N convention
-
N కన్వెన్షన్ కూల్చేసినప్పుడు.. నాగార్జున ఫోన్ చేశాడా?
-
N కన్వెన్షన్ కూల్చివేత వెనుక తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర
-
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. తొలిసారి స్పందించిన నాగచైతన్య!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. చండు మొండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో మత్స్యకారుని పాత్రలో చైతూ కనిపించనున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.ఎన్ కన్వెన్షన్‌పై నాగచైతన్యఅయితే ఇటీవల హైదరాబాద్‌లో తన తండ్రి నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చేశారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఆ ఫంక్షన్ హాల్‌ను నిర్మించారని ఆరోపణలు రావడంతో అధికారులు నేలమట్టం చేశారు. దీనిపై నాగార్జున సైతం హైకోర్టును అశ్రయించారు. దీంతో హైకోర్టు వెంటనే స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ పట్టా భూమినే అని.. దీనిపై న్యాయస్థానంలోనే పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ విషయంలో కోర్టులో నాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే తానే దగ్గరుండి కూల్చేవాడినని నాగార్జున అన్నారు. పెళ్లి వివరాలు త్వరలో చెబుతాతాజాగా ఈ వ్యవహారంపై నాగచైతన్యకు ప్రశ్న ఎదురైంది. నగరంలో హిమాయత్‌నగర్‌లో ఓ షాపు ప్రారంభానికి వెళ్లిన చైతూకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే ఈ సమయంలో ఆ టాపిక్ వద్దని చెప్పారు. ఆ విషయంపై నాన్న అన్ని వివరాలు వెల్లడించారని గుర్తు చేశారు. మీ పెళ్లి గురించి ప్రశ్న ఎదురవ్వగా.. డెస్టినేషన్ వెడ్డింగ్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కాగా.. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆయన పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
అవాస్తవాలు నమ్మొద్దు.. ఒక్క సెంట్ కూడా ఆక్రమించలేదు: నాగార్జున ట్వీట్
సాక్షి, హైదరాబాద్: అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేయడంపై మరో ట్వీట్ చేశారు. ఇప్పటికే హైకోర్ట్ నుంచి స్టే తెచ్చుకున్న ఆయన ఎన్-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవానికి దూరంగా ఉన్నాయని తెలిపారు. ఊహగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని.. అది పూర్తిగా పట్టా భూమి అని నాగ్ క్లారిటీ ఇచ్చారు. ఒక్క సెంట్ కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చిందని నాగార్జున వెల్లడించారు. కాగా.. తమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఆరోపణలు రావడంతో హైడ్రా నేలమట్టం చేసింది. అయితే కూల్చివేతకు ముందు కూడా తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని నాగార్జున తెలిపారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కచ్చితంగా తానే దగ్గరుండి నేలమట్టం చేసేవాడినని అన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల, మేమేదో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందన్నారు. స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ,N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు…— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 25, 2024 -
N కన్వెన్షన్ కూల్చివేతపై భట్టివిక్రమార్క సంచలన కామెంట్స్
-
అందుకే కూల్చేశాం.. ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రా రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా స్పందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమ్మిడికుంట చెరువు, ఎఫ్టిఎల్, బంఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాం. ఈ రోజు కూల్చిన నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు జరిపారు’’ అని హైడ్రా స్పష్టం చేసింది.తుమ్మిడికుంట, ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌పై 2014లోనే హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 2016లో హెచ్ఎండీఏ ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2014లో హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేశాక ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించింది. నిబంధనలు ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిని నిర్థారించమని హైకోర్టు సూచించింది. ఎన్ కన్వెన్షన్ ప్రతినిధుల సమక్షంలోనే ఎఫ్టీఎల్ సర్వే చేసి నివేదిక అందించాం. మేమిచ్చిన నివేదికపై ఎన్ కన్వెన్షన్ ప్రతినిధులు మియాపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు.’’ అని హైడ్రా పేర్కొంది.‘‘ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఎలాంటి స్టే ఇవ్వలేదు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. ఎన్ కన్వెన్షన్ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఒక ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలను ఎన్ కన్వెన్షన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది. గత ప్రభుత్వంలో ఆక్రమణలను రెగ్యులర్ చేయించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించింది.. కానీ అధికారులు తిరస్కరించారు. తమ్మిడికుంట చెరువు ఆక్రమణల వల్ల హైటెక్స్ పరిధిలోని నాలాలు మూసుకుపోయి వరద వస్తుంది. ఆక్రమణల వల్ల తమ్మిడికుంట చెరువు 50 నుంచి 60 శాతం వరకు కూచించుకుపోయింది.’’ అని హైడ్రా వెల్లడించింది. -
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి స్పందన..
ఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలు చేసినట్లు మల్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చట్టబద్ధంగానే వ్యవహరించిందని ఆయన స్పష్టం చేశారు.2014కు ముందు హైదరాబాద్‌లో ఉన్న చెరువులు ఎన్ని ఉన్నాయో.. ఇప్పుడు ఉన్న చెరువు ఎన్నో చూస్తే ఆక్రమణలు బయటపడతాయన్నారు. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మ్యాపులతో అన్ని లెక్కలు బయటపెడతామన్నారు. కబ్జా అయిన చెరువులను కాపాడవద్దని అంటారా? అని మీడియా సమావేశంలో విలేకర్లను ఎదురు ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి. ‘హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్ అండ్ రాక్స్. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా. దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నారు. బఫర్ జోన్ లో కాదు, నేరుగా చెరువులోనే కఠిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు. సాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నాం. రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఫోటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతాం.చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నాం. అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతాం. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత’ అని ఆయన పేర్కొన్నారు. -
నాగార్జునకు ఊరట.. కూల్చివేత ఆపేయండి.. హైకోర్టు ఆర్డర్స్
-
అన్యాయంగా కూల్చేశారు..నాగార్జున ఎమోషనల్
-
తెలంగాణ హైకోర్టులో నాగార్జునకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు.కాగా, తమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఆరోపణలు రావడంతో హైడ్రా దాన్ని నేలమట్టం చేసింది. స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు.కోర్టు కేసులు, స్టే ఆర్డర్లకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని నాగార్జున అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా తాము ఏ పనులూ చేయలేదని చెప్పడానికే ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు వివరించారు. పట్టా భూమిలోనే కన్వెన్షన్ హాల్ ఉందని, ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. ఇది ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. -
పూర్తిగా నేలమట్టమైన నాగార్జున N కన్వెన్షన్
-
‘హైడ్రా’ ఉక్కుపాదం.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత (ఫొటోలు)
-
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో లలా లాండ్ సీజన్ 3.0 (ఫోటోలు)
-
మాదాపూర్: ఆకట్టుకున్న ఇంటీరియర్ ప్రదర్శన (ఫొటోలు)
-
ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఫ్యాషన్ షో
-
ఎల్బీ నగర్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు
హైదరాబాద్ : అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం మూడో రోజుకు కూడా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, సరూర్ నగర్, ఏఎస్ రావ్ నగర్‌లోని అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా బీఎన్ రెడ్డి నగర్ లోని చైతన్య నగర్ లోని అయిదో అంతస్తును కూల్చివేశారు. కాగా కూల్చివేతలు ఆపాలంటూ స్థానికుల ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా నిన్న కాప్రా, ఉప్పల్, సైదాబాద్, ధూల్ పేట, గుడిమల్కాపూర్, అంబర్ పేట, ఆదర్శనగర్, రాజేంద్ర నగర్, నల్లగండ్ల, శేరిలింగంపల్లి, సీతాఫల్ మండీ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో 19 భవనాలను అధికారులు నేలమట్టం చేశారు. గడిచిన రెండు రోజులగుఆ మొత్తం 25 భవనాలకు కూల్చివేశారు. -
బీహెచ్ఈఎల్ ఎంఐజీలో అక్రమ కట్టడాల కూల్చివేత
హైదరాబాద్ : అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శేరిలింగంపల్లి బీహెచ్ఈఎల్ ఎంఐజీ ఫేజ్-3లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం కూల్చివేశారు. పోలీసుల మోహరింపు మధ్య అక్రమంగా నిర్మించిన మూడు భవనాలను పొక్లెయిన్లతో కూల్చివేశారు. మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఎలా కూల్చివేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 809 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించింది. వాటిలో 172 పెద్ద నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. -
'ఆ రెండు ప్రాంతాల' మినహా కూల్చివేతలు
హైదరాబాద్ : అక్రమ భవనాల కూల్చివేతలపై జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది. ఎల్బీనగర్, గోకుల్ ప్లాట్స్ మినహా మిగతా ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. పోలీసులు తక్కువగా ఉన్నందువల్ల కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు వాయిదా వేసినట్లు ఆయన మంగళవారమిక్కడ చెప్పారు. మిగిలిన అక్రమ భవనాలను ఎప్పుడు కూల్చివేసేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా ఇటీవలే గురుకుల్ ట్రస్ట్, అయ్యప్పసొసైటీలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసిన అధికారులు తాజాగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో నేటి నుంచి కూల్చివేతకు సిద్ధమయ్యారు. అక్రమ నిర్మాణాలపై నిఘా వేసిన జీహెచ్ఎంసీ అధికారులు 890 అక్రమ నిర్మాణాలను గుర్తించడంతో పాటు వాటికి సంబంధించి రిజిస్టర్లు కూడా తయారు చేశారు. వాటిల్లో భారీ అక్రమాలకు పాల్పడిన 172 భవనాలను కూల్చివేయాలని నిర్ణయించారు. -
ఉక్కుపాదం
* అక్రమ నిర్మాణాలకు ఆదిలోనే అడ్డుకట్ట * రంగంలోకి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు * హైదరాబాద్ పరిధిలోని 18 సర్కిళ్లకు 18 టీమ్స్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. వాటి నివారణకు ‘ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్’ను ఏర్పాటు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై ఈ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ రంగంలోకి దిగి అడ్డుకుంటాయి. తొలిదశలో సర్కిల్‌కి ఒకటి చొప్పున గ్రేటర్‌లోని 18 సర్కిళ్లకు వెరసి 18 ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్‌ల పనితీరును జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని అడిషనల్ సీసీపీ లేదా సీపీలు పర్యవేక్షిస్తారు. సర్కిల్లో ఉండే ఏసీపీ నేతృత్వంలో టీమ్ పనిచేస్తుంది. ఒక్కో ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌కు ఆరుగురు సిబ్బంది ఉంటారు. అక్రమ నిర్మాణాల ఫిర్యాదులే అధికం.. జీహెచ్ఎంసీకి వివిధ వర్గాల నుంచి, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల్లో టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెందినవి.. అందులోనూ అక్రమ నిర్మాణాలవే అధికం. వారం వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల వేదిక ‘ప్రజావాణి’లో సైతం అక్రమ నిర్మాణాల ఫిర్యాదులే ఎనభై శాతానికి పైగా ఉంటున్నాయి. వీటి పరిష్కారానికి ఒకటి రెండురోజుల్లో టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి, తగిన వ్యూహం, కార్యాచరణ రూపొందిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. నాలాలు, చెరువుల భూముల్లో నిర్మాణాలు జరిపితే కఠిన వైఖరి అవలంబిస్తామన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. తొందరపాటు చర్యలకు దిగబోమని, న్యాయనిపుణుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్ కన్వెన్షన్‌పై అక్రమ నిర్మాణ బోర్డు.... సర్వే చేసిన అధికారుల బృందం తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ ఉందని తేల్చిన విషయం తెలిసిందే. ఎన్కన్వెన్షన్ లోపల మార్కింగ్ అధికారులు తాజాగా ‘అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్’ అని రాశారు. గురుకుల్ ట్రస్టులోని నిర్మాణాలపైనా ఇదే తరహాలో రాస్తున్నారు. కాగా, తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసేందుకు సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని సోమవారం కలిశారు. చార్జీలు మూడు రెట్లు గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని భవనాల్లో ఇప్పటికే కరెంటు, తాగునీటి సదుపాయం పొందుతున్న వారికి జూలై నెల నుంచి మూడు రెట్ల బిల్లులు అందనున్నాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకు అక్రమ నిర్మాణాలు జరిపిన వారికి మూడు రెట్లు బిల్లులు వసూలు చేయవచ్చు. -
ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కొంత మేరకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తేల్చారు. తుమ్మిడికుంట చెరువును ఆనుకుని ఉన్న ఈ భారీ ఫంక్షన్ హాలు చెరువుకు సంబంధించి 25 మీటర్ల మేర ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు సర్వే చేసి తేల్చారు. వాస్తవానికి చెరువు ఫుల్ట్యాంక్ లెవెల్‌తో పాటు, బఫర్ జోన్‌గా మరో 30 మీటర్లు కూడా ఉండాల్సి ఉంది. అయితే, చెరువు గట్టునే ఉన్న ఈ సెంటర్ హాలులో 25 మీటర్లు ఫుల్ట్యాంక్ లెవెల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.