Explosion At Gas Station In Russia's Dagestan Few Killed Many Injured - Sakshi
Sakshi News home page

రష్యా గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. 35 మంది మృతి 

Published Tue, Aug 15 2023 12:12 PM | Last Updated on Wed, Aug 16 2023 7:57 AM

Explosion At Gas Station In Russias Dagestan Few Killed Many Injured - Sakshi

మాస్కో: ఒకపక్క ఉక్రెయిన్‍తో జరుగుతున్న ఒకపక్క ఉక్రెయిన్‍తో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో రష్యా తలమునకలై ఉండగా అంతలోనే మరో ఊహించని విపత్తు ఎదురైంది. కాకసాన్ రిపబ్లిక్ అఫ్ దగేస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది.

దగెస్తాన్‌ రిపబ్లిక్‌లోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో సంభవించిన భారీ పేలుడులో 35 మంది చనిపోగా మరో 115 మంది క్షతగాత్రులయ్యారు. దగెస్తాన్‌ రాజధాని మఖాచ్కాలా శివారులో సోమవారం రాత్రి ఈ పెను విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో 16 మంది చిన్నారులు సహా 65 మందిని ఆస్పత్రులకు తరలించారు.

వీరిలో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. మొదటగా కారు రిపేరు షెడ్డులో ప్రారంభమైన మంటలు సమీపంలోని గ్యాస్‌ స్టేషన్‌కు పాకడంతో పేలుడు సంభవించినట్లు అధికారులు వివరించారు. ఇటీవలి కాలంలో రష్యాలో సంభవించిన అతిపెద్ద పేలుడు ఘటన ఇదే.  

ఇది కూడా చదవండి: స్వాతంత్య్ర వేడుకల్లో హడావుడి అంతా వాళ్లదే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement