సాక్షి, హైదరాబాద్: అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేయడంపై మరో ట్వీట్ చేశారు. ఇప్పటికే హైకోర్ట్ నుంచి స్టే తెచ్చుకున్న ఆయన ఎన్-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవానికి దూరంగా ఉన్నాయని తెలిపారు. ఊహగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని.. అది పూర్తిగా పట్టా భూమి అని నాగ్ క్లారిటీ ఇచ్చారు. ఒక్క సెంట్ కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చిందని నాగార్జున వెల్లడించారు.
కాగా.. తమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఆరోపణలు రావడంతో హైడ్రా నేలమట్టం చేసింది. అయితే కూల్చివేతకు ముందు కూడా తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని నాగార్జున తెలిపారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కచ్చితంగా తానే దగ్గరుండి నేలమట్టం చేసేవాడినని అన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల, మేమేదో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందన్నారు. స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ,
N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు…— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 25, 2024
Comments
Please login to add a commentAdd a comment