అక్కడ..అబ్బాయే అత్తారింటికి వస్తాడు.. | Matrilineal System And Marriage Among The Khasis Of Meghalaya | Sakshi
Sakshi News home page

అక్కడ..అబ్బాయే అత్తారింటికి వస్తాడు.

Published Thu, Mar 7 2024 2:35 PM | Last Updated on Thu, Mar 7 2024 5:11 PM

Matrilineal System And Marriage Among The Khasis Of Meghalaya - Sakshi

ఇప్పటికీ చాలా కుటుంబాల్లో కొడుకు పుట్టగానే వారుసుడు పుట్టాడంటూ ఘనంగా వేడుకలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆడిపల్ల పుడితేనే సెలబ్రేషన్స్‌. ఆడిపిల్లలకే ఆస్తి ఇస్తారు. ఆఖరికి అక్కడి మహిళలు అత్తారింటికి వెళ్లరు. అబ్బాయిలే అత్తారింటికి వస్తారు. దశాబ్దాలుగా సాగుతున్న పితృస్వామ్య వ్యవస్థకు పూర్తి విభిన్నంగా ఉంటారని చెప్పొచ్చు. ఆ వ్యవస్థ విదేశాల్లోనేమో! అనుకోకండి. మనదేశంలోనే ఈ వ్యవస్థ ఉంది. ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో మనదేశంలో ఉన్న ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? ఏంటా వింత ఆచారాలు తెలుసుకుందామా!.

గిరిజనులు అనగానే బాగా వెనుకబడిన వాళ్లు, అమాయకులు అనుకుంటాం. మేఘాలయ రాష్ట్రంలోని గిరిజన తెగను చూస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఆ తెగల ఆచారాలు సంప్రదాయలను చూసి సమాజానికి ఎంత స్ఫూర్తిగా ఉన్నాయా ? అని ఆశ్చర్యపోవడం ఖాయం. మనమే చాలా వెనకబడి ఉన్నామా? అన్నా సందేహం కూడా వస్తుంది. ఇలా ఎందుకు చెబుతున్నానంటే..

ఆడపిల్లకే పట్టం..
మేఘాలయలోని ఖాసీ, గరో అనే తెగలు మయాన్మార్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన తెగలు. ఈ తెగలు మేఘలయాలోని జైంటియా అనే పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయితే ఈ తెగలు దశాబ్దాలకు పూర్వమే కొన్ని నియమాలు, పద్ధతులు పెట్టుకున్నారు. వాటినే ఇప్పటికీ ఆచరిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 
అక్కడ ఆడపిల్ల పుడితేనే వేడుకగా సెలబ్రేషన్స్‌ చేస్తారు. ఆడపిల్లకే పట్టం కడతారు.పెత్తనం అంతా ఆడపిల్లదే. ఆడపిల్లకే ఆస్తి ముట్టజెప్పుతారు. ఆఖరికిగా ఆడపిల్ల అత్తారింటికి వెళ్లదు. వరుడే అత్తారింటికి ఇళ్లరికం అల్లుడుగా వస్తాడు.

అయితే ఆ తెగలోని ఆడపిల్లలు తమ తెగలోని అబ్బాయిని కాకుండా మరో జాతి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈ నియమాలు వర్తించవట. అలాగే అక్కడి కుటుంబాల్లో ఒకరికి మించి ఎక్కువమంది ఆడిపిల్లలు ఉంటే..చిన్న కూతురు తప్పించి మిగతా వాళ్లంతా తమ భర్తలతో అదే ఇంట్లో ఉండోచ్చు. అక్కడ చిన్న అమ్మాయిని ఖథూగా పరిగిణిస్తారు. ఆ అమ్మాయికి పెళ్లి తర్వాత ఇంటి భాద్యతలు, ఆస్తిపాస్తులన్నీ ఆమెకే ఇస్తారు.

ఆఖరికీ తల్లి మరణం తర్వాత ఇంటి భాద్యతలన్నీ నిర్వర్తించాల్సి కూడా ఆమెనే. అంతేగాదు పుట్టబోయే పిల్లలకు ఇంటిపేరు కూడా తల్లి ఇంటి పేరే పెడతారు. అలాగే పిల్లల పోషణ, బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కూడా ఆడవాళ్లకే ఎక్కువ హక్కులు ఉంటాయట. అందువల్లే ఇక్కడ మహిళలు వ్యవసాయం, ఇతర ఉద్యోగాల్లో వాళ్లే బాగా రాణిస్తారట.  ఇలా ప్రతి విషయంలో పురుషుల కంటే మహిళలదే పైచేయి కావడంతో అక్కడ గృహహింస,అత్యాచారాలు, వేధింపులు ఉండవని అక్కడ స్థానికులు చెబుతున్నారు. 

సమానత్వం కోసం పురుషుల పోరాటం..
ఇలా ఇక్కడ దశాబ్దాలుగా మాతృస్వామ్య వ్యవస్థే రాజ్యమేలుతోంది. అయితే ప్రపంచంలో చాలా చోట్ల స్త్రీలకు సమాన హక్కుల ఉండాలని, లింగ సమానత్వం కోసం తెగ పోరాటాలు చేస్తుంటే ఆ ఖాసీ, గరో తెగకు చెందిన పురుషులు మాత్రం తమ సమానత్వం కోసం ఏళ్లుగా పోరాడుతుండటం విశేషం. ఇందుకోసం 1990 నుంచి ఓ స్వచ్ఛంద సంస్థ నిరంతరం కృషి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఏదీఏమైన ఈ రెండు తెగలు సమాజానికి స్ఫూర్తిగా మంచి నియమాలు పెట్టుకున్నాయి కదూ!. అయితే ఇలాంటి ఆచారమే 20వ శతాబ్దానికి పూర్వమే కేరళలోని నాయర్‌ తెగలో కూడా ఉండేదట. 

(చదవండి: వజ్రాలు, వైఢ్యూర్యాలతో డిజైన్‌ చేసిన జాకెట్‌..ధర ఏకంగా..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement