liquor scam
-
కేజ్రీవాల్‌కు షాక్..! లిక్కర్ కేసుపై ఎల్జీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత,ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది.లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకుగాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనుమతిచ్చినట్లు సమాచారం. దీంతో లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌పై ప్రత్యేక కోర్టు విచారణకు ఇక లైన్ క్లియరవనుంది. సీఆర్పీసీ ప్రకారం పబ్లిక్ సర్వెంట్లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా కావాలి అయితే ఈడీ కేసుల్లో మాత్రం ఈ అనుమతి గతంలో అవసరం లేదు. తాజాగా నవంబర్ 6వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈడీ కేసుల్లో కూడా పబ్లిక్ సర్వెంట్లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరమైంది. దీంతో ఈడీ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ అనుమతి కోరింది.కాగా, లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. బయటికి వచ్చిన తర్వాత ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలుండడంతో ప్రస్తుతం ఆయన వాటిపైనే ఫోకస్ చేశారు. ఇప్పటికే ఎన్నికల కోసం ఆప్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. -
రోజుకో స్కామ్ బయటకి..కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
-
లిక్కర్ స్కామ్: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ:లిక్కర్ స్కామ్‌లో ఛత్తీస్‌గఢ్,జార్ఖండ్‌లలోని మొత్తం 17 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఏకకాలంలో సోదాలు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ చౌబే,ఎక్సైజ్ ఉన్నతాధికారి గజేంద్రసింగ్ నివాసాలు, స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల్లో ఈడీ మంగళవారం(అక్టోబర్ 29) తనిఖీలు నిర్వహించింది.ఐఏఎస్ అధికారులతో కలిపి మొత్తం ఏడుగురితో కూడిన సిండికేట్‌పై ఛత్తీస్‌గఢ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో లిక్కర్‌స్కామ్‌కు పాల్పడడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సిండికేట్ భారీగా గండికొట్టిందన్న ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో మనీలాండరంగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు తాజాగా ఈడీ రంగలోకి దిగింది. ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం.. ఏం జరిగిందంటే.. -
ఢిల్లీ లిక్కర్ కేసు: విచారణ నవంబర్ 8కి వాయిదా
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ కేసు సీబీఐ ఛార్జ్ షీట్ జరిగిన విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా , ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్ హాజయ్యారు. శనివారం సీబీఐ ఛార్జ్ షీట్‌పై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా.. అనంతరం కేసును వాయిదా వేశారు. తదుపరి కేసు విచారణ నవంబర్ 8వ తేదీన చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.చదవండి: టమాటాలకు పోలీసు బందోబస్తు -
కర్నాటకలో 90రూ ఉండే మద్యం ఏపీ 99 రూపాయాలు...
-
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత, సిసోడియా
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం(అక్టోబర్ 4) విచారణ జరిపింది. ఈ విచారణకు హాజరయిన ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 19కి వాయిదా వేసింది. కాగా, లిక్కర్ కేసులో కవిత, మనీష్ సిసోడియాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రధాన నిందితులకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు విచారణకు కోర్టు ఆదేశాల ప్రకారం వీరంతా హాజరవ్వాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఇల్లు ఖాళీ చేసిన కేజ్రీవాల్ -
కేంద్రానికి చెంపపెట్టు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ విడుదలను సీబీఐకి, అమిత్ షాకు, కేంద్రానికి చెంపపెట్టుగా ఆప్ అభివరి్ణంచింది. ‘‘సీబీఐ పంజరంలో చిలుకేనని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. అవి నేరుగా కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు. కనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా ఏ సాక్ష్యాన్నీ సంపాదించలేకపోయాయని ఢిల్లీ మంత్రి ఆతిషి ఎద్దేవా చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తారని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సుశీల్ గుప్తా అన్నారు. కేజ్రీవాల్ విడుదలను ప్రజాస్వామ్య విజయంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అభివరి్ణంచారు. ఆప్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ‘‘కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే వచి్చందని మర్చిపోవద్దు. మద్యం కేసులో ప్రధాన నిందితుడైన ఆయన తక్షణం రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే ఢిల్లీ ప్రజలే ఆయన రాజీనామాకు పట్టుబట్టే రోజు ఎంతో దూరం లేదంది. -
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా పడింది. బుధవారం(సెప్టెంబర్11) ఈ విషయమై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఈ విచారణ కోసం లిక్కర్ కేసు నిందితులు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఈయన బెయిల్ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి.. వాల్మీకి స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్ -
కవితకు బెయిల్ సుప్రీం కోర్టు ఆంక్షలు
-
కేజ్రీవాల్ విచారణకు సీబీఐకి అనుమతి
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అవినీతి కేసులోప్రాసిక్యూట్ చేసేందుకు తమకు అనుమతి లభించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సంస్థ వెల్లడించింది. లిక్కర్‌స్కామ్ అవినీతి కేసులో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌నూ విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది. తమకు అనుమతి లభించిన విషయాన్ని సీబీఐ తాజాగా రౌస్ ఎవెన్యూకోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్‌పై సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఆగస్టు 27న కోర్టు పరిగణలోకి తీసుకోనుంది. ఛార్జ్‌షీట్ అనంతరం కేసు విచారణ ముందుకు సాగాలంటే కేజ్రీవాల్ విచారణకు పరిపాలన పరమైన అనుమతి తప్పనిసరి. దీంతో సీబీఐ ఈ మేరకు అనుమతులు తెచ్చుకుంది. మరోవైపు, సీబీఐ అరెస్టును సవాలు, బెయిల్ విజ్ఞప్తిపై దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. -
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 27 వరకు కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం(ఆగస్టు20) కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జూన్ 26న కేజ్రీవాల్ అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఈ కేసులో ఆయన తీహార్జైలులో రిమాండ్‌లో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. -
లిక్కర్కేసు: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు14) విచారించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్భూయాన్లతో కూడిన బెంచ్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ మీద కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.లిక్కర్‌కేసులో ఈ ఏడాది మార్చి21న అరెస్టయిన కేజ్రీవాల్‌కు మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ అవినీతి కేసులో మాత్రం కేజ్రీవాల్ ఇంకా తీహార్జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇదే కేసులో 17 నెలలు రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నేత మనీష్‌సిసోడియాకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
లిక్కర్ స్కాం: మరోసారి కోర్టుకు కవిత.. బెయిల్ వచ్చేనా?
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో బెయిల్ విషయమై మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ కవిత సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో డిఫాల్ట్ బెయిల్‌పై రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు.. లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై కూడా కోర్టు విచారణ చేపట్టనుంది. -
Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల కస్టోడియల్ విచారణ ముగియడంలో కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు శనివారం రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సునేనా శర్మ ఎదుట హాజరుపర్చారు. మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం ఆయనను 14 రోజలపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. కేజ్రీవాల్‌ను వచ్చే నెల 12వ తేదీ దాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌కు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా సీఎం,ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ శనివారం(జూన్29) రౌస్ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు జులై 12 దాకా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తర్వాత కేజ్రీవాల్‌ను 3 రోజులు సీబీఐ రిమాండ్‌కు కోర్టు అప్పగించింది. శనివారం ఈ రిమాండ్ ముగియడంతో శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించే విషయమై తొలుత తీర్పు రిజర్వు చేసిన కోర్టు కొద్దిసేపటి తర్వాత రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
బెయిల్‌పై సుప్రీంలో పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: లిక్కర్‌స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే ఇస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూన్26) తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బెయిల్‌పై తొలుత ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేపై సుప్రీంలో వేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ బుధవారం ఉపసంహరించున్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ మీద హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై సుప్రీం కోర్టు బుధవారం ఉదయం విచారణ జరిపింది. ఈ విచారణకు కేజ్రీవాల్ తరపున హాజరైన ప్రముఖ లాయర్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. మధ్యంతర స్టేపై తాము ఇప్పటికే వేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.బెయిల్‌పై హైకోర్టు తాజాగా ఇచ్చిన తుదీ తీర్పుపై మళ్లీ పిటిషన్ వేస్తామని తెలిపారు. -
ఇక సీబీఐ వంతు!
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం సీబీఐ అరెస్టు చేసే అవకాశం కని్పస్తోంది. సీబీఐ వర్గాలు మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ చర్య ప్రధాని మోదీ కక్షసాధింపులో భాగమేనని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఆరోపించారు. అందుకే కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో ఇరికించారన్నారు.ఢిల్లీ హైకోర్టులో నిరాశేమనీ లాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌పై మధ్యంతర స్టే ఎత్తివేతకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుధీర్‌కుమార్ జైన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. వాదనలకు ఈడీకి ట్రయల్ కోర్టు సమయమివ్వలేదని ఆక్షేపించింది.కేజ్రీవాల్ ప్రమేయంపై సమర్పించిన పత్రాలను, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో, క్షుణ్నంగా పరిశీలించడంలో విఫలమైందని స్పష్టంచేసింది.కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడానికి ఈడీకి తగిన సమయమిచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఉత్తర్వుపై స్టేను రద్దు చేయడం లేదని తేచ్చిచెప్పారు. కేజ్రీవాల్‌కు ఈ నెల 20న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.దీన్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఆ మర్నాడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట దక్కలేదు. దాంతో ఆయన కనీసం మరిన్ని రోజులపాటు తిహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఉత్కంఠ: కేజ్రీవాల్ బెయిల్‌పై తుది తీర్పు రేపు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూన్25) తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఈడీ హైకోర్టుకు వెళ్లడంతో దానిని ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.దీనిపై సోమవారం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతర స్టేపై తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతే విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఏం తేలుస్తుందనేదానిపై ‘ఆప్’ పార్టీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. -
Delhi liquor scam: సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తనకు ఇచి్చన బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఈ నెల 20న బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈ నెల 21న ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండిపోవాల్సి వచి్చంది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్ ఏమైనా టెర్రరిస్టా: సునీతా కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం హద్దులు దాటిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు శుక్రవారం(జూన్21) చేపట్టిన నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సునీత మాట్లాడుతూ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ట్రయల్ కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయకముందే ఈడీ హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉన్న కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు హైకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఈడీ దాఖలు చేసిన రద్దు పిటిషన్‌ను విచారించేదాకా బెయిల్ ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసింది. -
కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. జులై 3 దాకా కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.కేసు తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. తన క్లైంట్కు జ్యుడీషియల్ కస్ఠడీ పొడిగించడాన్ని కేజ్రీవాల్ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కేజ్రీవాల్‌కు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్డడీ ముగియడంతో తీహార్ జైలు నుంచి ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టారు.కేజ్రీవాల్‌తో పాటు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న వినోద్చౌహాన్ కస్టడీని కూడా కోర్టు జులై 3 దాకా పొడిగించింది. లిక్కర్ స్కామ్‌లో ప్రతి అంశం చివరకు కేజ్రీవాల్‌కే ముడిపడి ఉంటోందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టు ముందు వాదనలు వినిపించారు. -
కేజ్రీవాల్ కోర్టు వీడియో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్.. కోర్టులో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వెంటనే తొలగించాలని సునీతా కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టినప్పడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్.. కోర్టు ప్రొసిడింగ్స్ జరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంలో న్యాయవాది వైభవ్ సింగ్ వేసిన పిల్‌పై శనివారం ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో రికార్డింగ్.. కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంఘించనట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. సునితా కేజ్రీవాల్ సంబంధిత వీడియోను డిలీట్ చేయాలని, అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సైతం రీపోస్ట్ అయిన ఆ వీడియోను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సునితా కేజ్రీవాల్‌తో పాటు వీడియో పోస్ట్ చేసిన మరో ఐదుగురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిల్‌పై జూలై 9న విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌ను రికార్డ్ చేసిన సునితా కేజ్రీవాల్ ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు. అయితే ఇలా చేయటం కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంగిండమవుతుందని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. -
తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ములాఖత్ అయ్యారు. కవితను కలిసిన కేటీఆర్ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి రెండు వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. -
లిక్కర్ కేసు: కవిత జ్యుడీషియల్ కస్టడీ 21కి పొడిగింపు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ శుక్రవారం(జూన్7) సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌పై విచారణ జరిపిన రౌస్ ఎవెన్యూ కోర్టు దానిని పరిగణలోకి తీసుకుంది. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 21 వరకు కోర్టు పొడిగించింది. జైలులో చదువుకోవడానికి తనకు 9 పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరోగా కోర్టు ఆమె విజ్ఞప్తిని అంగీకరించింది. కాగా, కవితపై ఇప్పటికే సీబీఐ ఫైల్ చేసిన ప్రధాన ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కేసులో కవిత పాత్ర కీలమని, సౌత్‌గ్రూపు ఏర్పాటులో ఆమె ముఖ్య పాత్ర పోషించారని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పనకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులిచ్చారని అభియోగాలు మోపింది. -
తీహార్ జైల్లో లొంగిపోయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
సాక్షి, ఢిల్లీ: తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ ముగియడంతో జైల్లో ఆయన లొంగిపోయారు. మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏప్రిల్‌లో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మే 10న మంజూరు చేసింది. ఆదివారంతో బెయిల్ గడువు ముగిసింది. బెయిల్ పొడిగింపు అభ్యర్థనను కోర్టు నిరాకరించడంతో ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహార్ జైలులో లొంగిపోయారు.కాగా, అంతకుముందు కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సందేశం ఇస్తూ.. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన న్యాయస్థానానికి కృతజ్ఞతలు. ఈరోజు తిరిగి లొంగిపోతానని తెలిపారు.‘‘మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తాను. అనంతరం హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటాను. అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలను, కార్యకర్తలను కలిసి తీహార్‌కు వెళ్తా. మీరు ఇక్కడ సంతోషంగా ఉంటేనే మీ సీఎం జైల్లో ఆనందంగా ఉంటాడు’’ అంటూ ట్వీట్ చేశారు.