హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం! : బీబీ పాటిల్‌ | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం! : బీబీ పాటిల్‌

Published Mon, Mar 25 2024 9:15 AM | Last Updated on Mon, Mar 25 2024 11:10 AM

- - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న బీబీ పాటిల్‌

మళ్లీ కేంద్రంలో బీజేపీదే అధికారం

బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్‌

సంగారెడ్డి: సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్‌ ఆరోపించారు. మండల పరిఽధి మామిడ్గి గ్రామ శివారులోని ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం రాత్రి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు పాండురంగారెడ్డి, పాండురంగారావు పాటిల్‌, శ్రీనివాస్‌రెడ్డి, మల్లప్ప ఆధ్వర్యంలో బసంత్‌పూర్‌, రాజోల, గంగ్వార్‌, గణేష్‌పూర్‌, మామిడ్గి తదితర గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు.

అనంతరం బీబీ పాటిల్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి మళ్లి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 400 కంటే అధిక స్థానాలు ఎన్‌డీఏ కూటమి గెలుచుకుంటుందన్నారు. తెలంగాణలోనూ బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తనకు మరో సారీ అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జహీరాబాద్‌ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో నాయకులు సుధీర్‌ కుమార్‌ బండారి, జగన్నాథ్‌, జనార్దన్‌రెడ్డి, ఓంకార్‌, మల్లేశం, రాహుల్‌, సతీష్‌గుప్త, అరవింద్‌ చౌహన్‌ పాల్గొన్నారు.

ఇవి చదవండి: బీజేపీ వరంగల్‌ అభ్యర్థిగా ‘అరూరి’..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement