Maha Shivaratri
-
హీరోయిన్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డ బాబాలు.. వీడియో వైరల్
సినిమా తారలు బయట కనిపించడం చాలా అరుదు. సినిమా ప్రమోషన్స్ కోసమో లేదా ఏదైనా షాప్ ఓపెనింగ్ సమయంలోనూ వారు బయటకు వస్తారు. అందుకే వాళ్లని ప్రత్యేక్షంగా చూసేందుకు సామాన్య జనం ఆసక్తి చూపిస్తారు. బయట కనిపిస్తే ఫోటోల కోసం ఎగబడతారు. ఇదంతా అభిమానులు, సామాన్యులు చేసే పని. కానీ ఓ హీరోయిన్‌తో ఫోటో దిగేందుకు బాబాలు పోటీ పడ్డారు. ఆమెను సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఈ విచిత్ర ఘటన హీరోయిన్ ఆమీషా పటేల్(Ameesha Patel)కి ఎదురైంది.శివరాత్రి వేడుకలో..మహా శివరాత్రి సందర్భంగా బుధవారం సినీ నటి ఆమీషా పటేల్ ముంబై జుహూలోని శివాలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఆమె బయటకు వస్తుండగా.. అక్కడి భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. సామాన్య భక్తులతో పాటు గుడిలో ఉన్న సాధువులు కూడా ఆమీషాతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఆమె కాసేపు నవ్వుతూ అందరికి సెల్ఫీలు ఇచ్చింది. అయితే బాబాలు పెద్ద ఎత్తున రావడంతో ఆమెకు ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ సిబ్బంది వారందరిని పక్కకి పంపిస్తూ.. ఆమీషాను కారు వద్దకు తీసుకెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది వద్దని చెప్పినా వినకుండా సాధువులు ఫోటో కోసం ఆమీషా వెంటపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధువులు కూడానా?హీరోయిన్‌తో సెల్ఫీ కోసం సాధువులు ఎగబడడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు వీరంతా నకిలీ బాబాలు అని.. నిజమైన బాబాలకి ఇలాంటి లక్షణాలు ఉండవని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. చివరికి సాధువులు కూడా ఇలా తయారయ్యారేంటి అని మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా ఆమీషాకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఎవరీ అమీషా పటేల్?ముంబైలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ కహో నా.. ప్యార్ హై (2000) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. అదే ఏడాది బద్రి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ మరుసటి ఏడాది గదర్: ఏక్ ప్రేమ్ కథ చిత్రంతో స్టార్ స్టేటస్ అందుకుంది. దీంతో వరుసగా హిందీలో అవకాశాలు క్యూ కట్టాయి. యే జిందగీ కా సఫర్, క్రాంతి, హమ్రాజ్, ఆప్ ముజే అచ్చే లగ్నే లగ్నే, తథాస్తు, మంగళ్ పాండే, వాదా, భూల్ భులయ్యా, తోడా ప్యార్ తోడా మ్యాజిక్, రేస్ 2.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది.తెలుగులో మహేశ్‌బాబు సరసన నాని , బాలకృష్ణతో నరసింహుడు పరమవీరచక్ర మూవీస్‌లో నటించింది. 2018లో వచ్చిన భయ్యాజీ సూపర్ హిట్ మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. గదర్ 2తో 2023లో రీఎంట్రీ ఇచ్చింది.హీరోయిన్ అమీషా పటేల్‌తో ఫోటోల కోసం ఎగబడ్డ బాబాలుమహాశివరాత్రి సందర్భంగా ముంబై - జుహూలో ఓ శివాలయానికి వెళ్లిన హీరోయిన్ అమీషా పటేల్‌ను చుట్టుముట్టి ఫోటోల కోసం ఎగబడ్డ బాబాలు pic.twitter.com/iLeZJd9OfE— Telugu Scribe (@TeluguScribe) February 27, 2025 -
దేవుడి దీపమే.. ఆ ఇంటికి శాపమైంది
శ్రీకాకుళం జిల్లా: ఆ కుటుంబానికి దీపమే శాపమైంది. కష్టార్జితాన్నంతా బూడిద చేసింది. వజ్రపుకొత్తూరు మండలం కొండవూరుకు చెందిన అడ్డి రమణ, విమల దంపతులు బుధవారం మహా శివరాత్రి పర్వదినాన ఇంట్లో దేవుడికి దీపం వెలిగించి శివాలయానికి వెళ్లారు. తిరిగి వచ్చే లోగా అగ్ని ప్రమాదం సంభవించడంతో తీరని నష్టం వాటిల్లింది. అప్పు తీర్చేందుకు తెచ్చిన రూ.1.15 లక్షల నగదు కాలిపోయింది. మూడు తులాల బంగారం, వెండి, విలువైన పత్రాలు, ఎల్ఐసీ పాలసీ బాండ్లు, దుస్తు లు, ఇతర సామగ్రి బూడిదైపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కష్టార్జితం కాలిపోయింది.. మంకినమ్మ దాసుడైన అడ్డి రమణ.. కౌలు రైతు. భార్యాబిడ్డలతో కలిసి రేకుల ఇంట్లోనే నివాసముంటున్నాడు. గ్రామంలో ఓ వ్యక్తికి లక్ష రూపాయలు బాకీ ఉండటంతో గేదెలు అమ్మాడు. రూ.1.15 లక్షలు రావడంతో ఇంటిలోని దేవుడి మూల దాచిపెట్టాడు. రేపోమాపో అప్పు తీర్చుదామనుకోగా ఇంతలో ప్రమాదం జరగడడంతో లబోదిబోమంటున్నాడు. కాగా, ఈ ప్రమాదంలో కొంత సొమ్ము పాక్షికంగా కాలిందని, బ్యాంక్ అధికారులు స్పందించి చెల్లుబాటేయ్యేలా చూసి బాధితుడిని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కొల్లి భాస్కరరావు కోరారు. ఇదే విషయాన్ని వీఆర్ఓ, తహసీల్దార్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. -
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..పులకించిన భక్తజనం (ఫొటోలు)
-
పుణ్యస్నానాలకు వెళ్లి ఏడుగురి మృతి
కొవ్వూరు/తాళ్లపూడి/శ్రీశైలం ప్రాజెక్ట్/కొళ్లికూళ్ల (పెనుగంచిప్రోలు): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం నదీ స్నానాలకు వెళ్లిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువకులు కాగా, ఇద్దరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తండ్రి, కుమారుడు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన 12 మంది యువకులు బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మోటారు సైకిళ్లపై సమీపంలోని చింతలపూడి పంప్‌హౌస్ వద్ద గోదావరి నదిలో స్నానాలకు వెళ్లారు. అక్కడి ఇసుక ర్యాంపు వద్ద నీరు మూడు అడుగులే ఉండటంతో స్నానాలకు దిగారు. కేరింతలు కొడుతూ ఉత్సాహంగా స్నానాలు చేస్తూ నీరు ఎక్కువగా ఉన్న వైపు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లేసరికి ప్రవాహం పెరగడంతో తిరుమలశెట్టి సాయిపవన్ (17), పడాల దుర్గాప్రసాద్ (19), అనిశెట్టి పవన్ గణేష్ (18), పడాల దేవదత్త సాయి (19), గర్రే ఆకాశ్ (19) కొట్టుకుపోయారు. వెంటనే స్థానిక జాలర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు పడవలతో గాలించారు. మృతులంతా పేద కుటుంబాలకు చెందినవారే. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు ఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. శ్రీశైలం వద్ద తండ్రి, కుమారుడు మృతి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్ల గ్రామానికి చెందిన పెరుగు చిన్న గురవయ్య (35), ఆయన కుమారుడు వాసు (11) శ్రీశైలం లింగాలగట్టు వద్ద కృష్ణా నదిలో మునిగి మరణించారు. శివ దీక్ష తీసుకున్న గురవయ్య, భార్య తిరుపతమ్మ, కుమారుడు వాసు, ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు మంగళవారం బస్సులో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లారు. బుధవారం ఉదయం స్నానాలు చేసేందుకు లింగాలగట్టు వద్దకు వెళ్లారు. కృష్ణా నదిలో స్నానం చేస్తుండగా వాసు కాలు జారి నీటిలో పడిపోయాడు. కుమారుడిని కాపాడబోయిన చిన్న గురవయ్య కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న తిరుపతమ్మ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని మత్స్యకారులు నదిలో దూకి వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గురవయ్య, వాసు మృతదేహాలను పోలీసులు సున్నిపెంట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
శివరాత్రి జాగరణ: జగడమైనా ఆడుదాం.. జామురాతిరి వరకు గడిపేద్దాం..
ముక్కోటి దేవతలు ఒక ఎత్తు.. శివయ్య ఒక్కడూ ఒకెత్తు.. అందుకే శివయ్య పండగ శివరాత్రి అంటేనే ఒక ప్రత్యేకత.. అన్ని పండగలకూ ఇంట్లోనే పూజలు. మహా అయితే గుళ్లకు పోయి రావడం.. ఇంట్లో రకరకాల వంటలకు చేసుకుని తినడం.. భుక్తాయాసంతో రోజూకన్నా ఓ గంట ముందుగానే పడుకోవడం సర్వసాధారణం. కానీ శివరాత్రి అంటేనే వేరు.. ఆ పండగ చేసుకునే తీరే వేరు.. ఇష్టాను సారం తినడం. గుర్రుపెట్టి నిద్రపోవడం వంటి రెగ్యులర్ ఫార్మాట్ ఈ శివయ్య పండక్కి ఉండదు.. శివరాత్రికి దాదాపుగా ఉపవాసం ఉంటారు.. పండో.. ఫలమో తిని.. పంచామృతం వంటివి సేవించి రోజూకన్నా తక్కువ ఆహారంతో శివయ్యను సేవిస్తారు..అన్నిటికి మించి ఆ ముక్కంటి కోసం కోట్లాదిమంది ప్రజలు ఏకంగా జాగరణ చేయడం ఇందులో ప్రత్యేకత. జాగరణ అంటే ఎలా.. రోజూ తొమ్మిది.. పదింటికి నిద్రపోయే జనాలు తెల్లార్లు నిద్రపోకుండా ఉండడం ఎలా ? వారికి నిద్రను దూరం చేసేది ఎలా ? ఇప్పుడంటే రకరకాల చానెళ్లు.. ఓటీటీలు... టీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు వస్తున్నాయి కానీ 2000 సంవత్సరం వరకు జాగరణ అంటే అదొక ప్రత్యేక ప్లాన్ .. దానికోసం రెండురోజుల ముందునుంచే ఏర్పాట్లు.. ఉండేవి...పేకాడుకుందాం మామాఇప్పుడంటే ఏదీ వింతకాదు కానీ ఓ ఇరవయ్యేళ్ళ క్రితం వరకు జాగరణ అంటే అదో పెద్ద ప్రక్రియ. ఊళ్లలో కొన్ని చోట్ల శివకళ్యాణం .. గంగావివాహం వంటి కథాకాలక్షేపాలు ఉండేవి.. ఇంకొందరు జల్దీ ఫైవ్ .. లేదా పేకాట వంటివాటితో జాగరణ చేసేవాళ్ళు.. జగడం ఆడుతూ అయినా సరే జామురాతిరి వరకైనా జాగరణ చేయాలన్నది సూక్తి.. ఈ మేరకు కొందరు అర్థరాత్రి వరకు ఏదోలా ఓపికపట్టి జాగరణ ఉండేవారు..దానికోసం రకరకాల కార్యక్రమాలు.. కథా కాలక్షేపాలు.. రంగస్థల ప్రోగ్రామ్స్.. వంటివి ఊళ్లలో నిర్వహించేవాళ్ళు.. అది లేనివాళ్లు దగ్గర్లోని శివాలయం వద్ద కూర్చుని భజనలతో గడిపేవాళ్లు... ఆలయాల వద్ద తెల్లార్లు సాంస్కృతిక కాలక్షేపాలు ఉండేవి. కొన్ని పల్లెల్లో గ్రామం మొత్తం చందాలు వేసుకుని 16 ఎంఎం తెరలు కట్టి ఊళ్లలో సినిమాలు వేయించేవాళ్ళు.. కృష్ణ.. శోభన్ బాబు.. ఎన్టీయార్ సినిమాలు ఎక్కువగా ఈ చిన్న స్క్రీన్ మీద వేసి.. గ్రామం మొత్తం జాగరణ చేసేవాళ్ళు.కేబుల్ ఆపరేటర్ కు ఫోన్ కొట్టు.. నచ్చిన సినిమా పెట్టుఆ తరువాతి కాలంలో కేబుల్ టీవీలు వచ్చాయి.. అంటే 1990ల్లో కేబుల్ టీవీలు వచ్చాక జాగరణ తీరు మారింది. కేబుల్ ఆపరేటర్లు తెల్లార్లు తమ కేబుల్ చందాదారులకు సినిమాలు వేసేవాళ్ళు. అందరూ రాత్రి భోజనాలు చేసేశాక తమ టివిల ముందు కూర్చుంటే అయన వరుసగా ఓ నాలుగు సినిమాలు వేసేవాడు.. దీంతో తెల్లారిపోయేది. ఇంటిల్లిపాదీ టివిల ముందు కూర్చుని సినిమా చూస్తూ మధ్యలో నిద్ర వస్తే నాలుగు అడుగులు అటు ఇటు వేసి రావడం.. లేదా మధ్యలో టీ కాపీలు పెట్టుకుని తాగడం.... కొంతమంది అయితే కేబుల్ ఆపరేటరుకు ఫోన్ చేసి ఈ సినిమాలు వేయాలో లిస్ట్ కూడా ఇచ్చేవాళ్ళు. అందులోనూ మళ్ళా రికమెండేషన్లు.. కొంతమందికి మాత్రమే ఆపరేటర్ వద్ద పలుకుబడి ఉండేది.. కాబట్టి ఆ పలుకుబడి ఉన్న పెద్దలతో కేబుల్ ఆపరేటరుకు చెప్పించి.. చిరంజీవి.. నాగార్జున.. బాలకృష్ణ.. సినిమాలు వేయించి మెల్లగా జాగరణ పూర్తి చేసేవాళ్ళు.మిడ్ నైట్ సినిమాకు పోదాం మామాపల్లెల్లో జాగరణ చేయడం ఇష్టం లేని యువత మాత్రం నడిచి కొందరు.. సైకిళ్ళ మీద కొందరు దగ్గర్లోని పట్టణాలకు పోయేవాళ్లు. అక్కడ సెకెండ్ షో అయ్యాక అంటే రాత్రి 12 తరువాత ఒక షో సినిమా వేసేవారు. దాన్ని మిడ్ నైట్ షో అనేవారు. అది ముగిసేసరికి దాదాపు మూడు అయ్యేది.. ఒక్కోసారి ఊళ్లలోని టూరింగ్ టాకీసులు ఒకే టిక్కెట్ మీద రెండు సినిమాలు.. వేసి ప్రేక్షకులను రప్పించేవారు.. పట్టణాల్లోని దాదాపు అన్ని థియేటర్లల్లోనూ ఈ మిడ్ నైట్ షోలు వేసేవాళ్ళు.దీనికి రెండు రోజుల ముందు నుంచే .. పోస్టర్లు.. రిక్షాలో మైక్ పెట్టి ప్రచారం వంటివి చేసేవాళ్ళు.. జాగరణ రోజు ఊళ్లలో తెల్లార్లు టీ స్టాళ్లు నడిచేవి.. తెల్లార్లు సినిమాలు చూసి.. అట్నుంచటే నదీస్నానం చేసి జాతరకు వెళ్ళేవాళ్ళు.. కొందరు జోగుతూ సైకిళ్ళ మీద ఇళ్లకు చేరేవాళ్ళు.. జాతరలో బొమ్మలు.. జీళ్ళు.. ఖజ్జూరం.. సెనగలు.. చేరుకుముక్కలు కొనుక్కుని ఇళ్లకు రావడం ఒక మధురానుభూతి. ఇప్పుడు ఆ జాగరణ తీరు మారింది.. ఎవరింట్లో వాళ్ళు ఓటిటిలు.. బిజీ.. పక్కింటికి వెళ్లి మాట్లాడడం.. వారి ఇంట్లో కూర్చుని పేకాడుకోవడం.. కబుర్లాట అంతా నామోషీ.. ఇప్పుడు ఎవరికీ వారే యమునా తీరు.. ముక్కోటి దేవతలకు మహారాజు అయినా ఈ మనుషులమధ్య దూరాన్ని మాత్రం శివయ్య కూడా తగ్గించలేకపోతున్నాడు.-సిమ్మాదిరప్పన్న -
నుదుట నామాలు.. శివయ్య భక్తిలో టాలీవుడ్ హీరోయిన్స్
మహాశివరాత్రి సందర్భంగా నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల లాంటి హీరోయిన్స్ దేవాలయాలకు వెళ్లారు. సింగర్ శ్రేయా ఘోషల్ శివుడి బొమ్మతో ఉన్న చీరతో కనిపించింది. మరికొందరు బ్యూటీస్ ఎప్పటిలానే కాస్త గ్లామరస్ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by Vaishali Raj (@vaishaliraj_official) View this post on Instagram A post shared by Divya khossla (@divyakhossla) View this post on Instagram A post shared by Richa Panai (@richapanai) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Tridha Choudhury ✨ (@tridhac) -
కీసరగుట్టలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో విషాదం
-
మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రజలందరిపై మహాశివుడి అనుగ్రహం సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలందరిపై మహాశివుడి అనుగ్రహం సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.#Mahashivratri2025— YS Jagan Mohan Reddy (@ysjagan) February 26, 2025 -
మహా శివరాత్రి.. శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
నేడే ఆఖరి అమృత స్నానం
మహాకుంభ్ నగర్(యూపీ): కోట్లాది మంది భక్తుల శరణ ఘోష, ఆధ్యాత్మిక పరిమళాల మధ్య భక్త జన కోటి పుణ్య స్నానాలు, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీకి కొనసాగింపుగా ‘మహా కుంభమేళా’గా వినతికెక్కిన మహత్తర ఆధ్యాత్మిక వేడుక ఎట్టకేలకు చిట్టచివరకు చేరుకుంది.గత 44 రోజులుగా త్రివేణి సంగమ క్షేత్రంలో అప్రతిహతంగా కొనసాగుతూ కోట్లాది మంది భక్తుల పవిత్ర స్నానాలతో కిక్కిరిసిన ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా ఘాట్లు బుధవారం తుదిఅంకంలో భాగంగా మహాశివరాత్రితో మరోసారి ఇసుకేస్తే రాలనంత జనసంద్రంగా మారనున్నాయి. నేడు మహా శివరాత్రిని పురస్కరించుకుని కోటి మంది భక్తులు చిట్టచివరిదైన ‘అమృత్ స్నాన్’ క్రతువులో పాలుపంచుకోనున్నారని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఘాట్ల వద్దకు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అంతటా వాహనాలను నిషేధించారు.‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. ఇటీవల త్రివేణి సంగం ఘాట్‌లో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలుకోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం మరింతగా పోలీసు బలగాలను మొహరించింది. చిట్టచివరి రోజు కావడంతో భక్తులు తాకిడి అనూహ్యంగా ఉండొచ్చన్న అంచనాలతో ప్రభుత్వం అన్ని రకాలుగా సర్వసన్నద్ధమైంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో కుంభమేళా భక్తుల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఘాట్ల వద్ద ఒకేచోట జనం పోగుబడకుండా ప్రత్యేక పర్యవేక్షణా బలగాలను రంగంలోకి దింపారు. -
నేడు శివరాత్రి.. జనమనోహరుడు
శివరాత్రివేళ ఒక్కసారిగా పుణ్యనదులు, పుణ్యక్షేత్రాలు జనవాహినితో సందడిగా ఉంటాయి. ఒక సమైక్యతకీ, సమన్వయానికీ సంకేతమిది. భాషలు, ఆచార వ్యవహారాలు, కట్టూ బొట్టూ ఇలాంటి తేడాలు ఎన్ని ఉన్నా భారతీయులందరూ ఒకే శివభావంతో ఒక్కటిగా మసలే సుదినమిది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా పుట్టిన హాలాహలాన్ని ఉండలా చేసుకుని కంఠంలో ఉంచి కాపాడిన వాడు శివుడు. ఆ తరువాతపాలకడలిని మధించగా వచ్చిన అద్భుతమైన వస్తువులన్నింటినీ దేవదానవులే పంచుకున్నారు. అవేవీ శివుడు స్వీకరించలేదు. ఆశించలేదు. ఈ లీలద్వారా జగత్పాలకుడైన శివుడు,పాలకులు ఎలా ఉండాలో బోధించాడు.ఒకపాలకుడిగా ప్రజల ధనాలనీ, ప్రయోజనాలనీ తాను అనుభవించకుండా, సుఖాలను మాత్రం అందకి పంచి, కటువైన విషాన్ని తాను దిగమింగిన అమృతమూర్తి రుద్రుడు. భూమికోసం... తన పితరుల మోక్షం కోసం భగీరథుని ప్రార్థన మేరకు గంగను తన జటాజూటాల నుంచి దించిన వేల్పు శివుడు. లోకక్షేమంకోసం ఎంతటి భారాన్నైనా స్వీకరించి నిర్వహించే సమర్థత, సౌజన్యం శివుని సహజ స్వభావం. లోకకంటకులైన త్రిపురాసురాది దుష్టుల్ని నిగ్రహించి, తన పరాక్రమాన్ని, ప్రసన్నతనీ ప్రదర్శించిన పరమాత్ముడు. ‘శివం’ అంటే ‘మేలు, మంచి’. లోకాలకి మేలు చేసే స్వభావం కలవాడు కనుకనే శివుడు. ప్రాణికోటికి శుభాన్ని కోరేవాడు, శ్రేయస్సును కలిగించే వాడు శివుడు.రుద్రుడు – దుఃఖాన్నిపోగొట్టేవాడు;శంకరుడు – సుఖాన్నీ, శాంతినీ కలిగించేవాడు;శంభుడు – శాంతికిమూలమైన వాడు;సదాశివుడు – ఎల్లవేళలా శుభస్వరూపుడు.⇒ ఇలా శివుని నామాలన్నీ ఆయనలోని ‘మేలు’ గుణాల్ని చెబుతున్నాయి. ఈ స్వభావాలను మనలో పెంచుకునేలా చేసేదే శివభావన, శివారాధన.⇒ ‘శివుని పూజించడం – అంటే తపస్సునీ, జ్ఞానాన్నీ, త్యాగాన్నీ ఆరాధించడమే. భారతీయుల ఆదర్శాలివి. అందుకే నిరంతరం త΄ోరూపంలో ఉన్న శివుని ఆరాధిస్తున్నారు’’ అని స్వామి వివేకానందుల వాగ్భావన. ఈ సుదినాన శివ తత్త్వాన్ని అర్థం చేసుకుందాం.. చేతనైన మేరకు శివరాత్రిని జరుపుకుందాం. మన చిత్తాలను శుద్ధి చేసుకొని, పవిత్ర భావనతో అంతర్ముఖులమై మనలోని పరమాత్మని ధ్యానించడమే ముఖ్య శివారాధన. అంతర్ముఖత్వానికి సంకేతమే రాత్రి. సత్యాన్ని మరువకుండా జాగరూకతతో మెలగడమే జాగరణ. ఇంద్రియ చపలత్వాన్ని నిగ్రహించడమే ఉపవాసం. సద్భావనలతో పరమాత్మను ఆరాధించడమే అభిషేకం.– డి.వి.ఆర్. -
హ్యూమనిస్టు జగమై జంగమమై
జగత్సర్వం శివమయం. శివునికి అతీతమైనది ఏదీ లేదు ఆకార నిరాకార దివ్యదీపం శివుని రూపం. నిరంజనుడు. నిరూపుడు. నిర్గుణుడు. మేరునగానికి మరుభూమికి తేడా చూడని తత్వమే శివ తత్వం. భస్మలేపనమైనా సుగంధమైనా తనకు ఒక్కటే. జనన.. మరణం లేని ఆది అంతం లేని అనాది ఉనికి శివుడు. గమనానికి వాహకమై ఏ చలనం లేని అచలం శివుడు. సమస్తాన్ని సృష్టించి, తానే సమస్తమైనవాడు. తనలో జనించిన జగత్తు దుఃఖాలకు, సౌఖ్యాలకు తాను అతీతుడు. స్థావర జంగమాత్మక జగత్తులో ఒక జంగముడై అనాది యుగాల నుండి నడయాడే శూన్య సంచారి. నిజమైన సమతా తత్త్వానికిపాదు శివుడే. ముడుపులు, కానుకలకు మురువని వాడు. అభిషేకానికి, బిల్వ పత్రానికి పరవశించే పసివాడు శివుడు.చరిత్రకారులు ఈమని శివ నాగిరెడ్డి, కన్నడ సాహితీవేత్త ఆచార్య ఏ. శివప్రకాశ్, ఏటుకూరి బలరామ మూర్తి, ఆధ్యాత్మికవేత్త శివానంద మూర్తి వీరి రచనల అధ్యయనం వల్ల, బౌద్ధానికి, శివతత్వానికి ఉన్న ఎన్నో సారూప్యతలను కాంచగలం. జగద్గురు ఆదిశంకరుడు బౌద్ధాన్ని అధ్యయనం చేసి అందులోని ప్రతీత్య సముత్పాద తత్వమునకు ఆకర్షితుడై అద్వైతాన్ని రూపొందించినట్లు తెలుస్తున్నది. శంకరుని అద్వైతానికన్నా ముందే సిద్ధ నాగార్జునుని మాధ్యమిక వాదముంది. ఇంచుమించు అదే కాలంలో కాశ్మీరానికి చెందిన అభినవగుప్తుని పూర్ణాద్వైతం సాత్విక ధోరణిలో ఎంతో ప్రామాణికమైనది. దృశ్యం మిథ్య. సకలం నిష్కలం ... ఈ జగత్ అంతా బుద్బుద ప్రాయం ఈ భావసంచయమంతా బౌద్ధం నుంచి శంకరాచార్యుడు పొందినాడని అనేకులు ప్రస్తావించినారు.కర్ణాటకలో దేవర దాసమయ్య, బసవన్న, అక్క మహాదేవి, అల్లమా ప్రభు, మదార చెన్నయ్య, శివ నాగమయ్య ఎందరో శివయోగులు కుల, మత, లింగ భేదాలుపాటించలేదు. ఇష్టలింగమే నీలోని శివుడని, కాయకమే కైలాసమన్నారు. నీలో ఉన్న ఇష్ట లింగాన్ని నీకు నీవే పూజించుకొని నిన్ను నీవే తరింప చేసుకోమన్నారు. కర్మకాండలు, క్రతువులు అనివార్యం కాదని బోధించారు. లోకహితమే ఆధ్యాత్మిక తత్వమన్నారు. మహోన్నతమైన ఆలోచనలతో, ఆచరణలతో విశాల ప్రజా రాసులకు దగ్గరైనారు. ఆనాటి బసవన్న నుంచి ఈ మధ్యే లింగైక్యం చెందిన టుముకూరు సిద్ద గంగస్వామి సనాతన శివభక్తిని, ఆధునిక విజ్ఞానాన్ని మిళితం చేశారు.అందరికి నాణ్యమైన ఉచిత విద్య, ఆధునిక వైద్యసేవలనందించి ఎన్నో జీవితాలను వెలిగించారు. సంపదపై ఏ ఒక్కరి హక్కు ఉండదని దేవర దాసమయ్య వాక్కును ఉటంకించారు రుద్రాక్షమఠం ప్రభు లింగస్వామి. డాక్టర్ భాస్కర యోగి శివతత్వమునెరిగిన అవధూతలెందరినో పరిచయం చేశారు. మరోవైపు శ్రీధరస్వామి, శివరామదీక్షితులు, కంభ బ్రహ్మం, అనుమనగిరి శివరామ యోగి, కాలజ్ఞాని వీరబ్రహ్మం, యోగి వేమన శివతత్వాన్ని అచలంతో మేళవించి పరిపూర్ణమైన ఎరుకను బోధ చేసినారు.పోరుమామిళ్ల కాశినాయన, అమరాబాద్ సయ్యద్ అబ్దుల్, వారి శిష్యుడు బాలకిషన్, చిన్న రాముడు, కాసిదాసు, కోటకదిరా చంద్ర మౌళీశ్వర స్వామి, చెన్నదాసు, దుర్గి సుబ్బదాసు, కైవారం నారాయణ తాత, అహమదుద్దిన్, ఉత్తరాస్వెల్లి విశ్వద్దీన్, యానగొంది మాణిక్యమ్మ, పూదోట బసవయ్య, ఇమ్మడిజెట్టి చంద్రయ్య, దున్న ఇద్దాసు, హఠయోగి చెన్నదాసు, నడిగడ్డ ఈ్వరయ్య... ఇలా ఎందరో మాన్యులు మహాజ్ఞాన సంపన్నులై నిరాడంబరంగా జీవించి ప్రలోభాలకు, కాసులకు, అధికార పీఠాలకు ఆమడ దూరంలో ఉండినారు. పరిపూర్ణమైన ఎరుకతో లోకాన్ని తరింపజేసినారు. ఈ శివతత్వం మానవులలో ద్వేషం మాపుతుంది. భోగ లాలసతనాపుతుంది. క్రౌర్యానికి కళ్ళెం వేస్తుంది. ఆశా మోహాలను అదుపులో ఉంచుతుంది. ‘‘మేలైన ఆకాశ పృథ్వి, జలం, అగ్ని, గాలితో కూడిన మూలం లేని ఈ జగత్ స్థితిని దాని స్వస్వరూపాన్ని అవగతం చేస్తుంది. అరూపకుడైన శివుడు నిరాకార సాకారమై భాసిస్తున్నాడు. స్వర్గం నరకం, పునర్జన్మ, కర్మ.. ఇవన్నీ మానవుని పరిమిత అన్వేషణలో జనించినవే. వీటికి అతీతమైనదే శివతత్వం. అంతటా వ్యాపించి, అంతట తానై, ఉండీ లేనట్లుగా ఉండే తత్వమే శివతత్వం. బుద్ధభగవానుడు మొదలుకొని, రమణమహర్షి దాక, జగద్గురు శంకరుడు మొదలుకొని వీరబ్రహ్మం దాక, రామచంద్ర ప్రభు నుండి శివరామ దీక్షితులు దాక... కనకదాసు నుండి కాశీ నాయనదాకా... ఈ తత్త్వాన్ని దర్శించి దారులేసిన వాళ్లే్ల. ఆ దారిని చూపే దీపాన్ని నీలో నీవు వెలిగించుకోవలసిందే. - గోరటి వెంకన్న -
శివరాత్రికి జాగారమా? ఈ సినిమాలు చూస్తూ భక్తి పారవశ్యం
శివరాత్రి వచ్చేసింది. దీంతో ఇప్పటికే శివాలయాలన్నీ కళకళలాడిపోతున్నాయి. శివుడి భక్తిలో మునిగిపోయేందుకు, రాత్రంతా జాగారం చేసేందుకు కోట్లాది మంది భక్తులు సిద్ధమైపోతున్నారు. రాత్రంతా గుడిలో ఉండలేం కానీ జాగారం చేస్తాం అనుకునే వాళ్లు.. తమ మనసు మరోచోటకు వెళ్లకూడదనుకుంటే శివుడి సినిమాలు చూస్తూ ఈ శివరాత్రిని పూర్తిచేయొచ్చు.(ఇదీ చదవండి: ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?)మరి తెలుగులో ఇప్పటివరకు శివుడు, ఆయనకు సంబంధించి చాలానే సినిమాలు వచ్చాయి. చిరంజీవి, ఎన్టీఆర్, కృష్ణంరాజు తదితరలు నటించిన పాత చిత్రాలతో పాటు రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్ లోనూ శివుడి రిఫరెన్స్ ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఇంతకీ వాటిని ఎక్కడెక్కడ చూడొచ్చంటే?శివరాత్రి స్పెషల్ మూవీస్శ్రీ మంజునాథ (యూట్యూబ్)అంజి (యూట్యూబ్)ఎన్టీఆర్ 'భూ కైలాస్' (యూట్యూబ్)ఖలేజా (అమెజాన్ ప్రైమ్ - సన్ నెక్స్ట్)ఢమరుకం (అమెజాన్ ప్రైమ్ - సన్ నెక్స్ట్)అఖండ (యూట్యూబ్ - హాట్ స్టార్)మహాభక్త సిరియాళ (హాట్ స్టార్)భక్త శంకర (హాట్ స్టార్)భక్త కన్నప్ప (యూట్యూబ్-అమెజాన్ ప్రైమ్)శివకన్య (యూట్యూబ్- అమెజాన్ ప్రైమ్)మహాశివరాత్రి (జీ5 - యూట్యూబ్)శివరాత్రి మహత్యం (జియో సినిమా- యూట్యూబ్)వీటితోపాటు భక్త మార్కండేయ, దక్షయజ్ఞం, ఉమాచండీ గౌరీశంకరుల కథ, కాళహస్తి మహత్యం, జగద్గురు ఆదిశంకర, మావూళ్లో మహాశివుడు, కార్తికేయ సినిమాల్ని కూడా చూస్తూ శివరాత్రి జాగారం చేసేయొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?) -
సుమనోహర గాథలు
అవి కేవలం ఆలయాలు కాదు.. అనాది కాలపు ఆనవాళ్లు. అవి కేవలం విగ్రహాలు కావు.. ఘన సాంస్కృతిక చరితకు సాక్ష్యాలు. ఆ గాలుల్లో పంచాక్షర మంత్రాలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఆ నీళ్లలో పంచామృత ధారలు కలిసి ప్రవహిస్తుంటాయి. ఆ మట్టి రేణువుల్లో మహాదేవుడి ప్రతిబింబాలు కనిపిస్తుంటాయి. ఈ శివరాత్రికి ఆ కథలు తెలుసుకుందాం. జాగరణ క్రతువులో మన కోవెల కథలు పారాయణంగా చెప్పుకుందాం. కలియుగ కైలాసంపైకప్పు లేని శైవక్షేత్రం, ప్రపంచంలోనే ఎత్తైన స్వయం భూలింగం, అత్యంత ప్రాచీన సుమేరు పర్వతం.. కలగలిపి రావివలస ఎండల మల్లన్న క్షేత్రం. శివరాత్రి నుంచి మొదలుకుని మూడు రోజుల పాటు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ కార్య నిర్వహణాధికారి జి.గురునాథరావు పర్యవేక్షణలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 27 గురువారం నిత్య అర్చనలతో పాటు మల్లన్నకు విభూది భష్మాలంకరణ పూజలు చేయనున్నారు. 28 శుక్రవారం స్వామి వారి తిరువీధి, చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తారు. చేరుకునే మార్గాలివే.. ఎండల మల్లన్న ఆలయానికి రోడ్డు, రైల్వే మా ర్గాలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి టెక్కలి చేరుకుంటే.. అక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి. రైల్వే మార్గం విషయానికి వస్తే టెక్కలితో పాటు సమీపంలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నౌపడ రైల్వే స్టేషన్, 20 కిలోమీటర్ల దూరంలో పలాస రైల్వే స్టేషన్‌కు రైల్వే మా ర్గంలో చేరుకుని అక్కడి నుంచి చిన్నపాటి వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. – టెక్కలి బ్రహ్మసూత్ర శివలింగాలుశ్రీముఖలింగం దక్షిణ కాశీగా ఎప్పటి నుంచో ఖ్యాతి పొందింది. ఇక్కడ అరుదైన బ్రహ్మసూత్ర శివలింగాలు ఐదు ఒకే చోట కొలువై ఉన్నాయి. బ్రహ్మజ్ఞాన తత్పరులైన మహర్షులు స్థాపించి నిత్య పూజలందుకునే శివలింగాలను బ్రహ్మసూత్ర శివలింగాలు అంటారు. భీమేశ్వర, సోమేశ్వర, వరుణేశ్వర, ఈశాన్య ఈశ్వర, ఎండల మల్లికార్జున లింగాలు ఇక్కడ దర్శనమిస్తా యి. దేశం మొత్తం మీద ఇలాంటివి చాలా అరుదు. శ్రీముఖలింగంలో ముఖాకృతిలో లింగం దర్శనం ఇవ్వడం ప్రత్యేకత. ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కృతయగంలో గోవిందేశ్వరుడు అనే నామంతో కనాకాకృతిలోను, త్రేతాయగంలో మధుకేశ్వరుడనే నామంతో రజతాకృతి లోను, ద్వాపర యగంలో జయంతేశ్వరుడనే నామంతో కాంస్యాకృతిలోను, కలియగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో ముఖం దాల్చి శిలాకృతిలో శివుడు శ్రీముఖలింగం క్షేత్రంలో దర్శనమిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి శ్రీముఖలింగానికి రవాణా సదుపాయం ఉంది. –జలుమూరుబలరామ ప్రతిష్టితంశ్రీకాకుళం కల్చరల్: పవిత్ర నాగావళి తీరం, పురాతన ఆలయ నిర్మాణం, బలరామ ప్రతిష్టిత శివలింగం.. వెరసి ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయం. ద్వాపర యుగాంతంలో నిర్మితమైన ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. బలరామ ప్రతిష్టితములైన పంచలింగాల ప్రాంతం కావడంతో పంచలింగ క్షేత్రంగానూ పరిఢవిల్లుతోంది. ఆలయంలో ఉత్స వాలకు అర్చకులు శ్రీరామమూర్తి, ఈఓ సర్వేశ్వరరావు ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి రోజున రాత్రి 12గంటలకు లింగోద్భవ పూజలు జరుగు తాయని, తెల్లవారు 3గంటలకు స్వామివారి ఊరేగింపు నందివాహనంపై ఉంటుందని తెలిపారు. బావిలోని విగ్రహాలు బయటకు తీసి.. శ్రీకాకుళం గుజరాతీపేటలో ఉన్న ఉమా లక్ష్మేశ్వర స్వామి ఆలయం కూడా అతిపురాతనమైనది. 300 ఏళ్ల కిందట మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక స్వామీజీ నాగావళి నది పొంగి ఉండగా ఇక్కడ బస చేశారు. ఆ సమయంలోనదీ ప్రాంగణంలోని ఒక నూతిలో ముస్లింరాజు పారేసిన విగ్రహాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. అందులో విగ్రహాలు బయటకు తీసి జీరో్ణద్ధరణ చేశారు. ఆ తర్వాత ఆలయాన్ని సుందరంగా నిర్మించి అర్చనాదులు నిర్వహిస్తున్నారు. భక్తుల కొంగు బంగారం శ్రీకాకుళం నక్కవీధిలోని ఉమాజఠలేశ్వర స్వామి ఆలయం ఉంది. భస్మాంగుల వంశస్తులు ఈ ఆలయాన్ని నెలకొలి్పనట్లు చరిత్ర చెబుతోంది. శివరాత్రి పర్వదినం రోజున ఏకాహం, లింగోద్భవ కాలంలో లింగాభరణం నిర్వహిస్తారు.250 ఏళ్లుగా.. శ్రీకాకుళంలోని కొన్నావీధిలో భీమేశ్వరుడు 250 ఏళ్లుగా పూజలు అందుకుంటున్నాడు. లోతైన గర్భగుడి, పెద్ద శివలింగం, లింగంపై నాటి ధారాపాత్ర.. వంటివి ఇక్కడి ప్రత్యేకతలు. శివరాత్రి నాడు ఉదయం నుంచి రుద్రాభిõÙకాలు, క్షీరాభిషేకాలు ఉంటాయని ఆలయ ఈఓ మాధవి, అర్చకులు గంట చిన్న రామ్మూర్తి తెలిపారు. -
మహిమాన్విత క్షేత్రం.. ఓంకారం!
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో ఉండే ఓంకారేశ్వరుడు కోరిక కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి. అందుకే ఇక్కడి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కోరికలు తీరిన వారు.. కోరికలు కోరుకుని ముడుపులు కట్టుకునే భక్తులతో ఆలయం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఆలయానికి తూర్పు, దక్షిణ ద్వారాలు కలిగి ఉన్నాయి. ఈశాన్యంలో పుష్కరిణి కలిగి ఉండడటం, సిద్దులు తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ చరిత్ర ఇక్కడున్న శివలింగాన్ని సిద్ధేశ్వరుడు అనే ముని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని వందల ఏళ్ల క్రితం సిద్ధేశ్వరుడు అనే ముని తపస్సు చేసుకునేందుకు బయలుదేరి ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఓం అనే శబ్దం వినిపించిందట. తాను తపస్సు చేసుకునేందుకు ఇదే సరైన ప్రదేశమని నిర్ణయించుకున్న ఆ ముని ఇక్కడ ఓ శివలింగాన్ని ప్రతిష్టించి తపస్సు మొదలు పెట్టాడట. అప్పటి నుంచే ఈ ఆలయానికి ఓంకార సిద్ధేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఆ ముని వల్లే ఇక్కడ పంచ బుగ్గ కోనేరు వెలసిందనీ... ఆ నీటితోనే పార్వతీపరమేశ్వరులకు రోజూ అభిషేకం నిర్వహిస్తారనీ చెబుతారు. వ్యాస మహర్షి అశ్వత్థనారాయణ స్వామి (ఆంజనేయస్వామి)ని ఇక్కడ ప్రతిష్టంచడంతో ఈ ప్రాంతానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొన్నాళ్లకు వేంకటేశ్వరస్వామి, దుర్గాదేవి ఆలయాలనూ ఇక్కడ నిర్మించారు. ఇక్కడ అన్నదానం ప్రారంభించడానికి కాశీనాయన అనే యోగి కారణమని అంటారు. నెల్లూరు జిల్లా బెడుసుపల్లిలో జన్మించిన కశిరెడ్డి మొదటి నుంచీ ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు. కొన్నాళ్లకు ఓ స్వామీజీ వద్ద మంత్రదీక్ష తీసుకుని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ చివరకు 1933లో ఇక్కడకు చేరుకుని ఆశ్రమం ఏర్పాటు చేశాడనీ ప్రతీతి. కశిరెడ్డి మహిమలు తెలిసిన భక్తులు ఆ యోగిని ‘నాయనా’ అని పిలవడం మొదలుపెట్టడంతో ఆ స్వామి కాశీనాయనగా గుర్తింపు పొందాడట. ఆకలిగా ఉన్నవారికి లేదనకుండా అన్నం పెట్టాలనే సందేశాన్ని చాటిన ఈ యోగి ఇక్కడే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాడనీ, ఆయన పరమపదించాక అద్దాల మండపాన్ని కట్టి ఆ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యాన్నదానాన్ని కొనసాగిస్తున్నారనీ అంటారు. ధర్మస్థాపనకు కష్ణభగవానుడు వీరభోగ వసంతరాయలు రూపంలో ఎప్పుడైనా రావొచ్చని కాలజ్ఞానంలో రాసి ఉందనీ, అలా వచ్చే స్వామికి నివేదించాలనే ఉద్దేశంతోనే ఇలా పదమూడు రకాల వంటకాలతో భోజనాలు సిద్ధం చేస్తుంటామనీ చెబుతారు. భక్తులే అన్నీ సమకూరుస్తారు కొండపైనున్న శివాలయంతోపాటూ ఇతర ఉపాలయాల్లో పూజల్ని నిర్వహించే భక్తులు ఆ తరువాత కాశీనాయన క్షేత్రానికి చేరుకుంటారు. సాధారణ రోజుల్లో రోజుకు దాదాపు 1,500 మంది భోజనం చేస్తే కార్తీక మాసం, శివరాత్రి సమయాల్లో అయిదారు లక్షల మందికి అన్నసంతర్పణ జరుగుతుంది. ఈ ఆశ్రమంలో మధుమేహులకు ప్రత్యేక కౌంటరు ద్వారా కొర్ర అన్నం, రాగి,లడ్డూ వంటివి వడ్డిస్తారు. ఇరవై నాలుగు గంటలూ ఇక్కడ పొయ్యి వెలుగుతూనే ఉంటుందనీ, ఇందుకు అవసరమైన నిత్యావసరాలను భక్తులే ఎప్పటికప్పుడు సమకూరుస్తుంటారనీ అంటారు. అర్ధరాత్రో, అపరాత్రో ఇక్కడికి వచ్చేవారు భోజనం వండుకుని తినేందుకు వీలుగా నిత్యావసరాలను ఈ ప్రాంగణంలో ఉంచుతారు. ఏటా 20 లక్షల మంది ఇక్కడ భోజనం చేస్తారు. మార్చి 1 వరకు ఉత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం మార్చి 1వ తేది వరకు ఉత్సవాలకు ఓంకార క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ నాగప్రసాద్ తెలిపారు. 25న బండిఆత్మకూరు గ్రామంలో ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. 26న ఉత్సవమూర్తులకు మంగళవాయిద్యాలతో బండిఆత్మకూరు గ్రామం నుంచి బయలుదేరి శింగవరం, సోయయాజులపల్లె, గ్రామాల్లో గ్రామోత్సవం జరిపి ఆలయ ప్రవేశం చేసి, గణపతిపూజ, రక్షాబంధనం, ద్వజరోహణం, వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి ఉత్సవమూర్తులకు కళ్యాణం ఉంటుంది. 27న నంది వాహనోత్సవం, 28న రథోత్సవం అనంతరం వసంతోత్సవం ఉంటుంది. మార్చి 1న స్వామివారు ఓంకారం నుంచి బయలుదేరి బండిఆత్మకూరు చేరటంతో బ్రహోత్సవాలు ముగుస్తాయి. ఎలా రావాలంటే..భక్తులు ఓంకారం చేరుకునేందుకు నంద్యాల, బండిఆత్మకూరు, ఆత్మకూరు ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వసులు ఏర్పాటు చేశారు. (చదవండి: Shivaratri2025 పుణ్యప్రదం.. జ్యోతిర్లింగ దర్శనం) -
Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు
ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి.. ‘హరహర మహాదేవ..శంభో శంకర’(Hara Hara Mahadeva..Shambho Shankara) అంటూ శివనామస్మరణలతో మారుమోగనున్న శివాలయాలు. భక్తిపావశ్యంలో శివభక్తులు మునిగితేలే వేళ.. నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయానికి లెక్కకుమించినంతమంది భారతీయులు తరలివెళ్లనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు భారత్ నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు తరలివెళుతున్నారు. భాగమతి నది ఒడ్డున ఉన్న ఐదవ శతాబ్దపు ఈ ఆలయంలో శివరాత్రి పూజలు నిర్వహించేందుకు నాలుగువేల మంది సాధువులతో పాటు, వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారని పశుపతినాథ ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు. మహాశివరాత్రి నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయని పశుపతి ట్రస్ట్ ప్రతినిధి తెలిపారు.శివరాత్రి(Shivaratri) రోజున భక్తుల భద్రతకు 10 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. అలాగే 5,000 మంది స్వచ్ఛంద సేవకులను భక్తులకు సేవలు అందించనున్నారు. మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున 2.15 గంటలకు పశుపతినాథ్ ఆలయం తెరుచుకుంటుందని, ఆలయంలోని నాలుగు ద్వారాల నుండి భక్తులు మహాశివలింగాన్ని దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం, మాంసం, చేపల అమ్మకం, వినియోగాలను నిషేధిస్తూ ఖాట్మండు జిల్లా పరిపాలన కార్యాలయం(Kathmandu District Administration Office) నోటీసు జారీ చేసింది. సోమవారం నుండి గురువారం వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. దీనిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. హిమాలయాలు శివుని నివాసమని హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు. నేపాల్‌లో పెద్ద సంఖ్యలో శైవులు ఉన్నారు. వీరు శివుణ్ణి ప్రధానంగా ఆరాధిస్తుంటారు.ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్ పింఛనెంత? -
శ్రీకాళహస్తి : అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)
-
హరహర మహదేవ..కాలినడకన శ్రీశైలం చేరుకుంటున్న భక్తులు (ఫోటోలు)
-
మహా కుంభ్‌కు 60 కోట్ల మంది..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు జన జాతర కొనసాగు తోంది. జనవరి 13వ తేదీన మే ళా అధికారికంగా ప్రారంభం కాక ముందు నుంచే మొదలైన భక్తుల రాకడ రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 45 కోట్ల మంది వరకు రావచ్చన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంచనా తలకిందులైంది. ఇప్పటికే 60 కోట్ల మార్కును దాటినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటించారు. 26వ తేదీన కుంభమేళా ముగిసేసరికి ఇది 75 కోట్లకు చేరుకునే అవకాశముందని అధికార యంత్రాంగం చెబుతోంది. చివరి రోజైన 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినం, ఆఖరి షాహీ స్నాన్ ఉండటంతో త్రివేణీ సంగమంలో స్నానమాచరించేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తారని యంత్రాంగం అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఇలా ఉండగా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబసభ్యులతో పాటు శనివారం త్రివేణీ సంగమంలో పుణ్యస్నానమాచరించారు. ఆయనతోపాటు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆయన మంత్రివర్గ సహచరులు కూడా స్నానాలు చేశారు. -
మహాశివరాత్రికి 3,000 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్ర ముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు లు నడపనుంది. 43 శైవ క్షేత్రాలకు 3,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 24వ తేదీ నుంచి 28 వరకు ఈ ప్రత్యే క బస్సులు అందుబాటులో ఉంటా యి. ప్రధానంగా శ్రీశైల క్షేత్రానికి 800, వేములవాడకు 714, ఏడుపా యల జాతరకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సుల చొప్పున నడుపనున్నారు.అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటా యి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయి. ఈ స్పె షల్ బస్సుల్లో 50% అదనపు చార్జీలను వసూలు చేస్తారు. రెగ్యులర్ సర్విస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. శివరాత్రి ఆపరేషన్స్‌పై ఆర్టీసీ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. మహిళలకు ఉచితమే..: గత ఏడాది శివరాత్రికన్నా ఈసారి 809 బస్సులను అదనంగా నడపనున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లో ఉంటుందని చెప్పారు. ముందస్తు టికెట్ల బుకింగ్‌ను www.tgsrtcbus.in వెబ్సైట్లో చేసుకోవచ్చు. సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040–6944 0000, 040–23450033ను సంప్రదించాలని అధికారులు సూచించారు. -
హరోం హర అంటున్న సినీ స్టార్స్
మహా శివరాత్రి పర్వదినం (ఫిబ్రవరి 26) సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహా శివరాత్రికి జాగరణ చేసేందుకు భక్తులు శివాలయాలకు పోటెత్తుతారు. ఆ రోజు శివాలయాలన్నీ హరోం హర అంటూ శివనామ స్మరణతో మార్మోగుతాయి. సినిమా ఇండస్ట్రీకి కూడా మహా శివుడితో ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. శివుడి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి, ప్రేక్షకులను అలరించాయి. తాజాగా పరమేశ్వరుడి నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాగే శివ భక్తి నేపథ్యంలో పాటలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాల విశేషాల గురించి తెలుసుకుందాం.శివుడి నేపథ్యంలో...తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివుడి నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. గత ఏడాది మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఆహార దేవతగా భావించే అన్నపూర్ణా దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో పోస్టర్లో ఉంది.అంటే... ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని కచ్చితంగా ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందని చెప్పకనే చెప్పింది యూనిట్. ఈ సినిమాలో మురికి వాడల్లో నివశించే వ్యక్తిగా ధనుష్ పాత్ర ఉంటుంది. అలాగే ముంబైకి చెందిన ఓ ధనవంతుడి పాత్రలో నాగార్జున కనిపించనుండగా, రష్మికా మందన్న మధ్యతరగతి యువతి పాత్ర చేస్తున్నారు. నటుడు జిమ్ సర్భ్ ఓ బిలియనీర్ బిజినెస్ మ్యాన్‌గా కనిపిస్తారు. శివ భక్తుడి కథమంచు విష్ణు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 25న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదలకానుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ‘కన్నప్ప’ యూనిట్. పరమశివుడికి వీర భక్తుడైన కన్నప్ప నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. కన్నప్పలోని వీరత్వం, భక్తిని మేళవించి ఈ మూవీ తెరకెక్కించారు ముఖేశ్ కుమార్ సింగ్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేయడం విశేషం. శివ తాండవం చేస్తున్న అక్షయ్ కుమార్ పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.శివుడిగా ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో ఆ పోస్టర్ ద్వారా చూపించింది యూనిట్. అంతేకాదు... ఈ సినిమా నుంచి విడుదలైన ‘శివ శివ శంకరా...’ పాటకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేశారు. ఈ మూవీలో తిన్నడు పాత్రలో మంచు విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. మధుబాల, ప్రీతీ ముకుందన్, ఐశ్వర్య, దేవరాజ్, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. శివ తాండవం పాప వినాశక సాక్షాత్ సాంబ శివ అంటూ ఆడి పాడుతున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. ఈ మూవీలో అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై కథానాయికలు. పెన్ స్టూడియోస్‌పై డా. జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంలో శివుడి నేపథ్యంలో ఓ పాట తెరకెక్కించారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘భైరవం’ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది యూనిట్. ఈ పాటలో పరమ శివుని భయం, బలం ఈ రెండింటినీ తన హావభావాలు, నృత్యంతో అద్భుతంగా కనబరిచారు సాయి శ్రీనివాస్. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటని శంకర్ మహదేవన్ తనదైన శైలిలో పాడారు. ఓ ఆలయం ముందు ఈ పాటను చిత్రీకరించారు.‘‘ఈ నెల 26న రానున్న మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఆధ్యాత్మిక పాటని విడుదల చేశాం. పరమ శివుడి దైవిక సారాన్ని అందంగా ప్రజెంట్ చేసి, లోతుగా ప్రతిధ్వనించే ఎమోషన్స్‌ని ఈ పాట ఆవిష్కరిస్తుంది. సాయి శ్రీనివాస్ పాత్ర శివ తాండవం ప్రేరణ స్ఫూర్తితో మెస్మరైజ్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. జటాధరవైవిధ్యమైన కథా నేపథ్యం ఉన్న చిత్రాలు, పాత్రలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సుధీర్‌బాబు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కేఆర్ భన్సల్, ప్రేరణా అరోరా నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం ‘జటాధర’. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథ ఇది.అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, పురాణ చరిత్ర వీటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా పరమ శివుడితో ముడిపడిన కథే అని సమాచారం. పైగా టైటిల్‌ని బట్టి చూస్తే ఇదే వాస్తవం అనిపిస్తుంది. జటాధరుడు అని పరమ శివుణ్ణి పిలుస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.పరమ శివుని భక్తురాలుహీరోయిన్ తమన్నా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. తొలి భాగాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అశోక్ తేజ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు.సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో శివ భక్తురాలైన శివ శక్తి నాగసాధు పాత్రలో నటిస్తున్నారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ సింహ భాగం వారణాసిలోని కాశీలో జరిగింది. శనివారం విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇవే కాదు... మరికొన్ని సినిమాలు కూడా శివుడి నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. -
శ్రీశైలం : నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై ముగిసిన శివరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
మహాశివరాత్రి : విశాఖ ఆర్కే బీచ్ లో జాగారం స్నానాలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు
-
శివరాత్రి పూజలో పాల్గొన్న పిచుక్క
-
రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద భక్తుల రద్దీ
-
Shivaratri: వేములవాడలో శివరాత్రి శోభ (ఫొటోలు)
-
Maha Shivratri: భక్తులతో కిటకిటలాడిన శ్రీశైలం (ఫొటోలు)
-
Keesaragutta: కేసరగిరిలో హర హర మహాదేవ శంభో శంకర (ఫొటోలు)
-
Maha Shivratri: మళ్ళీ రావు ఆ బంగారు రోజులు..
మాది నంద్యాల. అనగనగా రోజుల్లో కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారుట. 14వ శతాబ్దంలో నందన అనే మహారాజు గారు మా మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంవల్ల దీనికి నంది మండలమని పేరొచ్చిందని కాల క్రమేణా అదే నంద్యాలగా రూపాంతరం చెందిందని అంటారు. చుట్టూ నవనందులు ఉన్నా మాకు మహనంది మీదే మక్కువ ఎక్కువ. ఒక్క రోజు సెలవు దొరికితే చాలు "పొదామా అంటే, పోదామా" అనుకుంటూ మేము పిల్లలమంతా అద్దె సైకిల్లు తీసుకుని పొద్దున మహనందికి తయారు. పోయి పెద్ద కోనేరులో ఈతలు కొట్టి అలిసి పోయి, సేద తీరడానికి చిన్న కోనేరులో ఈతలు కొట్టి తేరుకుని సాయంత్రానికంతా తిరిగి ఇళ్ళు చేరుకునేవాళ్లం. ఈతల మధ్యలో సమయం దొరికితే మహనందీశ్వరుణ్ణి కూడా దర్శించుకుని దండం పెట్టుకునేవాళ్లం. మీరు ఈ మాట ఇక్కడ జాగ్రత్తగా వినాలి. దండం పెట్టుకునేవాళ్లం అన్నాను అంతే కానీ కొరికలు కోరుకునే వాళ్లం అనలేదు. దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికని, కోరికలు తీర్చుకోడానికే దేవుడుకి దండం పెట్టుకోవాలని మేము నేర్చుకోలేదు. ఒకరోజు గుడిలోకి వెళ్ళి నేనూ, నా ఫ్రెండు శంకర్ దండం పెట్టుకున్నాక.. శంకర్ కిందికి వంగి దేవుడి పళ్ళెంలో ఉన్న నోట్లని గుప్పిట నిండుగా పట్టుకుని ఆక్కడి నుండి పారిపోయాడు. నాకు కూడా అక్కడ ఉన్న ఒక అయిదురూపాయల నోటు టెంప్ట్ చేసింది కానీ , తీసుకోలేకపోయాను. అందుకు నా మీద దేవుడికి కోపం వచ్చి చేతకాని నన్ను ఆర్టిస్ట్ కమ్మని శపించి, ధైర్యం, చాకచక్యం పుష్కలంగా ఉన్న శంకర్‌ను ప్రముఖ పొలిటీషియన్ కమ్మని వరమిచ్చాడు. గుడిలో పులిహోర మాత్రం ఇద్దరికీ సమానంగా ఇచ్చాడు. శివుడు మా ప్రాంతపు ఎక్కువ దేవుడు. మా నూనెపల్లె నడిబొడ్డున శివాలయం ఉంది. తెల్లవారిన దగ్గర నుంచి "బ్రహ్మమురారి సురార్చిత లింగం | నిర్మలభాసిత శోభిత లింగమ్ | జన్మజ దుఃఖ వినాశక లింగం | తత్-ప్రణమామి సదాశివ లింగమ్ |" అని ఎప్పుడూ వినపడుతూనే ఉండేది. అప్పుడు నేనూ, నావంటి నూనెపల్లె పిల్లలం కలిసి శివాలయం ముందు నుండి ఆటలాడుతూ పరిగెడుతూ బ్రహ్మమురారి సురార్చిత లింగం అని పాడుకుంటూ మంచి నీళ్ళ బాయి దగ్గర మలుపు తిరగగానే మసీదు నుంచి అజాన్ రాగానే అల్లాహు అక్బర్ | అష్-హదు అన్-లా ఇలాహ ఇల్లల్లాహ్| అష్-హదు అన్న ముహమ్మద అర్-రసూల్ అల్లాహ్| హయ్యా అలస్-సలాహ్| హయ్యా అలల్-ఫలాహ్| అల్లాహు అక్బర్. అని ముగింపు పాడుకునేవాళ్లం. ఆ రోజుల్లో మీరెవరు అని అంటే మేము నూనెపల్లె వాళ్లం అని మాత్రమే మా ప్రవర. మాది నిజానికి ప్రకాశం జిల్లా. మా జేజి నాయన తన కుటుంబాన్ని తీసుకుని బ్రతుకు తెరువుకోసం నూనెపల్లె చేరినపుడు ఆయనని వెల్ కం టు నూనెపల్లె అని స్వాగతించింది మా ఊరి మహాదేవుడు శివుడు, తన గుడి అరుగు మీద స్థలం చూపి నువ్వు ఇక్కడ టైలరింగ్ చేసుకోవచ్చబ్బా! అన్నాట్టా. మా పెద్దల బ్రతుకు గిర్రున తిరగడానికి కుట్టు మిషన్ చక్రం కదిలింది ఈ శివాలయం గుడి నీడ నుండే. మామూలుగా పండగలన్నీ ఉదయపు సంబరాలయితే ఒక్క మహా శివరాత్రి మాత్రం సాయంత్రం నుండి మొదలయ్యే ఉత్సాహం. ప్రతి పండగకు ముందు పిల్లలమంతా కూడి రాబోయే పండగ గురించి ఎన్నెన్ని విశేషాలు చెప్పుకునే వాళ్లమో! లెక్కే లేదు. అప్పుడు మా చొక్కాకు ఒక జేబు, నిక్కరకు రెండు జేబులు ఉన్నా ఆ మూడు జేబుల నిండా కబురులు తరగని అక్షయ నిధుల్లా పోటెత్తేవి. అప్పుడు మా ఊరి రోడ్లు ఎప్పుడూ ఎద్దుల బళ్లతోనూ, గుర్రపు జట్కాలతోనూ , రిక్షాల మూడు చక్రాలతోనూ, సైకిల్ బెల్లులతోనూ, సైడ్, సైడ్ జరుగు జరుగు అని హెచ్చరిస్తూ కదిలేవి. ఒకటీ రెండు బస్సులు ఉన్నా, అవి ఎప్పుడో ఒకప్పుడు వస్తూ పోతూ ఆగుతూ కదులుతూ ఉండేవి. ఆ రోజుల్లో ప్రతి పండగకు మా ఊరి శివాలయం ముందు పందిరి కట్టి హరికథలు నడుస్తూ ఉండేవి. మామూలు రోజుల్లో చీకటి పడగానే త్వరగా నిద్రపోయే ఊరి రహదారులు పండగ రోజుల్లో మాత్రం తెల్లవార్లూ మేలుకుని ఉంటాయి. కథలు చెప్పడానికి వచ్చిన హరిదాసు గారి కథా గమనాన్ని, మృదుమధురమైన గానాన్ని, కాలి అందియలు ఘల్లు మనడాన్ని, చేతిలోని చిడతలు ఝల్లు మనడాన్ని, ఆ పిట్టకథలను, ఆ వేదాంత చర్చను, మధ్య మధ్యలో పాపులర్ సినిమాల పాటల చమత్కారపు పేరడీలను ఊరు ఊరంతా, దారి దారంతా గడ్డం క్రింద చేయిపెట్టుకుని అలా కళ్ళప్పగించి చూస్తూ, వింటూ ఉండేది. ఈ హరి కథల కోసమని చీకటిపడే సమయానికంతా ఊరిని, దారిని బందు పెట్టేవారు. ఇక ఆ రాత్రి ఆ దారిన ఒక వాహనం నడవదు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక్క సైకిలు చక్రమూ తిరగదు. ఊరి జనం అంతా చేతికందిన చాపలు, దుప్పట్లు, బొంతలు, బియ్యం బస్తాల జనపనార పట్టాలు పట్టుకుని రోడ్దుని ఆక్రమించుకునేవారు. అందరికన్నా ముందు అక్కడికి చేరుకునేది నావంటి పిల్లలు. వారి వారి అమ్మా నాయనల కోసమో, అవ్వా తాతల కోసం కాదు. స్కూలు, ట్యూషన్ క్లాస్మెంట్ కోసమని, ప్రాణ స్నేహితుల కోసమని తగు మాత్రం స్థలం రిజర్వు చేసి పెట్టేవారు. ఎన్నయినా చెప్పండి మళ్ళీ రావు ఆ బంగారు రోజులు. ఆకాశానికి నక్షత్రాలు పూచే ఆ సాయంకాలాలు, అరచేతుల్లో గాజు మొబైల్ అద్దాలకు బదులు దేవుడు రాసిన గీతలు కనపడే రోజులు మరిక లేవు. ఇవన్నీ మామూలు రోజుల్లోని పండగల సాయంకాలాల గుడి బయటి దృశ్యాలు. హరికథల పండగ రోజుల్లో బాగా నిద్ర అనిపిస్తే ఇంటికి రావచ్చు. శివరాత్రి సంగతి వేరు. శివరాత్రి రోజున శివాలయం బయట రోడ్డుకి అడ్డంగా పెద్ద తెల్లని తెర కట్టేవారు. తెరకి అటూ ఇటూ జనం కూర్చునేవారు. చాపలు, దుప్పట్లు, బొంతలు, బియ్యం బస్తాల జనపనార పట్టాలు మామూలే. పిల్లలు ముందు గానే వచ్చి స్థలం రిజర్వు చేసి పెట్టడమూ మామూలే. ఆ రాత్రి శివాలయం ముందు మూడు ఆటలు సినిమాలు వేసేవారు. పౌరాణిక సినిమాలే వేసేవారు. మూడు సినిమాలలో ఒక సినిమా మాత్రం దక్షయజ్ఞం ఖచ్చితంగా ఉండేది. 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ కూడా తప్పకా ఉండేది. మేము ఆ సినిమాని ఉప్మా, చట్ని, గారె, సాంబారుల కథ అని పిలుచుకుని, గట్టిగా నవ్వి ఆపై కళ్ళు మూసి దేవుడికి దండం పెట్టుకుని లెంపలు వేసుకునేవాళ్లం ఆ శివరాత్రి రాత్రులలో, ముఖ్యంగా దక్షయజ్ఞం సినిమా చూస్తున్నప్పుడు మా ఊరి శివాలయంలో ఉండే ఆ చంద్రచూడుడు, చంద్రశేఖరుడు, విషకంఠుడు, పినాకపాణి , మహాశివుడు క్లైమాక్స్ లో గుడి లోపలినుండి ఆ ఫలాన తెరమీదకు వచ్చి నందమూరి రామారావు ఒంటి మీదికి పూని శివతాండవం చేయిస్తాడు చూడు! తీవ్ర దుఃఖంతో, మహా కోపంతో, తన జూట నుండి ఒక కేశాన్ని పెరికి నేలకేసి కొడితే ఆ వెంట్రుక నుండి ఆయన పెద్ద కొడుకు వీరభద్రుడు పుట్టుకొస్తాడు చూడు. అది మాకు శివరాత్రి అంటే. ఆ ఒక్క దృశ్యం చూడడం కోసమే కదా సంవత్సరమంతా వేచి వేచి శివరాత్రి జాగారం చేసేది. ఈ రోజుల్లో లాగా ఏ క్షణన కావాలిస్తే ఆ క్షణాన కళ్ళముందుకి నర్తనశాలలు, పాండవ వనవాసాలు, వినాయక విజయాలు వచ్చే కాలం కాదు కదా. ఆ రోజుల్లో ప్రతి అనుభవానికి ఒక గొప్ప విలువ ఉండేది. లిప్త పాటు అదృష్టాల్ని ఒడిసిపట్టుకుని బ్రతుకు పుస్తకంలో మెరుపుల నెమలీకలా దాచుకుని తీరాల్సిందే. పండగ పూట సినిమాలు చూస్తూ జాగారం చెయడమేమిటి కలికాలం అని పెద్ద తరం వాళ్ళు విసుక్కుంటున్నా సరే, దారి మీద మూడాటల తెర ఆడుతూనే ఉండేది. సినిమా టాకీసులలో రాత్రి మూడాటలు ఆడుతూనే ఉండేవి, గుళ్ళల్లో పూజలు, అవధూతల ఆశ్రమాల్లో భజనలు కొనసాగుతూనే ఉండేవి. ఏదో ఒక రకంగా, ఒక రూపంగా భక్తి అనేది కళ్ల మీదికి నిదుర మూత వాలకుండా కాపాడుతూ ఉండేది. ఒక రాత్రి ముగిసేది. ఆ తరువాతి పగటిని రాత్రిలా జనం అంతా నిద్రపోయేవారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వచ్చే జాగారపు యామిని ప్రస్తుతం మరణించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో జనం మెలకువగానే ఉంటున్నారు. పగళ్ళు నిద్రపోతూనే ఉంటున్నారు. శివుడికి ఒకరోజు, రాత్రికి ఒక కాలం, సినిమాకి ఒక వారం అంటూ ఏమీ ఉండటం లేదు. శివరాత్రికి చలికాలం శివ శివ అని పారిపోతుంది అనేవారు. చలికాలం రాకముందే చలి పారిపోయే కాలం వచ్చినట్లుంది. భస్మాసురుడికి భయపడి శివుడు పరుగులెత్తాడు అని అనుకునేవారు. అసురుడి దాకా ఎందుకు మామూలు మనిషికి భయపడే చూసే పరమశివుడు ఎప్పుడో పారిపోయినట్లుగా అనిపిస్తుంది. నాకు మాత్రం ఆలయాలు ఉన్నాయి కానీ, దేవుడులు అక్కడ ఉండటం లేరేమో అని గట్టి నమ్మకమే ఉంది. పండగ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది కానీ, అనుభవాలు మిగలడం లేదు నిన్నటి రాత్రికి ఈ శివరాత్రికి తేడా కనపడ్డం లేదు. మా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు. మద్రాసులో బతికిన కాలేజీ, చచ్చిన కాలేజీ అనేవి ఉన్నాయని. ఇప్పుడు నేను రాసుకున్నదంతా చచ్చిపోయిన మా నూనెపల్లె కథ, ఒక వదలని దుఃఖపు గీతి రాత. -
విశాఖ తీరం : మహా కోటి శివ లింగానికి భక్తుల రద్దీ (ఫొటోలు)
-
మహాశివరాత్రి: ఈ ఆలయాన్ని సందర్శిస్తే.. ఏడాదిలో వివాహం!
భారతదేశంలో వివాహం అనేక ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరికీ అదొక సామాజిక అవసరం. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మందికి పెళ్లి వయసు వచ్చిన వివాహం కావడం లేదని ఆందోళనకు గురవుతుంటారు. అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతూ ఉంటాయి. వీటినుంచి విముక్తి కోసం రకరకాల పూజలు, శాంతులు చేస్తూ ఉంటారు. జాతకాలు, దోషాలు అంటూ నానా తంటాలు పడుతుంటారు. కానీ ఈ శివాలయానికి వెళితే సంవత్సరం తిరిగే లోపే వివాహం అవుతుందని భక్తులు చెబుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఒక దేవాలయం గురించి , దాన్ని ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. తంజావూరు జిల్లా కుట్టాలమ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయం కళ్యాణసుందర్ ఆలయం. కావేరీ నదీతీర ప్రాంతంలో నిర్మితమైన ఈ ఆలయంలోని పార్వతీ పరమేశ్వరులు పాణిగ్రహణ (చేతిలో చేయి వేసి పట్టుకున్న) స్థితిలో దర్శనమిస్తారట. ఆదిదంపతుల వివాహం జరిగిన పవిత్రమైన స్థలంగా భక్తులవిశ్వాసం. అందుకే పెళ్లికాని వారు ఒక్కసారి ఈ ఆలాయన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏడాది తిరిగే లోగా ఆమూడుముళ్ల వేడుక జరుగుతుందని భక్తులు నమ్ముతారు . తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్గుడి బ్లాక్‌లో ఉందీ దేవాలాయం. దీని పేరే మంగళాంబి సమేత మాంగళీశ్వర దేవాలయం. మాంగల్య మహర్షి ఇక్కడ విరివిగా వివాహాలను నిర్వహించారని ప్రతీతి. ఈ దేవుడి ఆశీస్సుల వల్లే బైరవ, వశిష్టర్, అగస్తియర్ల వివాహాలు జరిగాయట. ముఖ్యంగా ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు క్రమం తప్పకుండా సందర్శించే దేవాలయం. పురాణాల ప్రకారం, మాంగల్య మహర్షి స్వయంగా ఉత్తర నక్షత్రంలో జన్మించాడట. మాంగల్య మహర్షి తపస్సు చేసి సంపాదించిన అపారమైన శక్తి మహిమతో ఇది సాధ్యమవుతుందని చెబుతారు. ఆయన దేవదూతలకు గురువైనందున, ఆయన ఆశీర్వాదంతో శ్రీఘ్రమే వివాహాలు జరుగుతాయని, అమోఘమైన వరాలను అనుగ్రహిస్తారని నమ్ముతారు.వివాహానికి సంబంధించిన ప్రతీ ముహూర్తాన్ని దేవదూతలు పైనుండి ఆశీర్వది స్తారని కూడా నమ్ముతారు. నిజానికి తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్టు జిల్లా, చెన్నైలోని తిరువిందందై అనే గ్రామంలో ఉన్న నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయం సహా ఇలాంటి టెంపుల్స్ చాలా ఉండటం విశేషం. -
మహాశివరాత్రి : "శివ శివ" అంటూ తలచుకుంటే..!
మహాకవి ధూర్జటి 'శ్రీ కాళహస్తీశ్వర శతకం'లో శివనామ ప్రాభవం, ప్రభావం గురించి అద్భుతమైన పద్యం చెప్పాడు. "పవి పుష్పంబగు,అగ్ని మంచగు.. శత్రుం డతిమిత్రుడౌ..విషము దివ్యాహారమౌ..." అని అంటాడు. "శివ శివ" అంటూ శివుడిని తలుచుకుంటే చాలు! అన్నీ నీకు వశమవుతాయని అంటాడు. మహాశక్తివంతమైన వజ్రాయుధం లలిత లావణ్యమైన పుష్పంగా రూపు మార్చుకుంటుంది. అగ్ని పర్వతం కూడా మంచు పర్వతంగా మారిపోతుంది, సముద్రమంతా ఇంకిపోయి, మామూలు నేలగా మారిపోతుంది. పరమశత్రువు కూడా అత్యంత స్నేహితుడవుతాడు, విషము దివ్యమైన ఆహారంగా మారిపోతుంది. ఇలా...ఎన్నో జరుగతాయని, అనూహ్యమైన ఫలితాలు, పరిణామాలు ఎన్నెన్నో సంభవిస్తాయని ఈ పద్యం అందించే తాత్పర్యం. అంతటి వశీకరణ శక్తి శివనామానికి వుంది. అతి శీఘ్రంగా భక్తులను కరుణించి, వరాల వర్షాలు కురిపించే సులక్షణభూషితుడు హరుడు. భోళాశంకరుడు, భక్తవశంకరుడు శివదేవుడు. పాల్కురికి సోమనాథుడు నుంచి శ్రీనాథుడు వరకూ,పోతన నుంచి విశ్వనాథ వరకూ,ధూర్జటి నుంచి కొప్పరపు కవుల వరకూ మహాకవులెందరో శివుడిని ఆరాధించినవారే. పంచాక్షరీ మంత్రోపాసనలో పరవశించినవారే. కవులందరూ శివులే. భవ్యకవితావేశంతో శివమెత్తినవారే. శివరాత్రి వేళ స్త్రీ,బాల, వృద్ధులందరూ ఉరిమే ఉత్సాహంతో శివమెత్తి నర్తిస్తారు. ఆ ఉత్సాహం ఉత్సవమవుతుంది. హిందువులకు,ముఖ్యంగా శివారాధకులకు 'మహాశివరాత్రి' గొప్ప పండుగరోజు. శివపార్వతుల కల్యాణ శుభదినంగా, శివతాండవం జరిగే విశేషరాత్రిగా పరమపవిత్రంగా పాటించి వేడుకలు జరుపుకోవడం తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. శివపురాణం ప్రకారం శివుడు లింగాకారుడుగా మారే రోజుగా శివపురాణం చెబుతోంది. ఏ రీతిన చూసినా, ఏ తీరున చెప్పినా, ఏ లీలగా భావించినా ఇది పుణ్యదినం, భక్తులకు ధన్యదినం. శివరాత్రి నాడు ఉపవాసం ఉండడం, రాత్రంతా జాగారం చేయడం, శివ తపో ధ్యానాలతో తన్మయులవడం సర్వత్రా దర్శనమవుతూ ఉంటాయి. శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా విశేషాల కథా పారాయణలు కోట్లాదిమంది ప్రపంచమంతా జరుపుతారు. బిల్వపత్రాలతో అర్చన చేస్తే శివుడు అత్యంతంగా ఆనందిస్తాడని భక్తులు నమ్ముతారు. "మా రేడు నీవని ఏరేరి తేనా? మారేడు దళములు నీ పూజకు " అన్నాడు వేటూరి. ప్రపంచంలో ఏ దేశంలో వున్నా, శివభక్తులు తెల్లవారుజామునే లేవడం క్రమశిక్షణగా పాటిస్తారు. విభూతి ధారణ చేసి "ఓం నమఃశివాయ" అంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే ఎంతో శక్తి చేకూరుతుందని, ఎన్నో విశేషఫలితాలు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు. తపస్సు, యోగాభ్యాసం, ధ్యానం గొప్ప ఫలితాలను అందిస్తాయన్నది అనాదిగా పెద్దలు చెబుతున్నది. మంత్రోపాసనలు గొప్ప వైభవాన్ని, రక్షణను కలిగిస్తాయని ఆర్యవాక్కు. పంచాక్షరీ మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం విశేషంగా భావిస్తారు. శివుడిని ప్రధానంగా యోగకారకుడుగా అభివర్ణిస్తారు. మహాశివరాత్రి నాడు జాగరణ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆధ్యాత్మిక శోభ, గొప్ప ఆరోగ్యం లభిస్తాయనే విశ్వాసంతో కోట్లాదిమంది తరతరాల నుంచి మహాశివరాత్రిని పరమనిష్ఠగా జరుపుకుంటున్నారు. రాత్రంతా సంగీత,సాహిత్య, నాటక,కళా ప్రదర్శనలతో మార్మోగి పోతుంది. ఎంతోమంది ద్వాదశ లింగాల దర్శనానికి సమాయిత్తమవుతారు. రుద్రాభిషేకం విశేషంగా జరుపుకోవడం పరిపాటి. తెలుగునాట ఎన్నో సుప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నాయి. పల్నాడు ప్రాంతంలోని కోటప్పకొండ ప్రభ తీరే వేరు. కోటప్పకొండ తిరునాళ్ల చాలా ప్రసిద్ధి. శ్రీశైలం,శ్రీకాళహస్తి, భీమేశ్వరం వంటి క్షేత్రాలలో జరిగే విశేషపూజలు, భక్తుల కోలాహలం చెప్పనలవి కాదు. తెలంగాణలో రుద్రేశ్వరస్వామి వెయ్యి స్థంభాల ఆలయం, కీసరగుట్ట, వేములవాడ మొదలైన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఐశ్వర్యప్రదాతలై విలసిల్లుతున్నాయి. శివుని ఆరాధన సర్వశక్తికరం, సర్వముక్తిప్రదం. శివరాత్రి నాడు జరిగే పూజలను దర్శించుకున్నా పుణ్యప్రదం. నాలుగు యామాలుగా పూజలు నిర్వహిస్తారు. అత్యంత శక్తివంతమైన శివ పంచాక్షరీ మంత్రం ప్రకృతిలో భాగమైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో ముడిపెట్టుకొని ఉంటుంది. శివుడిని పంచముఖునిగా, పంచబ్రహ్మలుగా భావిస్తారు. చైతన్యం దీని మూలసూత్రం. శివతత్త్వమే పరమోన్నతం. నిస్వార్థం, నిరాడంబరత ఆయన సుగుణధనాలు. మహాశివస్మరణ సంబంధియైన మహాశివరాత్రి అర్చనలు మానసిక ప్రశాంతతకు మూలం, శారీరక శక్తికి కేంద్రం, ముక్తికి సోపానం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కాశీ నుంచి కాళహస్తి దాకా, నేపాల్ నుంచి పాకిస్తాన్ దాకా కోటి ప్రభలతో,కొంగ్రొత్త శోభలతో కోలాహలంగా సాగే 'మహాశివరాత్రి' ధరిత్రిని పవిత్రంగా నిలిపే పుణ్యరాత్రి, శివగాత్రి. పాకిస్తాన్ లోని కరాచీలో శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంతో ప్రసిద్ధం. కొన్ని వేలమంది ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. మన వలె ఉపవాస దీక్ష ఆచరిస్తారు, సముద్రస్నానం చేస్తారు. శివరాత్రిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరకంగా పిలుచుకుంటారు. కశ్మీర్ లో 'హరరాత్రి' అంటారు. ఒరిస్సావారు 'జాగరా' అంటారు. జాగరా అంటే జాగారం చేయడం, అంటే నిద్రపోకుండా మేల్కొని ఉండడం. పంజాబ్‌లో శోభాయాత్రలు నిర్వహిస్తారు. ఇలా ఏ పేరుతో కొలిచినా, తలచేది శివుడినే. దివ్యశివరాత్రి మనలో భవ్య భావనలు నింపుగాక! - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
జన్మకో శివరాత్రి అని ఎందుకంటారో తెలుసా!
శివతత్వమే మంగళం. జన్మకో శివరాత్రి అన్నది ఆర్యోక్తి. దీని అర్ధం సంవత్సరంలో వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డ దైవారాధన కనీసం శివరాత్రి రోజు చేసినా సమస్త మంగళాలు ప్రోదిచేసి అందించే దైవం బోళాశంకరుడు అన్నది అందరూ అనుభవైకపూర్వకంగా అనుభవించే సత్యం. మహా శివరాత్రి అనడానికి.. ప్రతీమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు.ప్రతి మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మాసశివరాత్రిగా వ్యవహరిస్తారు. మాఘ కృష్ణ పక్ష చతుర్దశిలో వచ్చే శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు.ఈ తిథి నాడు లింగాకారంలో పరమేశ్వరుడు ఆవిర్భవించిన సందర్బంగా పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక దినంగా మహాశివరాత్రిగా జరుపుకుంటాం. శివ అంటే.. శివ అనే నామమే అత్యంత పవిత్రమైనది.శివ అంటే మంగళం,శుభం,క్షేమం,భద్రం,శాంతం అనే అర్ధాలు చెప్పబడ్డాయి.అన్నిటికీ ఆధారమైనవాడు శివయ్య.అలసిన జీవుడు ధ్యానంలో చేరేది శివ చైతన్యవలయంలోనికే. పరమ శివుని ఆవిర్భావం అందరికీ తెలిసిందే.భక్త సులభుడు మరియు భక్త వరదుడు శంకరుడు అన్నది పురాణాలు ద్వారా అందరికీ సుపరిచితం. శివతత్వం అంటే.. సాక్షాత్ చదువుల తల్లి సరస్వతీ మాత శివతత్వం గ్రంథస్తం చేసే క్రమంలో ఎంత రాసినా తరగని ఘని అయిన పరమేశ్వరుడి తత్వరచన కోసం కాటుక కొండను కరిగించి "సిరా" (ఇంక్) గానూ, కల్పవృక్షం కొమ్మను "కలం"(పెన్) గాను, భూమాతను "కాగితం"(పేపర్)గా చేసుకుని రచన ప్రారంభించి ఎంత రాసినా పూర్తి కానీ సశేషం శివతత్వం అని గ్రహించి "పరమేశ్వరా నీ తత్వం అందనిది కానీ నీ అనుగ్రహం సులభసాధ్యంగా అందరికీ అందేదీ"అని నిర్వచించారట అమ్మవారు. అంతటి విశిష్టతే శివతత్వం. శివపూజ.. గీతాచార్యుడయిన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలిపిన అమృతవాక్కు పురాణాల ద్వారా గ్రహించిన మహనీయులు ప్రపంచానికి అందించినది "కోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శివపూజ చేయలేము".సాక్షాత్ దైవమే చెప్పిన ఈ మాట శివపూజలో ఉన్న ధార్మిక ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ రోజు ఉపవాసమే నైవేద్యం:- పార్వతీనాధునికి ఉపవాసమే భక్తుడు సమర్పించే నిజమైన నైవేద్యం.తృప్తి కోసం భక్తుడు తాను స్వీకరించే ఆహారం సాత్వికమైనది శివార్పణమ్ చేసి తీసుకోవచ్చు.శక్తి కొద్దీ ఎవరు ఇష్టపూర్వకంగా సమర్పించే ఆహారం అయినా పరమాత్మునికి ప్రీతికరమైనది. అభిషేకప్రియుడు.. లింగరూపుడు అయిన శివయ్యకు శుద్ధజలం(మంచి నీరు)అత్యంత ప్రీతి కరమయిన అభిషేకద్రవ్యం.గంగాధరుడు కాబట్టి గంగకు అత్యంత ప్రాధాన్యత.మరో రకంగా ఆలోచిస్తే సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే జలం కోరుకున్నాడు భగవానుడు.శక్తి కొద్దీ పంచామృతాలు,పళ్లరసాలు భక్తులు సమర్పిస్తారు.ఒక్కో ద్రవానికి ఒక్కో విశిష్టత చెప్పబడింది.స్థూలంగా శివునికి అభిషేకం అత్యంత ప్రియం. బిల్వదళం.. మారేడుదళాలు సంవత్సరం మొత్తంలో శిశిరఋతువులో సైతం ఆకురాల్చని విధానం కలిగి ఉండటమే కాక శరీరం లోని వేడిని సైతం తగ్గించే శక్తి కలిగి ఉండడంతో గరళకంటుడికి మారేడుదళం సమర్పిస్తారు భక్తులు.ఈ బిల్వదళం సమర్పణలో ఒక్కో రకమయిన పురాణ వివరణలు కూడా ఉన్నాయి. ఈ శివరాత్రి రోజును ఉపవాసంతో శివుడిని అర్చించి జాగరణ చేయడం అనేది అత్యంత కష్టమైన విధి విధానం. వీటన్నింటిని కనీసం ఒక్కసారైన ఆచరించే పూజ చేయగలిగితే చాలని జన్మకో శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘమాసం ఈ చలికాలంలో ఇవన్నీ ఒక్కసారైన నియమంగా చేస్తే చాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఆర్కోక్తి జన్మకో శివరాత్రి. అందువల్లే దీన్ని మహా శివరాత్రి అని కూడా పిలవడం జరిగింది. ఐక్యతకు శివకుటుంబం ఆదర్శం.. పరస్పర వైరభావం కలిగిన వాహనాలు ఎద్దు,సింహం,నెమలి,ఎలుక ఏంతో అన్యోన్యతతో ఒదిగి ఉండటం ప్రస్తుత సమాజానికి ఒక విలువైన పాఠం.ఎన్నో వైరుధ్యాలు,భావాలు,వ్యక్తిత్వాలు ఉన్నా సమాజం అనే గొడుగు క్రింద అందరం అన్యోన్యంగా ఉన్నప్పుడే భావితరాలకి శాంతి మరియు సౌబ్రాతృత్వాలు అందించగలం.ఐక్యతే విజయ సూత్రం అని చెబుతోంది శివకుటుంబం. దయగల దైవం చంద్రశేఖరుడు. భక్తితో శివునికి చేరవ్వవుదాం. సత్కర్మలు ఆచరించి నిశ్చలమైన భక్తి, విశ్వాసాలను ఇవ్మమని అడుదాం. శివతత్వాన్ని శాశ్వతం చేసుకుందాం మన నిత్య జీవనవిధానంలో.. (చదవండి: శివయ్య అనుగ్రహం కావాలంటే..) -
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవార ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా: శివనామ స్మరణతో కోటిపల్లి, ద్రాక్షారామ పుణ్యక్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రినీ పురస్కరించుకొని కోటిపల్లి ద్రాక్షారామం ఆలయాలలో క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. వేకువజామున నుంచి భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. నంద్యాల: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తజనం బారులు తీరారు. వేకువజాము నుండి పాతాళగంగ స్నాన ఘట్టాల వద్ద శివ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలో నేడు పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. శివనామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. కరీంనగర్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధి భక్త జనసంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరుగనున్న జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్న గురువారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పట్టువస్త్రాల సమర్పించింది. మరో వైపు పంచాక్షరీ నామస్మరణతో రాజన్న సన్నిధి మార్మోగుతోంది. 👉: (మహాశివరాత్రి 2024: శ్రీశైలంకు భారీగా భక్తజనం (ఫొటోలు) -
మహా జాతర షురూ
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున ఆ ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. ఉద యం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తుల రాక మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వచ్చిన వారంతా తమకు దొరికిన ఖాళీ స్థలంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్న ను దర్శించుకుని, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రాజన్న గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమంలో భాగంగా 1,500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ గౌతమి, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మూడు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. -
Maha Shivratri: శివయ్య అనుగ్రహం కలగాలంటే..
విద్యలన్నింటిలోనూ వేదం గొప్పది. వేదాలన్నింటిలోనూ సంహితకాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం గొప్పది. అందులోనూ ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం గొప్పది. పంచాక్షరిని పలుకలేకున్నా, అందులో ‘శివ’ అనే రెండక్షరాలు చాలా గొప్పవి అని శాస్త్ర వచనం. శివుడినే శంకరుడని కూడా అంటారు. శంకరోతి ఇతి శంకరః అని వ్యుత్పత్తి. అంటే శమనం లేదా శాంతిని కలిగించేవాడు అని అర్థం. ‘శివ శివ శివ యనరాదా... భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి అన్నాడు గాని, అచంచల భక్తితో శివనామాన్ని స్మరిస్తే చాలు, భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత పవిత్రమైనది. ఉపవాస దీక్షలతో, జాగరణలతో రోజంతా శివనామ స్మరణలో, అభిషేక, అర్చనాది శివారాధన కార్యక్రమాలలో నిమగ్నమై పునీతమవుతారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు తొలుత హాలాహలం ఉద్భవించింది. దాని ధాటికి ముల్లోకాలూ దగ్ధమై భస్మీపటలం కాగలవని భయపడిన దేవదానవులు తమను కాపాడాలంటూ శివుడికి మొర పెట్టుకోవడంతో, శివుడు హాలాహలాన్ని మింగి తన కంఠంలో బంధిస్తాడు. హాలాహలం వేడిమికి శివుడి కంఠమంతా కమిలిపోయి, నీలంగా మారుతుంది. ఈ కారణంగానే శివుడు నీలకంఠుడిగా, గరళకంఠుడిగా పేరుగాంచాడు. ఇది జరిగిన రోజు మాఘ బహుళ చతుర్దశి. లోకాలను కాపాడిన శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు జనులందరూ జాగరణ చేస్తారు. అప్పటి నుంచి మహాశివరాత్రి రోజున శివభక్తులు జాగరణ చేయడం ఆచారంగా మారిందని ప్రతీతి. మహాశివరాత్రిని ఎలా పాటించాలంటే... మహాశివరాత్రి రోజున వేకువజామునే నిద్రలేచి, సూర్యోదయానికి ముందే స్నానాదికాలు ముగించుకోవాలి. ఇంట్లో నిత్యపూజ తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. ఉపవాస దీక్షలు పాటించేవారు పండ్లు, పాలు మాత్రమే స్వీకరించాలి. లౌకిక విషయాలను ఎక్కువగా చర్చించకుండా వీలైనంతగా భగవత్ ధ్యానంలో గడపాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. వీలుంటే మహాశివునికి అభిషేకం జరిపించడం మంచిది. మరునాటి సాయంత్రం ఆకాశంలో చుక్క కనిపించేంత వరకు జాగరణ ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ఉపవాస, జాగరణ నియమాలను పాటించకపోయినా, సాత్విక ఆహారం తీసుకుని, వీలైనంతగా శివ ధ్యానంలో గడపాలని శాస్త్రాలు చెబుతున్నాయి. -
పరమ శివుని భక్తిని చాటి చెప్పే చిత్రాలు.. ఎంచక్కా ఓటీటీల్లో చూసేయండి!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందడి మొదలైంది. శివనామస్మరణతో శ్రీశైల గిరులు మార్మోగిపోతున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ, ఉపవాసం చేయడం ఆనవాయితీ. అలా ఆ పరమశివుడిని, పార్వతిదేవిని స్మరించుకుంటూ భక్తితో పొంగిపోతుంటారు. ఇప్పటికే ఆ పరమ శివుని మహిమలపై వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. శివరాత్రి సందర్భంగా శివున్ని తరించుకుంటూ సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే. శివుని భక్తిని చాటి చెప్పే సినిమాల జాబితాను మీకోసం తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఓటీటీల యుగంలో ఏయే సినిమా ఏక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరే చూసేయండి. అలాగే శివరాత్రికి కచ్చితంగా చూడాల్సిన సినిమాల జాబితా ఇదుగో మీ కోసమే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మహాభక్త సిరియాళ భక్త శంకర అమెజాన్ ప్రైమ్ భక్త కన్నప్ప ఎరోస్ నౌ శ్రీ మంజునాథ శివకన్య జీ5 మహాశివరాత్రి జియో సినిమా శివరాత్రి మహత్యం యూట్యూబ్ భక్త సిరియాళ భక్త మార్కండేయ శ్రీ మంజునాథ ఉమాచండీ గౌరీశంకరుల కథ కాళహస్తి మహత్యం శివలీలలు మహాశివరాత్రి దక్షయజ్ఞం జగద్గురు ఆదిశంకర మావూళ్లో మహాశివుడు శివకన్య శివరాత్రి మహత్యం వీటిలో భక్త కన్నప్ప, శ్రీ మంజునాథ భక్త మార్కండేయ, మహాభక్త సిరియాళ మరింత విశేషం కానుంది. మహాభక్త సిరియాళ చిత్రంలో తారకరత్న, అర్చన జంటగా నటించారు. వీటితోపాటు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, శ్రీహారి నటించిన జగద్గురు ఆదిశంకర చూడాల్సిన సినిమా. ఇవే కాకుండా శివరాత్రి మహత్యం, భూకైలాస్, అంజి, కార్తికేయ వంటి మరెన్నో చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినవాటిని సెలక్ట్ చేసుకుని వాటిని చూస్తూ జాగారం చేసేయండి.. -
శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శివనామస్మరణతో మారుమోగుతున్న నల్లమల అభయారణ్యం
-
నిత్య పూజలు అందుకుంటున్న కేతకీ పార్వతీ పరమేశ్వరులు
సంగారెడ్డి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అంకురార్పణ, ధ్వజారోహణం, శిఖర పూజా కార్యక్రమాలతో జాతర ప్రారంభమైంది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజలతో పాటు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శశిధర్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, నాయకులు సంతోష్ కుమార్ పాటిల్, రుద్రయ్య స్వామి, గాలప్ప పాటిల్, నరేందర్ రెడ్డి, దత్తు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆకాశం నుంచి పడిన మంత్రపు పెట్టె.. రూ.50కోట్లంటూ.. -
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీమన్నారాయణ అవతారంలో శ్రీనివాసుడు..!
-
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం
-
పాండవుల వనవాసంలో కొన్నాళ్ళు ఇక్కడే నివాసం..
-
మహా శివరాత్రికి ముస్తాబవుతున్న అలంపూర్ క్షేత్రం
-
ప్రకృతి సోయగాలకు నెలవైన కపిలతీర్థం
-
పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ శివలింగాలు ఇక్కడే!
-
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
-
ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా శివరాత్రి వేడుకలు
-
శివుడికి నేడు విశేషమైన అభిషేకాలు
-
శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చెయ్యడం వలన ఉపయోగం ఏంటంటే..
-
పిఠాపురంలో మహా శివరాత్రి వేడుకలు
-
శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలు
-
వేములవాడ మహా శివరాత్రి వేడుకలు
-
భీమవరం పంచారామ క్షేత్రానికి భారీగా వచ్చిన భక్తులు
-
హర హర మహాదేవ శంభో
-
రెండు పర్వదినాలు ఇవాళే వచ్చాయి..
-
అమరావతిలో గంట గంటకూ పెరుగుతున్న భక్తుల రద్దీ
-
శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి వేడుకలు
-
పరమ శివుడిని దర్శించుకుంటే' కోరిన కోర్కెలు తీరతాయి..!
-
విశాఖలో మహా శివరాత్రి వేడుకలు
-
భక్తులతో పోటెత్తిన ఆదిలాబాద్ శివాలయాలు
-
భక్తులతో కిటకిటలాడుతున్న బంజారా హిల్స్ శివాలయం
-
శివుడి పాటలతో లైవ్ లో ఉర్రూతలూగించిన సింగర్స్
-
మాధవ స్వామి ఆలయంలో- శివరాత్రి సంబరాలు
-
కోటప్పకొండ ఆలయంలో శివరాత్రి సందడి..
-
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సంబరాలు
-
ఖమ్మంలో శివరాత్రి సందడి
-
నెల్లూరు శివాలయంలో శివరాత్రి సంబరాలు
-
2000 వేల ఏళ్ల నాటి శివాలయంలో ఘనంగా శివరాత్రి సంబరాలు
-
భక్తులతో నిండిపోయిన కోటప్ప కొండ మహాశివరాత్రి సంబరాలు
-
క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా శివరాత్రి సంబరాలు
-
తిరుపతిలో శివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లు
-
కాశ్మీర్‌లోని లింగేశ్వర ఆలయంలో త్రిష ప్రత్యేక పూజలు
తమిళ సినిమా: మహాశివరాత్రి పర్వదినాన నటి త్రిష మహాశివుని సేవలో తరించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా రాణిస్తున్న ఈమె ఆ మధ్య నటించిన కొన్ని చిత్రాలు నిరాశ పంచడంతో క్రేజ్ తగ్గింది. అయితే పొన్నియిన్ సెల్వన్ చిత్రం విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. నాలుగుపదుల వయసు దగ్గర పడుతున్న ఈ అమ్మడు ఇప్పటికీ అవివాహితే. కాగా ఇటీవల ఈమె దృష్టి దైవ దర్శనాలపై మళ్లిందని భావించవచ్చు. సమయం దొరికినప్పుడల్లా గుళ్లు, గోపురాలు తిరిగేస్తున్నారు. చదవండి: తారకరత్న భార్య, పిల్లల్ని చూశారా? చిన్న వయసులోనే తీరని దుఃఖం తాజాగా విజయ్ సరసన లియో చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. నటుడు అర్జున్, దర్శకుడు మిష్కిన్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మన్సూర్ అలీ ఖాన్, నటి ప్రియా ఆనంద్ వంటి ప్రముఖ నటినట్లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కశీ్మర్లో జరుగుతోంది. అక్కడ జమ్మూ కశ్మీర్ సమీపంలోని బహల్ గామ్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో లియో చిత్రం షూటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. చదవండి: తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి అస్వస్థత.. అక్కడ చిత్ర యూత్ ప్రేమికుల రోజున దిగిన ఫొటోలను నటి త్రిష సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి నెట్టింట్లో వైరల్ అయ్యాయి.. కాగా శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నటి త్రిష కాశ్మీర్‌లోని లింగేశ్వర ఆలయానికి వెళ్లి అక్కడ శివలింగానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయ అర్చకులు దగ్గరుండి మరి త్రిషతో ప్రత్యేక పూజలు జరిపించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన అభిమానులు త్రిష భక్తిని చూసి పారావస్యం పొందడంతో పాటు ఓం నమశివాయ అంటూ లైకులు కొడుతున్నారు. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
ఆదియోగి సేవలో రజనీకాంత్!
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సోదరుడు సత్యనారాయణతో కలిసి కర్ణాటక, చిక్కబల్లాపుర జిల్లాలోని ఆదియోగి దర్శనానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోయంబత్తూరు ఈషా యోగ మందిరం తరపున ఈఏడాది జనవరి 15 కర్ణాటక రాష్ట్రం చిక్కబల్లాపుర జిల్లాలోని నందిమలై (కొండ) పరీవాహక ప్రాంతంలో 112 అడుగుల ఎత్తయిన ఆదియోగి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోయంబత్తూరులోని శివుని శిలా విగ్రహం మాదిరిగానే చిక్కబల్లాపురలో ఆదియోగి శిలా విగ్రహం ఉండడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. కాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అశేష భక్తులు శనివారం నుంచే శివ దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా నటుడు రజనీకాంత్ తన సోదరుడు సత్యనారాయణతో కలిసి ఆదియోగిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ యోగేశ్వర లింగానికి విశేష పూజలు నిర్వహించారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
భక్తులతో కిటకిటలాడుతోన్న విశాఖ ఆర్కే బీచ్
-
హరహర మహాదేవ... రాజన్నను దర్శించుకున్న 3 లక్షల మంది భక్తులు
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజన్న క్షేత్రం శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని రాజన్న దర్శనానికి దాదాపు 3 లక్షల మంది వరకు వేములవాడకు తరలివచ్చారు. ఒక్కోభక్తుడి దర్శనానికి దాదాపు పది గంటల సమయం పట్టింది. శివమాలాధారులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. సాయంత్రం 6 గంటల నుంచి నిరంతరం లఘు దర్శనాలకు అవకాశం కల్పించారు. ఉదయం వేళలో మధ్య మధ్యలో దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆర్జిత సేవలు రద్దు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లలో భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎసీపీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్, ఏఎస్పీ చంద్రయ్య, తహసీల్దార్ రాజారెడ్డి పరిశీలించారు. రాజన్నకు వెంకన్న పట్టువస్త్రాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్నకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ బృందం సమర్పించారు. వీరికి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ప్రసాదాలు అందించి, సత్కరించారు. రూ.50 కోట్లతో అభివృద్ధి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వేములవాడ, సిరిసిల్ల పట్టణాలను రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. హాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్ స్వాగతం పలికారు. రాజన్న దర్శనం అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వేములవాడపై ప్రత్యేక దృష్టి పెట్టారని, రాష్ట్రంలోనే ఎములాడ రాజన్న ఆదాయంలో నంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. గుడి చెరువు, ధర్మ గుండంలను ఎల్లప్పుడు గోదావరి జలాలతో నింపుతామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థఫు మాధవి, కౌన్సిలర్లు ఉన్నారు. మార్మోగిన ఆలయాలు కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్ పట్టణంతో పాటు జిల్యావ్యాప్తంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కరీంనగర్ పాతబజారులోని శివాలయం, కమాన్ వద్ద రామేశ్వరాలయంలో స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులుతీరారు. ► శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం వేకువజాము 3.30 గంటలు: స్థానికుల దర్శనాల అనంతరం నిరంతరం లఘు దర్శనాల కొనసాగింపు. ► శనివారం ఉదయం 7 గంటలు: టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఆధ్వర్యంలో రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. ► ఉదయం 8: రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పట్టువస్త్రాలు సమర్పించారు. ► మధ్యాహ్నం 3.30: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజన్నను దర్శించుకున్నారు. ► సాయంత్రం 4: శివమాలధారులు రాజన్నను దర్శించుకున్నారు. ► సాయంత్రం 6: అద్దాల మండపంలో అనువంశిక అర్చకుల ఆధ్వర్యం లో సామూహిక మహాలింగార్చన. ► సాయంత్రం 6 నుంచి ..: రాష్ట్ర భాషా, సాంస్కృతికశాఖ జాయింట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో శివార్చన. ► రాత్రి 11.35 నుంచి ఉదయం 4 గంటలు: లింగోద్భవ సమయంలో రాజన్నకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. సేవలు ఇలా.. ► రాజన్న మహాజాతరలో 2 వేల మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. ► 650 మంది శానిటేషన్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు విధులకు హాజరయ్యారు. ► ఎంపీవోలు 80 మంది, మెడికల్ సిబ్బంది 300, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ 150, అంగన్వాడీలు 150, స్వచ్ఛంద సంస్థ సభ్యులు వెయ్యి మంది జాతరలో విధులు నిర్వహించారు. ► ఆలయ సిబ్బంది 850, సెస్ ఉద్యోగులు 90, ఎక్సైజ్ 75 మంది విధులకు హాజరయ్యారు. ► 800 బస్సుల్లో భక్తులను వివిధ ప్రాంతాలకు చేరవేశారు. ► 14 ఉచిత బస్సులు తిప్పాపూర్ నుంచి రాజన్న ఆలయానికి భక్తులను ఉచితంగా చేరవేశాయి. చదవండి: ఊరూవాడా శివనామ స్మరణ -
మహాశివరాత్రి: టాలీవుడ్ కొత్త అప్డేట్స్ ఇవే!
మహా శివరాత్రి సందర్భంగా టాలీవుడ్ జోరుగా హుషారుగా మహా అప్డేట్స్ ఇచ్చింది. ఆ విశేషాలు తెలుసుకుందాం... వెండితెర బోళా శంకరుడిగా దుష్టులపై శివతాండవం చేస్తున్నారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘బోళా శంకర్’. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా, ఆయనకు చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘బోళా శంకర్’లోని చిరంజీవి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతదర్శకుడు. ఏప్రిల్ 14న ‘బోళా శంకర్’ని విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు పండగ రోజున ‘నేను ప్యార్‌లోన పాగలే..’ అంటూ ‘రావణాసుర’ చిత్రం కోసం పాట పాడారు రవితేజ. పబ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, స్వయంగా రవితేజ పాడటం విశేషం. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా, హీరో సుశాంత్ కీ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇక సంక్రాంతికి థియేటర్స్‌లోకి వస్తానన్న విషయాన్ని శివరాత్రి రోజున వెల్లడించారు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలి సిందే. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీ రోల్స్ చేస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. అలాగే శివరాత్రి రోజునే ‘రామబాణం’ ఫస్ట్ లుక్‌ను వదిలారు గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత మూడోసారి హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రామబాణం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, ఖుష్బూ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో రిలీజ్ కానుంది. ఇక త్వరలోనే మ్యూజిక్ బ్లాస్ట్ ఉంటుందంటున్నారు ‘ఏజెంట్’. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఏజెంట్’. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ప్రముఖ హీరో మమ్ముట్టి ఓ కీ రోల్ చేస్తున్నారు. కాగా ‘ఏజెంట్’ ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు మేకర్స్. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఇవే కాదు.. అల్లరి నరేశ్ ‘ఉగ్రం’, సాయిధరమ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’తో పాటు మరికొన్ని చిత్రబృందాలు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. -
మహాశివరాత్రి స్పెషల్.. మంచు లక్ష్మి సాంగ్ వైరల్..!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే వారిలో మంచు లక్ష్మి ఒకరు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఇవాళ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సరికొత్తగా ప్రేక్షకులను పలకరించింది. శివరాత్రి అంటే శివాలయాలు శివ నామ స్మరణతో మారుమ్రోగడం ఖాయం. ఈసారి మంచు లక్ష్మి కూడా ప్రత్యేక గీతంతో అభిమానులను అలరించింది. ఆది శంకరాచార్యులు రచించిన మహాశివుని ‘నిర్వాణ శతకం’ స్వయంగా పాడిన వీడియో రిలీజ్ చేసింది. శివునిపై ప్రత్యేక పాటను మంచు లక్ష్మితో పాటు ఆమె కూతురు విద్య కూడా ఆలపించడం మరో విశేషం. ఈ సాంగ్‌ను ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసింది. దాదాపు ఎనిమిది నిమిషాల పాటు పాడిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో అలరిస్తోంది. ఈ పాటకు మంచు మనోజ్ సైతం అభినందనలు తెలిపారు. సాంగ్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. కాశీలో షూట్ చేసినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. Always proud of you akka🙏🏼❤️ Awesome song. Wishing you and the team behind this a great success in whatever you guys do. Love you ❤️🙏🏼#HappyMahashivratri #Shambo https://t.co/IocFmhIHUr — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 18, 2023 -
శివ ధ్యానం జన్మజన్మల పుణ్యఫలం
-
సకల చరాచర జగత్తుకు లయకారుడు పరమేశ్వరుడు
-
శ్రీకాళహస్తిస్వరుడి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
చిరంజీవి 'భోళా శంకర్' నుంచి క్రేజీ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా నటిస్తుంది.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకూ రిలీజైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా భోళా శంకర్ సినిమాకు సంబంధించి మేకర్స్ “స్ట్రీక్ ఆఫ్ శంకర్” పేరుతో గ్లింప్స్‌ను వదిలారు. జై బోలో భోళా శంకర్🙏🏻 Celebrating this Mahashivartri with the Vibrant “STREAK OF SHANKAR”🔱 from #BholaaShankar ❤️🔥 - https://t.co/5qUTcQTRD9 Mega🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial #MahathiSwaraSagar @BholaaShankar#StreakofShankar pic.twitter.com/wTZCZ5Taht — AK Entertainments (@AKentsOfficial) February 18, 2023 -
పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి!
సాక్షి, ఏలూరు: పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల ప్రకారం.. శివరాత్రి పండుగ వేళ ఏలూరులో విషాదం నెలకొంది. గోదావరిలో ఏడుగురు స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. మృతులను తూర్పు గోదావరి జిల్లా దోసపాడు వాసులుగా గుర్తించారు. మృతుల వివరాలు ఇవే.. - ఓలేటి అరవింద్ (20) - ఎస్కే లక్ష్మణ్ (19) - పెదిరెడ్డి రాంప్రసాద్ (18). -
సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. జగాలను ఏలే జంగమ దేవుడు, తినేత్రుడు, లింగాకార రూపుడైన శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచుకుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచు కుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2023 -
వాహనదారులకు అలర్ట్! విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు..
విజయవాడ స్పోర్ట్స్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు, వాహనచోదకుల సౌకర్యార్థం విజయవాడ నగరంలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా శుక్రవారం తెలిపారు. నగరంలోని పలు మార్గాల్లో సాగే వాహనాల రాకపోకలను వేరే రూట్లకు మళ్లిస్తున్నట్లు వివరించారు. శుక్ర వారం అర్ధరాతి 12 నుంచి శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఆంక్షల సమయంలో భవానీపురంలోని కుమ్మరిపాలెం నుంచి ఘాట్‌రోడ్డుకు, గద్ద»ొమ్మ సెంటర్ నుంచి ఘాట్ రోడ్డుకు, బస్టాండ్ నుంచి ఘాట్‌రోడ్డుకు బస్సులు, కార్లు, ఆటోలు అనుమతించబోమని స్పష్టంచేశారు. స్క్యూ బ్రిడ్జి నుంచి యనమలకుదురు కట్ట వైపు, పెదపులిపాక నుంచి యనమలకుదురు కట్ట వైపు బస్సులు, భారీ వాహనాలను అనుమతించబోమని సీపీ రాణా పేర్కొన్నారు. వాహనాల దారి మళ్లింపు ఇలా.. ► హైదరాబాద్– విశాఖపట్నం మధ్య తిరిగే వాహనాలు ఇబ్రహీంపట్నం, గొల్లపూడి బైపాస్, సితార జంక్షన్, సీవీఆర్ ఫ్లై ఓవర్, పైపుల రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్డు, రామవరప్పాడు మార్గంలో ప్రయాణించాలి. ► విజయవాడ – హైదరాబాద్ మధ్య ప్రయాణించే ఆర్టీసీ బస్సులు బస్టాండ్ నుంచి కనకదుర్గ ఫ్లై ఓవర్, గొల్లపూడి, స్వాతి జంక్షన్, వైజంక్షన్, ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించాలి. ► బస్టాండ్ నుంచి భవానీపురం, పాలప్రాజెక్ట్కు రాకపోకలు సాగించే సిటీ బస్సులు రాజీవ్‌గాంధీ పార్కు, కనకదుర్గ ఫ్లై ఓవర్, శివాలయం వీధి, జోజినగర్ చర్చి, సితార సెంటర్, చిట్టినగర్ మార్గాన్ని అనుసరించాలి. ► అవనిగడ్డ నుంచి విజయవాడకు కరకట్ట మీదుగా రాకపోకలు సాగించే ఆరీ్టసీ, సిటీ బస్సులు పెదపులిపాక, తాడిగడప, బందరు రోడ్డు, బెంజిసర్కిల్, స్క్యూ బ్రిడ్జి, వారధి జంక్షన్ మార్గంలో ప్రయాణించాలి. -
హైదరాబాద్ లో శివాలయాలకు పోటెత్తిన భక్తులు
-
విశాఖ ఆర్ కె బీచ్ లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
-
కీసరగుట్ట ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు
-
రాజన్న దర్శనం కోసం వేములవాడకు పోటెత్తిన భక్తులు
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతోంది. శివమాలధారులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆధ్యాత్మిక క్షేత్రం కిక్కిరిసిపోతోంది. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాజాతరకు నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే గుడారాలు వేసుకుంటున్నారు. ధర్మగుండంలోకి అనుమతి లేకపోవడంతో షవర్ల వద్ద స్నానాలు చేస్తున్నారు. గుడి ఆవరణలో జాగరణ కోసం భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసిన ఆలయ అధికారులు లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రూ.3.70 కోట్లతో జాతర ఏర్పాట్లు చేశారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో శివార్చనలో భాగంగా 1,600 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాస్‌ల జారీ విషయంలో ఉద్యోగులు, పురప్రముఖులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి జాతరకు 3 లక్షల వరకు భక్తులు వస్తారని అధికారుల అంచనా. స్వామి మహామంటపంలో ఉత్సవమూర్తులను సిద్ధం చేసి ఉంచారు. అన్నదానం ప్రారంభం జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి స్థానిక వాసవీ సేవా సమితి, మన చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రమేశ్‌బాబు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఈవో కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ అన్నదానం శని, ఆదివారాలు సైతం కొనసాగుతుందని నిర్వాహకులు మోటూరి మధు, కొమ్మ నటరాజ్ తెలిపారు. దాదాపు 30 వేల మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. ఉచిత బస్సు సేవలు దేవస్థానం తరఫున 14 ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ సేవలను శుక్రవారం ప్రారంభించారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి బైపాస్‌రోడ్డు గుండా జగిత్యాల బస్టాండు, గుడిప్రాంతం, బైపాస్‌రోడ్డు ద్వారా కోరుట్లబస్టాండు, ప్రాంతాలను కలుపుతూ తిరిగి తిప్పాపూర్ బస్టాండ్ వరకు చేరుకుంటాయి. భక్తుల రద్దీని బట్టి బస్సులను తింపనున్నట్లు డీఎం మురళీకృష్ణ తెలిపారు. ప్యూరిఫైడ్ వాటర్ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఆలయ ఈవో కార్యాలయం వద్ద, గుడి పక్కన పార్కింగ్ ఏరియా, బద్దిపోచమ్మ గుడి వద్ద రాజన్న జలప్రసాదం మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్ బాబు తదితరులు శివార్చన ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. చదవండి: శివ నామస్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు -
తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
-
శివ శివ శంకర
-
దేశవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
-
Maha Shivaratri 2023: శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. జగాలను ఏలే జంగమ దేవుడు, తినేత్రుడు, లింగాకార రూపుడైన శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులంతా పాతాళ గంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామివారి దర్శించుకుంటున్నారు. అధికారులు తెల్లవారుజాము నుంచే దర్శనానికి అనుమతించారు. రాజన్న సిరిసిల్లా జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు రాజన్నను దర్శించుకుంచేకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టీటీడీ, రాష్ట్రప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి కల్యాణ మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన జరుగుతుంది. రాత్రి 11:30 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి 11 మంది రుత్వికులచే ఆలయ అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో మహాశివుడ్ని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. విశాఖ తీరంలో శివరాత్రి శోభ అలముకుంది. అఫీషియల్ కాలనీలోని వైశాకేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆర్కే బీచ్‌లో టీఎస్ఆర్ సేవా పీఠం ఆధ్వర్యంలో కోటి శివలింగార్చన నిర్వహించారు. అప్పికొండలోని సోమేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర జరుగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొంటున్నారు. తిరుపతి: జిల్లా వ్యాప్తంగా మహా శివరాత్రి సందర్బంగా భక్తులతో శివాలయాలు కిటకిట లాడుతున్నాయి. శ్రీకాళహాస్తీశ్వర స్వామి సన్నిధిలో భక్త జనం పోటెత్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం ఇంద్ర విమానం వాహనం, రాత్రి కి నంది - సింహ వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనం ఇవ్వనున్నారు. కపిల తీర్థం ఆలయం జలపాతం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, దీపారాధన చేస్తున్నారు. కపిలేశ్వర స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు ఉదయం రధోత్సవం, రాత్రి నంది వాహన సేవ ఉంది. ఏర్పేడు మండలం గుడిమల్లంలో కొలువైన పరశురామేశ్వర స్వామి ఆలయానికి మహా శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అనకాపల్లి జిల్లా: సబ్బవరం మండలం లింగాల తిరుగుడులో సోమలింగేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చోడవరంలోని గంగా సమేత పార్వతి పరమేశ్వర స్వయంభు ఆలయంలో శివరాత్రి సందర్బంగా పూజలు నిర్వహించారు. ఎస్ రాయవరం మండలం పంచదార్లలలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు. అల్లూరి జిల్లా: హుకుంపేట మండలం మఠం పంచాయతీలో మత్స్య లింగేశ్వర స్వామి శివరాత్రి జాతర ప్రారంభమైంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అనంతగిరి మండలం బొర్రా గుహల్లో శివరాత్రి జాతర జరుగుతోంది. గుహల్లో వెలిసిన మహాశివుడికి గిరిజనులు అభిషేకాలు చేస్తున్నారు. కాశీపట్టణంలో ఉమా రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. శివలింగపురంలో స్వయంభు శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు లోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివరాత్రి వేడకుల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా: మహా శివరాత్రి సందర్భంగా భీమవరంలోని పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగుతోంది. పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరికి ఏటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కృష్ణాజిల్లా: కృత్తివెన్ను శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి జోగి రమేష్ మంత్రి జోగి రమేష్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దేవదాయ ధర్మదాయ శాఖ ఏసీ గోపీనాథ్ బాబు. శ్రీ నాగేశ్వర స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి జోగి రమేష్. కృష్ణాజిల్లా: మహాశివరాత్రి సందర్భంగా మోపిదేవి మండలం పెద్దకళ్లపల్లిలో దుర్గా నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు. ఏలూరు జిల్లా: ముసునూరు మండలం బలివే రామలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. బలివే రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మేకాప్రతాప్ అప్పారావు. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురుస్కరించుకుని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కీసరగుట్ట భక్త జనసంద్రంతో నిండిపోయింది. శ్రీ భవాని శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని తరించేందుకు భక్తులు రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చారు. -
వెలిగిపోతున్న వేములవాడ రాజన్న
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం మహాశివరాత్రి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానాచార్యుడు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని శనివారం ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున జేఈవో బృందం, అనంతరం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రూ.3.7 కోట్ల వ్యయంతో మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్సవాలకు 3 లక్ష ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 2 వేల మందితో ఎస్పీ అఖిల్‌మహాజన్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సౌకర్యం కల్పించారు. జాతర ఉత్సవాల చైర్మన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. రాజన్న భక్తుల కోసం గుడి చెరువులోకి గోదా వరి జలాలను శుక్రవారం విడుదల చేశారు. -
మహాశివరాత్రి స్పెషల్.. శివుని ప్రత్యేక గీతాలు
మహా శివరాత్రి శివ భక్తులకు అత్యంత ఇష్టమైన పండుగ. ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. శివభక్తులు తమ ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రత్యేక గీతాలు ఆలపిస్తారు. అలాగే శివుడి చరిత్రను వివరిస్తూ పలు సినిమాలు కూడా వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడి గుర్తు చేసుకుంటూ అత్యంత ప్రీతికరమైన పాటలేవో తెలుసుకుందాం. ఓం మహాప్రాణ దీపం సాంగ్ -శ్రీ మంజునాథ (2001) ఇది చిరంజీవి, అర్జున్ సర్జా నటించిన శ్రీ మంజునాథ (2001) చిత్రంలోని చాలా ప్రజాదరణ పొందిన భక్తి గీతం. ప్రసిద్ధ తెలుగు పాటను శంకర్ మహదేవన్ పాడారు. ఈ పాదం -శ్రీ మంజునాథ (2001) శ్రీ మంజునాథ చిత్రంలోని శ్రీపాదం ప్రసిద్ధ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం పాడారు. ఆటగదరా శివా .. ఆటగదా కేశవ సాంగ్ జీవిత చిత్రాన్ని చూపించే పాటల్లో ఎక్కువ మందికి ఇష్టమైన పాట ఆటగదరా శివా... ఈ పాటలో ప్రతి అక్షరం అద్భుతమే. ఆటగదరా శివా ఆటగద కేశవా అంటూ సాగే పాట చిన్న చిన్న పదాలతో జీవితాన్ని తట్టిలేపిన తనికెళ్ల భరణి రచించగా.. ఈ పాటను ఏసుదాసు ఆలపించారు. ఎట్టాగయ్యా శివా శివా మరణానికి-పుట్టుకకు మధ్యలో అన్నీ ఎదురీతలే. బంధాలకు ప్రతిమనిషీ బందీనే, అందరికీ వేదన బాధ ఒక్కటే... దయచూడు భోళాశంకరా కరుణ చూపించు అంటూ సాగే ఈ పాట ఆటగదరా శివ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. భ్రమ అని తెలుసు సాంగ్ బ్రతుకంటే బొమ్మల ఆట.. పుట్టుక తప్పదు, మరణం తప్పదు.. అన్నీ తెలిసి మాయలో బతుకుతున్నాం అంటూ మనిషిలో ఉంటే అంతర్యామిని తట్టిలేపే పాట ఇది. జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోని ఈ పాట శివ భక్తులకు ఇష్టమైన పాటగా నిలిచింది. మాయేరా అంతా మాయేరా నీ ముందూ నీ వెనుకా జరిగేదంతా మాయే.. మనవాళ్లు మనది అన్నది మాయే...జననం-మరణం మాయ మధ్యలో జరిగే నాటకం అంతా మాయ..జగమంతా మాయే..జనమంతా మాయే..కళ్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయే అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేలా ఉంటుంది ఓ మహాదేవా సాంగ్ 1966లో విడుదలైన ఓ మహాదేవ పాట శివునికి అంకితం చేయబడింది. తెలుగు చిత్రం పరమానందయ్య శిష్యుల కథ కోసం పి.సుశీల పాడారు. లింగాష్టకం సాంగ్ లింగాష్టకం మ్యూజిక్ ఇయర్స్ ఆఫ్ శాండల్‌వుడ్ అనే సంగీత ఆల్బమ్‌కు చెందినది. దీనిని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాట 1976లో విడుదలైంది. -
మహా శివరాత్రికి తప్పక చూడాల్సిన సినిమాలు!
మహా శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ముక్కంటి నామస్మరణతో ఆలయాలు మార్మోగుతాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతోమంది భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తూ ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో సాంబశివుడిని పూజిస్తారు. రోజంతా ఆయన నామస్మరణలోనే మునిగి తేలుతుంటారు. మరి అంతటి పవిత్రమైన రోజు మీలో భక్తిపారవశ్యాన్ని మరింత పెంపొందించే సినిమాలు చూడకపోతే ఆరోజు పరిపూర్ణం ఎలా అవుతుంది? పైగా నిద్ర పోకుండా జాగరణ చేసేందుకు చాలా మంది సినిమాలను ఎంచుకుంటారు. కాబట్టి ఈ శివరాత్రికి శివయ్య మీద భక్తిని పెంపొందించే సినిమాలేంటో ఓసారి చూసేయండి.. 1. కాళహస్తి మహత్యం 2. శివలీలలు 3. భక్త మార్కండేయ 4. దక్షయజ్ఞం 5. శివకన్య 6. భక్త కన్నప్ప 7. ఉమాచండీ గౌరీశంకరుల కథ 8. మావూళ్లో మహాశివుడు 9. మహాశివరాత్రి 10. శ్రీ మంజునాథ ఇవే కాకుండా శివరాత్రి మహత్యం, భూకైలాస్, అంజి, కార్తికేయ వంటి మరెన్నో చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినవాటిని సెలక్ట్ చేసుకుని వాటిని చూస్తూ జాగారం చేసేయండి.. చదవండి: థియేటర్స్‌లో సూపర్ హిట్.. మళ్లీ రీరిలీజ్ -
Maha Shivaratri 2023: థియేటర్స్‌లో మళ్లీ ఆ సూపర్ హిట్ మూవీస్..ఎక్కడ?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శిస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. హీరోల పుట్టినరోజు లేదా ఏదైన పండగ రోజు చూస్కొని పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు మహేశ్‌బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణల సినిమాలు రీరిలీజై.. మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో స్పెషల్ డే వస్తే చాలు ఓల్డ్ సూపర్ హిట్ మూవీస్.. రీరిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న కూడా చాలా సినిమాలు మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. శివరాత్రి రోజు రీరిలీజ్‌కు రెడీ అయిన స్టార్ హీరోల సినిమాలపై ఓలుక్కేద్దాం. పుష్ప ది రైజ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లోని సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్లో ఉదయం 3 గంటలకు స్పెషల్ షో వేయనున్నారు. అఖండ.. నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబట్టింది. ఇందులో అఘోరాగా బాలయ్య నటన అందరిని ఆకట్టుకుంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా మళ్లీ విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12.15 నిమిషాలకు, సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్స్‌లో రాత్రి 11.49 గంటలకు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం వాల్తేరు వీరయ్య కూడా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయనుంది. శివరాత్రి పురస్కరించుకొని ఫిబ్రవరి 18న సంధ్య 70 ఎమ్ఎమ్ లో అర్థ రాత్రి 12.15గంటలకు, అలాగే ఉదయం 3 గంటలకు వాల్తేరు వీరయ్య స్పెషల్ షో వేయనున్నారు. కాంతార చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ గతేడాది సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. ఇదే పేరుతో టాలీవుడ్లో అక్టోబర్ 15న విడుదలై..ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శివరాత్రి రోజు హైదరాబాద్‌లోని సప్తగిరి 70ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు ప్రదర్శంచనున్నారు. టెంపర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ మూవి ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్‌ని కొత్త లుక్‌లో చూపించడమే కాదు.. యాక్టింగ్‌లోనూ మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు తెలియజేసిన చిత్రమిది. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్‌లోని దేవి థియేటర్స్‌లో అర్థరాత్రి 12.15 గంటలకు, సంధ్య థియేటర్స్‌లో అర్థరాత్రి 12.30 గంటలకు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు మహేశ్‌బాబు నటించిన సరిలేరే నీకెవ్వరు సినిమా కొత్తపేటలోని మహాలక్ష్మీ కాంప్లెక్స్‌లో శనివారం అర్థరాత్రి 11.59 గంటలకు, దూకుడు చిత్రం సుదర్శన్‌లో ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు. అలాగే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం కూడా మహాలక్ష్మీ కాంప్లెక్స్‌లో ఉదయం 3 గంటలకు విడుదల కానుంది. -
విజయనగరంలోని రామక్షేత్రంలో శివనామస్మరణ
-
శ్రీకాళహాస్తిలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శివనామస్మరణతో మార్మోగుతోన్న నల్లమల్ల ఫారెస్ట్
-
శివయ్యా.. నా వల్ల కాదయ్యా!
సాక్షి, ఖమ్మం: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల నుంచి ఆలయ నిర్వహణ నిధులు రాకపోవడంతో శివరాత్రి వేడుకలు నిర్వహించలేనంటూ నేలకొండపల్లిలోని శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం అర్చకుడు కొడవటిగంటి నరసింహారావు అధికారులకు మొర పెట్టుకుంటున్నాడు. ఆలయం పేరిట 1996వ సంవత్సరం వరకు 23 ఎకరాల భూమి ఉండగా, స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం నిధులు సమకూర్చలేదు. ఆతర్వాత ఆదాయం పడిపోయి అర్చకుల వేతనాలు నిలిపేయడంతో 2018లో నరసింహారావు హైకోర్టును ఆశ్రయించగా, భూమి విలువతో పాటు వడ్డీ కలిపి రూ.51 లక్షలను బ్యాంక్‌లో ఫిక్స్డ్ చేశారు. అయినప్పటికీ నాలుగేళ్ల నుంచి అర్చకుడికి వేతనం రాకపోగా, దీప, ధూప నైవైద్యం నిధులు కూడా ఇవ్వడంలేదు. దీంతో కుటంబ పోషణే కష్టంగా మారిన నేపథ్యాన శివరాత్రి వేడుకలు చేయడం సాధ్యం కాదంటూ నరసింహారావు బుధవారం తన గోడు వెళ్లబోసుకున్నాడు. -
Maha Shivratri 2023: సైకత శివయ్య
సంగారెడ్డి టౌన్: మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డిలోని ఫసల్వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 19.5 అడుగుల సైకత మహా లింగాన్ని బుధవారం రాత్రి ఆవిష్కరించారు. విద్యాపీఠం వ్యవస్థాపకుడు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, గానుగాపూర్ పీఠాధిపతి వల్లభానంద సరస్వతి, కూడలి శృంగేరి శంకరాచార్య పీఠాధిపతి అభినవ విద్యారణ్య భారతి స్వామి ముఖ్య అతిథులుగా సైకత శివలింగాన్ని ఆవిష్కరించారు. 360 టన్నుల ఇసుకతో ప్రపంచంలోనే అతి పెద్దదైన సైకత శివలింగాన్ని రూపొందించినట్టు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. -
శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
మహా శివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు: టీఎస్ఆర్టీసీ
హైదరాబాద్: మహా శివరాత్రి పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను నడపడానికి టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. తెలంగాణ నుంచి 2427 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సులు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవ క్షేత్రాలకు సర్వీసులు నడపనుంది. ఈ మేరకు భక్తులకు ఇబ్బంది కలగ్గకుండా టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి పత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సు సర్వీస్‌లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. “మహారాత్రి శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 40 ప్రముఖ శైవాలయాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించాం. రద్దీకి అనుగుణంగా మరిన్ని పత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. భక్తులు ఈ ప్రత్యేక సర్వీస్‌లను ఉపయోగించుకుని క్షేమంగా శైవాలయాలకు చేరుకొని.. మొక్కులు చెల్లించుకోవాలి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ , సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, కోరారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహాశివరాత్రికి ఈ అద్దె బస్సు సౌకర్యాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని సూచించారు. -
నేటి నుంచి శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
మహాశివరాత్రి జాతరకు సీఎంకు ఆహ్వానం
వేములవాడ : ఈ నెల 18న జరిగే వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే మహా శివరాత్రి జాతరకు హాజరు కావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఆహ్వానించారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్, వేద పండితులు సీఎంకు శాలువాకప్పి ఆహ్వాన పత్రిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 33 జిల్లాల్లో కార్మిక భవనాలు మంజూరు చేసినందుకు కేసీఆర్‌కు మంత్రి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
మహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి నేపథ్యంలో ప్రముఖ శైవ క్షేత్రాలన్నింటిలో దేవదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, మహానంది ఆలయాలకు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు అడిషనల్, రీజనల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులను ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్కరిని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ కమిషనర్ –1 చంద్రకుమార్‌ను కోటప్పకొండ ఆలయానికి, అడిషనల్ కమిషనర్ –2 రామచంద్రమోహన్ శ్రీకాళహస్తి ఆలయానికి, ఎస్టేట్స్ విభాగం జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను శ్రీశైల ఆలయానికి, కర్నూలు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న రాణా ప్రతాప్‌ను మహానంది ఆలయానికి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మిగిలిన శైవక్షేత్రాలకు సంబంధించి ఆర్జేసీలు ఆయా ఆలయాల వారీగా తమ పరిధిలోని సీనియర్ అధికారులను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమించాలని పేర్కొన్నారు. -
విశాఖ సాగర తీరంలో పోటెత్తిన భక్త జనం (ఫొటోలు)
-
శివానందలహరి
-
దివ్య కాశి భవ్య కాశి
-
శివోహం..
సాక్షి నెట్వర్క్: ‘హరహర మహాదేవ.. శంభోశంకరా..’ అంటూ మంగళవారం రాష్ట్రం ప్రతిధ్వనించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముక్కంటి దర్శనానికి రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఏ నోట విన్నా శివనామ స్మరణే వినిపించింది. అభిషేకాలతో భక్తవశంకరుడిని ప్రసన్నం చేసుకున్నారు. పలుచోట్ల పరమేశ్వరుడిని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా జరిగాయి. శ్రీగిరి క్షేత్రం జనసంద్రమైంది. నల్లమల కొండలు శివనామ స్మరణతో పరవశించాయి. మల్లన్న, భ్రామరీలకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మంగళవారం రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పరిమళభరిత పుష్పాలతో అలంకరించిన స్వామి, అమ్మవారు.. వేదమంత్రాల నడుమ ఒక్కటయ్యారు. ఆదిదంపతుల కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు హరోంహరా.. శంభో.. శివశంకరా అంటూ పరవశించారు. నీలకంఠుడికి పాగాలంకరణ శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో శివుడి లింగోద్భవ సమయంలో నిర్వహించే పాగాలంకరణ ప్రత్యేకం. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మికుడు పృధ్వీ వెంకటేశ్వర్లు పాగాలంకరణ చేశారు. పండితులు, ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా జ్యోతిర్లింగ మల్లికార్జునుడికి లింగోద్భవకాల మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకానికి శ్రీకారం చుట్టారు. వెంటనే దేదీప్యకాంతులతో కనువిందుచేసిన విద్యుద్దీపాలను ఆపేశారు. క్షణాల్లో శంభో శివశంభో.. ఓం నమఃశివాయ అంటూ భక్తుల శివనామస్మరణ నలుమూలల నుంచి మిన్నంటింది. పృధ్వీ వెంకటేశ్వర్లు స్వామి గర్భాలయ విమాన గోపురాన్ని, ముఖమండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు. అనంతరం వెలిగిన విద్యుద్దీపాల కాంతుల్లో పాగాలంకరణ భక్తులను కనువిందు చేసింది. అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన ప్రభోత్సవం కనులపండువగా సాగింది. లక్షలాదిగా భక్తులు వచ్చిన వాహనాలతో శ్రీశైలంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఔటర్ రింగ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు నిండిపోవడంతో అనేక వాహనాలను రోడ్డుమీదే నిలపాల్సి వచ్చింది. దీంతో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి తెలంగాణలోని మన్ననూరు ఫారెస్ట్ చెక్‌పోస్ట్ నుంచి శ్రీశైలానికి వచ్చే వాహనాలను నిలిపేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో.. శ్రీకాళహస్తీశ్వరాలయం మంగళవారం తెల్లవారుజామున మూడుగంటల నుంచే భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవారు ఇంద్రవిమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామి నంది వాహనంపై, అమ్మ సింహ వాహనంపై నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మంగళవారం అర్ధరాత్రి తరువాత ఒంటిగంట నుంచే దేవస్థానంలో లింగోద్భవ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం పదిగంటలకు రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. భక్తజనసంద్రంగా కోటప్పకొండ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ భక్తులతో పోటెత్తింది. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. 17 భారీ విద్యుత్ ప్రభలు తరలివచ్చాయి. స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పట్టువస్త్రాలు, వెండిప్రభను సమర్పించారు. త్రికోటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సోమయాజులు, జస్టిస్ కృష్ణమనోహర్, జస్టిస్ పద్మావతి దర్శించుకున్నారు. పంచారామమైన అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో స్వామికి ఏక రుద్రాభిషేకాలను, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. రామతీర్థంలో.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి భక్తులు పోటెత్తారు. వైష్ణవాలయమైనా ఏటా మాదిరే శివరాత్రికి భక్తులు హాజరై శ్రీరాముడిని, పక్కనే ఉన్న ఉమాసదాశివుడిని పూజించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బోడికొండపై శిఖరజ్యోతి వెలిగించారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగంలో భక్తులు పోటెత్తారు. వైఎస్సార్ జిల్లాలోని శైవక్షేత్రాల్లో అభిషేకాలు, పూజలు చేశారు. పంచారామక్షేత్రాల్లో.. ఉభయ గోదావరి జిల్లాల్లోని పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామ, భీమారామ, క్షీరారామ, కుమారభీమారామాల్లో పరమశివుడిని, అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రీ ఉమాకుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవిలను, శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారికి భక్తులు పూజలు చేశారు. వీరంపాలెంలోని శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠంలో స్పటిక లింగానికి నిర్వహించిన పూజల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి పాల్గొన్నారు. విశాఖలో మహాకుంభాభిషేకం మహా శివరాత్రిని పురస్కరించుకొని టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ సాగరతీరంలో మంగళవారం 37వ మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. శారదా పీఠా«ధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచామృతం, సుగంధద్రవ్యాలు, పళ్లరసాలతో కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. -
నీలకంథరా దేవా..
వేములవాడ/వరంగల్/నాగర్‌కర్నూలు: ఉదయమంతా శివయ్య దర్శనాలు.. రాత్రి జాగరణలు.. ‘ఓం నమఃశివాయ’నామస్మరణతో మంగళవారం రోజంతా శివాలయాలు మార్మోగాయి. పోటెత్తిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఇటు వేములవాడ రాజన్న.. అటు వేయిస్తంభాల ఆలయం లోని రుద్రేశ్వరుడు.. మరోపక్క చెంచుల మల్లికార్జునుడు.. భక్తజన దర్శనాలతో ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో లయకారుడు లింగాకారుడై ఉద్భవించిన పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం స్వామికి మహాలింగార్చనను స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం ఘనంగా నిర్వహించింది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీసీ సంక్షేమమంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వపక్షాన స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు తిరుమల తిరుపతి వెంకన్న తరఫున టీటీడీ ఏఈవో మోహన్‌రాజు, వేదమూర్తులు సూర్యనారాయణశాస్త్రి, జితేశ్‌ల బృందం రాజన్నకు పట్టువస్త్రాలను సమర్పించారు. ‘కొడుకునియ్యి రాజన్నా..నీకు కోడెను గడుతాం రాజన్నా..’ అని గీతాలాపన చేస్తూ 2 లక్షలమంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణమంతా మంచిగంధం వర్ణమైంది. సాయంత్రం 6 గంటలకు వేదమూర్తులతో మహాలింగార్చన వైభవోపేతంగా సాగింది. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఆలయాన్ని తెరిచే ఉంచుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ప్రకటించారు. దర్శనానికి 6 గంటలు సోమవారం అర్ధరాత్రి 12 నుంచి మంగళవారం వేకువజామున 3.30 వరకు స్థానికుల దర్శనాల అనంతరం లఘుదర్శనాలను కొనసాగించారు. దర్శనానికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టింది. దీంతో క్యూలైన్లలో పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆరోగ్యసిబ్బంది సేవలందించారు. భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షవర్ల వద్ద స్నానాలు చేసి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గుడిచెరువులో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాగా, రాజన్న దర్శనంలో మంగళవారం దాదాపు ఆరుసార్లు బ్రేక్ విధించారు. దీంతో భక్తులు క్యూలైన్లలోనే గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వేయిస్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. నగరంలోని వేయిస్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు. ప్రధాన దారినుంచి రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులుదీరారు. రాత్రి శ్రీ రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరదేవీ కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణంలో పాల్గొన్నారు. కాళేశ్వరంలో భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో పెద్దపట్నం వేశారు. రాత్రి స్వామి కల్యాణం జరిగింది. కురవి వీరన్న ఆలయంలో కల్యాణం వైభవంగా జరిగింది. పిల్లలమర్రి కిటకిట... సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలోని శివాలయం మహా శివరాత్రి సందర్భంగా మంగళవారం తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయాన్నే దర్శనాలు, అభిషేకాలు నిర్వహించేందుకు భక్తులు బారులుదీరారు. అనంతరం రాత్రి స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. -
హరహర మహాదేవ్.. శివుడికి ప్రియాంక-నిక్ జోనాస్ దంపతుల పూజలు
Priyanka Chopra Nick Jonas Celebrate Mahashivratri In Los Angeles: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగి తనదైన ముద్ర వేసుకుంది. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా భారతీయ మూలాలను, భారతదేశ సంస్కృతిని, తన అస్థిత్వాన్ని మరిచిపోనని ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లే లాస్ ఏంజిల్స్‌లోని తమ ఇంట్లో పరమశివున్ని కొలిచింది ప్రియాంక-నిక్ జోనాస్ జంట. ఇండియాలో ఘనంగా జరుపుకునే పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. మార్చి 1 మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి పూజ చేశారు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది ప్రియాంక చోప్రా. తన ఇన్‌స్టా స్టోరీలో 'మహా శివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్. శివరాత్రి జరుపుకుంటున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు. ఓం నమః శివాయ' అంటూ శివుడి విగ్రహానికి పూజ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో ప్రియాంక గులాబీ రంగు గల సాంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, తెల్లటి కుర్తా పైజామాలో నిక్ జోనాస్ కనిపించాడు. ప్రియాంక కజిన్ దివ్య జ్యోతి కూడా ఈ వేడుకల్లో పాల్గోంది. -
విశాఖ తీరంలో కుంభాభిషేకం
-
శివయ్యకు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రత్యేక పూజలు
-
వరంగల్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు
-
భీమవరంలో మహాశివరాత్రి వేడుకలు
-
శివనామ స్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం
-
నెల్లూరులో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
-
తూర్పు గోదావరి జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
-
సర్వం శివోహం
-
కోటప్ప కొండకు భారీగా భక్తుల తాకిడి
-
రాజమండ్రి పుష్కర ఘాట్ కు పోటెత్తిన భక్తులు
-
విశాఖ జిల్లాలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
-
శ్రీకాళహస్తి: శివనామస్మరణతో మార్మోగుతున్న దక్షిణ కైలాసం(ఫోటోలు)
-
Maha Shivratri 2022: హరహర మహాదేవ
-
శివరాత్రికి ఎములాడ సిద్ధం
వేములవాడ: పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎములాడ రాజన్న ఆలయం శివరాత్రి శోభ సంతరించుకుంది. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో సోమవారం నుంచి మార్చి రెండవ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జాతరకు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా రూ. 2 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాన్ని ఇప్పటికే రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేములవాడకు చేరుకునే 5 ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేలా భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాజన్న చెంతకు చేరుకోండిలా.. రాజధాని హైదరాబాద్‌కు 150 కిలోమీటర్లు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఉంది. స్వామివారి సన్నిధికి చేరుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి ప్రతి అరగంటకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతి 10 నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చేవారు సిద్దిపేట మీదుగా.. వరంగల్ నుంచి వచ్చేవారు కరీంనగర్ మీదుగా వేములవాడ చేరుకోవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా గుడి చెరువుకట్ట కింద ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేశారు. దాదాపు 770 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, దేవస్థానం దక్షిణ ద్వారం వద్ద, పూర్వపు ఆంధ్రాబ్యాంకులో కౌంటర్ ఏర్పాటు చేశారు. లడ్డూ రూ.20, పులిహోర ప్యాకెట్ రూ.15 చొప్పున విక్రయిస్తారు. రాజన్న జాతర పూజలు మహాశివరాత్రి సందర్భంగా నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ధర్మ దర్శనం, రూ.50తో స్పెషల్ దర్శనం, రూ.100తో శీఘ్రదర్శనం చేసుకోవచ్చు. రూ.100తో కోడె మొక్కులు, రూ.200తో స్పెషల్ కోడె మొక్కులు తీర్చుకోవచ్చు. మార్చి ఒకటిన ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అక్కడి అర్చకుల ప్రత్యేక బృందం, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శివస్వాములకు, 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు (ఈ సమయంలో భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు) నిర్వహిస్తారు. జాతరకు 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
కీసరగుట్ట జాతరకు రూ.50 లక్షలు
Maha Shivratri in Telangana, 2022: మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు, వసతుల కల్పనలో అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్చార్జి కలెక్టర్ హరీష్, జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్ శ్యాంసన్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, పోలీసులు, కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి మార్చి 4 వరకు కీసరగుట్ట జాతర జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.50 లక్షలు ప్రత్యేక నిధులు విడుదల చేసిందని తెలిపారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశం, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావని, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఆలయ చైర్మన్ ఉమాపతి శర్మ, ధర్మకర్తల మండలి సభ్యుడు నారాయణ శర్మ, డీఆర్ఓ లింగ్యానాయక్, ఆర్డీఓలు రవికుమార్, మల్లయ్య, ఆలయ ఈఓ కట్ట సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. (క్లిక్: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో శాసనాల ప్రదర్శనశాల) -
నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
-
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మంత్రి వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి లవన్న శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం వైఎస్ జగన్‌ను దేవాదాయశాఖ మంత్రి, శ్రీశైలం కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. శ్రీశైలం ఈవో, ఆలయ అర్చకులు సీఎం వైఎస్ జగన్‌కు.. వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. -
ఇంద్రకీలాద్రిపై 26 నుంచి మహా శివరాత్రి మహోత్సవాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ పేర్కొంది. 26న శనివారం ఉదయం 9.30 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు, వధూవరులుగా అలంకరణ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్రహావనం, బలిహరణ, హారతి జరుగుతుంది. మార్చి 1వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు శ్రీ గంగా పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల దివ్యలీలా కల్యాణోత్సవం జరుగుతుంది. 2వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. 3వ తేదీ ఉదయం 9.30 గంటలకు దేవస్థాన యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగుస్తాయి. అనంతరం వసంతోత్సవం జరుగుతుంది. -
ఈ అభిషేకాన్ని దర్శించడం ఎన్నో జన్మల సుకృతం
‘సిరిగిరి మల్లన్నను శరణన్న చాలు పరమపాతక కోట్లు భస్మమై తూలు’ అని శ్రీశైల ప్రశస్తి. శ్రీ పర్వతం లేదా శ్రీశైలం అంటే కైలాసనాథునికి పరమ ప్రీతి. ఇక తెలుగువారికి శివుడంటే ఉన్న ప్రీతికి సాక్ష్యాలు అవసరం లేదు. అసలు త్రిలింగాల వల్లే తెలుగు పదం ఆవిర్భవించిందని కదా మన నమ్మకం. అందుకే శివాలయం లేని ఊరు మనకు తెలుగునాట కనిపించదు. మన శివాలయాల్లో విశిష్టమైన మహత్తుగల క్షేత్రం శ్రీశైలం మహాశివరాత్రి శ్రీశైలంలో రమణీయ, భక్తి భావతరంగిత చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. సర్వం శివమయంగా కనిపించే ఈ క్షేత్రాన్ని మహాశివరాత్రినాడు దర్శించడమే మహాభాగ్యం. క్షేత్రంలో ఎక్కడ ప్రతిష్ఠిత శివలింగం ఉన్నా దర్శనం చేసుకోవడానికి, అభిషేకంలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తి చూపిస్తారు. అనువైన ప్రతిచోటా అడుగడుగునా లింగార్చనలు జరుగుతూ ఉంటాయి. ఆ అభిషేకాలను చూడడమే ధన్యం అనుకున్న భక్తులు తామూ ఒక్క మారేడుదళమైనా ఆ సాంబయ్యపై ఉంచాలని పోటీపడతారు. సిద్ధులు, యోగులు, తపస్వులు ఎందరో మామూలు మానవులలో కలిసిపోయి సంచరిస్తూ ఉంటారు. ఆనందంతో నాట్యం చేసేవారు. మల్లికార్జునుని భక్తిగీతాలు పాడేవారు, శంఖాలు పూరించేవారు. వాద్యఘోషతో కైలాసనాథునికి జయజయనాదాలు చేసేవారు, పురాణ శ్రవణం చేసేవారు ఇలా అందరూ ఏదో ఒక విధంగా ఆనాటితో జన్మధన్యం అనుకుంటూ ఆనందపడేవారే. శివరాత్రి వైభవ సంప్రదాయాలు ఉద్వేగ భరిత క్షణాలు సంధ్యాసమయంలో ప్రారంభమవుతాయి అఖిలలోకాలకు ప్రభయై వెలిగే అచలేశ్వరునికి ప్రభోత్సవం సిద్ధమవుతుంది. స్వామి అమ్మవార్లు ప్రభపైకి విచ్చేస్తారు. అందమైన ప్రభపై చిత్రవిచిత్ర పుష్పాలతో అలంకరణ జరుగుతుంది. ఆదిదంపతులు పురవీధుల్లో ప్రభలపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరిస్తారు. సూర్యాస్తమయం ఆవుతుంది. శ్రీశైల ఆలయం చుట్టూ ఉండే సాలుమండపాలపై, మెట్లపై ఇతర మండపాలలో ఎక్కడ చూసినా జనమే కానవస్తారు. వారందరి ఎదురుచూపులన్నీ పాగాలంకరణ కోసమే. మరోవైపు ఆలయంలో లింగోద్భవకాల రుద్రాభిషేక ఏర్పాట్లలో అర్చకగణం మునిగిపోతుంది. లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, పాగాలంకరణ ఒకేసమయంలో ప్రారంభమవుతాయి. దివ్యతీర్థజలాలతో, విశేషద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అఖిల జగత్తుకు మూలాధారమైన ఆదిదేవునికి జరిగే ఈ అభిషేకాన్ని దర్శించడం ఎన్నో జన్మల సుకృతం. అభిషేకం పూర్తయ్యే సమయానికి కొంచెం ముందుగా పాగాలంకరణ పూర్తవుతుంది. ఒక్కసారిగా అంతటా వెలుగులు ప్రసరిస్తాయి. కళ్లముందు పాగాలంకరణతో మెరిసిపోయే స్వామి. నుదుట బాసికం పెట్టుకుని, పాగా చుట్టుకున్న మల్లన్న, భ్రమరాంబికాదేవితో కల్యాణం జరిపించుకోవడానికి చంద్రవతీ కల్యాణ మంటపానికి విచ్చేస్తాడు. లోకహితం కోసం జరిగే ఆదిదంపతుల కల్యాణోత్సవం... రెండు కన్నులు వాలని రసవత్తర ఘట్టాన్ని తిలకించాలంటే శ్రీశైలం సందర్శించాలి. మల్లికార్జునా! ఆదుకో! శివరాత్రి: ఇన్ని గంటలు శివార్చన చేస్తే పుణ్యం! -
శివనామస్మరణతో మారుమోగుతున్న కీసరగుట్ట
-
శివరాత్రి రోజున శ్వేత నాగు దర్శనం; జన్మ ధన్యం!
సాక్షి, మంచిర్యాల: జిల్లాలోని లక్సీట్టిపెట్ మునిసిపాలిటీ పరిధిలోని కోర్టు ఆవరణలో మహా శివరాత్రి పర్వదినాన పసుపునుటి సంతోష్ ఇనే వ్యక్తి ఇంటి పరిధిలో అరుదైన పెద్ద శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. కాలనీ వాసులు పెద్దఎత్తున శ్వేత నాగు పాముకు పూజలు చేసి పాలు పోశారు. మహాశివరాత్రి రోజు ఈ శ్వేత దర్శనం ఇవ్వడంతో జన్మ ధన్యమైందని భక్తులు అన్నారు. ఈ శ్వేత నాగును దర్శించుకునేందుకు కాలనీ వాసులు తరలివచ్చారు. స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో.. శ్వేతనాగును పట్టుకుని అడవిలో వదిలేశారు. చదవండి: కడతేరిన ‘ఫేస్బుక్’ ప్రేమ రిటైర్డు డీజీపీ మెయిల్ నుంచి మెసేజ్ రావడంతో.. -
మహా శివరాత్రి : భక్త జనసంద్రమైన శ్రీశైలం
-
శివరాత్రి రోజున అరుదైన శ్వేత నాగు దర్శనం
-
ఈశా వేడుకల్లో సింగర్ మంగ్లీ స్వరాలు
సాక్షి,సిటీబ్యూరో: ప్రస్తుత సంగీత ప్రపంచంలో గాయని మంగ్లీది ప్రత్యేక స్థానం అని చెప్పనవసరం లేదు. జానపదాలు మొదలు బతుకమ్మ పాటల వరకు తన గానామృతంతో అందరినీ అలరిస్తోంది. ప్రతి పండుగకు తన కొత్త పాట సందడి చేయాల్సిందే. తన యాసతో ప్రకృతి, సంస్కృతి మిళితమైన జానపదాలు మొదలు సినిమా పాటల్లోనూ దూసుకుపోతుంది. వీటితో పాటు దక్షిణ భారతదేశంలో ఎవరికీ దక్కని అవకాశం మంగ్లీకి దక్కింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అతిపెద్ద వేదికైన కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ నిర్వహించే మహాశివరాత్రి వేడుకల్లో తన గొంతును వినిపించనుంది. ప్రతి శివరాత్రికి ఈశా యోగా కేంద్రంలో ఘనంగా వేడుకలు జరగడం విదితమే. అయితే ఈసారి కోవిడ్ కారణంగా isha.sadhguru.org/msrలో ఇంగ్లిష్తో పాటు 11 భారతీయ భాషల్లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహాశివుడిని స్మరిస్తూ ఐదు పాటలు పాడనున్నట్లు మంగ్లీ తెలిపింది. కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు పార్థివ్ గోహిల్, ఆంధోని దాసన్, కబీర్ కేఫ్, సందిప్ నారాయణ్ తదితరులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
హైదరాబాద్: నేటి రాత్రి ఫ్లైఓవర్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: జగ్నేకీ రాత్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నగరంలోని ఫ్లైఓవర్లను గురువారం అర్ధరాత్రి నుంచి మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కొత్వాల్ అంజనీకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇవి అమలులో ఉంటాయి. గ్రీన్‌ల్యాండ్స్, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్లతో పాటు పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. మరోవైపు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆజాదీకి అమృత్ మహోత్సవ్ పేరుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటి నేపథ్యంలో ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజ్ ఐలాండ్, ఛాపెల్ రోడ్ టీ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, బషీర్‌బాగ్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఏఆర్ పెట్రోల్ పంపుల నుంచి వాహనాలను మళ్లిస్తారు. -
శివరాత్రి: ఇన్ని గంటలు శివార్చన చేస్తే పుణ్యం!
పరమేశ్వరునికి అత్యంత ప్రియమైనది శివరాత్రి. బ్రహ్మ విష్ణువులకు జ్ఞానబోధ చేయడానికి శివుడు లింగరూపం ధరించిన సమయం శివరాత్రి. ఇది మాఘ కృష్ణ చతుర్దశి సమయంలో జరిగింది. కనుకనే మనమంతా ఆ రాత్రిని శివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ శివరాత్రి మధ్యరాత్రిని లింగోద్భవ కాలం అంటారు. లింగోద్భవ కాలంలో ప్రపంచంలోని సకల తీర్థాలు.. దేవతాంశలన్నీ శివలింగంలో నిలిచి ఉంటాయి. అందుకే ఆ సమయంలో ప్రతీ భక్తుడూ శివలింగారాధన చేయాలి. శివలింగారాధన సకల పాపాలనూ పోగొడుతుంది. సకల పుణ్యాలను సంపాదించి పెడుతుంది. ఈ జన్మను తరింపజేస్తుంది. మరు జన్మ లేకుండా చేస్తుంది. శాశ్వత శివపదాన్ని అందిస్తుంది. శివలింగారాధన అనగానే మనందరికీ అనేక పుణ్యక్షేత్రాలు.. గొప్ప పూజలు.. అభిషేకాలు.. యజ్ఞాలు తలంపుకు వస్తాయి. శివార్చన అనేది కేవలం ఆడంబరంతో..అధికారంతో చేసేది కాదు. ఐశ్వర్యంతో సాధ్యమయ్యేది కాదు. భక్తి ప్రధానమైనది. శివరాత్రి సమయంలో ఎనిమిది జాములలో వీలుకాకపోతే ఆరు జాములలో శివార్చన చేయాలని శాస్త్రవచనం. (ఒకరోజుకు ఎనిమిది జాములు. పగలు నాలుగు జాములు.. రాత్రి నాలుగు జాములు. మన కలగణనలో నాలుగు గంటలు) శివరాత్రి ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రంతా శివనామస్మరణతో జాగరణ చేయాలి. సత్కాలక్షేపం చేస్తూ చేసేదే జాగరణ. మనసంతా మహాదేవుని నింపుకుని శివగాథలు వింటూ.. శివుని మహిమలను కీర్తిస్తూ.. శివనామం పలుకుతూ.. శివలింగాన్ని అభిషేకిస్తూ..శివార్చన చేస్తూ.. శివునికి నమస్కరిస్తూ..శివునికే తనువు, మనసును సమర్పించి సర్వం శివునిలో లయం చేయగలిగితేనే శివానుగ్రహం కలిగినట్లు. శివరాత్రి రోజున మనం చేయాల్సిన కార్యం ఇదే. అయితే సాధారణంగా శివరాత్రి అంటే అందరూ దగ్గరలో ఉండే ప్రముఖ శైవక్షేత్రం ఎక్కడ ఉంటే అక్కడకు పయనమవుతాం. కానీ మనం చేయాల్సిన పని ఒకటుంది. శివాలయం లేని ఊరుండదు. అటువంటి శివాలయం ఎంత పాతదైనా.. పాడైపోయినా.. చెట్టు చేమలు మొలిచినా దాన్ని శుభ్రం చేసి ఆ ఆలయంలో శివుని ఆరాధించుకుంటే కలిగే ఫలితం అనంతమైనది. శివరాత్రి ప్రతి శివలింగం తేజస్సుతో వెలుగులీనుతూ అందులో శివశక్తి ప్రవహిస్తుంది. కనుక అటువంటి ఆలయాలను పునరుద్ధరించి పూజించడం చాలా అవసరం. ఊరిలోని శివభక్తులంతా పూనుకొని ఈ పనిని సాధిస్తే ఆ ఊరిలోని ప్రజలందరికీ శ్రేయస్సు లభిస్తుంది. ఇవేవీ లేకపోయినా కేవలం శుద్ధజలంతో అభిషేకించినా శివుడు అమిత ప్రసన్నుడౌతాడు. శివార్చనకు తామరపువ్వు, జిల్లేడు పూలు, నల్లకలువలు చాలా ముఖ్యం. ఇవి తెచ్చే స్తోమత లేకపోతే దవనపత్రి, ఉసిరి పత్రి, మారేడు పత్రి వీటితోనైనా పూజించవచ్చు. పూజ కూడా కుదరని భక్తుడి చేతిలో శివనామస్మరణమనే ఆయుధం ఎలాగూ ఉంది. ‘ఓం నమఃశివాయ‘ అనే పంచాక్షరీ మంత్రం జపిస్తే చాలు. సమస్త పాపాలు తొలగిపోతాయి. శివరాత్రికి శివపంచాక్షరీ జపం చేసిన భక్తునికి ఎటువంటి పాపాలూ అంటవు. శివనామం భవసాగరం నుంచి తరింపజేసే నావ. ఏడేడు జన్మల పాపాలను క్షణంలో పోగొట్టే దివ్యమంత్రం. సకలదోషాలను..భూతప్రేతాలను పారద్రోలే పరమ మంత్రం. మహాదేవ అన్నా..శంభు అన్నా అన్నీ సదాశివుని అనుగ్రహాన్ని కలిగించేవే. శివనామోచ్చరణ ఫలితం అంతా ఇంతా కాదు. శివ నామాన్ని ఒక్కసారి కీర్తించినంత మాత్రం చేత మానవులు ఏడు జన్మలలో ఎప్పుడెప్పుడు చేసి ఉన్న ఏ పాపాలనుండి అయినా అతిశీఘ్రంగా విముక్తి పొందుతాడు. బుద్ధిమంతుడు ‘శి–వ’ అనే ఈ రెండక్షరాలనూ సదా ఉచ్చరిస్తూ సంసార సాగరాన్ని అవలీలగా దాటేసి, శివ సాయుజ్యం పొంది తీరుతాడు. ఇలా శివరాత్రి సమయంలో శివపంచాక్షరీ మంత్రం ఎంత ఎక్కువ జపిస్తే అంత గొప్ప ఫలితం లభిస్తుంది. కనుక శివరాత్రి వ్రతాన్ని ఆలయంలోనూ.. గృహంలోనూ.. ఇవి కుదరని వారు మనస్సులోనైనా భక్తితో జరుపుకుంటే వారు శివానుగ్రహభాగ్యులే. శివుడు వారికనుగ్రహించిన స్తోమతను బట్టి వారు శివపూజను ఆచరించుకోవచ్చు. ఇందులో తరతమభేదాలేమీ లేవు. భక్తి ముఖ్యం. భావన ముఖ్యం. శివునిపై మనసును నిలపడం ముఖ్యం. కనుక ఈ శివరాత్రిన శివునిపై భక్తిని నిలిపి చరమైన ఈ జీవితానికి స్థిరమైన లక్ష్యాన్ని ప్రసాదించమని పరమేశ్వరుని కోరుకుందాం. శివానుగ్రహం పొందుదాం. సాధారణంగా శివరాత్రి అంటే అందరూ దగ్గరలో ఉండే ప్రముఖ శైవక్షేత్రం ఎక్కడ ఉంటే అక్కడకు పయనమవుతాం. కానీ మనం చేయాల్సిన పని ఒకటుంది. శివాలయం లేని ఊరుండదు. అటువంటి శివాలయం ఎంత పాతదైనా.. పాడైపోయినా.. చెట్టు చేమలు మొలిచినా దాన్ని శుభ్రం చేసి ఆ ఆలయంలో శివుని ఆరాధించుకుంటే కలిగే ఫలితం అనంతమైనది. శివరాత్రి ప్రతి శివలింగం తేజస్సుతో వెలుగులీనుతూ అందులో శివశక్తి ప్రవహిస్తుంది. కనుక అటువంటి ఆలయాలను పునరుద్ధరించి పూజించడం చాలా అవసరం. ఊరిలోని శివభక్తులంతా పూనుకొని ఈ పనిని సాధిస్తే ఆ ఊరిలోని ప్రజలందరికీ శ్రేయస్సు లభిస్తుంది. వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠ శ్రీ భ్రామరీ హృదయలోల దయాంబురాశే శ్రీమల్లికార్జున సదాశివ చంద్రచూడ శ్రీశైలవాస మమ దేహి కరావలంబమ్ వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠ శ్రీ భ్రామరీ హృదయలోల దయాంబురాశే శ్రీమల్లికార్జున సదాశివ చంద్రచూడ శ్రీశైలవాస మమ దేహి కరావలంబమ్ శివుడు అభిషేక ప్రియుడు. కనుక ఆ రోజు పరమేశ్వరునికి ఒక చెంబెడు నీటితో అభిషేకించి.. మారేడు పత్రిని శివలింగంపై ఉంచి ఒక్క చిరుదీపాన్ని ఏ శివాలయంలో వెలిగించినా మహాదేవుడు అమితప్రీతిపాత్రుడై భక్తులను అనుగ్రహిస్తాడు. శివరాత్రి సమయంలో స్థిరలింగం, చరలింగం, మృత్తికా లింగం, బాణలింగం, స్ఫటిక లింగం ఇలా ఏ లోహంతోనైనా తయారు చేసిన శివలింగాన్ని పూజిస్తే ఆ జన్మకు ఆ ఒక్క శివరాత్రితోనే సార్థకత చేకూరుతుంది. సామాన్య భక్తులు చక్కగా మంచి పుట్టమట్టి..బంకమట్టిని తెచ్చుకొని శివలింగం తయారు చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లు, పంచదార వీటితో అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేసేటప్పుడు రుద్రనమకచమకాలనే వేదమంత్రాలను చెప్తూ చేసినా.. ఇవేవీ రానివారు పంచాక్షరీ మంత్రం పలుకుతూ చేసినా ఒకే ఫలితం కలుగుతుందని శివుడు పార్వతికి చెప్పాడు. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య, ఆధ్యాత్మిక రచయిత -
శివుడికి మూడో కన్ను నిజంగానే ఉందా?
ఏ దేవుడికీ మూడు కళ్లు లేవు... మరి శివుడికే ఎందుకు..అందవికారంగా ఉంటాడుగా మూడో కన్ను ఉంటే... శివుడికి మూడోకన్ను ఉండకపోతే ముక్కంటి ఎందుకవుతాడు... త్రయంబకేశ్వరుడు ఎలా అవుతాడు.. త్రినేత్రుడు అనే పేరును ఎలా సంపాదించుకుంటాడు.. మూడు కళ్ల శివుడు కొలువై ఉన్న ప్రదేశానికే త్య్రయంబకేశ్వరం అనే పేరు వచ్చింది. పవిత్ర గోదావరి నది అక్కడ ప్రభవించింది. తప్పు చేసినా, సాధుసజ్జనులను హింసించినా మూడో నేత్రం అగ్ని ప్రళయాన్ని సష్టిస్తుంది. మూడో కంటి గురించి పండితులు చెప్పే మాట ఇలా ఉంది... శివుడి మూడో కన్ను భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని. ప్రతి మనిషిలోను అంతర్నేత్రం ఉంటుంది. అదే అంతర్జ్యోతి, జ్ఞాన జ్యోతి ప్రసాదిస్తుంది. దానినే మనోనేత్రం అంటాం. ప్రతి మనిషిలోని జ్ఞానజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగును దర్శించుకోగలిగిన వారు మహాపురుషులు అవుతారు. మనకున్న రెండు కళ్లతో ఒక్కోసారి న్యాయమేదో అన్యాయమేదో చూడలేకపోతాం. అందుకే న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి, మనోనేత్రంతో వాస్తవాన్ని వీక్షించాలంటారు న్యాయశాస్త్రవేత్తలు. మూడో కన్ను ప్రత్యేకత... మనోనేత్రంతో కోరికలను జయించాలి. సాక్షాత్తు మన్మథుడు వచ్చి శివుడిని ప్రేరేపించటానికి ప్రయత్నించిన సందర్భంలో ఆయన ఆ కాముడిని తన మూడోకంటితో భస్మం చేశాడు శివుడు. అంటే తన మనో నేత్రంతో కామ వాంఛను జయించాడని అర్థం. అందుకే మనలోనూ మూడో నేత్రం ఉండాలంటున్నాడు శివుడు. ప్రతి సామాన్య మానవుడికి సమతుల్యత, సాధుత్వం, దూరదష్టి ఉండాలి. పరస్త్రీని తల్లిగా భావించాలి, ఇతరుల ధనం కోసం ఆశపడకూడదు, సన్మార్గంలో యశస్పు గడించాలి. ఈ మూడు లక్షణాలకు, పైన చెప్పిన మూడు గుణాలకు త్రినేత్రాలు ప్రతీకలు. మనిషిలో మూడో నేత్రం తెరుచుకున్నప్పుడు కంటికి కనిపించే వస్తువులు కాకుండా, పోతన చెప్పినట్లు పెను చీకటికి ఆవల ఉన్న పరమాత్మను దర్శించగలుగుతారని యోగీశ్వరులు చెబుతారు. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం మూడో నేత్రం గురించి, ‘ఇది జ్ఞానానికి యాంటెన్నా’ అని చెబుతున్నారు. సిద్ధి పొందటానికి ఈ మూడో నేత్రమే దోహదపడుతుందని, భౌతిక శరీరంతో జీవిస్తున్నప్పటికీ సిద్ధి కలుగుతుందని వేదాంతులు చెబుతున్నారు. అదే మూడో నేత్రం. ఒకసారి శివుడు తపోదీక్షలో నిమగ్నమైపోయాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సమయంలో పార్వతీదేవి అక్కడకు వచ్చి, శివుడిని ఆటపట్టించటానికి ఆయన రెండు కళ్లను తన చేతులతో మూసింది. వెంటనే ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది. ముల్లోకాలలోనూ అయోమయం ఏర్పడింది. స్వర్గాధిపతి కూడా భయపడ్డాడు. శివుడు తనకున్న దివ్యశక్తితో, మూడో కన్నును సృష్టించి, తన నుదుటి మీద నిలిపాడు. ఆ కంటి నుంచి అగ్ని ప్రజ్వరిల్లింది. ఆ అగ్ని వల్ల ముల్లోకాలలోనూ చీకటి తొలగింది. శివుని రెండు కళ్లను మూసిన పార్వతి రెండు చేతులూ చెమర్చాయి. పార్వతిపరమేశ్వరుల కారణంగా ఏర్పడిన చెమట ఒక బాలుడిగా పరిణమించింది. ఆ బాలుడే అంధకుడు. మహాదేవుని పరమభక్తుడైన ఒక దానవుడు, అంధకుడిని దత్తతు తీసుకున్నాడు. ఆ కథ వేరు. – డాక్టర్ వైజయంతి పురాణపండ -
నేడు గుడివాడకు సీఎం జగన్
సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్ గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటిస్తారు. గుడివాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. గురువారం ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరి 11.30–11.50 గంటల మధ్య గుడివాడ మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.