అక్కినేని నాగచైతన్య టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తన సొంతం టాలెంట్‌తోనే పేరు సంపాదించాడు. జోష్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు చైతూ. ఆ తర్వాత ఏమాయ చేశావే మూవీతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
(ఇది చదవండి: నాగచైతన్య 'కస్టడీ' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల)
వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ మే 12 విడుదలకానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య పోలీస్‌గా కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు నా జీవితంలో ఎలాంటి బాధకరమైన సంఘటనలు లేవు. నాకు ఎదురైన ప్రతి సంఘటన ఏదో ఒక పాఠం నేర్పింది. కానీ కొన్ని సినిమాల విషయంలో బాధపడ్డా. వాటిపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయా. ఆ విషయంలో మాత్రం బాధపడుతుంటా. మూడు చిత్రాల విషయంలో అలా జరిగింది.' అని చెప్పుకొచ్చారు.
కాగా.. కస్టడీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య చివరిసారిగా అమిర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దాలో కనిపించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశకు గురి చేసింది.
(ఇది చదవండి: కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment