Bridge
-
పంబన్ 2.0
పంబన్ (రామేశ్వరం) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభానికి సిద్ధమైంది. సముద్రంలో నిర్మించిన తొలి వ ర్టీకల్ లిఫ్ట్(Vertical Lift) (నిలువునా పైకి లేచే) వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవటంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. త్వరలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీనిని జాతికి అంకితం చేయనున్నారు. వంతెనపై ట్రయల్స్‌ను శనివారం విజయవంతంగా చేశారు.దూర ప్రయాణాన్ని తగ్గించేందుకు.. 1914లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తమిళనాడులోని మండపం (సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం) నుంచి పంబన్ (రామేశ్వరం దీవి ప్రారంభ చోటు) వరకు రైలు వంతెనను నిర్మించింది. ఆ సమయంలోనే వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో వంతెన స్పాన్లు విడిపోయి ఉంటాయి. సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్డు లెవల్ క్రాసింగ్ రైలు గేటు తరహాలు పైకి లేస్తాయి.దీంతో పడవలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు. సముద్రపు నీటి ప్రభావంతో ఈ వంతెన తుప్పుపట్టి బలహీనపడింది. దీంతో రోలింగ్ లిఫ్ట్‌కు బదులుగా వ ర్టీకల్ లిఫ్ట్‌తో కొత్త వంతెనను నిర్మించారు. వంతెన మధ్యలో ఈ లిఫ్ట్ లేకపోతే నౌకలు రామేశ్వరం దాటిన తర్వాత ఉన్న మనదేశ చిట్టచివరి భూభాగం ధనుషో్కడి ఆవలి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల 150 కి.మీ. అదనపు దూరాభారం అవుతుంది. వంతెన ప్రత్యేకతలు..⇒ వంతెన నిర్మాణ వ్యయం రూ.540 కోట్లు. పొడవు 2.10 కి.మీ. ⇒ పిల్లర్లతో కూడిన పైల్స్ సంఖ్య 333 ⇒ సముద్రగర్భంలో సగటున 38 మీటర్ల లోతు వరకు పిల్లర్లు. వీటికోసం వాడిన స్టెయిన్లెస్ స్టీలు 5,772 మెట్రిక్ టన్నులు (రీయిన్‌ఫోర్స్‌మెంట్), స్ట్రక్చరల్ స్టీల్ 4,500 మెట్రిక్ టన్నులు. ⇒ సిమెంటు వినియోగం 3.38 లక్షల బస్తాలు. 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ⇒పైకి లేచే భాగం బరువు 660 మెట్రిక్ టన్నులు. ⇒ స్పెయిన్ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. ఆ దేశానికి చెందిన టిప్స సంస్థను కన్సల్టెన్సీగా నియమించుకుని వంతెనను డిజైన్ చేయించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ⇒ ప్రపంచంలో సముద్రపు నీరు, ఉప్పు గాలి ప్రభావంతో ఇనుము అతి వేగంగా తుప్పుపట్టే ప్రాంతం మియామీ. ఆ తర్వాత పంబన్ ప్రాంతమే. దీంతో కొత్త వంతెన తుప్పు బారిన పడకుండా జింక్, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సేన్‌తో కూడిన రంగు డబుల్ కోట్ వేశారు. కనీసం 35 సంవత్సరాల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూస్తే మరికొంతకాలం తప్పు పట్టదు. ⇒ పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే రెండు భాగాలు రెక్కాల్లా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5.20 నిమిషాల్లో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది. ⇒ ఈ వంతెనపై రైళ్లను గంటకు 80 కి.మీ. వేగంతో నడిపే వీలుంది. కానీ, రైల్వే సేఫ్టీ కమిషనర్ 74 కి.మీ. వేగానికి అనుమతించారు. పాత వంతెనపై గరిష్ట వేగం గంటకు 10 కి.మీ. మాత్రమే. ⇒ నిర్మాణ పనులు 2019లో మొదలయ్యాయి. కొవిడ్ వల్ల కొంతకాలం ఆలస్యమైనా, మొత్తంగా 2 సంవత్సరాల్లోనే పూర్తిచేశారు. ⇒ 2022 డిసెంబర్లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపేశారు. అప్పట్లో రోజుకు 18 ట్రిప్పుల రైళ్లు తిరిగేవి. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ⇒ లిఫ్టు టవర్లకు 310 టన్నుల బరువు తూగే భారీ స్టీల్ దిమ్మెలు రెండు వైపులా కౌంటర్ వెయిట్స్‌గా ఏర్పాటు చేశారు. కరెంటు శక్తితో వంతెన భాగం పైకి లేవటం మొదలుకాగానే కౌంటర్ వెయిట్స్ మరోవైపు దిగువకు జారటం ద్వారా వంతెన భాగం పైకి వెళ్లేలా చేస్తాయి. దీంతో 5 శాతం కరెంటు మాత్రమే ఖర్చవుతుంది. ⇒ లిఫ్ట్ టవర్ పైభాగంలో ప్రత్యేకంగా స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) సెంటర్ ఏర్పాటు చేశారు. వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. అక్కడి భారీ కంప్యూటర్లో లోపాలను చూపుతుంది. ⇒ రైల్వేలో సీనియర్ ఇంజనీర్, విజయనగరం జిల్లాకు చెందిన నడుకూరు వెంకట చక్రధర్ ఈ వంతెన నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం దాని ఇన్చార్జిగా ఉన్నారు. ⇒ 1964 డిసెంబర్ 22న పెను తుఫాను కారణంగా 25 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డ అలలు, బలమైన గాలులతో పంబన్ వంతెన ధ్వంసమైంది. రాత్రి 11.50 సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న 653 నంబర్ రైలు కొట్టుకుపోయి అందులోని 190 మంది ప్రయాణికులు మృతి చెందారు. కానీ, వంతెనలోని షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ భాగం మాత్రం కొట్టుకుపోకుండా నిలిచింది. మెట్రో మ్యాన్‌గా పిలుచుకుంటున్న ఈ. శ్రీధరన్ ఆధ్వర్యంలో 46 రోజుల్లోనే వంతెనను పునరుద్ధరించారు. -
Dock Bridge : ప్రకృతి ఆధారిత వేళ్ల వంతెన..!
ఇది వేళ్లాడే వంతెన. ఉంగాట్ నది మీద ఉంది. అభివృద్ధి చెందిన నగరాలన్నీ నగరం మధ్యలో ఉన్న చెరువు మీద ఇనుప చువ్వలతో వేళ్లాడే వంతెనలను కడుతున్నాయి. కానీ ఉంగాట్ నది మీద కనిపించేవి వేళ్లతో కట్టిన వంతెనలు. అది కూడా చెట్టు నుంచి వేరు చేసిన వేళ్లు కాదు, సజీవంగా ఉన్న వేళ్ల వంతెనలు. ఈ నైపుణ్యం ప్రపంచంలో మనదేశానికే సొంతం, అది కూడా మేఘాలయ వంటి మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించిన నైపుణ్యం. ఈ నది డాకీ పట్టణం నుంచి ప్రవహిస్తోంది. వంతెన డాకీ పట్టణంలో ఉంది. అందుకే డాకీ రూట్ బ్రిడ్జిగా వ్యవహారంలోకి వచ్చింది. ఇలాంటి వంతెనలు డాకీ పట్టణంలో మాత్రమే కాదు. మేఘాలయలో చాలా చోట్ల విస్తారంగా ఉంటాయి. కానీ మేఘాలయ పర్యటనకు వెళ్లిన వాళ్లు తప్పకుండా డాకీ పట్టణంలోని రూట్ బ్రిడ్జి మీద నడిచి మురిసిపోతారు. ఎందుకంటే ఇది దేశానికి చివరి వంతెన. డాకీ దాటితే బంగ్లాదేశ్‌లో అడుగుపెడతాం. మనిషికి జీవన నైపుణ్యాలు అవసరాన్ని బట్టి వృద్ధి చెందుతాయనడానికి నిదర్శనం ఈ వంతెనలు. ఇనుము, సిమెంటు వంటి భవన నిర్మాణ సామగ్రిని తరలించడం సాధ్యం కాని చోట్ల ప్రకృతి ఇచ్చిన మెటీరియల్‌తో జనం తమకు అవసరమైన విధంగా మలుచుకోవడం అంటే ఇదే. మేఘాలయలో నివసించే ఖాసీ, జైంతియా తెగల వాళ్లు నదికి రెండు వైపులా ఉన్న రబ్బరు చెట్ల వేళ్లను ఒకదానితో మరొక దానిని జడలాగ అల్లుతూ ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుతో కలుపుతారు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి వంతెన రెడీ. సిమెంటు వంతెనలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు కానీ ఈ వేళ్ల వంతెనలను ఒకసారి అల్లితే వందేళ్లకు కూడా చెరగవు, పైగా మరింత దృఢమవుతూ ఉంటాయి. మరీ లేత వేళ్లను కాకుండా ఒక మోస్తరు ముదురు వేళ్లతో వంతెన అల్లుతారు. కాలం గడిచే కొద్దీ చెట్టు పెద్దదవుతుంది, వేళ్లు శక్తిపుంజుకుంటూ ఉంటాయి. మరో విచిత్రం ఏమిటంటే... ఈ వేళ్లు నది నీటిని అందుకోవడానికి మాన్గ్రోవ్లాగ పిల్ల వేళ్లను పెంచుకుంటాయి. కొత్త వంతెనలు మనం నడిచేటప్పుడు బరువుకు తగినట్లు ఊగుతుంటాయి. ముదురు వంతెనలు కదలవు. ఈ వంతెనల మీద నుంచి రాకపోకలు సాగించేది మనుషుల మాత్రమే కాదు, జింకలు, చిరుతపులులతోపాటు ఇతర జంతువులు కూడా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వంతెనల మీదనే వెళ్తాయి. ఇప్పటి వరకు వంతెన గొప్పదనాన్నే మాట్లాడుకున్నాం. కానీ ఉంగాట్ నదికి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విశేషణం ఉంది. మనదేశంలో అత్యంత పరిశుభ్రమైన నదుల్లో ఉంగాట్ నది ఒకటి. ఈ నదిలో పడవలో విహరిస్తుంటే నీటి కింద నేల అద్దంలో కనిపించినంత స్వచ్ఛంగా ఉంటుంది. వేళ్ల వంతెన మీద నడవడంతోపాటు పడవ ఎక్కి ఈ నదిలో విహరించడం కూడా గొప్ప అనుభూతి.రాముడు కూడా కట్టాడునది మీద చెట్ల వేళ్లతో వంతెన నిర్మించే నైపుణ్యం ఇతిహాస కాలం నాటిదని చెబుతారు. వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు అడవుల్లో నివసించినట్లు చెప్పుకుంటాం. గంగానది తీరాన నివసించిన రోజుల్లో ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరడానికి రాముడు, లక్ష్మణుడు నదిలో ఈదుతూ వెళ్లేవారని, ప్రతిరోజూ నది దాటడం సీతమ్మకు కష్టం కావడంతో ఆమె కోసం వంతెన నిర్మించారని చెబుతారు. గంగానది మీద రిషికేశ్ దగ్గర రామ్‌ఝాలా, లక్ష్మణ్ ఝాలా ఉన్నాయి. బ్రిటిష్ పాలన కాలంలో ఈ వంతెనలను ఇనుముతో పునర్నిర్మించారు. రిషికేశ్‌లో గంగానది మీద ఇప్పుడు మనకు కనిపించేవి కొత్త నిర్మాణాలు. వాకా మంజూలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: తాత మొండి పట్టుదల ఎంత పనిచేసింది..! ఏకంగా ఇంటి చుట్టూ..) -
గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్ముకుని.. ముగ్గురి మృతి
బరేలీ: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్ముకున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. యూపీలోని బరేలీలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. జీపీఎస్ ఫాలోచేస్తూ నిర్మాణంలో ఉన్న వంతెనపైకి వెళ్లిన ఓ కారు అమాంతం అక్కడి నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.వివరాల్లోకి వెళితే బరేలీలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనపై నుంచి వచ్చిన ఒక కారు రాంగంగా నదిలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. వారు గూగుల్ మ్యాప్ ఉపయోగించి నావిగేట్ అవుతూవచ్చారు. అయితే వంతెనలోని కొంత భాగం దెబ్బతిన్నట్లు సూచించడంలో గూగుల్ మ్యాప్ విఫలమైందని పీటీఐ పేర్కొంది.బరేలీ నుంచి కారులో ముగ్గురు వ్యక్తులు బదౌన్ జిల్లాలోని డాటాగంజ్ వెళ్తుండగా ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఫరీద్ పూర్, బరేలీ, దాతాగంజ్ పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గతంలో వచ్చిన వరదల కారణంగా వంతెన ముందు భాగం కూలిపోయి నదిలో పడిపోయింది. అయితే ఇది జీపీఎస్‌లో అప్డేట్ కాలేదు. ఫలితంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 3 men in a car used Google Maps, which directed them to an under-construction bridge in Bareilly, UP. Their car fell off, and all 3 died.1) Why were there no barricades at the bridge?2) Why does Google Maps direct users to incomplete routes? Is the GPS data not updated? This… pic.twitter.com/8t8qQp0FQg— Anshul Saxena (@AskAnshul) November 24, 2024కారు బ్రిడ్జిపై అప్పటికే అతివేగంతో ఉండటానికి తోడు చివరి నిమిషంలో డ్రైవర్ కూడా ఏం చేయలేకపోయాడని, దట్టమైన పొగమంచు కారణంగా డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించలేకపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరిని అమిత్, వివేక్లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఫరూకాబాద్‌లోని ఇమాద్‌పూర్ వాసులని, మూడో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. ఈ ప్రమాదంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం -
గుజరాత్ బుల్లెట్ ప్రాజెక్టులో అపశృతి
అహ్మాదాబాద్: గుజరాత్‌లోని బుల్లెట్ రైల్ ప్రాజెక్టులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆనంద్ జిల్లా వసాద్ దగ్గర పిల్లర్లు కూలిపోయాయి. ఆకస్మికంగా పిల్లర్లు కూలడంతో ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఐరన్ బీమ్ కూలిపోవడంతో 3-4 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించామని ఆనంద్ ఎస్పీ గౌరవ్ జసాని చెప్పారు.VIDEO | Gujarat: "According to the primary information, 3-4 workers were trapped under the debris after an iron beam collapsed. The rescue operation started immediately. Two people have already been rescued and were taken to the hospital," says Anand SP Gaurav Jasani on collapse… pic.twitter.com/0N5ze6JR1S— Press Trust of India (@PTI_News) November 5, 2024 -
నదిపై కుప్పకూలిన బ్రిడ్జి.. ఎనిమిది మంది గల్లంతు
హనోయ్: వియత్నాంలో ఎర్ర నదిపై ఉన్న 30 ఏళ్ల నాటి వంతెన కుప్ప కూలింది. ఉత్తర ప్రావిన్సు ఫుథోలో సోమవారం(సెప్టెంబర్9) ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో దానిపై ప్రయాణిస్తున్న 8 మంది నదిలో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఎర్ర నదిపై ఉన్న మిగిలిన వంతెనల మీద రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని చోట్ల పూర్తిగా నిషేధించారు.ట్రాఫిక్ ఆపేసిన వాటిలో రాజధాని హనోయ్‌లోని చోంగ్డోంగ్ బ్రిడ్జి కూడా ఉంది. భారీ తుపాను యాగీ బీభత్సం వల్లే వంతెన కూలినట్లు అధికారులు తెలిపారు. తుపాను ధాటికి మొత్తం 58 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి.. నిప్పులు చిమ్మే డ్రోన్ డ్రాగన్ -
వందేళ్ల వంతెన చాన్నాళ్లు 12 ఏళ్ల వంతెనకు నూరేళ్లు
నిజాం కాలంలో వందేళ్ల క్రితం ఖమ్మం మున్నేరుపై రాతి కట్టడంగా నిర్మించిన బ్రిడ్జి 36.9 అడుగుల మేర వరదను తట్టుకుని నిలబడింది. అదే మున్నేరుపై ప్రకాశ్‌నగర్ వద్ద పదేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి స్పాన్ మాత్రం పక్కకు జరిగింది. భారీ వరదతో బ్రిడ్జి స్పాన్ బేరింగ్ పైనుంచి పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల 1న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు మున్నేరుకు భారీగా వరద వచి్చంది. 36.9 అడుగుల మేర వరద ప్రవాహం ఆరు గంటలపాటు కొనసాగింది. ఈ వరద ప్రవాహంతోనే బ్రిడ్జి స్పాన్ బేరింగ్ల పైనుంచి పక్కకు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకొన్ని గంటలు వరద ఇలాగే కొనసాగితే బ్రిడ్జికి ముప్పు వాటిల్లేదని నిపుణులు చెబుతున్నారు. – ఖమ్మం మయూరి సెంటర్పదిలంగా వందేళ్ల బ్రిడ్జి.. అనేకసార్లు భారీగా వరదల తాకిడి తగిలినా ఎక్కడా తొణుకు లేకుండా ఖమ్మం కాల్వొడ్డు వద్ద నిర్మించిన బ్రిడ్జి పదిలంగా నిలిచింది. నిజాంల కాలంలో రాతితో కట్టిన ఈ బ్రిడ్జి వద్ద పలుసార్లు 30 అడుగులకు పైగా వరద ప్రవహించినా చెక్కుచెదరలేదు. గత పదేళ్లుగా బ్రిడ్జి పని అయిపోయిందని, వందేళ్లు దాటినందున ప్రమాదం పొంచి ఉన్నట్లేనని అధికార యంత్రాంగం, ప్రజలు చర్చించుకుంటున్నా.. సగర్వంగా నిలవడం విశేషం. కాగా, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై ఎస్12 స్పాన్ పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూడో బ్రిడ్జిగా నిర్మాణం.. హైదరాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, కోదాడ, విజయవాడ ప్రాంతాల వైపు నుంచి ఖమ్మం నగరంలోకి వచ్చేందుకు మున్నేరుపై మూడు వంతెనల నిర్మాణం జరిగింది. 110 ఏళ్ల క్రితం నిజాం కాలంలో కాల్వొడ్డు వద్ద ఒక బ్రిడ్జి.. కరుణగిరి వద్ద రెండు దశాబ్దాల క్రితం మరో బ్రిడ్జి నిర్మించారు. నానాటికీ రద్దీ పెరగడంతో 2010లో ప్రకాశ్‌నగర్ వద్ద మున్నేరుపై మూడో బ్రిడ్జి నిర్మాణానికి నాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2013లో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రాగా.. గత ఏడాది 30.7 అడుగులు, ఈనెల 1న 36.9 అడుగుల మేర వరద వచి్చంది. తాజా వరదతో బ్రిడ్జి నాణ్యత వెలుగులోకి వచి్చందన్న చర్చ జరుగుతోంది. -
ఆ 9 మందిని కాపాడే వరకు ఇక్కడ నుంచి వెళ్ళను..
-
గుర్రంగడ్డ.. కష్టాల అడ్డా!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: చుట్టూ కృష్ణా నది.. మధ్యలో ఊరు.. విద్య, వైద్యం, నిత్యావసరాలు ఏది కావాలన్నా, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా పడవలో నది దాటాల్సిందే.నది ఉప్పొంగే సమయంలో అయితే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే.. తెలంగాణలోనే ఏకైక ద్వీపంగా పేరు పొందిన గుర్రంగడ్డ వాసుల పరిస్థితి ఇది. పాలకులు మారుతున్నా తమ బాధలు తీరడం లేదని.. వంతెన నిర్మాణం చేపట్టినా ఏళ్లకేళ్లుగా సాగుతూనే ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.సాహసం చేయాల్సిందే..జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో కృష్ణానది మధ్యలో గుర్రంగడ్డ ఉంది. గద్వాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవి వైశాల్యం సుమారు 2,400 ఎకరాలు. ఇక్కడ సుమారు 200 కుటుంబాలు నివసిస్తుండగా, జనాభా వెయ్యికి పైనే ఉంటుంది. గ్రామస్తులు ఇక్కడి 1,500 ఎకరాల్లో వేరుశనగ, వరి వంటి పంటలు సాగు చేస్తున్నారు.ఇక్కడ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఆపై చదువుకోవాలన్నా, ఏదైనా అనారోగ్యానికి గురైనా, నిత్యావసరాలు కావాలన్నా, చివరికి రేషన్ సరుకుల కోసం కూడా.. నది దాటి వెళ్లాల్సిందే. ఏటా వానాకాలం మొదలై నదిలో ప్రవాహం పెరిగాక కష్టాలు మరింతగా పెరుగుతాయి. దీనితో ఇక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఇక ప్రతిదానికీ నది దాటాల్సి రావడంతో ఈ ఊరు పిల్లలను పెళ్లి చేసుకునేందుకు గానీ, ఊరి వారికి పిల్లను ఇచ్చేందుకు గానీ వెనుకాడే పరిస్థితి ఉందని.. ప్రస్తుతం 40 మందికిపైగా పెళ్లికాకుండా ఉన్నారని స్థానికులు అంటున్నారు.6 ఏళ్లుగా పిల్లర్ల దశలోనే వంతెనగుర్రంగడ్డకు సుమారు ఆరేళ్ల కింద వంతెన మంజూరైంది. అప్పటి నుంచి నిర్మాణం సాగుతూనే ఉంది. ఏటా వానాకాలం ముందు పనులు ప్రారంభించడం, వరద పెరగగానే నిలిపివేయడం కాంట్రాక్టర్‌కు పరిపాటిగా మారిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్‌కు ఐదుసార్లు నోటీసులిచ్చామని, వచ్చే ఏడాది వానాకాలంలోపు వంతెన నిర్మాణం పూర్తిచేస్తామని ఇరిగేషన్ ఈఈ జుబేర్ అహ్మద్ తెలిపారు.ఈ ఫొటోలోని మహిళ పేరు పద్మమ్మ. గుర్రంగడ్డకు చెందిన ఆమెకు అయిజ మండలం ఉప్పలకు చెందిన వెంకటేశ్‌తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పుట్టింటికి రావాలంటే నది దాటాలి. దాంతో ఎప్పుడు వచి్చనా భర్తతో కలిసి వస్తుంది. నదికి వరద పోటెత్తితే.. బోట్లు నడవక కొన్నిరోజులు గ్రామంలోనే ఉండిపోవాల్సి వస్తుందని.. అందుకే ఎప్పుడో ఓసారి మాత్రమే వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని దాటుతున్నాం గ్రామంలో ఆస్పత్రి లేదు. ఏ చిన్న చికిత్స కోసమైనా గద్వాలకు వెళ్లాలి. గర్భిణిగా ఉన్నప్పుడు, డెలివరీ అయ్యాక చెకప్ కోసం చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బోట్లో నది దాటాల్సి వచి్చంది. వరద వచి్చనప్పుడు ఏ సమస్య వచ్చినా కష్టమే. – సంధ్య, గ్రామ మహిళ -
తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే.. మూడోసారి కుప్పకూలిన వంతెన
పాట్నా: బిహార్‌లో మరో వంతెన కూలిపోయింది. ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న సుల్తాన్‌గంజ్-అగువానీ ఘాట్ వంతనెలోని ఓ భాగం కూలి ఒక్కసారిగా నదిలో పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఇదిలా ఉండగా గత తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ వంతెన కూలడం ఇప్పటికి ఇది మూడోసారి కావడం గమనార్హం. వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే నిర్మాణంలో ఉండగానే ఈ వంతెన పదేపదే కూలిపోతుండటంతో నిర్మాణ నాణ్యత, ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.2014, ఫిబ్రవరి 23న లో భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్ - ఖగారియా జిల్లాలోని అగువానీ ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2015 మార్చి 9న నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం బిహార్ ప్రభుత్వం రూ.1,710 కోట్లు కేటాయించింది. ఇది భాగల్పూర్ నుంచి ఖగారియా మీదుగా జార్ఖండ్‌కు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాలేదు. ముందుగా గతేడాది జూన్‌లో తుఫాను కారణంగా వంతెన పిల్లర్లు కొంతభాగం కుప్పకూలిపోగా తిరిగి నిర్మాణం చేపట్టారు. మళ్లీ జూన్ 4న మరోసారి కూలింది. నిర్మాణంలో ఉన్న వంతెన మూడుసార్లు కూలిపోవడంతో ప్రతిపక్షాలు నీతీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.अगुवानी सुल्तानगंज में गंगा पे निर्माणाधीन पुल फिर तीसरी बार गिरा ।पूरा system भ्रष्टाचार में लिप्त हैं ।मैं लगातार बोल रहा था कि फिर गिरेगा लेकिन आज तक किसी पे कोई कार्यवाही नहीं हुईं।ना अधिकारी पे ,ना एस.पी सिंघला कंपनी पे ,ना रोडिक कन्सल्टेंसी पे। @narendramodi @nitin_gadkari pic.twitter.com/HLnA3EkaXB— Dr.Sanjeev Kumar MLA Parbatta,Bihar (@DrSanjeev0121) August 17, 2024 దీనిపై స్పందించిన ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్న ఎస్ కే సింగ్లా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జరిమానా విధించింది. వంతెనను సొంత ఖర్చుతో పునర్నిర్మించాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఈ కంపెనీ ఈ ఘటనపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
చైనా ప్రమాదం.. 38కి చేరిన మృతులు
చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో హైవే బ్రిడ్జి పాక్షికంగా కూలిన ఘటనలో మృతుల సంఖ్య సంఖ్య 38కి చేరుకుంది. సుమారు 25 మంది జాడ ఇంకాతెలియరాలేదు. జూలై 19న జరిగిన ఈ ప్రమాదంలో 25కుపైగా వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగా వెళుతూ, వేగంగా ప్రవస్తున్న నదిలో పడిపోయాయి. ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో రెస్క్యూ సిబ్బంది ఒకరిని రక్షించారు. షాంగ్సీ ప్రావిన్స్‌లోని డానింగ్ హైవేపై వంతెన కూలిపోయిన ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.మీడియాకు అందిన సమాచారం ప్రకారం వంతెన కూలిన సమయంలో 25 కార్లు నదిలో పడిపోయాయి. బాధితుల కోసం రెస్క్యూ బృందాలు కిలోమీటర్ల మేర వెదుకులాట సాగించాయి. రాష్ట్ర వార్తా సంస్థ జిన్హువా విడుదల చేసిన ఫోటోలో వంతెనలోని ఒక భాగం కూలిపోయి ఉండటాన్ని గమనించవచ్చు.ఈ ప్రమాదం బారినపడి గల్లంతైన వారి కోసం వెదుకులాట ఇంకా కొనసాగుతోంది. ఇటీవల చైనాలో సంభవించిన గ్యామీ తుఫాను కారణంగా 48 మంది మృతి చెందారు. అలాగే మేలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో ఒక వంతెన కూలిపోయిన ఘటనలో 36 మంది మృతిచెందారు. -
వయనాడ్ విలయం : ఆమె సీత కాదు.. సివంగి
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఎవ్వరూ బతికి ఉంటే అవకాశం లేదంటూ స్వయంగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అంతటి విపత్తు సృష్టించిన ఈ విలయం నుంచి బాధితులను రక్షించే సహాయక చర్యల్లో, రికార్డు సమయంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జ్ నిర్మించిన మేజర్ సీతా షెల్కే వార్తల్లో నిలిచారు.ఇండియన్ ఆర్మీకి చెందినమద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్‌కు చెందిన మేజర్ సీతా షెల్కే సహాయక చర్యలలో చురుకుగ్గా పాల్గొన్నారు. మేజర్ సీతా షెల్కే, మేజర్ అనీశ్ నేతృత్వంలోని బృందం చేసిన కృషి విశేషంగా నిల్సుస్తోంది. కేరళలోని వాయనాడ్‌లో కేవలం16 గంటల్లో 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను నిర్మించి పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వినియోగించిన సాంకేతిక నైపుణ్యం, షెల్కే చూపించిన అంకితభావం, ధైర్యసాహసాలు భారత సైన్యంలోని మహిళా అధికారుల పాత్రను గుర్తు చేసింది. ఇది మహిళా సాధికారతకు, కష్టకాలంలో సమైక్యతకు నిదర్శనమని రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ ప్రశంసించారు. ఇంకా పలువురు సైనికాధికారులు, నెటిజన్లుఆమెకు హ్యాట్సాఫ్ అంటున్నారు. వంతెన నిర్మాణం జూలై 31న రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఆగస్టు 1సాయంత్రం 5:30 గంటలకు పూర్తయింది. మేజర్ షెల్కే నాయకత్వంలో ఇంజనీర్ల బృందం అనేక సవాళ్ల మధ్య వంతెనను సకాలంలో పూర్తి చేయడానికి అవిశ్రాంతంగా పనిచేసింది. తద్వారా ప్రభావిత ప్రాంతాలకు రవాణాను సులభతరం, వేగవంతం చేసింది.Kudos to Maj Seeta Shelke & her team of #MadrasEngineersGroup of #IndianArmy who went beyond all kind of challenges & built the 190ft long bridge with 24 Ton capacity in 16 hours in #Wayanad Started at 9 pm on 31 July & completed at 5:30 pm on 1 Aug. @giridhararamane #OPMADAD pic.twitter.com/QDa6yOt6Z2— PRO Defence Trivandrum (@DefencePROTvm) August 1, 2024 -
చైనా కవ్వింపు చర్య.. భారత్ భూభాగంలో వంతెన నిర్మాణం
భారత సరిహద్దులోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసినట్ల తెలుస్తోంది. ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలుపుతూ 400 మీటర్ల వంతెనను పూర్తి చేసింది. దీనికి సంబంధించిన సాటిలైట్ అమెరికాకు చెందిన బ్లాక్‌స్కై సంస్థ విడుదల చేసింది. ఈ బ్రిడ్జ్ పూర్తి కావటం వల్ల సరిహద్దుల్లో సైనిక దళాలు, సామగ్రిని మోహరించడానికి చైనాకు సమయం తగ్గనున్నట్లు తెలుస్తోంది.🛑 China has completed a 400-meter bridge over Pangong Lake in #Ladakh, enhancing troop movement between the north and south banks and reducing travel by 50-100 km. Located 2 km from the Line of Actual Control (#LAC) in the disputed Aksai Chin area, this bridge is strategically… pic.twitter.com/qMCVzN7ypg— Saikiran Kannan | 赛基兰坎南 (@saikirankannan) July 30, 2024 ఈ వంతెన పూర్తి అయి జూలై 9 నుంచే ఉపయోగంలోకి వచ్చి పలు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు సాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ సరిహద్దుకు కేవలల 25 కిలో మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఈ బ్రిడ్జ్‌కి ఉత్తరంగా ఉన్న ఖుర్నాక్ కోట ప్రాంతంలో చైనా ఆర్మీ రెండు హెలిపాడ్లు నిర్మించినట్లు కూడా ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రాంతం 1958కి ముందు భారత్ భాగంగానే ఉండేది. కానీ, అనంతరం ఈ ప్రాంత్నాన్ని చైనా ఆక్రమించింది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావటం వల్ల ప్యాంగాంగ్ సరస్సు మధ్య 50 నుంచి 100 కిలోమిటర్ల దూరం తగ్గనుంది. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణంపై గతంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘‘దాదాపు 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇలాంటి అక్రమ ఆక్రమణలను భారతదేశం ఎన్నడూ అంగీకరించదు’’అని పేర్కొంది. -
కొండాయి.. కష్టం కొండంత
గత ఏడాది జూలై 27న వాన.. వరదై.. జలప్రళయంగా మారి రెండు గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లా కొండాయిలో బ్రిడ్జి దాటుతున్న ఎనిమిది మందిని బలితీసుకుంది. అదే సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తింది. ఐదుగురు గల్లంతు కాగా, వారిలో ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఆ కుటుంబాలు వారి చివరి చూపునకు నోచుకోకుండా పోయాయి. ఇప్పటికీ ఆయా గ్రామాల్లో పరిస్థితులు ఏమీ మారలేదు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి బృందం ఆ రెండు గ్రామాలను సందర్శించింది.ఏటూరునాగారం/భూపాలపల్లి అర్బన్/భూపాలపల్లి రూరల్⇒ ఏడాది కాలంగా బ్రిడ్జి నిర్మించని కారణంగా వానొస్తే.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామస్తులు ఏది కావాలన్నా.. 42 కిలోమీటర్ల దూరంలోని ఏటూరునాగారానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొత్త బ్రిడ్జి నిర్మాణం జరిగి ఉంటే..12 కిలోమీటర్లు ప్రయా ణించి ఏటూరునాగారం చేరుకునేవారు. ప్రస్తుతం చుట్టూ తిరగలేక ఇంటి వద్దనే కలోగంజి తాగుతున్నారు. ఊరంతా దోమల బెడద. వర్షాలు వస్తే...వాగు దాటలేక గ్రామంలోనే మగ్గిపోతున్నారు. 2023 జూలై 27వ తేదీ సాయంత్రం 4 తర్వాత భారీ వర్షాలు కొండాయి, మల్యాల గ్రామాలను అతలాకుతలం చేశాయి.ఈ క్రమంలోనే బ్రిడ్జి కూలడంతో దానిపై నడుచుకుంటూ వెళుతున్న 8 మంది (రషీద్, కరింబీ, మజీద్, బీబీ, నజీర్‌ఖాన్, షరీఫ్, మహబూబ్‌ఖాన్, దబ్బగట్ల సమ్మక్క) అసువులు బాశారు. ఏడాది గడిచినా, ఆ విషాదచాయలు అలానే ఉన్నాయి. కొండాయి– దొడ్ల గ్రామాల మధ్య గల జంపన్నవాగుపై నిర్మించి ఉన్న హైలెవల్ బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఎలాంటి బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. ఇటీవల ఐటీడీఏ అధికా రులు రూ.35 లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తున్న ఫుట్ ఓవర్ ఐరన్ బ్రిడ్జి సైతం ఇటీవల వరదలకు కూలిపోయింది.వెల్డింగ్, పిల్లర్లు సైతం ఊడిపోయి వాగులో కలిసిపోయాయి. బ్రిడ్జిని అమర్చే క్రేన్ సైతం వాగులో కూరుకుపోయింది. దీంతో అధికారులు పడవ ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలోనే ఈ పడవను నడుపుతు న్నారు. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీల్లో ఆకలికేకలు మొదలయ్యాయి. ప్రజలు పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీస్తున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం మంత్రి సీతక్క రూ. 9.50 కోట్లు మంజూరు చేయించింది. కానీ టెండర్లు కాక పనులు మొదలు కాలేదు. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ ప్రజలకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. బ్రిడ్జి నిర్మిస్తే గానీ తమ బతుకులు బాగుపడవని కన్నీటిపర్యంతమవుతున్నారు.ఇప్పుడు ఇలా వెళ్తున్నారు..కొండాయి నుంచి పది కిలోమీటర్ల దూరంలోని ఊరట్టం నుంచి మేడారం మీదుగా రెండు కిలోమీటర్లు ప్రయాణించి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయికి చేరుకోవాలి. అక్కడి నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరునాగారం రావాలి. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ ప్రజలు నరకయాతన పడుతూ ప్రయాణిస్తున్నారు. అదే కొండాయి వద్ద బ్రిడ్జి అందుబాటులోకి వస్తే కేవలం 12 కిలోమీటర్లు ప్రయాణించి ఏటూరునాగారం చేరుకుంటారు. పచ్చడి మెతుకులతో..కొండాయికి సరైన రోడ్డుమార్గం లేక నిత్యావసర సరుకులు నిండుకొని పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీస్తున్నాం, ఎలాంటి పనులు లేవు. వ్యవసాయం లేదు, కూలీకి పోయేందుకు దారిలేదు. రేషన్ షాపులో ఇచ్చిన దొడ్డుబియ్యం వండుకొని పచ్చడి వేసుకొని ఇంటిల్లిపాది పూట గడుపుతున్నాం. – కాక ఫణిచందర్, కొండాయి‘మోరంచ’.. మొర ఆలకించేదెవరు?వాగులో ఐదుగురు గల్లంతు.. ఇప్పటికీ దొరకని ఇద్దరి ఆచూకీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాగు పక్కనే ఉన్న మోరంచపల్లి గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. గ్రామస్తులందరూ ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడాలంటూ వేడుకున్నారు. ఐదుగురు వరదలో కొట్టుకుపోగా, ముగ్గురి మృతదేహాలు పంట పొలాల్లో లభించాయి. ఒక మహిళ, యాచకుడి మృతదేహం జాడ ఇప్పటికీ దొరకలేదు. గ్రామంలో ఎవరిని కదిలించినా వరద ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెడుతున్నారు. మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ సాయం నామమాత్రమే..గ్రామంలోని 20 చెంచు కుటుంబాలు సర్వం కోల్పోగా, ప్రభుత్వం సాయం అంతంత మాత్రమే అందింది. ఆ సమయంలో తక్షణ సాయం కింద ప్రతి కుటుంబానికి కేవలం రూ.10వేల నగదు, నిత్యావసర వస్తువులు, పాడి గేదెలు ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన, ఇతర వస్తువులు, పంటలు నష్టపోయిన, వాహనాలు కొట్టుకుపోయిన వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందలేదు. మరణించిన ముగ్గురి కుటుంబాలకు పరిహారం రాగా, ఇప్పటికి ఆచూకీ లభించని గడ్డం మహాలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు. ఏడాదైనా నా భార్య ఆచూకీ లేదు.. గత ఏడాది తెల్లవారు జూమున వచ్చిన వరదలో కొట్టుకుపోయిన నా భార్య ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. గుర్తు తెలి యని మహిళలు ఎక్కడ చనిపోయి కనిపించినా అక్కడకు వెళ్లి చూశాం. ఇటీవలే నా భార్య సంవత్సరీకం చేశాను. ఒంటరిగా ఉండలేక నా కూతుళ్ల వద్ద ఉంటున్నా. – గడ్డం శ్రీనివాస్, మృతురాలు మహాలక్ష్మి భర్తతాతయ్య, నానమ్మలను కోల్పోయాం తాత మజీద్, నానమ్మ బీబీతో పాటు కొండాయిలో ఉండే వాళ్లం. గత ఏడాది మా కుటుంబంలో మజీద్, బీబీని వాగు మింగేసింది. ఆ భయంతో ఇప్పుడు ఏటూరు నాగారంలో ఉంటున్నాం. చిన్నషాపు పెట్టు కొని జీవిస్తున్నాం. వర్షాకాలం వచ్చిందంటే ఆ దుర్ఘటన గుర్తుకొస్తుంది. – రియాజ్ , కొండాయికాలు జారితే ఖతం..హనుమకొండలోని నయీంనగర్ వంతెన నిర్మాణ పనులు కొనసాగు తుండడంతో వాహనదారులు, కాలినడకన వెళ్లేవారికి కష్టాలు తప్పడం లేదు. నయీంనగర్‌లో కళాశాలలు, పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, బాలికలు, బాలుర వసతి గృహాలతో చాలా రద్దీగా ఉంటుంది. వంతెన చుట్టూ తిరిగి వెళ్లడానికి 2 కిలోమీటర్ల దూరం ఉండటంతో.. విద్యార్థులు, ప్రజలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రమాదకర మైన కట్టెల నిచ్చెనపై నుంచి నాలా దాటుతున్నారు. వర్షా నికి నిచ్చెన తడిసి విరిగిపోయినా, కాలు జారినా నాలాలో కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హనుమకొండవాగులు దాటి వైద్యం..కన్నాయిగూడెం: ములుగు జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా జ్వరాలు, ఇతర వ్యాధులు ఎక్కువగా ఉండటంతో వైద్య సిబ్బంది రోగులకు చికిత్స అందించడానికి ఏజెన్సీ గ్రామాల బాటపట్టారు. ఈ క్రమంలో కొండాయి సబ్‌సెంటర్ పరిధి వైద్యు డు ప్రణీత్ కుమార్ తమ సిబ్బందితో కలసి ఏటూరునాగారం నుంచి సర్వాయిరోడ్డు మార్గాన 40కి.మీ. ప్రయాణించి అడవి, వాగులు దాటుకుంటూ మారు మూలన ఉన్న కన్నాయి గూడెం మండలం ఐలాపుర్ గ్రామానికి శుక్రవారం చేరుకున్నారు. స్థానిక ప్రజలకు వైద్యం అందించారు. వారు వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో చంటిపిల్లతో వస్తున్న వారికి అడవిలోనే వైద్యం చేశారు.మందుకొట్టి.. చావగొట్టిఎల్లారెడ్డి: డ్రిల్ పీరియడ్‌లో ఆటలాడుకుంటున్న విద్యార్థులను.. మద్యం మత్తులో ఉన్న అటెండర్ చితకబాదడంతో గాయపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. పాఠశాల డ్రిల్ పీరియడ్‌లో ఆరో తరగతి విద్యార్థులు ఆడుకుంటున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న అటెండర్.. వారి వద్దకు వెళ్లి ఎందుకు అల్లరి చేస్తున్నారంటూ కర్రతో ఇష్టమొచ్చి నట్లు కొట్టాడు.దీంతో విద్యార్థులు రామ్, లక్ష్మ ణ్, అజయ్లతో పాటు మరికొందరి ఒంటిపై వాతలు తేలాయి. తీవ్ర నొప్పి తో బాధపడుతున్న రామ్, లక్ష్మణ్, అజయ్‌లను ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. తరచూ విధుల్లో మద్యం తాగుతున్న అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. -
10 ఏళ్లలో కూలిపోయిన 200 వంతెనలు!
బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీహార్‌లో ఇటీవలి కాలంలో జూన్ 18న తొలి వంతెన కూలగా ఆ తరువాత కేవలం 17 రోజుల్లోనే 12కు పైగా వంతెనలు కుప్పకూలిపోయాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి బలహీనమైన వంతెనల విషయంలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.దేశంలో వంతెనలు కూలడమనేది ఒక్క బీహార్ మాత్రమే కాదు. ఇతర ప్రాంతాలలో కూడా వంతెనలు కూలుతుంటాయి. ఒక నివేదిక ప్రకారం 1977- 2017 మధ్య భారతదేశంలో 2,130 వంతెనలు కూలిపోయాయి. 2012- 2021 మధ్య 214 వంతెనలు కూలిపోయినట్లు ప్రభుత్వ రికార్డులలో నమోదయ్యింది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక ప్రకారం ఇటీవలి కాలంలో వంతెనల కూలిన కేసులు తక్కువగా నమోదయ్యాయి. 2012- 2013 మధ్య సగటున 45 వంతెనలు కుప్పకూలగా, ఆ సంఖ్య 2021లో ఎనిమిదికి తగ్గింది.సంవత్సరంకూలిన వంతెనలు2012452013452014162015222016 192017 102018 172019232020920218 వంతెనలు కూలిపోవడానికి కారణంవంతెనలు కూలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంతెనల డిజైన్, ఉపయోగించిన మెటీరియల్, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడం మొదలైనవి వీటిలో ప్రధాన కారణాలు. వంతెనలు కూలడానికి ప్రకృతి వైపరీత్యాలు కూడా ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇండియా టుడే నివేదిక ప్రకారం ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో 80కి పైగా వంతెనలు కూలిపోయాయి. 2012 నుంచి 2021 వరకు వంతెనలు కూలిన ప్రమాదాలలో 285 మంది మృతి చెందారు. 2022లో గుజరాత్‌లోని మోర్బీలో వంతెన కూలిపోవడంతో 141 మంది మృతి చెందారు.సంవత్సరం మృతుల సంఖ్య2013 532014 122015 242016 472017 102018 342019 262020 102021 5 -
గాలివానకు మళ్లీ కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, సాక్షి: ముత్తారం మండలం ఓడేడ్ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై గిడ్డర్లు మరోసారి కూలాయి. దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పెద్దపల్లి జిల్లా ఆర్అండ్బీ ఇన్‌ఛార్జి అధికారి, ఈఈ నర్సింహాచారి పేర్కొన్నారు. అధికారులను క్షేత్రస్థాయికి పంపి ఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. 2016 ఆగస్టులో సుమారు రూ.49 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించారు. నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బతినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. రెండేళ్లుగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1, 2 నంబరు పిల్లర్లలో మూడు గడ్డర్లు కింద పడ్డాయి.భూపాలపల్లి మీదుగా పెద్దపళ్లి జిల్లాకు వెళ్లాలంటే సుమారు 100కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా కాకుండా బ్రిడ్జి గనుక పూర్తైతే కేవలం 30 కిలోమీటర్ల దూరానికి తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయంగా వాగు గుండా మట్టి రోడ్డు నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నా.. వర్షాకాలం ఆ రోడ్డు కొట్టుకుపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. -
బిహార్‌లో కుంగిన మరో వంతెన.. 10 రోజుల్లో నాలుగో ఘటన
పాట్నా: బిహార్‌లో వంతెనలు వరుసగా కూలిపోతున్నాయి. వర్షాలు, వరదలు కారణంగా గత 10 రోజుల్లో రాష్ట్రంలో ఇప్పటికే మూడు వంతెనలు కుంగిపోవడం, కూలిపోవడం జరగ్గా.. తాజాగా మరో వంతెన ప్రమాదానికి గురైంది. తాజాగా కిషన్‌గంజ్ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన ఓ వంతెన కుంగిపోయింది. దీంతో బహదుర్గంజ్, దిఘాల్‌బ్యాంక్ బ్లాక్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి, రాకపోకలను నిలిపివేసినట్లు చెప్పారు. రహదారుల శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.‘కంకయీ, మహానంద నదులను కలిపే మడియా ఉపనదిపై 2011లో 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మించారు. నేపాల్‌లోని పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ప్రవాహం ధాటికి వంతెన పిల్లర్లు కుంగిపోయాయి. ఇదిలా ఉండగా అంతకుముందు తూర్పు చంపారన్, సివాన్, అరారియా జిల్లాల్లో వంతెన సంబంధిత ఘటనలు చోటుచేసుకున్నాయి. -
బాల్టిమోర్ బ్రిడ్జి ఘటన.. నౌకలోని 8 మంది సిబ్బంది భారత్‌కు
వాషింగ్టన్: అమెరికాలోని బాల్టిమోర్ బ్రిడ్జిని ఢీకొట్టిన కంటెయినర్ నౌకలోని భారతీయ సిబ్బందిలో 8 మంది స్వదేశం బయలుదేరారు. వీరు ఇండియా రావడానికి కోర్టు అనుమతిచ్చింది. నౌక బాల్టిమోర్ బ్రిడ్జిని ఢీకొట్టి మూడు నెలలు కావస్తోంది. నౌకలోని మొత్తం 21 మంది సిబ్బందిలో ఇంకా నలుగురు నౌకలోనే ఉన్నారని బాల్టిమోర్ మారిటైమ్ ఎక్స్చేంజ్ తెలిపింది. మిగిలిన సిబ్బందిని మాత్రం బాల్టిమోర్‌లోని ఓ సర్వీస్ రెస్టారెంట్లో ఉంచారు. నౌక బ్రిడ్జిని ఢీకొన్న ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్నందునే వీరిని ఇంకా అక్కడ ఉంచినట్లు సమాచారం. నౌకలోని 21 మంది సిబ్బందిలో 20 మంది భారతీయులే. నౌక బాల్టిమోర్ నుంచి శుక్రవారం వర్జీనియాలోని నార్ఫోక్ బయలుదేరింది. అక్కడ దానిని రిపేర్ చేస్తారు. ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని బాల్టిమోర్ ఫ్రాన్సిస్ స్కాట్‌కీ బ్రిడ్జ్‌ను కంటెయినర్ నౌక ఢీకొనడంతో బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో బ్రిడ్జిపై పనిచేస్తున్న ఆరుగురు నిర్మాణ కార్మికులు మృతి చెందారు. -
బీహార్‌లో కూలిన మరో వంతెన
బీహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అరారియాలో ఓ వంతెన కూలిపోయిన ఘటన మరువక ముందే సివాన్‌లోని దారుండా బ్లాక్‌లోని రామ్గర్హాలోని గండక్ కాలువపై నిర్మించిన వంతెన కూలిపోవడం కలకలం రేపుతోంది.పాతేడీ బజార్- దరౌండా బ్లాక్‌లను కలిపే ఈ వంతెన కూలిపోవడంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే అరారియాలో ఓ వంతెన కూలిపోయింది. ఆ వంతెన నిర్మాణానికి దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా సివాన్‌లోని కాలువకు వంతెనకు ఒకే పిల్లర్ ఉండగా అది కూడా కొట్టుకుపోవడంతో వంతెన కూలిపోయింది.ఈ వంతెన నిర్మించి ఏడాది కూడా గడవకముందే కూలిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శాఖాపరమైన నిర్లక్ష్యం కారణంగానే వంతెన కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
వంతెన మధ్యలో మొరాయించిన రైలు.. ప్రమాదాన్ని నివారించిన లోకో పైలట్లు
ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు అందరినీ బెంబెలెత్తిస్తున్నాయి. అయితే ఇటువంటి సందర్భాల్లో ఒక్కసారి ఆ రైలు నడుపుతున్న పైలట్లు తెగువ చూపి, ప్రమాదాన్ని నివారిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఉదంతం బీహార్‌లో చోటుచేసుకుంది.బీహార్‌లోని సమస్తీపూర్‌లో రైలు ప్రమాదాన్ని నివారించిన లోకో పైలట్లను అందరూ మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే సమస్తీపూర్ రైల్వే సెక్షన్‌లోని వాల్మీకినగర్-పనియవా స్టేషన్ల మధ్యగల వంతెనపై రైలు ఉన్నట్టుండి ఆగిపోయింది. వంతెనపై రైలు అలా ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే రైలులోని ఏదో వాల్వ్ నుంచి ఎయిర్ ప్రజర్ లీక్ అవడాన్ని లోకో పైలట్లు గమనించారు. అందుకే రైలు అలా ఆగిపోయిందని గుర్తించారు.బయటి నుంచి సాంకేతిక సాయం అందించడానికి వీలులేని చోట రైలు ఆగింది. దీంతో రైలును నడుపుతున్న ఇద్దరు లోకో పైలట్లూ ఇంజిన్‌లోని లీకేజీని సరిచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వారు రైలు కిందుగా పాకుకుంటూ లీకేజీ అవుతున్న చోటుకువెళ్లి మరమ్మతులు చేశారు.ఈ ఘటన గురించి రైల్వే అధికారులు మాట్లాడుతూ నార్కతియాగంజ్ - గోరఖ్‌పూర్ ప్యాసింజర్ రైలు వాల్మీకినగర్- పనియావాన్ మధ్య గల వంతెనపైకి చేరుకోగానే ఇంజిన్ (లోకో)కు చెందిన అన్‌లోడర్ వాల్వ్ నుండి అకస్మాత్తుగా ఎయిర్ ప్రజర్ రావడం మొదలైంది. ఫలితంగా ఎంఆర్ ఒత్తిడి తగ్గింది. దీంతోట్రాక్షన్ ఆగిపోయి, రైలు వంతెనపై నిలిచిపోయింది. రైలు బ్రిడ్జి మధ్యలో ఆగడంతో దాన్ని సరిచేసే మార్గం కనిపించలేదు. అయితే రైలు నడుపుతున్న పైలట్లు ఎంతో తెగువ చూపి, దానికి మరమ్మతులు చేసి, రైలు ముందుకు కదిలేలా చేశారు.ఈ సందర్భంగా సమస్తీపూర్ డీఆర్ఎం మాట్లాడుతూ లోకో పైలట్లు అజయ్ కుమార్ యాదవ్, జీత్ కుమార్ ఎంతో తెగువచూపి వంతెనపై ఆగిపోయిన రైలు ముందుకు కదిలేలా చేశారని, వీరికి రైల్వేశాఖ రూ.10 వేల నగదు అందించడంతోపాటు ప్రశంసా పత్రం ఇవ్వనున్నదని తెలిపారు. -
ఐఐటీ హైదరాబాద్ ఘనత..త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో బ్రిడ్జ్ తయారీ..!
ఐఐటీ హైదరాబాద్ అరుదైన ఘనత సాధించింది. యువ స్టార్టప్ సింప్లిఫోర్జ్ క్రియేషన్సతో కలిసి భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ బ్రిడ్జ్‌ను తయారుచేసింది. స్వదేశీ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జ్ తయారు చేయడం విశేషం. ఈ త్రీడీ ప్రింటెడ్ బ్రిడ్జ్‌ని ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీన్ని కేవీఎల్ సుబ్రమణ్యం అతని రీసెర్చ్ గ్రూప్, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ బృందం కలిసి పాదాచారుల బ్రిడ్జ్‌ని రూపొందించారు. లోడ్ పరీక్ష తర్వాత పూర్తి స్థాయి 7.50 మీటర్ల వంతెనను రూపొందించే యత్నం చేశారు. కాంక్రీట్ ఉపబలాన్ని తగ్గించి ఈ నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు. ఈ వంతెనలో మెటీరియల్ ప్రాసెసింగ్, డిజైన్ మెథడాలజీలలో అనేక పురోగతులు హైలెట్‌గా నిలిచాయి. నిజానికి ఈ త్రీడి కాంక్రీట్ ప్రింటింగ్ అనేది అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు నిదర్శనం. పైగా తక్కువ బరువుతో వేగవంతమైన సమర్థవంతమైన వంతెనలు, నిర్మాణాలను అభివృద్ధి చేసే నిర్థిష్ట ఆప్టమైజ్ అప్లికేషన్ త్రీడీ టెక్నాలజీ. ఈ మేరకు ఈ ప్రోటోటైప్ వంతెనను అభివృద్ధి చేసిన కేఎల్ సుమ్రమణ్యం, అతని బృందాన్ని ఐఐటీ హైదరబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అభినందించారు. వేగవంతమైన సమర్థవంతమైన నిర్మాణాలకు సాంకేతికతో కూడిన పరిష్కారాలు అత్యంత అవసరమని అన్నారు. సమర్థవంతమైన నిర్మాణం కోసం స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం అనేది ఆత్మ నిర్బర్ కలను సాకారం చేసుకునే దిశగా డిజిటల్క్నాలజీని అభివృద్ధిపరిచే ఘనమైన ముందుడగు అని ప్రశంసించారు. ఇలాంటి ఆవిష్కరణలు ఆర్థిక పరంగా స్థానిక అభివృద్ధికి మాత్రమే గాక మౌలిక సదుపాయల రంగానికి మరిన్ని ప్రయోజనాలు అందించగలదని భావిస్తున్నానని అన్నారు.(చదవండి: ఆరోజు రాత్రి వరకు అబ్బాయి.. లేచిన వెంటనే అమ్మాయిగా మార్పు..!) -
రూ.12 కోట్ల వంతెన.. ప్రారంభానికి ముందే ఫసక్.. వీడియో వైరల్
పాట్నా: రూ.12 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఓ బ్రిడ్జి ప్రారంభానికి కూడా నోచుకోకుండానే కూలిపోయింది. బీహార్‌లోని అరారియా జిల్లాలో బక్రా నదిపై కుర్సకాంత -సిక్తి మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం ప్రభుత్వం రూ.12 కోట్లతో బ్రిడ్జిని నిర్మించింది. ప్రారంభోత్సవానికి సిద్దమైంది. అయితే అనూహ్యంగా ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బ్రిడ్జి కూలిపోవడంపై సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా బ్రిడ్జి కూలిపోయింది.విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.బ్రిడ్జి కూలిన ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జ్ కూలిపోతుందనే ముందస్తు జాగ్రత్తతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. దీంతో ప్రాణపాయం తప్పింది. #WATCH | Bihar | A portion of a bridge over the Bakra River has collapsed in Araria pic.twitter.com/stjDO2Xkq3— ANI (@ANI) June 18, 2024 -
USA: ‘బాల్టిమోర్’ బ్రిడ్జి పునఃనిర్మాణానికి 480 కోట్లు
వాషింగ్టన్: ఇటీవల నౌక ఢీకొని కుప్పకూలిన అమెరికాలోని బాల్టిమోర్ వంతెన నిర్మాణం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్ల(రూ.480 కోట్లు) అత్యవసర నిధులను కేటాయించింది. ఈ మేరకు మేరీ లాండ్ గవర్నర్ వెస్‌మూర్ కోరిన వెంటనే ఈ నిధులను దేశ రవాణా, హైవే మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నిధులతో వంతెన శిథిలాలను నదిలో నుంచి తొలగించడంతో పాటు కూలిన భాగాన్ని మళ్లీ నిర్మించనున్నారు. కీలకమైన బాల్టిమోర్ వంతెనను వీలైనంత త్వరగా మళ్లీ నిర్మించేందుకు అవసరమైతే భూమిని ఆకాశాన్ని ఒకటి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే మీడియాకు తెలిపారు. కాగా, మంగళవారం(మార్చ్ 29)న అర్ధరాత్రి ఒంటిగంటకు పటాప్కో నదిపై ఉన్న ఫ్రాన్సిన్ స్కాట్‌కీ బ్రిడ్జి భారీ కంటెయినర్ నౌక ఢీకొని కుప్పుకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బ్రిడ్జిపై పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు నదిలో పడిపోగా వారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మరో నలుగురు ఆజూకీ ఇంకా తెలియలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి.. ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం -
బస్సు లోయలో పడి 45 మంది మృతి
కేప్ టౌన్: ఈస్టర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని బస్సు ప్రమాదం కబళించింది. దక్షిణాఫ్రికాలోని లింపొపొ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్క చిన్నారి గాయాలతో సజీవంగా బయటపడింది. బోట్స్వానాకు చెందిన వీరంతా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈస్టర్ ఉత్సవాలకు వెళ్తున్నారు. అదుపు తప్పిన బస్సు కొండప్రాంతంలోని ఎంమట్లకలా వద్ద వంతెన బారియర్లను ఢీకొట్టింది. ఆ పక్కనే ఉన్న 164 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ముక్కలైన బస్సులో భారీగా మంటలు చెలరేగి కొందరు సజీవ దహనం కాగా, మరికొందరు దూరంగా పడిపోయారు. ఘటనలో డ్రైవర్ సహా మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోగా ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే సజీవంగా బయటపడింది. మంటల్లో కొందరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో నుజ్జయిన బస్సులో ఇరుక్కుపోయాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిదేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పొరుగు దేశం బొట్స్వానాకు చెందిన బాధితులంతా దక్షిణాఫ్రికాలోని మోరియా పట్టణంలో ఘనంగా జరిగే ‘జియోన్ క్రిస్టియన్ చర్చి’ ఈస్టర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫొసా బొట్స్వానా అధ్యక్షుడు మసిసితో ఫోన్లో మాట్లాడారు. ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈస్టర్ పండుగ రద్దీ సమయంలో రోడ్డు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టినప్పటికీ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. #BREAKING : Bus Accident Kills 45 In South Africa At least 45 people were killed as a result of a bus accident, South Africa's Department of Transportation said. An 8-year-old girl is reportedly the only survivor. The crash occurred near Mamatlakala in the northern province of… pic.twitter.com/15tGAbdAM0 — upuknews (@upuknews1) March 29, 2024 బ్రిడ్జి పై నుంచి కింద పడి నేలను ఢీకొట్టిన తర్వాత బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. దీంతో ప్రమాదంలో మరణించిన కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి. కొన్ని మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోగా మరికొన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు బోట్సువానా నుంచి మొరియా పట్టణానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి.. ప్రముఖ సైకాలజిస్ట్ కన్నుమూత -
Baltimore Bridge Accident : అమెరికాలో కంటెయినర్ షిప్ ఢీకొని కుప్పకూలిన బాల్టీమోర్ బ్రిడ్జ్ (ఫొటోలు)
-
Bihar: కుప్పకూలిన వంతెన.. చిక్కుకున్న కూలీలు
పాట్నా: బిహార్‌లోని సౌపాల్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి శుక్రవారం( మార్చ్ 22) ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా కూలిన బ్రిడ్జి కింద పలువురు చిక్కుకుపోయారు. కోసీ నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై భవన నిర్మాణ కార్మికులు స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డట్లు జిల్లా అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘి ఇదీ చదవండి.. కేజ్రీవాల్ కస్టడీ కోరనున్న ఈడీ -
‘సుదర్శన్ సేతు’ ప్రత్యేకత ఏమిటి?
దేశంలో మౌలిక సదుపాయాలకు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్వెల్) మరో ప్రత్యేక ఉదాహరణ మన కళ్ల ముందుకు వస్తోంది. అదే సుదర్శన సేతు. ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం)జాతికి అంకితం చేయనున్నారు. ఈ కేబుల్ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ప్రత్యేకమైన డిజైన్‌తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు. బ్రిడ్జికి ఇరువైపులా శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించారు. ఇందులో ఫుట్‌పాత్ పైభాగంలో సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వచ్చేది. పడవపైనే ఆధారపడేవారు. వాతావరణం ప్రతికూలంగా ఉంటే ప్రయాణానికి మరింత జాప్యం జరిగేది. అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ వంతెన నిర్మితం కావడంతో భక్తుల కష్టాల తీరనున్నాయి. అలాగే దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2016లో ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017, అక్టోబర్ 7న ఓఖా- భేట్ ద్వారకలను కలిపే వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.962 కోట్లు కాగా, తర్వాత దానిని రూ.980 కోట్లకు పెంచారు. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్‌లో నివసిస్తున్న సుమారు 8,500 మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది. ఈ వంతెన డెక్ మిశ్రమ ఉక్కు-రీన్ఫోర్స్డ్ కాంక్రీటుతో తయారయ్యింది. దీని వెడల్పు 27.2 మీటర్లు (89 అడుగులు). ఈ వంతెనకు ఇరువైపులా 2.5 మీటర్లు (8 అడుగులు) వెడల్పు గల ఫుట్‌పాత్ కూడా ఉంది. ఈ వంతెన మొత్తం పొడవు 2,320 మీటర్లు (7,612 అడుగులు). ఇది భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది. -
చైనాలో వంతెనను ఢీ కొట్టిన భారీ షిప్.. రెండు ముక్కలైన బ్రిడ్జి
దక్షిణ చైనాలో వంతెనను భారీ కార్గో షిప్ ఢీకొట్టడంతో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై ఈ ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ షిప్ ఫోష్‌మన్ నుంచి గ్వాంగ్జూ వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఉన్న లిజింగ్షా వంతెనను బలంగా ఢీకొట్టింది. తాకిడికి వంతెన రెండు ముక్కలుగా వీడిపోయింది. నౌక్ బ్రిడ్జి మధ్యే చిక్కుకుపోయింది ఈ ఘటనలో ఒక బస్సుతో సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ నౌకలో ఎటువంటి సరుకు లేదని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదానికి కారణమైన షిప్ కెప్టెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్వాంగ్జూ నగరం నుంచి ఆరుగురు డైవర్లతో అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇదీ చదవండి: రియల్ లైఫ్ మోగ్లీ: శునకాల మధ్య పెరిగి ఆమె ఓ శునకంలా..ఇప్పటికీ..! -
Khammam: గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జిపై ప్రమాదం
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భాగంగా వైరా-మధిర మధ్య భారీ వంతెన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం బ్రిడ్జిపై సిమెంట్ కాంక్రీట్ పోస్తుండగా స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా మండలం సోమవరం దగ్గర ఈ ఘటన జరిగింది. భారీ శబ్దం రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వంతెన మీద ఉన్న కూలీలు ప్రాణాలు రక్షించుకునేందుకు బ్రిడ్జిపైనుంచి కిందకు దూకేశారు. దీంతో పలువురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, నాసిరకంగా నిర్మించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను హెచ్డీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. -
కర్ణాటక - తెలంగాణ సరిహద్దులో ఉన్న కృష్ణానది వంతెన
-
‘అటల్ సేతు’ నిర్మాణం కోసం ఉపయోగించిన టెక్నాలజీ ఇదే!
ప్రధాని నరేంద్ర మోదీ ‘అటల్ బిహారీ వాజ్‌పేయి సేవరి- నవ శేవ అటల్ సేతు’ వంతెనను ప్రారంభించారు. ఈ వంతెనను రూ.17,480 కోట్లతో నిర్మించారు. 21.8 కిలోమీటర్ల 6 లేన్ల పొడవుతో 16.5 కిలోమీటర్లు సముద్రం మీద, 5.5 కిలోమీటర్లు భూమిపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జిగా చరిత్రకెక్కింది. డిసెంబర్ 2016 లో ఈ బ్రిడ్జికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇక ఈ వంతెన నిర్మాణంలో ఉపయోగించిన టెక్నాలజీ కారణంగా భారత్‌ను ప్రపంచ పటంలో నిలుపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అతి తక్కువ ఐదేళ్ల కాలంలో పూర్తయిన ఈ బ్రిడ్జి వినియోగంతో కనెక్టివిటీ, రవాణాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని రవాణా సంబంధిత పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా బ్రిడ్జిని నిర్మించే సమయంలో వినియోగించిన టెక్నాలజీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే ఆటల్ సేతు ప్రత్యేకతలు : భూకంపాలనే నిరోధించేలా : వంతెన భూకంపాలను నిరోధించేలా టెక్నాలజీని వినియోగించారు. ఇది 6.5 రిక్టర్ స్కేల్ వరకు తీవ్రతతో వివిధ రకాల భూకంపాలను తట్టుకోలగలదు. రివర్స్ సర్క్యులేషన్ రిగ్స్: సౌండ్, వైబ్రేషన్లను తగ్గించడానికి వినియోగించిన టెక్నాలజీ సముద్ర జీవులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శబ్ధాన్ని తగ్గిస్తూ : వంతెనలో నాయిస్ సైలెన్సర్లు, శబ్ద ప్రభావాన్ని తగ్గించడానికి టెక్నాలజీని ఉపయోగించారు. ఎకో-ఫ్రెండ్లీ లైటింగ్: వంతెనపై లైటింగ్ సిస్టమ్ జల పర్యావరణానికి అంతరాయం కలగకుండా రూపొందించబడింది. టోల్ క్యూలు లేవు: ఎంటీహెచ్ఎల్ ఓపెన్ రోడ్ టోలింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది, ఇది టోల్‌ల వద్ద పొడవైన క్యూల సమస్యను పరిష్కరిస్తుంది. అధునాతన స్కానర్లు వాహనాన్ని స్కాన్ చేయగలవు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ వసూలు అవుతాయి. తద్వారా వాహనాల నిరీక్షణ సమయం తగ్గుతుంది. డిస్ప్లేలు: డ్రైవర్లకు సమాచారాన్ని అందించడానికి వంతెన నిర్దిష్ట వ్యవధిలో డిస్ప్లేలు ఉన్నాయి. వారి మార్గంలో ట్రాఫిక్ జామ్‌లు లేదా ప్రమాదాల గురించి వారికి సమాచారం అందుతుంది. -
అతిపొడవైన సముద్రపు వంతెన.. ‘అటల్ సేతు’ను ప్రారంభించిన మోదీ
సాక్షి, ముంబై: ముంబైలోని నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘అటల్ సేతు’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. దీనినే ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్ అని కూడా పిలుస్తున్నారు. ముంబైలో దాదాపు రూ. 20 వేల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని .. జాతికి అంకితం చేశారు. కాగా అటల్ సేతు మొత్తం పొడువు 22 కిలోమీటర్లు. 16.5 కిలోమీటర్ల మేర అరేబియా సముంద్రంపై.. 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతతో నిర్మించారు. VIDEO | PM Modi inaugurates Mumbai Trans Harbour Link (MTHL), the longest sea bridge in the country, in Navi Mumbai. The MTHL, also known as Atal Setu named after former PM Atal Bihari Vajpayee, originates from Sewri in Mumbai and terminates at Nhava Sheva in Uran taluka in… pic.twitter.com/Z9cy8S1vAD — Press Trust of India (@PTI_News) January 12, 2024 ఇది ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై టోల్ ఫీజు ఒకవైపు రూ. 250 వసూలు చేయనున్నారు. ఫ్లెమింగో పక్షుల కోసం బ్రిడ్జ్‌కు ఒకవైపు సౌండ్ బారియర్ ఏర్పాటు చేశారు. అటల్ సేతు వంతెన ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ముంబై నుంచి నవీ ముంబైకు చేరుకోవచ్చు. గతంలో ముంబై నుంచి నవీ ముంబైకి రెండు గంటల సమయం పట్టేది. #WATCH | Atal Setu - the Mumbai Trans Harbour Link - is India's longest bridge built on the sea and it is expected to see the movement of more than 70,000 vehicles every day pic.twitter.com/VqmPMf1CCU — ANI (@ANI) January 12, 2024 అటల్ సేతు వంతెనకు 2016 డిసెంబర్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి కావాల్సిన వంతెన.. గడువుకు ఆరు నెలల ముందే( డిసెంబర్ 25 నాటికి) సిద్ధం చేసినట్లు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ సంజయ్ ముఖర్జీ తెలిపారు. కాంట్రాక్టర్లు, అధికారులు, కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. -
Mumbai Trans Harbour Link: పొడవైన సముద్రవంతెన.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం!
ముంబయి: భారత్‌లోనే అతిపొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జనవరి 12)న ప్రారంభించనున్నారు. భారత్‌లోనే అతిపెద్ద సముద్ర వంతెన రవాణా వినియోగానికి అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వంతెనపై రాకపోకలకు పలు ఆంక్షలు విధించారు. వంతెనపై గరిష్ఠ వేగం గంటకు 100కిలోమీటర్ల దాటకూడదని ఆదేశాలు జారీ చేశారు. మోటార్‌బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలుకు అనుమతిని నిరాకరించారు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికిల్స్, మిని బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వంతెన ఎక్కేప్పుడు, దిగేప్పుడు వాహనాల వేగం 40 కిలోమీటర్లకు పరిమితం చేశారు. రూ. 18,000 కోట్ల వ్యయంతో నిర్మించిన అటల్ బ్రిడ్జ్.. ముంబైలోని సెవ్రీ నుండి ప్రారంభం అవుతుంది. రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్ తాలూకాలోని న్హవా షెవాలో ముగుస్తుంది. అటల్ వంతెన అనేది 6-లేన్ సముద్రం లింక్. ఇది సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.5 కి.మీ. ఉంటుంది. ఈ వంతెనతో వాహనదారులు ముంబయి, నవీ ముంబయి మధ్య దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో అధిగమించగలరు. ఈ వంతెన లేకపోతే 2 గంటల సమయం పడుతుంది. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
సముద్రపు వంతెన ‘అటల్ సేతు’.. ప్రత్యేకతలివే!
దేశంలోనే అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన నిర్మాణం పూర్తయింది. దీనిని జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ముంబయి- నవీ ముంబయిలను కలిపే ఈ అతిపెద్ద సముద్రపు వంతెన పొడవు 22 కిలోమీటర్లు. దీనికి ‘అటల్ సేతు’ అనే పేరు పెట్టారు. దీని విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వంతెనపై 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఇవి భద్రత పరంగా ఎంతో ఉపయోగపడతాయి. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కి అందిస్తాయి. రూ. 20 వేల కోట్లతో నిర్మించిన ఈ వంతెనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వంతెన కారణంగా ముంబై నుండి నవీ ముంబైకి ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. ఈ వంతెన ఏర్పాటుతో దక్షిణ ముంబై నుండి నవీ ముంబైకి చేరుకోవడానికి కేవలం 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. ఇంతవరకూ ఈ దూరం ప్రయాణించడానికి రెండు గంటల సమయం పట్టేది. ఈ వంతెన ప్రారంభంతో ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సముద్రపు వంతెన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ వంతెన మహారాష్ట్రలోని రెండు పెద్ద నగరాలను కలుపుతుంది. ఇది ఆరు లేన్ల వంతెన. ఈ వంతెనలోని 16.5 కిలోమీటర్ల రహదారి సముద్రం మీద నిర్మితమయ్యింది. దాదాపు 5.5 కిలోమీటర్ల రహదారి భూభాగంపై ఉంది. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జిపై ఒకవైపు రూ.250 టోల్ వసూలు చేయనున్నారు. శీతాకాలంలో ఇక్కడి సముద్రానికి వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనకు ఒకవైపు సౌండ్ బారియర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర జీవులకు హాని కలగని లైట్లను ఏర్పాటు చేశారు. ఈ వంతెన దక్షిణ ముంబైలోని శివడి నుండి ప్రారంభమై, ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్‌ను దాటుతుంది. -
కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్
విశాఖ సిటీ: మాస్టర్‌ప్లాన్ రోడ్లు.. సెంటు స్థలాల లేఅవుట్లు.. జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌లు.. ఇలా ఒకవైపు ప్రజావసరాలకు అనువైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణాలు..కైలాసగిరి, తెన్నేటి పార్కుల పునరుద్ధరణ.. సీ హారియర్ మ్యూజియం.. హెల్త్ ఎరీనా జాగింగ్ ట్రాక్.. కొండకర్ల ఆవలో ఫ్లోటింగ్ జెట్టీ.. మరోవైపు పర్యాటకులను ఆకట్టుకొనే ప్రాజెక్టులకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) విశాఖ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది. సుందర విశాఖను పర్యాటకులకు స్వర్గధామంగా మలిచేందుకు మరిన్ని బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వీఎంఆర్డీఏ గత ఏడాది కాలంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ప్రగతి, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులపై మెట్రోపాలిటన్ కమిషనర్, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. వీఎంఆర్డీఏ గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీ వరకు రూ.161 కోట్లు ఆదాయం రాగా.. రూ.215 కోట్లు వ్యయం జరిగినట్లు వెల్లడించారు. సెంటు స్థలాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం బల్క్ ల్యాండ్ ప్రతిపాదనకు అంగీకారం తెలిపిందని, వాటి వేలం ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతోందని చెప్పారు. ఫన్ ప్రాజెక్టులు.. స్టార్ హోటల్.. ► పిల్లల కోసమే ప్రత్యేకంగా వైశాఖి జల ఉద్యానవనంలో 3.48 ఎకరాల్లో పీపీపీ విధానంలో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో అమ్యూజ్మెంట్ అండ్ ఫన్ జోన్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. ► అలాగే తెన్నేటి పార్కు బీచ్‌లో డిజైన్–ఇన్వెస్ట్–ఇన్స్టాల్మెంట్–ఆపరేషన్ విధానంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ► వీఎంఆర్డీఏ పార్కు వెనుక ఉన్న 7.97 ఎకరాల్లో పీపీపీ విధానంగా రూ.220 కోట్లతో ఫైవ్‌స్టార్ హోటల్, మైస్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జ్యుడీషియల్ రివ్యూ కోసం పంపించారు. ► నేచురల్ హిస్టరీ పార్క్ అండ్ మ్యూజియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు డీపీఆర్ సిద్ధం చేశారు. ● ఎన్ఏడీ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు 25 శాతం మేర పూర్తయ్యాయి. 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ► 83 లేఅవుట్లలో 1,41,654 మందికి సెంటు స్థలాల పట్టాలు అందించారు. ఈ లేఅవుట్ల అభివృద్ధిలో వీఎంఆర్డీఏ ప్రముఖ పాత్ర పోషించింది. వీటిలో రూ.175 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు. ► భూములు ఇచ్చిన రైతులకు 1,215 ఎకరాల్లో 48 లేఅవుట్లు అభివృద్ధి చేసి ప్లాట్లను కేటాయించారు. వాటి అభివృద్ధికి రూ.660 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నిధులను మూడు దశలలో ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో రూ.200 కోట్లతో క్వారీ రబ్బిష్ రోడ్లు, సీసీ డ్రైన్ల పనులు జరుగుతున్నాయి. ఫేజ్–2లో రూ.305 కోట్లతో బీటీ రోడ్లు, ప్లాంటేషన్, పార్కులు, ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రగతిలో ఉన్నాయి. ఫేజ్–3లో రూ.155 కోట్లతో నీటి సరఫరా కల్పించనున్నారు. ► ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు. జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌కు మంచి స్పందన ► మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు స్థలాలు ఇవ్వాలన్న సంకల్పంతో చేపట్టిన జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌కు మంచి స్పందన వస్తోంది. ► విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో 204.96 ఎకరాల్లో లేఅవుట్లు వేసి 1280 ప్లాట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ► విజయనగరం జిల్లా రఘుమండలో ఉన్న 229 ప్లాట్లకు ఇప్పటికే 165 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో లాటరీ తీసి 160 మంది కేటాయింపులు చేశారు. అలాగే జియ్యానివలసలో 130 ప్లాట్లకు 66 దరఖాస్తులు రాగా 56 మందికి ఇచ్చారు. విశాఖలో పాలవలస 1, 2లలో 150 దరఖాస్తులకు గాను లాటరీ 94 ప్లాట్లు విక్రయించారు. ఇప్పటికీ వస్తున్న దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే వాటికి లాటరీ ప్రక్రియను చేపట్టనున్నారు. రూ.58.74 కోట్లతో మాస్టర్‌ప్లాన్ రోడ్ల అభివృద్ధి ► విశాఖలో రూ.58.74 కోట్లతో మాస్టర్‌ప్లాన్ రోడ్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ► బోయపాలెం హైవే నుంచి నుంచి కాపులుప్పాడ, బీచ్ రోడ్డులో సీతకొండ, పాయకరావుపేట రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ● అలాగే రూ.12 కోట్లతో లా కాలేజీ హైవే నుంచి పెబెల్ బీచ్ హౌసింగ్ వరకు ఫుట్‌పాత్, గ్రీనరీ, రూ.3.22 కోట్లతో విజయనగరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ జంక్షన్ నుంచి కేఏ పేట మీదగా పాల్ నగర్ జంక్షన్ వరకు రోడ్డు, రూ.9.7 కోట్లతో సబ్బవరం నుంచి గుల్లేపల్లికి, రూ.3.52 కోట్లతో యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు, రూ.7 కోట్లతో, మారికవలస జంక్షన్ నుంచి బీచ్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ► మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ 11 ఫ్లోర్లలో 9 ఫోర్ల నిర్మాణం పూర్తయింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. ● చీమలాపల్లి, ఎండాడ లా కాలేజీ వద్ద చేపట్టిన కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం 30 శాతం పూర్తయింది. ఈ సమావేశంలో వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, సెక్రటరీ కీర్తి, సీఈ శివప్రసాద్‌రాజు, డీఎఫ్ఓ శాంతిస్వరూప్, ఈఈలు భవానీప్రసాద్, బలరాం తదితరులు పాల్గొన్నారు. కై లాసగిరిపై సరికొత్త ప్రాజెక్టులు ► పర్యాటకులను మరింత ఆకట్టుకొనే తరహాలో కై లాసగిరిపై గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ► ఆరు నెలల్లో దీని నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ► దీంతో పాటు జిప్‌లైన్, స్కై సైక్లింగ్ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను చేపట్టారు. రెండు నెలల్లోనే వీటిని ఏర్పాటు చేసి ప్రజలకు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించాలని భావిస్తున్నారు. ►అలాగే కై లాసగిరిపై 1.99 ఎకరాల్లో పీపీపీ విధానంలో రూ.18 కోట్లతో నేచర్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బీచ్ వ్యూ కేఫ్ నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ► వీఎంఆర్డీఏ పార్కు లైహౌస్ వద్ద ఓషన్ డెక్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను పూర్తి చేశారు. ► సీఆర్‌జెడ్ అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ► కై లాసగిరిపై రూ.4.69 కోట్ల అంచనా వ్యయంతో సైన్స్ మ్యూజియం నిర్మాణానికి రెండు రోజుల క్రితమే శంకుస్థాపన చేశారు. ► అలాగే కొండపై డ్యాషింగ్ కార్, 12డీ థియేటర్, ఫ్లాష్ టవర్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. -
Phu Quoc: వెహికిల్స్‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే ఇది... కిస్సింగ్ బ్రిడ్జి
వియత్నాంలో అది అనగనగా ఓ వంతెన. కానీ దాన్ని కట్టింది అన్ని వంతెనల మాదిరిగా అటూ ఇటూ దాటడానికి కాదు. ముద్దులు పెట్టుకోవడానికి! అవును. వినడానికే విచిత్రంగా ఉంది కదూ! దక్షిణ వియత్నాంలోని ఫూక్వోక్ ద్వీపం అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి. అక్కడి సన్‌సెట్ సిటీలో ఇటీవల నిర్మించిన 800 మీటర్ల పై చిలుకు పొడవైన బ్రిడ్జి అందరినీ ఎంతగానో అలరిస్తోంది. ఇది ముద్దుల బ్రిడ్జి కావడమే ఇందుకు కారణం. దీని డిజైన్‌ను ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ మార్కో కాసామోంటీ రూపొందించాడు. లగ్జరీ టూరిజం డెవలపర్ సంస్థ సన్ గ్రూప్ నిర్మించింది. ఆడమ్ సృష్టికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు మైకేలాంజిలో సిస్టిన్ చాపెల్‌లో సృజించిన ఫ్రెస్కో పెయింటింగ్ స్ఫూర్తితో దీని డిజైన్‌కు రూపకల్పన చేశారు. రెండు సగాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ పెయింటింగ్‌లోని రెండు చూపుడు వేళ్ల మాదిరిగానే బ్రిడ్జి తాలూకు రెండు సగాలు కూడా పరస్పరం తాకవు. వాటి మధ్య 30 సెంటీమీటర్ల దూరముంటుంది. దూరంనుంచి చూస్తే ఆ రెండు కొనలూ ఒకదాన్నొకటి చుంబించుకుంటున్నట్టుగానే ఉండటం మరో విశేషం! ముద్దులాడాలనుకునే జంటలో ఒకరు ఆ సగం నుంచి, మరొకరు ఈ సగం మీద నుంచుని వీలైనంతగా ముందుకు వంగాలన్నమాట! ఆ మీదట పెదాలకు పని చెబుతూ తమ ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. పెళ్లికి ప్రపోజ్ చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జి పేరు చౌ హోన్. దాని అర్థం కూడా ‘పెళ్లికి ప్రపోజ్ చేసుకోవడం’ కావడం మరో విశేషం. వారం క్రితం ప్రారంభించిన ఈ బ్రిడ్జి చూస్తుండగానే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. దాన్ని చూడటానికి, చెరోవైపు నుంచి రొమాంటిక్‌గా ముద్దులాడటానికి జంటలు భారీగా వస్తున్నాయట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కల సాకారం చేసిన సీఎం జగన్..
-
HYD: మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
సాక్షి, హైదరాబాద్: మూసీ నదిపై ముసారాంబాగ్ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్నందున ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అంబర్పేట్ నుంచి మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ మీదుగా మలక్‌పేట టీవీ టవర్ వైపు వెళ్లే అన్ని సాధారణ వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులను అలీ కేఫ్ ఎక్స్ రోడ్ వద్ద జిందాతిలిస్మత్, గోల్నాక న్యూ బ్రిడ్జ్ హైటెక్ ఫంక్షన్ హాల్, అఫ్జల్‌నగర్ వైపు మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద కుడి మలుపు తిరిగి పిస్తా హౌస్, మూసారాంబాగ్ జంక్షన్ వైపు వెళ్లాలని పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గకుండా వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లి సహకరించాలని పోలీసులు కోరారు. చదవండి: పీవీని ‘భారత రత్న’తో గౌరవించాలి: కేటీఆర్ -
నాగలదిన్నె బ్రిడ్జి ప్రారంభం.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరం
అయిజ/నందవరం: ఇరు తెలుగు రాష్ట్రాలకు నాగలదిన్నె బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం నందవరం మండలంలోని నాగలదిన్నె గ్రామ సమీపంలో తుంగభద్ర నదిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైలెవల్ వంతెన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, జిల్లా జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, తెలంగాణ రాష్ట్రం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రిబ్బన్ కట్ చేసి వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ.. 2009లో తుంగభద్ర నది ఉధృతిలో పాత బ్రిడ్జి కొట్టుకుపోయిందన్నారు. 2011లో ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి కొత్త బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేయించారన్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. కరోనా విపత్తు, తెలంగాణ వైపు భూ సేకరణ వంటి ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆయన పట్టుబట్టి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించారన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రజలకు బంధుత్వాలు ఉన్నాయని, వారందరికీ ఈ బ్రిడ్జి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాబోయే కాలానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మాట్లాడుతూ.. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి రూ.42 కోట్ల అంచనాతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశామన్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. గత తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి భూ సేకరణ సమస్యను పరిష్కరించామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాంట్రాక్టరుకు బకాయిలు చెల్లించి వంతెన నిర్మాణానికి కావాల్సిన నిధులు సైతం మంజూరు చేసి పూర్తి చేయించిందన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం కోసం రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దకాలంగా ఎదురు చూశారని, ఎట్టకేలకు రెండు రాష్ట్రాల బంధాలకు వంతెన వారధిగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. బ్రిడ్జి ప్రారంభోత్సవంలో కర్నూలు కలెక్టర్ సృజన, సబ్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంతరెడ్డి, నియోజకవర్గ నాయకులు బసిరెడ్డి, భీమిరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, ఆదోని డివిజన్ ఈఈ కృష్ణారెడ్డి, డీఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నిత్యానందరాజు, ఎంపీడీఓ దశరథ రామయ్య, సీఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐలు తిమ్మయ్య, తిమ్మారెడ్డి, శరత్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదిత్య థాక్రేపై కేసు నమోదు
ముంబయి: అనుమతి లేకుండా వంతెనను ప్రారంభించారనే ఆరోపణలతో శివసేన నాయకుడు ఆదిత్య థాక్రేపై కేసు నమోదైంది. లోయర్ పరేల్ వద్ద డెలిస్లే బ్రిడ్జి రెండో క్యారేజ్‌వేను అధికారిక అనుమతి లేకుండా థాక్రే గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ చర్యపై ఆందోళన వ్యక్తం చేసిన ముంబయి పోలీసులు.. కేసు నమోదు చేశారు. లోయర్ పరేల్ వద్ద డెలిస్లే బ్రిడ్జి రెండో క్యారేజ్ వంతెన ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. వంతెనను వాహనదారులు వాడుకోవచ్చని అధికారిక సంస్థలు ఇంకా ధ్రువీకరించలేదు. ఇవేవీ పట్టించుకోకుండా వంతెనను ఆదిత్య థాక్రే ప్రారంభించారు. థాక్రే చర్యలపై పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సునీల్ షింద్, సచిన్ అహిర్లతో పాటు ఆదిత్య ఠాక్రేపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 143, 149, 336, 447 కింద కేసు నమోదు చేయబడింది. ఈ సెక్షన్లు చట్టవిరుద్ధంగా గుమిగూడడం, అల్లర్లు చేయడం, ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య నేరపూరిత నేరాలకు సంబంధించినవి ఉంటాయి. దక్షిణ ముంబయి లోయర్ పరేల్ మధ్య నిర్మిస్తున్న కీలకమైన లింక్ డెలిస్లే బ్రిడ్జ్‌ను జూన్‌లో పాక్షికంగా తెరిచారు. కర్రీ రోడ్ నుండి లోయర్ పరేల్‌ను కలిపే మరో దశ సెప్టెంబర్‌లో ప్రారంభించబడింది. ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ -
ఓటేయాలంటే..వాగు దాటాలె
కొండాయి గ్రామ జనాభా 1860 ఓటర్లు: 1220 నివాస గృహాలు: 418 బతకడం వేరు. జీవించడం వేరు. వాళ్లు కేవలం బతుకుతున్నారంతే.. జీవించడాన్ని మన పాలకులు వాళ్లకింకా అలవాటు చేయలేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. పాలకులూ మారుతున్నా.. ఆవిష్కరణలు ఆకాశాన్ని చుట్టేస్తున్నా.. ఇప్పటికీ ములుగు జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వాగులు దాటుతున్నారు. ఈ ఏడాది జూలై 27న వరద ఎనిమిది మందిని మింగింది. ఇప్పటికీ ఆ గ్రామాల్లో ఏ మనిషిని కదిలించినా రోదనలే. అంతుచిక్కని వేదనలే. వారిని ‘సాక్షి’ పలకరిస్తే వాగంత దుఃఖాన్ని వెళ్లబోసుకున్నారు. వారి ఎజెండా.. ఏమిటో చెప్పుకొచ్చారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది మా అమ్మగారింటికి(కొండాయి) తొలుసూరు కాన్పు చేయించుకునేందుకు వచ్చిన. వాగుపై బ్రిడ్జి కూలింది. నొప్పులు రావడంతో వాగులో నుంచి నడుములోతుల్లో దాటుకుంటుపోయిన. దొడ్లకు చేరుకొని అక్కడి నుంచి ఏటూరునాగారం, ములుగు వెళ్లేసరికి బిడ్డ అడ్డం తిరిగింది. పెద్దాపరేషన్ చేసి డెలివరీ చేసిండ్లు. మళ్లీ బాలింత నొప్పులతో ఉంటే.. మా అమ్మనాన్న, వాళ్లు మరో పదిమంది కలిసి డొల్ల కట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. – మానేటి సంధ్యారాణి, బాలింత, కొండాయి ఐదు నెలల నుంచి అంతులేని వ్యథ ఈ ఏడాది జూలై 27న అకాల వర్షాలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధి హైలెవెల్ బ్రిడ్జి కూలింది. జంపన్న వాగు ఉధృతికి కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఆయా గ్రామాల ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. కొండాయి గ్రామంలో వరద 8 మందిని జల సమాధి చేసింది. బ్రిడ్జి కొట్టుకుపోవడంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీకి పూర్తిగా రాకపోకలు నిలిచాయి. ఐదు నెలల నుంచి ఆయా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నారు. గర్భిణులు ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డొల్లాలు కట్టి వాగు దాటిస్తున్నారు. రేషన్ బియ్యం కోసం సైతం కొండాయిలో వేలి ముద్రవేసి.. వాగుదాటి దొడ్లకు వెళ్లి అక్కడి నుంచి బియ్యాన్ని మోసుకుంటూ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎరువు అందుతలేదు.. పొలం పనుల కోసం కావాల్సిన ఎరువు బస్తాలు, ఇతర సామగ్రిని తెచ్చుకునేందుకు నరకం కనిపిస్తోంది. ఎరువు బస్తాలను వాగులో నుంచి తలపై పెట్టుకొని దాటించడం కష్టంగా మారింది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇలా వ్యవసాయ పనిముట్లకు కష్టాలు పడుతూ వాగుదాటాల్సి వస్తోంది. –బొచ్చు ఉపేందర్, రైతు ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాం. నా భర్త, కొడుకు జంపన్నవాగు ప్రమాదంలో చచ్చిపోయిండ్లు. ఇంటికి మగదిక్కులేకుండా పోయింది. ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నా. నాకు ఏ అవసరం వచ్చినా.. ఆదుకునే వారే లేరు. బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న. – మున్నిబేగం, కొండాయి ఒక్క కొండాయి గ్రామమే కాదు... ఏజెన్సీ పరిధిలోని అనేక ఆదివాసీ గూడేల ప్రజలు వంతెనలు లేక నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో, పోటీలో ఉన్న నేతల హామీల్లో వీరి సమస్యలు ఎక్కడా కనిపించవు. ఏజñ న్సీ వాసుల ఇబ్బందులు ఇలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది బీడీ కార్మికులు ఏళ్ల తరబడి సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. వీరి వెతలు నేతల చెవికెక్కుతాయన్న ఆశతో ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వేళ...ఈ పీపుల్స్ ఎజెండాకు మోక్షం లభిస్తుందని వారు ఎదురుచూస్తున్నారు. - అలువాల శ్రీనివాస్ -
మిస్టీరియస్ డెవిల్స్ బ్రిడ్జ్..
-
అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!
కనువిందు చేసే కొన్ని దృశ్యాలు ఎంతగా ఆకట్టుకుంటాయో.. అంతే బెదరగొడతాయి. ప్రపంచంలో కొన్ని ఆసక్తికరమైన నిర్మాణాల వెనుక ఉన్న రహస్యమైన కథలే అందుకు ప్రతీకలు. జర్మనీ, సాక్సోనీ రాష్ట్రం, గోర్లిట్జ్ జిల్లా, గబ్లెంజ్ సమీపంలోని రాకోట్జ్ సరసుపైనున్న వంతెన అలాంటిదే. ఇది ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ అయిన కుమ్లౌ అజేలియా రోడడెండ్రన్ పార్క్‌కి ఆనుకుని ఉంది. ఇక్కడి ప్రకృతి అందం.. కనురెప్పలను క్షణం కూడా వాల్చనివ్వదు. ఎటు తిరిగి చూసినా స్వప్నలోకంలో విహరిస్తున్నట్లే అనిపిస్తుంది. ఈ వంతెనకు.. సర్కిల్ బ్రిడ్జ్, బసాల్ట్ బ్రిడ్జ్, కుమ్లౌ బ్రిడ్జ్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి. సుందరమైన ఈ వంతెన.. సరసులో ప్రతిబింబిస్తూ.. ఎటు నుంచి చూసినా.. కచ్చితమైన కొలతలతో.. వృత్తాకారంలో కనువిందు చేస్తుంది. చలికాలంలో కిందున్న నీరంతా గడ్డకట్టి.. ఓ ఆర్చ్‌లా ఆకట్టుకుంటుంది. అగ్నిపర్వతాల శిల నుంచి ఏర్పడిన ‘బసాల్ట్’ అనే రాతితో పాటు మరిన్ని సహజమైన రాళ్లతో ఇది నిర్మితమైందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. అయితే ఇది జనజీవనాన్ని కలిపే వారధి కాదని, కేవలం వీక్షకుల అహ్లాదం కోసం నిర్మించిన కట్టడం మాత్రమేనని కొందరు నిపుణుల ఉద్దేశం. దీన్ని 19వ శతాబ్దంలో ఓ మోతుబరి దగ్గరుండి కట్టించాడని స్థానికంగా కొన్ని కథనాలున్నా వాటికి సరైన ఆధారాల్లేవు. వైవిధ్యమైన ఒంపుతో మలచిన ఈ వంతెన.. ఎలాంటి వారినైనా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద కొన్ని కొనలు.. ముళ్ల కిరీటాన్ని తలపిస్తాయి. ఇంత గొప్ప కట్టడం మనుషులకు సాధ్యంకాదని, దెయ్యాలు దీన్ని నిర్మించాయని, సైతాను ఆదేశంతో ఇది ఏర్పడిందని, ఈ వారధి సమీపంలో ఆత్మలు సంచరిస్తూ ఉంటాయని కొందరు విశ్వసిస్తారు. అందుకే దీన్ని ‘డెవిల్స్ బ్రిడ్జ్’ అని పిలిచేవారు ఎక్కువయ్యారు. ఇక్కడ ప్రత్యేకమైన కలువ పువ్వులు, అరుదైన వృక్షజాతులు.. రకరకాల రంగులతో ఆకట్టుకుంటాయి. మరోవైపు కొందరు దైవచింతన కలవారు.. ఈ వంతెన నిర్మాణానికి ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని వివరిస్తారు. ఇది మరొక ప్రపంచానికి మార్గమని సూచిస్తారు. దాన్నే బలంగా నమ్ముతుంటారు. ఇక్కడి అందాలను చూడటానికి చాలామంది ఔత్సాహికులు ఎగబడుతుంటారు. కానీ ఈ బ్రిడ్జ్ మీదకు అనుమతి లేదు. చుట్టూ ఉన్న అందాలను మాత్రం తరించొచ్చు. ఏది ఏమైనా ఈ బ్రిడ్జ్‌ని నిర్మించింది ఎవరు? ఎందుకు నిర్మించారు? ఎందుకు దెయ్యం పేరుతో భయంకరమైన కథలు పుట్టుకొచ్చాయి? అసలు ఆ కాలంలో ఇంత గొప్ప నిర్మాణం ఎలా సాధ్యమైంది లాంటి ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాలు దొరకలేదు. --సంహిత నిమ్మన (చదవండి: ఇజ్రాయెల్ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్ అవుతోందంటే..) -
పెద్ద శబ్ధంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన
-
Hyderabad: మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్/ నల్గొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇక రాజధాని హైదరాబాద్ మహానగరంలో కురిసిన కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్భందంలో ఇరుక్కుపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఉధృతంగా మూసీ.. మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత హైదరాబాద్‌లో సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి 6వేల క్యూసెక్కుల నీరు మూసీలో వదలడంతో మూసారాంబాగ్ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. మూసీ వాగు ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జికి ఆనుకొని వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మంగళవారం రాత్రి 9గంటల నుంచి మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపి వేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. #HyderabadRains Moosarambagh bridge is being closed from 9 Pm this evening due to increase in water levels in Musi as about 6000 cusecs is released from Osmansagar & Himayathsagar into Musi .. We will review the situation tomorrow pic.twitter.com/krWO8uqTyW — Arvind Kumar (@arvindkumar_ias) September 5, 2023 మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను ఒక్కో అడుగు మేర ఎత్తి 3250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో :1013.18 క్యూసెక్కులు వస్తుండగా.. అవుట్ ఫ్లో : 3753.81క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం : 645.00 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం : 643.60 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 4.46టీఎంసీలు..కాగా ప్రస్తుత నీటి నిల్వ : 4.09టీఎంసీలు ఉంది. చదవండి: మైసమ్మగూడలో నీట మునిగిన అపార్ట్మెంట్లు జంట జలాశయాలకు భారీగా వరద నీరు హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో హిమాయత్ సాగర్ ప్రాజెక్టు 4 గేట్లు, ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీకి వరద పోటెత్తింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరిసరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. -
స్టీల్ బ్రిడ్జికి ‘నాయిని’ పేరు
హైదరాబాద్: ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.426 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు చౌరస్తాలో మంత్రి కేటీఆర్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. స్టీల్‌బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తీరుతుందని, నగరంలోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా వెళ్లే వాహనాదారులకు ఇది ఎంతో వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఎటువంటి రోడ్డు వెడల్పు లేకుండా దుకాణాదారులకు నష్టం కలిగించకుండా అనుకున్న సమయానికి స్టీల్‌బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మెట్రో ట్రైన్ మీదుగా అత్యంత ఎత్తు నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం స్టీల్ మాత్రమే ఉపయోగించి నిర్మించినట్లు తెలిపారు. ఇది నగరానికే తలమానికమని ఆయన కొనియాడారు. కాగా.. స్టీల్ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరును ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం తొలి హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి పని చేశారని, స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వు జారీ చేయనుందన్నారు. నాయిని నరసింహారెడ్డి సుదీర్ఘ కాలం పాటు ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించారన్నారు. అక్కడే ఉన్న వీఎస్టీ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో నాయిని సేవలను దృష్టిలో ఉంచుకొని స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
ఇంజినీర్‌ను బురదలో దింపిన ఎమ్మెల్యే
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుండడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఇంజినీర్‌ను బురదలో దింపి పనిష్మెంట్ ఇచ్చిన సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. దొడ్డబళ్లాపురం–నెలమంగల ప్రధాన రహదారి మార్గంలో గొల్లహళ్లి వద్ద రైల్వే పైవంతెన పనులు గత రెండు సంవత్సరాలుగా కుంటుతూ సాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించి స్థానికులు ఎమ్మెల్యే శ్రీనివాస్ వద్ద ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి వచ్చిన ఎమ్మెల్యే ఇంజినీర్‌ను పిలిచి దుర్భాషలాడి ఒకసారి బురదలో దిగి పరిశీలించాలని ఆదేశించాడు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇంజినీర్ బురదలో దిగి నడిచాడు. పనులు త్వగా పూర్తిచేయాలని లేదంటే ఇదే బురద ముఖానికి పూస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే మరికొందరు అధికారులు ఇలా చేస్తే కనీసం పనులు త్వరగా చేస్తారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి తల్లీకొడుకులను కలిపిన భారీ వరదలు.. 35 ఏళ్ల క్రితం వేరయి.. -
కురుపాం మండలం భీంపూర్ వంతెన నిర్మాణానికి నిధులు
-
ప్రియునితో ఉండగా పిన్నికి దొరికిపోయింది.. కంగారులో బ్రిడ్జిపై నుంచి దూకేసి..
మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఒక యువతి 30 అడుగుల ఎత్తయిన ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకిన ఘటన చోటుచేసుకుంది. ఆ యువతి అంతకుముందు రోజే ఇంటిలో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం అన్నిచోట్లా గాలిస్తుండగా, ఆమె పిన్నికి ఖండ్వా రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై ఆ యువతి కనిపించింది. పిన్నిని చూసి ఆందోళనకు లోనైన ఆమె వెంటనే ఆ ఓవర్‌బ్రిడ్జిపై నుంచి ఒక్క ఉదుటన కిందకు దూకేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ యువతితో పాటు ఘటన జరిగిన సమయంలో ఒక యువకుడు ఆమె పక్కనే ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద ఎస్ఎన్ కాలేజీ సమీపంలో జరిగింది. సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆ యువతితో పాటు ఒక యువకుడు ముఖానికి రుమాలు కట్టుకుని ఉన్నాడని, ఈ ఘటన జరగిన వెంటనే పారిపోయాడని తెలుస్తోంది. ఆ యువతి ముందురోజు రాత్రి ఇంటిలోని ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె కారులో లిఫ్టు తీసుకుని, ఖండ్వా చేరుకున్నదని స్థానికులు చెబుతున్నారు. ఆ యువతి మర్నాటి ఉదయం తన ఇంటిలోని వారికి వీడియోకాల్ చేసి, తాను ఎవరితో ఉన్నదీ తెలియజేసింది. ఆ వీడియో కాల్లో ఎస్ఎన్ కాలనీ కనిపించిన నేపధ్యంలో ఆ యువతి తల్లి తన సోదదరిని ఆ ప్రాంతానికి వెళ్లాలని కోరింది. దీంతో ఆమె ఆ బ్రిడ్జి దగ్గరకు వెళ్లింది. ఆ యువతి తన పిన్ని తనను పిలవడాన్ని గమనించి, ఆందోళన పడుతూ బ్రిడ్రిపై నుంచి దూకేసింది. వెంటనే పిన్ని స్థానికుల సహాయంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించింది. సమచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆకాశాన్ని చీల్చి, రోడ్డును తాకి, అగ్నిగోళంలా మారి.. వణికిస్తున్న పిడుగు వీడియో! -
ఒక్క రూపాయి తీసుకోకుండా.. వందల కొద్ది బ్రిడ్జ్‌లను నిర్మించాడు!
ఎన్నో మారు మూల ప్రాంతాలను నగరాలతో అనుసంధానమయ్యేలా చేశాడు. స్కూళ్లకు, ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇబ్బంది ఉండే మారూమూల ప్రాంతాలకు అతను వారధిగా నిలిచాడు. వందలకొద్ది వంతెనలను అలవోకగా నిర్మించాడు. ఒక్క రూపాయి ఆశించకుండా, ఎలాంటి సాయం తీసుకోకుండా ఉచితంగా నిర్మించాడు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఆ సమాజా సేవ అతనికి ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి. అతడే బ్రిడ్జ్మ్యాన్గా పిలిచే గిరీష్ భరద్వాజ్ భరద్వాజ్ కర్ణాటకకు చెందిన ఇంజనీర్. నదులు, వాగుల వద్ద ఉండే మారుమూల గ్రామాలను నగరాలతో కనెక్టవిటీ అయ్యేందుకు ఎంతగానో కృషి చేశాడు. ఆయా గ్రామాల్లో ఉండే విద్యార్థులు, ప్రజలు సీటీకి వెళ్లాలంటే వాగులు, వంకలు దాటేల్సింది. నిత్యం వారికది సాహస క్రీడగా మారింది. దీన్ని చూసి చలించిపోయిన భరద్వాజ్ ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జ్‌లు నిర్మిస్తే వారి సమస్య తీరుతుందని భావించి ప్రభుత్వాన్ని ఆశ్రయించగా.. సాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆయనే స్వయంగా నిర్మించేందుకు పూనుకోవాలనే ధృఢ నిశ్చయానికి వచ్చాడు. అందుకోసం తక్కువ ఖర్చుతో నిర్మించి బ్రిడ్జిల కోసం అన్వేషించాడు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం స్టీల్ కేబుల్స్ ఎంచుకుని వేలాడే బ్రిడ్జ్‌లను నిర్మించాలనే ఓ నిర్ణయానికి వచ్చాడు. అలా మొత్తం వివిధ ప్రాంతాల్లో సుమారు 128 బ్రిడ్జ్‌లు అలవోకగా నిర్మించాడు. మొదటగా కావేరి నదిపై కుశాల్నగర్ సమీపంలోని నిసర్గధామ ద్వీపాన్ని కర్ణాటక ప్రధాన భూభాగన్ని కలిపేలా 55 మీటర్ల బ్రిడ్జ్‌తో అతని ప్రయాణం ప్రారంభమైంది. అలా అతను తక్కువ ఖర్చుతో బ్రిడ్జ్‌లు నిర్మించిన వ్యక్తిగా ఘనత సాధించడమే గాక ఇలా ఎన్నో మారుమూల ప్రాంతాలను నగరాలతో కనెక్ట్ అయ్యేలా చేసి 'బ్రిడ్జ్‌మ్యాన్ ఆప్ ఇండియాగా పేరుగాంచాడు. ఆయన చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం పద్శశ్రీతో సత్కరించింది. భరద్వాజ్ ఓ కార్యక్రమంలో మట్లాడుతూ..నేను చాలా విస్తృతంగా పనిచేశాను. దురదృష్టమేమిటంటే ప్రతిభావంతులైన చాలా మంది గుర్తించబడటం లేదు. 1980 దశకంలో మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. జీవితంలో క్రూరంగా మారిన ఏ వ్యక్తినైనా ప్రేమ, ఆప్యాయతతో తిరిగి సమాజంలోని జనజీవన స్రవంతిలోకి తీసుకురావచ్చు. అందుకు కావల్సిందల్లా మానవత్వం, ప్రేమ ఉంటే చాలని చెప్పారు. ఇక ఆయన జీవితం ఆధారంగా కన్నడ నిర్మాత సంతోష్ కోడెంకేరి ది బ్రిడ్జ్‌మ్యాన్ అనే బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. దీనిని కన్నడలో నిర్మించి హిందీలో కూడా విడుదల చేయనుండటం గమనార్హం. (చదవండి: 20 కుటుంబాలు ఇళ్ళు హామీ పెట్టి.. బ్యాంకు రుణం తెచ్చి కట్టిన గుడి !) -
కొల్లేరు ప్రజలకు మంచి రోజులు
కైకలూరు: కొల్లేరు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మంచి రోజులు వచ్చాయి. చిరకాల కలగా మిగిలిన సర్కారు కాల్వపై వారధి ప్రారంభానికి సిద్ధమైంది. సమీప జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద అతిపెద్ద అనివేటి మండప నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సర్కారు కాల్వ వారధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వారధిగా పేరు ఖరారు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొల్లేరు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే గత ప్రభుత్వం భావించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అక్కడి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. కొల్లేరు ప్రజల ప్రధాన వృత్తి చేపల సాగు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ చార్జీలను తగ్గిస్తానని సీఎం జగన్ మోహన్‌రెడ్డి వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. టీడీపీ పాలనలో యూనిట్ ధర రూ.3.85 ఉండగా జగన్ ప్రభుత్వం రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. కొల్లేరు గ్రామాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం నిధుల ద్వారా సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, నాడు–నేడులో పాఠశాలల నిర్మాణాలు కొల్లేరు గ్రామాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వారధి కల సాకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కొల్లేరు అభయారణ్య పరిధిని తగ్గిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించారు. కొల్లేరు ఆపరేషన్ తర్వాత రూ.3,500 కోట్ల పునరావాస ప్యాకేజీని ప్రజలకు అందించారు. ప్రధానంగా కొల్లేరు ప్రజల చిరకాల కల సర్కారు కాల్వపై వారిధి నిర్మాణానికి 2009లో రూ.12 కోట్లను వైఎస్ కేటాయించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత పనులు జరగలేదు. గత ప్రభుత్వం అంచనాలు పెంచి రూ.14.70 కోట్లు కేటాయించిన పనులను పూర్తి చేయలేదు. సీఎం ప్రత్యేక శ్రద్ధతో స్థానిక ఎమ్మెల్యే డీఎన్నార్ వారధి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. తుది పనులు పూర్తికావడంతో ప్రారం¿ోత్సవ తేదీ ప్రకటించనున్నారు. అతిపెద్ద అనివేటి మండపం.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం అతి పురాతనమైనది. గత ప్రభుత్వ పాలనలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎండలో నిలబడాల్సి వచ్చేది. ఎమ్మెల్యే డీఎన్నార్ ప్రత్యేక శ్రద్ధ వల్ల ప్రజా విరాళాలు దాదాపు రూ.5 కోట్లతో సమీప జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా 305 మీటర్ల పొడవు, 105 మీటర్ల వెడల్పుతో భారీ అనివేటి మండపం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన పనులు పూర్తయ్యాయి. వివిధ రకాల శిల్పాలను కళాకారులు సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా అమ్మవారి జాతరలో కలవబోనాలను అతి వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతోంది పెద్దింట్లమ్మ దేవస్థాన అబివృద్ధికి ఎమ్మెల్యే డీఎన్నార్ విశేష కృషి చేస్తున్నారు. అతిపెద్ద అనివేటి మండపం త్వరలో పూర్తికానుంది. వారధి నిర్మాణం పూర్తికావడంతో ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రానికి అమ్మవారి దేవస్థానం మీదుగా వాహనాలు చేరే అవకావం ఉంటుంది. దీంతో కొల్లేరు పర్యాటకాభివృది్థతో పాటు అమ్మవారి దేవస్థానానికి నేరుగా బస్సు సౌకర్యం ఏర్పడుతోంది. – కేవీ.గోపాలరావు, పెద్దింట్లమ్మ దేవస్థాన ఈవో, కొల్లేటికోట -
ఇసుకలో సిమెంట్ కూడా కలపాలి మహాప్రభో!.. బీహార్‌లో కూలిన రెండో వంతెన!
పాట్నా: బీహార్‌లో ఏ ముహుర్తాన వంతెనలు ప్రారంభించారు గానీ వరుసగా కూలుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం కిషన్‌గంజ్ జిల్లాలో మరో వంతెన కూలిపోయింది. కాగా రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన కావడం గమనార్హం. రాష్ట్ర రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో మెచ్చి నదిపై ఉన్న వంతెన పిల్లర్ కూలిపోయిందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. NH-327Eలో నిర్మాణంలో ఉన్న ఈ వంతెన పూర్తయితే కిషన్‌గంజ్, కతిహార్లను కలుపుతుందని అయన అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. వంతెన కూలడంపై దర్యాప్తు కోసం నిపుణులతో కూడిన ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మానవ తప్పిదం వల్లనే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ ఒరిగిపోయినట్లు తెలుస్తోందని అన్నారు. ఇదే నెల మొదటి వారంలో అగువాని-సుల్తాన్ గంజ్ తీగల వంతెన పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ వంతెన కూడా నిర్మాణంలో ఉండగా కూలిపోవడం గమనార్హం. 2019 నవంబర్‌లో పూర్తి కావాల్సిన ఈ వంతెన నిర్మాణ పనులు మూడేళ్లకు పైగా కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతలోనే కూలిపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా ఒకే నెలలో నిర్మాణంలో ఉన్న రెండు వంతెనలు కూలిపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఇసుకలో సిమెంట్‌లో కలిపితే ఇలా జరగవని వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. చదవండి: బాబోయ్ ఇదేం ఆచారం! ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి.. ఆపై -
ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్.. నితిన్ గడ్కరీ జీ అంటూ..!!
Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఆసక్తికరమైన పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూ ఉండే ఆయన ఇటీవల ఒక వీడియోని ట్విటర్ ద్వారా షేర్ చేసి కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ'జీ ఇలాంటి అద్భుతాలు మన దేశంలో కుదురుతుందా? అంటూ ప్రశ్నించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నెదర్లాండ్స్‌లోని రివర్స్ బ్రిడ్జిగా ప్రసిద్ధి చెందిన వెలువెమీర్ అక్వెడక్ట్ బ్రిడ్జ్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో నది మీద నిర్మించిన రోడ్డు మీద వాహనాలు వేగంగా వస్తూ పోతూ ఉన్నాయి. అయితే రోడ్డుకి మధ్యలో కట్ అయినట్లు, మధ్యలో నీటి కాలువ ఉన్నట్లు చూడవచ్చు. ఇది చూస్తే ఒక్కసారిగా వాహనాలు నదిలోకి వెళ్లాయా అనిపిస్తుంది, కానీ అద్భుతమైన టెక్నాలజీతో నిర్మించిన ఈ రోడ్డు పైన బోట్స్, కింద వెహికల్స్ ప్రయాణించేలా నిర్మించారు. (ఇదీ చదవండి: ఫేస్‌బుక్‌పై కేసు.. రూ. 41 లక్షలు ఫైన్ - లాయర్ దెబ్బకు ఖంగుతిన్న మెటా!) Wait…What?? Can we do this too, @nitin_gadkari ji? 😊 pic.twitter.com/SNjRry5rup — anand mahindra (@anandmahindra) June 12, 2023 నీటిపై బోట్లు వెళ్లడానికి రహదారి మధ్యలో ఈ డిజైన్ చేశారు. ఇంజినీర్లు వాహనాలు కింద వెళితే, బోట్లు పైన వెళ్లాలా రూపొందించారు. ఈ నిర్మాణానికి సామాన్యులే కాదు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. దీంతో మన దేశంలో ఇలాంటి నిర్మాణాలు సాధ్యమవుతాయా? అంటూ నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీనిపైన కొంతంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. -
ఈ ఇల్లు చాలా ప్రత్యేకం: అమ్మకానికి బ్రిడ్జ్ హౌస్.. ధర ఎన్ని కోట్లో తెలుసా?
మీరు ఇప్పటివరకూ ఇన్నో రకాల ఇళ్లు చూసి ఉంటారు. ఖరీదైన భవంతుల గురించి విని ఉంటారు. కొండలపై రూ.కోట్లు పెట్టి కట్టిన , విలాసవంతమైన నివాసాల గురించి చదివి ఉంటారు. కానీ ఓ కాలువ బ్రిడ్జిపై నిర్మించిన ఈ ప్రత్యేకమైన ఇంటి గురించి తెలుసా? యునైటెడ్ స్టేట్స్‌లోని లాస్ ఏంజెల్స్‌లోని అల్హంబ్రా వాష్ కాలువకు అడ్డంగా బ్రిడ్జ్‌పై నిర్మించిన ఇల్లు తాజాగా అమ్మకానికి వచ్చింది. దీని విలువ దాదాపు రూ. 2 కోట్లు. ఒక పడకగది, ఒక బాత్రూమ్ ఉన్న ఈ ప్రత్యేకమైన ఇంటిని కంపాస్ రియల్ ఎస్టేట్ పోర్టల్ వెబ్సైట్లో విక్రయానికి ఉంచారు. 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కొనుక్కునే వారు అందమైన రూఫ్ టాప్ డాబాను ఆనందించవచ్చని, రిటైల్ దుకాణాలు, ఎల్ఏ ఫిట్నెస్, 99 రాంచ్, మెయిన్ స్ట్రీట్‌లో మంచి ఫుడ్‌స్టాల్స్‌కు సమీపంలో ఉండవచ్చని, ఇది నిజంగా గొప్ప ఆస్తి అని ఇంటిని అమ్మకానికి ఉంచిన పోర్టల్ పేర్కొంది. Welcome to the L.A. Troll Apartment. You can live under a bridge for only $250,000 https://t.co/6crQ2gvOls pic.twitter.com/l5M7Yjpbjk — Mighty AP (@themightyap) June 6, 2023 లాస్ ఏంజిల్స్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆహ్లాదకరమైన కాలువ నీటి ప్రవాహానికి ఎదురుగా, రోడ్డు వంతెన పక్కన ఈ ఇల్లు ఉంటుంది. ఇంటి డాబా మీదకు వెళ్తే సుందరమైన పరిసరాలను వీక్షించవచ్చు. ఈ ఇల్లు ఒకప్పటి తన హైస్కూల్ స్నేహితుని తల్లిదండ్రులకు చెందినదని దీన్ని అమ్మకానికి ఉంచిన కంపాస్ ఏజెంట్ డౌగ్ లీ చెప్పారు. ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ.. -
Bihar Bridge Collapse: కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు..
బిహార్‌లో భాగల్పూర్లో రూ. 1700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తీగల వంతెన ఆదివారం పేకమేడలా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ మేరకు బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..గతేడాది ఏప్రిల్ 30న ఈ వంతెన కొంతభాగం కూలిపోయిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత దీని నిర్మాణ విషయంపై అధ్యయనం చేయడం కోసం ఐఐటీ రూర్కీ నిపుణలను సంప్రదించాం. ఇంకా తుది నివేదిక రావాల్సి ఉంది. అధ్యయనం చేసిన నిపుణుల ఈ నిర్మాణంలో కొద్దిపాటి లోపాలున్నాయని మాకు తెలియజేశారు. అందుకు సంబంధించిన వాటినన్నింటిని తొలగించాం. అయనప్పటికీ ఆదివారం జరిగిన ఘటన తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోందని తేజస్వీ యాదవ్ అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాధికారి ఒకరు మాట్లాడుతూ..ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులైన అధికారులపై తప్పక కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వంతెన దగ్గర పనిచేస్తున సెక్యూరిటీ గార్డు కూడా ఈ ఘటన తర్వాత కనిపించకుండా పోయినట్లు తెలిపారు. రెస్క్యూ అధికారులు అతని ఆచకి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిడ్జి కూలిన తర్వాత నుంచి గార్డు కనిపించ లేదని, అతడి మృతదేహం కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతడి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి డిమాండ్ చేశారు. ఆయన పాలనలో జరుగతున్న అవినీతి కారణంగానే ఇలాంటి దుర్ఘటన జరిగిందని ఆరోపణలు చేశారు. మరో సహచర బీజేపీ నాయకుడు సయ్యద్ షానవాజ్ కూడా ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. (చదవండి: బిహార్‌లో కూలిన తీగల వంతెన) -
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్లు పనిచేస్తున్నారు..!
-
Ananthapur: టవర్‌క్లాక్ బ్రిడ్జిపై రాకపోకలు షురూ
అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం అనంతపురానికి మణిహారమైన టవర్‌క్లాక్ బ్రిడ్జిపై సోమవారం రాకపోకలు మొదలయ్యాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమందితో నిర్వహించిన బైక్ ర్యాలీతో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. బళ్లారి బైపాస్‌లోని ఎంజీ పెట్రోల్ బంక్ నుంచి బ్రిడ్జి మీదుగా టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, ఐరన్‌బ్రిడ్జ్, గాంధీ బజార్, శ్రీకంఠం సర్కిల్, రైల్వే ఫీడర్ రోడ్డు, ఆర్ట్స్ కళాశాల వరకు ఉల్లాసంగా.. ఉత్సాహంగా ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే ‘అనంత’ పార్టీ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఎమ్మెల్యే అనంతను పార్టీ కార్యకర్తలు భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు. జై జగన్.. జై అనంత అంటూ నినదించారు. నూతన బ్రిడ్జిని తిలకించేందుకు వేలాదిమంది ప్రజలు తరలిరావడంతో టవర్‌క్లాక్ – పీటీసీ వరకు పండుగ వాతావరణం కనిపించింది. ‘అనంత’లో రూ.650 కోట్ల అభివృద్ధి కోవిడ్‌తో ఏడాదిన్నర కాలం గడిచిపోయినా...మిగతా రెండున్నరేళ్లలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రూ.650 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకొచ్చిన ఫ్లై ఓవర్‌ను ఎన్‌హెచ్ పరిధిలోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని ఎంపీ తలారి రంగయ్యతో కలిసి సీఎం దృష్టికి తీసుకుపోయామన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి అర్బన్ లింక్ ప్రాజెక్ట్ కింద రోడ్ల విస్తరణతో పాటు టవర్‌క్లాక్ బ్రిడ్జిని కూల్చి.. దాని స్థానంలో కొత్తగా నాలుగు వరసలతో బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించారన్నారు. ప్రస్తుతం సప్తగిరి సర్కిల్, శాంతి థియేటర్ వద్ద పనులు, బ్రిడ్జ్ కింద అండర్ పాస్ పనులను మరో మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.రూ.311.93 కోట్లతో నిర్మించిన టవర్‌క్లాక్ బ్రిడ్జ్, ఫోర్‌వేను సీఎం జగన్, కేంద్ర మంత్రులు త్వరలో అధికారికంగా ప్రారంభిస్తారన్నారు. అంతవరకు ఇలాగే ఉంటే ట్రాఫిక్‌తో ప్రజలు మరింత ఇబ్బంది పడతారని భావించి ముందస్తుగా బ్రిడ్జిపై రాకపోకలు మొదలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. 16 నెలల్లోనే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారని, ఎస్ఆర్సీ, ఎన్‌హెచ్, ఆర్అండ్బీ, నగరపాలక, రెవెన్యూ, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. -
అనంతపురంలో టవర్‌క్లాక్ బ్రిడ్జి రెడీ
అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం అనంతపురంలో అత్యంత కీలకమైన టవర్‌క్లాక్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సిద్ధమైంది. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చేపట్టే బైక్ ర్యాలీతో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం బ్రిడ్జిపై ప్రత్యేక లైటింగ్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు హాజరుకానున్నారు. అండర్ పాస్, ఇతర పనులు పూర్తయ్యాక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రితో అధికారికంగా ఈ చారిత్రక బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి ఎమ్మెల్యే అనంత బ్రిడ్జిని పరిశీలించారు. నేషనల్ హైవేగా మార్పు చేసి... అనంతపురం టవర్‌క్లాక్ – పీటీసీ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 1965లో నిర్మించారు. ఐదు దశాబ్దాల తర్వాత బ్రిడ్జి అక్కడక్కడా దెబ్బతినడం, వాహనాలకు అనుగుణంగా రోడ్డు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నేషనల్ హైవేస్ పరిధిలో ఉన్న ఈ బ్రిడ్జిని 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా టవర్‌క్లాక్ బ్రిడ్జిని విస్తరించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని భావించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బ్రిడ్జిని 2020 నవంబరులో నేషనల్ హైవేస్ పరిధిలోకి తీసుకొచ్చారు. 2021 మే 3న బళ్లారి బైపాస్ వద్ద జాతీయ రహదారి– 44ను కలుపుతూ నగర శివారు పంగల్ రోడ్డు వద్దనున్న చైన్నె హైవేకి అనుసంధానిస్తూ కేంద్రం రూ.311.93 కోట్లతో అర్బన్ ప్రాజెక్ట్ చేపట్టేలా చర్యలు తీసుకుంది. టవర్‌క్లాక్ బ్రిడ్జి సహా 9.2 కిలోమీటర్ల పొడవున రోడ్డు పనులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 720 మీటర్ల(దాదాపు 1.44 కి.మీ) పొడవున రెండు వైపులా (ఫోర్వే) బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. 2021 అక్టోబర్ 25న మొదలైన పనులు ఈ ఏడాది అక్టోబర్ 24కు పూర్తి కావాలి. అయితే 5 నెలలు ముందే కాంట్రాక్ట్ సంస్థ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. సీఎం చిత్తశుద్ధితోనే బ్రిడ్జి ఏర్పాటు ఒక నాయకునికి చిత్తశుద్ధి ఉంటే ఎంతటి అభివృద్ధి అయినా సాధ్యమని ఈ పనులతో నిరూపితమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితోనే బ్రిడ్జి, ఫోర్ వే ఏర్పాటు సాధ్యమయ్యాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రికార్డు సమయం(15 నెలలు)లో, ప్రజల పూర్తి సహకారంతో బ్రిడ్జి పనులు పూర్తయ్యా యి. సీఎం ప్రత్యేక చొరవతో ఇప్పటికే నగరంలో రూ.650 కోట్ల తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రానున్న ఏడాదిలోనూ సాధ్యమైనంత అభివృద్ధి చేసి చూపుతాం. – అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే -
పాక్‌లో పర్యటిస్తున్న టీమిండియా సేఫ్.. వదంతులు నమ్మవద్దు
బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఏసియా అండ్ మిడిల్ ఈస్ట్ (BFAME) ఆర్గనైజ్ చేస్తున్న 22వ ఆసియా మరియు మిడిల్ ఈస్ట్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్లో పర్యటిస్తున్న 32 మంది సభ్యుల భారత బ్రిడ్జ్ జట్టు సురక్షితంగా ఉందని బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) చీఫ్ సుతాను బెహురియా వెల్లడించారు. టీమిండియా టోర్నీ ముగిసిన తర్వాతే (మే 13) భారత్‌కు బయల్దేరుతుందని ఆయన స్పష్టం చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాక్‌లో చెలరేగుతున్న అల్లర్లలో భారత బృందం అవస్థలు పడుతుందని, టోర్నీ పూర్తికాకుండానే టీమిండియా భారత్‌కు బయల్దేరిందని వస్తున్న వదంతుల నేపథ్యంలో బెహురియా ఈ మేరకు స్పందించారు. సోషల్‌మీడియాలో జరుగుతున్నది ఫేక్ ప్రచారమని కొట్టిపారేశారు. భారత బృందం హోటల్లో సేఫ్‌గా ఉందని, పాక్ భద్రతా యంత్రాంగం ప్రత్యేక దళాలను మొహరించి టీమిండియాకు సెక్యూరిటీ ఇస్తుందని తెలిపారు. BFAME updates; The news is fake, and there are no plans for an early return says Indian captain Ranjan Bhattacharya. The Indian team is winning and we will return together.@Sportskeeda @the_bridge_in @IndiaAllsports @Republic_Bharat @bridgelinks #bfame #bfameinpakistan pic.twitter.com/nRGqyuzG5A — Pakistan Bridge Federation (@PakBridgeFed) May 10, 2023 కాగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ మాజీ ప్రధాని, ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో పాక్ అంతటా అల్లర్లు చెలరేగుతున్నాయి. దేశంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. అనేక నగరాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ప్రజా ఆస్తులు విధ్వంసానికి గురవుతన్నాయి. భద్రతా దళాలు కాల్పుల్లో పలువురు ప్రాణాల సైతం కోల్పోయారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పాక్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. చదవండి: టీమిండియాను వెనక్కునెట్టిన పాక్ -
వైరల్ వీడియో: 150 కిలోల పేలుడు పదార్థాలు.. క్షణాల్లో నేలమట్టమైన బ్రిడ్జి..
-
నదిలో పడిన బస్సు.. 24 మంది దుర్మరణం
ఖర్గోన్/భోపాల్: కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికిపైగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. జిల్లాలోని దొంగర్గావ్ గ్రామ సమీపంలో బొరాద్ నదిపై నిర్మించిన వంతెన మీదుగా బస్సు ప్రయాణిస్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా బస్సుపై నియంత్రణ కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో బస్సు వంతెన రెయిలింగ్‌ను బద్దలుకొడుతూ నదిలో పడింది. బస్సు పడిన చోట నీటిప్రవాహం లేదు. 37 మందికే సీటింగ్ సామర్థ్యమున్న బస్సులో ఏకంగా 70 మంది ప్రయాణిస్తున్నారని, ఫిట్నెస్ లేని బస్సు వేగంగా ప్రయాణించడమూ ప్రమా దానికి కారణమని ప్రభుత్వం తెలిపింది. ఫిట్‌నెస్‌లేని బస్సుకు అనుమతినిచ్చిన అసిస్టెంట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌చేసింది. ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ.4 లక్షల నగదు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల ఆర్థికసాయం అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షల ఎక్స్ గ్రేషి యా అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. చదవండి: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన సొంత కూతురు -
లండన్ బ్రిడ్జిపై పేలిన ఆయిల్ ట్యాంకర్.. వీడియో వైరల్..
లండన్‌లో ఓ బ్రిడ్జిపై ఆయిల్ ట్యాంకర్ పేలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటనలు అదుపుచేశారు. అయితే కారు టైరు పేలిపోయి అదుపుతప్పి ఆయిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం అనంతర దృశ్యాలను అటువైపుగా వెళ్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాసేపట్లోనే అవి వైరల్‌గా మారాయి. Fire on the gold star bridge in groton Ct😳 pic.twitter.com/pxbAMKWWec — chrisstevens7 (@Moneymakerzzz91) April 21, 2023 Firefighters battle a blaze on the Goldstar Memorial Highway, l- 95 south #newlondon #groton pic.twitter.com/SQdDvmiitV — Greg Smith (@SmittyDay) April 21, 2023 Kayaker Matt Stone of Chester caught this footage from the water near the Gold Star Bridge boat launch @thedayct pic.twitter.com/EyGqSU5Cit — Elizabeth Regan (@eregan_ct) April 21, 2023 చదవండి: సొంత నగరంపైనే రష్యా బాంబింగ్ -
వంతెనపై ఊహకే అందని అద్భుతంలా ఒక నగరం..! వీడియో వైరల్
వంతెనలు అనేవి దురాలను తగ్గించడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేవి. అలాంటి వంతెనపై ఒక నగరం నిర్మిస్తే ఎలా ఉంటుంది. ఊహిస్తేనే ఏదోలా ఉంది కదూ. ఔను! వంతెనపై ఒక యునిక్ నగరాన్ని నిర్మించారు. కింద నీళ్లు కూడా ఉన్నాయి. చూస్తే ఒక అద్భుతమైన దృశ్యంలా కనిపిస్తుంది. అంతేగాదు ఆ వంతెన కింద వాటిని అద్భతమైన ప్రకృతి దృశ్యంగా మార్చింది. ఇది చైనాలో ఉంది. చాంకింగ్లోని లిన్షి టౌన్షిప్లో సాంప్రదాయ చైనీస్, పాశ్చాత్య శైలి కలయికతో భవనాలను నిర్మించినట్లు ఫోటోగ్రాఫర్ గువోజు తెలిపారు. ఇది పర్యాటకులకు అంతరిక్షం గుండా ప్రయాణిస్తున్న అనుభూతి ఇస్తుందని చెప్పారు. ఎప్పుడూ మంచి ప్రేరణనిచ్చే ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తూ సామాజిక మీడియాలో యాక్టివ్‌గా ఉంగే దిగ్గజ పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా అందుకు సంబందించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు. ఐతే నెటిజన్లు మాత్రం ఈ వీడియోని చూసి చాలా విభిన్నంగా స్పందించారు. ఇది అసాధ్యం అని ఊహజనితమైనదని ఒకరూ, దీనివల్ల నది జలాల్లో వ్యర్థాలు ఎక్కువతాయని మరొకరూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: చెత్త వివాదం..పారిశుధ్య కార్మికులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యాపారవేత్త) Imagine living here….. pic.twitter.com/foa7F4jTdC — Harsh Goenka (@hvgoenka) April 15, 2023 -
సాక్షి ఎఫెక్ట్: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు
ఇచ్ఛాపురం రూరల్(శ్రీకాకుళం జిల్లా): టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.7 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ బ్రిడ్జిని నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సెల్ఫీ తీసి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌లు తోక ముడిచారు. వీరి సెల్ఫీకి బొడ్డబడ గ్రామస్తులంతా ప్రతిస్పందించారు. ఈ వంతెన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైందంటూ గురువారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ప్రజల్లో అభాసుపాలయ్యామంట గురువారం ‘సెల్ఫీ’ పోస్టులు తొలగించారు. చదవండి: టీడీపీ నేతల ‘సెల్ఫీ’గోల్ -
చిరకాల స్వప్నం.. త్వరలో సాకారం
పి.గన్నవరం: లంక గ్రామాల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారం కానుంది. ఊడిమూడిలంక వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులూ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారంటే, తు.చ. తప్పకుండా అమలు చేసి చూపిస్తారనడానికి మరో ఉదాహరణగా నిలిచింది. గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి గత ఏడాది ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడి ప్రజలకు అవసరమైన వంతెన పనులను త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన విషయం విదితమే. వేలాది మందికి మేలు పి.గన్నవరం మండల పరిధిలో వశిష్ట గోదావరి నదీపాయ అవతల ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో సుమారు 3,500 మంది నివసిస్తున్నారు. వరదల సమయంలో మూడు నెలల పాటు వారికి పడవల పైనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో గోదావరి నదిపై వంతెన నిర్మించాలని దశాబ్దాల తరబడి ఇక్కడి ప్రజలు కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈ సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రూ.49.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన ఆదేశాలతో సంబంధిత ఫైలు చకచకా కదిలింది. అధికారులు శరవేగంతో అన్ని అనుమతులూ మంజూరు చేశారు. చివరిగా ఈ వంతెన నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ బాలు నాయక్ ఆమోదముద్ర వేశారు. ఈ వంతెన నిర్మాణానికి ఇక శంకుస్థాపనే తరువాయి. దీంతో ఆయా లంక గ్రామాల ప్రజల్లో ఆనందోత్సహాలు నెలకొన్నాయి. 320 మీటర్ల పొడవున.. వశిష్ట నదీపాయపై 320 మీటర్ల పొడవున 7.5 మీటర్ల వెడల్పున వంతెన నిర్మిస్తామని పంచాయతీరాజ్ ప్రాజెక్టు డీఈ అన్యం రాంబాబు తెలిపారు. రెండు అబెక్ట్‌మెంట్ వాల్స్ సహా, ఏడు పిల్లర్లతో వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు. దీనికి ముందు ప్రధాన పంట కాలువపై కూడా వంతెన నిర్మిస్తామన్నారు. పంట కాలువ నుంచి 1.5 కిలో మీటర్ల మేర అప్రోచ్ రోడ్డు నిర్మిస్తారని వివరించారు. చైన్నె ఐఐటీ నిపుణుల సూచన మేరకు వంతెన నిర్మాణం జరుగుతుందని చెప్పారు. తాను ఏఈగా ఉన్నప్పటి నుంచి దశాబ్ద కాలంగా ఈ వంతెన కోసం ప్రయత్నిస్తున్నానని.. చివరికి డీఈగా పని చేస్తుండగా సీఎం జగన్ చొరవతో వంతెన పనులు ప్రారంభం కానుండటం ఎంతో ఆనందంగా ఉందని రాంబాబు ఆనందం వ్యక్తం చేశారు. వంతెనకు అన్ని అనుమతులూ ఇచ్చిన సీఎం జగన్‌కు లంక గ్రామాల ప్రజలతో పాటు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కృతజ్ఞతలు తెలిపారు. -
నాగావళి నదిపై మరో వంతెన
రాజాం: విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజల రాకపోకలకు వీలుగా నాగావళి నదిపై మరో వంతెన నిర్మించనున్నారు. రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలం వాల్తేరు గ్రామం వద్ద ఉన్న బలసలరేవు నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని ఇసుకలపేట రేవు మధ్య వంతెన నిర్మించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వంతెన నిర్మాణానికి ఏడాదిన్నరగా ఆర్అండ్బీ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. తాజా గా ఫ్రీ ఎస్టిమేట్ నిర్వహించి అవసరమైన నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల చొరవతో నిధులు మంజూరుకావడంతో వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. 50 గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య ప్రయాణ దూరం తగ్గనుంది. నెలరోజలుగా కొలతలు నదిపై వంతెన నిర్మాణానికి సంబంధించి రూ.15 లక్షల వ్యయంతో అంచనా సర్వేను కోస్టల్ ల్యాండ్ సర్వే ఏజెన్సీ నిర్వహించింది. వంతెన నిర్మాణ ప్లానింగ్‌ను, అంచనా వ్యయాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగించింది. రూ.87 కోట్లను ప్రభుత్వం మజూరు చేయడంతో ఆర్‌అండ్‌బీశాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్లాన్ ప్రకారం నదికి ఇరువైపులా రోడ్డు చదును చేయడం, పిల్లర్లకు అనువైన ప్రదేశాలను నిర్ధారిస్తున్నారు. రోడ్డు సౌకర్యం, భవిష్యత్ వినియోగం, నదిలో మట్టి నమూనాలు సేకరణ, ఎంత లోతులో గ్రావెల్ ఉందనే అంశాలుపై పూర్తి వివరాలు సేకరించామని, ఈ నెలాఖరులోగా సీఎం జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా వంతెన పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్అండ్బీ జేఈ ఆంజనేయులు తెలిపారు. వంతెన నిర్మాణం పూర్తయితే సంతకవిటి నుంచి ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాలకు రహదారి సౌకర్యం కలగడంతో పాటు రెండు జిల్లాలను కలిపేవారధిలా మారనుంది. సంతకవిటి మండలంలో నాగావళి నదిపై రెండో వంతెనగా లెక్కల్లోకి వస్తుంది. 560 మీటర్ల పొడవున వంతెన నిర్మాణం కానుంది. 1998–99 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మిస్తామంటూ హామీ ఇచ్చింది. అప్పట్లో రూ.90 లక్షలు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించి నా పనులు చేయలేదు. 2017లో ఏడాదిన్నర పాటు వాల్తేరుతో పాటు పరిసర గ్రామాల ప్రజలు దీక్షలు చేసినా పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతీయుల వంతెన కలను నెరవేర్చుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రమాదాలకు చెక్ వాల్తేరు వద్ద నాగావళి నదిని దాటి వందలాదిమంది ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. నది ఉద్ధృతంగా ప్రవహించినప్పుడు నాటు పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా ఉంటున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల కృషితో వంతెన కల సాకారమవుతోంది. ఈప్రాంత ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారు. – సిరిపురపు జగన్మోహనరావు, జెడ్పీ వైస్ చైర్మన్, హొంజరాం అందరి సహకారంతో ప్రజలు సమస్యలు పరిష్కరించడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గతంలో అర్ధాంతరంగా ఉండిపోయిన వంతెనలు, రోడ్లు కూడా పూర్తిచేస్తాం. వాల్తేరు వద్ద బలసలరేవు వంతెన నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తాం. అందరి సహకారంతో వంతెన నిర్మాణం సాకారంకానుంది. – కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే కష్టాలు తీరుతాయి.. ఇసుకలపేట నుంచి అటు శ్రీకాకుళం, ఇటు ఆమదాలవలస చాలా దగ్గర. మధ్యలో నాగావళి నది ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నరకయాతన పడేవారు. వంతెన నిర్మాణంతో ఆ కష్టాలన్నీ తీరుతాయి. మా గ్రామంతో పాటు పరిసర గ్రామాలు ప్రజలు, వంతెన సాధన కమిటీ తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – గురుగుబెల్లి స్వామినాయుడు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్, వాల్తేరు -
వ్యథ నుంచి పుట్టిన వారధి
భైంసా రూరల్: ఎవరో వస్తారని ఎదురు చూడలేదు. ఎవరూ స్పందించకపోయినా పట్టించుకోలేదు. తాను అనుకున్నది చేశాడు. నలుగురికీ ఆదర్శంగా నిలిచాడు. సొంత డబ్బుతో వాగుపై వంతెన నిర్మించాడు నిర్మల్ జిల్లా భైంసా మండలం ఖథ్గాం గ్రామానికి చెందిన యువ రైతు నాగేశ్. గ్రామ రైతులు పొలాల వద్దకు వెళ్లడానికి సుద్దవాగు అడ్డుగా ఉంది. గతంలో వాగు దాటుతూ ఇద్దరు మృతి చెందారు. వాగుపై వంతెన నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో.. రైతులు, కూలీలు పొలాల వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రైతు నాగేశ్ సొంత ఖర్చుతో తాళ్లు, కర్రలతో వంతెన నిర్మించాడు. వాగు అవతలివైపు 400 ఎకరాల పంట పొలాలున్నాయి. రైతు నాగేశ్ పొలం కూడా ఉంది. సొంతంగా రూ.25 వేలు ఖర్చుచేసి తాళ్లు, వెదురు కర్రలతో వంతెన నిర్మించిన నాగేశ్‌ను రైతులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. -
దశాబ్దాల సమస్యకు దారి చూపిన జగన్
సి.బెళగల్(కర్నూల్ జిల్లా): కోడుమూరు, కృష్ణగిరి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు 70 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు దారి చూపిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ అన్నారు. మంగళవారం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం వద్ద హంద్రీ నదిపై వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, పాణ్యం, పత్తికొండ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, కుడా చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి తదితరులు హాజరయ్యారు. హంద్రీ ఒడ్డున భూమిపూజ చేసి శిలా ఫలకాన్ని వీరు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు చేయడంతో పలు గ్రామాల ప్రజల కష్టా లు తొలగిపోతున్నాయన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి గెలిపించుకుందామన్నా రు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడు తూ ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రజల కష్టాలు చూసి చలించి, అధికారంలోకి వస్తే వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చారన్నారు. కృష్ణగిరి, కోడుమూరు ప్రజలు ఎప్పటికీ జగనన్న మేలు మరువరన్నారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రజల వద్దకు పంపుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శమన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. -
పెనమలూరులో పచ్చ రాజకీయం.. ఆ క్రెడిట్ కొట్టేయడానికే చీప్ పాలిటిక్స్
ఆ మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నపుడు నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఐదేళ్ళలో ఒక కాలువపై చిన్న వంతెన కూడా పూర్తి చేయించలేకపోయాడు. అన్ని రకాలుగా జనాన్ని దోచుకుతిన్నాడు. ఇప్పుడు మాజీగా మిగిలాక కూడా జనంపై కక్ష తీర్చుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో, ఆయన గొడవేంటో.. మీరే చదవండి సైకిల్ పని వివాదం సృష్టించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులతో పచ్చ పార్టీ నాయకులు గంగవెర్రులెత్తుతున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికి నానాపాట్లు పడుతున్నారు. తాజాగా వివాదాలకు కేరాఫ్ గా నిలిచే విజయవాడ నగర శివార్లలోని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చీప్ పాలిటిక్స్ చూసి జనం అసహ్యించుకుంటున్నారు. యనమలకుదురులో అసంపూర్తిగా ఆగిపోయిన వంతెన వద్ద బోడే ప్రసాద్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. అక్కడి కాల్వపై వంతెన నిర్మాణానికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శంకుస్థాపన జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న ప్రస్తుత పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి చొరవతో ఈ వంతెన మంజూరైంది. శంకుస్థాపన జరిగిన వెంటనే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పెనమలూరు నుంచి పోటీ చేసిన బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హాయాంలో ఐదేళ్ళలో వంతెన పనులు పూర్తిచేయలేకపోయారు. బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో చిన్న వంతెన నిర్మాణాన్ని కాంట్రాక్టర్ ఐదేళ్ల పాటు సాగదీశాడు. వంతెనపై పచ్చ రాజకీయం 2019 ఎన్నికల్లో బోడే ప్రసాద్ ఓడిపోయి పార్థసారథి విజయం సాధించారు. కాంగ్రెస్ హయాంలో తాను శంకుస్థాపన చేసిన వంతెన ఇంకా పూర్తికాకపోవడంతో వంతెన నిర్మాణంపై పార్ధసారధి ప్రత్యేక దృష్టి సారించారు. ఇరిగేషన్ శాఖ అడ్డంకులన్నీ తొలగించి వంతెన నిర్మాణం పూర్తిచేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇదే అదనుగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కాంట్రాక్టర్ తో కోర్టులో కేసు వేయించాడు. అప్పటి వరకూ జరిగిన పనులకు బిల్లులు చెల్లించలేదని.. అవి చెల్లించాలంటూ కాంట్రాక్టర్ కోర్టుకెళ్లాడు. గత రెండేళ్లుగా కోర్టులో పోరాడి, కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడంతో పాటు అసంపూర్తిగా మిగిలిపోయిన వంతెనను పూర్తిచేసేందుకు అన్ని అనుమతులు తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో పనులు తిరిగి మొదలు కానున్నాయి. విషయం తెలిసిన టీడీపీ నేత బోడే ప్రసాద్ తన వల్లే పనులు మొదలవుతున్నాయని చెప్పుకునేందుకు ఇప్పుడు కొత్తగా చిల్లర రాజకీయాలకు తెరతీసాడు. ఇదేం ఖర్మరా బాబూ..! తన ఐదేళ్ళ పదవీ కాలంలో పూర్తి చేయకపోగా.. ఇప్పుడు వంతెన పూర్తి చేసిన క్రెడిట్ అధికార పార్టీ ఎమ్మెల్యే పార్ధసారధికి వెళ్తుందనే అక్కసుతో బోడే ప్రసాద్ ఇదేం ఖర్మరా బాబూ అంటూ వంతెన వద్ద ఆందోళన చేపట్టాడు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు శాంతియుత నిరసన తెలిపారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడటంతో పోలీసులు మోహరించారు. ఇదే అదనుగా భావించిన బోడే ప్రసాద్.. మహిళలను అడ్డం పెట్టకుని వైసీపీ శ్రేణులపై భౌతికదాడులకు పాల్పడ్డారు. ఫలితంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వంతెన వద్ద నిరసన పేరుతో బోడే ప్రసాద్ చాలా సేపు డ్రామా నడిపించాడు. బోడే చేపట్టిన నిరసన డ్రామాపై వైసీపీ శ్రేణులతో పాటు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన వంతెనను ఐదేళ్లలో పూర్తిచేయకుండా ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడానికి ఇలా చీప్ పాలిటిక్స్ ప్లే చేయడాన్ని తప్పుబడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో కాంట్రాక్టర్ల దగ్గర్నుంచి డబ్బు దండుకుని.. అభివృద్ధి పనులను గాలికి వదిలేసిన బోడే ప్రసాద్ ఇప్పుడు ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడాన్ని సహించబోమని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. - హితైషి, పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Yanamalakuduru Bridge: రక్తికట్టని మాజీ ఎమ్మెల్యే బోడే డ్రామా
పెనమలూరు(కృష్ణా జిల్లా): యనమలకుదురు పరిధిలో బందరు కాలువపై అసంపూర్తిగా మిగిలిన వంతెన నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వింత నాటకాలకు తెరలేపారు. ప్రతిపక్షంలో ఉండగా వంతెన శిలాఫలకానికి పిండ ప్రదానాలు చేసి ప్రజలపై కల్లబొల్లి ప్రేమ కురిపించిన ఆయన.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా వంతెన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వంతెన నిర్మాణంపై దృష్టి సారిస్తుండటంతో అక్కసుతో కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిర్మాణానికి మోకాలడ్డారు. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారాన్ని రాజకీయ స్వలాభం కోసం పచ్చనాటకానికి తెరలేపారు. అధికారంలోకి వచ్చినా నిర్లక్ష్యం.. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వంతెన నిర్మాణానికి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ రాశారు. అయితే ఆయన వెంటనే పనులు ప్రారంభించలేదు. జలరవాణాకు వంతెన అడ్డుగా ఉంటుందని సాకు చూపి వంతెన పనులు టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో యనమలకుదురు ప్రజలు దిక్కుతోచక లాకుల మీదుగా నానా ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు. తరచూ ట్రాఫిక్ ఇక్కట్లతో ఈ ప్రాంత ప్రజలు అగచాట్లు పడ్డారు. అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేగా ఉన్న బోడె ప్రసాద్ వంతెన నిర్మాణంపై ఏమాత్రం చొరవ చూపలేదు. కాంట్రాక్టర్‌తో చెట్టాపట్టాల్ వేసుకుని కాలం గడిపారు. గతంలో బోడె ప్రసాద్ వంతెన కోసం ఆందోళనలు చేసి గ్రామస్తులను దగా చేశారు. ఆలస్యంగా పనులు ప్రారంభం.. యనమలకుదురు వంతెన అగ్రిమెంట్ రాసిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు 2016లో ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ రామవరప్పాడు వద్ద రైవస్ కాలువపై వంతెన నిర్మాణం పనులు ప్రారంభించి, సకాలంలో పూర్తి చేశారు. వంశీ వంతెన పనులు చకచకా పూర్తి చేయటంతో అప్పటివరకు నిద్రావస్థలో ఉన్న బోడె ప్రసాద్ నిద్రలేచి వంతెన పనులు ప్రారంభించారు. తన వలనే వంతెన పనులు ఆలస్యంగా ప్రారంభించామని యనమలకుదురు గ్రామసభలో బోడెప్రసాద్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. కాంట్రాక్టర్‌కు బిల్లు ఎగ్గొట్టిన టీడీపీ.. యనమలకుదురు వంతెన పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు టీడీపీ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయే నాటికి రూ 3.60 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదు. టీడీపీ పాలనలో కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించే బాధ్యత బోడెప్రసాద్‌పై ఉన్నా ఆయన పూర్తి నిర్లక్ష్యం చూపాడు. దీంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పథకం ప్రకారం వంతెన పనులు నిలుపుదల చేశాడు. మరో కాంట్రాక్టర్‌తో వంతెన పనులు చేయించాలని ప్రభుత్వం సిద్ధపడగా కాంట్రాక్టర్ కోర్టు స్టే తెచ్చుకున్నాడు. వంతెన పనులు విషయంలో కాంట్రాక్టర్ సహకరించక పోవటంతోనే అసలు సమస్య వచ్చింది. కాంట్రాక్టర్‌కు రూ. 4 కోట్లు బిల్లులు చెల్లించటానికి అధికారులు చర్యలు చేపట్టారు. కాంట్రాక్టర్ బిల్లులు రావాలనే ఉద్దేశంతోనే నేడు బోడెప్రసాద్ వంతెన నాటకానికి తెరలేపారని గ్రామస్తులు మండి పడుతున్నారు. బోడె ప్రసాద్ అరెస్టు.. యనమలకుదురు వంతెన వద్ద శాంతి భద్రతలకు భంగం కలిగించిన మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. యనమలకుదురు వంతెన వద్ద మంగళవారం బోడెప్రసాద్ వంద మందితో వెళ్లి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా బందరు కాలువలో దూకుతానని బెదిరించారు. ఈ ఘటనపై పోలీసులు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, బోడెప్రసాద్, మరో వంద మందిపై కేసు నమోదు చేశారు. వారికి నోటీసులు ఇచ్చి, బోడెప్రసాద్, అనుమోలు ప్రభాకరరావును అరెస్టు చేసినట్లు పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపారు. వంతెన కథ ఇది.. యనమలకుదురులో బందరు కాలువపై వంతెన నిర్మాణం చేయాలని 2011లో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పుడు మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి రూ. 8 కోట్లు మంజూరు చేశారు. అయితే అనుకున్న సమయానికి పనులు జరగక పోవటంతో ప్రతిపక్షంలో ఉన్న బోడె ప్రసాద్ శిలాఫలకం వద్ద పిండ ప్రదానం, కర్మకాండలు నిర్వహించి పచ్చ మీడియా ప్రచారంతో వార్తల్లోకెక్కారు. (క్లిక్ చేయండి: ఇప్పటం పిటిషనర్లకు ఏపీ హైకోర్టు షాక్) వంతెన పనులు పూర్తి చేస్తాం.. యనమలకుదురు వంతెనకు సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాం. పనులు కూడా ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేస్తాం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నాం. – కృష్ణారావు, ఈఈ, నీటిపారుదల శాఖ -
యనమలకుదురు వంతెన విషయంలో టీడీపీ డ్రామాలు
-
యనమలకుదురు వంతెన విషయంలో టీడీపీ డ్రామాలు
-
యనమలకుదురులో కొత్త డ్రామాకు తెరదీసిన టీడీపీ
సాక్షి, విజయవాడ: యనమలకుదురు కేంద్రంగా టీడీపీ డ్రామాలకు తెరతీసింది. కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడంతో యనమలకుదురు వంతెన పనులు నిలిచిపోయాయి. కేసు కోర్టులో ఉందని తెలిసి కూడా టీడీపీ డ్రామా ఆడటం మొదలుపెట్టింది. ఈ డ్రామాలకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ హయాంలో ఈ బ్రిడ్జికి శంకుస్థాపన జరగగా, తర్వాత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాడు వంతెన పనులను టీడీపీ ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే పార్థసారథి వంతెన పనులు పూర్తయ్యేందుకు చొరవ చూపిస్తున్నా టీడీపీ నాయకులు నాటకాలు ఆడుతుండటం గమనార్హం. చదవండి: (ఏలూరులో లారీడ్రైవర్పై మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్ దాష్టీకం) -
వైరల్ వీడియో.. ట్రక్కుపై డాన్స్ చేస్తూ చనిపోయిన యువకుడు
వాషింగ్టన్: అమెరికా టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో 25 ఏళ్ల యువకుడు అతిచేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కదులుతున్న ట్రక్కు ఎక్కి డాన్స్ చేస్తూ చనిపోయాడు. నవంబర్ 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియోలో యువకుడు 18 చక్రాల ట్రక్కు ఎక్కి కాసేపు డాన్స్ చేశాడు. అయితే వెనకాల చూసుకోకపోవడంతో ఓ బ్రిడ్జి తాకి ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీశాడు. యువకుడు కిందపడిపోయినప్పుడు అతని మెడ విరిగిందని, ఆ ప్రాంతమంతా రక్తం ఉందని వెనకాల కారులో వెళ్లిన ఓ మహిళ చెప్పింది. ఆ దృశ్యాలు చూసి వెన్నులో వణుకుపుట్టిందని భయాందోళన వ్యక్తం చేసింది. తన రోజును ఇలా ప్రారంభించాల్సి వస్తుందని అనుకోలేదని చెప్పింది. చదవండి: వైరల్ వీడియో.. రష్యా క్షిపణులను పేల్చేసిన ఉక్రెయిన్ -
గోఖలే వంతెన త్వరలో కూల్చివేత
సాక్షి, ముంబై: అంధేరీలోని గోఖలే వంతెన సాధ్యమైనంత త్వరగా కూల్చివేసి వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని బీఎంసీ భావిస్తోంది. స్ధానికులు పడుతున్న ఇబ్బందులు, నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కూల్చివేత పనులకు 21 రోజుల్లో టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ పూర్తి చేయాలని బీఎంసీ భావిస్తోంది. 2023 మార్చి లోగా కూల్చివేత పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేగాకుండా కూల్చివేత పనుల్లో చివరి ఘట్టం పూర్తి చేయడానికి 30 గంటలపాటు రైల్వే నుంచి బ్లాక్ తీసుకోనున్నట్లు బీఎంసీ పేర్కొంది. ఆ తరువాత నూతన వంతెన పనులకు శ్రీకారం చుట్టనుంది. 1975లో నిర్మించిన అంధేరీలో తూర్పు–పశ్చిమ ప్రాంతాలను కలిపే గోఖలే వంతెన శిథిలావస్ధకు చేరుకోవడంతో ఈ నెల ఏడో తేదీ నుంచి మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్ ఉంటోంది. వాహనాలను దారి మళ్లించేందుకు ట్రాఫిక్ శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినప్పటికీ అవికూడా సరిపోవడం లేదు. దీంతో కూల్చివేత పనులు వేగవంతం చేసి కొత్త వంతెన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని బీఎంసీ నిర్ణయించింది. ఎంత వ్యయం? ఎవరి బాధ్యత? గోఖలే వంతెన ఎవరు నేల మట్టం చేస్తారు..? ఎవరు నిర్మిస్తారనే ప్రశ్న స్ధానిక ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరు కూల్చివేయాలి...? ఎవరు నిర్మించాలి...? అందుకయ్యే వ్యయంలో ఎవరు, ఎంత శాతం నిధులు వెచ్చించాలి..? ఇలాంటి కారణాలు తెరమీదకు వచ్చాయి. ఇదివరకు నేలమట్టం చేసిన అనేక వంతెనల పనులు జాప్యం జరగడానికి ఇవే ప్రధాన కారణాలయ్యాయి. దీంతో ఈ వంతెన రైల్వే హద్దులో ఉన్న పనులు పశ్చిమ రైల్వే చేపట్టనుంది. బీఎంసీ హద్దులో ఉన్న పనులు బీఎంసీ చేపట్టనుంది. కాని రైల్వే ట్రాక్స్ మీదున్న వంతెన భాగాన్ని కూల్చివేయాలంటే కూలీలకు ప్రాణాలతో చెలగాటమాడటంతో సమానం. ఓవర్ హెడ్ వైర్లోంచి 25 వేల ఓల్టేజీల విద్యుత్ ప్రవహిస్తుంది. వంతెన కిందున్న ఆరు రైల్వే మార్గాల మీదుగా సగటున రెండు నిమిషాలకు ఒక రైలు ప్రయాణిస్తుంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా ప్రాణాలకే ప్రమాదం. దీంతో ఈ వంతెన నేలమట్టం చేయాలంటే ఇటు ఇంజినీర్లకు, అటూ కూలీలకు కత్తిమీద సాములంటిదేనని పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో సుమీత్ ఠాకూర్ పేర్కొన్నారు. కూల్చివేత పనులకు టెండర్లు దాఖలు చేయడానికి కంట్రాక్టర్లకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఇవ్వనున్నట్లు ఠాకూర్ తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి సుమారు 84 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. సాధారణంగా గోఖలే వంతెన వినియోగంలో ఉన్నప్పుడే ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య ఉండేది. ఇప్పుడు ఆ వంతెన మూసి వేయడంతో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. ఫలితంగా స్ధానికులు విసిగెత్తిపోయారు. రోడ్డు మార్గం కంటే లోకల్ రైలు లేదా మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. -
ఉక్రెయిన్ ఉగ్రవాదమా? అది ప్రపంచానికి తెలుసు!
మాస్కో: కీలకమైన క్రిమియా-రష్యా వంతెనపై పేలుడు ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించాడు. రష్యా-క్రిమియాలను కలిపే ఆ వంతెనపై దాడికి ఉక్రెయిన్ కారణమని ఆరోపించిన ఆయన.. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద చర్యతో సమానమని విమర్శించాడు. ఇది రష్యాకు సంబంధించిన క్లిష్టమైన, అతిముఖ్యమైన పౌర మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి ఉద్దేశించిన తీవ్రవాద చర్య. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఉక్రెయిన్ నిఘా బలగాలు ఉద్దేశపూర్వకంగా ఇందులో పాల్గొన్నాయి అంటూ క్రెమ్లిన్ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా పుతిన్ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ పేలుడుకు కర్త, కర్మ, క్రియ.. అన్నింటికి ఉక్రెయిన్ కారణం అని ఆయన పేర్కొన్నారు. 2014లో క్రిమియాను రష్యా, ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్నాక.. నాలుగేళ్లకు ఈ బ్రిడ్జిని ప్రారంభించింది. సుమారు 19 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ బ్రిడ్జిని 2018లో గ్రాండ్‌గా ప్రారంభించారు పుతిన్. ఉక్రెయిన్ దక్షిణ భాగానికి మాస్కో దళాలు చేరుకునేందుకు కెర్చ్ స్ట్రెయిట్ వీలుగా ఉండేది. అంతేకాదు.. రష్యా నల్ల సముద్రం నౌకాదళం ఉన్న సెవాస్టోపోల్ నౌకాశ్రయానికి కూడా ఈ వంతెన ప్రధాన మార్గం. అయితే క్రెమ్లిన్-రష్యాలను అనుసంధానం చేసే ఈ కీలక వారధిపై శనివారం బాంబు పేలుడుతో మంటలు ఎగసిపడ్డాయి. బ్రిడ్జి సగ భాగం నాశనం కాగా, ముగ్గురు దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. Crimean bridge this morning. pic.twitter.com/chmoUEIxt7 — Anton Gerashchenko (@Gerashchenko_en) October 8, 2022 ఈ నేపథ్యంలో.. రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ హెడ్ అలెగ్జాండర్ బస్ట్రీకిన్తో పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఆయన పుతిన్‌కు వివరించారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకున్నా.. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ వర్గాల పనేనని రష్యా ఆరోపిస్తోంది. పేలుడు ధాటికి బ్రిడ్జి ఒక పక్క భాగం నాశనం అయ్యిందని, ఒక్కరోజు విరామం తర్వాత రైలు సేవలు, పాక్షిక రహదారి సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయని రష్యా అధికారులు తెలిపారు. పుతిన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడి ఆరోపణలకు ఉక్రెయిన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సలహాదారు మైఖాయిలో పోడోల్యాక్ స్పందిస్తూ.. పుతిన్ ఆరోపణలను తిప్పి కొట్టారు. ఉక్రెయిన్‌ది ఉగ్రవాదమా? ఇక్కడున్నది ఒకే ఒక్క ఉగ్రవాద దేశం. అదేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఉక్రెయిన్ ఉగ్రవాదానికి పాల్పడుతోందన్న పుతిన్ ఆరోపణలు.. చివరికి రష్యాకు కూడా విరక్తిగా అనిపించకమానదు. ఇక బ్రిడ్జి దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెటకారంగా స్పందించారు. ఉక్రెయిన్‌లో ఇవాళ పగలు అంతా బాగోలేదు. బాగా ఎండ దంచికొడుతోంది. దురదృష్టవశాత్తూ క్రిమియాలో మాత్రం దట్టంగా మేఘాలు అలుముకుని ఉన్నాయి. అదే సమయంలో వెచ్చగానూ ఉంది అంటూ దాడిని ఉద్దేశించి శనివారం రాత్రి తన ప్రసంగంలో వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలన విషయాలు -
Russia-Ukraine war: రష్యా ప్రతీకారం
జపొరిజాజియా: రష్యా–క్రిమియా ద్వీపకల్పాన్ని అనుసంధానించే కీలక వంతెనపై ఉక్రెయిన్ అనుకూల వర్గాలు పేలుళ్లకు పాల్పడిన నేపథ్యంలో పుతిన్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా సిటీపై నిప్పుల వర్షం కురిపించింది. శనివారం అర్ధరాత్రి తర్వాత వరుసగా రాకెట్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 12 మంది పౌరులు మృతిచెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. రష్యా దాడుల్లో 20 ప్రైవేట్ నివాస గృహాలు, 50 అపార్టుమెంట్ భవనాలు దెబ్బతిన్నాయని సిటీ కౌన్సిల్ కార్యదర్శి అనాతోలివ్ కుర్టెవ్ చెప్పారు. జపొరిజాజియాలో రష్యా రాకెట్ దాడులను ఉక్రెయిన్ సైన్యం ధ్రువీకరించింది. పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారని పేర్కొంది. రష్యా దాడుల పట్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. రష్యా అంతర్జాతీయ ఉగ్రవాది అంటూ మండిపడ్డారు. తమను ఎవరూ రక్షంచలేరా? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అమాయకులను బలి తీసుకున్నారు: జెలెన్స్కీ వాస్తవానికి దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా ప్రస్తుతం రష్యా ఆధీనంలోనే ఉంది. ఈ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేస్తూ రష్యా అధినేత పుతిన్ ఇటీవలే సంతకాలు చేశారు. జపొరిజాజియా ప్రావిన్స్ మొత్తం చట్టబద్ధంగా తమదేనని వాదిస్తున్నారు. గత గురువారం ఇదే సిటీపై రష్యా సైన్యం జరిపిన క్షిపణి దాడుల్లో 19 మంది బలయ్యారు. తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని రష్యా ఇటీవల తరచుగా దాడులు చేస్తుండడం గమనార్హం. తాజా రాకెట్ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ దయ, కరుణ లేకుండా అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్నారని దుమ్మెత్తిపోశారు. అది అక్షరాలా రాక్షసకాండ అని ధ్వజమెత్తారు. ఈ దాడులకు ఆదేశాలిచ్చినవారు, వాటిని పాటించినవారు తప్పనిసరిగా చట్టానికి, ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. వంతెన భద్రత పెంచాలని ఆదేశాలు ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా ఆక్రమించింది. రష్యా–క్రిమియాను అనుసంధానించే వంతెనపై శనివారం భారీ ఎత్తున పేలుళ్లు జరిగాయి. వంతెన కొంతవరకు ధ్వంసమైంది. ఈ పేలుళ్లకు ఇంకా ఎవరూ బాధ్యత వహించలేదు. ఇదంతా ఉక్రెయిన్ అనుకూలవర్గాల పనేనని రష్యా నిర్ణయానికొచ్చింది. ప్రతీకార చర్యల్లో భాగంగా జపొరిజాజియాను లక్ష్యంగా చేసుకుంది. వంతెనకు, అక్కడున్న ఇంధన రంగ మౌలిక సదుపాయాలకు భద్రత పెంచాలంటూ పుతిన్ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. భద్రత కోసం ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌ను రంగంలోకి దించారు. పుతిన్ ‘ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్’ ప్రారంభించారని రష్యా ప్రజాప్రతినిధులు కొందరు తెలిపారు. తూర్పు డొనెట్స్క్ రీజియన్‌లోని బఖ్ముత్, అవ్దివ్కా నగరాల్లో రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ సాగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైనిక దళాల అధికారి ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం రెండు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ జవాన్ల మధ్య ఘర్షణలో వాటిల్లిన ప్రాణనష్టంపై వివరాలు తెలియరాలేదు. రష్యా సైన్యానికి కొత్త కమాండర్ రష్యా–క్రిమియా వంతెనపై పేలుళ్ల తర్వాత రష్యా ఒక్కసారిగా అప్రమత్తయ్యింది. ఉక్రెయిన్‌లో తమ సైనిక బలగాలకు సారథ్యం వహించడానికి ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జనరల్ సెర్గీ సురోవికిన్‌ను నియమిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇకపై ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్లను ఆయనే ముందుండి నడిపిస్తారని స్పష్టం చేసింది. సురోవికిన్‌ను కొన్ని నెలల క్రితం దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా సేనలకు ఇన్చార్జిగా నియమించారు. ఇప్పుడు పదోన్నతి కల్పించారు. ఆయన గతంలో సిరియాలో రష్యా సైన్యానికి సారథ్యం వహించారు. సిరియాలోని అలెప్పో నగరంలో పెను విధ్వంసానికి సురోవికిన్ ప్రధాన కారకుడన్న ఆరోపణలున్నాయి. -
రష్యాకు మరో ఎదురుదెబ్బ
ఖర్కీవ్: ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంలో రష్యాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే వంతెనపై శనివారం పేలుడు సంభవించి కొంతభాగం దెబ్బతింది. దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా బలగాలకు అవసరమైన యుద్ధ సామగ్రి రవాణాకు ఈ వంతెనే కీలకం. వంతెనను పేల్చేస్తామంటూ పలుమార్లు హెచ్చరికలు చేసిన ఉక్రెయిన్ ఘటనపై అధికారికంగా స్పందించలేదు. అక్కడి అధికారులు, పలువురు నేతలు మాత్రం ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై ప్రత్యేక స్టాంప్ విడుదల చేస్తామని ఉక్రెయిన్ పోస్టల్ శాఖ ప్రకటించింది. గత మేలో రష్యా యుద్ధనౌక మునిగిపోయినప్పుడు పోస్టల్ శాఖ స్టాంపులను విడుదల చేయడం గమనార్హం. ఘటనపై రష్యా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్‌లో స్వాధీనం చేసుకున్న లేమన్ వంటి ప్రాంతాలను కోల్పోయిన రష్యాకు ఇది షాకిచ్చే పరిణామం. ఘటనాస్థలిని రష్యా నిఘా అధికారులు పరిశీలించారు. ‘ట్రక్కు బాంబు పేలుడుతో వంతెనలోని వాహనాలు రాకపోకలు సాగించే రెండు సెక్షన్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంధనం తీసుకెళ్తున్న ఏడు రైల్వే వ్యాగన్లకు మంటలు అంటుకున్నాయి. ముగ్గురు చనిపోయారు’అని తెలిపారు. ఘటనతో రైళ్లు, వాహనాల రాకపోకలను కొద్దిగంటలపాటు నిలిపివేశారు. తాత్కాలిక మరమ్మతుల అనంతరం తిరిగి రాకపోకలను ప్రారంభించారు. 2014లో క్రిమియాను ఆక్రమించిన రష్యా కెర్చ్ జలసంధి మీదుగా యూరప్‌లోనే అత్యంత పొడవైన, 12 మైళ్ల వంతెనను 2018లో నిర్మించింది. రైళ్లు, ఇతర వాహనాలు రాకపోకలకు వీలుగా వంతెనపై రెండు వేర్వేరు సెక్షన్లున్నాయి. ఉక్రెయిన్‌లో తమ సేనలకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ జనరల్ సెర్గీ సురోవికిన్ నేతృత్వం వహిస్తారని వంతెనపై పేలుడు సంభవించిన కొద్ది గంటల్లోనే రష్యా అధికారికంగా ప్రకటించింది. సురోవికిన్ ఇప్పటి వరకు దక్షిణ ఉక్రెయిన్‌లో సేనలకు నాయకత్వం వహిస్తున్నారు. బ్రిడ్జి బాంబింగ్ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేపట్టాలని రష్యా ప్రజాప్రతినిధులు అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు. పుతిన్ ఇందుకు సానుకూలంగా స్పందించిన పక్షంలో అధికార యంత్రాంగానికి విస్తృత అధికారులు దఖలు పడతాయి. ఖర్కీవ్‌పై క్షిపణుల పరంపర ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌పైకి శనివారం వేకువజామునుంచే రష్యా క్షిపణులు దూసుకొచ్చాయి. ఖర్కీవ్ సమీపంలోని మూడు పట్టణాల్లోని నివాస ప్రాంతాల్లో పడటంతో ఒకరు చనిపోయారు. ఈ దాడుల్లో రష్యా ఎస్–300 క్షిపణులను ప్రయోగించినట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు సామగ్రి నిండుకోవడం వల్లే ప్రధానంగా గగనతలం నుంచి భూమిపై లక్ష్యాలను చేధించటానికి వాడే ఈ క్షిపణులను రష్యా ప్రయోగించినట్లు భావిస్తున్నారు. సుమీ ప్రాంతంపై రష్యా ఫిరంగులు, క్షిపణులతో దాడులు కొనసాగించింది. ఖెర్సన్ నుంచి పౌరుల తరలింపు ఉక్రెయిన్ బలగాల తీవ్ర ప్రతిఘటనతో రష్యా బెంబేలెత్తుతోంది. ఇటీవల రఫరెండంతో కలిపేసుకున్న నాలుగు ప్రాంతాల్లో ఒకటైన ఖెర్సన్ నుంచి పౌరులను రష్యాలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. చిన్నారులు, వృద్ధులు తదితరులకు దక్షిణ రష్యాలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉక్రెయిన్ బలగాలతో హోరాహోరీ తప్పదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. -
విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు
మాస్కో: క్రిమియాను రష్యాను కలిపే వంతెనపై భారీ విధ్వంసం జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం 6 గం.లకు ఓ ట్రక్కు పేలడం కారణంగా ఈ భారీ ప్రమాదం సంభవించింది. దీంతో క్రిమియా వైపుగా వెళ్తున్న రైలులోని ఏడు ఇంధన ట్యాంకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విధ్యంసం కారణంగా వంతెన రెండు లైన్లు పాక్షికంగా కూలిపోయాయి. ఈ మేరకు ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియాను రష్యాను కలిపే కీలక వంతెన భారీ కారు బాంబు పేలుడుతో ధ్వంసమైంది. ఈ ఘటనపై రష్యా దర్యాప్తు చేపట్టింది. ఒక ట్రక్కును పేల్చివేయడంతోనే అగ్నికీలలు వ్యాపించినట్లు రష్యా పరిశోధన కమిటి పేర్కొంది. ఈ వంతెనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2018లో ప్రారంభించారు. ఘటనా స్థలానికి డిటెక్టివ్‌లను పంపినట్లు దర్యాప్తు కమిటీ పేర్కొంది. పరిశోధన కమిటీ ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకు కారకులెవరు వంటి వాటిపై ముమ్మరంగా విచారణ సాగిస్తున్నట్లు వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Crimean bridge this morning. pic.twitter.com/chmoUEIxt7 — Anton Gerashchenko (@Gerashchenko_en) October 8, 2022 (చదవండి: షాకింగ్ వీడియో.. కారులో బర్గర్ తింటున్న యువకుడిపై పోలీసు కాల్పులు) -
వంతెనను పేల్చేయించాడు
1948 సెప్టెంబర్ 16 ఉదయం.. మూసీనది పరవళ్లు తొక్కుతోంది. వరద హోరు తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో పెద్ద శబ్దం. దాని తర్వాత వరస శబ్దాలు. చూస్తుండగానే.. సూర్యాపేట – టేకుమట్ల వంతెన నేలకొరిగింది. అద్భుత నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకున్న ఆ రాతి వంతెనను బాంబులు తునాతునకలు చేసేశాయి. సైనికాధ్యక్షుడు జనరల్ ఎడ్రూస్ ప్లాన్. నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాలు. భారత సైన్యాలు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టకుండా అడ్డుకునే ప్రణాళిక ఫలితంగా నిజాం ముచ్చటపడి నిర్మించిన టేకుమట్ల వంతెన కూలిపోయింది. – సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్–విజయవాడ రహదారిపై సూర్యాపేటకు పది కి.మీ. ముందున్న మూసీ నదిపై నిజాం ముచ్చటపడి నిర్మించిన వంతెన అది. మంచి ప్లాన్‌తో అద్భుతంగా నిర్మింపజేశాడా వంతెన. సంస్థానానికి సముద్ర రవాణా లేకపోవటంతో సముద్ర వాణిజ్యానికి మచిలీపట్నం పోర్టే ఆధారం. అందుకే అక్కడి నుంచి భాగ్యనగరానికి విశాలమైన రోడ్డు నిర్మించాడు. పన్నుల వసూళ్లకు వెళ్లేందుకు, పోర్టు వస్తువుల రవాణా, సైనిక పటాలాలు వచ్చి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ‘దండు బాట’గా పిలుచుకునే ఈ రోడ్డుపైనే మూసీ దాటేందుకు అద్భుతంగా వంతెన నిర్మించాడు. సైనికాధికారి ఎడ్రూస్ ప్లాన్.. అయితే 1948 సెప్టెంబర్‌లో భారత సైన్యం దాడికి ఉపక్రమించబోతోందని నిజాంకు సమాచారం వచ్చింది. అప్పటికే ఢిల్లీలోని కొందరు పెద్దలతో నిజాం మంతనాలు జరిపాడు. పెద్దగా ప్రతిఘటించొద్దన్న సంకేతాలొచ్చాయి. దానికి నిజాం కొన్ని షరతులు పెట్టాడు. తుది నిర్ణయంపైనే తర్జనభర్జన నడుస్తోంది(ఇది చరిత్ర పరిశోధకుల మాట). సైనిక చర్యపై నిజాం ఆంతరంగికులలో ముఖ్యుడైన సైనికదళా«దిపతి జనరల్ ఎడ్రూస్ వెంటనే కార్యరంగంలోకి దిగాడు. నిర్ణయం తీసుకునేందుకు నిజాంకు సమయం కావాలని గుర్తించిన ఎడ్రూస్, భారత సైన్యం వెంటనే హైదరాబాద్‌కు చేరకుండా అడ్డుకోవాలనుకున్నాడు. నగరానికొచ్చే ప్రధాన మార్గాలు, సైన్యం ఏయే ప్రాంతాల నుంచి వస్తుందో మ్యాప్ రూపొందించుకున్నాడు. సైన్యాన్ని నిలువరించాలంటే వంతెనలు పేల్చేయడమే మార్గమనే నిర్ణయానికొచ్చాడు. మహారాష్ట్ర నుంచి వచ్చే సైన్యాన్ని అడ్డుకునేందుకు ఉస్మానాబాద్ మార్గంలోని మూడు వంతెనలు గుర్తించాడు. ఒడిశా గుండా వస్తున్న సైన్యాలను, ఆంధ్రాప్రాంతం నుంచి ఖమ్మం మీదుగా వస్తున్న సైన్యాలను ఆపేందుకు టేకుమట్ల వంతెనను పేల్చాలని నిర్ణయించాడు. దీంతో 15 రోజులు సైన్యాన్ని నిలవరించగలమని చెప్పి.. నిజాం ఆమోదంతో వంతెనలు పేల్చేందుకు బృందాలను పంపాడు. అందులో భాగంగా సెప్టెంబరు 16న సూర్యాపేట వంతెనను పేల్చేశారు. ఇంతా చేస్తే ఈ వ్యూహం పారలేదు. కొన్ని దళాలు అనుకున్న సమయానికే హైదరాబాద్‌కు చేరుకోగలిగాయి. మళ్లీ నిర్మాణం.. సైనిక చర్య ముగిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయినప్పటికీ, నాటి కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగిన నిజాం.. సూర్యాపేట వంతెనను పునర్నిర్మింపజేశాడు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆధునిక వంతెనను నిర్మించేవరకు సేవలందించిన ఆ వంతెన.. నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటోందన్నట్టుగా విశ్రాంతి తీసుకుంటోంది. -
ప్రారంభోత్సవం రోజునే పరాభవం... హఠాత్తుగా కుప్పకూలిన వంతెన: వీడియో వైరల్
Bridge collapsed immediately after an official cut the ribbon to inauguration: డెమొక్రెటిక్ రిపబ్లక్ ఆఫ్ కాంగో(డీర్సీ)లో ఒక వంతెన ప్రారంభోత్సవంలో అధికారులు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమంలో చక్కర్లు కొడుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. వాస్తవానికి కాంగ్లోలో వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఒక చిన్న వంతెనను నిర్మించారు. ఆ వంతెన ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. పైగా పెద్ద ఎత్తున్న అధికారులు కూడా వచ్చారు. సరిగ్గా ఒక మహిళా అధికారి రిబ్బన్ కటింగ్ చేస్తుండగా... హఠాత్తుగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అధికారులు అంతా ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బెంబేలెత్తిపోయారు. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై అధికారులను రక్షించి సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అదృష్టవశాత్తు ఎవరు కిందపడిపోలేదు, పైగా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఐతే ఈ వంతెనను మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి నిర్మించారు. కానీ వంతెన నిర్మాణ నాణ్యతల్లో లోపాలు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో... స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున్న ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అదీగాక ఈ వంతెనకు ముందు ఉన్న తాత్కాలికా నిర్మాణం తరుగచుగా కూలిపోతుంటుందని ఒక స్థానిక వార్త సంస్థ పేర్కొనడం గమనార్హం. (చదవండి: యూకే హోం సెక్రటరీగా భారత సంతతి మహిళ)