collapse
-
సెల్లార్ల తవ్వకాలు.. తెల్లారుతున్న బతుకులు
సాక్షి, హైదరాబాద్ : భవన నిర్మాణాల్లో బిల్డర్ల ఉల్లంఘనలు, అధికారుల ఆమ్యామ్యాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. నిర్మాణాల్లో పలు డీవియేషన్లకు పాల్పడే బిల్డర్లు సెల్లార్ల తవ్వకాల్లోనూ కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో.. పొట్టకూటి కోసం పనిచేసే కార్మికులు అసువులు బాస్తున్నారు. తాజాగా బుధవారం ఎల్బీనగర్ పరిధిలో ముగ్గురి ప్రాణాలు పోవడం వెనుకా నిలువెత్తు నిర్లక్ష్యమే బట్టబయలైంది. సంబంధిత అధికారులు సైతం మొక్కుబడిగా నోటీసులిస్తూ చేతులు దులుపుకుంటున్నారు తప్ప పనులు ప్రారంభమైనప్పటి నుంచీ తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవడం లేదు. బిల్డర్లు, అధికారులకు మధ్యనున్న ‘ఆర్థిక సంబంధాలే’ ఇందుకు కారణమనే ఆరోపణలు షరా‘మామూలు’గా మారాయి. నిబంధనలు కాగితాల్లోనే.. ⇒ అనుమతులతోపాటు పాటించాల్సిన నిబంధనలు కాగితాల్లో ఉంటున్నాయి తప్ప చాలామంది వాటిని పాటించడం లేదు. నిబంధనల మేరకు సెల్లార్ తవ్వే నేల బలంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించాలి. పనులు జరిగే ప్రాంతంలో బారికేడింగ్, రిటైనింగ్ వాల్ ఉండాలి. ప్రస్తుతం పనులు తొలి దశలోనే ఉన్నందున రిటైనింగ్ వాల్ దాకా రాలేదు కానీ మిగతా జాగ్రత్తలు కూడా పాటించలేదు. ⇒ నేల జారిపోకుండా అవసరమైన పటిష్టతా చర్యలు చేపట్టాల్సి ఉండగా అవీ జరగడంలేదు. తగిన సెట్బ్యాక్లు లేవు. సెల్లార్ తవ్వకం ప్రాంతాన్ని నిత్యం పరిశీలిస్తూ, ఎక్కడైనా నేల బలహీనంగా ఉన్నా, జారిపోయేలా ఉన్నా వెంటనే తగిన చర్యలు చేపట్టాలి. కానీ వాటిని పట్టించుకోలేదు. నిర్మాణంలో భద్రతా చర్యలు, కారి్మకుల రక్షణ చర్యలు గాలికొదిలేశారు. ⇒ జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు సెల్లార్ తవ్వకానికి ముందు నిర్మాణదారు సంబంధిత అధికారికి సమాచారమివ్వాల్సి ఉండగా, ఆ పని చేయలేదు. సంబంధిత సర్కిల్ అధికారి గతనెల 16వ తేదీన ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి నోటీసు ఇచి్చనట్లు ఎల్బీనగర్ జోన్ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారి తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే సెల్లార్ తవ్వకం పనులు మొదలు పెట్టారు. అందువల్లే వదులుగా ఉన్న మట్టి మీదపడి ముగ్గురి ప్రాణాలు పోవడంతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృత్యు ఘంటికలు ఇలా.. చాలా ప్రాంతాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండానే సెల్లార్లు తవ్వుతున్నారు. గత సంవత్సరం అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. ఎల్బీనగర్జోన్లో ఇవి ఎక్కువగా ఉండటం కూడా వెల్లడైంది. తవ్వకాల్లో వెలువడిన మట్టిని తరలించే లారీలు ఓవర్‌లోడ్‌తో వెళ్తుండటాన్ని గుర్తించారు. ⇒ సెల్లార్ తవ్వకాల్లో ఉల్లంఘనల వల్లే దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నానక్‌రామ్‌గూడలో భవనం కూలి పదిమందికి పైగా మరణించారు. ⇒ 2017లో కొండాపూర్‌లో ఓభవన నిర్మాణానికి సంబంధించి 30 అడుగుల లోతున జరుగుతున్న సెల్లార్ పనుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ⇒ 2019లో ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న సెల్లార్లో పడి ఇద్దరు మైనర్ బాలలు మరణించారు. ⇒ 2020లో మాదాపూర్ ఖానామెట్‌లో ప్రై వేట్ కళాశాల బస్సు సెల్లార్ గుంతలో పడింది.కూకట్‌పల్లిలో ఏడాదిక్రితం నిబంధనలు పాటించనందున సెల్లార్ తవ్వుతున్న పరిసరాల్లో నేల కుంగింది. -
యూపీ: బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం
-
కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు
బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులోని బాబాసపాల్యా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. మంగళవారం(అక్టోబర్ 22) ఈ ఘటనలో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు.పదిహేడు మంది దాకా కార్మికులు భవన శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లు సమాచారం. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు నలుగురిని కాపాడారు. మిగిలిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్లే భవనం కూలిపోయినట్లు తెలుస్తోంది.#Karnataka: Incessant rains have caused the collapse of an under-construction multi-storey building in Babasapalya near Hennur in #Bengaluru. Sixteen labourers are reportedly trapped beneath the debris, while one labourer, who sustained injuries, managed to escape after the… pic.twitter.com/cENnfDuO1j— South First (@TheSouthfirst) October 22, 2024 ఇదీ చదవండి: నాగపూర్‌లో పట్టాలు తప్పిన రైలు -
Kolkata: విమానం ప్రయాణంలో విషాదం
ఇరాక్ నుంచి చైనా వెళ్తున్న విమానంలో విషాదం చోటు చేసుకుంది. ఓ టీనేజీ ప్రయాణికురాలు అస్వస్థతకు గురై సీటులోనే కుప్పకూలిపోగా.. విమానాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే.. ఆస్పత్రికి తరలించేలోపు ఆ బాలిక కన్నుమూసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలు బాగ్దాద్ సర్ చినార్ ప్రాంతానికి చెందిన డెరన్ సమీర్ అహ్మద్(16). మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఏఐ 473 విమానంలో చైనా గువాంగ్జౌకు వెళ్తోంది. అయితే బుధవారం అర్ధరాత్రి దాటాక.. హఠాత్తుగా ఆమె అస్వస్థతకు గురైంది.దీంతో విమానాన్ని దారి మళ్లించి అరగంటకు కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్ట్‌లో దించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమెను ఏఏఐ ఆంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత గురువారం అర్ధరాత్రి మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి బయల్దేరింది. ఈ ఘటనపై అసహజ మరణంగా కోల్‌కతా బాగౌతి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం పూర్తి అయ్యాక.. మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. -
మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోని జనసాంద్రత అధికంగా ఉండే జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.అకస్మాత్తుగా ఇల్లు కూలిపోవడంతో 12 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు, శిథిలాల నుండి మొత్తం ఆరుగురిని వెలికితీశారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. గాయపడిన ముగ్గురిని లాలా లజపతి రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీకి తరలించారు.మీరట్ డిఎం దీపక్ మీనా మీడియాతో మాట్లాడుతూ సంఘటనా స్థలంలో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు. వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా జాకీర్ కాలనీలోని మూడంతస్తుల ఇల్లు కూలిన విషయాన్ని ధృవీకరిస్తూ, శిథిలాల కింద ఆరుగురు సమాధి అయ్యారని తెలుస్తోందని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు.ఇది కూడా చదవండి: చమురు ట్యాంకర్‌కు మంటలు -
నదిపై కుప్పకూలిన బ్రిడ్జి.. ఎనిమిది మంది గల్లంతు
హనోయ్: వియత్నాంలో ఎర్ర నదిపై ఉన్న 30 ఏళ్ల నాటి వంతెన కుప్ప కూలింది. ఉత్తర ప్రావిన్సు ఫుథోలో సోమవారం(సెప్టెంబర్9) ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో దానిపై ప్రయాణిస్తున్న 8 మంది నదిలో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఎర్ర నదిపై ఉన్న మిగిలిన వంతెనల మీద రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని చోట్ల పూర్తిగా నిషేధించారు.ట్రాఫిక్ ఆపేసిన వాటిలో రాజధాని హనోయ్‌లోని చోంగ్డోంగ్ బ్రిడ్జి కూడా ఉంది. భారీ తుపాను యాగీ బీభత్సం వల్లే వంతెన కూలినట్లు అధికారులు తెలిపారు. తుపాను ధాటికి మొత్తం 58 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి.. నిప్పులు చిమ్మే డ్రోన్ డ్రాగన్ -
ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం
-
కూలిన భారీ చెత్తకుప్ప..18 మంది మృతి
కంపాల: ఉగాండా రాజధాని కంపాలలో డంపింగ్‌యార్డులోని మట్టితో కప్పేసిన భారీ చెత్తకుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు. మృతిచెందిన వారిలో చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారు.వీధుల్లో ప్లాస్టిక్ ఏరుకునే వారు చెత్తకుప్ప కూలిన సమయంలో అక్కడే ఉండటంతో వారు చెత్తకుప్ప కింద పడి మృతి చెందారు. భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యకు వర్షం అడ్డంకిగా మారింది. -
Mexico: కూలిన పిరమిడ్.. వినాశానికి సంకేతమా?
మెక్సికోలో తుఫాను కారణంగా అత్యంత పురాతన తెగకు చెందిన ఒక పిరమిడ్ కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఇది పెనువిపత్తుకు, వినాశనానికి నాంది అంటూ పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ పురాతన తెగకు చెందిన వారసులు పిరమిడ్లు కూలడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కూలిన పిరమిడ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిరమిడ్ పాక్షికంగా కూలిపోయి ఉండటం, దానిలో కొంత భాగం కొట్టుకుపోయినట్లు ఉండటాన్ని ఈ ఫొటోలలో చూడవచ్చు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పురాతన పురేపెచా తెగ వారు తమ దేవతకు మానవ బలులు అర్పించడానికి యకాటా పిరమిడ్‌ను ఉపయోగించేవారని తెలుస్తోంది. యకాటా పిరమిడ్లు మిచోకాన్ రాష్ట్రంలోని ఇహుట్జోలో ఉన్నాయి.ఇప్పడు వచ్చిన తుఫాను పెను విధ్వంసాన్ని సూచిస్తుందని స్థానికుడు తరియాక్విరి అల్వారెజ్ మీడియా ముందు పేర్కొన్నారు. ఇది మా పూర్వీకులకు సంబంధించిన చేదువార్త. ఇది విపత్కర సంఘటనను సూచిస్తోందని ఆయన అన్నారు. 1519లో స్పానిష్ దండయాత్రకు ముందు పురేపెచా తెగలు అజ్టెక్లను ఓడించి 400 సంవత్సరాలు పాలించాయి.మెక్సికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (ఐఎన్ఏహెచ్) ఒక ప్రకటనలో.. ఇహుట్జోలో ఒక పిరమిడ్ కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇది జరిగింది. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలుప్రాంతాల్లో భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొంది. పిరమిడ్ బయటి గోడ, లోపలి భాగం దెబ్బతిన్నట్లు సర్వేలో వెల్లడైంది. దీనికి మరమ్మతు చేయడంపై అధికారులు దృష్టి సారించారని తెలిపింది. -
‘సుంకిశాల’ నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తాడు
సాక్షి, హైదరాబాద్/పెద్దవూర: జంటనగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల వద్ద చేపడుతున్న ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిన సంఘటన చిన్నదని, నష్టం తక్కువైనా చాలా దురదృష్టకరమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. పనులు పూర్తి కావడానికి రెండు నెలలు ఆలస్యమవుతుందని, ఎంతటి నష్టమైనా కాంట్రాక్టరే భరిస్తాడని, ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును కాంట్రాక్టర్ పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. నీట మునిగిన సుంకిశాల పంప్‌హౌస్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిలతో కలిసి పరిశీలించారు.అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. సుంకిశాల ప్రాజెక్టుకు ఈ పరిస్థితి రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. సుంకిశాల ప్రాజెక్టును డిజైన్ చేసింది, కాంట్రాక్ట్ ఇచ్చింది. నిర్మాణం చేపట్టింది బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు ఎందుకు మొత్తుకుంటున్నారో అర్థం కావడం లేదని, ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఈ పనులను ప్రారంభించటంలో మతలబు ఏమిటో వారే చెప్పాలన్నారు. శ్రీశైలం సొరంగం పనులు పూర్తి చేసి ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందేదని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి తీరుతామని చెప్పారు. సీఎంపై ఆరోపణలు సరికావు : గుత్తా సుంకిశాల ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యుడని రాజకీయ ఆరోపణలు కేటీఆర్ చేయడం సరికాదని, ప్రస్తుతం మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నంత మాత్రాన ఈ ఘటనకు సీఎం బాధ్యుడని అంటే ఎలా అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లోనే ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో, ఎవరి కోసం చేపట్టాల్సి వచ్చిందో కేసీఆర్, కేటీఆర్‌లలో ఎవరి మానసపుత్రికనో వారికే తెలియాలన్నారు. గ్రావిటీ ద్వారా తాగునీరు అందిస్తాం : తుమ్మలప్రభుత్వంపై ఎత్తిపోతల భారం లేకుండా మిగిలి పోయిన 9.5 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేసి నల్లగొండజిల్లాకు సాగునీటితో పాటు జంట నగరాలకు గ్రావిటీ ద్వారా తాగునీరు ఇవ్వ టానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వరద ఉధృతి ని ఏజెన్సీ ఊహించకపోవడం, త్వరగా పూర్తి చేయా లన్న తపనో, త్వరగా నీరు ఇవ్వాలన్న తాపత్ర యమో దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు. ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో వెంటనే ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందన్నారు. రిపోర్టు రాగానే ఏంచర్యలు తీసుకో వాలి.. బాధ్యులు ఎవరనేది తప్పకుండా ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. సుంకిశాలను సందర్శించిన వారిలో జలమండలి ఎండీ ఆశోక్‌రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇంజనీర్ల బృందం కూడా ఉంది.పునర్నిర్మాణ వ్యయం రూ.20 కోట్లపైనేరిటైనింగ్ వాల్ నిర్మాణ ఖర్చు భరించేందుకు కాంట్రాక్టర్ సంస్థ అంగీకరించనట్టు తెలి సింది. అయితే ఈ పనులకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం తగ్గిన తర్వాతనే దెబ్బతిన్న భాగాన్ని తిరిగి నిర్మించే అవకాశాలున్నాయి. సుంకిశాల ‘ఘటన’. రిటైనింగ్ వాల్ కూలిన వ్యవహారంలో గోప్యత ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పనుల నాణ్యతపై కూడా ఆరా తీస్తోంది. -
Uttar Pradesh: కూలిన రెండు ఇళ్లు.. శిథిలాల కింద పలువురు..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాశీ విశ్వనాథుని దేవాలయం సమీపంలో సోమవారం అర్థరాత్రి రెండు ఇళ్లు కూలిపోయాయి. చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోయా గల్లీ కూడలి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.సమాచారం అందుకున్న అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదం దరిమిలా కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లే నాల్గవ నెంబరు ద్వారాన్ని మూసివేశారు. ఆలయానికి వెళ్లే సందర్శకులకు గేట్ నంబర్ వన్, గేట్ నంబర్ టూ నుంచి ప్రవేశం కల్పిస్తున్నారు. కూలిపోయిన రెండు ఇళ్లు 70 ఏళ్ల క్రితం నాటివని అధికారులు తెలిపారు. #WATCH | Kaushal Raj Sharma, Commissioner Varanasi Division says "Two houses collapsed here in which 9 people were trapped. 2 of them came out on their own and 7 others were rescued. One woman has lost her life and the remaining are under treatment. The rescue operation is almost… pic.twitter.com/YWhycEVmgZ— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 6, 2024 -
చైనా ప్రమాదం.. 38కి చేరిన మృతులు
చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో హైవే బ్రిడ్జి పాక్షికంగా కూలిన ఘటనలో మృతుల సంఖ్య సంఖ్య 38కి చేరుకుంది. సుమారు 25 మంది జాడ ఇంకాతెలియరాలేదు. జూలై 19న జరిగిన ఈ ప్రమాదంలో 25కుపైగా వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగా వెళుతూ, వేగంగా ప్రవస్తున్న నదిలో పడిపోయాయి. ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో రెస్క్యూ సిబ్బంది ఒకరిని రక్షించారు. షాంగ్సీ ప్రావిన్స్‌లోని డానింగ్ హైవేపై వంతెన కూలిపోయిన ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.మీడియాకు అందిన సమాచారం ప్రకారం వంతెన కూలిన సమయంలో 25 కార్లు నదిలో పడిపోయాయి. బాధితుల కోసం రెస్క్యూ బృందాలు కిలోమీటర్ల మేర వెదుకులాట సాగించాయి. రాష్ట్ర వార్తా సంస్థ జిన్హువా విడుదల చేసిన ఫోటోలో వంతెనలోని ఒక భాగం కూలిపోయి ఉండటాన్ని గమనించవచ్చు.ఈ ప్రమాదం బారినపడి గల్లంతైన వారి కోసం వెదుకులాట ఇంకా కొనసాగుతోంది. ఇటీవల చైనాలో సంభవించిన గ్యామీ తుఫాను కారణంగా 48 మంది మృతి చెందారు. అలాగే మేలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో ఒక వంతెన కూలిపోయిన ఘటనలో 36 మంది మృతిచెందారు. -
Mumbai: కూలిన భవనం.. శిథిలాల కింద పలువురు?
మహారాష్ట్రలోని నవీ ముంబైలో మూడంతస్తుల భవనం ‘ఇందిరా నివాస్’ కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షాబాజ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ముంబై పోలీసులు, అగ్నిమాపక శాఖ, మున్సిపాలిటీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. #WATCH नवी मुंबई (महाराष्ट्र): शाहबाज गांव में तीन मंजिला इमारत 'इंदिरा निवास' ढह गई है। कई लोग मलबे में फंसे हुए हैं। मौके पर NDRF, पुलिस, अग्निशमन दल और नगरपालिका के अधिकारी पहुंचे हैं। बचाव कार्य जारी है।अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/oNkccmXiS1— ANI_HindiNews (@AHindinews) July 27, 2024 మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4:35 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. భవనం కూలిపోతుండటాన్ని గ్రహించిన కొందరు బయటకు పరుగుపరుగున వచ్చారు. అయితే కొందరు బయటకు రావడం ఆలస్యం కావడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించామని నవీ ముంబై మునిసిపల్ కమిషనర్ కైలాష్ షిండే తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపడుతున్నదని, కుప్పకూలిన భవనం పదేళ్ల క్రితం నాటిదని అన్నారు. భవన యజమానిపై చర్యలు తీసుకుంటామని షిండే పేర్కొన్నారు. #WATCH नवी मुंबई (महाराष्ट्र): कैलाश शिंदे (पालिका आयुक्त नवी मुंबई) ने कहा, "करीब आज सुबह 5 बजे के पहले ये इमारत ढह गई। ये जी+3 की इमारत है सेक्टर-19, शाहबाज गांव में है। ये 3 मंजिला इमारत था इमारत से 52 लोग सुरक्षित बाहर निकले और मलबे में फंसे 2 लोगों को बचाया गया है और भी 2… https://t.co/tKmHs4xIWG pic.twitter.com/6ha8X3PtW9— ANI_HindiNews (@AHindinews) July 27, 2024 -
కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్ శాటిలైట్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. అది గురువారం ప్రయోగించిన 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయి. స్పేస్ ఎక్స్ కూడా దీన్ని ధ్రువీకరించింది. ప్రయోగ సమయంలో చోటుచేసుకున్న పొరపాటే ఇందుకు కారణమని తెలిపింది. ‘‘గురువారం రాత్రి ప్రయోగం మొదలైన కాసేపటికి ఫాల్కన్–9 రాకెట్ రెండో దశ ఇంజన్ సకాలంలో మండటంలో విఫలమైంది. దాంతో ఉపగ్రహాలు ఉద్దేశించిన కక్ష్యకు బదులు భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించాయి. దాంతో వాటి మనుగడ అసాధ్యంగా మారింది. అవి త్వరలో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోనున్నాయి’’ అని వివరించింది. అయితే, ‘‘వాటివల్ల ఇతర ఉపగ్రహాలకు ఏ సమస్యా ఉండబోదు. అలాగే ఉపగ్రహాలు ఒకవేళ భూమిని తాకినా జనావాసాలకు ముప్పేమీ ఉండదు’’ అని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ అత్యంత విశ్వసనీయంగా పని చేసిన ఫాల్కన్–9 రాకెట్ చరిత్రలో ఇది తొలి భారీ వైఫల్యంగా చెప్పవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘‘బిహార్‌లో బ్రిడ్జిలు కూలడం వెనుక కుట్ర’’
పాట్నా: బిహార్‌లో వరుసగా బబ్రిడ్జిలు కూలిపోవడంపై కేంద్ర మంత్రి జితన్‌రామ్ మాంజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంతెనలు వరుసగా కూలిపోవడం వెనుక ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలన్న కుట్ర ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.‘రెండు నెలల క్రితం బ్రిడ్జిలన్నీ సరిగానే ఉన్నాయి. ఇప్పుడేమో వరుసపెట్టి కూలిపోతున్నాయి. ప్రభుత్వాన్ని అవమానించేందుకు కొంత మంది కావాలనే ఇది చేస్తున్నారని అనుమానం వస్తోంది. వంతెనలు కూలిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నాకు సమాచారం ఉంది’అని మాంజీ అన్నారు. గడిచిన 10 రోజుల్లో బిహార్‌లో వరుసపెట్టి బ్రిడ్జిలు కూలిపోవడం చర్చనీయాంశమైంది. -
రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టు ఘటన, ‘నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’: బీజేపీ
న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా అటు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్, ఇటు గుజరాత్‌లోని రాజ్ కోట్ మినాశ్రయంలోని టెర్మినల్ రూఫ్ కూలిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. రాజ్ కోట్ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.అయితే వరుస ఘటనలను ఉద్దేశిస్తూ కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ ఎయిర్‌పోర్టును గతేడాదే మోదీ ప్రారంభించారని, అప్పుడే కూలిపోయిందని దుయ్యబట్టింది. దీనికి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ఘటనకు నెహ్రూను నిందించొద్దని, ఎందుకంటే ఆయన విమానాశ్రయాలు కట్టించలేకపోయారని ఎద్దేవా చేసింది.దీనికి బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వీయా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీకి దీటుగా బదులిచ్చారు. ‘‘భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టులోని క్లాత్ టెంట్ చిరిగిపోయింది. అంతేగానీ.. కట్టడం కూలినట్లు కాదు. ఇక, ఈ ఘటనకు మనం నెహ్రూ (మాజీ ప్రధాని)ను నిందించొద్దు. ఎందుకంటే ఆయన ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలను నిర్మించలేదు.ఆయన హయాంలో మనమంతా డీఆర్డీవో ధ్రువీకరించిన ఎడ్లబండ్లలో ప్రయాణించాం’’ అని అన్నారు. ఇక, దిల్లీ ఘటన నేపథ్యంలో దేశంలోని అన్ని చిన్నా పెద్ద విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించాలని పౌరవిమానయాన శాఖ ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. -
బాల్టిమోర్ బ్రిడ్జి ఘటన.. నౌకలోని 8 మంది సిబ్బంది భారత్‌కు
వాషింగ్టన్: అమెరికాలోని బాల్టిమోర్ బ్రిడ్జిని ఢీకొట్టిన కంటెయినర్ నౌకలోని భారతీయ సిబ్బందిలో 8 మంది స్వదేశం బయలుదేరారు. వీరు ఇండియా రావడానికి కోర్టు అనుమతిచ్చింది. నౌక బాల్టిమోర్ బ్రిడ్జిని ఢీకొట్టి మూడు నెలలు కావస్తోంది. నౌకలోని మొత్తం 21 మంది సిబ్బందిలో ఇంకా నలుగురు నౌకలోనే ఉన్నారని బాల్టిమోర్ మారిటైమ్ ఎక్స్చేంజ్ తెలిపింది. మిగిలిన సిబ్బందిని మాత్రం బాల్టిమోర్‌లోని ఓ సర్వీస్ రెస్టారెంట్లో ఉంచారు. నౌక బ్రిడ్జిని ఢీకొన్న ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్నందునే వీరిని ఇంకా అక్కడ ఉంచినట్లు సమాచారం. నౌకలోని 21 మంది సిబ్బందిలో 20 మంది భారతీయులే. నౌక బాల్టిమోర్ నుంచి శుక్రవారం వర్జీనియాలోని నార్ఫోక్ బయలుదేరింది. అక్కడ దానిని రిపేర్ చేస్తారు. ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని బాల్టిమోర్ ఫ్రాన్సిస్ స్కాట్‌కీ బ్రిడ్జ్‌ను కంటెయినర్ నౌక ఢీకొనడంతో బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో బ్రిడ్జిపై పనిచేస్తున్న ఆరుగురు నిర్మాణ కార్మికులు మృతి చెందారు. -
ఎన్డీఏ సర్కారు త్వరలోనే కూలుతుంది: ఖర్గే
బెంగళూరు: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున మూడోసారి అధికారంలోకి వచి్చందని, త్వరలోనే కుప్పకూలుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి వచి్చంది. ప్రజల తీర్పు మోదీకి అనుకూలంగా లేదు. ఈయనది మైనారిటీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అతిత్వరలో కుప్పకూలుతుంది’అని పేర్కొన్నారు. ‘దేశ క్షేమం కోసం ఈ ప్రభుత్వం కొనసాగాలనే కోరుకుంటున్నాం. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తాం. కానీ, మన ప్రధానికి సవ్యంగా కొనసాగే ఏ పనికైనా అవాంతరం కల్పించడం అలవాటు. అయినప్పటికీ దేశం కోసం మేం సహకారం అందిస్తూనే ఉంటాం’అని ఖర్గే అన్నారు. భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపై ఉంచడంలో బీజేపీ ఇబ్బందులను ఎదుర్కొంటోందంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ చీఫ్ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఖర్గే వ్యాఖ్యలపై ఎన్డీఏ పక్షాలైన జేడీయూ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ), హిందుస్తానీ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎం) తీవ్రంగా స్పందించాయి. గతంలో కాంగ్రెస్ సారథ్యంలో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌ల ప్రభుత్వాలు ఎలా కొనసాగాయో చరిత్ర చెబుతోందని ఖర్గేను ఎద్దేవా చేశాయి. కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన మైనారిటీ ప్రభుత్వం పీవీ నరసింహారావు రాజకీయ చతురతతో రెండేళ్లలోనే మెజారిటీ ప్రభుత్వంగా మారిందని జేడీయూ తెలిపింది. ఇటీవలి ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాలు పొరపాటున కొంత బలం పుంజుకున్నాయని, ప్రతిపక్ష పోషించాలని రిపబ్లికన్ పార్టీ, హెచ్ఏఎంలు ఖర్గేకు సలహా ఇచ్చాయి. -
నాగర్ కర్నూల్: ఈదురుగాలుల బీభత్సం.. గోడ కూలి నలుగురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: తాడూరు మండలం ఇంద్రకల్లో విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షం కూలీ కుటుంబాల బతుకులను చేసింది. ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆదివారం సాయంత్రం అకాలంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి గ్రామంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల షెడ్డు కూలి నలుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.ఇంద్రకల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మాణానికి 6 మంది కూలీలు వెళ్లారు. గోడలు కడుతుండగా ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది పని ముగించుకొని నిర్మాణంలో ఉన్న గోడ పక్కనే కూర్చున్నారు. తీవ్రమైన ఈదురుగాలులతో ఒక్కసారిగా గోడకూలి కూలీలపై పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
ముంబై, సాక్షి: ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఘాట్కోపర్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఈదుర గాలుల ధాటికి 100 అడుగుల ఎత్తైన భారీ ఇనుప హోర్డింగ్ కూలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. వంద మంది దాకా గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.Breaking : Death Toll in the Mumbai Hoarding collapse rises to 8. 30 still feared trapped. How is the crushing of 8 people , under a 100 ft hoarding , in India's financial capital NOT a news priority on Prime Time TV ? pic.twitter.com/G29jzn47IH— Shreya Dhoundial (@shreyadhoundial) May 13, 2024 #WATCH | Ghatkopar hoarding collapse incident | Latest visuals from the accident spot; rescue and search operation underway8 people have died and approximately 20-30 are trapped under the hoarding which collapsed in Maharashtra's Ghatkopar. pic.twitter.com/OFCajrg7iT— ANI (@ANI) May 13, 2024 సోమవారం సాయంత్రం 4గం.30 ప్రాంతంలో.. గాలుల ధాటికి ఘాట్కోపర్లోని సమతా నగర్లో భారీ హోర్డింగ్ కూలి రైల్వే పెట్రోల్ పంపుపై పడింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీంలు రంగంలోకి దిగారు. 14 మంది మృతదేహాల్ని వెలికి తీశాయి. కూలిన హోర్డింగ్ కింద కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని ముంబయి నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.#WATCH | Mumbai: The death toll in the Ghatkopar hoarding collapse incident has risen to 14. There were a total of 88 victims, out of which 74 were rescued injured: NDRF(Morning visuals of the rescue operations from the spot) pic.twitter.com/vggAIlfY3g— ANI (@ANI) May 14, 2024 ఇక దాదర్, కుర్లా, మాహిమ్, ఘాట్కోపర్, ములుండ్, విఖ్రోలి, దక్షిణ ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతోపాటు, బలమైన ఈదురు గాలులు వీచాయి. కొన్నిచోట్ల దట్టంగా దుమ్ము ఎగసిపడింది.#WATCH | Ghatkopar hoarding collapse incident | Maharashtra CM Eknath Shinde says, "...Rescuing the people is our priority. Government will take care of the treatment of those who are injured in the incident. Rs 5 lakh will be given to the family of those who have lost their… pic.twitter.com/uMPQjJLQ90— ANI (@ANI) May 13, 2024 వడాలాలోని బర్కత్ అలీ నాకాలో శ్రీజీ టవర్ సమీపంలో వడాలా-అంటోప్ హిల్ రోడ్డులో సాయంత్రం నాలుగు గంటలకు నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్ రైల్వే రెండు గంటలకుపైగా లోకల్ రైలు సేవలను నిలిపివేసింది. అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.ముంబయి విమానాశ్రయంలో దృగ్గోచరత పడిపోవడంతో గంటా ఆరు నిమిషాల పాటు విమానాల రాకపోకలను నిలిపివేశారు. సుమారు 15 విమానాలను దారి మళ్లించారు. సాయంత్రం 5.03 గంటలకు రన్‌వే కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. -
Bengaluru: కుప్పకూలిన 120 అడుగుల రథం
బెంగళూరు: బెంగళూరు రూరల్ పరిధిలోని అనేకల్‌లో శనివారం(ఏప్రిల్ 6)జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఏకంగా 120 అడుగుల ఎత్తున్న రథం ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. హుస్కుర్ మడ్డురమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలో ఈ ప్రమాదం జరిగింది. రథం కూలిపోయినపుడు అక్కడ వేలాది మంది భక్తులున్నారు. రథాన్ని తాళ్లతో కట్టి పైకి లేపడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి కిందపడిపోయింది. ఎత్తైన రథాల ఊరేగింపునకు హుస్కుర్ మడ్డురమ్మ టెంపుల్ చాలా పాపులర్. దశాబ్దం క్రితం ఈ గుడి వార్షికోత్సవంలో వందల రథాలను ఊరేగించేవారు. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య 10కి పడిపోవడం గమనార్హం. ఇదీ చదవండి.. రంగు మారనున్న గరీబ్‌రథ్ -
Bihar: కుప్పకూలిన వంతెన.. చిక్కుకున్న కూలీలు
పాట్నా: బిహార్‌లోని సౌపాల్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి శుక్రవారం( మార్చ్ 22) ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా కూలిన బ్రిడ్జి కింద పలువురు చిక్కుకుపోయారు. కోసీ నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై భవన నిర్మాణ కార్మికులు స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డట్లు జిల్లా అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘి ఇదీ చదవండి.. కేజ్రీవాల్ కస్టడీ కోరనున్న ఈడీ -
కూలిన మెట్రో స్టేషన్ వాల్... పలువురికి గాయాలు!
ఢిల్లీలోని గోకల్‌పురి మెట్రో స్టేషన్లో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌లోని సైడ్ వాల్లోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో, అక్కడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్నవారికి బయటకు తీసుకువచ్చి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ గురువారం 11 గంటల సమయంలో గోకల్‌పురి మెట్రో స్టేషన్ సరిహద్దు గోడ (తూర్పు వైపు) కూలిపోయి, దిగువ రహదారిపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జేసీబీ, క్రేన్ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఘటనా స్థలంలో స్థానిక పోలీసులు, మెట్రో ఉద్యోగులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
అతిథుల డ్యాన్స్.. కూలిపోయిన రిసెప్షన్ వేదిక
వధువరులు, బంధువులు ఆనందంతో ఎంజాయ్ చేసే వివాహ రిసెప్షన్లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. వేడుకలో భాగంగా డ్యాన్స్ చేసే క్రమంలో అకస్మాత్తుగా వెడ్డింగ్ హాల్ ఫ్లోర్ కూలిపోయింది. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వధువరులతో పాటు సుమారు 30 మంది అతిథులు 25 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లోర్‌ను నుంచి కిందకు పడిపోయారు. దీంతో గాయపడిన వారిని స్థానిక అస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... వరుడు పాలో ముగ్నైనీ, వధువు వలేరియా యబరా తమ వివాహాన్ని ఇటలీలోని పిస్టోయాలో ఉన్న ఓ వెడ్డింగ్ హాల్లో ఏర్పాటు చేశారు. హాల్లోని వేదికపై నూతన వధూవరులతో పాటు సుమారు 30 మంది అతిథులు ఉన్నారు. ఆనందంతో వారంతా డ్యాన్స్ చేయటం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. అందరూ వేదిక చెక్కల మధ్య ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గాయపడ్డవారంతా పిస్టోయాలోని శాన్ జకోపో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై పెళ్లి కొడుకు ముగ్నైని మాట్లాడుతూ.. ‘రిసెప్షన్ వేదిక కుప్పకూలే ముందు అంతా సంతోషంగా ఉన్నాం. అతిథులు డాన్స్ చేసేసరికి ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. నేను కూడా వాళ్లతోపాటు పడిపోయాను. నాపై చాలా మంది పడ్డారు. వెంటనే నా భార్య వలేరియా ఎక్కడ ఉందో వెతికాను. ఆమె కనిపించకపోయే సరికి తీవ్ర ఆందోళనకు గురయ్యాను. చివరకు ఇద్దరం కలిసి ఆస్పత్రిలో చేరాం.. పక్కపక్క బెడ్లో ఉండి చికిత్స పొందుతున్నాం’ అని ముగ్నైని తెలిపారు. చదవండి: Pakistan: పార్టీ జెండాపై గొడవ.. కన్న కొడుకును హతమార్చిన తండ్రి -
కూలిన చర్చి స్లాబ్.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుందంది. కోహీర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ చర్చి కూలిపోయింది. మెథడిస్ట్ చర్చికి స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ చెక్కలు కూలి పోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. శిధిలల్లో మరో నలుగురు కూలీలు చిక్కుకున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నలుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంగారెడ్డిజిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా సమాచారం. చదవండి: సురేందర్ కిడ్నాప్ కేసు డీసీపి శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు -
41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ
ఢిల్లీ: సిల్క్యారా సొరంగంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధానికి తమ అనుభవాలను కార్మికులు తెలియజేశారు. తొలిత బయపడ్డాం.. కానీ నమ్మకం కోల్పోలేదని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం కాపాడుతుందనే భరోసా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న కార్మికులనే కాపాడారని గుర్తుచేశారు. సహాయక చర్యలు పూర్తైన తర్వాత ప్రధాని మోదీ కూలీలందరితో ఫోన్లో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. యోగా, మార్నింగ్ వాక్‌తోనే తమలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకున్నట్లు ఈ సందర్భంగా ఓ కూలీ ప్రధానికి తెలిపారు. మేం సొరంగంలో చిక్కుకుపోయినా చాలా ధైర్యంగా ఉన్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులనే కాపాడింది... దేశంలో ఉన్న మమ్మల్ని కచ్చితంగా కాపాడగలదన్న భరోసాతో ఆందోళన చెందలేదని వెల్లడించారు. ఈ 17 రోజులు మేమంతా కలిసిమెలిసి ఉన్నామని తెలిపిన కూలీలు.. యోగా, మార్నింగ్ వాక్ వంటివి చేసి మాలోని స్థైర్యాన్ని పెంచుకున్నామని ప్రధానితో అన్నారు. సొరంగంలో చిక్కుకోగానే మొదట 10-15 గంటలు భయపడ్డామని కూలీలు తెలిపారు. శ్వాసతీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. కానీ అధికారులు తాము చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించి ఓ పైపును పంపించారని వెల్లడించారు. దాని ద్వారా ఆహారం పంపించారని పేర్కొన్నారు. ఓ మైక్‌ను కూడా అమర్చడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగామని ప్రధానితో చెప్పారు. మోదీ భావోద్వేగం.. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న కార్మికులను వెలికితీసిన సాహసకృత్యాన్ని టెలివిజన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాత్రి కేబినెట్ భేటీ జరిగిన క్రమంలో మంత్రులతో కలిసి సిల్క్యారా సొరంగంలో కార్మికుల వెలికితీతను వీక్షించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కేబినెట్ సమావేశం జరిగిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. ఈ సందర్భంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా బయటపడటంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒకానొక దశలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారని వెల్లడించారు. నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. సొరంగం నుంచి బయటకు తీసుకురాగానే బాధిత కార్మికులను రిషికేశ్‌లోని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇదీ చదవండి: Uttarkashi Tunnel Collapse: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే.. -
జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
అమెరికా సైనిక విమానం కుప్పకూలిపోయింది. జపాన్ సమీపంలోని యకుషిమా ద్వీప సమీపంలోని సముద్రంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఎనిమిదిమంది సభ్యులు ప్రయాణిస్తున్నారు. ఈ విషయాన్ని జపాన్ తీరప్రాంత అధికారి వెల్లడించారు. అయితే విమానంలోని వారి పరిస్థితి, భద్రతపై సమాచారం తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. యూఎస్‌కు చెందిన మిలిటరీకి చెందిన వి-22 ఓస్ప్రే విమానం ఎనిమిది మధ్య వ్యక్తులతో వెళ్తుంది. జపాన్‌లోని యకుషిమా ద్వీపం సమీపంలో సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జపాన్ సమయం ప్రకారం( భారత కాలమాన ప్రకారం ఉదయం 11:17 గంటలు) బుధవారం మధ్యాహ్నం 2.47 గంటలకు జరిగింది. యుఎస్ మిలిటరీ విమానం సముద్రంలో పడిపోవడంతో దాని ఇంజిన్ నుంచి మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని జపాన్‌లోని యూఎస్ బలగాల ప్రతినిధి పేర్కొన్నారు. కాగా అమెరికాకు చెందిన ఎస్ప్రే సంస్థ విస్తరణ జపాన్‌లో వివాదాస్పందగా మారింది. ఈ హైబ్రిడ్ విమానం ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ విమర్శలను అమెరికా సైన్యం, జపాన్ కొట్టిపారేస్తున్నాయి. ఇది పూర్తి సురక్షితమని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా గత ఆగస్టులో ఇదే యూఎస్ ఎస్ప్రే విమానం ఉత్తర ఆస్ట్రేలియా తీరంలో కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు యూఎస్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2016 డిసెంబర్లో కూడా జపాన్ దక్షిణ ద్వీపం ఒకినావా సముద్రంలో మరో విమానం ప్రమాదానికి గురైంది. -
ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ సాగిందిలా..?
ఉత్తరకాశీ: ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీయడానికి 17 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతం అయింది. 41 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 800 మిల్లీమీటర్ల పైపు గుండా కార్మికులను బయటకు తీసుకురావడానికి ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మట్టి తొలగింపు పనులను పూర్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టు వదలకుండా రెస్క్యూ అపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇన్ని రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగిందంటే..? సొరంగం కూలింది ఇక్కడ ? సిల్క్యారా బెండ్ నుంచి మొదలుపెట్టి బార్కోట్ వరకు కొండ కింద 4.531 కి.మీ.ల మేర సొరంగం తవ్వుతున్నారు. సిల్క్యారా వైపు నుంచి 2.340 కి.మీ.ల మేర సొరంగం తవ్వకం, అంతర్గత నిర్మాణం పూర్తయింది. సొరంగం ముఖద్వారం నుంచి దాదాపు 205–260 మీటర్ల మార్క్ వద్ద దాదాపు 57 మీటర్ల పొడవునా సొరంగం కూలింది. అదే సమయంలో సొరంగం లోపలి వైపుగా 41 మంది కార్మికులు పనిలో ఉన్నారు. అంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర విశాలమైన ప్రాంతంలో కార్మికులు చిక్కుకుపోయారు. 57 మీటర్ల వెడల్పుమేర శిథిలాలున్నాయి. ఇంతే వెడల్పున శిథిలాల గుండా పైపును జొప్పించి వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. చిక్కుకున్న కార్మికులకు ఆహారం ఇలా.. డ్రిల్లింగ్ సమయంలో రాళ్లు కూలడం వంటి కారణాలతో కార్మికులను రక్షించడం సవాలుగా మారింది. దీంతో చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్ అందించారు. దీంతో సొరంగంలో కార్మికులు ప్రాణాలతో ఉండగలిగారు. స్టీల్ పైపు ద్వారా చిన్న కెమెరాను లొపలికి పంపించి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ముఖాలను కూడా చూశారు. లోపలికి ల్యాండ్‌లైన్.. ఆహారం నీరు అందడంతో కార్మికులు క్షేమంగా ఉన్నారు. అయితే లోపల ఉన్న కార్మికుల మానసిక స్తైర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకు సహాయకంగా లూడో వంటి బోర్డ్ ఆట వస్తువులతోపాటు మొబైల్ ఫోన్లను పంపించారు. నిరంతరం మాట్లాడేందుకు వీలుగా ‘ల్యాండ్‌లైన్’ను పంపారు. ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్స్ఛెంజ్ను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటుచేసింది. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వాడారు. అనుకోని అవాంతరాలు.. సొరంగంలో మొదట సమాంతరంగా డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. కానీ ఇంకొన్ని మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకునేలోపే అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన ‘వేదిక’కు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. బిగించిన వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచ్చితమైన దిశలో డ్రిల్లింగ్ సాధ్యపడదు. అప్పుడు అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు. Uttarakhand Tunnel Rescue:ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు వాతావరణం కూడా అడ్డంకిగా మారి.. ఉత్తరాఖండ్‌లో అధ్వాన్నంగా తయారైన వాతావరణం రెస్క్యూ ఆపరేషన్‌కు కొత్త సమస్యలను సృష్టిచింది. వర్షాలు, వడగళ్ల వాన కురిసి రెస్క్యూ ఆపరేషన్‌పై ప్రభావం పడింది. సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించిన ప్రధాని మోదీ ప్రత్యేక కార్యదర్శి పీకే మిశ్రా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కే భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధులు రెస్క్యూ సిబ్బందికి ప్రోత్సాహాన్ని అందించారు. రెస్క్యూ ఆపరేషన్‌కు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ కూడా తన బృందంతో ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కొండపై నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్.. సమాంతరంగా అవాంతరాలు ఎదురవడంతో సొరంగంలో కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు మరో ప్రణాళికను పట్టాలెక్కించాయి. శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను పక్కనబెట్టేశారు. కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను మొదలు పెట్టారు. ఈ క్రమంలో డ్రిల్లింగ్ కోసం అమెరికా నుంచి అధునాతన ఆగర్ మెషీన్‌ను ఉపయోగించారు. 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. కానీ శిథిలాల్లో ఉన్న ఇనుప కడ్డీలు డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను నాశనం చేయడంతో మళ్లీ ఆటంకం ఏర్పడింది. సొరంగం అంతర్గత నిర్మాణంలో వాడిన ఇనుప కడ్డీలు సొరంగం కూలాక శిథిలాల్లో చిందరవందరగా పడి ఆగర్ మెషీన్ ముందుకు కదలకుండా అడ్డుపడ్డాయి. దీంతో డ్రిల్లింగ్ వేళ మెషీన్ బ్లేడ్లన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో మ్యాన్యువల్ పద్దతిని ఎంచుకున్నారు. చివరికి మాన్యువల్‌గానే డ్రిల్లింగ్.. డ్రిల్లింగ్ మిషన్ ధ్వంసం కావడంతో సాధారణంగా మనుషులతోనే తవ్వాల్సి వచ్చింది. మాన్యువల్ డ్రిల్లింగ్‌లో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే తవ్వడానికి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీనికితోడు ఆ వ్యక్తి తనతో పాటు ఆక్సిజన్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆక్సిజన్ కూడా ఒక గంట మాత్రమే ఉంటుంది. అంటే గంటకోసారి తవ్వే వ్యక్తిని మార్చాల్సి ఉంటుంది. దీంతో తవ్వే వేగం తగ్గింది. దాదాపు 57 మీటర్ల మేర సొరంగం కూలింది. ఇందులో 47 మీటర్ల వరకు శిథిలాల గుండా ఆగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ చేశారు. కూలినభాగంలోని కాంక్రీట్ నిర్మాణ రాడ్లు.. డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను ముక్కలుచేశాయి. దాంతో మెషీన్‌ను వెనక్కి లాగారు. కానీ మెషీన్ విరిగిపోయి ముక్కలు లోపలే ఉండిపోయాయి. ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో ముక్కలను విడివిడిగా కట్‌చేసి బయటకు తీశారు. ముక్కలన్నీ తీసేశాక అదే మార్గంలో దూరి కార్మికులు మ్యాన్యువల్‌గా రంధ్రం చేశారు. భారత సైన్యంలోని మద్రాస్ యూనిట్ ఇంజనీర్లు, ట్రెంచ్‌లెస్ ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త బృందం మ్యాన్యువల్‌గా తవ్వడంలో సహాయం చేసింది. ఇందుకు ర్యాట్-హోల్ పద్దతిని ఉపయోగించారు. Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు రంగంలోకి ‘ర్యాట్–హోల్’ మైనింగ్ కార్మికులు ఈ పని పూర్తిచేసేందుకు ‘ర్యాట్–హోల్’ మైనింగ్‌లో సిద్ధహస్తులైన కార్మికులను రప్పించారు. వీరు 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న పైపు గుండా లోపలికి దూరి శిథిలాలకు రంధ్రం చేస్తూ ముందుకు కదిలారు. ఇలా 12 మీటర్ల మేర డిల్లింగ్ చేయాలి. యూపీలోని ఝాన్సీకి చెందిన కార్మికులు ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఝాన్సీకి చెందిన పర్సాదీ లోధీ, విపిన్ రాజ్‌పుత్ తదితరులను ఈ పనికి పురమాయించారు. ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ప్రస్తుత ఘటనలో పదేళ్లుగా ఈ వృత్తిలో అనుభవం ఉన్న కార్మికులను రంగంలోకి దించారు. అయితే.. బొగ్గును వెలికితీయడం కాకుండా కార్మికులను కాపాడేందుకు ఈ పద్దతిలో పనిచేయడం ఇదే తొలిసారి. 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేసిన అనుభవం ఉన్నట్లు పేర్కొన్న కార్మికులు.. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేశారు. ఇదీ చదవండి: Uttarkashi tunnel: నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ -
సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెస్తారు ఇలా...
ఉత్తరాఖండ్‌లో టన్నెల్ కూలిన ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు గత 13 రోజులుగా శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉత్తర్‌కాశీలో సిల్క్యారా టన్నెల్ కూలిన ఘటనలో బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకా కొన్ని గంటల్లో 41 మందిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వీరికి తక్షణమే వైద్య సహాయం అందించేందుకు ఘటన స్థలంలో అంబులెన్సులు, ప్రత్యేక పడకలు, ఔషధాలు, ఆక్సిజన్ కిట్లు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం టన్నెల కూలిన స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్లో ఉండిపోయిన కార్మికులను రాళ్ల శిథిలాల నుంచి బయకు తీసుకొచ్చే పద్దతి గురించి అధికారులు వెల్లడించారు. పెద్ద పైపు ద్వారా చక్రాలు కలిగిన స్ట్రేచర్‌ను కార్మికుల వద్దకు చేర్చి.. ఒకరి తర్వాత ఒకరిని బయటకు తీసుకురానున్నట్లు తాజాగా తెలిపారు. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) ఓ వీడియో విడుదల చేసింది .వెల్డింగ్ చేసిన పైపులో స్ట్రెచర్ మీద కార్మికులు వెల్లికిలా పడుకొని ఉంటే దానిని తాడుతో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు బయటకు లాగనున్నారు. చదవండి: నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట #WATCH | | Uttarkashi (Uttarakhand) tunnel rescue: NDRF demonstrates the movement of wheeled stretchers through the pipeline, for the rescue of 41 workers trapped inside the Silkyara Tunnel once the horizontal pipe reaches the other side. pic.twitter.com/mQcvtmYjnk — ANI (@ANI) November 24, 2023 కాగా నవంబర్ 12 టన్నెల్‌లోని కొంతభాగం కూలడంతో 41 మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సాగుతున్న సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. డ్రిల్లింగ్ సమయంలో రాళ్లు కులడం వంటి కారణాలతో కార్మికులను రక్షించడం సవాలుగా మారుతోంది. ప్రస్తుతం చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్ అందిస్తున్నారు. ఇటీవల స్టీల్ పైపు ద్వారా చిన్న కెమెరాను లొపలికి పంపించడంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ముఖాలు తొలిసారి కనిపించిన సంగతి విదితమే. -
సొరంగం కుప్పకూలిన ఘటన.. డ్రిల్లింగ్ పనుల్లో అంతరాయం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో సొరంగం కుప్పకూలి 60 గంటలకు పైగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనుల్లో మంగళవారం రాత్రి అంతరాయం ఏర్పడింది. కుప్పకూలిన టన్నెల శిథిలాల గుండా ఆగర్ మెషీన్ సాయంతో వెడల్పాటి స్టీల్ పైపులను లోపలికి పంపే పనులు మంగళవారం మొదలైనట్లు తెలిపారు. డ్రిల్లింగ్ పరికరాలను ఉపయోగించి 800, 900 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకురావడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. అన్నీ సజావుగా సాగితే బుధవారాని కల్లా అందరినీ వెలుపలికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, రాత్రి వేళ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రులకు ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ పనులకు మాత్రం అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు. ఎటువంటి అపాయం లేదు సొరంగం లోపల చిక్కుకున్న కారి్మకులకు ఆక్సిజన్, మంచి నీరు, టీ, ఆహారం ప్యాకెట్లు, మందులను ట్యూబుల ద్వారా లోపలికి పంపిస్తున్నామని అధికారులు వివరించారు. కార్మికులు 400 మీటర్ల వెడల్పుండే బఫర్ జోన్లో చిక్కుబడి పోయారన్నారు. వారు తేలిగ్గా, నడవొచ్చు, గాలి పీల్చుకోవచ్చు అని వివరించారు. అందరూ ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారన్నారు. ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మఖాల్–యమునోత్రి జాతీయ రహదారిలో సిల్క్యారా– దండల్గావ్ మధ్య నిర్మిస్తున్న సొరంగం ఆదివారం ఉదయం సిల్క్యారా వైపు కూలిన విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుబడిన వారిలో బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులున్నారు. ధైర్యంగా ఉండండి టన్నెల్లో చిక్కుబడిపోయిన 40 మందిలో ఒకరైన ఉత్తరాఖండ్‌కు చెందిన కార్మికుడితో ఆయన కుమారుడు కొద్ది సెకన్ల పాటు మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నాడు. భయపడాల్సిన అవసరం లేదని, తనతోపాటు ఉన్న తోటి వారికి కూడా ధైర్యం చెబుతున్నానని అతడు పేర్కొన్నాడు. సొరంగం కుప్పకూలడంతో ఆదివారం ఉదయం నుంచి లోపలే ఉండిపోయిన 40 మందిలో ఉత్తరాఖండ్‌లోని కొట్‌ద్వార్‌కు చెందిన గబ్బర్ సింగ్ నేగి కూడా ఉన్నారు. నేగి సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఘటనా స్థలి వద్దకు మంగళవారం ఉదయం నేగి కొడుకు ఆకాశ్, అన్న మహరాజ్ చేరుకున్నాడు. అధికారులు పైపు ద్వారా ఆకాశ్‌కు తండ్రితో మాట్లాడే అవకాశం కల్పించారు. తమకు ఆక్సిజన్ అందుతోందని, భయపడొద్దని కుమారుడికి నేగి ధైర్యం చెప్పారు. ఇంట్లో వాళ్లకి కూడా ఇదే విషయం చెప్పాలని కోరారు. ‘సొరంగం కూలిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మాకు చాలినంత ఆహారం, నీరు అందుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే సురక్షితంగా బయటకు వచ్చేందుకు ఇంజినీర్లు కృషి చేస్తున్నారు’అని కూడా నేగి తన కుమారుడికి తెలిపారు. -
ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు?
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. ఆ సమయంలో 40 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే సహయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి జరిగింది. ఈ సొరంగం ఉత్తరకాశీలోని యమునోత్రి జాతీయ రహదారిపై ఉంది. ప్రస్తుతం సొరంగంలోని శిధిలాలను తొలగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిల్క్యారాలోని నాలుగున్నర కిలోమీటర్ల పొడవున నిర్మితమవుతున్న ఈ సొరంగంలో 150 మీటర్ల భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఉత్తరకాశీ పోలీసు సూపరింటెండెంట్ అర్పణ్ యదువంశీ తమ బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, ఎమర్జెన్సీ 108, సొరంగం నిర్మిస్తున్న నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ఉద్యోగులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చార్ ధామ్ రోడ్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న ఈ ఆల్-వెదర్ టన్నెల్ నిర్మాణం కారణంగా ఉత్తరకాశీ నుండి యమునోత్రి ధామ్ వరకు ప్రయాణం 26 కిలోమీటర్లమేర తగ్గనుంది. ఇది కూడా చదవండి: నేడు ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని ఎన్నికల ర్యాలీ.. జనం హాజరుపై సందేహాలు? -
Israel-Hamas War: చక్రబంధంలో గాజా సిటీ!
ఖాన్ యూనిస్/జెరూసలేం/న్యూఢిల్లీ: గాజాలో హమాస్ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు కొనసాగుతోందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. తమ పదాతి సేనలు, వైమానిక దళాలు శత్రువులపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయని, ప్రశంసనీయమైన విజయాలు సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. మిలిటెంట్ల దాడులను తమ జవాన్లు గట్టిగా తిప్పికొడుతున్నారని పేర్కొంది. శుక్రవారం జరిగిన దాడుల్లో చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని, వారి సొరంగాలు నామరూపాల్లేకుండా పోయాయని తెలియజేసింది. గాజా సిటీలో దాడులు ఉధృతం చేయబోతున్నామని ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శుక్రవారం నాటికి గాజాలో 9,200 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో మిలిటెంట్ల అదీనంలో ఉన్న 240 మంది బందీల ఆచూకీ కోసం ఇజ్రాయెల్ సైన్యం ముమ్మరంగా ప్రయతి్నస్తోంది. ఇందుకోసం అమెరికా డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లు గత వారం రోజులుగా గాజా ఉపరితలంపై చక్కర్లు కొడుతున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గాజాని చుట్టుముట్టాం: ఇజ్రాయెల్ గాజాలో ప్రధాన నగరం, హమాస్ మిలిటెంట్ల ముఖ్యమైన అడ్డా అయిన గాజా సిటీని తమ సేనలు చుట్టుముట్టాయని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ ప్రకటించారు. భూతల దాడులు ప్రారంభమైన వారం రోజుల తర్వాత గాజా సిటీ చుట్టూ తమ దళాలు పూర్తిస్థాయిలో మోహ రించినట్లు తెలిపారు. గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ప్రపంచ దేశాల నుంచి తమపై ఒత్తిడి వస్తున్నట్లు వెలువడుతున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. నల్ల బ్యాగుల్లో తిరిగి వెళ్తారు: హమాస్ గాజాలో ఇజ్రాయెల్ సైన్యానికి దారుణ పరాజయం ఎదురు కాబోతోందని హమాస్ మిలిటరీ విభాగమైన ఖాసమ్ బ్రిగేడ్స్ స్పష్టం చేసింది. తమ భూభాగంలో అడుగుపెట్టిన ఇజ్రాయెల్ సైనికులు నల్ల బ్యాగుల్లో తిరిగి వెళ్తారని హెచ్చరించింది. తద్వారా వారికి తమ చేతుల్లో చావు తప్పదని పేర్కొంది. కాల్పుల విరమణ లేదు: నెతన్యాహూ హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేసే దాకా గాజాలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. మానవతా సాయం గాజాకు చేరవేయడానికి, విదేశీయులను బయటకు పంపించడానికి వీలుగా తాత్కాలికంగా కాల్పు ల విరమణ పాటించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభ్యర్థనపై ఆయన స్పందించారు. నెతన్యాహూ శుక్రవారం అమెరి కా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాలస్తీనియన్లను కాపాడండి గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సామాన్య పాలస్తీనియన్లు మరణిస్తుండడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ప్రజలను కాపాడడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. లేకపోతే ‘శాంతికి భాగస్వాములు’ ఎవరూ ఉండరని చెప్పారు. గాజాను శ్మశానంగా మార్చొద్దని పరోక్షంగా తేలి్చచెప్పారు. గాజాకు భారీస్థాయిలో మానవతా సాయం అవసరమని, ఆ దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని అన్నారు. ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న మానవతా సాయాన్ని గాజాలోకి విస్తృతంగా అనుమతించాలని, ఈ విషయంలో ఆంక్షలు తొలగించాలని చెప్పారు. ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. పవిత్ర యుద్ధం చేస్తున్నాం: హసన్ నస్రల్లా ఇజ్రా యెల్‌పై దా డుల విషయంలో అమెరికా హెచ్చరికలు తమను భయపెట్టలేవని లెబనాన్‌కు చెందిన షియా మిలిటెంట్ సంస్థ ‘హెజ్బొల్లా’ అధినేత హసన్ నస్రల్లా పేర్కొన్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి హెజ్బొల్లా దూరంగా ఉండాలంటూ అమెరికా చేసిన హెచ్చరికలపై ఆయన శుక్రవారం స్పందించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలైన తర్వాత ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్‌పై తొలుత దాడిచేసిన హమాస్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్‌పై పవిత్ర యుద్ధంలో త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. మధ్యధరా సముద్రంలో అమెరికా సైనిక బలగాలను చూసి తాము బెదిరిపోవడం లేదని అన్నారు. తమ దగ్గర బలమైన సైన్యం ఉందని, అన్నింటికీ సిద్ధపడే ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నట్లు నస్రల్లా పేర్కొన్నారు. నస్రల్లా ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు. ఆయన ప్రసంగాన్ని టీవీల్లో ప్రసారం చేశారు. ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా కారి్మకులు వెనక్కి తమ దేశంలో పని చేస్తున్న పాలస్తీనియన్ కారి్మకులను వారి సొంత ప్రాంతమైన గాజాకు పంపించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. శుక్రవారం పదుల సంఖ్యలో కారి్మకులను గాజాకు పంపించింది. భారమైన హృదయంతో వారు వెనక్కి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్ 7 నుంచి ఘర్షణ మొదలైంది. అంతకంటే ముందు 18,000 మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ ప్రభుత్వం వర్క్ పరి్మట్లు జారీ చేసింది. వారిలో చాలామంది ఇజ్రాయెల్‌కు చేరుకొని, వేర్వేరు పనుల్లో కుదురుకున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో పాలస్తీనియన్లు వెనక్కి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. -
‘మిజోరం’ ప్రమాదం.. 22కు చేరిన మృతులు
ఐజ్వాల్: మిజోరంలోని ఐజ్వాల్‌లో బుధవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 22 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. జాడ తెలియకుండా పోయిన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. అతడు ప్రాణాలతో ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. క్షతగాత్రులైన ముగ్గురిలో ఇద్దరిని ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. బాధితులైన మొత్తం 26 మందీ పశి్చమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాకు చెందిన వారే. -
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో కుప్పకూలి చనిపోయిన పైలట్
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో పైలట్ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన కో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య విమానంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఆదివారం రాత్రి మియామీ ఎయిర్‌పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత 56 ఏళ్ల కెప్టెన్ ఇవాన్ అందౌర్ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోడంతో సిబ్బంది వెళ్లి చూడగా కిందపడిపోయి ఉన్నారు. సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వెంటనే కో పైలట్ విమానాన్ని పనామా సిటీలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ల బృందం ఇవాన్‌ను పరిశీలించగా.. అప్పటికీ పైలట్ చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. అప్పటి వరకు ప్రయాణికులకు పనామాలోని హోటల్లో వసతి కల్పించారు. ఈదురదృష్టకర సంఘటనపై ఎయిర్‌లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్‌లైన్స్‌లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొంది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ 25 ఏళ్ల కెరీర్లో తమ ఎయిర్‌లైన్స్‌కు ఎంతో సేవలు అందించారని పేర్కొంది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఇవాన్ అందూర్‌ను కాపాడుకోలేకపోయామని వెల్లడించింది. చదవండి: వర్షం ఇంక లేదు.. వరదైంది..! -
గర్భిణిపై కూలిన ఇంటిపైకప్పు
మెదక్ మున్సిపాలిటీ: తొలి కాన్పు కోసం పుట్టింటికి వచ్చిన గర్భిణిపై ఇల్లు కూలిన ఘటనలో కడుపులోని గర్భస్థ శిశువు మృతి చెందగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదఘటన మెదక్‌లోని మిలట్రీ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుడైన మహ్మద్ సర్వర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండో కూతురు యాస్మిన్ సుల్తానా ఇటీవల కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. 15 రోజుల్లో ఆమెకు ప్రసవం చేయాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తరుణంలో భారీ వర్షాలకు తడిసిన ఇంటి గోడ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో యాస్మిన్ తీవ్రంగా గాయ పడటంతో వెంటనే మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె కడుపులో గర్భస్థ శిశువు మృతి చెందినట్లు గుర్తించి తొలగించారు. యాస్మిన్‌ను హైదరా బాద్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కాగా, ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన యాస్మిన్ తల్లి చాంద్ సుల్తానా మెదక్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యాస్మిన్ సుల్తానా కుటుంబాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువా రం పరామర్శించి రూ.లక్ష సాయం అందించారు. -
ఇసుకలో సిమెంట్ కూడా కలపాలి మహాప్రభో!.. బీహార్‌లో కూలిన రెండో వంతెన!
పాట్నా: బీహార్‌లో ఏ ముహుర్తాన వంతెనలు ప్రారంభించారు గానీ వరుసగా కూలుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం కిషన్‌గంజ్ జిల్లాలో మరో వంతెన కూలిపోయింది. కాగా రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన కావడం గమనార్హం. రాష్ట్ర రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో మెచ్చి నదిపై ఉన్న వంతెన పిల్లర్ కూలిపోయిందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. NH-327Eలో నిర్మాణంలో ఉన్న ఈ వంతెన పూర్తయితే కిషన్‌గంజ్, కతిహార్లను కలుపుతుందని అయన అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. వంతెన కూలడంపై దర్యాప్తు కోసం నిపుణులతో కూడిన ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మానవ తప్పిదం వల్లనే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ ఒరిగిపోయినట్లు తెలుస్తోందని అన్నారు. ఇదే నెల మొదటి వారంలో అగువాని-సుల్తాన్ గంజ్ తీగల వంతెన పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ వంతెన కూడా నిర్మాణంలో ఉండగా కూలిపోవడం గమనార్హం. 2019 నవంబర్‌లో పూర్తి కావాల్సిన ఈ వంతెన నిర్మాణ పనులు మూడేళ్లకు పైగా కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతలోనే కూలిపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా ఒకే నెలలో నిర్మాణంలో ఉన్న రెండు వంతెనలు కూలిపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఇసుకలో సిమెంట్‌లో కలిపితే ఇలా జరగవని వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. చదవండి: బాబోయ్ ఇదేం ఆచారం! ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి.. ఆపై -
Hyderabad : ఎల్బీనగర్లో కుప్పకూలిన ఫ్లైఓవర్ (ఫొటోలు)
-
ఎల్బీనగర్ ఫైఓవర్ ప్రమాదం.. గాయపడిన వారిని పరామర్శించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి యోగక్షేమలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సంబంధిత వార్త: HYD: కుప్పకూలిన ఫ్లైఓవర్.. నలుగురి పరిస్థితి విషమం జరిగిన ఘటన దురదృష్టకరమన్న కేటీఆర్, ఈ ప్రమాదం పట్ల పురపాలక శాఖ పూర్తిస్థాయి విచారణ చేపడుతుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన అంశాలపైన జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో ముగ్గురితో కూడిన కమిటీకి అదనంగా జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విచారణ చేయించి, ప్రమాద కారణాలను తెలుసుకుంటామన్నారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగితే కఠిన చర్యలు సైతం తీసుకుంటామన్నారు. మంత్రి కేటీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పురపాలక శాఖ అరవింద్ కుమార్, ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. చదవండి: సర్పంచ్ నవ్య కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎమ్మెల్యే రాజయ్య యవ్వారం.. -
HYD: కుప్పకూలిన ఫ్లైఓవర్.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ వద్ద సాగర్ రింగ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మంగళవారం అర్ధరాత్రి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది గాయపడగా వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక, ప్రమాదంలో గాయపడిన వారిని యూపీ, బీహార్ వాసులుగా గుర్తించారు. అయితే ఫ్లైఓవర్ అర్ధరాత్రి కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పిదని అధికారులు తెలిపారు. పగలు సమయంలో ప్రమాదం జరిగి ఉంటే తీవ్ర ప్రమాదంగా మారి ఉండేది. ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. బైరామల్‌గూడ ఫ్లైఓవర్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. ప్రమాదంపై ఎన్డీఆర్ఎఫ్ అధికారులు పోలీసులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా, ఫ్లైఓవర్ కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: నెలాఖరున బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం -
Jharkhand: అక్రమ బొగ్గు గని కూలి ఘోరం
రాంచీ: జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఇవాళ ఘోరం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది బొగ్గు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో భారత్ కోకింగ్‌కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) భౌరా కాలరీ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భౌరా పోలీసుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సింద్రీ డీఎస్సీ అభిశేక్ కుమా మాట్లాడుతూ.. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. గనిలోకి అక్రమంగా మైనింగ్ చేపడుతున్నప్పుడు స్థానిక గ్రామస్థులు అనేకమంది పనుల్లో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులు సత్వరమే స్పందించి ముగ్గురిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చామని, ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించినట్టు తెలిపారు. -
Russia-Ukraine war: ఆగని కన్నీటి వరద
ఖేర్సన్(ఉక్రెయిన్): నీపర్ నదిపై కఖోవ్కా డ్యామ్ పేలుడుతో కొత్త మలుపు తీసుకున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో జనం కష్టాలు మరింత పెరిగాయి. ఇన్నాళ్లూ బాంబుల మోతతో బంకర్లతో, భూగర్భ గృహాల్లో తలదాచుకున్న జనం ఇప్పుడు అవన్నీ జలమయం కావడంతో పొట్టచేతపట్టుకుని ప్రాణభయంతో పరుగుపెడుతున్నారు. యుద్ధంలో శత్రుదేశ సైన్యం సంహారం కోసం జనావాసాలకు దూరంగా పూడ్చిపెట్టిన మందుపాతరలు వరదప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయి. ఆ వరదనీరు జనావాసాలను ముంచెత్తడంతో అవి ఇప్పుడు జనావాసాల్లో ఎక్కడికి కొట్టుకొచ్చి ఆగాయో, ఎప్పుడు పేలుతాయోనన్న భయం జనాలను వెంటాడుతోంది. నీటితో నిండిన నోవా కఖోవ్కా నగరంలో కొంతభాగం రష్యా అధీనంలో మరికొంత భాగం ఉక్రెయిన్ అధీనంలో ఉంది. తమ అధీన నగర ప్రాంతంలో ఐదుగురు చనిపోయారని రష్యా నియమిత మేయర్ వ్లాదిమిర్ గురువారం చెప్పారు. మరికొందరి జాడ గల్లంతైంది. స్థానికుల తరలింపు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. తాగునీరు కరువై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్, మొబైల్ ఫోన్ నెట్వర్క్ పూర్తిగా పోయిందని అధికారులు చెప్పారు. నష్టపరిహారం ఇవ్వండి: జెలెన్స్కీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించి అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ‘రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతవాసులకు వరద నష్టపరిహారం చెల్లించాలి. ఆస్తులు, వ్యాపారాలు నష్టపోయిన వారికి సాయం అందించాలి’ అని తర్వాత ఆయన కార్యాలయం ఆన్లైన్లో ఒక డిమాండ్ పంపింది. ‘600 చదరపు కిలోమీటర్ల భూభాగం నీటమునిగింది. ఇక్కడ ఏకంగా 18 అడుగుల ఎత్తులో నీరు నిలిచింది. 14,000కుపైగా భవనాలు నీటమునిగాయి. 4,000కుపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు పంపాం’ అని రష్యా నియమిత ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రొకుడిన్ చెప్పారు. నీపర్ నది తూర్పు పరివాహక ప్రాంతంలో మూడింట రెండొంతుల భూభాగం ర్రష్యా ఆక్రమణలో ఉంది. ఇది విధ్వంసకర దాడే: మేక్రాన్ ‘డ్యామ్‌ను కూల్చేయడం ముమ్మాటికీ విధ్వంసకర దాడే. అరాచక చర్య ఇది’ అని ఏ దేశాన్నీ ప్రస్తావించకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్వీట్‌చేశారు. వాటర్ ప్యూరిఫయర్లు, 5,00,000 ప్యూరిఫికేషన్ టాబ్లెట్లు, శుభ్రతా కిట్లు పంపిస్తున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది. ‘డ్యామ్ కూలడానికి మూడు రోజుల ముందు 200 సైనిక వాహనాలు, 2,000 మంది సైనికులను కోల్పోయిన ఉక్రెయిన్ ఆ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు డ్యామ్‌ను ఉక్రెయినే కూల్చింది’ అని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఆరోపించారు. -
Bihar Bridge Collapse: కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు..
బిహార్‌లో భాగల్పూర్లో రూ. 1700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తీగల వంతెన ఆదివారం పేకమేడలా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ మేరకు బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..గతేడాది ఏప్రిల్ 30న ఈ వంతెన కొంతభాగం కూలిపోయిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత దీని నిర్మాణ విషయంపై అధ్యయనం చేయడం కోసం ఐఐటీ రూర్కీ నిపుణలను సంప్రదించాం. ఇంకా తుది నివేదిక రావాల్సి ఉంది. అధ్యయనం చేసిన నిపుణుల ఈ నిర్మాణంలో కొద్దిపాటి లోపాలున్నాయని మాకు తెలియజేశారు. అందుకు సంబంధించిన వాటినన్నింటిని తొలగించాం. అయనప్పటికీ ఆదివారం జరిగిన ఘటన తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోందని తేజస్వీ యాదవ్ అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాధికారి ఒకరు మాట్లాడుతూ..ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులైన అధికారులపై తప్పక కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వంతెన దగ్గర పనిచేస్తున సెక్యూరిటీ గార్డు కూడా ఈ ఘటన తర్వాత కనిపించకుండా పోయినట్లు తెలిపారు. రెస్క్యూ అధికారులు అతని ఆచకి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిడ్జి కూలిన తర్వాత నుంచి గార్డు కనిపించ లేదని, అతడి మృతదేహం కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతడి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి డిమాండ్ చేశారు. ఆయన పాలనలో జరుగతున్న అవినీతి కారణంగానే ఇలాంటి దుర్ఘటన జరిగిందని ఆరోపణలు చేశారు. మరో సహచర బీజేపీ నాయకుడు సయ్యద్ షానవాజ్ కూడా ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. (చదవండి: బిహార్‌లో కూలిన తీగల వంతెన) -
బిహార్‌లో కూలిన తీగల వంతెన
పట్నా: రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భారీ తీగల వంతెన కూలిపోయింది. బిహార్ రాష్ట్రం భాగల్పూర్ జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నిర్మాణంలో ఈ వారధి తొలుత రెండు ముక్కలుగా విడిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి నేలకూలాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. గంగా నదిపై ఖగారియా.. అగువానీ, సుల్తాన్‌గంజ్ మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కొంత భాగం కూలిపోవడంతో పునర్నిర్మించారు. రెండు నెలల క్రితం బలమైన ఈదురు గాలుల ధాటికి పగుళ్లు వచ్చాయి. ఆదివారం నేలకూలింది. దాదాపు ఐదు స్తంభాలు కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేత విజయ్‌కుమార్ సిన్హా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి పనిలోనూ కమిషన్లు తీసుకోవడం ఒక సంప్రదాయంగా మారిపోయిందని నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన ఆగిపోయిందని, ఆరాచకం, అవినీతి పెచ్చరిల్లిపోతున్నాయని ఆరోపించారు. ఇక్కడ వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతుంటే సీఎం నితీశ్ విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడటంతో
చైనా:చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 14 మంది మృతి చెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. సిచువాన్ ప్రావిన్స్‌లోని జిన్‌కౌహీ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 40 వేల మంది వరకు నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. నిరంతరాయంగా పడుతున్న వర్షాల కారణంగానే కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడుతుందా? -
చంద్రునిపై కూలిన జపాన్ వ్యోమనౌక!
టోక్యో: జపాన్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ ఐస్పేస్ ప్రయోగించిన ల్యాండర్ మంగళవారం చంద్రునిపై దిగే క్రమంలో కుప్పకూలినట్టు సమాచారం. చంద్రుని ఉపరితలానికి కేవలం 10 మీటర్ల దూరంలో ఉండగా దానితో సంబంధాలు తెగిపోయాయి. 6 గంటలకు పైగా విఫలయత్నం చేసిన అనంతరం, చివరి అంకంలో ల్యాండర్ చంద్రున్ని ఢీకొట్టి కుప్పకూలిందని ఐస్పేస్ ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై ల్యాండర్‌ను దించిన తొలి ప్రైవేట్ కంపెనీగా అది చరిత్రకెక్కేది. ఇంతటితో కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నిస్తామని దాని సీఈఓ హకమడ ప్రకటించారు. -
కుప్పకూలిన మూడంతస్తుల రైస్ మిల్లు.. నలుగురు కార్మికులు మృతి
హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల రైస్ మిల్లు భవనం కుప్పకూలడంతో నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటన కర్నాల్ జిల్లాల నితారోరిలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. కార్మికులు తమ షిఫ్టులు ముగిసిన తర్వాత రైస్‌మిల్లులో పడుకునేవారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి రైస్ మిల్లులో దాదాపు 150 మంది కార్మికులు నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అర్థరాత్రి ఒక్కసారిగా భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. మరో 24 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ యంత్రాల ద్వారా భవన శిథిలాలను తొలగిస్తున్నారు. మొత్తం ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారో తెలియలేదు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సరైన కారణాలు తెలియాల్సి ఉంది. భవనంలో కొన్ని లోపాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, రైలు మిల్లు యాజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనపై విచారణకు కమిటీ వేయనున్నట్లు డీసీ కర్నాల్ అనీష్ యాదవ్ తెలిపారు. #WATCH | Haryana: Several rice mill workers feared being trapped under debris after a three-storeyed rice mill building collapsed in Karnal. Workers used to sleep inside the building. Fire brigade, police and ambulance have reached the spot. Rescue operations underway. pic.twitter.com/AFzN9HDPYw — ANI (@ANI) April 18, 2023 -
భూత కోల వేడుకలో విషాదం.. నృత్యం చేస్తూ కుప్పకూలిన కళాకారుడు
-
సిలికాన్ వ్యాలీ బ్యాంకు సెగ: లక్ష ఉద్యోగాలు, 10వేల స్టార్టప్‌లకు గండం
న్యూఢిల్లీ: సిలికాన్ వేలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూసివేత వల్ల దానితో ముడిపడి ఉన్న అంకుర సంస్థల్లో ఆందోళన నెలకొంది. తక్షణ ఆర్థిక అవసరాలకు కావాల్సిన నిధుల కోసం అవి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్వీబీలో డిపాజిట్లు ఉన్న దాదాపు 10,000 చిన్న సంస్థలు .. వచ్చే 30 రోజుల్లో తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన పిటీషన్లో వై కాంబినేటర్ (వైసీ) తెలిపింది. దీని వల్ల 1 లక్ష పైగా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు పేర్కొంది. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ) ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా కట్టడి చేయకపోతే .. యావత్ అమెరికా టెక్నాలజీ పరిశ్రమపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 3,500 మంది పైచిలుకు సహ వ్యవస్థాపకులు, సీఈవోలు, రెండు లక్షల మంది పైగా స్టార్టప్ సంస్థల ఉద్యోగులు ఈ పిటీషన్‌పై సంతకం చేశాయి. వీటిలో పేవో, సేవ్ఇన్, శాలరీబుక్ వంటి భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఇన్క్యుబేటర్ సంస్థ అయిన వై కాంబినేటర్ కమ్యూనిటీలోని మూడో వంతు స్టార్టప్‌లకు ఎస్వీబీలో మాత్రమే ఖాతాలు ఉన్నాయి. (ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా) ఎస్వీబీలో భారీగా డిపాజిట్లు ఉన్న కొన్ని బడా టెక్ సంస్థలకు (వై కాంబినేటర్తో సంబంధమున్నవి) అమెరికాతో పాటు భారత్‌లోనూ కార్యకలాపాలు ఉన్నాయని ఫిన్‌టెక్ కంపెనీ రికర్ క్లబ్ సీఈవో ఏకలవ్య గుప్తా తెలిపారు. దేశీయంగా గిఫ్ట్ సిటీలో అకౌంట్లు తెరిచేందుకు ఆయా స్టార్టప్‌లకు తాము సహాయం అందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, గతంలోలాగా ఎస్వీబీని ప్రభుత్వం బెయిలవుట్ చేయబోదని అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్ స్పష్టం చేశారు. అయితే, డిపాజిటర్లందరికీ వారి సొమ్ము తిరిగి అందేలా చూసేందుకు చర్యలపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. 15 ఏళ్ల క్రితం నాటి ఆర్థిక సంక్షోభానికి నేటి పరిస్థితులకు వ్యత్యాసం ఉందని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉందని చెప్పారు. సత్వర టేకోవర్‌కు ఆస్కారం.. ఈ సమస్య స్వల్పకాలికమైనదే కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. క్లయింట్ల సొమ్మును తిరిగిచ్చేందుకు సరిపడేంత అసెట్లు ఎస్వీబీ దగ్గర ఉండటంతో పాటు, పలు ప్రముఖ సంస్థల ఖాతాలూ ఉన్న నేపథ్యంలో బ్యాంకును సత్వరమే ఏదో ఒక సంస్థ టేకోవర్ చేయొచ్చని తెలిపాయి. రాబోయే వారం రోజుల్లోనే ఇది జరగవచ్చని ఇన్‌మొబి గ్రూప్ సహ వ్యవస్థాపకుడు అభయ్ సింఘాల్ చెప్పారు. స్వల్పకాలికంగా ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కోసం 7-8 బిలియన్ డాలర్ల నిధులు అవసరం కావచ్చని, అవి అందితే ప్రస్తుతానికి సమస్య పరిష్కారం కావచ్చని పేర్కొన్నారు. ఏవో కొన్నింటిపై మినహా మిగతా స్టార్టప్‌లపై ఎస్వీబీ సంక్షోభ ప్రభావం ఉండకపోవచ్చని జెన్‌ప్యాక్ట్ వ్యవస్థాపకుడు ప్రమోద్ భాసిన్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్య స్థానికమైందే తప్ప అంతర్జాతీయ మైంది కాదన్నారు. భారతీయ స్టార్టప్‌లకు ఎస్వీబీతో చెప్పుకోతగ్గ స్థాయిలో లావాదేవీలేమీ లేవు కాబట్టి అవి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పరిశ్రమ నిపుణుడు, 5ఎఫ్ వరల్డ్ చైర్మన్ గణేష్ నటరాజన్ చెప్పారు. ఎస్వీబీతో లావాదేవీలు జరిపే సంస్థలు కూడా కాస్త ఓపిక పడితే తమ సొమ్మును తిరిగి పొందడానికి వీలుంటుందన్నారు. మరోవైపు, తమ రెండు అనుబంధ సంస్థలకు (కిడోపియా, మీడియా వర్కజ్క్) ఎస్వీబీలో సుమారు రూ. 64 కోట్లు ఉన్నాయని గేమింగ్, స్పోర్ట్స్ మీడియా ప్లాట్‌ఫామ్ సంస్థ నజారా టెక్నాలజీస్ వెల్లడించింది. అయితే, వాటి చేతిలో తగినన్ని నిధులు ఉన్నాయని, ఎస్వీబీ పరిణామం వల్ల వాటి వ్యాపారంపై ప్రభావమేమీ పడబోదని పేర్కొంది. అంకురాలతో భేటీ కానున్న కేంద్ర మంత్రి.. దేశీ సంస్థలపై ఎస్వీబీ పరిణామాల ప్రభావాన్ని అంచనా వేయడంపై కేంద్రం దృష్టి సారించింది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వారంలో దేశీ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కానున్నారు. దేశ నిర్మాణంలో కీలకంగా ఎదుగుతున్న అంకుర సంస్థలకు ప్రభుత్వం ఏ విధంగా తోడ్పాటు అందించగలదన్నది తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. -
భారత్‌లో కలకలం..మరో బ్యాంక్‌ను మూసివేస్తున్నారంటూ రూమర్స్!
ప్రపంచ దేశాల్లో ఎన్నో టెక్నాలజీ స్టార్టప్ (భారత్‌లో 21 స్టార్టప్)ల్లో పెట్టుబడులు పెట్టి, వాటికి బాసటగా నిలిచిన అక్కడి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) నిండా మునిగింది. 2008 లేమాన్ బ్రదర్స్ ఆర్థిక సంక్షోభం తర్వాత మరో పెద్ద బ్యాంక్ దివాళాకు కారణమైంది. ఇప్పుడీ పరిణామాలతో అమెరికా నుంచి 13 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైకి చెందిన శ్యామ్‌రావు విఠల్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ (ఎస్వీసీ) బ్యాంకు దివాళా తీస్తుందనే పుకార్లు కలకలం రేపుతున్నాయి. ఎక్కడో అమెరికాలో ఉన్న ఎస్వీబీ బ్యాంక్ మూతపడితే.. భారత్‌లో ఉన్న బ్యాంక్‌కు ఆర్ధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే పుకార్లతో సదరు బ్యాంక్ స్పందించింది. పుకార్లను కొట్టిపారేసింది. ఈ రూమర్స్‌ను స్ప్రెడ్ చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు ట్వీట్ చేసింది. భారత్‌కు చెందిన బ్యాంక్ మూత పడిందంటూ మనదేశానికి చెందిన ఎస్వీసీ బ్యాంక్ 1906 నుంచి ముంబై కేంద్రంగా వినియోగదారులకు బ్యాంకింగ్ సేవల్ని అందిస్తోంది. 11 రాష్ట్రాల్లో 198 బ్రాంచీలు, 214 ఏంటీఎంలు, 2300 మంది ఉద్యోగులతో 100 ఏళ్లు పూర్తి చేసుకొని ఎన్ఏఎఫ్సీయూబీ అవార్డ్ దక్కించుకుంది. 116 ఏళ్ల చరిత్ర ఉన్న ఎస్వీసీ బ్యాంక్ ప్రస్తుతం రూ.31,500 కోట్ల బిజినెస్ చేస్తుండగా ఆర్ధిక సంవత్సరం 2021-22లో రూ.146 కోట్ల నెట్ప్రాఫిట్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే బ్యాంక్ మూతపడిందంటూ రూమర్స్ వచ్చాయి. దీంతో ఆబ్యాంక్ కస్టమర్లు ఆందోళన గురయ్యారు. ఆ బ్యాంకులో దాచిన డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంక్ బ్రాంచీలను సంప్రదించారు. అది ఎస్వీబీ బ్యాంక్.. మనది ఎస్వీసీ బ్యాంక్ అయితే కస్టమర్ల ఆందోళనతో ఎస్వీసీ బ్యాంక్ అధికారికంగా ఓ నోటీసును విడుదల చేసింది. ఆ నోటీసుల్లో ఉన్న వివరాల మేరకు..అమెరికాలో ఉన్న దిగ్గజ బ్యాంక్ మూత పడింది. అది సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (svb) కాగా.. మనది శ్యామ్‌రావు విఠల్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ ( svc) అని స్పష్టత ఇచ్చింది. ఇక ఎస్‌వీసీపై వస్తున్న తప్పుడు ప్రచారంతో .. కస్టమర్లు ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించింది. Important announcement#HumSeHaiPossible #SVCBank #Banking #SVC #Importantannouncement pic.twitter.com/p05lHBJm9w — SVC Bank (@SVC_Bank) March 11, 2023 ఇది వాట్సాప్ యూనివర్సిటీ దుస్థితి ఆ వివరణతో ఎస్వీసీ కస్టమర్లు ఊపిరి పీల్చుకున్నారు. సదరు బ్యాంకుపై వస్తున్న రూమర్లకు నెటిజన్లు తమదైన శైలిలో ట్వీట్లు చేస్తున్నారు. ZyppElectric సీఈవో ఆకాష్ గుప్తా మాట్లాడుతూ.. తర్వాత ఎస్ఎల్బీ(సంజయ్ లీలా భన్సాలీ) ప్రకటన విడుదల చేయొచ్చని ట్వీట్లో పేర్కొనగా.. భారత్ అద్భుతమైందని మరో యూజర్ వెటకారంగా కొనియాడగా ..భారతీయుల్లారా..వాట్సాప్ యూనివర్సిటీ దుస్థితి ఇలా ఉందని కామెంట్ చేశాడు. ఎస్వీసీ ముఖ్యమైన వివరణ ఇచ్చిందంటూ మరో యూజర్ కృజ్ఞతలు తెలిపారు. -
యువతలో ఆకస్మిక గుండెపోటుకు కారణం ఏంటి?
-
Hyderabad: ఆకస్మిక గుండెపోటుతో ఇద్దరు మృతి.. డాక్టర్లు ఏమంటున్నారంటే!
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో హఠాత్తుగా అడ్డంకులు ఏర్పడటాన్ని గుండెపోటు అంటారు. మరి గుండెకు రక్తం, ఆక్సిజన్ సరిగా అందకపోతే అది పంపింగ్ చేయలేదు. ఎంత ఎక్కువసేపు అడ్డంకి ఏర్పడితే గుండెకు అంత నష్టం ఏర్పడుతుంది. పురుషుల్లో ఇలాంటి గుండెపోటు 65 ఏళ్లకు.. మహిళల్లో 70 ఏళ్లకు వస్తాయనేది పాత లెక్క. కానీ ఇటీవల ఆ వయసు క్రమంగా తగ్గిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా.. గుండెపోటు ముప్పు అందరిని చుట్టుముడుతోంది. ముఖ్యంగా యువత, చిన్నారుల్లో సడెన్ హార్ఠ్ ఎటాక్ కేసులు ఎక్కువగా అవుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో రబ్బాని అనే వ్యక్తి పెళ్లి వేడుకలో సంతోషంగా పాల్గొని.. వరుడి పాదాలకు పసుపు రాస్తుండగా గుండెపోటుతో క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. తాజాగా బోయినపల్లిలో జిమ్‌లో కసరత్తులు చేస్తూ 24 ఏళ్ల యువ కానిస్టేబుల్ విశాల్ ఉన్నట్టుండి కుప్పకూలాడు.. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించడగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే యువకుల్లో గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు కనిపించకపోవడం అతిపెద్ద సమస్య. చాలాసార్లు నిశబ్ధంగా విరుచుకుపడి.. ప్రాణాల మీదకు తెస్తుంది. ఇలా వరుసగా జరుగుతున్నసైలెంట్ గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సడెన్ హార్ట్ ఎటాక్‌పై ప్రముఖ కార్డియాలజిస్ట్ చాణక్య కిషోర్ సాక్షితో మాట్లాడారు. యువతలో ఆకస్మిక గుండెపోటుకు కారణాలు ఏంటి.. దీన్ని ముందుగా గుర్తించగలమా?. ఎలాంటి జాగ్రత్తలతో గుండెపోటును నివారించవచ్చు.. అనే అంశాలపై ఆయన చెప్పిన వివరాలు డాక్టర్ మాటల్లోనే... -
సంక్షోభానికి చివరి అంచున నిలబడ్డ పాక్! చివరికి శ్రీలంకలానే..
పాక్‌లో ఆర్థిక పరిస్థితులు చాల ఘోరంగా ఉన్నాయి. మరోవైపు ఐఎంఎఫ్ అధికారులు నగదు విషయమై చర్చించేందుకు మంగళవారం పాకిస్తాన్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌లో తీవ్ర ఆందోళనలో మొదలయ్యాయి. ఒక పక్క రూపాయి విలువ పతనమవ్వడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అక్టోబర్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో.. నెలల తరబడి అంతర్జాతీయ ద్రవ్య నిధి డిమాండ్ చేసిన పన్నుల పెంపు, సబ్సిడీ కోతలకు వ్యతిరేకంగా పోరాడారు. దీంతో ఇటీవల పాక్ దివాలా దిశగా అడుగులు వేసింది. అదీగాక స్నేహ పూర్వక దేశాలు సాయం చేసేందుకు రాకపోవడంతో పాక్ ఐంఎఫ్ డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. అంతేగా యూఎస్ డాలర్ల బ్లాక్‌మార్కెట్‌ని నియంత్రించడానికి ప్రభుత్వం రూపాయిపై నియంత్రణలను సడలించింది. దీంతో కరెన్సీ రికార్డు స్థాయికి పడిపోయింది. అలాగే తక్కువ ధరకే లభించే కృత్రిమ పెట్రోల్ ధరలను సైతం పెంచారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త అబిద్ హసన్ మాట్లాడుతూ.."తాము సంక్షోభానికి చివర అంచులో ఉన్నాం. తమ ప్రభుత్వం ఐఎంఎఫ్ డిమాండ్లను నెరవేర్చడం గురించి ప్రజలకు తెలియజేయాలి. లేదంటే దేశం కచ్చితంగా సంక్షోభంలో మునిగిపోతుంది. చివరికి శ్రీలంకలా అయిపోతుంది. ఐతే మా పరిస్థితి మాత్రం బహుశా అక్కడికంటే ఘోరంగా ఉండొచ్చు." అని ఆవేదనగా చెప్పారు. కాగా, శ్రీలంక కూడా పాక్ మాదిరిగానే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి, చివరికి ఆ దేశ నాయకుడు దేశం విడిచి పారిపోయే పరిస్థితికి దారితీసింది. అదీగాక పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్‌కి చెందిన విశ్లేషకుడు నాసిర్ ఇక్బాల్ రాజకీయ అనిశ్చితి కారణంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేదని, వాస్తవంగా కుప్పకూలిపోతుందని హెచ్చరించారు కూడా. కొనుగోలు చేయలేని స్థితిలో ప్రజలు ప్రపంచంలోనే ఎక్కువ వినియోగదారులు ఉన్న ఐదవ అతిపెద్ద స్టేట్ బ్యాంకులో సుమారు రూ. 30 వేల కోట్లు (3.7 బిలియన్ డాలర్లు) మాత్రమే ఉన్నాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులను కొనుగోలు చేయడానికే సరిపోతుంది. దీంతో కొనుగోలు చేయలేని సరుకంతా కరాచీ పోర్టులోని వేలాది షిప్పింగ్ కంటైనర్లలోనే ఉంటుంది. రూపాయి పతనంలో పరిశ్రమలు కుదేలయ్యాయి. ప్రజా నిర్మాణ ప్రాజెక్టు ఆగిపోయాయి. టెక్స్టైల్స్ ప్యాక్టరీలు పాక్షికంగా మూతపడ్డాయి. దీంతో పెట్టుబడులు మందగించాయి. డజన్ల కొద్ది కూలీలు ఉపాధి లేక అల్లాడుతున్నారు. ఫలితంగా బిక్షాటన చేసే వారి సంఖ్య పెరిగింది. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల ఆదాయం మార్గాలు తగ్గడంతో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని దారుణ స్థితిలో ఉన్నారు. గందరగోళంగా ఉన్న రాజకీయ పరిస్థితులు జూన్‌లో ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 33 మిలియన్ డాలర్ల రుణాలు ఇతర విదేశీ చెల్లింపులు చెల్లించాల్సి ఉందని స్టేట్ బ్యాంకు గవర్నర్ జమిల్ అహ్మద్ గత నెలలో వెల్లడించారు. మరోవైపు దేశం తీవ్ర ఇంధన కొరతతో అల్లాడుతోంది. గత వారం ఖర్చుల కోత చర్యల కారణంగా.. విద్యుత్ గ్రిడ్‌లో సాంకేతిక లోపం సంభవించి.. ఒక రోజంతా అంధకారంలోనే ఉండిపోయింది. ఐతే పాక్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్ ఏప్రిల్ నుంచి రష్యా చమురు దిగుమతులు ప్రారంభమవుతాయని, ఒప్పందంలో భాగంగా స్నేహ పూర్వక దేశాల మధ్య కరెన్సీలలో చెల్లింపులు జరుగుతాయని ఆశాభావంగా చెప్పారు. ఇదిలా ఉండగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందస్తు ఎన్నికల కోసం తన ప్రయత్నంలో భాగంగా పాలక కూటమిపై ఒత్తిడి పెంచారు. గతేడాది అవిశ్వాస తీర్మానం కారణంగా పదవి నుంచి తొలగించబడ్డ ఖాన్ 2019లో ఐఎంఎఫ్‌తో బహుళ బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీపై చర్చలు జరిపారు. ఐతే ఈ కార్యక్రమం అనుహ్యంగా నిలిచిపోయింది. ఇప్పటికే రెండు డజన్లకు పైగా ఖరారు చేసుకున్న ఐఎంఎఫ్ ఒప్పందాలు విచ్ఛిన్నమయ్యాయి. ఒకవేళ పాకిస్తాన్ ఈ పరిస్థితి నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారడమే గాక పేదరికి తీవ్రతరం అవుతుందని రాజీకీయ విశ్లేషకుడు మైఖేలే కుగెల్ మాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశంలో పెద్దస్థాయిలో సంస్కరణలు తీసుకురాలేకపోతుందని, తదుపరి సంక్షోభాన్ని ఎదుర్కోనే దేశంగా చిట్టచివరి అంచున నిలబడి ఉందని అన్నారు. (చదవండి: పుతిన్‌నే ఎక్కువగా నమ్ముతా! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు) -
హైదరాబాద్: పది అడుగుల మేర కుంగిన రోడ్డు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఉన్నపళంగా రోడ్డు కుంగిపోయిన ఉదంతం చోటు చేసుకుంది. శనివారం హిమాయత్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. హిమాయత్ నగర్‌లోని స్ట్రీట్ నెంబర్ 5లో పది అడుగుల మేర రోడ్డు కుంగిపోయింది. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో ట్రక్కు అందులోకి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలుకాగా, ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. -
ఘోర ప్రమాదం.. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కొడుకు మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కుమారుడు మృతి చెందిన ఘటన నగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. తేజస్వీ(25) అనే మహిళ తన భర్త లోహిత్, రెండున్నరేళ్ల కూమార్తె, కుమారుడు విహాన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై హెబ్బాల్ వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ నగర్ నుంచి హెచ్‌ఆర్‌బీర్ లేఅవుట్ వరకు చేపట్టిన నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కుప్పకూలి రోడ్డు మీద పడింది. బైక్‌పై వెళ్తున్న కుటుంబంపై ఇనుప రాడ్లతో కూడిన మెట్రో పిల్లర్ పడటంతో వారు తీవ్ర గాయపడ్డారు. ముగ్గురుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వివాహితతోపాటు ఆమె మూడే కుమారుడు మరణించారు. తేజశ్విని భర్త, కుమార్తె చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మెట్రో పిల్లర్ కూలడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ ఘటన: ప్రయాణికులను ఎక్కించుకోకుండా.. -
చతికిల‘బడి’.. కూలిపోయే పైకప్పులు.. వేలాడే విద్యుత్ తీగలు!
సాక్షి, హైదరాబాద్: కూలిపోయేలా ఉన్న పై కప్పులు.. రాలిపోతున్న గోడల పైపెచ్చులు.. వేలాడుతున్న కరెంట్ తీగలు.. విరిగిపోతున్న బల్లలు, కుర్చీలు.. కొత్త గదుల నిర్మాణం దేవుడెరుగు, ఉన్న భవనాలు దాదాపుగా శిథిలావస్థకు చేరాయి. వంటగదుల సంగంతి చెప్పనక్కర్లేదు. వానొస్తే బురద.. గాలొస్తే తంటా. పేద, మధ్యతరగతి పిల్లలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కన్పిస్తున్న దృశ్యాలు. ఈ దుస్థితిని మార్చేస్తామని, కార్పొరేట్‌కు ధీటుగా సర్కార్ బడిని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెప్పింది. 12 రకాల పనులతో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమంది. ఈ కార్యక్రమానికి ‘మన ఊరు–మనబడి’ అనే పేరు పెట్టింది. దశలవారీగా అమలు చేసే ఈ కార్యక్రమంలో తొలిదశను ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. కొన్నిచోట్ల పనులు అసలు ప్రారంభమే కాలేదు. పనులు మొదలైన చోట్లా సవాలక్ష అవాంతరాలు చోటు చేసుకుంటున్నాయి. మోకాలెత్తు పునాదులు.. మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. నిధుల ప్రకటనలతోనే సరి.. మన ఊరు– మనబడి కార్యక్రమాన్ని 2021 మార్చి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ళల్లో రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్టు తెలిపింది. కానీ 2021–22లో నిధులు కేటాయించలేదు. 2022 మార్చి బడ్జెట్లో రూ.7,289 కోట్లు మూడు విడతలుగా పాఠశాలల్లో మౌలిక వసతులకు కేటాయిస్తామని ప్రకటించింది. అదే నెలలో సీఎం కేసీఆర్ వనపర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూళ్ళు తెరిచే నాటికే పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. కానీ స్కూళ్ళకు మళ్ళీ సెలవులొస్తున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. తొలిదశ స్కూళ్లకే.. రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ స్కూళ్ళల్లో తొలివిడతగా ఈ సంవత్సరం 9,123 స్కూళ్ళను ఈ పథకం కింద ఎంపిక చేశారు. తొలి దశలో చేపట్టే పనులను రూ.3,497 కోట్లతో పూర్తి చేయాలని భావించారు. నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, ఫర్నిచర్ ఏర్పాటు, రంగులు వేయడం, పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్ బోర్డులు, ప్రహరీ గోడలు కట్టడం, వంటగది ఏర్పాటు, మరమ్మతులు, శిధిల భవనాల స్థానంలో కొత్త గదుల నిర్మాణం, డిజిటల్ సౌకర్యాల వంటి 12 రకాల పనులు ఈ నిధులతో చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ పూర్తిస్థాయిలో ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఇప్పటివరకు 8,833 బడులకు పరిపాలన అనుమతులు రాగా 7,211 బడుల్లో పనులు మొదలయ్యాయి. ఇప్పటివరకు 1,200 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. ముందుకురాని కాంట్రాక్టర్లు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కొన్ని స్కూళ్లకైనా మరమ్మతులు చేసి, మెరుగ్గా చూపించాలని ప్రభుత్వం ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో భావించింది. ఈ దిశగా వివిధ శాఖల అధికారులతో విద్యాశాఖ మంత్రి సమీక్ష జరిపారు. కానీ ప్రతిచోట ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. రూ.30 లక్షల లోపు పనులన్నీ స్థానిక విద్యా కమిటీ నేతృత్వంలో చేయించే అవకాశం ఉంది. అంతకు మించితే టెండర్లు పిలవాలి. ఇలాంటి పనులు 2 వేల వరకు ఉన్నాయి. విద్యా కమిటీ నేతృత్వంలో ఎక్కువగా చిన్నా చితక పనులే చేపడుతున్నారు. కరెంట్ వైర్లు సరి చేయడం, గోడలకు రంగులేయడం, పెచ్చులూడితే ప్లాస్టింగ్ చేయడం వంటివే ఉంటున్నాయి. నిర్మాణాలు, శౌచాలయాల (మరుగుదొడ్లు) ఏర్పాటు వంటి పనులు ఎక్కడా మొదలవ్వలేదు. కొన్ని చోట్ల నిర్మాణాలు మొదలైనా నిధులు అందక ఆగిపోతున్నాయి. దీంతో చాలాచోట్ల టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల నాలుగు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించ లేదు. సకాలంలో బిల్లులు మంజూరయ్యే పరిస్థితి లేదంటూ వాళ్ళు వెనక్కు తగ్గుతున్నారు. ఎక్కడైనా ఇదే పరిస్థితి... ►ఆదిలాబాద్ జిల్లా మావల–1 మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం నిర్మాణానికి మన ఊరు–మన బడి పథకం కింద టెండర్లు పిలిచారు. కానీ ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. మావల–2 మండల కేంద్రంలోని మరో ప్రైమరీ స్కూల్ నిర్మాణం పనులు మొదలైనా బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ మధ్యలోనే పని ఆపేశాడు. బజార్ హత్నూర్ మండలం కోల్హారిలో రూ.12 లక్షలతో ప్రతిపాదించిన స్కూల్ నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తవ్వలేదు. ►హనుమకొండ సుబేదారిలోని హైస్కూల్లో తరగతి గదుల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యుత్ పనుల మాత్రమే మొదలు పెట్టారు. పగిలిపోయిన ఫ్లోరింగ్ గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. ప్రమాదకరంగా మారిందని మన ఊరు–మనబడి సమీక్షల్లో చెప్పినా స్పందన కరువైందని స్థానికులు తెలిపారు. సుబేదారి ప్రైమరీ స్కూల్లో శౌచాలయాల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ►మంచిర్యాల జిల్లా జన్నారంలో పనులు నత్త నడకను తలపిస్తున్నాయి. పొన్నెకల్ ప్రాథమిక స్కూల్ భవన నిర్మాణం పిల్లర్ల దశలో ఉంది. ధర్మారంలోని స్కూల్ బిల్డింగ్ ఇంకా రూఫ్ లెవల్లోనే ఉంది. కలమడుగు గ్రామంలోని స్కూల్లో శౌచాలయాల నిర్మాణం పునాదుల దశలోనే పురిటినొప్పులు పడుతోంది. ►నిర్మల్ జిల్లా కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల విద్యార్థులు ఒకే గదిలో కూర్చోవాల్సిన పరిస్థితి. అదే గదిలో విద్యార్థులకు వంట చేయడం జరుగుతోంది. పాడుబడ్డ మరుగుదొడ్ల కారణంగా ఆరుబయలే దిక్కవుతోంది. ►జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నత పాఠశాల గదులన్నీ శిథిలావస్థకు చేరాయి. గదుల నిర్మాణం కోసం ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. -
తుప్పుపట్టిన కేబుళ్లు, వదులైన బోల్టులు.. మోర్బి ఘటనలో షాకింగ్ నిజాలు..!
గాంధీనగర్: 135 మంది అమాయకులు చనిపోయిన గుజరాత్ మోర్బి కేబుల్ బ్రిడ్జ్ విషాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి కారణం బ్రిడ్జిని పునరుద్ధరించేందుకు నియమించిన కాంట్రాక్టర్లేనని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) ప్రాథమిక దార్యాప్తులో తేలింది. స్థానిక కోర్టుకు సమర్పించిన ఈ నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. బ్రిడ్జిని పునరుద్ధరించిన కాంట్రాక్టర్లు కేవలం మెటల్ ఫ్లోరింగ్‌ను మాత్రమే మార్చారని నివేదిక పేర్కొంది. తుప్పుపట్టిన కేబుళ్లు, వదులుగా ఉన్న బోల్టులు, విరిగిన యాంకర్ పిన్స్ వంటి కీలక సమస్యలను పట్టించుకోలేదని తెలిపింది. కొత్తగా వేసిన మెటల్ ఫ్లోరింగ్ వల్ల వంతెన బరువు పెరిగినట్లు వెల్లడించింది. అసలు వంతెన పునరుద్ధరించేందుకు నియమించిన రెండు సంస్థలకు బ్రిడ్జిలకు మరమ్మతులు చేసే అర్హతే లేదనే షాకింగ్ విషయాన్ని నివేదిక బహిర్గతం చేసింది. నిపుణుడి సలహా తీసుకోకుండానే.. ప్రజల కోసం బ్రిడ్జిని తిరిగి ఓపెన్ చేసే ముందు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఒరెవా గ్రూప్ ఎలాంటి నిపుణుడి సలహా తీసుకోలేదని నివేదిక స్పష్టం చేసింది. ఘటన జరిగిన అక్టోబర్ 30న ఈ సంస్థ 3,615 టికెట్లను విక్రయించిందని, బ్రిడ్జికి రెండువైపులా ఉన్న బుకింగ్ ఆఫీస్‌ల మధ్య సమన్వయం లేదని చెప్పింది. బ్రిడ్జి కూలినప్పుడు సామర్థ్యానికి మించి 250-300 మంది దానిపై ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ బ్రిడ్జిని రినోవేట్ చేసేందుకు గుజరాత్‌లోని ధ్రాగధ్రాకు చెందిన దేవ్ ప్రకాశ్ సోల్యుషన్ సంస్థను నియమించింది ఒరెవా సంస్థ. ఈ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యతలను ఒరెవానే చూసుకుంటోంది. మరమ్మతులు చేసినప్పుడు బ్రిడ్జి మెటల్‌ను మాత్రమే మార్చామని దేవ్ ప్రకాశ్ సొల్యూషన్స్ కోర్టులో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిని అరెస్టు చేశారు అధికారులు. వీరిలో ఒరెవా గ్రూప్ మేనెజర్లు దీపక్ పర్కేష్, దినేశ్ దావే సహా ఈ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు ఉన్నారు. దేవ్ ప్రకాశ్ సొల్యూషన్ సంస్థ ఓనర్లు ప్రకాశ్ పర్మార్, దేవంగ్ పర్మార్ కూడా అరెస్టయ్యారు. వీరంతా బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు ఇవ్వాల్సి ఉంది. చదవండి: మసాజ్ వీడియో మరువకముందే మరొకటి.. జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు.. -
షాకింగ్ ఘటన: విమానం గాల్లో ఉండగానే కుప్పకూలిన మహిళ ఆ తర్వాత...
మనం రైళ్లలోనూ, బస్సుల్లోనూ వెళ్లినప్పుడూ ఎవరైనా అనారోగ్యంతోనో లేక అనుకోకుండా అపస్మారక స్థతిలోకి వెళ్లితే... బస్సు అయితే గనుక సమీపంలోని ఆస్పత్రి వద్ద ఆపడం చేస్తారు. అదే రైలు అయితే వెంటనే సమీపంలోనే రైల్వే ఆస్పత్రికి ఇన్ఫాం చేసి అంబులెన్స్‌లో తీసుకువెళ్తారు. మరీ విమానంలో అదీ కూడా గాల్లో ఎగురుతూ ఉండగా అంటే ఊహించడానికే భయంగా అనిపిస్తుంది. అచ్చం అలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. న్యూఢిల్లీ నుంచి పాట్నా బయలు దేరుతున్న ఇండిగో విమానంలో 59 ఏళ్ల సుమన్ అగర్వాల్ అనే మహిళ అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో తన సీటులోనే కుప్పకూలిపోయింది. దీంతో విమానాన్ని వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేయాలని పైలెట్లు నిర్ణయించుకున్నారు. కానీ ముందు ఆమెకు ప్రాథమిక చికిత్స అందిచాల్సి ఉంటుంది. దీంతో పైలెట్లు వెంటనే పాట్నా ఎయిర్ కంట్రోల్‌కి కూడా సమాచారం అందించారు. ఇంతలో నలుగురు వైద్యులు, నర్సులు సదరు మహిళను రక్షించడానికి హుటాహుటినా ఆమె వద్దకు వచ్చారు. ఆమె రక్తపోటు రికార్డు కాకపోవడం, పల్స్ కూడా కనిపించపోవడంతో ఒకింత టెన్షన్ పడ్డారు వైద్యులు. ముందుగా పేషెంట్‌కి ఆక్సిజన్ అందించారు. తదనంతరం కాన్యూలా అనే పరికరాన్ని నోటి గుండా ఆహార గొట్టంలోకి పెట్టారు. ఇది ఆస్పత్రిలోనే సాధ్యం కానీ విమానంలో ఈ పరికరాన్ని పెట్టడం అత్యంత సవాలుతో కూడిన పని అయినప్పటికీ ఆ పరికరాన్ని ఆమె శ్వాసనాళ్వ వద్దకు పెట్టి దానిగుండా డెక్సోనా, డెరిఫిలిన్ల వంటి మందులను వేయడమే గాక తక్షణమే శక్తి వచ్చే గ్లూకోజ్ వాటర్‌ను కూడా ఇచ్చారు. దీంతో ఆమె స్ప్రుహలోకి వచ్చింది. ఆ తర్వాత విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ నిమిత్తం దాదాపు 7.45కు పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సిన విమానాన్ని సుమారు 25 నిమిషాల ముందు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. తదనంతరం ఆమెను అంబులెన్స్‌లో పరాస్ హెచ్ఎంఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ భర్త ప్రమోద్ అగర్వాల్ ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. (చదవండి: ఈ రెస్టారెంట్ బిల్ చూస్తే....వాట్? అని నోరెళ్లబెడతారు!) -
రాళ్ల క్వారీలో కూలిన బతుకులు
ఐజ్వాల్: మిజోరాంలో ఘోర ప్రమాదం జరిగింది. రాళ్ల క్వారీ కుప్పకూలిన ఘటనలో.. కడపటి వార్తలు అందేసరికి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాళ్ల కింద చిక్కుకున్న మరికొందరు కూలీల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నయ్‌థియాల్ జిల్లాలోని మౌదర్హ్ అనే గ్రామంలో ఏబీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రాళ్ల క్వారీలో ప్రమాదం జరిగింది. ఈ క్వారీలో రెండున్నర ఏళ్లుగా పనులు జరుగుతున్నాయి. మృతులంతా బీహారీ కూలీలని అధికారులు ప్రకటించారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. సోమవారమే ఈ రాళ్ల క్వారీ కూలిపోయింది. కార్మికులు మధ్యాహ్న భోజన అనంతరం పనుల్లో మునిగిపోగా.. ఈ ప్రమాదం జరిగింది. కూలీలలో 12 మందితో పాటు హిటాచి డ్రైవర్లు క్వారీ లోపల చిక్కుకుపోయినట్లు సమాచారం. వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వలంటీర్లు తరలివచ్చారు. రాష్ట్ర విపత్తు నివారణ బృందాలతో పాటు సరిహద్దు భద్రతా దళాలు, అస్సాం రైఫిల్స్ రెస్య్యూ ఆపరేషన్ చేపట్టాయి. -
షాకింగ్ ఘటన: చూస్తుండగానే...హఠాత్తుగా కుర్చిలోంచి కుప్పకూలిపోయాడు
ఒక వ్యక్తి క్లినిక్ వచ్చి హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....61 ఏళ్ల దిలీస్ కుమార్ మదానీ పంటి నొప్పికి చికిత్స కోసం క్లినిక్‌కి వచ్చాడు. అతను క్లినిక్ వెలుపల కుర్చిలో పేపర్ చదువుతూ కూర్చొన్నాడు. కాసేపటికి కాస్త ఇబ్బందిగా కనిపించాడు. అంతే అందరూ చూస్తుండగానే కుర్చిలోంచి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటేనే క్లినిక్ సిబ్బంది అతనికి సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. ఐతే వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు మృతుడు సోదరుడు మహేంద్ర మదానీ మాట్లాడుతూ...దిలీప్ గార్మెంట్ వ్యాపారం చేస్తున్నాడని, అతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారని చెప్పారు. వారంతా బార్మెర్లోని పంచపద్రలో ఉంటారని అన్నారు. ఒక పనిపై బార్మెర్ వచ్చాడని, అనుకోకుండా పంటినొప్పి రావడంతో క్లినిక్‌కి వచ్చినట్లు తెలిపారు. అతను ఉదయం బాగానే ఉన్నాడని అకస్మాత్తుగా ఇంత ఘోరం జరిగిపోయిందని భాదగా చెప్పారు. इस तरह की घटनाएं चिंता बढाने वाली है। पचपदरा (बाड़मेर) निवासी दिलीप जी जैन अचानक अखबार पढ़ते पढ़ते चल बसे। कोरोना के बाद लगातार ऐसी घटनाएं बढ़ रही है।#Rajasthan pic.twitter.com/SoUNn4D4mV — Vivek Shrivastava (@Viveksbarmeri) November 6, 2022 (చదవండి: మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు..ఉద్రిక్తంగా యూపీ) -
మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో సంచలన విషయాలు
-
శాపమా? పాలకుల పాపమా?
దారుణం... దిగ్భ్రాంతికరం. ఆదివారం సాయంత్రం గుజరాత్‌లోని మోర్బీ వద్ద కుప్పకూలిన తీగల వంతెన దుర్ఘటనను అభివర్ణించడానికి బహుశా ఇలాంటి మాటలేవీ సరిపోవేమో! నదిపై కట్టిన తీగల వంతెన సెకన్ల వ్యవధిలో కూలిపోతుంటే, ఒకరి మీద మరొకరుగా వందల సంఖ్యలో జనం నదీజలాల్లో పడిపోయిన తీరును వీడియోల్లో చూస్తుంటే గొంతు పెగలడం కష్టం. తెగిపోయిన తీగల మొదలు అందిన అవశేషం ఏదైనా సరే పట్టుకొని, ప్రాణాలు దక్కించుకొనేందుకు పైకి ఎగబాకాలని బాధితులు శతవిధాల ప్రయత్నిస్తూనే ప్రాణాలు కోల్పోయిన తీరు ఎంతటివారినైనా కన్నీరు పెట్టిస్తుంది. రెండేళ్ళ చిన్నారి సహా 47 మంది పిల్లలు... కడపటి వార్తలందేసరికి మొత్తం 140 మందికి పైగా అమాయకులు... అన్యాయంగా వారి ప్రాణాలు తీసిన ఈ ఘటన పరిహారమిచ్చి తప్పించుకోలేని పాపం. ఆరంభించిన అయిదు రోజులకే రోప్ బ్రిడ్జి కూలిపోవడం మరమ్మత్తుల పనిలో నాణ్యతా లోపంతో పాటు, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ! గుజరాత్‌లోని మచ్ఛు నదిపై దాదాపు 150 ఏళ్ళ క్రితం బ్రిటీషు కాలంలో కట్టిన ఈ తీగల వంతెన పేరున్న పర్యాటక ప్రాంతం. ఇప్పుడిది మరుభూమికి మారుపేరు. కొన్ని కుటుంబాలకు కుటుంబాలు నదిలో పడి ప్రాణాలు కోల్పోయాయి. ఓ పార్లమెంట్ సభ్యుడి సోదరి సహా సమీప బంధువులు 12 మంది ఒకేసారి ఈ దుర్ఘటనలో చనిపోయారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు తక్షణ నష్టపరిహారాలు ప్రకటించి, సహాయక చర్యలు దిగాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సారథ్యంలో దర్యాప్తునకు ఆదేశించి, పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి, ప్రస్తుతానికి ఈ బిడ్జి మరమ్మత్తులు చేసిన కంపెనీ ఉద్యోగులతో పాటు టికెట్లు అమ్మిన ఇద్దరు క్లర్కుల్నీ, ఒక బ్రిడ్జి కాంట్రాక్టర్నీ, భద్రతా సిబ్బందినీ అంతా కలిపి 9 మందిని అరెస్టు చేశారు. ఇప్పటికీ మరో 100 మందికి పైగా జాడ తెలియని పరిస్థితుల్లో ఇవేవీ బాధితుల కన్నీళ్ళను తుడిచేయలేవు. ప్రకృతి కాక, మానవ తప్పిదాలే ఈ ఘోరకలికి కారణం కావడం విచారకరం. అనేక అంశాల్లో పాతుకుపోయిన ప్రభుత్వ యంత్రాంగ నేరపూరిత నిర్లక్ష్యానికి నిలువుటద్దం. అజంతా బ్రాండ్ పేరుతో గోడ గడియారాలు, కాలిక్యులేటర్లకు ప్రసిద్ధమై, సీఎఫ్ఎల్ దీపాలు, ఇ– బైక్స్ రూపొందిస్తున్న ప్రైవేటు సంస్థ ఒరేవా. ఏటా రూ. 800 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఈ గడియారాల కంపెనీకి వంతెన మరమ్మత్తుతో సంబంధం ఏమిటో, దానికి ఈ పని ఎందుకు అప్పగించారో అర్థం కాదు. 51 ఏళ్ళుగా వ్యాపారంలో ఉన్న ఈ సంస్థ బ్రిడ్జి నిర్వహణను 15 ఏళ్ళకు లీజు తీసుకొని, మరమ్మత్తుల పని మూడోవ్యక్తికి కట్టబెట్టింది. బ్రిడ్జి పనులకు అధికారికంగా 8 నుంచి 12 నెలల టైమ్ ఇచ్చినా, హడావిడిగా 5 నెలల్లో పూర్తి చేశారు. ఏడాదికి పైగా పట్టే మరమ్మత్తులను హడావిడిగా అయిందనిపించి, గుజరాతీ సంవత్సరాదికి అక్టోబర్ 26న ప్రారంభించాల్సిన తొందర ఏమిటి? స్థానిక మునిసిపాలిటీ నుంచి అనుమతి లేకుండానే, బ్రిడ్జి దృఢత్వంపై పరీక్షలు చేయకుం డానే ఒరేవా సంస్థ రోప్బ్రిడ్జిపై పర్యాటకం ఎలా ప్రారంభించింది? ఏకకాలంలో 125 మందిని మించి మోయలేని వంతెనపై అదే పనిగా టికెట్లమ్ముతూ 500 పైచిలుకు మందిని ఎలా అనుమతిం చారు? తీగల వంతెన పైకి చేరిన కొందరు ప్రమాదకరంగా ఆ తీగలను పట్టుకొని ఊగుతుంటే వారిని ఆపేందుకు సిబ్బంది ఎందుకు ప్రయత్నించలేదు? ఇలా ఎన్నో ప్రశ్నలకు జవాబు లేదు. మరో నెలలో గుజరాత్లో ఎన్నికలున్న వేళ ఈ ప్రమాదం రాజకీయ ఆరోపణల పర్వానికి దారి తీసింది. 2016లో కోల్‌కతాలో ఫ్లై–ఓవర్ కూలి, పలువురు మరణించినప్పుడు అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ తప్పుపడుతూ ‘ఇది దేవుడి శాపమా, లేక అవినీతి పాపమా’ అంటూ చేసిన మాటల దాడిని ప్రతిపక్షాలు వ్యంగ్యంగా గుర్తు చేస్తున్నాయి. శవ రాజకీయాలు ఎవరు చేసినా సమర్థనీయం కాదు కానీ, ఎఫ్ఐఆర్లోని నిందితుల పేర్లలో సంస్థ పేరు కానీ, దాని అధిపతి పేరు కానీ, వ్యక్తుల పేర్లు కానీ లేకపోవడం కచ్చితంగా ప్రశ్నార్హమే. చిన్న చేపల్ని పట్టుకొని వ్యాపార తిమింగలాల్ని వదిలేస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కార్పొరేట్లకూ, రాజకీయాలకూ మధ్య పెరుగుతున్న బంధాన్ని సూచిస్తోంది. దాదాపు పాతికేళ్ళుగా గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీకి ఇది కొంత ఇబ్బందికరమైన విషయమే. మోదీ, షాలిద్దరూ గుజరాత్ వారే కావడం మరో ఇబ్బంది. యూపీలోని చందౌలీ దగ్గరా ఛఠ్ పూజ సందర్భంగా ఆదివారం ఓ వంతెన పాక్షికంగా కూలినట్టు ఆలస్యంగా వార్తలందుతున్నాయి. ఎలాంటి ప్రాణహానీ జరగనప్పటికీ, ఇలాంటి ఘటనలన్నీ మన ప్రాథమిక వసతి సౌకర్యాలలోని లోటుపాట్లను ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికల వేళ 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో పర్యటించనున్నారు. కానీ అంతకన్నా ముఖ్యం ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవడం! ప్రతిపక్షాలు కోరుతున్నట్టు రాష్ట్ర సర్కార్ హయాంలోని అధికారులతో కాక, రిటైర్డ్ జడ్జీల్లాంటి వారితో స్వతంత్ర దర్యాప్తు జరిపి, అసలైన బాధ్యుల్ని కనిపెట్టడం కఠినంగా శిక్షించడం! అలవి మాలిన నిర్లక్ష్యం అన్నింటా ప్రమాదకరమే. ప్రజా సౌకర్యాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొన్నిసార్లు అది ప్రజల ప్రాణాలకే ముప్పు. ఏమైనా, మోర్బీ ఘటన అక్షరాలా పాలకుల, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమే. కొందరి బాధ్యతారాహిత్యానికీ, అవినీతికీ ప్రజలు బలి కావాలా? ఆత్మవిమర్శ చేసుకో వాలి. పర్యాటకంతో ఆర్థిక ఆర్జన కన్నా అమాయకుల ప్రాణాలు ముఖ్యమని అర్థం చేసుకోవాలి. -
Photos: గుజరాత్లో ఘోరం.. మచ్చూ నదిపై కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి
-
గుజరాత్ లో కేబుల్ వంతెన తెగి నదిలో పడ్డ పర్యాటకులు
-
తీవ్ర విషాదం: కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 131 మంది సందర్శకుల మృతి
మోర్బీ/న్యూఢిల్లీ: మాటలకందని మహా విషాదం. సెలవు రోజున నదిపై జరిపిన సరదా విహారం ప్రాణాంతకంగా మారిన వైనం. గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లాలోని మోర్బీ పట్టణంలో ఆదివారం సాయంత్రం 6.30 సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మణి మందిర్ సమీపంలో మచ్చూ నదిపై ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణ అయిన 140 ఏళ్ల నాటి వేలాడే తీగల వంతెన ప్రమాదవశాత్తూ తెగి కుప్పకూలిపోయింది. దాంతో వంతెన రెండుగా విడిపోయింది. ఆ సమయంలో వంతెనపై మహిళలు, చిన్నారులతో సహా 400 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. వారిలో చాలామంది 100 మీటర్ల ఎత్తు నుంచి హాహాకారాలు చేస్తూ నదిలోకి పడిపోయారు. ఆ విసురుకు 100 మందికి పైగా గల్లంతయ్యారు. 132 మందికి పైగా నీట మునిగి దుర్మరణం పాలైనట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని వెల్లడించారు. ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. వారిలో పలువురు నదిలోకి కుంగిపోయిన వంతెనపై వేలాడుతూ కాపాడండంటూ ఆక్రందనలు చేశారు. పైకెక్కేందుకు విశ్వప్రయత్నం చేశారు. #Morbi ब्रिज में दुर्घटना से पहले कुछ युवकों का झुंड केबल को पैरों से मारकर अपनी जगह से खींचते कैमरे में कैद हुआ है। आपिये गुजरात को बदनाम करने के लिए किसी भी हद तक जा सकते हैं। pic.twitter.com/atpJXRJDPT — Prashant Umrao (@ippatel) October 30, 2022 ఆదివారం గుజరాత్లో మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో పర్యాటకులు. ప్రమాదం గురించి తెలిసి సహాయక చర్యలు మొదలవడానికి కనీసం గంట సమయం పట్టింది. అప్పటికే అత్యధికులు నిస్సహాయంగా అసువులు బాశారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు, పసివాళ్లేనని తెలుస్తోంది. సాయమందేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. వారి హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డవాళ్లు, స్థానికులు వీలైనంత మందిని కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం ప్రభుత్వ సిబ్బంది వారికి జత కలిశారు. బాధితులను పడవల్లో ఒడ్డుకు చేర్చారు. Saddened by the terribly tragic news coming from #Morbi in #Gujarat, a renovated cable bridge reopened 5 days ago came crashing down killing 60 people and leaving several hundred people injured. My condolences and prayers to the families who have lost their dear ones. pic.twitter.com/jRahvZVDki — K C Venugopal (@kcvenugopalmp) October 30, 2022 తెగిన బ్రిడ్జిపై చిక్కుబడ్డ బాధితులు జాతీయ విపత్తు సహాయక బృందాలూ రంగంలోకి దిగాయి. అర్ధరాత్రి దాటాక కూడా వెలికితీత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సామర్థ్యానికి మించిన భారమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి ముందు చాలామంది వంతెనపై గంతులు వేస్తూ, దాని వైర్లను లాగుతూ కన్పించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి వంతెన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల సీఎంలు తదిరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్‌లోనే ఉన్న మోదీ దీనిపై సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ వచ్చారు. బాధితులకు అవసరమైన అన్నిరకాల సాయమూ అందించాలని ఆదేశించారు. సీఎం అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు కేంద్ర, రాష్ట్రాలు చెరో రూ.50 వేలు ఇవ్వనున్నాయి. మోదీ అహ్మదాబాద్‌లో తలపెట్టిన రోడ్ షోను ప్రమాదం నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. -
కొల్లగొట్టేందుకు వచ్చి పట్టుబడ్డ దొంగలు... కొంపముంచిన ప్లాన్
ఇటీవల దొంగలు దోచుకునేందుకు వచ్చి ప్రమాదాల బారిన పడ్డ ఉదంతాలు కోకొల్లలు. అంతేందుకు ఇటీవల ఒక దొంగ ఒక దేవాలయంలో దొంగతనానికి వచ్చి కిటికిలో ఇరుక్కుపోయి పట్టుబడ్డాడు. అచ్చాం అలానే ఒక దొంగల ముఠా ఏకంగా బ్యాంక్‌ని కొల్లగొట్టేందుకు ఒక పెద్ద స్కేచ్ వేశారు. అదే వారిని పట్టుబడేలా చేసింది. వివరాల్లోకెళ్తే....రోమ్‌లో ఒక ప్రముఖ బ్యాంకును దోచుకునేందుకు నలుగురు దొంగలు ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఈ మేరకు రోమ్‌లోని వాటికన్ సమీపంలో ఇన్నోసెంటజోలోని రోడ్డులో కొంత భాగం కూలిపోయింది. దీంతో ఆ మార్గం గుండా బ్యాంకుకు చేరుకునేలా సోరంగం తవ్వారు. ఆ సోరంగ గుండా వెళ్లి బ్యాంకును దోచుకోవాలనేది వారి ప్లాన్. ఆ నలుగురు దొంగలు అనుకున్న విధంగానే వెళ్లారు గానీ అందులో ఒక వ్యక్తి మాత్రం ఆ సోరంగం నుంచి బయటపడ లేకపోయాడు. దీంతో తనను రక్షించండి అంటూ పెడబొబ్బలు పెట్టాడు. దీంతో ఆ వ్యక్తి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందడంతో సదరు దొంగను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. ఈ మేరు పోలీసులు సదరు దొంగను రక్షించగా అసలు విషయం బయటపడింది. దీంతో తప్పించుకున్న మిగతా ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ దొంగల ముఠాపై పలు దోపిడి నేరాలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్లో రివైంజ్ తీర్చుకున్న భార్య) -
క్రిప్టో.. ఇంకా తప్పటడుగులే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. కొత్త తరహా సాధనాలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్‌రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్‌లో క్రిప్టో ఎక్సేంజ్‌లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఎక్సే్ఛంజ్‌లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆర్థికంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్‌లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్సే్ఛంజ్ వజీర్‌ఎక్స్‌లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్‌లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్సే్ఛంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్‌కాయిన్‌లో లాభం వచ్చి, బిట్ కాయిన్‌లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్‌కాయిన్‌లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50–60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్సే్ఛంజ్‌లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30–40 చిన్న ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్‌లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్‌కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10–15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. నియంత్రణలు.. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్సే్ఛంజ్‌ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తం మీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థించే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017–2021 మధ్య ఈక్విటీలు–క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్‌కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్‌లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30–40% నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బనాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్‌పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్‌కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. -
అదిలాబాద్: దెబ్బతిన్న రోడ్లు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
-
కూకట్‌పల్లిలో దారుణం.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా..
సాక్షి,హైదరాబాద్: కూకట్‌పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శాతవాహననగర్‌లో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ గోడకూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆ దారిలో నిర్మాణం జరుగుతున్న నీటి ట్యాంక్ గోడ శిథిలాలు కూలి చిన్నారి మీద పడ్డాయి. ఈ ఘటనలో శరోన్ దీత్య(4)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్లఎదుటే పాప మృతి చెందడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకుంటున్నారు. -
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అపశ్రుతి.. చూస్తుండగానే కుప్పకూలింది
కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగానే ఒక్కసారిగా ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మలప్పురం జిల్లాలోని పూంగోడ్‌లో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కేరళలో ఆల్ ఇండియా సెవెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి పూంగోడ్‌లోని ఎల్పీ స్కూల్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో ప్రేక్షకులు పోటెత్తారు. సామర్థ్యానికి మించి రావడంతో మైదానంలోని గ్యాలరీలు నిండిపోయాయి. అయితే ప్రేక్షకులు మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఒకవైపు ఉన్న గ్యాలరీ కుప్పకూలిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ఏకంగా 8వేల మంది హాజరైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Nicholas Pooran: 'ఒక్క సీజన్ మాత్రమే చెత్తగా ఆడాను.. నేనేంటో చూపిస్తా' బీర్ బాటిల్‌తో మ్యాచ్ రిఫరీ తల పలగొట్టాడు.. అంతటితో ఊరుకోకుండా #WATCH Temporary gallery collapsed during a football match in Poongod at Malappuram yesterday; Police say around 200 people suffered injuries including five with serious injuries#Kerala pic.twitter.com/MPlTMPFqxV — ANI (@ANI) March 20, 2022 -
మరో సంక్షోభం దిశగా అఫ్గన్! ఐరాస హెచ్చరిక
తాలిబన్ల ఆక్రమణ, అల్లకల్లోల పరిస్థితులు, బయటి దేశాలతో వర్తక వాణిజ్యాలు నిలిచిపోవడం.. తదితర కారణాలతో అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలుకు లోనైంది. ఈ తరుణంలో అఫ్గనిస్తాన్ పై మరో పిడుగు పడనుంది. ఊహించని స్థాయిలో ఆర్థిక సంక్షోభం అఫ్గన్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయంటూ హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి. యూఎన్ డెవలప్మెంట్ ప్రొగ్రాం(UNDP) సోమవారం మూడు పేజీలతో కూడిన ఒక నివేదికను రిలీజ్ చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయని, తద్వారా ఆర్థిక తలెత్తే అవకాశం ఉందని, ఆ ప్రతికూల ప్రభావం సొసైటీపై ఊహించని స్థాయిలో చూపించ్చొచ్చని అభిప్రాయపడింది ఐరాస. కిందటి ఏడాది 7 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్, ఉత్పత్తులను, సేవలను అందించింది అఫ్గనిస్తాన్. ఎలాంటి అవాంతరాలు లేకుండా లావాదేవీలు జరగడానికి కారణం.. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థే. అయితే చాలామంది లోన్లు తిరిగి చెల్లించకపోవడం, తాలిబన్ల ఆక్రమణ తర్వాత నగదు విత్‌డ్రా, అదే సమయంలో డిపాజిట్లు తక్కువగా వస్తుండడం, అవసరాలకు సరిపడా కరెన్సీ నిల్వలు లేకపోవడంతో.. కొద్దినెలల్లోపే ఈ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐరాస యూఎన్డీపీ నివేదికలో పేర్కొంది. ఇప్పటికైనా తేరుకుని బ్యాంకింగ్ వ్యవస్థను బలపర్చాలని తాలిబన్ ప్రభుత్వానికి సూచించింది ఐక్యరాజ్య సమితి. ఇందుకోసం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు సైతం సహకరించాలని యూఎన్డీపీ అభిప్రాయపడింది. మరోవైపు కఠిన ఆంక్షల విధింపు, విదేశీ నిధులు నిలిచిపోవడం, తాలిబన్ల ఆక్రమణ టైంలో వర్తకవాణిజ్యాలు ఆగిపోవడంతో పాటు అఫ్గన్‌కు రావాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలావరకు దెబ్బతింది. ఈ తరుణంలో బ్యాంకింగ్, డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వ్యవస్థలు సైతం దెబ్బతింటే గనుక.. ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చినా ఆ సంక్షోభం నుంచి కోలుకోవడానికి దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
పాతిక కోట్లను బాంబులతో పేల్చేశారు!
వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం.. అంతులేని అవినీతి, కుమ్మక్కు రాజకీయాల ఫలితంగా నిర్మించిన ఏడాదికే ఓ ఆనకట్టకు అవినీతి కంతలు పడ్డాయి. దీనికితోడు భారీ వర్షాలకు నీటి ఉద్ధృతి పెరగడంతో డ్యాం కూలిపోయే పరిస్థితి నెలకొంది. చేసేది లేక అధికారులు ఆనకట్టనే పేల్చివేశారు. అలా.. రూ.25 కోట్ల ప్రజాధనం నీళ్లపాలైంది. సాక్షి, చెన్నై(తమిళనాడు): భారీ వ్యయంతో నిర్మించిన ఆనకట్ట ఏడాదిలోపే బలహీన పడిపోయింది. పొంచి ఉన్న ముంపుముప్పు నుంచి గ్రామాలను కాపాడేందుకు దక్షిణ పెన్నానదిపై రూ.25.35 కోట్లతో నిర్మించిన ఆనకట్టను ఆది, సోమవారాల్లో బాంబులతో అధికారులే పేల్చి.. కూల్చేవేశారు. వివరాలు.. విళుపురం జిల్లా దళవానూరు గ్రామం, కడలూరు జిల్లా ఎనదిరిమంగళూరు గ్రామాలకు మధ్య ప్రవహించే దక్షిణ పెన్నానదిపై గత అన్నాడీఎంకే ప్రభుత్వం రూ.25.35 కోట్లతో ఆనకట్ట నిర్మించింది. వ్యవసాయ ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ ఆనకట్టను గత ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన ప్రారంభించి వినియోగంలోకి తెచ్చారు. అయితే ప్రారంభించిన నాలుగు నెలలకే.. అంటే ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఆనకట్ట క్రస్ట్‌గేట్లకు దన్నుగా ఇరువైపులా అమర్చిన గోడ పాక్షికంగా తెగిపోయింది. ఫలితంగా నీరు బయటకు ప్రవహించడం ప్రారంభమైంది. ఈ వ్యవహారంలో బాధ్యులుగా భావిస్తూ ప్రజాపనులశాఖలోని ఆరుగురిని అధికారులు సస్పెండ్ చేశారు. ప్రభుత్వ మార్పుతో.. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు చోటు చేసుకోగా రూ.15 కోట్లతో ఆనకట్టను మరమ్మతు చేయాలని ప్రజాపనులశాఖ అంచనాలు సిద్ధం చేసింది. ఈలోగా భారీ వర్షాలు, వరద ప్రవాహం మొదలవడంతో మరమ్మతు పనులను ప్రారంభించలేక పోయారు. ఇదిలా ఉండగా, విళుపురం జిల్లాలో గత కొన్నిరోజులు కుండపోత వర్షాల వల్ల దక్షిణ పెన్నానదిలో వరద ప్రవాహం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో ఆనకట్ట పూర్తిగా నిండిపోయి వరదనీరు రెండువైపుల ఒడ్డును తాకడం మొదలైంది. ఇన్‌ఫ్లో అంతకంతకూ పెరిగింది. ఆనకట్టలోని మూడు క్రస్ట్ గేట్లు బలహీన దశకు చేరుకుని ఏ క్షణమైన బద్దలయ్యే పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ఆనకట్టలోకి నీటి ప్రవాహాన్ని ఇసుకబస్తాలు వేసి నిలువరించేందుకు ఈనెల 10వ తేదీన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇన్‌ఫ్లో, ప్రవాహ ఒత్తిడిని తట్టుకోలేక ఆనకట్ట ఎడమవైపు తెగిపోగా ఉధృతంగా ప్రవహించిన నీటిలో స్థానికంగా సాగు చేసిన చెరకు పంట కొట్టుకుపోయింది. పైగా 11వ తేదీన అనకట్ట ప్రహరీగోడ బీటలు వారింది. దీంతో విళుపురం జిల్లా కలెక్టర్ మోహన్, ఎస్పీ శ్రీనాథ ఇతర ఉన్నతాధికారులు ఆదివారం ఉదయం ఆనకట్టను పరిశీలించారు. ఈ సమయంలో సాతనూరు ఆనకట్ట నుంచి సెకనుకు 3,500 ఘనపుటడుగుల నీటిని దక్షిణ పెన్నానదిలోకి విడుదల చేసినట్లు సమాచారం అందింది. ఈ ప్రవాహం వల్ల పెన్నానది ఒడ్డు మరింతగా దెబ్బతిని పరిసర గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తే పెనుముప్పు తప్పదని అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ కారణంగా దెబ్బతిన్న మూడు క్రస్ట్ గేట్లను, దానికి సమీపంలోని ఆనకట్ట ప్రాంతాన్ని 50 అడుగుల మేర బాంబులతో పేల్చి తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. మొదటిసారి తూచ్.. మూడు క్రస్ట్ గేట్లను, తీరంలోని కాంక్రీట్ గోడను వంద జిలెటిన్ స్టిక్స్, వంద తూటాలను 20 చోట్ల అమర్చి ఆదివారం సాయంత్రం 5.50 గంటలకు కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో పేల్చేశారు. పేలుళ్ల ధాటికి ఆనకట్ట శిథిలాలు వంద మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. అయినా ఆశించిన స్థాయిలో ఆనకట్టను తొలగించలేక పోగా, అక్కడక్కడా పగుళ్లు చోటుచేసుకుని మరింత ప్రమాదకరంగా తయారైంది. దక్షిణ పెన్నానదిలో ప్రవాహ ఉధృతి పెరిగినట్లయితే ఆనకట్ట పూర్తిగా కొట్టుకుపోయి ప్రమాదం జరిగే అవకాశం ఏర్పడింది. దీంతో సోమవారం మరోసారి బాంబులు పెట్టి పూర్తిస్థాయిలో పేల్చివేసినట్లు ప్రజాపనులశాఖ అధికారులు వెల్లడించారు. -
వైరల్ వీడియో.. చూస్తుండగానే సముద్రంలో కలిసిపోయిన ఇల్లు
సోషల్ మీడియాను వాడుతున్న యూజర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందులో పలు వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటే.. మరికొన్ని ఆందోళనకు గురిచేస్తుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట దూసుకుపోతుంది. ఓ ఇల్లు ఒక్కసారిగా సముద్రంలో కుప్పకూలింది. ఆ ఇల్లు కూలినట్లు గాక సముద్రమే మింగేసిందా? అనేలా ఉన్న ఈ వీడియో చూస్తున్నంతసేపు మనల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. జూలై 28న అర్జెంటినాలోని బ్యూనస్ ఎయిర్స్‌లోని మార్ డెల్ తుయులో ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో నీటిమట్టం అంతకంతకూ పెరగడంతో తీరం సమీపాన ఉన్న ఓ రెండస్థుల భవనం పునాదులు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఒక్కసారిగా ఆ రెండస్థుల భవనం సముద్రంలోకి కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేరని, పెను ప్రమాదం తప్పిందని అర్జెంటినా మీడియా వెల్లడించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా తీర ప్రాంతం కోతకు గురవుతున్న కారణంగానే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. After teetering on the edge for some time, a house in Buenos Aires, Argentina, has finally collapsed into the sea. Watch more videos from Sky News: https://t.co/3ZESAqWhX3 pic.twitter.com/8cZE8LKe8S — Sky News (@SkyNews) July 30, 2021 -
ముంబైలో కుప్పకూలిన రెండు అంతస్తుల భవనం
-
అనకాపల్లి: కూలిన ఫ్లైఓవర్ పిల్లర్.. కారు, ట్యాంకర్ ధ్వంసం
-
అనకాపల్లి: కూలిన ఫ్లైఓవర్ పిల్లర్.. కారు, ట్యాంకర్ ధ్వంసం
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. హైవే వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్ కూలింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు అక్కడ ఓ కారు, ట్యాంకర్ ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లర్ భాగాలు వీటి మీద పడటంతో అవి పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. విచారకర అంశం ఏంటంటే ప్రమాదం సమయంలో కారులో ఉన్న దంపతుల్దిదరు మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఈ హైవే విస్తరణ పనులు కొనసాగతున్నాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో విశాఖ శ్రీహరిపురంకు చెందిన సతీష్ కుమార్, సుశాంత్ మహంతిలు మృతి చెందారు. కారులో వెనక కూర్చున్న మృతుల భార్యలు సునీత, లక్ష్మిలను స్థానికులు కాపాడారు. ఇక వీరిలో సునీత గర్భిణీ. బాధితులంగా అనకాపల్లి శ్రీ నూకాలమ్మ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఈ రెండు కుటుంబాలు ఉపాధి రీత్యా శ్రీహరిపురంలో నివాసం ఉంటున్నారు. -
వరద బీభత్సానికి కుప్పకూలిన వైద్య కేంద్రం, ఇళ్ళు : బీహార్
-
సూరజ్ ఖాన్ ఆసుపత్రి వద్ద కుప్పకూలిన భవనం గోడ
-
కుప్పకూలిన మార్కెట్ : సూచీలు ఢమాల్
-
కుప్పకూలిన మార్కెట్ : సూచీలు ఢమాల్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. శుక్రవారం ఆరంభంలోనే సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు కుప్పకూలింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనించింది. బ్యాంక్, స్మాల్, మిడ్ క్యాప్ ఇలా అన్ని రంగాల షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో దేశీయ మార్కెట్లో గత రెండు రోజులు తుడిచిపెట్టుకు పోయాయి. యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఏడాది గరిష్టానికి చేరడం ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. అయితే ఆరంభం పతనాన్ని నుంచి కోలుకున్న సెన్సెక్స్ ప్రస్తుతం 676 పాయింట్ల నష్టంతో 50396 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల నష్టంతో 14914 వద్ద ట్రేడవుతోన్నాయి. వాల్ స్ట్రీట్ ప్రధాన సూచికలు గురువారం కుప్పకూలిపోయాయి, నాస్డాక్ సూచిక నాలుగు నెలల్లో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. జనవరి 28 నుండి అతిపెద్ద ఇంట్రాడే శాతం నష్టానికి దారితీసింది. జపాన్ 225 1.8 శాతం క్షీణించగా, హాంకాంగ్, హాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ 1.69 శాతం నష్టపోయాయి. మరోవైపు ఎన్ఎస్ఓ మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) 2020-21 మార్కెట్ ముగిసిన నేడు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను విడుదల చేయనుంది. వరుసగా రెండు త్రైమాసికాల సంకోచం తరువాత అక్టోబర్-డిసెంబర్ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధిబాటలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. -
హర్యానాలో అర్థరాత్రి కూలిన ఫ్లై ఓవర్
గురుగ్రామ్ : హర్యానాలోని గురుగ్రామ్‌లో శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి సోహ్నా రోడ్డులో 6 కిమీ మేర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మాత్రమే గాయపడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్లైఓవర్ శిధిలాలను తొలగించే పనులు జరుగుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేని కారణంగా పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అమన్ యాదవ్ తెలిపారు. రాజీవ్ చౌక్ నుంచి గురుగ్రామ్‌లోని సోహ్నా వరకు 6కిమీ మేర ఈ ఫ్లైఓవర్‌ను రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఓరియంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ చేపట్టింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఫ్లైఓవర్‌లోని ఎలివేటెడ్ రోడ్డులోని కొంత భాగం కూలిపోయిందని కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ శైలేష్ సింగ్ తెలిపారు. కాగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ నాణ్యతపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.