మేఘాలయలో ఓటేయనున్న ఇటలీ, స్వీడన్, అర్జెంటీనా! | Italy, Argentina and Sweden to vote in Meghalaya Election! | Sakshi
Sakshi News home page

మేఘాలయలో ఓటేయనున్న ఇటలీ, స్వీడన్, అర్జెంటీనా!

Published Mon, Feb 12 2018 2:28 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

Italy, Argentina and Sweden to vote in Meghalaya Election! - Sakshi

ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ప్రజలు..(ఫైల్‌)

ఉమ్నియా: మేఘాలయ ఎన్నికల్లో ఓ వింత చోటుచేసుకోబోతోంది. ఇటలీ, స్వీడన్, అర్జెంటీనా, ఇండోనేసియాతోపాటు ప్రామిస్‌లాండ్, హోలీలాండ్, జెరూసలేం...తదితరాలన్నీ అక్కడి ఎన్నికల్లో ఓటేయబోతున్నాయి. అదేంటీ..ఈ దేశాలకు మేఘాలయ ఎన్నికలతో ఏంటీ సంబంధం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఇవన్నీ ఇక్కడ ఈ నెల 27న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్ల పేర్లు..! ఇవే కాదు, వారాలు.. సండే, థర్స్‌డే, రాష్ట్రాలు గోవా, త్రిపుర లాంటి పేర్లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ఖాసీ తెగ ప్రజల్లో ఇలాంటి విచిత్రమైన పేర్లుండటం సహజం. ఎన్నికల జాబితాలో ఈ పేర్లను చూసిన అధికారులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారట..! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement