అక్రమ భవనాల కూల్చివేతలపై జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది. ఎల్బీనగర్, గోకుల్ ప్లాట్స్ మినహా మిగతా ప్రాంతాల్లో...
హైదరాబాద్ : అక్రమ భవనాల కూల్చివేతలపై జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది. ఎల్బీనగర్, గోకుల్ ప్లాట్స్ మినహా మిగతా ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. పోలీసులు తక్కువగా ఉన్నందువల్ల కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు వాయిదా వేసినట్లు ఆయన మంగళవారమిక్కడ చెప్పారు. మిగిలిన అక్రమ భవనాలను ఎప్పుడు కూల్చివేసేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
కాగా ఇటీవలే గురుకుల్ ట్రస్ట్, అయ్యప్పసొసైటీలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసిన అధికారులు తాజాగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో నేటి నుంచి కూల్చివేతకు సిద్ధమయ్యారు. అక్రమ నిర్మాణాలపై నిఘా వేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు 890 అక్రమ నిర్మాణాలను గుర్తించడంతో పాటు వాటికి సంబంధించి రిజిస్టర్లు కూడా తయారు చేశారు. వాటిల్లో భారీ అక్రమాలకు పాల్పడిన 172 భవనాలను కూల్చివేయాలని నిర్ణయించారు.