ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమ బాగ్దాద్‌లోని గ్యాస్ స్టేషన్‌పై ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడు ట్రక్కు బాంబుతో దాడి చేయడంతో భారీ మొత్తంలో ప్రాణనష్టం చోటుచేసుకుంది. 80మందికిపైగా మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారందరూ షియా భక్తులే. పవిత్ర షియా నగరం కర్బాలా నుంచి వస్తుండగా ఉగ్రవాది ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు.