Viral Video: Huge Explosion On Only Bridge Linking Crimea To Russia - Sakshi
Sakshi News home page

విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు

Published Sat, Oct 8 2022 3:10 PM | Last Updated on Sat, Oct 8 2022 4:49 PM

Viral Video: Huge Explosion On Only Bridge Linking Crimea To Russia - Sakshi

మాస్కో: క్రిమియాను రష్యాను కలిపే వంతెనపై భారీ విధ్వంసం జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం 6 గం.లకు  ఓ ట్రక్కు పేలడం కారణంగా ఈ భారీ ప్రమాదం సంభవించింది. దీంతో క్రిమియా వైపుగా వెళ్తున్న రైలులోని ఏడు ఇంధన ట్యాంకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విధ్యంసం కారణంగా వంతెన రెండు లైన్లు పాక్షికంగా కూలిపోయాయి. ఈ మేరకు ఉక్రెయిన్‌ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియాను రష్యాను కలిపే కీలక వంతెన భారీ కారు బాంబు పేలుడుతో ధ్వంసమైంది.

ఈ ఘటనపై రష్యా దర్యాప్తు చేపట్టింది. ఒక ట్రక్కును పేల్చివేయడంతోనే అగ్నికీలలు వ్యాపించినట్లు రష్యా పరిశోధన కమిటి పేర్కొంది. ఈ వంతెనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 2018లో  ప్రారంభించారు. ఘటనా స్థలానికి డిటెక్టివ్‌లను పంపినట్లు దర్యాప్తు కమిటీ పేర్కొంది. పరిశోధన కమిటీ ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకు కారకులెవరు వంటి వాటిపై ముమ్మరంగా విచారణ సాగిస్తున్నట్లు వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: షాకింగ్‌ వీడియో.. కారులో బర్గర్‌ తింటున్న యువకుడిపై పోలీసు కాల్పులు)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement