పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా! | US Secretary Of State Marco Rubio Dials S Jaishankar, Pak PM | Sakshi
Sakshi News home page

పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!

Published Thu, May 1 2025 10:25 AM | Last Updated on Thu, May 1 2025 1:19 PM

US Secretary Of State Marco Rubio Dials S Jaishankar, Pak PM

వాషింగ్టన్‌ : జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడి అంశంపై పాకిస్తాన్‌కు అమెరికా షాకిచ్చింది. మతిలేని చర్యను వెనకేసుకు రావొద్దని హెచ్చరించింది. పహల్గాం దాడి విషయంలో చేపట్టే దర్యాప్తులో భారత్‌కు సహకరించాలని సూచించింది.  

పహల్గాం ఉగ్రదాడితో భారత్‌ - పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో  అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం..  భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాక్‌ ప్రధాని హహబాద్‌ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

ఫోన్‌ సంభాషణలో రూబియో.. ఉగ్రవాదంపై భారత్‌ తీసుకునే ప్రతి చర్యలో అమెరికా పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అదే సమయంలో పహల్గాంలో  26 మంది ప్రాణాలు తీసిన అమానుష చర్యపై భారత్‌ చేపట్టే దర్యాప్తుకు సహకరించాలని సూచించినట్లు సమాచారం.

 

జైశంకర్‌తో మాట్లాడిన సమయంలో మార్కో రూబియో పహల్గాం దాడి బాధితులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై జరిపే  పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముందు నుంచి పహల్గాం ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని భారత్‌ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పాకిస్తాన్‌తో కలిసి పనిచేయాలని భారత్‌ కృషి చేయాలని కోరారు.  

అందుకు ప్రతిస్పందనగా ఎక్స్‌ వేదికగా జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో  దాడికి పాల్పడ ఉగ్రవాదుల్ని, వాళ్లను పెంచి పోషిస్తున్న వారిని, పహల్గాం ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలి’ అని పేర్కొన్నారు.  

రుబియో  పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో జరిపిన సంభాషణల్లో పాకిస్తాన్‌ పహల్గాం దాడిని ఖండించాలని, దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఈ దాడిపై పాకిస్తాన్ బాధ్యత వహించాలని, భారత్‌తో నేరుగా సంభాషణలు పునరుద్ధరించి శాంతి దిశగా కృషి చేయాలని సూచించినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి తాజా పరిణామలపై భారత్‌ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement