Shehbaz Sharif
-
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్ ప్రధాని
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సమయం అసన్నమవుతోంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, యూఏఈ వేదికలగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్లో అందరి కళ్లు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఈ టోర్నీ మొత్తం ఒక లెక్క.. ఈ దాయుదుల పోరు ఒక లెక్క. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల మధ్య పాక్-భారత్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి.దీంతో ఈ రెండు జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు మరి కొన్ని రోజుల్లో తెరపడనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ జట్టుకు దిశానిర్దేశం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఎంత ముఖ్యమో, టీమిండియాను ఓడించడం అంతే ముఖ్యమని షరీఫ్ ఉద్ఘాటించారు. శుక్రవారం రాత్రి లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాలా బాగుంది. ఇటీవల కాలంలో ఆటగాళ్లు సైతం అద్బుతంగా రాణిస్తున్నారు. కానీ ఇప్పుడు వారికి అసలైన సవాలు ఎదురు కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే కాకుండా మన చిరకాల ప్రత్యర్ధి భారత్‌పై విజయం సాధించాలి. దేశం మొత్తం మీ వెనక ఉంది. అల్ ది బెస్ట్ అంటూ" షరీఫ్ పేర్కొన్నారు. కాగా షరీఫ్ వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు గట్టిగా కౌంటరిస్తున్నారు. మీకు అంత సీన్ లేదులే.. ముందు గెలిచి మాట్లాడండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా గత రెండు ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌ను భారత్ మట్టికర్పించింది. వన్డే ప్రపంచకప్-2023లో దాయాదిని చిత్తు చేసిన భారత్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో మాత్రం పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది.ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్చదవండి: రోహిత్ ప్రాక్టీస్ ఆపేయ్.. ఫస్ట్ ఆ పనిచేయు: భారత మాజీ క్రికెటర్ -
ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)అధినేత ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారుల ఆందోళనతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ మద్దతుదారులు ఆదివారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖా ముఖ్యమంత్రి అలీ అమీన్ నేతృత్వం వహించిన ఈ కవాతు సోమవారం సాయంత్రం నాటికి ఇస్లామాబాద్ చేరుకుంది.సోమవారం రాత్రి లక్షలాది తరలి వచ్చిన ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. నిరసన కారులు రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. రహదారులను మూసివేశారు. ఇస్లామాబాద్ చుట్టూ బారీకేడ్లు ఏర్పాటుచేశారు. తొలగించుకుంటూ నిరసనకారులు ముందుకు రాగా టియర్ గ్యాస్ ప్రయోగించి కట్టడి చేశారు. దీంతో ఆందోళన కారులు పోలీసులపై దాడికి పాల్పడటంతో అయిదుగురు భద్రతా సిబ్బంది మరణించినట్లు, అనేకమంది గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు.పంజాబ్ ప్రావిన్స్‌లో నిరసనకారులు చేసిన దాడిలో ఒక పోలీసు అధికారి మరణించగా, 119మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. 22 పోలీసు వాహనాలకు నిప్పంటించారని తెలిపారు. ఆందోళనకారుల్లోనూ నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ నిరసనలు మంగళవారం కూడా కొనసాగుతుండటంతో పాక్ వ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది. -
విషెస్ చెప్పి విమర్శలపాలైన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ప్రజలకు సుద్దులు చెప్పే నేతలు తాము మాత్రం నిబంధనల్ని బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తారన్న విమర్శలు నిజమని పాక్ ప్రధాని నిరూపించారు. వేర్పాటువాద శక్తులు విరివిగా ఉపయోగిస్తూ దేశంలో అస్థిరకతకు కారణమవుతున్నారని, అందుకు పరోక్షంగా కారణమైన ‘ఎక్స్’సోషల్ మీడియాపై నిషేధం విధిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దానిని అమలుచేస్తోంది కూడా. అయితే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయనాదం చేసిన ట్రంప్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’వేదికను వినియోగించుకోవడం విమర్శలకు తావిచ్చింది. స్వయంగా ప్రభుత్వాధినేతనే సొంత నిర్ణయాలకు విలువ ఇవ్వనప్పుడు ప్రజలేం పట్టించుకుంటారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. -
పాకిస్తాన్లో జై శంకర్.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం
ఇస్లామాబాద్: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సదస్సుకు హాజరయ్యేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం పాకిస్తాన్ చేరుకున్నారు. ఆయనకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాకిస్తాన్ సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో జై శంకర్ మావేశమయ్యారు.సభ్యదేశాల అతిథుల కోసం షరీఫ్ ఏర్పాటు చేసిన విందులో ఇరువురు నేతలం కరచాలనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. సభ్యదేశాల నుంచి అగ్రనేతలు పాల్గొంటున్న ఈ సమ్మిట్‌లో ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ, సామాజిక-సాంస్కృతిక సంబంధాల్లో సభ్యదేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. #WATCH | Islamabad: Pakistan PM Shehbaz Sharif welcomes EAM Dr S Jaishankar and other SCO Council Heads of Government, to a dinner hosted by him.EAM is in Pakistan to participate in the 23rd Meeting of SCO Council of Heads of Government.(Video Source: PTV) pic.twitter.com/BHtUhuLm9e— ANI (@ANI) October 15, 2024ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇస్లామాబాద్, రావల్పిండిలో కీలక మార్గాలు, వ్యాపారాలను మూసివేశారు. ఇదిలా ఉండగా భారత్-పాక్ మధ్య సంబంధాలు సన్నగిల్లిన క్రమంలో భారత సీనియర్ మంత్రి ఆదేశంలో అడుగుపెట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2015 డిసెంబర్లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆప్ఘనిస్థాన్‌లో సదస్సు కోసం ఇస్లామాబాద్ వెళ్లారు.Landed in Islamabad to take part in SCO Council of Heads of Government Meeting. pic.twitter.com/PQ4IFPZtlp— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 15, 2024 -
ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలే
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించిన పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బదులిచ్చింది. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలను స్వయంగా ఆహ్వానించినట్లే అవుతుందన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు ఉగ్రవాద దాడులపై పాకిస్తాన్ వేలిముద్రలు ఉన్నాయని స్పష్టంచేసింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో శుక్రవారం భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ మాట్లాడారు. ఇదే సభలో తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆర్టికల్ 370పై మాట్లాడారు. దీనిపై భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించారు. సైన్యం పెత్తనం కింద నలుగుతూ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేసే దేశమైన పాకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడడం ఏమటని నిలదీశారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా రిగ్గింగ్‌లు జరిగే దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. భారతదేశ భూభాగాన్ని కబళించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఆటంకాలు సృష్టించడానికి ఉగ్రవాదాన్ని నమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదానికి, మాదక ద్రవ్యాల వ్యాపారానికి, చీకటి నేరాలకు మారుపేరైన పాకిస్తాన్‌కు భారత్ గురించి నోరువిప్పే అర్హత లేదని భవిక మంగళానందన్ పరోక్షంగా హెచ్చరించారు.పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఒక ఆయుధంగా ప్రయోగిస్తోందన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని పేర్కొన్నారు. తమ దేశ పార్లమెంట్‌పై, ఆర్థిక రాజధాని ముంబై నగరంపై, మార్కెట్లపై, యాత్రా మార్గాలపై దాడులు చేసిన నీచ చరిత్ర పాకిస్తాన్ ఉందని నిప్పులు చెరిగారు. అలాంటి ధూర్త దేశం హింస గురించి నీతులు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. -
పాక్‌కు ఘాటుగా బదులిచ్చిన భారత్
పొరుగు దేశం పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఐక్యరాజ్య సమితి వేదికగా మన దేశంపై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. అయితే ఈ ఆరోపణలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది.ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడటమేంటో? అని మన దేశపు దౌత్యవేత్త భవిక మంగళానందన్ ప్రశ్నించారు.‘‘ఈ ప్రపంచ వేదిక దురదృష్టవశాత్తూ అవాస్తవాలను వినాల్సి వచ్చింది. పాక్ ప్రధాని భారత్ గురించి ప్రస్తావించడంపై ఇవాళ మేం స్పందిస్తున్నాం. సుదీర్ఘకాలంగా పొరుగు దేశాలపై సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఒక ఆయుధంగా ఉపయోస్తోంది. ఆ విషయం అందరికీ తెలుసు. అలాంటి దేశం హింస గురించి మాట్లాడటం వంచనే అవుతుంది.ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది. వాస్తవమేంటంటే.. ఆ దేశం మా భూభాగాన్ని కోరుకుంటోంది. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోంది. మిలిటరీ సాయంతో నడుస్తూ.. ఉగ్రవాదం విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన పాక్, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడటమా?’’ అని భవిక అన్నారు. Watch: India exercises its Right of Reply at the 79th session of the @UN General Assembly debate.@DrSJaishankar @MEAIndia pic.twitter.com/c6g4HAKTBg— India at UN, NY (@IndiaUNNewYork) September 28, 2024 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో సాధారణ చర్చ సందర్భంగా.. పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో తమ దేశంలోని సమస్యలను వదిలేసిన షరీఫ్.. కేవలం కశ్మీర్ గురించే సుదీర్ఘంగా మాట్లాడారు. పాలస్తీనా ప్రజల మాదిరిగానే జమ్ము ప్రజలు కూడా స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నారని అన్నారు. అలాగే.. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ.. శాంతిస్థాపన కోసం 2019 ఆగస్టులో భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలన్నారు. -
పాక్ నోట మళ్లీ పాతపాట
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ మరోసారి కశీ్మర్ ప్రస్తావన తెచి్చంది. దీర్ఘకాలిక శాంతి కోసం భారత్ ఆరి్టకల్ 370ని పునరుద్ధరించాలని, జమ్మూకశీ్మర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్ తన సైనిక సంపత్తిని భారీగా పెంచుకుంటోందని ఆరోపించారు. ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి షరీఫ్ శుక్రవారం ప్రసంగించారు. ఆరి్టకల్ 370, హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది బుర్హాన్ వనీల ప్రస్తావన తెచ్చారు. ‘పాలస్తీనియన్ల లాగే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా తమ స్వాతంత్య్రం, స్వీయ నిర్ణయాధికారం కోసం శతాబ్దకాలంగా పోరాడుతున్నారు’ అని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీరీల అభిమతానికి అనుగుణంగా, ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా జమ్మూకశీ్మర్పై భారత్ చర్చలకు రావాలన్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ దూరంగా జరిగిందని ఆరోపించారు. స్వీయ నిర్ణయాధికారం జమ్మూకశీ్మర్ ప్రజల ప్రాథమిక హక్కని, దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని భద్రతా మండలి తీర్మానాలు చెబుతున్నాయని అన్నారు. భారత్‌కు బ్రిటన్ మద్దతు ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వముండాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ మద్దతు పలికారు. భారత్ డిమాండ్‌కు అమెరికా, ఫ్రాన్స్‌లు ఇదివరకే మద్దతు పలికిన విషయం తెలిసిందే. ప్రపంచ ఐక్యవేదిక మరింత ప్రాతినిధ్యంతో, మరింత స్పందనతో కూడి ఉండాలని స్టార్మర్ ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. -
పాక్ నాయకత్వానికి అసలు పరీక్ష
ఎన్నికలపై రాజకీయ గందరగోళం, వివాదాలతో కూడిన వాతావరణంలో పాకిస్తాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధానిగా తన రెండవ పదవీ కాలంలో, షెహబాజ్ షరీఫ్ బలహీనమైన ఆరు పార్టీల సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇది పాలనాపరమైన పని నుండి ప్రభుత్వ దృష్టిని మరల్చగలదు. ఆందోళనా రాజకీయాలను ఆశ్రయించాలని ‘పీటీఐ’ భావించడం కూడా పాలక కూటమికి సవాలే. పరిపాలనలో సైనిక వ్యవస్థ అజమాయిషీ కూడా ప్రభుత్వ అధికారాన్ని పరిమితం చేసేదే. ఇక ఆర్థిక సవాలు, అత్యంత ముఖ్యమైనది. పాక్ దారుణమైన సంక్షోభంలో ఉంది. అయితే, కఠినమైన ఆర్థిక చర్యల ద్వారా భారత్ సహా పలు దేశాలు భయంకరమైన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాయని గుర్తుంచుకోవాలి.పూర్తి మెజారిటీ లేని నాయకుడిగా షెహ బాజ్ షరీఫ్ తన ప్రభుత్వ మనుగడ కోసం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)పై ఆధారపడ్డారు. ఈ పార్టీ కేబినెట్లో చేరడానికి నిరాకరిస్తూ ప్రభుత్వానికి మద్దతునిచ్చింది. దీని అర్థం ఏమిటంటే, పీపీపీ, ఇతర మిత్రపక్షాలను సంతోషంగా ఉంచడానికీ, వారి డిమాండ్లను నెరవేర్చడానికీ ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలలో నిమగ్నమై ఉంటుంది. ఆందోళనా రాజకీయాలను ఆశ్రయించాలని పాకిస్తాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) భావిస్తున్నందున ఇది పాలక కూటమికి నిరంతరం సవాలును విసురుతుంది. జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షం పెద్ద కూటమిగా ఏర్పడినందున పార్లమెంటరీ వ్యవహారా లను నిర్వహించే పనిని అది మరింత కష్టతరం చేస్తుంది. అసెంబ్లీ ప్రారంభ సెషన్లలో పీటీఐ మద్దతుగల జాతీయ అసెంబ్లీ సభ్యుల విఘాతకరమైన ప్రవర్తన, రాబోయే పరిణామాల స్వరూపాన్ని సూచి స్తోంది. ప్రత్యేకించి వారు ప్రతి సెషన్ లోనూ నిరసనలు తెలుపుతామని తేల్చి చెప్పారు. ఈ ఘర్షణ శాసన నిర్మాణానికి అడ్డంకులుగా మారు తుంది. పైగా పార్లమెంట్ కార్యకలాపాలను కూడా స్తంభింపజేస్తుంది. పరిపాలనలో సైనిక వ్యవస్థ అజమాయిషీ కూడా ప్రభుత్వ అధికా రాన్ని పరిమితం చేస్తుంది. తన మునుపటి పదవీకాలంలో, షెహబాజ్ షరీఫ్ సైనిక వ్యవస్థకు చాలా ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడు ఏదైనా ముఖ్యమైన మార్గంలో దానిపై తిరగబడడం లేదా దాని పాత్రను తగ్గించడం అసంభవం. కాబట్టి దేశం ఎలా నడుస్తుందనే అంశంపై సైన్యం అజమాయిషీ కొనసాగుతుందని దీని అర్థం. తర్వాత క్లిష్టమైన ప్రాదేశిక ముఖచిత్రం కూడా ఉంది. రాష్ట్రాలకు సంబంధించి పిఎమ్ఎల్–ఎన్ ఒక ప్రావిన్ ్సను మాత్రమే నియంత్రి స్తోంది. మిగిలిన మూడు ప్రావిన్సులను వేర్వేరు పార్టీలు నియంత్రి స్తున్నాయి. పైగా ఖైబర్ పఖ్తున్క్వాలో పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం కొనసాగుతోంది. ఇది కూడా కొత్త ప్రభుత్వానికి పరిమితులు విధిస్తుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను నిర్వహించడం ఒక స్పష్టమైన సవాలుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆచరణాత్మకమైన తత్వం, దృఢంగా వ్యవహరించడం మధ్య తెలివైన కలయిక అవసరం. అయితే దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ పరిమితులు ఏవీ ప్రభుత్వాన్ని నిరోధించకూడదు. ఏదేమైనా, అది ప్రభుత్వ బాధ్యత. దీని కోసం, ప్రధానమంత్రి తన మునుపటి పదవీకాలంలో నియమించిన విచిత్రమైన, సంఖ్యరీత్యా పెరిగి పోయిన క్యాబినెట్‌ను కాకుండా, ఒక సమర్థమైన బృందాన్ని ఎంచు కోవాలి. స్పష్టమైన, పొందికైన విధాన ఎజెండాను రూపొందించాలి. ఆర్థిక సవాలు, వాస్తవానికి అత్యంత ముఖ్యమైనది. పాకిస్తాన్ భారీ విదేశీ రుణ సేవా బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుండి కోరుకోవాల్సింది పొందేందుకు షరీఫ్ ప్రభుత్వం కఠినమైన, రాజకీయంగా బాధాకరమైన నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్థిక సవాలు తీవ్రమైనది అయినప్పటికీ ఈ సంక్షోభంలోనూ ప్రభుత్వం ఒక అవకాశాన్ని చూడాలి. ఎక్కువ రుణాలు తీసుకోవడం, ఉద్దీపనలు, సంస్కరణలను వాయిదా వేయడం, అధిక స్థాయి రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సృష్టించకుండా ఎక్కువ రుణాలు సేకరించడం– ఇవన్నీ పాక్ రహదారిపై మరొక సంక్షోభానికి మాత్రమే హామీ ఇస్తాయి. వృద్ధి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి లేదా రికార్డు స్థాయి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విషయంలో ఏమీ చేయదు. కాబట్టి రోగాన్ని దాచిపెట్టే బ్యాండ్ ఎయిడ్ విధానం, ఏ విధంగానూ ఇప్పుడు ఆమోదయోగ్యం కాదు. ప్రత్యామ్నాయంగా ఈ సంక్షోభాన్ని విస్తృత శ్రేణి నిర్మాణాత్మక సంస్కరణలను ప్రారంభించడానికీ, ఆర్థిక వ్యవస్థను విష వలయం నుండి బయట పడేయటానికీ ఉపయోగించవచ్చు. నిలకడలేని ఆర్థిక అసమతుల్య తలు, భారీ దేశీయ, విదేశీ రుణాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ పొదుపులు, పెట్టుబడి, స్తంభించిన వృద్ధి– ఇవన్నీ ఈ విషవలయంలో భాగమే. ప్రపంచంలోని పలు దేశాలు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న దాని కంటే భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. కానీ అవి సంక్షోభాన్ని బలంగా, మరింత స్థితిస్థాపకంగా తిరిగి లేచినిలబడేలా ఉపయోగించుకోగలిగాయి. 1997లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఆగ్నేయాసియా దేశాలు ప్రాథమిక సంస్కరణలను చేపట్టడం ద్వారా, కఠినమైన ఆర్థిక చర్యలతో నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించడం ద్వారా గట్టెక్కాయి. అదేవిధంగా, 1990లలో భారతదేశం, 1980లు, 1990లలో అనేక లాటిన్ అమెరికన్ దేశాలు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. అవి తర్వాత కోలుకోవడమే కాకుండా పటిష్టమైన వృద్ధి బాటలో పయనించగలిగాయి. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాయి. ప్రతి సందర్భంలోనూ, దీర్ఘకాల నిబద్ధత చూపుతూ, స్థిరమైన విధానాలను ఈ దేశాల నాయకులు అమలుపరిచారు. అతుకుల బొంత పరిష్కారాలు నిజానికి పరిష్కారాలే కావనీ, నిర్మా ణాత్మక సర్దుబాట్లు, కఠినమైన ఆర్థిక విధానం, ఇతర సంస్కరణ చర్యలు ముందుకు సాగడానికి చాలా అవసరమనీ విశ్వసించిన సమర్థ బృందాల దన్నుతో నాయకులు తగు చర్యలు ప్రారంభించారు. స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడానికి తక్షణ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మరొక సంక్షోభం కూడా షరీఫ్ ప్రభుత్వానికి సవాలుగా నిలుస్తుంది. ఇది మానవాభివృద్ధిలో సంక్షోభం. అక్షరాస్యత, విద్య, ఆరోగ్యం, పేదరికం, సామాజిక న్యాయం, మానవ సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలు ఇటీ వలి సంవత్సరాలలో క్షీణిస్తున్నాయి. ప్రపంచ మానవాభివృద్ధి ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ గణనీయంగా పడిపోవడంతో ప్రపంచ బ్యాంక్ దీనిని ‘నిశ్శబ్ద, లోతైన మానవ మూలధన సంక్షోభం’గా పేర్కొంది. అత్యధిక సంఖ్యలో బడి మానేసిన 2 కోట్లకు పైగా పిల్లలతో ప్రపంచంలోనే పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉందనే భయంకరమైన వాస్తవం, దాని విద్యా అత్యవసర పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. 40 శాతం మంది నిరక్షరాస్యులతో అక్షరాస్యత స్థాయిలు నిలిచి పోయాయి. అంతకుముందటి సంవత్సరంతో పోలిస్తే 2023లో 1.25 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని అంచనా. మానవ అభివృద్ధికి సంబంధించిన పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇది దేశ స్థిరత్వం, ఆర్థిక పురోగతి గొప్ప ప్రమాదంలో పడనుందనే వాస్తవాన్ని తెలియజేస్తోంది. పాకిస్తాన్ నిద్రలో నడుచుకుని వెళ్తూ విపత్తులో పడిపోవచ్చని సూచిస్తుంది. ఈ సవాళ్లను నిండు రాజకీయ వాతావరణంలోనే పరిష్కరించవలసి ఉంటుందనీ, ప్రభుత్వ అధికారంపై ఉన్న పరిమితులు, ప్రధాన విధాన చర్యలను అమలు చేయగల దాని సామర్థ్యంపై భారంగా పడతాయనీ అంగీకరించాలి. రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడానికీ, కీలక చర్యలపై రాజకీయ ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడానికీ ప్రభుత్వం మార్గాలను అన్వేషించాలి. ఇది సులభం కాదు. ప్రభుత్వ సంకీర్ణ భాగస్వాములు కఠినమైన ఆర్థిక చర్యల నుండి తమను తాము దూరం చేసుకోవాలనుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన నాయకులను వారి పోరాట మార్గం నుండి తప్పించడం కూడా అంతే కష్టం. అందుకే, షెహబాజ్ షరీఫ్‌కు ఇది నాయకత్వ పరీక్ష. మలీహా లోధి వ్యాసకర్త పాకిస్తాన్ దౌత్యవేత్త; ఐరాసలో పాక్ మాజీ ప్రతినిధి (‘ద డాన్’ సౌజన్యంతో) -
Pakistan General Elections 2024: పాక్ ప్రధానిగా షహబాజ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్–ఎన్ నేత షెహబాజ్ షరీఫ్(72) ఎన్నికయ్యారు. నూతన ప్రధానిని ఎన్నుకోవడానికి పాకిస్తాన్ పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 336 ఓట్లకు గాను çషహబాజ్ షరీఫ్‌కు 201 ఓట్లు లభించాయి. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్‌కు కేవలం 92 ఓట్లు దక్కాయి. షెహబాజ్ షరీఫ్‌కు సాధారణ మెజార్టీ కంటే 32 ఓట్లు అధికంగా లభించడం విశేషం. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సంకీర్ణ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహించబోతున్నారు. పీఎంఎల్–ఎన్, పీపీపీ కూటమికి ముత్తహిదా ఖ్వామీ మూవ్మెంట్, పాకిస్తాన్ ముస్లిం లీగ్(క్యూ), బలూచిస్తాన్ అవామీ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్(జెడ్), ఇస్తెఖామ్–ఇ–పాకిస్తాన్ పార్టీ, నేషనల్ పార్టీ మద్దతిస్తున్నాయి. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పార్లమెంట్ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. షహబాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఓటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులైన కొందరు ఎంపీలు సభలో అలజడి సృష్టించారు. అనంతరం షహబాజ్ మాట్లాడుతూ కశ్మీర్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. కశ్మీరీల, పాలస్తీనియన్ల స్వాతంత్య్రం కోసం ఒక్కటి కావాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. వారి స్వేచ్ఛను కోరుతూ పార్లమెంట్లో తీర్మానం చేయాలన్నారు. -
పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం తరఫున షెహబాజ్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్ ప్రధానమంత్రిగా ఆయన ఎన్నిక కావటం ఇది రెండోసారి. షెహబాజ్ షరీఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఎన్నికైనట్లు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం పతనమైన తర్వాత షెహబాజ్ షరీఫ్.. మొదటి సారి ప్రధాని అయ్యారు. షెహబాజ్‌షరీఫ్ నేషనల్ అసెంబ్లీలో 201 ఓట్ల సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 169 ఓట్లు. జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ మద్దతు గల ఒమర్ అయూబ్ 92 ఓట్లకే పరిమితమయ్యారు. ఇక.. ఇటీవల జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో 265 స్థానాలకుగాను పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు 93, పీఎంఎల్ఎన్ 75, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 53, ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం)కి 17 సీట్లు వచ్చాయి. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టోకు చెందిన పీపీపీలు కూటమిగా ఏర్పాడ్డాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించి.. ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్‌ను ప్రకటించింది. తాజాగా ఆదివారం జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా గెలుపొందారు. -
‘పాక్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దు’
వాషింగ్టన్: పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న వేళ.. అగ్రరాజ్య చట్ట సభ్యులు పెద్ద షాకే ఇచ్చారు. ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దంటూ అధ్యక్షుడు జో బైడెన్‌కు డెమొక్రటిక్ సభ్యులు లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. అమెరికా ఆ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని లేఖలో పేర్కొన్నారు వాళ్లంతా. ఫిబ్రవరి 8 నాటి పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేవరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని లేఖలో బైడెన్ చట్టసభ్యులు కోరారు. ‘‘పోలింగ్‌కు ముందు, తరువాత రిగ్గింగ్ జరిగిందనే దానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన దర్యాప్తు జరిగేవరకు వేచి చూడండి. అంతవరకు ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దు. లేనిపక్షంలో ఆ దేశాధికారుల ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సమర్థించినట్లవుతుంది. అది అక్కడి ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తిని తక్కువ చేసినట్లే’’ అని లేఖలో ప్రస్తావించారు వాళ్లు. బైడెన్‌తో పాటు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను ఉద్దేశించి సంయుక్త లేఖ రాశారు వాళ్లు. ‘‘ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్‌ఖాన్‌కు జైలు శిక్షలు విధించారు. ఆ పార్టీ అభ్యర్థులకు స్వతంత్రులుగా పోటీ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. పీటీఐ శ్రేణులు.. పోలీసు దాడులు, అరెస్టులు, వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల తుది ఫలితాల విడుదలలో జాప్యం అనుమానాలకు కారణమైంది. ఫలితాలు తారుమారైనట్లు ఆరోపణలు ఉన్నాయి’’ అని 33 మంది చట్టసభ్యులు తెలిపారు. ఇందులో ప్రోగ్రెసివ్ కాకస్ ఛైర్పర్సన్, భారత సంతతికి చెందిన ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో భారీఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు గురువారం పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. అదే సమయంలో.. మెజారిటీ రాకపోయినా కూటమి రూపేణా ప్రభుత్వ ఏర్పాటునకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ సిద్ధమైంది. షరీఫ్ సోదరుడు.. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం పాక్ నూతన ప్రధానిగా ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పరిణామాల మధ్య అగ్రరాజ్య చట్టసభ్యుల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
పాక్ రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్
ఇస్లామాబాద్: తీవ్ర గందరగోళం.. రిగ్గింగ్ ఆరోపణల నడుమ ఎన్నికలు పూర్తి చేసుకున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి కాబోయే ప్రధాని ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే అస్పష్టతతో కూడిన ఫలితాలతో.. అనిశ్చితి నెలకొన్న పాకిస్థాన్‌లో రాజకీయం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఇప్పటికే నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ ప్రభుత్వ ఏర్పాటునకు తీవ్రంగా యత్నిస్తుండగా.. ప్రతిపక్ష పాత్రకైనా రెడీ అని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మద్ధతుదారులు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లోకి దిగడం విశేషం. మెజారిటీ రాకున్నా.. మిత్రపక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP)తో.. మరికొన్ని చిన్నచిన్న పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది ముస్లిం లీగ్ నవాజ్(PML-N) యత్నిస్తోంది. తన సోదరుడిని షెహబాజ్‌ను ఎలాగైనా మరోసారి ప్రధానిని చేయాలని నవాజ్ షరీఫ్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈలోపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భలే ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మద్ధతుగా ఆయన మద్ధతుదారులు.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇండిపెండెంట్లు కావడంతో వాళ్లకు ప్రభుత్వ ఏర్పాటునకు వీలు లేకుండా పోయింది. దీంతో.. ప్రతిపక్ష పాత్రకే వీళ్లంతా పరిమితం కావొచ్చనే చర్చ నడిచింది. ఈ లోపు.. పీటీఐ వర్గం ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. అయితే.. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీని పాక్ ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. దీంతోనే వాళ్లు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి నెగ్గారు. అక్కడి నిబంధనల ప్రకారం.. పాక్ ఎన్నికల్లో నెగ్గిన ఒక పార్టీకి గెలిచిన సీట్ల సంఖ్యకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఖాన్ మద్ధతుదారులంతా స్వతంత్ర అభ్యర్థులుగా గెలవడంతో.. ఆ వర్గానికి రిజర్వ్డ్ సీట్లు దక్కవు. అందుకే ఒక పార్టీగా వాళ్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పాక్‌లో ఇస్లామిక్ పొలిటికల్ పార్టీస్ గ్రూప్‌గా పేరున్న ‘‘ఇస్లామిక్ పొలిటికల్ అండ్ రెలిజియస్ పార్టీస్ గ్రూప్’’లోని ఓ చిన్న పార్టీ అయిన సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్(SIC). ఈ పార్టీలో చేరేందుకు ఖాన్ మద్దతుదారులంతా సిద్దం అయ్యారు. ఎస్ఐసీ తరఫున ఆ పార్టీ చైర్మన్ సయ్యద్ మహ్ఫూజ్ ఒక్కరే మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఈ కూటమిలో చేరడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది పీటీఐ ప్లాన్‌గా స్పష్టం అవుతోంది. ‘‘ఈ కూటమికి గనుక అనుమతి లభిస్తే.. పాకిస్థాన్‌లోని వివిధ ప్రావిన్స్‌లోనే కాదు కేంద్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి పీటీఐ చేరుకుంటుంది’’ అని పీటీఐ తరఫున ప్రధాని అభ్యర్థి అయూబ్ ఖాన్ చెబుతున్నారు. ‘‘మా సభ్యులంతా సున్నీ ఇత్తేహద్‌కౌన్సిల్‌లో చేరాలని నిర్ణయించుకున్నాం. ఈ మేరకు చర్చలు సఫలం అయ్యాయి. మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని అయ్యేందుకు అవకాశమూ లేకపోలేదు’’ అని పీటీఐ చైర్మన్(ఆపద్ధర్మ) గోహర్ అలీఖాన్ మీడియాకు తెలిపారు. ఈ వారంలోనే ఎస్ఐసీలో చేరేందుకు దరఖాస్తులను పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారాయన. ఒకవేళ.. ఈ కూటమికి గనుక పాక్ ఈసీ అంగీకరిస్తే మాత్రం.. పాక్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. -
సైన్యం ప్రతిష్ఠను దిగజార్చిన తీర్పు
పాకిస్తాన్ తర్వాతి ప్రధానిగా మరోసారి షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. నాలుగోసారి ప్రధాని అవుతారని భావించిన నవాజ్ షరీఫ్ ఉన్నట్టుండి తన సోదరుడు షెహబాజ్ పేరును ముందుకు తెచ్చారు. అయితే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ మద్దతు ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చినందున, పాలనా సామర్థ్యానికి సంబంధించిన సమస్యలు అలాగే ఉంటాయి. ఇక, ఈ ఎన్నికలు పాక్‌లో సైన్యం ప్రాబల్యం తగ్గిందని సంకేతిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్‌కు ముఖ్యమైనవే. ఆ దేశంతో మన సంబంధాలు సుప్తావస్థలో ఉండవచ్చు. కానీ అవి ఎప్పటికీ అలాగే ఉండవు. ఏ రకమైన ప్రపంచ శక్తిగా ఎదగడానికైనా, ఉపఖండ శాంతి, ఆర్థిక ఏకీకరణ మనకు చాలా కీలకం. ఇస్లామిక్ రిపబ్లిక్ గమ్యానికి మధ్యవర్తిగా తన ప్రాబల్యాన్ని పాకిస్తాన్ సైన్యం రాను రానూ కోల్పోతోందని ఇటీవలే ముగిసిన ఆ దేశ ఎన్నికలకు చెందిన ఆశ్చర్యకరమైన ఫలితాలు సూచిస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం దేశాన్ని వాస్తవంగా నడిపిన మయన్మార్ సైన్యం... ఇప్పటి వరకూ ప్రజాస్వామ్య, వేర్పాటువాద శక్తులకు వ్యతిరేకంగా విజయవంతంగా పోరాడుతూ వచ్చినప్పటికీ వెనుకపట్టు పడుతోంది. మన దేశ తూర్పు సరిహద్దులలో జరుగుతున్న దానితో పోలిస్తే పాకిస్తాన్ పరిణామాలు కూడా మరీ భిన్నమైనవేమీ కాదు. ప్రస్తుత తరుణంలో రాబోయే కాలంలో పాక్ రాజకీయాలు ఎలా రూపుదిద్దుకుంటాయో చెప్పడం కష్టమే. నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్– నవాజ్’(పీఎంఎల్–ఎన్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’(పీపీపీ) కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన ‘పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్’ (పీటీఐ) మద్దతు ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చినందున, పాలనా సామర్థ్యానికి సంబంధించి తీవ్రమైన సమస్యలు అలాగే ఉంటాయి. ఇమ్రాన్ పార్టీని అణిచివేసేందుకు ఉద్దేశించిన చర్యలను ఆ పార్టీ నామినీలు అధిగమించి అత్యుత్తమ పనితీరు కనబరిచారు. అసమానతలకు వ్యతిరేకంగా వారు ప్రదర్శించిన పోరాట పటిమ మన దేశ ప్రతిపక్షానికి కూడా ప్రేరణగా ఉపయోగపడుతుంది. ఎన్నికల ఫలితాలను చూస్తే పాకిస్తాన్ సైన్యం పెద్ద ఎత్తున పట్టు కోల్పోయిందని చెప్పవచ్చు. 2023 మే 9న ఇమ్రాన్ అరెస్టు తర్వాత, ఆయన పార్టీ మద్దతుదారులు దేశవ్యాప్తంగా హింసకు పాల్పడి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, పాకిస్తాన్ పంజాబ్‌లోని సైనిక స్థావరాలపై కూడా దాడి చేసిన సంఘటనలను గుర్తు చేసుకోండి. ఈ పరిణామాలన్నీ భారత్‌కు ముఖ్యమైనవే. పాకిస్తాన్ ప్రభు త్వంతో మన సంబంధాలు తీవ్రమైన సుప్తావస్థలో ఉండవచ్చు. కానీ అవి ఎప్పటికీ అలాగే ఉండలేవు. పాకిస్తాన్ తనకుతాను మునిగిపోనీ లేదా తేలియాడనీ అని భావించేవారు నిజంగానే భ్రమలో ఉన్నారు. ఏ రకమైన ప్రపంచ శక్తిగా ఎదగడానికైనా సరే, ఉపఖండ శాంతి, ఆర్థిక ఏకీకరణ అనేవి మన భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి. భారత్, పాకిస్తాన్ సంబంధాలు ఇటీవలి కాలంలో ఆసక్తికరమైన దశలో ఉన్నాయి. ఒకవైపు పాకిస్తాన్ జిహాదీల చొరబాట్లు, వారి దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు, పాకిస్తాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి చేరువ కావడానికి ప్రయత్నించింది. ఈలోగా, ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’(ఎఫ్ఏటీఎఫ్) ఒత్తిడితో, హఫీజ్ సయీద్(లష్కర్–ఎ–తైయబా సహ వ్యవస్థాపకుడు)కు పాక్ 31 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే (లష్కర్–ఎ–తైయబా మరో వ్యవస్థాపకుడు) జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి కూడా వరుసగా మూడు ఐదేళ్ల జైలు శిక్షలు విధించారు. ఇక, 2008 ముంబై దాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మీర్‌ను కూడా పాకిస్తాన్ ‘దొరికించుకుని’ దోషిగా నిర్ధారించింది. 2023 జనవరిలో, అప్పటి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (నవాజ్ షరీఫ్ తమ్ముడు) దేశంలో అంధకార స్థితి మధ్య ‘మేము మా గుణపాఠం నేర్చుకున్నాము. మా నిజమైన సమస్యలను పరిష్కరించు కోగలిగితే, మేము భారతదేశంతో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాము’ అని ప్రకటించారు. కానీ మరుసటి రోజే, కశ్మీర్ రాజ్యాంగ హోదాను భారతదేశం పునరుద్ధరించనంత వరకూ ఎటువంటి సంభా షణా సాధ్యం కాదని పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఆ తర్వాత, భారత ప్రభుత్వం ఆమోదించిన ఆర్టికల్ 370 రద్దును మన సుప్రీం కోర్ట్ సమర్థించింది. జమ్మూ – కశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కూడా పిలుపునిచ్చింది. కానీ అది కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లేని కొత్త సరిహద్దులను కలిగి ఉంటుంది. వాస్తవానికి, పుల్వామాలో సైనికులపై దాడి, ఆర్టికల్ 370 రద్దు కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి ముందే, రెండు దేశాలు ఐఎస్ఐ(పాకిస్తాన్ గూఢచార సంస్థ) మాజీ డిప్యూటీ చీఫ్‌తోనూ, భారతీయ ఇంటెలిజెన్ ్స అధికారితోనూ తెరవెనుక సంభా షణను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాయి. తర్వాత, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఒకానొక గల్ఫ్ దేశంలో అప్పటి ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను కలిశారు. 2021లో ప్రధాని మోదీ పాకిస్తాన్ పర్యటనకూ, సింధ్‌లోని హింగ్లాజ్ మాతా ఆలయాన్ని సందర్శించడానికీ ప్రణాళికలు రూపొందాయి. కానీ అంతలోనే పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత 2022లో, ఆయన పదవి నుండి తొలగించబడ్డారు. మోదీ, నవాజ్ షరీఫ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, ఆ సంబంధాల సూత్రాలను ఎంచుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది. 2015లో ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు భారత ప్రధాని లాహోర్‌లో దిగి నప్పటి నుంచీ చాలా పరిణామాలే జరిగాయి. ముఖ్యంగా, 2019 బాలాకోట్ వైమానిక దాడులు, తీవ్రవాద దాడి జరిగినప్పుడు పాక్‌పై దాడి చేయడానికి న్యూఢిల్లీ వెనుకాడదని స్పష్టంగా సూచించింది. భారత్ కంటే పాకిస్తాన్‌కే ఇప్పుడు శాంతియుత సరిహద్దు అవసరం. దాని ఆర్థిక పరిస్థితి భయంకరంగా కొనసాగుతోంది; జిహాదీ తీవ్రవాద ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది; అంతర్జా తీయ సమాజం దాని పగ్గాలను బిగించడానికి ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ను ఉపయోగిస్తోంది. పైగా, అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల అధికార స్వీకారం నుండి ఆశించిన ప్రయోజనాలు కార్యరూపం దాల్చలేదు. బదులుగా ఇరాన్ తో పాకిస్తాన్ ప్రమాదకరమైన గొడవకు దిగింది. అమెరికా, చైనా తమ సొంత కారణాల వల్ల, పాకిస్తాన్ లో ఉమ్మడి ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ప్రధానంగా, అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక ఆరోగ్యం చాలా అవసరం. కాబట్టే, ఈ రెండు దేశాలూ, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను మాత్రమే కాకుండా, పాక్–అఫ్గాన్ ప్రాంతం తీవ్ర వాదులకు పుట్టిల్లు కాకుండా ఉండే వాతావరణాన్ని కోరుకుంటు న్నాయి. తన బీఆర్ఐ (బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్) పెట్టుబడులు ఉన్నప్పటికీ, తాను మాత్రమే పాకిస్తాన్ ఆర్థిక శ్రేయస్సుకు హామీ ఇవ్వలేననీ, ఇతర దేశాలు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) కూడా ముఖ్యమైన పాత్ర పోషించాలనీ చైనా గ్రహించింది. అమె రికాకు పాకిస్తాన్ ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా ఉన్నదనీ, వాషింగ్టన్ కూడా పాక్‌లో లోతైన ప్రయోజనాలను కలిగి ఉందనీ కూడా చైనీయులకు తెలుసు. ఇస్లామిక్ స్టేట్ బలపడుతున్న అఫ్గాని స్తాన్‌లో ఏమి జరుగుతోందో తెలుసుకోవడానికి అమెరికాకు పాకిస్తాన్ ఒక ముఖ్యమైన సాధనం. సైనిక కోణంలో భారత్ విషయానికొస్తే, భారతదేశ చర్యలు గత మూడేళ్లలో పాకిస్తాన్ నుండి చైనా వైపు దృష్టిని మరల్చినట్లు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, పాకిస్తాన్ సరిహద్దును ప్రశాంతంగా ఉంచడం భారతదేశ ప్రయోజనాలలో భాగం. పాకిస్తాన్ మూలంలోనే పూర్తిగా గడబిడ ఉంటుంది. ఒక ఉన్నత స్థాయి బ్యాక్ ఛానల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మరోసారి చర్చలు ప్రారంభించడమే మార్గం. ప్రబలమైన ఘర్షణను తగ్గించడం, రెండు దేశాల మధ్య సంబంధాలకు గానూ కొత్త విధానాన్ని రూపొందించడం తదుపరి కర్తవ్యం. మనోజ్ జోషీ వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, న్యూఢిల్లీ ‘ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నవాజ్ షరీఫ్ అనూహ్య నిర్ణయం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) తరఫున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు, మాజీ ప్రధాని అయిన షహబాజ్ షరీఫ్ (72)ను నామినేట్ చేశారు. దీంతో షహబాజ్ మరోసారి పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగోసారి పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ (74) బాధ్యతలు చేపడతారని అంతా ఊహిస్తున్న వేళ ఈ షాకింగ్ నిర్ణయం వెలువడింది. పీఎంఎల్-ఎన్ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు తన ఎక్స్(ట్విటర్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. తమ అధినేత నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు మరియం తెలియజేశారు. అలాగే.. నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ (50)ను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎంఎల్-ఎన్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. پاکستان مسلم لیگ (ن) کے قائد جناب محمد نوازشریف نے وزیراعظم اسلامی جمہوریہ پاکستان کے عہدے کےلئے جناب محمد شہبازشریف کو نامزد کر دیا ہے جبکہ وزیراعلی پنجاب کے عہدے کےلئے محترمہ مریم نوازشریف کو نامزد کیا ہے۔ جناب محمد نوازشریف نے پاکستان کے عوام اور سیاسی تعاون فراہم کرنے والی… — Marriyum Aurangzeb (@Marriyum_A) February 13, 2024 وزیر اعظم شہباز شریف وزیراعلیٰ مریم نواز pic.twitter.com/kW3MbqmRCv — Badar Shahbaz 🇵🇰🇵🇸 (@BSWarraich) February 13, 2024 పాక్ జాతీయ అసెంబ్లీలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన సీట్లు రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో పాక్ సైన్యం ఆశీస్సులున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto) నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)తో చర్చలు జరిపింది. అయితే బిలావల్ భుట్టో జర్దారీ ప్రధాని పదవి ఆశిస్తున్నారని, ఇరు పార్టీలు ప్రధాని పదవిని పంచుకోవాలని వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో పాక్ ప్రధాని పదవి రేసు నుంచి పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో తాజాగా వైదొలిగినట్లు ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో తమ పార్టీ భాగమవ్వకుండానే.. ‘పీఎంఎల్-ఎన్’ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇదీ చదవండి: ప్రభుత్వంలో చేరబోం ఈ క్రమంలో షరీఫ్ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన తన తమ్ముడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. 265 స్థానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలుపొందారు. పీఎంఎల్-ఎన్ 75 స్థానాల్లో, పీపీపీ 54 స్థానాల్లో గెలుపొందింది. -
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. మూడు రోజులు ముందుగానే
ఇస్లామాబాద్: గత కొన్నాళ్లుగా పాకిస్తాన్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితులు దిగజారడం, అవినీతి ఆరోపణల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కావడం వంటి ఘటనలు వల్ల ఎప్పటికప్పుడు ఆ దేశం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా బుధవారం రాత్రి పాక్ ప్రభుత్వం జాతీయ అసెంబ్లీని రద్దు చేసింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు అరీఫ్ అల్వీకి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. అంతకుముందు ఇస్లామాబాద్‌లో ఫెడరల్ క్యాబినెట్ చివరి సమావేశానికి కూడా ప్రధాని అధ్యక్షత వహించారు. బుధవారం నేషనల్ అసెంబ్లీలో తన వీడ్కోలు ప్రసంగంలో, షరీఫ్ మాట్లాడుతూ.. ఈ రాత్రి, సభ అనుమతితో, జాతీయ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన సలహాను అధ్యక్షుడికి పంపుతాను అని పేర్కొన్నారు. దీంతో పాక్ పార్లమెంట్ దిగువసభతో పాటు ముస్లిం లీగ్- నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజుల ముందుగానే రద్దు అయ్యింది. ఈ నేపథ్యంలో త్వరలోనే పాక్‌లో ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా అయితే పాక్ ప్రభుత్వం పదవీ కాలం పూర్తయిన తర్వాత రెండు నెలలులోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ, ముందస్తుగానే జాతీయ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఎన్నికల నిర్వహనకు 90 రోజుల సమయం ఉంది. చదవండి: ప్రపంచ బ్యాంక్‌లో తెలుగమ్మాయి -
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అసెంబ్లీని రద్దు చేసే ముందు ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రతిపక్ష నాయకుడు రజా రియాజ్ తో ఈరోజు సమావేశం కానున్నారు. వీరిద్దరూ కలిసి ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దు తర్వాత పాక్ ఆపద్ధర్మ ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తారు. ఆగస్టు 11న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దు విషయాన్ని రాష్ట్రపతి అరిఫ్ అల్వి దృష్టికి తీసుకెళ్తూ ఆయనకు లేఖ రాయనున్నారు ప్రస్తుత ప్రధాని షెబాజ్ షరీఫ్. అంతకు ముందే అసెంబ్లీ రద్దయిన తర్వాత ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించడానికి, ఎన్నికలు నిర్వహించడానికి తాత్కాలిక ప్రధానిని నియమించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఇందులో భాగంగా ఆయన ప్రతిపక్ష నేత రజా రియాజ్ తో ఈరోజు చర్చించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే షెబాజ్ షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తారు. తాత్కాలిక ప్రధాని రేసులో ఉన్నవారిలో మాజీ ఆర్ధిక శాఖ మంత్రి హఫీజ్ షేక్, నవాజ్ షరీఫ్ వద్ద ఆర్ధిక కార్యదర్శిగా పనిచేసిన తరీక్ బజ్వా, 2018లో తాతకాలిక ప్రధానిగా పని చేసిన మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ, పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి తస్సాదక్ హుస్సేన్ జిలాని, మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాకేబుల్ బఖీర్, నవాజ్ షరీఫ్ వ్యక్తిగత సహాయకుడు ఫవాద్ హాసన్ ఫవాద్, మాజీ విదేశాంగ శాఖమంత్రి హుస్సేన్ హరూన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. డిసెంబరులో పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల ఏర్పాటుకు కొంత సమయం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో అసెంబ్లీని రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం. ప్రభుత్వం రద్దైన మరుక్షణమే పాకిస్తాన్ ఎలక్షన్ కమీషన్ రంగంలోకి దిగి తదుపరి ప్రభుత్వ ఎన్నిక కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. పూర్తి పదవీకాలం పూర్తైన తర్వాత అయితే ఎన్నికలు 60 రోజుల్లోనే నిర్వహిచాల్సి ఉంటుంది. అలా కాకుండా ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే మాత్రం పాక్షితం ఎన్నికల కమిషన్ కు 90 రోజుల గడువు ఉంటుంది. ఈలోపే వారు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: 27 ఏళ్ల తర్వాత థాయ్ యువరాజు రీఎంట్రీ.. అందు కోసమేనా? -
భారత్‌తో చర్చలకు సిద్ధమే: షెహబాజ్
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఇరు దేశాల్లో పేదరికం, నిరుద్యోగంతో పోరాడుతున్న నేపథ్యంలో యుద్ధం అనేది మార్గం కాదన్నారు. పాకిస్తాన్ మినరల్స్ సమ్మిట్ సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమంలో షెహబాజ్ పాల్గొన్నారు.. ఆర్థికంగా కుదేలైన దేశంలో విదేశీ పెట్టుబడుల కోసం ఉద్దేశించిన ఈ సదస్సులో హెహబాజ్ మాట్లాడుతూ పాకిస్తాన్ కోలుకోవడం కోసం ఇరుగు పొరుగు దేశలన్నింటితోనూ తాము మాట్లాడతామని, పొరుగు దేశంతో యుద్ధం అనేది ఇక మార్గం కాదన్నారు. భారత్‌తో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కశ్మీర్ అంశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రేరేపిస్తూ ఉండడంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. -
మా పార్టీ గెలిస్తే మా అన్నే పీఎం: షెహబాజ్
ఇస్లామాబాద్: రానున్న ఎన్నికల్లో తమ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్–ఎన్) మరోసారి విజేతగా నిలిచిన పక్షంలో తన సోదరుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధానిగా పగ్గాలు చేపడతారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. లండన్‌లో గడుపుతున్న నవాజ్ çస్వదేశానికి త్వరలో వస్తారన్నారు. సాధారణ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా తటస్థుడిని తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేస్తామన్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరనే విషయమై భాగస్వామ్య పార్టీలతోపాటు, పీఎంఎల్–ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపాక నిర్ణయిస్తామని తెలిపారు. -
పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా ఇషాఖ్ దార్!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్ (73) పేరు తెరపైకి వచి్చంది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ పదవీ కాలం ఆగస్టు 14న ముగియనుంది. కానీ 8వ తేదీనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా ఆదివారం వెల్లడించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఇషాఖ్ దార్‌ను ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగిస్తారని తెలియజేసింది. ఆయన పేరును అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పార్టీ ప్రతిపాదించింది. పాక్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పుల కోసం, విదేశాల నుంచి పెట్టుబడుల కోసం ప్రయతి్నస్తోంది. రుణాలు, పెట్టుబడులతో ఆర్థికంగా కుదురుకోవడానికి చాలా సమయం పట్టనుంది. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు షరీఫ్ ప్రభుత్వం ఇష్టపడడంలేదు. అందుకే ఆపద్ధర్మ ప్రభుత్వంతో నెట్టుకురావాలని భావిస్తోంది. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అసెంబ్లీ పదవీ కాలం పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, జాతీయ అసెంబ్లీని పదవీ కాలం ముగియక ముందే రద్దు చేస్తే 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించవచ్చు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే దాకా ఆపద్ధర్మ ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు. ఆపద్ధర్మ ప్రధానిగా ఇషాఖ్ దార్ నియామకంపై పాకిస్తాన్ ప్రభుత్వం వచ్చేవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
వన్డే వరల్డ్‌కప్ ఆడడంపై ఉన్నతస్థాయి కమిటీ: పీసీబీ
భారత్ గడ్డపై అక్టోబర్-నవంబర్‌లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. 10 వేదికల్లో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియాతో పాటు అన్ని జట్ల మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ఇక చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్, టీమిండియాలు వన్డే వరల్డ్‌కప్‌లో అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడబోతున్నాయని ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వన్డే వరల్డ్‌కప్ విషయంలో మరోసారి ఆసక్తికర ప్రకటన చేసింది. టోర్నీలో పాల్గొనే విషయంపై ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) కూడా భారత్‌లో పర్యటించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలోని ఈ కమిటీ.. ప్రపంచకప్ కోసం భారత్‌లో పాక్ పర్యటించే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. భారత్-పాకిస్థాన్‌లకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ కమిటీ చర్చించి తుది నివేదికను ప్రధానికి అందించనుంది. మరోవైపు పీసీబీ తాత్కాలిక ఛైర్మన్ జకా అష్రాఫ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ తసీర్.. డర్బన్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం వెళ్లారు. భద్రతా కారణాలు చూపించి.. పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్ పదే పదే విముఖత వ్యక్తం చేస్తున్న విషయాన్ని వారు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. భారత్-పాక్‌లు ఐసీసీ, ఆసియా కప్‌లలో మాత్రమే తలపడుతున్న విషయం తెలిసిందే. చదవండి: #BANVsAFG: సెంచరీలతో చెలరేగిన ఆఫ్గన్ ఓపెనర్లు.. ప్రపంచ రికార్డు -
పాక్ ప్రధానికి వినబడేలా.. మోదీ స్ట్రాంగ్ మెసేజ్
న్యూఢిల్లీ: ఉగ్రవాదం అనేది ఒక ప్రాంతానికే కాదు.. యావత్ ప్రపంచ శాంతికి ప్రమాదకారి. అలాంటి ఉగ్రవాద కట్టడిలో ద్వంద్వ వైఖరి అసలు పనికిరాదు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించడానికి కూటమి వెనుకాడకూడదు.. అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సందేశం ఇచ్చారు. మంగళవారం జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సులో(వర్చువల్)కి భారత్ అధ్యక్షత వహించింది. మన దేశం తరపున ప్రధాని మోదీ ఈ సదస్సులో ప్రసంగించారు. ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే.. కజకస్థాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్(కొత్త సభ్యదేశంగా చేరింది) ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ఎస్సీవో సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ.. నిర్ణయాత్మకమైన చర్యల ద్వారా ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్‌లకు అడ్డుకట్ట వేయాలని పిలుపు ఇచ్చారాయన. పరస్సర సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని సభ్య దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారాయన. ఉగ్రవాదంపై సమిష్టింగా మనమంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఏమాత్రం సరికాదంటూ దాయాది దేశం పాక్‌కు చురకలంటించారాయన. ఇక ఇదే వేదిక నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సంక్షోభాలు.. సమస్యలపైనా ప్రధాని మోదీ చర్చించారు. 1996లో చైనా, కజకస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజికిస్తాన్ల పంచ దేశాల కూటమితో షాంగై ఫైవ్ ఆవిర్భవించింది. దానికి కొససాగింపుగా ఏర్పడిందే SCO. ప్రస్తుతం ఇందులో తొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి. 2005 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో పరిశీలన దేశంగా భారత్ కొనసాగుతూ వస్తోంది. అయితే.. 2017లో ఆస్తానాలో జరిగిన సదస్సు ద్వారా పూర్తి సభ్యత్వ దేశంగా భారత్ మారింది. ఇదీ చదవండి: ఒకే ఫొటో.. అంత మందికి ఎలాగబ్బా? -
పాక్ ప్రధాని అనుచిత ప్రవర్తన.. మహిళ ఆఫీసర్ దగ్గర గొడుగు లాక్కుని.. వీడియో వైరల్..
ప్యారిస్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అనుచితంగా ప్రవర్తించారు. సమావేశానికి హాజరవ్వడానికి వెళ్లిన క్రమంలో ఆహ్వనానికి వచ్చిన మహిళ అధికారి వద్ద గొడుగు లాక్కున్నారు. పాపం.. వర్షం కారణంగా గొడుగు పట్టడానికి వచ్చిన ఆ మహిళ ఉద్యోగిని తడుస్తూనే ప్రధాని వెంట నడిచింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. Prime Minister Muhammad Shehbaz Sharif arrived at Palais Brogniart to attend the Summit for a New Global Financial Pact in Paris, France. #PMatIntFinanceMoot pic.twitter.com/DyV8kvXXqr — Prime Minister's Office (@PakPMO) June 22, 2023 సమావేశ భవనాన్ని చేరడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ కారు దిగారు. వర్షం కారణంగా ఆయనకు గొడుగు పట్టడానికి కారు డోర్ దగ్గరే ఓ మహిళ అధికారి రెడీగా ఉంది. ప్రధాని కారు దిగగానే తడవకుండా గొడుగు పట్టింది. అయితే.. ఆయన ఆ గొడుగును ఆమె నుంచి తీసుకునే ప్రయత్నం చేయగా.. అసౌకర్యం కలగకుండా తానే పడతానన్నట్లుగా గొడుగును ఎత్తే ప్రయత్నం చేసింది. కానీ షెహబాజ్ షరీఫ్ ఆమె నుంచి గొడుగును లాక్కున్నారు. తానే గొడుగు పట్టుకుని సమావేశ భవనానికి వెళ్లారు. ఏం చేయాలో తెలియక ఆ మహిళ ఉద్యోగిని అధ్యక్షుడి వెంటే వర్షంలో తడుస్తూ నడిచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Why did he leave the woman in the rain? Shehbaz sharif is such an embarrassment. Yaaar kis cartoon ko PM bana diya hai inho ne. 😂 pic.twitter.com/kPzOmXSvQG — Saith Abdullah (@SaithAbdullah99) June 22, 2023 ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ప్రధాని అనుచిత ప్రవర్తనపై పాక్ సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మహిళను వర్షంలోనే ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రధాని ఎలా అయ్యారని నెట్టింట విమర్శల వర్షం కురిపించారు. What a disgraceful embarrassment this man is! #Titanic #ShehbazSharif pic.twitter.com/91hpulmBkL — bushra (@Bushra2k7) June 22, 2023 ఇదీ చదవండి: యుద్ధానికి సై అంటారు, మమ్మల్ని పట్టించుకోరు.. ఆదుకోండి ప్లీజ్!: పాక్ ప్రధాని -
రక్షించండి ప్రభో! పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. పాక్ ప్రధాని ఆవేదన
పాకిస్థాన్‌లో నగదు నిల్వలు అడుగంటిపోయాయి. ఐఎమ్ఎఫ్ నుంచి రావాల్సిన నగదు అందకపోవడంతో ఆ దేశం పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీనిపై తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్యారిస్ వేదికగా స్పందించారు. 'యుద్దాలకు ఇవ్వడానికి ప్రపంచ రుణదాతల దగ్గర డబ్బులు ఉంటాయి.. కానీ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌కు ఇవ్వడానికి మాత్రం ఉండవు' అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యారిస్‌లో రెండు రోజులపాటు జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్‌లో ఈ మేరకు ఆయన మాట్లాడారు. 'యుద్ధం జరుగుతున్న దేశానికి ఏమైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలకు కూడా కావాల్సినవన్నీ సమకూర్చుతారు. వేల మంది ప్రాణాలను రక్షించడానికి మాత్రం నిధులను ఇవ్వడానికి వెనకంజ వేస్తారు. పాకిస్థాన్ విషయానికి వచ్చే సరిగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి సంపన్న దేశాలు. మా దేశంలో ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది' అని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది వరదలతో నష్టపోయిన పాక్‌ను రక్షించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి వేల కోట్లు సొంత జేబు నుంచి ఖర్చు చేశామని షెహబాజ్ షరీఫ్ గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్ చర్చలు జరుపుతుంది. ప్రధానంగా వాతావరణ విపత్తుల కారణంగా చితికిపోయిన దేశాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుంటుంది. జూన్ చివరి నాటికి ఐఎమ్ఎఫ్ నుంచి పాక్‌కు రావాల్సిన 6.5 బిలియన్ డాలర్ల రుణ కార్యక్రమం గడువు ముగుస్తుంది. గత సంవత్సరం నవంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న 1.1 బిలియన్ డాలర్ల రుణాన్నైనా విడుదల చేయాలని ఐఎమ్ఎఫ్కు షరీఫ్ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి నిలిచిపోయిన నిధులపై ప్రశ్నించగా తనను పాక్ ఆర్థిక మంత్రి చెంపపై కొట్టాడని ఓ విలేఖరి ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: State Dinner Menu: వైట్ హౌస్‌లో మోదీకి అదిరే ఆతిథ్యం.. డిన్నర్ మెనూలో ఏముందంటే.. -
నవాజ్ పాక్ తిరిగొచ్చి, నాలుగోసారి ప్రధాని అవ్వాలి: షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు తిరిగి రావాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల కోసం పార్టీ తరపున ప్రచారాన్ని ముందుండి నడిపించాలని, అంతేగాక నాలుగోసారి పాక్ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పీఎంఎల్ఎన్ పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎన్నికలు రాబోతున్న దృష్ట్యా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రధాని షెబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తన అన్నయ్య నవాజ్ షరీఫ్ రాక కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. పాక్‌కు తిరిగి వచ్చి పార్టీ సమావేశాలను నిర్వహించాలని, ఎన్నిక ప్రచారానికి నాయకత్వం వహించాలని కోరారు. PML-N అధ్యక్షుడి బాధ్యతలను తిరిగి అతనికి అప్పగిస్తానని పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ పాక్‌కు తిరిగి వచ్చాక రాజకీయాల మ్యాప్ మారుతుందని తెలిపారు. కాగా పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సుప్రీంకోర్టు రివ్యూ ఆఫ్ జడ్జిమెంట్స్ అండ్ ఆర్డర్స్ యాక్ట్ 2023పై సంతకం చేసిన కొన్ని వారాల తర్వాత ఈ షెహబాజ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇది 60 రోజుల్లోగా నవాజ్ షరీఫ్ తనజీవితకాల అనర్హతలకు వ్యతిరేకంగా అప్పీల్ హక్కును వినియోగించుకోవడానికి మొదటి దశను క్లియర్ చేస్తుంది. ఈ కొత్త చట్టం ద్వారా ఆర్టికల్ 184(3) ప్రకారం కేసుల్లో కోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయవచ్చు. గతంలో ఇచ్చిన తీర్పులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది, మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్ పనామా షరీఫ్‌పై పేపర్ల కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టు జూలై 28, 2017న అనర్హత వేటు వేసింది. అతడిని జీవితకాలం ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించకుండా నిషేధం విధించింది. ఏడాది తర్వాత,ఎన్నికల చట్టం 2017ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును ప్రకటిస్తూ.. ఆర్టికల్ 62, 63 ప్రకారం అనర్హత వేటు పడిన ఏ వ్యక్తి కూడా రాజకీయ పార్టీ అధినేతగా పనిచేయలేరని కోర్టు పేర్కొంది. దీంతో PML-N అధ్యక్షుడిగా షెహబాజ్ షరీఫ్ చేపట్టారు. కాగా ఆరోగ్య కారణాల రీత్యా నవాజ్ షరీఫ్ నవంబర్ 2019 నుంచి లండన్‌లో నివాసం ఉంటున్నారు. చదవండి: నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్.. -
పార్లమెంట్ విశ్వాసం పొందిన పాక్ పీఎం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం పార్లమెంట్‌లోని దిగువసభ నేషనల్ అసెంబ్లీ విశ్వాసం పొందారు. మొత్తం 342 మంది సభ్యులకుగాను 180 మంది షరీఫ్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. షరీఫ్ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థకు మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సమయంలో ఈ పరిణామం సంభవించింది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన సమయంలో షరీఫ్‌కు 174 మంది సభ్యులు మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం. పంజాబ్, ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్ అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ)కి అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించిన బిల్లును నేషనల్ అసెంబ్లీ ఇటీవల తిరస్కరించిన నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమయింది. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు జరపాలంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ గట్టిగా పట్టుబడుతోంది. -
పాక్ ప్రధాని ఇంట్లోకి చొరబడ్డ అఫ్ఘాన్ వ్యక్తి.. భద్రతపై విమర్శల వెల్లువ
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారిక నివాసంలోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఎలా వచ్చాడో గానీ ప్రధాని ఇంట్లోకి చొరబడి భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు అఫ్ఘాన్ వాసిగా పేర్కొన్నారు అధికారులు. అతను మూడు వేర్వేరు మార్గాల గుండా ప్రధాని నివాసంలోకి చొరబడినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన సీసీఫుటేజ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అత్యంత భద్రతతో కూడిన ప్రధాని అధికారిక నివాసంలోకి ఎలా చొరబడ్డాడు అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని విచారణ నిమిత్తం ఉగ్రవాద నిరోధక విభాగానికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: గర్భంలో ఉండగానే కరోనా సోకిన పసికందులకు దెబ్బతిన్న మెదడు) -
ఇటలీ పడవ ప్రమాదంలో 24 మందికి పైగా పాకిస్తానీలు గల్లంతు
ఇటలీ సముద్ర జలాల్లో వలసదారులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ప్రమాదంలో 59 మంది గల్లంతవ్వగా, వారిలో 24 మంది పాకిస్తానీలు ఉన్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఈ ప్రమాదం నుంచి సుమారు 81 మంది ప్రాణాలతో బయటపడగా, ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స తీసుకుంటున్న వ్యక్తితో సహా 20 మంది ఆస్పత్రి పాలైనట్లు ఇటాలియన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 58 మృతదేహాలను వెలికితీశారని, 61 మంది ప్రాణాలను రక్షించినట్లు వెల్లడించారు. టర్కీ నుంచి బయలుదేరిన ఈ చెక్క పడవలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు డజన్ల మందికి పైగా పాకిస్తానీయులు మునిగిపోయారన్న నివేదికలు త్రీవ ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వాస్తవాలను నిర్థారించాలని విదేశాంగ కార్యాలయాన్ని ఆదేశించారు. కాగా, మానవ స్మగ్లర్లు యూరప్‌లోకి వలసదారులను అక్రమంగా రవాణా చేయడానికి ఉపయోగించే మార్గాలలో టర్కీ ఒకటి. (చదవండి: ఇటలీ సముద్ర జలాల్లో పడవ మునక ) -
‘తప్పట్లేదు.. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస వద్దు’
గత కొంత కాలంగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆ దేశ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది పాక్. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన పొదుపు చర్యల్లో భాగంగా తమ మంత్రులు ఇకపై 5-స్టార్ హోటళ్లలో బస, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేయవద్దని స్పష్టం చేసింది. కీలక నిర్ణయం.. అవి బంద్ ఇస్లామాబాద్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ.. ‘మనం సమయానుకూలంగా నడుచుకోవాలి. కాలం మన నుంచి ఏమి కోరుతుందో వాటిని ఇవ్వాల్సి ఉంటుందని’ షరీఫ్ అన్నారు. పెరుగుతున్న అప్పులు, ప్రపంచ ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరతల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు గతంలో ప్రభుత్వం తన ఉద్యోగుల జీతాలను తగ్గించడంతో పాటు సమాఖ్య మంత్రుల సంఖ్యను మరింత తగ్గించింది. వీటితో పాటు మంత్రిత్వ శాఖలు, విభాగాల ఖర్చులను చాలా వరకు అరికట్టింది. దీంతోపాటు లగ్జరీ వస్తువులు, కార్ల కొనుగోలుపై కూడా వచ్చే ఏడాది వరకు పాక్ ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. అంతేకాకుండా ప్రభుత్వం ఖర్చు తగ్గించే చర్యలలో $764 మిలియన్ల ప్రణాళికను కూడా పాటిస్తోంది. తద్వారా ఐఎంఎఫ్ నుంచి నిధులు పొందాలనే ఆలోచనలో ఉంది. సబ్సిడీలను తొలగించాలని ఐఎంఎఫ్ చేసిన అభ్యర్థనను అనుసరించి, పాకిస్తాన్ లగ్జరీ దిగుమతులపై సుంకాలను పెంచింది. ఇంధన ధరలను పెంచడంతో పాటు ఈ వారం ప్రారంభంలో కరెన్సీని తగ్గించింది. అదనంగా, ఐఎంఎఫ్ మార్కెట్ నిర్ణయించిన కరెన్సీ రేటును అనుమతించాలని సూచించింది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దెబ్బకు అటు సామాన్యులను మాత్రమే కాకుండా సైన్యాన్ని కూడా ప్రభావితం చేసింది. సరఫరాలో కోత కారణంగా పాకిస్తాన్ సైన్యం మెస్‌లలో ఆహార కొరత సమస్యలను ఎదుర్కొంటోంది. చదవండి : 'పుతిన్‌కు నెక్ట్స్ బర్త్‌డే లేదు.. ఏడాది కూడా బతకడు..!' -
ఏం మాట్లాడుతున్నావ్! అంటూ పాక్ ప్రధానిని దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు
పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఒక ప్రకటన ఆయనను విమర్శల పాలు చేసింది. ఏదో తన దేశీయుల గొప్పగా భావిస్తారని.. చెబితే అది కాస్త షరీఫ్‌కి తలనొప్పిగా మారింది. ఈ మేరకు ప్రధాని షరీఫ్ మన పాకిస్తాన్‌కి చెందిన అజ్ఞాత వ్యక్తి ఒకరు టర్కీ, సిరియా భూకంప బాధితులకు 30 మిలియన్ల డాలర్లు సాయం అందిచాడని గర్వంగా చెప్పారు. అమెరికాలోని టర్కీ రాయబార కార్యాలయానికి వెళ్లి మరీ సాయం అందిచినట్లు తెలిపారు. ఇది నన్ను ఎంతగానో కదిలించింది. ఇది మానవాళి అధిగమించలేని అసమానతలపై విజయం సాధించేలా చేసే అద్భతమైన దాతృత్వ చర్యగా పేర్కోన్నారు. దీనికి తాను ఎంతగానో గర్వపడుతున్నానంటూ ట్విట్టర్ వేదికగా గొప్పగా చెప్పుకొచ్చారు. దీంతో షరీఫ్ చేసిన ప్రకటన అక్కడ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తానీయులకు మింగుడుపడలేదు. దీంతో ట్విట్టర్ వేదికగా షరీప్‌పై పలు విమర్మలు ఎక్కుపెట్టారు. తన సొంత దేశం అస్తవ్యస్తంగా ఉంటే ఎందుకు సాయం చేసేందుకు ముందుకు రాలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీలాంటి అవినీతి పరులు ఉన్నారు కాబట్టి సాయం చేసేందుకు రాలేదు కాబోలు అంటూ షరీఫ్‌కి చివాట్లు పెట్టారు నెటిజన్లు. అంతేగాదు ఆ అనామకుడు పాక్ దౌత్య కార్యాలయంలోకి వెళ్లి వరదల్లో అల్లకల్లోలం అయిన తన దేశానికి ఎందుకు ఇవ్వలేదనేది పాక్ రచయిత్రి అయేషా సిద్ధిఖా కూడా ప్రధాని షరీఫ్‌ని ప్రశ్నించారు. ఎందుకంటే అధికారంలో ఉన్నది దొంగలని అతనికి తెలుసు అందుకే ఇవ్వలేదని, ఇది నిజంగా సిగ్గుతో చచ్చిపోవాల్సిన విషయం అంటూ షరీఫ్‌ని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఏకిపరేశారు. Deeply moved by the example of an anonymous Pakistani who walked into Turkish embassy in the US & donated $30 million for earthquake victims in Türkiye & Syria. These are such glorious acts of philanthropy that enable humanity to triumph over the seemingly insurmountable odds. — Shehbaz Sharif (@CMShehbaz) February 11, 2023 (చదవండి: మరోసారి భారత్‌కు ధన్యవాదాలు! ఎప్పటికీ మనం దోస్తులమే!: టర్కీ రాయబారి) -
పతనం అంచున పాక్
‘‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. సాధించింది ఏమీ లేదు. దేశంలో మరింత విధ్వంసం జరిగింది. నిరుద్యోగం పేదరికం మీద పడ్డాయి. యుద్ధానికి కారణమైన కశ్మీర్ వంటి అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ ‘‘అణ్వాయుధాలు కలిగిన మన దేశం అన్నవస్త్రాల కోసం ప్రపంచ దేశాల ముందు దేహి అంటూ చేయి చాపడం నిజంగా సిగ్గు చేటు. అంతర్జాతీయ సంస్థల్ని రుణాలు అడగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇలా ప్రపంచ దేశాలను భిక్షమడిగి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించడం పరిష్కారం కాదు’’ ఈ వ్యాఖ్యలు చేసినది ఎవరో కాదు. సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. రోజు రోజుకీ దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోతూ ఉండడంతో మరో దారి లేక షరీఫ్ శాంతి మంత్రం జపిస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామన్న భావనలో పాక్ సర్కార్ ఉంది. గోధుమల లారీని వెంబడించి.. ! పాకిస్తాన్లో ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి విపరీతమైన కొరత ఏర్పడింది. నిరుపేదలు గోధుమ పిండి కొనుక్కోవడానికి గంటల తరబడి దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కరాచీలో ఒక గోధుమ పిండి లారీ వెళుతూ ఉంటే దాని వెనక ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఒక్క వీడియో చాలు పాక్‌లో ఆహార సంక్షోభం ఏ స్థాయికి చేరుకుంటోందో చెప్పడానికి. బియ్యం, గోధుమలు, కూరగాయలు డిమాండ్‌కు తగ్గ సప్లయి కావడం లేదు. ఇరుగు పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే డాలర్ నిల్వలు తరిగిపోతున్నాయి. కరాచీలో కేజీ గోధుమ పిండి రూ.160 ధర పలుకుతూ ఉండడంతో ప్రజలు కడుపు నింపుకోవడమెలాగ అని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రెస్టారెంట్లలో ఒక భోజనం ఖరీదు ఏకంగా రూ.800కి చేరుకుంది. విద్యుత్ సంక్షోభంతో మార్కెట్లను, రెస్టారెంట్లను రాత్రి 8 గంటలకే మూసేస్తూ ఉండడంతో జనం కూడా చేసేదేమి లేక త్వరగా నిద్రపోతున్నారు. దీంతో పాక్‌లో చీకటి పడగానే విద్యుత్ వెలుగులు లేక కారు చీకట్లోకి దేశం వెళ్లిపోతోంది. పెట్రోల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.200కి పైనే ఉండడంతో సామాన్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు ప్రాణావసరమైన మందులకి కూడా కొరత ఏర్పడడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరాచీలో ఇన్సులిన్ లభించకపోవడంతో మధుమేహ రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఇక సైనికులకి రెండు పూటలా తిండి పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దేశంలో టాప్‌లో ఉన్న 8 తయారీ సంస్థలు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లేక మూతపడ్డాయి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వివిధ దేశాల్లో రాయబార కార్యాలయాలను కూడా పాక్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో ఆర్థిక సంక్షోభం పరాకాష్టకు చేరుకున్నట్టయింది. ►పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో నిల్వలు నిండుకుంటున్నాయి. స్టేట్ బ్యాంకులో 420 కోట్ల డాలర్లే ఉన్నాయి. ఇవి 25 రోజుల దిగుమతి అవసరాలకు మాత్రమే సరిపోతాయి. ►విదేశీ మారక నిల్వలు 2022 జనవరిలో 1660 కోట్లు ఉంటే ఈ ఏడాది జనవరి నాటికి కాస్త 560 కోట్ల డాలర్లకి పడిపోయాయి. ►ఈ ఆర్థిక సంవత్సరం జనవరి –మార్చి మధ్య పాకిస్తాన్ 830 కోట్ల డాలర్ల విదేశీ అప్పులు తీర్చవలసి ఉంది. ►2022–23లో జీడీపీలో 2.8% ఉన్న రక్షణ బడ్జెట్‌ను 2.2శాతానికి తగ్గించారు. ►2022 ఆకస్మిక వరదలు 3.8 కోట్ల మందిని ప్రభావితం చేశాయి. దేశం విలవిలలాడింది. ► స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. ►వాణిజ్య లోటు ఒక్కసారిగా 57% పెరిగిపోయింది. అత్యవసర జాబితాలో లేని లగ్జరీ వస్తువులు 800కి పైగా రకాల వస్తువుల దిగుమతులపై నిషేధం విధించినప్పటికీ వాణిజ్య లోటు పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం పాక్ వాణిజ్య లోటు 4.866 కోట్ల డాలర్లుగా ఉంది. భారతే దిక్కా ..? పాకిస్తాన్‌కు అండదండ అందించే చైనా ఈ సారి ఆ దేశాన్ని గట్టెక్కించే పరిస్థితులు కనిపించడం లేదు. పాకిస్తాన్ ప్రాంతంలో చైనా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టుకు సంబంధించిన భద్రతాపరమైన ముప్పు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు కోసం వందల కోట్ల డాలర్లను వెచ్చించిన చైనా ఇంక ఆర్థికంగా ఆదుకుంటుందన్న నమ్మకం లేదు. యూఏఈ, సౌదీ అరేబియాలు ముస్లిం దేశాలు కావడంతో పాక్‌కు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చాయి. యూఏఈ 200 కోట్ల డాలర్ల సాయాన్ని చేయడానికి కూడా అంగీకరించింది. కరోనా విలయం, రష్యా, అమెరికా యుద్ధంతో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాలు కూడా సాయం చేసే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే భారత్‌తో బలమైన సంబంధాలు కలిగి ఉంటే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చునని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మన దేశంతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరిస్తే నిత్యావసరాలైన బియ్యం, గోధుమ పిండి, కూరగాయలు, మందులు వంటివి తీసుకురావడం అత్యంత సులభంగా మారుతుంది. వాఘా–అట్టారి, ఖోఖర్పార్–మునాబావో సరిహద్దుల నుంచి నిత్యావసర సామగ్రి తరలించడం సులభతరంగా ఉంటుందని పాక్‌లో ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం పాకిస్తానేనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఆ దేశ వృద్ధి రేటు గతంలో వేసిన అంచనాల కంటే 2%‘ నెమ్మదిస్తుందని తెలిపింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కారణంగా దక్షిణాసియా ప్రాంత పురోగతి రేటు కూడా తగ్గిపోతోందని పేర్కొంది. పాకిస్తాన్‌ను గత ఏడాది ముంచెత్తిన వరదలే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషించింది. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌కు 3,300 కోట్ల డాలర్లు రుణంగా వస్తే తప్ప ఆ దేశం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తలబొప్పి పలికించిన తత్త్వం
తలబొప్పి కడితే కానీ తత్త్వం బోధపడదంటే ఇదే. పాలు పోసి పెంచిన తీవ్రవాద సర్పం తన మెడకే చుట్టుకొంటూ, అస్తవ్యస్త విధానాలతో ఆర్థికంగా నట్టేట మునిగాక పాకిస్తాన్ తెలివి తెచ్చుకుంటున్నట్టుంది. నిరుడు పగ్గాలు పట్టిన ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోట హఠాత్తుగా ఊడిపడ్డ భారత్‌తో శాంతి చర్చల మాట చూస్తే అలాగే అనిపిస్తోంది. రెండురోజుల పర్యటనకు వెళ్ళిన ఆయన దుబాయ్ వార్తాఛానల్ ‘అల్ అరేబియా’తో సోమవారం మాట్లాడుతూ భారత్‌తో మూడు యుద్ధాలతో గుణపాఠాలు నేర్చామనీ, నిజాయతీగా శాంతి చర్చలు జరపాలనీ, ఉభయులకూ మిత్రదేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్యవర్తిగా వ్యవహరించాలనీ అన్నారు. కానీ, ఆ మర్నాడే పాక్ ప్రధాని కార్యాలయం హడావిడిగా వివరణనిచ్చింది. కశ్మీర్లో ‘చట్టవిరుద్ధ చర్యల’పై భారత్ వెనక్కి తగ్గితేనే చర్చలంటూ మెలికపెట్టింది. తప్పంతా తమదేనని అనిపించుకోవడం ఇష్టం లేని శక్తిమంతమైన సైనిక వర్గాలు ఒత్తిడి తేవడంతో పాక్ పాలకులు అలా స్వరం సవరించుకోవాల్సి వచ్చింది. కానీ అసలంటూ చర్చల ప్రస్తావన రావడం విశేషమే. భారత్‌తో శాంతి నెలకొంటేనే పాక్ ఆర్థికవ్యవస్థకు లాభమని షెహబాజ్, ఆయన సోదరుడైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు తరచూ చెబుతుంటారు. కానీ, భారత్‌తో చేసిన మూడు యుద్ధాలతో బుద్ధి వచ్చిందనీ, వాటి వల్ల కష్టాలు, కన్నీళ్ళు, నిరుద్యోగం, పేదరికమే దక్కాయనీ ఒక పాకిస్తానీ పాలకుడు అనడం ఇదే తొలిసారి. అందుకే, షెహబాజ్ తాజా మాటలు తరచూ చేసే శుష్క ప్రకటనల కన్నా భిన్నమైనవి, ప్రాధాన్యమున్నవి. అందులోనూ ఆర్థిక కష్టాల్లో 300 కోట్ల డాలర్ల మేర భుజం కాస్తున్న ‘సోదర’ దేశం యూఏఈని శాంతిసంధాతగా రమ్మనడమూ కీలకమే. నిజానికి, దాయాదుల మధ్య తెర వెనుక చర్చల ప్రక్రియకు మధ్యవర్తి పాత్ర తమ దేశమే పోషించిందని యూఏఈ ఉన్నత దౌత్యాధికారి 2021లో బయటపెట్టారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు నిచ్చాయన్నారు. మళ్ళీ ఆ సోదర దేశాన్నే పాక్ సాయం కోరింది. నిజాయతీ ఎంత ఉందో కానీ, ఇన్నాళ్ళకు పాక్ పాలకులు సరైన దోవలో ఆలోచిస్తున్నారు. డాలర్ నిల్వలు పడిపోతూ, శ్రీలంక బాటలో పాక్ కూడా దివాళా తీసే ప్రమాదపుటంచున ఉంది. ఈ నేపథ్యంలోనే ‘అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం చెలరేగితే, ఏం జరిగిందో చెప్పడానికైనా ఎవరూ మిగలర’న్న ఆకస్మిక జ్ఞానం వారికి కలిగిందనుకోవాలి. నిజానికి, పాక్ చర్చల ఆకాంక్ష, కశ్మీర్ సమస్య పరిష్కారం, చివరకు భారత్‌తో శాంతిస్థాపన ఆలోచనలు కొత్తవేమీ కావు. జనరల్ పర్వేజ్ ముషారఫ్ పాలనలోనే ఈ కథ కంచి దాకా వెళ్ళినట్టే వెళ్ళి, ఆఖరి క్షణంలో అడ్డం తిరిగింది. అప్పట్లో ఇక్కడ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ఒత్తిడి, అక్కడ ముషారఫ్‌ను బలహీనపరిచిన దేశీయ సమస్యలు కలసి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చాయి. ఆ మధ్య ఇమ్రాన్ ఖాన్ – సైన్యాధ్యక్షుడు జనరల్ బజ్వా ద్వయం కూడా ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని ప్రయత్నించింది. కానీ, పాక్ పాలక వర్గాలు పడనివ్వలేదు. దేశ ఆర్థిక సమస్యలు, తీవ్రవాద ‘తెహ్రీక్–ఎ–తాలిబన్ పాకిస్తాన్’ (టీటీపీ) తలనొప్పి, పశ్చిమ ఆసియా భౌగోళిక రాజకీయాల్లో మార్పులు – ఇలా అనేకం శాంతి గీతాలాపనకు కారణం. పశ్చిమాసియాలో కీలకమైనవీ, పాక్‌కు ‘సోదర’ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా తాజా పరిస్థితుల్లో భారత్‌కు దగ్గరయ్యాయి. దీంతో, పాక్ రూటు మార్చక తప్పట్లేదు. పైగా, భారత్‌తో శాంతి నెలకొంటే వాయవ్యాన తలనొప్పిగా మారిన తాలిబన్లపై దృష్టి పెట్టవచ్చు. ఈ ఏడాదే పాక్‌లో ఎన్నికలు జరగనున్నందున ఈ శాంతి వచనాలు ఊహించదగ్గవే. అధికారం కోరే ప్రతి పార్టీ ఓటర్లకు గాలం వేస్తూ, ఎన్నికల మేనిఫెస్టోలో భారత్‌తో శాంతిస్థాపన అంశాన్ని చేర్చడం షరా మామూలే. గత ఎన్నికల్లో ప్రధాని పీఠానికి పోటీపడ్డ ముగ్గురూ ఆ వాగ్దానమే చేశారు. ఇప్పుడు ఎన్నికల వేళ షెహబాజ్ అదే పల్లవి అందుకున్నట్టున్నారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ 2019 ఆగస్ట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని భారత్ పునః సమీక్షించే అవకాశం లేదు. అది మినహాయించి, జమ్ము–కశ్మీర్‌ల రాష్ట్ర హోదా పునరుద్ధరణ లాంటివి కోరుతూ చర్చలంటే కథ కొంత ముందుకు నడుస్తుంది. అదే సమయంలో యూఏఈ సహా ఉభయ మిత్రులూ, తెర వెనుక శక్తిమంతులూ ఎందరున్నా... అంతర్గత అంశమైన కశ్మీర్‌పై అంతర్జాతీయ జోక్యం మనకు సమ్మతం కానే కాదు. అది గుర్తెరిగి ప్రవర్తిస్తేనే తాజా ప్రతిపాదనకు సార్థకత. పీఎంఓ ప్రకటన అటుంచి, చర్చలకు కట్టుబడి ఉన్నామని షెహబాజ్ బృందం చేతల్లో చూపాలి. పాక్‌తో గత అనుభవాల దృష్ట్యా ఆ దేశం నేర్చుకున్నట్టు చెబుతున్న గుణపాఠాల పట్ల భారత్‌కు అనుమానాలు సహజమే. అయితే, అనాలోచితంగా శాంతి ప్రతిపాదనకు అడ్డం కొట్టాల్సిన పని లేదు. దౌత్య, వాణిజ్యపరంగా ముందుగా చేయాల్సినవీ చాలానే ఉన్నాయి. 2019 ఆగస్ట్ పరిణామాల తర్వాత ఇరుదేశాల రాజధానుల్లోనూ హైకమిషనర్లు లేరు. కింది సిబ్బందే బండి నడుపుతున్నారు. పరస్పర విశ్వాసం పాదుగొల్పే చర్యల్లో భాగంగా రెండుచోట్లా హైకమిషనర్ల నియామకం జరగాలి. వీసాలపై షరతుల్ని సడలించాలి. సాంస్కృతిక, క్రీడా సంరంభాలను పునరుద్ధరించాలి. ముఖ్యంగా తీవ్రవాదానికి కొమ్ము కాయబోమని పాక్ నమ్మకం కలిగించాలి. శాంతి పథంలో సాగాలంటే అది అతి ముఖ్యం. అందుకు పాక్ రెండడుగులు ముందుకు వేస్తే, నాలుగడుగులు వేయడానికి శాంతికాముక భారతావని సదా సిద్ధంగానే ఉంటుంది. -
యుద్ధం తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌తో మూడు యుద్ధాలు చేసి గుణపాఠం నేర్చుకున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో తాము తమ పొరుగుదేశం భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం అన్నారు. కాశ్మీర్ వంటి అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో నిజాయితీతో కూడిన చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు దుబాయ్‌కి చెందిన అల్ అరేబియా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ.."భారత ప్రధాని మోదీకి నా సందేశం ఏంటంటే?.. మన మధ్య చిచ్చు రేపుతున్న బర్నింగ్ పాయింట్లను పరిష్కరించడానికి టేబుల్‌పై కూర్చోని చిత్తశుద్ధితో చర్చలు జరుపుదాం. శాంతియుతంగా జీవిద్దాం. పరస్పరం కలిహించుకోవడంతో సమయం, వనరులు వృధా చేస్తున్నాం" అని అన్నారు. తాము భారత్‌లో చేసిన మూడు యుద్ధాల కారణంగా పాక్ ప్రజలకు తీరని కష్టాలను మిగిల్చాయి. వారంతా తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. అదీగాక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న పాక్ తమకు సాయం చేయమంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రజలు ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణంగా గోధుమపిండి కోసం ఘోరంగా ఆర్రుల చాజుతున్నారు. మరోవైపు అక్కడి ప్రజలు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఎదుర్కొంటోన్నారు. గతేడాది చివర్లోనే దేశ భద్రతా దళాలతో కాల్పులు విరమించింది. ఈ పరిస్థితుల దృష్ట్యా పాక్ ప్రధాని షెహబాజ్ పోరుగు దేశంతో ముక్కుసూటిగా నిజాయితీగా వ్యహిరిస్తాం అని పిలుపునిచ్చారు. ఇరుదేశాల్లోనూ నైపుణ్యవంతులైన వైద్యులు, ఇంజనీర్లు, కార్మికులు ఉన్నారని, ఆ వనరులను ఉపయోగించుకుని శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే మందుగుండు సామాగ్రి కోసం వనరులను దుర్వినియోగం చేయాలనుకోవటం లేదని తెలిపారు. ఈ క్రమంలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ..పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని, కాశ్మీర్లో జరుగుతున్న వాటిని ఆపాలని అన్నారు. ఈ మేరకు తీవ్ర సంక్షోభంతో సతమతమవుతున్న పాక్ భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమంటూ నేరుగా సంకేతాలిస్తోంది. (చదవండి: వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన) -
152/0 VS 170/0: మీకు మాకు ఇదే తేడా.. పాక్ ప్రధానికి ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ కౌంటర్
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా దారుణ పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వివాదాస్పద ట్వీట్‌పై (152/0 VS 170/0) తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఫైనల్‌కు చేరామన్న మదంతో కొట్టుకుంటున్న పాక్ ప్రధానికి.. ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాక్ ప్రధాని మరోసారి వంకర బుద్ధి చాటుకున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. So, this Sunday, it’s: 152/0 vs 170/0 🇵🇰 🇬🇧 #T20WorldCup — Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022 మీకు మాకు ఇదే తేడా.. మేము గెలిచినా, ప్రత్యర్ధి గెలిచినా మేము సంతోషిస్తాం, కానీ మీరు ఇతరుల ఓటమితో రాక్షసానందం పొందుతున్నారు.. ఇకనైనా ఇలాంటి పరువు పోగొట్టుకునే పనులు మానుకుని, సొంత దేశంలో సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ ఓ రేంజ్లో చురలకలంటిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. పాక్ ప్రధానికి భారత్ అభిమానులు ఇచ్చిన కౌంటర్లతో పోలిస్తే, ఇర్ఫాన్ ఇచ్చిన ఈ కౌంటర్ మరింత స్ట్రాంగ్‌గా ఉంది. Aap mein or hum mein fark yehi hai. Hum apni khushi se khush or aap dusre ke taklif se. Is liye khud ke mulk ko behtar karne pe dhyan nahi hai. — Irfan Pathan (@IrfanPathan) November 12, 2022 దీంతో ఇర్ఫాన్ చేసిన కౌంటర్ అటాక్‌పై భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిగా బుద్ధి చెప్పావంటూ ఇర్ఫాన్‌ను మెచ్చుకుంటున్నారు. వంకర బుద్ధి గల వ్యక్తులు నిజంగానే ఇతరుల బాధను ఎగతాలి చేస్తూ రాక్షసానందం పొందుతారంటూ ఇర్ఫాన్ కౌంటర్ ట్వీట్‌కు మద్దతు పలుకుతున్నారు. పాక్ ప్రధానిని ఇన్ స్వింగింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి భలే బుద్ధి చెప్పావంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో, టీ20 వరల్డ్‌కప్-2021 గ్రూప్ దశలో పాకిస్తాన్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ప్రత్యర్ధులు చేసిన స్కోర్లను (152/0 VS 170/0) ప్రస్తావిస్తూ.. ఈ ఆదివారం 152/0 VS 170/0 అంటూ పాక్ ప్రధాని తన స్థాయి దిగజార్చుకునే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై భారత అభిమానులు, మాజీలు తగు రీతిలో ఇప్పటికీ కౌంటర్లిస్తూనే ఉన్నారు. ఏదో అదృష్టం కలిసొచ్చి ఫైనల్ దాకా చేరిన మీకు ఇంత పొగరు పనికిరాదంటూ చురకలంటిస్తున్నారు. చదవండి: టీమిండియా ఓటమిపై పాక్ ప్రధాని ట్వీట్ వైరల్.. కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్ -
టీమిండియా ఓటమిపై పాక్ ప్రధాని ట్వీట్ వైరల్.. కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్
ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final: ఘోర పరాజయంతో టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ నుంచి నిష్క్రమించింది టీమిండియా. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటర్లు పర్వాలేదనిపించినా.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక భారత బౌలరుల ఆపసోపాలు పడిన తీరు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. పవర్ ప్లేలో మనవాళ్లు తడబడితే(38) ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ మాత్రం ఏకంగా 63 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత వారి దూకుడుకు అడ్డుకట్టవేయడం టీమిండియా బౌలర్ల తరం కాలేదు. తమదైన శైలిలో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ పొట్టి ఫార్మాట్ ఉన్న మజాను ప్రేక్షకులకు అందించారు ఈ ఇద్దరు బ్యాటర్లు. బట్లర్ 80, హేల్స్ 86 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చారు. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. 7 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. నవంబరు 13న మెల్బోర్న్లో ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైంది. పాక్ ప్రధాని ట్వీట్ వైరల్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమిని ఉద్దేశిస్తూ.. ‘‘టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఆదివారం.. 152/0 వర్సెస్ 170/0 అన్నమాట’’ అని పేర్కొన్నారు. గతేడాది ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో చేతిలో భారత జట్టు 10 వికెట్ల తేడాతో పరాజయం(అప్పుడు పాక్ స్కోరు 152/0) పాలైన విషయాన్ని ఉటంకిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు. వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో.. పాక్, ఇంగ్లండ్ ఫైనల్ చూడబోతున్నామని పేర్కొన్నారు. ఫ్యాన్స్ కౌంటర్ కాగా ఈ ట్వీట్‌పై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘మా వాళ్లేమీ నక్క తోక తొక్కి.. ఎవరో ఎవరినో ఓడించడం ద్వారా సెమీస్‌కు చేరలేదు. సెమీ ఫైనల్ చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడలేదు. ఒక్క మ్యాచ్‌లో ఓటమి చెందినంత మాత్రాన మా వాళ్లేమీ తక్కువ కాదు’’ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజమని, ఇండియా ఫైనల్ చేరితే కథ వేరేగా ఉండేందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ టోర్నీలో జింబాబ్వే చేతిలో పాక్ ఓటమిని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Rohit Sharma On India Loss: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్ వాళ్లకే! WC 2022: ఆ ఇద్దరూ విఫలం.. వీళ్లపైనే భారం! అసలైన మ్యాచ్‌లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు So, this Sunday, it’s: 152/0 vs 170/0 🇵🇰 🇬🇧 #T20WorldCup — Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022 -
Imran Khan: నన్ను చంపజూసింది ప్రధానే
ఇస్లామాబాద్/లాహోర్: ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను చంపేందుకు కుట్ర పన్నారని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ‘‘ఆంతరంగిక శాఖ మంత్రి సనావుల్లా, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఫైసల్ నసీర్తో పాటు మరొకరికి కూడా ఈ కుట్రలో భాగస్వామ్యముంది. వీరి పేర్లతో కూడిన వీడియోను ఇప్పటికే విదేశాలకు పంపించేశాను. నాకు జరగరానిది జరిగితే ఆ వీడియో బయటకు వస్తుంది’ అన్నారు. దుండగుడి కాల్పుల్లో తన కుడి కాలిలోకి నాలుగు బుల్లెట్లు దిగాయని చెప్పారు. చికిత్స పొందుతున్న తన సొంత షౌకత్ ఖానుమ్ ఆస్పత్రి నుంచి శుక్రవారం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 2011లో పంజాబ్ గవర్నర్‌ను చంపినట్లుగానే వజీరాబాద్‌లో తనను చంపేందుకు కుట్ర జరుగుతున్న విషయం ముందే తెలుసన్నారు. ‘‘నాపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఉగ్రవాది కాడు. నాపై దైవదూషణ నేరం మోపారు. అధికార పీఎంఎల్ఎన్ దాన్ని ప్రచారం చేసింది. అంతా పథకం ప్రకారం జరుగుతోంది. దీని వెనుక కుట్రను ఛేదిస్తాం’’ అన్నారు. గాయం నుంచి కోలుకున్నాక పోరాటం కొనసాగిస్తానన్నారు. దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ నేతకు కూడా న్యాయం జరగడం లేదని పాక్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ బందియాల్నుద్దేశించి అన్నారు. ఇమ్రాన్ కుడి కాలి ఎముక విరిగిందని వైద్యులు చెప్పారు. ఇమ్రాన్‌పై కాల్పులను నిరసిస్తూ పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పీటీఐ కార్యకర్తలు రావల్పిండి, ఫైజాబాద్‌ల్లో భారీగా రోడ్లపై బైఠాయించారు. పోలీసులతో ఘర్షణలకు దిగారు. లాహోర్‌లో గవర్నర్ హౌస్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ ఘటనపై పోలీసులు, నిఘా అధికారులతో సంయుక్త విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్ ప్రభుత్వం పంజాబ్‌ను కోరింది. ఇమ్రాన్ మాత్రమే చంపేందుకు కాల్పులు జరిపినట్లు నిందితుడు చెబుతున్నట్లుగా ఉన్న వీడియో లీక్‌కు కారకులైన పలువురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. వారి సెల్ఫోన్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. వజీరాబాద్ పట్టణంలో గురువారం పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ర్యాలీలో దుండగుల తుపాకీ కాల్పుల్లో ఒకరు చనిపోగా ఇమ్రాన్ సహా పలువురు గాయపడిన విషయం తెలిసిందే. -
‘మాకు నిజమైన మిత్రుడు’.. జిన్‌పింగ్ ఎన్నికపై పాకిస్థాన్ హర్షం
ఇస్లామాబాద్: చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్(69) రికార్డ్ స్థాయిలో మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మరోమారు అధ్యక్షుడిగా ఎన్నిక కావటంపై హర్షం వ్యక్తం చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి హెహబాజ్ షరీఫ్. తమ దేశానికి ఆయన నిజమైన స్నేహితుడని అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు ప్రధాని. జిన్‌పింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘సీపీసీ జనరల్ సెక్రటరీగా మూడోసారి ఎన్నికైనందుకు యావత్ పాకిస్థాన్ తరఫున షీ జిన్‌పింగ్‌కు నా అభినందనలు. తెలివైన సారథ్యం, చైనా ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకున్న నిబద్ధతకు ఇది తార్కాణం’ అని ట్వీట్ చేశారు ప్రధాని షెహ్బాజ్. మరోవైపు.. జిన్‌పింగ్ ఎన్నికపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా స్పందించారు. ‘సీపీసీ జనరల్ సెక్రటరీగా మరోసారి ఎన్నికైన షీ జిన్‌పింగ్‌కు అభినందనలు. పాకిస్థాన్‌కు నిజమైన స్నేహితుడు, పాక్-చైనాల వ్యూహాత్మక బంధానికి బలమైన మద్దతుదారుడు’ అంటూ ట్వీట్ చేశారు. On behalf of the entire Pakistani nation, I congratulate President Xi Jinping on his reelection as CPC General Secretary for the 3rd term. It is a glowing tribute to his sagacious stewardship and unwavering devotion for serving the people of China. 🇵🇰 🇨🇳 — Shehbaz Sharif (@CMShehbaz) October 23, 2022 I extend heartiest congratulations to H.E. Xi Jinping on his reelection as CPC General Secretary, and my best wishes for his health and happiness. He is a true friend of Pakistan and champion for All-Weather Strategic Cooperative Partnership between Pakistan and China. 🇵🇰 🇨🇳 — The President of Pakistan (@PresOfPakistan) October 23, 2022 ఇదీ చదవండి: ‘ప్రపంచానికి చైనా అవసరం’.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ వ్యాఖ్యలు -
బైడెన్ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని ఫైర్
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాకిస్తాన్ అణ్వాయుధాల సామర్థ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చాలా ఘాటుగా స్పందించారు. గత దశాబ్దాలుగా అణ్వాయుధాల విషయంలో పాక్ అత్యంత బాధ్యతాయుతమైన అణు రాజ్యంగా నిరూపించుకుంది. తమ అణు కార్యక్రమాలను ఫూల్ ఫ్రుఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌తో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు షెహబాజ్ ట్విట్టర్లో... అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాక్ బాధ్యతయుతమైన అణుదేశం. అంతర్జాతీయ అణుశక్తి(ఐఏఈఏ) అవసరాలకు అణుగుణంగా మా అణ్వాయుధాలకు అత్యుత్తమ రక్షణ వ్యవస్థ ఉంది. దీనికి మేము గర్విస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ...జాతీయ ప్రయోజనాలను పరిరక్షించగల బాధ్యతాయుతమైన అణుదేశం పాక్. అన్ని స్వతంత్ర దేశాల మాదిరిగా మా అణుకార్యక్రమాల వల్ల ఏ దేశానికి ముప్పు వాటిల్లదు. మేము ప్రాంతీయ శాంతి భద్రతలను పెంపొందించడంలో యూఎస్‌కి సహకరించాలన్నదే మా కోరిక. దయచేసి అణు సామర్థ్యం విషయంలో లేనిపోని సందేహాలకు తావివ్వద్దు. అలాగే పాకిస్తాన్ తన స్వయంప్రతిపత్తి సార్వభౌమ రాజ్యాధికారం తోపాటు ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే హక్కును కలిగి ఉంది అని షెహబాజ్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందిస్తూ...బైడెన్ దేన్ని ఆధారం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారంటూ నిలదీశారు. ముఖ్యంగా అణ్వాయుధీకరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలలో పాల్గొన్న యూఎస్‌లా పాకిస్తాన్ ఎప్పుడు దూకుడుగా వ్యవహరించింది అని ప్రశ్నించారు. (చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు) -
ఐరాసలో పాక్ ‘శాంతి’ మాటలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) 77వ సమావేశాల వేదికగా భారత్‌ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు దీటుగా బదులిచ్చింది ఢిల్లీ. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించరని స్పష్టం చేసింది. 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ.. శాంతి కోరుకునేవారెవరూ అలాంటి హింసాత్మక దాడులకు కుట్రలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వరని మండిపడింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్ 2019లో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం ఏర్పడిందన్నారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత బృందం తొలి సెక్రెటరీ మిజిటో వినిటో పాక్‌పై నిప్పులు చెరిగారు. ‘భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరం. తమ సొంత దేశంలో జరిగిన అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చేస్తోన్న చర్యలను సమర్థించుకునేందుకే ఆయన ఇలా మాట్లాడారు. పొరుగుదేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్నారు. అలాంటి వారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరు. ముంబయిలో ఉగ్ర పేలుళ్లకు పాల్పడిన టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వరు. శాంతిని కాంక్షించేవారు.. అన్యాయంగా, అక్రమంగా పొరుగుదేశాల భూభాగాలను లాక్కోవాలని చూడరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు వినిటో. పాకిస్థాన్‌తో ఉగ్రవాద రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని భారత్ కాంక్షిస్తోందని పేర్కొన్నారు వినిటో. జమ్మూకశ్మీర్ ఇప్పటికీ.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగామేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాల్లోని బాలికలకు బలవంతపు పెళ్లిళ్ల అంశాన్ని సూచిస్తూ.. మైనారిటీల హక్కులను కాలరాస్తున్న దేశం, అంతర్జాతీయ వేదికపై మైనారిటీల గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. శాంతి, భద్రత, పురోగతినే భారత్ కోరుకుంటోందని, అది సీమాంతర ఉగ్రవాదం సమసిపోయినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు -
మసూద్‌పై చర్యలుంటాయా? పాక్ ప్రధాని రియాక్షన్ ఏంటంటే..
సమర్ఖండ్: పాకిస్తాన్ బుద్ధి మరోసారి.. అదీ అంతర్జాతీయ వేదికగా బయటపడింది. గ్లోబల్ టెర్రరిస్ట్, జైషే ముహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సుకు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ హాజరయ్యారు. అయితే.. అంతర్జాతీయ మీడియాతో ముఖాముఖి సందర్భంగా ఆయన్ని ఇరకాటంలో పడేశాడు భారత జర్నలిస్ట్ ఒకరు. భారత్‌కు చెందిన ఓ మీడియా జర్నలిస్ట్.. ‘షరీఫ్ సాబ్.. మసూద్ అజార్ మీద ఒక చిన్నప్రశ్న. అతనికి వ్యతిరేకంగా మీ చర్యలు ఉంటాయా?’ అని ప్రశ్నించారు. అయితే.. దానికి సమాధానం ఇవ్వకుండా పక్కనే ఉన్న తన ప్రతినిధితో మాట్లాడుకుంటూ ముందుకెళ్లారు. అయితే అక్కడే ఉన్న ఆయన సిబ్బంది సదరు జర్నలిస్ట్‌ను మళ్లీ ఆ ప్రశ్న అడగకుండా నిలువరించే యత్నం చేశారు. ఇకచాలూ.. దయచేసి ఆపండి అంటూ సిబ్బందిలోని ఓ వ్యక్తి సదరు జర్నలిస్ట్‌కు సూచించారు కూడా. ఇదిలా ఉంటే.. భారత్ సహా పలుదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన జైషే ముహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఐక్యరాజ్య సమితి గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించింది. అయితే.. ఈమధ్యే మసూద్ అఫ్గన్‌లో ఉన్నాడంటూ పాక్ ఆరోపించగా.. అలాంటి ఉగ్రసంస్థలను ఆదరించే ఘనత కేవలం పాక్‌కే ఉంటుందంటూ తాలిబన్లు సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: మళ్లీ అక్కడ శవాల దిబ్బలే దర్శనమిస్తున్నాయి -
‘ఈయనేం ప్రధాని.. దేశానికి తలవంపులు తెస్తున్నారు’
వైరల్: పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ అంతర్జాతీయ వేదిక నుంచి నవ్వులపాలయ్యారు. ఉజ్బెకిస్తాన్ వేదికగా జరుగుతున్న షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సమ్మిట్ సందర్భంగా.. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీలో పాక్ ప్రధాని షెహ్బాజ్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇయర్‌ఫోన్స్ పెట్టుకునే క్రమంలో ఆయన పడ్డ అవస్థలు చూసి.. పుతిన్ చిన్నగా నవ్వుకున్నారు. ఎంతకీ అవి సెట్ కాకపోవడంతో.. ‘ఎవరైనా వచ్చి సాయం చేయండి’ అంటూ కోరారు. దీంతో వ్యక్తిగత సిబ్బంది నుంచి ఒకరు వచ్చి సాయం చేశారు. ఆ సమయంలోనూ షెహ్బాజ్ ఇబ్బందిగా ఫీల్ కావడంతో.. పుతిన్ నవ్వుకుంటూనే ఉన్నారు. This CrimeMinister is a constant embarrassment for Pakistan. Even President Putin had to eventually just laugh at this clumsy man. Pathetic. This is what conspirators wanted? To have by design a politician who would not only be a crook but also a pathetic apology for a PM? pic.twitter.com/mmEhLY7RZg — Shireen Mazari (@ShireenMazari1) September 15, 2022 When u are only there for a free trip & don't give a damn about your country u sleep thru meetings while the other side makes notes. Shameful & embarrassing behaviour of Imported govt at SCO. Who is responsible for inflicting this cabal of inept crooks on to the nation? pic.twitter.com/jAoZDWa8Xg — Shireen Mazari (@ShireenMazari1) September 16, 2022 ఇక ఈ వీడియో వైరల్ కావడంతో.. పాక్‌లో ట్రోల్ నడుస్తోంది. బయటా తన చేష్టలతో పాక్ పరువు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు కొందరు. ఇంకొవైపు ప్రతిపక్ష పీటీఐ షీరిన్ మజారీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎస్సీవో సమ్మిట్‌లో పాక్ బృందం తీరును ప్రశ్నిస్తూ.. ట్విటర్లో ఎండగడుతున్నారు. ఇదీ చదవండి: సేవింగ్స్ డబ్బులు ఇవ్వట్లేదని ఎంత పని చేసింది.. -
SCO Summit: ప్రధాని మోదీ కీలక భేటీపై ఉత్కంఠ
సమర్ఖండ్: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్ నగరంలో శుక్రవారం ప్రారంభం కానున్న షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్ తదితర నేతలు హాజరుకానున్నారు. ఈ ఉదయం ప్రధాని మోదీ అక్కడకు చేరుకున్నారు. ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వ్యాపార–వాణిజ్యం, ఇంధన సరఫరా వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కాత్ మిర్జీయోయెవ్‌తోపాటు ఇతర దేశాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అవుతారా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. 2001లో షాంఘైలో ఏర్పాటైన ఎస్సీఓలో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్‌లో ఎస్సీఓ సదస్సు జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సదస్సులో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం ఉజ్బెకిస్తాన్‌కు బయలుదేరడానికి ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిన్‌పింగ్, పుతిన్ సమావేశం చైనా, రష్యా అధినేతలు షీ జిన్‌పింగ్, పుతిన్ గురువారం సమర్ఖండ్లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రష్యాకు జిన్‌పింగ్ మద్దతు ప్రకటించారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తామన్నారు. సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్ సిటీకి చేరుకున్నారు. శుక్రవారం జరిగే సదస్సులో ఆయన పాలుపంచుకుంటారు. ఇదీ చదవండి: పాక్‌కు తాలిబన్ల కౌంటర్ -
ఫోన్ చేసినా.. అడుక్కోవడానికే చేశారనుకుంటున్నారు
ఇస్లామాబాద్: నానాటికీ దిగజారుతున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కళ్లకు కట్టారు. మిత్రదేశాలు కూడా పాకిస్తాన్‌ను అడుక్కునే దేశంగానే చూడటం మొదలుపెట్టాయంటూ విచారం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో లాయర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘మనతో సన్నిహితంగా ఉండే ఏ దేశానికి వెళ్లినా, వారికి ఫోన్ చేసినా అడుక్కోటానికే అని అనుకుంటున్నారు. చాలా చిన్న దేశాలు కూడా అభివృద్ధిలో పాక్‌ను దాటేసి పోయాయి. మనం మాత్రం 75 ఏళ్లుగా జోలె పట్టుకుని తిరుగుతూ బిచ్చమెత్తుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు కూడా దేశం పరిస్థితి ఇదే, వరదలతో ఇప్పుడు మరింత తీవ్రంగా మారిందన్నారు. తాజా వరదల నేపథ్యంలో పొరుగు మిత్ర దేశం చైనా కేవలం సాయ ప్రకటనకే పరిమితం అయ్యింది. తమ దగ్గర సంభవించిన స్వల్ప కరువును, కరోనా-లాక్డౌన్ పరిస్థితులను చూపుతూ పాక్ సాయం విషయంలో చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో షెహబాజ్ కామెంట్లు పరోక్షంగా చైనా మీదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదీ చదవండి: దేశాభివృద్ధి పథంలో అమెరికా కీలక పాత్ర- ప్రధాని మోదీ -
పాక్ వరదలకు మరో 119 మంది బలి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల వల్ల గత 24 గంటల్లో 119 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,000 మార్కును దాటేసింది. దేశంలో జూన్ 14 నుంచి భీకర వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ, నైరుతి పాకిస్తాన్లో తీవ్రత అత్యధికంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,033 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 1,527 మంది క్షతగాత్రులయ్యారని పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) ఆదివారం ప్రకటించింది. వరదల కారణంగా 3,451.5 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. 147 వంతెనలు దెబ్బతిన్నాయి. 170 దుకాణాలు నేలమట్టమయ్యాయి. 9.49 లక్షల ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎంతమేరకు ఆర్థిక నష్టం వాటిల్లందనేదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. రూ.వందల కోట్ల నష్టం వాటినట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. అంతర్జాతీయ సమాజం ఆదుకోవాలని పాక్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. -
పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి... 937 మంది మృతి
ఇస్లామాబాద్: గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు పాకిస్తాన్ అతలాకుతలమైపోయింది. ఈ వరద బీభత్సానికి పాకిస్తాన్లో దాదాపు 343 మంది చిన్నారులతో సహా సుమారు 937 మంది మృతి చెందారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. ఈ విపత్తులో దాదాపు 30 మిలియన్ల మందికి పైగా ఆశ్రయం కోల్పోయినట్లు పేర్కొంది. జాతీయి విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్ఎండీఏ) ప్రకారం.. సింధూ ప్రావిన్స్‌లో ఈ వరదల కారణంగా అత్యధిక సంఖ్యలో చనిపోయారని, సుమారు 306 మందికి పైగా తమ జీవనాన్ని కోల్పోయినట్లు పేర్కొంది. అలాగే బలోచిస్తాన్లో 234 మంది, పంజాబ్ ప్రావిన్స్‌లో 165 మంది ఖైబర్ పంక్త్వులలో 185 మంది రికార్డు స్థాయిలో చనిపోయారని వెల్లడించింది. పాక్ ఆక్రమిత్ కాశ్మీర్లో 37 మంది, గిల్గిట్-బాల్టిస్తాన్‌లో తొమ్మిది చనిపోయినట్లు పేర్కొంది. అంతేకాదు ఆగస్టులో పాకిస్తాన్లో 166.8 మి.మీటర్ల వర్షం కురిసిందని, సగటున 48 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని ఎన్వెఎండీఏ వెల్లడించింది. ఈ అసాధారణ వర్షాలకు దక్షిణ పాకిస్తాన్‌లోని దాదాపు 23 జిల్లాలో బాగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. వాతావరణ మార్పుల మంత్రి షెర్రీ రెహ్మాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ దేశవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టమని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు దేశంలోని పలుప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయి, కమ్యూనికేషన్ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. పైగా వేలాది మంది నిరాశ్రయులయ్యరాని, తినేందుకు ఆహారం లేక అల్లాడిపోతున్నట్లు చెప్పారు. తమకు అంతర్జాతీయ దాతల సాయం అవసరమని నొక్కి చెప్పారు. ప్రస్తుతం పాక్‌లో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆశ్రయం, తక్షణ సహాయ చర్యలు ఆవశక్యత చాలా ఉందని పేర్కొన్నారు. (చదవండి: 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం... మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడి ఆర్ట్ కలెక్షన్) -
భారత్‌తో శాంతినే కోరుకుంటున్నాం కానీ.. కశ్మీర్‌తో ముడిపెట్టిన పాకిస్తాన్ ప్రధాని
ఇస్లామాబాద్: భారత్‌తో శాంతియుత సంబంధాలకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్ సమస్య పరిష్కారంతోనే ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి నెలకొంటుందని అన్నారు. ‘యుద్ధం రెండు దేశాలకు ఎంతమాత్రం మంచిది కాదు. భారత్‌తో చర్చల ద్వారా శాశ్వత శాంతి స్థాపన జరగాలని కోరుకుంటున్నాం. అయితే, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించినప్పుడే ఈ ప్రాంతంలో శాంతి స్థాపన సాధ్యం’అని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థుల బృందంతో ఆయన పేర్కొన్నట్లు ‘ది న్యూస్ ఇంటర్నేషనల్’ తెలిపింది. వాణిజ్యం, ఆర్థిక రంగాలతోపాటు ప్రజల జీవన స్థితిగతులను పెరుగుపరచడంలో ఇరు దేశాల మధ్య పోటీ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘పాక్ దురాక్రమణదారు కాదు. మా రక్షణ వ్యయం సరిహద్దుల రక్షణ కోసమే తప్ప దురాక్రమణ కోసం కాదు’అని అన్నారు. ‘పాక్ ఆవిర్భావం తర్వాత మొదట్లో ఆర్థికంగా అన్ని రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. అనంతరం రాజకీయ అస్థిరత, సంస్థాపరమైన లోపాల కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది’అని ఆయన చెప్పారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన అనంతరం భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చదవండి: అరుదైన ఘటన.. కవలలే.. కానీ కంప్లీట్ డిఫరెంట్! -
పాక్... మరో శ్రీలంక
ఇస్లామాబాద్: శ్రీలంక మాదిరిగానే పాకిస్తాన్ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో గంటల కొద్దీ విద్యుత్ కోతలు అమల్లో ఉండటంతో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పాకిస్తాన్ ప్రభుత్వమే ప్రజలను హెచ్చరించింది. విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని శుక్రవారం నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ (ఎన్ఐబీటీ) ట్విట్టర్లో తెలిపింది. దేశ అవసరాలకు సరిపోను ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) అందకపోవడంతో జూలైలో ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ఇటీవల పేర్కొన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఒక వైపు పెరుగుతుండగా జూన్‌లో దిగుమతులు తగ్గిపోయినట్లు జియో న్యూస్ పేర్కొంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కరాచీ తదితర నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీల్లో పని గంటలను కుదించారు. ఇంధన కొరతను అధిగమించేందుకు ఖతార్‌తో చర్చలు జరుగుతున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు పడిపోవడంతో దేశంలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా రెట్టింపయింది. -
24 గంటల్లో గోధుమ పిండి ధర తగ్గించకుంటే దుస్తులు అమ్మేస్తా!
Pakistani Prime Minister Shehbaz Sharif given an ultimatum: వచ్చే 24 గంటల్లో 10 కిలోల గోధుమ పిండి బస్తా ధరను తగ్గించకుంటే తన బట్టలను అమ్మేస్తానని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఖైబర్ ఫక్తున్ఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్‌కి తన నిర్ణయాన్ని తెలిపారు. థకారా స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని షరీఫ్ ప్రసంగిస్తూ...నా దుస్తులు విక్రయించి అయిన ప్రజలకు తక్కువ ధరలో గోధుమ పిండి అందిస్తానని చెప్పారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశానికి నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని కానుకగా ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. దాదాపు ఐదు మిలయన్ల ఇళ్లు, 10 మిలయన్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోవడమే కాకుండా దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారంటూ ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. తాను దేశ శ్రేయస్సు కోసం ప్రాణాలర్పించడమే కాకుండా అభివృద్ధి పథంలో ఉంచుతానని షరీఫ్ బహిరంగంగా ప్రకటించారు. బలూచిస్తాన్ ఎన్నికల గురించి మాట్లాడుతూ..ప్రజలకు తనపై విశ్వాసం ఉందని తనకు అనుకూలంగా ఓట్లు వేయడానికి పోలింగ్‌బూత్‌లకు తరలి వచ్చారని షరీఫ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రజలకు గల నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ని ప్రజలు గద్ది దించుతారని గ్రహించే ఇంధన ధరలు తగ్గించారంటూ విమర్శించారు. అంతేకాదు షరీఫ్ తన సోదరుడు, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. ఆ సభలో పీఎంఎల్-ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ కూడా ప్రసంగించడమే కాకుండా తన తండ్రి నవాజ్ షరీఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. (చదవండి: షాకింగ్ వీడియో: మోనాలిసా పెయింటింగ్ ధ్వంసానికి యత్నం! మారు వేషంలో వచ్చి మరీ..) -
వేతనం తీసుకోని పిచ్చోడిని: పాకిస్థాన్ పీఎం
లాహోర్: పంజాబ్ సీఎంగా ఉండగా వేతనం కూడా తీసుకోకుండా మూర్ఖుడిలా వ్యవహరించానంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తనను తాను నిందించుకున్నారు. రూ.1,600 కోట్ల మనీలాండరింగ్ కేసులో లాహోర్ ప్రత్యేక కోర్టులో విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పన్నెండున్నరేళ్ల పాటు వేతనం, ఇతర లబ్ధిని పొందలేదు. నేనొక మూర్ఖుడిని. కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ కేసులో నన్ను నిందితుడిగా మార్చారు. ఆ దేవుడే నన్ను పాకిస్థాన్ ప్రధానిగా చేశారు’ అని చెప్పుకున్నారు. అవినీతి, అక్రమ సంపాదన ఆరోపణల నేపథ్యంలో షరీఫ్, ఆయన కుమారులు హంజా, సులేమాన్‌లపై 2020 నవంబరులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA)మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. హంజా షరీఫ్ ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు., సులేమాన్ యూకేలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి శనివారం ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. షెహబాజ్ కుటుంబానికి చెందిన 28 బినామీ ఖాతాలను తాము గుర్తించామని ఎఫ్ఐఏ కోర్టుకు తెలిపింది. 2008 నుంచి 2018 మధ్య ఈ బినామీ ఖాతాల ద్వారా ఆయన 14 బిలియన్ల పాకిస్తాన్ రూపాయలు అక్రమ సంపాదన ఆర్జించినట్లు ఆరోపించింది. చదవండి: నైజీరియా చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి -
తప్పడం లేదు.. మాజీ ప్రధాని వల్లే ఇలా జరిగింది
దాయాది దేశం పాకిస్తాన్లో పెట్రో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రో ధరల విషయంలో ప్రభుత్వం తీరుపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కౌంటర్ ఇచ్చారు. తమ దేశం(పాకిస్తాన్) దివాళా తీయకుండా ఉండేందుకే ఇంధన ధరలను పెంచడం తప్పనిసరి అని ప్రధానియ షరీఫ్ అన్నారు. పెట్రోలియం ధరల పెంపు నిర్ణయం కఠినమైనది కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటూ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలు, నిర్లక్ష్యం కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఇమ్రాన్‌పై మండిపడ్డారు. గత సర్కార్.. పెట్రోల్ సహా పలు ఇంధనాలపై సబ్సిడీ ఇచ్చింది. ధరల పెంపుపై ఐఎంఎఫ్ సూచనలను పట్టించుకోకుండా సబ్సిడీలను కొనసాగిస్తూ వచ్చారు. కానీ పెట్రోల్ ధరలు పెంచితేనే ఆర్థిక సాయం అందిస్తామని ఐఎంఎఫ్ తేల్చిచెప్పడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అంతకుముందు.. ఇంధనంపై అమలులో ఉన్న సబ్సిడీ సదుపాయాన్ని తొలగించే వరకు పాకిస్తాన్‌కు ఎలాంటి ఆర్థిక సాయం అందించలేమని ఐఎంఎఫ్ తెగెసి చెప్పింది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.179.85, డీజిల్ లీటరు రూ.174.15, కిరోసిన్ రూ.155.95, లైట్ డీజిల్ రూ.148.41కు ఎగబాకాయి. ఆర్థిక సాయంపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్) పాక్ బుధవారం జరిపిన చర్చలు విఫలం కావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ధరలు పెంచామని పాక్ ఆర్థిక మంత్రి మిఫాత్ ఇస్మైల్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఉత్తరకొరియాకు భారీ ఊరట.. -
చెత్త రాజకీయాలకు సామాన్యులు బలవ్వాలా?.. మాజీ క్రికెటర్ ఆగ్రహం
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్.. దేశ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయాలకు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ట్విటర్ వేదికగా పంచుకున్న మహ్మద్ హఫీజ్ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో పాటు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా పలు రాజకీయ నాయకులను ట్యాగ్ చేశాడు. ''లాహోర్‌లోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అందుబాటులో లేదు.. ఏటీఎంలో డబ్బులు రావడం లేదు.. మీ చెత్త రాజకీయ నిర్ణయాలతో సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి.. ఈ దేశ ప్రభుత్వం నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఏప్రిల్‌లో పాక్ 23వ కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టారు. మహ్మద్ హఫీజ్‌కు ఇది కొత్త కాదు. ఇంతకముందు క్రికెటర్‌గా ఉన్నంతకాలం తప్పు చేసిన ప్రతీసారి పీసీబీని ప్రశ్నిస్తూ వచ్చాడు. పీసీబీకి ఎన్నోసార్లు ఎదురెళ్లి రెబల్‌గా పేరు పొందినప్పటికి తనదైన ఆటతీరుతో జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగాడు. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన మహ్మద్ హఫీజ్ అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేశాడు. అతని కెప్టెన్సీలోనే పాకిస్తాన్ 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో టీమిండియాపై హఫీజ్ సేన విజయం సాధించి కప్ ఎగురేసుకుపోయింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ తరపున 218 వన్డేలు, 55 టెస్టులు, 119 టి20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 12వేలకు పైగా పరుగులు చేసిన హఫీజ్ 250కి పైగా వికెట్లు తీశాడు. చదవండి: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్లో పాక్ బౌలర్ కొత్త చరిత్ర No Petrol available in any petrol station in Lahore??? No cash available in ATM machines?? Why a common man have to suffer from political decisions. @ImranKhanPTI @CMShehbaz @MaryamNSharif @BBhuttoZardari — Mohammad Hafeez (@MHafeez22) May 24, 2022 -
అంతకన్నా పాక్ మీద అణుబాంబులు వేయండి: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను దొంగల చేతిలో పెట్టడం కంటే.. అణు బాంబులు వేసి పాకిస్థాన్‌ను నాశనం చేయడం మంచిదని వ్యాఖ్యానించారు. శుక్రవారం బనిగల నివాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షెహ్బాజ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. దొంగలు పాక్‌ను పాలించడం ఆశ్చర్యం కలిగించే విషయమని, అంతకంటే దేశాన్ని ఒక అణు బాంబు వేసి పాక్‌ను నాశనం చేయడం ఉత్తమం అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కొందరు.. గతంలో ప్రతీ వ్యవస్థను నాశనం చేసి అవినీతికి పాల్పడ్డారని, ఇప్పుడు వాళ్లను ఎవరు విచారిస్తారని అన్నారు. ఇతరులపై ఆరోపణలు చేయడం మాని.. ముందు ప్రభుత్వ పని తీరును చక్కబర్చాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్దేశించి హితవు పలికారు. పాక్ నిజమైన స్వాతంత్ర్యం కోసం ఈ నెల 20వ తేదీన 20 లక్షల మందితో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారాయన. దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రజల్లో తన ప్రసంగాల ద్వారా విషం నింపుతున్నారంటూ ప్రధాని షెహబాజ్, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ పై మండిపడుతున్నారు. -
ఇమ్రాన్ ఖాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇమ్రాన్ అరెస్ట్‌కు దాదాపుగా రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఇమ్రాన్ సౌదీ అరేబియాలో ఈద్ ప్రార్ధనల్లో ఉన్నారు. అది ముగిసిన అనంతరం ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. సౌదీ అరేబియాలోని మదీనాలో పాక్ ప్రస్తుత ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటనలో ఇమ్రాన్‌పై పోలీసులు దైవదూషణ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పాక్ మీడియా పేర్కొంది. పాక్ హోం మంత్రి రాణా సనవుల్లాకు సంబంధించిన మీడియా రిపోర్టుల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. కాగా సౌదీ అరేబియాలోని మదినాలో ప్రార్థనా మందిరం దగ్గర గత గురువారం పాక్ కొత్త ప్రధాని షాహబాజ్, అతని ప్రతినిధుల బృందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదైంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పాక్ ప్రధాని షాబాజ్‌ను ఉద్దేశించి దొంగ.. ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోల ఆధారంగా పాకిస్థాన్‌లో పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్‌తోపాటు ఇక మాజీ మంత్రులు ఫవాద్ చౌదరి, షేక్ రషీద్, ప్రధాని మాజీ సలహాదారు షాబాజ్ గుల్‌తో సహా 150 మంది ఉన్నారు. చదవండి: తక్కువ అంచనా వేశారు.. రష్యన్ బోట్లను పేల్చేశాం: ఉక్రెయిన్ “Chor Chor”slogans raised at Shahbaz Sharif and PML N delegation in Masjid e Nabvi Madina Munawara pic.twitter.com/Z2zPt8KhUK — Times of lsIamabad (@TimesofIslambad) April 28, 2022 -
కానుకలు అమ్ముకున్నారంటూ ఆరోపణలు.. స్పందించిన ఇమ్రాన్
ఇస్లామాబాద్: కానుకలను అమ్ముకున్నానన్న ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం ఘాటుగా స్పందించారు. అవి తనకు అందిన కానుకలని, వాటిని తోషాఖానాలో ఉంచాలో లేదో తన ఇష్టమేనని అన్నారు. పాకిస్తాన్ చట్టం ప్రకారం దేశ ప్రముఖులు తమకందని కానుకలను తోషాఖానాలో ఉంచాలి. లేదంటే సగం ధరకు కొనుక్కోవాలి. తాను అలాగే కొనుక్కున్నానని ఇమ్రాన్ అన్నారు. చట్ట ప్రకారం అది తన హక్కన్నారు. ఇమ్రాన్ 58 కానుకలను రూ.14 కోట్లకు అమ్ముకున్నారని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. పీఓకే ప్రధానిగా సర్దార్ తన్వీర్ ఇల్యాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ పార్టీ ప్రాంతీయ అధ్యక్షుడు సర్దార్ తన్వీర్ ఇల్యాస్ సోమవారం ఎన్నికయ్యారు. -
Pakistan PM: థ్యాంక్స్ ‘మోదీ జీ’.. పాక్ కొత్త పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ నూతన పీఎం షెహబాజ్ షరీఫ్ ఆదివారం లేఖ రాశారు. ఈ లేఖలో భారత్‌తో శాంతియుత సంబంధాలు, కశ్మీర్ సహా అపరిష్క్రత సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అయితే, పాక్‌లో అవిశ్వాస తీర్మానం తర్వాత ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఓ లేఖలో భారత ప్రధాని మోదీ.. షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు తెలిపారు. ఆ లేఖలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. కాగా, ఈ లేఖపై పాక్ ప్రధాని స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. భారత్‌తో పాకిస్తాన్ శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుట్టున్నట్టు తెలిపారు. అలాగే, జమ్ముకశ్మీర్‌తో సహా ఇతర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ త్యాగం అందరికీ తెలిసిందేనని అన్నారు. శాంతి కోసం పాటుపడాలని అన్నారు. సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక, ఆర్థికాభివృద్ధి గురించి ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందని షెహబాజ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పుల్వామా ఉగ్రదాడికి ప్రతి స్పందనగా 2019లో పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనంతరం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్తాన్‌తో భారత్ నిర్మాణాత్మక సంబంధాలను కోరుకుంటోందని ఇటీవలే స్పష్టం చేశారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. -
Shehbaz Sharif: షరీఫ్‌కు అమెరికా అభినందనలు
వాషింగ్టన్: పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు తాము తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు యథాతథంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. షరీఫ్ హయాంలో పాక్–అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడాలని బ్లింకెన్ ఆకాంక్షించారు. తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఇరు దేశాల నడుమ భేదాభిప్రాయాలు తలెత్తాయి. బ్లింకెన్ ప్రకటన పట్ల పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. చదవండి: (Russia Warns: ఆ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్) -
పరువు తీసుకున్న పాకిస్తాన్ నేతలు.. ట్రెండింగ్‌లో వీడియో
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో గత కొద్ది రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్‌ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో పాక్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం మాజీ ప్రధాని ఇమ్రాన్.. అటు పాకిస్తాన్ నేతలపై, ఇటు భారత్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. పాక్‌లో ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, నేతలు ఓ స్టార్ హోటల్లో రచ్చరచ్చ చేశారు. ఇఫ్తార్ విందులో ఇరు వర్గాల మద్దతుదారులు, నేతలు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు డ్రింక్స్ , ఫుడ్ విసురుకున్నారు. బూతులు తిట్టుకుంటూ నానా హంగామా చేశారు. ఓ బాడీ బిల్డర్.. వృద్ధుడిపై దాడికి దిగి భారీ పంచ్‌లు విసిరాడు. దీంతో కిందపడిపోయిన అతడిని లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. افطاری کرتے ہوئے آوازیں کسنے اور بدتمیزی کرنے پر مصطفی نواز کھوکھر اور نور عالم غصے میں آگئے،، یہ ہم لوگوں کو کیا سکھا رہے ہیں؟؟ pic.twitter.com/W9SrPbYG6A — Waseem Abbasi (@Wabbasi007) April 12, 2022 మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాను మరింత ప్రమాదకరంగా మారుతానని గురువారం హెచ్చరించారు. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రమాదకారి కాదు. కానీ ఇప్పుడు నేను మరింత ప్రమాదకారిగా మారుతానని పేర్కొన్నారు. అయితే అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి దిగిపోయి వారం కూడా గడవకముందే ఇమ్రాన్ ఖాన్ ఇలా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం అర్ధరాత్రి దాకా న్యాయస్థానం తలుపులు తెరవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలపాలని డిమాండ్ చేశారు. నేను న్యాయవ్యవస్థను అడుగుతున్నాని.. మీరు అర్ధరాత్రి వరకు కోర్టును ఎందుకు తెరిచి ఉంచారని ప్రశ్నించారు. Welcome to purana Pakistan#امپورٹڈ_حکومت_نامنظور pic.twitter.com/7XgB0dYUm9 — Chaudhry Ataur Rehman (@AtaurRehmanCh81) April 12, 2022 ఇది చదవండి: నార్త్ కొరియా కిమ్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాలో వైరల్ -
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పాక్ నూతన ప్రధాని
ఇస్లామాబాద్: ఇండియాతో శాంతియుత సహకార సంబంధాలను కోరుతున్నామని పాక్ నూతన ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పారు. తనకు అభినందనలు తెలిపిన భారత ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. జమ్ము, కశ్మీర్‌పై వివాదం పరిష్కారమైతేనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని పాత పాటే పాడారు. ఉగ్రవాదంపై పోరులో పాక్ ఎన్నో నష్టాలు చవిచూస్తోందన్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా కశ్మీర్ రక్తమోడుతోంటూ షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! పదవి చేపట్టిన అనంతరం ప్రధానిగా తొలిరోజున ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న వారానికి రెండు రోజుల సెలవులను షరీఫ్ మంగళవారం రద్దు చేశారు. దీంతో పాటు వారి పనివేళల్లో కూడా మార్పులు చేశారు. ఇకపై అధికారులకు కేవలం ఆదివారం మాత్రమే వీక్లీ ఆఫ్ ఉంటుందన్నారు. చదవండి: (కశ్మీర్‌పై షహబాజ్ కారుకూతలు) -
Sakshi Cartoon: ఎప్పటి వరకని అడుగుతున్నార్సార్! మీడియావారు!
ఎప్పటి వరకని అడుగుతున్నార్సార్! మీడియావారు! -
పురుటినొప్పుల ప్రజాస్వామ్యం
దాయాది దేశం పాకిస్తాన్ ప్రభవించిన సుముహూర్తం ఏమో కానీ, 75 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ ప్రజాస్వామ్యం పురిటినొప్పుల్లోనే ఉంది. ఇన్ని దశాబ్దాలలో ఏ ఒక్క ప్రధాన మంత్రీ పూర్తి పదవీకాలం గద్దెపై లేనే లేరు. ఆ సంప్రదాయమే మూడేళ్ళ పైచిలుకు క్రితం గద్దెనెక్కిన ఇమ్రాన్ ఖాన్‌కూ పునరావృతమైంది. కొద్ది వారాల నాటకీయ పరిణామాలు, అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ పదవీచ్యుతులై, ఆ దేశ ప్రధాన మంత్రి పీఠంపై కొత్త నేత కొలువు తీరాడు. 342 మంది సభ్యుల పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా 174 ఓట్లతో విశ్వాసం నిలుపుకొని, సోమవారం ఆ దేశ 23వ ప్రధాని అయ్యారు – పీఎంఎల్ (ఎన్) నేత షెబాజ్ షరీఫ్. గతంలో ఇమ్రాన్ ప్రవచించిన ‘నయా పాకిస్తాన్’ను మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షెబాజైనా తీసుకురాగలుగుతారా? క్రికెటర్‌గా మొదలై రాజకీయ నాయకుడై, 2018 జూలైలో ప్రధాని పీఠమెక్కిన ఇమ్రాన్ కథ ఎక్కడో మొదలై ఎలాగో ముగిసింది. అవినీతి రహిత, పేదసాదల అనుకూల, వ్యాపార స్నేహశీల ‘నయా పాకిస్తాన్’ తెస్తానన్నది ఆయన చెప్పిన మాట. 50 లక్షల చౌక గృహాల నిర్మాణం, కోటి ఉద్యోగాల కల్పన ఆయన చేసిన వాగ్దానం. కానీ, 51 వాగ్దానాల మేనిఫెస్టోలో రెండే పూర్తి చేశారు. మూడున్నరేళ్ళకే జనం ఆశలు కుప్పకూలాయి. 12.7 శాతం ద్రవ్యోల్బణం, 20 శాతం ఆహారో ల్బణం, సగానికి పడిపోయిన రూపాయి విలువ – ఇమ్రాన్ హయాం ఘనతలు. సైన్యం అండతో అడ్డదోవలో, ఎలెక్టెడ్ పీఎంగా కాక ‘సెలెక్టెడ్ పీఎం’గా సంకీర్ణ ప్రభుత్వపు గద్దెనెక్కారనే పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ చివరకు అదే సైన్యంతో సున్నం పెట్టుకొని, పదవి పోగొట్టుకోవడం విచిత్రం. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంలో ఓటమి పాలై, పదవీభ్రష్టుడైన తొలి పాకిస్తానీ పీఎంగా చరిత్ర కెక్కారు. పదవీ గండం తప్పదని తెలిశాక, తనకు మెజారిటీ లేని నేషనల్ అసెంబ్లీని రద్దు చేయమని అధ్యక్షుణ్ణి కోరడం సహా రకరకాల గూగ్లీలు విసిరారు. అవేవీ పారక, పెవిలియన్ దారి పట్టారు. 1996లో రాజకీయాల్లోకి వచ్చి, ‘పాకిస్తాన్ తెహ్రీక్–ఎ– ఇన్సాఫ్’ (పీటీఐ) పార్టీని స్థాపించి, 22 ఏళ్ళు అనేక రాజకీయ పోరాటాలు చేసి, ప్రధాని పీఠమెక్కిన ఇమ్రాన్ పదవీచ్యుతికి ఆయన స్వీయలోపాలే కారణం. ఆఖరి బంతి దాకా ఆడకుండానే, పిచ్ మీది వికెట్లు పీకేసి వెళ్ళిపోయినట్టుగా ఆదివారం అవిశ్వాస తీర్మానం రోజున కానీ, సోమవారం కొత్త పీఎం ఎన్నిక వేళ కానీ ఇమ్రాన్ పార్లమెంట్లో కనిపించనే లేదు. ఆయన తన ప్రయత్నాలతో పాకిస్తాన్‌ను మరింత అనిశ్చితిలోకీ, రాజ్యాంగ సంక్షోభంలోకి నెట్టారు. చివరకు దేశ సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చరిత్ర చూస్తే, 1973 ఏప్రిల్ 10న పాకిస్తాన్ పార్లమెంట్ తమ దేశ రాజ్యాంగాన్ని ఆమోదించింది. సరిగ్గా 49 ఏళ్ళ తరువాత అదే రోజున అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన తొలి పాకిస్తానీ ప్రధాని అయ్యారు ఇమ్రాన్. ఆయన మాత్రం ఇప్పటికీ తన పదవీ భ్రష్టతలో అమెరికన్ విదేశీ హస్తం సహా ఆరోపణలు, నిరసనలతో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా ప్రజల్లో అమరవీరుడు అనిపించుకొని, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు. పాకిస్తానీ ప్రజాస్వామ్యం ఆది నుంచీ గిడసబారిన బోన్సాయ్ చెట్టే! స్వాతంత్య్రం సిద్ధించిన 1947 నుంచి ఇప్పటి దాకా 75 ఏళ్ళ చరిత్రలో పాకిస్తాన్ 29 మంది ప్రధాన మంత్రులను చూసింది. వారిలో ఏ ఒక్కరూ తమ పదవీ కాలం పూర్తి చేసుకోలేదు. ఒకరైతే, ఏకంగా ఒకే ఏడాదిలో రెండుసార్లు ఆ పదవి చేపట్టారంటే ప్రధాన మంత్రి పీఠం ఎంత ఊగిసలాడుతోందో అర్థం చేసుకోవచ్చు. అవినీతి ఆరోపణలు, సైనిక తిరుగుబాట్లు, అధికార పార్టీలలో అంతర్గత తగాదాలతో బలవంతపు రాజీనామాల లాంటి కారణాలతో 18 సార్లు పాకిస్తానీ పీఎంలు పదవీచ్యుతులయ్యారు. ఒక్క 1993లోనే ఏకంగా అయిదుగురు మారారు. దేశ తొలి ప్రధాని లియాఖత్ అలీఖాన్ ఒక్కరే అధికకాలం (4ఏళ్ళ 2నెలలు) పదవిలో ఉన్నారు. ఆయనా 1951 అక్టోబర్‌లో హత్యకు గురయ్యారు. షెబాజ్ కుటుంబ మూలాలు అవిభక్త భారత్‌లో అమృత్సర్ సమీపంలోని జతీ ఉమ్రాలో ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం రాక ముందే పాకిస్తాన్‌కు తరలిపోయినా, ఆ గ్రామానికీ, గ్రామస్థు లకు సాయం చేయడంలో 70 ఏళ్ళ షెబాజ్ తదితరులు అనుబంధం వీడలేదు. రాజకీయ, దౌత్య, వాణిజ్య బంధాలతో అంతర్జాతీయంగానూ భారత్‌కూ స్నేహ హస్తం అందిస్తారా? పాకిస్తాన్ అనేక సమస్యలతో సతమతమవుతున్న వేళ షెబాజ్‌కు ఇప్పుడు దక్కినది ముళ్ళ కిరీటమే! అప్పులు పేరుకుపోయాయి. డాలర్‌కు 190 రూపాయల స్థాయికి పాకిస్తానీ రూపాయి పడిపోయింది. ఒక్క మాటలో పాకిస్తానీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అంతర్గత తీవ్రవాదం పాక్‌కు ఉన్న మరో సమస్య. అమెరికా సహా అనేక దేశాలతో విదేశాంగ సంబంధాలూ ఆశాజనకంగా లేవు. ఈ సమస్యల్ని షెబాజ్ ఎలా ఎదుర్కొంటారో? ఇమ్రాన్‌కు భిన్నంగా అమెరికాతో స్నేహం కోరుతున్న ఈ కొత్త ప్రధాని సైతం పాకిస్తాన్ సైనిక నేత జనరల్ బాజ్వా చేతిలో కీలుబొమ్మ అని ప్రచారం. పైపెచ్చు, షెబాజ్ మీదా అనేక అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులున్నాయి. ఇలాంటి వ్యక్తిని పీఎంగా ఎలా ఎన్నుకుంటారంటున్న ఇమ్రాన్, ఆయన పార్టీ సభ్యులు పార్లమెంట్ నుంచి రాజీనామాల బాట పడుతున్నట్టు వార్త. అంటే, వచ్చే ఏడాది జరగాల్సిన జనరల్ ఎన్నికల తతంగం మరింత త్వరగానే తప్పేలా లేదు. ప్రభుత్వాల ఏర్పాటు, కూలిపోవడం ఏదైనా సరే ప్రజాకాంక్షలకు తగ్గట్టు జరిగితేనే ఏ ప్రజాస్వామ్యానికైనా మంచిది. లేదంటే, ఎవరు పీఠమెక్కినా అదే పాత కథ పునరావృతమవుతుంది. -
రాజకీయాల్లో ఆవేశం స్టార్.. షెహబాజ్
ప్రతిపక్షాలు ఏకంకాగా.. ఎట్టకేలకు ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించి తాను ప్రధాని పీఠం మీద కూర్చోబోతున్నాడు షెహబాజ్ షరీఫ్ . డెబ్భై ఏళ్ల ఈ ప్రతిపక్ష నేత రాజకీయాలతోనే కాదు.. హత్యారోపణలు, వివాహాలతో, అవినీతి ఆరోపణలతో చాలాసార్లు వార్తల్లోకెక్కాడు కూడా. అంతేకాదు రాజకీయాల్లోనూ ఆవేశపూరితుడనే పేరుంది ఆయనకి. బహిరంగ సభల్లో, ర్యాలీ, చట్టసభ.. వేదిక ఏదైనా సరే ఊగిపోతూ చేసే ప్రసంగాలు.. జనాల్లో జోష్ నింపడమే కాదు.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంటాయి కూడా!. ► తొలుత వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న షెహబాజ్.. ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణించడం మొదలుపెట్టారు. పాక్‌లో ఏ ముఖ్యమంత్రి సాధించలేని ఫీట్‌ను(మూడుసార్లు సీఎంగా ఎన్నిక కావడం) సాధించాడీయన. ► అయితే మొదటి దఫా సీఎంగా పని చేసిన టైంలో నేరాలకు ఘోరాలకు పాల్పడడన్న ఆరోపణలతో బలవంతగా దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. స్వదేశానికి వచ్చే ప్రయత్నాలన్ని బెడిసి కొట్టాయి ఆయనకి. చివరకు.. పాక్ సుప్రీం కోర్టు జోక్యంతో తిరిగి పాక్‌లో ఎలాగోలా అడుగుపెట్టాడు. ► అనేక మలుపుల తర్వాత హత్యలకు సంబంధించిన ఆరోపణల్లో షెహబాజ్‌కు విముక్తి లభించింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో.. పంజాబ్‌కు మళ్లీ రెండు, మూడో దఫా సీఎంగా ఎంపికయ్యాడు. ► సోదరుడు నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు తర్వాత షెహబాజ్ షరీఫ్ ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్(పీఎంఎల్-ఎన్) చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2018 నుంచి నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గళం వినిపించడం మొదలుపెట్టాడు. ► మనీలాండరింగ్ కేసులో 2019 డిసెంబర్లో ఆయన, ఆయన కొడుక్కి సంబంధించిన ఆస్తులను కొన్నింటినిపై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో చర్యలు తీసుకుంది. ఆపై లాహోర్ హైకోర్టు ఆదేశాలతో ఆయన్ని అరెస్ట్ చేయగా.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో బెయిల్ మీద బయటకు వచ్చారు. Entertainment will continue in Pakistan. Meet Shahbaz Sharif Next PM of Pakistan & his Highly Entertaining Hand Movements 😂😂 #ShahbazSharif #ImranKhan #NoConfidenceMotion pic.twitter.com/FdtVtkgt2v — Farhad Khan (@Farhadkhan998) April 9, 2022 ► చివరకు.. ఇమ్రాన్ ఖాన్ మీది వ్యతిరేకతను వాడుకుని ప్రధాని పీఠంగా కూర్చున్నారు. షెహబాజ్ షరీఫ్ పాక్ 23వ ప్రధాని. ► 1951, సెప్టెంబర్ 23న జన్మించిన మియాన్ ముహ్మద్ షెహబాజ్ షరీఫ్.. వ్యాపార-రాజకీయాలతో ఎదిగి సోదరుడు నవాజ్ షరీఫ్ కంటే ధనికుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ► షెహబాజ్.. నుస్రత్‌ను మొదటి వివాహం చేసుకున్నాడు. నలుగురు పిల్లలు, 2003లో తెహమినా దుర్రనితో రెండో వివాహం జరిగింది. ► అయితే ఆయన వైవాహిక జీవితంపైనా విమర్శలు వినిపిస్తుంటాయి. రహస్యంగా ఎంతో మందిని ఆయన వివాహం చేసుకున్నాడంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తుంటారు. ► వంశపారంపర్యంగా వస్తున్న లాహోర్‌లోని రాయివిండ్ ప్యాలెస్‌లోనే షెహబాజ్ కుటుంబం జీవిస్తోంది. ► అభ్యుదయ కవిగా పేరున్న షెహబాజ్.. కవితా పంక్తులను విసురుతూ చేతులను ఆవేశంగా కదిలిస్తూ ప్రసంగాల్ని రక్తికట్టిస్తుంటారు. ► చట్ట సభల్లో, పొలిటికల్ ర్యాలీల్లో ప్రత్యర్థుల మీద విమర్శలు సంధించేప్పుడు చేతులు ఆడిస్తూ.. భయంకరంగా ఊగిపోతూ స్పీచ్‌లు దంచుతుంటాడు. ► అందుకే ప్రధాని అయిన ఈ టైంలో ఆయన ఆవేశపూరితమైన ప్రసంగాలు, చేతుల కదిలికలకు సంబంధించిన జిఫ్ ఫైల్స్, యానిమేషన్ బొమ్మలు వైరల్ అవుతున్నాయి. ► పాక్‌లోనే కాదు.. ఇప్పుడు ఇండియాలోనూ అందుకు సంబంధించిన మీమ్ ట్రెండ్ కొనసాగుతుండడం విశేషం. -
పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ (70) సోమవారం ఎన్నికయ్యారు. పాక్ పార్లమెంట్లో ఇమ్రాన్‌పార్టీ వాకౌట్‌తో షరీఫ్ ఎన్నికకు ఎలాంటి వ్యతిరేకతా రాలేదు. షరీఫ్ పదవీ స్వీకారానికి ముందు అధ్యక్షుడు అరీఫ్ అలీ అనారోగ్యకారణాలు చూపుతూ సెలవు పెట్టారు. దీంతో షరీఫ్‌తో సెనేట్ చైర్మన్ సాదిక్ సంజ్రానీ ప్రమాణ స్వీకారం చేయించారు. షరీఫ్ ఎన్నికతో గతనెల 8న ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో మొదలైన పాక్ రాజకీయ డ్రామాకు తెరపడినట్లయిందని నిపుణులు భావిస్తున్నారు. అంతకుముందు పార్లమెంట్లో షరీఫ్‌కు 174 ఓట్లు రావడంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌కు ఆయన్ను ప్రధానిగా ప్రకటిస్తున్నట్లు స్పీకర్ అయాజ్ సిద్ధిఖీ తెలిపారు. డిఫ్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరీ పక్కకు తప్పుకోవడంతో సిద్ధిఖీ సభను నడిపించారు. ప్రధానిగా ఎన్నికయ్యేందుకు పాక్ పార్లమెంట్లో 172 ఓట్లు కావాల్సి ఉంది. అనంతరం పార్లమెంట్‌నుద్దేశించి షరీఫ్ ప్రసంగించారు. పాక్ చరిత్రలో ఒక ప్రధానికి వ్యతిరేకంగా అవిశ్వాసం విజయం సాధించడం ఇదే తొలిసారన్నారు. చెడుపై మంచి గెలిచిందన్నారు. దేశానికి ఇది శుభదినమని, ఒక ఎంచుకున్న ప్రధానిని (ఇమ్రాన్) చట్టబద్ధంగా తొలగించిన రోజని ఆయన అభివర్ణించారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు షహబాజ్ సోదరుడు. తన ఎన్నిక రోజు పాక్ రూపాయి బలపడడం ప్రజల్లో ఆనందానికి చిహ్నమన్నారు. అవిశ్వాసంపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన ప్రశంసించారు. ఆ తీర్పు వచ్చిన రోజు పాక్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అంతా అబద్ధం తమ ప్రభుత్వాన్ని పడదోసేందుకు విదేశీ కుట్ర జరిగిందన్న ఇమ్రాన్ వ్యాఖ్యలు డ్రామాగా షరీఫ్ విమర్శించారు. విదేశీ కుట్ర జరుగుతోందన్న వివాదాస్పద లేఖపై పార్లమెంట్ భద్రతా కమిటీకి వివరణ ఇస్తామన్నారు. సైన్యాధికారులు, ప్రభుత్వాధికారులు, ఐఎస్ఐ చీఫ్, విదేశాంగ కార్యదర్శి, సదరు లేఖ రాసిన రాయబారి సమక్షంలోనే కమిటీ సభ్యులకు వివరిస్తామన్నారు. ఈ వివాదంలో కుట్ర ఉందని తేలితే తాను రాజీనామాకైనా సిద్ధమన్నారు. నిజానికి సదరు ఉత్తరం మార్చి 7న వచ్చిందని, కానీ తాము అవిశ్వాసా న్ని అంతకుముందే నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రపంచ రాజకీయాల్లో తమకు సహకరిస్తున్నందుకు ఆయన చైనాను ప్రశంసించారు. పీటీఐ వాకౌట్: పాక్ కొత్త ప్రధాని ఎన్నిక సమావేశాన్ని మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ బహిష్కరించింది. అంతకుముందు పీటీఐ నేత, మాజీ విదేశాంగ మంత్రి ఖురేషీ మాట్లాడుతూ పాకిస్తాన్ ముందు ఆత్మ గౌరవం, బానిసత్వం అనే రెండు దారులున్నాయని చెప్పారు. తమ పార్టీ ఎన్నికలో పాల్గొనకుండా వాకౌట్ చేస్తోందని ప్రకటించారు. తమ పార్టీ సభ్యులంతా జాతీయ అసెంబ్లీ నుంచి రాజీనామా చేస్తారని, విదేశీ ఎజెండాతో పనిచేసే ఏ ప్రభుత్వంలో భాగస్వాములు కాబోరని మాజీ మంత్రి ఫహాద్ చౌదరీ చెప్పారు. షరీఫ్‌కు మోదీ అభినందనలు న్యూఢిల్లీ: పాకిస్తాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్‌కు భారత ప్రధాని మోదీ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. భారత్ ఎప్పుడూ శాంతిని, స్థిరత్వాన్ని కోరుతుందన్నారు. ఉపఖండంలో ఉగ్రవాదం ఉండకూడదన్నది భారత్ అభిలాషన్నారు. అప్పుడే అభివృద్ధిపై దృష్టి సారించగలమన్నారు. సవాళ్లు అనేకం రాజీనామా చేసిన ఇమ్రాన్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతోంది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తోంది. ఈ నేపథ్యంలో దేశ శాంతి భద్రతలను, ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాల్సిన పెను సవాళ్లు షరీఫ్ ముందున్నాయి. పార్లమెంట్లో షరీఫ్ పార్టీకి 86 సీట్లే ఉన్నాయి. పలు మిత్రపక్షాల సహకారంతో తాజా ప్రభుత్వం ఏర్పడింది. వీరిలో ఏ ఒక్కరు అలిగినా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. వీరందరినీ సంతృప్తి పరచడం, నూతన నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అంచనాలను అందుకోవడం కూడా షరీఫ్‌కు సవాలేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశంలో పలు చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. విదేశాంగ శాఖ పనితీరు మసకబారింది. భారత్‌తో ఉద్రిక్తతలు సరేసరి! వీటన్నింటినీ తట్టుకొని షరీఫ్ మనుగడ సాగించాల్సిఉంది. షహబాజ్‌పై నేరారోపణ విచారణ వాయిదా ఈనెల 27కు వాయిదా వేసిన పాక్ కోర్టు లాహోర్: పాక్ కొత్త ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆయన కుమారుడు హంజాపై మనీలాండరింగ్ కేసులో నేరారోపణను పాక్ కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. ఆ రోజు వరకు వీరికి ప్రీ అరెస్టు బెయిల్‌ను కూడా మంజూరు చేసింది. దీంతో షరీఫ్ ప్రధాని అయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టులో వ్యక్తిగత విచారణ నుంచి తనను ఒక్కరోజు మినహాయించాలని, తమ బెయిల్‌ను పొడిగించాలని అంతకుముందు షహబాజ్ వేసిన పిటిషన్‌ను ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) కోర్టు అనుమతించిందని కోర్టు అధికారి ఒకరు చెప్పారు. విచారణకు ఎఫ్ఐఏ టీమ్ న్యాయవాది హాజరుకానందున విచారణ వాయిదా పడింది. 2020లో షహబాజ్ ఆయన కుమారులు హంజా, సులేమాన్‌పై ఎఫ్ఐఏ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సులేమాన్ అప్పట్లో యూకేకు పారిపోయారు. వీరంతా కలిసి 2008–18 కాలంలో 1,400 కోట్ల పాక్ రూపాయల మేర మోసం చేశారని ఆరోపణలున్నాయి. త్వరలో పాక్‌కు నవాజ్ లండన్‌లో ఉంటున్న పాక్ మాజీ ప్రధాని, షహబాజ్ సోదరుడు నవాజ్ షరీఫ్ వచ్చేనెల్లో ఈద్ తర్వాత స్వదేశానికి వచ్చే అవకాశాలున్నాయని పీఎంఎల్ఎన్ పార్టీ నేతలు చెప్పారు. నవాజ్‌పై ఇమ్రాన్ ప్రభుత్వం పలు అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో ఆయన చికిత్స కోసమని కోర్టు అనుమతి తీసుకొని 2019లో దేశం విడిచి లండన్ వెళ్లారు.