Meghalaya
-
ఎంతో సుందరమైన ప్రాంతాలు.. మేఘాలయా వెళ్తే తప్పక చూడాల్సిందే! (చిత్రాలు)
-
పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు
గౌహతి: పరీక్షల్లో అక్రమాలకు ఊతమిచ్చారన్న ఆరోపణలపై యూనివర్సిటీ ఆప్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మేఘాలయ(యూఎస్‌టీఎం) చాన్స్‌లర్ మహబూబుల్ హక్ అరెస్టయ్యారు. అస్సాంలోని షిభుమి జిల్లాకు చెందిన ఓ కోర్టు శనివారం రాత్రి హక్‌తోపాటు, కరీమ్గంజ్ జిల్లా పత్తర్‌కండిలోని ఓ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను కూడా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు గౌహతిలోని నివాసంలో ఉన్న హక్‌ను శనివారం అదుపులోకి తీసుకుని షిభుమికి తరలించారు. యూఎస్‌టీఎం చాన్స్‌లర్‌గా ఉన్న హక్ ఈఆర్డీ అనే ఫౌండేషన్ ద్వారా ఎన్నో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఇందులో పత్తర్‌కండిలోని స్కూలు కూడా ఉంది. ఇతర జిల్లాలకు చెందిన సీబీఎస్ఈ విద్యార్థులను ఎక్కువ మార్కులు వచ్చేలా ప్రిపేర్ చేస్తామంటూ ఈ స్కూలుకు తీసుకువచ్చారు. వీరు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు పథకం వేశారంటూ శుక్రవారం నుంచి అక్కడ వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లతోపాటు చాన్స్‌లర్ హక్ అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ..దీని వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందన్నారు. సీబీఎస్ఈలోనే కాకుండా, మెడికల్ ఎంట్రన్స్‌లోనూ ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘యూఎస్‌టీఎం చాన్స్‌లర్ హక్ పెద్ద ఫ్రాడ్, ఆయన జీవితమే ఫ్రాడ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హక్ దొడ్డిదారిన పొందిన ఓబీసీ సరి్టఫికెట్ తర్వాత రద్దయిందని చెప్పారు. అస్సాం–మేఘాలయ సరిహద్దుల్లో ఉన్న యూఎస్‌టీఎం క్యాంపస్ కారణంగా గౌహతి నగరానికి వరద ముప్పు పెరిగిందంటూ సీఎం శర్మ గతంలోనే ఆరోపణలు చేయడం తెల్సిందే. -
మేఘాలయలో కలుద్దాం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అలరించిన జాతీయ క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. తదుపరి మేఘాలయ జాతీయ క్రీడల ఆతిథ్యానికి సిద్ధం కానుంది. 2027లో అక్కడ 39వ నేషనల్ గేమ్స్ జరుగనున్నాయి. శుక్రవారం మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్‌కల్ సంగ్మా క్రీడాజ్యోతి అందుకోవడంతో దీనికి సంబంధించిన లాంఛన ప్రకియ కూడా ముగిసింది. 18 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన తాజా జాతీయ క్రీడల్లో సర్వీసెస్ 121 పతకాలతో ఓవరాల్ చాంపియన్‌షిప్ గెలుచుకుంది. సర్వీసెస్ క్రీడాకారులు 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలిచారు. మహారాష్ట్ర అత్యధికంగా 198 పతకాలు గెలిచినప్పటికీ పసిడి వేట (54 స్వర్ణాలు)లో వెనుకబడిపోవడంతో రెండో స్థానంలో నిలిచింది. 71 రజతాలు, 73 కాంస్యాలు మరాఠా క్రీడాకారులు చేజిక్కించుకున్నారు. హరియాణా 153 పతకాలు (48 పసిడి, 47 రజతాలు, 58 కాంస్యాలు) మూడో స్థానంలో నిలువగా, ఆతిథ్య ఉత్తరాఖండ్ 24 స్వర్ణాలు, 35 రజతాలు, 44 కాంస్యాలతో మొత్తం 103 పతకాలు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (14 పతకాలు) 18వ స్థానంలో, తెలంగాణ (18 పతకాలు) 26వ స్థానంలో నిలిచాయి. 2036 ఒలింపిక్స్‌కు సిద్ధం: అమిత్ షా జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వక్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ‘క్రీడల్లో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉంది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు రెడీగా ఉంది. ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమిగా ప్రసిద్ధి. అయితే తాజా ఈవెంట్ నిర్వహణ ద్వారా ఖేల్ భూమి అయ్యింది. కేవలం క్రీడల నిర్వహణే కాదు. ఆటగాళ్లు రాటుదేలిన తీరు సాధించిన ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో చేసిన విశేష కృషికి నిదర్శనం. గత జాతీయ క్రీడల్లో ఉత్తరాఖండ్ 21వ స్థానంలో నిలిచింది. తాజా క్రీడల్లో ఏడో స్థానానికి ఎగబాకింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే క్రీడారంగంలో ఆ రాష్ట్రం ఇంతలా ఎదిగింది. ఇదే జోరు ఇకమీదటా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్‌కల్ సంగ్మా తదితరులు పాల్గొన్నారు. పీటీ ఉష మాట్లాడుతూ ‘ఈ మహత్తర ప్రయాణం ఇక్కడితో ముగిసేది కాదు. ఎల్లప్పుడు దిగి్వజయంగా సాగేది. భారత క్రీడల ప్రగతిని చాటేది’ అని ఆమె కితాబిచ్చారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ‘2036 విశ్వక్రీడల్లో టాప్–10లో నిలిచేందుకు ఇదొక గొప్ప ఆరంభం. దేశంలో క్రీడాసంస్కృతి పెరుగుతుందనడానికి ఇదో నిదర్శనం’ అని అన్నారు. -
2 పరుగులే 6 వికెట్లు.. 152 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే
మేఘాలయ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 86 పరుగులకే ఆలౌటైంది. ఆరంభంలోనే ముంబై స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్(Shardul Thakur) హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి దెబ్బతీశాడు. అతడి ధాటికి మేఘాలయ కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మేఘాలయ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది.152 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ హిస్టరీలోనే తొలి ఆరు వికెట్లకు అత్యల్ప స్కోర్ చేసిన రెండో జట్టుగా మేఘాలయ నిలిచింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఎసీసీ క్రికెట్ క్లబ్ అగ్రస్ధానంలో ఉంది. 1872లో లార్డ్స్‌లో సర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఎంసీసీ ఖాతా తెరవకుండానే తొలి 6 వికెట్లను కోల్పోయింది. ఈ లిస్ట్‌లో ఎంసీసీ, మేఘాలయ తర్వాతి స్ధానాల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (3-6), లీసెస్టర్‌షైర్(4-6), నార్తాంప్టన్‌షైర్(4-6) ఉన్నాయినాలుగేసిన శార్ధూల్..ఇక ఈ మ్యాచ్‌లో శార్థూల్ ఠాకూర్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. మేఘాలయ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన లార్డ్ శార్ధూల్.. బి అనిరుధ్, సుమిత్ కుమార్, జస్కిరత్లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఓవరాల్‌గా 11 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్.. 43 పరుగులిచ్చి 4 వికెట్లను పడగొట్టాడు.అతడితో పాటు మొహిత్ అవస్థి మూడు, సిల్వస్టర్ డిసౌజా రెండు , షామ్స్ ములానీ ఒక్క వికెట్ సాధించారు. మేఘాలయ బ్యాటర్లలో టెయిలాండర్ హీమ్యాన్(28) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: RT 2025: హ్యాట్రిక్‌తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం -
హ్యాట్రిక్‌తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ముంబై స్టార్ ఆల్‌రౌండర్, టీమిండియా వెటరన్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో శార్ధూల్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు.ముంబై బౌలింగ్ ఎటాక్‌ను ప్రారంభించిన శార్దూల్ తొలి ఓవర్లోనే మేఘాలయ ఓపెనర్ నిశాంత చక్రవర్తిని డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మళ్లీ మూడో ఓవర్ వేసిన లార్డ్ శార్ధూల్.. బి అనిరుధ్, సుమిత్ కుమార్, జస్కిరత్లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు.దీంతో తొలి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ హ్యాట్రిక్‌ను ఠాకూర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి దెబ్బకు మేఘాలయ కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మేఘాలయ కెప్టెన్ ఆకాష్ చౌదరి(14), ప్రింగ్సాంగ్ సంగ్మా(18) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 15 ఓవర్లకు మేఘాలయ 6 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.కాగా ఈ మ్యాచ్ కంటే ముందు జమ్మూ అండ్ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్ధూల్ ఠాకూర్ సెంచరీతో మెరిశాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్ధూల్ వన్డే తరహాలో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ శర్మ,జైశ్వాల్,రహానే, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట, ఠాకూర్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. శార్దూల్ 119 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. అంతకుముందు మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో ఈ ముంబై క్రికెటర్ రాణించాడు.టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడా?లార్డ్ ఠాకూర్ గత 14 నెలలగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఠాకూర్ చివరగా భారత్ తరుపున 2023లో సౌతాఫ్రికాపై టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే శార్ధూల్ తన రిథమ్‌ను తిరిగి పొందాడు. దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో శార్ధూల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అతడికి టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై అద్బుతమైన రికార్డు ఉంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో టెస్టులకు అతడిని ఎంపిక చేసే అవకాశమున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.చదవండి: SA 20: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్ -
Dock Bridge : ప్రకృతి ఆధారిత వేళ్ల వంతెన..!
ఇది వేళ్లాడే వంతెన. ఉంగాట్ నది మీద ఉంది. అభివృద్ధి చెందిన నగరాలన్నీ నగరం మధ్యలో ఉన్న చెరువు మీద ఇనుప చువ్వలతో వేళ్లాడే వంతెనలను కడుతున్నాయి. కానీ ఉంగాట్ నది మీద కనిపించేవి వేళ్లతో కట్టిన వంతెనలు. అది కూడా చెట్టు నుంచి వేరు చేసిన వేళ్లు కాదు, సజీవంగా ఉన్న వేళ్ల వంతెనలు. ఈ నైపుణ్యం ప్రపంచంలో మనదేశానికే సొంతం, అది కూడా మేఘాలయ వంటి మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించిన నైపుణ్యం. ఈ నది డాకీ పట్టణం నుంచి ప్రవహిస్తోంది. వంతెన డాకీ పట్టణంలో ఉంది. అందుకే డాకీ రూట్ బ్రిడ్జిగా వ్యవహారంలోకి వచ్చింది. ఇలాంటి వంతెనలు డాకీ పట్టణంలో మాత్రమే కాదు. మేఘాలయలో చాలా చోట్ల విస్తారంగా ఉంటాయి. కానీ మేఘాలయ పర్యటనకు వెళ్లిన వాళ్లు తప్పకుండా డాకీ పట్టణంలోని రూట్ బ్రిడ్జి మీద నడిచి మురిసిపోతారు. ఎందుకంటే ఇది దేశానికి చివరి వంతెన. డాకీ దాటితే బంగ్లాదేశ్‌లో అడుగుపెడతాం. మనిషికి జీవన నైపుణ్యాలు అవసరాన్ని బట్టి వృద్ధి చెందుతాయనడానికి నిదర్శనం ఈ వంతెనలు. ఇనుము, సిమెంటు వంటి భవన నిర్మాణ సామగ్రిని తరలించడం సాధ్యం కాని చోట్ల ప్రకృతి ఇచ్చిన మెటీరియల్‌తో జనం తమకు అవసరమైన విధంగా మలుచుకోవడం అంటే ఇదే. మేఘాలయలో నివసించే ఖాసీ, జైంతియా తెగల వాళ్లు నదికి రెండు వైపులా ఉన్న రబ్బరు చెట్ల వేళ్లను ఒకదానితో మరొక దానిని జడలాగ అల్లుతూ ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుతో కలుపుతారు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి వంతెన రెడీ. సిమెంటు వంతెనలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు కానీ ఈ వేళ్ల వంతెనలను ఒకసారి అల్లితే వందేళ్లకు కూడా చెరగవు, పైగా మరింత దృఢమవుతూ ఉంటాయి. మరీ లేత వేళ్లను కాకుండా ఒక మోస్తరు ముదురు వేళ్లతో వంతెన అల్లుతారు. కాలం గడిచే కొద్దీ చెట్టు పెద్దదవుతుంది, వేళ్లు శక్తిపుంజుకుంటూ ఉంటాయి. మరో విచిత్రం ఏమిటంటే... ఈ వేళ్లు నది నీటిని అందుకోవడానికి మాన్గ్రోవ్లాగ పిల్ల వేళ్లను పెంచుకుంటాయి. కొత్త వంతెనలు మనం నడిచేటప్పుడు బరువుకు తగినట్లు ఊగుతుంటాయి. ముదురు వంతెనలు కదలవు. ఈ వంతెనల మీద నుంచి రాకపోకలు సాగించేది మనుషుల మాత్రమే కాదు, జింకలు, చిరుతపులులతోపాటు ఇతర జంతువులు కూడా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వంతెనల మీదనే వెళ్తాయి. ఇప్పటి వరకు వంతెన గొప్పదనాన్నే మాట్లాడుకున్నాం. కానీ ఉంగాట్ నదికి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విశేషణం ఉంది. మనదేశంలో అత్యంత పరిశుభ్రమైన నదుల్లో ఉంగాట్ నది ఒకటి. ఈ నదిలో పడవలో విహరిస్తుంటే నీటి కింద నేల అద్దంలో కనిపించినంత స్వచ్ఛంగా ఉంటుంది. వేళ్ల వంతెన మీద నడవడంతోపాటు పడవ ఎక్కి ఈ నదిలో విహరించడం కూడా గొప్ప అనుభూతి.రాముడు కూడా కట్టాడునది మీద చెట్ల వేళ్లతో వంతెన నిర్మించే నైపుణ్యం ఇతిహాస కాలం నాటిదని చెబుతారు. వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు అడవుల్లో నివసించినట్లు చెప్పుకుంటాం. గంగానది తీరాన నివసించిన రోజుల్లో ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరడానికి రాముడు, లక్ష్మణుడు నదిలో ఈదుతూ వెళ్లేవారని, ప్రతిరోజూ నది దాటడం సీతమ్మకు కష్టం కావడంతో ఆమె కోసం వంతెన నిర్మించారని చెబుతారు. గంగానది మీద రిషికేశ్ దగ్గర రామ్‌ఝాలా, లక్ష్మణ్ ఝాలా ఉన్నాయి. బ్రిటిష్ పాలన కాలంలో ఈ వంతెనలను ఇనుముతో పునర్నిర్మించారు. రిషికేశ్‌లో గంగానది మీద ఇప్పుడు మనకు కనిపించేవి కొత్త నిర్మాణాలు. వాకా మంజూలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: తాత మొండి పట్టుదల ఎంత పనిచేసింది..! ఏకంగా ఇంటి చుట్టూ..) -
అజేయ శతకాలతో చెలరేగిన కేఎస్ భరత్, అశ్విన్
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో ఆంధ్ర జట్టు అదరగొడుతోంది. గ్రూప్-‘బి’లో భాగంగా మేఘాలయతో పోరులో ఘన విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 10 వికెట్ల తేడాతో మేఘాలయ(Andhra vs Meghalaya )ను మట్టికరిపించింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ జట్టు 48.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ నిశాంత చక్రవర్తి (108 బంతుల్లో 101; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... అర్పిత్ (90 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించాడు. దీంతో ఒకదశలో మేఘాలయ జట్టు 182/1తో పటిష్ట స్థితిలో కనిపించింది.యారా సందీప్ 5 వికెట్లతో అదరగొట్టాడుఅయితే ఆ తర్వాత ఆంధ్ర బౌలర్లు విజృంభించి వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో మేఘాలయ బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆంధ్ర బౌలర్లలో యారా సందీప్ 28 పరుగులిచ్చి 5 వికెట్లతో అదరగొట్టగా... ఆంజనేయులు, మహీప్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర 29.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 228 పరుగులు చేసింది.భరత్, అశ్విన్ అజేయ శతకాలుఆంధ్ర కెప్టెన్ శ్రీకర్ భరత్ (KS Bharat- 81 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో విజృంభించాడు. మరో ఓపెనర్ అశ్విన్ హెబర్ (Ashwin Hebbar- 96 బంతుల్లో 108 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) కూడా ‘శత’క్కొట్టడంతో ఆంధ్ర జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. మేఘాలయ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న భరత్... సిక్స్‌లతో చెలరేగిపోతే అశి్వన్ బౌండరీలతో హోరెత్తించాడు. వీరిద్దరూ పోటీపడి పరుగులు రాబట్టడంతో లక్ష్యం చిన్నబోయింది.రెండో స్థానంలోగత మ్యాచ్‌లో సర్వీసెస్‌పై అజేయ అర్ధశతకాలతో వికెట్ నష్టపోకుండానే జట్టును గెలిపించిన భరత్, అశ్విన్... ఈసారి కూడా దాన్ని పునరావృతం చేశారు. 5 వికెట్లు తీసిన సందీప్నకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. గ్రూప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన ఆంధ్ర జట్టు 4 విజయాలు, ఒక పరాజయంతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర జట్టు తలపడుతుంది. చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
అదరగొట్టిన ఆల్‌రౌండర్ వేద్ రెడ్డి.. హైదరాబాద్ భారీ విజయం
సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ ట్రోఫీ దేశవాళీ అండర్–16 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు ఖాతాలో తొలి విజయం లభించింది. గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భాగంగా లక్నో వేదికగా హైదరాబాద్ టీమ్ మేఘాలయ జట్టుతో తలపడింది. ప్రత్యర్థిపై ఇన్నింగ్స్ 101 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో వేద్ రెడ్డి(Ved Reddy) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి హైదరాబాద్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. వేద్ రెడ్డి 58 పరుగులు చేయడంతోపాటు మ్యాచ్‌లో 4 వికెట్లు తీసుకున్నాడు. మొదట మేఘాలయ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులకు ఆలౌటైంది. వేద్ రెడ్డి 2 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. వేద్ రెడ్డి (58; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 141 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆడిన మేఘాలయ జట్టు 40 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. -
తిలక్ వర్మ మెరిసినా...
రాజ్‌కోట్: కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (44 బంతుల్లో 57; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో ఆకట్టుకున్నా... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. గత మ్యాచ్‌లో మేఘాలయ జట్టుపై ఘనవిజయం సాధించిన హైదరాబాద్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగాల్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. టి20ల్లో వరుసగా మూడు శతకాలు బాది రికార్డుల్లోకెక్కిన తిలక్ వర్మ అదే ఫామ్ కొనసాగిస్తూ హాఫ్‌సెంచరీతో విజృంభించగా... రాహుల్ బుద్ధి (30; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. తన్మయ్ అగర్వాల్ (6) రాహుల్ సింగ్ (10), మికిల్ జైస్వాల్ (12), రవితేజ (0), ప్రతీక్ రెడ్డి (3), సీవీ మిలింద్ (0) విఫలమయ్యారు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ 3... షహబాజ్, కరణ్ లాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బెంగాల్ జట్టు 17.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. అభిõÙక్ పొరెల్ (41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కరణ్‌లాల్ (46; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అనికేత్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. తదుపరి మ్యాచ్‌లో బుధవారం రాజస్తాన్‌తో హైదరాబాద్ తలపడనుంది. బెంగాల్ చేతిలో హైదరాబాద్ ఓటమి -
భారత్‌లో ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. షిల్లాంగ్ తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)
-
మేఘాలయలో ఆకస్మిక వరదలు..10 మంది మృతి
షిల్లాంగ్:మేఘాలయలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. భారీ వర్షాల ప్రభావంతో ఒక్కసారిగా సౌత్‌గారో హిల్స్ జిల్లాలో వరదలు వచ్చాయి. కేవలం 24 గంటలపాటు కురిసిన వర్షాలకే వరదలు రావడంతో ప్రాణనష్టం జరిగింది.వరదల వల్ల సౌత్‌గారో హిల్స్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడడంతో మొత్తం 10 మంది మరణించారు. ఒకే కుంటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమీక్ష నిర్వహించారు.ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేశారు.ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇదీ చదవండి: ఆహారంలో బల్లి..50 మందికి అస్వస్థత -
మేఘాలయలో బంగ్లా టాప్ లీడర్ మృతి.. కారణం అదేనా?
షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడి మృతదేహం లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. భారత సరిహద్దు నుంచి 1.5 కి.మీ దూరంలో తమలపాకు తోటలో అవామీ లీగ్ నాయకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు నుండి 1.5 కి.మీ దూరంలో ఉన్న ఈస్ట్ జైన్తియా హిల్స్ జిల్లాలో బంగ్లాకు చెందిన అవామీ లీగ్ నాయకుడు ఇషాక్ అలీ ఖాన్ కన్నా మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్బంగా జైన్తియా ఎస్పీ గిరిప్రసాద్ మాట్లాడుతూ.. మృతుడి దగ్గర బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ దొరికింది. అతడిని బంగ్లాదేశ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన అవామీ లీగ్ నాయకుడు ఇషాక్ అలీ ఖాన్ పన్నాగా గుర్తించాము. పోస్టుమార్గం నిమిత్తం అతడిని ఖలీహ్రియత్లోని సివిల్ ఆసుపత్రి తరలించినట్టు తెలిపారు.ఇక, పోస్టుమార్టం అనంతరం, తదుపరి ప్రక్రియల కోసం డెడ్ బాడీని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత పన్నా పరారీలో ఉన్నాడు. షేక్ హసీనా ప్రభుత్వంలో పన్నా కీలక వ్యక్తిగా ఉన్నట్టు సమాచారం. అయితే, భారత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుంది అధికారులు భావిస్తున్నారు. ఆయన మృతిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. -
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. భారత్ చేరిన వెయ్యి మంది విద్యార్థులు
ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు పెరగుతున్న క్రమంలో ఢాకాలోని భారత హైకమిషన్ విద్యార్థులను పలు మార్గాల ద్వారా ఇండియాకు సురక్షితంగా చేర్చుతోంది. ఇప్పటివరకు 1000 మంది విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరకున్నారు. 778 మంది విద్యార్థులు వివిధ మార్గాల ద్వారా బంగ్లాదేశ్ సరిహద్దు దాటి భారత్‌కు చేరుకున్నారు. ఇక.. 200 మంది విద్యార్థులు రెగ్యులర్ విమాన సర్వీసుల్లో భాగంగా శనివారం ఢాకా, చిట్టగాంగ్ ఎయిర్‌పోర్టుల్లో విమానం ద్వారా భారత్‌కు చేరకున్నట్లు విదేశీ వ్యవహరాల శాఖ వెల్లడించింది. అయితే మరో నాలుగు వేల మంది విద్యార్థులతో టచ్‌లో ఉన్నామని అధికారులు తెలిపారు. ఇక.. శుక్రవారం 300 మంది భారతీయులు.. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు బయలుదేరి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల గుండా ఇళ్లకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత్ చేరకున్న 300 మంది విద్యార్థల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థులంతా ఉత్తర ప్రదేశ్, హర్యానా, మేఘాలయా, జమ్ము కశ్మీర్ చెందినవారిగా అధికారులు గుర్తించారు.Over 300 Indian Students Return Home As 105 Bangladeshis Die In ProtestsMany of the students who returned were pursuing MBBS degrees and most of them were from Uttar Pradesh, Haryana, Meghalaya and Jammu and Kashmir.#BangladeshiStudentsareinDanger https://t.co/kL2sdGFYmL— AK_0 (@ak_2350) July 20, 2024 బంగ్లాదేశ్ నుంచి రెండు మార్గాలు ద్వారా విద్యార్థులు భారత్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తాలాకు సమీపంలోని అకురాహ్ పోర్టు, మేఘాలయాలోని దావ్కీ గుండా విద్యార్థులు భారత్‌లోకి ప్రవేశించారు. పలువరు విద్యార్థులు టాక్సిల ద్వారా సుమారు ఆరుగంటల ప్రయాణం చేసి మరీ ఇళ్లకు చేరకున్నట్లు అధికారులు తెలిపారు. 200 మంది భారతీ విద్యార్థులతోపాటు కొంతమంది భూటాన్, నేపాల్ చెందిన విద్యార్థులు కూడా భారత్‌లోకి ప్రవేశించినట్లు మేఘాలయా అధికారులు పేర్కొన్నారు.బంగ్లాదేశ్‌లో పోలీసులు, అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఘటనల్లో శుక్రవారం నాటికి 64 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. గాయపడిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుందని తెలిపింది. -
Water Woman: అగాథా సంగ్మా గేమ్ చేంజర్
అగాథా సంగ్మా. ఆ పేరే ఓ రికార్డు. రాజకీయ దిగ్గజమైన తండ్రి పీఏ సంగ్మా వారసురాలిగా మేఘాలయలోని తుర నుంచి తొలిసారి లోక్‌సభలో అడుగు పెట్టినా, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధిగా ఎదిగారు. అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి బాధ్యతలు సమర్థంగా నిర్వహించి గేమ్ చేంజర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2014లో లోకసభ బరిలోంచి తప్పుకున్నా ‘అయాం నాట్ అ చైల్డ్ ఎనీమోర్’ అంటూ 2019లో లోక్‌సభ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈసారీ తురా నుంచే బరిలో ఉన్నారు... వాటర్ ఉమన్... తండ్రి పీఏ సంగ్మా రాజీనామాతో 2008లో అగాథా తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. తుర ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించి దేశంలోనే యంగెస్ట్ ఎంపీగా నిలిచారు. తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లోనూ నెగ్గారు. 29 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రి అయ్యారు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగానూ చరిత్ర సృష్టించారు. అంతేగాక అసోంకు చెందిన రేణుకాదేవి బార్కాటకి అనంతరం ఈశాన్య రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి అయిన రెండో మహిళగా నిలిచారు. నీటికోసం నెత్తి మీద కుండతో కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన దుస్థితి నుంచి మహిళలను బయటికి తేవడమే తన కల అని చెప్పే అగాథా వాటర్ ఉమన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈశాన్య గ్రామాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అక్కడి వెనకబడ్డ ప్రాంతంలో కొత్త వెలుగులు నింపారు. 2012లో జరిగిన రాజకీయ పరిణామాలతో కేంద్ర మంత్రిగా రాజీనామా చేశారు. 2014లో మేఘాలయ రాష్ట్ర రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొంది నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2018లో సౌత్ తుర నుంచి ఘనవిజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో మళ్లీ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. మాజీ సీఎం ముకుల్ సంగ్మాపై ఘనవిజయం సాధించారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు గర్వంగా ఉందంటారామె. మేఘాలయ నుంచి మళ్లీ లోక్‌సభలో అడుగు పెడతారా అన్నది ఆసక్తికరం. పర్యావరణ ప్రేమిక... అగాథా సంగ్మా 1980 జూలై 24న ఢిల్లీలో జని్మంచారు. మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్‌లో పెరిగారు. తురాలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ నుంచి పాఠశాల విద్య పూర్తి చేశారు. పుణె యూనివర్సిటీలో ఎల్ఎల్బీ అనంతరం ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్‌గా చేరారు. బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ వర్సిటీలో ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. 2019లో పాట్రిక్ రోంగ్మా మారక్‌ను పెళ్లాడారు. పర్యావరణవేత్త అయిన అగాథా సందర్భం వచి్చనప్పుడల్లా ప్రకృతి పట్ల తన ప్రేమను, బాధ్యతను చాటుకున్నారు. పెళ్లి కూడా పూర్తి పర్యావరణహిత పద్ధతిలో చేసుకుని ఆదర్శంగా నిలిచారు. చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి పెళ్లికి వచి్చనవారికి విత్తన పత్రాలిచ్చారు. నిశి్చతార్థ సమయంలోనూ మొక్కలు నాటారు. అగాథా పుస్తకాల పురుగు. సమయం దొరికిందంటే పుస్తకం పట్టుకుంటారు. అగాథా అంతే బాగా రాస్తారు కూడా. ఫొటోగ్రఫీ అన్నా ఆమెకు ప్రాణం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రామ్‌లల్లా దర్శనానికి మూడు రాష్ట్రాల గవర్నర్లు!
గుజరాత్, సిక్కిం, మేఘాలయ గవర్నర్లు రామ్‌లల్లాను దర్శించుకునేందుకు అయోధ్య చేరుకున్నారు. వారికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్వాగతం పలికింది. ఈ ముగ్గురు గవర్నర్లు వేర్వేరు సమయాల్లో రామ్‌లల్లాను దర్శించుకున్నారు. మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్ తమ పూర్వీకుల స్వస్థలమైన అజంగఢ్ నుండి రోడ్డు మార్గంలో ముందుగా అయోధ్య చేరుకున్నారు. అనంతరం రామజన్మభూమిలోని ఆలయంలో కొలువైన రామ్‌లల్లాను దర్శించుకున్నారు. అలాగే సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య విమానాశ్రయం నుంచి నేరుగా సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడి భద్రతా సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ శ్రీరామ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. తరువాత వారు రామ్‌లల్లాను దర్శించుని పూజలు చేశారు. సర్క్యూట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య రామ్‌లల్లాను చూశాక ఎంతో ఆనందం కలిగిందన్నారు. -
స్టైలిష్‌గా ఉన్న ఈయన ఓ రాష్ట్ర సీఎం.. ఎవరో తెలుసా?
ఇక్కడ స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈయన మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా (Meghalaya CM Conrad Sangma). మౌడియాంగ్డియాంగ్లో నిర్మాణమవుతున్న మేఘాలయ శాసనసభ నూతన భవనాన్ని ఆయన తాజాగా పరిశీలించారు. స్పీకర్ థామస్ సంగ్మా, డిప్యూటీ స్పీకర్ తిమోతీ డి షిరా, ఉప ముఖ్యమంత్రి ప్రిస్టోన్ టైన్సాంగ్ నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. మేఘాలయ శాసనసభ నూతన భవన నిర్మాణం ఆ రాష్ట్ర చరిత్రలో గొప్ప మైలురాయి. నిర్మాణం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో శాసనసభ భవనం ప్రారంభోత్సవం కోసం మేఘాలయ పౌరులలో నిరీక్షణ పెరిగింది. ఈ మైలురాయి రాష్ట్ర అభివృద్ధి పథంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపుతుంటారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే కొందరు సీఎంలు మాత్రం ఏదో ఒక వ్యాపకంతో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలాంటి వారిలో మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఒకరు. ఐరన్ మైడెన్ పాటకు ఆయన ఎలక్ట్రిక్ గిటార్‌పై వాయిస్తున్న వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంగీతం తనకు అంతులేని ఉత్సాహాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుందని సీఎం సంగ్మా చెబుతుంటారు. తాను ఎప్పుడూ సంగీతంలోనే ఉంటానని, అవకాశం దొరికినప్పుడల్లా ఎలక్ట్రిక్ గిటార్ ప్లే చేస్తానని చెప్పారు. క్యాబినెట్ సహచరులతో ఉన్నప్పుడు, ముఖ్యమైన సమావేశాలు, కార్యక్రమాల అనంతరం లైవ్ ప్రదర్శన ఇవ్వడానికి ఇష్టపడుతుంటానని తెలిపారు. -
అక్కడ..అబ్బాయే అత్తారింటికి వస్తాడు..
ఇప్పటికీ చాలా కుటుంబాల్లో కొడుకు పుట్టగానే వారుసుడు పుట్టాడంటూ ఘనంగా వేడుకలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆడిపల్ల పుడితేనే సెలబ్రేషన్స్. ఆడిపిల్లలకే ఆస్తి ఇస్తారు. ఆఖరికి అక్కడి మహిళలు అత్తారింటికి వెళ్లరు. అబ్బాయిలే అత్తారింటికి వస్తారు. దశాబ్దాలుగా సాగుతున్న పితృస్వామ్య వ్యవస్థకు పూర్తి విభిన్నంగా ఉంటారని చెప్పొచ్చు. ఆ వ్యవస్థ విదేశాల్లోనేమో! అనుకోకండి. మనదేశంలోనే ఈ వ్యవస్థ ఉంది. ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో మనదేశంలో ఉన్న ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? ఏంటా వింత ఆచారాలు తెలుసుకుందామా!. గిరిజనులు అనగానే బాగా వెనుకబడిన వాళ్లు, అమాయకులు అనుకుంటాం. మేఘాలయ రాష్ట్రంలోని గిరిజన తెగను చూస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఆ తెగల ఆచారాలు సంప్రదాయలను చూసి సమాజానికి ఎంత స్ఫూర్తిగా ఉన్నాయా ? అని ఆశ్చర్యపోవడం ఖాయం. మనమే చాలా వెనకబడి ఉన్నామా? అన్నా సందేహం కూడా వస్తుంది. ఇలా ఎందుకు చెబుతున్నానంటే.. ఆడపిల్లకే పట్టం.. మేఘాలయలోని ఖాసీ, గరో అనే తెగలు మయాన్మార్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన తెగలు. ఈ తెగలు మేఘలయాలోని జైంటియా అనే పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయితే ఈ తెగలు దశాబ్దాలకు పూర్వమే కొన్ని నియమాలు, పద్ధతులు పెట్టుకున్నారు. వాటినే ఇప్పటికీ ఆచరిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్కడ ఆడపిల్ల పుడితేనే వేడుకగా సెలబ్రేషన్స్ చేస్తారు. ఆడపిల్లకే పట్టం కడతారు.పెత్తనం అంతా ఆడపిల్లదే. ఆడపిల్లకే ఆస్తి ముట్టజెప్పుతారు. ఆఖరికిగా ఆడపిల్ల అత్తారింటికి వెళ్లదు. వరుడే అత్తారింటికి ఇళ్లరికం అల్లుడుగా వస్తాడు. అయితే ఆ తెగలోని ఆడపిల్లలు తమ తెగలోని అబ్బాయిని కాకుండా మరో జాతి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈ నియమాలు వర్తించవట. అలాగే అక్కడి కుటుంబాల్లో ఒకరికి మించి ఎక్కువమంది ఆడిపిల్లలు ఉంటే..చిన్న కూతురు తప్పించి మిగతా వాళ్లంతా తమ భర్తలతో అదే ఇంట్లో ఉండోచ్చు. అక్కడ చిన్న అమ్మాయిని ఖథూగా పరిగిణిస్తారు. ఆ అమ్మాయికి పెళ్లి తర్వాత ఇంటి భాద్యతలు, ఆస్తిపాస్తులన్నీ ఆమెకే ఇస్తారు. ఆఖరికీ తల్లి మరణం తర్వాత ఇంటి భాద్యతలన్నీ నిర్వర్తించాల్సి కూడా ఆమెనే. అంతేగాదు పుట్టబోయే పిల్లలకు ఇంటిపేరు కూడా తల్లి ఇంటి పేరే పెడతారు. అలాగే పిల్లల పోషణ, బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కూడా ఆడవాళ్లకే ఎక్కువ హక్కులు ఉంటాయట. అందువల్లే ఇక్కడ మహిళలు వ్యవసాయం, ఇతర ఉద్యోగాల్లో వాళ్లే బాగా రాణిస్తారట. ఇలా ప్రతి విషయంలో పురుషుల కంటే మహిళలదే పైచేయి కావడంతో అక్కడ గృహహింస,అత్యాచారాలు, వేధింపులు ఉండవని అక్కడ స్థానికులు చెబుతున్నారు. సమానత్వం కోసం పురుషుల పోరాటం.. ఇలా ఇక్కడ దశాబ్దాలుగా మాతృస్వామ్య వ్యవస్థే రాజ్యమేలుతోంది. అయితే ప్రపంచంలో చాలా చోట్ల స్త్రీలకు సమాన హక్కుల ఉండాలని, లింగ సమానత్వం కోసం తెగ పోరాటాలు చేస్తుంటే ఆ ఖాసీ, గరో తెగకు చెందిన పురుషులు మాత్రం తమ సమానత్వం కోసం ఏళ్లుగా పోరాడుతుండటం విశేషం. ఇందుకోసం 1990 నుంచి ఓ స్వచ్ఛంద సంస్థ నిరంతరం కృషి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఏదీఏమైన ఈ రెండు తెగలు సమాజానికి స్ఫూర్తిగా మంచి నియమాలు పెట్టుకున్నాయి కదూ!. అయితే ఇలాంటి ఆచారమే 20వ శతాబ్దానికి పూర్వమే కేరళలోని నాయర్ తెగలో కూడా ఉండేదట. (చదవండి: వజ్రాలు, వైఢ్యూర్యాలతో డిజైన్ చేసిన జాకెట్..ధర ఏకంగా..!) -
HCA: ‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు ఇస్తాం!
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చాంపియన్‌గా హైదరాబాద్ జట్టు అవతరించింది. ఉప్పల్ స్టేడియంలో మేఘాలయ జట్టుతో జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 71/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 34.2 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తిలక్ వర్మ (64; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ సింగ్ (62; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... రోహిత్ రాయుడు (34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. తిలక్, రోహిత్ నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. అయితే విజయానికి 7 పరుగుల దూరంలో తిలక్, 5 పరుగుల దూరంలో రోహిత్ అవుటయ్యాడు. చివరకు ఆర్యన్ బౌలింగ్‌లో చందన్ సహానీ కొట్టిన భారీ సిక్సర్‌తో హైదరాబాద్ విజయం ఖాయమైంది. ఆరు జట్లున్న ప్లేట్ గ్రూప్‌లో లీగ్ దశలో ఐదు మ్యాచ్‌ల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో గెలిచి హైదరాబాద్ అజేయంగా నిలిచింది. హైదరాబాద్‌తోపాటు రన్నరప్ మేఘాలయ జట్టు కూడా వచ్చే రంజీ ట్రోఫీ సీజన్లో అగ్రశ్రేణి జట్లు పోటీపడే ‘ఎలైట్’ డివిజన్‌కు అర్హత సాధించగా... ఈ సీజన్ ‘ఎలైట్’ డివిజన్లో పోటీపడ్డ 32 జట్లలో ఓవరాల్‌గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన గోవా, మణిపూర్ జట్లు వచ్చే సీజన్లో ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోయాయి. 2022–23 సీజన్లో ఎలైట్ గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆడింది. 7 మ్యాచ్‌లలో తొలి మ్యాచ్‌ను తమిళనాడుతో ‘డ్రా’ చేసుకున్న టీమ్ ఆ తర్వాత వరుస ఆరు వరుస పరాజయాలతో (ముంబై, అస్సాం, ఆంధ్ర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ఢిల్లీ చేతుల్లో) నిష్క్రమించి ప్లేట్ డివిజన్‌కు పడిపోయింది. వచ్చే సీజన్లో హైదరాబాద్ ఎలాంటి ఆటను ప్రదర్శిస్తుందో వేచి చూడాలి. ‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు... ‘ప్లేట్’ డివిజన్లో విజేతగా నిలిచిన తమ జట్టుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) 10 లక్షల నగదు పురస్కారాన్ని అందించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ నితేశ్ రెడ్డి... సెంచరీ సాధించిన ప్రజ్ఞయ్ రెడ్డి... ‘ప్లేట్’ డివిజన్లో 56 వికెట్లతో టాపర్‌గా నిలిచిన బౌలర్ తనయ్ త్యాగరాజన్... కెప్టెన్ తిలక్ వర్మ... 7 మ్యాచ్‌ల్లో కలిపి 765 పరుగులు సాధించి ‘టాప్ స్కోరర్’గా నిలిచిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్‌లకు ప్రత్యేకంగా తలా రూ.50 వేల ప్రోత్సాహక బహుమతిని కూడా అందజేశారు. దీంతో పాటు వచ్చే సీజన్లో జట్టుకు ప్రేరణ అందించేందుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు మరింత భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. రాబోయే మూడేళ్లలో సత్తా చాటి హైదరాబాద్ రంజీ ట్రోఫీ టైటిల్ సాధిస్తే జట్టుకు రూ. 1 కోటి నగదు బహుమతిని, దాంతోపాటు జట్టులోని ఒక్కొక్కరికి బీఎండబ్ల్యూ కార్లను అందజేస్తామని ఆయన తెలిపారు. -
ఎలైట్ డివిజన్‌కు హైదరాబాద్, మేఘాలయ
సాక్షి, హైదరాబాద్: వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా వచ్చే సీజన్లో ఎలైట్ డివిజన్లో పోటీ పడేందుకు అర్హత సంపాదించింది. ఉప్పల్ స్టేడియంలో నాగాలాండ్ జట్టుతో ఆదివారం ముగిసిన తొలి సెమీఫైనల్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 68 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు రెండో సెమీఫైనల్లో మేఘాలయ ఆరు వికెట్ల తేడాతో మిజోరం జట్టును ఓడించి హైదరాబాద్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఫైనల్ చేరడంతో మేఘాలయ జట్టు కూడా వచ్చే సీజన్లో ఎలైట్ డివిజన్లో ఆడుతుంది. హైదరాబాద్‌తో జరిగిన సెమీఫైనల్లో మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 20/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన నాగాలాండ్ 58.3 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 81 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... కెపె్టన్ తిలక్ వర్మ 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. -
ఆ వాటర్ ఫాల్ 'ఓ కన్నతల్లి గుండె కోత'!
కొన్ని పుకార్లు ఎంతగా భయపడతాయంటే..తరాలు మారిన ఆ భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఎందువల్ల అనేది అర్థంకానీ మిస్టరీలా ఉండిపోతుంది. తెలుసుకుందామంటే..కల్పిత భయం నీడలా తెలియకుండా భయాలను కలగజేస్తుంది. ఆ భయమే ఆ చేధనలో కనిపించి వామ్మో! ఎందుకులే అనిపించేలా ఉంటాయి. అలా నేటికీ అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయిన వాటర్ ఫాల్ గాథ ఇది!. ఇప్పటికీ ఆ వాటర్‌ఫాల్ వద్దకు రాత్రుళ్ల వెళ్లాలంటే హడలే..! అది మేఘాలయలోని ‘రంగ్జిర్తెహ్’ గ్రామం. ఇది ‘లికాయి’ అనే స్త్రీ కథ. లికాయికి యుక్తవయసులో పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు. ఆ బంధానికి ప్రతీకగా ఆమెకు అందమైన ఆడపిల్ల పుట్టింది. అయితే కొన్నిరోజులకే.. అనుకోని విషాదం ఆమె జీవితాన్ని మోడుగా మార్చింది. విధి ఆడిన ఆటలో భర్తను కోల్పోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పెంచటం ఆమెకు కష్టమైంది. దాంతో లికాయి.. మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కొన్ని నెలలకు.. తన జీవితం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తినే ఎన్నుకుని రెండో పెళ్లి చేసుకుంది. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. రెండో భర్త తనపై చూపించే ప్రేమకు.. ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేది లికాయి. ఒకరోజు అతడు ఆమెకు మాంసం కూర వండి పెట్టాడు. ఆనందంతో కడుపునిండా తినేసింది. తిన్న వెంటనే తమలపాకులు, వక్క వేసుకుని తృప్తిగా తేన్చాలి అనుకుంది. కానీ తమలపాకుల పక్కనే రక్తం ఓడుతున్న చిన్న వేలు ఆమెని భయపెట్టింది. అది తన కూతురుదని గుర్తించి నిర్ఘాంతపోయింది. కాసేపటికే మరో ఘోరం ఆమెకు అర్థమైంది. తాను తిన్నది మాంసం కూర కాదని, తన కూతురు శరీరాన్ని అని గ్రహించి.. పిచ్చిదానిలా కేకలుపెట్టింది. తన రెండవ భర్తే ఇంతటి ఘోరానికి ఒడికట్టాడని తెలిసి వాకిట్లో కూలబడి పొట్టను బాదుకుంటూ పెద్దపెద్దగా ఏడ్చింది. ఆ కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేక సమీపంలోని జలపాతం దగ్గరకు పరుగుపెట్టి అందులో దూకేసింది. ఈ విషాద గాథ.. మేఘాలయలోని ‘నోహ్కలికాయి వాటర్ ఫాల్స్’ ముందుండే పెద్ద బోర్డ్ మీద.. ఓ పురాణ గాథలా కనిపిస్తుంటుంది. ఈ ఉదంతం తెలిసిన వాళ్లంతా.. ఆ జలపాతం ‘ఓ కన్నతల్లి గుండె కోత’ అని భావిస్తుంటారు. స్థానికుల్లో చాలామంది మాత్రం రాత్రి పూట ఇక్కడికి వెళ్లడానికి భయపడుతూ ఉంటారు. లికాయి.. ఆత్మగా మారి ఆ సమీపంలోనే తిరుగుతోందని, తన బిడ్డను వెతుక్కుంటోందని నమ్మేవాళ్లంతా.. ఈ కథకు హారర్ టచ్‌ని ఇచ్చి.. మరింతమందిని వణికిస్తుంటారు. అయితే లికాయి నిజంగానే ఆత్మగా మారిందా? లికాయి వ్యథ సరిగ్గా ఏ కాలంలో జరిగింది? ఆమె రెండో భర్త ఏమయ్యాడు? లాంటి వివరాలేమీ తెలియవు. అందుకే ఈ వాటర్ ఫాల్స్ వెనుకున్న ఈ గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన (చదవండి: 'రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో..' కథ కాదు నిజం..) -
Hyd: రెండ్రోజుల్లోనే టెస్టు ఖతం.. వరుసగా రెండో విజయం
రంజీ ట్రోఫీ-2024లో హైదరాబాద్ క్రికెట్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మేఘాలయను ఏకంగా ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండురోజుల్లోనే మ్యాచ్ ముగించి సత్తా చాటింది. రంజీ ట్రోఫీ ‘ప్లేట్’ గ్రూప్‌లో భాగంగా మేఘాలయాతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. మేఘాలయను తొలి ఇన్నింగ్స్‌లో 33.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ చేసింది. మేఘాలయ బ్యాటర్లలో కెప్టెన్ కిషన్ లింగ్డో (51) మినహా అంతా విఫలమయ్యారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో పాలకోడేటి సాకేత్ సాయిరామ్ (4/33) నాలుగు వికెట్లు పడగొట్టగా... సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, రవితేజ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఫలితంగా 71 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో 182/4 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన హైదరాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రోహిత్ రాయుడు 124 పరుగులతో అజేయంగా నిలవగా.. చందన్ సహానీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సీవీ మిలింద్ 38 బంతుల్లోనే 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయను 154 పరుగులకు కట్టడి చేసిన హైదరాబాద్ జయభేరి మోగించింది. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్ నాగాలాండ్‌ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో అతడు జట్టును వీడగా.. రాహుల్‌సింగ్ గహ్లోత్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. -
రాహుల్ సింగ్ మెరుపు శతకం
జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌ను హైదరాబాద్ జట్టు విజయంతో ముగించింది. మేఘాలయ జట్టుతో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ 41.1 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. కార్తికేయ కక్ 36 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి మేఘాలయను కట్టడి చేశాడు. రోహిత్ రాయుడు రెండు వికెట్లు తీశాడు. అనంతరం హైదరాబాద్ కేవలం 18.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 161 పరుగులు సాధించి గెలిచింది. కెపె్టన్ గహ్లోత్ రాహుల్ సింగ్ (56 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ మెరుపు శతకం సాధించి హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్ రాయుడు (0) డకౌట్‌కాగా... మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (54 బంతుల్లో 49 నాటౌట్; 8 ఫోర్లు)తో కలిసి రాహుల్ సింగ్ రెండో వికెట్‌కు అజేయంగా 159 పరుగులు జోడించాడు. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ తమ ఏడు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించడంలో విఫలమైంది. గ్రూప్ ‘డి’లో పోటీపడ్డ ఆంధ్ర జట్టు ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మంగళవారంతో విజయ్ హజారే ట్రోఫీ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. హరియాణా, రాజస్తాన్, విదర్భ, కర్ణాటక, ముంబై, తమిళనాడు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. మిగిలిన రెండు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ల కోసం ఈనెల 9న ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో బెంగాల్‌తో గుజరాత్; కేరళతో మహారాష్ట్ర తలపడతాయి. ఈ మ్యాచ్‌ల్లో నెగ్గిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిస్తాయి. -
మీటింగ్ అయ్యాక గిటార్ వాయించే సీఎం! ఆయనో డిఫరెంట్ ‘ట్యూన్’
నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపుతుంటారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే కొందరు సీఎంలు మాత్రం ఏదో ఒక వ్యాపకంతో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలాంటి వారిలో మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా (Meghalaya Chief Minister Conrad Sangma) ఒకరు. ఐరన్ మైడెన్ పాటకు ఆయన ఎలక్ట్రిక్ గిటార్‌పై వాయిస్తున్న వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా తన సంగీత అభిరుచి గురించి మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా పలు ఆసక్తి వివరాలను ‘హిందూస్తాన్ టైమ్స్’తో పంచుకున్నారు. సంగీతం తనకు అంతులేని ఉత్సాహాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడూ సంగీతంలోనే ఉంటానని, అవకాశం దొరికినప్పుడల్లా ఎలక్ట్రిక్ గిటార్ ప్లే చేస్తానని చెప్పారు. క్యాబినెట్ సహచరులతో ఉన్నప్పుడు, ముఖ్యమైన సమావేశాలు, కార్యక్రమాల అనంతరం లైవ్ ప్రదర్శన ఇవ్వడానికి ఇష్టపడుతుంటానని తెలిపారు. జీ20 సమావేశాల్లో ప్రదర్శన తన సహచరులతో డిన్నర్లో కలిసినప్పుడు తప్పకుండా గిటార్ వాయిస్తానని, సంగీతం తన సంస్కృతిలో అంతర్భాగమని చెప్పుకొచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైనా విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పుడు, తన సంగీతాన్ని విని ఆ అసంతృప్తిని మరచిపోతారని వెల్లడించారు. ఇటీవల జీ20 సమావేశాల్లో తన ప్రదర్శను రాయబారులు, సహచరులందరూ ఆనందించారని పేర్కొన్నారు. యువతకు ప్రోత్సాహం తాను యువకుడిగా ఉన్నప్పుడు తన బ్యాండ్‌కి సంగీతాన్ని రికార్డ్ చేయడానికి స్టూడియో ఉండేది కాదని చెప్పుకొచ్చిన ఆయన రాష్ట్రంలో సంగీత కళాకారుల కోసం మరిన్ని స్టూడియోలను తీసుకురావలనుకుంటున్నట్లు తెలిపారు. సంగీత అవకాశాలతో పాటు, సినిమాలకు లొకేషన్‌గా మేఘాలయ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మేఘాలయ యువత సినిమా నిర్మాణంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇందు కోసం సినిమా థియేటర్ల ఏర్పాటును ప్రోత్సహించడానికి భారీ రాయితీలు అందిస్తున్నామన్నారు. యువ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి రాష్ట్రం తరఫున సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీ నోట బ్రియాన్ డి ఖర్ప్రాన్ పేరు.. ఎవరీయన?
ఢిల్లీ: ప్రధాని మోదీ నేడు(ఆదివారం) మన్‌కీ బాత్ 104వ ఎపిసోడ్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మేఘాలయవాసి బ్రియాన్ డి ఖర్ప్రాన్పై ప్రశంసలు కురిపించారు. బ్రియాన్ తన బృందంతో కలిసి మేఘాలయాలో 1700లకు పైగా గుహలను కనుగొన్నారని చెప్పారు. బ్రియన్ చేసిన సేవలను కొనియాడారు. మేఘాలయ గుహలను సందర్శించాలని దేశ ప్రజలను కోరారు. ఎవరు ఈ బ్రియాన్ డి ఖర్ప్రాన్ ? మన్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ బ్రియాన్ గురించి చెప్పారు.'1964లో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే బ్రియాన్ డి ఖర్ప్రాన్ గుహలను కనుగొనడం ప్రారంభించారు. 1990నాటికి ఆయన తన స్నేహితులతో కలిసి ఓ సంఘాన్ని స్థాపించారు. వారందరూ కలిసి మేఘాలయాలో బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో గుహలను వెలుగులోకి తీసుకువచ్చారు. బ్రియాన్ డి ఖర్ప్రాన్ తన బృందంతో కలిసి 1700పైగా గుహలను కనిపెట్టారు. ప్రపంచ పటంలో మేఘాలయా గుహలకు స్థానం వచ్చింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అత్యంత లోతైన, పొడవైన గుహలు ఉన్నాయి' అని ప్రధాని మోదీ చెప్పారు. During #MannKiBaat, talked about Mr. Brian D. Kharpran Daly, who has done decades of work on discovering and popularising caves in Meghalaya. I also urge you all to travel to Meghalaya and explore the beautiful caves yourself. pic.twitter.com/pZDX1SOFuu — Narendra Modi (@narendramodi) August 27, 2023 టూరిస్టులు మేఘాలయా గుహలను తమ ప్రణాళికలో భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. దేశంలోనే చాలా పొడవైన, లోతైన గుహలు మేఘాలయాలో ఉన్నాయని తెలిపారు. అది బ్రియాన్ చేసిన కృషి ఫలితమేనని అన్నారు. మేఘాలయ అడ్వెంచరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేసిన బ్రియాన్ డి ఖర్ప్రాన్ ఇప్పటివరకు రాష్ట్రంలోని 537.6 కి.మీ గుహలను చుట్టివచ్చారు. ఇదీ చదవండి: మోదీ మన్‌కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని -
మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణం
నాగాలాండ్, మేఘాలయా ముఖ్యమంత్రులుగా ఎన్డీపీపీ చెందిన నీఫియా రియో, నేఫనల్ పీపుల్స్ పార్టీకి చెందిన కాన్రాడ్ సంగ్మా మంగళవారం ప్రమాణం చేశారు. మొదటగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్ కె సంగ్మా మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తోపాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. మంగళవారం సంగ్మా తోపాటు ఎన్పీపీకి చెందిన ప్రిస్టోన్ టిన్సాంగ్, స్నియావ్‌భలాంగ్ ధర్లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీజేపీకి చెందిన అలెగ్జాండర్ లాలూ హెక్, యుడీపీకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, హెచ్ఎస్పీడీపీకి చెందిన షక్లియార్ వార్జ్రీ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ మేరకు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలలో యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీకి నుంచి ఒక్కొక్కరు సంగ్మా మంత్రివర్గంలో సభ్యులుగా గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణం చేయించారు. ఇదేరోజు నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)కి చెందిన నీఫియు రియో కూడా ప్రమాణ చేశారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నీఫియు ఐదోసారి ప్రమాణం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా టిఆర్ జెలియాంగ్, వై పాటన్ ప్రమాణ స్వీకారం చేయగా, రియో క్యాబినెట్‌లోని ఇతర సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే సోషల్ మీడియాలో కామెడీ చేస్తూ ఫేమస్ అయినా రాష్ట్ర బీజేపీ చీఫ్ టెమ్జెన్ ఇమ్నా అలోంగ్, నానాగాలాండ్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికైన ఇద్దరు మహిళల్లో ఒకరైన సల్హౌతుయోనువో క్రూసే మంత్రి మండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. హోలీ తర్వాత రోజు గురువారం త్రిపురలో బీజేపీకి చెందిన మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్డీపీపీ, బీజేపీ రెండూ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా 72 ఏళ్ల రియోను ఎన్నుకున్నాయి. అలాగే రాష్ట్రంలోని అన్ని ఇతర పార్టీలు రియో నేతృత్వంలోని కూటమికి తమ మద్దతను ఇచ్చాయి. మేఘాలయాలో ఎన్పీపీ నేతృత్వంలోని కూటమి బీజేపీకి చెందిన ఇద్దరితో సహా మొత్తం 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం కాన్రాడ్ సంగ్మా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. సంగ్మా ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్నారు. ఆయన మంగళవారం ఇతర క్యాబినేట్ మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, సోమవారం కొత్తగా ఎన్నికైన 58 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయగా, ప్రొటెం స్పీకర్ తిమోతి షిరా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగ్మా కూడా హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీకి స్పీకర్‌ను మార్చి9న ప్రత్యేక హౌస్‌లో సెషన్లో ఎన్నుకోనున్నట్టు సమాచారం. త్రిపురలో బీజేపీ నాయకుడు మాణిక్ సాహా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారని ఆ పార్టీ ప్రకటించింది. సోమవారం అగర్తలాలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో సాహాను ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భట్టాచారీ తెలిపారు. అంతేగాదు బీజేపీ దాని మిత్ర పక్షాలు త్రిపుర, నాగాలాండ్‌లో అధికారాన్ని నిలుపుకోగా, మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. (చదవండి: విమానం ల్యాండింగ్ అవుతుందనంగా.. ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం..) -
మేఘాలయలో బీజేపీ బిగ్ ప్లాన్.. ఉద్దవ్ థాక్రే సంచలన కామెంట్స్!
ముంబై: ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)కి బీజేపీతో సహ ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇక, అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీంతో, మేఘాలయలో రాజకీయాలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఉద్దవ్ థాక్రే ఆదివారం.. మహారాష్ట్రలోని ఖేడ్ పట్టణంలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో నేను ముఖ్యమంత్రిని కావడం కోసం నేను ఎన్సీపీ, కాంగ్రెస్ బూట్లు నాకానని పుణెలో అమిత్ షా అన్నారు. ఇప్పుడు వాళ్లు మేఘాలయాలో ఏం చేస్తున్నారు? అంటూ విమర్శలు చేశారు. గో మూత్రం చల్లడం వల్ల మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా?. స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పిస్తే మనకు స్వాతంత్య్రం వచ్చిందని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పటేల్.. ఆర్ఎస్ఎస్ను నిషేధించారని అన్నారు. కానీ, ఆయన పేరును కూడా బీజేపీ వాడుకుంటోంది. అదే విధంగా సుభాష్ చంద్రబోస్, బాలాసాహెబ్ థాక్రే పేర్లను కూడా వాళ్లు దొంగిలించారు. వాళ్లు శివసేన పేరు, బాలాసాహెబ్ ఫొటోతో కాకుండా మోదీ పేరుతో ఓట్లు అడగాలని నేను సవాల్ చేస్తున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు. శివసేన బాణం-విల్లు గుర్తుపై స్పందిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తప్పు. మా నుంచి పార్టీ పేరు, గుర్తును లాగేసుకున్నారు. కానీ, శివసేనను నా నుంచి ఎవరూ తీసుకోలేరు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
ప్రాంతీయ పార్టీలన్నీ ఒకేజట్టుగా ప్రభుత్వం!
షిల్లాంగ్: మేఘాలయాలో సర్కార్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. ప్రాంతీయ పార్టీల సభ్యులంతా.. ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)కి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. దీంతో ఎన్పీపీ కూటమి బలం 32 నుంచి 45కి చేరగా, తాజా మాజీ సీఎం కొన్రాడ్ కే సంగ్మా రేపు(మంగళవారం) ముఖ్యమంత్రి మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మేఘాలయా రాజకీయాలు ఆదివారం వరకు ఉత్కంఠగానే సాగాయి. 26 మంది సొంత పార్టీ సభ్యులు, ఇద్దరు బీజేపీ, మరో ఇద్దరు హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెస్‌ఎస్‌పీడీపీ) ఎమ్మెల్యేలు.. మొత్తంగా 32 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ శుక్రవారం గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలిసి లేఖ సమర్పించారు కొన్రాడ్ సంగ్మా. అయితే.. ఆ మద్దతును ఉపసంహరించుకున్నట్లు వెంటనే హెస్‌ఎస్‌పీడీపీ చీఫ్ ప్రకటించడం, వివిధ పార్టీలను కూడగలుపుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రకటించడం ఆసక్తిని రెకెత్తించింది. ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీ అయిన టీఎంసీ(ఐదు సీట్లు దక్కించుకుంది)తో కలిసి ఏకతాటి పైకి వచ్చేందుకు మొగ్గు చూపించకపోవడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. చివరకు.. మేఘాలయా ప్రధాన ప్రాంతీయ పార్టీలైన యూడీపీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) సభ్యులు సైతం ఎన్పీపీ కూటమికే మద్దతు ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. సంగ్మాను కలిసి తమ మద్దతును బలపరుస్తూ లేఖను అందించారు. ఎన్పీపీ 26, యూడీపీ 11, పీడీఎఫ్ 2, హెస్‌ఎస్‌పీడీపీ 2, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతోపాటు బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో మేఘాలయా డెమొక్రటిక్ అలయన్స్(MDA) ప్రభుత్వం కొలువు దీరనుంది. సోమవారం(ఇవాళ) మేఘాలయా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. వారంలోపు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 27వ తేదీన 60 స్థానాలున్న మేఘాలయా అసెంబ్లీలో 59 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఒక చోట సిట్టింగ్ అభ్యర్థి మరణంతో ఎన్నిక నిర్వహణ నిలిపివేసింది ఎన్నికల సంఘం. -
సంతోష్ ట్రోఫీ ఫైనల్.. 54 ఏళ్ల నిరీక్షణకు తెర
దేశవాలీ ఫుట్‌బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీని కర్ణాటక సొంతం చేసుకుంది. 54 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలవడం విశేషం. శనివారం రాత్రి మేఘాలయాతో జరిగిన ఫైనల్ పోరు నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కర్ణాటక 3-2 తేడాతో మేఘాలయాను ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది. కర్ణాటక తరపున సునీల్ కుమార్(ఆట 3వ నిమిషం), బెకి ఓరమ్(20వ నిమిషం), రాబిన్ యాదవ్(44వ నిమిషం) గోల్స్ చేయగా.. మేఘాలయ తరపున బర్లింగ్టన్(8వ నిమిషం), షీన్(60వ నిమిషం) రెండు గోల్స్ కొట్టారు. అయితే ఆట తొలి సగంలోనే ఇరజట్లు కలిపి నాలుగు గోల్స్ కొడితే.. అందులో మూడు కర్ణాటక చేయగా.. ఒకటి మేఘాలయ ఖాతాలోకి వెళ్లింది. అయితే రెండో సగంలో మేఘాలయా మరొక గోల్ చేసినప్పటికి కర్ణాటక డిఫెన్స్‌ను నిలువరించలేక చేతులెత్తేసింది. ఇక కర్ణాటక 1968-69 సీజన్లో తొలిసారి సంతోష్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 😄😄😄#MEGKAR ⚔️ #HeroSantoshTrophy 🏆 #GrandFinale 💥 #IndianFootball ⚽ pic.twitter.com/1gqSRz8jns — Indian Football Team (@IndianFootball) March 4, 2023 🏆 KARNATAKA ARE CHAMPIONS AFTER 5️⃣4️⃣ YEARS 🏆 It was a close call in the end, but Karnataka get over the line in the end 🤩 MEG 2⃣-3⃣ KAR 📺 @FanCode & @ddsportschannel #MEGKAR ⚔️ #HeroSantoshTrophy 🏆 #GrandFinale 💥 #IndianFootball ⚽ pic.twitter.com/tUVsvggPBE — Indian Football Team (@IndianFootball) March 4, 2023 చదవండి: సీఎస్కే కెప్టెన్‌గా బెన్ స్టోక్స్!? ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె కొత్త చరిత్ర.. -
మేఘాలయా: మారిన సీన్.. ఎన్పీపీ-బీజేపీకి షాక్!
షిల్లాంగ్: నేషనల్ పీపుల్స్ పార్టీతో(ఎన్పీపీ)తో జత ద్వారా మరోసారి అధికార పీఠం ఎక్కాలనుకున్న బీజేపీకి షాక్ తగలనుందా?. మొత్తం 32 మంది ఎమ్మెల్యేల మద్దతు తనుకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కలిశారు ఎన్పీపీ చీఫ్, తాజా మాజీ సీఎం కాన్రాడ్ సంగ్మా. అయితే ఆపై కొన్ని గంటలకే అక్కడ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. 26 మంది సొంత పార్టీ సభ్యులతో పాటు బీజేపీ(ఇద్దరు), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెస్‌ఎస్‌పీడీపీ నుంచి ఇద్దరు), మరో ఇద్దరు స్వతంత్రుల మద్దతు తమకే ఉందని, మేఘాలయాలో ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం కల్పించాలని గవర్నర్ ఫగు చౌహాన్‌కు లేఖ సమర్పించారు కాన్రాడ్ సంగ్మా. తదనంతరం.. మార్చి 7వ తేదీన ప్రమాణస్వీకరానికి ముహూర్తం ఖరారు చేసినట్లు, ప్రధాని మోదీ సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించారాయన. అయితే.. ఇది జరిగిన కొద్దిగంటలకే హెచ్ఎస్పీడీపీ షాక్ ఇచ్చింది. తొలుత హెచ్ఎస్పీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ మద్దతు ఎన్పీపీకి బహిరంగంగా ప్రకటించారు. అయితే.. ఎన్పీపీ-బీజేపీలకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకున్నట్లు ఆ పార్టీ చీఫ్ స్వయంగా ప్రకటించారు. తమ ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది ఆ పార్టీ. మరోవైపు యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) అధ్యక్షుడు మెట్బా లింగ్డో.. తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి ఆసక్తిని రేకెత్తించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని తెలిపారాయన. యూడీపీతో పాటు టీఎంసీ, కాంగ్రెస్, పీడీఎఫ్, హెచ్‌ఎస్‌పీడీపీతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతు తమకు ఉందని ప్రకటించారాయన. ఈ మేరకు ఆయా పార్టీల సమావేశం జరగ్గా.. కూటమిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చర్చలు కొనసాగుతున్నాయని టీఎంసీ నేత.. మాజీ సీఎం ముకుల్ సంగ్మా మీడియాకు వెల్లడించారు. బీజేపీ, ఎన్పీపీ తప్ప అన్ని పార్టీలు ఇవాళ ఇక్కడ హాజరయ్యాం. అంకెల గారడీ ఎవరైనా చేస్తారు. ఇంతకు ముందు పలు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు చూశాం. కానీ, ఇక్కడ అలా కాదు. మేఘాలయాలో ప్రభుత్వ ఏర్పాటు అంత ఈజీ కాదు. త్వరలోనే మా కూటమిపై ఓ స్పష్టత ఇస్తాం అని పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. యూడీపీ 11 సీట్లు, టీఎంసీ ఐదు, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ రెండు సీట్లు దక్కించుకుంది. మొత్తం 60 స్థానాలకుగానూ 59 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి అక్కడ(ఒక చోట సిట్టింగ్ అభ్యర్థి మరణంతో ఎన్నిక నిర్వహణ నిలిపివేశారు). గురువారం త్రిపుర, నాగాలాండ్‌తో పాటు ఫలితాలు వెల్లడించగా, మేఘాలయాలోనే ఇలా ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. -
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి
షిల్లాంగ్: మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) చీఫ్, తాజా మాజీ సీఎం కాన్రాడ్ సంగ్మా రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్‌ను కోరారు. రాష్ట్ర అసెంబ్లీలోని 60 మంది సభ్యులకు గాను 32 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని తెలిపారు. వీరి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశామన్నారు. శుక్రవారం ఆయన రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు నాకుంది. మద్దతిస్తామని బీజేపీ ఇప్పటికే తెలిపింది. హిల్ స్టేట్ డెమోక్రటిక్ పార్టీ, స్వతంత్రులు కూడా మా వెంట ఉన్నారు’అని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఈ నెల 7న ప్రమాణం చేయనుందని, ప్రధాని మోదీ కూడా ఈ కార్యక్రమానికి వస్తారని తెలిపారు. కాగా, ఎన్పీపీ యేతర, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ అంతకుముందు టీఎంసీ, కాంగ్రెస్, యూడీపీ, పీడీఎఫ్‌లు హడావుడి చేశాయి. ఫిబ్రవరి 27వ తేదీన 59 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఎన్పీపీ సొంతంగా 26, మిత్రపక్షం యూడీపీ 11 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, టీఎంసీలు చెరో ఐదు స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ రెండు సీట్లను దక్కించుకుంది. -
మేఘాలయ సీఎంగా మరోసారి సంగ్మా.. ఈనెల 7న ప్రమాణస్వీకారం!
షిల్లాంగ్: మేఘాలయాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రకటించారు. గురువారం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్ల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 26 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే మొత్తం 60 స్థానాలకు మెజార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31ని ఆయన పార్టీ అందులేకపోయింది. కానీ తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 32 సభ్యుల బలముందని సంగ్మా తెలిపారు. ఎవరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎన్పీపీకి బీజేపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. కాగా.. కాన్రాడ్ సంగ్మా మేఘాయల గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈనెల 7న ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, ఎన్పీపీ ఈసారి విడిపోయి ఒంటరిగా పోటి చేశాయి. బీజేపీ తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడంతో సంగ్మా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లారు. 2018 కంటే ఏడు సీట్లు ఎక్కువ తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్‌కు చెరో ఐదు సీట్లు వచ్చాయి. ఎన్పీపీ మాజీ మిత్రపక్షం యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ 11 సీట్లు కైవసం చేసుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. త్రిపురలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో కూడా బీజేపీ కూటమే విజయం సాధించింది. మేఘాలయలో కూడా ఎన్‌పీపీకే ఆ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఈ ప్రభుత్వంలో కూడా భాగం కానుంది. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
ఈశాన్యంలో కమల వికాసం
అగర్తలా/షిల్లాంగ్/కోహిమా: ‘మిషన్ నార్త్ఈస్ట్’ పేరిట ఈశాన్య రాష్ట్రాల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ కి నూతనోత్తేజం లభించింది. ఈశాన్య భారతంలో కమలం వికసించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. త్రిపురలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ దక్కింది. 60 స్థానాలకు గాను సొంతంగా 32 స్థానాలు గెలుకొని, ఒక్కే ఒక్క స్థానంలో నెగ్గిన మిత్రపక్షం ఐపీఎఫ్టీతో కలిసి వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలుండగా, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి 37 స్థానాల్లో పాగా వేసింది. ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు లభించాయి. రెండు పార్టీలు కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. 60 స్థానాలున్న మేఘాలయాలో ఒంటరిగా పోటీకి దిగి, కేవలం 2 సీట్లే గెలుచుకున్న బీజేపీ కింగ్‌మేకర్‌గా అవతరిస్తుండడం గమనార్హం. 26 సీట్లలో నెగ్గిన అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వంలో బీజేపీ మళ్లీ జూనియర్ భాగస్వామిగా చేరినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. నాగాలాండ్‌లో 5, త్రిపురలో 3 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ మేఘాలయాలో సున్నా చుట్టేసింది. త్రిపురలో కొత్త పార్టీ తిప్రా మోథా ఏకంగా 13 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. త్రివేణికే ఈ మొత్త్తం క్రెడిట్: మోదీ ఎన్నికల్లో బీజేపీ స్థిరంగా విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ పనితీరు పట్ల కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. బీజేపీ గెలుపునకు గాను క్రెడిట్ మొత్తం ‘త్రివేణి’కే ఇవ్వాలన్నారు. బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ఆయా ప్రభుత్వాల పని సంస్కృతి, పార్టీ కార్యకర్తల అంకితభావం వల్లే విజయాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈశాన్య ప్రాంతం ఢిల్లీకి, దిల్(హృదయం)కి ఎక్కువ దూరంలో లేదన్న సంగతి ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందన్నారు. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ కూటమి మళ్లీ అధికారం దక్కించుకోవడం పార్టీ కార్యకర్తలందరికీ గర్వకారణమని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మర్ జా మోదీ(చనిపో మోదీ) అని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, ప్రజలు మాత్రం మత్ జా మోదీ(వెళ్లొద్దు మోదీ) అని నినదిస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు. ఫలితాలు నిరుత్సాహకరం:కాంగ్రెస్ త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు నిరుత్సాహం కలిగించాయని కాంగ్రెస్ పేర్కొంది. అయితే, ఉప ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లలో సాధించిన విజయం ప్రోత్సాహం నింపిందని తెలిపింది. ఈ ఫలితాలపై సమీక్ష జరిపి, పార్టీ సంస్థాగత బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. త్రిపురలో కాషాయం రెపరెపలు త్రిపురలో బీజేపీ–స్థానిక పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) కూటమి రెండోసారి అధికారం దక్కించుకుంది. మొత్తం 60 సీట్లకు గాను ఎన్నికల్లో 33 సీట్లు గెలుచుకుంది. ప్రద్యోత్ కిశోర్ దేవ్‌వర్మ నేతృత్వంలోని తిప్రా మోథా పార్టీ 13 స్థానాలు గెలుచుకుంది. ఇక వామపక్షాలు–కాంగ్రెస్ కూటమికి 14 స్థానాలు లభించాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా తెరవలేక చతికిలపడింది. ఆ పార్టీ కి కేవలం 0.88 శాతం ఓట్లు లభించాయి. ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు పడడం గమనార్హం. బీజేపీ, ఐపీఎఫ్‌టీకి 2018తో పోలిస్తే ఈసారి సీట్ల సంఖ్య తగ్గింది. తిప్రా మోథా పార్టీ గణనీయంగా పుంజుకోవడమే ఇందుకు కారణం. ఈసారి 55 స్థానాల్లో పోటీకి దిగిన బీజేపీకి 32 స్థానాలు గెలుచుకుంది. ఐపీఎఫ్‌టీకి కేవలం ఒక స్థానం లభించింది. 47 సీట్లలో పోటీ చేసిన సీపీఎం కేవలం 11 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ, ఆర్ఎస్పీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై 13 మంది పోటీ చేయగా, ముగ్గురు విజయం సాధించారు. టౌన్ బార్దోవాలీ స్థానంలో పోటీ చేసిన మాణిక్ సాహా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆశి‹Ùకుమార్ సాహాపై 1,257 ఓట్ల తేడాతో గెలుపొందారు. మిస్టర్ క్లీన్‌కే మళ్లీ కిరీటం! త్రిపురలో మిస్టర్ క్లీన్‌గా గుర్తింపు పొందిన సాహా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు. దంత వైద్యుడైన సాహా గతంలో కాంగ్రెస్‌లో పనిచేశారు. 2016లో బీజేపీలో చేరారు. 2020లో త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. 2022 ఏప్రిల్ 3 నుంచి జూలై 4 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. గత ఏడాది జరిగిన టౌన్ బార్దోవాలీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ విప్లవ్ దేవ్ స్థానంలో ఆయనను సీఎంగా నియమించింది. మాణిక్ సాహా నిజాతీయపరుడిగా, కష్టపడి పనిచేసే నాయకుడిగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ–బీజేపీ హవా నాగాలాండ్‌లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ(రామ్‌విలాస్ పాశ్వాన్) 2, ఆర్పీఐ(అథవాలే) 2, ఎన్పీఎఫ్ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు 60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్డీపీపీ టిక్కెట్‌పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్–3 స్థానం నుంచి సల్‌హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం. మేఘాలయలో హంగ్! మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ కీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. రాష్ట్రంలో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. మేఘలయలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా, 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. సోహియోంగ్ నియోజకవర్గంలో యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) అభ్యర్థి డొంకుపర్ రాయ్ లింగ్డో ఫిబ్రవరి 20న మృతిచెందడంతో పోలింగ్ వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్న అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అతిపెద్ద పార్టీ గా అవతరించింది. మెజార్టీ కి కొద్దిదూరంలోనే ఆగిపోయింది. కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వంలో ఎన్పీపీ మిత్రపక్షంగా వ్యవహరించిన యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ 5, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకున్నాయి. ఒంటరిగా పోటీ చేసిన జాతీయ పార్టీ బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా వంటి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనప్పటికీ ఆశించిన ఫలితందక్కలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్పీపీ నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మద్దతును కోరుతున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్పీపీకి సహకరించాలంటూ తమ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఎన్పీపీకి మద్దతు తెలియజేస్తూ లేఖ ఇవ్వబోతున్నామని మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మారీ చెప్పారు. ముఖ్యమంత్రి సంగ్మా దక్షిణ తురా స్థానంలో గెలిచారు. -
త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ ఘన విజయం.. మేఘాలయలో షాక్..
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్‌లో మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచింది. దీంతో, రెండు రాష్ట్రాల్లో వికర్టీని అందుకుంది. - త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోవడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. - ఇక, కాంగ్రెస్, లెప్ట్ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది. As per ECI, BJP leading on 33 seats out of 60 Assembly seats; Counting of votes underway#TripuraAssemblyElections2023 pic.twitter.com/uKPKZ0nzgP — ANI (@ANI) March 2, 2023 - నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఎన్పీఎఫ్ రెండు స్థానాలు కైవసం చేసుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం. - ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. మేఘాలయలో హంగ్... మరోవైపు.. మేఘాలయలో హంగ్ వచ్చింది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ భారీ ఓటమిని చవిచూసింది. రెండు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. నాగాలాండ్‌లో అసలు ఖాతా తెరవలేకపోయింది. -
Election Results: మేఘాలయలో హంగ్.. బీజేపీ బిగ్ ప్లాన్!
► ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్‌లో మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచి రెండు రాష్ట్రాల్లో వికర్టీని అందుకుంది. త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోవడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్, లెప్ట్ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది. ► నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఎన్పీఎఫ్ రెండు స్థానాలు కైవసం చేసుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం. ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి ► మరోవైపు.. మేఘాలయలో హంగ్ వచ్చింది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు అవుతుంది. ► తమిళనాడులోని ఈరోడ్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఈవీకేఎస్ ఎలన్గోవన్ ఘన విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది. ఈ విజయం సీఎం ఎంకే స్టాలిన్ వల్లే సాధ్యమైందని ఎలన్గోవన్ పేర్కొన్నారు. ఎన్నికల హామీలను 80శాతం నెరవేర్చినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 40కి 40 ఎంపీ స్థానాలు డీఎంకే కూటమే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. Credit of this victory goes to CM MK Stalin. He did 80% of the things that were promised by DMK in election manifesto. I feel proud to be a part of the Legislative Assembly which is headed by MK Stalin: DMK-backed Congress candidate EVKS Elangovan on his lead in #ErodeEastResults pic.twitter.com/J9XkJE70tT — ANI (@ANI) March 2, 2023 ► ఈశాన్య భారతంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ.. త్రిపురలో రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ► ఇక, మేఘాలయలో ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ► రాత్రి 7 గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. మూడు రాష్ట్రాల విక్టరీ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. ► మహారాష్ట్రలోని పుణే జిల్లా కస్బా స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో, కాంగ్రెస్ శ్రేణులు, మహా వికాస్ అగాడీ కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ సంబురాలు చేసుకుంటున్నారు. #WATCH | Maharashtra: Maha Vikas Aghadi (MVA) workers celebrate in Pune as official EC trends show Congress candidate Dhangekar Ravindra Hemraj leading in Kasba Peth assembly by-election. pic.twitter.com/Duxyvm9K15 — ANI (@ANI) March 2, 2023 ► త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బోర్దోవలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం సాహా.. సీపీఎం అభ్యర్థి ఆశిష్‌కుమార్ సాహాపై విజయం సాధించారు. ► మేఘాలయలో హంగ్ దిశగా పోలింగ్ కౌంటింగ్ కొనసాగుతోంది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ 17 స్థానాల్లో ఆధిక్యంగా ఉంది. #MeghalayaElections | As per official EC trends, CM Conrad Sangma's National People's Party leading on 17 of the total 59 seats so far. Counting of votes still underway, trends on 47 seats known. pic.twitter.com/GsLOUPGgSd — ANI (@ANI) March 2, 2023 ► తమిళనాడులోని ఈరోడ్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. కాగా, ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. Tamil Nadu | E.V.K.S.Elangovan of Congress leading in Erode East by-election pic.twitter.com/IQ08d1Tv4L — ANI (@ANI) March 2, 2023 ► పూణేలోని చించావద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. Pune, Maharashtra | Counting of votes underway for Kasba Peth by-elections pic.twitter.com/CUp88aRSL3 — ANI (@ANI) March 2, 2023 ► పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌డిగీ ఉప ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్, టీఎంసీ మధ్య హోరాహోరి కొనసాగుతోంది. ► మేఘాలయలో ఫలితాలు హంగ్ దిశగా వెళ్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కనపించడం లేదు. ► నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ ఆధిక్యంతో 50 స్థానాల్లో దూసుకుపోతోంది. ► త్రిపురలో 60 స్థానాలకు గానూ దాదాపు 39 స్థానాల్లో బీజేపీలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ► మేఘాలయలో ఎన్పీపీ 28, బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యం ► నాగాలాండ్‌లో బీజేపీ 21, ఎన్పీఎఫ్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ► త్రిపురలో బీజేపీ 24 స్థానాల్లో, ట్రిపా 10 స్థానాల్లో, లెఫ్ట్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► అరుణాచల్ ప్రదేశ్‌లోని లూమ్లా, జార్ఖండ్‌లోని రామ్‌ఘర్, తమిళనాడులోని ఈరోడ్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్డిగి అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం Counting of votes for Tripura, Nagaland & Meghalaya elections begins Counting for by-elections for Lumla assembly seat of Arunachal Pradesh, Ramgarh (Jharkhand), Erode East (Tamil Nadu), Sagardighi (West Bengal) & Kasba Peth, Chinchwad assembly seats of Maharashtra also begins pic.twitter.com/mMlLV3ryfV — ANI (@ANI) March 2, 2023 ► మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం ► ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మేఘాలయలోని తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్ 144 సెక్షన్ విధించారు. Meghalaya | Section 144 imposed in Eastern West Khasi Hills district by the District Magistrate pic.twitter.com/JY8t1wHCp9 — ANI (@ANI) March 2, 2023 ► ముఖ్యంగా త్రిపుర అసెంబ్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. బీజేపీని ఓడించేందుకు లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టి బరిలో దిగాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ► నాగాలాండ్, మేఘాలయలో కూడా ఫలితాలపై చర్చ నడుస్తోంది. Nagaland | The counting of votes for the #NagalandAssemblyElections2023 will begin at 8 am; Visuals from counting centre at Deputy Commissioner's office in Kohima pic.twitter.com/XdT0sWc4e9 — ANI (@ANI) March 2, 2023 న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. కాగా, మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మ్యాజిక్ ఫిగర్ 30 దాటిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. -
‘ఈశాన్య’ ఫలితాలు నేడే
న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈశాన్యాన మరింతగా విస్తరించాలన్న అధికార బీజేపీ ఆశలు ఏ మేరకు నెరవేరాయన్నది ఈ ఫలితాలతో తేలనుంది. ముఖ్యంగా ఈసారి అందరి దృష్టీ ప్రధానంగా త్రిపురపైనే నెలకొంది. అక్కడ పాతికేళ్ల వామపక్ష పాలనకు తెర దించుతూ అభివృద్ధి నినాదంతో బీజేపీ 2018లో సొంతంగా అధికారంలోకి రావడం తెలిసిందే. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా నిలువరించేందుకు చిరకాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి మరీ లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టి బరిలో దిగాయి. ఇక నాగాలాండ్, మేఘాలయల్లో కూడా బీజేపీ అధికార సంకీర్ణంలో భాగస్వామిగా ఉంది. అయితే మేఘాలయలో ఎన్నికల ముందు అధికార నేషనల్ పీపుల్స్ పార్టీతో బంధం తెంచుకుని సంకీర్ణం నుంచి బయటికొచ్చింది. అంతేగాక తొలిసారిగా మొత్తం 60 స్థానాలకూ పోటీ చేసింది! నాగాలాండ్‌లో మరోసారి ఎన్డీపీపీతో కలిసి బరిలో దిగింది. అక్కడ బీజేపీ అధికారం నిలుపుకుంటుందని, త్రిపురలో ఏకైక పెద్ద పార్టీగా మెజారిటీకి చేరువగా వస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం తెలిసిందే. ఇక త్రిపురలో హంగ్ తప్పకపోవచ్చని అంచనా వేశాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్‌మేకర్‌గా మారొచ్చని జోస్యం చెప్పాయి. -
నాగాలాండ్, త్రిపురలో బీజేపీ హవా.. మేఘాలయలో మాత్రం!
న్యూఢిల్లీ: ఈశాన్యాన మళ్లీ కమల వికాసమేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తాజాగా ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో నాగాలాండ్, త్రిపురల్లో మళ్లీ బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందని, మేఘాలయలో హంగ్ తప్పదని జోస్యం చెప్పాయి. అక్కడ అధికార ఎన్పీపీ మరోసారి ఏకైక పెద్ద పార్టీగా నిలుస్తుందని చెప్పాయి. త్రిపురలో ఎన్నో ఆశలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కొత్త పార్టీ టిప్రా మోర్చా గట్టి దెబ్బ కొట్టనుంది. అధికార బీజేపీ జైత్రయాత్రకూ అది కాస్త అడ్డుకట్ట వేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయల్లో సోమవారం పోలింగ్ పూర్తయింది. మేఘాలయ రాష్ట్రంలో ఈసారి హంగ్ తప్పకపోవచ్చని అన్ని ఎగ్జిట్ పోల్సూ చెప్పడం విశేషం! అధికార ఎన్పీపీకి 18 నుంచి 26 సీట్లకు మించకపోవచ్చని అవి పేర్కొన్నాయి. ఇక బీజేపీకి దక్కుతున్నది 4 నుంచి గరిష్టంగా 11 స్థానాలే. కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి కాగా తృణమూల్‌కు మాత్రం ఎగ్జిట్ పోల్స్ 5 నుంచి 13 స్థానాల దాకా ఇచ్చాయి. యూడీపీకి ఇండియాటుడే, టైమ్స్ నౌ రెండూ 8 నుంచి 14 సీట్లిచ్చాయి. నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్డీపీపీ–బీజేపీ కూటమి అధికారాన్ని నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో పేర్కొన్నాయి. ఎన్డీపీపీకి 28–34 సీట్లు, బీజేపీకి 10 నుంచి 14 వస్తాయని ఇండియాటుడే అంచనా వేసింది. ఎన్పీఎఫ్కు 3 నుంచి 8 సీట్లు వస్తుండగా కాంగ్రెస్ 2 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. టైమ్స్ నౌ కూడా ఎన్డీపీపీకి 27–33 సీట్లు, బీజేపీకి 12–16 ఇవ్వగా ఎన్పీఎఫ్కు 6 సీట్లతో సరిపెట్టింది. త్రిపుర పాతికేళ్ల సీపీఎం కూటమి జైత్రయాత్రకు అడ్డుకట్ట వేస్తూ 2018లో బీజేపీ ఏకంగా 36 సీట్లతో మెజారిటీ సాధించి ఆశ్చర్యపరిచింది. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా అడ్డుకునేందుకు సీపీఎం కూటమి తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. కానీ వాటి అవకాశాలకు కొత్తగా వచ్చిన టిప్రా మోతా భారీగా గండి కొట్టనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మోతా 9 నుంచి 16 సీట్లు దాకా గెలుచుకుంటుందని అంచనా వేశాయి. బీజేపీ మళ్లీ మెజారిటీ సాధిస్తుందని ఇండియాటుడే, జీ న్యూస్ అభిప్రాయపడగా 24 సీట్లకు పరిమితం కావచ్చని టైమ్స్ నౌ పేర్కొంది. కాంగ్రెస్–సీపీఎం కూటమికి ఏ ఎగ్జిట్ పోల్‌లోనూ గరిష్టంగా 21 సీట్లు దాటలేదు. బీజేపీకి 45 శాతం ఓట్లు రావచ్చని ఇండియాటుడే అంచనా వేసింది. లెఫ్ట్–కాంగ్రెస్ కూటమికి 32 శాతం, టిప్రా మోతాకు 20 శాతం వస్తాయని పేర్కొంది. హంగ్ నెలకొనే పక్షంలో ప్రత్యేక టిప్రా లాండ్ డిమాండ్‌కు జైకొట్టే పార్టీకే మద్దతిస్తామని టిప్రా మోతా అధ్యక్షుడు ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దేవ్ బర్మ ఇప్పటికే ప్రకటించారు. నాగాలాండ్‌లో 83%, మేఘాలయలో 75% ఓటింగ్ షిల్లాంగ్/కోహిమా: నాగాలాండ్‌లో ఓటర్లు పోటెత్తారు. దాంతో సోమవారం జరిగిన పోలింగ్‌లో మధ్యాహ్నం మూడింటికే 83.63% ఓటింగ్ నమోదైంది! ఇక మేఘాలయలో సాయంత్రం ఐదింటికల్లా 75% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూలు ఉండటంతో రెండు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ శాతం మరింత పెరగనుంది. రెండు అసెంబ్లీల్లోనూ 60 స్థానాలకు గాను 59 సీట్లకు పోలింగ్ జరిగింది. కొన్ని బూత్‌ల్లో ఈవీఎంలతో సమస్య తలెత్తినా అధికారులు వెంటనే పరిష్కరించారు. -
ముగిసిన మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల పోలింగ్
Updates మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన పోలింగ్ ముగిసింది. మేఘాలయలో 59 అసెంబ్లీ స్థానాలకు 3,419 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ నిర్వహించగా.. నాగాలాండ్‌లో 59 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మేఘాలయ, నాగాలాండ్‌తోపాటు ఫిబ్రవరి 16న జరిగిన త్రిపుర ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. ► నాగాలాండ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 81.94% పోలింగ్ నమోదైంది. ► మేఘాలయలో సాయంత్రం 5 గంటల వరకు 74.32% పోలింగ్ నమోదైంది. ► నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 60.51% ఓటింగ్ నమోదైంది. ►మేఘాలయ తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చార్లెస్ పింగ్రోప్ షిల్లాంగ్‌లోని తన నియోజకవర్గం నోంగ్తిమ్మాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. #MeghalayaElections2023 :TMC State President Charles Pyngrope voting in his Nongthymmai constituency in Shillong pic.twitter.com/mk4S553sl1 — All India Radio News (@airnewsalerts) February 27, 2023 ► నాగాలాండ్‌లో ఉదయం 11 గంటల వరకు 38.68 శాతం ఓటింగ్ నమోదు. ► ఓటు హక్కు వినియోగించుకున్న మేఘాలయ సీఎం కార్నాడ్ సంగ్నా. గారో హిల్స్‌లోని తురా పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్బంగా సీఎం సంగ్మా మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది శుభపరిణామం. ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయని నా నమ్మకం అంటూ కామెంట్స్ చేశారు. Meghalaya CM Conrad Sangma cast his vote at Walbakgre -29 polling station in Tura, Garo Hills "People coming out in large no. to vote. This is good for democracy. I've not see this kind of voter turnout in the past. We are confident that it'll be in our favour," he says. pic.twitter.com/wFkELDuNpE — ANI (@ANI) February 27, 2023 9.00AM ► ఉదయం తొమ్మిది గంటల వరకూ మేఘాలయలో 12 శాతం, నాగాలాండ్‌లో 15.76 శాతం పోలింగ్ నమోదైంది నాగాలాండ్, మేఘాలయల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు(సోమవారం) ఉదయం గం. 7.00లకు పోలింగ్ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, రెండు రాష్ట్రాల్లో 552 మంది బరిలో ఉన్నారు. 34 లక్షలకు పైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. మేఘాలయాలో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా, బరిలో 369 మంది అభ్యర్థులు నిలిచారు. 21.6 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 60 స్థానాలకుకు గాను 59 స్థానాల్లో పోటీ జరుగునుంది. ఇక్కడ ఒక స్థానాన్ని బీజేపీ ముందుగానే కైవసం చేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఖతేజో కినిమి అకులుటో నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగాలాం్‌లో 183 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ ఓటర్లు సంఖ్య 13లక్షలకుపైగా ఉంది. మేఘాలయాలో ఇప్పటిదాకా ఏపార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. నాగాలాండ్‌లో ఏ పార్టీ అన్నిచోట్లా పోటీకి దిగలేకపోయింది. ఇక తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. -
చిన్న పార్టీల చుట్టూ...
మేఘాలయలో ప్రాంతీయ పార్టీలే జోరు మీదున్నాయి. ప్రస్తుతమున్న పార్టీలతో పాటుగా మరో రెండు పార్టీలు కొత్తగా బరిలోకొచ్చాయి. వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీ (వీపీపీ) , కేఏఎం మేఘాలయ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వీపీపీ 18 సీట్లలోనూ కేఎంఎం 3 సీట్లలో మాత్రేమే పోటీ పడుతున్నప్పటికీ వాటి ప్రభావం బాగా ఉంటుందన్న అంచనాలున్నాయి. ఇతర పార్టీల్లా కాకుండా ఈ రెండు పార్టీలు స్వచ్ఛమైన రాజకీయాలు, అవినీతి రహిత ప్రభుత్వాలు అనే అంశాలపై దృష్టి సారించాయి. గత ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ సారి కూడా ఏ పార్టీకి మెజార్టీ దక్కే అవకాశాలైతే కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ముకుల్ సంగ్మా సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 21 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ 19 సీట్లలో నెగ్గిన నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), రెండే స్థానాలు గెలిచిన బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీలైన యూడీఎఫ్, పీడీపీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (హెచ్ఎస్పీడీపీ), మరికొందరు స్వతంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి బీజేపీ, ఎంపీపీ మధ్య విభేదాలు ముదిరాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఆర్. మారక్ గారో హిల్స్‌లో బ్రోతల్ హౌస్ నడుపుతున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, మారక్ ఇరువురు తుర పట్టణానికి చెందిన వారైనప్పటికీ వారి మధ్య సయోధ్య లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ సారి ఎన్నికల్లో మారక్‌కు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. మారక్‌పై ఉన్న సానుభూతితో గారో హిల్స్‌లోని 24 అసెంబ్లీ స్థానాల్లో పాగా వేయాలని యోచిస్తోంది. సంగ్మా సర్కార్‌కు మద్దతు ఉపసంహరించాలని బీజేపీ స్థానిక నాయకులు ఒత్తిడి తెచి్చనప్పటికీ పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుపొంది ఇప్పుడు కనీసం డబుల్ డిజిట్‌పై దృష్టి పెట్టింది. అధికారంలో ఉన్న పార్టీలన్నీ ఎవరికి వారే పోటీ పడుతున్నట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అధికార వ్యతిరేకత ఎన్పీపీపైనే ఉంటుందని ఇతర పార్టీలు ధీమాగా ఉన్నాయి. మరోవైపు ఎన్పీపీ కూడా బీజేపీ హిందుత్వ విధానాలు తమ పార్టీకి ఎదురు దెబ్బగా మారుతుందన్న ఆందోళనతోనే ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని పార్టీలకు సవాల్ విసిరినా ఈసారి అంతర్గత కుమ్ములాటలతోనే ఆ పార్టీ సతమతమవుతోంది. గత ఎన్నికల్లో పార్టీలో ప్రధానంగా ఉన్న ముకుల్ సంగ్మా ఈసారి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న టీఎంసీ ఈ సారి బలమైన పక్షంగా మారుతుందనే అంచనాలున్నాయి. మొత్తమ్మీద ఈ ముక్కోణపు పోటీలో మేఘాలయ ఎన్నికల చిత్రం ఎలా మారుతుందో చూడాలి. నాగాలాండ్‌లో మొత్తం 60 నియోజకవర్గాల్లో ఎవరూ అభ్యర్థుల్ని నిలబెట్టలేని పరిస్థితులున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీల ఉనికి నామ మాత్రంగానే ఉంది. నాగాలాండ్‌లో ప్రస్తుతం నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) బీజేపీ కూటమి అధికారంలో ఉంది.ఎన్డీపీపీ 40 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటే, బీజేపీ 19 నియోజకవర్గాల్లో బరిలో ఉంది. ఈ సారి ఎన్నికల్లో గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ ఎక్కువ ప్రభావం చూపించనుంది. ముఖ్యమంత్రి నిపుయో రియోకు సామాన్య ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో 26 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) అవతరించినప్పటికీ , బీజేపీతో ఎప్పట్నుంచో సంబంధాలున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్డీపీపీతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ నాగా శాంతి చర్చలకు అత్యంత ప్రాధాన్యం ఇచి్చంది. ఈ సారి కూడా బీజేపీ ఎన్డీపీపీ కలిసి పోటీ చేయనున్నాయి. ఎన్డీపీపీ 40 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటే బీజేపీ 20 స్థానాలకే పరిమితమైంది. గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్‌ను పరిశీలిస్తామన్న హామీతో బీజేపీ అత్యధిక సీట్లలో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించవచ్చునన్న ఆశతో ఉంది. రాష్ట్ర జనాభాలో 88 శాతం క్రిస్టియన్లు ఉన్నారు. బీజేపీ అందరితోనూ రాజీపడుతూ నాగాలాండ్‌లో పట్టు బిగించాలని చూస్తోంది. క్రిస్టియన్ల ఓటు బ్యాంకుపైనే గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ 23 సీట్లలో మాత్రమే పోటీకి దిగింది. గత రెండు సార్లు ఎన్నికల్ని పరిశీలిస్తే స్థానిక అంశాలపై అంతగా వ్యతిరేకత కనిపించడం లేదు. 2018లో పోటీకి దిగిన అధికార ఎమ్మెల్యేలలో 70 శాతం మంది మళ్లీ నెగ్గడం విశేషం. -
నేను కూడా బీఫ్ తింటా.. దానిపై ఆంక్షలేవు: బీజేపీ అధ్యక్షుడి సంచలన ప్రకటన
మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మౌరీ సంచలన ప్రకటన చేశారు. మేఘాలయాలో దాదాపు ప్రతిఒక్కరూ గొడ్డు (బీఫ్) మాంసం తింటారని వెల్లడించారు. బీఫ్ తినడంపై రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. ఇది తమ ఆహార అలవాటు, సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ తమకు కావాల్సింది తినే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు. దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ విషయంలో పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై తనేం మాట్లాడదలుచుకోలేదని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘మేఘాలయలో ఉన్న వారందరూ బీఫ్ తింటారు. దానిపై ఎలాంటి నియంత్రణ లేదు. నేను కూడా తింటాను. మేఘాలయాలో బీఫ్‌పై నిషేధం లేదు. ఇది ప్రజల జీవనశైలి, దీనిని ఎవరూ ఆపలేరు. భారతదేశంలో కూడా అలాంటి నియమం లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు కొన్ని చట్టాలను ఆమోదించాయి. మేఘాలయలో, మాకు కబేళా ఉంది. ప్రతి ఒక్కరూ ఆవు లేదా పందిని తీసుకొని మార్కెట్‌కు తీసుకువస్తారు. వీటిని పరిశుభ్రంగా ఉంచుతారు. అందుకే ఇక్కడి వారికి తినే అలవాటు ఉంది’ అని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి తొమ్మిదేళ్లు అవుతోందని.. ఈ కాలంలో దేశంలో ఏ చర్చిపై కూడా దాడులు జరగలేదని ప్రస్తావించారు. అలాగే బీజేపీ అధికారంలోఉన్న గోవా, నాగాలాండ్‌లో కూడా చర్చిలపై అలాంటి ఘటనలేవి చోటుచేసుకోలేదని గుర్తు చేశారు. బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, టీఎంసీ చేస్తున్న ఆరోపణలు కేవలం ఎన్నికల ప్రచారం కోసమేనని మండిపడ్డారు.. మేఘాలయలో క్రిస్టియన్లే అధికంగా ఉంటారని అందరూ చర్చికి వెళ్తారని ఎర్నెస్ట్ తెలిపారు. ఈసారి తప్పకుండా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ సాధిస్తుందన్నారు. కాగా మేఘాలయలో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: బిగుస్తున్న ఉచ్చు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం -
టీఎంసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
షిల్లాంగ్: భారత్ జోడో యాత్ర ముగించిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ.. దేశంలో వరుసగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించారు. తాజాగా ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్‌పైనా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. షిల్లాంగ్‌లో ఇవాళ(బుధవారం) ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. బీజేపీతో పాటు తృణమూల్ కాంగ్రెస్‌పైనా సంచలన ఆరోపణలు చేశారు. టీఎంసీ చరిత్ర ఏంటో మీ అందరికీ తెలుసు. పశ్చిమ బెంగాల్లో హింస, కుంభకోణాలకు కారణమైంది. అలాగే వాళ్లు అనుసరిస్తున్న పద్దతులను కూడా చూస్తున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం భారీగా ధనం వెచ్చించింది ఆ పార్టీ. ఆ ఆలోచన బీజేపీకి కలిసొచ్చింది. ఇప్పుడు మేఘాలయాలోనూ అదే వైఖరి అవలంభిస్తోంది టీఎంసీ. మేఘాలయాలో బీజేపీని బలోపేతం చేయడానికి, అధికారంలోకి తేవడానికే టీఎంసీ తీవ్రంగా యత్నిస్తోంది అని ఆరోపించారాయన. అలాగే.. బీజేపీది అణచివేత ధోరణి గల పార్టీగా అభివర్ణించిన రాహుల్ గాంధీ.. ఆ పార్టీ తనకు ప్రతీది తెలుసని, ఎవరినీ గౌరవించదని చెప్పారు. అందుకే సమిష్టిగా బీజేపీ-ఆరెస్సెస్‌లపై పోరాడాలని ఆయన బహిరంగ సభకు హాజరైన ప్రజానీకానికి పిలుపు ఇచ్చారు. బీజేపీ నుంచి మేఘాలయ భాష, సంస్కృతి, చరిత్రకు హాని జరగకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందని చెప్పారాయన. అలాగే మేఘాలయా ప్రభుత్వం పీకలలోతు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారాయన. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 27వ తేదీన మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కౌంటింగ్, ఫలితాలు మార్చి 2వ తేదీన వెల్లడికానున్నాయి. -
'విజిల్ విలేజ్'! అక్కడ శిశువు పుట్టిన వెంటనే..కొత్త రాగం పుట్టుకొస్తోంది!
ఇంతవరకు ఎన్నో గ్రామాలు గురించి విన్నాం. అక్కడ ఉండే వింత ఆచారాలో లేక విచిత్రమైన వాతావరణ పరిస్థితులు గురించో విని ఉంటాం. కానీ ఇలాంటి విచిత్రమైన గ్రామం పేరు ఇప్పుడూ దాక విని ఉండే అవకాశమే లేదు. పైగా ఈ గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా అవార్డును కూడా గెలుచుకుంది. వివరాల్లోకెళ్తే.. మేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్ నుంచి 60 కి.మీ దూరంలో కాంగ్‌థాంగ్ అనే గ్రామం ఉంది. దీన్ని 'విజిల్ విలేజ్'గా పిలుస్తారు. ఇక్కడ ప్రజలు తమ తోటి గ్రామస్తులను పేర్లతో పిలవరు. ఒక ట్యూన్(రాగం) పేరుతో పిలుచుకోవడమే ఇక్కడ ప్రత్యేకత. తమ సందేశాలను తెలియజేయడానికి ఈలలు వేయడం వంటివి చేస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు రెండు పేర్లు ఉంటాయి. ఒకటి సాధారణ పేరు, మరోకటి పాట పేరు. షార్ట్ ట్యూన్లో ఇంటిలో పిలుచుకుంటే ఊరిలో ఉన్నప్పుడూ లాంగ్ ట్యూన్‌తో పిలుచుకుంటారు. ఈ గ్రామంలో సుమారుగా 700 మంది గ్రామస్తులు ఉన్నారు. అందరికీ విభిన్న రాగాల ట్యూన్లు ఉన్నాయి. ఈ మేరకు కాంగ్‌థాంగ్ గ్రామ నివాసి ఫివ్‌స్టార్ ఖోంగ్సిట్ మాట్లాడుతూ...ఒక వ్యక్తిని సంబోధించడానికి ఉపయోగించే ట్యూన్‌ని వారి తల్లులే కంపోజ్ చేస్తారట. అలాగే అక్కడ గ్రామస్తుడు ఎవరైన చనిపోతే అతనితో పాటే అతడిని పిలిచే ట్యూన్ కూడా చనిపోతుందట. అక్కడ ఉండే ప్రతి ఒక్క గ్రామస్తుడికి ఒకో రాగం పేరుతో పిలుచుకుంటారు. ఈ రాగాలతోటే వాళ్లు ఒకరితో ఒకరు సంభాషించుకుంటామని చెబుతున్నారు. ఇది వారికి తరతరాలుగా సాంప్రదాయంగా వస్తుందని చెప్పారు స్థానికులు. గతేడాది పర్యాటక మంత్రిత్వశాఖ కాంగ్‌థాంగ్ ఉత్తమ పర్యాట గ్రామంగా ది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎంపిక చేసింది. అంతేగాదు 2019లె బిహార్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని యూనెస్కో ట్యాగ్ ఇవ్వాల్సిందిగా సూచించారు కూడా. (చదవండి: యాదృచ్ఛికంగా తీసిన డాక్యుమెంటరీ కాదు!: జై శంకర్) -
ప్రధాని మోదీకి షాకిచ్చిన మేఘాలయ సీఎం!
షిల్లాంగ్: ప్రధాని నరేంద్ర మోదీకి మేఘాలయ ప్రభుత్వం షాకిచ్చింది. ఫిబ్రవరి 24న టురలో పీఎం సంగ్మా స్టేడియంలో నిర్వహించే ఎన్నికల ర్యాలీకి అనుమతి నిరాకరించింది. ఈ స్టేడియంలో ఇంకా పనులు పూర్తి కాలేదని, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా అక్కడే ఉందని పేర్కొంది. ప్రధాని సభకు జనం భారీగా తరలివస్తారు కాబట్టి ఈ స్టేడియానికి ఆ సమర్థ్యం లేదని, మెటీరియల్‌కు కూడా భద్రత ఉండదని వివరణ ఇచ్చింది. మోదీ సభకు వేదికను మార్చుకుంటే అనుమతి ఇస్తామని మేఘాలయ క్రీడా శాఖ చెప్పింది. అలోత్గ్రే క్రికెట్ స్టేడియంలో ర్యాలీ నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ కార్యదర్శి ఈశాన్య రాష్ట్రాల ఇంఛార్జ్ రితురాజ్ సిన్హా స్పందించారు. మోదీ ఎన్నికల ర్యాలీ అనుకున్న తేదీనే జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. అయితే వేదిక ఎక్కడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మేఘాలయ ప్రజలతో మోదీ మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాక ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. అయితే రెండు నెలల క్రితమే ప్రారంభోత్సవం జరిగిన స్టేడియంలో ఇంకా పనులు పూర్తి కాకపోవడం ఏంటని రితురాజ్ ప్రశ్నించారు. బీజేపీని చూసి సీఎం కోన్రాడ్ సంగ్మాకు భయమేస్తోందా? అని ఎద్దేవా చేశారు. సభ జరగకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, ఈసారి ఎన్నికల్లో బీజేపీ వేవ్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మేఘాలయతో పాటు నాగలాండ్‌లో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో రాష్ట్రం త్రిపురలో ఫిబ్రవరి 16నే ఓటింగ్ పూర్తయింది. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు మార్చి 2న ప్రకటిస్తారు. చదవండి: శివసేనను షిండేకు ఇవ్వడంపై సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ -
మేఘాలయలో ముక్కోణం
ఈశాన్య భారత్‌లో గిరిజన ప్రాబల్యం కలిగిన మేఘాలయాలో శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయలో ఫిబ్రవరి 27న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 2న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పాత ప్రత్యర్థులైన కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా మళ్లీ హోరాహోరీగా తలపడుతున్నారు. 2018 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నేతృత్వం వహించి, 21 స్థానాల్లో పార్టీని గెలిపించిన మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నుంచి బరిలోకి దిగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. కిందటిసారి పోటీలో లేని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతుండడం విశేషం. 2018లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికార పీఠానికి దగ్గరగా వచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థులంటూ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఎన్నికల్లో ఎన్పీపీకి కాన్రాడ్ సంగ్మా, తృణమూల్ కాంగ్రెస్‌కు ముకుల్ సంగ్మా, కాంగ్రెస్‌కు విన్సెంట్ పాలా, బీజేపీకి ఎర్నెస్ట్ మారీ నాయకత్వం వహిస్తున్నారు. ప్రధానంగా ఎన్పీపీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు సాగుతోంది. అంతర్గత లుకలుకలతో అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండీఏ) కూటమి విచ్ఛిన్నమైంది. కూటమిలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ), యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ), పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. ఎండీఏలో అతిపెద్ద పార్టీ అయిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మరోసారి కుర్చీ దక్కించుకోవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే మేఘాలయలో 2013 తర్వాత వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న తొలి పార్టీగా ఎన్పీపీ రికార్డుకెక్కుంది. 18 మంది రాజీనామా 2018లో కేవలం 20 సీట్లు గెలుచుకున్న ఎన్పీపీ.. యూడీపీ(6 సీట్లు), హెచ్ఎస్పీడీపీ(2 సీట్లు), పీడీఎఫ్(4 సీట్లు), బీజేపీ(2 సీట్ల)తోపాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ఎమ్మెల్యేల గోడదూకుళ్లు తదితరాలతో బలాబలాలు మారుతూ వచ్చాయి. 2021 నవంబర్‌లో ముకుల్ సంగ్మా నేతృత్వంలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు సైతం పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేకుండాపోయారు. ఇటీవలే 18 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు, సొంత పార్టీలకు రాజీనామా చేశారు. టిక్కెట్లపై హామీ ఇచ్చే పార్టీలో చేరి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తృణమూల్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ వీరిలో ఉన్నారు. గిరిజన రాష్ట్రమైన మేఘాలయకు ప్రత్యేక హోదా ఉంది. దాంతో రాష్ట్రంలో ఖర్చు చేసే నిధుల్లో 90 శాతానికిపైగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంటాయి. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడి రాజకీయాలను చాలావరకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. చిన్నాచితక పార్టీలు ఏదో ఒక నినాదంతో ఎన్నికల్లో పోటీ చేయడం, ఒకటో రెండో స్థానాలు గెలుచుకొని, ఫలితాల అనంతరం నెంబర్ గేమ్‌లో వీలైనంత మేరకు లబ్ధి పొందడం పరిపాటిగా మారింది. మళ్లీ మాదే అధికారం: ఎన్పీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టించిందని, అందుకే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నామని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తేల్చిచెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం లేదని, తాము మళ్లీ నెగ్గడం ఖాయమని ఎన్పీపీ రాష్ట్ర అధ్యక్షుడు డబ్ల్యూ.ఖార్లుఖీ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభావితం చేసే అంశాలేమిటి? ప్రభుత్వ వ్యతిరేకత: కాన్రాడ్ సంగ్మా సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవడం, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుండడం, నిధుల లేమితో ఆరోగ్య రంగం కునారిల్లుతుండడం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారింది. సరిహద్దు రగడ: మేఘాలయ–అస్సాం నడుమ సరిహద్దు వివాదం రగులుతోంది. రెండు రాష్ట్రాల్లో సరిహద్దులో ఉన్న పలు తెగల మధ్య హింసాకాండ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని జనం ఆరోపిస్తున్నారు. కూటమి విచ్ఛిన్నం: అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండీఏ) కూటమి విచ్ఛిన్నమై, పార్టీలు సొంతంగా పోటీ చేస్తుండడం ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీది రెండు నాల్కల వైఖరి: మమత
షిల్లాంగ్: రాష్ట్రాలకు చెల్లించాల్సిన నిధులు, ఇతరత్రా హామీలను ఎన్నికల వేళ ప్రధానంగా ప్రస్తావించే బీజేపీ ఆ తర్వాత మరోలా మాట్లాడుతుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మేఘాలయలోని ఉత్తర గారో హిల్స్ జిల్లాలో బుధవారం ఆమె భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘బీజేపీకి రెండు ముఖాలుంటాయి. ఎన్నికల ముందు హామీలు గుప్పిస్తూ ఒక ముఖం మాట్లాడుతుంది. ఆ తర్వాత మరో ముఖం మరోలా మాట్లాడుతుంది. కాషాయ పార్టీ ఏలుబడిలోని రాష్ట్రాలకే కేంద్ర నిధులు దక్కుతాయి. ఇలాంటి పార్టీకి ఓటేయకండి’’ అని పిలుపునిచ్చారు. అస్సాం, త్రిపురలతోపాటు మేఘాలయలోనూ పార్టీని పటిష్టంచేయడంపై మమత దృష్టిసారించారు. మేఘాలయలో 2021 నవంబర్‌లో కాంగ్రెస్‌లోని 17 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 12 మంది టీఎంసీలో చేరడం విశేషం! గత డిసెంబర్లో రాష్ట్రంలో పర్యటించిన మమత.. స్థానిక మహిళలకు ఆర్థిక తోడ్పాటు కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. ఈ కొద్దిరోజుల్లోనే 3.14 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు! -
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఈశాన్య రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా
-
Meghalaya: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో మేఘాలయలో అయిదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బుధవారం తమ రాజీనామాను గవర్నరకు సమర్పించి యూనైటెడ్ డెమోక్రటిక్ పార్టీలో(యూడీపీ) చేరేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా చేసిన వారిలో కేబినెట్ మంత్రి హిల్ స్టేట్ పిపుల్ డెమోక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ) ఎమ్మెల్యే రెనిక్టన్ లింగ్డో టోంగ్కార్, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే షిత్లాంగ్ పాలే, సస్పెండెడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైరల్బోర్న్ సియోమ్, పిటి సాక్మీతో పాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అయితే ఈ పరిణామంతో రాష్ట్రంలో కాంగ్రెస్, హెచ్ఎస్పీడీపీ పార్టీలకు ఎమ్మెల్యేలు లేకుండా పోయారు. కాగా మేఘాలయలో ఈమధ్య కాలంలో పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 18 మంది శాసనసభ్యులు సంబంధిత పార్టీలకు రాజీనామాలు సమర్పించారు. ఇదిలా ఉండగా మార్చి 15తో మేఘాలయ 11వ అసెంబ్లీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో మూడు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించనుంది. ఇక మేఘాలయ డెమోక్రటిక్ అలయెన్స్ పేరుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన బీజేపీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీనికితోడు తాము కూడా ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ పేర్కొంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయలో మెజార్టీ మార్కును దాటగలమని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా 2018లో ఎన్సీపీ (20), యూడీపీ (8), పీడీఎఫ్ (4), హెచ్ఎస్పీడీపీ (2), బీజేపీ (2), ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి(మొత్తం 39) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా ప్రస్తుతం మేఘాలయ సీఎంగా ఉన్నారు. చదవండి: ట్రైన్లో గర్భిణీకి పురిటి నొప్పులు.. ప్రసవం చేసిన హిజ్రాలు. -
Natural Farming: ఏపీ స్ఫూర్తితో మేఘాలయలో ప్రకృతి సాగు
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ప్రకృతిసాగు వైపు అడుగులేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇటీవలే మేఘాలయ రాష్ట్ర అధికారులు, గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి గిరిజనులు పాటిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేసింది. మేఘాలయలో ప్రకృతి వ్యవసాయ పరివర్తన కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించే క్రమంలో మేఘాలయ స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ సొసైటీతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుసాధికార సంస్థ, అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులకు చెందిన నిట్టపుట్టు పరస్పర సహాయ సహకార సంఘం మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు మేఘాలయలో ప్రకృతిసాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక సహాయం అందించనుంది. మేఘాలయలో ఘరో, ఖాశీ హిల్స్‌లో ఎంపిక చేసిన ఐదు బ్లాకుల్లో 20గ్రామాల రైతులను ప్రకృతి వ్యవసాయ రైతులుగా తీర్చిదిద్దడంతోపాటు బలమైన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ) వ్యవస్థ రూపకల్పనకు చేయూతనిస్తుంది. ఇందుకోసం 10 మంది సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల బృందం మేఘాలయాకు వెళ్లింది. ఈ బృందం అక్కడి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, ప్రాజెక్టు బృందంతో కలిసి పనిచేస్తుంది. ఎంపికచేసిన బ్లాకుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రకృతిసాగు చేపట్టడం ద్వారా వాటిని రిసోర్స్ బ్లాకులుగా తీర్చిదిద్దనున్నారు. ఇంగ్లిష్ స్థానిక భాషల్లో ప్రకృతిసాగు విధానాలు, పాటించాల్సిన పద్ధతులపై మెటీరియల్ తయారుచేసి ఇస్తారు. సిబ్బందికి శిక్షణతోపాటు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రస్థాయిలో కో ఆర్డినేట్ చేసేందుకు స్టేట్ యాంకర్‌ను నియమిస్తారు. సీజన్ల వారీగా రెండు రాష్ట్రాల కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రకృతి వ్యవసాయ అనుభవాలు, ఉత్తమ అభ్యాసాలను పరస్పరం పంచుకోవడానికి కృషిచేస్తారు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం) -
అస్సాం-మేఘాలయ బార్డర్ చిచ్చు.. ఆరుగురి మృతి.. ఇంటర్నెట్ బంద్
సరిహద్దులో కాల్పుల ఘటన ఉద్రిక్తతలతో మేఘాలయ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఏడు జిల్లాల్లో 48 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అసోం(పూర్వ అస్సాం)-మేఘాలయ సరిహద్దు వెంట జరిగిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన ఐదుగురు మరణించారు. దీంతో.. సోషల్ మీడియాలో వందతులు వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో పశ్చిమ జైంటియా హిల్స్ వద్ద అక్రమ కలప రవాణాను అడ్డుకునే క్రమంలో ఘర్షణలు తలెత్తినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసులు-ఫారెస్ట్ అధికారులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మేఘాలయకు చెందిన వ్యక్తులతో పాటు ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఓ ఫారెస్ట్ గార్డు చనిపోయినట్లు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం వెల్లడించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఈ ఉదయం(మంగళవారం) 10.30 నుంచి 48 గంటలపాటు ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపిన మేఘాలయ పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు వెల్లడించారు. మరోవైపు అసోం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మంగళవారం ఉదయం అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో అస్సాం-మేఘాలయ సరిహద్దులో హింస చెలరేగింది. అసోం పరిధిలోని పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ముక్రు ప్రాంతంలో అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో.. మేఘాలయలోని పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లా ముఖో వైపు అక్రమంగా కలప తరలిస్తున్న టింబర్‌ను అసోం అటవీ శాఖ బృందం అడ్డుకుంది. ఈ క్రమంలో వాళ్లు పారిపోయే క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ ఘటన తర్వాత ఫారెస్ట్ సిబ్బంది జిరికెండింగ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను పెంచారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత.. మేఘాలయ నుంచి ఆయుధాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉదయం ప్రాంతంలో అక్కడకు వచ్చారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఫారెస్ట్ గార్డులు, పోలీసు సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని అస్సాం పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉండగా.. మేఘాలయ సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో అసోం పోలీసులు భద్రతను పెంచారు. ఐదుగురు కూడా బుల్లెట్ గాయాలతో మరణించారా లేదా మరేదైనా ఆయుధం తగలడంతో మృతిచెందారా? అసోం ఫారెస్ట్ మరణానికి కారణం ఏంటన్న దానిపై అసోం పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. అస్సాం గార్డులే మొదటగా టింబర్ల టైర్లను కాల్చారని చెప్తున్నారు. నలుగురు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఫారెస్ట్ గార్డు గాయపడి మరణించినట్లు సమాచారం. 1972లో మేఘాలయ అస్సాం నుండి వేరు అయ్యింది. అప్పటి నుంచి అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ నడుస్తూనే వస్తోంది. ఇరు రాష్ట్రాలు గతేడాది ఆగస్టులో మూడు ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ఈ సమస్య పరిష్కారానికి సిద్ధం అయ్యాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు.. ఓ డ్రాఫ్ట్ రెజల్యూషన్‌ను హోం మంత్రి అమిత్ షాకు జనవరి 31వ తేదీన సమర్పించాయి. ఒప్పందాల నడుమే ఉద్రిక్తతలు ఇరు రాష్ట్రాలకు సంబంధించి 884.9 కిలోమీటర్ల సరిహద్దు వెంట 12 వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ఆరింటికి సంబంధించి పరిష్కారం కోసం మార్చి నెలలో.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఒక ఒప్పందం చేసుకున్నారు. దీంతో.. ఐదు దశాబ్దాల నాటి వివాదాన్ని ఓ కొలిక్కి వస్తుందని అంతా అనుకున్నారు. ఇక.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈ ఒప్పందం చారిత్రాత్మకమని, సంతకంతో 70% వివాదం పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఆగస్టులో మిగిలిన ప్రాంతాల్లో వివాదాన్ని పరిష్కరించేందుకు శర్మ, సంగ్మా చర్చలు జరిపారు. అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈలోపు.. అస్సాం 18.51 స్క్వేర్ కిలోమీటర్లు, మేఠాలయా 18.21 స్క్వేర్ కిలోమీటర్లు ఉంచేసుకోవాలని ప్రతిపాదించాయి. తొలిదశలో 36 గ్రామాలకు సంబంధించి ఒప్పందం కుదిరింది కూడా. ఇదిలా ఉంటే.. మిజోరాంతోనూ గతంలో ఇలాగే సరిహద్దు విషయంలో ఘర్షణలు తలెత్తాయి. 2021లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు అస్సాం పోలీసులు దుర్మరణం పాలయ్యారు. -
సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
షిల్లాంగ్: వాతావరణం అనుకూలించకపోవటంతో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. షిల్లాంగ్‌లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో హెలికాప్టర్ దిగాల్సి ఉండగా.. వాతావరణం అందుకు అనుకూలించలేదు. దీంతో ఉమియామ్ సరస్సు సమీపంలో ల్యాండింగ్ చేశారు పైలట్లు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు సీఎం కాన్రాడ్ సంగ్మా. తురా నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘటన ఎదురైనట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన యూనియన్ క్రిస్టియన్ కాలేజీ క్యాంపస్‌లోని పర్యావరణాన్ని ఆస్వాదించానని పేర్కొన్నారు సంగ్మా. తమను సురక్షితంగా కిందకు చేర్చినందుకు హెలికాప్టర్ కెప్టెన్, పైలట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎంత సాహసం! వాతావరణం అనుకూలించక ఉమియామ్‌లోని యూసీసీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. క్యాంపస్‌లోని అందమైన ప్రకృతిని ఆస్వాదించాను. యూసీసీ సిబ్బందిని కలిశాను. అక్కడి క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం చేశాను.’ అని రాసుకొచ్చారు సంగ్మా. What an adventure! •Emergency Landing at UCC, Umiam due to bad weather •Enjoyed the beautiful scenery in the Campus •Met with staff of UCC •Lunch in UCC Canteen The weather is truly unpredictable. Thank the Captain & Pilot for bringing us back safely. pic.twitter.com/D4rMAzGYhC — Conrad Sangma (@SangmaConrad) November 2, 2022 ఇదీ చదవండి: గోవాలో ఇకపై ఈ పనులు చేస్తే భారీగా జరిమానా -
అమ్మ, ముగ్గురు చెల్లెళ్ల భారం... తొలుత స్కూల్ బస్ డ్రైవర్‌గా.. ఇప్పుడేమో!
ప్రతి పనిలోనూ పురుషులతో పోటీ పడుతున్నారు నేటితరం మహిళలు. గరిటే కాదు స్టీరింగ్నూ తిప్పేస్తామని అనేక సందర్భాల్లో స్టీరింగ్‌ను చాకచక్యంగా తిప్పిచూపించిన వారెందరో. తాజాగా ఈ జాబితాలో చేరిన జాయిసీ లింగ్డో.. అతిపెద్ద సంస్థ అమెజాన్‌లో ట్రక్ స్టీరింగ్ తిప్పుతూ ఔరా అనిపిస్తోంది. ఒకచోటనుంచి మరోచోటుకు అమెజాన్ గూడ్స్‌ను రవాణా చేస్తూ అమెజాన్ ఇండియాలో తొలి మహిళా ట్రక్ డ్రైవర్‌గా నిలిచింది . తనలాంటి వారెందరికో డ్రైవింగ్ కూడా ఒక ఉపాధి మార్గమంటూ చెప్పకనే చెబుతోంది. మేఘాలయలోని షిల్లాంగ్‌కు చెందిన 35 ఏళ్ల నిరుపేద మహిళే జాయిసీ లింగ్డో. ఇంట్లో కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో అమ్మ, ముగ్గురు చెల్లెళ్ల భారం జాయిసీ భుజాలపైన పడింది. దీంతో చదువుని త్వరగా ముగించేసి వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించసాగింది. గువహటీలోని స్టీల్ కంపెనీతోపాటు ఇతర కంపెనీలు, స్థానిక షాపుల్లో స్టోర్ మేనేజర్‌గా పనిచేసేది. సరదాగా ప్రారంభించి... ఒకపక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క తన స్నేహితుల సాయంతో సరదాగా డ్రైవింగ్ నేర్చుకుంది. స్టీరింగ్ తిప్పడం బాగా వచ్చాక ఓ స్కూల్ బస్‌కు డ్రైవర్‌గా చేరింది. కొంతకాలం పని చేశాక అమెజాన్‌లో ట్రక్ డ్రైవర్స్‌ను తీసుకుంటున్నారని తెలిసి దరఖాస్తు చేసుకుంది. ఆరేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండడంతో అమెజాన్ కంపెనీ జాయిసీని తీసుకుంది. దీంతో అమెజాన్ ఇండియాలో తొలి మహిళా ట్రక్ డ్రైవర్ గా నిలిచింది. గువహటీ వ్యాప్తంగా అమెజాన్ గూడ్స్‌ను సమయానికి డెలివరీ చేస్తూ మంచి డ్రైవర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మహిళా ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ, తనలాంటి మహిళలెందరికో కొత్త ఉపాధి మార్గాన్ని ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తోన్న జాయిసీ అమేజింగ్ డ్రైవర్‌గా పేరు తెచ్చుకుంటోంది. మనసుంటే మార్గం ఉంటుంది వివిధ ప్రాంతాలకు తిరుగుతూ కొత్త ప్రాంతాలు, కొత్త మనుషుల్ని కలవడం బాగా నచ్చింది. అందుకే డ్రైవింగ్ మీద ఉన్న ఆసక్తిని వృత్తిగా మార్చుకుని రాణించగలుగుతున్నాను. డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకోవాలనుకునేవారు ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. కొత్త ఉపాధి అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి వాటిని అందిపుచ్చుకునేందుకు ఆరాటపడాలి. కొత్తదారిలో నడిచేటప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతాయి. సాధించాలన్న మనస్సుంటే మార్గం తప్పకుండా దారి చూపుతుంది. – జాయిసీ లింగ్డో చదవండి: Viraj Mithani: ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలం.. కట్‌చేస్తే అంతర్జాతీయ స్థాయిలో Street Child World Cup 2022: వీధి బాలికల టీమ్ ఆడుతోంది చూడండి -
ఫామ్ హౌస్‌లో గుట్టుగా వ్యభిచార గృహం.. బీజేపీ నేత అరెస్టు
లక్నో: ఫామ్ హౌస్‌లో అక్రమంగా వ్యభిచార గృహం నడుపుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ బీజేపీ నాయకుడు బెర్నార్డ్ మరాక్ను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు హాపుడ్ జిల్లాలో అరెస్టు చేశారు. అతడ్ని మేఘాలయ పోలీసులకు అప్పగించనున్నట్లు హాపుడ్ ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు. మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడుడైన బెర్నార్డ్‌కు చెందిన ఫామ్ హౌస్‌పై శనివారం రైడింగ్ చేశారు పోలీసులు. అక్కడ గుట్టుగా నడుపుతున్న వ్యభిచార గృహం నుంచి ఆరుగురు మైనర్లను కాపాడారు. ఈ కేసులో మొత్తం 73 మందిని అరెస్టు చేశారు. అనంతరం బెర్నార్డ్పై నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ చేశారు. అప్పటికే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బెర్నార్డ్‌ను మేఘాలయలోని తురకు తరలిచేందుకు ఏర్పాట్లు చేసినట్లు, ఆ రాష్ట్ర పోలీసులు అతడ్ని తీసుకువెళ్లేందుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: ఫామ్ హౌసులో గుట్టుగా బీజేపీ నేత సెక్స్ రాకెట్.. 23 మంది మహిళలు, 73 మంది.. -
బీజేపీ నేత లీలలు.. ఫామ్ హౌసులో గుట్టుగా సెక్స్ రాకెట్
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మేఘాలయ బీజేపీ ముఖ్య నేత అకృత్యాలు బయటకు రావడంతో సంచలనంగా మారింది. తన ఫామ్ హౌసులో గుట్టుగా వ్యభిచార గృహం నిర్వస్తున్న బీజేపీ నేత బెర్నార్డ్ మరాక్.. అలియాస్ రింపు గుట్టురట్టు అయ్యింది. వివరాల ప్రకారం.. మేఘాలయ బీజేపీ నేత బెర్నార్డ్ మరాక్.. వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణంలోని ఉన్న తన ఫాంహౌసులో గుట్టుగా సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నాడు. ఈ మేరకు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో శనివారం పోలీసులు ఆకస్మిక రైడ్స్ చేశారు. దాడుల్లో భాగంగా.. ఐదుగురు చిన్నారులను రక్షించినట్టు వెస్ట్ గారో హిల్స్ జిల్లా ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు. వారిలో నలుగురు బాలురు, ఒక అమ్మాయి ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో వ్యభిచార దందాతో సంబంధం ఉన్న 73 మంది అరెస్ట్ చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. వారిలో 23 మంది మహిళలు ఉన్నారు. ఇక, ఫామ్‌హౌసులో 30 చిన్న గదులు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, రక్షింపబడిన చిన్నారులు.. దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. పోలీసుల రైడ్స్‌లో భాగంగా.. 400 మందు బాటిళ్లు, 500కు పైగా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, 47 మొబైల్ ఫోన్లు, 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దీంతో, మారక్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్టు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మారక్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మారక్ గతంలో మిలిటెంట్‌గా విధులు నిర్వహించాడు. అనంతరం రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసి.. బీజేపీలో చేరారు. మేఘాలయ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. A case of “immoral trafficking” was filed following raids at a resort owned by BJP Meghalaya state unit’s vice president Bernard N Marak alias Rimpu, where six children were found "locked inside dingy cabin-like unhygienic rooms". pic.twitter.com/PJO1UiTwW6 — The Second Angle (@TheSecondAngle) July 24, 2022 -
స్వతంత్ర భారతి: మూడు రాష్ట్రాల అవతరణ
మణిపుర్, త్రిపుర, మేఘాలయలు ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. 1947లో మణిపుర్ స్వతంత్ర రాజ్యమయ్యింది. మణిపుర్ రాజు మహారాజా ప్రబోధచంద్ర మణిపుర్ రాజ్యాంగాన్ని ఏర్పరచి, ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికారు. 1949లో మణిపుర్ రాజ్యం భారతదేశంలో విలీనం అయింది. 1956 నుండి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న మణిపుర్ 1972లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. త్రిపుర కూడా భారతదేశ స్వాతంత్య్రానికి ముందు ఒక రాజ్యంగా ఉండేది. 1949 లో భారత్‌లో విలీనమయ్యే వరకు గిరిజన రాజులు త్రిపురను శతాబ్దాలుగా పరిపాలిస్తూ వచ్చారు. చదవండి: చైతన్య భారతి: డిగ్రీ లేని మేధావి రాచరిక పాలనకు వ్యతిరేకంగా గణముక్తి పరిషద్ ఉద్యమం ప్రారంభమైనది. ఈ ఉద్యమ ఫలితమే త్రిపుర భారతదేశంలో విలీనం అవడం. దేశ విభజన తీవ్ర ప్రభావం చూపిన ప్రాంతాలలో త్రిపుర కూడా ఒకటి. రాష్ట్రంలో ఇప్పుడు బెంగాలీలు (ఇందులో చాలామంది 1971లో బంగ్లాదేశ్ యేర్పడిన తర్వాత పారిపోయి ఇక్కడ ఆశ్రయం పొందినవారే), స్థానిక గిరిజనులు పక్కపక్కనే సహజీవనం సాగిస్తున్నారు. త్రిపుర 1972లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. మేఘాలయ 1972 ముందు వరకు అస్సాంలో భాగంగా ఉండేది. మణిపుర్, త్రిపురలతో పాటు ప్రభుత్వం 1972 జనవరి 21 మేఘాలయకు రాష్ట్ర ప్రతిపత్తిని ఇచ్చింది. -
వివక్షపై.. నమ్రత పిడికిలి
ఇటీవల ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ దివ్యాంగ పిల్లవాడిని విమానంలో ఎక్కడానికి అనుమతించలేదు. ‘‘ప్రత్యేక అవసరాలు కలిగిన ఇతనివల్ల మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడతారు’’ అని సాకును చూపిస్తూ పిల్లవాడిని విమానంలోకి ఎక్కడానికి నిరాకరించింది. ఈ సంఘటనను చూసిన వారంతా..ఇంత చిన్నచూపా? ఇదేం పని? అంటూ విమర్శిస్తూనే వారి అమానుషత్వాన్ని తీవ్రంగా ఖండించారు. అయితే 35 ఏళ్ల నమ్రత మాత్రం అందరిలా ‘అయ్యోపాపం’ అనో, పిడికిళ్లు బిగించో ఊరుకోలేదు. దివ్యాంగులను విమాన సిబ్బంది అలా ఎలా అడ్డుకుంటారు? ఇది సరైంది కాదంటూ ఏకంగా ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. ‘‘నాకు ఒక చెవి వినపడదు. చుట్టూ ఉన్నవారు నన్ను ఎంత అవహేళనగా చూస్తారో ఆ బాధ నాకు తెలుసు’’ అని చెబుతూ తనలా సమాజంలో వివక్షకు గురవుతోన్న ఎంతోమంది అట్టడుగు వర్గాల వారి తరపున నిలబడి పోరాడుతోంది నమ్రత. మేఘాలయకు చెందిన అమ్మాయి నమ్రతాశర్మ. గోర్ఘా కమ్యునిటీలో ఎనిమిదో తరానికి చెందిన అమ్మాయి. నాగాలాండ్‌లో పుట్టడడం వల్ల నమ్రతకు నేపాలీ కూడా మాట్లాడం వచ్చు. మేఘాలయలో పోస్ట్రుగాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత గ్రామీణాభివద్ధి సెక్టార్లో ఉద్యోగం రావడంతో బీహార్ వెళ్లింది. ఉద్యోగం వల్ల వినికిడి పోయింది... ఎవరికైనా ఉద్యోగం వస్తే కష్టాలన్నీ పోయి సంతోషంగా అనిపిస్తుంది. నమ్రతకు మాత్రం ఉద్యోగంతో పెద్ద కష్టమే వచ్చింది. మేఘాలయాలో పెరిగిన నమ్రత ఉద్యోగరీత్యా బీహార్‌కు వచ్చింది. అక్కడి వాతావరణం మేఘాలయకు పూర్తి భిన్నంగా ఉండడంతో ఆమెకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఉద్యోగ విషయంలో అంతా బాగానే ఉన్నప్పటికీ వేడి ఎక్కువగా ఉండడం వల్ల తరచూ డీహైడ్రేషన్‌కు గురయ్యేది. ప్రారంభంలో సర్దుకున్నప్పటికీ క్రమంగా తన చెవి నరాలు ఎండిపోయి వినికిడి శక్తిని కోల్పోయింది. తనతో ఎవరు మాట్లాడినా సరిగా వినిపించేది కాదు. దీంతో తన సహోద్యోగులంతా ‘హే చెవిటిదానా’ అని పిలిచి పెద్దగా నవ్వుకునేవారు. నమ్రత మాటల్లో నేపాలీ యాస ధ్వనించడంతో ‘ఏ నేపాలీ’ అని కూడా ఆమెను కించపరిచేవారు. ఇలా పదేపదే జరగడంతో నమ్రతకు చాలా బాధగా అనిపించేది. గొంతుకగా నిలవాలని కొంతమంది తనకు సాయం చేస్తామని చెప్పి ఆమె మీద జోకులు వేసి నవ్వుకోవడాన్ని భరించలేని నమ్రతకు... ‘‘నాకు ఒక్క చెవి వినపడకపోతేనే ఇలా గేలిచేస్తున్నారు. కొంతమందికి పూర్తిగా వినపడదు. అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటీ?’’ అనిపించింది. ఇలా అవమానాలు ఎదుర్కొంటోన్న వారికి సాయపడాలని నిర్ణయించుకుంది. దళిత, ఆదివాసి మహిళలు, అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు ఎవరైతే వినికిడి శక్తిని కోల్పోయారో, మాట్లాడలేరో, అలాంటి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి గొంతుకగా నిలబడుతోంది. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకోసం నమ్రత వేసిన పిటిషన్ ఇది తొలిసారి కాదు. గతంలో కూడా నమ్రత బెంగళూరులో ఉన్నప్పుడు.. అక్కడ ఉన్న ఒకే ఒక డెఫ్ ఇన్స్టిట్యూట్ ‘టెక్నికల్ ట్రై నింగ్ స్కూల్’ను మెట్రో నిర్మాణంలో భాగంగా కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ స్కూలును కూల్చవద్దని పిటిషన్ వేసింది. దీనికి అక్కడి స్థానికులు కూడా మద్దతు తెలపడంతో స్కూలు కూల్చడాన్ని మెట్రో అధికార యంత్రాంగం వాయిదా వేసింది. ఆ తర్వాత ‘పాతాల్‌లోక్’ వెబ్ సిరీస్ లో ఈశాన్య దేశాల ప్రజలను కించపరిచే విధంగా మాటలు ఉన్నాయని, వాటిని తొలగించాలని పిటిషన్ వేసింది. ఇలా సమాజంలో ఎదురయ్యే అనేక వివక్షలను గొంతెత్తి ప్రశ్నిస్తూ ఎంతోమందికి కనివిప్పు కలిగిస్తూ సమాజాభివద్ధికి తనవంతు సాయం చేస్తోంది నమ్రత. మానవత్వం చూపాలి మనుషులమని మర్చిపోయి ప్రవర్తించడం చాలా బాధాకరం. మనుషుల్లో కొంతమంది పొడవుగా, మరికొంతమంది పొట్టిగా, వివిధ రకాల రంగూ, రూపురేఖలతో విభిన్నంగా ఉంటారు. అంతమాత్రాన వాళ్లు మనుషులు కాకుండా పోరు. ఎటువంటి లోపాలు, అంతరాలు ఉన్నప్పటికీ వాళ్లు మనలాంటి మనుషులని గుర్తించాలి. వికలాంగుల పట్ల వివక్ష చూపకూడదు. మానవత్వం చూపాలి. – నమ్రతా శర్మ -
T20 Trophy: హైదరాబాద్ శుభారంభం
T20 Cricket Tournament- పుదుచ్చేరి: జాతీయ సీనియర్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్ ‘ఎ’ గ్రూప్‌లో భాగంగా సోమవారం మేఘాలయ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 64 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ రమ్య (44; 4 ఫోర్లు), కె.అనిత (34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), జి.త్రిష (20 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో ప్రణవి చంద్ర, భోగి శ్రావణి, అనిత, వంకా పూజ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: IPL 2022: బట్లర్ భళా... చహల్ చాంగుభళా -
‘ఈశాన్యం’లో సామరస్యం
సరిహద్దుల విషయంలో తరచు సంఘర్షించుకుంటున్న ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ ఆదర్శంగా అస్సాం, మేఘాలయ మంగళవారం ఒక ఒప్పందానికొచ్చాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మంగళవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా అర్ధ శతాబ్దిగా ఇరు రాష్ట్రాల మధ్యా సాగుతున్న సుదీర్ఘ వివాదానికి తెరదించారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులపై వివాదా లుండటం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన సమస్య కాదు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో అవి తరచు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఏళ్ల తరబడి సహాయ శిబిరాల్లో సాధారణ పౌరులు తలదాచు కోవడం అక్కడ కనబడుతుంది. అస్సాం–నాగాలాండ్ మధ్య 2014 ఆగస్టులో దాదాపు పక్షం రోజులపాటు ఘర్షణలు చెలరేగి 14 మంది చనిపోగా, అనేకమంది ఆచూకీ లేకుండా పోయారు. గృహదహనాలు సైతం చోటుచేసుకున్నాయి. 1985లో అయితే ఆ రెండు రాష్ట్రాల పోలీసులూ పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో వందమంది వరకూ మరణించారు. ఉద్రిక్తతలున్నప్పుడు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరుపుకోవడం, పరిస్థితులు అదుపు తప్ప కుండా చూడటంలాంటివి చేయకపోవడం వల్ల సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అస్సాం, మేఘాలయ ఒక అవగాహనకు రావడం హర్షించదగ్గ పరిణామం. అస్సాం నుంచి కొన్ని ఇతర రాష్ట్రాల మాదిరే మేఘాలయ కూడా 1972లో విడివడి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రెండింటిమధ్యా 885 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అయితే అప్పర్ తారాబరి, గజంగ్ రిజర్వ్ ఫారెస్టు, బోక్లాపారా, లాంగ్‌పీ, నాంగ్వా తదితర 12 ప్రాంతాల్లో నిర్ణ యించిన సరిహద్దులు వివాదాస్పదమయ్యాయి. తమకు న్యాయబద్ధంగా చెందాల్సిన ప్రాంతాలను అస్సాంలోనే ఉంచారన్నది మేఘాలయ ఆరోపణ. ఈ కారణంగానే అది అస్సాం పునర్విభజన చట్టం 1972ని సవాల్ చేస్తూ న్యాయస్థానానికి ఎక్కింది. అటు అస్సాం సైతం మేఘాలయ కోరు తున్న స్థానాలు బ్రిటిష్ కాలంనుంచే తమ ప్రాంత అధీనంలో ఉండేవని వాదిస్తూ వస్తోంది. అస్సాంకు కేవలం మేఘాలయతో మాత్రమే కాదు... నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం లతో కూడా సరిహద్దు వివాదాలున్నాయి. ఆ వివాదాలు అనేకసార్లు హింసకు దారితీశాయి. ఇంత క్రితం ఈశాన్య రాష్ట్రాలను ఏలే ముఖ్యమంత్రుల్లో చాలామంది కాంగ్రెస్ వారే అయినా, కేంద్రంలో ఆ పార్టీ నేతృత్వంలోనే చాన్నాళ్లు కేంద్ర ప్రభుత్వాలు కొనసాగినా వివాదాల పరిష్కారానికి అవి ఏమాత్రం తోడ్పడలేదు. పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఉద్రిక్త ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగా లను దించడం, ఉద్యమించే పౌరులపై అణచివేత చర్యలు ప్రయోగించడం మినహా చేసిందేమీ లేదు. అందువల్లే గత యాభైయ్యేళ్లుగా సరిహద్దు సమస్యలు సజీవంగా ఉంటున్నాయి. చొరవ, పట్టుదల, చిత్తశుద్ధి, ఓపిక ఉండాలేగానీ పరిష్కారం కాని సమస్యలంటూ ఉండవు. ఎక్కడో ఒకచోట ప్రారంభిస్తే వివాదాలపై అన్ని పక్షాలకూ అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చు కునే విశాల దృక్ప థాన్ని ప్రదర్శిస్తే, స్వరాష్ట్రంలో ఆందోళన చెందుతున్నవారిని ఒప్పించగలిగితే సమస్యలు పటాపంచ లవుతాయి. కానీ ఆ చొరవేది? ఈశాన్య రాష్ట్రాలు భౌగోళికంగా చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో సరిహద్దులను పంచుకుంటాయి. మిలిటెంట్ సంస్థలు ఆ దేశాల సరిహద్దుల వద్ద ఆశ్రయం పొందుతూ ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ దాడులకు దిగడం రివాజు. ప్రభుత్వాలు తమ సమ యాన్నంతా శాంతిభద్రతలకే వెచ్చించే పరిస్థితులుండటం మంచిది కాదు. అందుకే ఆలస్యంగానైనా అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదరడం సంతోషించదగ్గది. అయితే ఇప్పుడు కుదిరిన ఒప్పందంతోనే అస్సాం, మేఘాలయ మధ్య ఉన్న వివాదాలన్నీ సమసిపోతాయని భావించలేం. మొత్తం 12 అంశాలకు సంబంధించి వివాదాలుంటే ఇప్పుడు ఆరింటి విషయంలో ఒప్పందం కుదిరింది. రాజీ కుదిరిన ప్రాంతాలు మొత్తం సరిహద్దులో 70 శాతం. మిగిలిన 30 శాతంలో 36 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంది. అయితే ఈ విషయమై అస్సాంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు దాదాపు అన్ని పార్టీలూ ప్రభుత్వ ముసా యిదాపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ‘ఇచ్చిపుచ్చుకునే’ పేరుతో మేఘాలయకు ఉదారంగా ఇస్తున్నదే ఎక్కువనీ, ఆ రాష్ట్రం మాత్రం బెట్టు చేస్తున్నదనీ ఆ పార్టీలు విమర్శించాయి. అయితే అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు ఒకటి గుర్తుంచుకోవాలి. సమస్యను నాన్చుతూ పోవడం వల్ల అవి మరింత జటిలమవుతాయి. ఏళ్లు గడిచేకొద్దీ కొరకరాని కొయ్యలుగా మారతాయి. ఒకపక్క బ్రహ్మపుత్ర నది ఏటా ఉగ్రరూపం దాలుస్తూ జనావాసాలను ముంచెత్తుతుంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈనాటికీ మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. అక్కడ తగినన్ని పరిశ్రమలు లేవు. యువకులకు ఉపాధి అవకాశాలు కూడా తక్కువ. ఆ ప్రాంత అభివృద్ధికంటూ చేసే వ్యయంలో సామాన్యులకు దక్కేది స్వల్పమే. ఈ పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండటం మంచిది కాదు. ఇప్పుడు కుదిరిన ఒప్పందం ఎలాంటి అడ్డంకులూ లేకుండా సవ్యంగా సాగిపోవాలనీ, ఇతర అంశాలపై కూడా సాధ్యమైనంత త్వరగా రెండు రాష్ట్రాలూ అంగీకారానికి రావాలనీ ఆశించాలి. నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం సైతం సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇదే మార్గంలో కృషి చేస్తే ఈశాన్యం ప్రశాంతంగా మనుగడ సాగించగలదు. -
50 ఏళ్ల వివాదానికి చరమగీతం
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా అపరిష్కరితంగా ఉన్న సరిహద్దు వివాదానికి అసోం, మేఘాలయ రాష్ట్రాలు చరమ గీతం పాడాయి. 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సరిహద్దు వివాదాల పరిష్కారానికి సంబంధించిన చారిత్రక ఒప్పందంపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖతో పాటు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారం ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఒప్పందంపై ఇరువురు ముఖ్యమంత్రులు సంతకాలు చేయడాన్ని ‘చరిత్రాత్మక రోజు’గా వర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారమైందని వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలో శాంతి, సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధిపై దృష్టి సారించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. సామరస్య పరిష్కారం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న 884.9 కిలోమీటర్ల సరిహద్దులో ఆరు చోట్ల సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివాదాన్ని ఈ ఒప్పందం పరిష్కరించనుంది. ఈ ఆరు ప్రాంతాల్లో 36 గ్రామాలు ఉండగా.. 36.79 చదరపు కిలోమీటర్ల వివాదానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం అసోం 18.51 చదరపు కి.మీ. ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకుని మిగిలిన 18.28 చదరపు కి.మీ. ప్రాంతాన్ని మేఘాలయకు ఇస్తుంది. (క్లిక్: గూర్ఖాల్యాండ్ డిమాండ్‌ను వదిలిన మోర్చా) 50 ఏళ్ల వివాదం 1972లో అస్సాం నుంచి మేఘాలయను విభజించినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడంతో సమస్య పరిష్కారమైంది. కాగా, అసోం సీఎంతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాలకు మేఘాలయ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. (క్లిక్: యోగి ఆదిత్యనాథ్ వద్దే హోంశాఖ) -
కప్పల తక్కెడ!
భిన్న ధ్రువాలు కలవవు అని సాధారణ సూత్రం. కానీ, సిద్ధాంతాలకు తిలోదకాలిస్తే, రాజకీయాలలో ఎవరైనా ఎవరితోనైనా కలిసిపోవచ్చని మరోసారి రుజువైంది. అధికారమే పరమావధిగా అన్ని తేడాలూ పక్కన పెట్టేస్తే, అందరూ కలసి ఏక ధ్రువ రాజకీయం చేయదలిస్తే ఏమవుతుంది? ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో అదే అయ్యింది! మేఘాలయలోని కాంగ్రెస్‌లో మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేలూ మంగళవారం నాడు బీజేపీ సమర్థిస్తున్న ‘మేఘాలయ డెమోక్రాటిక్ అలయన్స్’ (ఎండీఏ)లో చేరారు. దీంతో, ఒకప్పుడు 17 మంది ఎమ్మెల్యేలతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇప్పుడక్కడ ఖాళీ అయిపోయింది. ఆ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఒక్కటే అసెంబ్లీలో ప్రతిపక్షం జాగాలో మిగిలింది. స్థానిక కారణాలు ఏమైనా, బద్ధ శత్రువులనుకున్న కాంగ్రెస్, బీజేపీలు కలసిన విచిత్రమైన పరిస్థితి. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) సారథ్యంలోని అధికార కూటమిలో చేరామే తప్ప, కాంగ్రెస్‌లోనే ఉన్నామని కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకురాలైన అంపరీన్ లింగ్డో అంటున్నారు. సైద్ధాంతిక బద్ధవిరోధి బీజేపీ సమర్థిస్తున్న ఆ కూటమి ప్రభుత్వంలో చేరడానికి సరైన కారణం కాంగ్రెస్ నేతల వద్ద కనిపించదు. పైకి మాత్రం ప్రజాప్రయోజనాల రీత్యా, రాష్ట్రాన్ని కలసికట్టుగా ముందుకు తీసుకుపోవడానికి వీలుగా ప్రభుత్వానికి చేదోడుగా నిలిచేందుకే ఈ పని చేశామంటున్నారు. ఆ మాటే మంగళవారం నాటి ప్రభుత్వ సమర్థన లేఖలో రాసిచ్చారు. కానీ, అధికారమే పరమావధి అయిన రోజుల్లో ప్రతిపక్ష స్థానంలోని పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి, విరోధి పంచన ఉన్న అధికార కూటమిలో ఎందుకు కలిసి ఉంటారో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. మేఘాలయ అసెంబ్లీలో మొత్తం 60 మంది సభ్యులుంటారు. గడచిన 2018 ఎన్నికలలో కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలిచింది. తర్వాత ఆ సంఖ్య 17కు తగ్గింది. అసెంబ్లీలో ఆ పార్టీయే ప్రతిపక్షం. కానీ, తర్వాత ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా సహా 12 మంది ఎమ్మెల్యేలు గత నవంబర్‌లో టీఎంసీలోకి ఫిరాయించారు. అలా అప్పటి నుంచి కాంగ్రెస్‌లో అయిదుగురే మిగిలారు. తాజాగా కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకురాలైన అంపరీన్ లింగ్డో సహా అయిదుగురూ తమ ప్రతిపక్ష పాత్రకు గుడ్‌బై చెప్పేశారు. అధికార కూటమికి జై కొట్టేశారు. గత నవంబర్ నాటి ఫిరాయింపులే ఓ పెద్ద ఎదురుదెబ్బ అనుకుంటే, ఇప్పుడు మిగిలిన కొద్దిమందీ అధికార కూటమిలో చేరడంతో ఈ ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ పుట్టి మునిగింది. అయితే, ఈ పరిణామం మరీ అనూహ్యమేమీ కాదు. సాక్షాత్తూ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకురాలే పార్టీని వీడి, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని ఎన్పీపీలో చేరతారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. కాంగ్రెస్‌ను వీడి, ఎన్పీపీలో చేరిన భర్త బాటలోనే ఆమె కూడా వెళతారన్న మాట బయటకొచ్చింది. ఆమె మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తూ వచ్చారు. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన తాను అర్ధరాత్రి దొంగలాగా పారిపోననీ, ఈ పర్యాయం ఇక్కడే కొనసాగుతాననీ, తర్వాత సంగతి తర్వాతనీ చెబుతూ వచ్చారు. తీరా వారం తిరగక ముందే సహచరులతో సహా వెళ్ళి, అధికార కూటమిలో కలిసిపోయారు. సాంకేతికంగా మాత్రం తాము కాంగ్రెస్ పార్టీనే అంటున్నారు. మేఘాలయాలో పార్టీలో మిగిలిన పెద్ద పేర్లయిన ఆమె, ఆమె సహచర ఎమ్మెల్యే సాక్మీ కూడా ప్లేటు తిప్పడంతో కాంగ్రెస్ కుండ ఖాళీ అయింది. ‘ఈ కాలమాన పరిస్థితుల్లో మమ్మల్ని మేమే కాపాడుకోవాలి. మేము అయిదుగురం ఒకరి నొకరం రక్షించుకుంటున్నాం’ అన్నది అంపరీన్ మాట. అధికారానికి దూరంగా ఉన్నవేళ అనేక రాజకీయ, ఆర్థిక అనివార్యతలు ఆమెనూ, ఆమె సహచరులనూ తాజా నిర్ణయం వైపు నెట్టాయని పరిశీలకుల ఉవాచ. చూపరులకే కాదు, రెండువైపులా పార్టీ పెద్దలకూ ఈ తాజా పరిణామం కొంత ఇబ్బందికరమే. ‘సింహం, లేడీపిల్ల ఒకేచోట, ఒకేసారి నీళ్ళెలా తాగుతాయి’ అని మేఘాలయ బీజేపీ ఛీఫ్ మాట. ‘ఇది దిగ్భ్రాంతికరం’ అన్నది రాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ వ్యాఖ్య. నిజానికి, చరిత్ర చూస్తే ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కలిసి అడుగులేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చూసినదే. కాకపోతే, ఈసారి కొంత ఎక్కువ రచ్చ జరుగుతోంది. సిద్ధాంతాలకు తిలోదకాలివ్వడంలో అన్ని పార్టీలదీ ఒకే తంతు. అందరికీ అధికారమే పరమా వధి. అవకాశవాద రాజకీయాల వేళ పొరుగునే ఉన్న మిజోరమ్‌లో సైతం చక్మా స్వయంప్రతిపత్తి జిల్లా కౌన్సిల్లో అధికారం కోసం కాంగ్రెస్‌తో బీజేపీ చేతులు కలిపింది. మేఘాలయలో నైతికత గురించి మాట్లాడుతూ వచ్చిన తృణమూల్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని మరీ, రాష్ట్రంలో కాస్తంత పట్టు చిక్కించుకుంది. వచ్చే ఫిబ్రవరిలో నాగాలాండ్, త్రిపురలతో పాటు సరిహద్దు రాష్ట్రం మేఘాలయలోనూ ఎన్నికలు. ఒకప్పుడు తాము పాలించిన రాష్ట్రాల్లో అధికారానికి దూరమయ్యాక కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. ఫిరాయింపులు పెరుగుతున్నాయి. తాజాగా ఎన్నికలు జరుగుతున్న గోవా, మణిపూర్ లాంటి చోట్ల పార్టీ మారబోమంటూ అభ్యర్థులతో ముందే ఒట్టు వేయించుకొంటున్న విచిత్ర పరిస్థితి. ఎవరు ఎటువైపు అయినా గెంతేసే ఈ కప్పల తక్కెడ సంస్కృతి ప్రజాస్వామ్యానికి శోభస్కరం కాదు. ప్రతిపక్షాలు అధికారం కోసం బాధ్యత విస్మరించినా, ప్రజా శ్రేయస్సంటూ ప్రతిపక్షమే లేకుండా పాలన చేద్దామని అధికారపక్షం అనుకున్నా చరిత్ర క్షమించదు! -
మేఘాలయలో కాంగ్రెస్ ఖాళీ.. 21 మంది ఎమ్మెల్యేల నుంచి జీరోకు..
షిల్లాంగ్: మేఘాలయలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు గిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ మద్దతిస్తున్న అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి (ఎండీఏ)లో చేరారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టు అయింది. అంతకముందు వీరంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని కూటమిలో చేరుతున్నట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు లేఖ అందించారు. కాంగ్రెస్‌ను వీడిన వారిలో ఆపార్టీ శాసనసభాపక్షనేత అంపరీన్ లింగ్డోతోపాటు.. మేరల్‌బోర్న్ సీయొం, కింఫా ఎస్ మార్బనియాంగ్, మేహెన్ర్డోరాప్‌సాంగ్, పిటీ సాక్మీలు ఉన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్టీ మేఘాలయ ప్రజాస్వామ కూటమిలో చేరాలని నిర్ణయించినట్టు లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, ఇదే లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా పంపించారు. తాము అధికార కూటమిలో చేరినప్పటికీ కాంగ్రెస్ సభ్యులుగానే కొనసాగుతామని సీఎల్పీ నేత అంపరీన్ లింగ్డో చెప్పడం గమనార్హం. ముఖ్యమత్రితో కలిసి అయిదురు ఎమ్మెల్యే దిగిన ఫోటోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. చదవండి: హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు అయితే తాజా పరిణామంతో ప్రస్తుతం మేఘాలయలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. 60 మంది సభ్యులున్న శాసనసభలో నవంబరు వరకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాతో సహా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. మిగిలిన అయిదుగురు ఇప్పుడు ఎండీఏలో చేరారు. దీంతో మేఘాలయ అసెంబ్లీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. చదవండి: మోదీజీ మీ విధానాన్ని మార్చుకోండి!....అప్పుల బాధలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వ్యాపారి! -
ఈశాన్యంలో ఆశాదీపం కాన్రాడ్ కె సంగ్మా
షిల్లాంగ్: తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం, అంతర్జాతీయ యూనివర్సిటీల్లో నేర్చుకున్న బిజినెస్ పాఠాలు, గిరిజనులకు సేవ చేయాలన్న సంకల్పంతో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా ఈశాన్య ప్రాంతంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తన తండ్రి, లోక్‌సభ దివంగత స్పీకర్ పీఏ సంగ్మా వేసిన బాటలో నడుస్తూ ఎన్పీపీని ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ పార్టీ స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నారు. మణిపూర్ గిరిజనుల హక్కులను కాపాడడం కోసం అవతరించిన పార్టీ, ఇప్పుడు ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయి అధికారాన్ని దక్కించుకోవాలన్నది సంగ్మా ఆశ. సంగీతం అంటే చెవి కోసుకుంటారు. గిటార్, పియానో వాయిస్తారు. ప్రయాణాలు చేయడమంటే ఆయనకు అమితమైన ఆసక్తి. గిరిజనులకు ఆశాదీపంలా మారిన తమ పార్టీని వాళ్లే ఆదుకుంటారన్న వ్యూహంతోనే ముందుకు వెళుతున్నారు. బీజేపీ సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి సొంతంగా పోటీకి దిగి మణిపూర్‌లోనూ అధికారం దక్కించుకోవడానికి తహతహలాడుతున్నారు. మేఘాలయా సీఎంగా ఉంటూనే మణిపూర్‌లో కూడా పార్టీని కింగ్‌మేకర్‌గా నిలపాలని ఆరాటపడుతున్నారు. ► పీఏసంగ్మా దంపతులకు 1978వ సంవత్సరం, జనవరి 27న మేఘాలయలోని తురాలో జన్మించారు. ► ఢిల్లీలో పెరిగారు. సెయింట్ కొలంబియాలో ప్రాథమిక విద్య అభ్యసించారు. ► అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి బీబీఏ, లండన్ ఇంపీరియల్ కాలేజీ నుంచి ఎంబీఏ చేశారు. ► డాక్టర్ మెహతాబ్ అజితోక్‌ను పెళ్లాడిన సంగ్మాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ► తండ్రి పీఏ సంగ్మా ఎన్సీపీలో ఉన్నప్పుడు ఆయన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేవారు. ► 2003లో తొలిసారిగా ఎన్సీపీ నుంచి సెల్సెల్లా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 182 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ► 2008లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆర్థిక, విద్యుత్, ఐటీ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ► ఎన్నికల్లో విజయం సాధించిన పదిరోజుల్లోనే ఆర్థిక మంత్రిగా మేఘాలయ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సాధించారు. ► 2009–2013 వరకు మేఘాలయలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ► 2016 మార్చిలో సంగ్మా మరణానంతరం ఎన్పీపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది తుర లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఉపఎన్నికల బరిలోకి దిగి 1.92 లక్షల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ► 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచినప్పటికీ ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసి మేఘాలయ సీఎం అయ్యారు. ► పీఏ సంగ్మా ఫౌండేషన్ చైర్మన్‌గా విద్య, పర్యావరణ రంగాల్లో కృషి చేస్తున్నారు. ► కిందటి మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన ఎన్పీపీ నాలుగు స్థానాలను దక్కించుకుంది. ► ముఖ్యమంత్రి ఎన్.బైరన్ సింగ్‌పై వ్యతిరేకతతో ఒకానొక దశలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని కూడా అనుకున్నారు కాన్రాడ్ సంగ్మా. ► ఆ తర్వాత బీజేపీ హైకమాండ్‌తో రాజీకొచ్చిన సంగ్మా ఈసారి కూడా తనకున్న చరిష్మా మీదే పార్టీకి అత్యధిక స్థానాలు లభించేలా వ్యూహాలు పన్నుతున్నారు. ► రాష్ట్రంలో ఎన్పీపీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న సంగ్మా మణిపూర్ ఎన్నికల భారం అంతా ఒంటి చేత్తో మోస్తున్నారు. ► హిందూ మైటీ, ముస్లిం మైటీ–పంగల్ వర్గాలకు ఎస్టీ హోదా, నాగాల సమస్యలకు శాంతియుత పరిష్కారం, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణ వంటి అంశాలపై సంగ్మా అలుపెరుగని పోరాటమే చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
కరోనా బారినపడిన మరో సీఎం.. హోం ఐసోలేషన్‌లో..
షిల్లాంగ్: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని, ఏ రంగాల వారిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు కాన్రాడ్ సంగ్మా ట్విటర్‌ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కాగా, కాన్రాడ్ సంగ్మా 2020లోను కరోనా బారిన పడ్డారు. I have tested positive for COVID-19. I am isolating myself for the required time. I have mild symptoms. All those who came into contact with me last few days are requested to observe their symptoms and test if necessary. — Conrad Sangma (@SangmaConrad) January 21, 2022 చదవండి: ఇక నుంచి కరోనాను నిమిషాల్లో గుర్తించవచ్చు.. ఎలాగంటారా.. -
భారత్‌లో రైతుల ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే..!
భారత్‌లోని ధనిక, పేద రాష్ట్రాల జాబితాను నీతి ఆయోగ్ ఇటీవలే విడుదల చేసింది. దేశంలోని ఐదవ పేద రాష్ట్రంగా, ఈశాన్య భారతంలోని పేద రాష్ట్రంగా మేఘాలయ నిలిచింది. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో రైతుల ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన ఒక నివేదికలో మేఘాలయ అదరగొట్టింది. భారత్‌లో వ్యవసాయం ద్వారా వచ్చే సగటు నెలవారీ ఆదాయంలో మేఘాలయ తొలిస్థానంలో నిలిచింది. పంజాబ్ రెండో స్థానంలో, హర్యానా మూడో స్థానంలో నిలిచాయి. మేఘాలయ రైతుల సంపాదన ఎంతంటే..! ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మేఘాలయ రైతులు అత్యధిక సగటు రోజువారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మేఘాలయ రైతులు సగటున నెలకు రూ. 29,000 సంపాదిస్తుండగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు నెలకు వరుసగా రూ. 26,000, రూ. 22,000 ఆర్జిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఇదిలా ఉండగా... జార్ఖండ్, ఒడిశా ,పశ్చిమ బెంగాల్‌కు చెందిన రైతులు తక్కువ మేర నెలవారీ ఆదాయాలను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ మూడు రాష్ట్రాల రైతులు సగటున నెలకు రూ. 4,000, రూ. 5,000 , రూ. 6,000 కంటే తక్కువగా సంపాదిస్తున్నారని లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించింది. తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే..తెలంగాణలోని రైతులు సగటున నెలకు రూ. 9403, ఆంధ్రప్రదేశ్ రైతులు నెలకు రూ. 10480 మేర సంపాదిస్తున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా రైతుల సగటు ఆదాయం దాదాపు రూ. 10,000గా నిర్ధారించబడింది. ఈ డేటాను ‘ అగ్రికల్చర్ హౌజ్ హోల్డ్స్ అండ్ ల్యాండ్ అండ్ లైవ్‌స్టాక్స్ హోల్డింగ్స్ ఆఫ్ రూరల్ హౌజ్‌హోల్డ్స్’ పేరుతో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) సర్వే చేసింది.ఈ డేటా 2019 సంవత్సరానికి సంబంధించినది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే వ్యూహంతో ప్రభుత్వం పనిచేస్తోందని లోక్‌సభలో తెలిపారు. చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో తెలుసా? -
మేఘాలయలో కాంగ్రెస్‌కు ఝలక్!
న్యూఢిల్లీ: నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో తాజాగా తలబొప్పి కట్టింది. అసెంబ్లీలో పార్టీకి ఉన్న 18 మంది ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం ముకుల్ సంగ్మాతోతో సహా ఏకంగా 12 మంది బుధవారం తృణమూల్ కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. మేఘాలయ అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న ముకుల్ సంగ్మా కొంతకాలంగా కాంగ్రెస్ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. మేఘాలయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విన్సెంట్ హెచ్. పాలాను నియమించినప్పటి నుంచి ముకుల్ సంగ్మాకు ఆయనతో పొసగడం లేదు. తన అభిప్రాయానికి విలువివ్వకుండా విన్సెంట్ నియామకం జరిగిందనేది ఆయన కినుక. చివరకు సంగ్మా టీఎంసీ గూటికి చేరారు. 2023లో జరగనున్న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే టీఎంసీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల వ్యూహకర్త, మమతా బెనర్జీకి సన్నిహితుడైన ప్రశాంత్ కిశోర్‌కు చెందిన బృందం కొంతకాలంగా షిల్లాంగ్‌లో మకాం వేసి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సర్వే చేస్తోంది. ఇప్పుడు ముకుల్ సంగ్మా చేరికతో టీఎంసీ ఒక్కసారిగా బలపడినట్లైంది. -
పేర్లు లేని గ్రామం.. మరి ఎలా పిలుచుకుంటారో తెలుసా!
సాధారణంగా ఎవరినైనా పిలవాలంటే వారి పేర్లతో పిలుస్తాం. అది వాళ్ల సొంత పేరు కావచ్చు లేదా ముద్దు పేరు కావచ్చు. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే అభిమానులు పిలుచుకునే పేర్లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది పేరు లేకుండా ఓ మనిషిని పిలవగలమా అంటే కుదురుతుంది అంటున్నారు మేఘాలయలోని ఓ గ్రామ నివాసితులు. అదెలా అనుకుంటున్నారా.. ఎందుకుంటే వాళ్లు ఆ ప్రాంతంలో పేర్లు లేకుండానే కేవలం విజిల్స్‌తోనే కమ్యూనికేట్ చేసుకుంటారట! అసలా కథేంటంటే.. ఆ ఊరి పేరు కాంగ్థాన్. ఆ ఊరిలో సుమారు 700 వందలకు పైగా ప్రజలు నివసిస్తుంటారు. మేఘాలయాలోని ఈస్ట్ ఖాసి జిల్లాలో ఉంది. ఆ ప్రాంత ప్రజలకు ఈల వేయడం ఆచారం. అది గత నెలనో లేదా గత సంవత్సరం నుంచి పాటిస్తోంది కాదు వారి పూర్వీకులనుంచి సంప్రదాయంగా వస్తోందట. అసలు కొత్తవాళ్లు ఆ ఊరికి వెళ్తే వాళ్ల ఆచారాలు చూసి ఆశ్చర్యపోక మానరు. ఎందుకంటే సీటీ (విజిల్), పక్షుల అరుపులు, సినిమా పాటల్లోని ట్యూన్ల ఆధారంగా పిల్లలకు పేర్లు పెడుతుంటరు ఇక్కడ. అందుకే ఆ గ్రామాన్ని విజిల్ గ్రామం అని పిలుస్తారు. ఇక్కడి గ్రామస్తులు ఒకరినొకరు ప్రత్యేకమైన రాగంతో పిలుచుకుంటారు. ఒకరినొకరు పిలుచుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో రాగంఉంటుందట. గ్రామస్తులు ఈ ట్యూన్‌ని ‘జింగ్‌ర్‌వై లాబీ’ అని పిలుస్తారు, అంటే తల్లి ప్రేమ పాట అని అర్థం. -
Neha Nialang: 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్‌గా... సహజమైన పద్ధతిలో
Neha Nialang Success Story In Telugu: ఇంట్లో ఆడపిల్ల ఉందంటే అమ్మకు ఇంటిపనుల్లో చేదోడువాదోడుగా ఉంటుంది. ఓ నాలుగురోజులు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా పిల్ల చూసుకుంటుందన్న భరోసా కూడా కల్పిస్తారు కొందరమ్మాయిలు. నేహ నియాలంగ్ భరోసాతోనే ఆగిపోకుండా, తనకు తెలిసిన వంటల తయారీతో ఏకంగా వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్నప్పటినుంచి ఇంటి, వంట పనుల్లో చూరుకుగా పాల్గొనే నేహ ఇంట్లో వాళ్ల కోసం సరికొత్త వంటలు వండడమేగాక, వాటిని బయట మార్కెట్లో విక్రయిస్తూ.. 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి, మేఘాలయ రుచులను ఇతర ప్రాంత వాసులకు అందిస్తోంది. మేఘాలయలోని జోవైకు చెందిన నేహానియాలంగ్ అందరి అమ్మాయిల్లానే ఇంట్లో పనులను ఇలా చూసి అలా పట్టేసింది. అయితే మేఘాలయలో అనేక కుటుంబాలు ఒక దగ్గర కలిసి నచ్చిన వంటకాలు వండుకుని కలసి తినే సంప్రదాయం ఉంది. దీంతో అడపాదడపా జరిగే గెట్ టు గెదర్‌లలో వండే వంటకాలను నేహ ఆసక్తిగా నేర్చుకునేది. ఇలా నేర్చుకుంటూనే పదహారేళ్లు వచ్చేటప్పటికీ ఇంట్లో అందరికీ వండిపెట్టే స్థాయికి ఎదిగింది. ఇంట్లో తరచూ వంటచేస్తూ ఉండడం వల్ల ఏం ఉన్నాయి ఏం లేవు అనేది జాగ్రత్తగా గమనించేది. సరుకులు నిండుకుంటే వెంటనే మార్కెట్‌కు వెళ్లి తెచ్చేది. అయితే కొన్నిసార్లు ఇంట్లో ఎక్కువగా వాడే జామ్ వంటివి దొరికేవి కావు. కానీ అవి లేకపోతే ఇంట్లో నడవదు. చపాతీ, రోస్టెడ్ బ్రెడ్‌లోకి జామ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. జామ్ దొరకనప్పుడు.. జామ్‌ను ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది తనకు. దీంతో ఇంట్లో ఉన్న పండ్లతో జామ్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ జామ్‌లు ఇంట్లో వాళ్లకు నచ్చడంతో రకరకాల జామ్‌లు తయారుచేసేది. నేహ తయారు చేసిన జామ్‌ల రుచి నచ్చిన కుటుంబసభ్యులు.. అమ్మకం మొదలు పెడితే ఇవి బాగా అమ్ముడవుతాయి’’ అని చెప్పేవాళ్లు. నేహ మాత్రం ఆ మాటలకు నవ్వేదేగానీ, సీరియస్‌గా తీసుకునేది కాదు. వృథా కానివ్వద్దని.. లాక్ డౌన్ సమయంలో చాలా రకాల పండ్లు వృథా అయ్యేవి. ప్రభుత్వ నిబంధన ప్రకారం నిర్దేశిత సమయాల్లోనే పండ్లు కూరగాయలు విక్రయించాలి. ఆ సమయంలోపు అమ్మకపోతే, అప్పటికే బాగా పండిన పండ్లు మగ్గిపోయి వృథా అయిపోయేవి. మార్కెట్‌కు వెళ్లిన ప్రతిసారి నేహ ఈ విషయాన్ని గమనిస్తుండేది. ఒకసారి ఓ రైతు పండ్లను పారబోయడం చూసింది. ఎందుకు పారబోస్తున్నావని అడిగితే..‘‘మార్కెట్ సమయం అయిపోయింది. ఇవి ఇలా ఉంటే రేపటికి ఇంకా మగ్గిపోతాయి. ఎలాగూ అమ్ముడు కావు. ఈ గంపను అద్దెకు తీసుకొచ్చాను. ఈరోజే యజమానికి ఇచ్చేయాలి’’ అని చెప్పాడు. అతని మాటలు నేహ మనసుని తట్టిలేపాయి. ‘ఎంతో చెమటోడ్చి పండిన పంట నేలపాలవుతోంది. ఈ పండ్లే వారి జీవనాధారంం అవి ఎటూగాకుండా పోతున్నాయి’ అనిపించింది తనకు. వీటిని వృథాగా పోనివ్వకుండా వీటితో ఏదైనా తయారు చేయాలనుకుంది. అనుకుందే తడవుగా మార్కెట్లో దొరికే పండ్లను కొని జామ్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. పండ్లు భారీగా లభ్యమవుతుండడంతో పెద్ద మొత్తంలో జామ్‌లు తయారు చేసేది. దలాడే ఫుడ్స్.. నేహ తయారుచేసిన జామ్‌లు ముందుగా స్థానికంగా విక్రయించింది. వాటికి మంచి స్పందన లభించడంతో ‘దలాడే ఫుడ్స్’ ప్రారంభించి భారీ స్థాయిలో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో విక్రయిస్తుండేది. దలాడే అనేది మేఘాలయలో మాట్లాడే ఖాసీ భాష పదం. దలాడే అంటే ‘మనంతట మనమే’ అని అర్థం. రైతులు ఉత్పత్తి చేసిన దేనిని కూడా వ్యర్థంగా పోనివ్వకుండా..పండ్ల నుంచి తేనె వరకు అన్నింటినీ దలాడే ద్వారా విక్రయిస్తోంది నేహ. ఏడాది తర్వాత స్థానికంగా దొరికే తేనె, మేఘాలయలో ప్రముఖంగా లభించే లకడాంగ్ పసుపు, రుచికరమైన చట్నీలు, జీడిపప్పు బటర్, తేనెతో చేసిన మసాలాల వంటి వాటిని విక్రయిస్తోంది. ఎటువంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు వాడకుండా సహజసిద్ధమైన పద్ధతిలో మేఘాలయ రుచులను వివిధ ప్రాంతాలకు అందిస్తోంది. ‘‘కేవలం బీఎస్సీ బయోకెమిస్ట్రీ చదివిన నాకు ఈ వ్యాపారం కాస్త కష్టంగానే ఉంది. అందులోనూ వ్యాపారం అంటే మామూలు విషయం కాదు. ఈ రంగంలో అనుభవం ఉన్న కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి వంట మీద ఆవగాహనతోనే ఈ రంగంలోకి దిగాను. అందుకే ఒక్కొక్క అంశాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను. మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత అందించే కార్యక్రమాల్లో పాల్గొని తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుంటున్నాను’’ అని నేహ చెబుతోంది. -
ఇదేం వింత.. పడవ గాల్లో ఎగరడం ఏంటి..!?
Meghalaya Cleanest Umngot River Images: ఇక్కడ ఉన్న ఫోటో చూడగానే ఏమనిపిస్తుంది.. పడవ ఏంటి గాల్లో ఎగురుతుంది.. ఇదేలా సాధ్యం అని ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి బాహుబలి చిత్రం గుర్తుకు వస్తుంది. కాసేపు పరీక్షగా చూస్తే.. ఆశ్చర్యంతో మన కళ్లు పెద్దవి అవుతాయి. అబ్బ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో కదా.. ఎక్కడబ్బా.. ఇంత పరిశుభ్రమైన.. స్వచ్ఛమైన నది.. ఓ సారి వెళ్లి చూసి వస్తే బాగుండు అనిపిస్తుంది. నది అడుగు భాగంలో ఉన్న ప్రతి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత స్వచ్ఛంగా ఉందంటే.. పడవ ఏదో అద్దం మీద ఉన్నట్లుంది. ఇంత స్వచ్ఛమైన నది ఏ దేశంలో ఉందో కదా అని ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంత అందమైన, పరిశుభ్రమైన, స్వచ్ఛమైన నది మన దేశంలోనే ఉంది. ఈ ఫోటోని కేంద్ర జలశక్తి వనరుల శాఖ ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: లారీ ఎక్కిన పడవ.. ఆశ్చర్యంగా ఉందే!) కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం తన ట్విటర్లో ఈ నది ఫోటో షేర్ చేసింది. ‘‘ప్రపంచలోని అత్యంత స్వచ్ఛమైన నదుల్లో ఇది ఒకటి. భారతదేశంలోనే ఉంది. మేఘాలయ రాష్ట్రం, షిల్లాంగ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉంగోట్ నది. నదిలో పడవ మీద వెళ్తున్న ఫోటో చూస్తే.. అది గాల్లో తేలుతుందేమో అనిపిస్తుంది. ఈ నదిలో నీరు చాలా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉంటాయి. దేశంలోని నదులన్ని ఇలా ఉండాలని ఆశిస్తున్నాను. హ్యాట్సాఫ్ మేఘలయ ప్రజలు’’ అంటూ ట్వీట్ చేసిన ఈ ఫోటో గంటల వ్యవధిలోనే వైరలయ్యింది. (చదవండి: దుర్గం చెరువు: విదేశాల్లో ఉన్నామా అనే ఫీలింగ్!) ఇది చూసిన నెటిజనులు.. ‘‘భారత దేశంలో ఇంత స్వచ్ఛమైన నది ఉందంటే నమ్మబుద్ది కావడం లేదు.. యమునా నది ఎప్పుడు ఇంత సుందరంగా మారుతుంది... గంగా నది మాట ఏంటి.. ఏది ఏమైనా నదిని పదిలంగా కాపాడుకుంటున్న మేఘలాయ ప్రజలకు ధన్యవాదాలు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇప్పటి వరకు ఈ ఫోటోకి 19 వేలకు పైగా లైక్‌లు, 3 వేల రీట్వీట్లు వచ్చాయి. One of the cleanest rivers in the world. It is in India. River Umngot, 100 Kms from Shillong, in Meghalaya state. It seems as if the boat is in air; water is so clean and transparent. Wish all our rivers were as clean. Hats off to the people of Meghalaya. pic.twitter.com/pvVsSdrGQE — Ministry of Jal Shakti 🇮🇳 #AmritMahotsav (@MoJSDoWRRDGR) November 16, 2021 చదవండి: సినిమా సెట్టింగో.. స్పెషల్ ఎఫెక్టో అనుకుంటున్నారా..! -
‘సెక్రెటరీ నా దగ్గరకు వచ్చి రెండు సంతకాలు చేస్తే 300 కోట్లు వస్తాయన్నాడు’
న్యూఢిల్లీ: తన జీవితంలో అవినీతితో ఎప్పుడూ రాజీ పడలేదని అటువంటి పరిస్థితే వస్తే పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధపడినట్లు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. కాగా సత్యపాల్ మాలిక్ ఆగష్టు 21, 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. సంవత్సరం తరువాత అక్టోబర్ 2019లో గోవాకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన మేఘాలయకు గవర్నర్‌గా పని చేస్తున్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను జమ్మూ కాశ్మీర్‌కు పోస్ట్ అయిన వెంటనే, తన టేబుల్‌పై రెండు ఫైళ్లు వచ్చాయని తెలిపారు. అవి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆరెస్సెస్‌తో అనుబంధం ఉన్న వ్యక్తికి చెందిన సంస్థలవి. కాకపోతే అందులో ఏదో స్కామ్ ఉందని తనకు తెలిసిందని, అందుకు ఆ రెండు ఒప్పందాలను రద్దు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆ ఫైల్‌లను క్లియర్ చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన సెక్రటరీ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. దీని వల్ల ఒత్తిళ్లు వస్తాయని కూడా కొందరు తెలపడంతో ఆ పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ విషయాన్నే అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలియజేయగా, తన నిర్ణయాన్ని ప్రధాని సమర్థించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. मेघालय के राज्यपाल प्रधानमंत्री की पोल खोल रहे हैं. जरूर देखा जाए pic.twitter.com/QnwQUiU8VK — Ranvijay Singh (@ranvijaylive) October 21, 2021 -
ఘోర రోడ్డు ప్రమాదం: నదిలో బోల్తా పడ్డ బస్సు
షిల్లాంగ్: మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తురా నుంచి షిల్లాంగ్ వెళ్తున్న బస్సు నోంగ్‌చ్రామ్ ప్రాంతంలోని రింగ్ది నదిలో ఒక్కసారిగా పడిపోయింది. బస్సులోని ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది ఉన్నారు. నాలుగు మృత దేహాలను వెలికి తీయగా, మరో రెండు మృత దేహాలు బస్సులోనే చిక్కుకొని ఉన్నాయి. చిక్కుకున్న మృతదేహాలతో పాటు మరికొంతమంది ప్రయాణికులను వెలికి తీయడానికి ఈస్ట్ గారో హిల్స్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. -
సీఎం నివాసంపై పెట్రో బాంబు దాడి
షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ లిబరేషన్ కౌన్సిల్(హెచ్ఎన్ఎల్సీ) మాజీ నేత చెరిష్‌స్టార్ఫీల్డ్ థాంగ్‌కీని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో.. హింసాత్మక ఘటనలు తలెత్తాయి. థాంగ్‌కీ మద్దతుదారులు.. కొన్ని చోట్ల ప్రభుత్వ వాహనాలపై దాడులు చేశారు. ఓ చోట పోలీస్ వాహనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అంతటితో ఆగక ఏకంగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. ప్రస్తుతం తన అధికారిక నివాసంలో ఉంటున్నారు. ఆందోళనకారలు 3 వ మైలు ఎగువ షిల్లాంగ్‌లోని లైమర్‌లోని ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం వద్ద ఈ దాడికి పాల్పడ్డారు. రెండు మోలోటోవ్ కాక్టైల్ బాటిళ్లను సీఎం నివాసంపై విసిరారు. వీటిలో మొదటి బాటిల్ ఇంటి ముందు భాగంలో పడగా.. రెండవది పెరడు వెనుకకు విసిరివేశారు. ఇది గమనించిన గార్డులు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటలనకు బాధ్యత వహిస్తూ.. మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. తనను హోం శాఖ నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ సీఎం కాన్రాడ్ సంగ్మాకు లేఖ రాశారు. ఇది ఈ కేసు విచారణ పారదర్శక సాగడానికి ప్రభుత్వ తీసుకన్న న్యాయపరమైన చర్యగా నిలుస్తుందని అన్నారు. ఘర్షణలకు కారణం ఏంటంటే.. 2018 లో లొంగిపోయిన చెస్టర్‌ఫీల్డ్ థాంగ్‌కీకి.. ఈ నెల లైతుంఖ్రా వద్ద చోటు చేసుకున్న పేలుడులో ఆయన పాత్రపై ఆధారాలు లభించడంతో ఆగస్టు 13 పోలీసులు అతని ఇంట్లో దాడులు నిర్వహించారు. అక్కడ మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావించారు. అయితే థాంగ్‌కీ పోలీసులపై కత్తితో దాడి చేయాలని చూశాడని.. ఈ క్రమంలో అతడిని ఎదుర్కొవడానికి జరిపిన కాల్పుల్లో థాంగ్‌కీ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఇక, ఈ ఘటనపై థాంగ్‌కీ కుటుంబ సభ్యులతో పాటు, మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. థాంగ్‌కీ అంత్యక్రియల్లో వందలాది మంది ఆయన మద్దతుదారులు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు విసిరారు. ఈ హింసాత్మక ఘటన నేపథ్యంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో కర్ఫ్యూ విధించారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుందని తెలిపారు. అలాగే నాలుగు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి.. 48 గంటల పాటు నిలిపివేస్తున్నట్టుగా చెప్పారు. ఇక మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. థాంగ్‌కీ మరణంపై విచారణకు ఆదేశించినున్నట్టు చెప్పారు. మరోవైపు ఈ ఘటనను మేఘాలయ మానవ హక్కుల స్పందించింది. సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. దీనిపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని కోరింది. -
కిలేడీ ఎత్తుగడ.. బ్యాంకు దోచేయడానికి ఏకంగా 3 రోజులు
షిల్లాంగ్ (మేఘాలయ): కూటి కోసం కోటి విద్యలనేది ఓ నానుడి. అయితే కొందరు అప్పనంగా కోట్లకు పడగెత్తాలనే అత్యాశతో చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడి కటకటాపాలవుతారు. తాజాగా మేఘాలయలోని బిష్ణుపూర్ శాఖ గ్రామీణ బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన ఓ కిలేడీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఓ 40 ఏళ్ల మహిళ బ్యాంకులో గత శుక్రవారం డబ్బులు జమ చేయడానికి వచ్చింది. అయితే బ్యాంకును దోచేయాలనే ఉద్దేశంతో లోపలే ఉండిపోయింది. శనివారం, ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులో దోపీడీకి అనువుగా బావించింది. తాను బ్యాంకు లోపల చిక్కుకున్నానని ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఇక ముందస్తు ప్రణాళికతో ఆమె కొన్ని ఆహార పదార్థాలను కూడా తన వెంట తెచ్చుకుంది. అయితే డబ్బు సంచుల మూటలు ఉంటాయేమో పట్టుకెళ్తాననే భ్రమలో ఉన్న ఆ మహిళ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు. సోమవారం బ్యాంకు మేనేజర్ లోపలికి అడుగుపెట్టినప్పుడు మహిళ అక్కడే ఉంది.. అని పోలీసులు పేర్కొన్నారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సదరు మహిళను అరెస్టు చేశారు. చదవండి: వాట్సప్ చూస్తోందని చెల్లిని చంపిన అన్న -
Lockdown: భారీ సడలింపులతో పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభన తగ్గుముఖం పట్టింది. రోజు నమోదయ్యే కేసులు క్రమేణా తగ్గుతున్నాయి. దీంతో రాష్ట్రాలు భారీ సడలింపులతో లాక్డౌన్ కొనసాగిస్తున్నాయి. ఈ మేరకు లాక్‌డౌన్‌ను జూన్ 14వ తేదీ వరకు పొడగిస్తూ ఢిల్లీ, తమిళనాడు, మేఘాలయ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే పేరుకు లాక్డౌన్ కానీ సడలింపులు భారీగా ఇచ్చారు. కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించగా.. కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ఆంక్షలు సడలిస్తూ ఉత్వర్వులు జారీ చేశాయి. ఇక మహారాష్ట్ర కూడా అన్‌లాక్ ప్రక్రియ మొదలుపెట్టనుంది. ఈ మేరకు సోమవారం నుంచి అన్‌లాక్‌కు ఐదంచెల వ్యూహాన్ని రచిస్తోంది. (చదవండి: తగ్గని కరోనా ఉధృతి: లాక్డౌన్ పొడగింపు) ఢిల్లీ ప్రస్తుతం లాక్డౌన్ ప్రభావంతో కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ మొదలుపెట్టారు. సరి బేసి విధానంలో సడలింపులు ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లోని మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ కొన్ని ఒకరోజు.. మరికొన్ని మరుసటి రోజు తెరచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దుకాణాలు, మార్కెట్లు తెరచుకోవచ్చని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ దుకాణాలు ఉదయం 10 నుంచి 8 గంటల వరకు తెరుచుకోవచ్చు. నిత్యావసర దుకాణాలు, మెడికల్ దుకాణాలు రోజు తెరవచ్చు. ఈ లాక్‌డౌన్‌ను జూన్ 14వ తేదీ వరకు పొడగిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా మూడో వేవ్‌కు తాము బాధ్యత వహించమని సీఎం కేజ్రీవాల్ ప్రజలకు స్పష్టం చేశారు. అంటే జాగ్రత్తలు పాటిస్తూ తమ కార్యకలాపాలు చేసుకోవాలని సీఎం పరోక్షంగా సూచించారు. కాగా ఢిల్లీలో ఏప్రిల్ 18వ తేదీ నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది. మేఘాలయ ఈశాన్య రాష్ట్రం మేఘాలయ కూడా లాక్‌డౌన్‌ను జూన్ 14వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే అన్నీ దుకాణాలు తెరచుకోవచ్చని స్పష్టం చేసింది. చాయ్ దుకాణాలు తెరచుకునేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే కరోనా వ్యాప్తి ఇక్కడే అధికంగా ఉందని గుర్తించి ప్రభుత్వం టీ దుకాణాలపై నిషేధం విధించింది. మార్కెట్లు, దుకాణాలు మధ్యాహ్నం 3 గంటలలోపు మూసివేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడమని స్పష్టం చేసింది. మే 18వ తేదీ నుంచి ఈ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతోంది. తమిళనాడు కరోనా ఉధృతి తగ్గకపోవడంతో తమిళనాడులో లాక్‌డౌన్‌ను పొడగిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 14వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తూనే సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న 27 జిల్లాల్లో స్వల్ప సడలింపులు ఇచ్చింది. ఇక కరోనా తీవ్రత అధికంగా ఉన్న 11 జిల్లాలకు మాత్రం మరికొన్ని ఆంక్షలు విధించింది. కోయంబత్తూరు, నీలగిరిస్, తిరుపూర్, ఈరోడు, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్, నాగపట్టణం, మాయిలదుతూరై కఠిన ఆంక్షలు కొనసాగనున్నాయి. కాగా తమిళనాడులో మే 8వ తేదీ నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది. -
అక్రమ మైనింగ్ గనిలో ఇరుక్కుపోయిన ఐదుగురు
షిల్లాంగ్: మేఘాలయలో దారుణం చోటు చేసుకుంది. జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ మైనింగ్ గనిలో ఐదుగురు కార్మికులు ఇరుక్కుపోయినట్లు మేఘాలయ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఐదుగురు ఆదివారం ఓ డైనమైట్ పేల్చిన ఘటనలో గని కుప్పకూలడంతో ఇరుక్కుపోయారని, ఆ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఆ ఐదుగురూ అస్సాంకు చెందిన వారని సిల్చార్ ఎస్పీ వెల్లడించినట్లు మేఘాలయ పోలీసులు పేర్కొన్నారు. తావరణం అనుకూలించకపోవడం, సరైన వెలుతురు లేకపోవడం, ప్రత్యక్ష్య సాక్షులు లేకపోవడం వంటి కారణాల వల్ల ఘటనను గుర్తించడంలో ఆలస్యమైందని ఈస్ట్ జైంతియా హిల్స్ ఎస్పీ జగ్పాల్ ధనోవా పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రత్యేకంగా విచారించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జైంతియా హిల్స్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందని అస్సాం ప్రజలు ఆరోపిస్తుండగా, ఆ విషయంపై తనకు అంత అవగాహన లేదని స్థానిక ఎమ్మెల్యే షైలా చెప్పారు. ఆ విషయాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు. (చదవండి: Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!) -
మేజికల్ మేఘాలయ ఎక్స్ విశాఖపట్నం
ఐఆర్సీటీసీ భారతీయ దర్శన్‌లో భాగంగా ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్న టూర్ ప్యాకేజ్ పేరు ‘మేజికల్ మేఘాలయ ఎక్స్ విశాఖపట్నం’. ప్యాకేజ్ కోడ్: SCBA25. ఇది ఆరు రోజుల (ఐదు రాత్రులు) పర్యటన. ఇందులో చిరపుంజీ, గువాహటి, మావ్లిన్నాంగ్, ఖజిరంగ, షిల్లాంగ్‌లను చూడవచ్చు. ఏప్రిల్ 24వ తేదీ మొదలై 29 తో పూర్తవుతుంది. ప్యాకేజ్ రాను, పోను విమాన చార్జీలతో కలిపి ఉంటుంది. సింగిల్ ఆక్యుపెన్సీలో 36,199 రూపాయలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 30,099, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 28,059 రూపాయలు. 24వ తేదీ 6E 6038 విమానం ఉదయం పదిం పావుకు విశాఖపట్నంలో బయలుదేరి 11.50 గంటలకు కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు చేరుతుంది. అక్కడి నుంచి ‘6E 568’ విమానం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు కోల్‌కతాలో బయలుదేరి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు గువహటి చేరుస్తుంది.29వ తేదీ ‘6E 6966’ విమానం సాయంత్రం ఐదు గంటలకు గువాహటి నుంచి బయలుదేరి ఆరు గంటల పదిహేను నిమిషాలకు కోల్‌కతాకు చేరుస్తుంది. అక్కడి నుంచి ‘6E 675’ విమానం ఏడు గంటల యాభై నిమిషాలకు కోల్‌కతాలో బయలుదేరి రాత్రి తొమ్మిదిన్నరకు విశాఖపట్నం చేరుస్తుంది. మొదటి రోజు: విశాఖపట్నం నుంచి గువహటి వరకు విమాన ప్రయాణం. గువహటి నుంచి రోడ్డు మార్గాన షిల్లాంగ్ చేరి హోటల్లో చెక్ అవడం. రాత్రి బస. రెండవ రోజు: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ప్రయాణం చిరపుంజి వైపు సాగుతుంది. మధ్యలో నొహ్కలికై జలపాతం, మౌసమి గుహలను చూసుకుని సాయంత్రం షిల్లాంగ్‌కు తిరుగు ప్రయాణం. తిరుగు ప్రయాణంలో ఎలిఫెంటా ఫాల్స్ చూడవచ్చు. ఆ రాత్రి కూడా బస షిల్లాంగ్‌లోనే. మూడవరోజు: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత షిల్లాంగ్ నుంచి మావ్‌లిన్నాంగ్‌కు ప్రయాణం. ఇది ఆసియాలో క్లీనెస్ట్ విలేజ్. వేళ్ల వంతెనలు, దాకీ సరస్సు చూసుకుని సాయంత్రం తిరిగి షిల్లాంగ్‌కు ప్రయాణం. షిల్లాంగ్‌లో రాత్రి బస. నాలుగవ రోజు: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత షిల్లాంగ్‌లో హోటల్ గది చెక్ అవుట్ చేసి ఖజిరంగాకు బయలుదేరాలి. దారిలో డాన్‌బాస్కో మ్యూజియం, ఉమియుమ్ లేక్ పర్యటన ఉంటుంది. ఖజిరంగ చేరగానే హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస. ఐదవ రోజు: తెల్లవారు జామున ఏనుగులను చూడడానికి వెళ్లవచ్చు. ఇది ప్యాకేజ్‌లోకి రాదు. సొంతంగా వెళ్లాలి. అలా వెళ్లిన వాళ్లు రొటీన్ టూర్ ప్లాన్ సమయానికి తిరిగి హోటల్‌కు వచ్చి రిఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసి సిద్ధంగా ఉండాలి. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నట్ట నడి అడవిలోకి జీపు సఫారీ ఉంటుంది. గది చెక్ అవుట్ చేసి గువహటి వైపు సాగిపోవాలి. దారిలో బాలాజీ ఆలయాన్ని దర్శించుకుని గువహటి చేరి హోటల్ గదిలో చెక్ ఇన్ అయ్యి రాత్రి బస చేయాలి. ఆరవ రోజు: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి బయలు దేరాలి. ఎయిర్ పోర్టుకు చేరే లోపు దారిలో కామాఖ్య ఆలయ దర్శనం ఉంటుంది. మూడు గంటలకు ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేస్తారు. ప్యాకేజ్‌లో విమానం టిక్కెట్లు, హోటల్ గదుల అద్దె, ఐదు బ్రేక్‌ఫాస్ట్‌లు, ఐదు డిన్నర్లు, ఏసీ వాహనాల్లో లోకల్ సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటాయి. చదవండి: ట్రావెల్ టిప్స్: జాగ్రత్తగా వెళ్లి వద్దాం! -
మా వద్ద 50% పైగా రిజర్వేషన్లు సబబే
న్యూఢిల్లీ: రాష్ట్రంలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడాన్ని మేఘాలయ బుధవారం సుప్రీంకోర్టులో సమర్ధించుకుంది. 85% పైగా గిరిజనులు ఉన్న తమ రాష్ట్రంలో ఆ స్థాయి రిజర్వేషన్లు అవసరమని పేర్కొంది. మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను, ఇంద్ర సాహ్ని కేసులో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పును పునఃపరిశీలించే అంశాన్ని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆ ధర్మాసనం ముందు మేఘాలయ తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ అమిత్ కుమార్ బుధవారం వాదనలు వినిపించారు. మేఘాలయ అనేక ప్రత్యేకతలు, వైవిధ్యత ఉన్న రాష్ట్రమని, అందువల్ల అసాధారణ పరిస్థితుల్లో అక్కడ 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం సరైనదేనని కోర్టుకు వివరించారు. ఇంద్ర సాహ్ని కేసును పునః పరిశీలించాల్సిన అవసరం లేదని అమిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. పలు ఇతర రాష్ట్రాలు కూడా తమ వాదనలను వినిపించాయి. వాదనల అనంతరం విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టబద్ధ హక్కు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మంగళవారం కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల(ఎస్ఈబీసీ) జాబితాను రాష్ట్రాలు ప్రకటించే అధికారాన్ని 102వ రాజ్యాంగ సవరణ తొలగించదని వివరించింది. -
షిల్లాంగ్ వేళ్ల వంతెన.. చూడాల్సిందే
ఇది కంప్యూటర్లో చేసిన గ్రాఫిక్ కాదు. ప్రకృతి చేసిన విన్యాసం. అక్వేరియంలో చేపలకు బదులు పడవ బొమ్మను వదిలినట్లు అనిపిస్తోంది కదూ! కానీ ఇది బొమ్మ పడవ కాదు, నిజమైన పడవ. అందులో ఉన్న మనుషులు ఆ సరస్సు సౌందర్యాన్ని వీక్షించడానికి వచ్చిన పర్యాటకులు. ఆ సరస్సు పేరు ఉమియా లేక్. ఇది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది 220 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన సరస్సు. ఈ సరస్సులో నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో పదాల్లో చెప్పాల్సిన పని లేదు, ఈ ఫొటో చెప్పేస్తోంది. ఉమియా సరస్సులో తేలుతున్న పడవ మెత్త చీపురు ఇక్కడిదే.. మేఘాలయలో కమలా తోటలు ఎక్కువ. క్యాబేజీ, క్యాలిఫ్లవర్ పంట చేలు విస్తారంగా కనిపిస్తాయి. కొండ వాలులో రకరకాల అడవి చెట్లు ఉంటాయి. వాటన్నింటిలో చీపురు చెట్లు ఎక్కువ. పట్టు కుచ్చులా మెత్తగా ఉండే చీపురును మనం కొండ చీపురు కట్ట అంటాం. ఆ చెట్లు పెరిగేది ఇక్కడే. వేళ్ల వంతెన మీద పర్యాటకుల సందడి చెట్ల వేళ్లతో వంతెన... టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో మన ఇంజనీర్లు చెరువుల మీద సస్పెన్షన్ బ్రిడ్జి కడుతున్నారు. వీటిని మనిషి మేధోవికాసానికి పరాకాష్టలుగా చెప్పుకుంటాం. షిల్లాంగ్ వాసులు మనసుతో వంతెనలు కట్టారు. ఉన్న వనరులను అవసరమైనట్లు మలుచుకోవడానికి మేధతోపాటు సున్నితమైన మనసు కూడా ఉండాలి. చుట్టూ అన్ని చెట్లు ఉన్నప్పటికీ చెట్లను నరికి వంతెన కట్టాలనే ఆలోచన చేయలేదు. మహా వృక్షాల వేళ్లను తాళ్లుగా అల్లి వంతెనగా అమర్చారు. వేళ్లను చెట్ల నుంచి వేరు చేయలేదు. కాబట్టి అవి చెట్టుకు బలాన్నిస్తూనే ఉంటాయి. మనుషులను చేరవేసే వాహకాలుగా కూడా పని చేస్తుంటాయి. పెద్ద చెట్లకయితే రెండు వరుసల వంతెనలు కూడా అల్లుతారు. వంతెన నిండుగా మనుషులు ఎక్కి ఊయల ఊగినట్లు ఊగినా సరే పట్టు సడలవు. ఇదే మంచికాలం... మేఘాలయలో రోడ్లు ఎండాకాలంలో వేస్తే వర్షాకాలంలో కొట్టుకుపోతాయి. సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో వెళ్తే గతుకుల రోడ్ల తిప్పలు తప్పవు. ఏటా నవంబర్ నుంచి రోడ్డు పనులు మొదలై డిసెంబర్‌కి పూర్తవుతాయి. మేఘాలయ రాష్ట్రం మేఘాలమయం కావడంతో రాష్ట్రం మొత్తంలో ఒక్క ఎయిర్‌పోర్టు కూడా లేదు. షిల్లాంగ్ చేరాలంటే పొరుగున ఉన్న అస్సాం రాష్ట్రం, గువాహటి ఎయిర్‌పోర్టులో దిగి రోడ్డు మార్గంలో ప్రయాణించాలి. గువాహటి నుంచి షిల్లాంగ్ వెళ్లే ప్రయాణంలో మేఘాలయ జీవన చిత్రం కళ్లకు కడుతుంది. కాబట్టి అస్సాంలో దిగడం ఏ మాత్రం వృథా కాదు. షిల్లాంగ్ టూర్లో బారాపానీ, నెహ్రూ పార్క్, నోహ్స్గితలాంగ్ జలపాతం, నోహ్కాలికాల్ జలపాతం, మావ్సమాల్ గుహలు, మావ్లాయ్నాంగ్ విలేజ్, ఎలిఫెంట్ ఫాల్స్, షిల్లాంగ్ పీక్ చూడాల్సిన ప్రదేశాలు. -
పెట్రోల్ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు!
దేశవ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ(రూ.100) చేయగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రూ.100కు చేరువలో ఉన్నాయి. రికార్డుస్థాయిలో పెరుగుతున్న ఇంధన ధరలు చూసి సామాన్య ప్రజానీకం వాహనం తీయాలంటేనే భయపడిపోతున్నారు. వారి ఆగ్రహాన్ని సోషలో మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఈ ఇంధన ధరల పెరుగుదలపై ప్రతి పక్షాలు అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి. చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలను తగ్గించాలని ప్రతి పక్షాలు కోరుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో దేశంలోని 4 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించాయి. త్వరలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి సుంకాలు తగ్గించినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, అస్సాం, రాజస్థాన్, మేఘాలయలలో పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్నులు తగ్గించబడ్డాయి. తగ్గిన తర్వాత కూడా ఢిల్లీలోని డీజిల్ ధర ఈ మూడు రాష్ట్రాల కన్నా తక్కువగా ఉంది. త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ్ బెంగాల్లో అక్కడి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.1 వ్యాట్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల్లో మేఘాలయ పెట్రోల్‌పై లీటరుకు రూ.7.40, డీజిల్‌పై రూ .7.10 భారీగా తగ్గించినట్లు ప్రకటించింది. రాజస్థాన్ ప్రభుత్వం జనవరిలోనే చమురు ధరలపై వ్యాట్‌ను 38 శాతం నుంచి 36 శాతానికి తగ్గించింది. అటు అసోం కూడా కరోనా కారణంగా విధించిన అదనపు పన్ను రూ.5 తగ్గిస్తూ ఫిబ్రవరి 12న నిర్ణయం తీసుకుంది. పన్ను తగ్గింపు తరువాత పెట్రోల్ ధర కోల్‌కతాలో రూ.91.78, షిల్లాంగ్‌లో రూ .86.87, గౌహతిలో రూ .87.24, జైపూర్‌లో రూ .97.10గా ఉంది. చదవండి: సైనికుల కోసం సోలార్ టెంట్లు భారీగా పెరిగిన ఉల్లి ధర -
మేఘాలలో తేలిపొమ్మని!
‘దేఖో అప్నా దేశ్’. ఐఆర్సీటీసీ సరికొత్త నినాదం ఇది. కోవిడ్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో కొత్త సంవత్పరం వచ్చిందంటే చాలు నగరవాసులు ‘చలో టూర్’ అంటూ రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. బ్యాంకాక్, దుబాయ్, శ్రీలంక వంటి విదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈసారి కోవిడ్ కారణంగా మూసివేసిన అంతర్జాతీయ సరిహద్దులు ఇంకా తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో ‘మన దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో విహరిద్దాం’ అనే లక్ష్యంతో ఐఆర్సీటీసీ ‘దేఖో అప్నా దేశ్’ ప్యాకేజీలను సిద్ధంచేసింది. లాక్డౌన్, వర్క్ ఫ్రం హోం, పిల్లల ఆన్లైన్ చదువులు వంటి వివిధ కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్న నగరవాసులకు ఈ ప్యాకేజీలు సరికొత్త ఉత్సాహాన్నివ్వనున్నాయి. మధ్యప్రదేశ్, అండమాన్, మేఘాలయ, హంపీ తదితర ప్రాంతాల కోసం ఐఆర్సీటీసీ తాజాగా డొమెస్టిక్ ఫ్లైట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. – సాక్షి, సిటీబ్యూరో చలో హంపీ.. హంపీ– బాదామి– ఐహోల్– పట్టడక్కల్ ప్రాంతాల పర్యటన జనవరి (2021) 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉంటుంది. ఈ పర్యటనలో మొదటి రోజు (29) ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి ఉదయం 9.25 గంటలకు విద్యానగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హోస్పేట్‌కు రోడ్డు మార్గంలో వెళ్తారు. అనెగుండి, పంపానది, తుంగభద్ర డ్యామ్ తదితర ప్రాంతాల పర్యటన అనంతరం హోస్పేట్ చేరుకుంటారు. రెండోరోజు హోస్పేట్ నుంచి హంపీ వెళ్తారు. విఠల, విరూపాక్ష ఆలయాలు, క్వీన్స్బెత్, లోటస్ మహల్ తదితర ప్రాంతాల సందర్శన ఉంటుంది. మూడోరోజు బాదామి గుహలను సందర్శిస్తారు. అనంతరం ఐహోల్, పట్టడక్కల్ చారిత్రక కట్టడాల సందర్శన అనంతరం నాలుగోరోజు హోస్పేట్ మీదుగా తిరిగి ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు విద్యానగర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 6.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అన్ని వసతులతో కలిపి ఒక్కొక్కరికి రూ.15,750 చొప్పున చార్జీ ఉంటుంది. 11 ఏళ్లలోపు పిల్లలకు రూ.12,750 చొప్పున ఉంటుంది. చదవండి: మంచు ముసుగులో అరకు అందాలు అందాలలో అహో మహోదయం .. – అసోం, మేఘాలయలోని అందమైన ప్రదేశాలను వీక్షించేందుకు మరో ప్యాకేజీ. ఇది మార్చి (2021) 12 నుంచి 17 వరకు కొనసాగుతుంది. 12న ఉదయం5.20 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 8 గంటలకు గౌహతి చేరుకుంటారు. 17న ఉదయం 8.40 గంటలకు గౌహతి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 11.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అన్ని సదుపాయాలతో పెద్దవాళ్లకు రూ.44,683, పిల్లలకు రూ.26,353 చొప్పున చార్జీలు ఉంటాయి. చదవండి: సిక్కోలు ‘నయాగరా’ అమేజింగ్ అండమాన్.. అండమాన్, నికోబార్ పర్యటన ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు ఉంటుంది. ఈ టూర్లో సెల్యూలర్ జైల్, రాస్, హావ్లాక్ ఐలాండ్స్, అందమైన సాండీ బీచెస్, వివిధ రకాల జంతువులు, పక్షులతో కూడిన వైవిధ్య ప్రదేశాలను వీక్షించవచ్చు. పెద్దవాళ్లకు రూ.43,416, పిల్లలకు రూ.29,686 చొప్పున చార్జీ ఉంటుంది. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇండోర్, ఉజ్జయిని, మాండు తదితర ప్రాంతాల పర్యటన ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు కొనసాగుతుంది. కాలభైరవ టెంపుల్, మంగళ్‌నాథ్ మందిర్, జంతర్‌మంతర్, తదితర ప్రాంతాలను పర్యటిస్తారు. పెద్దవాళ్లకు రూ.25,250, పిల్లలకు 17,100 చొప్పున చార్జీ ఉంటుంది. -
హిందువులు చర్చికెళ్తే ఖబడ్దార్..
డిస్పూర్: ప్రేమికుల రోజు మన సంస్కృతి కాదు.. యువతీయువకులు బయట జంటగా కనిపిస్తే.. పెళ్లి చేస్తాం అని బెదిరించే బజరంగ్ దళ్ కార్యకర్తలు తాజాగా క్రైస్తవుల పవిత్ర పర్వదినం క్రిస్టమస్ మీద పడ్డారు. హిందువులు ఎవరైనా క్రిస్టమస్ నాడు చర్చికి వెళ్తే చితకబాదుతాం జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ మిథు నాథ్ అస్సాం కాచర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాథ్ ఇలా మాట్లాడటానికి ప్రధాన కారణం.. కొన్ని రోజుల క్రితం క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న మేఘలయాలో వివేకానంద సెంటర్‌ని మూసి వేశారు. ఆ కోపంతో నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రైస్తవులు మన పవిత్ర పుణ్యక్షేత్రాలను మూసి వేశారు. ఈ స్థితిలో ఎవరైనా హిందువులు, చర్చికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ విషయంలో మేం చాలా సీరియస్‌గా ఉన్నాం’ అన్నారు. ( సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!) అంతేకాక ‘మా మాటలు కాదని ఎవరైనా చర్చికెళితే.. మేం వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత రోజు పేపర్లో మేం హెడ్‌లైన్స్‌లో నిలుస్తాం. "గుండాదళ్" ఓరియంటల్ పాఠశాలను ధ్వంసం చేసింది.. అని పేపర్లో వస్తుంది. కాని అది మా ప్రాధాన్యత కాదు. షిల్లాంగ్‌లోని క్రైస్తవులు మన దేవాలయాల ద్వారాలను లాక్ చేస్తున్నప్పుడు హిందువులు వారి కార్యక్రమాలలో పాల్గొనడాన్ని మేం అనుమతించము’ అని మిథు నాథ్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ఖాసీ విద్యార్థి సంఘం రామకృష్ణ మిషన్ ఆలయాన్ని మూసివేసింది అని తెలిపారు. అయితే, ఈ వాదనను మేఘాలయ ప్రభుత్వ ఉన్నతాధికారి ఖండించినట్లు సమాచారం. డిస్ట్రిక్ హాలీడే కావడంతో సాంస్కృతిక కేంద్రం మూసివేశారని.. లాక్ చేయలేదని సదరు అధికారి తెలిపారు. -
మేఘాలయగా గవర్నర్‌గా సత్యపాల్
సాక్షి, న్యూఢిల్లీ : గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్ర గవర్నరు భగత్ సింగ్ కోశ్యారికి గోవా బాధ్యతలను అదనంగా అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా గోవా గవర్నర్‌గా కూడా కోష్యారీ అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని రాష్ట్రపతి భవన్ ఆదేశించింది. మేఘాలయ గవర్నర్‌గా ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న తథాగతరాయ్ స్థానంలో సత్యపాల్ మాలిక్ ను రాష్ట్రపతి బదిలీ చేశారు. సత్యపాల్ మాలిక్ గతంలో జమ్ముకశ్మీర్, బిహార్ గవర్నర్ గా పని చేశారు. 2018 ఆగస్టులో మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. అయితే జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత 2019 అక్టోబర్ లో సత్యపాల్ మాలిక్ ను గోవాకు బదిలీ చేస్తూ,ఆయన స్థానంలో గిరిష్ చంద్రముర్మును నియమించారు. కాగా, గతంలో మాలిక్ గవర్నర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. గవర్నర్లకు పెద్ద పని ఏదీ ఉండదని, గవర్నర్ గా పని చేసే వారు వైన్ తాగి, గోల్ఫ్ ఆడుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశంలో గవర్నర్ వ్యవస్థపై చర్చ కూడా జరిగింది. -
పలు రాష్ట్రాల్లో మినీ లాక్డౌన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న నేపథ్యంలో ఈ మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు పలు రాష్ట్రాలు మినీలాక్‌డౌన్ విధించాయి. కర్ణాటక, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయల్లో లాక్డౌన్ విధించారు. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్ ప్రాంతాల్లో జూలై 14 రాత్రి 8 గంటల నుంచి జూలై 22 ఉదయం 5 గంటల వరకు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక సీఎం తెలిపారు. అస్సాం రాష్ట్రం గౌహతిలోని కామ్రూప్లో జూలై 12 నుంచి మరో వారం రోజులపాటు లాక్డౌన్ పొడిగించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్, నహర్లాగన్, నిర్జులి, బందర్‌దేవాల్లో గతంలో విధించిన లాక్డౌన్ జూలై 13 సాయంత్రానికి ముగియనుండడంతో దీన్ని మరోవారం పొడిగించారు. -
మేఘాలయలో తొలి కరోనా కేసు
షిల్లాంగ్: తమ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు లేనందున, లాక్‌డౌన్‌ను పాక్షికంగా ఎత్తివేయాలని నిర్ణయించుకున్న మేఘాలయలో తొలి కేసు నమోదైంది. దీంతో అక్కడి సర్కారు అప్రమత్తమైంది. షిల్లాంగ్‌లోని బెథనీ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడికి కరోనా పరీక్షలు నిర్వహించగా సోమవారం పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మార్చి 22 నుంచి సదరు ఆసుపత్రికి వెళ్లినవారు వెంటనే 108ను సంప్రదించాలని, లేదా http://meghalayaonline.gov.in/covid/login.htm లో తమ పేరు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆ ఆసుపత్రి నుంచి రోగులు, డాక్టర్లు, నర్సు, ఇతర సిబ్బంది ఎవరూ బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. (పర్యాటకులకు అత్యవసర సమాచారం) మరోవైపు అధికారులు అతనితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో నేటి నుంచి 48 గంటలపాటు కర్ఫ్యూ విధించారు. ఈ కొత్త కేసుతో ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య 38కి చేరింది. ఇందులో అస్సాం 30, మణిపూర్, త్రిపుర 2, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ 1 కేసు నమోదయ్యాయి. కాగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలు దాటగా 358 మంది మృతి చెందారు. 1,193 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. (ఏప్రిల్ 15 నుంచి లాక్డౌన్ పాక్షిక ఎత్తివేత!) -
ఫేస్బుక్ పేజీ ద్వారా ‘సోల్‌మేట్’ ప్రదర్శన
షిల్లాంగ్: కరోనా పోరాటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిచేందుకు ప్రముఖులు, బడా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఆ జాబితాలో మేఘాలయ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాండ్ కంపెనీ సోల్‌మేట్ చేరింది. సోషల్ మీడియా (ఫేస్బుక్ పేజీ) ద్వారా ప్రదర్శన ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ద్వారా నిధులు సేకరిస్తామని సోల్‌మేట్ బ్యాండ్ మ్యూజికల్ ఆర్టిస్ట్ రూడీ వాల్లాంగ్ చెప్పారు. లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారికి, కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నవారికి వచ్చిన మొత్తం అందిస్తామని అన్నారు. కాగా, తమ ఫేస్బుక్ పేజీలో గత ఆదివానం సోల్‌మేట్ బ్యాండ్ ప్రదర్శన ఇవ్వగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమనుల నుంచి మంచి స్పందన వచ్చింనదని రూడీ తెలిపారు. ‘రూరల్ 7ట్రెప్ ఎయిడ్ కోవిడ్-19’పేరుతో విరాళాలు సేకరించామని వెల్లడించారు. ‘మేమున్న ప్రదేశం నుంచే లైవ్‌లో ప్రదర్శన ఇచ్చాం. మనదేశం నుంచే కాక విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా ఆర్థిక సాయం చేశారు. దాదాపు 8 లక్షల రూపాయలు సమకూరాయి. మరిన్ని విరాళాలు సేకరించి లాక్‌డౌన్‌తో ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నవారికి .. వైరస్ నియంత్రణకై శ్రమిస్తున్నవారికి వాటిని అందిస్తాం. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న మ్యూజిషిన్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నాం. ఆ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. కాగా, కరోనా కేసులు లేని రాష్ట్రాల్లో మేఘాలయ కూడా ఒకటి. ఆర్థిక పరంగా చూసుకుంటే లాక్డౌన్ సరైంది కాదని నా అభిప్రాయం’అని రూడీ పేర్కొన్నారు. -
ఏప్రిల్ 15 నుంచి లాక్డౌన్ పాక్షిక ఎత్తివేత!
షిల్లాంగ్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఈశాన్య రాష్ట్రం పేర్కొంది. ప్రైవేటు వాహనాల రాకపోకలకు అనుమతినిస్తామని.. అయితే విద్యా సంస్థలను మాత్రం ఏప్రిల్ 30 వరకు మూసివేస్తామని వెల్లడించింది. ప్రాణాంతక వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే మేఘాలయలో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి పాక్షికంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.(కరోనాపై పోరు: డాక్టర్ కన్నీటిపర్యంతం) ఈ మేరకు కేబినెట్ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ‘‘ఏప్రిల్ 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. విద్యాసంస్థలను మాత్రం ఏప్రిల్ 30 వరకు మూసివేస్తున్నాం. రైతులు పొలాలకు వెళ్లొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లు వారానికి ఒకసారి తెరుస్తాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది. అయితే వ్యాపారాలపై మాత్రం లాక్డౌన్ ప్రభావం కొనసాగుతుంది. కోవిడ్-19 వ్యాప్తిస్తున్న తరుణంలో రోజూ కూలీలు, వేతన జీవులు, చిరు వ్యాపారులను ఆదుకునేందుకు వారానికి 700 రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందజేస్తాం. లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ చేస్తాం’’ అని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.(ఆ దేశాలకు ఎగుమతి చేస్తాం: భారత్) కాగా దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో లాక్డౌన్ మరికొన్ని రోజులు పొడగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల తర్వాత తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరావు.. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఎత్తివేసినా తమ రాష్ట్రంలో మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కూడా మరికొన్ని వారాల పాటు లాక్డౌన్ కొనసాగిస్తేనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. (తెలంగాణ బాటలో మరికొన్ని రాష్ట్రాలు!) -
పర్యాటకులకు అత్యవసర సమాచారం
షిల్లాంగ్ : కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో వీలైనన్ని విధాలుగా దాన్ని అడ్డుకోవటానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసే దిశగా రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాలను మూసివేస్తూ మేఘాలయ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదలచేసింది. ఈ నెల 31వ తేదీ వరకు అన్ని పర్యాటక ప్రదేశాలు మూసివేయబడతాయని, అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 15వ తేదీ వరకు ఈ బంద్ కొనసాగవచ్చని పేర్కొంది. మేఘాలయ, షిల్లాంగ్‌లతో పాటు ఇతర ప్రదేశాలను పర్యటించదల్చుకున్నవారు షెడ్యూల్లో మార్పులు చేసుకోవాలని కోరింది. ( చేతికి క్వారంటైన్ ముద్రతో గరీబ్ రథ్‌లో.. ) చదవండి : కరోనా పేషెంట్ల బట్టలు ఉతకం -
పంచ పద్మాలు
కథానాయిక మూళిక్కళ్ పంకజాక్షి: పై పెదవి మీద తోలుబొమ్మను ఉంచుకుని, రామాయణ మహాభారత కథలను నాలిక మీద ఆడిస్తున్న ఏకైక కళాకారిణి కేరళకు చెందిన మూళిక్కళ్ పంకజాక్షి. తల్లిదండ్రులు నేర్పిన ‘నూక్కు విద్య పవక్కలి’ (తోలు బొమ్మలాట)ని ఆమె తన పన్నెండవ ఏట నుంచే కాపాడుకుంటూ వస్తున్నారు. కేరళలోని మోనిపల్లె తాలూకా కొట్టాయం వారిది. భర్త శివరామ పాణిక్కర్ కూడా కళాకారుడే. మధుర స్వరంతో శివరామ పాడుతూ, వాద్యాలను ఉపయోగించటం వల్లే తన కథకు మరింత అందం చేకూరి, తాను అందరికీ పరిచితురాలినయ్యాను అంటారు పంకజాక్షి. ఐదు వందల సంవత్సరాల నాటì ఈ విద్యను, ఈ శతాబ్దంలో నేటికీ సజీవంగా ఉంచిన ఏకైక వ్యక్తి పంకజాక్షి. ఆమెను ఈ విద్య నేర్చుకోమని తల్లిదండ్రులు ఎన్నడూ ఒత్తిడి తీసుకురాలేదు. మొదట్లో తన ఇంటిముందరే కాళ్లను బారచాచి, పైకి చూస్తూ, చిన్న చిన్న కొబ్బరి కాయ పిందెలను పైపెదవి మీద గంటలుగంటలు బ్యాలెన్స్ చేసేది. సూర్యోదయానికి ముందు, మధ్యాహ్న సమయాలలో సాధన చేసిన పంకజాక్షి, వివాహం వల్ల కాని, పిల్లల వల్ల కాని ఎన్నడూ ఎటువంటి ఆటంకం కలగలేదని అంటారు. ఆమె మనుమరాలు కె. ఎస్. రంజని కూడా ఈ కళను కొనసాగిస్తున్నారు. పంకజాక్షి ఆరు సంవత్సరాలుగా అనారోగ్యం కారణంగా ఈ విద్యను ప్రదర్శించటం లేదు. ఆసక్తి ఉన్నవారికి తన ఇంటి దగ్గర ఈ విద్యను నేర్పుతున్న పంకజాక్షికి పద్మశ్రీ అవార్డు లభించింది. సంఘసేవిక ఉషా చౌమర్: మరుగుదొడ్లను పరిశుభ్ర పరిచే పని చేస్తున్న రోజుల్లో ఉషా చౌమర్‌కి, ఆ పని చేసి ఇంటికి వచ్చాక వాంతులు అయ్యేవి. ఏమీ తినాలనిపించేది కాదు. తనమీద తనకే అసహ్యం వేసేది. 1993లో తోటీ పనిని నిషేధించినా, కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ తోటీ పనివారు ఉన్నారు. రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో ఒక సామాన్య దళిత తోటీ కుటుంబంలో పుట్టిన ఉషా తన ఏడవ ఏట నుంచే తల్లికి సహాయంగా చీపురు పట్టారు. పది సంవత్సరాల వయసులో గృహిణిగా ఆల్వార్ జిల్లా చేరుకున్నారు. భర్తకు సహాయంగా ఇదే పనిలో జీవితం కొనసాగింది. డా. బిందేశ్వర్ పాఠక్ అనే సంఘ సంస్కర్త ఉషా నివసించే కాలనీకి రావటంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. ఆయన ‘నయీ దిశ’ పేరుతో స్థాపించిన సంస్థ ద్వారా ఉషా అప్పడాలు, నూడుల్స్, పచ్చళ్లు తయారుచేసి అమ్మకాలు ప్రారంభించారు. అలా తను కొత్త జీవితంలోకి వచ్చి తనలాంటి వారి జీవితాలలో వెలుగురేఖలు ప్రసరింప చేశారు. ఆంగ్లవిద్యను కూడా అభ్యసించిన ఉష.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, ఆయనకు రాఖీ కట్టిన తరువాత సామాజికవేత్తగా కూడా మారారు. అమెరికా, పారిస్, దక్షిణాఫ్రికా వంటి పలు దేశాలలో పర్యటిస్తూ, ఎంతోమందిని తోటీ పని నుంచి బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ సంస్థకు అధ్యక్షురాలిగా ఉంటున్న ఉష తన సేవలకుగాను ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. సౌభాగ్యవతి ట్రినిటీ సయూవూ: ఈశాన్య రాష్ట్రాలలోని మేఘాలయలో ములీ అనే చిన్న గ్రామంలో జన్మించిన ట్రినిటీ సయూవూ ఉపాధ్యాయురాలిగా విద్యార్థులను చక్కదిద్దేవారు. అంతటితో తృప్తి చెందకుండా, నలుగురికీ ఉపయోగపడే పని కూడా మరేదైనా చేయాలనుకున్నారు. వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. పసుపు సాగును ఒక ఉద్యమంగా ప్రారంభించారు. లకడాంగ్ అనే పసుపు రకాన్ని పండించటం వల్ల మూడు రెట్ల ఆదాయాన్ని పొందవచ్చని తెలుసుకున్నారు. ట్రినిటీ సయూవూ ఈ విషయాన్ని మేఘాలయాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 800 మందికి తెలియబరిచారు. ప్రతిరోజూ స్కూల్ అయిపోగానే, సాయంకాలం వేళ చుట్టుపక్కల గ్రామాలలో ఉండే మహిళలను కలుసుకుని, ఈ బంగారు సుగంధ ద్రవ్యం (పసుపు) పంట పండించటం వల్ల వచ్చే అదనపు రాబడి గురించి వారికి ఆసక్తి కలిగేలా వివరించేవారు. అధిక ఆదాయం వచ్చేలా, పసుపు కొమ్ములను స్వయంగా మిల్లులో పట్టించి, పసుపును కవర్లలో ప్యాకింగ్ చేసి, అమ్ముతున్నారు. సేంద్రియ పద్ధతిలో ఈ సాగు జరుగుతోంది. రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను తెలియచేస్తూ, తాము తయారు చేసిన పసుపును దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేసి, సంపన్నులవుతున్నారు ఆమె నుంచి స్ఫూర్తిని పొందినవారు. ఇందుకోసం ఎంతగానో శ్రమించిన ట్రినిటీ సయూవూను పద్మశ్రీ పురస్కారం వరించి వచ్చింది. ధాన్యలక్ష్మి రహీబాయ్ సోమా: సంకర విత్తనాల కంటె దేశీ విత్తనాల వల్లే సేంద్రియ వ్యవసాయం సాధ్యమని భావించారు మహారాష్ట్రలోని కొంభల్నే గ్రామానికి చెందిన రహీబాయ్ సోమా. ఆలోచనలను ఆచరణలో పెడితేనే ఏ వ్యక్తయినా ఉన్నతస్థాయికి చేరుకుంటారని ఆమె నమ్ముతారు. ఏడుగురు సభ్యులున్న రహీబాయ్ సోమా కుటుంబం ఉపాధికోసం ఔరంగాబాద్ జిల్లా ఆకోలే తాలూకాకు చేరుకున్నాక, కొత్త జీవితం ప్రారంభించారు. వర్షాకాలంలో వ్యవసాయం చేస్తూ, మిగతా సమయంలో పం^è దార ఫ్యాక్టరీలో రోజు కూలీలుగా పనిచేసేవారు కుటుంబంలోని వాళ్లంతా. అయితే ఆ జీవితం రహీబాయ్ సోమాకు నచ్చలేదు. వారి కున్న ఏడు ఎకరాలలో మూడు ఎకరాల మీద శ్రద్ధ పెట్టారు రహీబాయ్ సోమా. భూమి సారవంతంగా ఉంటేనే మంచి పంట దిగుబడి వస్తుందని ఆమెకు బాగా తెలుసు. నేలను తడిగా ఉంచటం కోసం తన పొలంలో వ్యవసాయ చెరువును అంటే జలకుండాన్ని తవ్వించి, కూరగాయలు పండించటం ప్రారంభించారు. ఆమెలోని పట్టుదలను గమనించిన మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫర్ రూరల్ ఏరియాస్ వారు ఆమెకు సహకరించారు. దానితో రహీబాయ్ సోమా కోళ్లఫారం, మొక్కల నర్సరీ కూడా ప్రారంభించారు. పంటలు చక్కగా పండించటం కోసం దేశీ విత్తనాలను సంరక్షించటం కోసం విత్తనాల బ్యాంకును నెలకొల్పి, సీడ్ మదర్‌గా గుర్తింపు పొందారు. దాచిన విత్తనాలను పొరుగు రైతులకు ఇస్తూ, వారు కూడా ఫలితం పొందేందుకు సహకరిస్తున్న రహీబాయ్ సోమాను పద్మశ్రీ పురస్కారం వెతుక్కుంటూ వచ్చింది. వనమాలి తులసి గౌడ: కర్ణాటకలోని అంకోలా తాలూకా హొన్నాలి గ్రామానికి చెందిన తులసి గౌడకు ఏడుపదులు పైబడ్డా నేటికీ హుషారుగానే కనిపిస్తారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. పుట్టిన రెండేళ్లకే తండ్రిని పోగొట్టుకున్నారు. కుటుంబాన్ని నడపటం కష్టంగా ఉండటంతో, తులసి గౌడకు బాల్యంలోనే వివాహం చేశారు ఆమె తల్లి. ఆమెను అక్కడ కూడా దురదృష్టం వెంటాడింది. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది. అయినా ౖ«§ð ర్యాన్ని కోల్పోలేదు తులసి గౌడ. ఒంటరితనాన్ని దూరం చే సుకోవటం కోసం, మొక్కలకు చేరువైంది. ఆమెలోని ఉత్సాహాన్ని చూసి, అటవీశాఖ వారు ఆమెకు వనమాలి ఉద్యోగం ఇచ్చారు. మొక్కలను తన బిడ్డల్లా చూసుకుంటూ, అంకిత భావంతో పనిచేశారు తులసి. మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోసి సంరక్షించటమే కాకుండా, ఆ మొక్కలోని గుణాలు, మొక్క పేరుకు సంబంధించిన జ్ఞానం పెంచుకున్నారు. ఎవరు వచ్చి, ఏ మొక్క గురించి ప్రశ్నించినా తడుముకోకుండా, విసుగు లేకుండా, ఆనందంగా ఆ వివరాలు చెబుతారు తులసి గౌడ. టేకు మొక్కలతో తన ప్రయాణం ప్రారంభించిన తులసి గౌడ, పనస వంటి అనేక పెద్ద పెద్ద మొక్కలు కూడా నాటి, అవి పెరిగి, ఫలాలనిస్తుంటే, తనకు మనుమలు పుట్టినంత ఆనందిస్తారు. పర్యావరణానికి అందించిన సేవలకు గాను ఆమెకు ఉన్న పురస్కారాలకు వన్నె తెచ్చేలా పద్మశ్రీ పురస్కారం వచ్చి చేరింది. - డా. వైజయంతి పురాణపండ -
ఛాందసంపై కిక్‌బాక్సింగ్
ఈశాన్య రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ మామూలు యువకుడు గొప్ప మార్పు కోసం కృషి చేస్తున్నాడు. అతని పేరు పిన్నెహోబర్ మైలీమ్‌గాప్. మేఘాలయలోని స్మిత్ గ్రామంలో వివక్షపూరితమైన ధోరణులను ఓడించేందుకు అమ్మాయిలకూ కిక్‌బాక్సింగ్ తరగతులు నిర్వహిస్తున్నాడు. పల్లెవాసులు తమ ఛాందసానికి స్వస్తి పలికి ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తున్నాడు. మొదటి అడుగు ఇరవై ఒక్క ఏళ్ల పిన్నెహోబర్ మైలీమ్‌గాప్ పొట్టిగా ముఖంలో అమాయకత్వం ఉట్టిపడుతున్నట్టుగా కనిపిస్తాడు. పదో తరగతి పాసయ్యాడు. మేఘాలయ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ద్వారా స్మిత్ గ్రామంలో పిల్లలకు కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. అయితే ఇదంత సులువుగా జరగలేదంటాడు మైలీమ్‌గాప్. ఈ గ్రామంలో సనాతన నిబంధనలను ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించరు. ఇక్కడేదైనా కార్యక్రమం తలపెట్టాలంటే తప్పనిసరిగా గ్రామ కౌన్సిల్‌తో పాటు హెడ్‌గా ఉండే సోర్దార్ అనుమతి పొందాలి. వచ్చిన ప్రతి అభ్యర్థనను నిశితంగా పరిశీలించి గాని అనుమతి ఇవ్వరు. ‘ఆ విధంగా నేను అదృష్టవంతుడినే. నేను చెప్పిన విషయాలు నచ్చడంతో కిక్‌బాక్సింగ్ తరగతులకు గ్రామ కమ్యూనిటీ హాల్‌ను ఉపయోగించుకోవడానికీ అనుమతించారు’ అని ఆనందంగా చెబుతాడు మైలీన్గాప్. మొదట్లో తన క్లాసులకు అంతగా స్పందన లేదు. సోర్దార్ జోక్యం చేసుకుని పల్లెవాసులతో సమావేశాలను నిర్వహించి, పిల్లలను పంపమని ప్రోత్సహించాడు. ఇప్పుడు మైలీమ్‌గాప్ శిక్షణ తరగతిలో 60 మంది పిల్లలున్నారు. బాలికలకూ బాక్సింగ్ ‘తరగతుల నిర్వహణకు డబ్బు పెద్ద అడ్డంకిగా ఉండేది. పిల్లలకు సరైన దుస్తులూ ఉండేవి కావు. దీంతో వాళ్లంతా రోజూ ఇళ్లలో వేసుకునే దుస్తులతోనే ప్రాక్టీస్ చేస్తుంటారు. మరో సమస్య ఏంటంటే అమ్మాయిలు కేంద్రంలో శిక్షణ పొందడానికి రప్పించడం’ అంటాడు మైలీమ్‌గాప్. స్మిత్ గ్రామంలో బాలికలు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదనే దానిపై గట్టి నియంత్రణ ఉంటుంది. మైలీమ్‌గాప్ ఆశను కోల్పోలేదు. ఇంటింటికి వెళ్లి బాలికలు ఆత్మరక్షణ కోసం ఈ విద్య నేర్చుకోవడం ఎంత ముఖ్యమో తల్లిదండ్రులకు వివరిస్తుంటాడు. ఇప్పుడు తన క్లాస్‌లో 15 మంది బాలికలు ఉన్నారు. ముందెవరూ ఆసక్తి చూపని సమయంలో పదహారేళ్ల ఎబాన్ కైంటివ్యూ తల్లి... తన కుమార్తెను చేర్చడానికి ముందుకొచ్చింది. ఎబాన్ తండ్రి ఆర్మీ జవాన్. కుటుంబానికి దూరంగా ఉండేవాడు. దీంతో ఎబాన్ తల్లి కూతురు రక్షణ కోసం కిక్‌బాక్సింగ్ క్లాస్‌లో చేర్చింది. ఎబాన్ కిక్‌బాక్సింగ్‌లో ఛాంపియన్ కావడమే లక్ష్యంగా చేసుకుంది. రోజూ ఆమె ధైర్యంగా ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఎబాన్ను చూసి 18 ఏళ్ల ఫిబారిహున్ మావ్లాంగ్ కూడా కిక్‌బాక్సింగ్ క్లాస్‌లో చేరింది. అలా క్రమంగా మరో పదమూడు మంది అమ్మాయిలు ఈ శిక్షణాకేంద్రంలో చేరారు. మైలీమ్‌గాప్ శిక్షణా కేంద్రం చిన్నదే కావచ్చు. కానీ ఓ మారు గ్రామంలో అతను రాబట్టాలని చూసే ఫలితాలు మాత్రం మెచ్చుకోదగినవి. కొన్ని నెలల క్రితం పూణే బాక్సింగ్ పోటీలలో మైలీమ్‌గాప్ విద్యార్థులు ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజత పతకాలు సాధించారు. – ఆరెన్నార్ -
మేఘాలయలో ఇంటర్నెట్ సేవలు బంద్
షిల్లాంగ్: రాజ్యసభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. అస్సాం, త్రిపుర, మేఘాలయలో పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. నిరసనల నేపథ్యంలో మేఘాలయలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం నుంచి 48 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలతో పాటు ఎస్ఎంఎస్, వాట్సప్, ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ సేవలను సైతం నిలిపివేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారుతుండటంతో తూర్పు కాశీ హిల్స్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు గురువారం కర్ఫ్యూ విధించారు. అస్సాంలోని పది జిల్లాల్లో బుధవారం నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా ప్రభుత్వం ఈ నిషేధాన్ని మరో 48 గంటల పాటు పొడిగించింది. గుహవటి, డిబ్రూగర్లో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సుప్రీంకోర్టుకు పౌరసత్వ బిల్లు -
పదికి పది వికెట్లు.. పది మెయిడెన్లు
కోల్‌కతా: మేఘాలయ ఆఫ్ స్పిన్నర్ నిర్దేశ్ బైసోయా అసాధారణ ప్రదర్శనతో రికార్డులకెక్కాడు. అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లను పడగొట్టాడు. 15 ఏళ్ల నిర్దేశ్ బుధవారం తొలిరోజు ఆటలో నాగాలాండ్‌ను తన స్పిన్‌తో చుట్టేశాడు. 21 ఓవర్లు వేసిన ఈ కుర్రాడు 51 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. ఇందులో 10 ఓవర్లను మెయిడెన్లుగా వేశాడు. దీంతో నాగాలాండ్ జట్టు 113 పరుగులకే ఆలౌటైంది. గత రెండేళ్లుగా నిర్దేశ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గత టోరీ్నలో ఆరు మ్యాచ్‌లాడిన అతను 33 వికెట్లు తీశాడు. తాజా టోర్నీలో నాలుగే మ్యాచ్‌లాడిన అతను 27 వికెట్లు పడేశాడు. నిజానికి నిర్దేశ్ సొంతూరు మీరట్... కానీ మేఘాలయ తరఫున ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల క్రితమే భారత మేటి స్పిన్నర్ అనిల్ కుంబ్లే (10/74) పాకిస్తాన్‌పై ఢిల్లీ టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లతో చరిత్రకెక్కాడు. దీంతో ఢిల్లీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో భారత్ అద్వితీయ విజయాన్ని సాధించింది. గతేడాది మణిపూర్ పేసర్ రెక్స్ సింగ్ కూడా పదికి పది వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత వహించాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో అతను చరిత్ర సృష్టించగా... పుదుచ్చేరి లెఫ్టార్మ్ స్పిన్నర్ సిదాక్ సింగ్ సీకే నాయుడు ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టేశాడు. -
ఆర్ఏఎస్ పద్ధతి బాగుంది
బాలానగర్ (జడ్చర్ల): రీ–సైక్లింగ్ ఆక్వా సిస్టం (ఆర్ఏఎస్) బాగుందని మేఘాలయ మత్స్యశాఖ మంత్రి కురమన్ ఉరియా అన్నారు. సోమవారం బాలానగర్ మండలం గుండేడ్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు విశ్వనాథరాజు తక్కవ నీటితో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చేపలను ఎలా పెంచాలనే దానిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా, ఇదే పద్ధతిని గౌహతి వద్ద అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ, మేఘాలయ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఐతిమోలాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కోవాల్సిన పనిలేదు’
షిల్లాంగ్ : పర్యావరణ పరిరక్షణ గురించి ప్రసంగాలు చేయడమే కాకుండా... ఆ బృహత్తర కార్యక్రమంలో తాను కూడా భాగస్వామియై పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు రామ్‌సింగ్. మేఘాలయకు చెందిన ఐఏఎస్ అధికారి ఆయన. వెస్ట్‌కారో హిల్స్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న రామ్‌సింగ్ ప్రకృతి ప్రేమికుడు. కాలుష్య రహిత, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం తన వంతు కృషి చేస్తున్నారు. సేంద్రీయ కూరగాయలు కొనడం కోసం వారాంతాల్లో ఏకంగా పది కిలోమీటర్లు నడిచి వెళ్తారు. తద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం... పనిలో పనిగా వ్యాయామం కూడా పూర్తవుతుందంటారు. వీపునకు వెదురుబుట్ట తగిలించుకుని.. భార్య, కూతురితో కలిసి మార్కెట్‌కు వెళ్లి రావడం మరో సరదా అని చెబుతారు రామ్ సింగ్. మేఘాలయ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వన్ సిటిజన్- వన్ ట్రీ’ కార్యాక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న ఈ బ్యూరోక్రాట్... తన లాగే మేఘాలయ యువత కూడా ప్లాస్టిక్‌కు నో చెప్పాలని పిలుపునిస్తున్నారు.(చదవండి : ఈ చెక్క బాటిల్ ఎంత బాగుందో!!) ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రామ్‌సింగ్ శుక్రవారం తన ‘మార్కెట్ యాత్ర’కు సంబంధించిన ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేశారు. ‘ వారాంతాల్లో 21 కిలోల కూరగాయలు కొనడానికి 10 కిలోమీటర్లు నడిచి వెళ్తాను. నాకు ఇది మార్నింగ్ వాక్. ప్లాస్టిక్ లేదు. కాలుష్యం కూడా లేదు. అంతకుమించి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోవాల్సిన పనిలేదు. ఫిట్ ఇండియా. ఫిట్ మేఘాలయ. సేంద్రీయ పదార్థాలు తినండి. తుర పట్టణాన్ని పచ్చగా.. పరిశుభ్రంగా ఉంచండి’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రామ్ సింగ్ జీవన విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇండియన్ బ్యూరోక్రసీలో ఓ కొత్త అధ్యాయం. మీరు నిజంగా ఆదర్శనీయం సార్. మీ స్పూర్తితో మేము కూడా ప్లాస్టిక్‌ను నిషేధిస్తాం. వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని సైతం కాపాడుకుంటాం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ సింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి రామ్‌సింగ్ మాట్లాడుతూ...‘ కూరగాయల కోసం దూరం వెళ్లాల్సి వస్తోంది... వాటిని మోసుకురావడం మరో ఎత్తు అంటూ ఎంతో మంది నా దగ్గర వాపోయారు. అలాంటప్పుడు కొకెంగ్(వెదురు బుట్ట) తీసుకువెళ్లవచ్చు కదా అని సలహా ఇచ్చాను. తద్వారా ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గిపోతుంది కదా అని చెప్పాను. కానీ వారికి నా మాటలు నవ్వు తెప్పించాయి. అందుకే ఆచరించి చూపితే వారిలో మార్పు వస్తుందని భావించాను. గత ఆర్నెళ్లుగా నా భార్యతో కలిసి సరదాగా మార్కెట్‌కు నడిచి వెళ్తూ కొకెంగ్లో వారానికి సరిపడా సేంద్రీయ కూరగాయలు తెచ్చుకుంటున్నా. ఆధునిక యుగంలో ఎదురయ్యే సరికొత్త సవాళ్లకు సంప్రదాయ పద్ధతిలో పరిష్కారాలు కనుగొని వాటిని అధిగమించవచ్చు’ అని చెప్పుకొచ్చారు. -
మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ కన్నుమూత
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డోంకుపర్ రాయ్(64) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హర్యాణాలోని మేదాంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయన్ని సోమవారం మేఘాలయాకు తరలించనున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. డోంకుపర్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వంలో కీలకమైన మిత్రపక్షంగా వ్యవహరిస్తుంది. దీంతో ఆయన 2018లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. డోంకుపర్ రాయ్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘మేఘాలయ స్పీకర్‌గా, మాజీ ముఖ్యమంత్రిగా డోంకుపర్ రాయ్ విశేషమైన సేవలు అందించారు. అదేవిధంగా మేఘాలయ అభివృద్ధికి కృషి చేశారు. చాలా మందికి సాయం అందించి వారి జీవితాలను మార్చారు. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలుపుతున్నాన’ని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. అదేవిధంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కూడా డోంకుపర్ అకాల మరణం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తాము ఒక మంచి నాయకున్ని, మెంటర్ని కోల్పోయామని తెలిపారు. ఆయన ఎంతో మందికి అంకితభావంతో సేవ చేశారని పేర్కొన్నారు. దేవుడు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. -
‘సరిహద్దు’లో ఓటు యుద్ధం
ఎన్నికలొస్తున్నాయంటే రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాలకు అగ్ని పరీక్ష. ఆ గ్రామాలు ఎవరి కిందకి వస్తాయో కచ్చితమైన నిబంధనలు ఉండవు. ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతూ పంచాయితీలు పెడుతుంటారు. వజ్రాయుధం లాంటి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వారికి ఉండదు. అసోం – మేఘాలయా సరిహద్దుల్లోని లాంగ్‌టూరి గ్రామానికి చెందిన 150 మంది గరో అనే తెగకు చెందిన ప్రజలకు ఈసారి ఓటు హక్కు లభించలేదు. 1940 సంవత్సరం నుంచి వాళ్ల తల్లిదండ్రులు, తాత ముత్తాలు ఈ గ్రామంలోనే ఉంటున్నారు. కానీ ఇప్పటి వరకు వారికి ఓటు వేసే అవకాశం ఒక్కసారి కూడా రాలేదు. ఈ గ్రామం ఏ రాష్టం పరిధిలోకి వస్తుందన్న దానిపై ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అక్కడ ప్రజలు తమకు అసోంలో గౌహతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని బోకో అసెంబ్లీ పరిధిలో ఓటు హక్కు కల్పించాలని చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. ఈ గ్రామం గౌహతికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే కామరూప్ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఆఫ్ పోలీసు కమల్ కుమార్ బైశ్య ఈసారికి ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాలేదని, వచ్చే ఎన్నికల నాటికి తప్పక చేస్తామని అంటున్నారు. వారి ఆశ ఎప్పటికి తీరేనో మరి. -
ఇది న్యాయమేనా?!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మేఘాలయ హైకోర్టు ఒక దురదృష్టకర తీర్పు వెలువ రించింది. స్థానిక పత్రిక ‘షిల్లాంగ్ టైమ్స్’ సంపాదకురాలు పట్రిషియా ముఖిం, ప్రచురణకర్త శోభా చౌధురిలు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ కోర్టు సమయం ముగిసేవరకూ న్యాయ స్థానంలో ఒక మూల కూర్చోవాలని శిక్ష విధించడంతోపాటు ఇద్దరూ చెరో రెండు లక్షల రూపా యలూ జరిమానా చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించకపోతే ఆర్నెల్లు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఆ పత్రిక ముగిసిపోతుందని(నిషేధానికి గురవుతుందని) కూడా న్యాయస్థానం తేల్చిచెప్పింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఆరేళ్లక్రితం రిటైరైన జస్టిస్ శైలేంద్రకుమార్ 2010లో కోర్టు ధిక్కారం కింద శిక్షించే అధికారాన్ని దుర్వినియోగం చేయడం న్యాయమూర్తులకు రివాజుగా మారిందని వ్యాఖ్యానించారు. ఫలితంగా సరిగా ఆలోచించేవారికి, నమ్మినదానికి కట్టుబడి ఉండే సాహసికులకు ఇబ్బందులెదురవుతున్నా యని చెప్పారు. ఆయనే కాదు... వివిధ సందర్భాల్లో జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్, జస్టిస్ జేఎస్ వర్మ వంటి న్యాయకోవిదులు సైతం కోర్టు ధిక్కార నేరాన్ని న్యాయస్థానాలు అత్యంత జాగురూకతతో వినియోగించాలని హితవు పలికారు. న్యాయమూర్తుల పదవీ విరమణానంతరం వారికి అందా ల్సిన సదుపాయాలపై మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ‘షిల్లాంగ్ టైమ్స్’ పత్రిక రెండు కథనాలు ప్రచురించింది. ఈ విషయంలో పత్రికపై ఎలాంటి చర్య తీసుకోవాలో సూచించడానికి కోర్టు సహాయకులుగా నియమించిన న్యాయవాదులపై సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేశా రని, ఆ పోస్టుల్లో న్యాయవ్యవస్థను హేళన చేశారని ధర్మాసనం భావించింది. మీడియా స్వేచ్ఛ అంటే మీడియా సంస్థలు ఇష్టానుసారం రాసే స్వేచ్ఛ కాదు. జరిగిన ఉదంతాలను, మాట్లాడిన మాటలను వక్రీకరించే స్వేచ్ఛ అంతకన్నా కాదు. అది భావ ప్రకటనా స్వేచ్ఛకు పూచీ పడుతున్న రాజ్యాంగంలోని 19(1)(ఏ) ద్వారా ప్రజలకు సమకూరిన హక్కు. ఈ హక్కును దుర్వినియోగం చేస్తూ, అవాంఛనీయ పోకడలకు పోతూ ఇష్టానుసారం ప్రవర్తించే మీడియా సంస్థలు లేకపోలేదు. ప్రజలకు గల తెలుసుకునే హక్కును గుర్తించి, గౌరవించి దాన్ని బాధ్యతగా వినియోగించని మీడియా సంస్థలు ఎంతో కాలం మనుగడ సాగించలేవు. ఎప్పటి కప్పుడు లోటుపాట్లను సరిదిద్దుకుంటూ, విశ్వసనీయతను పెంచుకోవడానికి ప్రయత్నించని సంస్థలు మీడియాలో మాత్రమే కాదు...ఏ రంగంలోనూ నిలబడలేవు. అత్యధిక మీడియా సంస్థలు ఎన్నో పరిమితుల్లో శక్తివంచన లేకుండా తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో వాటికి రాజకీయ నాయకుల నుంచి, అవినీతి అధికారుల నుంచి, భూ కబ్జాదారులనుంచి, మాఫియా ముఠాల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. నిజాలు వెల్లడించినందుకు, ప్రజల్ని అప్రమత్తం చేసి నందుకు ఎందరో పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో అత్యంత ప్రధానమైన న్యాయవ్యవస్థ మీడియాకు అండగా నిలబడాలని అందరూ కోరుకుంటారు. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ భద్రంగా ఉండాలంటే ఇదెంతో అవసరం. కానీ మేఘాలయ హైకోర్టు వెలువరించిన తీర్పు దానికి విరుద్ధంగా ఉంది. ‘షిల్లాంగ్ టైమ్స్’ ప్రచురించిన మొదటి కథనం నిరుడు డిసెంబర్ 6 నాటిది. జస్టిస్ ఎస్ఆర్ సేన్ ఇచ్చిన ఆ తీర్పు రిటైరైన న్యాయమూర్తులకూ, వారి కుటుంబాలకు కల్పించాల్సిన సదుపాయాలు, భద్రతకు సంబంధించింది. ఆ వార్త తీర్పులోని అంశాలను యధాతథంగా ఇచ్చింది తప్ప ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు. అదే నెల 12న ప్రచురించిన రెండో కథనం సైతం ఆ కోవలోనిదే. ఆ సదుపాయాల జాబితాను ఇచ్చింది. రిటైరైన న్యాయమూర్తులకు ప్రొటోకాల్ అమలు, గెస్ట్‌హౌస్ సదుపాయం, వారి కుటుంబసభ్యులకు వైద్యసాయం, ఇంకా మొబైల్/ఇంటర్నెట్ చార్జీలు ఇవ్వడం వంటివన్నీ అందులో ఉన్నాయి. అంతక్రితం మరో ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చిన ఈ మాదిరి తీర్పును ఆ కథనం ప్రస్తావించింది. రిటైరైనవారికి జడ్ కేటగిరి, వై కేటగిరి భద్రత కల్పించాలని ఆదేశిస్తూ ఇచ్చిన ఆ తీర్పును గుర్తుచేసింది. మార్చి నెలలో జస్టిస్ ఎస్ఆర్ సేన్ రిటైర్ కాబో తున్నారని తెలిపింది. అంతేతప్ప ఆయనకు ఎలాంటి ఉద్దేశాలనూ ఆపాదించలేదు. రిటైర్ కాబో తున్నవారు ఇలాంటి తీర్పులివ్వడం చట్టవిరుద్ధమనిగానీ, అనుచితమనిగానీ అనలేదు. అయినా ఆ కథనంపై ముఖిం బేషరతుగా క్షమాపణలు చెప్పారు. శిక్షను తప్పించుకోవడానికే ఆమె క్షమాపణ కోరుతున్నారని న్యాయమూర్తి భావించారు. విశేషమేమంటే రిటైరైన న్యాయమూర్తులకు వై కేటగిరి, జడ్ కేటగిరి భద్రత కల్పించాలంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రిటైరైన న్యాయమూర్తులకు సాధారణ భద్రత సరిపోతుందని తేల్చిచెప్పింది. కోర్టు ధిక్కార చట్టం ఏ ఏ అంశాలు కోర్టు ధిక్కారం కిందికొస్తాయో చెబుతోంది. న్యాయ కార్యకలాపాలను సముచితమైన, ఖచ్చితమైన సమాచారంతో తెలిపినా... న్యాయస్థానం వెలువ రించిన తీర్పులోని యోగ్యతాయోగ్యతలపై సముచితమైన విమర్శ, వ్యాఖ్య చేసినా కోర్టు ధిక్కారం కిందకు రాదని చట్టం చెబుతోంది. దాని ప్రకారం తప్పుడు రాతలు, దురుద్దేశపూర్వకమైన రాతలు మాత్రం కోర్టు ధిక్కారమవుతాయి. ఎందుకంటే అవి న్యాయమూర్తుల ప్రవర్తనపై సంశయాలను కలిగిస్తాయి. అంతిమంగా దేశంలో న్యాయ పాలనకు విఘాతం కలిగిస్తాయి. కానీ ‘షిల్లాంగ్ టైమ్స్’ కథనాలు ఈ పరిధిలోకొస్తాయని అనుకోలేం. అవి తీర్పును తప్పుబట్టలేదు. వ్యక్తిగత ప్రయో జనాలు పొందేందుకే ఈ తీర్పునిచ్చారనలేదు. అయినా కోర్టు ధిక్కార చట్టం కింద చర్యలు తీసుకోవడం విచారకరం. ఈ విషయంలో ఎడిటర్స్ గిల్డ్, పాత్రికేయ సంఘాలు వ్యక్తం చేస్తున్న ఆందోళన సహేతుకమైనది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పత్రికాస్వేచ్ఛను పరి రక్షిస్తుందని ఆశిద్దాం. -
‘సరైన సమయంలో ఎన్డీయేను వీడుతాం’
షిల్లాంగ్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈశాన్య భారతంలో ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ బిల్లు-2016ను ఈశాన్య ప్రాంతంలోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో కొనసాగుతున్న పార్టీలు బిల్లుకు నిరసనగా బయటకు రావాలని యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధినేత కాన్రాడ్ సంగ్మా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్డీయేతో సంబంధాలు తెంచుకునేందుకు తగిన సమయంకోసం ఎదురుచుస్తున్నామని సంగ్మా అన్నారు. పౌరసత్వ బిల్లుకు రాజ్యసభలో తమ పార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆయన స్పష్టంచేశారు. మేఘాలయ అసెంబ్లీలో ఇద్దరు శాసన సభ్యులున్న బీజేపీ, ఇతర పార్టీల మద్దతుతో గత ఏడాది సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మేఘాలయతో పాటు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్పీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. మణిపూర్, అరుణాచల్ ప్రద్‌శ్‌లో బీజేపీకి సంగ్మా మద్దతు ప్రకటించడంతో అక్కడ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఎన్డీయే కూటమి నుంచి ఎన్పీపీ బయటకు వచ్చినట్లుయితే ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంది. మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్పీపీ అధికారంలోకి వచ్చేలా చక్రం తిప్పింది. బీజేపీ నుంచి విడిపోతే మేఘలయ తమకు ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు ఉందని సంగ్మా ఇదివరకు ప్రకటించారు. మరికొన్ని పార్టీలు కూడా బీజేపీని వీడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈశాన్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లును త్వరలోనే రాజ్యసభ ప్రవేశపెట్టనున్నారు. -
మేఘాలయ గనిలో మృతదేహం లభ్యం
న్యూఢిల్లీ/ షిల్లాంగ్: మేఘాలయలో బొగ్గు గనిలో చిక్కుకుపోయిన ఘటనలో ఎట్టకేలకు ఒకరి మృతదేహం లభ్యమైంది. దీంతో పాటు కొన్ని అస్థిపంజరాలను గుర్తించామని నేవీ ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ చెప్పారు. రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ (ఆర్వోవీ)కు అమర్చిన కెమెరాల సాయంతో బుధవారం రాత్రి మృతదేహాన్ని, గురువారం అస్థిపంజరాలను గుర్తించారు. గని లోపల దాదాపు 160 అడుగుల లోతులో మృతదేహాన్ని, 210 అడుగుల లోతులో అస్థిపంజరాలను గుర్తించినట్లు చెప్పారు. గతేడాది డిసెంబర్ 13న ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ బొగ్గు గనిలో 15 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. -
మేఘాలయలో తేలని కార్మికుల జాడ
షిల్లాంగ్: మేఘాలయలోని తూర్పు జైంతియా జిల్లాలో ఓ అక్రమ బొగ్గు గనిలో చిక్కుకున్న 15 మంది కార్మి కుల జాడ ఇంకా తెలియరావడం లేదు. అధికారులు శక్తిమంతమైన మోటార్ల సాయంతో ఇప్పటికే కోటి లీటర్ల నీటిని తోడేసినప్పటికీ 370 అడుగుల లోతున్న ఈ గనిలో నీటి మట్టం కొంచెం కూడా తగ్గలేదు. దీంతో పక్కనే ఉన్న గనుల నుంచి నీళ్లు వస్తుంటా యన్న అనుమానంతో వాటి నుంచి మరో 2 కోట్ల లీటర్ల నీటిని తోడేశారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. గతేడాది డిసెంబర్ 13న పక్కనే ఉన్న లైటన్‌నదిలోని నీరు గనిలోకి ఒక్కసారిగా పోటెత్తడంతో 15 మంది లోపల చిక్కుకు పోయారు. తాజాగా సుప్రీంకోర్టు పర్య వేక్షణలో సహాయక చర్యలు సాగుతున్నాయి. మరోవైపు కార్మికుల జాడను గుర్తించేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్), గ్రా విటీ అండ్ మాగ్నటిక్ గ్రూప్‌కు చెందిన నిపు ణులు ఆదివారం గని వద్దకు చేరుకున్నారు. వీరికి అదనంగా చెన్నైకు చెందిన నీటిలో ప్రయానించే రిమోట్ కంట్రోల్ వాహనంతో పాటు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ విషయమై సీఎస్ఐఆర్ నిపుణుడు దేవాశిష్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్ 20 నుంచి గనిలో నీటిని తోడేస్తున్నప్పటికీ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తమకు అంతుపట్టడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆర్మీ, నేవి, ఎన్డీఆర్ఎఫ్ సహా వేర్వేరు విభాగాలకు చెందిన 200 మంది నిపుణులు, సిబ్బంది కార్మికుల జాడ కనుగొనేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. -
‘ఏదైనా అద్భుతం జరగొచ్చు.. ప్రయత్నం మానకండి’
న్యూఢిల్లీ : మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లా బొగ్గు గనిలో చిక్కుకుపోయిన 15 మంది కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ‘మీ సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉండండి. ఏదైనా అద్భుతం జరిగి అందరూ లేదా వాళ్లలో కనీసం కొందరైనా బతికి ఉండొచ్చేమో’? అని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకోసం అవసరమైన నిపుణుల సహాయం కూడా తీసుకోవాల్సిందిగా సూచించింది. ఈ సందర్భంగా అక్రమంగా గనుల తవ్వకాలు చేపడుతున్న వారికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. అసలు అక్రమంగా గనులు తవ్వేందుకు ఎవరు అనుమతులు ఇస్తున్నారని న్యాయస్థానం మేఘాలయ అధికారులను ప్రశ్నించింది. అధిక శక్తి గల పంపుల ద్వారా గనిలో నుంచి ఇప్పటి వరకు 28 లక్షల లీటర్ల నీటిని బయటకు తోడినట్లు మేఘాలయ అధికారులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే.. దగ్గర్లో ఉన్న నది కారణంగా నీటి స్థాయిలు ఏమాత్రం తగ్గడం లేదని సహాయక చర్యలకు ఇది తీవ్ర ఆటంకంగా మారిందని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం నేవీ సిబ్బంది రిమోర్ట్‌లతో పని చేసే ఐదు వాహనాలతో రంగంలోకి దిగి నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అక్రమంగా గని తవ్వకం చేపట్టిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా అగ్నిమాపక దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, రాష్ట్ర అగ్నిమాపక దళంతో పాటు ఇతర కంపెనీలకు చెందిన సిబ్బంది కూడా నిరంతరం గని దగ్గర సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. డిసెంబరు 13న ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలో పలువురు కూలీలు అక్రమంగా బొగ్గు గని తవ్వేందుకు వెళ్లగా.. అదే సమయంలో వరదలు సంభవించి గనిలోకి నీరు చేరింది. అదృష్టవశాత్తూ ఐదుగురు కూలీలు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 15 మంది అందులో చిక్కుకుపోయారు. దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ వారి ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. కూలీల జాడ తెలుసుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. -
వందకోట్ల భారీ జరిమానా విధించిన ఎన్జీటీ..!
సిమ్లా: అక్రమ మైనింగ్‌ను ఆపలేకపోయిన కారణంగా మేఘాలయ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. ప్రభుత్వానికి 100 కోట్లు జరిమాన విధిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఏకే గోయల్ శనివారం తీర్పును వెలువరించారు. నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ లేకుండా మైనింగ్‌ను నిర్వహిస్తున్న కంపెనీలకు రద్దు చేయాలని 2014లో ఎన్జీటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం రాష్ట్రంలోని మైనింగ్ పరిశీలనకు పర్యటించిన కమిటీ ఈఏడాది జనవరి 2న ఎన్జీటీకి నివేదికను అందించింది. రాష్ట్రంలో 24వేలకు పైగా అక్రమ మైనింగ్ కంపెనీలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. అక్రమ మైనింగ్ కారణంగా నీరు, గాలి, వాతావరణం కాలుష్యానికి గురువుతోందని తీర్పులో పేర్కొన్నారు. రెండు నెలల్లోగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) వద్ద రూ.100 కోట్లు జమ చేయాలని గోయల్ ఆదేశించారు. మేఘాలయలోని బొగ్గు గనుల్లో ఇటీవల 15 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దట్టమైన చెట్లు ఉన్న కొండపై ఎలుక బొరియల్లా ఉండే గనుల్లో అక్రమంగా బొగ్గు తవ్వేందుకు కూలీలు లోపలికి వెళ్లారు. పక్కనే ప్రవహిస్తున్న లిటిల్ నది నీరు గనిలోకి ముంచెత్తడంతో కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం, అగ్నిమాపక దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్మికుల ఆచూకి ఇప్పటివరకు దొరకటేదు. -
ఇది వారికి జీవన్మరణ సమస్య : సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మేఘాలయాలోని ఓ బొగ్గు గనిలో గల్లంతైన 15 మంది కార్మికులను కాపాడటానికి జరుగుతన్న సహాయక చర్యలపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికులను కాపాడే విషయంలో ఆదిత్య ఎన్ ప్రసాద్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. కార్మికులను కాపాడటానికి ఆర్మీ సహాయం ఎందుకు తీసుకోలేదని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం మేఘాలయా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కార్మికులను కాపాడే విషయంలో ప్రతి క్షణం విలువైనదని.. ఇది వారికి జీవన్మరణ సమస్య అని ధర్మాసనం అభిప్రాయపడింది. గల్లంతైన వారిని బయటకు తీసుకురావడానికి విస్తృత చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంపై దృష్టి సారించాలని సోలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతాను కోరిన ధర్మాసనం.. కార్మికులను కాపాడటానికి ఏ రకమైన చర్యలు తీసుకున్నారో శుక్రవారం కోర్టుకు తెలియజేయాలని చెప్పింది. కార్మికులను కాపాడటానికి తీసుకున్న చర్యలు ఇంతవరకు ఎందుకు సఫలీకృతం కాలేదని మేఘాలయా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన మేఘాలయా తరఫు న్యాయవాది ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోల్ ఇండియా అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారని కోర్టుకు తెలిపారు. అయినా ఆ వివరణతో కోర్టు సంతృప్తి చెందలేదు. మేఘాలయలోని ఈస్ట్ జైంతా హిల్స్ జిల్లా లూమ్‌థారీ ప్రాంతంలోని ఓ అక్రమగనిలో డిసెంబర్ 13న ఈ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బొగ్గును వెలికితీస్తున్న క్రమంలో పక్కనే ఉన్న లైటైన్ నదీ ప్రవాహం గనిలోకి పోటెత్తింది. ఈ ఘటనలో 15 మంది లోపలే చిక్కుకోగా, ఐదుగురు మాత్రం ప్రవాహానికి ఎదురొడ్డి బయటపడగలిగారు. ప్రమాదం జరిగి 22 రోజులు కావస్తున్న గనిలో కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ప్రాణాలతో లేకున్నా.. కనీసం శవాలనైనా తీసుకురండి!
వాళ్లంతా నిరుపేదలు... మూటలు మోస్తూ, రిక్షా తొక్కుతూ జీవనం సాగించే సాధారణ కూలీలు... రోజంతా కష్టపడినా వంద రూపాయలకు మించి సంపాదించలేరు... అటువంటి అసహాయులకు ఒక్కరోజు కష్టానికే రూ. 2 వేల వేతనం చెల్లిస్తానంటూ ఆశ చూపాడో ఓ వ్యాపారి. అతడి మాటలు నమ్మిన ఆ బడుగు జీవులు తమ బతుకులు బాగుపడతాయని భావించారే తప్ప... తమ జీవితాలు ఇరుకైన ర్యాట్‌హోల్‌లో చిక్కుకొని ‘నీళ్ల’పాలు అవుతాయని ఊహించలేకపోయారు. 21 రోజులైనా సదరు బొగ్గు కార్మికుల జాడను కనుక్కోలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలిస్తే... ప్రాణాలతో కాకపోయినా సరే వారి చివరిచూపు దక్కినా తమకు కాస్త ఊరటగా ఉంటుందంటూ బాధితుల కుటుంబాలు రోదిస్తున్న తీరు మానవత్వమున్న ప్రతి ఒక్కరి మనస్సును ద్రవింపజేస్తోంది. జాడ ఇంకా తెలియరాలేదు మేఘాలయలోని జయంతియా కొండల్లోని తవ్వుతున్న అక్రమ గనిలో బొగ్గు వెలికి తీసేందుకు వెళ్లి గల్లంతైన 15 మంది కార్మికుల కోసం... 15 మంది గజ ఈతగాళ్ల బృందం, 10 శక్తివంతమైన కిర్లోస్కర్ మోటార్లు(నీటిని తోడే యంత్రాలు) అక్కడికి చేరుకుని ఇప్పటికి దాదాపు వారం రోజులైంది. అయినప్పటికీ వారి జాడ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. నేటివరకు (బుధవారం) ఆరుగంటలకోసారి 7.20 లక్షల లీటర్ల నీటిని తోడుతున్నామని రక్షణా బృందాల అధికార ప్రతినిధి తెలిపారు. గనిలో ఎండిపోయిన చెక్క నిర్మాణాలు అడ్డుగా ఉండటం వలన ఈతగాళ్లకు ఆటంకం కలుగుతోందని.. ఈ నేపథ్యంలో గురువారం నాటికి కోల్ ఇండియాకు చెందిన శక్తిమంతమైన సబ్మెర్సిబుల్ పంపులు అందుబాటులోకి తెచ్చి నిమిషానికి 500 గ్యాలన్ల చొప్పున నీటిని తోడి సహాయక చర్యలు వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులు.. యథావిధిగా అక్రమాలు జాతీయ బొగ్గు ఉత్పత్తిలో ఈశాన్య రాష్ట్రం మేఘాలయ వాటా పది శాతం. చాలా ఏళ్లుగా ఆ రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరు బొగ్గే. కానీ శాస్త్రీయత లోపించిన మైనింగ్ ప్రక్రియను చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకునేవరకూ తవ్వకాలు ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఉత్తర్వులివ్వడంతో చట్టబద్ధమైన కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అక్రమ మైనింగ్ వ్యాపారులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ బొగ్గు నిల్వలు బాగా లోతున నిక్షిప్తమై ఉండటంతో.. వాటిని వెలికి తీయ డానికి ఎలుక కలుగు(ర్యాట్‌హోల్స్)ను పోలిన గుంతను నిలువుగా తవ్వుతారు. బొగ్గు కనిపించాక అక్కడి నుంచి సొరంగాలు ఏర్పాటు చేసి బొగ్గు తీస్తారు. ఈ కలుగులన్నీ నదీ తీరానికి సమీపంలోనే ఉండటం వల్ల నదులు పొంగినప్పుడల్లా వీటిల్లోకి నీరు ప్రవేశిస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబరులో గనిలోకి భారీగా నీరు చేరడంతో.. అందులోకి దిగిన 90మంది సురక్షితంగా బయటకు రాగలిగారు గానీ 15మంది మాత్రం చిక్కుకు పోయారు. శవాలు దొరికినా చాలు.. ప్రస్తుతం గనిలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది పశ్చిమ గారో హిల్స్ జిల్లాకు చెందిన వారే. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి ఆ అక్రమ గనిలో ఇరుక్కున్న తన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ... ‘ ఆ గనికి చెందిన సర్దార్ నా కుమారుడు(18), సోదరుడు(35), అల్లుడి(26)కి పని ఇప్పిస్తానని చెప్పాడు. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల కూలీ వస్తుందని ఆశ చూపాడు. దాంతో వాళ్లు ఆ గనిలోకి దిగారు. ఐదురోజులపాటు అక్కడ పనిచేశారు. సురక్షితంగానే ఉన్నారు. కానీ ఆరో రోజు (డిసెంబరు 13) పనికి వెళ్లిన ఆ ముగ్గురు ఇంతవరకు తిరిగి రాలేదు. నా భార్య, కూతురు, ముగ్గురు మనుమలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడంలేదు’ అంటూ షోహర్ అలీ అనే వ్యక్తి తన కుటుంబ దుస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘కిరాయిలకు ఇళ్లు చూపించి రోజుకు 200 రూపాయలు సంపాదించే నేను.. 500 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్లు చిక్కుకున్న ఆ గని దగ్గరికి ఎలా వెళ్లగలను. నా దగ్గర ప్రస్తుతం మా అందరి తిండి ఖర్చులకు మాత్రమే డబ్బులు ఉన్నాయంటూ తన దీనస్థితిని మీడియాకు వెల్లడించాడు. క్రిష్ణ లింబూ అనే మరో వ్యక్తి మాట్లాడుతూ.. ‘మా బావ కూడా ఆ మృత్యు కుహరంలో చిక్కుకున్నాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప అతడు బతికి ఉండే అవకాశమే లేదు. అయితే కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు శవం దొరికినా చాలు. బాధిత కుటుంబాలకు వారి కొడుకులు, మనుమలు, భర్త, తండ్రి, సోదరుల కడసారి చూపైనా దక్కాలి కదా’ అంటూ ఆవేదన వెళ్లగక్కాడు. మైనింగ్ మాఫియా ధన దాహానికి వీరి కన్నీటి గాథ తాజా ఉదాహరణ మాత్రమే. ఏళ్లుగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్ కారణంగా వేలాది మంది కార్మికులు(ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం), నిజాయితీపరులైన కొంతమంది అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా ఎంతో బలవంతులైన మైనింగ్ మాఫియాను కట్టడి చేయాలని భావిస్తే రాజకీయంగా ముప్పు ఏర్పడుతుందనే భయంతో గత ప్రభుత్వాలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం వెనకుడుగు వేయడంతోనే అక్రమ వ్యాపారుల ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనేది బహిరంగ రహస్యమే. ఏదేమైనా ప్రభుత్వ వైఫల్యం, ఆకలి కష్టాలు వెరసి ఎంతోమంది కార్మికులు వీరి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీరిలో అత్యధికులు మైనర్లే కావడం మరింత విచారకరం. ప్రస్తుతానికైతే... ఏదో ఒక అద్భుతం జరిగి ఈ ర్యాట్‌హోల్‌లో బంధీలుగా ఉన్న కార్మికులు సురక్షితంగా బయటపడాలని ఆశిద్దాం. -
మేఘాలయలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
గనిలోకి గజ ఈతగాళ్లు
షిల్లాంగ్: మేఘాలయలోని గనిలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. విశాఖలోని నేవీ బేస్ నుంచి బయలుదేరిన 15 మంది గజ ఈతగాళ్ల బృందం శనివారం పశ్చిమ జైంతియా జిల్లా లుంథారి గ్రామ సమీపంలోని గని వద్దకు చేరుకుంది. వీరి వద్ద నీటి అడుగున శోధించే రిమోట్ వాహనాలు తదితర అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ఈ బృందానికి జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్) అధికారులు పరిస్థితి వివరించారు. అలాగే, భువనేశ్వర్ నుంచి బయలుదేరిన ఈతగాళ్ల బృందంతోపాటు 10 శక్తివంతమైన కిర్లోస్కర్ మోటార్లు కూడా గని వద్దకు చేరుకున్నాయని జిల్లా ఎస్పీ సిల్వెస్టర్ నోంగ్టింగర్ తెలిపారు. వీరంతా కలిసి 370 అడుగుల లోతున్న గనిలో గల్లంతైన కార్మికుల జాడ కనుక్కునే పనిలో నిమగ్నమై ఉన్నారన్నారు. లిటీన్ నది మధ్యలో ఉన్న చిన్న గుట్టపై ఓ ప్రైవేట్ కంపెనీ అక్రమంగా బొగ్గు గని నడుపుతోంది. ఈ నెల 13వ తేదీన నది వరద అకస్మాత్తుగా గనిలోకి ప్రవేశించడంతో బొగ్గు తవ్వుతున్న కార్మికులు 15 మంది అందులో చిక్కుకుపోయారు. గనిలోతు 370 అడుగుల లోతు ఉండగా నీరు 170 అడుగుల వరకు ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతంలో భూమికి 200 నుంచి 500 అడుగుల లోతులో బొగ్గు తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. బతికి ఉండేందుకు అవకాశమే లేదు గనిలోని కార్మికులు తప్పించుకుని వచ్చేందుకు మార్గం లేదని ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడిన సాహిబ్ అలీ అనే కార్మికుడు తెలిపాడు. ఇతనిది అస్సాంలోని చిరంగ్ జిల్లా. ఆ రోజు ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్న మిగతా నలుగురూ పశ్చిమ గారో జిల్లాలోని తమ సొంతూళ్లకు వెళ్లిపోయారని అలీ తెలిపాడు. ‘ప్రమాదం జరిగిన రోజు 22 మంది వరకు పనిలో ఉన్నాం. కేవలం ఒకే మనిషి కూర్చునేందుకు వీలుండే లోతైన గుంతల్లో చాలామంది బొగ్గు తవ్వుతున్నారు. ఉదయం 5 గంటలకే పని మొదలుపెట్టాం అయితే, 7 గంటల సమయంలో ఎన్నడూ లేనిది గనిలోకి కొత్త రకమైన గాలి వీచింది. కొద్దిసేపటికే పెద్ద శబ్దం చేస్తూ వరద నీరు గనిలోకి వెల్లువలా వచ్చింది. అతికష్టంమీద బయటకు రాగలిగా. ఆ రోజు ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్న నలుగురూ ఇనుప పెట్టెల్లో బొగ్గును నింపేవారే. గనిలో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడేందుకు దారి లేదు. నీటి అడుగున శ్వాస పీల్చకుండా ఎవరైనా ఎంతకాలం ఉండగలరు?. నాకు తెలిసినంత వరకు గనిలో 17 మంది వరకు చిక్కుకున్నారు. సంప్రదాయం ప్రకారం అంతిమ క్రియలు జరిపేందుకు వారి మృతదేహాలైనా దొరుకుతాయని నా ఆశ’ అని అలీ అన్నాడు. ర్యాట్‌హోల్‌లో రెక్కీ నేవీతోపాటు ఎన్డీఆర్ఎఫ్నకు చెందిన గజ ఈతగాళ్లు ప్రమాదం జరిగిన ర్యాట్ హోల్గా పిలిచే ఆ ఇరుకైన గని లోపలికి దిగి, నీటి మట్టం, కార్మికుల ఆచూకీ ఎలా కనుగొనాలనే విషయమై ఒక అంచనాకు వచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే ఈ బృందాలు తమ పనిని ప్రారంభిస్తాయని ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌కు చెందిన నిపుణులు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. వీరితోపాటు పంజాబ్‌కు చెందిన గని ప్రమాదాల నిపుణుడు జస్వంత్ సింగ్ గిల్ కూడా సాయంగా అక్కడికి వచ్చారు. శక్తివంతమైన కిర్లోస్కర్ మోటార్లతో నీటిని తోడే ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానుందని అధికారులు అంటున్నారు. కూలీల బతుకులు కూల్చింది సాహిబ్ అలీతోపాటు గని తవ్వకాల్లో పాల్గొంటున్న వారంతా నిరుపేదలు.. రిక్షా తొక్కుతూ, బరువులు మోస్తూ జీవనం సాగించేవారు. ఈ పనుల్లో సంపాదన కుటుంబపోషణకు సరిపోక కూలీ ఆశతో ప్రమాదకరమైన గని పనిలో చేరారు. అత్యంత ఇరుకైన, లోతైన గనిలో రోజంతా పనిచేస్తే రూ.2వేల వరకు చేతికందుతాయి. వేరే ప్రాంతాలకు చెందిన కార్మికులు రెండు మూడు వారాలపాటు ఈ పనిని కొనసాగించి, తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోతారు. గనిలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది పశ్చిమ గారో హిల్స్ జిల్లాకు చెందిన వారే. ఈ నెల 13వ తేదీన ప్రమాదం జరగ్గా గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 22వ తేదీన రూ.లక్ష చొప్పున తాత్కాలిక సాయం ప్రకటించింది. -
గని కార్మికుల గాలింపునకు విశాఖ నేవీ ఈతగాళ్లు
షిల్లాంగ్: మేఘాలయలోని ఓ అక్రమ బొగ్గు గనిలో గల్లంతైన 15 మంది కార్మికుల జాడ కనుక్కునేందుకు నేవీ గజ ఈతగాళ్లు రంగంలోకి దిగనున్నారు. పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని లుంథారి గ్రామం సమీపంలోని గనిలోకి ఈ నెల 13వ తేదీన నది వరద ప్రవేశించడంతో కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వీరి జాడ కనిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విశాఖలోని నేవీ విభాగానికి చెందిన 15 మంది గజ ఈతగాళ్ల బృందం శనివారం ఆ ప్రాంతానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. వీరి వద్ద అత్యాధునిక పరికరాలు ఉన్నాయని, సహాయ చర్యలపై నేవీ అధికారులు సమీక్ష జరిపారని వివరించారు. ఇదిలా ఉండగా, 37 అడుగుల లోతైన గని నుంచి నీటిని తోడి వేసేందుకు కిర్లోస్కర్ కంపెనీకి చెందిన 18 అతి శక్తివంతమైన మోటార్లను అక్కడికి పంపే ఏర్పాట్లుచేస్తున్నారు. దీంతోపాటు ఒడిశా అగ్ని మాపక శాఖకు చెందిన 20 మంది సభ్యులతో కూడిన రక్షక బృందం అత్యాధునిక పరికరాలతో ప్రయత్నిస్తోంది. -
మృత్యు కుహరంలో...
ఊరూ పేరులేని...తమకంటూ ఎలాంటి గుర్తింపూ లేని నిర్భాగ్యులు గత పక్షం రోజులుగా మేఘా లయలోని జయంతియా కొండల్లో తవ్వుతున్న అక్రమ గనిలో చిక్కుకున్న తీరు మన ప్రభుత్వాల సమర్థతను ప్రశ్నార్ధకం చేస్తోంది. ఆ అక్రమ గనిలో ప్రమాదం ముంచుకొచ్చే సమయానికి ఎందరు న్నారో, వారిలో ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారో ఎవరికీ తెలియదు. ఆ గని నిర్వాహకుడు చెబుతున్న ప్రకారమైతే 90మంది సురక్షితంగా బయటకు రాగలిగారు. 15మంది చిక్కుకు పోయారు. అక్రమ గనికి సమీపంలో ప్రవహించే లీతీన్ నది ఉప్పొంగి ఆ నీరంతా అందులోకి చేరిం దని అంటున్నారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా, మైనింగ్ పనిలో పాల్గొనేవారికి అవసరమైన రక్షణ ఉపకరణాలేవీ ఇవ్వకుండా అధికారుల అండతో సాగిస్తున్న ఈ దుర్మార్గం గురించి పర్యావరణవా దులు ఎన్నో ఏళ్లనుంచి పోరాడుతున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే పోయాయి. కనీసం వారి పిటిషన్లలో ఏముందో చదివి ఉన్నా ఇప్పుడు జరిగిన ప్రమాద తీవ్రత తెలిసేది. నీళ్లు తోడటానికి పక్షం రోజులుగా వినియోగిస్తున్న పంప్సెట్లు పనికిరావని ఇన్నాళ్లకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి, ప్రభుత్వానికి జ్ఞానోదయమైంది. ఆపరేషనంతా పూర్తయ్యేసరికి ప్రమా దంలో చిక్కుకున్నవారు ప్రాణాలతో ఉంటారా అన్నది అనుమానమే. మేఘాలయలో ఉన్న బొగ్గు నిక్షేపాల పరిమాణం 64 కోట్ల టన్నులకు మించి ఉంటుందని చెబుతున్నారు. జాతీయ బొగ్గు ఉత్పత్తిలో ఆ రాష్ట్రం వాటా పది శాతం. మొన్నటి వరకూ మేఘా లయ ప్రధాన ఆదాయ వనరు బొగ్గే. కానీ శాస్త్రీయత లోపించిన మైనింగ్ ప్రక్రియను చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకునేవరకూ మైనింగ్ ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఉత్తర్వులివ్వడంతో చట్టబద్ధమైన కార్యకలాపాలు నిలిచిపోయాయి. అక్రమ మైనింగ్ యధావిధిగా సాగుతోంది. మేఘాలయలో బొగ్గు నిల్వలు బాగా లోతున నిక్షిప్తమై ఉంటాయి. వాటిని వెలికి తీయ డానికి ఎలుక కలుగును పోలి ఉండేలా నిలువుగా తవ్వుతారు. బొగ్గు తారసపడ్డాక అక్కడినుంచి సొరంగాలు ఏర్పాటు చేసి బొగ్గు తీస్తారు. ఈ విధానం అశాస్త్రీయమైనదని, దీనివల్ల బొగ్గు వెలికి తీసేవారి ప్రాణాలకు ముప్పు కలగడంతోపాటు పర్యావరణం కూడా నాశనమవుతుందని పర్యావ రణవాదులు వాదిస్తున్నారు. ఈ కలుగులన్నీ నదీ తీరానికి సమీపంలోనే ఉండటం వల్ల వరద ముంచెత్తినప్పుడల్లా వీటిల్లోకి నీరు ప్రవేశిస్తోంది. 2007–14 మధ్య వీటిలో దాదాపు 15,000మంది మరణించి ఉంటారని ఇంపల్స్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. జయంతియా కొండలపై కురిసే వర్షాల వల్ల ఏర్పడ్డ నదులు క్షీణదశకు చేరుకుంటున్నాయి. ఎక్కడి కక్కడ గనుల్లో నీరు నిల్వ ఉండిపోవడమే ఇందుకు కారణం. పైగా వెలికి తీసిన బొగ్గును బయటే వదిలేయడం వల్ల నదీ జలాల్లో ఆమ్లాలు అధికమై అవి తాగడానికి, పంటలకు కూడా పనికి రాకుండా పోతున్నాయి. జనం ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇన్ని ప్రమాదాలు ఇమిడి ఉన్న మైనింగ్ చుట్టూ రాజకీయాలు పరిభ్రమించడం ఆశ్చర్యం కలిగి స్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్పీపీ–బీజేపీ కూటమిలోని పార్టీలు, గతంలో రాష్ట్రాన్నేలిన కాంగ్రెస్ కూడా మైనింగ్ యజమానులకు మద్దతుగానే నిలబడ్డాయి. మొన్న ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో పోటీచేసినవారిలో 30శాతంమంది గనుల యజమానులే. ఎన్జీటీ ఉత్తర్వుల వల్ల తమ జీవనాధారం దెబ్బతిన్నదని, వీటిని వెనక్కు తీసుకోవాలని మైనింగ్ యజమానులు ఉద్యమిస్తే అన్ని పార్టీలు వత్తాసు పలికాయి. పర్యావరణానికి మేం ఒక్కరమే హాని కలిగిస్తున్నామా అన్నది మైనింగ్ యజమానుల ప్రధాన ప్రశ్న! ఎన్జీటీ నిషేధాన్ని ఎత్తేయించడానికి మొన్న ఫిబ్రవరి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. అప్పటి ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడం వల్లే కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైం దని చెబుతారు. తాము అధికారంలోకొస్తే 8 నెలల్లో దీన్ని పరిష్కరిస్తామని బీజేపీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. ఆతర్వాత ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మంత్రులతో ఒక కమిటీని కూడా నియమిం చారు. అదెంతవరకూ వచ్చిందోగానీ ఈలోగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే వెలికి తీసిన బొగ్గు నిల్వల్ని అమ్మడానికి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అనుమతుల్ని వచ్చే జనవరి నెలాఖరు వరకూ పొడిగించింది. కానీ మైనింగ్ కార్యకలాపాలు చట్టవిరుద్ధంగా సాగిపోతూనే ఉన్నాయి. వాటి జోలికి పోతే రాజకీయంగా ముప్పు కలుగుతుందని పార్టీలన్నీ భయపడటంతో అధికారులు కూడా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. బొగ్గు మాఫియా ఎంత బలంగా పనిచేస్తున్నదో చెప్పడానికి 2015 లో జరిగిన ఎస్ఐ హత్యే ఉదాహరణ. చట్టవిరుద్ధంగా తరలుతున్న 32 బొగ్గు లారీలను పట్టుకున్నం దుకు మర్బనియాంగ్ అనే ఎస్ఐని మాఫియా కొట్టి చంపితే ఈనాటికీ అతీగతీ లేదు. ఆయన్ను హత్య చేశారని ఒక పోస్టుమార్టం నివేదిక చెప్పగా, మరో నివేదిక దాన్ని ఆత్మహత్యగా తేల్చింది. అక్రమ మైనింగ్ యాజమాన్యాల దుశ్చర్యలు అన్నీ ఇన్నీ కాదు. మైనింగ్ కలుగులన్నీ కేవలం ఒక మనిషి ప్రవేశించడానికి సరిపోయేంత ఇరుగ్గా ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరిని మాత్రమే లోపలికి పంపడానికి వీలుంటుంది. పైగా దృఢకాయులు పనికిరారు గనుక మైనర్ బాలల్ని ఎక్కు వగా ఇందుకోసం వినియోగిస్తారు. వీరు వందల అడుగుల లోతులకు వెళ్లి అక్కడ అడ్డంగా సొరంగం చేస్తూ బొగ్గు సేకరించాలి. ఈ పిల్లలకు ఒక్కొక్కరికి రోజుకు రూ. 1,000 నుంచి రూ. 2,000 ఇస్తారు. ఇదంతా తెలిసినా పట్టనట్టు వ్యవహరించిన పార్టీలు, ప్రభుత్వమూ కూడా ఈ పాపంలో భాగస్వాములు. చట్టవిరుద్ధమైన మైనింగ్‌ను ఆపలేకపోవడమే కాదు...కనీసం ప్రమా దంలో చిక్కుకున్నవారిని ఎలా కాపాడాలన్న అవగాహన కూడా లేకుండా విలువైన సమయాన్ని వృధా చేసిన పాలకుల తీరు క్షమార్హం కాదు. ఇప్పటికైనా మృత్యు కుహరాలను శాశ్వతంగా మూసేందుకు చర్యలు తీసుకోవాలి. -
మేఘాలయా గనిలో చిక్కుకున్న కార్మికులు
-
కిర్లోస్కర్ స్వచ్ఛంద సాయం
షిల్లాంగ్: మేఘాలయలోని బొగ్గుగనిలో రెండు వారాల కింద చిక్కుకున్న 15 మందిని రక్షించేందుకు కిర్లోస్కర్ సంస్థ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. ఆ గనిలోని నీటిని తోడేందుకు అవసరమైన 100 హెచ్‌పీ మోటార్లను తాము సమకూరుస్తామని తెలిపింది. గని వద్ద పరిస్థితులను అంచనా వేసి, వారిని కాపాడేందుకు కిర్లోస్కర్‌కు చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాగా, గని నుంచి నీటిని ఎంత తోడినా నీటి మట్టాలు తగ్గకపోవడంతో ఆ ప్రక్రియను అధికారులు శనివారం నిలిపేసిన విషయం తెలిసిందే. గనిలోని నీటిని తోడేందుకు రెండు 25 హెచ్‌పీ పంపులు సరిపోవట్లేదని, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న పంపులు కావాల్సిందిగా మేఘాలయ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్కే సింగ్ తెలిపారు. గని నుంచి దుర్గంధం వెలువడుతుండటంతో గనిలో చిక్కుకున్న వారు చనిపోయి ఉండొచ్చన్న మీడియా కథనాలను ఎన్డీఆర్ఎఫ్ ఖండించింది. వారిని రక్షించే చర్యలు చేపడుతున్న గువాహటిలోని ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మైనర్లు చనిపోయి ఉంటారని, వారి దేహాలు కుళ్లిపోవడం ప్రారంభమైందని తాను చెప్పినట్లు వస్తున్న కథనాలను ఎస్కే సింగ్ తప్పుపట్టారు. 48 గంటలుగా నీటిని తోడే ప్రక్రియ నిలిచిపోవడంతో గనిలో నిలిచిపోయిన నీటి వల్ల ఆ దుర్గంధం వస్తుందని స్పష్టం చేశారు. చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కృషిచేస్తున్నాయన్నారు. -
14 రోజులుగా బొగ్గు గనిలోనే 15 మంది..
న్యూఢిల్లీ: మేఘాలయలోని ఓ బొగ్గు గనిలో గత 14 రోజులుగా చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఇంకా తెలియరావడం లేదు. గనిలో నీటి ఉధృతి కారణంగా సహాయక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారు. మరోవైపు బొగ్గుగనిలోని నీటిని తోడేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గనిలోని నీటిని బయటకు పంప్ చేయడానికి హైపవర్ సబ్ మెర్సిబుల్ పంపులు కావాలని అధికారులు కోరినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకూ ఓ నిర్ణయం తీసుకోలేదు. దీంతో గనిలోని కార్మికుల ప్రాణాలపై వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మేఘాలయలోని ఈస్ట్ జైంతా హిల్స్ జిల్లా లూమ్‌థారీ ప్రాంతంలోని ఓ అక్రమగనిలో డిసెంబర్ 13న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గును వెలికితీస్తున్న క్రమంలో పక్కనే ఉన్న లైటైన్ నదీ ప్రవాహం గనిలోకి పోటెత్తింది. ఈ ఘటనలో 15 మంది లోపలే చిక్కుకోగా, ఐదుగురు మాత్రం ప్రవాహానికి ఎదురొడ్డి బయటపడగలిగారు. పంపులపై బదులేది? సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కమాండెంట్ ఎస్కే శాస్త్రి ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..‘గనిలోని నీటిని తోడేసేందుకు కనీసం వంద హార్స్పవర్ ఉన్న 10 మోటార్ పంపులు కావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మేం కేంద్రానికి లేఖ రాసినా ఇంతవరకూ జవాబు రాలేదు. మా దగ్గర ప్రస్తుతం 25 హార్స్పవర్ సామర్థ్యం ఉన్న రెండు పంపులు మాత్రమే ఉన్నాయి. దాదాపు 370 అడుగులు ఉన్న ఈ గని మధ్యలో 70 అడుగుల మేర నీరు చేరుకుంది. ఈ నీటిని తొలగిస్తేనే జాతీయ విపత్తు సహాయక బృందం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది లోపలకు పోగలరు. మేం గనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ నీటి ఉధృతి కారణంగా కుదరలేదు’ అని తెలిపారు. గని కార్మికుడొకరు బొగ్గును వెలికితీసే క్రమంలో గోడపై బలంగా కొట్టడంతో గనిలోకి లైటైన్ నది నీరు పోటెత్తి ఉంటుందని శాస్త్రి చెప్పారు. ‘ర్యాట్ హోల్’ తవ్వకం తాజాగా కార్మికులు చిక్కుకున్న బొగ్గు గనిని ర్యాట్ హోల్ పద్ధతిలో తవ్వారు. ఈ విధానంలో తొలుత చిన్న పరిమాణంలో గుంతలను నిట్టనిలువుగా బొగ్గు కనిపించేవరకూ తవ్వుతారు. అనంతరం సన్నటి దారుల ద్వారా బొగ్గును పైకి తీసుకొస్తారు. అయితే ఈ విధానంలో పర్యావరణానికి నష్టం జరుగుతుండటం, కార్మికుల ప్రాణానికి ముప్పు ఉండటంతో మేఘాలయలో 2014లో ఈ ర్యాట్ హోల్ పద్ధతిని నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈస్ట్ జైంతా హిల్స్‌లో గని ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంపై మేఘాలయ ముఖ్యమంత్రి కన్రడ్.కె.సంగ్మా స్పందిస్తూ..‘కాలం వేగంగా కరిగిపోతోంది. పదిహేను మంది కార్మికులను రక్షించడానికి హైపవర్ సబ్మెర్సిబుల్ పంపులను ఇవ్వాలని కోల్ ఇండియాను కోరాం. వాళ్లు వీలైనంత త్వరగా సాయం చేస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు. ఈ గనిలోకి కార్మికులను పనికి దింపిన ఓ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న యజమాని కోసం గాలింపు జరుపుతున్నారు. ఫొటోలకు పోజులా? గని కార్మికులు చిక్కుకుపోయిన ఘటనపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. 15 మంది కార్మికులు బొగ్గుగనిలో చిక్కుకుంటే ప్రధాని మోదీ మాత్రం అస్సాంలోని బోగీబీల్ వంతెనపై ఫొటోలకు పోజులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఓవైపు మేఘాలయలో 15 మంది కార్మికులు వరద నీటితో నిండిపోయిన గనిలో చిక్కుకుని శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రధాని మాత్రం బోగీబీల్ వంతెనపై కెమెరాలకు ఫోజులు ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వం హై ప్రెజరైజ్డ్ మోటార్ పంపులను అందించేం దుకు నిరాకరిస్తోంది. మోదీజీ.. దయచేసి ఈ కార్మికులను కాపాడండి’ అని ట్వీట్ చేశారు. -
‘ఫోటోలకు ఫోజులు ఆపి ఆ మైనర్లను కాపాడండి’
సాక్షి, న్యూఢిల్లీ : మేఘాలయాలో బొగ్గు గనుల్లో చిక్కుకుపోయిన 13 మందిని రక్షించే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 13 నుంచి గనుల్లో చిక్కుకున్న మైనర్లను రక్షించేందుకు సహాయ చర్యల కోసం ప్రభుత్వం హై ప్రెజర్ పంప్‌లను సమకూర్చలేదని ఆరోపించారు. మేఘాలయలో అక్రమంగా నిర్వహిస్తున్న గనిలో పోటెత్తిన వరదల్లో చిక్కుకుని 13మంది కార్మికులు గల్లంతైన సంగతి తెలిసిందే. బ్రహ్మపుత్ర నదిపై పొరుగున ఉన్న అసోంలో బోగీబీల్ బ్రిడ్జిపై ఫోజులు ఇచ్చే బదులు బొగ్గుగనిలో ఊపిరాడక సతమతమవుతున్న 13 మందిని కాపాడాలని రాహుల్ ట్వీట్ చేశారు. పరికరాలు లేకపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్న 15 మంది మైనర్లను రక్షించే ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లాలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు సరిపడా పోలీసు బలగాలు లేవని మేఘాలయా హోం శాఖకు చెందిన సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. -
దిమ్మతిరిగిపోయే హైకోర్టు తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : ‘హిందువులంతా సహజంగానే భారత పౌరులు’ అనే ఆరెస్సెస్ నినాదాన్ని పునరుద్ఘాటిస్తూ మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఆర్ సేన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి దిమ్మతిరిగిపోయే తీర్పును వెలువరించారు. ‘2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ బిల్లు ప్రకారం దేశంలోని హిందువులు, సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు, పార్శీలు, క్రైస్తవులు, ఖాసీలు, జెంటియాలు, గారోలులకు భారత పౌరసత్వం మంజూరు చేయండి’ అంటూ తీర్పు చెప్పారు. ఇప్పటికే భారత్‌లో శాశ్వత నివాసం ఉంటున్న వీరికే కాకుండా భవిష్యత్తులో భారత్‌కు వచ్చే ఈ జాతులకు చెందిన వారందరికి భారత పౌరసత్వం మంజూరు చేయాల్సిందేనన్నారు. వీరంతా కూడా హిందువుల కిందకే వస్తారని పరోక్షంగా చెప్పారు. బహూశ హిందూ ఓ మతం కాదని, అది ఓ జీవన విధానమన్న బీజేపీ విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఆదేశాలు జారీ చేసినట్లున్నారు. ఆ మాటకొస్తే ఆరెస్సెస్ చెప్పే చరిత్ర ప్రకారం ‘అఖండ్ భారత్’ అంటే అఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు కూడా వస్తాయని అన్నారు. ఆ మాటకొస్తే ఆ దేశాల పౌరులకు కూడా పౌరసత్వం మంజూరు చేయాల్సి ఉంటుందన్న హెచ్చరిక కాబోలు! అంతేకాకుండా తానిచ్చిన ఈ తీర్పు ప్రతిని ప్రధాన మంత్రి, కేంద్ర న్యాయ, హోం మంత్రులకు కూడా పంపించాలని సూచించారు. తాము పుట్టిన నేల, తాము పూర్వికులు నమ్ముకున్న నేల భారత్ అయినప్పుడు అందరికి పౌరసత్వం ఇవ్వాల్సిందేనని జస్టిస్ సేన్ చెప్పారు. ఈ దేశం నుంచి పాకిస్థాన్ మతం ప్రాతిపదికన విడిపోయి ఇస్లామిక్ రాజ్యాంగ ప్రకటించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ అప్పుడే భారత్ కూడా తమది ‘హిందూ’ రాజ్యమని ప్రకటించుకొని ఉండాల్సిందని, లౌకిక రాజ్యం కనుక భారత్‌లోని అన్ని మతాల వారికి పౌరసత్వ హక్కు ఉంటుందన్నారు. భారత గడ్డపై స్థిర నివాసం ఏర్పరుచుకొని, భారతీయ చట్టాలను గౌరవిస్తున్న ముస్లింలకు కూడా పౌరసత్వం ఇవ్వాల్సిందేనన్నారు. 2016లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలోని ముస్లిం మతస్థుల ప్రస్తావన కూడా లేని విషయాన్ని ఆయన దష్టిలో పెట్టుకున్నట్లుంది. భారతీయ పౌరులెవరో తేల్చడానికి అస్సాంలో సవరించిన పౌరసత్వ జాబితాలో గల్లంతయిన 40 లక్షల మందికి కూడా పౌరసత్వం ఇవ్వాల్సిందేనని జస్టిస్ సేన్ పరోక్షంగా సూచించారు. బంగ్లా ముస్లింలుగా భావిస్తున్న వారంతా బెంగాల్ నుంచి వచ్చినవాల్లేనని, బెంగాల్ పలు సార్లు హింసాకాండతో విడిపోయిందని, ఫలితంగా శరణార్థులు భారత్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన చరిత్ర పుటల్లోని పలు అంశాలను ప్రస్తావించారు. అస్సాం దురాక్రమణ గురించి, బెంగాల్ విభజన, బంగ్లాదేశ్ యుద్ధం తదితర అనేక అంశాలను ఆయన గుర్తు చేశారు. చరిత్రకు సంబంధించి కోర్టు నియమించిన కమిటీలు సమర్పించిన వివిధ నివేదికల్లోని అంశాలను ప్రస్తావించారు. పాకిస్థాన్ విడిపోయినప్పుడు భారత్ తనది ‘హిందూ’ దేశంగా ప్రకటించుకొని ఉండాల్సిందన్న సేన్ వ్యాఖ్యలపై సీపీఎం నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ జడ్జీని తొలగించాల్సిందిగా డిమాండ్ చేసింది. దీనిపై కూడా జస్టిస్ సేన్ స్పందిస్తూ ‘నేను లౌకిక వాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాను. మత పరమైన వేధింపులకు, దాడులకు గురైన వారికి న్యాయం జరగాలన్నదే నా అభిమతం’ అని చెప్పారు. -
గనిలో చిక్కుకున్న 13 మంది
లుమ్‌థారి: మేఘాలయలో అక్రమంగా నిర్వహిస్తున్న గనిలో పోటెత్తిన వరదల్లో చిక్కుకుని 13 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుంది. వర్షానికి గని సొరంగ మార్గం కుప్పకూలడంతో వారు నీటిలో కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం గురించి తెలియగానే జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు, రాష్ట్ర విపత్తు సహాయక బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. పంపులతో నీటిని బయటకు తోడుతున్నారు. అయినా గల్లంతైన వారి జాడ తెలియరాలేదు. వారు బతికి ఉండే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు. 370 అడుగుల లోతున్న ఆ గనిలో 70 అడుగుల వరకు నీరు చేరినట్లు పోలీసులు తెలిపారు. నీటి ఉధృతి తగ్గకపోతే మరో రెండు పంపుల్ని వినియోగించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే గజ ఈతగాళ్ల సాయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, వరదలు ప్రారంభమైనప్పుడు గని నుంచి ఐదుగురు బయటికి రావడం చూశామని స్థానికులు చెప్పారు. కానీ, ఆ ఐదుగురి జాడ తెలియరాలేదు. అక్రమంగా గనిని నిర్వహిస్తున్న యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారు. -
ఈశాన్య భారతంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ
-
ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం..
కోల్‌కతా: అస్సాం, మేఘాలయ, బిహార్, జార్ఖండ్ సహా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. ఉదయం 10.20 సమయంలో పలు ప్రాంతాల్లో 15 నుంచి 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. అస్సాంలోని కోక్రాఘర్ పట్టణానికి వాయవ్య దిశలో రెండు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూఉపరితలానికి 10 కి.మీ లోతులో భూమి కంపించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. -
ఉప ఎన్నికలు: 8400 ఆధిక్యంతో సీఎం గెలుపు
షిల్లాంగ్ : మేఘాలయ సీఎం, పాలక నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) చీఫ్ కన్రాడ్ కే సంగ్మా దక్షిణ తురా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చార్లెట్ మొమిన్‌పై 8400 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పోలయిన ఓట్లలో సంగ్మాకు 13,656 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి మొమిన్‌కు 8421 ఓట్లు దక్కాయని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎఫ్ఆర్ కర్కోంగర్ వెల్లడించారు. సంగ్మా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఈ స్ధానం నుంచి ముఖ్యమంత్రి సోదరి, మాజీ కేంద్ర మంత్రి అగత సంగ్మా రాజీనామా చేశారు. 60 మంది సభ్యులు కలిగిన మేఘాలయా అసెంబ్లీలో తాజా గెలుపుతో పాలక ఎన్పీపీ సంఖ్యాబలం విపక్ష కాంగ్రెస్‌తో సమానంగా 20కి చేరుకుంది. ఆరు పార్టీలతో కూడిన మేఘాలయా డెమొక్రాటిక్ అలయన్స్(ఎండీఏ) ప్రభుత్వానికి ఎన్పీపీ నేతృత్వం వహిస్తోంది.ఇక రాణికోర్ ఉప ఎన్నికలో యునైటెడ్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి పియోస్ మార్విన్ 3,390 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. -
అస్సాంలో చిచ్చు.. మేఘాలయలో మంట
సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంలో సంక్షోభం సష్టించిన ‘ఎన్ఆర్సీ’ పౌరసత్వ జాబితా ఇప్పుడు సరిహద్దులోని మేఘాలయలో ప్రకంపనలు సష్టిస్తోంది. అస్సాం పౌరసత్వ జాబితాలో దాదాపు 40 లక్షల మంది గల్లంతయిన నేపథ్యంలో వారంతా తమ రాష్ట్రంలోకి అక్రమంగా తరలి వచ్చి స్థిరపడుతారన్న ఆందోళన మేఘాలయ పౌరుల్లో మొదలయింది. ముఖ్యంగా రాష్ట్ర ఆదిమ తెగ ఖాసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల సంఘం రంగంలోకి దిగి సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. తూర్పు జెంటియా హిల్స్ జిల్లా, పశ్చిమ ఖాసి హిల్స్ జిల్లా, రైబోయి జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఖాసి విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి డొనాల్డ్ వి. తాబా మీడియాకు తెలిపారు. అస్సాంలోని బారక్ వ్యాలీ జిల్లాల వాసులు తమ రాష్ట్ర రాజధాని గువాహటి వెళ్లాలంటే మేఘాలయ మీదుగా వెళుతారు. ఇది వారికి చాలా దగ్గరి దారి. అస్సాం నుంచి మేఘాలయలోకి వివిధ వాహనాల్లో వస్తున్న వారందరిని ఈ చెక్‌పోస్టుల వద్ద నిలిపేసి గుర్తింపు కార్డులను, ఇతర డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా మూడు రోజుల క్రితం విడుదల చేసిన అస్సాం పౌరసత్వ జాబితాలో పేర్లున్నాయా, లేవా? అని ప్రశ్నిస్తున్నారు. లేవంటే వెనక్కి పంపిస్తున్నారు. ఉన్నాయంటే అందుకు రుజువులు చూపించమని అడుగుతున్నారు. వెనక్కి పంపించే క్రమంలో కొన్ని చోట్ల గొడవలు కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. ఖాసి విద్యార్థులు పలువురు అస్సామీలను చితకబాదినట్లు ఫిర్యాదులు అందాయి. ఖాసి కమ్యూనిటీకి చెందిన ప్రజలు గత జూన్ నెలలోనే ఓ చిన్న వివాదాన్ని పురస్కరించుకొని మొత్తం సిక్కులను తమ రాష్ట్రం నుంచి పంపించేయడంటూ ఆందోళనలు నిర్వహించడం, ఆ సందర్భంగా విధ్వంసకాండ చెలరేగడం తెల్సిందే. పంజాబ్ నుంచి సిక్కులు అక్రమంగా వలస రావడం వల్ల తమ ఉపాధి, విద్యావకాశాలను వారే తన్నుకుపోతున్నారని వారి ఆరోపణ. బంగ్లా దేశీయులకు వర్క్ పర్మిట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీకే సంగ్మా ప్రయత్నించినప్పుడు కూడా వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో అస్సాం సమస్య తమ పీకల మీదకు వచ్చిందని వారు భావిస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లే ని అస్సాం ప్రయాణికులను దౌర్జన్యంగా వెనక్కి పంపిస్తున్నారు. అక్కడక్కడ దౌర్జన్య సంఘటనలు జరిగిన మాట వాస్తవమేనని, ఇక ముందు అలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకున్నామని మేఘాలయ హోం మంత్రి జేమ్స్ సంగ్మా తెలిపారు. అక్రమ వలసలను నిరోధించే పోలీసులతో రాష్ట్ర ప్రభుత్వమే చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిందని విద్యార్థులు వారికి సహకరిస్తున్నారని ఆయన వివరించారు. పోలీసులు, జిల్లా అధికారుల సహకారంతోనే తాము చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నామని విద్యార్థులు తెలియజేశారు. తన నియోజక వర్గానికి చెందిన ప్రయాణికులు మేఘాలయలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని, ప్రయాణికులకుండే స్వేచ్ఛను హరించడమే కాకుండా చితక బాదుతున్నారంటూ అస్సాంలోని సిల్చార్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ కేంద్ర హోం మంది రాజ్‌నాథ్ సింగ్‌కు ఓ లేఖ రాశారు. చదవండి: అమిత్ షా మాటల్లో మర్మమేమిటీ? ఫక్రుద్దీన్ ఫ్యామిలీ కూడా పరాయివారేనా! ‘అసోం’లో అసలు ఏం జరుగుతోంది? -
మేఘాలయ యుగం!
కృత, త్రేతా, ద్వాపర, కలియుగాల గురించి విని ఉంటారు... ఇవన్నీ హిందూ మత విశ్వాసాలకు సంబంధించినవి.. మరి ఆధునిక సైన్స్ ఏం చెబుతోంది? గతం గురించి కాకపోయినా.. ఇటీవలి కాలం మాత్రం మేఘాలయ యుగానిదంటోంది! ఎందుకలా? సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టిందని శాస్త్రవేత్తల అంచనా. అప్పటి నుంచి ఇప్పటివరకూ బోలెడన్ని ముఖ్యమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. జీవం పుట్టుక మొదలుకొని.. వేర్వేరు కారణాలతో జీవజాతులు దాదాపుగా అంతరించిపోవడం వరకూ ఉన్న ఈ ఘటనల ఆధారంగా శాస్త్రవేత్తలు భూమి చరిత్ర మొత్తాన్ని కొన్ని యుగాలుగా విడదీశారు. స్థూలంగా పాలియోజోయిక్, మెసోజోయిక్, సెనోజోయిక్ అనే మూడు భాగాలు ఉంటే.. మళ్లీ ఒక్కోదాంట్లో ఉప విభాగాలూ ఉన్నాయి. ఈ విభజన ప్రకారం మనం ప్రస్తుతం సెనోజోయిక్ భాగంలోని హాలోసీన్ యుగంలో ఉన్నాం! ఒకప్పుడు మంచుముద్దగా ఉన్న భూమిపై అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని.. ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయన్న ఘటనకు పెట్టిన పేరిది. సుమారు 11,700 ఏళ్ల చరిత్ర ఉంది హాలోసీన్కు. అయితే ఈ మధ్య కాలంలో పురాతత్వ శాస్త్రవేత్తలకు మేఘాలయలో లభ్యమైన కొన్ని ఆధారాలు మొత్తం చరిత్రను మలుపు తిప్పేవే. దీంతో 4,200 ఏళ్ల క్రితం నుంచి ఇటీవల ఉన్న కాలాన్ని.. కచ్చితంగా చెప్పాలంటే 1950 వరకూ ఉన్న కాలాన్ని ‘‘మేఘాలయ యుగం’’అని పేరు పెట్టాలని శాస్త్రవేత్తలు తీర్మానించారు. – సాక్షి, హైదరాబాద్ నాగరికతలను మింగేసిన కరువు మొదలైంది అప్పుడే... హరప్పన్ నాగరికత అంతరించి పోయిందెలా? దశాబ్దాల కరువని సైన్స్ చెబుతోంది! మరి దక్షిణ అమెరికాలోని మాయన్ నాగరికత మాటేమిటి? అవి కూడా కరువు కాటకాలతోనే కానరాకుండా పోయాయి. పర్షియా ప్రాంతపు సుమేరియన్, ఈజిప్టులోని నైలు నదీ నాగరికతల పరిస్థితి కూడా ఇంతే. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ నాగరికతలన్నీ సుమారు 4,200 ఏళ్లకు కొంచెం అటు ఇటుగా అంతరించిపోవడం. మేఘాలయలోని ఒక రకమైన రాయి (స్టాల్గమేట్)తో కూడిన గుహల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపినప్పుడు ఆ కాలం నాటి గుర్తులు కొన్ని రసాయనాల రూపంలో బయటపడ్డాయి. కరువు కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావం ఈ రాళ్లలో కనిపించింది. నాగరికతలు అంతరించిపోవడమన్నది భూమి చరిత్రలో కీలకమైన ఘట్టం కాబట్టి.. అందుకు ఆధారాలు లభించిన ప్రాంతం మేఘాలయ ఆధారంగా దీన్ని కొత్త యుగంగా గుర్తించాలని ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రఫీ అనే సంస్థ ప్రతిపాదించింది. హాలోసీన్ యుగంలో కొంత భాగాన్ని నార్త్‌గ్రిప్పియన్ యుగంగానూ.. మిగిలిన భాగాన్ని మేఘాలియన్ యుగంగానూ గుర్తించాలన్న ఈ సంస్థ ప్రతిపాదనను ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియలాజికల్ సైన్సెస్ ఆమోదించాల్సి ఉంది. -
షిల్లాంగ్‌లో మళ్లీ ఘర్షణలు.. ఆర్మీ ఫ్లాగ్ మార్చ్
షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. షిల్లాంగ్‌లో విధించిన కర్ఫ్యూను భద్రతాబలగాలు ఆదివారం 8 గంటల పాటు ఎత్తివేయడంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు మావ్‌లైలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో అధికారులు మళ్లీ కర్ఫ్యూను విధించారు. మరోవైపు సోమవారం షిల్లాంగ్‌కు చేరుకున్న ఆర్మీ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించింది. స్థానిక గిరిజన తెగ ప్రజలకు, ఇక్కడే స్థిరపడ్డ పంజాబీలకు మధ్య గొడవ జరగడంతో గత ఐదు రోజులుగా నగరం అట్టుడుకుతోంది. కాగా, షిల్లాంగ్‌లో శాంతిభద్రతల్ని పరిరక్షించేందుకు 1,500 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనికి అదనంగా కేంద్రం మరో 10 కంపెనీల పారామిలటరీ బలగాలను పంపిందన్నారు. అల్లర్లను రెచ్చగొట్టేందుకు దాదాపు 500 మంది దుండగులు నగరంలోకి ప్రవేశించారన్న నిఘావర్గాల హెచ్చరికతోనే కర్ఫ్యూను పునరుద్ధరించినట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన సీఎం కన్రాడ్ సంగ్మా.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఓ కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో మేఘాలయకు వచ్చిన ప్రతినిధుల బృందానికి వాస్తవ పరిస్థితిని తెలిపామన్నారు. కాగా, ఈ ఘర్షణలపై విచారణకు తమ ప్రతినిధి మన్జిత్సింగ్ రాయ్‌ను పంపిస్తున్నట్లు జాతీయ మైనారిటీ కమిషన్ ప్రకటించింది. -
షిల్లాంగ్ ఎందుకు మండుతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : ‘పంజాబీ బృందం ఇద్దరు ఖాసీ బాలల తలలు నరికారు’ అంటూ గురువారం రాత్రి వాట్సాప్‌లో నకిలీ వార్త ప్రచారం కావడంతో షిల్లాంగ్‌లోని పంజాబీ లైన్ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖాసీ (అగ్రవర్ణ కులం) వర్గానికి చెందిన కొంత మంది యువకులు పంజాబీ లైన్ లేదా స్వీపర్స్ కాలనీ సమీపంలో గుమిగూడారు. అప్పటికే అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ పోలీసులతో ఘర్షణకు దిగారు. గుంపులో నుంచి ఓ యువకుడు ఇనుప రాడ్‌తో కొట్టడంతో పోలీసు సూపరింటెండెంట్ స్టీపెన్ రింజా తీవ్రంగా గాయపడ్డారు. ఆ అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువు గోళాలను ప్రయోగించారు. పంజాబీ కాలనీ, పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు, ఆ తర్వాత కర్ఫ్యూ విధించారు. నేటికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాంతో కాలనీని విడిచి దాదాపు 500 మంది దళిత సిక్కులు పిల్లా పాపలతో సమీపంలోని గురుద్వార్‌లో తలదాచుకుంటున్నారు. అక్కడి కమ్యూనిటీ కిచెన్‌లో వంటచేసుకొని అక్కడే కాలం గడుపుతున్నారు. గురవారం ఉదయం జరిగిన ఓ సంఘటన ఇంతటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మేఘాలయ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సును ఎక్కడ పార్క్ చేయాలనే విషయమై బస్సు డ్రైవర్, కొంత మంది పంజాబీ మహిళలకు మధ్య గొడవ జరిగింది. మహిళల తరపున వచ్చిన ఓ పంజాబీ యువకుడు బస్సు డ్రైవర్‌పై, అందులోని ఇద్దరు ప్రయాణికులపై చేయి చేసుకున్నారు. ఈ సంఘటనలో కంటోన్మెంట్ బోర్డు పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసులు ఆ పంజాబీ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. ‘సిక్కు మహిళల పట్ల మాకు ఎలాంటి కాఠిన్యం లేదు. దాడి చేసిన యువకుడి పట్ల ద్వేషమూ లేదు. మా గాయాల చికిత్స కోసం మాకు నాలుగు వేల రూపాయలను నష్టపరిహారంగా కూడా వారు చెల్లించారు’ అంటూ బస్సు డ్రైవర్ స్వయంగా రాజీ పత్రాన్ని రాసిచ్చారు. గురుద్వార్‌లో తలదాచుంటున్న మహిళలు ‘పంజాబీ బృందం ఇద్దరు ఖాసీ బాలల తలలు నరికారు’ అంటూ అదే రోజు రాత్రి వాట్సప్‌లో వచ్చిన ఫేక్ న్యూస్ ఒక్కసారిగా కలకలం రేపింది. శుక్రవారం రాత్రి పంజాబీ కాలనీ పరిసర ప్రాంతాల్లో, ఖాసీలు ఎక్కువగా ఉన్న షిల్లాంగ్ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సైన్యం కవాతు కూడా నిర్వహించింది. తరతరాలుగా తాము పంజాబీ కాలనీలో ప్రశాంతంగా జీవిస్తున్నామని, తాము మరుగుదొడ్లు శుభ్రంచేసే పాకీ పనిని మానేసిన 1980 వ దశకం నుంచే అగ్ర కులానికి చెందిన ఖాసీల దాడులు తమపై ప్రారంభమయ్యాయని పంజాబీ మహిళలు చెబుతున్నారు. తమను ఖాళీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని స్థానిక పంచాయతీ కౌన్సిల్ సెక్రటరీ గుర్జీత్ సింగ్ ధృవీకరించారు. బ్రీటీషర్ల కాలం నుంచి.. బ్రిటీష్ కాలం నుంచి, దాదాపు 160 సంవత్సరాలుగా పంజాబీ దళితులు ఈ కాలనీలోనే నివసిస్తున్నారు. వీధులను ఊడ్చేందుకు, మరుగు దొడ్లను శుభ్రం చేసేందుకుగాను బ్రిటీషర్లు 1853లో పంజాబీ దళితులను తీసుకొచ్చారు. వారు నివసించేందుకు అప్పటి మిల్లీయం సియెమ్ (మిల్లీయం పాలకుడు) కొంత భూమిని వారికి రాసిచ్చారు. ఆ తర్వాత 1863, డిసెంబర్లో ఇదే నివాస స్థలంపై బ్రిటీష్ ప్రభుత్వానికి, స్థానిక పాలకుడికి, పంజాబీ దళితులకు మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పుడు తామున్నది అతి ఖరీదైన స్థలంగా మారడంతో తమను ఎలాగైనా ఖాళీ చేయించాలని చూస్తున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. గురద్వార్ కమ్యూనిటీ కిచెన్‌లో చపాతీలు చేస్తున్న మహిళలు అక్రమ వలసదారులు.. షిల్లాంగ్‌కు చెందిన ఖాసీలు మాత్రం సిక్కు దళితులను అక్రమ నివాసితులుగానే పరిగణిస్తున్నారు. పంజాబీ కాలనీకి చెందిన కొంత మంది యువకులు నేరాలకు పాల్పడుతున్నారన్నది కూడా అభియోగం. 1980 ప్రాంతంలోనే జిల్లా కమిషనర్ పంజాబీలకు ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులపై మేఘాలయ హైకోర్టు 1986లో స్టే ఇచ్చింది. ఖాసీ విద్యార్థి సంఘం, ఖాసీ ప్రజా సమాఖ్య లాంటి సంస్థలు అప్పుడప్పుడు పంజాబీలను ఖాళీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా పంజాబీలు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్‌కు పలు సార్లు ఫిర్యాదు చేశారు. భారత పౌరులుగా తాము దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు, ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పరుచుకోవచ్చంటూ హైకోర్టులో కూడా వారు పలు పిటిషన్లు దాఖలు చేశారు. గురుద్వారాలకు, స్థానిక దేవాలయాలకు పట్టాలు మంజూరు చేసిన స్థానిక ప్రభుత్వం వారి ఇళ్ల స్థలాలకు మాత్రం ఇప్పటికీ పట్టాలు మంజూరు చేయలేదు. మల్టీప్లెక్స్ నిర్మానానికి.... మున్సిపాలిటీ అనుమతి లేకుండా విద్యుత్ బోర్డు కూడా దళితులకు విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదు. అది వివాదాస్పద స్థలంగా తమ రికార్డుల్లో నమోదై ఉందని స్థానిక మున్సిపాలిటీ బోర్డు వాదిస్తోంది. ఒకప్పుడు మరుగుదొడ్డు శుభ్రం చేసిన వారికి కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకుండా పోయింది. 2009 రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు వారికి కనీస సౌకర్యాలు సమకూరాయి. బీజేపీ కుట్రతో అధికారంలోకి వచ్చిన జాతీయ పీపుల్స్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అక్కడి నుంచి దళితులను షిల్లాంగ్ శివారులోకి తరలించి అక్కడ మల్టీఫ్లెక్స్ నిర్మించానుకుంటోంది. -
బీజేపీ కూటమిని గద్దె దించే యోచనలో కాంగ్రెస్!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత అధికార బీజేపీని గట్టి దెబ్బతీసింది. మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు, 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క మహారాష్ట్రలోని పాల్ఘర్ నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి చేదు అనుభవమే ఎదురైంది. మొత్తం 11 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. తొమ్మిది స్థానాల్లో ఎదురీదుతోంది. ముఖ్యంగా మేఘాలయాలోని అంపటి అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అంపటిలో కాంగ్రెస్ అభ్యర్థి మియానీ డీ షిరా 3,191 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా గెలుపుతో మేఘాలయలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మేఘాలయాలో తాజా గెలుపుతో కాంగ్రెస్ సంఖ్యాబలం 21కి చేరింది. మరోవైపు అధికార ఎన్పీపీ 20 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కోనార్డ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కర్ణాటక రాజకీయాలను మేఘాలయలో పునరావృతం చేసి.. విపక్షాల ఐక్యతతో మరో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజారిటీ సాధించలేదు. అయినా, గవర్నర్ వజుభాయ్ వాలా మొదట బీజేపీ నేత యడ్యూరప్పకు అవకాశం కల్పించారు. దీంతో బిహార్, గోవా, మణిపూర్ తదితర రాష్ట్రాల్లోనూ అతిపెద్ద పార్టీలుగా నిలిచిన పలు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేఘాలయాలో అధికార బీజేపీకూటమిని గద్దె దింపి.. ప్రతిపక్షాల ఐక్యతతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. -
కర్ణాటక ఎఫెక్ట్: ఇతర రాష్ట్రాల్లో ప్రకంపనలు!
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయ సంక్షోభం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కొన్ని నెలల కిందట ఎన్నికల అనంతరం అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తొలుత అతిపెద్ద పార్టీ అయిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గోవా కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను డిమాండ్ చేయగా... ఆపై మణిపూర్ మాజీ సీఎం ఇబోబి సింగ్, మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మాలు కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా నిర్ణయంపై స్పందించారు. మాజీ సీఎంలు సైతం తమ రాష్ట్ర గవర్నర్లను కలుసుకుని ఈ విషయంపై చర్చించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు మణిపూర్ గవర్నర్‌ను ఇబోబి సింగ్, మేఘాలయ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు శుక్రవారం సమయం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ల ఆధ్వర్యంలో రాజధానుల వద్ద, ఇతర నేతలు జిల్లా కలెక్టరెట్ల వద్ద ధర్నా చేసి తమ నిరసన తెలపాలని కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నేతలను ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నేతలకు లేఖలు పంపిన విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీకి వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ను ఎమ్మెల్యేగా గవర్నర్ వజుభాయ్ వాలా నామినేట్ చేయడం వివాదాస్పదమైంది. బీజేపీ నేత యడ్యూరప్ప బల నిరూపణ పూర్తవకుండా గవర్నర్ ఇలా ఎమ్మెల్యేను నామినేటెడ్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్-జేడీఎస్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గతేడాది మార్చిలో మణిపూర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలకుగానూ కాంగ్రెస్ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 21 సీట్లు సాధించిన బీజేపీ అధికారం సొంతం చేసుకుంది. నలుగురేసి ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)తో పాటు ఒక లోక్ జనశక్తి ఎమ్మెల్యే, ఒక తృణమూల్ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ బలం 32కి పెరిగింది. బీజేపీ నేత నాంగ్తోంబం బీరేన్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికల్లో మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్పీపీ అధికారంలోకి వచ్చింది. -
వొక్కలిగల నుంచి హస్తానికి వ్యతిరేకత
బెంగళూరు: వొక్కలిగ వర్గం నుంచి ఎదురైన వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో సీఎం సిద్దరామయ్య జేడీఎస్ నాయకుడు జీటీ దేవెగౌడ చేతిలో సుమారు 36 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. వొక్కలిగల ప్రాబల్యం అధికంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలోని మాం డ్య, తుమకూరు, హసన్, కోలార్, చామరాజనగర్‌లోని చాలా స్థానాల్లో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలే వీచాయి. కోలార్‌లో మూడు, తుమకూరులోని మొత్తం 11 సీట్లలో ఆరింటిని గెలుచుకుంది. ఈ ప్రాంతాల్లోని మొత్తం 45 స్థానాల్లో జేడీఎస్ 20కి పైగా సీట్లు గెలుచుకోవడం విశేషం. మాండ్యలో ఉన్న ఆరు సీట్లూ ఆ పార్టీ ఖాతాలోకే చేరాయి. తాజా ఫలితాలపై జీటీ దేవెగౌడ స్పందిస్తూ..‘ సిద్దరామయ్య అంటే వొక్కలిగలకు ఎలాంటి ద్వేషం లేదు. కానీ ప్రచారంలో ఆయన హెచ్డీ దెవెగౌడపై చేసిన వ్యాఖ్యలు ఆ వర్గానికి ఆగ్రహం తెప్పించాయి. దీని వల్లే హసన్, మాండ్యనే కాకుండా వొక్కాలిగల పట్టున్న ఇతర ప్రాంతాల్లోనూ సిద్దరామయ్యపై వ్యతిరేకత పెరిగింది’ అని అన్నారు. ఇక హెచ్డీ దేవెగౌడ స్వస్థలమైన హసన్‌లోని ఏడు సీట్లలో జేడీఎస్ ఆరింటిని గెలుచుకుంది. ‘గోవా, మణిపూర్‌లో మీరు చేసిందేమిటి?’ న్యూఢిల్లీ: కర్ణాటకలో అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని పార్లమెంటు సంప్రదాయాల్ని వల్లెవేస్తున్న బీజేపీ.. గోవా, మణిపూర్, మేఘాలయ విషయంలో ఆ సంప్రదాయాన్ని ఎందుకు విస్మరించిందని కాంగ్రెస్ ప్రశ్నించింది. జేడీఎస్‌తో కలసి ప్రభుత్వ ఏర్పాటును ఆ పార్టీ సమర్థించుకుంది. రాజ్యాంగ నిబంధనలు, సంప్రదాయాల ప్రకారమే కాంగ్రెస్ నడుచుకుంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీ లేదా పార్టీల కూటమిని ఆహ్వానించాలన్న సంప్రదాయానికి అనుగుణంగానే 1996లో వాజ్‌పేయిని అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉందని గుర్తు చేశారు. అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలన్న సంప్రదాయాల్ని ఆ మూడు రాష్ట్రాల విషయంలో బీజేపీ ఎందుకు అతిక్రమించిందని ఆయన ప్రశ్నించారు. -
అణచివేత చట్టానికి స్వస్తి
మేఘాలయలో ఇరవై ఏడేళ్లనుంచి అమల్లో ఉన్న సాయుధ దళాల (ప్రత్యేకాధికా రాల) చట్టాన్ని ఉపసంహరిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు ఈ చట్టం నుంచి మిన హాయింపు ఇచ్చినట్టు తెలిపింది. అస్సాంలో కూడా పాక్షికంగా ఉపసంహరించే ప్రతిపాదన ఉన్నట్టు చెబుతున్నారు. త్రిపురలో మూడేళ్లక్రితం అప్పటి వామపక్ష ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుంది. ఆనాటినుంచీ మా ప్రాంతాల్లో కూడా దీన్ని తొలగించాలని ఇతర ఈశాన్య రాష్ట్రాలనుంచి, జమ్మూ–కశ్మీర్‌నుంచి పలు సంస్థలు డిమాండు చేస్తున్నాయి. ఈ చట్టాన్ని రద్దు చేయాలని మణిపూర్ యువతి ఇరోం షర్మిల దాదాపు పదహారేళ్ల సుదీర్ఘకాలం నిరాహార దీక్ష జరిపారు. ఇది అమలవు తున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని సమీక్షించి తగిన సిఫార్సులు చేయాలని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఈ చట్టాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. ఆ విషయంలో 2010లో యూపీఏ సర్కారు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా అది కూడా చట్టాన్ని పాక్షికంగా ఉపసంహరించాలని సూచించింది. ఇలా వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలు ఏక కంఠంతో అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు... సాక్షాత్తూ కేంద్ర మంత్రివర్గ ఉపసంఘమే పాక్షిక ఉపసంహరణకు మొగ్గు చూపినప్పుడు కూడా ఓ చట్టం ఇన్నాళ్లు మనుగడ సాగించగలగటం ఆశ్చర్యకరమే. కానీ సైన్యం అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లనే ఇవన్నీ నిరర్ధకమయ్యాయని తెలిస్తే అంతకన్నా ఆశ్చర్యం కలుగుతుంది. కల్లోలిత రాష్ట్రాల్లో ఇలాంటి చట్టం ఆసరా లేకుండా శాంతిభద్రతలను కాపాడే బాధ్యత తీసుకోవడం తమకు సాధ్యం కాదని సైన్యం చెప్పిన పర్యవసానంగా యూపీఏ సర్కారు దీని జోలికెళ్లడం మానుకుంది. దేశంలో స్వాతంత్య్రానంతరం రూపొందించిన ఒక చట్టంపై ఇంత పెద్ద యెత్తున నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తం కావడం సాయుధ దళాల(ప్రత్యేకాధికా రాల) చట్టం విషయంలో మాత్రమే జరిగింది. అయితే దీని మూలాలు ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని అణచడానికి బ్రిటిష్ వలసపాలకులు తీసుకొచ్చిన సాయుధ దళాల విశేషాధికారాల ఆర్డినెన్స్‌లో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు తిరుగు బాట్లతో అట్టుడుకుతున్నప్పుడు 1958లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అవిభక్త అస్సాంలోని నాగాలాండ్‌లో అమలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమేపీ ఇతరచోట్లకు ఇది విస్తరించింది. 1990లో జమ్మూ–కశ్మీర్లో శాంతిభద్రతలు క్షీణిం చడం మొదలయ్యాక అక్కడ కూడా దీన్ని ప్రయోగించడం మొదలుపెట్టారు. కల్లోల పరిస్థితులున్నప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసు కోవడం సర్వసాధారణం. కానీ ఆ వంకన ప్రభుత్వాలే జనం బతుకుల్లో కల్లోలం సృష్టిస్తే దాన్నెవరూ చూస్తూ ఊరుకోరు. తిరుగుబాట్లకూ లేదా ఉద్యమాలకూ మూల కారణాలేమిటో, అవి లేవనెత్తుతున్న సమస్యలేమిటో అవగాహన చేసుకుని పరిష్కరించడానికి బదులు ఇలాంటి కఠిన చట్టాలను ఆశ్రయిస్తే ‘సులభంగా’ గట్టె క్కగలమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. పర్యవసానంగా ఆ కల్లోలిత ప్రాంతాల్లోని జనం ప్రాణభయంతో బతుకీడుస్తున్నారు. సాయుధ దళాల చట్టం సైన్యానికి విశేషాధికారాలు ఇస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణకు నియమితులైన బలగాలు అనుమతి లేకుండా ఎవరి ఇళ్లనైనా తనిఖీ చేయొచ్చు. వారెంటు లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. ప్రమాదకారులన్న అనుమానం వచ్చిన వ్యక్తులను కాల్చి చంపొచ్చు. బహిరంగ స్థలాల్లో అయిదుగురు వ్యక్తులు గుమిగూడి ఉంటే, వారి వల్ల ముప్పు వాటిల్లవచ్చునని అనిపిస్తే కాల్పులు జరపొచ్చు. సైన్యం చర్యలను న్యాయస్థానాల్లో సవాలు చేయడం పౌరులకు సాధ్యం కాదు. ఏ సైనికుడైనా అన్యాయంగా, అకారణంగా ప్రాణం తీశాడని ఆరోపణ వస్తే వారిని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతినీయాలి. ప్రజా ప్రతినిధులుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ నోరెత్తడానికి లేదు. పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విశేష ప్రాధాన్యమిచ్చే రాజ్యాంగం అమలవుతున్నచోట దానికి విరుద్ధమైన ఇలాంటి క్రూర చట్టం రూపొందడం, ఎందరు కాదన్నా అవిచ్ఛిన్నంగా కొనసాగడం దిగ్భ్రాంతికరమే. శత్రువులన్న అనుమానం కలిగినంతమాత్రాన, ఆరోపణలొచ్చినంతమాత్రాన పౌరులను కాల్చిచంపడమంటే చట్టబద్ధపాలన మాత్రమే కాదు... ప్రజాస్వామ్యం కూడా తీవ్ర ప్రమాదంలో పడినట్టు పరిగణించా ల’ని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మణిపూర్‌లో 2000 సంవత్సరం నుంచి 2012 వరకూ 1528మంది పౌరులను సాయుధ బలగాలు అకారణంగా హతమార్చాయని, వాటిపై విచారణ జరిపించడంతోపాటు సాయుధ దళాల చట్టాన్ని రద్దు చేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇచ్చిన తీర్పులో ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. 2004లో తంగజం మనోరమ చాను అనే మహిళను అస్సాం రైఫిల్స్ సిబ్బంది అరెస్టు చేశాక ఆమె శవమై కనబడినప్పుడు పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ ఘటనను నిరసిస్తూ కొందరు మణి పురి మహిళా ఉద్యమకారులు సైనికులు బస చేసిన కాంగ్లా భవనం ముందు నగ్న నిరసనకు దిగారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం వంటివి ఉన్న సమస్యను పరిష్క రించకపోగా కొత్త సమస్యలను తీసుకొస్తాయి. ప్రజలకూ, ప్రభుత్వాలకూ మధ్య అగాధాన్ని పెంచుతాయి. అసంతృప్తిని మరింత విస్తరింపజేస్తాయి. జనం ఎదు ర్కొంటున్న సమస్యలపై సకాలంలో స్పందిస్తే, వారి డిమాండ్లలోని సహేతుకతను అవగాహన చేసుకుని తగిన పరిష్కారాన్ని అన్వేషిస్తే ఉద్యమాలు ఉగ్రరూపం దాల్చవు. అమానుష చట్టాల అవసరమే ఉండదు. అంతర్జాతీయంగా మన దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్న ఈ చట్టాన్ని మణిపూర్, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో సైతం ఉపసంహరించడంతోపాటు దాన్ని సంపూర్ణంగా రద్దు చేసే దిశగా ఆలోచించాలి. -
మేఘాలయలో ఏఎఫ్ఎస్పీఏ ఎత్తివేత
న్యూఢిల్లీ: మేఘాలయలో భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో పాక్షికంగా తొలగించింది. భద్రతా దళాలు ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎవరినైనా, ఎక్కడైనా, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేసేందుకు అధికారం కల్పిస్తున్న ఏఎఫ్ఎస్పీఏను మార్చి 31 నుంచి మేఘాలయలోని అన్ని ప్రాంతాల్లో ఎత్తివేశారు. భద్రత పరంగా మేఘాలయలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని, అందుకే ఈ చట్టాన్ని తొలగించామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు విదేశీయులపై ఉన్న నిబంధనలను కేంద్రం ఎత్తేసింది. ప్రత్యేక పర్మిట్ ఏదీ అవసరం లేకుండానే పర్యటించవచ్చని స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ వంటి పలు దేశాల పర్యాటకులకు మాత్రం అనుమతివ్వలేదు. -
పోలీసుల అదుపులో కీచక తాత
సాక్షి, షిల్లాంగ్ : తప్పొప్పులపై నలుగురికీ చెప్పాల్సిన తాత పశువాంఛతో సొంత మనవరాలిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. మేఘాలయాలోని నార్త్ గరో హిల్స్‌కు సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో 60 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలిక స్వయానా మనవరాలిపై ఘాతుకానికి తెగబడ్డాడు. దేశవ్యాప్తంగా మైనర్ బాలికలపై లైంగిక దాడులపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈనెల 10న బాధిత బాలిక ట్యూషన్‌కు వెళ్లేందుకు పుస్తకాలు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో డెనీ మారక్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడని, జరిగిన విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని అధికారులు వెల్లడించారు. అయితే బాలిక ఇటీవల వేధింపుల గురించి తల్లికి చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు మారక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, దర్యాప్తు కొనసాగుతోందని నార్త్ గరో హిల్స్ ఎస్పీ డాల్డన్ తెలిపారు. గతంలో రెండు సందర్భాల్లోనూ బాధిత బాలికను నిందితుడు లైంగికంగా వేధించాడని తెలిసిందని చెప్పారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. -
మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణం
షిల్లాంగ్: మేఘాలయ 12వ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) చీఫ్ కాన్రాడ్ సంగ్మా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో మంగళవారం సంగ్మాతోపాటు మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. సంగ్మాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్పీపీ అధికారంలోకి వచ్చేలా చక్రం తిప్పింది. త్రిపుర సీఎంగా విప్లవ్ దేవ్ : త్రిపురలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా విప్లవ్ దేవ్ నియమితులు కానున్నారు. మంగళవారం బీజేపీ, మిత్రపక్షం ఐపీఎఫ్టీ ఎమ్మెల్యేలు సమావేశమై విప్లవ్‌ను సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార వేడుక శుక్రవారం (9వ తేదీన) జరగనుంది. నాగాలాండ్‌కు కొత్త సీఎం రియో: నాగాలాండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)ని ఆ రాష్ట్ర గవర్నర్ పీబీ ఆచార్య ఆహ్వానించారు. ఎన్డీపీపీ సీనియర్ నేత నీఫ్యూ రియో గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. -
మేఘాలయా సీఎంగా కన్రాడ్ సంగ్మా
సాక్షి, షిల్లాంగ్ : మేఘాలయా 12వ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) చీఫ్ కన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరైన ఈ కార్యక్రమంలో సంగ్మాచే గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడు కన్రాడ్ సంగ్మా 2016లో తండ్రి మరణానంతరం ఎన్పీపీ పగ్గాలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్పీపీ సొంతగా 19 స్ధానాల్లో గెలుపొందగా, ఆరుగురు యూడీపీ ఎమ్మెల్యేలు, నలుగురు పీడీఎఫ్ ఎమ్మెల్యేలు, ఇద్దరేసి బీజేపీ, హెచ్ఎస్పీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి మద్దతు తెలిపారు. మరికొందరు ఇండిపెండెంట్లతో ఎన్పీపీ బలం 34కు పెరిగింది. యూడీపీ చీఫ్ దంకూపర్ రాయ్ ఎన్పీపీకి మద్దతు తెలపడంతో కన్రాడ్ సంగ్మా సర్కార్ కొలువుతీరేందుకు మార్గం సుగమమైంది. కాంగ్రెసేతర ఫ్రంట్‌కు సంగ్మా నాయకత్వాన్ని బలపరుస్తామని రాయ్ ముందుకొచ్చారు. పదేళ్లుగా మేఘాలయాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్ధానాలు గెలుచుకోగా ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలకు పరిమితమై ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. -
ఈశాన్యం చెప్పిన పాఠం
-
మేఘాలయ సారథి కన్రాడ్
షిల్లాంగ్: మేఘాలయలో కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీజేపీ, ఇతర పక్షాల మద్దతుతో నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) అధ్యక్షుడు కన్రాడ్ కే సంగ్మా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మేఘాలయ కొత్త సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్పీపీ సారథ్యంలో బీజేపీ, మరో మూడు పార్టీల సంకీర్ణ కూటమి తరఫున ఆదివారం రాత్రి గవర్నర్ గంగా ప్రసాద్‌ను కలిసిన కన్రాడ్ సంగ్మా.. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమకు మొత్తం 34 మంది ఎమ్మెల్యేల మద్దతుందని పేర్కొంటూ ఎమ్మెల్యేల మద్దతు లేఖల్ని అందచేయగా.. ప్రభుత్వ ఏర్పాటుకు కన్రాడ్ను గవర్నర్ ఆహ్వానించారు. ఇక ఈ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ తరఫున ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆ పార్టీ అగ్రనేతలు కమల్‌నాథ్, అహ్మద్ పటేల్‌లు రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు. కాగా మేఘాలయ సీఎం ముకుల్ సంగ్మా తన పదవికి రాజీనామా చేశారు. సంగ్మా రాజీనామాను గవర్నర్ ఆమోదించారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి ఎజెండా మేరకు పనిచేస్తాం: కన్రాడ్ గవర్నర్‌ను కలిసిన అనంతరం కన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ.. ‘ఎన్పీపీకి చెందిన 19 మంది, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) నుంచి ఆరుగురు, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) నుంచి నలుగురు, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ) నుంచి ఇద్దరు, బీజేపీకి చెందిన ఇద్దరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు లేఖల్ని గవర్నర్‌కు సమర్పించాం’ అని చెప్పారు. సంకీర్ణ సర్కారును నడిపించడం అంత సులువైన విషయం కాదని, అయితే మాకు మద్దతిస్తోన్న పార్టీలు ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి అజెండా మేరకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడే కన్రాడ్ సంగ్మా.. 2016లో తండ్రి మరణం అనంతరం తుర స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించా సంకీర్ణ సర్కారులో కన్రాడ్ సంగ్మానే సీఎం అవ్వాలన్న షరతుపై మద్దతిచ్చేందుకు అంగీకరించామని యూడీపీ అధ్యక్షుడు డొంకుపర్ రాయ్ తెలిపారు. మేఘాలయలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, తమ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్, యూడీపీలు చెరి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా తనను కలిసి మాజీ సీఎం ముకుల్ సంగ్మా ప్రతిపాదించగా తిరస్కరించానని, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అంతకముందు రాయ్‌ను బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు కలిసి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు పోటాపోటీగా.. మేఘాలయలో హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం శనివారం మధ్యాహ్నం నుంచి కాంగ్రెస్, ఎన్పీపీలు పోటాపోటీగా పావులు కదిపాయి. అతి పెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ శనివారం రాత్రే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. కమల్‌నాథ్, అహ్మద్ పటేల్, సీపీ జోషీలు మేఘాలయ చేరుకుని మంత్రాంగం నడిపించారు. ఇతర చిన్న పార్టీలతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం దక్కలేదు. ‘నిబంధనల మేరకు అతి పెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా మమ్మల్నే ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరాం’ అని కమల్‌నాథ్ తెలిపారు. మేఘాలయలో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ 21 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. -
మేఘాలయ నెక్ట్స్ సీఎం ఈయనే!
షిల్లాంగ్ : మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కోన్రాడ్ సంగ్మా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ నెల 6న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేస్తారని ఈశాన్య ప్రజాస్వామిక కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ తెలిపారు. కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం పదవి ఉండబోదని వెల్లడించారు. ఈ మేరకు కోన్రాడ్ సంగ్మా నేతృత్వంలో సంకీర్ణ కూటమి నేతలు గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో 34 మంది సభ్యులు కోనార్డ్ సంగ్మాకు మద్దతుగా నిలువడంతో ఆయన మెజారిటీ సాధించినట్టు అయింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గవర్నర్‌ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరినప్పటికీ.. వారికి మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ తిరస్కరించారు. 60 స్థానాలు ఉన్న మేఘాలయా అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాలు గెలిచి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ... మెజారిటీ సంఖ్యాబలానికి (31) 10 సభ్యుల దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ చక్రం తిప్పి.. 19 స్థానాలు గెలుపొందిన ఎన్పీపీ నేతృత్వంలో ప్రాంతీయ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేసింది. ప్రస్తుతం ఎన్పీపీ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ అధికార కూటమికి 34మంది సభ్యుల మద్దతు ఉంది. ఎన్పీపీ నుంచి 19మంది, బీజేపీ నుంచి ఇద్దరు, యూడీపీ నుంచి ఆరుగురు, హెచ్‌స్‌పీడీపీ నుంచి ఇద్దరు, పీడీఎఫ్ నుంచి నలుగురు, ఒక స్వతంత్ర సభ్యుడు ఈ కూటమిలో ఉన్నారు. అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మేఘాలయలో అధికారాన్ని నిలబెట్టుకోకపోవడం కాంగ్రెస్ పార్టీని షాక్‌కు గురిచేస్తోంది. సరైన సంఖ్యాబలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన పార్టీ పరిశీలకులను ప్రభుత్వ ఏర్పాటుకోసం మేఘాలయకు పంపించారని, ఇది ఆయనలో రాజకీయ పరిణతి లేకపోవడాన్ని చాటుతోందని హేమంత బిస్వా శర్మ విమర్శించారు. -
2 సీట్లు నెగ్గి అధికారంలోకా.. ఎలా..!
సాక్షి, షిల్లాంగ్: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండంటే రెండే స్థానాల్లో నెగ్గిన బీజేపీ అధికారాన్ని ఏ విధంగా కోరుకుంటుందని సీఎం ముకుల్ సంగ్మా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలే వారిని వద్దనుకున్న నేపథ్యంలో ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ పావులు కదుపుతుందన్నారు. ఇటీవల జరిగిన న్నికల్లో ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన విషయం తెలిసిందే. కానీ బీజేపీ మాత్రం కొన్ని పార్టీలతో కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లీకులిస్తోంది. దీనిపై సీఎం ముకుల్ సంగ్మా రాజధాని షిల్లాంగ్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. 'ఈ ఎన్నికల్లో మేఘాలయ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. 21 స్థానాలతో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించంతో.. ప్రభుత్వ ఏర్పాటు అంశాలను గవర్నర్‌ను కలిసి చర్చించాను. స్థానిక పార్టీల అభ్యర్థులు, కొందరు స్వత్రంత్రుల మద్ధతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని గవర్నర్ కు తెలిపాను. కానీ 47 స్థానాల్లో పోటీచేసి కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించిన బీజేపీ అధికారంలోకి రావడం ఏ విధంగా సాధ్యమవుతుంది. స్థానిక రాజకీయ పార్టీల నెగ్గిన అభ్యర్థులను మభ్యపెట్టి ఎలాగైనా సరే మేఘాలయలో అధికారంలోకి రావాలని బీజేపీ అత్యాశకు పోతుందంటూ' సీఎం ముకుల్ సంగ్మా విమర్శించారు. మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికార కాంగ్రెస్ 21 స్థానాలు, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 19 సీట్లు సొంతం చేసుకుంది. 47 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ రెండు చోట్ల మాత్రమే గెలిచింది. యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) ఆరు చోట్ల, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) నాలుగు, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ) రెండు చోట్ల గెలుపొందాయి. కేహెచ్ఎన్ఏఎం, ఎన్సీపీలు చెరొక స్థానంలో, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలిచాయి. యూడీఎఫ్, హెచ్‌ఎస్‌పీడీపీలు పొత్తుపై ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. -
కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్
సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా జరిగిన ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం మేఘాలయలోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం చేజారుతున్నట్టే కనిపిస్తోంది. త్రిపురలో పాతికేళ్లుగా పెట్టనికోటగా ఉన్న కమ్యూనిస్టు కంచుకోటను కూల్చి.. నాగాలాండ్‌లోని బలమైన ఉనికితో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్న బీజేపీ.. మేఘాలయ కూడా కాంగ్రెస్‌కు చిక్కకుండా మంత్రాంగం నడుపుతోంది. హంగ్ ఫలితాలు వెలువడ్డ మేఘాలయలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఆ పార్టీ ఇంకా పది స్థానాల దూరంలో నిలిచింది. 60 స్థానాలు ఉన్న మేఘాలయాలో కాంగ్రెస్ 21 స్థానాలు గెలుపొందగా, ఎన్పీపీ 19 స్థానాలు సాధించింది. ఈ క్రమంలో కేవలం రెండు స్థానాలు గెలిచి.. తొలిసారి మేఘాలయ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న బీజేపీ.. ఇక్కడ తన పాచిక విసిరి.. కాంగ్రెస్ అధికారం దక్కకుండా తెరవెనుక చక్రం తిప్పుతోంది. 19 స్థానాలు గెలిచిన ఎన్పీపీ నేతృత్వంలో ఇతర పార్టీలనకు ఒకచోటకు చేర్చి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని ఎనిమిది స్థానాలు గెలిచిన యూడీపీ-హెచ్ఎస్డీపీ బీజేపీ ఏర్పాటుచేస్తున్న కూటమిలో చేరేందుకు ముందుకొచ్చింది. కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఆదివారం యూడీపీ చీఫ్ డాక్టర్ దొంకుపర్ రాయ్‌తో భేటీ అయి ఈమేరకు మంతనాలు సాగించారు. ఎన్పీపీ-యూడీపీ చేతులు కలుపడంతో బీజేపీ ఆకాంక్ష మేరకు మేఘాలయలో కాంగ్రెసేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఎన్పీపీ కి చెందిన కోనార్డ్ సంగ్మా తదుపరి మేఘాలయ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నట్టు సమాచారం. గోవా, మణిపూర్ తరహాలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినప్పటికీ మరోసారి మేఘాలయాలో ఆ పార్టీకి అధికారపీఠం దూరం కానుండటం షాక్‌కు గురిచేస్తోంది. -
లెఫ్ట్ కోట బద్ధలు.. త్రిపురలో బీజేపీ పాగా
-
మేఘాలయలో హంగ్
-
మేఘాలయలో హంగ్
షిల్లాంగ్: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టలేదు. ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 59 స్థానాలకుగాను అధికార కాంగ్రెస్ 21 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 47 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ రెండు చోట్ల మాత్రమే గెలిచింది. మేఘాలయ అసెంబ్లీలోని 60కి గాను 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బాంబు పేలుడులో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అభ్యర్థి మరణించడంతో ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. మేఘాలయలో ఏ పార్టీ లేదా సంకీర్ణ కూటమైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 30 స్థానాలు అవసరం. అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేయగా.. అటు ఎన్పీపీ, బీజేపీలు ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులతో సంకీర్ణ సర్కారు ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలే కీలకం ఈ ఎన్నికల్లో యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) ఆరు చోట్ల, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) నాలుగు, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ) రెండు చోట్ల గెలుపొందాయి. కేహెచ్ఎన్ఏఎం, ఎన్సీపీలు చెరొక స్థానంలో, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలిచాయి. యూడీఎఫ్, హెచ్‌ఎస్‌పీడీపీలు పొత్తుపై ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. సంకీర్ణం ఏర్పాటుకు ప్రయత్నాలు ఇతర పార్టీలు, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పీఏ సంగ్మా కుమారుడు కొనార్డ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ అటు కేంద్ర ప్రభుత్వంలో, ఇటు మణిపూర్‌లో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతోంది. కొనార్డ్ మాట్లాడుతూ..‘ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న నమ్మకంతో ఉన్నాం. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. మార్పు కోసం ఎదురుచూస్తున్నారు’ అని చెప్పారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతో సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై మాత్రం స్పందించలేదు. బీజేపీ.. చిన్న పార్టీలు, స్వతంత్రులతో చర్చించేందుకు హిమంత శర్మను మేఘాలయకు పంపింది. గోవా, మణిపూర్ అనుభవంతో కాంగ్రెస్ అప్రమత్తం ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, ఇతర పార్టీలతో పొత్తు చర్చల కోసం సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కమల్ నాథ్‌లను కాంగ్రెస్ మేఘాలయకు పంపింది. గతేడాది గోవా, మణిపూర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటులో నిర్లిప్తంగా ఉంది. దీంతో మణిపూర్, గోవాల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈసారి కాంగ్రెస్ అప్రమత్తమైంది. ‘మేం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ద్వారా ప్రజల అభిమతం నెరవేరనుంది. మేం ప్రతి ఒక్కరితో చర్చిస్తున్నాం. ధనబలంతో వీలైనంత గందరగోళం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’ అని కమల్‌నాథ్ పేర్కొన్నారు. -
ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు..
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ మూడు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలను (త్రిపుర, నాగాలాండ్) బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మేఘాలయలో మాత్రం హంగ్ పరిస్థితి నెలకొంది. ఏ పార్టీ కూడా పూర్తి మెజార్టీని సాధించలేకపోయాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఒక్కో రాష్ట్రానికి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటిల్లో త్రిపురలో 59, మేఘాలయలో 59, నాగాలాండ్‌లో 60 స్థానాలకు ఎన్నికలుజరగడం కౌంటింగ్ పూర్తవడం జరిగింది. లెఫ్ట్ కోట బద్ధలు.. త్రిపురలో బీజేపీ పాగా దాదాపు 25 ఏళ్లుగా త్రిపురలో చక్రం తిప్పుతున్న వామపక్షాల కంచుకోటను బీజేపీ బద్ధలు కొట్టింది. త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ఈ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవి చూసింది. 2013లో లెఫ్ట్ పార్టీ సీపీఎం గతంలో మొత్తం 49 సీట్లు దక్కించుకోగా ఈసారి జరిగిన ఎన్నికల్లో కేవలం 16 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. అయితే, బీజేపీ మాత్రం భారీ విజయం అందుకుందనే చెప్పాలి. 2013లో అసలు ఖాతానే తెరవని బీజేపీ ఏసారి ఏకంగా 43సీట్లతో పూర్తి మెజార్టీ సాధించింది. మేఘాలయలో హంగ్.. కాంగ్రెస్‌కే ఛాన్స్ ఇప్పటి వరకు మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం హంగ్ పరిస్థితి నెలకొంది. 2013లో కాంగ్రెస్ పార్టీకి 28 స్థానాలు రాగా ఈసారి 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇక నేషనల్ పీపుల్స్ పార్టీకి(ఎన్పీపీ) 19 సీట్లు రాగా బీజేపీ కేవలం రెండు స్థానాలు మాత్రమే తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇతరులు 17 స్థానాలు గెలుచుకున్నారు. బీజేపీ మద్దతిచ్చినా ఎన్పీపీకి 21 స్థానాలే వస్తాయి. మేజిక్ ఫిగర్ అందుకోవాలంటే మరో 9కిపైగా సీట్లు కావాల్సిందే. ఇలా చేయాలంటే ఇతరులపై ఎన్పీపీ ఆధారపడాలి కానీ, అది సాధ్యమయ్యేదిగా కనిపించడం లేదు. అయితే, గతంలో కాంగ్రెస్ పడిపోయే పరిస్థితుల్లో ఎన్పీపీ మద్దతు ఇచ్చినందున ఈసారి కూడా కాంగ్రెస్, ఎన్పీపీ భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నాగాలాండ్ బీజేపీ ఖాతాలో.. నాగాలాండ్ కూడా బీజేపీ ఖాతాలో దాదాపు పడింది. ఇక్కడ బీజేపీ ఒంటరిగా కాకుండా వివిధ పార్టీలతో కలిసి నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ ప్లస్)గా పోటీ చేసింది. ఈ కూటమి మొత్తం 30 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ 8 స్థానాలు గెలుచుకోగా ఈసారి మాత్రం ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే, నాగా పీపుల్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) మాత్రం 28 స్థానాలు గెలుచుకుంది. -
ఆ సీఎం రెండు చోట్లా ఘన విజయం
సాక్షి, షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ముకుల్ సంగ్మా రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంపాతి, సంగ్సక్ నియోజవర్గాల నుంచి బరిలోకి దిగిన సంగ్మా విజయకేతనం ఎగురవేశారు. సంగ్మా రెండు పర్యాయాలు సీఎంగా చేశారు. తొలిసారి 2010 ఏప్రిల్‌లో మేఘాలయ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ముకుల్ సంగ్మా 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. కానీ మేఘాలయలో హంగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ సూచనలు లేవు. మధ్యాహ్నం సమయానికి జరిగిన ఓట్ల లెక్కింపులో 2 చోట్ల నెగ్గిన కాంగ్రెస్ మరో 20 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఎన్పీపీ 16 చోట్ల, ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మేఘాలయాలో ఫలితాలు బీజేపీకి మింగుడు పడటం లేదు. బీజేపీ ఇక్కడ కేవలం 4 స్థానాలు నెగ్గేలా కనిపిస్తోంది. కాగా, మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా, బీజేపీ తరపున 47 మంది పోటీ చేసిన విషయం తెలిసిందే. -
మేఘాలయలో హంగ్ ?
-
ఈశాన్య రాష్ట్రాలలో మొదలైన ఓట్ల లెక్కింపు
-
మరికొన్ని గంటల్లో 'ఈశాన్య' రాష్ట్రాల భవితవ్యం
అగర్తల/కోహిమా/షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. నేడు(శనివారం) ఉదయం 8 గంటలకు మూడు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల్లోనూ 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వివిధ కారణాల వల్ల మూడింటిలోనూ 59 స్థానాలకే పోలింగ్ జరిగింది. త్రిపుర, మేఘాలయలో అభ్యర్థుల మరణం కారణంగా ఒక్కో స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఇక నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) చీఫ్ నీఫి రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. బీజేపీ తరపున 47 మంది పోటీలో ఉన్నారు. నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీతో జత కట్టింది. ఇక్కడ ఎన్డీపీపీ 40 చోట్ల, బీజేపీ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 18 స్థానాల్లోనే బరిలో ఉంది. కమలం వికసించేనా..? త్రిపురలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న వామపక్ష కూటమికి పరాభవం తప్పదని, ఇక్కడ బీజేపీ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉందని రెండు ఎగ్జిట్‌పోల్ సర్వేల్లో తేలింది. మిగతా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని పేర్కొంది. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా అధికారంలో ఉంది. 2008లో మూడు నెలల రాష్ట్రపతి పాలన మినహా నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) 2003 నుంచి అధికారంలో ఉంది. అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలోనూ విజయకేతనం ఎగురవేసి ఈశాన్య భారతంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. -
నాగాలాండ్, మేఘాలయలో 75 శాతం పోలింగ్
న్యూఢిల్లీ: నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో 75% పోలింగ్ నమోదైంది. మేఘాలయలో ఓటింగ్ ప్రశాతంగా ముగియగా నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోయారు. నాగాలాండ్ రాష్ట్రం అకులుటో నియోజకవర్గం జున్హెబోటో జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అభిజిత్ సిన్హా తెలిపారు. మోన్ జిల్లా టిజిట్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలోని పోలింగ్ స్టేషన్ సమీపంలో బాంబు పేలి ఒకరు గాయపడ్డారని చెప్పారు. సుధోస్డు, లాడిగఢ్‌లో పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్తతల కారణంగా ఎన్నిక నిలిపివేసినట్లు వివరించారు. క్రైస్తవ వ్యతిరేక పార్టీకి ఓటేయరాదంటూ మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఓ ప్రైవేట్ రేడియో స్టేషన్ జాకీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎన్నికలకు మతం రంగు పులిమేందుకు యత్నించిన ఆ స్టేషన్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈనెల 18వ తేదీన ఎన్నికలు జరిగిన త్రిపురతోపాటు మేఘాలయ, నాగాలాండ్ ఓట్ల లెక్కింపు వచ్చే నెల 3న చేపట్టనున్నారు. -
త్రిపురలో కూలనున్న ఎర్రకోట!
న్యూఢిల్లీ: దేశంలో కమ్యూనిస్టుల చివరి కంచుకోట కూడా కూలిపోబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. త్రిపురలో 1993 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 25 ఏళ్లుగా సీపీఎం ఒక్కటే అధికారంలో ఉంది. దేశంలో ప్రస్తుతం కమ్యూనిస్టులు ఇతరులతో పొత్తులేకుండా పాలిస్తున్న ఏకైక రాష్ట్రం త్రిపుర మాత్రమే. అయితే ఈసారి అక్కడ బీజేపీ పీఠమెక్కనుందని న్యూస్ ఎక్స్, మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. నాగాలాండ్‌లో కూడా బీజేపీయే స్వల్ప ఆధిక్యంతో గెలవచ్చని ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి. అయితే సీ–ఓటర్ సర్వే మాత్రం వీటికి భిన్నంగా ఉంది. త్రిపురలో కమ్యూనిస్టులు తమ అధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉందంటోంది. త్రిపురలో ఈ నెల 18న, మేఘాలయ, నాగాలాండ్‌లలో మంగళవారం పోలింగ్ జరిగింది. మూడు రాష్ట్రాల ఫలితాలూ ఈ శనివారం వెలువడనున్నాయి. మూడు రాష్ట్రాల శాసనసభల్లోనూ సమానంగా 60 సీట్లే ఉన్నాయి. అయితే త్రిపుర, మేఘాలయల్లో ఇద్దరు అభ్యర్థులు మృతి చెందడంతో, నాగాలాండ్‌లో ఒక స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నిక జరగడంతో మూడు రాష్ట్రాల్లో 59 సీట్లకే పోలింగ్ జరిగింది. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లను సాధిస్తుందనీ, కాంగ్రెస్ మాత్రం నాగాలాండ్, త్రిపురల్లో ఖాతానే తెరవక పోవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలోనూ త్రిపుర, మేఘాలయలకు సంబంధించి దాదాపుగా ఇవే ఫలితాలు వచ్చాయి. త్రిపురలో...: త్రిపురలో న్యూస్ ఎక్స్ ప్రకారం బీజేపీ–ఐపీఎఫ్టీ (ఇండిజినియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) కూటమికి 35 నుంచి 45 సీట్లు, 51 శాతం ఓట్లు రానున్నాయి. యాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం బీజేపీ–ఐపీఎఫ్టీ కూటమికి 44–50 సీట్లు, 49 శాతం ఓట్లు వస్తాయి. అయితే సీ–ఓటర్ మాత్రం త్రిపురలో సీపీఎం, బీజేపీ కూటమిల మధ్య సీట్ల తేడా స్వల్పంగా ఉం టుందనీ, సీపీఎంకు 26–34, బీజేపీ కూట మికి 24–32 సీట్లు వస్తాయని చెబుతోంది. మేఘాలయలో...: కాంగ్రెస్ అధికారంలో ఉన్న మేఘాలయలోనూ న్యూస్ ఎక్స్ ప్రకారం అత్యధికంగా ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ)కి 23–27 సీట్లు రానున్నాయి. సీ–ఓటర్ ప్రకారం ఎన్పీపీకి 17 నుంచి 23 దక్కనున్నాయి. యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీకి 30 సీట్లు వస్తాయంటోంది. నాగాలాండ్‌లో...: నాగాలాండ్‌లో బీజేపీ–ఎన్డీపీపీ కూటమికి 27 నుంచి 32 సీట్లు వస్తాయని న్యూస్ ఎక్స్ చెబుతోంది. సీ–ఓటర్ ప్రకారం బీజేపీ కూటమికి 25 నుంచి 31 సీట్లు దక్కనున్నాయి. -
అక్కడ హంగ్ తప్పదు.. బీజేపీకి చాలా కష్టం!
సాక్షి, షిల్లాంగ్ : మేఘాలయ హంగ్ ఏర్పడనుందా? ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదా? అటు ప్రాంతీయ పార్టీలుగానీ, జాతీయ పార్టీలుగానీ, మొత్తం ఓటు బ్యాంకును తమ ఖాతాల్లోకి వేసుకోలేకపోయాయా? ఈ విషయంలో కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ మేఘాలయలో వెనుకబడుతుందా? గతంలోకంటే కాంగ్రెస్ పార్టీ తన స్థానాలను పెంచుకోని మరోసారి అక్కడ అతిపెద్ద పార్టీగా మారనుందా? అంటే ఓ సర్వే ఫలితాలు అవునని చెబుతున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మేఘాలయలో మంగళవారం ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో కచ్చితంగా హంగ్ పరిస్థితి ఏర్పడుతుందని, సంకీర్ణాలతో కలిసి మెజార్టీ స్థానాలు లభించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకొని ఐదేళ్లపాటు నడిపించాల్సిందేనని హైదరాబాద్‌కు చెందిన సర్వే సంస్థ 'పీపుల్స్ పల్స్' వెల్లడించింది. ఈ సంస్థ తెలిపిన ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 19 నుంచి 24 సీట్లు లభించి అతిపెద్ద పార్టీగా మారనుందట. ఇక ఎన్పీపీ 10 నుంచి 13 సీట్లు పొందుతుందని, యూడీపీకి 6 నుంచి 9 మాత్రం వస్తాయని, ఇక బీజేపీకి మాత్రం అతి తక్కువగా 2 నుంచి 5సీట్లు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉందని ఆ సర్వే తేల్చింది. ఇక ఇతరులు మాత్రం 7 నుంచి 12 సీట్లు పొందుతారని పేర్కొంది. తాము ఈ ప్రీపోల్ సర్వేను ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నిర్వహించామని, 20 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజక వర్గంలో మూడు పోలింగ్ కేంద్రాల ప్రాతిపదికన 1200 మంది ఓటర్లను శాంపిల్‌గా తీసుకొని సర్వే నిర్వహించినట్లు పీపుల్స్ పల్స్ వెల్లడించింది. తాము చెప్పిన అంచనాల్లో మూడుస్థానాలు పెరగడమో మూడు తగ్గడమో జరుగుతుంది తప్ప పెద్దగా తేడాలు ఏమీ ఉండవని తెలిపింది. మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే కనీసం 31 స్థానాలు మేజిక్ ఫిగర్‌ను అందుకోవాలి. అయితే కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తేల్చిన నేపథ్యంలో 24 స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయనుకున్నా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కనీసం మరో ఏడు సీట్లు కావాల్సి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలకు 30 సీట్లు దక్కించుకోగా ఇద్దరు స్వతంత్రులు, ఒక యూడీపీ ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనేది ప్రధాన ప్రశ్న. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) జాతీయ పార్టీ అని చెప్పుకున్నప్పటికీ అది ముఖ్యంగా గారో హిల్స్‌కు చెందిన పార్టీ అని, ఈ ఎన్నికల్లో చెప్పుకోదగిన పనితీరును అది కనబర్చలేదని సర్వే తెలిపింది. ఇక ఎక్కువ సీట్లు ఉన్న తురా ప్రాంతంలో కాంగ్రెస్‌కు 8, ఎన్పీపీకి 7, బీజేపీకి 3 ఇతరులకు మూడు, జీఎన్సీ, ఎన్సీపీ, యూడీపీలకు తలా ఓ సీటు వస్తుందని సర్వే వెల్లడించింది. బీజేపీ వెనుకబడటానికి కారణం మేఘాలయలో బీజేపీ వెనుకబాటుకు ప్రధాన కారణం భాగస్వామ్య పార్టీలు ముందుకు రావకపోవడమేనని సర్వే తేల్చింది. స్థానిక పార్టీలు ఏవీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అక్కడి 70శాతం ప్రజలకు ఇష్టం లేదట. ఎన్నికలకు ముందు బీజేపీ పొత్తుపెట్టుకునేందుకు ఏ పెద్ద ప్రాంతీయ పార్టీ కూడా ముందుకు రావడానికి ఇష్టపడలేదట. 74శాతం మంది ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఓటర్ల దృష్టి దేనిపై ఉంది? 2018 ఎన్నికల్లో స్థానిక ఓటర్లలో ఎక్కువశాతంమంది అభివృద్ధి అనే అంశంపైనే ఫోకస్ చేశారంట. అలాగే, తమ ప్రాంతంలో నిరుద్యోగాన్ని పారదోలాలని 25శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది. ఇక 53శాతం ఓటర్లు తమకు పోటీకి దిగే అభ్యర్థి ముఖ్యం అని చెప్పగా 22శాతం, 15 శాతం ఓటర్లు తమకు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ముఖ్యం అని చెబుతున్నారు. ముకుల్ సంగ్మాకు ఎన్ని మార్కులు? ముకుల్ సంగ్మా ప్రభుత్వానికి మరోసారి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెబితే ఏమంటారని ప్రశ్నించగా 38శాతం మంది నో చెప్పగా 22శాతం మంది మాత్రం ఓకే చెప్పారని సర్వే తెలిపింది. 40శాతంమంది మాత్రం అనూహ్యంగా తాము ఏమీ చెప్పలేమని పేర్కొన్నట్లు సర్వే పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను మళ్లీ ఎన్నుకుంటారా అని ప్రశ్నించగా 38శాతంమంది నో అని, 34శాతంమంది తప్పకుండా అని చెప్పారు. అంతేకాకుండా ముకుల్ సంగ్మా పనితీరుకు ప్రజలు మంచి మార్కులే వేశారు. 50శాతం మంది ఆయన బాగా పనిచేస్తున్నారని, 17 శాతంమంది పర్వాలేదని, 37 శాతం మంది సరిగా పనిచేయట్లేదని బదులిచ్చినట్లు సర్వే తేల్చింది. -
మేఘాలయ,నాగాలాండ్‌లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు
-
మేఘాలయ, నాగాలాండ్‌లో నేడే ఓటింగ్
-
మేఘాలయ, నాగాలాండ్‌లో నేడే ఓటింగ్
షిల్లాంగ్/ కోహిమా: ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని అధికారులు వెల్లడించారు. కొన్ని పోలింగ్ కేంద్రాలు మినహా మిగతా అన్ని చోట్లా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నాగాలాండ్‌లోని కొన్ని జిల్లాల్లో సాయంత్రం 3 వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నారు. మేఘాలయ, నాగాలాండ్ సహా ఇప్పటికే ఎన్నికలు పూర్తైన త్రిపుర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్చి 3న ప్రకటిస్తారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 120 నియోజకవర్గాలకు గానూ 118 చోట్ల పోలింగ్ జరగనుంది. మేఘాలయలో విలియమ్ నగర్ ప్రాంతంలో తీవ్రవాదుల దాడిలో ఎన్సీపీ అభ్యర్థి జోనాథన్ ఎన్ సంగ్మా మరణించడంతో అక్కడ ఎన్నిక నిలిపివేశారు. ఇక నాగాలాండ్‌లో ఎన్డీపీపీ చీఫ్ నెఫ్యూ రియో ఉత్తర అంగామి–2 నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఆ స్థానంలో ఎన్నిక జరగట్లేదు. మహిళల కోసం పోలింగ్ కేంద్రాలు.. మేఘాలయలో దాదాపు 18.4లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా 67 పోలింగ్ కేంద్రాలు సహా 61 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశామని మేఘాలయ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎఫ్ఆర్ ఖార్కోంగర్ వెల్లడించారు. అలాగే తొలిసారి అత్యధికంగా 32 మంది మహిళలు ఎన్నికల బరిలో ఉన్నట్లు తెలిపారు. ఇక నాగాలాండ్‌లో మొత్తం 11.91 లక్షల మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్) నాగాలాండ్ చేరుకున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ అభిజిత్ సిన్హా వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగిసింది. -
మాకూ ఒక చాన్సివ్వండి!
ఫుల్బరీ/కోహిమా: మేఘాలయకు సుపరిపాలన అందించేందుకు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లో మేఘాలయ భద్రంగా ఉండబోదని విమర్శించారు. తమకు అవకాశం ఇస్తే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని.. ప్రతి రూపాయి సద్వినియోమయ్యేలా పనిచేస్తామని అందుకు తనదే భరోసా అని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ వ్యతిరేకత లేకపోవటాన్ని అలుసుగా తీసుకుని అవినీతికి పాల్పడుతోందన్నారు. మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ‘మేఘాలయలో అధికార ముకుల్ సంగ్మా ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయింది. గర్భిణులు ఇంట్లోనే ప్రసవించే దారుణ పరిస్థితిని కల్పిస్తున్నారు. ఇది తల్లీబిడ్డలకు ప్రమాదకరం. చాలా అంశాల్లో రాష్ట్రం అభద్రతతో తల్లడిల్లుతోంది’ అని మోదీ విమర్శించారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఈశాన్య భారతాన్ని.. ఆగ్నేయాసియాతో అనుసంధానిస్తామని నాగాలాండ్ ప్రచారంలో పునరుద్ఘాటించారు. తద్వారా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. నిధుల దుర్వినియోగం మేఘాలయలో 1100 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 470 కోట్లు విడుదల చేస్తే.. అందులో కనీసం 50 శాతం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించలేదన్నారు. కేంద్రం ఇచ్చిన చాలా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. షిల్లాంగ్‌లో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.180 కోట్లు ఖర్చుచేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధి, ఉపాధికల్పన పెరుగుతుందన్నారు. ఇరాక్, సిరియాల్లో చిక్కుకున్న కేరళ నర్సులను కేంద్ర ప్రభుత్వం క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిందన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. క్రిస్టియన్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. సుస్థిర ప్రభుత్వం అవసరం ‘రవాణా ద్వారా ఈశాన్యరాష్ట్రాల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా, ఈ ప్రాంతం వేగవంతమైన అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం’ అని నాగాలాండ్ ప్రచారంలో మోదీ పేర్కొన్నారు. ‘నవభారత నిర్మాణ స్వప్నం సాకారం.. నవ నాగాలాండ్ కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షలతో పాటుగానే జరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి జరగనంతవరకు దేశాభివృద్ధి స్వప్నం లక్ష్యాన్ని చేరదు. అందుకే ఈ ప్రాంతంపై బీజేపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. సుస్థిర, బలమైన రాష్ట్ర ప్రభుత్వం నాగాలాండ్‌కు చాలా అవసరం’ అని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 27న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ తరపున 20 మంది, మిత్రపక్షం ఎన్డీపీపీ తరపున 40 మంది బరిలో ఉన్నారు. -
మోదీ గొప్ప ఇంద్రజాలికుడు
జోవాయ్: దేశంలో ప్రజాస్వామాన్ని మాయం చేయగల గొప్ప ఇంద్రజాలికుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కుంభకోణాలకు పాల్పడినవారిని ఇక్కడ మాయం చేసి.. భారత చట్టాలు చేరుకోలేని చోటకు పంపటం మోదీ మ్యాజిక్ అని విమర్శించారు. బుధవారం మేఘాలయలోని జోవాయ్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. ‘అప్రయత్నంగానే చాలా అంశాలను మోదీ తన చేతి వేళ్లతో కనిపించేటట్లు, మాయమయ్యేటట్లు చేయగల సమర్థుడు. కుంభకోణాలకు పాల్పడిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు ఇక్కడ మాయమై విదేశాల్లో కనిపించడం.. అదీ మన చట్టాలు చేరుకోలేని చోటు కావడమే మోదీ మ్యాజిక్. త్వరలోనే ఆయన దేశం నుంచి ప్రజాస్వామ్యాన్నీ కూడా మాయం చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం అవినీతిని అంతమొందించలేదు కానీ.. అలాంటి కుంభకోణాలకు పాల్పడిన వారిని మాత్రం కనిపించకుండా చేయగలిగింద’ని రాహుల్ విమర్శించారు. జీవితంపై భరోసా కల్పించడం, భద్రత, ఆర్థిక అభివృద్ధిలోనూ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, ట్వీటర్ ద్వారా కూడా ప్రధానిపై రాహుల్ విమర్శనాస్త్రాలు సంధించారు. పీఎన్బీ కుంభకోణం, రాఫెల్ ఒప్పందాలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలపాలని ప్రశ్నించారు. వచ్చే మన్‌కీ బాత్ ఎపిసోడ్లో నీరవ్ మోదీ కుంభకోణం, రాఫెల్ ఒప్పందాల గురించీ మోదీ మాట్లాడాలన్నారు. ‘మోదీజీ మీ ఏకపాత్రాభినయ కార్యక్రమం మన్‌కీ బాత్‌లో గతనెల ఇచ్చిన సూచనలను మీరు విస్మరించారు. స్వీకరించలేనప్పుడు సూచనలు కోరటమెందుకు? ఈసారి మీ ఉపదేశాన్ని నేను వింటాను’ అని రాహుల్ ట్వీటర్ ద్వారా విమర్శించారు. -
మేఘాలయలో తీవ్రవాదుల దాడి
షిల్లాంగ్: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న మేఘాలయలో ఆదివారం తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విలియమ్ నగర్ నియోజకవర్గ అభ్యర్థి జొనాథన్ సంగ్మాతోపాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు మృతి చెందారు. తూర్పు గరో జిల్లాలో జరిగిన ఈ ఘటనలో తీవ్రవాదులు తొలుత పేలుడు జరిపి అనంతరం సంగ్మా వాహన శ్రేణిపై కాల్పులకు దిగారు. మేఘాలయ శాసనసభలో ఉన్న మొత్తం 60 స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుండటం తెలిసిందే. మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా మృతులకు సంతాపం తెలిపారు. -
మేఘాలయలో ఓటేయనున్న ఇటలీ, స్వీడన్, అర్జెంటీనా!
ఉమ్నియా: మేఘాలయ ఎన్నికల్లో ఓ వింత చోటుచేసుకోబోతోంది. ఇటలీ, స్వీడన్, అర్జెంటీనా, ఇండోనేసియాతోపాటు ప్రామిస్లాండ్, హోలీలాండ్, జెరూసలేం...తదితరాలన్నీ అక్కడి ఎన్నికల్లో ఓటేయబోతున్నాయి. అదేంటీ..ఈ దేశాలకు మేఘాలయ ఎన్నికలతో ఏంటీ సంబంధం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఇవన్నీ ఇక్కడ ఈ నెల 27న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్ల పేర్లు..! ఇవే కాదు, వారాలు.. సండే, థర్స్డే, రాష్ట్రాలు గోవా, త్రిపుర లాంటి పేర్లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ఖాసీ తెగ ప్రజల్లో ఇలాంటి విచిత్రమైన పేర్లుండటం సహజం. ఎన్నికల జాబితాలో ఈ పేర్లను చూసిన అధికారులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారట..! -
మేఘాలయలో గెలుపు గుర్రం ఎవరిది?
సాక్షి, న్యూఢిల్లీ : ఈ నెల 27వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా నామమాత్రపు అస్థిత్వం కలిగిన అతి చిన్న ‘నేషనల్ పీపుల్స్ పార్టీ’ రోజురోజుకు బలం పుంజుకుంటోంది. పాలకపక్ష కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా పలువురు శాసన సభ్యులు, మేఘాలయ జిల్లా అటానమస్ కౌన్సిల్ సభ్యులు గతంలో బీజేపీలోకి వలసపోగా ఇప్పుడు నేషనల్ పీపుల్స్ పార్టీలోకి వలసపోతున్నారు. నెలరోజుల క్రితం ఐదుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు సహా మొత్తం ఎనిమిది మంది పాలకపక్ష సభ్యులు, పలువురు జిల్లా అటానమస్ కౌన్సిల్ సభ్యులు నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరారు. అంతకుముందు ఓ నలుగురు పాలకపక్ష సభ్యులు బీజేపీలో చేరారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్న నేషనల్ పీపుల్స్ పార్టీ రాష్ట్రంలో మాత్రం విడిగా పోటీ చేస్తోంది. అందుకు కారణం మేఘాలయ ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆదివాసీలు తమ సంస్కృతిని ఆదరించని బీజేపీ పట్ల వ్యతిరేకతను పెంచుకోవడమే. 2016లో అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మేఘాలయలో కూడా చాలా మంది బీజేపీకి వలసబాట పట్టారు. అయితే ఆవు మాంసానికి వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ తీసుకరావడంతో ఆదివాసీలైన ఖాసీలు, గారోలు, జయింటీయాలు ఆ పార్టీకి ఎదురు తిరిగారు. వారంతా కూడా గోమాంసంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తమ సంస్కతిని నిషేధిస్తారా? అంటూ బీజేపీపై కోపం తెచ్చుకున్నారు. ఆ తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నా, ఆదివాసీలను మంచి చేసుకోవడం కోసం స్థానిక బీజేపీ నాయకులే బహిరంగ సహభంక్తి గోమాంస భోజనాలను ఏర్పాటు చేసినా లాభం లేకపోయింది. ఆరెస్సెస్ సంస్కతిని ఆ సంస్థ ప్రోద్భలంతో తమపై రుద్దేందుకు ప్రయత్నించడం ఏమిటంటూ వారు ఎదురు తిరిగారు. వారిలో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న ఖాసీలు ఇప్పుడు పూర్తిగా నేషనల్ పీపుల్ప్ పార్టీతో ఉన్నారు. అందుకనే ఆ పార్టీ ఎన్నికల అనంతరం అవసరమైతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా ? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేకపోతుంది. గతంలో లోక్‌సభ స్పీకర్ పనిచేసిన పీఏ సంగ్మా 2012లో ఈ నేషనల్ పీపుల్స్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన 2016లో మరణించడంతో ఆయన కుమారుడు సీ. సంగ్మా ఇప్పుడు బలమైన నాయకుడిగా ఎదిగారు. ఆయన పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మేఘాలయ పశ్చిమ ప్రాంతానికి చెందిన ఫిలేమాన్ లింగ్డో పార్టీలో మరో బలమైన నాయకుడు. ఆయన ఇప్పుడు పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని దీమాగా చెప్పే నాయకులు పాలకపక్ష కాంగ్రెస్‌లో ఎవరూ లేరు. మేఘాలయ రాష్ట్రం మనుగడ 85 శాతం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉందికనుక రాష్ట్ర ప్రజలు తమని గెలిపిస్తారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. గోమాంసం గురించి ప్రశ్నిస్తే అది ముగిసిపోయిన అధ్యాయమని వారు చెబుతున్నారు.