న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) అధినేత కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూన్25) తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఈడీ హైకోర్టుకు వెళ్లడంతో దానిని ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
దీనిపై సోమవారం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతర స్టేపై తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతే విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఏం తేలుస్తుందనేదానిపై ‘ఆప్’ పార్టీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment