Delhi High Court
-
‘సుప్రీం’లో ఆప్ సర్కార్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు విషయంలో ఢిల్లీ ఆప్ ప్రభుత్వానికి ఊరట లభించింది. పథకానికి సంబంధించిన ఎంవోయూపై ప్రభుత్వం సంతకాలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బలవంతంగా సంతకం చేయించడం ఏంటన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ.. నిలుపుదల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీకల్లా దేశ రాజధానిలో ఈ పథకం ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఎంవోయూపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయాలని కిందటి నెలలో ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఆప్ సర్కార్ ఓ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. శుక్రవారం హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ పిటిషన్‌పై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat Health Infrastructure Mission (PM-ABHIM) scheme) పథకాన్ని కేంద్ర ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఢిల్లీలోనూ దీనిని ప్రవేశపెట్టాలని చూసింది. అయితే దేశ రాజధానికి దీని అవసరం లేదని, ఇక్కడి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోనే ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారంటూ ఆప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రమంగా ఇది రాజకీయ దుమారం రేపింది.దీనిపై బీజేపీ ఎంపీలు హైకోర్టులో పిటిషన్ వేయగా.. పథకాన్ని వర్తింపజేయాలని హైకోర్టు ఆదేశించింది. తదనంతరం బీజేపీ ఆప్ మధ్య మాటలు తుటాలు పేలాయి. అయితే సుప్రీం కోర్టులో ఆ ఆదేశాలకు బ్రేకులు పడ్డాయి. సుప్రీం కోర్టులో ఆప్ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.ఏమిటీ పథకం.. పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడమే ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఉద్దేశం. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్లమంది సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఒక అంచనా. ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్ధులు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి పొందుతారు. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్యబీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది. సీజీహెచ్ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని గానీ ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారూ ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు. ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్ ఒక్కటే సరిపోతుందని ఇటీవల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. -
మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు
కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది. మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవనే దీనికి కారణం. ఈ వివాదంలో బోలెడన్ని టర్న్స్, ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తండ్రి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారనే రూమర్స్, పరస్పరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం.. మధ్యలో ఊహించని విధంగా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి, ఆపై పోలీసు కేసు.. ఇది కాదన్నట్లు అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరి, కొన్నిరోజులకు డిశ్చార్జ్ కావడం.. ఇలా ఒకటేమిటి ఇండస్ట్రీ మొత్తం ఈ వివాదం గురించే చర్చించుకున్నారు. ప్రస్తుతానికి ఇది కాస్త సద్దుమణిగినట్లే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?)జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు ఓవైపు నడుస్తోంది. మరోవైపు తన ఫొటోలు, వాయిస్ రికార్డింగ్స్‌ని గూగూల్, సోషల్ మీడియాలో ఉపయోగించద్దని ఢిల్లీ హైకోర్ట్‌లో ఈయన పిటిషన్ వేశారు. దీనికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. మోహన్ బాబు కంటెంట్‌ని గూగుల్ నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో మంచు ఫ్యామిలీ వివాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్.. గూగుల్ నుంచి డిలీట్ అవుతాయి.(ఇదీ చదవండి: శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో) -
బెయిలొస్తదేమోనని మనం కూడా గందరగోళంలోనే ఉన్నాం!
-
కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?.. ఈడీని ప్రశ్నించిన కోర్టు
ఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్ చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించింది. మీరు(ఈడీ) ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగింది.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టుకు ఇచ్చిన బెయిల్‌ను ఈడీ సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఈడీ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ విషయంలో నేను అయోమయంలో ఉన్నాను. మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు. కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్టు చేయాలనుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నించారు. అనంతరం విచారణను సెప్టెంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా..మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేసింది. కాగా రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలను వినే వరకు కేజ్రీవాల్‌కు కల్పించిన బెయిల్ ఉపశమనంపై మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
సాక్షి,ఢిల్లీ : ఢీల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన సీబీఐ అరెస్ట్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది.ఢిల్లీ లిక్కర్ కేసులో రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ ప్రారంభిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ దర్యాప్తులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఆయన ఇంకా తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగాల్సి వచ్చింది. సీబీఐ కేసులో బెయిల్ వస్తేనే కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. -
టీఎంసీ ఎంపీకి షాక్.. రూ. 50 లక్షలు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సాకేత్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. లక్ష్మీ పురికి క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. క్షమాపణలను ప్రముఖ జాతీయ వార్తాపత్రికలో ప్రచురించాలని, ఆరు నెలల పాటు సోషల్ మీడియాలో కూడా ఉంచాలని సూచించింది. ఎనిమిది వారాల్లోగా ఈ ఉత్తర్వును పాటించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.కాగా, 2021 జూన్ 13, 26న సాకేత్ గోఖలే వివాదస్పద ట్వీట్లు పోస్ట్ చేశారు. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి తన ఆదాయానికి మించి స్విట్జర్లాండ్‌లో ఆస్తిని కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆమె భర్త, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గురించి కూడా ఆ ట్వీట్లలో ప్రస్తావించారు.ఈ నేపథ్యంలో అదే ఏడాది లక్ష్మీ పురి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలేపై పరువునష్టం దావా వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. -
ఉత్కంఠ: కేజ్రీవాల్ బెయిల్‌పై తుది తీర్పు రేపు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూన్25) తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఈడీ హైకోర్టుకు వెళ్లడంతో దానిని ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.దీనిపై సోమవారం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతర స్టేపై తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతే విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఏం తేలుస్తుందనేదానిపై ‘ఆప్’ పార్టీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. -
Delhi liquor scam: జైల్లోనే కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మరికొన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఈ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచి్చన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సు«దీర్‌కుమార్ జైన్, జస్టిస్ రవీందర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించడానికి సరైన అవకాశం లభించలేదన్నారు. తమ వాదనల సమయంలో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తొందరపెట్టారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఈ కేసులో వాస్తవాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బెయిల్‌ను రద్దు చేయడానికి ఇంతకంటే మంచి కేసు ఇంకొకటి ఉండదన్నారు. అనంతరం ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ‘‘ట్రయల్ కోర్టు ఆర్డర్‌పై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వివరణాత్మక ఆదేశాల నిమిత్తం తీర్పు రిజర్వ్ చేస్తున్నాం. మొత్తం రికార్డులను పరిశీలించాల్సి ఉంది కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తాం. అప్పటివరకూ ట్రయల్ కోర్టు ఆదేశాల అమలుపై మధ్యంతర స్టే విధిస్తున్నాం’’ అని వెల్లడించింది. ఈడీ పిటిషన్‌పై స్పందించాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేసింది. -
తెలుగు వెబ్‌సిరీస్ తొలగించాలని కోర్టులో పిటిషన్
పాకెట్ఎఫ్ఎం సంస్థ తన ఆడియో సిరీస్ కాపీరైట్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు వెంటనే స్పందించి సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.పిటిషన్‌లోని వివరాల ప్రకారం..ఆన్లైన్ ఆడియో ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ పాకెట్ఎఫ్ఎం తన ఆడియో సిరీస్ 'యక్షిణి'ని పెయిడ్ కస్టమర్లకు అందిస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కాపీరైట్ హక్కులు సంస్థ కలిగి ఉంది. ఇటీవల వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ ‘యక్షిణి’ని పోలిఉండే వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదల చేసింది. పాకెట్ఎఫ్ఎం వెంటనే దాన్ని సదరు ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని కోరుతూ జూన్ 11న దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.ఇదిలాఉండగా, జూన్ 14 నుంచి ఈ తెలుగు వెబ్‌సిరీస్ ప్రారంభం కాబోతుందని డిస్నీ+ హాట్‌స్టార్ ప్రకటించింది. దాంతో పాకెట్ఎఫ్ఎం డిస్నీ+ హాట్‌స్టార్ మాతృసంస్థ అయిన నోవీ డిజిటల్ ఎంటర్టైన్మెంట్పై కోర్టులో దావా వేసింది. వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను తొలగించేలా సంస్థను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించింది.ఇదీ చదవండి: సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్‌లు పంపాలా..?ఈ వ్యాజ్యం గురువారం జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై డిస్నీ+ హాట్‌స్టార్ తన ప్రత్యుత్తరాన్ని దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మే 2021 నుంచి పాకెట్ఎఫ్ఎం ప్లాట్ఫామ్లో ‘యక్షిణి’ ఆడియో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. -
ఢిల్లీ హైకోర్టులో ఎలోన్ మస్క్ పిటిషన్.. ఎందుకంటే
టెస్లా పవర్ ఇండియా కంపెనీకి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంస్థ పేరు మీద ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఉంటే వాటి అమ్మకాలతో సహా ఇతర వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. గురుగావ్ కేంద్రంగా సేవలందిస్తున్న టెస్లా పవర్ ఇండియాపై అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన దావాపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఢిల్లీ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. టెస్లా పవర్‌పై కేసును హైకోర్టు గురువారం విచారించనుంది.టెస్లా కంపెనీ ట్రేడ్ మార్క్‌తో భారత్‌లోని స్థానిక సంస్థ టెస్లా పవర్ ఇండియా వినియోగిస్తోందని, దీనిపై గందరగోళం నెలకొందని.. వ్యాపార ప్రయోజనాలకు హాని కలిగిస్తోందని వాదించింది. అంతేకాదు టెస్లా పవర్ బ్యాటరీలపై తమకు (టెస్లా-యూఎస్) ఫిర్యాదులు అందుతున్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో టెస్లా వెల్లడించింది. టెస్లా పవర్ బ్యాటరీలు ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీవేనని ప్రచారం చేయడం, లోగోను వినియోగించుకున్నట్లు హైలెట్ చేసింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మస్క్ తరుపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేసింది. -
ఆ మూడు కేసుల్లోనూ ‘పిన్నెల్లి’కి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి
సాక్షి, అమరావతి: ఈవీఎంల ధ్వంసం కేసులో హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు వేర్వేరుగా మరో మూడు కేసులు నమోదు చేయడాన్ని సవాలుచేస్తూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హత్యాయత్నం చేశానంటూ నమోదు చేసిన ఈ కేసుల్లో తనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఆదివారం అయినప్పటికీ ఈ వ్యాజ్యాల అత్యవసర దృష్ట్యా న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తన ఇంటి వద్దే విచారణ చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు వాదనలు కొనసాగాయి. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది..పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసి తీరాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అసాధారణ రీతిలో వ్యవహరిస్తోందన్నారు. ఎప్పుడూ కూడా ఎన్నికల కమిషన్ ఇలా వ్యవహరించలేదన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ కక్ష సాధింపు ధోరణి చూపుతోందని.. తన పరిధి దాటి వ్యవహరిస్తోందని తెలిపారు. పిన్నెల్లి అరెస్టు విషయంలో డీజీపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అది ఎందుకో అర్థంకావడం లేదన్నారు.ఈవీఎంల ధ్వంసం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే తెల్లారేలోపు పిన్నెల్లిపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. అప్పటివరకు ఆ కేసుల గురించి కనీన ప్రస్తావన కూడా తేలేదన్నారు. ఘటన 13న జరిగితే పది రోజుల తరువాత పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. అలాగే, మరో కేసును కూడా ఘటన జరిగిన పది రోజుల తరువాత నమోదు చేశారని తెలిపారు. ఓ కేసులో ఫిర్యాదుదారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. హత్యాయత్నం చేశారని పది రోజుల తరువాత ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తి, ఘటన జరిగిన రోజునే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. కట్టుకథ అల్లి, ఎలాగైనా పిన్నెల్లిని అరెస్టుచేయాలన్న దురుద్దేశంతోనే ఈ కేసులు నమోదు చేశారని నిరంజన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ మూడు కేసులు కూడా ఎన్నికలకు సంబంధించినవేనని.. ఒకే అంశంపై మూడు ఎఫ్ఐఆర్లు చెల్లవన్నారు.కేసుల నమోదులో పది రోజుల జాప్యం ఎందుకు జరిగిందో చెప్పడంలేదన్నారు. పిన్నెల్లి దాడిచేశారని చెబుతూ ఓ నిమిషం వీడియోను బయటపెట్టారని, వెబ్‌క్యాస్టింగ్ ఉన్నప్పుడు మొత్తం వీడియోను పరిశీలించి ఆ తర్వాతే చర్యలు తీసుకుని ఉండాల్సిందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు మూడు కేసులు పెట్టారని, రేపు ఇంకొన్ని కేసులు పెడతారని, వీటి వెనుక ఎవరున్నారో పోలీసులకు బాగా తెలుసునన్నారు.అలా చేయడం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను అవమానించడమే..ఈ కేసులో డీజీపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అందుకే రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) ఉండగా, పోలీసుల తరఫున వాదనలు వినిపించుకునేందుకు మరో ప్రైవేటు న్యాయవాదిని నియమించుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇలా చేయడం పీపీని అవమానించడమేనన్నారు. ఒకవేళ ప్రైవేటు న్యాయవాది ప్రత్యేకంగా వాదనలు వినిపించాలనుకుంటే అందుకు ప్రభుత్వం జీఓ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితి లేకపోవడంతో, ఫిర్యాదుదారు అయిన పోలీసు తరఫున ఆ న్యాయవాది హాజరవుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి తమ ముందస్తు బెయిల్‌ను పీపీ తీవ్రంగా వ్యతిరేకించారని, అయినా కూడా ఓ ప్రైవేటు న్యాయవాదిని నియమించుకోవాలని ప్రయత్నించారంటే తెర వెనుక ఎంత వ్యూహ రచన జరుగుతోందో అర్థంచేసుకోవచ్చునన్నారు.ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు అరెస్టు నుంచి రక్షణనిచ్చారని, ఈ కేసుల్లో కూడా అలాంటి రక్షణనే ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి కోర్టును అభ్యర్థించారు. అలాగే, హత్యాయత్నం చేశారని చెప్పినంత మాత్రాన ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని.. అందుకు నిర్ధిష్ట విధానం ఉందని ఆయన వివరించారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిన్నెల్లిపై మరో కేసు పెట్టారని, ఇది ఎంతమాత్రం చెల్లదన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా పిన్నెల్లిని నిలువరించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్, పోలీసులు పనిచేస్తున్నారని న్యాయమూర్తికి నిరంజన్‌రెడ్డి తెలిపారు.పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారు..తరువాత పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసే సందర్భంలో పిన్నెల్లిపై నిఘా పెట్టాలని ఈ కోర్టు పోలీసులను ఆదేశించిందన్నారు. అయితే, ఇప్పటివరకు పిటిషనర్ ఆచూకీ తెలీలేదని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనన్నారు. దర్యాప్తులో వెలుగుచూసిన వాస్తవాల ఆధారంగా కేసులు పెట్టామని తెలిపారు. పిన్నెల్లి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని, అందువల్ల ఆయన మధ్యంతర ముందస్తు బెయిల్‌కు అర్హుడు కారన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామన్నారు. కౌంటింగ్ రోజున మరిన్ని అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు.పిన్నెల్లిని ఎప్పుడు నిందితుడిగా చేర్చారో చెప్పండి..ఈ సమయంలో సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే ఈ కేసులు పెట్టారని, ఆ విషయం తెలిసి కూడా తామెలా బయటకు రాగలమన్నారు. ఈ కేసులన్నీ కూడా పాత తేదీలతో నమోదు చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. క్రైం నెంబర్ 59లో పిన్నెల్లిపై ఎప్పుడు కేసు నమోదు చేశారని ప్రశ్నించారు. 23న చేశారని నిరంజన్‌రెడ్డి చెప్పగా, కాదని 22నే చేశామని పీపీ నాగిరెడ్డి చెప్పారు. ఇది పచ్చి అబద్ధమని, ఈవీఎంల కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన తరువాతే పిన్నెల్లిని నిందితునిగా చేర్చారన్నారు. ఇక్కడే పోలీసుల కుట్ర బయటపడుతోందన్నారు. పోలీసులు పీపీకి సైతం వాస్తవాలు చెప్పడంలేదన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించారన్నారు.పిన్నెల్లి చరిత్రను చూడండి..అనంతరం.. సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది ఎన్. అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ, ముందస్తు బెయిల్ మంజూరు చేసేటప్పుడు పిటిషనర్ పిన్నెల్లి చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఇలాగే ఆయన పలు నేరాలకు పాల్పడ్డారన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి, క్రైం నెం 59లో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పీపీని ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.అస్మిత్ విషయంలో మాట్లాడని పోలీసులుఇక తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో ఆయనకు హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు ఎక్కడా కూడా ఆయన ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించలేదు. కేవలం షరతులు విధించాలని మాత్రమే కోరారు. అదే సమయంలో ఈవీఎంల కేసులో పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. వాస్తవానికి.. ఆ కేసులో పిన్నెల్లిపై హత్యాయత్నం ఆరోపణలు లేవు. కానీ, టీడీపీ అభ్యర్థి అస్మిత్‌పై ఉన్నాయి. అయినా కూడా పోలీసులు అస్మిత్ విషయంలో ఓ రకంగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి విషయంలో మరో రకంగా వ్యవహరించారు. ఇదంతా కూడా పోలీసులు కావాలనే చేస్తున్నారనేందుకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.పోలీసుల తరఫున ప్రైవేటు న్యాయవాది అసాధారణం..ఇదిలా ఉంటే.. పిన్నెల్లి విషయంలో పోలీసు ఉన్నతాధికారుల చర్యలు అసాధారణంగా ఉన్నాయి. అందుకు ఆదివారం హైకోర్టులో జరిగిన పరిణామాలే నిదర్శనం. ఫిర్యాదుదారుగా ఉన్న పోలీసు తరఫున ఓ ప్రైవేటు న్యాయవాది హాజరుకావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలీసు ఫిర్యాదుదారుగా ఉన్న కేసుల్లో ఇప్పటివరకు ఆ పోలీసు తరఫున ప్రైవేటు న్యాయవాది హాజరైన ఉదంతాలు హైకోర్టు చరిత్రలో ఇప్పటివరకు లేవు. సాధారణంగా పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటరే హాజరవుతుంటారు. అయితే, పిన్నెల్లి విషయంలో డీజీపీ కార్యాలయం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది.కారంపూడి కేసులో ఫిర్యాదుదారు అయిన సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరయ్యారు. వాస్తవానికి.. పిన్నెల్లిపై ఉన్న కేసుల్లో పోలీసుల తరఫున వాదనల కోసం అశ్వనీకుమార్నే నియమించుకోవాలని డీజీపీ కార్యాలయం భావించింది. అయితే, అందుకు ప్రభుత్వం జీఓ జారీచేయాల్సి ఉండటంతో వారి ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. చివరకు నారాయణస్వామి తరఫున అశ్వనీకుమార్‌ను రంగంలోకి దించారు.అశ్వనీకుమార్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు అత్యంత సన్నిహితుడు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు రమేష్‌కుమార్ ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదిగా అశ్వనీకుమార్‌ను నియమించారు. తన పదవీ విరమణ తరువాత కూడా వ్యక్తిగతంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేసులు అశ్వనీ వాదించారు. ఇప్పుడు పిన్నెల్లి కేసులో అశ్వనీకుమార్ తెరపైకి రావడం వెనుక కూడా నిమ్మగడ్డ ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. అలాగే, టీడీపీ, జనసేన నాయకుల తరఫున కూడా అశ్వనీకుమార్ కేసులు వాదించారు. -
విదేశాలకు పారిపోతారేమో.. అష్నీర్ దంపతులకు ఢిల్లీ హై కోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అష్నీర్ దంపతులు త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. అయితే వాళ్లిద్దరూ అమెరికాకు వెళ్లే ముందే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.80 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.దీంతో పాటు అష్నీర్, మాధురీలకు యూఏఈ గోల్డెన్ వీసా ఉంది. ఈ వీసా ఉన్న వారికి యూఏఈ ప్రభుత్వం తమ దేశ పౌరులుగా గుర్తిస్తూ వారికి ఎమిరేట్స్ కార్డ్ అనే ఐడెంటిటీ కార్డ్ ఇస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఎమిరేట్స్ కార్డ్‌ను కోర్టుకు సబ్మిట్ చేయాలని సూచించింది. అర్హులైన ఈ కార్డ్ దారులు 10ఏళ్ల పాటు యూఏఈ దేశ పౌరులుగా గుర్తింపు లభిస్తుంది.కేసేంటిభారత్పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది.విదేశాలకు వెళ్లేందుకు ఈ తరుణంలో అమెరికాలో ఉన్న కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జూన్ 17 నుండి జూన్ 25 వరకు బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సమ్మర్ కోర్సు, నేషనల్ స్టూడెంట్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ కోసం తమ కుమారుడికి ఆహ్వానం అందిందని పిటిషన్లో పేర్కొన్నారు. విదేశాలకు పారిపోతేఈఓడబ్ల్యూ తరఫు న్యాయవాది ఈ పిటిషన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అష్నీర్‌కు, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే, వారు దేశానికి తిరిగి రాకపోయే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు అష్నీర్ దంపతుల న్యాయవాది దంపతులు దేశం విడిచి పారిపోరని, కలిసి ప్రయాణించే బదులు విడివిడిగా వెళ్లేందుకు అనుమతించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.షరతులు వర్తిస్తాయ్అయితే వారి ప్రయాణానికి సంబంధించి కొన్ని షరతులు విధించింది. అష్నీర్ గ్రోవర్, మాధురి జైన్ గ్రోవర్లు విదేశాలకు ఎప్పుడు వెళ్లాలన్న వారి ప్రయాణ ప్రణాళికలు, వారి ప్రయాణం, వసతి, ఖర్చులతో ఇలా మొత్తం సమాచారాన్ని కోర్టు, దర్యాప్తు అధికారులకు అందించాలని తీర్పులో వెలువరించింది. విదేశాలకు విడివిడిగానే కోర్టు ఆదేశాలతో అష్నీర్ గ్రోవర్ మే 26న అమెరికాకు వెళ్లి జూన్ 14న తిరిగి రావాల్సి ఉండగా, మాధురీ జైన్ జూన్ 15న ప్రయాణించి జూలై 1న తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. -
కవిత బెయిల్ పై ఉత్కంఠ
-
కవిత పూర్తి పాత్రను బయటపెట్టిన సీబీఐ
-
Delhi High Court : జేమ్స్‌బాండ్ సీక్వెల్సా?
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ పదేపదే పిటిషన్లు దాఖలవడంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ వేసిన ఈ తరహా పిటిషన్‌పై ఆగ్రహం వెలిబుచ్చింది. ‘‘దీనిపై ఢిల్లీ లెఫ్ట్గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని గతంలోనే స్పష్టం చేసినా పదేపదే అవే పిటిషన్లు వేస్తున్నారు. ఇవేమీ జేమ్స్‌బాండ్ సినిమా సీక్వెల్స్ కావు. వ్యవస్థను వెక్కిరించేలా పిటిషన్లు వేస్తే ఊరుకోం. మీకు రూ.50,000 జరిమానా వేస్తాం’’ అని సందీప్‌ను హెచ్చరించింది. ఆయన తరఫున లాయర్ వాదించబోయినా, ‘‘రాజకీయ ప్రసంగాలు ఇవ్వాలనుకుంటే వీధి చివరికెళ్లి ఇచి్చ రండి. మీ క్లయింట్ నేత కాబట్టి రాజకీయాలు చేస్తారు. మేం రాజకీయాల్లో మునగదల్చుకోలేదు’’ అని స్పష్టం చేసింది. -
బాబుకు ‘ఈడీ’ వేడి
సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది! హవాలా మార్గంలో అక్రమ నిధులు పొందే రాజకీయ పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్లు ఆధారాలున్నందున ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌పై ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం సరైనదేనని పేర్కొంది. ఈ కేసులో హవాలా మార్గంలో ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు చేరిన తరహాలోనే చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల మధ్య చాలా సారూప్యతలు న్నాయి. ఇప్పటికే స్కిల్ కుంభకోణంపై షెల్ కంపెనీలను విచారిస్తున్న ఈడీ ఇక చంద్రబాబును కూడా బోనెక్కించే అవకాశాలున్నాయి. ‘ఆప్’ చేతికి రూ.50 కోట్లు ఢిల్లీలో మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మళ్లించినట్లు ఈడీ నిర్థారించింది. 2022లో గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు హవాలా మార్గంలో రూ.50 కోట్లు చేరినట్లు ఆధారాలతో తేల్చింది. ఈ మేరకు గోవాలో ఆప్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఓ అభ్యర్థి వాంగ్మూలం కూడా ఇవ్వడం గమనార్హం. కేజ్రీవాలే బాధ్యత వహించాలి మద్యం కుంభకోణంపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ, పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కేజ్రీవాల్ దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం రాజకీయ పార్టీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సంఘం. కంపెనీల చట్టం ప్రకారం ఓ కంపెనీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సముదాయం. రెండు వేర్వేరు చట్టాల ద్వారా నమోదైన రాజకీయ పార్టీ, కంపెనీల నిర్వచనం మాత్రం ఒకటే. కాబట్టి అక్రమ నిధులు పొందిన ఓ కంపెనీపై ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లుగానే అక్రమంగా నిధులు పొందిన రాజకీయ పార్టీపై కూడా అదే విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు’ అని న్యాయమూర్తి ప్రకటించారు. ‘మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఆ పార్టీకి జాతీయ సమన్వయకర్త (అధ్యక్షుడు)గా ఉన్న కేజ్రీవాలే అందుకు బాధ్యత వహించాలి. ఆయనపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు. ఆయన అరెస్ట్ సరైనదే’ అని తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ స్కామ్‌లో టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు – బాధ్యత వహించాల్సింది చంద్రబాబే చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్‌లో కొల్లగొట్టిన నిధులు హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లోకి చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జర్మనీలోని సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు అంటూ నిధులు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేసిన రూ.371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చిన అవినీతి నెట్వర్క్ గుట్టును సిట్ బయట పెట్టింది. అందులో రూ.65.86 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు పక్కా ఆధారాలతో గుర్తించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీహిల్స్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలున్నాయి. వాటిల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 చొప్పున జమ చేశారు. జూబ్లీ హిల్స్‌లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయి నోట్లను కట్టల రూపంలో తరలించి ఈ అక్రమ నిధులను జమ చేశారు. విస్తుపోయే విషయం ఏమిటంటే.. ఆ నిధులు తమకు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించకుండానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. ఆ సమయంలో టీడీపీ బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులను జమ చేశారు. భారీ డిపాజిట్లకు సంబంధించి ఆదాయ మార్గాలు వెల్లడించాల్సి ఉండగా టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86 కోట్లు జమ కావడం గమనార్హం. నోట్ల డిపాజిట్ సమయంలో ‘పే–స్లిప్’లో ఆ నిధులు ఎలా వచ్చాయనే విషయాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి. ఇక బాబుపై ఈడీ కొరడా! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు సంబంధించి సిట్ పూర్తి ఆధారాలను ఈడీకి అందచేసింది. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో నిధుల తరలింపుపై కేసు నమోదు చేసిన ఈడీ ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఇప్పటికే సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్‌తోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్‌టెక్ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ కేసులో ఆ కంపెనీ ఆస్తులను జప్తు చేయడం సరైన చర్యేనని ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లో చేరిన అక్రమ నిధులపై ఈడీ దృష్టి సారించాల్సి ఉంది. తాజా తీర్పు ప్రకారం రాజకీయ పార్టీ ఖాతాలో చేరే అక్రమ నిధులకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలి. అంటే టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబే నిందితుడు అన్నది సుస్పష్టం. ఈ క్రమంలో ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని పలువురు న్యాయ నిపుణులతోపాటు సిట్ కూడా ఈడీ దృష్టికి తీసుకెళ్లనుంది. -
కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీ స్కాం కేసుకు సంబంధించి ఆయన వేసిన మరో పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం ఉదయం కొట్టేసింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునే సమయం పెంచాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన్ని లాయర్ కలిసేందుకు వారానికి రెండు సార్లు ఛాన్స్ ఇస్తున్నారు. అయితే.. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి ఐదు సార్లు లాయర్‌ను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్లో కోరిన కేజ్రీవాల్ కోరారు. అయితే కోర్టు అందుకు అనుమతి నిరాకరిస్తూ.. కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసింది. ఇదిలా ఉంటే.. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ అరెస్టును సమర్థించిన కోర్టు.. సామాన్యులకు, సీఎంలకు న్యాయం ఒక్కోలా పని చేయదంటూ వ్యాఖ్యానించింది. -
లిక్కర్ కేసు: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్ కోర్టు రిమాండ్ చేయడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తనను ఈడీ అరెస్టు చేయడం అక్రమమని ఢిల్లీ హైకోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వు చేసిన కోర్టు తాజాగా మంగళవారం(ఏప్రిల్ 9) దానిని వెలువరించింది. ఈ తీర్పులో భాగంగా లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ఢిల్లీ హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ స్కామ్‌కు పాల్పడటం ద్వారా అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్ కుట్రపన్నారనేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కారణంతో లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్ అరెస్టు సబబేనని పేర్కొంది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేవీ ఉండవని స్పష్టం చేసింది. సామాన్యులకు, సీఎంకు చట్టం ఒకటేనని తెలిపింది. కాగా, లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అనంతరం వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 దాకా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి..మళ్లీ తీహార్ జైలుకే కవిత -
కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లోని జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తనను ఈడీ అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించడంపై గతంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం తీర్పు చెప్పనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసుపై కీలక తీర్పు వెలువరించనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఆప్ ఎమ్మెలే దుర్గేశ్ పాఠక్‌తో పాటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌ను సోమవారం ఈడీ ప్రశ్నించింది. సౌత్ గ్రూప్ నుంచి హవాలా రూపంలో తీసుకున్న రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆప్ వాడిందని ఈడీ ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆ ఎన్నికల్లో గోవాకు పాఠక్ ఇన్చార్జిగా ఉన్నారు. ఎన్నికల వేళ జరిగిన నగదు లావాదేవీలపై ఆయన్ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో కీలక పత్రాలకు సంబంధించిన వివరాల కోసం విభన్‌ను విచారించింది. పాఠక్‌ను విచారించడంపై ఢిల్లీ మంత్రి అతిశి మండిపడ్డారు. ఆప్ నేతలను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకే విచారణ పేరుతో బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. -
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట..
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేదుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వ పాలన కొరవడిందని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా ఈ ప్రజా ప్రయోజన పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని గురువారం జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోడాతో కూడిన డివిజన్ బెంచ్ బెంచ్ కొట్టేసింది. సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే పిటిషనర్ ఈ అంశంపై రాజ్యాంగ అధికారులను(రాష్ట్రపతి లేదా గవర్నర్) సంప్రదించాలని హైకోర్టు కోరింది. ‘కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలి. కానీ అది అతని (కేజ్రీవాల్) వ్యక్తిగత నిర్ణయం. ఇది న్యాయస్థానం, కోర్టు ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన విధించిన సందర్భాలు ఉన్నాయా? దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: తీహార్ జైలు నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ సందేశం ప్రభుత్వం పనిచేయడం లేదని మేము ఎలా చెప్పగలం? దానిని నిర్ణయించడానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పూర్తి సామర్థ్యం ఉంది. ఆయనకు మా మార్గదర్శకత్వం అవసరం లేదు. చట్టాం ప్రకారం ఏం చేయాలో ఆయన చేస్తారు’ అని పేర్కొంది. అనంతరం పిటిషనర్ గుప్తా మాట్లాడుతూ.. తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు దీనిని ప్రస్తావించనున్నట్లు చెప్పారు. కాగా సీఎంగా అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలంటూ హైకోర్టులో దాఖలైన రెండో పిటిషన్ ఇది. కాగా మార్చి 28న సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. -
కునాల్ కపూర్ విడాకులు : భార్య అంత వేధించిందా?
సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు ఢిల్లీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించిందంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వెల్లువెత్తాయి. భర్తను అప్రతిష్టపాలు చేసేలా ఆరోపణలు ,నిరాధారమైన వాదనలు, అతని ప్రతిష్టపై ప్రభావం చూపుతాయని క్రూరత్వానికి సమానమని కోర్టు పేర్కొంటూ ఆయనకు విడాకుల పిటీషన్‌ను కోర్టు సమర్ధించింది. అసలు ఇంతకీ కునాల్ కపూర్ మాజీ భార్య ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది నిజంగానే క్రూరంగా ప్రవర్తించింది లాంటి వివరాలను పరిశీలిద్దాం..! పలు మీడియా నివేదికల ప్రకారం 2008, ఏప్రిల్‌లో కునాల్ ఏక్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వారి పెళ్లయిన తొలిరోజులో, లగ్జరీ కారు లేదనీ, ఉన్న కారు చిన్న కారంటూ ఎగతాళి చేసింది. ఏమీ లేదంటూ ఎద్దేవా చేసేదట. అతనికి చెప్పకుండానే తన ఉద్యోగాన్ని వదిలేసింది. అతనిపై కక్షసాధించేందుకే ఇంట్లో పనిలేకుండా కూర్చుంది. ఏక్తా కపూర్ భర్తపట్ల, అతని తల్లి దండ్రుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేదని, ఒకటిరెండుసార్లు అతనిపై చేయి కూడా చేసుకుంది అనేది ప్రధాన ఆరోపణ. (భార్య క్రూరత్వం : సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు భారీ ఊరట) కానీ కునాల్ భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాడు. ఫారిన్ టూర్లు తీసుకెళ్లాడు. కానీ ఆమె ఎప్పుడూ కావాలనే తగాదా పడేది. ఈ వివాదాల నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం ప్రయత్నించాడు. ఆమె ఏమీ మారలేదు. టీవీ షో మాస్టర్ చెఫ్‌కి ఎంపికైనప్పుడు వీరిద్దరి మరిస్థితులు మరింత దారుణంగా మారాయి. అతనికి మంచి పేరు రావడం కూడా ఆమె తట్టుకోలేకపోయింది. యష్‌రాజ్ స్టూడియోస్‌లో షో షూట్లో ఉండగా కొడుకుతో కలిసి స్టూడియోకు వచ్చి గొడవ చేసింది. టీవీ షో జడ్జ్‌గా పాపులర్ అయిన తర్వాత, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని నిరంతరం బెదిరించేంది.షూట్‌కి ఒకరోజు ముందు చెంపదెబ్బ కొట్టిందని కునాల్ ఆరోపించాడు. (గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ యాక్టర్) కొడుకు పుట్టిన తర్వాత బిడ్డను కూడా సరిగ్గా పట్టించు కోలేదు. పిల్లాడిని పనిమనిషికి వదిలేసి మాల్స్‌కు వెళ్లిపోయేది. 2013లో కునాల్‌ని కొట్టింది కూడా. దీన్ని కునాల్ తండ్రి రికార్డ్ చేశాడు. దీంతో ఆమె ఆ ఫోన్ లాక్కొని వృద్ధుడని కూడా చూడకుండా కర్రతో కొట్టడానికి కూడా ప్రయత్నించింది. ఈ వ్యవహారం పోలీసుల దాకా పోయింది. 2014లో జరిగిన మరో సంఘటనలో, కునాల్ తండ్రిని ప్లాస్టిక్ కుర్చీతో దాడి చేయడంతో విభేదాలు మరింత రాజుకున్నాయి. 2015లో మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆమె ఇంటిముందు గలాటా చేసింది. చివరికి విసిపోయిన కునాల్ ఆమెనుంచి దూరంగా వెళ్లాడు. అప్పటినుంచి కునాల్ , అతని భార్య విడివిడిగా ఉంటున్నారు. కుమారుడు మాత్రం తల్లితోనే ఉంటున్నాడు. అయితే బిడ్డను కలవడానికి లేదా మాట్లాడటానికి కూడా ఏక్తా అనుమతించేది కాదు. ప్రతిదానికీ డబ్బులు డిమాండ్ చేసేదని కునాల్ చాలా సార్లు వాపోయాడు. ఏక్తా కపూర్ వాదన: వివాహేతర సంబంధాలు అయితే ఈ ఆరోపణలన్నింటినీ ఏక్తా కపూర్ గతంలోనే ఖండించింది. తనకు విడాకులు ఇవ్వడానికి పన్నిన పన్నాగమని ఆరోపించింది. బాగా పేరు సంపాదించిన తర్వాత భర్తకు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించింది. అయితే భర్తను కొడుతున్న వీడియోను ఫ్యామిలీ కోర్టు తీరస్కరించింది. ఆమె నిగ్రహం కోల్పేయాలా కునాల్ ప్రవర్తించాడని కోర్టు ఈ వీడియోను తోసిపుచ్చింది. వరకట్న ఆరోపణలు చేసింది, అయితే, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో వీటిని ధృవీకరించలేకపోయింది. అయితే ఫ్యామిలీ కోర్టు విడాకులకు అంగీకరించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణలో భార్య క్రూరత్వాన్ని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు కునాల్‌కు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పుపై ఏక్తా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
నేరస్థులను జైలులో పెట్టాల్సిందే.. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీ వాదనలు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు బుధవారం(ఏప్రిల్ 3)న విచారించి తీర్పును రిజర్వు చేసింది. ఎన్నికల వేళ ఢిల్లీ సీఎంను అరెస్టు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదించారు. దీనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తరపున వాదించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి రాజు ఘాటుగా స్పందించారు. ఎన్నికల కారణంగా తమను అరెస్టు చేయవద్దనే హక్కు నిందితులకు లేదన్నారు. విచారణ సక్రమంగా సాగాలంటే నిందితులను అరెస్టు చేసి జైలులో ఉంచాల్సిందేనని కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ అక్రమ అరెస్టు పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. కాగా, లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. తీహార్ జైలు నుంచి ఆప్ ఎంపీ రిలీజ్ -
అవమానించేందుకే అరెస్ట్ చేశారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ మార్చి 23న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం కేజ్రీవాల్ పిటీషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ వాదనలు వినిపిస్తున్నారు. తన క్లైంట్ అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేముందు ఆయన నివాసం వద్ద ఎటువంటి స్టేట్మెంట్ తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అరెస్టకు ముందు ఈడీ అసలు అటువంటి ప్రయత్నమే చేయలేదని కోర్టుకు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ పారిపోయే అవకాశం ఉందా?. ఆయన ఒకటిన్నర ఏళ్లలో ఎవరైనా సాక్షిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారా?. ప్రశ్నించడానికి నిరాకరించారా? అని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ ఈడీని ప్రశ్నించారు. అంతకుముందు హైకోర్టులో హాజరుపరిచే క్రమంలో సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో నన్ను అవమానపరిచేందుకు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ఆపేందుకు అరెస్టు చేశారు. ఈడీ నా నుంచి ఎలాంటి స్టెట్మెంట్ రికార్డ్ చేయలేదు’ అని అన్నారు. ఇక.. ఈడీ కస్టడీ ముగిసిన అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు సోమవారం జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. అయన్ను తీహార్ జైల్క తరలించారు. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. మార్చి 21 తేదీన సాయంత్రం ఈడీ రెండున్నర గంటల పాటు విచారించి.. అనంతరం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట
ఢిల్లీ, సాక్షి: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆయన్ని సీఎం పదవి నుంచి తొలగించాలని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే.. ఢిల్లీ హైకోర్టు గురువారం ఆ పిల్‌ను కొట్టేసింది. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేమని.. అలాగే జైలు నుంచి కేజ్రీవాల్ పాలన నడిపించడాన్ని కూడా తాము అడ్డుకోలేమని ఉన్నత న్యాయస్థానం పిటిషనర్‌కు తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ మన్మోహన్(తాత్కాలిక), జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్థిక కుంభకోణంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి సీఎం పదవిలో కొనసాగేందుకు అనర్హుడంటూ ఢిల్లీకి చెందిన రైతు, సామాజిక వేత్త సుర్జిత్‌సింగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. -
హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ‘ఈనాడు’ అసత్య ఆరోపణలు
సాక్షి, అమరావతి: ‘సాక్షి’ దినపత్రిక తన సర్కులేషన్ పెంచుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ‘ఈనాడు’ అడ్డగోలుగా చేస్తూ వచ్చిన ఆరోపణలు అసత్యమని ఢిల్లీ హైకోర్టు సాక్షిగా తేలిపోయాయి. వలంటీర్లు విస్తృత సర్క్యులేషన్ కలిగిన ఏ దినపత్రికనైనా కొనుగోలు చేయవచ్చంటూ ప్రభుత్వం జీవో జారీ చేయగా దీనివల్ల సాక్షి సర్క్యులేషన్ ఆమాంతం పెరిగిపోయిందంటూ ఈనాడు ప్రమాణపూర్వకంగా చెప్పిన మాటలు, శుద్ధ అబద్ధమని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి. ప్రభుత్వ జీవో వల్ల సాక్షి నిజంగానే లబ్ధి పొంది ఉంటే ఆ పత్రిక సర్క్యులేషన్ మిమ్మల్ని దాటిపోయి ఉండాలి కదా? మరి ఏబీసీ గణాంకాలు మరో రకంగా ఉన్నాయి కదా? అంటూ హైకోర్టు ధర్మాసనం సూటిగా సంధించిన ప్రశ్నలకు ఈనాడు వద్ద సమాధానమే లేకుండా పోయింది. సాక్షి సర్క్యులేషన్ విషయంలో తన ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో చేసేదేమీ లేక ఈనాడు వెనక్కి తగ్గింది. హైకోర్టు సైతం సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించేందుకు అనుమతినిచ్చింది. దీంతో చేసేదేమీ లేక సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించకుండా ఏబీసీని నిరోధించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని ఈనాడు ఉపసంహరించుకుంది. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ దినపత్రికనైనా కొనుక్కునేందుకు వలంటీర్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఈనాడు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంలో తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రతీమ్ సింగ్ ఆరోరా ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.