మాస్కో: తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని విడిచివెళ్లిపోవడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది.
ఇదే సమయంలో ఆయన విమాన ప్రమాదంలో మరణించారనే వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో అసద్ రష్యాలో ఉన్నట్టు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. రష్యా మీడియా ప్రకటనలో ఊహాగానాలకు చెక్ పెట్టినట్టు అయ్యింది.
సిరియాలో తిరుగుబాటు దళాలు డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో సిరియా అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా విమానంలో బయలుదేరారు. అనంతరం, ఆయన విమానం ఆచూకీ తెలియకపోవడంతో ప్రమాదానికి గురైనట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై మొదట రష్యా స్పందిస్తూ.. అసద్ చనిపోలేదని క్లారిటీ ఇచ్చింది. అనంతరం, అసద్ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, మానవతా సాయం కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించినట్టు చెప్పుకొచ్చాయి. ఈ ప్రకటనలో అసద్.. రష్యాలో సురక్షితంగా ఉన్నారని తెలిసింది.
ఇదిలా ఉండగా.. సిరియాలో తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం బషర్ సిరియాను వీడారని రష్యా పేర్కొంది. ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయానికి వచ్చారని, అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలు ఇచ్చారని రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది.
BREAKING: 🇸🇾🇷🇺 Bashar al-Assad and his family are in Moscow, Russia and have been granted asylum. pic.twitter.com/7vO9SBMoGA
— BRICS News (@BRICSinfo) December 8, 2024
Comments
Please login to add a commentAdd a comment