gas station
-
రష్యాలో భారీ పేలుడు.. 35 మంది మృతి
మాస్కో: ఒకపక్క ఉక్రెయిన్‌తో జరుగుతున్న ఒకపక్క ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో రష్యా తలమునకలై ఉండగా అంతలోనే మరో ఊహించని విపత్తు ఎదురైంది. కాకసాన్ రిపబ్లిక్ అఫ్ దగేస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. దగెస్తాన్ రిపబ్లిక్‌లోని ఓ గ్యాస్ స్టేషన్లో సంభవించిన భారీ పేలుడులో 35 మంది చనిపోగా మరో 115 మంది క్షతగాత్రులయ్యారు. దగెస్తాన్ రాజధాని మఖాచ్కాలా శివారులో సోమవారం రాత్రి ఈ పెను విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో 16 మంది చిన్నారులు సహా 65 మందిని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. మొదటగా కారు రిపేరు షెడ్డులో ప్రారంభమైన మంటలు సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు పాకడంతో పేలుడు సంభవించినట్లు అధికారులు వివరించారు. ఇటీవలి కాలంలో రష్యాలో సంభవించిన అతిపెద్ద పేలుడు ఘటన ఇదే. Dozens of people were killed in Russia's Dagestan region after a fire started at an auto repair shop on a highway and spread to a nearby gas station, officials said https://t.co/u8pA5Iyopa pic.twitter.com/GvHMhlYGMy — Reuters (@Reuters) August 15, 2023 ఇది కూడా చదవండి: స్వాతంత్య్ర వేడుకల్లో హడావుడి అంతా వాళ్లదే -
బెంజ్‌కారులో వచ్చి.. డబ్బులు నేలకేసి కొట్టాడు
Viral Video: డబ్బు మనిషికి అవసరం. కానీ, ఆ డబ్బుతో ఏమైనా చేయొచ్చనే ఆలోచన ఎంతమాత్రం సరికాదనే మంచి మాట ఒకటి ఉంది. డబ్బుంది కదా అని తలపొగరు ప్రదర్శిస్తే.. దానికి కాలమే సమాధానం చెబుతుంది కూడా. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెర్సిడెజ్ బెంజ్‌కారులో వచ్చిన ఓ వ్యక్తి.. ఇంధనం కోసం ఓ బంక్ వద్దకు వచ్చాడు. తీరా ఇంధనం నిండాక.. డబ్బుల్ని అక్కడున్న సిబ్బంది చేతికి ఇవ్వకుండా నేలకేసి విసిరికొట్టాడు. అయితే.. ఆ సిబ్బంది మహిళ మాత్రం సహనం కోల్పోలేదు. నిదానంగా.. ఆ డబ్బులు ఏరి తన బ్యాగ్‌లో వేసుకుంది. ఆపై ఆ కారు ముందుకు వెళ్లిపోగా.. బాధతో కన్నీళ్లు కార్చింది. చైనాలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే రెడ్డిట్ ద్వారా ఈ వీడియో వైరల్ కాగా, పని హడావిడిలో తాను డబ్బు అలా వదిలేసి పోయానే తప్ప.. ఆమెను అవమానించడం తన అభిమతం కాదని ఆ కారు ఓనర్ వివరణ ఇచ్చినట్లు స్థానిక మీడియా ఓ కథనం ప్రచురించింది. కానీ, నెటిజన్లు మాత్రం ఆ సమాధానంతో సంతృప్తి చెందకుండా ఆ కారు ఓనర్‌ను ఏకిపడేస్తున్నారు. -
అమెరికా కాల్పుల్లో హైదరాబాద్ వాసికి గాయాలు
-
కాల్పుల్లో హైదరాబాద్ వాసికి గాయాలు
వాషింగ్టన్ : అమెరికాలోని దోపిడీ దొంగల కాల్పుల్లో హైదరాబాద్ వాసికి గాయాలు అయ్యాయి. టోలిచౌకీకి చెందిన సయ్యద్ బాఖర్ హుస్సేన్ దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు. దీంతో ఆయనను ప్రస్తుతం అమెరికాలోని సౌత్ సుబర్బన్ డాల్టన్ క్రిస్ట్ ఆస్పత్రిలో చేర్చించారు. ఆయన పరిస్థితి కొంత ప్రమాదకరంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. షికాగోలోని డాల్టన్‌లో క్లార్క్ స్టోర్, గ్యాస్ స్టేషన్లోకి దొంగలు చొరబడ్డారు. దోపిడికి యత్నించే క్రమంలో కాల్పులు జరపడంతో అర్షద్ వోహ్రా(19) అనే గుజరాత్‌కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోగా సయ్యద్ బాఖర్ హుస్సేన్ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. అర్షద్ వోహ్రా కుటుంబ సభ్యులు ఈయనకు బంధువులు. కాగా, కాల్పుల్లో తీవ్రంగా గాయపడి బాఖర్ చికిత్స పొందుతున్నారని తెలిపిన ఆయన కుటుంబ సభ్యులు తమకు తెలంగాణ ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. -
గ్యాస్ స్టేషన్లో ఫైర్: వారందరూ హీరోలైపోయారు!
గ్యాస్ స్టేషన్లో నిప్పులంటుకున్నాయంటే.. అక్కడ పనిచేసే వర్కర్లందరూ ఒక్కసారిగా షాకుకు గురై పరుగులు పెడతారు. కానీ చైనాలో ఓ గ్యాస్ స్టేషన్లో మోటార్ సైకిలిస్టు ద్వారా నిప్పంటుకోవడంతో అక్కడ పనిచేసేవారందరూ హీరోలైపోయారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఉద్యోగుల టీమ్ వర్క్ ప్రస్తుతం సోషల్ మీడియా యూజర్ల మన్ననలను పొందుతోంది. వారి చూపించిన ధైర్యసాహసాలకు రివార్డు కింద 65వేల యువాన్లు అంటే 6,11,000 రూపాయలను కూడా అందుకున్నట్టు చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్ వర్క్ రిపోర్టు చేసింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ యిబిన్ లో మే 4వ తేదీన ఉదయం తొమ్మిది నలభై గంటలకు ఈ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ మోటార్ సైకిలిస్టు తన బైకులో ఆయిల్ నింపిన తర్వాత, ఇంధనం నింపే దగ్గరే మంటలు చెలరేగేలా చేశాడు.. వెంటనే స్పందించిన అక్కడి ఉద్యోగి వెంటనే పెనుముప్పు నుంచి బయటపడేందుకు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. ఆ మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉండగానే ఆ మోటార్ సైకిలిస్టు బైకును కిందకి పడేసి, మరింత మంటలు చెలరేగేలా చేశాడు. మంటలు మరింత పైకి ఎగయడంతో అక్కడే ఉన్న ఉద్యోగులందరూ ఏకమై, వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. అదేసమయంలో మోటార్ సైకిలిస్టు ఆ మంటల్లోకి దూకాడు. అతన్ని ఓ వర్కర్ పక్కకు లాగగా.. మిగతా వర్కర్లు మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఓ వ్యక్తి బైకును ఇంధనం నింపే దగ్గర్నుంచి నుంచి పక్కకు లాగేశాడు. ఇలా స్టాఫ్ సభ్యులందరూ చాకచక్యంగా వ్యవహరించిన తీరుతో పెను ముప్పు తప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టు అయిన ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది. ఉద్యోగులను అందరూ కొనియాడుతుండగా.. ప్రమాదానికి కారణమైన మోటార్ సైకిల్ వ్యక్తిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ''గ్రేట్ వర్క్! వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ఆ వ్యక్తిని, గ్యాస్ స్టేషన్ ను రెండింటినీ కాపాడారు'' అని ఓ కామెంటర్ కొనియాడాడు. స్టాఫ్ సభ్యులందరకు హ్యాట్సాప్ అని మరికొందరు ఫేస్ బుక్ యూజర్లంటున్నారు. -
ట్రక్కు బాంబుతో గ్యాస్ స్టేషన్‌పైకి..
-
గ్యాస్ స్టేషన్‌పై ట్రక్కు బాంబుతో దాడి.. 80 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమ బాగ్దాద్‌లోని గ్యాస్ స్టేషన్‌పై ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడు ట్రక్కు బాంబుతో దాడి చేయడంతో భారీ మొత్తంలో ప్రాణనష్టం చోటుచేసుకుంది. 80మందికిపైగా మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారందరూ షియా భక్తులే. పవిత్ర షియా నగరం కర్బాలా నుంచి వస్తుండగా ఉగ్రవాది ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ‘పశ్చిమ బాగ్దాద్ లోని గ్యాస్ స్టేషన్ పై మేం దాడి చేశాం’ అంటూ ఇస్లామిక్ స్టేట్ స్వయంగా ప్రకటించింది. -
అమెరికాలో యువకుడిని కాల్చిచంపిన పోలీసు
బెర్కెలే(అమెరికా): అమెరికాలోని మిస్సోరీలో ఓ యువకుడిని పోలీసు అధికారి కాల్చిచంపడం ఉద్రికత్తతకు దారి తీసింది. తనపై కాల్పులు జరపడానికి తుపాకీ తీయడంతో ఆ యువకుడిపై కాల్పులు జరిపినట్టు పోలీసు అధికారి పేర్కొన్నారు. మిస్సోరీలోని బెర్కెలేలోని ఓ గ్యాస్‌స్టేషన్ వద్ద మంగళవారం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఓ నల్లజాతి యువకుడిని ఓ తెల్లజాతీయుడైన పోలీసు కాల్చిచంపడంతో ఆందోళనలు చెలరేగిన ప్రాంతానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.