Truck bomb
-
విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు
మాస్కో: క్రిమియాను రష్యాను కలిపే వంతెనపై భారీ విధ్వంసం జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం 6 గం.లకు ఓ ట్రక్కు పేలడం కారణంగా ఈ భారీ ప్రమాదం సంభవించింది. దీంతో క్రిమియా వైపుగా వెళ్తున్న రైలులోని ఏడు ఇంధన ట్యాంకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విధ్యంసం కారణంగా వంతెన రెండు లైన్లు పాక్షికంగా కూలిపోయాయి. ఈ మేరకు ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియాను రష్యాను కలిపే కీలక వంతెన భారీ కారు బాంబు పేలుడుతో ధ్వంసమైంది. ఈ ఘటనపై రష్యా దర్యాప్తు చేపట్టింది. ఒక ట్రక్కును పేల్చివేయడంతోనే అగ్నికీలలు వ్యాపించినట్లు రష్యా పరిశోధన కమిటి పేర్కొంది. ఈ వంతెనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2018లో ప్రారంభించారు. ఘటనా స్థలానికి డిటెక్టివ్‌లను పంపినట్లు దర్యాప్తు కమిటీ పేర్కొంది. పరిశోధన కమిటీ ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకు కారకులెవరు వంటి వాటిపై ముమ్మరంగా విచారణ సాగిస్తున్నట్లు వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Crimean bridge this morning. pic.twitter.com/chmoUEIxt7 — Anton Gerashchenko (@Gerashchenko_en) October 8, 2022 (చదవండి: షాకింగ్ వీడియో.. కారులో బర్గర్ తింటున్న యువకుడిపై పోలీసు కాల్పులు) -
అఫ్గాన్‌లో పేలుడు.. ఐదుగురు మృతి
కాబుల్ : అఫ్గానిస్తాన్ తూర్పు భాగంలోని గార్డెజ్ సిటీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, 14 మంది గాయపడ్డారు. గార్డెజ్ సిటీలోని ఓ కోర్టు సమీపంలో పార్క్ చేసి ఉన్న పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్‌ను ఉగ్రవాదులు పేల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్నచోటును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ దాడి వెనక తాలిబన్ల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి : ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్) అయితే ఈ దాడికి రెండు రోజుల ముందే అఫ్గాన్‌లో జరిగిన రెండు వెర్వేరు ఉగ్రదాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం కాబుల్‌లోని మెటర్నరీ ఆస్పత్రిలో జరిగిన కాల్పుల్లో 24 మంది మృతిచెందారు. అదే రోజు తూర్పు నాన్‌గాహార్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో 32 మంది మరణించారు. ఈ ఆత్మహుతి దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ ప్రకటించింది. అఫ్గాన్‌లో జరుగుతున్న వరుస దాడులను ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు. మిలటరీ ఎదురుదాడి విధానాన్ని అవలంబించాలని ఆయన ఆదేశించారు. -
ఉగ్ర ముష్కరుల బీభత్సం
నాలుగు దేశాల్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. టర్కీ, ఈజిప్టు, సొమాలియా, నైజీ రియాల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. దాడుల్లో మొత్తం 80 మంది బలవగా, 200 మంది గాయపడ్డారు. టర్కీ దాడి తమ పనేనని కుర్దిస్తాన్ ఫ్రీడమ్ ఫాల్కన్స, సొమాలియా దాడి తాము చేశామని అల్‌కాయిదా అనుబంధ షబాబ్ గ్రూప్ చెప్పాయి. ఈజిప్ట్ పేలుడుకు కారణం స్థానిక జీహదీలని భావిస్తున్నారు. ఈజిప్టులో 25 మంది.. కైరో: ఈజిప్టు రాజధాని కైరోలోని సెరుుంట్ మార్క్స్ కెథడ్రల్కు అనుకొని ఉన్న సెయింట్ పీటర్ చర్చిపై ఆదివారం శక్తిమంతమైన బాంబు దాడి జరిగింది. 25 మంది మృతిచెందగా, 49 మంది క్షతగాత్రులయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. అంతా ప్రార్థనల్లో ఉన్నప్పుడు బాంబు పేలింది. ప్రార్థనల సమయంలో ఓ మహిళే ఈ బాంబును అమర్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు స్థానిక పత్రిక పేర్కొంది. ఈ దాడి ఎవరు చేసింది ఇంకా తెలియలేదు. అరుుతే జిహాదిస్టులు తరచూ స్థానిక క్రైస్తవ మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారు. టర్కీలో 38 మంది.. ఇస్తాంబుల్: టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఫుట్‌బాల్ మైదానం సమీపంలో శనివారం రాత్రి జరిగిన జంట పేలుళ్లలో 38 మంది మరణించగా, 155 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఫుట్‌బాల్ మ్యాచ్ పూర్తయ్యాక స్టేడియం వెలుపల శక్తివంతమైన బాంబు పేలింది. తర్వాత పార్కులో పోలీసుల వద్ద ఆత్మాహుతి దాడి జరిడింది. నైజీరియాలో బాలికల ఆత్మాహుతి దాడి మైదుగురి: ఈశాన్య నైజీరియాలోని మైదుగురిలో ఆదివారం ఇద్దరు బాలికలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. 17 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాగా, ఆత్మాహుతికి పాల్పడిన బాలికలు ఏడు, ఎనిమిది ఏళ్ల లోపు వారేనని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. రిక్షాల్లో మార్కెట్‌కు వచ్చిన ఇద్దరు బాలికలు పౌల్ట్రీ వైపు వెళ్లి, తమను తాము పేల్చుకోవడం చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించాడు. సోమాలియాలో 20 మంది.. మొగదిషు: సోమాలియా రాజ ధాని మొగదిషులో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మంది చనిపోయారు. పోర్టు ప్రవేశమార్గం వద్ద ఉగ్రవాదులు ట్రక్కు బాంబు పేలుడుకు పాల్పడ్డారు. -
ట్రక్కు బాంబుతో గ్యాస్ స్టేషన్‌పైకి..
-
గ్యాస్ స్టేషన్‌పై ట్రక్కు బాంబుతో దాడి.. 80 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమ బాగ్దాద్‌లోని గ్యాస్ స్టేషన్‌పై ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడు ట్రక్కు బాంబుతో దాడి చేయడంతో భారీ మొత్తంలో ప్రాణనష్టం చోటుచేసుకుంది. 80మందికిపైగా మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారందరూ షియా భక్తులే. పవిత్ర షియా నగరం కర్బాలా నుంచి వస్తుండగా ఉగ్రవాది ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ‘పశ్చిమ బాగ్దాద్ లోని గ్యాస్ స్టేషన్ పై మేం దాడి చేశాం’ అంటూ ఇస్లామిక్ స్టేట్ స్వయంగా ప్రకటించింది. -
ట్రక్కుబాంబు బీభత్సం
ఇరాక్‌లో 67 మంది మృతి బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. వేకువజామున నగరంలోని ప్రధాన మార్కెట్ యార్డు రక్తంతో ఎర్రబారింది. ఉగ్రవాదులు ఓ ట్రక్కులో బాంబు పెట్టి పేల్చివేశారు. 67 మందిని పొట్టనపెట్టుకున్నారు. తామే దాడికి పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ప్రకటించారు. ఇకపై మరిన్ని దాడుల చేస్తామని హెచ్చరించారు. ముస్లిం జాతి కోసం షియాలపై మరిన్ని బాంబు దాడులు చేస్తామన్నారు. షియా ముస్లిం తెగ ప్రాబల్యం అధికంగా ఉండే ఈ మార్కెట్‌కు ప్రతి గురువారం ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలుదారులు వస్తుంటారు. ఉదయం కూరగాయలు, పండ్లు, ఇతర సరుకులు రవాణా చేసే పలు ట్రక్కులు మార్కెట్ ప్రాంగణంలోకి వస్తుండగా వాటిల్లో ఒక ట్రక్కు దూసుకువచ్చి ఒక్కసారిగా పేలింది. 67 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 152 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మార్కెట్లోని పలు కార్లు గాలిలోకి ఎగిరిపడ్డాయి. దుకాణాలు బూడిదయ్యాయి.