shanghai cooperation organisation
-
S Jaishankar: ఆత్మపరిశీలన చేసుకోండి
ఇస్లామాబాద్: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. పొరుగు దేశంతో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికారు. పాక్ పట్ల భారత్‌కు విశ్వాసం సడలిపోవడానికి కారణాలేమిటో అన్వేíÙంచాలని సూచించారు. విశ్వాసం బలపడితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని తేల్చిచెప్పారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అనే మూడు భూతాలు ప్రాంతీయ సహకారానికి అతిపెద్ద అవరోధాలు అని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు భారత్–పాకిస్తాన్ మధ్య వ్యాపారం, వాణిజ్యం, ఇంధన సరఫరా, ప్రజల మధ్య అనుసంధానాన్ని నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన బుధవారం జరిగిన షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) సభ్యదేశాల కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్(సీహెచ్‌జీ) 32వ సదస్సులో జైశంకర్ మాట్లాడారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమతాన్ని తప్పనిసరిగా గౌరవిస్తేనే సంబంధాలు బలపడతాయని, వ్యాపారం, వాణిజ్యం, అనుసంధానం కొనసాగుతాయని స్పష్టంచేశారు. పరస్పరం గౌరవించుకోవడంపైనే పరస్పర సహకారం అధారపడి ఉంటుందన్నారు. పరస్పర విశ్వాసంతో కలిసికట్టుగా పనిచేస్తే ఎస్సీఓ సభ్యదేశాలు ఎంతగానో లబ్ధి పొందుతాయని సూచించారు. 3 భూతాలపై రాజీలేని పోరాటం చేయాలి ఎస్సీఓ చార్టర్‌కు సభ్యదేశాలన్నీ కట్టుబడి ఉండాలని జైశంకర్ స్పష్టంచేశారు. చార్టర్ పట్ల మన అంకితభావం స్థిరంగా ఉన్నప్పుడే ఆశించిన లక్ష్యాలు సాధించగలమని అన్నారు. ప్రాంతీయంగా అభివృద్ధి జరగాలంటే శాంతి, స్థిరత్వం అవసరమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదంపై అందరూ రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతను జైశంకర్ మరోసారి నొక్కిచెప్పారు. భద్రతా మండలిని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా మార్చాలంటే సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిందేనని వెల్లడించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితిపై ఎస్సీఓ ఒత్తిడి పెంచాలని కోరారు. అంతకుముందు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు జిన్నా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న జైశంకర్‌తో పాక్ ప్రధాని షరీఫ్ కరచాలనం చేసి సాదర స్వాగతం పలికారు. -
పాకిస్తాన్లో జై శంకర్.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం
ఇస్లామాబాద్: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సదస్సుకు హాజరయ్యేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం పాకిస్తాన్ చేరుకున్నారు. ఆయనకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాకిస్తాన్ సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో జై శంకర్ మావేశమయ్యారు.సభ్యదేశాల అతిథుల కోసం షరీఫ్ ఏర్పాటు చేసిన విందులో ఇరువురు నేతలం కరచాలనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. సభ్యదేశాల నుంచి అగ్రనేతలు పాల్గొంటున్న ఈ సమ్మిట్‌లో ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ, సామాజిక-సాంస్కృతిక సంబంధాల్లో సభ్యదేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. #WATCH | Islamabad: Pakistan PM Shehbaz Sharif welcomes EAM Dr S Jaishankar and other SCO Council Heads of Government, to a dinner hosted by him.EAM is in Pakistan to participate in the 23rd Meeting of SCO Council of Heads of Government.(Video Source: PTV) pic.twitter.com/BHtUhuLm9e— ANI (@ANI) October 15, 2024ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇస్లామాబాద్, రావల్పిండిలో కీలక మార్గాలు, వ్యాపారాలను మూసివేశారు. ఇదిలా ఉండగా భారత్-పాక్ మధ్య సంబంధాలు సన్నగిల్లిన క్రమంలో భారత సీనియర్ మంత్రి ఆదేశంలో అడుగుపెట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2015 డిసెంబర్లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆప్ఘనిస్థాన్‌లో సదస్సు కోసం ఇస్లామాబాద్ వెళ్లారు.Landed in Islamabad to take part in SCO Council of Heads of Government Meeting. pic.twitter.com/PQ4IFPZtlp— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 15, 2024 -
పాక్ ప్రధానికి వినబడేలా.. మోదీ స్ట్రాంగ్ మెసేజ్
న్యూఢిల్లీ: ఉగ్రవాదం అనేది ఒక ప్రాంతానికే కాదు.. యావత్ ప్రపంచ శాంతికి ప్రమాదకారి. అలాంటి ఉగ్రవాద కట్టడిలో ద్వంద్వ వైఖరి అసలు పనికిరాదు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించడానికి కూటమి వెనుకాడకూడదు.. అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సందేశం ఇచ్చారు. మంగళవారం జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సులో(వర్చువల్)కి భారత్ అధ్యక్షత వహించింది. మన దేశం తరపున ప్రధాని మోదీ ఈ సదస్సులో ప్రసంగించారు. ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే.. కజకస్థాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్(కొత్త సభ్యదేశంగా చేరింది) ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ఎస్సీవో సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ.. నిర్ణయాత్మకమైన చర్యల ద్వారా ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్‌లకు అడ్డుకట్ట వేయాలని పిలుపు ఇచ్చారాయన. పరస్సర సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని సభ్య దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారాయన. ఉగ్రవాదంపై సమిష్టింగా మనమంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఏమాత్రం సరికాదంటూ దాయాది దేశం పాక్‌కు చురకలంటించారాయన. ఇక ఇదే వేదిక నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సంక్షోభాలు.. సమస్యలపైనా ప్రధాని మోదీ చర్చించారు. 1996లో చైనా, కజకస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజికిస్తాన్ల పంచ దేశాల కూటమితో షాంగై ఫైవ్ ఆవిర్భవించింది. దానికి కొససాగింపుగా ఏర్పడిందే SCO. ప్రస్తుతం ఇందులో తొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి. 2005 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో పరిశీలన దేశంగా భారత్ కొనసాగుతూ వస్తోంది. అయితే.. 2017లో ఆస్తానాలో జరిగిన సదస్సు ద్వారా పూర్తి సభ్యత్వ దేశంగా భారత్ మారింది. ఇదీ చదవండి: ఒకే ఫొటో.. అంత మందికి ఎలాగబ్బా? -
విదేశీ మారక నిల్వల కంటే వేగంగా... పాక్ విశ్వసనీయత పతనం
బెనౌలిమ్ (గోవా): అంతర్జాతీయ వేదికలపై వక్రబుద్ధి ప్రదర్శించే పాకిస్తాన్ తీరుపై విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ విశ్వసనీయత దాని విదేశీ మారక ద్రవ్య నిల్వల కంటే కూడా శరవేగంగా క్షీణిస్తోందంటూ దుయ్యబట్టారు. శుక్రవారం గోవాలో ముగిసిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) విదేశాంగ మంత్రుల భేటీ ఇందుకు వేదికగా మారింది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భేటీలో లేవనెత్తారు. దానిపై పునరాలోచన చేసేదాకా భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు పాక్ సిద్ధంగా లేదన్నారు. దాంతో భేటీ అనంతరం జై శంకర్ మీడియాతో మాట్లాడుతూ బిలావల్ వ్యాఖ్యలను తూర్పారబట్టారు. ‘‘ఆర్టికల్ 370 ముగిసిన చరిత్ర. ఇప్పటికైనా నిద్ర నుంచి మేల్కొని వాస్తవాలు గమనించండి’’ అంటూ చురకలు వేశారు. బిలావల్ ‘ఉగ్రవాదానికి ప్రోత్సాహకుడు, సమర్థకుడు, అధికార ప్రతినిధి’గా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు! తామూ ఉగ్రవాద బాధితులమేనన్న బిలావల్ వ్యాఖ్యలపైనా జై శంకర్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, పాక్ చేతులు కలుపుతాయా అని ప్రశ్నించగా, ఉగ్రవాద బాధితులు ఎప్పుడూ ఉగ్రవాదానికి పాల్పడిన వారితో కలిసి ఉగ్రవాదంపై చర్చించడానికి కూర్చోరని బదులిచ్చారు. చేశారు. జీ 20 సన్నాహక సమావేశాలను జమ్మూ కశ్మీర్లో జరపడంపై బిలావల్ లేవనెత్తిన అభ్యంతరాలనూ కొట్టిపారేశారు. ‘‘అసలు జీ 20 భేటీలతో మీకేం సంబంధం? దానికంటే, జమ్మూ కశ్మీర్లో మీరు ఆక్రమించుకున్న భూభాగాలను ఎప్పుడు ఖాళీ చేస్తారన్న దానిపై మాట్లాడితే బాగుంటుంది’’ అంటూ వాతలు పెట్టారు. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. ‘‘మేమేదో పాక్‌పై దౌత్యపరంగా పై చేయి సాధించేందుకు ప్రయత్నించడం లేదు. ఆ దేశం అసలు రంగును రాజకీయంగా, దౌత్యపరంగా ఎప్పటికప్పుడు ప్రపంచం ముందుంచుతున్నాం’’ అని వివరించారు. ఉగ్రమూలాల్ని పెకిలించాలి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమూలంగా నాశనం చేయాలని ఎస్సీఓ భేటీలో జై శంకర్ పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాదం ఇప్పటికీ కొనసాగుతోంది. దానినెవరూ సమర్థించరాదు. ప్రభుత్వాల సాయంతో తెరవెనుక సాగే సీమాంతర ఉగ్రవాదం సహా ఏరూపంలో ఉన్నా అరికట్టాలి’’ అని పాక్‌నుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రమూకల ఆర్థిక మూలాలను సమూలంగా నాశనం చేయాలన్నారు. ఇది ఎస్సీవో లక్ష్యాల్లో ఒకటని గుర్తు చేశారు. సభ్య దేశాల శాంతి, సుస్థిరతలకు భారత్ అత్యంత ప్రాముఖ్యతనిస్తుందన్నారు. ద్వైపాక్షిక అంశాలను ప్రస్తావించరాదనే ఎస్సీవో నిబంధనలను ఉల్లంఘించకుండానే పాక్‌కు మంత్రి తలంటారు. బిలావల్ మాట్లాడుతూ దౌత్యపరమైన అంశాల్లో ఉగ్రవాదాన్ని అస్త్రంగా వాడుకోరాదన్నారు. ‘‘ఈ సమస్యను రాజకీయాల నుంచి వేరు చేసి అందరూ కలిసికట్టుగా పోరాడాలి. నేనూ ఉగ్రవాద బాధితుడినే. నా తల్లి బేనజీర్ భుట్టో ఉగ్రవాదానికి బలయ్యారు’’ అన్నారు. నమస్కారంతోనే భుట్టోకు పలకరింపు భారత్ సారథ్యంలో ఎస్సీవో సదస్సుకు హాజరైన పాక్ మంత్రి భుట్టో తదితర సభ్య దేశాల విదేశాంగ మంత్రులకు ఎస్.జై శంకర్ తాజ్ ఎగ్జోటికా రిసార్టులో ఏర్పాటు చేసిన వేదిక వద్ద నమస్తేతో స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం హోటల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్లో మాత్రం భుట్టో సహా అతిథులందరితోనూ మంత్రి జై శంకర్ కరచాలనం చేశారు. కార్యక్రమంలో రష్యా, చైనా విదేశాంగ మంత్రులు వరుసగా బిలావల్ భుట్టో, సెర్గీ లావ్రోవ్, క్విన్ గాంగ్‌తోపాటు ఖజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మంత్రులు పాల్గొన్నారు. -
చైనా అధ్యక్షుడికి దూరం దూరంగా మోదీ.. నో స్మైల్, నో షేక్‌హ్యండ్
సమర్ఖండ్: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్ నగరంలో ఫాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ తదితర నేతలు హాజరయ్యారు. ఎస్సీఓ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఒకే వేదికపై కనిపించారు. గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత వీరిద్దరూ అంతర్జాతీయ వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. అయితే చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ దూరం దూరంగా ఉన్నారు. వేదికపై ఫోటో దిగే సమయంలో ఇద్దరు నేతలు పక్కపక్కనే నిల్చున్నప్పటికీ కనీసం నవ్వలేదు. ఇరువురు కరచాలనం(షేక్‌హ్యండ్) కూడా చేసుకోలేదు. శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు పరస్పరం వ్యవహరించిన దూరం చూస్తుంటే భారత్-చైనా సరిహద్దు వివాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వ్యాపార-వాణిజ్యం, ఇంధన సరఫరా వంటి కీలక అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా 2001లో షాంఘైలో ఏర్పాటైన ఎస్సీఓలో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా 2020లో మయన్మార్ పర్యటన అనంతరం జిన్‌పింగ్ కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లడం కూడా ఇదే తొలిసారి. చదవండి: ‘ఈయనేం ప్రధాని.. దేశానికి తలవంపులు తెస్తున్నారు’ -
జిన్‌పింగ్ పుతిన్, మోదీని కలుస్తారా? నిరాకరించిన చైనా !
బీజింగ్: ఈ వారంలోనే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎన్సీఓ) ప్రాంతీయ భద్రతా బ్లాక్ సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు సంబంధించిన ప్రణాళికా విషయాలు గురించి వెళ్లడించడానికి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఈ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 15 నుంచి ఉజ్బెకిస్తాన్‌లో జరగనుంది. బీజింగ్ ప్రధాన కార్యాలయంలో ఈ సదస్సు చైనా, భారత్, పాకిస్తాన్ దేశాల తోపాటు మధ్య ఆసియా దేశాలు కజికిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ వంటి దేశాలతో నిర్వహిస్తోంది. అందులో భాగంగానే చైనా అద్యక్షుడు జిన్‌పింగ్ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలలో పర్యటించనున్నారు. కరోనా మహమ్మారి తదనంతర ఇదే అతని తొలి విదేశీ పర్యటన. ఈ సదస్సు సందర్భంగా నాయకులు గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న సంస్థ కార్యకలాపాలను సమీక్షించడమే కాకుండా బహుపాక్షిక సహకారం గురించి చర్చించాలని భావిస్తున్నారు. ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సదస్సులో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: మాస్క్ థరించండి అన్నందుకు...కాల్చి చంపేశాడు) -
ఉగ్రవాదానికి ఊతం.. మానవాళిపై దాడి: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సమాజ శాంతి భద్రతలకు ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బుధవారం తజకిస్తాన్‌లోని డషన్బెలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి ఎలాంటి సహకారం అందించినా అది మానవాళిపై దాడి చేసినట్లని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఉన్న చోట్ల శాంతి, అభివృద్ధి ఉండబోవన్నారు. పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. ఎస్‌సీఓతో పని చేస్తూ శాంతికరమైన, భద్రమైన, స్థిరమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. -
ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తొలగించే దిశగా భారత్, చైనా ముందడుగు వేశాయి. మాస్కోలో గురువారం జరిగిన రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఇందుకు సంబంధించి ఐదు అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేలా చర్యలు చేపట్టకపోవడం, వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సంయమనం నెలకొనడం, రెండు దేశాల సరిహద్దు భద్రత దళాలు చర్చలు కొనసాగించడం, సైనిక బలగాల మధ్య దూరం పాటించడం అనే ఐదు అంశాల్లో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా అక్కడ ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఇరువురు నేతల మధ్య ఈ విషయంలో దాదాపు రెండున్నర గంటల పాటు నిర్మాణాత్మకంగా, నిర్మొహమాటంగా చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఉభయ దేశాలకు ప్రయోజనకరం కాదని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. తూర్పు లద్దాఖ్‌లో ప్యాంగాంగ్ సరస్సు కేంద్రంగా భారత్, చైనాలు భారీగా బలగాలను, యుద్ధ సామగ్రిని మోహరించిన విషయం తెలిసిందే. విదేశాంగ మంత్రుల భేటీ సందర్భంగా కుదిరిన ఐదు అంశాల ఒప్పందం ప్రస్తుత సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దు దళాలు చర్చలు కొనసాగించాలని, బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా జరగాలని, ఇరు దేశాల సైన్యం తగినంత దూరం పాటించాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు’ అని పేర్కొంటూ శుక్రవారం ఉదయం ఒక సంయుక్త ప్రకటనను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది. అయితే, బలగాల ఉపసంహరణకు సంబంధించి ఎలాంటి కాల వ్యవధిని ఈ ఐదు అంశాల ఒప్పందంలో పేర్కొనలేదు. ‘సరిహద్దులకు సంబంధించిన అన్ని ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌ను రెండు దేశాలు గౌరవించాలని, సరిహద్దుల్లో శాంతి, సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెరిగే చర్యలు చేపట్టకూడదని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్రిక్తతలు చల్లారిన తరువాత,.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పూర్వక వాతావరణం నెలకొనేలా విశ్వాస కల్పన చర్యలు చేపట్టడాన్ని వేగవంతం చేయాలని కూడా నిర్ణయించాయని వెల్లడించారు. రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్æ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్æ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే ఉద్దేశంతో భారత్, చైనా విదేశాంగ మంత్రుల భేటీలో కుదిరిన ‘ఐదు అంశాల’ ఒప్పందంపై వీరంతా చర్చించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత దళాల సన్నద్ధతను సమగ్రంగా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని పేర్కొంటూ సంబంధిత వ్యూహాలను ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె వివరించారు. -
ఎల్ఏసీని గౌరవించాలి
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను చైనా గౌరవించాలని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చైనా రక్షణ మంత్రి వెయి ఫెంఘెకు స్పష్టంచేశారు. భారత్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉందన్నారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి భారత్ సిద్ధంగా లేదని చెప్పారు. శుక్రవారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా వీరిద్దరు రెండు గంటల 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. గత మేలో తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి భేటీ ఇదే కావడం గమనార్హం. ఉభయులు సరిహద్దుతోపాటు, ఇరుదేశాల సంబంధాలపై నిర్మొహమాటంగా, లోతుగా చర్చించుకున్నారని విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితుల నిర్వహణలో బాధ్యతాయుతంగా మెలగాలని, అలజడి రేగేలా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉభయపక్షాలు నడుచుకోవాలని రాజ్‌నాథ్ చెప్పారు. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా బలగాలు పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలకు దిగి ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించాయని రాజ్‌నాథ్.. ఫెంఘె దృష్టికి తీసుకెళ్లారు. ఉభయ దేశాలు దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలను కొనసాగించాలని, వీలైనంత త్వరగా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. శాంతిని పునరుద్ధరించేలా ఇరు దేశాధినేతల ఏకాభిప్రాయం మేరకు నడుచుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని, దీనివల్ల విభేదాలు వివాదాలుగా మారకుండా ఉంటాయన్నారు. ఎల్ఏసీ వెంబడి గల్వాన్ లోయలో గత కొద్ది నెలలుగా చేస్తున్న అభివృద్ధి పనుల గురించి రాజ్‌నాథ్ చర్చల సందర్భంగా సూత్రప్రాయంగా చెప్పారు. సరిహద్దులో భారత బలగాలు వివాదాలకు తావీయకుండా ఎల్లప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా మెలుగుతున్నాయని, అదే సమయంలో భారత సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ పడబోమని తేల్చిచెప్పారు. చైనా అడిగిన అన్ని అంశాలకు రాజ్‌నాథ్ బదులిచ్చారని, వారు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. రెచ్చగొట్టే చర్యలొద్దు: చైనా వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చైనా మంత్రి ఫెంఘె రాజ్‌నాథ్‌కు చెప్పారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక ఒప్పందాలను కచ్చితంగా అమలు చేయాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని పేర్కొన్నట్లు చెప్పింది. ఉద్రిక్త నివారణకు కలిసి పనిచేయాలని, సంబంధాల పురోగతిపై దృష్టి పెట్టాలని ఫెంఘె చెప్పారంది. వివాదానికి కారణం భారతేనని, చైనా భూభాగాన్ని అంగుళం కూడా వదులుకోబోమని ఫెంఘె చెప్పారంటూ చైనా ఒక ప్రకటన విడుదల చేసి తన వక్రబుద్ధి చాటుకుంది. ఉద్రిక్తత నివారణకు సాయం చేస్తా: ట్రంప్ వాషింగ్టన్: భారత్–చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అక్కడి పరిస్థితి ‘చాలా అసహ్యంగా’ ఉందని అభివర్ణించారు. చైనా చాలా దూకుడుగా వ్యవహరిస్తోందని, అవసరమైతే వివాద పరిష్కారానికి సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ట్రంప్ శుక్రవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిపై భారత్, చైనాలతో మాట్లాడుతున్నానని పునరుద్ఘాటించారు. భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ
షాంఘై: భారత్-చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల రక్షణ మంత్రులు రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థ( ఎస్ఓసీ) మంత్రుల స్థాయి సమావేశంలో సరిహద్దు అంశాన్ని రాజ్‌నాథ్‌సింగ్ లేవనెత్తారు. అనంతరం చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మధ్య దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. లద్దాఖ్‌లో ఇరుదేశాల మధ్య ఘర్షణలు మొదలయ్యాక ఇప్పటి వరకు సైనిక ఉన్నతాధికారుల మధ్య మాత్రమే ఇప్పటి వరకు చర్చలు జరిగాయి. అత్యున్నత స్థాయి రాజకీయ నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి. కొద్ది వారాల కిందట భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సమావేశంలో మే నెలకు ముందున్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. అయితే చైనా మాత్రం భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించింది. చిన్న భూభాగాన్ని కూడా వదలుకోవడానికి చైనా సిద్ధంగా లేదని ఫెంఘే తెలిపారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకోవడానికి భారత్ ముందడుగు వేయాలని అన్నారు. చదవండి: సరిహద్దుల్లో టెన్షన్..టెన్షన్ -
ఇమ్రాన్.. ఏంటిది; ఆరోగ్యం బాగాలేదేమో!
బిష్కెక్ : షాంఘై సహకార సదస్సుకు హాజరైన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సౌదీ రాజును అవమానించిన ఇమ్రాన్.. ఈ సదస్సులో మరోసారి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి వివిధ దేశాధినేతలను అగౌరవపరిచారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో గురువారం షాంఘై సహకార సదస్సు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ దేశాధినేతలకు నిర్వాహకులు స్వాగతం పలుకుతున్న వీడియోను ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ తన అఫీషియల్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ వ్యవహార శైలిపై సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. అతిథులను ఆహ్వానించే క్రమంలో కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు ప్రపంచ దేశాధినేతలకు పేరుపేరునా స్వాగతం పలికారు. ఈ క్రమంలో.. సభాస్థలికి వచ్చే సమయంలో మిగిలిన నేతలంతా నిల్చునే ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఒక్కరే తన సీట్లో కూర్చుండిపోయారు. తన పేరు పలికినపుడు మాత్రమే నిలబడి అభివాదం చేశారు. ఇమ్రాన్ చర్యపై మండిపడిన నెటిజన్లు.. కనీస మర్యాద కూడా పాటించరా అంటూ ఆయనపై విరుచుకుపడుతున్నారు. ‘ పాక్ ప్రధానికి ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు. మిగతా వాళ్లంతా నిలబడి ఉండే మీరు మాత్రం కూర్చుంటారా. అందరూ వచ్చేదాకా ఆగలేరా. అంత అహంకారమా’ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇక మరికొందరు...‘ పాపం.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదేమో. కాసేపైనా కూర్చోకుండా ఉండలేరు కాబోలు. అర్థం చేసుకోరూ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఇటీవల సౌదీ ప్రభుత్వం మక్కాలో నిర్వహించిన అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సమావేశానికి ఇమ్రాన్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ రాజు వద్దకు వెళ్లి కరచాలనం చేసిన ఇమ్రాన్.. అనంతరం రాజు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ముందుకు కదిలారు. దీంతో ఇమ్రాన్ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. Prime Minister of #Pakistan @ImranKhanPTI's Arrival with other World Leaders at Invitation of President of Kyrgyzstan for Opening Ceremony 19th Meeting of the Council of the Heads of State of the Shanghai Cooperation Organization in Bishkek Kyrgyzstan (13.06.19)#SCOSummit2019 pic.twitter.com/fYdKYN3Fv7 — PTI (@PTIofficial) June 13, 2019 -
పాక్ మీదుగా వెళ్లను
న్యూఢిల్లీ/బీజింగ్: కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో ఈ నెల 13–14 తేదీల్లో జరిగే షాంఘై సహకార సదస్సు (ఎస్సీవో)కు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లరాదని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. తమ గగనతలం మీదుగా మోదీ విమానం వెళ్లేందుకు పాక్ అంగీకరించినప్పటికీ కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్, ఒమన్, ఇతర మధ్య ఆసియా దేశాల మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్కు చేరుకుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‡ తెలిపారు. ఈ ప్రయాణానికి సంబంధించి రెండు రూట్లను భారత ప్రభుత్వం ఖరారుచేసిందన్నారు. కాగా, భారత ప్రధాని మోదీ విమానంలో ఎస్సీవో సదస్సుకు తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు ప్రత్యేకంగా అనుమతిస్తామని పాక్ విమానయానశాఖ మంత్రి సర్వార్‌ఖాన్ చెప్పారు. మోదీ ప్రయాణించే ఎయిరిండియా బోయింగ్ 747–400 విమానం ఢిల్లీ నుంచి బిష్కెక్కు వెళ్లి తిరిగివచ్చేందుకు వీలుగా 72 గంటలపాటు పాక్ గగనతలంలో రాకపోకల్ని అనుమతిస్తామని పేర్కొన్నారు. ఎస్సీవోలో చైనా, భారత్, పాక్, కిర్గిజిస్తాన్ సహా 8 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మరోవైపు షాంఘై సహకార సదస్సుకు హాజరయ్యేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బయలుదేరినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా జిన్‌పింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారని వెల్లడించింది. ఎస్సీవో సదస్సు సందర్భంగా జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో పాటు భారత్‌పై కూడా వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిన నేపథ్యంలో అమెరికాను కలసికట్టుగా ఎదుర్కోవడంపై జిన్‌పింగ్, మోదీ చర్చించే అవకాశముందని ప్రభుత్వవర్గాలు చెప్పాయి. ఎస్సీవోతో పటిష్ట సంబంధాలు: మోదీ బిష్కెక్లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)లో అంతర్జాతీయ భద్రత, ఆర్థిక సహకారమే ప్రధాన అజెండాగా ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తన బిష్కెక్ పర్యటన ద్వారా ఎస్సీవో దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని ధీమా వ్యక్తం చేశారు. భారత రాయబారిగా వీడాంగ్ భారత్‌తో సత్సంబంధాలను పెంపొందించుకునే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ దౌత్యవేత్త సున్ వీడాంగ్ భారత్‌లో తమ కొత్త రాయబారిగా నియమించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ 2009–13 మధ్యకాలంలో చైనాలో భారత రాయబారిగా పనిచేసిన కాలంలో వీడాంగ్‌తో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చైనా విదేశాంగశాఖ పాలసీ–ప్రణాళికా విభాగంలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న వీడాంగ్‌ను భారత్‌లో తమ రాయబారిగా నియమించింది. భారత్‌లో చైనా రాయబారిగా ఉన్న లో జుహుయీనిని విదేశాంగశాఖ సహాయమంత్రిగా నియమించింది. -
దౌత్యంలో కొత్త దారులు
మిత్ర, శత్రు దేశాలన్న తేడా లేకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అందరినీ టారిఫ్‌ల యుద్ధంతో ఠారెత్తిస్తున్న వర్తమాన వాతావరణంలో కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో గురు, శుక్రవారాల్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను బుట్టదాఖలు చేసి, కొత్త షరతులు విధిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్న ట్రంప్ ధోరణి వల్ల ఇబ్బంది పడని దేశమంటూ లేదు. అమెరికాకు ఎంతో సన్నిహితంగా ఉండే యూరప్ దేశాలు సైతం ఈ దూకుడును సహించలేకపోతున్నాయి. అందుకే ఎస్సీఓ తీరుతెన్నులు ఇక ముందెలా ఉండబోతున్నాయన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అది తీసుకోబోయే నిర్ణయాలు అంతర్జాతీయ సంబంధాలపై రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నదని అంచనా వేస్తున్నవారూ ఉన్నారు. తమ తమ ప్రాంతాల్లో అమెరికా ప్రభావాన్ని పరిమితం చేయడం ఎలాగన్నది ఇప్పుడు రష్యా, చైనాలను వేధిస్తున్న ప్రశ్న. ఇందుకోసం తమ మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కనబెట్టి సమ ష్టిగా కలిసి కదలాలని అవి రెండూ భావిస్తున్నాయి. పూర్వపు సోవియెట్ యూనియన్‌లో భాగంగా ఉన్న దేశాల్లో అమెరికా ప్రభావం క్రమేపీ పెరగడం రష్యాను కలవరపెడుతుంటే... పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో దాని తీరుతెన్నులపై చైనాకు అభ్యంతరాలున్నాయి. రష్యా, చైనాలు కూటమిగా ఏర్ప డటం అసాధ్యమని ఇన్నాళ్లూ అమెరికా భావిస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది మొదట్లో అమెరికా నిఘా సంస్థ సెనేట్‌కు సమర్పించిన ఒక నివేదిక చైనా, రష్యాల మధ్య విస్తరిస్తున్న సహకారాన్ని ప్రత్యేకించి ప్రస్తావించింది. అవి పరస్పరం స్నేహసంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు అంతర్జాతీయ సంస్థల ద్వారా వాటికి అనువైన కొత్త నిబంధనలు, ప్రమాణాలు ఏర్పరచ డానికి ప్రయత్నిస్తున్నాయని ఆ నిఘా నివేదిక వివరించింది. అంతకుముందు సోవియెట్ యూని యన్, చైనాల మధ్య సంబంధాల మాటెలా ఉన్నా, 80వ దశకం చివరి నుంచి అవి క్రమేపీ మెరుగుపడుతూ వచ్చాయి. సోవియెట్ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక రెండింటిమధ్యా మిత్రత్వమే కొనసాగుతోంది. వలసలను కట్టడి చేయకపోతే అమెరికాకు చేసే ఎగుమతులపై మరో 5 శాతం టారిఫ్‌లు విధించి దాన్ని 25శాతానికి తీసుకెళ్తానని డోనాల్డ్ ట్రంప్ పక్షం రోజులక్రితం మెక్సికోను హెచ్చ రించారు. ఆ మర్నాడు మన దేశంపై విరుచుకుపడ్డారు. భారత్‌కు ఇప్పటివరకూ ఇస్తున్న సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీపీఎస్)ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనివల్ల 560 కోట్ల డాలర్లమేర భారత్‌కున్న వెసులుబాట్లు పోతాయని అమెరికా అంచనా వేస్తుండగా, అది 19 కోట్ల డాలర్లు మించదని మన దేశం చెబుతోంది. భారత్ మార్కెట్లలో అమెరికాకు సమాన ప్రతిపత్తి కల్పించ నప్పుడు మేమెందుకు దాన్ని కొనసాగించాలన్నది ట్రంప్ వాదన. అలాగే నిరుడు చైనాపైనా, 28 దేశాల కూటమి యూరప్ యూనియన్(ఈయూ)పైనా ఆయన భారీయెత్తున సుంకాలు విధించగా అటు చైనా, ఇటు ఈయూ సైతం అమెరికా ఉత్పత్తులపై తాము కూడా సుంకాలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఎవరికి వారు అమెరికా సాగిస్తున్న ఈ టారిఫ్‌ల యుద్ధం వల్ల నష్టపోతున్న తరు ణంలో ఆ దేశాలన్నీ ఏదో మేర ఏకం కావాలని చూడటం అసహజమేమీ కాదు. పద్దెనిమిదేళ్లక్రితం ఆవిర్భవించిన ఎస్సీఓలో మన దేశానికి 2017లో సభ్యత్వం లభించింది. అయితే అది కీలకమైన సంస్థగా రూపుదిద్దుకోబోతున్నదని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఇది ఏ దేశానికీ వ్యతిరేకంగా ఏర్పడింది కాదని, ఇందులో భద్రత, అభివృద్ధిపైనే దృష్టి సారించి, వాటికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తామని ఇప్పటికే చైనా ఉప విదేశాంగమంత్రి ఝాంగ్ హాన్ హ్యూ వివరణనిచ్చారు. అలా అంటూనే వాణిజ్యపరమైన ఆత్మరక్షణ విధానాలు, ఏకపక్ష విధా నాలు వగైరాలపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకుంటామని ఆయన అనడాన్నిబట్టి అమెరికా వ్యవహారశైలి, దాన్ని ఎదుర్కొనడానికి అనుసరించాల్సిన వ్యూహం వగైరాలు కూడా శిఖరాగ్ర సదస్సులో ప్రస్తావనకు రాకమానవని అర్ధమవుతోంది. ఎస్సీఓలో సభ్య దేశాలుగా ఉన్న భారత్, పాకిస్తాన్ల మధ్య ఉన్న విభేదాలు, తనకు భారత్‌తో ఉన్న వివాదాలు పరిష్కారమైతే సంస్థ మరింత పటిష్టమవుతుందన్న అభిప్రాయం చైనాకుంది. అదే సమయంలో అమెరికా పోకడల విష యంలో భారత్, చైనాలు రెండింటికీ అభ్యంతరాలున్నాయి. ఇవే తమ మధ్య మరింత సహకారాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని చైనా విశ్వసిస్తోంది. ప్రధాని మోదీ ఈ సదస్సులో ఉగ్ర వాదం అంశాన్ని లేవనెత్తినా, నేరుగా పాక్ పేరెత్తి దాన్ని విమర్శించబోరని చైనా ఆశిస్తోంది. ఈ సదస్సు సందర్భంగా మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ల మధ్య భేటీ జరగబోదని ఇప్పటికే తేటతెల్లమైంది. అమెరికా అనుసరిస్తున్న ధోరణులు ఆ దేశానికి సన్నిహితంగా ఉండే సింగపూర్, మలేసియా వంటి దేశాలకు కూడా రుచించడం లేదు. ఎదుగుతున్న చైనాను, దాని ఆకాంక్షలను గుర్తించి అందుకు అనుగుణమైన సర్దుబాట్లు చేసుకోవాలని ఈ నెల 2న ముగిసిన ఆసియా ప్రాంత దేశాల రక్షణ సదస్సు ‘షాంగ్రీలా డైలాగ్’లో సింగపూర్ ప్రధాని లీ షెన్ లూంగ్ అమెరికాకు హితవు పలి కారు. చైనాతో వాణిజ్య, భద్రతా అంశాల్లో తగవుపడుతున్న అమెరికా తీరును మలేసియా ప్రధాని మహతీర్ మహమ్మద్ విమర్శించారు. ఇలా సన్నిహిత దేశాలకే అమెరికా అనుసరిస్తున్న ధోరణి నచ్చని స్థితిలో, దాని బాధిత దేశాలకు ఇంకెంత ఆగ్రహావేశాలుంటాయో అర్ధం చేసుకోవచ్చు. ట్రంప్ విధానాల వల్ల చైనా, రష్యాలు సన్నిహితమవుతున్నాయని, ఈ పరిణామం ముందూ మునుపూ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నదని ఆ దేశ పౌరులు ఆందోళన పడుతున్నారు. ఏదేమైనా శరవేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో మన దేశానికి గరి ష్టంగా ప్రయోజనాలు రాబట్టే దిశగా మన దౌత్య వ్యూహాలను పదునుపెట్టుకోవాల్సి ఉంటుంది. -
జిన్‌పింగ్‌తో సై.. ఇమ్రాన్‌కు నై
బీజింగ్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల భేటీకి మరోసారి ము హూర్తం ఖరారైంది. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో జూన్ 12–14 మధ్య జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో) సందర్భంగా వీరిద్దరూ సమావేశమవుతారని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రి తెలిపారు. షాన్డాంగ్ ప్రావిన్సులో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మిస్రి మాట్లాడుతూ..‘ఇటీవలికాలంలో భారత్, చైనాలు సుస్థిరమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో సఫలమయ్యాయి. గతేడాది మోదీ, షీ జిన్‌పింగ్‌లు నాలుగుసార్లు సమావేశమయ్యారు. వుహాన్‌లో 2018లో జరిగిన చరిత్రాత్మక భేటీతో ఇరుదేశాల మధ్య సంబంధాలు సరికొత్త ఎత్తుకు చేరుకున్నాయి. భారత్–చైనాల మధ్య గతేడాది ద్వైపాక్షిక వాణిజ్యం రూ.6.57 లక్షల కోట్ల(95 బిలియన్ డాలర్లు)కు నమోదుకాగా, ఈ ఏడాది రూ.6.92 లక్షల కోట్ల(100 బిలియన్ డాలర్లు)కు చేరుకోనుంది’ అని పేర్కొన్నారు. ఇమ్రాన్‌తో భేటీకి నో.. షాంఘై సదస్సు సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మోదీ సమావేశం కాబోరని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పాక్ విదేశాంగ కార్యదర్శి సోహైల్ మహమూద్ ఇటీవల భారత్‌లో ప్రైవేటుగా పర్యటించిన నేపథ్యంలో మోదీ–ఇమ్రాన్ సమావేశమవుతారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయమై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కుమార్ స్పందిస్తూ.. ‘ఇమ్రాన్, మోదీల మధ్య ఎలాంటి భేటీ ఖరారు కాలేదు. పాక్ కార్యదర్శి సోహైల్ తన వ్యక్తిగత హోదాలో మూడ్రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఆయన పర్యటనకు, ఇరుదేశాల ప్రధానుల మధ్య భేటీకి ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, ప్రతీకారంగా భారత్ చేసిన వైమానిక దాడులతో పాక్–ఇండియాల మధ్య సంబంధాలు తీవ్రంగా దిగజారిన సంగతి తెలిసిందే. ఇటీవల రెండోసారి ప్రధానిగా మోదీ ఎన్నికైన అనంతరం ఫోన్‌చేసిన ఇమ్రాన్‌ఖాన్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. -
ఆ భేటీకి ప్లాన్ చేయలేదు!
న్యూఢిల్లీ: ఈ నెల 13, 14 తేదీల్లో కిర్జిస్తాన్ రాజధాని బిషక్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పాకిస్థాన్ అధినేత ఇమ్రాన్ ఖాన్ మధ్య సమావేశం ఉండబోదని భారత్ గురువారం స్పష్టం చేసింది. తనకు తెలిసినంతవరకు బిషక్‌లో ఎస్సీవో సదస్సు సందర్భంగా మోదీ, ఇమ్రాన్ ఖాన్ భేటీకి ప్లాన్ చేయలేదని, వారిద్దరి మధ్య సమావేశం ఉండే అవకాశం లేదని విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఎస్సీవో సదస్సు అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశముందా? అన్న ప్రశ్నకు కూడా.. అలాంటి అవకాశం లేదని, సమీప భవిష్యత్తులో ఇలాంటి చర్చల గురించి ప్లాన్ చేయలేదని ఆయన తేల్చిచెప్పారు. 2016లో పఠాన్‌కోట్ వైమానిక శిబిరంపై ఉగ్రవాద దాడి అనంతరం భారత్, దాయాది పాకిస్థాన్‌తో అధికారిక చర్చలను నిలిపివేసింది. ఉగ్రవాదం, చర్చలు కలిసిసాగలేవంటూ అప్పటినుంచి దాయాదితో ద్వైపాక్షిక చర్చలకు ఫుల్స్టాప్ పెట్టింది. ఈ నెల 13, 14 తేదీల్లో బిషక్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అటు పాక్ ప్రధాని ఇమ్రాన్ కూడా ఈ సదస్సుకు వస్తుండటంతో వీరిద్దరు భేటీ కావొచ్చునని ఊహాగానాలు వినిపించాయి. -
ఇండో–పాక్–చైనా మైత్రి!
న్యూఢిల్లీ: భారత్, చైనా, పాకిస్తాన్ల మధ్య త్రైపాక్షిక సహకారం ఉంటే భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడం భవిష్యత్తులో సులభమవుతుందని చైనా రాయబారి లువో ఝహూయ్ వ్యాఖ్యానించారు. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ అక్కడి వుహన్ నగరంలో అనధికారికంగా భేటీ అవ్వడం తెలిసిందే. ఈ భేటీ అనంతరం భారత్–చైనాల బంధం ఇంకెంత దూరం వెళ్లగలదు అనే అంశంపై ఢిల్లీలో చైనా రాయబార కార్యాలయం ఓ సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ రాయబారి లువో మాట్లాడుతూ ‘షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) మూడు స్తంభాల్లో భద్రతా సహకారం కూడా ఒకటి. ఎస్సీవో కింద చైనా, భారత్, పాక్‌ల మధ్య త్రైపాక్షిక సహకారం ఉంటే బాగుంటుందని కొందరు భారతీయ స్నేహితులే నాతో అన్నారు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. భారత్, పాక్‌ల సంబంధాలు పూర్తిగా ద్వైపాక్షికమేననీ, మూడో దేశం ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చైనా రాయబారి వ్యాఖ్యలను కాంగ్రెస్ కూడా ఖండించింది. భారత్, పాక్‌ల బంధం విషయంలో మరెవ్వరి జోక్యం ఉండకూడదంది. -
భారత్, పాకిస్తాన్ కలిసికట్టుగా..
అస్తానా: సరిహద్దులో నిత్యం పోట్లాడుకునే దాయాదులు.. కలిసికట్టుగా ఒకే ప్రతిజ్ఞ చేసిన సందర్భమిది. ప్రఖ్యాత షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ)లోకి పూర్తిస్థాయి సభ్యులుగా భారత్, పాకిస్తాన్‌లు ప్రమాణం చేశాయి. కజకిస్తాన్ రాజధాని అస్తానాలో ఎస్సీఓ వార్షిక సదస్సులో ఈ మేరకు ఇరు దేశాలు సంతకాలు చేశాయి. పూర్తికాల సభ్యులుగా చేరిన సందర్భంగా భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లను సంస్థలోని ఇతర సభ్యదేశాలు అభినందించాయి. యూరప్-ఆసియా దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, సైనిక సహకారం కోసం షాంఘై(1996లో)లో ఏర్పాటయిన కూటమిని షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ)లో చైనా, కజకిస్తాన్, కర్గీజ్‌స్తాన్, తజకిస్తాన్, రష్యాలు వ్యవస్థాపక సభ్యుదేశాలుగా ఉన్నాయి. మొదటి విస్తరణ(2001)లో ఉబ్జెకిస్తాన్ సభ్యత్వం పొందగా.. నేడు(9 జూన్, 2017) భారత్, పాకిస్థాన్‌లు పూర్తికాల సభ్యులయ్యాయి. ఉగ్రవాదంపై పోరుకు మోదీ పిలుపు 12ఏళ్ల పరిశీలన అనంతరం భారత్‌కు ఎస్సీఓ సభ్యత్వం దక్కడం ఆనందరంగా ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ.. సభ్యదేశాలన్నింటికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కలిసికట్టుగా పోరాడుదామని అన్నారు. మానవాళికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు ఉగ్రవాదమేనని, దానిని అంతం చేస్తేనేగానీ ప్రగతి సాధించలేమని పేర్కొన్నారు. భారత్‌కు పాక్ అభినందనలు ‘ఎస్సీఓలో సభ్యత్వం పొందిన శుభసందర్భంలో భారత్‌కు నా శుభాకాంక్షలు..’ అంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీప్ తన ఉపన్యాసాన్ని ప్రారంభించడం గమనార్హం. ‘మన భవిష్యత్ తరాలను యుద్ధం, సంఘర్షణలవైపు పోనియ్యకుండా శాంతిసమాధానాలతో జీవించేలా చేయడం మన కర్తవ్యం. ఇందుకు షాంఘై సహకార సంస్థ కృషిచేస్తుంది’అని షరీఫ్ అన్నారు.