పాకిస్తాన్‌లో జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం | EAM S Jaishankar And Pakistan PM Shehbaz Sharif Shake Hands In Pakistan Ahead Of SCO Summit | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం

Published Tue, Oct 15 2024 8:58 PM | Last Updated on Wed, Oct 16 2024 9:54 AM

S Jaishankar Shehbaz Sharif shake hands in Pakistan

ఇస్లామాబాద్: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు హాజరయ్యేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్ మంగళవారం పాకిస్తాన్‌ చేరుకున్నారు. ఆయనకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాకిస్తాన్ సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇస్లామాబాద్‌లో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో జై శంకర్‌ మావేశమయ్యారు.

సభ్యదేశాల అతిథుల కోసం షరీఫ్ ఏర్పాటు చేసిన విందులో ఇరువురు నేతలం కరచాలనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. సభ్యదేశాల నుంచి అగ్రనేతలు పాల్గొంటున్న ఈ సమ్మిట్‌లో ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ, సామాజిక-సాంస్కృతిక సంబంధాల్లో సభ్యదేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. 

ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా  కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇస్లామాబాద్‌, రావల్పిండిలో కీలక మార్గాలు, వ్యాపారాలను మూసివేశారు. ఇదిలా ఉండగా భారత్-పాక్ మధ్య సంబంధాలు సన్నగిల్లిన  క్రమంలో భారత సీనియర్ మంత్రి ఆదేశంలో అడుగుపెట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2015 డిసెంబర్‌లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆప్ఘనిస్థాన్‌లో సదస్సు కోసం ఇస్లామాబాద్‌ వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement