ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత.. తొలిసారి స్పందించిన నాగచైతన్య! | Tollywood Hero Naga Chaitanya Reacts On N Convention Issue And His Marriage With Sobhita Dhulipala | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: ఆ విషయం గురించి ఇప్పుడెందుకు.. పెళ్లి గురించి త్వరలోనే చెప్తా!

Published Wed, Aug 28 2024 12:35 PM | Last Updated on Wed, Aug 28 2024 1:07 PM

Tollywood Hero Naga Chaitanya Responds On N Convention Issue

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. చండు మొండేటి  దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో మత్స్యకారుని పాత్రలో చైతూ కనిపించనున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఎన్‌ కన్వెన్షన్‌పై నాగచైతన్య

అయితే ఇటీవల హైదరాబాద్‌లో తన తండ్రి నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చేశారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఆ ఫంక్షన్‌ హాల్‌ను నిర్మించారని ఆరోపణలు రావడంతో అధికారులు నేలమట్టం చేశారు. దీనిపై నాగార్జున సైతం హైకోర్టును అశ్రయించారు. దీంతో హైకోర్టు వెంటనే స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఎన్‌ కన్వెన్షన్‌ పట్టా భూమినే అని.. దీనిపై న్యాయస్థానంలోనే పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ విషయంలో కోర్టులో నాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే తానే దగ్గరుండి కూల్చేవాడినని నాగార్జున అన్నారు. 

పెళ్లి వివరాలు త్వరలో చెబుతా

తాజాగా ఈ వ్యవహారంపై నాగచైతన్యకు ప్రశ్న ఎదురైంది. నగరంలో హిమాయత్‌నగర్‌లో ఓ షాపు ప్రారంభానికి వెళ్లిన చైతూకు ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతపై కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే ఈ సమయంలో ఆ టాపిక్ వద్దని చెప్పారు. ఆ విషయంపై నాన్న అన్ని వివరాలు వెల్లడించారని గుర్తు చేశారు. మీ పెళ్లి గురించి ప్రశ్న ఎదురవ్వగా.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కాగా.. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆయన పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement