చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో హైవే బ్రిడ్జి పాక్షికంగా కూలిన ఘటనలో మృతుల సంఖ్య సంఖ్య 38కి చేరుకుంది. సుమారు 25 మంది జాడ ఇంకాతెలియరాలేదు. జూలై 19న జరిగిన ఈ ప్రమాదంలో 25కుపైగా వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగా వెళుతూ, వేగంగా ప్రవస్తున్న నదిలో పడిపోయాయి. ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో రెస్క్యూ సిబ్బంది ఒకరిని రక్షించారు. షాంగ్సీ ప్రావిన్స్‌లోని డానింగ్ హైవేపై వంతెన కూలిపోయిన ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం వంతెన కూలిన సమయంలో 25 కార్లు నదిలో పడిపోయాయి. బాధితుల కోసం రెస్క్యూ బృందాలు కిలోమీటర్ల మేర వెదుకులాట సాగించాయి. రాష్ట్ర వార్తా సంస్థ జిన్హువా విడుదల చేసిన ఫోటోలో వంతెనలోని ఒక భాగం కూలిపోయి ఉండటాన్ని గమనించవచ్చు.
ఈ ప్రమాదం బారినపడి గల్లంతైన వారి కోసం వెదుకులాట ఇంకా కొనసాగుతోంది. ఇటీవల చైనాలో సంభవించిన గ్యామీ తుఫాను కారణంగా 48 మంది మృతి చెందారు. అలాగే మేలో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఒక వంతెన కూలిపోయిన ఘటనలో 36 మంది మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment