పు తీసుకువచ్చింది మా ఆవిడ సుచిత్ర. చాలా విషయాల్లో అంటే నా అలవాట్లు, నా వ్యసనాలు, తరువాత నా పద్ధతులు ఇవన్నీ మారడానికి ప్రధాన కారణం నా భార్య. నాకు 21 ఏళ్ల క్రితం కొన్ని చెడు అలవాట్లుండేవి. పాట రాసేపుడు ఒక చెడు అలవాటుతో కూర్చొని రాసేవాణ్ణి. అది ఆరోగ్యానికి మంచిది కాదు. అది హానికరం అని చాలా విధాలుగా చెప్పినా నేను వినలేదు. కానీ తను ఓపిగ్గా చెబుతూ చెబుతూ ఇంతకాలంగా చెబుతోందని దృష్టి పెట్టేలాగా చేసింది. అపుడు ఆ అలవాటు నుంచి పక్కకొచ్చాను. చాలా చాలా మంచి జీవితానికి అపుడు శ్రీకారం చుట్టాను. అట్లాగే ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబాన్ని పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకోవడం. పిల్లలు గానీ, మా కుటుంబ సభ్యులు గానీ, మా వైపువాళ్లు, మా స్నేహితులు, ఇంకా ఇంటికొచ్చేవాళ్ల ఆదరణ అంతా తాను చూసుకోవడం. కుటుంబం కోసం నా సమయాన్ని వెచ్చించనివ్వకుండా పూర్తిగా నా వృత్తి మీద, నా పాటల మీద మాత్రమే పెట్టేలాగా అంత సమయాన్ని నాకిచ్చింది. వేరే ఏమీ ఉండదు పాట.. పాట.. లేదంటే చదవడం చదవడం. ఈ రెండే... అంటే సృజించడం... అధ్యయనం చేయడం ఈ రెండే .. వీటి మీదే మనసు లగ్నం చేసేలాగా నన్ను సిద్ధం చేసిందన్నమాట. ఇంకొకటి ఏంటంటే... అసలు ఆస్కార్ వస్తుందని ముందు ఊహించిందే నా భార్య. ఆస్కార్ కంటే ముందు ఆస్కార్ తను నాకిచ్చింది. 2022 డిసెంబర్ 22న నాకు ఒక ఉత్తరం రాసిచ్చింది – మీరు ఆస్కార్ అవార్డు సాధించబోతున్నారని. అప్పటికి నామినేషన్స్‌కు కూడా ప్రక్రియ మొదలవ్వలేదు. ఊరికే నామినేషన్‌కి పంపించామంతే! అప్పుడు తను నాకు ఉత్తరం రాసిస్తే ఇది ఎలా... అన్నాను. మీరు చూడండని చెప్పి దృఢమైన విశ్వాసంతో దేవుడికి పూజలు చేయడం మొదలు పెట్టింది. నేను అసలు నమ్మలేదు. నామినేషన్ 35 నుంచి 15 లోకి; 15 నుంచి 5 లోకి వచ్చింది మనది. అప్పుడు నమ్మడం మొదలెట్టాను. అవును... మా ఆవిడ చెప్పింది ముందే అని. ఏంటంటే నమ్మకం అనేది ఒక పక్షి లాంటిదని. పక్షి సూర్యోదయాన్ని అందరికంటే ముందే, లోకం కంటే ముందే పసిగడుతుంది. అట్లా మా ఆవిడ ఒక నమ్మకంతో ముందుకెళ్లింది. ఆ నమ్మకాన్ని నాలో కూడా నింపింది. నాలో కూడా ఆ నమ్మకం కలిగేలాగ చేసింది.ఒక కవిగా నేను చెడు అలవాట్లతో చెడు పద్ధతులతో ఉంటూ మంచి మాట చెప్పినా దాంట్లో నిజాయితీ లోపిస్తుందని నా భావన. అందువల్ల మనం మంచి దారిలో ఉండి మంచి మాట చెబితే అది సరైన పద్ధతి. అలా ఆ సరైన పద్ధతిలోకి తీసుకువచ్చింది నా భార్య. నేను రాత్రిపూట రాసేవాణ్ణి. పగటిపూట రాసేలా నన్ను ప్రోత్సహించి నాలో నమ్మకాన్ని నింపింది. ఇప్పుడు హాయిగా రాత్రి పడుకోవడం... పగలు రాయడం.బెటర్ ఫుల్: మల్లాది వెంకట కృష్ణమూర్తి, ప్రముఖ రచయితనా జీవిత కథలోని ప్రధాన పాత్ర పద్మజ. పద్మజ నా భార్య. మాకు ఎలా పరిచయమైంది? 1982లో ఓ వారపత్రిక సంపాదకుడు ఏదైనా మంచి శీర్షిక సజెస్ట్ చేయండి అని అడిగితే ‘మీ భార్యని మీరు ఎలా ఎప్పుడు కలుసుకున్నారు?’ అనే శీర్షికని సూచించాను. ‘పెళ్లిచూపులు లేదా పార్క్ అంతేగా?’ అని ఆయన దాన్ని స్వీకరించలేదు. కానీ అందరూ తమ భార్యలని అలాగే కలుసుకుంటారా? పద్మజ స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర చింతలపూడి. అభిమాన రచయితగా నాకు అక్కడ నుంచి రాసిన ఉత్తరాల ద్వారా మా పరిచయం. నన్ను చూడాలని ఉందంటే, హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోన్ చేయమని ఆఫీస్ నంబర్ ఇచ్చాను. అలా 1983లో నిమ్స్ హాస్పిటల్లో కలిశాను. కొద్దిసేపట్లో ఆమెకి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. నేను అమెరికన్ హాఫ్డాలర్ కాయిన్ని ప్రెసెంట్ చేశాను. లాస్ట్ మినిట్‌లో సర్జన్ సర్జరీ అవసరం లేదని చెప్పడంతో అది లక్కీచామ్‌గా పద్మజ భావించింది. ఈ రోజుకి అది తన దగ్గర భద్రంగా ఉంది.పద్మజలో సాహిత్యం మీద చక్కటి అభిరుచి ఉంది. అందరికి తెలిసిందే... సోక్రటీస్ భార్య కోపంగా అతని మీద కడవలో తెచ్చిన నీళ్లు కుమ్మరించింది. ఆయన ప్రశాంతంగా ‘ఈ రోజు వాన, ఉరుములు కలిసి వచ్చాయి’ అని శిష్యులతో చె΄్పాడు. ‘ఆమె ఎందుకు కుమ్మరించింది?’ అనే కోణంలోంచి ఆలోచించి తను రాసిన మొదటి కథ ‘సోక్రటీస్ భార్య’ నాకు బాగా నచ్చింది. పద్మజ పురుష ద్వేషి కాకపోయినా ఆ కథలో స్త్రీవాదం స్పష్టంగా ఉంది. ఆమె స్త్రీవాది అనే చె΄్పాలి. పద్మజ చక్కటి ఇల్లాలు. ముందు నేను, తర్వాత పిల్లలు ముఖ్యం. ఆ తర్వాతే మరేదైనా. 1989లో నేను యూరప్ వెళ్తూ తనని కూడా రమ్మంటే ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలి రావడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఆ జాబితాలో మనవరాలు, మనవడు కూడా చేరారు. తనకి నా మీద ఎంత శ్రద్ధ అంటే ఏ రోజు నేను వేసుకోవాల్సిన బట్టలు ఆరోజు తనే ఇస్తుంది. ఏ కారణంగానైనా అన్నం కొంచెం తక్కువ తింటే తను రుచిగా వండలేదని బాధపడుతుంది. అది కాదని చెప్పినా నమ్మదు. మా ముగ్గురు పిల్లలు కావ్య, ఊహ, లిపి తల్లిని స్నేహితురాలుగా భావిస్తారు. అన్ని మనసు విప్పి ఫ్రీగా చర్చిస్తారు. నాతో మాత్రం అలా కాదు.తమస్విని అనే కలం పేరుతో కౌముది డాట్ నెట్లో ‘సంసారంలో సరిగమలు’ అనే శీర్షికతో 10 ఏళ్ళుగా 100కి పైగా కథలు రాసింది. ఇవన్నీ మన మధ్య కనపడే మధ్యతరగతి మనుషులకి చెందిన కథలే. నా మొదటి పాఠకురాలు పద్మజ. నా రచనలను పత్రికకి పంపే ముందు తనే తప్పులను దిద్దుతుంది– ఈ వ్యాసంతో సహా. ప్రూఫ్‌రీడింగ్, పుస్తకాలకి పేజ్ మేకప్ తనే చేస్తుంది. పద్మజ తండ్రి ఎం.ఎ. సాంస్క్రిట్ పండిట్‌గా పని చేసేవారు. ఆయన పిల్లలకి తెలుగుని బాగా నేర్పించారు. ళ ని ల గా, ణ ని న గా పలికితే తను చాలా బాధపడుతుంది. అలాగే, నేను సెన్సిటివ్ కానీ కవిత్వాలు రాయలేను. తను నా అంత సెన్సిటివ్ కాదు కానీ టచింగ్‌గా ఉండే కవిత్వాలు రాయగలదు. పద్మజకూ నాకూ వయసులో పదహారేళ్ల తారతమ్యం ఉన్నా పద్మజకి నాతో సమానమైన మెచ్యూరిటీ ఉంది. సమానం అన్నానా? తప్పు. ఇంకాస్త ఎక్కువ మెచ్యూరిటీ ఉంది.1996లో తను పీజీ చేయాలని అనుకుంది. నేను అందుకు అభ్యంతరం చెప్పలేదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ లో పీజీ చేసింది. తనకి రాజకీయాల మీద అవగాహన ఉంది. నిత్యం దినపత్రిక చదువుతుంది. కాఫీ తాగే టైంలో దినపత్రిక చదివేప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది. 2000వ సంవత్సరం నుంచి పద్మజే ఆర్థిక వ్యవహారాలు, ఇంటి విషయాలు చూసుకుంటోంది. ఎప్పుడైనా అనుమానం వచ్చినా, సలహా అవసరమైనా నాతో సంప్రదిస్తుంది. పెద్దయ్యాక పిల్లలు ముగ్గురు విదేశాలకు వెళ్లాక మేము ఇప్పుడు ఇద్దరమే ఒంటరిగా ఇంట్లో. అప్పుడప్పుడు ఇద్దరం కలిసి వంట చేయడం ఓ సరదా. మా అమ్మ చివరి దశలో ఆఖరి పదేళ్లు నా దగ్గర ఉన్నప్పుడు ఓపెన్‌గా పద్మజతో ఆవిడ చెప్తూ ఉండేది ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని. అయినా చివరిదాకా మా అమ్మని పద్మజ ఎంతో సహనంగా శ్రద్ధగా చూసుకుంది. మా అమ్మలో ఆ ద్వేషం పోకుండానే వెళ్ళిపోయింది. కారణం శాఖాభేదం!పద్మజకి వంట చేసుకుని తినడమే ఇష్టం. బయటి భోజనం ఇష్టం ఉండదు. సాధ్యమైనంత వరకు రెస్టారెంట్స్‌కి వెళ్లడానికి అవాయిడ్ చేస్తుంటుంది ముఖ్యంగా పిల్లల దగ్గరికి విదేశాలకు వెళ్ళినప్పుడు అనేక దేశాలకు చెందిన రెస్టారెంట్స్‌కి వెళ్తూ ఉంటాం పీజా, న్యూడిల్స్ లాంటివి తనకి ఇష్టం ఉండదు. అన్నం మాత్రమే ఇష్టం. నేను చాలా తరచూ మా పిల్లలకి చెప్పే జోకు ‘నాకు ఇది వద్దు’ అంటే చిన్నప్పుడు మీ అమ్మ అది తినలేదు కాబట్టి వద్దు అంటుంది. చిన్నప్పడు ఏం తిన్నదో అదే తింటుంది. కొత్తవి ఏమి తినదు. రెస్టారెంట్‌కి వచ్చినప్పుడు ఒక్కోసారి ఇంటికి వెళ్లి అన్నం వండుకొని తినే సందర్భాలు కూడా ఉన్నాయి. మల్లాది ముచ్చట్లు అనే టోరీ రేడియో కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 9:30 నుంచి 11:30 దాకా వస్తుంది. ఆ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మేమిద్దరం కలిసి నిర్వహిస్తున్నాం. ఒక్కోసారి అనిపిస్తుంటుంది, పద్మజని కాక నేను మరొకరిని ఎవరినైనా చేసుకుని ఉంటే బహుశా విడిపోయి, ఈరోజు ఒంటరిగా ఉండేవాడినేమో అని. మేమిద్దరం కలిసి కొనసాగడానికి కారణం పూర్తిగా పద్మజే.మా ఇద్దరిలో నవ్వని వ్యక్తి నేను. ఎప్పుడూ నవ్వే వ్యక్తి పద్మజ. తను మాటకారి. నేను ముభావిని. తను లగ్జరీలని ఇష్టపడుతుంది. నేను మినిమలిస్ట్ని. నేను ఇంగ్లీషు పాత సినిమాలు చూడడానికి ఇష్టపడతాను. తను కొత్తగా వచ్చే సిరీస్‌ని చూడడానికి ఇష్టపడుతుంది. ఇలా మేము చాలా విషయాల్లో ఉత్తర దక్షిణ ధ్రువాలైనా మా మధ్య ఎలాంటి ఇబ్బందీ లేదు. కారణం ఒకరి పట్ల మరొకరికి గల సహనం.ప్రతి కష్టంలోనూ నాతో...: బాబీ, ప్రముఖ సినీ దర్శకుడునా లైఫ్‌లో నా వెనకాలే కాదు ముందు కూడా స్త్రీనే ఉంది. ముందు ఉండే స్త్రీ అమ్మ అయితే, వెనకాల ఉండే స్త్రీ నా భార్య అనూష. ఎక్కడో గుంటూరులో ఉండే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలకి వెళ్ళడానికి డబ్బులిచ్చి ఎంకరేజ్ చేసింది మా అమ్మ. అయితే ప్రేమలో ఉన్నప్పుడు నేను సినిమాలలోకి వెళ్ళి దర్శకుడిని అవుతా అంటే నా వెనక ఉండి నా వెన్ను తట్టింది నా భార్య. నాకు ముందు... వెనక వీళ్ళు ఉండటం వల్ల నేను ఇంత దూరం రాగలిగాను.అనూషతో ప్రేమలో ఉన్నప్పుడు నేను ఇంట్లో చెప్పుకోలేని సీక్రెట్స్ అన్నీ తనతో చెప్పుకునే వాడిని. ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్నాక నేను మనసులో అనుకునే అబద్ధాన్ని కూడా తను ముందే గెస్ చేసి ‘మీ అమ్మానాన్నకి చెప్పినట్టు నాకు చెప్పలేవు’ అని హెచ్చరిస్తుంది. తనకి నేనొక తెరిచిన పుస్తకం. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అంటారు కదా. అలా నేను నా కథలన్ని మొదట తనతోనే చెబుతాను. వంద శాతం నిర్మొహమాటంగా బాగుంటే బాగుంది అని బాలేకపోతే బాలేదని చెబుతుంది. కథలే కాదు... ట్యూన్స్, టీజర్స్, ప్రోమోస్ అన్నీ చూపిస్తాను. ఎందుకంటే నా భార్యకి ఏ ఫిల్టర్స్ ఉండవు. ఏదైనా నిజాయితీగా చెబుతుంది. నా క్రియేటివిటీని ఫస్ట్ జడ్జ్ చేసేది తనే. చిరంజీవిగారితో ‘వాల్తేరు వీరయ్య’ మూవీ షూటింగ్ చేస్తుంటే మా నాన్నగారు కాలం చేశారు. మా నాన్న చిరంజీవి గారికి చాలా పెద్ద అభిమాని. ఆ టైమ్ నాకు మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్. మా నాన్న లేని లోటు నా భార్య తీర్చింది. నన్ను ముందుకు నడిపింది. ప్రతి రోజు షూటింగే నా గోల్ కింద గుర్తు చేసేది. మీ నాన్నకి చిరంజీవిగారి పై ఉన్న ప్రేమ అందరికీ తెలిసేలా ఒక బ్లాక్ బస్టర్ సినిమా తియ్యమని నన్ను రోజూ మోటివేట్ చేసేది. తన మోటివేషన్ వల్లే నేను అంత పెద్ద సినిమా (‘వాల్తేరు వీరయ్య’) తియ్యగలిగాను. నాన్నకి చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమ, నాకు నాన్న మీద ఉన్న ప్రేమే ‘వాల్తేరు వీరయ్య’. అది మా నాన్నకి నేను ఇచ్చిన ట్రిబ్యూట్ అవ్వాలి అంటూ నన్ను ప్రోత్సహించింది నా వైఫ్. నేను ఇంట్లో ఎక్కువసేపు ఉంటే ఆఫీస్ లేదా? అని గుర్తు చేస్తూ ఉంటుంది. వెళ్ళి పని చేసుకో అని ఇండైరెక్ట్ సెటైర్స్ వేస్తుంటుంది,. మోస్ట్ ఆఫ్ ది టైమ్ షూటింగ్ లేనప్పుడు నేను గడిపేది ఇంట్లోనే. నేను, నా కూతురు వైష్ణవి, నా భార్య ఇదే నా ప్రపంచం. నా భార్య ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్‌లో ్రపొఫెసర్గా కూడా చేసింది. నా కోసం, మా కూతురి కోసం తన కెరియర్ శాక్రిఫైస్ చేసి, మమ్మల్ని బాగా చూసుకుంటుంది. ఇల్లు మ్యానేజ్ చేయడం అంటే ఈజీ కాదు. మా అమ్మని చూశాను, మా అక్కని చూశాను. మా అత్తగారిని చూశాను, తరువాత అనూషని చూస్తున్నాను. వీళ్లందరిని చూసిన తరువాత ఇల్లు మెయింటెయిన్ చేసుకోవటంలో ఆడవాళ్ళ తరువాతే ఎవరయినా అని నాకు అర్థం అయ్యింది.నా ప్రతి కష్టంలోనూ నా భార్య అనూష నాతో ఉంది. నేను అయిదు వందలు సంపాదిస్తున్న టైమ్ నుండి నా సంపాదన ఆమెకు తెలుసు. ఘోస్ట్ రైటర్‌గా నా పేరు పడని దగ్గర్నుంచి నా గ్రోత్ తెలుసు. నేను డైరెక్టర్ అవక ముందే పెళ్లి చేసుకున్నాం. అద్దె ఇళ్ల కోసం ఓనర్ల చుట్టూ తిరగడం, కారు ఈఎంఐ వస్తుంటే భయపడడం, గోల్డ్ లోన్లు పెట్టి రెంట్లు కట్టడం, ఇన్ని కష్టాలు పడుతున్నా ఏ రోజూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న దాంట్లో హ్యాపీగా బతకాలి అనే మెంటాలిటీతో ఉంటుంది. నా సక్సెస్ వెనకాల ఉండే ప్రశాంతానికి తనే కారణం. -
చావుకు అడ్డొస్తోందని భార్యపై పెట్రోల్ దాడి
తిరుమలాయపాలెం: కిడ్నీ సంబంధిత సమస్యతో నరకయాతన పడుతున్న ఓ వ్యక్తి తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడాలని ప్రయత్నించాడు. కానీ కుటుంబంలో విషాదం నింపొద్దని అడ్డు తగలడమే ఆయన భార్యకు శాపమైంది. ఈక్రమంలో సదరు వ్యక్తి భార్యపై పెట్రోల్ పోసి మంట అంటించాక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై జగదీశ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుమలాయపాలెంకు చెందిన తోటమళ్ల నాగభూషణం(65) రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.ఈ సందర్భంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి మూడు సార్లు ప్రయత్నించగా భార్య జయమ్మ అడ్డుపడింది. నానాటికీ సమస్య పెరుగుతుండడంతో అడ్డుపడుతున్న భార్యను ముందు చంపి ఆ తర్వాత తాను చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈమేరకు గురువారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ముందుగానే తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. కాగా, నాగభూషణం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా అందరికీ వివాహాలు జరిగాయి.వీరి కుమారుడు మండల కేంద్రంలోనే మరోచోట ఉంటున్నాడు. ఇంట్లో నుంచి మంటలు వస్తుండగా స్థానికులు గమనించి కుమారుడికి సమాచారం ఇవ్వగా వచ్చి భార్యాభర్తలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందగా, జయమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
భర్తను హత్య చేసిన భార్యకు పదేళ్ల జైలు
రంగారెడ్డి జిల్లా: భర్తను హత్య చేసిన భార్యకు ఎల్బీనగర్ కోర్డు పది సంత్సరాల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించింది. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ పద్మశాలిపురంలో నివాసం ఉండే ప్రభుగౌడ్, భార్య లక్ష్మి ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. భార్య లక్ష్మి కల్లు తాగి వస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేది. 2017 ఏప్రిల్ 6వ తేదీన సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం రవి వంట చేయాలని భార్యను కోరాడు. ఇందుకు నిరాకరించిన ఆమె తాను పుట్టింటికి వెళ్లిపోతానని బట్టలను సిద్ధం చేసుకొని బయలుదేరింది. అదే సమయంలో మళ్లీ గొడవ పడ్డారు. దీంతో లక్ష్మి కోపంతో రగిలిపోయి రవిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. కేకలు పెడుతూ మంటలతో బయటకు పరుగులు తీసిన రవిని స్థానికులు రక్షించారు. మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్స్‌లో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న అతడు చనిపోయాడు. ఇప్పటి మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టగర్ పి.జగదీశ్వర్ ఆదారాలను ఎల్బీనగర్లోని కోర్టుకు సమరి్పంచారు. విచారణ అనంతరం లక్ష్మికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వై.సత్యేంద్ర తీర్పునిచ్చారు. గృహ హింస కేసులో ఏడాది.. సిటీ కోర్టులు: గృహహింస కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి మనోరంజన్లోని 15వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ కోర్టు న్యాయమూర్తి డి.అజయ్ కుమార్ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు.. మలక్‌పేట్‌కు చెందిన తౌఫిక్ ఖాన్ అదే ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ బేగంను 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యం తాగి ఇంటికి వచ్చి విపరీతంగా కొడుతున్నాడని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని 2018లో సీసీఎస్ ఉమెన్ పోలీస్‌స్టేషన్‌లో ఇర్ఫాన్ బేగం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చార్జిషీట్‌తో పాటు మనోరంజన్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి డి.అజయ్ కుమార్ తీర్పు వెల్లడించారు. -
‘జీతం తక్కువ… భరణం ఎక్కువ!’.. ‘సుప్రీం’లో భర్త వాదనలు హాట్ టాపిక్!
ఢిల్లీ: యువర్ హానర్. నేను కార్మికుడిని. నా జీతం నెలకు రూ.9వేలు. అలాంటిది భరణం కింద నా భార్యకు నెలకు రూ.12వేలు ఎలా ఇవ్వాలి. మీరే నాకు న్యాయం చేయాలి అంటూ ఓ భర్త సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. అయితే, భర్త వాదనలపై ‘సుప్రీం’ ద్విసభ్య ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకేసులో భార్య, భర్తకు కింది కోర్టు విడాకులు మంజూరు చేసింది. అదే సమయంలో భరణం కింద భర్త.. భార్యకు రూ.6 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై భార్య అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.నా భర్త నుంచి విడాకులు కోరుకుంటున్నాను. కానీ నాకు ఇచ్చే భరణం సరిపోదు. పోషణ నిమిత్తం జీవితాంతం నెలకు రూ.12,000 భరణంతో పాటు ప్రతి సంవత్సరం ఐదు శాతం, ఆరు శాతం పెంచాలి. లేదంటే ఒకేసారి రూ.30 లక్షలు చెల్లించాలి’ అని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం భర్త వాదనలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా ఇంత తక్కువ వేతనం పొందడం నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించింది. కనీస వేతనానికి తగ్గకుండా చెల్లించే పరిస్థితి ఉండగా.. ఒక సంస్థ ఇంత తక్కువ వేతనం ఇస్తుందా అని ప్రశ్నించింది. భర్త తరఫు న్యాయవాది జార్జ్ పోథన్,తన క్లయింట్ నిజాయితీగా ఆదాయాన్ని వెల్లడిస్తున్నాడని, దానికి సంబంధించిన అఫిడవిట్ కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడని వాదించారు. బెంచ్ ఆ వాదనను ఖండించింది. భర్తకు భరణం చెల్లించే స్థోమత లేకపోతే భార్యను తనతో ఉంచుకుని, ఆమెకు వంట చేసి కుటుంబాన్ని చూసుకోవాలని హితువు పలికింది. అందుకు స్పందించిన భర్త.. భార్య తన తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసిందని వాపోయారు. భర్త వ్యాఖ్యలపై జస్టిస్ మెహతా కఠినంగా స్పందించారు. భార్యకు పోషణ ఖర్చు ఇవ్వడం భర్త బాధ్యత. అవసరమైతే అప్పు చేయాలి. సహాయం తీసుకుని బాధ్యతను నెరవేర్చాలని స్పష్టం చేశారు. తన సంస్థ తనకు అంతే జీతం ఇస్తుందని భర్త చెప్పిన అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసననం పరిశీలిస్తుంది. ఉద్యోగులకు చెల్లించే జీతాలపై తమకు స్పష్టత ఇవ్వాలని సదరు సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. -
ఈరోజు నేనిలా ఉండటానికి నువ్వే కారణం: విరానిక ఎమోషనల్ (ఫోటోలు)
-
ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులు
చెన్నై: తమిళ నటుడు, టీవీకే చీఫ్‌కు విజయ్‌కు భారీ షాక్ తగిలింది. పాతికేళ్లకు పైగా వివాహం బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఒక నటితో విజయ్ వివాహేతర సంబంధమే విడాకులకు కారణమంటూ పిటిషన్లో పేర్కొనడం సంచలనం రేపుతోంది.సంగీత దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధంలో ఉన్నాడని సంగీత ఆరోపించింది. 2021లో ప్రతివాదికి నటితో అక్రమ సంబంధం ఉందని ఆమె పేర్కొంది. అయితే సంబంధాన్ని ముగించాలని హామీ ఇచ్చిన తర్వాత కూడా విజయ్‌లో మార్పులేదని పాత ధోరణే కొన సాగుతోందనేది సంగీత ప్రధాన అరోపణ. అదే భర్తనుంచి చట్టబద్ధంగా విడిపోవాలనే తన నిర్ణయానికి పునాది వేసింది. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)(a) మరియు 27(1)(d) కింద సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. జీవిత భాగస్వామి వివాహేతర సంబంధంలో ఉన్నట్టు లేదా అవతలి వ్యక్తి పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు తేలితే, ప్రత్యేక వివాహ చట్టం, 1954 విడాకులకు అనుమతిస్తుంది. సంగీత పిటిషన్ ఈ రెండు చట్టపరమైన కారణాలను విచారిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం జిల్లా కోర్టు ముందు ఉంది. కాగా విజయ్,సంగీత తమ విభేదాలను బహిరంగంగా అంగీకరించనప్పటికీ గత రెండేళ్లుగా విజయ్ నుండి విడిగా నివసిస్తున్న సంగీత ఫిబ్రవరి 24న చెంగల్పట్టు మహిళా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కోర్టు ఆమె విజ్ఞప్తిని అంగీకరించి కేసును కుటుంబ సంక్షేమ కమిటీకి బదిలీ చేసింది.వారి సుదీర్ఘ మౌనం అభిమానులు, మీడియాలో నిరంతర ఊహాగానాలకు ఆజ్యం పోసింది. 1999 ఆగస్టులో ప్రేమవివాహం చేసుకున్న ఈ జంటకు జాసన్ సంజయ్ (25) , దివ్య షాషా (20) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమా నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చి ఇటీవల తమిళగ వెట్రి కజగం(TVK) పార్టీని ప్రారంభించిన విజయ్ కెరీర్, ప్రజా జీవితంలో ఈ పరిణామం కీలకమైంది అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు విజయ్ బృందం లేదా సంగీత ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్,షాకింగ్ వీడియో -
ఇండియాతో బంధం ఎంతో ప్రత్యేకం.. నెతన్యాహూ
ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయోల్ పర్యటన ముగిసింది. ఆ దేశంలో ఘనంగా అతిథ్యం స్వీకరించడంతో పాటు రెండు దేశాలు కీలకమైన పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. భారత్‌తో తనకు వ్యక్తిగతంగా ఎంతో కనెక్టివీటి ఉందని తెలిపారు. తన వైఫ్ సారా నెతన్యాహుని మెుదటి సారి కలిసింది ఇండియన్ రెస్టారెంట్లోనే అని తెలిపారు.భారత్ -ఇజ్రాయెల్ మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ద్వైపాక్షిక సంబంధాల పరంగా కాకుండా వ్యక్తిగతంగానూ భారత్ అంటే ఇజ్రాయెల్‌కు ఎంతో అభిమానం. ప్రపంచంలో చాలా దేశాలు యూదులపై దాడులు చేస్తున్న సమయంలో ఇండియా వారికి అండగా నిలిచింది. అందుకు భారత్‌తో ఇజ్రాయిలీలకు ఆత్మీయ అనుబంధం. ఇదిలా ఉండగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు వ్యక్తిగతంగానూ భారత్ తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు.ఆయన మాట్లాడుతూ" నాకు వ్యక్తిగతంగా భారత్ ఎంతో ప్రత్యేకం. నా మెదటి,లేదా రెండవ సారి నా వైప్ సారాను ఇండియన్ రెస్టారెంట్లోనూ కలిసాను. ఆఫుడ్ మాత్రమే కాదు. ఆ డేట్ ఎంతో అద్భుతంగా సాగింది." అన్నారు. ఆ రెస్టారెంట్‌ను రీనా పుష్కర్నా అనే భారతీయురాలు నడిపిస్తుంది. ఆమె కర్రీ క్వీన్‌గా ఎంతో ఫేమస్ అన్నారు. భారతీయ వంటకాలను ఇజ్రాయెల్‌కు పరిచయం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు.భారత్-ఇజ్రాయెల్ మధ్య సాంస్కృతిక రాయభారిగా తను పనిచేస్తుందన్నారు. గతంలో భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వచ్చినప్పుడు ఆ రెస్టారెంట్లోనూ విందు ఇచ్చామని భోజనం అద్భుతమని మోదీ ప్రశంసించారని తెలిపారు. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన మోదీకి ఇజ్రాయెల్‌లో ఘన స్వాగతం లభించింది. -
తాతా.. అమ్మ ఉరి వేసుకుంది
అనంతపురం సెంట్రల్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఎంత వేదన అనుభవించిందో తెలియదు కానీ.. కన్న కుమారుడు వద్దని వారిస్తున్నా... వినకుండా ఆ తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనతో బాలుడి ఒక్కసారిగా చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. విషాదకరమైన ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందిన సాయిప్రసాద్ కుమార్తె లలిత (30)కు ఆత్మకూరు మండలానికి చెందిన మోహన్‌కృష్ణతో పదేళ్ల క్రితం వివాహమైంది. పోలీసు కానిస్టేబుల్ కావడంతో అప్పట్లో 15 తులాల బంగారం, రూ.5 లక్షలు నగదును వరకట్నంగా ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి తొమ్మిదేళ్ల వయసున్న కుమారుడు ధర్మయోగి ఉన్నాడు. మోహన్ కృష్ణ ప్రస్తుతం నగరంలోని నివాసముంటూ వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఎస్పీ దృష్టికి వేధింపులు పైళ్లైన తొలినాళ్లలో వీరి సంసారం సజావుగా సాగినా... ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఆజాద్ నగర్‌లోని సొంతమింట్లో కుమారుడితో కలసి లలిత నివాసముంటోంది. అదే ఇంట్లో వేరే గదిలో మోహన్ కృష్ణ నివాసముండేవాడు. పలుమార్లు పోలీసు స్టేషన్లలో కౌన్సిలింగ్ ఇచ్చినా మోహన్ కృష్ణ తీరు మారలేదు. తాజాగా డీపీఓలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ జగదీస్ను లలిత కలసి తన దీన స్థితిని విన్నవించుకుంది. న్యాయం చేయాలని వేడుకుంది. అదే రోజు సాయంత్రం దిశ పీఎస్‌లో దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరినీ ఇంటికి పంపారు. లలిత తల్లిదండ్రులు కూడా రాత్రి కుమార్తె నివాసంలోనే ఉన్నారు. మంగళవారం ఉదయం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. వారు మార్గమధ్యంలో ఉండగానే ఉదయం 8 గంటల సమయంలో మనవడు ధర్మయోగి ఫోన్ చేసి తాతా.. అమ్మ ఉరి వేసుకుందని తెలిపాడు. వారొచ్చే సమయానికి ఉరికి విగతజీవిగా వేలాడుతూ లలిత కనిపించింది. మనిషి కాదు రాక్షసుడు ‘తొమ్మిదేళ్లుగా తమ కుమార్తెకు నరకం చూపించాడు. వాడు మనిషి కాదు.. రాక్షసుడు’ అంటూ లలిత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహేతర సంబంధాల మోజులో తమ కుమార్తెను నిత్యం వేధించాడని వాపోయారు. అతన్ని ఉరి తీస్తేనే తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని విజప్తి చేశారు. అదనపు కట్నం కోసం వేధించేవాడని, తనకు లవర్ ఉందని, ఆమెతోనే జీవిస్తానంటూ మాటలతోనే హింసించేవాడని వివరించారు. తనకు అందుతున్న పింఛన్ సొమ్ముతోనే కుమార్తె, మనవడిని పోషిస్తున్నట్లు తెలిపారు. మోహన్‌కృష్ణపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఘటనపై నాల్గో పట్టణ సీఐ జగదీష్ మాట్లాడుతూ.. దంపతుల మద్య మనస్పర్థలు ఉన్నాయని, ఇరువురూ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. -
భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త
రంగారెడ్డి: మరో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం నోములలో జరిగింది. భార్య నిద్రిస్తున్న సమయంలో భర్త ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అమృత, బాబులు.. భార్యా భర్తలు. అయితే మద్యానికి బానిసైన భర్త బాబు.. పదే పదే భార్య అమృతను వేధింపులకు గురి చేస్తున్నాడు. తాగొచ్చి తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తరుచు గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా, అమృత నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో నరికి హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం భర్త బాబు పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు బాబు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. -
చేవెళ్లలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
-
నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..
-
టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య
-
నడిరోడ్డుపై భార్యను చంపిన TDP కార్యకర్త
-
దారుణానికి ఒడిగట్టిన ఇస్రో మాజీ సైంటిస్ట్
బెంగళూరు: డిప్రెషన్. ఈ డిప్రెషన్లో తాను మరణిస్తే.. తన భార్య ఒంటరైపోతుందని, ఆమెను చూసుకునేవారు ఎవరూ ఉండరని భావించిన ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేశాడు. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. మాజీ ఇస్రో ఉద్యోగి నాగేశ్వరరావు (65) తన భార్య సంధ్య శ్రీ (60)ను వారి నివాసంలో తువ్వాలతో గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.అయితే సాధ్యం కాలేదు. ఘటన అనంతరం నాగేశ్వరరావు తన స్నేహితుడికి జరిగిన విషయం చెప్పాడు. అప్రమత్తమైన ఆ వ్యక్తి వెంటనే అవలహಳ್ಳಿ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంధ్య శ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.ప్రాథమిక దర్యాప్తులో నాగేశ్వరరావు తన భార్యను తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ, డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. భార్య భవిష్యత్తుపై ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని తేలింది. సంధ్య శ్రీ కూడా ఇస్రోలో పనిచేశారు. ఈ దంపతులకు అమెరికాలో స్థిరపడిన ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు ఈ ఘటన గురించి సమాచారం అందించబడింది. ప్రస్తుతం నాగేశ్వరరావుపై హత్య కేసు నమోదు చేసి, అతని మానసిక స్థితి, వైద్య చరిత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
భార్య, అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి
-
మా ఆయనకు చాలా మంది అమ్మాయిలతో..
బనశంకరి(బెంగళూరు): విదేశాల్లో కూర్చుని యువతులకు గాలం వేస్తున్న భర్త బండారాన్ని భార్యనే రట్టు చేసింది. భర్త కామకలాపాలపై మంగళూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మనీశ్ అనే వ్యక్తి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేసి వివాహం చేసుకున్నాడు. డబ్బులేదని వివాహానికి ముందు ఆత్మహత్య నాటకమాడాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులే పెళ్లి ఖర్చులు భరించారు. ఉద్యోగం కోసం భార్యనే రూ.2 లక్షలు ఇచ్చింది. దుబాయ్ వెళ్లిన అతను బహరాన్లో మరో మహిళతో ప్రేమకలాపాలు సాగించాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అతని వ్యవహారంపై నిఘా పెట్టగా వివాహానికి ముందు అనేకమంది యువతులతో సంబంధాలు ఉన్నట్లు తెలుసుకుంది. వారి వద్ద కూడా అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగిట్లు తేలింది. టిక్‌టాక్‌తో యువతులకు గాలం వేసే మనీశ్నుంచి ఎవరూ మోసపోవద్దని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. -
భార్య ఎఫైర్.. ప్రియుడి ఇంటిని తగలబెట్టిన భర్త
మహబూబాబాద్ రూరల్: వివాహేతర సంబంధం పెట్టిన చిచ్చు కారణంగా ఆగ్రహంతో మహిళ భర్త, బంధువుల చేతిలో ఒకరికి చెందిన రూ.20 లక్షల విలువగల ఇల్లు, వస్తు సామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ దహనమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గుండాలగడ్డ తండా గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం గుండాలగడ్డ తండా∙గ్రామానికి చెందిన ఓ వివాహితతో అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తండాలోని పెద్ద మనుషులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి పద్ధతి మార్చుకోవాలని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన తన పద్ధతి మార్చుకోలేదు. ఆ వివాహిత భర్త, బంధువులు ఆగ్రహంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి చెందిన ఇల్లు, ఇంట్లోని వస్తుసామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ (హార్వెస్టర్) విలువైన సామగ్రిని దహనం చేశారు. తండావాసులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక శకటంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై దీపిక, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
భార్య ఎఫైర్.. చివరికి ఎంత దారుణం జరిగిందంటే..
బ్రెజిల్లో ఇటుంబియారాలో దారుణం జరిగింది. భార్య అక్రమ సంబంధం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకోవడంతో భర్త తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటుంబియారా ప్రభుత్వ మున్సిపల్ సెక్రటరీ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అయితే, భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెపై నిఘా పెట్టాడు.ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను సైతం నియమించి పకడ్బందీగా ప్లాన్ చేశాడు.. భార్య తన ప్రియుడిని కలిసినప్పుడు వీడియో ఆధారాలు కూడా సంపాదించాడు. అక్రమసంబంధం నిజమేనని నిర్థారణ కావడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ దారుణానికి కొన్ని గంటల ముందు ఆ వ్యక్తి.. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తన పిల్లలపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ, "దేవుడు నా పిల్లలను ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక, నాన్న మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు" అనే క్యాప్షన్‌ను రాశారు. చూడముచ్చటగా ఉన్న వీరి ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భార్యా భర్తల జంట ఎంతో అందంగా ఉండటం.. పిల్లలు సైతం క్యూట్‌గా ఉండటంతో వీరి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. తండ్రి,.. క్షణికావేశంలో పిల్లల ప్రాణాలు తీయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. -
ఆ పెంగ్విన్ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..!
వివాహం అనేది అత్యంత పవిత్రమైన బంధం. వేరు వేరు నేపథ్యాల మనుషులు పెళ్లి అను బంధంతో ఒక్కటై..ప్రతి విషయంలోనూ తోడు నీడగా ఉంటామని ఒకరికొకరు వాగ్దానం చేసుకునే పవిత్రమైన కార్యం అది. అలాంటి వైవాహిక వ్యవస్థనే అపహాస్యం పాలుచేస్తున్నారు నేడు చాలామంది యువతీయువకులు. అలాంటి వాళ్లకు కనువిప్పు నెట్టింట రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న పోస్ట్. అది ఆ గొప్పబంధానికి ఉన్న పవిత్రతను హైలెట్ చేసింది. అంతేగాదు ఒకరికొకరుగా ఉండటం అంటే అవగతమవుతుంది. ఆలుమగలు బంధం అనే మాటకు అసలైన అర్థం చెబుతూ ఆలోచింపచేస్తున్న పోస్ట్ అందర్నీ తెగ ఆకర్షిస్తుంది. పైగా నెటిజన్లు ఆ జంటను 'మేడ్ ఫర్ఈచ్ అదర్' అంటూ కితాబిస్తున్నారు. అసలేం జరిగిందంటే..ఆ పోస్ట్‌లో ఒక మహిళ ఏ ఉద్యోగం లేని తన భర్త ఇచ్చిన గిఫ్ట్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకుందామె. తన భర్తకు కొన్ని నెలలుగా ఉద్యోగం లేదని, తాను కాపీ రైటర్‌గా పనిచేస్తూ ఇంటిని నెట్టుకొస్తున్నట్లు తెలిపింది. అతడు ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడని, అతడి ఖర్చలు, పాకెట్ మనీ అన్ని తానే చూస్తుంటానని రాసుకొచ్చింది పోస్ట్‌లో. అయితే తన భర్త ఆ డబ్బుని పెట్రోల్ కోసం, స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు మాత్రమే ఖర్చు చేస్తాడని తెలిపింది. పైగా తన భర్త పెద్దగా ఖర్చులు కూడా చేయడని, ఎప్పుడైనా స్నేహితులు ఫుడ్ ఆర్డర్ చేస్తే తన వంతుగా రూ. 200 నుంచి రూ. 300లే ఇస్తాడని తెలిపింది. అలాగే తాను తనకు ఉద్యోగం లేదని అతడి స్నేహితుల ముందు నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదని కూడా పేర్కొంది. అయితే ఉద్యోగం లేకపోయినా..తన భర్త ఈ వాలెంటైన్స్‌డేకి బహుమతి ఇవ్వడం తనని ఆశ్చర్యంలో ముంచెత్తిందని అంటోంది. తాను ఇచ్చిన పాకెట్ మనీలోనే కొంత తనకు గిఫ్ట్ ఇచ్చేందుకు కొని సర్ఫైజ్ చేసిన విధానం కన్నీళ్లు పెట్టించేసిందని భావోద్వేగంగా రాసుకొచ్చింది పోస్ట్‌లో. అంతేగాదు తన భర్త ఇచ్చిన వాలెంటెన్స్డేకి ఇచ్చిన గిఫ్ట్‌లను తెలియజేస్తూ..ఆయన ఇచ్చన పెంగ్విన్ ప్లషీ, చాక్లెట్ బార్ చూసి ఆనందంతో ఉంబ్బితబ్బిబైంది. ఈ కష్టసమయంలోనూ తన గురించి ఆలోచించినందుకు కంటనీళ్లు ఆగడం లేదంటూ కన్నీటిపర్యంతమైంది. తాము విదేశీ పర్యటనలకు వెళ్లిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ కష్టసమయం తమ మధ్య నెలకొన్న బలమైన బంధం కారణంగా ఇట్టే గడిచిపోతుందని ఉద్విగ్నింగా చెబుతూ పోస్ట్‌ని ముగించింది. నెటిజన్లు కూడా ఆ ఆలుమగల మధ్య ఉన్న బలమైన బంధానికి ఫిదా అవ్వడమే గాక ప్రశంసల వర్షం కురిపిస్తు పోస్టులు పెట్టారు.(చదవండి: టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్‌కి వచ్చేశా..!) -
నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా?
కర్ణాటక: తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాలోని యడియూరులో ఆలయం సమీపంలోని ఎస్ఎల్ఎన్ కళ్యాణ మండపంలో పెద్ద రచ్చ జరిగింది. నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా? అని పెళ్లికొడుకును మొదటి భార్య నిలదీయడంతో సినిమాలో మాదిరిగా కోలాహలం నెలకొంది. వివరాలు.. ఆదివారం ఈ మండపంలో బెంగళూరులోని ఆర్ఆర్ నగర నివాసి హరీష్ ప్రసాద్‌కు, మండ్యకు చెందిన పుణ్యశ్రీ అనే యువతితో పెళ్లి జరుగుతోంది. సరిగ్గా తాళి కట్టే సమయంలో మొదటి భార్య లేపాక్షి, పోలీసులు, కుటుంబ సభ్యులతో వచ్చింది. తామిద్దరూ ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నామని, శృంగేరిలో కాపురం ఉంన్నామని లేపాక్షి తెలిపింది. తాను ప్రైవేటు టీచరునని, తరచూ వేధింపులకు పాల్పడడంతో పాటు గర్భస్రావం చేయించేవాడని ఆమె ఆరోపించింది. రూ.2 వేలు పంపి... మూడు రోజుల క్రితం భర్త నాకు ఫోన్ చేసి రెండు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్‌పేలో రూ.2 వేలు పంపాడని, పెళ్లి జరుగుతోందని తెలిసి అడ్డుకోవడానికి వచ్చానని లేపాక్షి వివరించింది. లేపాక్షి మాటలతో వధూవరులు షాక్‌కు గురయ్యారు. వధువు తల్లిదండ్రులు ఈ పెళ్లిని రద్దు చేసుకుని, వరున్ని దండించారు. వారు కూడా పోలీసుస్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఇదేం గొడవ అని అతిథులందరూ వెళ్లిపోయారు. పెళ్ళి విందు కోసం వండిన వంటకాలు అలాగే మిగిలిపోయాయి. -
క్యూట్ జోడీ.. జనవరి ఎంజాయ్ చేశారిలా (ఫొటోలు)
-
కట్టుకున్న భార్యపై ఖాకీ దాష్టీకం
మంచిర్యాల క్రైం: క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఆ శాఖకు మచ్చతెచ్చాడు. కట్టుకున్న భార్యను రోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదాడు. మంచిర్యాల రెడ్డికాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై వీడియో సోమవారం వైరల్‌గా మారింది. స్థానిక పోలీసు స్టేషన్‌లోని కానిస్టేబుల్ రవిప్రసాద్ ఆదివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. నాలుగు గోడల నడుమ ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాస్తా అర్ధరాత్రి రోడ్డుపైకి చేరింది. అర్ధనగ్నంగా ఉన్న అతడు భార్యతోపాటు కూతురిని కూడా రోడ్డుపై చితకబాదాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న పోలీసు శాఖలోని వ్యక్తి ఇలాంటి ఘటనలకు పాల్పడటం, కట్టుకున్న భార్యపై కాఠిన్యాన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. రవిప్రసాద్ కానిస్టేబుల్‌గా పని చేస్తుండగా.. ఆయన భార్య పోలీసుశాఖలోని మరో విభాగంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తోంది. మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీసు.. భార్యను రోడ్డుపైకీడ్చిన దాష్టికాన్ని నగరవాసులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై స్థానిక సీఐ ప్రమోద్‌రావును సంప్రదించగా విషయం తెలిసిందని, కుటుంబ సమస్య అయినందున ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని వెల్లడించారు. -
భర్తను చితకబాదేసిన భార్య, వైరల్ వీడియో
భర్తపై భార్య దారుణంగా దాడిచేసిన వీడియో ఒకటి ఆందోళన పుట్టిస్తోంది. కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్నప్పటికీ ,అతనిపై హింసకు పాల్పడిన వైనం నెట్టింట భర్తలపై భార్యల హింసగురించి చర్చకు దారి తీసింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం, సీసీ కెమెరాలో బాధితుడ్ని కొడుతున్న దృశ్యలు నమోదయ్యాయి. తన భార్య నిర్వాకాన్ని రికార్డు చేసేందుకు,ఆధారాలు సేకరించడానికి బాధితుడు తన భార్యపై గదిలో రహస్య కెమెరాను అమర్చాడట. ఈ వీడియోను క్లిప్‌లో, ఆ మహిళ ఆ వ్యక్తిని మంచంపైకి విసిరి, అతనిపైకి ఎగిరి దూకి, రెండు చేతులతోనూ పిడి గుద్దుల వర్షం కురిపించింది. ఇంతలో మహిళ గదిలోకి వెళ్లి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఫలించలేదు. ఒక బిడ్డను ఎత్తుకుని ఉన్న మరో వ్యక్తి కూడా గదిలోకి వెళ్లాడు. అయినా బాధితుడిపై దాడి కొనసాగుతూనే ఉంది.దీంతో నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. భార్యల వేధింపులు తాళలేక తనువు చాలించిన అతుల్ సుభాష్,మానవ్ శర్మ ఉదంతాన్ని గుర్తుకు తెస్తుందని వ్యాఖ్యానించారు. 2025లో ఏప్రిల్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడిది, బాధితుడు ఎవరు? అనే వివరాలపై ఎలాంటి ధృవీకరణ లేదు. ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?నెటిజనుల స్పందనఆమెపై కేసు నమోదు చేయాలని కొంతమంది కోరగా, గృహ హింస నుండి పురుషులను రక్షించడానికి, అలాంటి మహిళలను శిక్షించడానికి ఎటువంటి చట్టాలు లేవని వాపోయారు. అదే పురుషుడు మహిళపై దాడిచేస్తే పదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు.పేలవమైన చట్టాలు, అవినీతి న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ బాధితుడిగా మారుతున్న ప్రతి పురుషుడికి మనం అధికారం ఇవ్వాలి.అలాగే ప్రతి పురుషుడిని ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్న ఇలాంటి మహిళలకు గుణపాఠం నేర్పాలి. వేధింపులకు గురవుతున్న వివాహిత పురుషుడు అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాడాలి. అంతకానీ ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవద్దు అని ఒక నెటిజన్ కోరడం గమనార్హం.అయితే వీడియో రికార్డు చేస్తున్నాడు కాబట్టి అతను కావాలనే ప్రతిఘటించడం లేదని కమెంట్ కూడా కనిపించింది. ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?Video source @mishrag47 . There is no domestic violence laws to protect men, no laws to severely punish such women. If man raise his hands on women simp men at once oppose him. #MenToo #GenderBiasedlaws #RejectWaqfBill #WaqfAmendmentBill #MuskanRastogi #IPL2025 #ToxicFeminism pic.twitter.com/KFoR0Ikf1Z— Saurabh Bahuguna46 (@bahuguna46) April 2, 2025 -
మానవత్వం మర్చిపోయారు.. పోలీసులు బాగా నటించారు
-
తొమ్మిదేళ్ల ప్రేమ.. పెళ్లి.. రెండు నెలలకే.. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే!
బరేలీ: తొమ్మిదేళ్ల ప్రేమ.. తర్వాత పెళ్లి.. రెండు నెలలకే విషాదంగా మిగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జితేంద్ర కుమార్ యాదవ్(33) తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని కనిపించడం కలకలం రేపింది. మొదట ఆత్మహత్యగా అంతా భావించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. జితేంద్రను భార్య జ్యోతి గొంతు నులిమి చంపినట్లు తేలిపింది. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ హత్యకు ఆమె తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా సహకరించారు. ఆ సమయంలో వారు అతడిని గట్టిగా పట్టుకోగా.. జ్యోతి గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.అసలేం ఏం జరిగిందంటే..మృతుడు జితేంద్ర, జ్యోతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్ 25న ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్ది వారాలకే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. జ్యోతి బ్యాంకు ఖాతా నుండి జితేంద్ర రూ.20 వేలు డ్రా చేసి ఆన్లైన్ జూదంలో పోగొట్టడమే వారి మధ్య వివాదాలకు ప్రధాన కారణంగా పోలీసులు తెలిపారు. జనవరి 26న ఈ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ.. దాడికి దారితీసింది. ఆ సమయంలో జ్యోతి తన తండ్రి కాళీచరణ్, తల్లి చమేలి, సోదరుడు దీపక్‌లను ఇంటికి పిలిచింది.కాళ్లు, చేతులు కదలకుండా..వారందరూ కలిసి జితేంద్ర కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా పట్టుకోగా, జ్యోతి అతని గొంతు నులిమి హత్య చేసింది. జితేంద్ర చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మఫ్లర్‌తో కిటికీ గ్రిల్‌కు మృతదేహాన్ని వేలాడదీశారు. అనంతరం తమ అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేశారు.పోలీసులు మొదట ఆత్మహత్యగా భావించినా, జితేంద్ర సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో అది ఉరి వల్ల జరిగిన మరణం కాదని.. గొంతు నులిమి హత్య చేసినట్లుగా తేలింది. దీంతో పోలీసులు సెక్షన్లు మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఆమె సోదరుడు దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు విచారణలో జ్యోతి తన నేరాన్ని అంగీకరించింది. జితేంద్ర ఐవీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా, జ్యోతి రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ బస్ కండక్టర్‌గా పనిచేస్తోంది. ఆర్థిక వివాదాలు కారణంగానే హత్యకు ఒడిగట్టినట్లు ఆమె పేర్కొంది. -
ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ
నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి భార్యను ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్య చేసింది. నగేష్‌తో సుజాత అనే మహిళకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం నగేష్ ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. భార్య మమతను పక్కకు తప్పించేందుకు హత్య చేయాలని సుజాత, నగేష్ ప్లాన్ వేశారు. మమతపై పెట్రోల్ పోసి సుజాత నిప్పంటించింది. తీవ్ర గాయాలతో మమత మరణించింది. మంటలు అంటుకుని ఐదు నెలల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని ఆసుపత్రికి తరలించారు. -
పోలీస్ కమెండోపై దారుణం.. డంబెల్‌తో దాడి చేసి..
న్యూఢ్లిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ స్పెషల్ సెల్లో స్వాత్ (SWAT) కమెండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి(27) భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఘజియాబాద్‌లోని ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఆమె కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె భర్త అంకుర్ చౌదరి.. కాజల్‌పై డంబెల్‌తో దాడి చేసి, ఆమె తలను తలుపు ఫ్రేమ్‌కు బలంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘాతుకానికి పాల్పడని తర్వాత అంకుర్ స్వయంగా తన బావ నిఖిల్‌కు ఫోన్ చేసి, ‘నీ అక్కను చంపేశాను, వచ్చి శవాన్ని తీసుకెళ్లు’ అని చెప్పడం కలకలం రేపుతోంది.కాజల్, అంకుర్ 2022లో డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కాజల్ 2023లో ఢిల్లీ పోలీసు విభాగంలో కమెండోగా ఎంపికయ్యింది. రక్షణ మంత్రిత్వ శాఖలో అంకుర్ క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించాడు. అయితే పెళ్లయిన 15 రోజుల నుండే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కారు ఇవ్వాలని, నగదు తేవాలని అంకుర్ కుటుంబం కాజల్‌ను శారీరకంగా, మానసికగా హింసించినట్లు సమాచారం.కాజల్ తండ్రి రాకేష్ తన కుమార్తె మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాజల్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ అని, అంకుర్ కేవలం తన కూతురుని మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డను కూడా చంపి, రెండు హత్యలు చేశాడని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. గణౌర్లో అత్తమామల వేధింపులు భరించలేక వారు ఢిల్లీలోని మోహన్ గార్డెన్‌కు మారినప్పటికీ, అంకుర్ తన ప్రవర్తన మార్చుకోలేదన్నారు. నిరంతరం డబ్బు కోసం వేధిస్తూనే ఉండేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.జనవరి 22న జరిగిన ఈ దాడి ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తొలుత హత్యాయత్నం కేసుగా నమోదు చేసినప్పటికీ, కాజల్ మరణించడంతో దానిని హత్య కేసుగా (సెక్షన్ 302 కింద) మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు అంకుర్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, ఆ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: వందే భారత్ మెనూలో అదిరిపోయే మార్పులు -
ఆ ఆస్తిలో వారికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది!
నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పిల్లలు నా మాజీ భార్య వద్దనే ఉంటారు. అయితే మా నాన్న గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా?– కృష్ణమూర్తి, విశాఖపట్నంమీ తండ్రిగారి దగ్గర నుంచి మీకు సంక్రమించిన ఆస్తి మీ తండ్రి గారి స్వార్జితమైవుండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి వుంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కు ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే అది మీ పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది వుంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ అది మీ తండ్రి గారికి కూడా వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయివుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేదా విడిపోయిన మీ మాజీ భార్య వద్ద ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఎంతమంది సంతానం వున్నారో మీరు చెప్పలేదు. ఒకవేళ మీతోపాటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ తల్లిగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాన్నమ్మ) ఉంటే వారికి కూడా మీతోపాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటాను వారు అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ పోందే హక్కు వుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comమెయిల్ చేయవచ్చు. -
మద్యం తీసుకురాలేదని.. భార్య ఎంత పని చేసిందంటే..!
హైదరాబాద్: మద్యానికి బానిసైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. శివకుమార్, రాజేశ్వరి(45) దంపతు లు. వారు యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమా రులు ఉన్నారు. ఈ నెల 25వ తేదీన ఆమె మద్యం సేవించింది. తనకు ఇంకా మద్యం కావాలని భర్తకు తెలిపింది. భర్త మద్యం తీసుకురానని చెప్పాడు. దాంతో అతనితో గొడవ పెట్టుకుని ఇంటి లోపలికి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కొద్ది సేపటి తర్వాత చిన్న కుమారుడు గౌతమ్‌కుమార్ తల్లి కోసం వెదికాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి ఉరి వేసుకుని కనిపించింది. తలుపులు పగలకొట్టి ఆమెను కిందకు దించారు. ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహిళ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు రాజేశ్వరి సోదరుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో దారుణం.. కుటుంబసభ్యులను కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి
-
తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)
-
బోరబండ మర్డర్ కేస్.. భార్యను చంపి వాట్సాప్ లో స్టేటస్
-
అక్రమ సంబంధానికి అడ్డు.. భర్తను చంపిన భార్య
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో ప్రసన్న అనే వివాహిత తన భర్త సుధీర్‌రెడ్డిని చంపింది. చున్నీతో గొంతు నులిమి చంపినట్లు పోలీసుల ఎదుట ప్రసన్న అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తనను అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య మారథాన్ రన్, ప్రముఖ వ్యాపారవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్
జెరోధా వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ తన భార్య క్యాన్సర్ సోకడం, చికిత్స, కోలుకోవడం గురించి మరోసారి సోషల్ మీడియాద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా టాటా ముంబై మారథాన్‌లో వైకల్యాన్ని చేర్చడంపై సంతోషాన్ని ప్రకటించారు. టాటా ముంబై మారథాన్‌లో పరుగెత్తిన దివ్యాంగులలో ఉన్న ఉత్సాహం, ఉద్వేగం మాటల్లో చెప్పలేనిదని ఆయన ప్రశంసించారు. అన్నీ సవ్యంగా ఉన్నా జీవితంలో ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేసే ముందు ఆలోచించేలా చేస్తుందన్నారు. అదే సమయంలో తన భార్య క్యాన్సర్ కోలుకున్న తీరు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. క్యాన్సర్ నుండి బయటపడిన తర్వాత దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 57 నిమిషాల్లో 10 కి.మీ పరిగెత్తారని వివరించారు. అలాగే మారథాన్‌లో పాల్గొన్న తన భార్య సీమా కామత్ ఫోటోలతో పాటు, ఆమె రాసిన వ్యక్తిగత బ్లాగుకు వ్యాఖ్యలలో లింక్‌ను పంచుకున్నారు.ఇదీ చదవండి: నోయిడా టెకీ విషాదం : కీలక పరిణామం The excitement and enthusiasm among people with disabilities running the Tata Mumbai Marathon today were beyond words. Makes you think about what right you have to complain about anything in life.On a personal note, Seema (wife, see the link in comments) ran 10km in ~57… pic.twitter.com/8YEDVwf0WE— Nithin Kamath (@Nithin0dha) January 18, 2026సీమా కామత్ తన బ్లాగులో అందించిన వివరాలు ప్రకారం 2021 నవంబరులో స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ. ఎలాంటి లక్షణాలు, ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే, చాలా క్రమశిక్షణగా, ఫిట్‌గా చాలా ఆరోగ్యంగా ఉండే ఆమె కేన్సర్ బారిన పడ్డారు. సాధారణంగా చేసుకునే ఫుల్ బాడీ టెస్ట్‌లో భాగంగా జరిగిన మమోగ్రామ్ టెస్ట్‌లో ఆమె కుడి రొమ్ములో గడ్డను గుర్తించారు. ఆ తరువాత బయాప్సీ, PET స్కాన్ లాంటి పరీక్షల ద్వారా ఆమెకు క్యాన్సర్ సోకిందని నిర్ధారించారు.దీంతో తాను షాక్‌కు గురయ్యారు. మొదట కుటుంబ సభ్యులు , కొంతమంది స్నేహితులతో తప్ప మిగతా ఎవ్వరితోనూ దీని గురించి చర్చించలేదు. అదేదో తప్పు అనే భావం ఉండటం వల్లే ఇది జరిగిందనీ, "మానసిక అనారోగ్యంలాగే, క్యాన్సర్ కూడా మన దేశంలో నిషిద్ధం" అని చెప్పుకొచ్చారు. కానీ అవగాహనతో ఉండి, ముందస్తు పరీక్షలతో దీన్ని జయించవచ్చు అన్నారామె.ఇదీ చదవండి: మంచులో రీల్స్..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్ వీడియోమాస్టెక్టమీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లతో "ఎమోషనల్ రోలర్ కోస్టర్" లా గడించిందన్నారు. ఈ రోజుల్లో క్యేన్సర్ను ముందుగా గుర్తిస్తే నివారణే సాధ్యమే అన్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండే వారు కూడా వైద్యులు రొటీన్ స్క్రీనింగ్ చాలా అవసరమని సీమా రాశారు. తీవ్రమైన అనారోగ్యాలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకే ప్రతీవవారికి ఆరోగ్య బీమా అవసరమన్నారు. చికిత్స సమయంలో కుటుంబ, సామాజిక మద్దతు ప్రాముఖ్యతను కూడా ఆమె నొక్కి చెప్పారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకు మనం చేయాల్సిందంతా చేయాలని సూచించారు. గతంలో తన క్సేన్సర్ రికవరీ జర్నీగురించి మాట్లాడిన సీమ జుట్టు ఊడిపోవడం లాంటి కీమో థెరపీ కష్టాలను పంచుకున్నారు. ఆ బాధలు భరించలేక చనిపోతే మేలు అనుకునేదాన్నని చెప్పారు. ఈ సమయంలో భర్త నితిన్, తన కొడుకు గుండు చేయించుకొనిధైర్యాన్ని నింపారన్నారు. చికిత్సతోపాటు, ఆహారం, వ్యాయామంతో క్యాన్సర్‌ను జయించానని వెల్లడించారు. వ్యాధినుంచి కోలుకున్న తరువాత క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, ప్రపంచ పర్యటనలు, మారథాన్రన్ లాంటి కార్యకల్లాపాలతో బిజీగా ఉంటున్నారు సీమ. -
ప్రియురాలితో కలిసి భార్యను హత్య చేసిన భర్త
-
‘నన్ను చంపినా నేను ఆ యువకులతోనే ఉంటా’
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. శనివారం ఉదయం ఈ ఘటన మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కలకలం రేపింది. సార్… నేను నా భార్యను గొంతు నులిమి చంపేశా. ఆమె శరీరం ఇంట్లో దుప్పటిలో చుట్టి ఉంది” అని చెప్పాడు.భార్యను హత్య చేసిన తర్వాత సచిన్ నాలుగు గంటల పాటు నగరంలో తిరిగాడు.. పారిపోవాలనుకున్నాడు. చివరికి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని.. సంఘటనా స్థలానికి అతని భార్య శ్వేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఫతేహ్పూర్ జిల్లా మోహన్పూర్ గ్రామానికి చెందిన సచిన్, శ్వేత ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో కోర్టులో పెళ్లి చేసుకున్నారు. మొదట సూరత్‌లో నివసిస్తూ సచిన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. నెలరోజుల తర్వాత కాన్పూర్‌కి వచ్చి గది అద్దెకు తీసుకుని, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై సచిన్‌కు అనుమానం కలిగింది. శ్వేత ఖాతాలో తరచూ డబ్బు జమ అవుతుండటంపై సచిన్ నిలదీశాడు. ఆమె తన అమ్మమ్మ పంపిందని చెప్పింది. ఎదురింట్లో ఉండే యువకులపై కూడా భర్తకు అనుమానం కలిగింది.భార్య ప్రవర్తనపై నిగ్గు తేల్చడానికి సచిన్.. స్నేహితులతో పార్టీకి వెళ్తున్నానని.. ఇంటికి రానంటూ భార్యకు తెలిపాడు. కానీ తిరిగి వచ్చి గది తలుపు తెరిచి ఉండగా, భార్యతో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. స్థానికులు 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కి కాల్ చేయడంతో పోలీసులు వారిని స్టేషన్‌కి తీసుకెళ్లారు. దంపతులను పోలీసులు కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు.ఇంటికి చేరుకున్న తర్వాత సచిన్‌కు భార్యతో గొడవ మరింత ముదిరింది. ‘‘నన్ను చంపినా నేను ఆ యువకులతోనే ఉంటాను” అంటూ శ్వేత బెదిరించిందని సచిన్ పోలీసులకు తెలిపాడు. దీంతో ఆగ్రహంతో ఆమెను గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులకు తెలిపాడు. “మేము ఒకరికి ఒకరం మాత్రమే ఉన్నాం. పారిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఆమెకు ఎవరూ లేరు. నాకు కూడా ఎవరూ లేరు. అందుకే పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాను” అని చెప్పాడు. శ్వేత మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపించారు. -
మిహికా: 2016.. అంతా సెల్ఫీలమయం (ఫోటోలు)
-
భార్య కాలిపోతుంటే... వీడియో తీశాడు!
సూరత్: వారిద్దరూ భార్యాభర్తలు. కొన్నాళ్లుగా తరచూ కీచులాడుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో ఒక రోజు వారి నడుమ మాటామాటా పెరిగింది. ఆవేశంలో భార్య ఒంటిపై డీజిల్ గుమ్మరించుకుని నిప్పంటించుకుంది. మంటల్లో చిక్కి హాహాకారాలు చేస్తుంటే కాపాడాల్సింది పోయి, ఆ ప్రబుద్ధుడు ఆమె మరణయాతనను తీరిగ్గా వీడియో తీస్తూ కూచున్నాడు! అంతేగాక, డీజిల్ పోసుకునేలా ఆమెను కావాలనే రెచ్చగొట్టినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది!! జనవరి 4న గుజరాత్లో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. బిహార్‌కు చెందిన రంజిత్ సాహా (33), ప్రతిమాదేవి (31) 2013లో ఇంటినుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం సూరత్‌లోని ఇచ్ఛాపూర్లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పిల్లలు, వారి చదువులు తదితరాల విషయమై కొంతకాలంగా దంపతులు తరచూ ఘర్షణ పడుతూ వస్తున్నారు. జనవరి 4న వారి మధ్య గొడవ పెద్దదైంది. ఆ క్రమంలో, చేతనైతే ఒంటిపై ఏమన్నా పోసుకుని అంటించుకోవాల్సిందిగా రంజిత్ రెచ్చగొట్టాడు. దాంతో ఆవేశానికి లోనైన ప్రతిమ, అతను అప్పటికే గ్యారేజీ నుంచి తెచ్చి ఉంచిన డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను వారించేందుకు గానీ, నిప్పింటించుకున్నాక కాపాడేందుకు గానీ రంజిత్ ఏమాత్రమూ ప్రయతి్నంచలేదు. పైగా, ఈ ఘటనలో తన ప్రమేయం లేదని నిరూపించుకునేందుకు ఆమె డీజిల్ పోసుకోవడం మొదలుకుని నిప్పంటించుకుని హాహాకారాలు చేయడం దాకా మొత్తం ఘటనను తన మొబైల్లో వీడియో తీస్తూ కూచుకున్నాడు! కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రతిమ వారం తర్వాత స్పృహలోకి వచి్చంది. తానే డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నానంటూ వాంగ్మూలమిచ్చి మరణించింది. కానీ ఆమె సోదరుడు మాత్రం రంజిత్ తీరుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంజిత్‌ను అదుపులోకి తీసుకుని అతని మొబైల్‌ను పరిశీలించగా ఈ వీడియో నిర్వాకం వెలుగులోకి వచి్చంది. ఫ్లోర్ క్లీనింగ్ కోసం ఫినాయిల్‌లో కలిపేందుకంటూ రంజిత్ గ్యారేజీ నుంచి డీజిల్ తెచ్చి ఇంట్లో పెట్టినట్టు విచారణలో తేలింది. బహుశా పక్కా ప్లాన్ ప్రకారమే అతను ఇదంతా చేసినట్టు వారు అనుమానిస్తున్నారు. అతనిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
బూతు దంపతుల బాగోతం.. భార్యను పడుకోబెట్టి భర్త వీడియోలు
-
రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. శివలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని.. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు.కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) సోమవారం(జనవరి 12) కన్నుమూశారు. వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అమీర్‌పేట్ ధరంకరం రోడ్డులోని నివాసంలో తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమెకు కేఎస్ సుబ్బారావు, కె.త్రివిక్రమరావు, కేఎస్ఎస్ మూర్తి కుమారులు, కుమార్తె రమాదేవి ఉన్నారు.గతేడాది డిసెంబర్ 20వ తేదీన అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆమె కొన్నిరోజులు చికిత్స పొంది కోలుకున్నారు. తిరిగి ఆరో గ్యం క్షీణించి సోమవారం ఉదయం మృతి చెందారు. మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు తదితరులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొంపల్లి సమీపంలోని దేవరయాంజల్ వ్యవసాయ క్షేత్రంలో శివలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు. -
పోలీస్ స్టేషన్లోనే భార్యను కాల్చి చంపాడు
హర్దోయి: భార్య ప్రియుడితో వెళ్లిపోయిందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి..పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఆమెను తుపాకీ కాల్చి చంపాడు. ఈ ఘటన యూపీలోని హర్దోయిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌పూర్ అతారియా వాసి అనూప్. ఇతడి భార్య సోనీ(35) వారం క్రితం ప్రియుడితో వెళ్లిపోయింది. నగలతోపాటు రూ.35 వేల నగదును ఆమె పట్టుకెళ్లిందంటూ అనూప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, పోలీసులు సోనీని ఆదివారం పట్టుకొచ్చి, స్టేషన్లో ఉంచారు. సోమవారం అనూప్‌ను పిలిపించారు. సోనీని కోర్టులో హాజరు పర్చే రాత పనులు జరుగుతున్నాయి. పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఉన్న క్యాంటిన్‌లోకి సోనీని ఓ మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్తుండగా, అనూప్ అడ్డుకున్నాడు. వెంటతెచ్చుకున్న తుపాకీతో సోనీపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సోనీ అక్కడికక్కడే చనిపోయింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన అనూప్‌ను పోలీసులు పట్టుకుని, తుపాకీని స్వా«దీనం చేసుకున్నారు. -
మాకు న్యాయం చేయాలి
హైదరాబాద్: న్యాయం కోసం పిల్లలతో కలిసి భర్త ఇంటి వద్ద భార్య నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటన దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని అహ్మద్‌గూడలో చోటుచేసుకుంది. సాయిచరణ్ అనే వ్యక్తి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యభర్తల మద్య పలుమార్లు గొడవలు జరిగేవి. దీంతో 2020 సంవత్సరం నుండి దూరంగా ఉంటున్నారు. అప్పటినుండి సాయిచరణ్ కనిపించకుండా తిరుగుతుండేవాడు. సాయిచరణ్ కీసర అహ్మద్‌గూడలోని హిడెన్ గార్డెన్ అపార్టుమెంట్లో ఉంటున్నాడని తెలుసుకొని పిల్లలతో కలిసి భార్య శిల్ప తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది. అనంతరం కీసర పోలీసులు వచ్చి ఆమెతో చర్చలు జరిపారు, తనకు న్యాయం జరిగేంతవరకు అక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుకూర్చుంది. -
భార్య బర్త్‌డే సెలబ్రేట్ చేసిన నితిన్ (ఫోటోలు)
-
సైబర్ వలలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సతీమణి ఊర్మిళ సైబర్ నేరస్తుల వలలో చిక్కారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు ఆర్జించవచ్చన్న నేరస్తుల మాయమాటలను నమ్మి ఏకంగా రూ.2.58 కోట్లు మోసపోయారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలోని స్రవంతి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న లక్ష్మీ నారాయణ భార్య ఊర్మిళకు గత నవంబర్ చివరి వారంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్‌లో సందేశం వచ్చింది.స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌కు చిట్కాలు ఇస్తామని, అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆ సందేశం సారాంశం. అయితే ఆమెకు ట్రేడింగ్‌లో అనుభవం లేకపోయేసరికి.. తన భర్తను వాట్సాప్ గ్రూప్‌లో చేరమని సలహా ఇచ్చారు. దీంతో లక్ష్మీ నారాయణ నవంబర్ 29న ‘స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్సే్ఛంజ్ గ్రూప్–20’అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. ఇందులో 167 మంది సభ్యులు ఉన్నారు. అమెరికాలో పీహెచ్డీ అంటూ.. దినేష్ సింగ్ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్‌లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై సలహాలు ఇస్తూ మెసేజ్‌లు చేసేవాడు. ‘స్టాక్ మార్కెట్ ట్రెజరీ హంటింగ్ సీక్రెట్స్’ పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురించనున్నానని, ఈనెల 23న ముంబైలో ఈ కార్యక్రమం ఉంటుందని దినేష్ గ్రూప్ సభ్యులకు కల్లబొల్లి మాటలు చెప్పాడు. తాను ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్‌ని అని, అమెరికాలోని వార్టన్ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశానని, జేపీ మోర్గాన్‌లో 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులను నిర్వహించిన ఈక్విటీ అనలిస్ట్నని చెబుతూ ఓ నకిలీ లింక్‌ను పంపించాడు. అది చూసిన గ్రూప్ సభ్యులు నిందితుడిని గుడ్డిగా నమ్మారు.ఇదే సమయంలో దినేష్ ‘ది వెల్త్ అలయెన్స్’ అనే కాన్సెప్‌్టను గ్రూప్ సభ్యులకు పరిచయం చేశాడు. ఒకేరకమైన ఆలోచనలు, లక్ష్యాలు ఉన్న గ్రూప్ సభ్యులు కలిసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే 500 శాతం రాబడులు వస్తాయని.. అదే అలయెన్స్ లక్ష్యమని నమ్మించాడు. 5–6 వారాల్లో 200 శాతం లాభాలు అందిస్తానని హామీ ఇచ్చాడు. సభ్యులతో ఏకీకృత బ్రోకరేజ్ ఖాతాను తెరిచాడు. మెకన్లీ బ్రోకరేజ్ సర్విసెస్ ద్వారా మాత్రమే ఇండియన్ మార్కెట్ క్యూఐబీ ట్రేడింగ్, యూఎస్ మార్కెట్ క్యూఐబీ ట్రేడింగ్, ఐపీఓ సబ్స్రి్కప్షన్లను నిర్వహించాలని సూచించాడు. ఇందుకు కస్టమర్ సర్విసెస్ మేనేజర్ అంటూ ఖైతీ అనే మహిళను పరిచయం చేశాడు. సెబీ రిజిస్టర్డ్ సంస్థ అని నకిలీ గుర్తింపు పత్రాలను చూపాడు. భారత్‌తోపాటు అమెరికా, హాంకాంగ్‌లలో ట్రేడింగ్ చేయడానికి అధికారం ఉందని వివరించాడు. బంగారం మీద రుణం తీసుకొని మరీ.. గ్రూప్ సభ్యులను మూడు శ్రేణులుగా విభజించిన దినేష్.. రూ.20 లక్షల కంటే తక్కువ పెట్టుబడులు ఉన్నవారికి విక్టరీ వాన్ గార్డ్స్ టీమ్–1 అని, రూ.20 లక్షల కంటే ఎక్కువ పెట్టేవారిని విక్టరీ వాన్ గార్డ్స్ టీమ్–2 అని, అత్యధిక పెట్టుబడులు పెట్టేవారిని క్లోజ్డ్ డోర్ డిస్ప్లే టీమ్ అని పేర్లు పెట్టాడు. గ్రూప్ సభ్యులకు వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు మార్గదర్శకత్వం అందిస్తామని మాయమాటలు చెప్పాడు. గ్రూప్ సభ్యులు అధిక లాభాలు పొందేందుకు పెట్టుబడులు పెంచాలని.. లేకపోతే లాభాలు కోల్పోతారని భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఊర్మిళ పెట్టుబడుల మొత్తాన్ని పెంచారు. ఈ2ఈ రైల్, గాబియన్ టెక్నాలజీస్ ఐపీఓలలో పాల్గొనాలని, పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలని సూచించాడు. 300 శాతం లాభాలు వస్తాయని నమ్మించాడు.దీంతో గుడ్డిగా నమ్మిన ఊర్మిళ.. బంగారం మీద రుణం తీసుకొని మరీ పెట్టుబడులు పెట్టారు. ఒకవైపు అత్యాశ వద్దని భర్త హెచ్చరించినా పట్టించుకోకుండా ఆమె పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయడం గమనార్హం. పెట్టుబడుల కోసం నిందితులు పశి్చమ బెంగాల్, అస్సాం, ఒడిశా, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు చెందిన కరెంట్ ఖాతా నంబర్లను అందించారు. దీంతో అనుమానం కలిగిన ఊర్మిళ.. ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు. వాట్సాప్ ఆధారిత పెట్టుబడి మోసాల గురించి పలు నివేదికలను చూశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 6న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 111(2)(బీ), 318(4), 319(2), 336(3), 338, 340(2)లతో పాటు ఐటీ చట్టంలోని 66–సీ,డీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఒక్క రోజే రూ.38 లక్షలు..ఊర్మిళ తన భర్త పేరు, వివరాలతో ‘మెక్కీ సీఎం’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, ట్రేడింగ్ ఖాతాను ప్రారంభించారు. గ్రూప్‌లో ఇచ్చిన సూచనల మేరకు మెకిన్లీ ట్రేడింగ్ ఖాతాలోకి సొమ్మును బదిలీ చేశారు. గత డిసెంబర్ 24న తొలుత రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. అప్పట్నుంచి ఈనెల 5 వరకు 19 దఫాలుగా మొత్తం రూ.2.58 కోట్లు పెట్టారు. డిసెంబర్ 26న ఒక్క రోజే ఏకంగా రూ.38 లక్షలు పెట్టారు. బాధితురాలి యాక్సిస్ బ్యాంక్ ఖాతా నుంచి నిందితులకు చెందిన సీబీఐ బ్యాంక్‌లోని కంపాకోలా బెవరేజెస్ ఖాతాకు ఈ సొమ్మును బదిలీ చేశారు. నిందితులు మాతారా ఎంటర్ప్రైజెస్, రిసోర్స్ గ్లోబల్ సర్వీసెస్, సమ్మిట్ ఆటోమేషన్ కంట్రోల్ సిస్టమ్ పేరుతో కరెంట్ ఖాతాలు నిర్వహిస్తున్నారు. -
భర్త వివాహేతర సంబంధం.. కత్తితో వివాహిత హల్చల్
రామన్నపేట: భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా తనకు, తన పిల్లలకు ఆస్తిలో వాటా ఇవ్వాలని భర్త దుకాణం ఎదుట భార్య కత్తితో హల్చల్ చేసింది. ఈ ఘటన వరంగల్ నగరంలో బుధవారం చోటుచేసుకుంది. నగరానికి చెందిన జ్యోత్స్నకు మెరుగు శ్రీకాంత్ అనే వ్యక్తితో 20 ఏళ్లక్రితం వివాహమైంది. భర్తకు వరంగల్ చౌరస్తాలో జ్యువెలరీ దుకాణం ఉంది. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 8 ఏళ్ల కిత్రం విడిపోయారు. విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం కోర్టు వాయిదా ఉండగా జ్యోత్స్న హాజరు కాలేదు. బుధవారం తన భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్ చేసింది. తన భర్త వేరే మహిళతో సహజీవనం సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇంతెజార్గంజ్ పోలీసులు అక్కడికి చేరుకుని సదరు వివాహితకు నచ్చజెప్పి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించగా, ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని వారు తెలపడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ మహిళను కుటుంబ సభ్యులతో పంపించారు. -
ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య
-
2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను చంపిన భార్య
-
ఖతర్నాక్ విగ్గురాజా
బట్టతల కారణంగా పెళ్లి ఈడు దాటిపోతుండడంతో.. అతగాడు ఘరానా మోసానికి దిగాడు. విగ్గుతో మేనేజ్ చేస్తూ ఎలాగోలా ఓ అమ్మాయికి తాళిబొట్టు కట్టేశాడు. తీరా.. కాపురంలోకి అడుగుపెట్టాక అతగాడి హెయిర్‌స్టైల్‌పై అనుమానం వచ్చిందామెకు. కొన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చిన అతను.. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. అక్కడి నుంచే అసలు డ్రామా మొదలుపెట్టాడు.. బట్టతల భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ భార్య నోయిడా పోలీసులను ఆశ్రయించింది. విగ్గు పెట్టుకుని తనను పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత జుట్టు రాలుతోందంటూ డ్రామాలు ఆడాడనని.. చివరకు విషయం తెలిసిపోవడంతో విగ్గు పీకేసి విలన్ వేషాలు వేస్తున్నాడని వాపోయిందామె. అప్పటి నుంచి సైకోలా మారిపోయి వేధించడం మొదలుపెట్టాడు.. నా ఫోన్ నుంచి వ్యక్తిగత ఫొటోలు సేకరించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాడు. చేసేది లేక నగలు ఇచ్చేశాను. ఆపై అదనపు కట్నం కోసం నా తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. భరించలేక న్యూఢిల్లీ ప్రతాప్ భాగ్‌లోని అత్తింటి నివాసంలో పంచాయితీ పెట్టించా. అందరి ముందు విగ్గు తీసేసి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి మమ్మల్ని వేధించాడు అని ఫిర్యాదులో పేర్కొందామె. సదరు భర్త కుటుంబం మొత్తంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని.. పరారీలో ఉన్న భర్త కుటుంబం కోసం గాలిస్తున్నట్లు బిస్రాఖ్ పీఎస్ అధికారి మనోజ్‌కుమార్ చెబుతున్నారు. -
నిజామాబాద్ సౌమ్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నిజామాబాద్: భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్త పల్లటి రమేష్‌పై రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఉండగా.. బీమా డబ్బుల కోసమే భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ పక్క ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోటం ఆపై ఇన్స్యూరెన్స్ డబ్బులతో పారిపోవడానికి ప్లాన్ చేశారు.ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నార్మల్ డెత్ గుండె పోటు అంటూ చిత్రీకరించారు. నిద్ర మాత్రలు ఇచ్చి భర్తగొంతు నులిమి హత్య చేసి హార్ట్ ఎటాక్‌గా భార్య నమ్మించింది. మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తామే హత్య చేసినట్లు భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ ఒప్పుకున్నారు.పోలీసుల వెల్లడించిన వివరాలు ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాం గ్రామానికి చెందిన పట్టాటి రమేష్ భార్య సౌమ్య ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్‌తో ఆమెకు పరిచయం.. వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త రమేష్‌కు తెలియడంతో, ఇద్దరినీ గట్టిగా మందలించాడు.దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని సౌమ్య ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. గత నెల 20న సౌమ్య తన ప్రియుడు దిలీప్‌తో కలిసి రమేష్‌ను ఇంట్లోనే హత్య చేశారు. అనంతరం భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించి, ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియల సమయంలో రమేష్ మెడపై గాట్లు కనిపించడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే ఇజ్రాయెల్‌లో ఉన్న అతని తమ్ముడు కేదారికి సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. ఈ కేసులో సౌమ్యతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఫ్రెంచ్ అధ్యక్షుడి భార్యపై ట్రోల్స్.. జైలుశిక్ష
పారిస్: ఫ్రెంచ్ అధ్యక్షుడి సతీమణిని ట్రోల్ చేసినందుకు గాను అక్కడి పారిస్ కోర్టు పదిమందికి జైలుశిక్ష విధించింది. బ్రిగెట్టి మేక్రాన్ పురుషుడు అంటూ కొంతమంది ఆన్లైన్లో వేదింపులకు గురిచేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేయగా తాజాగా ఆకేసును విచారించిన పారిస్ కోర్టు వారికి శిక్ష విధిస్తూ తీర్పుఇచ్చింది.ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భార్య బ్రిగిట్టే మాక్రాన్‌ను 2024లో కొంతమంది ఆకతాయిలు ఆన్లైన్లో ట్రోల్ చేశారు. వాస్తవానికి బ్రిగిట్టే మాక్రాన్ పురుషుడని ఆయన అసలు పేరు జీన్- మిచెల్-ట్రోగిక్స్ అని ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్‌పై కలత చెందిన మాక్రాన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పుకార్ల వల్ల తమ కుటుంబం ఎంతో బాధపడిందని ఆమె కుమార్తె తెలిపింది.తాజాగా దీనిపై విచారించిన కోర్డు నిందితులు పదిమందికి ఎనిమిది నెలల జైలుశిక్షతో పాటు రూ. 63 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే వీరిలో కొంతమంది తాము కేవలం సరదాకు మాత్రమే అలా అన్నామని అనగా.. దేశ అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని న్యాయమూర్తి వారిని హెచ్చరించారు.అమెరికాలో కూడా ట్రంప్ అనుకూల జర్నలిస్టులు కాండేస్ ఓవెన్స్, టక్కర్ గ్రావెన్స్ అనే ఇద్దరు జర్నలిస్టులు బ్రిగిట్టే మాక్రాన్ పురుషుడే అని వ్యాఖ్యలు చేశారు. బ్రిగిట్టే తన సోదరుడు జీన్-మిచెల్-ట్రోగన్స్ వాస్తవానికి ఒక్కరేనని మిచెల్ లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకొని బ్రిగిట్టేగా మారిందన్నారు. అయితే ఇవన్ని అసత్యపుకార్లని చాలా మంది కొట్టిపారేశారు. -
ఐఏఎస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి
సాక్షి,విజయవాడ: ఐఏఎస్ అధికారి కిషోర్ సతీమణి సత్య దీపిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చర్చాంశనీయంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత కొన్ని రోజులుగా ఐఏఎస్ అధికారి కిషోర్ భార్య సత్య దీపిక గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత వారం ఐఏఎస్ అధికారి కిషోర్ తన భార్యను ఆయుష్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే,ఈ ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.సత్య దీపిక మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సత్యదీపిక మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా సేకరిస్తున్నారు. -
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
-
భార్య వివాహేతర సంబంధం.. భర్తకు నరకయాత!
= తన భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటూ...అతనితో కలిసి తనపై దాడి చేస్తోందని పుట్టపర్తి మండలం జగరాజుపల్లికి చెందిన ఓ యువకుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తనకు విడాకులు కావాలని అడిగినా... ఆమె ఒప్పుకోవడం లేదని... కాపురం చేస్తానని చెబుతూనే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోయాడు. పైగా తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తోందని, పోలీసులు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తూ తనకే కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. = ముదిగుబ్బ మండలానికి చెందిన ఓ యువతి తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి రెండు వారాల క్రితం జిల్లా కేంద్రానికి వచ్చింది. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. తనను ఇబ్బందులు పెడుతున్నాడని కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసింది. అతనిపై కేసు నమోదు చేయాలని, లేదంటే తనతో విడాకులకు ఒప్పుకునేలా అతడిని మార్చాలని కోరింది. లేకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని వాపోయింది....ఇలా ప్రతి వారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు కుటుంబ సమస్యల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా అందే అర్జీల్లో 20 శాతానికి పైగా కుటుంబ కలహాలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఏ కేసును పరిశీలించినా.. దంపతుల మధ్యలోకి మరో వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. బంధం భారమనుకుంటున్న వారు వీలైనంత త్వరగా బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.సాక్షి, పుట్టపర్తి: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండాలని వేద మంత్రాల సాక్షిగా వివాహం చేస్తారు. అయితే ఇటీవల కాలంలో ఏడడుగులు నడిచి.. ఏడాది గడవక ముందే ఎన్నో జంటలు విడిపోతున్నాయి. పెళ్లయిన మొదటి రోజు నుంచే విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్న వారూ ఉన్నారు. మరికొందరు పిల్లలు పుట్టినా.. కలిసి ఉండలేక వేర్వేరుగా జీవితం వెళ్లదీస్తున్నారు. దంపతుల మధ్య తలెత్తుతున్న వివాదాలు చిన్నారుల భవితను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలతోనే.. దంపతుల మధ్య సయోధ్య కుదరక.. సర్దుకుపోయే గుణంలేక.. పెద్దల మాట లెక్క చేయక.. ప్రతి వారం కనీసం పది జంటలు పోలీసులను ఆశ్రయిస్తున్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని.. కలిసి ఉండలేమని.. వేరుగా జీవించేందుకు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇందులో వివాహేతర సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. భార్య లేదా భర్త.. అవతలి వ్యక్తిపై చేసే ఫిర్యాదులో కచ్చితంగా మరొకరితో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో దంపతుల మధ్య విభేదాలకు సంబంధించి కొందరు ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు విడాకులు కోరుతూ న్యాయవాదుల వద్దకు వెళ్తున్నారు. సర్దుకుపోయే తత్వంలేక నిత్యం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. అనాలోచిత నిర్ణయంతో. ఆకర్షణో.. ప్రేమో అర్థం చేసుకోలేక, ఆలోచించే పరిపక్వత లేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొత్త దాంపత్య జీవితంలో ఇష్టంగా అడుగు పెట్టినా.. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకుని గొడవ పడుతున్నారు. ఆలోచన లేని ఆవేశంతో విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్దలలు జోక్యం చేసుకుని సర్దిచెప్పినా పరిస్థితి చక్కబడటం లేదు.సర్దుకుపోతే మంచిది ప్రతి మనిషికీ తోడు ఎంతో అవసరం. మంచి, చెడులను వివరించి చెప్పగలిగే స్నేహితుడు దొరికితే వారు చాలా అదృష్టవంతులు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్నేహితులుగా భావించాలి. అప్పుడే వారికి కలిగే చిన్న చిన్న సమస్యలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఏదైనా సమస్య తలెత్తితే కుటుంబ పెద్దలకు చెప్పి.. ఇంట్లోనే సర్దుకుంటే మంచిది. – సతీష్ కుమార్, ఎస్పీ, శ్రీసత్యసాయి జిల్లా -
నా భర్త అశ్లీల వీడియోలు చూస్తూ.. నరకం చూపిస్తున్నాడు..!
బెంగళూరు: భర్త విచిత్ర ప్రవర్తన, లైంగిక వేధింపులతో మనస్తాపం చెందిన భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు.. భార్యాభర్తలిద్దరూ ఒకే కంపెనీలో సహోద్యోగులు. హెచ్ఆర్గా ఉన్నప్పుడే ఇద్దరికీ పరిచయమై అనంతరం ప్రేమకు దారి తీసింది. యువతి తల్లిదండ్రులను ఒప్పించిన అనంతరం 2025 సెపె్టంబరు 3 తేదీన కుటుంబ సభ్యులు చింతామణిలో మంజునాథ్‌తో వివాహం జరిపించారు.వివాహమైన అనంతరం భర్త సైకోలా ప్రవర్తిస్తుండగా ఫోన్ చూసి లైంగిక ప్రక్రియకు డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో వారి ముందు నగ్నంగా తిరుగుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారని మహిళ ఆరోపించింది. ప్రస్తుతం సైకో భర్త వేధింపులకు భార్య హడలిపోయింది. నేను వివాహం చేసుకుంది ఇలాంటి సైకో వ్యక్తినా అని మదనపడుతోంది. వివాహమైన కొద్దిరోజుల పాటు అన్యోన్యంగా ఉన్న భర్త ప్రస్తుతం సైకోలా ప్రవర్తిస్తుండటంతో భార్య బెంబేలెత్తిపోతోంది. అత్తమామల ముందు కూడా నగ్నంగా సంచరిస్తుండటంతో పాటు ప్యాసేజ్లోకి వెళ్లి చుట్టుపక్కల వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. భర్త విచిత్ర ప్రవర్తన, వేధింపులతో పాటు తనను భర్త అసభ్య పదజాలంతో దూషిస్తూ, శారీరకంగా, మానసికంగా హింసించాడని, తనతో పాటు తన తల్లిని కూడా అసభ్యంగా దూషించి దాడికి ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనకు అతని తల్లిదండ్రులు మద్దతు ఇస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. కేంద్ర విభాగం మహిళా స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య గొంతు కోసిన భర్త
ఆత్మకూరు: భార్యపై అనుమానం పెంచుకు న్న ఓ భర్త ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హనుమ కొండ జిల్లా ఆత్మకూ రు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రా నికి చెందిన అనూష, మంద రవి 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమా ర్తెలు. పెళ్లైన నాలుగేళ్లనుంచి రవి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అనూష ఓ గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుండగా రవి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనపై శారీరక, మానసిక వేధింపులు ఎక్కువ కావడంతో రెండు నెలల క్రితం అనూ ష మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ చేసి పంపించారు. అయినా రవి ప్రవర్తనలో మార్పు రాలే దు. గురువారం రాత్రి రవి భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను పిడిగుద్దులు గుద్దుతూ ఇంట్లోని కత్తి తీసుకుని గొంతు, మెడ, పొట్ట, కుడిచేతిపై ఇష్టానుసారంగా పొడిచాడు. అనూష కేకలు వేయడంతో పక్కగదిలో ఉన్న అత్త, కూతుళ్లు వచ్చి అడ్డుకున్నారు. చుట్టుపక్కలవారి సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సీఐ సంతోష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. -
భార్యపై అనుమానంతో నిప్పు పెట్టిన భర్త
-
దారి కాచి మరీ భువనేశ్వరిని కాల్చి చంపిన భర్త
నీతో కలిసి జీవించలేను విడాకులు ఇవ్వమని నోటీసులిచ్చిన భార్యను అత్యంత దారుణంగా కాల్చి చంపాడో భర్త. వైవాహిక విభేదాలతో ఆమె భర్తను విడాకులు అడిగింది. అదే ఆమె చేసిన నేరం. బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.బాధితురాలిని భువనేశ్వరి (39)గా గుర్తించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బసవేశ్వర నగర్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఈమె భర్త, నిందితుడు బాలమురుగన్ (40) ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఒక పనిచేసేవాడు. వీళ్లిద్దరూ తమిళనాడులోని సేలం జిల్లాకు చెందినవారు. వీరికి 2011లో వివాహమైంది. 2018లో బెంగళూరుకు మకాం మార్చారు. వీరికిద్దరు సంతానం. అయితే గత నాలుగేళ్లుగా బాలమురుగన్‌కు ఉద్యోగం లేదు. నెమ్మదిగా తగాదాలు మొదలయ్యాయి. దీంతో భార్యపై అనుమానం మొదలైంది. భువనేశ్వరి చట్టబద్ధంగా విడిపోవాలని కోరింది, దానిని బాల మురుగన్ వ్యతిరేకించాడు దీంతో వేరే బ్రాంచ్‌కు ఉద్యోగాన్ని బదిలీ చేయించుకున్న భువనేశ్వరి గత ఏడాదికాలంగా 12 ఏళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురితో కలిసి రాజాజీ నగర్లో వేరుగా నివాసముంటోంది. బాలమురుగన్ కేపీ అగ్రహారలో ఒంటరిగా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం భువనేశ్వరి బాలమురుగన్‌కు విడాకుల నోటీసు పంపింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్అటు ఉద్యోగం లేదు, ఇటు భార్యతో గొడవలు, అనుమానం, విడాకుల నోటీసులు దీంతో భార్యపై ఆగ్రహం పెంచుకున్న బాలమురుగన్ ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నారు. భార్య కదలికలను పసిగట్టి, సరిగ్గా ఆమె ఆఫీసునుంచి ఇంటికి వచ్చే సమయంలో కాపుగాసి ఆమెను అడ్డుకున్నాడు. మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో, రాజాజీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని 1వ ప్రధాన రోడ్డులో చాలా సమీపంనుంచి ఆమెపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పిస్టల్‌తో సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.హొయసల పెట్రోల్ సిబ్బంది గాయపడిన భువనేశ్వరిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అప్పటికేఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా వినిపించిన కాల్పులను భయాందోళనలు రేకెత్తించాయి. జనం పరుగులు తీశారు. రెండు బుల్లెట్లు భువనేశ్వరి తలపై దూసుకుపోగా, మిగిలిన రెండు బుల్లెట్లు ఆమె చేతికి తగిలాయి. నిందితుడు తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడని, ఇదే గొడవలకు దారితీసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, అతనికి ఆయుధం ఎలా వచ్చింది, దానికి లైసెన్స్ ఉందా? తదితర వివరాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
చపాతి లేట్ అయిందనీ, భార్య, నాలుగేళ్ల కొడుకుపై పెనంతో దాడి
గోరఖ్‌పూర్(యూపీ): ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు.. తాగుబోతుల నిర్వాకాలు ఎటు పోతాయో ఎవరూ చెప్పలేరు. రాత్రి పూట హాయిగా పిల్లాడితో కలిసి నచ్చింది వండుకుని తిందామనుకున్న ఆ ఇల్లాలికి పిడుగులా మీద పడ్డాడు తాగుబోతు భర్త. డ్రైవర్‌గా సంపాదించిందంతా తాగుడుకే నీళ్లగా ఖర్చయిపోగా ఆగమేఘాల మీద క్షణాల్లో చపాతి కావాలంటూ భీష్మించుకు కూర్చుని భార్యకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాడు. మెరుపువేగంతో చపాతి చేయకపోతే పిడిగు ద్దులు ఖాయమని హెచ్చరించి చివరకు అనుకున్నంత పనీ చేశాడు. భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడి రక్తం కళ్లజూశాడు. తాగుబోతు డ్రైవర్ నిర్వాకంపై ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్ నాథ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాస్త్రీనగర్‌లో ఒక్కటే చర్చ జరుగుతోంది. చపాతి ఆలస్యంగా చేసిందన్న చితకబాదుతాడా అంటూ అతడిని తిట్టిపోయని వాళ్లు లేరు. 30 ఏళ్ల భార్యామణి రాధికా సహానీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భార్యాభర్తల చపాతి గొడవ ఆలస్యంగా వెలుగుచూసింది. డిసెంబర్ 20వ తేదీన ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు, బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు.. గత శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో లాల్‌చంద్ సహానీ పూటుగా తాగి ఇంటికొచ్చాడు. లక్నోలో డ్రైవర్‌గా పనిచేయడం వచ్చిన డబ్బులు తాగుడకు తగలేయడం అతనికి దినచర్యగా తయారైంది. శనివారం రాత్రి ఇంటికి రాగానే ‘రోటీ రెడీ చెయ్’ అని హోటల్లో సర్వర్‌కు ఆర్డర్ వేసినట్లు ఆర్డర్ వేశాడు. ఇంట్లో అంట్లు తోమడం వంటి ఇంటి పనులు ముగించుకుని రోటీలు చేసి ఇచ్చింది. రోటీ చేయడానికి ఇంత సమయం పడుతుందా? ఇంత ఆలస్యంగా తీసుకొస్తావా? అంటూ లాల్‌చంద్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. అప్పటికే వంటగదిలో పొయ్యి మీద వేడిమీదున్న పెనం తీసుకుని భార్యను చితక్కొట్టాడు. గొడవతో భయపడి అటుగా వచ్చిన తమ నాలుగేళ్ల కుమారుడి తల మీదా లాల్ చంద్ పెనంతో దాడి చేయడంతో తలకు గాయమై రక్తం ధారగా కారింది. దీంతో భయపడిపోయిన లాల్ చంద్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెల్సిన ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే పిల్లాడిని ఆస్పత్రిలో చేర్పించాడు. పారిపోతూ లాల్‌చంద్ భార్యను ‘నిన్ను చంపేస్తా’’ అంటూ అరుస్తూ పరుగెత్తాడని పొరుగువాళ్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు తాగుబోతు భర్త కోసం గాలింపు మొదలెట్టారు. లాల్‌చంద్‌ను వెంటనే పట్టుకుని తగిన బుద్ధి చెప్తామని గోరఖ్‌నాథ్ పోలీస్‌స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శశిభూషణ్ రాయ్ చెప్పారు.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
బిడ్డను చూపాలంటే రూ.30 లక్షలు ఇవ్వు
మైసూరు: భార్య వేధింపులతో జీవితం మీద విరక్తి చెందిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మైసూరు ఆలనహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. జిల్లా టి. నరసిపుర తాలూకా నివాసి, ప్రైవేటు కంపెనీ ఇంజనీర్ ఉమేష్ (34), మైసూరులోని సిద్ధార్థ బరంగే నివాసి చన్నబసవేగౌడ కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. ప్రారంభంలో బాగానే ఉన్న భార్యాభర్తలు తరువాత తరచుగా గొడవ పడుతుండేవారని ఉమేష్ తండ్రి గురుమల్లెగౌడ తన ఫిర్యాదులో తెలిపాడు. గత 2 సంవత్సరాలుగా, ఉమేష్ తన చిన్నారి కూతురిని చూడలేక పోయాడు. భార్య బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. బిడ్డను చూడాలనుకుంటే డబ్బులు ఇవ్వాలని ఆమె వేధించేది. ఇది తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడేవాడు. డిసెంబర్ 19న, భార్యకు వీడియో కాల్ చేసి, తన కూతురిని చూపించమని అడిగాడు. అయితే, రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్చేసింది. దీంతో ఆవేదన చెందిన ఉమేష్ తన బాడుగ ఇంటిలో ఉరి వేసుకున్నాడు. భార్య రమ్య, అతని తల్లిదండ్రులపై చన్నబసవేగౌడపై అలనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
-
దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని..
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండటంతో భరించలేని ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి కాపురానికి రావ డం లేదనే అక్కసుతో అతను తన కుమారుడిని హత్య చేశాడు. మెదక్ జిలాల్లోని మెదక్ మండలంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద బాయి తండాకు చెందిన భాస్కర్ తన భార్య అమీనాపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈనెల 19న సాయంత్రం భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె పిల్లలను వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తిరిగి కాపురం చేసేందుకు రావడంలేదనే కోపంతో అతను శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ(3)ని గొంతు నొలిమి చంపాడు. ఈ ఘటనపై తల్లి అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ ఎస్ఐ లింగం తెలిపారు. ప్రస్తుతం చిన్నారి లక్కీ మృతదేహాన్ని మెదక్‌జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు న్యాయస్థానం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. తోషాఖానా-2 అవినీతి కేసులో విచారణ జరిపిన కోర్టు, శనివారం (డిసెంబర్ 20) వీరికి చెరో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పు ప్రకారం, పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 కింద నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో ఏడేళ్ల శిక్షతో పాటు, దంపతులిద్దరికీ చెరో రూ. 10 మిలియన్ల భారీ జరిమానా విధించారు.సౌదీ అరేబియా ప్రభుత్వం నుండి 2021లో అందిన విలాసవంతమైన బహుమతులను వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. విదేశీ ప్రముఖులు ఇచ్చే విలువైన ఆభరణాలు, విలాసవంతమైన గడియారాలను ప్రభుత్వ నిధికి (తోషాఖానా) అప్పగించకుండా, తక్కువ విలువ చూపించి కొనుగోలు చేశారని ప్రాసిక్యూటర్లు నిరూపించారు. ఆ తర్వాత ఆ వస్తువులను బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి, కోట్లాది రూపాయల లాభం పొందారని దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇమ్రాన్ ఖాన్ 2022లో అధికారం కోల్పోయినప్పటి నుండి ఎదుర్కొంటున్న సుమారు 200 పైగా కేసుల్లో ఇది అత్యంత కీలకమైనది. గతంలో తోషాఖానా-1 కేసులో పడిన 14 ఏళ్ల శిక్షకు ఇది అదనం. దీంతో ఆయనకు చట్టపరమైన ఇబ్బందులు మరింత జటిలమయ్యాయి. అయితే ఈ తీర్పులను ఇమ్రాన్ పార్టీ అయిన 'పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్' (పీటీఐ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఒక న్యాయ హత్య అని, రాబోయే ఎన్నికల నుండి ఇమ్రాన్‌ను దూరం చేయడానికి సైన్యం, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు.ఈ తాజా తీర్పు పాకిస్థాన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, భద్రతా సవాళ్లతో సతమతమవుతున్న తరుణంలో, ఈ శిక్ష పీటీఐ మద్దతుదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తీర్పు నేపధ్యంలో నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. తనను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పించేందుకే ఇన్ని కేసులు పెడుతున్నారని ఇమ్రాన్ వాదిస్తుండగా, ఇది అవినీతిపై చట్టం సాధించిన విజయమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు పీటీఐ నేతలు ప్రకటించారు. Pakistan's Dawn reports - "A special court of the Federal Investigation Agency (FIA) on Saturday sentenced PTI founder Imran Khan and his wife Bushra Bibi to 17 years imprisonment in the Toshakhana-2 case. The case pertains to the purchase of an expensive Bulgari jewellery set,… pic.twitter.com/LOtVNMr9pq— ANI (@ANI) December 20, 2025 -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
-
ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు (ఫోటోలు)
-
భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే.. వాళ్లు బతికిపోయారు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వల్ప వివాదానికే ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేశాడు. అంతేకాదు ముగ్గురు బాధితుల మృతదేహాలను వారి ఇంటి ప్రాంగణంలోని ఏడు అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తల్లీ పిల్లలు ఆరు రోజులుగా కనిపించకుండా పోవడంతో అందిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. విచారణలో, ఫరూఖ్ నేరం అంగీకరించాడని తెలుస్తోంది.నిందితుడిని కాంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామానికి చెందిన ఫరూక్‌గా గుర్తించారు. పోలీసుల ప్రకారం, ఫరూక్ తన భార్య తాహిరా (32) బుర్ఖా ధరించకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు ప్రారంభమైన వాగ్వాదం తీవ్రమైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తొలుత భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత కుమార్తెలు అఫ్రీన్ (14) , సెహ్రీమ్ (7)కూడా పొట్టనబెట్టుకున్నాడు.ఈ జంటమధ్య గత కొన్ని నెలలుగా తరచుగా గొడవలు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ వివాదాలతో ఫరూక్ తల్లిదండ్రులు దావూద్ ,అస్గారి నుండి విడిగా ఉంటున్నాడు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు, వారిలో ముగ్గురు సంఘటన సమయంలో లేనందున ప్రాణాలతో బయటపడ్డారు. డిసెంబర్ 9-10 రాత్రి హత్యలు జరిగాయని పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ పి సింగ్ తెలిపారు. టీ తయారుచేసే నెపంతో ఫరూఖ్ తన భార్యను నిద్రలేపి, ఆపై ఆమెను , పెద్ద కుమార్తెను కాల్చి చంపాడు. ఈ దారుణాన్ని చూసిన చిన్న కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లోనే లోతైన గొయ్యి తవ్వి, మృతదేహాలను పాతిపెట్టి, ఆ ప్రదేశాన్ని ఇటుకలతో కప్పేశాడ. పథకం ప్రకారం ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆర్థిక ఒత్తిడి, తరచుగా వాదనలు, కోపం, అవమాన భారంతోనే ఈ తప్పు చేశానని ఫరూఖ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.Shamli, Uttar Pradesh: A husband allegedly killed his wife and two daughters and buried their bodies in a 9-foot-deep pit at homeSP N.P. Singh says, “On Tuesday evening around 5 PM, the village head of Gaungori Daulat under Kandhla police station informed us that a man named… pic.twitter.com/RITXJLfsCY— IANS (@ians_india) December 17, 2025 -
ప్రాణం పోతున్నా పట్టించుకోని జనం
కర్ణాటక: కళ్ల ముందే ప్రాణం పోతున్నా.. గుండెపోటుతో రోడ్డుపై విలవిల్లాడుతున్నా.. సాయం కోసం అతని భార్య చేతులు జోడించి వేడుకుంటున్నా.. జనం పట్టించుకోలేదు. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరకు ఆ వ్యక్తి మరణించాడు. ఈ విషాద ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. బనశంకరి మూడో స్టేజ్ బాలాజీనగర్‌కు చెందిన వెంకటరామన్(34) మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యాడు. ఆందోళనకు గురైన భార్య రూప అతనిని వెంటనే స్కూటీపై సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెపోటు అని నిర్ధారించారు. ప్రథమ చికిత్స చేసి.. జయదేవ హృద్రోగ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ అంబులెన్సు లేకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రూప.. భర్తను వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మళ్లీ స్కూటీపైనే బయలుదేరింది. కదిరేనహళ్లి బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి.. వెంకటరామన్ స్కూటీపై నుంచి కిందపడిపోయాడు. దీంతో రూప రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డుపడి సాయం కోసం వేడుకుంది. అయినా ఎవరి మనసూ కరగలేదు. ఆ తర్వాత కొద్ది సేపటికి వెంకటరామన్ సోదరి అక్కడకు చేరుకుంది. చివరకు ఇద్దరూ కలిసి క్యాబ్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే వెంకటరామన్ మరణించాడు. సమయానికి ఎవరూ మానవత్వం చూపకపోయినా.. రూప పెద్ద మనసుతో తన భర్త కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచింది. #Heartbreaking incident in Bengaluru has left many shaken and questioning humanity. Thirty-four-year-old Venkataramanan suffered a sudden cardiac arrest while riding a bike with his wife. Near Kadrihalli Bridge, he collapsed on the road, gasping for life. His wife screamed for… pic.twitter.com/VXSUDWDq8Z— Bharathirajan (@bharathircc) December 17, 2025 -
భార్యతో కలిసి నిర్మాత దిల్ రాజు ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
శ్రీవారిలో సేవలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దంపతులు (ఫొటోలు)
-
భార్యను హత్య చేసి బైక్ పై మృతదేహాన్ని..
-
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
-
బాత్రూమ్ కడితేనే సంసారానికి వస్తా!
కర్నూలు జిల్లా: బాత్రూమ్ సమస్య ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఎదురుపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాని కి చెందిన శివశంకర్ (35), అతని సోదరుడు పక్కపక్కన నివాసముంటున్నారు. రెండిళ్లకు కలసి ఒకే బాత్ రూమ్ ఉంది. కొన్నాళ్ల పాటు సర్దుకుంటూ వచ్చిన శివశంకర్ భార్య శశికళ ఇటీవల వేరుగా బాత్రూమ్ నిర్మించాలని కోరింది. 10 రోజుల క్రితం ఈ విషయంలో దంపతులు ఘర్షణ పడ్డారు. బాత్రూమ్ నిర్మించేంత వరకు ఇంట్లో ఉండనంటూ శశికళ జూపాడుబంగ్లాలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. అయితే భర్త శివశంకర్ ఎంత బతిమలాడినా తిరిగిరాలేదు. దీంతో మనస్తాపం చెందిన శివశంకర్ శనివారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి తేనె భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం.రవీంద్రబాబు సోమవారం వెల్లడించారు. -
భార్యతో విహారయాత్రకు వెళ్లిన కీరవాణి కొడుకు హీరో సింహా (ఫొటోలు)
-
పెళ్లయిన 24 గంటలకే... ఎంత దారుణం..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వరకట్న వేధింపుల దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లోని జుహి ప్రాంతానికి చెందిన లుబ్నా, మొహమ్మద్ ఇమ్రాన్‌లకు నవంబర్ 29న ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. కోటి కలలతో లుబ్నా మరుసటి రోజు తన అత్తమామల ఇంటిలో అడుగుపెట్టింది. అయితే ఆమె కలలు 24 గంటలు ముగియకుండానే కల్లలయ్యాయి. అదనపు కట్నం కోసం ఆమెను వేధించి, భర్త ఇమ్రాత్తో పాటు అతని కుటుంబ సభ్యులు లుబ్నాను బయటకు గెంటేశారు.లుబ్నా తన అత్తమామల ఇంటికి వచ్చిన వెంటనే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ లేదా దానికి బదులుగా రెండు లక్షల నగదు ఇవ్వాలని వరుడి కుటుంబం డిమాండ్ చేసింది. ‘నేను ఇంటికి వచ్చిన వెంటనే గొడవ మొదలైంది. మాకు బుల్లెట్ బైక్ ఇవ్వలేదు.. వెంటనే ఇంటికి వెళ్లి రూ. రెండు లక్షలు తీసుకురా అంటూ వారు తనను కొట్టడం ప్రారంభించారు’ అని లుబ్నా పోలీసులకు వివరించింది. అత్తామామలు తనను కొట్టడమే కాకుండా, తమ పుట్టింటివారు పెట్టిన నగలు, నగదును కూడా వారు బలవంతంగా తీసేసుకున్నారని బాధితురాలు ఆరోపించింది.లుబ్నా తల్లి మెహతాబ్ మాట్లాడుతూ తమ కుమార్తె వివాహానికి లక్షలు ఖర్చు చేశామని, తమ శక్తి మేరకు సోఫా సెట్, టీవీ, వాషింగ్ మెషిన్, కిచెన్ సామాగ్రి తదితర విలువైన బహుమతులు ఇచ్చామని తెలిపారు. పెళ్లికి ముందు బైక్ డిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావన తేలేదని, ఒకవేళ ముందే అడిగి ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకోమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తమ కుమార్తె కన్నీటితో ఇంటికి వచ్చి జరిగిన దారుణాన్ని వివరించిందని మెహతాబ్ తెలిపారు.ఈ ఘటనపై లుబ్నా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మొహమ్మద్ ఇమ్రాన్, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని, పెళ్లికి ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని లుబ్నా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వరకట్న దాహంతో పెళ్లైన మరుసటి రోజే కొత్త కోడలిని వేధింపులకు గురిచేసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.ఇది కూడా చదవండి: చూపు లేకున్నా.. శరీరం సహకరించకున్నా.. -
వాట్సాప్ స్టేటస్‌గా ‘మధ్యాహ్నం హత్య’!
సాక్షి, క్రైమ్: ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేసిన దారుణ ఘటన ఆదివారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ(32) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి రేస్‌కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్లో ఉంటూ టౌన్ హాల్ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఆదివారం శ్రీప్రియను కలవడానికి ఆమె భర్త బాలమురుగన్ వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. అందులో ‘ద్రోహానికి ఫలితం.. మరణం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. శ్రీప్రియ తన నుంచి విడిపోయాక ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల చూశానని, అందుకే కోపంతో హత్య చేశాడని బాలమురుగన్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ హత్య ఆదివారం తమిళనాట పెను సంచలనం సృష్టించింది. -
నీ కుక్క నా పిల్లిపై దాడి చేసింది..!
అక్కడ పిల్లాడి పేరు విషయంలో ఏకాభిప్రాయం లేక ఆ జంట విడాకులకు వెళ్లగా.. ఇక్కడ తమ పెంపుడు జంతువుల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల మరో జంట విడిపోవాలని నిర్ణయించుకుంది. భోపాల్‌కు చెందిన ఓ యువతీయువకుడు జంతు ప్రేమికులు. అదే వారిద్దరినీ తొలుత స్నేహితులుగా.. ఆపై భార్యాభర్తలుగా మారేలా చేసింది. చివరకు అదే వారిద్దరూ విడిపోవాలనుకోవడానికీ కారణమైంది. భర్త దగ్గర కుక్క ఉంది.. భార్య పిల్లిని పెంచుకుంటోంది. ఆ రెండింటినీ కలపడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో తాము కూడా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కుక్క తన పిల్లిపై చాలాసార్లు దాడి చేసిందని ఆమె ఆరోపించగా.. ఆ పిల్లి ఇంట్లో అక్వేరియంపై పదేపదే తిరగడం చాలా ఆందోళనకు గురిచేసిందని అతడు పేర్కొన్నాడు. కుటుంబ పెద్దలు రంగంలోకి దిగినా.. వైద్యులు కౌన్సెలింగ్ చేసినా ఇరువురి తీరూ మారలేదు. ముందే అనుకున్నాం కదా.. విడిపోవడానికి కారణాలు కోకొల్లలు అని..! -
Sobhita Dhulipala : స్పెషల్ ఏజెంట్లా మారిపోయిన శోభిత! (ఫొటోలు)
-
ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య
బెంగళూరు: తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య ఉదంతం బెంగళూరు ఉత్తర తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యాదగిరికి చెందిన బసవరాజు(28), శరణమ్మలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉపాధి కోసం బెంగళూరు వచ్చి తిగళరపాళ్యలో నివసిస్తున్నారు. ఈక్రమంలో శరణమ్మకు వీరభద్ర అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ ఆనందానికి బసవరాజు ఎప్పటికైనా అడ్డు వస్తాడని భావించిన శరణమ్మ వీరభద్రతో కలిసి భర్తను కడతేర్చేందుకు ప్రణాళిక రచించింది. ఇంట్లో పడుకున్న బసవరాజు తలపై పెద్ద బండరాయి వేసి హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని తీసికెళ్లి గంగొండనహళ్లి వద్ద పెట్రోల్ పోసి నిప్పంటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. శరణమ్మతోపాటు ఆమె ప్రియుడు వీరభద్ర, అనిల్ అనే నిందితులను అరెస్టు చేశారు. -
దుబాయి మ్యూజియంలో అల్లు స్నేహ (ఫొటోలు)
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ముస్కాన్ రస్తోగి
బ్లూ డ్రమ్.. ఈ పేరు వింటేనే భర్తల వెన్నులో వణకు పుడుతోంది. అందుకు కారణం.. మీరట్‌లో జరిగిన ఓ ఘటన. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను ప్రియుడి సాయంతో గంజాయి మత్తులో కిరాకతంగా హతమార్చింది ఓ భార్య. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే.. భర్త సౌరభ్ రాజ్‌పుత్ (మర్చంట్ నేవీ ఆఫీసర్)ను అత్యంత కిరాతకంగా కడతేర్చిన ముస్కాన్ రస్తోగి మళ్లీ తల్లైంది. ఆదివారం సాయంత్రం మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సయమంలో ముస్కాన్ ప్రియుడు, ఈ కేసు సహ నిందితుడు సాహిల్ శుక్లా కూడా పక్కనే ఉన్నాడు. ఒకవేళ ఆ బిడ్డ తమ కొడుకుకే పుట్టినట్లు డీఎన్ఏ పరీక్షల్లో తేలితే.. తమ మనవడిగా స్వీకరిస్తామని సౌరబ్ కుటుంబం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.మీరట్‌లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బ్లూ డ్రమ్ హత్యకేసు మరోసారి వార్తల్లో నిలిచింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను క్రూరంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా అరెస్టైన ముస్కాన్ రస్తోగి, ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న ఆమె.. ఆదివారం సాయంత్రం జైలు అధికారుల పర్యవేక్షణలో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ప్రియుడు సాహిల్ శుక్లా మోజులో పడి భర్త సౌరభ్ గుప్తను హత్య చేయించిన కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ముస్కాన్ రస్తోగి అరెస్టు సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమెకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. గర్భధారణ చివరి దశకు చేరుకోవడంతో, భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమెను మీరట్ మెడికల్ కాలేజీకి తరలించారు.ముస్కాన్ సాధారణ ప్రసవం ద్వారా ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రసవం అనంతరం, భద్రతా కారణాల వల్ల వారిని ప్రత్యేక వార్డులో ఉంచారు. ఈ కేసు 2024లో వెలుగులోకి వచ్చింది.సౌరభ్ రాజ్‌పుత్ హత్య అనంతరం, అతని శవాన్ని బ్లూ డ్రమ్‌లో నింపి మాయం చేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు విచారణలో ముస్కాన్ రస్తోగి, ఆమె స్నేహితుడు సహా పలువురిని అరెస్టు చేశారు. శిశువు భవిష్యత్తుపై చర్చ ముస్కాన్ జైలులో శిశువుకు జన్మనివ్వడంతో, బిడ్డను ఎక్కడ ఉంచాలి? ఎవరు చూసుకుంటారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చట్టం ప్రకారం, మహిళా ఖైదీలు తమ పిల్లలను ఆరు సంవత్సరాల వయస్సు వరకు జైలులోనే ఉంచుకునే అవకాశం ఉంది. ముస్కాన్ రస్తోగిపై హత్య, శవాన్ని మాయం చేయడం, కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రసవం అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించే ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు. -
భార్యపై ప్రేమ: నాణేలు కూడబెట్టి..
ఇటీవల కాలంలో భార్య, భర్తకు.. భర్త, భార్యకు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం, సర్ప్రైజ్ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే కొంతమంది భిన్నంగా ఆలోచిస్తారు. దీనికి కారణం వారి ఆర్ధిక స్తోమత కావచ్చు.. లేదా ఇంకేదైనా కారణం కూడా కావొచ్చు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని అహిర్వాన్ ప్రాంతానికి చెందిన 22ఏళ్ల అభిషేక్ యాదవ్.. పాన్ షాప్ నడుపుకుంటూ ఉండేవాడు. ఇతడు ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత తన భార్యకు బంగారు గొలుసు ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. అయితే అతని ఆర్ధిక పరిస్థితి కారణంగా ఒకేసారి గొలుసు కొనలేడు. కాబట్టి డబ్బు కూడబెట్టాలనుకున్నాడు. అప్పటి నుంచి నాణేలను పోగు చేయడం ప్రారంభించాడు. ఏడాది పొడువునా రూ.10, రూ. 20నాణేలను కూడబెట్టాడు.మొత్తం కూడబెట్టిన నాణేల బస్తాలను.. బంగారు ఆభరణాల దుకాణానికి తీసుకెళ్లాడు. బస్తాలను కౌంటర్లో దగ్గర పెట్టాడు. ఇది చూసిన షాప్ యజమాని మహేష్ వర్మ మొదట ఆశ్చర్యపోయాడు. ఇన్ని నాణేలను బ్యాంకు కూడా తీసుకోదని వర్మ.. అభిషేక్‌తో చెప్పాడు. కానీ కొంతసేపటి తరువాత అంగీకరించాడు. మొత్తం నాణేలను లెక్కపెడితే.. రూ. 1.05 లక్షలు ఉన్నాయి. దీనిని లెక్కపెట్టడానికి రెండు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: షఫాలీ వర్మ కొత్త స్పోర్ట్స్ కారు: ధర ఎంతో తెలుసా?అభిషేక్ యాదవ్ తన భార్య కోసం కొన్న గొలుసు రూ. 1.25 లక్షలు. కానీ అతడు తెచ్చిన డబ్బును మహేష్ వర్మ తీసుకుని, మిగిలిన డబ్బును వాయిదాల పద్దతిలో కట్టించుకోవడానికి అంగీకరించాడు. మొత్తానికి యాదవ్ తన భార్య కోసం.. బంగారు గొలుసు కొనేసాడు.A Kanpur Paan sellar saves ₹20 Coins daily to buy ₹1 Lakh Gold Chain as a surprise Gift for his Wife.JEWELLER : I was SHOCKED. It took more than two hours to count all the coins 😳MAN : I’ll present it to her when she returns from her Maayka ♥️ pic.twitter.com/Dr0nMX6htj— News Algebra (@NewsAlgebraIND) November 23, 2025 -
తండ్రి అయ్యే వేళ.. వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ చేయమన్న మేనేజర్
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా.. వర్క్ చేయాలని పట్టుబడుతున్నాయి. తాజాగా ఒక ఉద్యోగికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మేనేజర్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు.నా భార్య ప్రసవ వేదనలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా.. మేనేజర్ వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ చేయమని అన్నారు. ఉద్యోగి ఆ విషయాన్ని రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. ''నా భార్య మా మొదటి బిడ్డ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. నేను మేనేజర్‌కు ఈ విషయం గురించి చెప్పి రెండు రోజులు మాత్రమే సెలవు అడిగాను. అయితే మేనేజర్ సానుభూతి చూపించడానికి బదులు, ఆసుపత్రి నుంచే వర్క్ చేయమని అన్నారు. మా బిడ్డపై ద్రుష్టి పెట్టాల్సిన సమయంలో నేను ఆసుపత్రి గదిలో నా ల్యాప్‌టాప్‌తో కూర్చోవడం సరైంది కాదు. నేను ఉద్యోగాన్ని వదులుకోలేను, ఎందుకంటే.. నా బాధ్యతలు పెరుగుతూనే ఉన్నాయి, నేను వాళ్లకు వ్యతిరేఖంగా మాట్లాడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారేమో అని భయంగా ఉందని'' అన్నారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు మేనేజర్‌పై ఫైర్ అవుతున్నారు. ఎప్పుడూ పని ఉంటుంది. ముందు మీ భార్యను చూడండి అని ఒకరు, భారతదేశంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. నేను ఇండియాలో పనిచేయకపోవడం మంచిది అయిందని ఇంకొకరు అన్నారు. భార్య, బిడ్డ జీవితంలో చాలా కీలకం.. ఆ దిశగా ఆలోచించు అని మరొకరు అన్నారు.ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం! -
LB నగర్ మన్సురాబాద్ వాంబే కాలనీలో దారుణం
-
బతికున్నట్లు నిరూపించుకునేందుకు మూడేళ్లు
అలీగఢ్: అధికారిక రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాకు చెందిన 58 ఏళ్ల సరోజ్ దేవి మూడేళ్ల క్రితమే చనిపోయింది..! అసలు చనిపోయింది నా భర్త..నేను కాదు మొర్రో.. అని అప్పటి నుంచి ఆమె అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటూనే ఉంది. ఎవరూ ఆమె గోడును పట్టించుకున్న పాపాన పోలేదు. చమర్ నగారియా గ్రామానికి చెందిన జగదీశ్ ప్రసాద్ 2020లో చనిపోయాడు. స్థానిక క్లర్కు ఒకరు మృతుల జాబితాలో జగదీశ్ ప్రసాద్ బదులుగా అతడి భార్య సరోజ్ దేవి చనిపోయినట్లుగా 2022 జనవరి ఒకటో తేదీన నమోదు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. సరోజ్ దేవి ఆధార్ నంబర్‌ను డీయాక్టివేట్ అయ్యింది. గుర్తింపునకు సంబంధించిన ఇతర ఆధారలేవీ ఆమెకు లేకుండాపోయాయి. అప్పటి నుంచి ఆమె అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. మూడేళ్లయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. చివరికి ఈ నెల 15వ తేదీన ఖైర్ సబ్ విడిజనల్ మేజి్రస్టేట్ శిశిర్ కుమార్‌కు తెహశీల్ దివస్ సందర్భంగా సరోజ్ దేవి తన సమస్యను వివరించింది. తన గుర్తింపును పునరుద్ధరించాలని, తనను తిరిగి బతికించాలని కోరింది. ఎట్టకేలకు ఆయన స్పందించారు. ప్రాధా న్యం కలిగిన అంశంగా భావించి, పరిష్కా రానికి అవసరమైన చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. రికార్డుల్లో ఇందుకు అవసరమైన దిద్దుబాట్లు చేపట్టామని శిశిర్ కుమార్ తెలిపారు. సమస్య పరిష్కారమై సరోజ్ దేవి త్వరలోనే ప్రభుత్వ రికార్డుల్లో సజీవురాలు అవ్వాలని ఆశిద్దాం.! -
రూ.6 లక్షల జాబ్ ఔట్.. వెంటనే డైవోర్స్!
బంధాలు, ప్రేమానురాగాలు అంతా ఒక బూటకం అన్నాడో సినీ కవి. కానీ చైనాకు చెందిన ఈ భార్యా బాధితుడి వేదన వింటే అది అక్షర సత్యం అనిపించక మానదు. నెలకు రూ. లక్షల్లో జీతమొచ్చే ఉద్యోగం అలా పోయిందో లేదో ఇలా తన భార్య తనకు విడాలిచ్చి వెళ్లిపోయిందని గోడు వెళ్లబోసుకోవడంతో ఇటీవల చైనా అంతటా వైరల్‌గా మారాడు.163.కామ్ ప్రకారం.. కియాన్ కియాన్ అనే 43 ఏళ్ల లా గ్రాడ్యుయేట్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలో పనిచేసేవాడు. నెలకు 50,000 యువాన్లు అంటే రూ.6.23 లక్షలు జీతం. కానీ వివాహం తన జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందంటున్నాడు.ఆమె విలాసవంతమైన ఖర్చుల కోసం పాపం ఉన్న ఒక్క ఫ్లాటునూ అమ్ముకోవాల్సి వచ్చింది. విడాకుల సమయానికి తనకంటూ ఎలాంటి ఆస్తి లేకుండా పోయిందని వాపోయాడు. పాపం మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తమ ఏడేళ్ల సహవాసంలో వాళ్లు దగ్గరైంది 7-8 సార్లు మాత్రమే అంటే ఎవరూ నమ్మరేమో..కియాన్ తన సంపాదనలో ఎక్కువ భాగం తన భార్య కోసమే ఖర్చు చేశాడు. కారణాలు తెలియదు కానీ, పాపం కియాన్ భారీ జీతమొచ్చే ఉద్యోగాన్ని ఐదేళ్ల క్రితం పోగొట్టుకున్నాడు.అప్పటి నుండి డెలివరీ రైడర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడతడి జీతం నెలకు 10,000 యువాన్లు అంటే రూ.1.24 లక్షలే.తన భార్య చాలా సౌందర్యవతి అని చెప్పుకొచ్చిన కియాన్.. తన జీతం తగ్గిపోగానే ఆమె విడాకులు కోరిందని ఘొల్లుమన్నాడు. ‘నేను ప్రేమిస్తున్నది నీ డబ్బునే కానీ, నిన్ను కాదు’ అని ఆమె తెగేసి చెప్పిందని వాపోయాడు.ఇంతా చేస్తున్న ఆమె ఏదైనా పనిచేస్తుందా అంటే అదీ లేదు. కియాన్ కియాన్ సంపాందించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ వచ్చేది.వామ్మో ఇవేమీ ఖర్చులుఆమె పెట్టే ఖర్చుల గురించి వింటే అవాక్కవాల్సిందే. ఆమె దుస్తులు కొన్నప్పుడల్లా ఒక్కోటి మూడు రంగులలో కొనేదట. ఒకసారి ఆమె ఒక్కొక్కటి 15,000 యువాన్లు (రూ.1.87 లక్షలు) పెట్టి రెండు డిజైనర్ బ్యాగులను కొనిందని వాపోయాడు కియాన్.మరో విస్తుపోయే విషయం ఏమిటంటే.. కియాన్ భార్య చేతులు, కాళ్ళకు కూడా ఖరీదైన ఫేషియల్ క్రీములను వాడేదట. ఇక సన్నగా ఉండటానికి ఖరీదైన సప్లిమెంట్లను తీసుకునే ఆమె చాలాసార్లు కాస్మొటిక్ చికిత్సలూ చేయించుకుందట. ఇంత చేసినా ఇప్పటికీ తన మాజీ భార్య అంటే తనకు ద్వేషం లేదంటున్నాడు అమాయక కియాన్కియాన్. -
అక్షర్ పటేల్ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)
-
నడిరోడ్డుపై భార్యను కిరాతకంగా..
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచాడు. మెడపై పొడిచి పీక కోయడంతో ఆ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. విజయవాడ విన్స్ హాస్పిటల్లో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుకున్న భర్త విజయ్.. భార్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా పొడిచాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సరస్వతి దారుణ హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి 14న విజయ్, సర్వసతీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సరస్వతి.. వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తుండగా.. భర్త విజయ్.. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అనుమానం పెనుభూతంగా మారి పట్టపగలే భార్యను విజయ్ దారుణంగా హత్య చేశాడు. భార్య సరస్వతి రెండేళ్ల కుమారుడితో ఒంటరిగా నివాసం ఉంటుందిప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే?కాగా, ప్రత్యక్ష సాక్షి బాలయ్య సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతిని విజయ్ కత్తితో పొడిచిన సమయంలో తాను ఆపే ప్రయత్నం చేశానని తెలిపారు. ‘‘దగ్గరకి వెళ్తే.. మీకు దీని గురించి తెలియదు నన్ను అపకండంటూ విజయ్ గట్టిగా అరిచాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. జైలుకి పంపించింది అందుకే చంపేస్తున్నా అంటూ అరిచాడు. వద్దని వారించిన మెడపై కత్తి తో పొడిచాడు.. పీక కోసి రాక్షసుడిలా బిహేవ్ చేశాడు. ఆసుపత్రిలో సరస్వతి డ్యూటీ పూర్తి చేసుకుని బయటికి వచ్చింది. అప్పుడే కత్తితో దాడి చేశాడు‘‘ అని బాలయ్య వివరించారు. -
ప్రియుడి కోసం... భర్త ఖతం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి గుట్టుగా నడుపుతున్న ప్రేమ వ్యవహారం ఆమె భర్తకు తెలిసింది. దీనిని గ్రహించిన ఆమె భర్త ఎక్కడ రచ్చ చేస్తాడోనని భయపడి, అతనిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడి సాయం తీసుకుంది. ఒక ప్లాన్ ప్రకారం భర్త అడ్డు తొలగించుకుంది. అయితే ఆ తర్వాత చట్టం ఏం చేసింది?ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఒక యువకుని మృతదేహం అతను ఉంటున్న గ్రామం వెలుపలి పొలంలో పోలీసులకు కనిపించింది. మృతదేహంపై మూడు బుల్లెట్ల గుర్తులు కనిపించాయి. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత దీనిని దోపిడీ కోసం చేసిన హత్యగా భావించారు. అయితే తదుపరి దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పోలీసులు అగ్వాన్పూర్ గ్రామంలో ఉంటున్న మృతుడి భార్య అంజలి విచారించేందుకు ఉపక్రమించగా, ఆమె ఇంటి నుంచి పరారైనట్లు తేలింది. అయితే అంజలికి అదే గ్రామానికి చెందిన అజయ్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు కనుగొన్నారు.దీంతో పోలీసులు అజయ్‌ను విచారించేందుకు ప్రయత్నించారు. అయితే అతను కూడా ఇంట్లో లేడని తెలిసింది. ఈ జంట అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తరువాత పోలీసులు వారికోసం వెదుకులాట సాగించి, ఎట్టకేలకు అదుపులోనికి తీసుకున్నారు. విచారణ సమయంలో అజయ్ నిజం వెల్లడించాడు. అంజలి భర్త రాహుల్ తమ సంబంధం గురించి తెలుసుకున్నాడని, దీంతో అంజలి కలత చెందిందని, తరువాత ఆమె భర్తను చంపేందుకు ఒక ప్లాన్ చేసిందని అతను చెప్పాడు. ఈ నేపధ్యంలోనే అజయ్ స్వయంగా రాహుల్‌ను పొలాల దగ్గర కలుసుకుందామని చెప్పాడు. అతను రాగానే అతనిపై రాహుల్ మూడుసార్లు తుపాకీ కాల్పులు జరిపాడని దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: ట్రంప్‌కు ‘శాంతి బహుమతి’?.. డిసెంబర్ ఐదున ప్రదానం -
బాడీషేమింగ్ చేస్తే తక్షణ శిక్ష తప్పదు!
మామూలుగానైతే భార్య మొబైల్ నంబరును సేవ్ చేసుకోడానికి ‘జానూ’, ‘సోనా’ అనో లేదా ‘బంగారం’ అనో... ఇలా రకరకాల ముద్దు పేర్లు పెట్టుకుంటుంటారు. మరికొందరు శిరీషకు ‘సిరి’ అనీ, దీపికకు ‘దీపూ’ అంటూ షార్ట్‌కట్‌లో షార్ట్ పేర్లూ పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే. కాపురంలో కొద్దికాలం గడిచాక ఆమెలో నచ్చని అంశాలేవైనా కనిపించినా సదరు ముద్దుపేర్లకు బదులుగా తన కోపాన్నీ, కసినీ సైలెంటుగా వెల్లడించుకునేలా ‘దెయ్యం’ అనో, ‘రాక్షసి’ అంటూ వయొలెంటు పేర్లు పెట్టుకోవాలనుకున్నా అలా చేయకపోవడమే మంచిదంటూ టర్కీలో జరిగిన ఓ ఉదంతం తెలుపుతోంది. టర్కీలో ఓ ప్రబుద్ధుడికి భార్య మీద కోపం వచ్చింది. ఆమె కాస్తంత లావుగా ఉండటంతో ఆమె పేరును ‘టాంబిక్’ అంటూ సేవ్ చేసుకున్నాడు ఆ మహానుభావుడు. అంతే... ఆ అంశం మీద అతడికి జరిమానా విధిస్తూ... అతడి వల్ల తన భార్యకు కలిగిన మనోవేదనకు గాను పరిహారం, విడాకులూ మంజూరయ్యాయి. ఇంతకీ ‘టాంబిక్’ అంటే టర్కీలో స్థూలకాయాన్ని (ఛబ్బీ) తెలిపే పదం. ఇది కేవలం స్థూలకాయాన్ని సూచించే పదం మాత్రమే కాదు... ఏ ‘బండ’దనో, ‘మొద్దు’దనో, ‘లడ్డు’దనో... ఇలా కాస్తంత దురర్థమో, నిందార్థమో ఇచ్చేలాంటి వాడుక మాట కావడంతో... అలా సేవ్ చేసుకున్న ఆ భర్తకు కోర్టులో మొట్టికాయలు తప్పలేదు. పైగా ఓ అమ్మాయి స్థూలకాయాన్ని ఎగతాళి చేసేలా ఆమె పేరును అభ్యంతరకరమైన పదాలతో సేవ్ చేసుకున్నందుకు ఆ భర్తకు భారీ జరిమానా విధించింది అక్కడి కోర్టు. అంతేకాదు.. పరోక్ష దూషణే అయినా... ఫోన్లో అలాంటి అభ్యంతరకరమైన మాటతో భార్యపేరు సేవ్ చేసుకున్నందున ఆమెకు కలిగిన మనోవేదనను పరిగణనలోకి తీసుకుని వెంటనే విడాకులు సైతం మంజూరు చేసింది టర్కీ కోర్టు. (చదవండి: మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!) -
మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’
న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) చారిత్రాత్మక విజయం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆది నుంచి చురుకైన ఉపన్యాసాలు, పదునైన విమర్శలతో దూసుకుపోయిన మామ్దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే ఆయన ఈ విజయం వెనుక ప్రముఖంగా నిలిచింది ఎవరో తెలుసా?జోహ్రాన్ మమ్దానీ భార్య కళాకారిణి, యానిమేటర్, రైటర్ రమా దువాజీ (Rama Duwaji). భర్త విజయంలో తన వంతు ప్రచారంలో కీలక భూమిక నిర్వహించారు. ప్రచార లోగోలు, ప్రచారం మొత్తాన్ని ఆకర్షణీయంగా రూపొందించడంలో ఆమెదే కీలక పాత్ర. లోగోలో బోల్డ్ ఎల్లో, నారింజ, నీలం రంగుల్లో బ్రాండింగ్ అనేది ఆయన ఉద్యమానికి పర్యాయపదంగా మారిందని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనతాను ఎక్కువగా వెలుగులోకి రాకుండానే రమా దువాజీ నిశ్శబ్దంగా తెర వెనుక ఉంటూనే భర్త విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. డెమొక్రాటిక్ సోషలిస్ట్ విలక్షణమైన ప్రచార గుర్తింపు, సోషల్ మీడియా ఉనికిని రూపొందించడంలో తన ఘనతను చాటుకున్నారు. ఎన్నికల రోజు వరకు జరిగే చర్చలు, ప్రచార కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండేవారు.. అలాగే మేయర్ రేసు గురించి ఆన్లైన్లో అరుదుగా పోస్ట్ చేసేవారు. అయితే మమ్దానీ ఆశ్చర్యకరమైన ప్రాథమిక విజయం తర్వాత జూన్‌లో ఆమె ఎన్నికలకు సంబంధించిన ఏకైక సోషల్ మీడియా పోస్ట్ విశేషంగా నిలిచింది. “ఇంతకంటే గర్వం కారణం ఏముంటుంది.” ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. చదవండి: పనస కాయ చిప్స్‌తో ఏడాదికి రూ. 12 లక్షలుతాజాగా మంగళవారం నాటి ఓటింగ్ సమయంలో మమ్దానీ తన ఓటు వేసే క్రమంలో భర్తకు అండగా నిలిచారు. ది డైలీ షోలో కనిపించినప్పుడు భర్త పక్కనే కొండంత అండగా ఉండటంతోపాటు, క్వీన్స్‌లోని ఫారెస్ట్ హిల్స్ స్టేడియంలో ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, సెనేటర్ బెర్నీ సాండర్స్తో కలిసి మమ్దానీ తన చివరి ర్యాలీ ప్రసంగం సమయంలో కూడా 10వేల మంది మద్దతుదారులతో పాటు ఆమె కూడా కనిపించింది. దువాజీ న్యూయార్క్ కు చెందిన సిరియన్-అమెరికన్ ఆర్టిస్ట్ దువాజీ. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్‌కు వెళ్లినా ఆమె డల్లాస్‌లో పెరిగారు. దుబాయ్‌లో చదివారు. ఆమె అనేక జర్నల్స్‌ను కూడా ప్రచురించారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి మమ్దానీ ఎన్నికైనపుడు 2021లో దువాజీ, మమ్దానీ డేటింగ్ యాప్ హింజ్‌లో కలుసుకున్నారు. వారి మొదటి డేట్ బ్రూక్లిన్‌లోని యెమెన్ కేఫ్ అయిన క్వాహ్వా హౌస్‌లో జరిగింది. మమ్దానీ తన మేయర్ ప్రచారాన్ని ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 2024లో వారు నిశ్చితార్థం చేసుకున్నారు. గత డిసెంబర్లో దుబాయ్‌లో వేడుకలు జరుపుకున్న తర్వాత, ఫిబ్రవరిలో లోయర్ మాన్‌హట్టన్‌లోని ఒక సాధారణ కోర్టు హౌస్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. దువాజీ సోషల్ మీడియా ఫీడ్ అంతా సిరామిక్, ఇలస్ట్రేషన్ వర్క్స్‌తో నిండి ఉంటాయి. పాలస్తీనాతో సంఘీభావాన్ని వ్యక్త పరిచే అనేక రచనలు కూడా చూడొచ్చు. ఆమెకు పెరుగుతున్న ప్రజా ఆకర్షణ, ఆదరణపై స్పందించిన స్నేహితులు మెడ్రన్ డే ప్రిన్సెస్ డయానా అంటూ ముద్దుగా పిలుచుకోవడం విశేషం. -
బెంగళూరు డాక్టర్ కేసులో ట్విస్ట్ : ప్రియురాలికి షాకింగ్ మెసేజ్
కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చిన బెంగళూరుకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి కేసులో మరో కీలక సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. చర్మవ్యాధి నిపుణురాలైన భార్య డాక్టర్ కృతిక రెడ్డిని మత్తుమందిచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నమహేంద్ర రెడ్డి నేరం చేసిన కొద్దిసేపటికే "నీకోసమే నా భార్యను చంపేశాను" అనే సందేశాన్ని ప్రియురాలికి పంపించిన వైనం కలకలం రేపుతోంది.దర్యాప్తు అధికారుల ప్రకారం, డిజిటల్ చెల్లింపు యాప్‌లో పనిచేసే మహిళతో రిలేషన్షిప్లో ఉన్నాడు మహేంద్ర రెడ్డి. భార్య చనిపోయిన వెంటనే ఆమెకు వాట్సాప్ ద్వారా నీకోసమే భార్యను చంపేశాననే మెసేజ్‌ను పంపించాడు. నిందితుడు ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణ సమయంలో పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆ మహిళను విచారించి ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ మహిళ ఎవరు? ఏంటి? అనే విషయాలను ఇంకా వెల్లడించలేదు.కాగా బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో జనరల్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ మహేంద్ర రెడ్డి, డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృతిక రెడ్డికి గత ఏడాది మే 26న వివాహం జరిగింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 21న మున్నెకొల్లాల్‌లోని వారి నివాసంలో కృతిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై మరాఠహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతని ఇంట్లో సోదాలు చేసినపుడు కాన్యులా సెట్, ఇంజెక్షన్ ట్యూబ్ ,ఇతర వైద్య వస్తువులతో సహా కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి అంతర్గత అవయవాల నమూనాలను కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ నివేదిక అసలు నిజాన్ని బయటపెట్టడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు కృతిక శరీరంలో 'ప్రోపోఫాల్' అనే శక్తిమంతమైన అనస్థీషియా ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఇది హత్యేనని నిర్ధారణ కావడంతో మృతురాలి తండ్రి అక్టోబర్ 13న తన అల్లుడే మత్తుమందు ఇచ్చి కూతురిని హత్య చేశాడని ఫిర్యాదు నమోదు చేశారు. తన భార్య మరణాన్ని సహజంగా చూపించడానికి అతను తన వైద్య నైపుణ్యాన్ని ఉపయోగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అక్టోబర్ 14న కర్ణాటకలోని మణిపాల్‌లో ఉన్న నిందితుడు మహేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. -
మా నాన్న ఎలా చంపాడంటే..
-
భర్త ఎంపీడీవో.. భార్య మాత్రం ఇలా.. బస్టాండ్‌లో ఏం జరిగిందంటే?
సాక్షి, విజయవాడ: తన భర్త ప్రభుత్వ ఉద్యోగి.. భార్య మాత్రం తన స్థాయిని మర్చిపోయింది. చిల్లర పనులకు దిగజారింది. బస్టాండ్‌లో తోటి ప్రయాణికురాలి వద్ద ఎంపీడీవో భార్య.. పర్సును దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. బస్సు ఎక్కే క్రమంలో ఒక నర్సు నుంచి పర్సు దొంగతనం చేసింది. ఈ విషయం తెలిసినా కూడా దొంగతనాన్ని దాచిపెట్టి భార్యను ఎంపీడీవో ప్రోత్సహించారు.బాధిత నర్సు ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్‌లను కృష్ణలంక పోలీసులు పరిశీలించారు. నర్సు చేతిలో ఉన్న బ్యాగ్‌ను ఎంపీడీవో భార్య అదే పనిగా చూస్తుండటం.. బస్సు ఎక్కే సమయంలో నర్సు వెనుకే ఆమె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యూనిఫాం ఆధారంగా కుమార్తె చదివే కళాశాలకు వెళ్లి విచారణ చేసిన పోలీసులు.. గుంటూరులో ఎంపీడీవోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని ప్రశ్నిస్తున్నారు. -
నీకు భార్య, పిల్లలు ఉన్నారు కదా.. జోగి రమేష్ అరెస్ట్ పై భార్య ఎమోషనల్..


