custody
-
బాబా సిద్ధిఖీ హత్య కేసు: నిందితుడికి 7 రోజుల కస్టడీ
ముంబై: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ శనివారం హత్యకు గురయ్యారు. ఆయనపై జరిగిన కాల్పుల కేసులో నిందితుడు గుర్మైల్ సింగ్‌ను ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టులో ఆదివారం హాజరుపర్చగా.. అక్టోబర్ 21 వరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితులైన గుర్మైల్ సింగ్(23), ధర్మరాజ్ సింగ్ కశ్యప్(17)లను ముంబై పోలీసులు ఈరోజు ఉదయం ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టులో హాజరుపరిచారు. ఎస్ప్లానేడ్ కోర్టు రెండో నిందితుడు మైనర్ కావటంతో ఆసిఫికేషన్ టెస్ట్ చేసిన తర్వాత మళ్లీ తమ ముందు హాజరుపర్చాలని ఆదేశించింది. ఆసిఫికేషన్ టెస్ట్ అనేది.. వ్యక్తి ఎముకలను ద్వారా వయస్సును అంచనా వేసే వైద్య పరీక్ష. ఇద్దరు నిందితులను పోలీసులు ముంబై క్రైం బ్రాంచ్‌కు తరలించారు.Mumbai: One accused in Baba Siddique firing case sent to custody till October 21Read @ANI Story | https://t.co/DljJNa4h7x#BabaSiddique #MumbaiCourt pic.twitter.com/s9uXQAZ8nw— ANI Digital (@ani_digital) October 13, 2024 నిందితుల తరఫు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసులు నిందితుడిని ఈరోజు కోర్టులో హాజరుపర్చారు. మేము దానిని వ్యతిరేకించాం. కోర్టుకు ఇవ్వగలిగిన ఆధారాలను ఇచ్చాం. కోర్టు ఆ కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అక్టోబరు 21 వరకు కస్టడీ విధించింది. ఇక రెండో నిందితుడిని ఆసిఫికేషన్ టెస్ట్ తర్వాత మళ్లీ హాజరు పర్చాలని ఆదేశించింది. పోలీసులు 14 రోజుల కస్టడీకి అడిగారు. కానీ కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణ అవసరమని కోర్టు భావిస్తే కస్టడీని మరికొన్ని రోజులు పెంచే అవకాశం ఉంది’ అని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడిని గుర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నాలుగో నిందితుడి పేరు మహ్మద్ జీషన్ అక్తర్ అని వెల్లడించారు. ఇప్పటికే మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.మరోవైపు.. బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ముంబైలో శాంతిభద్రతల పరిస్థితిని దారుణం ఉందని..దానికి నిదర్శణమే బాబా హత్ అని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. నేరాల విషయంలో మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్, బీహార్ మార్గంలో వెళుతుందని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను రాజీనామా చేయాలని వాడెట్టివార్ డిమాండ్ చేశారు.చదవండి: బాబా సిద్ధిఖీ హత్య.. కేజ్రీవాల్ రియాక్షన్ -
ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్‌కు ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్‌కతా కోర్టు ఎనిమిది రోజల సీబీఐ కస్టడీ విధించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోషతో పాటు, మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ వారిని సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఇప్పటికే కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో సందీప్ ఘోష్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ కేసులో విచారించడానికి నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోల్‌కతా కోర్టును కోరింది. అయితే కోర్టు ఎనిమిది రోజులు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. ఇందులో ఒక నిందితుడైన అఫ్సర్ అలీ బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సందీప్ ఘోష్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుపై కోల్‌కతా పోలీసులు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినప్పటికీ కలకత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో సోమవారం సీబీఐ సోదాలు జరిపి అనంతరం అరెస్ట్ చేసింది. -
మనీలాండరింగ్ కేసైనా బెయిల్ ఇవ్వాల్సిందే : సుప్రీం కోర్టు
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసుల్లోను బెయిల్ అనేది ఒక రూల్ అని, జైలు మినహాయింపుగానే ఉండాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్నప్పుడు నిందితుడు దర్యాప్తు అధికారికి ఇచ్చిన నేరారోపణ ప్రకటన సాక్ష్యంగా అంగీకరించేందుకు వీలుకాదని పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనుచరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రేమ్ ప్రకాష్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.మనీష్ సిసోడియా బెయిల్ తీర్పు విషయంలో కూడా.. పీఎంఎల్ఎ (మనీలాండరింగ్ నిరోధక చట్టం)లో బెయిల్ ఒక నియమం, జైలు మినహాయింపు అని తాము చెప్పినట్లు జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది.ఇక.. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితురాలు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన మరుసటి రోజు ప్రేమ్ ప్రశాష్ బెయిల్ మంజూరు అయింది. మరోవైపు.. ఈ నెల ప్రారంభంలో మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు కూడా సుప్రీం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
దర్శన్‌కు రాచమర్యాదలు.. ఏడుగురు జైలు అధికారుల సస్పెండ్
బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్‌కు బెంగళూరు జైలులో అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే వార్తలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. అభిమాని హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ పక్కనే ఉన్న కొందరితో ముచ్చిటిస్తున్న ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలో తాజాగా వైరల్‌గా మారడంతో జైల్లో దర్శన్‌కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందనే వివాదం రాజుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది.దర్శన్‌కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు జైలు అధికారులపై వేటు పడింది. అధికారులను సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందెవరు.. అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.దర్శన్ ఫోటో, వీడియో విషయంపై డీజీపీతో చర్చించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ద్వారా ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారుల ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. జైల్లోని సీసీ కెమెరాలు, విచారణ తర్వాతే ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. సెలబ్రిటీలైనా సరే ఇలాంటి చర్యలు ఎప్పటికీ సహించబోమని స్పష్టం చేశారు. అయితే జైలులో దర్శన్‌కు ఎలాంటి రాచమర్యాదలు జరగలేదని.. ఫోటో, వీడియో ఎలా బయటకొచ్చిందో విచారణలో తేలుతుంది. ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్శన్ ఎపిసోడ్‌పై లోతుగా విచారణ చేపట్టిననట్లు పేర్కొన్నారు. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌కు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా సీఎం,ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ శనివారం(జూన్29) రౌస్ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు జులై 12 దాకా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తర్వాత కేజ్రీవాల్‌ను 3 రోజులు సీబీఐ రిమాండ్‌కు కోర్టు అప్పగించింది. శనివారం ఈ రిమాండ్ ముగియడంతో శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించే విషయమై తొలుత తీర్పు రిజర్వు చేసిన కోర్టు కొద్దిసేపటి తర్వాత రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
21 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 21 వరకు ప్రత్యేక కోర్టు పొడిగించింది. కస్టడీ ముగియడంతో కవితను వర్చువల్‌గా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.కవిత కస్టడీ పొడిగించాలన్న సీబీఐ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. తదుపరి విచారణను ఈ నెల 21కు వాయిదా వేశారు. మరోవైపు, ఈ కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషిటును పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోరింది. దీనిపై జులై 6న విచారణ చేపడతామని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
ఏసీబీ కస్టడీలో ఏసీపీ
-
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్‌గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్‌లు కోరారు.కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చార్జిషీటుపై ఈడీ వాదనలు: కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లి మెంటరీ చార్జిషీటును పరి గణనలోకి తీసుకోవ డంపై దర్యాప్తు సంస్థ ప్రత్యే క కోర్టులో వాదనలు వినిపించింది. న్యాయవాది నవీన్ కుమార్ మట్టా వాదనలు వినిపిస్తూ.. కవిత, చారియట్ ప్రొడ క్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్‌కుమార్, చరణ్‌ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్‌ల పాత్ర గురించి చార్జిషీటులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని కవిత కాకుండా మిగిలిన వారి పాత్రపై వాదనలు విన్పించాలని సూచించారు. ఇదే క్రమంలో న్యాయమూర్తి అడి గిన ప్రశ్నలపై సమాధానానికి నవీన్ కుమార్ సమయం కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
బెంగళూరు: మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణకు బెంగళూరు కోర్టు రిమాండ్ విధించింది. ఆరు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డ మహిళను కిడ్నాప్ చేశారని రేవణ్ణపై కేసు నమోదైంది. ఈ కేసులో రేవణ్ణను ఇటీవలే సిట్ అరెస్టు చేసింది. తన తల్లిని కిడ్నాప్ చేయడమే కాక ఆమెపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని కిడ్నాప్‌కు గురైన మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రేవణ్ణపై కేసు నమోదైంది. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా కోరారు.కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్‌రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌లో పిటిషనర్ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.నా అరెస్టు అన్యాయం: కవితఅధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20దాకా రౌస్ న్యూ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్ కస్టడీని పొడిగించారు. మరోపక్క కేజ్రీవాల్‌కు మధ్యంత బెయిల్ ఇచ్చే అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం(మే7) విచారించింది. ఈ అంశంపై మళ్లీ మే 9వ తేదీన విచారిస్తామని లేదంటే వచ్చే వారం లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి అత్యున్నత కోర్టు సూచించింది. -
4 రోజులు సిట్ కస్టడీ
శివాజీనగర: లైంగిక దాడి, కిడ్నాప్ తదితర కేసుల్లో శనివారం రాత్రి అరెస్టయిన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్.డీ.రేవణ్ణను ప్రత్యేక తనిఖీ బృందం (ఎస్ఐటీ) అధికారులు రాత్రంతా విచారించారు. మరోవైపు ఆయనకు కోర్టు 4 రోజుల పాటు సిట్ కస్టడీకి అనుమతించింది. రాత్రి విచారణలో రేవణ్ణ సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. మహిళ కిడ్నాప్‌కు నాకు సంబంధం లేదు. నేను ఎవరినీ కిడ్నాప్ చేయలేదు అని చెబుతున్నారని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. అర్ధరాత్రి వరకు రేవణ్ణను మహిళ కిడ్నాప్ కేసులో కూలంకుషంగా విచారించారు. సిట్ చీఫ్, ఏడీజీపీ బీ.కే.సింగ్ బృందం విచారణలో పాల్గొంది. ఆరోపణలను రేవణ్ణ నిరాకరించారు. నేను ఆమెను కిడ్నాప్ చేయలేదు, ఎన్నికలు ఉన్న కారణాన ఆమె నా ఇంటికి వచ్చారు. ఆమె కొన్ని సంవత్సరాల నుండి నా ఇంట్లో పని చేస్తుండేవారు. ఆమె గురించి గాని, కిడ్నాప్ గురించి ఏమీ తెలియదు అని రేవణ్ణ చెప్పినట్లు సమాచారం. రాత్రి ఆయనను సిట్ ఆఫీసులోనే నిద్రపోనిచ్చారు. ఆదివారం కొన్ని ప్రశ్నలను అడిగి విచారణను కొనసాగించారు. సదరు మహిళపై రేవణ్ణ తనయుడు, ఎంపీ ప్రజ్వల్ అత్యాచారం చేశాడా?, ప్రజ్వల్‌ను తప్పించేందుకు ఆమెను కిడ్నాప్ చేయించారా? అనే కోణాలలో సిట్ విచారణ జరుపుతోంది. కస్టడీకి అనుమతి ఆదివారం సాయంత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య కోరమంగళలోని 17వ ఏసీఎంఎం కోర్టు జడ్జి రవీంద్ర కట్టిమని ఇంట్లో రేవణ్ణను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ కోసం ఆయనను వారంపాటు తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ న్యాయవాదులు కోరారు. జడ్జి ఆలకించి, 4 రోజుల పాటు.. అంటే 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సిట్ కస్టడీకి అనుమతించారు. దీంతో రేవణ్ణను సిట్ అప్పటివరకు విచారించే అవకాశముంది. రేవణ్ణ బెయిలు కోసం ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో బెయిలు అర్జీ సమర్పించారు. సోమవారం విచారణ జరగనుంది. ప్రజ్వల్ నివాసం సీజ్ ఎంపీ ప్రజ్వల్ ప్రభుత్వ నివాసానికి సిట్ అధికారులు తాళాలు వేశారు. ప్రజ్వల్‌కు హాసన్ ఆర్సీ రోడ్డులో ప్రభుత్వం కేటాయించిన నివాసం ఉంది. బాధితుల సమక్షంలో శనివారం రాత్రి మహజరు జరిపిన సిట్ అధికారులు నివాసానికి తాళం వేసి సీల్ వేశారు. తొలి అంతస్తు గదిలో అత్యాచారం జరిగిందనే ఆరోపణ వినిపించింది. ఇక్కడే నగ్న వీడియోలు రికార్డు చేసినట్లు అనుమానాలున్నాయి. ప్రజ్వల్ సిట్ విచారణకు వస్తారా?, రారా? అన్నది మిస్టరీగా మారింది. పాస్‌పోర్టును రద్దు చేయరెందుకు? దొడ్డబళ్లాపురం: ప్రజ్వల్, రేవణ్ణ కేసుల్లో బాధిత మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సుర్జేవాలా ఆదివారం తెలిపారు. సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత 75 సంవత్సరాల్లో ఇలాంటి దారుణ సంఘటన జరగలేదని, బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని సుర్జేవాలా అన్నారు. ప్రధాని మోదీ ప్రజ్వల్ పాస్‌పోర్టును ఎందుకు రద్దు చేయలేదని, ఇంటర్‌పోల్ ద్వారా ఎందుకు బ్లూ కార్నర్ నోటీసు ఇవ్వలేదని ప్రశ్నించారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది. కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
ఆమే సూత్రధారి.. పాత్రధారి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకానొక సమయంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డిలను కవిత భయపెట్టినట్లు కోర్టుకు తెలిపింది. కుంభకోణంలో కవితను సూత్రధారి, పాత్రధారిగా పేర్కొంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కవితను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మూడు రోజులపాటు కవితను సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. విజయ్నాయర్కు హవాలా రూపంలో డబ్బులు లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను శుక్రవారం అధికారులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఐదు రోజుల పాటు కవిత కస్టడీ కోరుతూ సీబీఐ, సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈడీ తరఫు న్యాయవాది పంకజ్ వాదనలు వినిపిస్తూ.. ‘లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ఒక నిందితుడైన విజయ్ నాయర్ (కేజ్రీవాల్ అనుచరుడు)కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు మరో నిందితుడైన దినేష్ అరోరా ద్వారా హవాలా రూపంలో చెల్లించారు. ఈ నేరపూరిత కుట్రకు అనుగుణంగా ఇండో స్పిరిట్స్‌లో 65 శాతం వాటా, రూ.29.29 కోట్లను సౌత్‌గ్రూపులోని నిందితులకు బదిలీ చేశారు. గోవా ఎన్నికల సమయంలో ఆప్ ఎన్నికల ప్రచారం నిమిత్తం రూ.44.45 కోట్లు వినియోగించారు. కవిత మాజీ ఆడిటర్ బుచి్చబాబు ఫోన్ వాట్సాప్ చాట్లు, భూ కొనుగోలు ముసుగులో సొమ్ము లావాదేవీలు బహిర్గతం అయ్యాయి. ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వడానికి పన్నిన నేరపూరిత కుట్రలో కల్వకుంట్ల కవిత కీలక పాత్రధారిగా ఉన్నట్లు సదరు భూ కొనుగోలు డీల్ ద్వారా వెల్లడైంది..’అని చెప్పారు. కవితతో మద్యం వ్యాపారి భేటీ దక్షిణాదికి చెందిన ఓ మద్యం వ్యాపారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని వెల్లడైంది. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రిని వ్యాపారి కోరగా.. ఎమ్మెల్సీ కవిత సంప్రదిస్తారని కేజ్రీవాల్ చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. తర్వాత సదరు వ్యాపారి కవితతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు సమకూర్చాల్సి ఉందని, దాంట్లో రూ.50 కోట్లు సదరు వ్యాపారి అందజేయాల్సి ఉంటుందని, తద్వారా మీరు వ్యాపార భాగస్వామి అవుతారని కవిత ఆయనకు తెలిపారు. అనంతరం బుచి్చబాబు డిమాండ్ మేరకు తన కుమారుడి ద్వారా కవిత అనుచరులకు రూ.25 కోట్లు వ్యాపారి చెల్లించారు. ఈ చెల్లింపులకు గానూ వ్యాపారి కుమారుడికి ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం వాటా దక్కింది. విజయ్నాయర్కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్లు చెల్లించినట్లుగా మరో నిందితుడు అభిషేక్ బోయినపల్లి తనకు చెప్పాడని అప్రూవర్ దినేష్ అరోరా తన వాంగ్మూలంలో వెల్లడించాడు. అభిõÙక్ బోయినపల్లి ఆదేశాల మేరకు హవాలా మార్గంలో గోవాకు భారీగా నగదు బదిలీ చేసినట్లు అప్పటి కవిత పీఏ అశోక్ కౌశిక్ చెప్పాడు. కౌశిక్ ద్వారా రూ.25 కోట్లు బదిలీ అయినట్లు రికార్డులు నిర్ధారించాయి. ఇండో స్పిరిట్స్‌లో తన ప్రాక్సీ అరుణ్ పిళై ద్వారా కవిత భాగస్వామ్యం కలిగి ఉన్నట్టు బుచ్చిబాబు ఫోను ద్వారా వెల్లడైంది..’అని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. భూ కొనుగోలు డీల్ ముసుగులో రూ.14 కోట్లు! భూ కొనుగోలు డీల్ ముసుగులో శరత్‌చంద్రారెడ్డికి చెందిన సంస్థల ఖాతాల నుంచి కల్వకుంట్ల కవితకు రూ.14 కోట్లు చేరాయి. నగదు బదిలీ ఒప్పందం అయితే జరిగింది కానీ అసలు భూమి బదిలీ కాలేదు. డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించడానికి శరత్‌చంద్రారెడ్డి ఆసక్తి చూపకపోవడంతో ఢిల్లీ, తెలంగాణలో వ్యాపారాలు దెబ్బతీస్తానని కవిత బెదిరించినట్లు వెల్లడైంది. పలువురు స్టేట్మెంట్ల ఆధారంగా కేసులో ప్రధాన కుట్రదారుల్లో కవిత ఒకరిగా తేలింది. దీంతో ఆమెను నిందితురాలిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. తర్వాత కోర్టు అనుమతితో కవితను ఈ నెల 6న తీహార్ జైలులో విచారించాం. కుంభకోణంలో తన పాత్ర గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు. ఐదు రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి..’అని పంకజ్ చెప్పారు. న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారు: కవిత న్యాయవాది కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షుల వాంగ్మూలాలు, ఇతరత్రా రూపంలో ఇప్పటికే తమ వద్ద ఉన్న అంశాలతో అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థ చూపిన కస్టడీ కారణాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయన్నారు. కవిత విషయంలో ప్రాథమిక హక్కులు ఉల్లంఘించిన నేపథ్యంలో సీబీఐ పిటిషన్ కొట్టివేయాలని కోరారు. కవిత పిటిషన్ కొట్టివేత ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి కావేరి బవేజా.. తొలుత సీబీఐ పిటిషన్లో తీర్పు రిజర్వు చేశారు. మధ్యాహ్నం కవిత దాఖలు చేసిన సవాల్ పిటిషన్‌ను విచారించారు. కవిత పిటిషన్‌ను కొట్టివేస్తూ 22 పేజీలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. ‘వాస్తవాలు, కేసు పరిస్థితులు, వాదనలు పరిశీలించాక కవితను ఈ నెల 15 వరకూ సీబీఐ కస్టడీకి అనుమతిస్తున్నా. సీబీఐ అరెస్టును రద్దు చేయాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నా. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీ టీవీ పర్యవేక్షణలో కవితను విచారించాలి. ప్రతిరోజూ సాయంత్రం 6– 7 గంటల మధ్య అరగంట సేపు తన న్యాయవాది మోహిత్‌రావుతో మాట్లాడే అవకాశం కవితకు ఇవ్వాలి. భర్త అనిల్‌కుమార్, సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు, పీఏ శరత్‌చంద్రలు ఆ సమయంలోనే 15 నిమిషాలు మాట్లాడొచ్చు. నిందితురాలికి ఇంటి భోజనం, జపమాల, దుస్తులు, మేట్రస్, బెడ్ షీట్లు, తువ్వాళ్లు, దిండులను సీబీఐ అధికారులు అనుమతించాలి. ఆమె కోరిన పుస్తకాలు అనుమతించాలి..’అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. -
‘ఆమ్ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దోపిడీ రాకెట్ నడుపుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి అనే పొగతో కప్పేసి ఆప్‌ను అవినీతి పార్టీగా చిత్రీకరించి, అంతమొందించడం ఈడీ లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. తాను ఈడీ దర్యాప్తును వ్యతిరేకించడం లేదని అన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనను ఈడీ కస్టడీలో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఏడు రోజుల కస్టడీ ముగియడంతో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపర్చారు. తొలుత ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు, న్యాయవాది జొహెబ్హుస్సేన్ వాదనలు వినిపించారు. మద్యం కుంభకోణం కేసులో స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతరత్రా డేటాను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనానికి రాజు తెలియజేశారు. ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాల్సి ఉందన్నారు. గోవా నుంచి సమన్లు అందుకొన్న కొందరితో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాలన్నారు. లిక్కర్ కేసులో దర్యాప్తునకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా సహకరించడం లేదని ఆరోపించారు. మరో ఏడు రోజులపాటు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అనుమతించాలని న్యాయమూర్తిని కోరారు. అనంతరం స్వయంగా వాదనలు వినిపించుకోవడానికి కేజ్రీవాల్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది గుప్తా కోరగా, న్యాయమూర్తి అనుమతించారు. కేజ్రీవాల్ తన వాదనలు హిందీలో కొనసాగించారు. 2022లో సీబీఐ కేసు నమోదైందని, తనని ఎవరూ అరెస్టు చేయలేదని, ఏ కోర్టు కూడా తనను దోషిగా గుర్తించడం గానీ లేదా ఆరోపణలు చేయడం గానీ జరగలేదని స్పష్టం చేశారు. ట్రాప్ చేయడమే ఈడీ అసలు ఉద్దేశం ఈ కేసులో సీబీఐ ఇప్పటిదాకా 31,000 పేజీలను కోర్టులో ఫైల్ చేసిందని, 294 మంది సాకు‡్ష్యలను విచారించిందని, ఈడీ 162 మందిని విచారించిందని, 25,000 పేజీల రిపోర్టును ఫైల్ చేసిందని చెప్పారు. తన పేరు కేవలం 4 స్టేట్‌మెంట్లలోనే ఉందని తెలిపారు. తననెందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. అయితే, ఈ వివరాలన్నీ అఫిడవిట్ రూపంలో ఇస్తే రికార్డుల్లో చేరుస్తానని న్యాయమూర్తి సూచించారు. దీంతో, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ అభ్యర్ధించారు. తాను ముఖ్యమంత్రినని, తన నివాసానికి మంత్రులు వస్తుంటారని, గుసగుసలాడుతుంటారని, దీని ఆధారంగా సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై ఎస్.వి.రాజు అభ్యంతరం వ్యక్తం చేయగా... ‘‘రాజు గారు, మీ ఆశీర్వాదం నాకు కావాలి. నన్ను మాట్లాడనివ్వండి’’ అని కేజ్రీవాల్ కోరారు. ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వగలనని న్యాయమూర్తి చెప్పడంతో కేజ్రీవాల్ తన వాదనలు కొనసాగించారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును ప్రస్తావించారు. తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చే వరకూ అతడి నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటూనే ఉన్నారని, దీన్నిబట్టి తనని ట్రాప్ చేయడమే ఈడీ అసలు ఉద్దేశమని అర్థమవుతోందని చెప్పారు. కొంతమంది నిందితులు అప్రూవర్లుగా మారిన అనంతరం ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. మాగుంట రాఘవ ఇచ్చిన స్టేట్మెంట్లను ప్రస్తావిస్తూ... ఆయన ఐదు స్టేట్మెంట్లు ఇచ్చారని తెలియజేశారు. ఈడీ ఏం చెబితే అదే వాంగ్మూలంగా ఇచ్చారని అన్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి స్టేట్మెంట్ మార్చుకోగానే ఆయన కుమారుడు మాగుంట రాఘవ బెయిలు పొందారని కేజ్రీవాల్ ఆరోపించారు. స్టేట్మెంట్లలో రాఘవ చెప్పింది ఏదీ కూడా ఈడీ రికార్డుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈడీ కార్యాలయంలో లక్ష పేజీలు ఉన్నప్పటికీ, తనకు అనుకూలంగా ఉన్న ఒక్క అంశాన్ని కూడా రికార్డుల్లోకి తీసుకోలేదన్నారు. రూ.100 కోట్ల కుంభకోణం అంటున్నారని, అయితే ఆ సొమ్ము ఎక్కడా లేదని చెప్పారు. ఈడీ దర్యాప్తు తర్వాతే మద్యం కుంభకోణం అనేది మొదలైందని విమర్శించారు. ఈడీ అంతిమ లక్ష్యం ఆమ్ ఆద్మీ పార్టీని అంతమొందించడమేనని పేర్కొన్నారు. దీనిపై ఈడీ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు. దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేయడం తగదన్నారు. నా వద్ద ఆధారాలున్నాయి బీజేపీకి శరత్‌చంద్రారెడ్డి రూ.55 కోట్లు విరాళంగా ఇచ్చారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ రాకెట్ నడుస్తోందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఈడీ తనని ఎన్నిరోజులు రిమాండ్‌లో ఉంచుకున్నా అభ్యంతరం లేదన్నారు. ఈడీపై పదేపదే అవే విమర్శలు చేయడం ద్వారా ప్రజల మద్దతు కూడకట్టుకోవాలని కేజ్రీవాల్ ప్రయతి్నస్తున్నారని ఎస్.వి.రాజు ధర్మాసనానికి తెలిపారు. ఈడీ కార్యాలయంలో తనకు అనుకూలంగా పేజీలు ఉన్నాయని కేజ్రీవాల్ ఎలా భావిస్తున్నారు? ఇదంతా ఊహాజనితం అని అన్నారు. లంచం ద్వారా వచ్చిన సొమ్ములు గోవా ఎన్నికల్లో కేజ్రీవాల్ వినియోగించారని తెలిపారు. ఈ సొమ్మంతా హవాలా రూపంలో సౌత్ గ్రూపు నుంచి వచ్చిందేనని, అదంతా ఒక చైన్ లాంటిదని, అందుకే దాని గురించి కేజ్రీవాల్ మాట్లాడడం లేదని తెలిపారు. బీజేపీకి శరత్‌చంద్రారెడ్డి విరాళం ఆరోపణలపై రాజు బదులిస్తూ... దీనికి, మద్యం కుంభకోణానికి సంబంధం లేదన్నారు. ఎందుకంటే ఢిల్లీలో మద్యం విధానాన్ని రూపొందించే హక్కు బీజేపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వెంటనే క్లీన్చిట్ రాదని, దర్యాప్తును ఎదుర్కోవాలని,సామాన్యుడికి, సీఎంకు అరెస్టు విషయంలో తేడా ఉండదని రాజు పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో ప్రశ్నించడానికి కేజ్రీవాల్‌కు మరో వారం రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరారు. అనంతరం, రాజు వాదనలకు తాను స్పందించవచ్చా? అని కేజ్రీవాల్ తరపు న్యాయవాది గుప్తా కోరగా.. ఇప్పటివరకూ స్పందించారుగా ఇక అప్రస్తుతం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది అప్రస్తుతం, అసందర్భం అని ఎలా అంటారని గుప్తా ప్రశ్నించగా... గట్టిగా మాట్లాడొద్దని హెచ్చరిస్తూ అందరి వాదనలు విన్నానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 4 రోజులపాటు ఈడీ కస్టడీకి మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ఈడీ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరో 4 రోజులపాటు పొడిగించింది. ఆయనను ఏప్రిల్ 1న ఉదయం 11 గంటల్లోగా తమ ఎదుట హాజరుపర్చాలని ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఈడీ అధికారులను ఆదేశించారు. కేజ్రీవాల్‌ను ఏడు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా, న్యాయమూర్తి నిరాకరించారు. కేవలం 4 రోజలుపాటు కస్టడీకి అనుమతించారు. గత ఐదు రోజులపాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించామని, తప్పించుకొనేలా ఆయన సమాధానాలిచ్చారని రిమాండ్ పిటిషన్లో ఈడీ వెల్లడించింది. -
తీహార్ జైలా ?..కస్టడీ పొడిగింపా ?
-
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
Updates ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజులు ఈడీ కోరినా నాలుగు రోజులే కస్టడీ పొడిగింపు. ఏప్రిల్ 1 వరకు కస్టడీలోనే కేజ్రీవాల్ సీబీఐ స్పెషల్ కోర్టులో ముగిసిన వాదనలు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వు. తీర్పును రిజర్వు చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు. మరో ఏడు రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరిన ఈడీ గోవా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాలన్న దర్యాప్తు సంస్థ నన్ను అరెస్టు చేయడమే ఈడీ లక్ష్యం : కేజ్రీవాల్ నిందితుడితో బలవంతంగా నా పేరు చెప్పించారు. నిందితుడు 55 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చారు. ఏ కోర్టు నన్ను దోషిగా పరిగణించలేదు. నా అరెస్టుకు తగిన ఆధారాలు లేవు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ అని చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా పార్టీని నిర్మూలించాలనుకుంటున్నారు. నా పేరు కేవలం నాలుగు సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈడీ వాదనలు: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ 100 కోట్ల లంచం తీసుకున్నారు. ఆయన విచారణకు సహకరించడం లేదు. ఈడీకి అరెస్టు చేసే హక్కు ఉంది. శరత్ చంద్రారెడ్డి 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రోలు బాండ్స్ రూపంలో బీజేపీకి ఇచ్చిన నిధులకు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధం లేదు. ఇది క్విడ్ ప్రోకో కిందికి రాదు. ఆమ్ ఆద్మీ పార్టీ హవాలా డబ్బు ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలు మా దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయి కోర్టుకు తీసుకు వెళ్లే సమయంలో కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు నా అరెస్ట్ రాజకీయ కుట్ర ఢిల్లీ ప్రజలే గట్టిగా సమాధానం చెబుతారు రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపర్చిన ఈడీ ఢిల్లీ: సీబీఐ స్పెషల్ కోర్టు ముందు కేజ్రీవాల్‌ను ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం కోర్టుకు చేరుకున్న కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపర్చనుంది. ఈడీ కస్టడీ పొడిగింపు కోరుతుందా? లేదంటే రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ అభియోగాలపై కేజ్రీవాల్‌ను మార్చి 21 ఆయన నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజు ఆయన్ను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టుకు హజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో కోర్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపర్చనుంది ఈడీ. ఒకవేళ కస్టడీ పొడగింపునకు కోర్టు అంగీకరించకపోతే మాత్రం ఆయన్ని తీహార్ జైలుకు తరలిస్తారు మరోవైపు తనను ఈడీ చేసిన అరెస్ట్ అక్రమమంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఆయనకు ఊరట లభించలేదు. కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈడీకీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్ రెండో ఆదేశం.. ఈడీ సీరియస్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అయితే, లాకప్ నుంచే ఆయన పాలన సాగిస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ఆయన రెండో ఆదేశం జారీ చేయగా.. కస్టడీ నుంచి ఆయన ఇస్తున్న ఆదేశాలపై ఈడీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ‘‘కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు’’ అని సౌరభ్ పేర్కొన్నారు. చదవండి: ఈడీ కస్టడీలో కేజ్రీవాల్: లాకప్ నుంచే తొలి ఆదేశం అంతా ఉత్తదేనా? ఇటీవల ఆయన నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి ఆతిశీకి నోట్ ద్వారా ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఆతిశీని ప్రశ్నించే అవకాశముంది. అయితే ఇప్పటికే కేజ్రీవాల్ ఇచ్చిన తొలి ఆదేశాలపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే సమయంలో కంప్యూటర్, పేపర్ అందుబాటులో లేని కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారా? అనే అంశంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇంతలోనే మరో ఆదేశం విడుదల కావడం.. దాన్ని ఆప్ గర్వంగా ప్రకటించుకోవడాన్ని ఈడీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. -
తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 15 జ్యూడీషియల్ రిమాండ్ విధించింది ట్రయల్ కోర్టు. ఏప్రిల్ 9 వరకు జ్యూడీషియర్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు. లిక్కర్ స్కాం కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ జ్యూడీషియల్ కస్టడీ కోరగా.. అదే సమయంలో కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. అయితే.. ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆమెకు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘‘సమాజంలో కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సాక్షాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుంది. లిక్కర్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కవిత పాత్రకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నాం. అక్రమ సొమ్ము గుర్తించే పనిలో ఉన్నాం. ఆర్థిక నేరాల దర్యాప్తు చాలా కఠినమైనది. ఆర్థిక నేరస్తులు చాలా వనరులు, పలుకుబడి ఉన్నవారు. పథకం ప్రకారం ప్రణాళికతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే దర్యాప్తు అనేది చాలా జఠిలమైనది. ఇందుకోసమైనా కవితను జ్యూడిషియల్ కస్టడీ కి పంపాలి’’ :::కవిత ఈడీ జ్యుడీషియల్ రిమాండ్ రిపోర్ట్ ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 9వ తేదీ దాకా కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అలాగే.. కవిత బెయిల్ పిటిషన్‌పై మరోసారి వాదనలు వినాల్సి ఉందని చెబుతూ.. ఏప్రిల్ 1వ తేదీకి ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసింది. బెయిల్‌పై వాదనల సందర్భంగా.. తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కవిత బెయిల్ పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. అయితే.. కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్. ఇక విచారణ సందర్భంగా.. కోర్టు ప్రాంగణంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు పెట్టారని అన్నారామె. అదే సమయంలో ఆమె తన భర్త అనిల్, బంధువులను కలిసి మాట్లాడేందుకు ఈడీ అనుమతించింది. ఇదీ చదవండి- అప్రూవర్‌గా మారను.. క్లీన్‌గా బయటకొస్తా: కవిత కవిత మేనల్లుడి అరెస్ట్‌కు రంగం సిద్ధం? మరోవైపు ఇవాళ లిక్కర్ స్కాం కేసులో ఇంకో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత మేనల్లుడు మేకా శరణ్‌ను ఈడీ విచారణ చేపట్టింది. లిక్కర్ స్కాం కేసులో అక్రమ సొమ్ము బదిలీలో శరణ్ కీలక పాత్ర పోషించారని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. శరణ్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. -
మరోసారి కస్టడీనా.. బెయిలా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. మంగళవారం ఉదయం కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈనెల 15న కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆమెకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం శనివారం మరోసారి కవితను కోర్టులో హాజరుపరచిన ఈడీ అధికారులు మరిన్ని రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. దీంతో మరో మూడు రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పదిరోజుల పాటు కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్‌ను కవితను అడుగుతూ అధికారులు విచారించారు. ఈ కేసులో ఇతర నిందితులతో కవిత జరిపిన వాట్సాప్ చాటింగ్ అంశంపై తొలిరోజు ఆమెను విచారించారు. ఈ కేసులో అరెస్టు అయిన వారితో ఏరకమైన సంబంధాలు ఉన్నాయి, వారిని ఎక్కడెక్కడ కలిశారు, వారికి కవితకు మధ్య ఏవిధమైన సంభాషణ జరిగిందనే విషయాలపై విచారణ జరిగింది. వీటితో పాటు ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ఒక్కో ప్రశ్న అడిగారు. వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చిన కవిత, మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లు సమాచారం. మరికొద్ది రోజులు కస్టడీ కోరనున్న ఈడీ! కవిత నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్న ఈడీ అధికారులు మంగళవారం విచారణ సందర్భంగా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరే అవకాశం ఉన్నట్లు అధికారుల నుంచి తెలుస్తోంది. ఇదే సందర్భంలో కవిత అరెస్టు అక్రమం అంటూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రెండు వాదనలను రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం వినే అవకాశంఉంది. దీంతో కవితను కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తుందా లేక, జ్యుడీషియల్ కస్టడీ విధి స్తుందా? ఈ రెండూ కాక బెయిలు మంజూరు చేస్తుందా? అనే అంశాలపై నేడు స్పష్టత వస్తుందని చెపుతున్నారు. కవితను కలసిన భర్త అనిల్ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోమవారం రాత్రి భర్త అనిల్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్‌రావు, పీఏ శరత్‌లు కలిశారు. సుమారు గంట పాటు కవితతో మాట్లాడారు. తొలుత కవిత భర్త అనిల్ ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పినట్లు సమాచారం. అలాగే తాము అంతా అండగా ఉన్నామంటూ వద్దిరాజు రవిచంద్ర భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మంగళవారం కవితను కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో.. న్యాయవాది మోహిత్‌రావు ఆమెతో పలు విషయాలను చర్చించినట్లు సమాచారం. ఈ చర్చల్లో ఆమె పీఏ శరత్ కూడా పాల్గొన్నారు -
కవిత కస్టడీ పొడిగింపు ?
-
సీఎం కేజ్రీవాల్ కు ఆరు రోజుల కస్టడీ ఇచ్చిన కోర్టు
-
కవిత పిటిషన్‌కు ఢిల్లీ కోర్టు అనుమతి
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై ఏడూ రోజుల ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. ఈ మేరకు కవితకు అనుమతినిచ్చింది సెషన్స్ కోర్టు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను 8 మంది కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. వారిలో తల్లి శోభా, పిల్లలు, కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతి లభించింది. ఇక.. శనివారం మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావులు కవితను ఈడీ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. వారు సుమారు గంటసేపు భేటీ అయి పలు అంశాలుపై చర్చించుకున్నట్లు తెలిసింది.అదేవిధంగా ఇవాళ.. ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలంటూ, అంతవరకు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దు అంటూ గతేడాది దాఖలైన పిటిషన్‌ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. -
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రెండో రోజు కస్టడీ విచారణ
-
కవితకు రిమాండ్, 7 రోజుల కస్టడీ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్‌లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. ఫామ్ హౌజ్‌కు కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం, ఆపై కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించిన పరిణామాల అనంతరం ఆమె తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వెళ్లిపోయారు. అయితే కవిత అరెస్టుపై ఇప్పటివరకూ కేసీఆర్ స్పందించలేదు. కవిత భర్తకు కూడా నోటీసులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అనూహ్యంగా మరో అడుగు ముందుకేసింది. కవిత భర్త అనిల్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే అనిల్ ఫోన్లను సీజ్ చేసింది ఈడీ. కవిత కస్టడీ రిపోర్టులో ఏముందంటే? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక కుట్ర దారు, ప్రధాన లబ్ధిదారు కవితే ఆమ్ అద్మీ పార్టీకి కవిత లిక్కర్ స్కాం ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారు మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు రూ. 30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది. మరోవైపు కవిత అరెస్టును ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీయడానికే రాజకీయ డ్రామా చేశారని, కవిత అరెస్టుపై ఆమె తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని, ఈడీ ఒకేరోజు హైదరాబాద్ వచ్చారని, ఈ కేసులో మోదీ మౌనం ఎందుకు వహిస్తున్నారని అడిగారు. కవిత అరెస్టుతో బీఆర్ఎస్ సానుభూతి, అవినీతిని సహించేది లేదంటూ బీజేపీ ఓట్లు దండుకునే యత్నం చేస్తున్నారన్నారు.