భారతదేశంలో వివాహం అనేక ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరికీ అదొక సామాజిక అవసరం. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మందికి పెళ్లి వయసు వచ్చిన వివాహం కావడం లేదని ఆందోళనకు గురవుతుంటారు. అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతూ ఉంటాయి. వీటినుంచి విముక్తి కోసం రకరకాల పూజలు, శాంతులు చేస్తూ ఉంటారు. జాతకాలు, దోషాలు అంటూ నానా తంటాలు పడుతుంటారు. కానీ ఈ శివాలయానికి వెళితే సంవత్సరం తిరిగే లోపే వివాహం అవుతుందని భక్తులు చెబుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఒక దేవాలయం గురించి , దాన్ని ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.
తంజావూరు జిల్లా కుట్టాలమ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయం కళ్యాణసుందర్ ఆలయం. కావేరీ నదీతీర ప్రాంతంలో నిర్మితమైన ఈ ఆలయంలోని పార్వతీ పరమేశ్వరులు పాణిగ్రహణ (చేతిలో చేయి వేసి పట్టుకున్న) స్థితిలో దర్శనమిస్తారట. ఆదిదంపతుల వివాహం జరిగిన పవిత్రమైన స్థలంగా భక్తులవిశ్వాసం. అందుకే పెళ్లికాని వారు ఒక్కసారి ఈ ఆలాయన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏడాది తిరిగే లోగా ఆమూడుముళ్ల వేడుక జరుగుతుందని భక్తులు నమ్ముతారు .
తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్‌గుడి బ్లాక్‌లో ఉందీ దేవాలాయం. దీని పేరే మంగళాంబి సమేత మాంగళీశ్వర దేవాలయం. మాంగల్య మహర్షి ఇక్కడ విరివిగా వివాహాలను నిర్వహించారని ప్రతీతి. ఈ దేవుడి ఆశీస్సుల వల్లే బైరవ, వశిష్టర్, అగస్తియర్‌ల వివాహాలు జరిగాయట. ముఖ్యంగా ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు క్రమం తప్పకుండా సందర్శించే దేవాలయం. పురాణాల ప్రకారం, మాంగల్య మహర్షి స్వయంగా ఉత్తర నక్షత్రంలో జన్మించాడట.
మాంగల్య మహర్షి తపస్సు చేసి సంపాదించిన అపారమైన శక్తి మహిమతో ఇది సాధ్యమవుతుందని చెబుతారు. ఆయన దేవదూతలకు గురువైనందున, ఆయన ఆశీర్వాదంతో శ్రీఘ్రమే వివాహాలు జరుగుతాయని, అమోఘమైన వరాలను అనుగ్రహిస్తారని నమ్ముతారు.వివాహానికి సంబంధించిన ప్రతీ ముహూర్తాన్ని దేవదూతలు పైనుండి ఆశీర్వది స్తారని కూడా నమ్ముతారు. నిజానికి తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్టు జిల్లా, చెన్నైలోని తిరువిందందై అనే గ్రామంలో ఉన్న నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయం సహా ఇలాంటి టెంపుల్స్ చాలా ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment