Tajikistan
-
Narendra Modi: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం
న్యూఢిల్లీ: ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం పెచ్చుమీరుతోందనడానికి ఇటీవల అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయని, ప్రాంతీయంగా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో అంతర్జాతీయ సమాజం ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారాన్ని అడ్డుకోవడానికి ఎస్సీఓ సమష్టిగా చర్యలు చేపట్టాలని కోరారు. మధ్య ఆసియా సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉగ్రవాద శక్తులపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. దేశాల మధ్య అనుసంధానం అవసరం మధ్య ఆసియాలో వివిధ దేశాల మధ్య భౌగోళికంగా అనుసంధానం ఉంటే మార్కెట్ మరింత విస్తృతమవుతుందని నరేంద్ర మోదీ వివరించారు. మధ్య ఆసియా, భారత్‌కు మధ్య కనెక్టివిటీ పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం లేకపోవడంతో వల్ల భౌగోళికంగా అడ్డుగోడలు ఏర్పడుతున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, ప్రాజెక్టుల నిర్మాణం పారదర్శకంగా జరగాలని హితవు చెప్పారు. ఎస్సీఓలో కొత్తగా చేరిన సభ్యదేశం ఇరాన్‌కు మోదీ స్వాగతం పలికారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడం సరికొత్త వాస్తవం అని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆ దేశంలో మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందన్నారు. ఉగ్రవాదులకు అఫ్గాన్ ఆశ్రయం ఇవ్వదని తెలిపారు. చైనాయే తమకు నమ్మకమైన నేస్తమని ఇమ్రాన్ మరోసారి స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్ నుంచి విదేశీ బలగాలు వెళ్లిపోయాక ఒక కొత్త చరిత్ర మొదలైందని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అన్నారు. అయినప్పటికీ ఆ దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఎస్సీఓ సభ్య దేశాలు అఫ్గాన్‌కు అన్ని విధాల సహకరించాలని పిలుపునిచ్చారు. చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు -
17న ‘షాంఘై’ భేటీలో మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ: తజకిస్తాన్ రాజధాని దుషాంబేలో 17న ప్రారంభంకానున్న వార్షిక షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ(వర్చువల్) పద్ధతిలో ప్రసంగించనున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నేరుగా దుషాంబేకు వెళ్లి అక్కడ జరుగుతున్న ఎస్సీవో సదస్సులో పాల్గొని భారత అభిప్రాయాలను పంచుకోనున్నారు. అఫ్గాన్ సంక్షోభం కారణంగా తలెత్తే పరిణామాలపై సదస్సులో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రహ్మాన్ అధ్యక్షత ప్రారంభమయ్యే 21వ ఎస్సీవో సదస్సులో సభ్య దేశాల అగ్రనేతలు నేరుగా, వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్నారు. భారత ప్రతినిధి బృందం తరఫున ప్రధాని మోదీ సదస్సు ప్లీనరీ సెషన్లో ప్రసంగించనున్నారు’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈసారి సమావేశాల్లో ఎస్సీవో సభ్య దేశాల నేతలు, పరిశీలక దేశాలు, ఎస్సీవో ప్రధాన కార్యదర్శి, ఎస్సీవో ప్రాంత ఉగ్రవ్యతిరేక విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్య అతిథులు పాల్గొననున్నారు. వర్చువల్ పద్ధతిలో సదస్సు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎస్సీవోలో పూర్తి స్థాయి సభ్య దేశం హోదా సంపాదించాక భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది నాలుగోసారి. ‘ఎస్సీవో 20వ వార్షికోత్సవం సందర్భంగా గత రెండు దశాబ్దాల్లో సాధించిన ప్రగతిపై సమీక్ష జరిగే అవకాశముంది. భవిష్యత్తులో దేశాల సహకారంపైనా చర్చ జరగొచ్చు’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరాన్, తజకిస్తాన్, ముఖ్య దేశాల విదేశాంగ మంత్రులతో జై శంకర్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. చైనా, రష్యా, పాక్ విదేశాంగ మంత్రులు సదస్సుకు హాజరుకానున్నారు. నాటో తరహాలో ఎనిమిది దేశాల కూటమిగా ఎస్సీవో ఆవిర్భవించింది. 2017 నుంచి భారత్, పాక్‌లు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు సంయుక్తంగా 2001లో షాంఘైలో ఎస్సీవోను స్థాపించారు. భద్రతాపరమైన అంతర్జాతీయ సహకారం కోసం ఎస్సీవోతో, రక్షణ అంశాల్లో ఉమ్మడి పోరు కోసం యాంటీ–టెర్రరిజం స్ట్రక్చర్(ర్యాట్స్)లతో భారత్ కలిసి పనిచేస్తోంది. ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ చర్చ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు. భారత్–ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మ భాగస్వామ్యంలో పురోగతిపై నేతలిద్దరూ చర్చించారు. ‘త్వరలో జరగబోయే ‘క్వాడ్’ సదస్సు గురించీ చర్చించాము’ అని ఆ తర్వాత మోదీ ట్వీట్‌చేశారు. -
ఉగ్రవాదానికి ఊతం.. మానవాళిపై దాడి: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సమాజ శాంతి భద్రతలకు ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బుధవారం తజకిస్తాన్‌లోని డషన్బెలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి ఎలాంటి సహకారం అందించినా అది మానవాళిపై దాడి చేసినట్లని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఉన్న చోట్ల శాంతి, అభివృద్ధి ఉండబోవన్నారు. పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. ఎస్‌సీఓతో పని చేస్తూ శాంతికరమైన, భద్రమైన, స్థిరమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. -
కాందహార్ కబళింపు దిశగా తాలిబన్లు
కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లో అంతర్యుద్ధం వేడి మరింత పెరిగింది. అఫ్ఘన్ ప్రభుత్వ దళాలతో పోరాడుతున్న తాలిబన్లు కీలకమైన కాందహార్ ప్రావిన్సులో ముఖ్యమైన పంజ్వై జిల్లాను గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. తాలిబన్లతో పోరాడి ఓడిన అఫ్ఘన్ దళాలు, తజ్బకిస్థాన్‌లోకి పారిపోయినట్లు స్థానిక ఏఎఫ్‌పీ ఏజెన్సీ తెలిపింది. తాజా విజయంతో అఫ్ఘన్లోని 421 జిల్లాల్లో 100 జిల్లాపై తాలిబన్లకు అదుపు లభించినట్లయింది. ఒక్క కాందహార్ ప్రావిన్సులోనే తాలిబన్ల గుప్పిట్లో ఐదు జిల్లాలున్నాయి. కాందహార్ నగరంపై పట్టు సాధించేందుకు పంజ్వై జిల్లా కీలకమైనది. అఫ్ఘన్ నుంచి యూఎస్ దళాలు వైదొలుగుతున్న తరుణంలో తాలిబన్లు దేశంపై పట్టు పెంచుకుంటూ పోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. పంజ్వై జిల్లాను తాలిబన్లు ఆక్రమించడంతో పలువురు స్థానికులు భయంతో అక్కడ నుంచి వలసపోతున్నారు. తాలిబన్లు తాము పాలించే చోట కఠినమైన షరియా చట్టం అమలు చేస్తారన్న భయంతో స్థానికులు పారిపోతున్నట్లు వార్తా వర్గాలు తెలిపాయి. పంజ్వై పతనం అఫ్ఘన్ ప్రభుత్వ దళాల అసమర్ధతకు నిదర్శనమని కాందహార్ ప్రావిన్షియల్ కౌన్సిల్ ప్రతినిధులు విమర్శించారు. యూఎస్ దళాల మద్దతు కోల్పోయిన అఫ్ఘన్ దళాలు కావాలనే యుద్ధరంగం నుంచి పారిపోయాయని ఆరోపించారు. బాగ్రామ్ కొంపముంచిందా? ఇటీవలే కీలకమైన బాగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి అమెరికా, నాటో దళాలు వైదొలిగాయి. ఈ చర్య తాలిబన్ల చొరబాటుకు మరింత వీలు కలిగిస్తుందని అప్పుడే అంచనాలు వెలువడ్డాయి. వీటిని నిజం చేస్తూ తాజా ఘటనలు జరిగాయి. సంవత్సరాల పాటు యూఎస్ తదితర దళాలకు ఈ ఎయిర్‌ఫీల్డ్ కీలక బేస్‌గా మారింది. ప్రస్తుతం యూఎస్ వైమానిక మద్దతు లేకపోవడంతో అఫ్ఘన్ దళాలకు ఓటమి తప్పడంలేదని నిపుణులు భావిస్తున్నారు. అయితే తమ వైమానిక దళం తాలిబన్లపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందని అఫ్ఘన్ మంత్రి అబ్దుల్ సత్తార్ ప్రకటించారు. పూర్తి శక్తితో తాలిబన్లను అడ్డుకుంటామన్నారు. కాగా ఇప్పటివరకు తమ సరిహద్దులు దాటి దాదాపు 300కుపైగా అఫ్ఘన్ సైనికులు పారిపోయి వచ్చారని తజ్బకిస్థాన్ ప్రతినిధులు చెప్పారు. మానవతా ధృక్పథంతో వారిని దేశంలోకి ఆహ్వానించామన్నారు. -
మా దేశానికి రావొద్దు...
న్యూఢిల్లీ: తజికిస్తాన్లో పర్యటించాలనుకున్న భారత కుర్ర ఫుట్‌బాలర్లకు ‘కరోనా’ షాకిచ్చింది. తమ దేశంలో భారత అండర్–16 ఫుట్‌బాల్ జట్టు పర్యటనను తజికిస్తాన్ రద్దు చేసింది. అండర్–15 దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య చాంపియన్ అయిన భారత కుర్రాళ్ల జట్టు రేపు అక్కడికి బయలుదేరాల్సి ఉంది. అక్కడ ఏఎఫ్సీ అండర్–16 చాంపియన్‌షిప్ రన్నరప్ అయిన తజికిస్తాన్‌తో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే భారత్‌లోనూ కరోనా కేసులు నమోదు కావడంతో తజికిస్తాన్ ప్రభుత్వం భారత్‌ను కరోనా ప్రభావిత దేశాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో 35 దేశాలున్నాయి. ఈ జాబితాలోని దేశాల్లో తమ దేశస్థులు పర్యటించడాన్ని... ఆ దేశస్థులు తమ దేశంలో పర్యటించడాన్ని తజికిస్తాన్ నిషేధం విధించడం వల్లే ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడలేకపోతున్నట్లు ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య స్పష్టం చేసింది. ఆడండి కానీ... ఆటోగ్రాఫ్‌లు వద్దే వద్దు! ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్–19)తో అమెరికాలో ఆరుగురు మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తమ ఆటగాళ్లకు, జట్ల కోచ్‌లు, ఫిజియో, ఇతర సిబ్బందికి తు.చ. తప్పకుండా పాటించే మార్గదర్శకాలు జారీచేసింది. ఆటగాళ్లెవరూ అభిమానులతో కలవరాదని కచ్చితంగా చెప్పేసింది. ఆటోగ్రాఫ్‌లు చేసేందుకు, పెన్నులను ముట్టుకునేందుకు, సెల్ఫీలు దిగేందుకు దూరంగా ఉండాలని ఎన్బీఏ స్పష్టం చేసింది. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తమ ప్రధాన ఉద్దేశమని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. కరచాలనం ఇవ్వం: జో రూట్ శ్రీలంకలో క్రికెట్ సిరీస్ ఆడేందుకు మంగళవారం అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యులు అక్కడ ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయబోరని కెప్టెన్ జో రూట్ వెల్లడించాడు. కరోనా ఎఫెక్ట్ వల్లే పరస్పర కరచాలనం చేయొద్దని నిర్ణయించుకున్నట్లు అతను తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో ఇంగ్లండ్ ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడ్డారు. అయితే త్వరగానే కోలుకున్నారు. ఇప్పుడైతే కోవిడ్–19 ప్రపంచాన్నే వణికిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా శుచి–శుభ్రతను పాటిస్తామని, తమ క్రికెట్ బోర్డు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే నడుచుకుంటామని రూట్ చెప్పాడు. నిర్‘బంధి’ంచారు... అబుదాబీలో విదేశీ సైక్లిస్ట్‌లకు వింత అనుభవం ఎదురైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు వచ్చిన జట్లలో కొందరికి కరోనా సోకడంతో వాళ్లని వెంటనే వారి స్వదేశాలకు పంపేసిన అబుదాబీ వర్గాలు మిగతా వారిని బస చేసిన హోటల్ గదుల్లోనే నిర్బంధించింది. ఫ్రాన్స్, రష్యా దేశాలకు చెందిన సైక్లిస్ట్‌లకు, సిబ్బందికి నిర్బంధం విధించిన యూఏఈ ప్రభుత్వం వైరస్ బారిన పడిన ఇద్దరు ఇటాలియన్ అధికారుల్ని ఉన్నపళంగా ఇటలీకి ప్రత్యేక విమానాల్లో పంపించింది. -
భారత్ x అఫ్గానిస్తాన్
దుశంబే (తజికిస్తాన్): ఫుట్‌బాల్ ప్రపంచకప్–2022 క్వాలిఫయర్స్‌లో నిలకడలేని ప్రదర్శనతో నిరాశపరుస్తున్న భారత జట్టు నేడు అఫ్గానిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. రెండో రౌండ్ క్వాలిఫయింగ్‌ను పరాజయంతో మొదలుపెట్టిన భారత్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లాడినా... ఇంకా గెలుపు బోణీనే కొట్టలేకపోయింది. తొలి మ్యాచ్‌లో తమకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న ఒమన్ చేతిలో 1–2తో ఓడిన భారత్ తర్వాత ఆసియా చాంపియన్ ఖతర్‌తో 0–0తో డ్రా చేసుకుంది. కోల్‌కతాలో జరిగిన గత మ్యాచ్‌లో, చివరకు దిగువ ర్యాంకులో ఉన్న బంగ్లాదేశ్‌తోనూ 1–1తో ‘డ్రా’గా ముగించడం భారత సాకర్ అభిమానుల్ని నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో సొంత ప్రేక్షకుల మధ్య ఓడిపోయే పరిస్థితి తలెత్తింది. చివరకు ఆదిల్ ఖాన్ (88వ ని.లో) చేసిన హెడర్ గోల్‌తో ‘డ్రా’తో గట్టెక్కింది. ప్రస్తుతం గ్రూప్ ‘ఇ’లో రెండు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన భారత్... ఎలాగైనా అఫ్గానిస్తాన్‌ను ఓడించాలనే గట్టిపట్టుదలతో ఉంది. 106 ర్యాంకులో ఉన్న భారత్... 149వ ర్యాంకులో ఉన్న అఫ్గాన్ కంటే ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. బోణీ కొట్టేందుకు ఇదే సరైన అవకాశం. సునీల్ చెత్రి ఆశించిన స్థాయిలో రాణిస్తే విజయం ఏమంత కష్టం కాదు. అదే జరిగితే ఆశావహ దృక్పథంతో మిగతా మ్యాచ్‌లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు. -
తజికిస్థాన్‌లోని హిందూకుష్ పర్వతశ్రేణుల్లో భూకంపం
-
కజికిస్తాన్లో తెలుగు విద్యార్ధుల అవస్ధలు
-
ఉగ్రవాద నిరోధం కోసం 13వేల మందికి...!
న్యూఢిల్లీ: తజికిస్థాన్ పోలీసులు తాజాగా 13వేల మంది పురుషులకు గడ్డాలు గీయించారు. సంప్రదాయబద్ధమైన ముస్లిం వస్త్రాలను అమ్మే 160 దుకాణాలను మూసివేయించారు. దేశంలో రాడికల్ ఇస్లామిజాన్ని నిరోధించేందుకు తజికిస్థాన్ ఈ మేరకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. మధ్య ఆసియా ముస్లిం మెజారిటీ దేశమైన తజికిస్థాన్.. ముస్లిం తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పొరుగు దేశం ఆఫ్ఘనిస్థాన్ ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు ఈ మేరకు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నదని అల్ జజీరా చానెల్ ఓ కథనంలో తెలిపింది. అంతేకాకుండా బురఖా ధరించకుండా 1700 మంది మహిళల్ని ఆ దేశ ప్రభుత్వం ఒప్పించిందని, లౌకిక నాయకత్వంలో కొనసాగుతున్న తజికిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్ ప్రభావం తమపై పడకుండా చాలాకాలంగా జాగ్రత్త వహిస్తోందని వివరించింది. ఈ క్రమంలోనే గతవారం తజికిస్థాన్ పార్లమెంటు అరబ్ ధ్వనించే పదాలను నిషేధించింది. అలాగే, ఫస్ట్ కజిన్స్ మధ్య వివాహ సంప్రదాయాన్నీ నిషేధించింది. ఫస్ట్ కజిన్స్ పెళ్లి చేసుకునేందుకు ఇస్లాం మతంలో అనుమతి ఉంది. ఇక గత ఏడాది తజికిస్థాన్ సుప్రీంకోర్టు ఇస్లామిక్ రినైజాన్స్ పార్టీని నిషేధించింది. దేశంలో మతహింస చోటుచేసుకోవడంతో రాడికల్ ఇస్లామిజమే ఇందుకు కారణమంటూ తొలి ఇస్లామిక్ రాజకీయ పార్టీ అయిన దీనిని రద్దు చేసింది. దేశంలో లౌకిక భావనను పెంపొందించి.. విదేశీ ప్రభావాలను నిరోధించేందుకు వీలుగా తజికిస్థాన్ అధ్యక్షుడు ఇమొమాలి రఖ్మోన్ కొత్త చట్టాలు తేవాలని భావిస్తున్నారు. 1994 నుంచి దేశాన్ని పాలిస్తున్న ఆయన ప్రస్తుత పదవీకాలం గడువు 2020లో ముగియనుంది. -
తాలిబన్లు పరుగో.. పరుగు
కాబూల్: అఫ్గనిస్థాన్ సేనలు బుధవారం తాలిబన్ ఉగ్రవాదుల నివాస స్థావరాన్ని గుర్తించారు. తజకిస్థాన్ తో సరిహద్దు కలిగి ఉన్న కుందు ప్రావిన్స్ లోని దషత్ ఈ ఆర్చి జిల్లాలోని ఓ చోట తాలిబన్ ఉగ్రవాదులను అఫ్గన్ సైన్యం గుర్తించింది. దీంతో వారి అలికడి విన్న తాలిబన్లు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దాదాపు 40మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ చుట్టుపక్కల ప్రతి ఇంటిని గాలించారు. జిల్లా మొత్తాన్ని వడపోశారు. ఓ రకంగా ఈ జిల్లా తాలిబన్ ఉగ్రవాదులకు కీలక స్థావరం గత రెండేళ్లలో ఎన్నిసార్లు ప్రయత్నించినా అఫ్గన్ సేనలు అక్కడికి వెళ్లలేకపోయాయి. ఇటీవలే కొన్ని వ్యూహాలతో ముందుకు కదిలిన ఆఫ్గన్ సైన్యం ఎట్టకేలకు ఉగ్రవాదుల అసలైన స్థావరాలను గుర్తించి వారికి ముచ్చెమటలు పట్టించింది. ఇటీవల తాలిబన్లు అఫ్గన్ సేనలపై విచక్షణా రహితంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. -
ఆ నేడు 9 సెప్టెంబర్, 1991
ఆ తరువాత... రెండు రోజుల క్రితం ఒక ఆసక్తికరమైన విషయంతో వార్తల్లోకి వచ్చింది తజికిస్తాన్. గడ్డాలు మీసాలు పెంచుకుంటున్న వారిపై తజికిస్తాన్ పాలకులు కన్నెర్రజేసి కత్తి కట్టారట. దొరికిన వాళ్లను దొరికినట్లు గెడ్డాలు మీసాలు తీయిస్తున్నారట. దీని వెనక పాలకుల రహస్య ఎజెండా ఏమిటో తెలియదుగానీ... ఈ బలవంతపు ముఖ కేశ ఖండనపై నిరసన బలంగా వినిపిస్తోంది. సోవియట్ యూనియన్‌లో ఉన్నంత వరకు తజికిస్తాన్ అనేది ఒక దేశంలో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై గుర్తింపుతో ఉండేది. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ పతనమైందో... అప్పుడు తజికిస్తాన్‌కు స్వాతంత్య్రం వచ్చింది. తజికిస్తాన్ కాస్తా ‘రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్’ అయింది. భిన్నమైన ప్రాచీన సంస్కృతులు పరిఢవిల్లిన రాజ్యం... తజికిస్తాన్. స్వాతంత్య్రం స్వయంశక్తిని ఇవ్వాలి. స్వతంత్ర రాజ్యం తనదైన గుర్తింపును తెచ్చుకోవాలి. 9 సెప్టెంబర్ 1991లో స్వాతంత్య్ర ప్రకటన తరువాత... దురదృష్టవశాత్తు తజికిస్తాన్లో అంతర్గత కలహాలు చెలరేగాయి. 1997 వరకు కొనసాగిన ఈ కలహాల్లో వేలాదిమంది చనిపోవడం, దేశం విడిచిపోవడం జరిగింది. -
యువ మంత్ర
కిర్గిజిస్థాన్: గుణగణన కేవలం యాభై లక్షల జనాభా ఉన్న చిన్న దేశం కిర్గిజిస్థాన్. ఇక్కడ పార్టీల కంటే అభ్యర్థి గుణగణాలను చూసే ఓట్లేస్తారు. ఈ దేశంలోని యువత ఓటు వేసేందుకు చాలా ఆసక్తి చూపుతుంది. తజకిస్థాన్: పరిగణన ఈ దేశంలో యువత ప్రాతినిధ్యం ఎక్కువ. దేశ ప్రజల్లో అక్షరాస్యులు ఎక్కవే కావడంతో ఓటుపై అవగాహన ఎక్కువే. ఇక్కడి యువత రాజకీయాలను ఓ వృత్తిగా పరిగణిస్తుంది. అఫ్గానిస్థాన్: ఉద్యోగావకాశం ఇక్కడ అధ్యక్ష తరహా పాలన. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగు తాయి. యువత ఎన్నికల్లో భారీగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతుంది. ఓటరు కార్డు ఉంటే ఉద్యోగాలు సులభంగా రావడానికి అవకాశాలెక్కువ. ఇరాన్: గండిపడే అవకాశం ఈ దేశంలో నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఓటరు కార్డు పాస్‌పోర్టు తరహాలో ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో ఓటు వేశాక అందులో ఓ స్టాంప్ వేస్తారు. స్టాంప్‌లు తక్కువుంటే ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. చైనా: ఆసక్తి తక్కువ అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఉపాధి కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఓటేసేందుకు ప్రజల్లో ఆసక్తి తక్కువ. రాజకీయాల్లోకి రావడానికి యువత ముందుకు రాదు. అమెరికా: యువశక్తి ఎక్కువ ఇప్పుడు అమెరికాలో యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటోంది. ఒకప్పుడు ఎన్నికల్లో యువత పాత్ర చాలా తక్కువగా ఉండేది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటివి యువతలో మార్పు తెచ్చాయి. నేపాల్: నవశక్తిదే తెగువ ఏడేళ్ల కితమే ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన నేపాల్‌లో 18 ఏళ్లు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఓటు ఉంటుంది. అక్కడ రాచరికానికి చరమగీతం పాడటంలో యువత పాత్రే కీలకం. ఓటు వేసేందుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు. యెమన్: ఎనలేని హవా ఇక్కడ ఐదు దశల్లో జరిగే ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికే కీలకం. అమెరికా అధ్యక్ష ఎన్నికను పోలి ఉంటుంది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటుంది. ఎన్నికల్లో హామీలివ్వడం, మరచిపోవడం మామూలే.