కిర్గిజిస్థాన్: గుణగణన
కేవలం యాభై లక్షల జనాభా ఉన్న చిన్న దేశం కిర్గిజిస్థాన్. ఇక్కడ పార్టీల కంటే అభ్యర్థి గుణగణాలను చూసే ఓట్లేస్తారు. ఈ దేశంలోని యువత ఓటు వేసేందుకు చాలా ఆసక్తి చూపుతుంది.
తజకిస్థాన్: పరిగణన
ఈ దేశంలో యువత ప్రాతినిధ్యం ఎక్కువ. దేశ ప్రజల్లో అక్షరాస్యులు ఎక్కవే కావడంతో ఓటుపై అవగాహన ఎక్కువే. ఇక్కడి యువత రాజకీయాలను ఓ వృత్తిగా పరిగణిస్తుంది.
అఫ్గానిస్థాన్: ఉద్యోగావకాశం
ఇక్కడ అధ్యక్ష తరహా పాలన. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగు తాయి. యువత ఎన్నికల్లో భారీగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతుంది. ఓటరు కార్డు ఉంటే ఉద్యోగాలు సులభంగా రావడానికి అవకాశాలెక్కువ.
ఇరాన్: గండిపడే అవకాశం
ఈ దేశంలో నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఓటరు కార్డు పాస్‌పోర్టు తరహాలో ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో ఓటు వేశాక అందులో ఓ స్టాంప్ వేస్తారు. స్టాంప్‌లు తక్కువుంటే ఉద్యోగావకాశాలు తగ్గుతాయి.
చైనా: ఆసక్తి తక్కువ
అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఉపాధి కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఓటేసేందుకు ప్రజల్లో ఆసక్తి తక్కువ. రాజకీయాల్లోకి రావడానికి యువత ముందుకు రాదు.
అమెరికా: యువశక్తి ఎక్కువ
ఇప్పుడు అమెరికాలో యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటోంది. ఒకప్పుడు ఎన్నికల్లో యువత పాత్ర చాలా తక్కువగా ఉండేది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటివి యువతలో మార్పు తెచ్చాయి.
నేపాల్: నవశక్తిదే తెగువ
ఏడేళ్ల కితమే ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన నేపాల్‌లో 18 ఏళ్లు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఓటు ఉంటుంది. అక్కడ రాచరికానికి చరమగీతం పాడటంలో యువత పాత్రే కీలకం. ఓటు వేసేందుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు.
యెమన్: ఎనలేని హవా
ఇక్కడ ఐదు దశల్లో జరిగే ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికే కీలకం. అమెరికా అధ్యక్ష ఎన్నికను పోలి ఉంటుంది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటుంది. ఎన్నికల్లో హామీలివ్వడం, మరచిపోవడం మామూలే.
యువ మంత్ర
Published Fri, Mar 21 2014 4:00 AM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM
Advertisement