బరేలీ: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్ముకున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. యూపీలోని బరేలీలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. జీపీఎస్ ఫాలోచేస్తూ నిర్మాణంలో ఉన్న వంతెనపైకి వెళ్లిన ఓ కారు అమాంతం అక్కడి నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
వివరాల్లోకి వెళితే బరేలీలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనపై నుంచి వచ్చిన ఒక కారు రాంగంగా నదిలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. వారు గూగుల్ మ్యాప్ ఉపయోగించి నావిగేట్ అవుతూవచ్చారు. అయితే వంతెనలోని కొంత భాగం దెబ్బతిన్నట్లు సూచించడంలో గూగుల్ మ్యాప్ విఫలమైందని పీటీఐ పేర్కొంది.
బరేలీ నుంచి కారులో ముగ్గురు వ్యక్తులు బదౌన్ జిల్లాలోని డాటాగంజ్ వెళ్తుండగా ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఫరీద్ పూర్, బరేలీ, దాతాగంజ్ పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గతంలో వచ్చిన వరదల కారణంగా వంతెన ముందు భాగం కూలిపోయి నదిలో పడిపోయింది. అయితే ఇది జీపీఎస్‌లో అప్‌డేట్ కాలేదు. ఫలితంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
3 men in a car used Google Maps, which directed them to an under-construction bridge in Bareilly, UP. Their car fell off, and all 3 died.
1) Why were there no barricades at the bridge?
2) Why does Google Maps direct users to incomplete routes? Is the GPS data not updated? This… pic.twitter.com/8t8qQp0FQg— Anshul Saxena (@AskAnshul) November 24, 2024
కారు బ్రిడ్జిపై అప్పటికే అతివేగంతో ఉండటానికి తోడు చివరి నిమిషంలో డ్రైవర్ కూడా ఏం చేయలేకపోయాడని, దట్టమైన పొగమంచు కారణంగా డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించలేకపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరిని అమిత్, వివేక్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఫరూకాబాద్‌లోని ఇమాద్‌పూర్ వాసులని, మూడో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. ఈ ప్రమాదంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం
Comments
Please login to add a commentAdd a comment