
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సమాజ శాంతి భద్రతలకు ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బుధవారం తజకిస్తాన్‌లోని డషన్బెలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి ఎలాంటి సహకారం అందించినా అది మానవాళిపై దాడి చేసినట్లని పేర్కొన్నారు.
ఉగ్రవాదం ఉన్న చోట్ల శాంతి, అభివృద్ధి ఉండబోవన్నారు. పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. ఎస్‌సీఓతో పని చేస్తూ శాంతికరమైన, భద్రమైన, స్థిరమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.