సంగారెడ్డి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అంకురార్పణ, ధ్వజారోహణం, శిఖర పూజా కార్యక్రమాలతో జాతర ప్రారంభమైంది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజలతో పాటు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు.
అనంతరం స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శశిధర్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, నాయకులు సంతోష్ కుమార్ పాటిల్, రుద్రయ్య స్వామి, గాలప్ప పాటిల్, నరేందర్ రెడ్డి, దత్తు పాల్గొన్నారు.
ఇవి చదవండి: ఆకాశం నుంచి పడిన మంత్రపు పెట్టె.. రూ.50కోట్లంటూ..
Comments
Please login to add a commentAdd a comment