
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన రద్దైంది. మే 9వ తేదీ మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ బదులు.. భారత దౌత్య ప్రతినిధి హాజరవుతారని క్రెమ్లిన్ వర్గాలు ఇవాళ ప్రకటించాయి.
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ మీద సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యా ప్రతీ ఏటా మే 9వ తేదీని విక్టరీ డేగా నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది 80వ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రపంచ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపింది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ వర్గాలు ధృవీకరించాయి కూడా.
అయితే ఆయన బదులు.. ప్రతినిధి హాజరవుతారని ఇప్పుడు ప్రకటన వెలువడింది. అయితే పహల్గాం ఘటన తర్వాత.. పాక్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలోనే మోదీ పర్యటన రద్దై ఉండొచ్చని పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.