న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా సీఎం,ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ శనివారం(జూన్29) రౌస్‌ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు జులై 12 దాకా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తర్వాత కేజ్రీవాల్‌ను 3 రోజులు సీబీఐ రిమాండ్‌కు కోర్టు అప్పగించింది.
శనివారం ఈ రిమాండ్ ముగియడంతో శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించే విషయమై తొలుత తీర్పు రిజర్వు చేసిన కోర్టు కొద్దిసేపటి తర్వాత రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment