bb patil
-
ప్రశ్నల టార్గెట్‌కి.. బీబీ పాటిల్ ధీటుగా సమాధానం!
సాక్షి, కామారెడ్డి: జహీరాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విమర్శలకు పదును పెడుతున్నాయి. రెండుసార్లు ఎంపీగా గెలిచిన పాటిల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయన కనీసం నాయకులను కూడా గుర్తు పట్టరని ఆరోపణలు చేస్తున్నారు. అయితే పాటిల్ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోకుండా, చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారంలో సాగిపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూ ల్ విడుదల కాకముందే జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరా రు చేశాయి. బీజేపీనుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బరిలో దిగగా.. కాంగ్రెస్‌నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, బీఆర్ఎస్నుంచి వేణు గోపాల్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి న బీబీ పాటిల్.. రెండుసార్లూ విజయం సాధించారు. తొలిసారి బరిలో నిలిచినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌పై 1,44,631 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం స్వల్ప ఓట్లతో గట్టెక్కారు. కాంగ్రెస్ అభ్యర్థికన్నా 6,229 ఓట్లే ఎక్కువ వచ్చాయి. అయితే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నా తన మెజారిటీ తగ్గిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల తర్వాత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో సంబంధాలు అంతంత మాత్రమయ్యాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో పాటిల్ పార్టీ మారాలని నిర్ణయించుకుని బీజేపీ జాతీయ నాయకులను కలిసి, కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన నాటి నుంచే నియోజకవర్గం అంతటా విస్తృతంగా పర్యటిస్తున్న పాటిల్.. ఆయా ప్రాంతాల్లోని బీజేపీ నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ వారి సహకారాన్ని అభ్యర్థిస్తున్నారు. దీంతో కాషాయ పార్టీ నేతలంతా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీకి ద్రోహం చేశాడంటున్న బీఆర్ఎస్.. బీబీ పాటిల్‌ను రెండుసార్లు గెలిపిస్తే ఆయన పార్టీకి ద్రోహం చేశాడని బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ఎంపీ గా ప్రజలకు అందుబాటులో ఉండకుండా, నాయకులు, కార్యక ర్తలను పట్టించుకోకుండా నిర్ల క్ష్యం చేయడమే గాక స్వార్థం కోసం పార్టీ మారాడంటూ వి మర్శిస్తున్నారు. ఇటీవల జిల్లా లో పర్యటించిన మాజీ మంత్రి హ రీష్రావుతో పాటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఎంపీ పాటిల్‌పై ఒంటి కాలిమీద లేస్తున్నారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే అయితే తన ఓటమికి పాటిలే కారణమంటూ కంటతడి కూడా పెట్టుకున్నారు. ఇదిగో అభివృద్ధి అంటున్న పాటిల్.. కాంగ్రెస్, బీఆర్ఎస్లు విమర్శలతో దాడి చే స్తుండగా.. బీబీ పాటిల్ మాత్రం తన ప్రచారం తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మూ డోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీబీ పాటిల్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎంపీగా తాను చేసిన అభివృద్ధి ఇది అంటూ ఓ జాబితాను రూపొందించి కరపత్రాల రూపంలో జనం ముందుంచుతున్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు నిధుల మంజూరుతో పాటు జాతీయ రహదారుల అభివృద్ధి, గ్రామీ ణ ప్రాంతాలకు కేంద్ర నిధులతో రహదారులు, ఇంకా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో కేంద్ర ప్ర భుత్వ నిధులతో చేపట్టిన పనులను వివరిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలపై ప్రత్యక్షంగా ఎక్కడా స్పందించకుండానే.. చేసిన అభివృద్ధిని వివరిస్తూ, మరోసారి ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ప్రచార పర్వంలో సాగిపోతున్నారు. ఫెయిల్యూర్ ఎంపీ అంటూ.. రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన బీబీ పాటిల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి దామో దర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావ్, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు సమావేశాల్లో ఎంపీ పాటిల్‌ను టార్గెట్ చేస్తూ మా ట్లాడుతున్నారు. ‘బీబీ పాటిల్ కాదు.. బిజి నెస్ పాటిల్’ అని విమర్శిస్తున్నారు. ఇవి చదవండి: మోదీ హయాంలోనే సురక్షితం -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం! : బీబీ పాటిల్
సంగారెడ్డి: సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్ ఆరోపించారు. మండల పరిఽధి మామిడ్గి గ్రామ శివారులోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పాండురంగారెడ్డి, పాండురంగారావు పాటిల్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లప్ప ఆధ్వర్యంలో బసంత్‌పూర్, రాజోల, గంగ్వార్, గణేష్‌పూర్, మామిడ్గి తదితర గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. అనంతరం బీబీ పాటిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి మళ్లి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 400 కంటే అధిక స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందన్నారు. తెలంగాణలోనూ బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తనకు మరో సారీ అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జహీరాబాద్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో నాయకులు సుధీర్ కుమార్ బండారి, జగన్నాథ్, జనార్దన్‌రెడ్డి, ఓంకార్, మల్లేశం, రాహుల్, సతీష్‌గుప్త, అరవింద్ చౌహన్ పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ వరంగల్ అభ్యర్థిగా ‘అరూరి’.. -
బీజేపీలో చేరిన బీబీ పాటిల్ కండువా కప్పి ఆహ్వానించిన ఛుగ్, లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌లు పాటిల్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా, జహీరాబాద్ లోక్‌సభ టికెట్‌పై పాటిల్‌కు నడ్డా హామీ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీలో చేరడానికి ముందే బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. జహీరాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, అయితే మరింత అభివృద్ధిని కాంక్షిస్తూ తాను బీజేపీలో చేరానని తెలిపారు. బీఆర్ఎస్ మునుగుతున్న నావ అని, త్వరలో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కె.లక్ష్మణ్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్ బీబీబీ.. అంటే బాప్, బేటా, బిటియా (తండ్రి, కుమారుడు, కూతురు) పార్టీగా మారిందని తరుణ్ ఛుగ్ ఎద్దేవా చేశారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. బీజేపీలోకి ఎంపీ బీబీ పాటిల్
-
బీఆర్ఎస్కు మరో షాక్.. బీజేపీలోకి ఎంపీ బీబీ పాటిల్
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీలోకి చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో చేరారు. జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాటిల్ బరిలోకి దిగనున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్‌రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్‌నగర్- డీకే అరుణ, నాగర్‌కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. -
బీఆర్ఎస్ ఎంపీకి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదని ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్ నేత మదన్మోహన్రావు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని పాటిల్ హైకోర్టులో ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేశారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం పాటిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. మెయిన్ పిటిషన్(మదన్మోహన్ దాఖలు చేసిన)లో రోజూవారీగా వాదనలు వింటామని పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుపై 6 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే జార్ఖండ్‌లో పాటిల్‌పై ఓ క్రిమినల్ కేసు నమోదైందని, ఆ వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొలేదని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని మదన్మోహన్రావు హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి 2022 జూన్‌లో ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. అయితే దీన్ని మదన్మోహన్రావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తెలంగాణ హైకోర్టు జూన్ 15న మౌఖిక తీర్పు ఇచ్చిందని, 3 నెలలైనా తీర్పు ప్రతిని బహిర్గతం చేయలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. తీర్పు ప్రతులు ఇవ్వకపోవడం సరికాదని, తీర్పు ఉత్తర్వులు లేకుండా తాము వాదనలు వినలేమని, ఆరు నెలల్లోపు వేగవంతంగా కేసును పరిశీలించి తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సూచించింది. దీంతో విచారణను సీజే ధర్మాసనం చేపట్టింది. -
‘బీబీ పాటిల్ ఎన్నిక’ పిటిషన్ పునఃవిచారించండి
సాక్షి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ గెలుపును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌ను పునః విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ మదన్మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించింది. చదవండి: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. లాభాల బోనస్ ప్రకటన హైకోర్టు జూన్ 15న మౌఖికంగానే తీర్పు చెప్పిందని పూర్తి తీర్పు ప్రతులు బహిర్గతం చేయకపోవడంతో విచారణ, వాదనలు వినడం వృథా అని ధర్మాసనం స్పష్టంచేసింది. కోర్టు తీర్పునకు వేచి ఉండాలని ఆదేశించలే మని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును పక్కనపెట్టి పునఃవిచారించాలని పేర్కొంది. కేసుపై హైకోర్టు సీజే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అక్టోబర్ 10న అన్ని పార్టీలు హైకోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. ఎన్నికల్లో గెలిచిన పాటిల్ తన అఫిడవిట్లో క్రిమి నల్ కేసుల వివరాలు పొందపరచలేదని మదన్మోహన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. -
జహీరాబాద్ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు
జహీరాబాద్ : స్థానిక రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుధీర్ఘ కాలం తర్వాత పెండింగ్ పనులు చేపట్టారు. జిల్లాలోనే ఏకైక అతిపెద్దది కావడంతో మోడల్ రైల్వే స్టేష¯Œ గా తీర్చిదిద్దేందుకు 2010 సంవత్సరంలో నిధులు మంజూరు చేశారు. అప్పట్లో స్టేషన్ లో పలు అభివృద్ధి పనులు చేపట్టినా ప్రధాన పనులను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత పెండింగ్ పనులకు మోక్షం కలిగింది. ప్రస్తుతం సుమారు రూ.3 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రైల్వే స్టేషన్ జహీరాబాద్ పట్టణం నడి బొడ్డున ఉండడంతో రెండు వైపుల ప్రాంతాలకు వెళ్లి, రావడం కష్టంగా మారింది. అండర్ బ్రిడ్జిలను నిర్మించినా అవి ఏ మాత్రం సౌకర్యంగా లేకపోవడంతో ప్రజలు స్టేషన్ కు ఇరు వైపులా వెళ్లేందుకు రైల్వే ట్రాక్‌ను దాటుతున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్ పనులను పూర్తి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకల్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండో ప్లాట్‌ఫాంలను ప్రారంభించి వినియోగంలోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ మేరకు పనులు చురుకుగా సాగుతుండడంతో ప్రజలు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జహీరాబాద్ రైల్వే స్టేషన్ లో 26 రైళ్లు ఆగుతున్నాయి. ఆయా రైళ్లలో ప్రయాణించే వారికి ఇప్పుడు నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండో ప్లాట్‌ఫాం సౌకర్యంగా మారనుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జితో తీరనున్న ఇబ్బందులు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో జహీరాబాద్ పట్టణ ప్రజల, ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. పట్టణంలోని రెండు వైపులా ప్రాంతాలకు రాక పోకలు సాగించే ప్రజలకు ఇక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉపయోగపడనుంది. నిలుచున్న రైళ్ల కింద నుంచి దాటుకుని వెళ్లే ఇబ్బందులు ఇక శాశ్వతంగా దూరం కానున్నాయి. పాఠశాల విద్యార్థులు, వ్యాపారులు, ఉపాధి కోసం ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి ఎంతో సౌకర్యంగా మారనుంది. రెండో ప్లాట్‌ఫాంతో సౌకర్యం ప్రస్తుతం స్టేషన్ లో ఒకే ప్లాట్ ఫాం ఉండడంతో రెండో ప్లాట్‌ఫాంపై నిలిచే రైళ్లలో నుంచి కిందిగి దిగే సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లగేజీని తీసుకుని కిందికి దిగే అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. రెండో ప్లాట్‌ఫాం నిర్మాణం జరగనందునే ఈ పరిస్థితి కలుగుతోంది. ప్రస్తుతం రెండో ప్లాట్‌ఫాం పనులు వేగంగా సాగుతున్నాయి. పనులు చివరి దశలో ఉన్నాయి. పనులు పూర్తయితే ప్రయాణికులు రైలులో నుంచి కిందికి దిగేందుకు సౌకర్యంగా మారనుంది. ఆకట్టుకుంటున్న బొమ్మలు జహీరాబాద్ రైల్వే స్టేషన్ కు రంగులద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది కళాకారులు స్టేషన్ లో గోడలపై రంగులు, బొమ్మలు వేసే పనులు చేపట్టారు. పర్యావరణం, నీటి పొదుపు, ప్లాస్టిక్ వాడకం వద్దు, స్వచ్ఛ భారత్, పచ్చదనం తదితర వాటి ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా చిత్రాలు, నినాదాలతో తీర్చిదిద్దుతున్నారు. అంతే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉపయోగపడే జంతువులు, పక్షుల చిత్రాలను ప్లాట్ ఫాం గోడలు, స్టేషన్ గోడలపై తీర్చిదిద్దుతున్నారు. రేల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులను ఆయా చిత్రాలు ఆకట్టుకోనున్నాయి. ప్రజల ఇబ్బందులు తీరనున్నాయి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండో ప్లాట్‌ఫాం నిర్మాణం పనులు త్వరలో పూర్తై వినియోగంలోకి రానున్నాయి. వీటిని పూర్తి చేయించేందుకు నేను ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడా. రైల్వే శాఖ అధికారులు సానుకూలంగా స్పందించి పనులను ప్రారంభించారు. పనులు త్వరలో పూర్తి చేయించి ప్రారంభింపజేసి ప్రజలకు ఉపయోగంలోకి తెస్తాం. ప్రయాణికులతో పాటు పట్టణ ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగనుంది. –బీబీ పాటిల్,జహీరాబాద్ ఎంపీ -
టీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్
సాక్షి, జహీరాబాద్ : జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించనందున ఎన్నిక రద్దు చేయాలని కోరారు. మదన్ మోహన్ రావు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రతివాదులుగా బీబీ పాటిల్, ఎన్నికల కమిషన్, టీఆర్ఎస్ పార్టీలను పిటిషన్లో చేర్చారు. విచారించిన హైకోర్టు ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా, మదన్ మోహన్‌రావు 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి బీబీ పాటిల్ చేతిలో ఓడిపోయారు. -
కథ కంచికేనా !
సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్) : బోధన్–బీదర్ రైల్వే లైన్ నిర్మాణానికి ఐదేళ్ల క్రితం సర్వే చేసి కేంద్రం చేతులు దులుపుకొంది. కొత్తగా మరో రైలు మార్గ సర్వేకు అనుమతించింది. నాందేడ్ నుంచి బీదర్‌కు కొత్త రైలు మార్గానికి అనుమతించి, సర్వే చేసేందుకు నిధులను కేటాయించింది. దీంతో బోధన్–బీదర్ రైలు మార్గం కథ కంచికేనా అంటూ ఈ ప్రాంత వాసులు ఆవేదన చెందుతున్నారు. కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో బోధన్–బీదర్ రైలు మార్గానికి నిధుల కేటాయింపు ఊసెత్తకపోవడం ఇందుకు నిదర్శనం. తెలంగాణలో 8 దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బోధన్–బీదర్ రైల్వే లైన్‌కు నిధుల కే టాయింపునకు మోక్షం లభించడం లేదు. అసంపూర్తిగా ఉన్న బోధన్ రైల్వేలైన్‌ను బీదర్ వరకు పొడిగిస్తే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో లబ్ది చేకూరుతుంది. 2010 రైల్వే బడ్జెట్లో సర్వేకు అనుమతి లభించగా, 2011 ఏప్రిల్ నెలలో సర్వే చేయడం ప్రారంభమైంది. బోధన్ రైల్వే స్టేషన్ నుంచి రుద్రూర్, వర్నీ, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం మీదుగా నారాయణఖేడ్, బీదర్ వరకు సర్వే నిర్వహించారు. బోధన్ నుంచి బీదర్ వరకు 138 కిలోమీటర్ల దూరం ఉండగా, 2014లో సర్వే పూర్తయింది. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. కేవలం రూ.1,029 వ్యయంతో లైన్ వేయవచ్చని అధికారులు తేల్చారు. 2014లో సర్వే పూర్తవడంతో, ప్రతీ ఏడాది రైల్వే బడ్జెట్లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని సర్వత్రా భావించారు. కానీ ఇప్పటి వరకు ఐదేళ్ళుగా ఐదు బడ్జెట్లు పూర్తయినా, నయా పైసా నిధులు కూడా మంజూరు కాలేదు. కేంద్రం దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బోధన్–బీదర్ రైల్వే లైన్‌కు మొండి చేయి చూపిస్తోంది. అయితే ఈ మార్గంలో సర్వే పూర్తయిన ందున రాష్ట్రప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే, మరో 50శాతం కేంద్రం కేటాయిస్తుందని, సుమారు 2వేల కోట్ల ప్రాజెక్ట్ అని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. కొత్తగా నాందేడ్ నుంచి బీదర్‌కు సర్వే ఇదిలా ఉండగా, బోధన్–బీదర్ రైల్వే లైన్ నిధులు పెండింగ్‌లోనే ఉండగా, కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో నాందేడ్–బీదర్ రైల్వే లైన్‌కు సర్వే నిర్వహించేందుకు అనుమతించింది. 155 కిలోమీటర్ల నిడివి గల ఈ రైలు మార్గానికి రూ.5,152 కోట్ల నిధులు అవసరం. నాందేడ్ నుంచి నాయెగాంవ్, దెగ్లూర్, ఔరాద్ల మీదుగా ఈ రైలు మార్గానికి సర్వే నిర్వహించనున్నారు. వాస్తవానికి బోధన్ నుంచి బీదర్‌కు రైలు లైను ఏర్పాటు చేస్తే నాందేడ్ నుంచి జానకంపేట, బోధన్ మీదుగా బీదర్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ రైలు మార్గాన్ని పక్కన పెట్టి కొత్తగా మరో రైలు మార్గం కోసం సర్వే చేయడం పట్ల ఈ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ళ క్రితమే బోధన్–బీదర్ రైలు మార్గం సర్వే పూర్తవగా ఇప్పటికీ నిధులు కేటాయించకుండా, మళ్ళీకొత్త మార్గానికి సర్వే చేయడంపై విమర్శలు వస్తున్నాయి. బోధన్–బీదర్ రైల్వే లైన్ సమగ్ర వివరాలు ► రైల్వే లైన్ పొడవు : 138 కిలో మీటర్లు ► రైల్వే లైన్ వెళ్ళే రాష్ట్రాలు : తెలంగాణలో 90 కిలో మీటర్లు, మహారాష్ట్ర,కర్ణాటకలో 48 కిలోమీటర్లు ► లబ్ధిపొందే జిల్లాలు : నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, బీదర్ ► రైల్వే లైన్ ప్రతిపాదించింది : నిజాం సర్కార్ హయాంలో (1938) ► ప్రతిపాదనలు ముందుకు సాగింది : కాంగ్రెస్ సర్కార్ హయాంలో (2010లో కేంద్ర మంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించారు) ► సర్వే పూర్తయిన సంవత్సరం : 2014 ► రైల్వే లైన్‌కు అవసరమైన నిధులు : 2014లో రూ.1,029 కోట్లు అవసరం ► ప్రస్తుత అంచనా వ్యయం : 2వేల కోట్లు ► నిధుల కేటాయింపు ఇలా : వెయ్యి కోట్ల నిధులు (రాష్ట్ర ప్రభుత్వం), వెయ్యి కోట్ల నిధులు (కేంద్ర ప్రభు త్వం) రాష్ట్ర ప్రభుత్వం 50శాతం నిధులివ్వాలి బోధన్–బీదర్ రైలు మార్గానికి సర్వే పూర్తయింది. రూ.2వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉంది. మారిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 50శాతం నిధులు కేటాయిస్తే, 50శాతం కేంద్రం మంజూరు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే ప్రాజెక్ట్ ముందుకు సాగుతుంది. – బీబీ పాటిల్, ఎంపీ, జహీరాబాద్ -
టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడిగా ఎవరు ఉంటారనేది ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది. కీలకమైన నేతలు ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ మొదలైంది. గత లోక్‌సభలో టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేతగా ఉన్న ఎ.పి.జితేందర్‌రెడ్డికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. టీఆర్ఎస్ కీలకనేతగా గుర్తింపు ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్ సీనియర్ ఎంపీగానూ ఉండేవారు. ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన కల్వకుంట్ల కవిత సైతం పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తరుపున గెలిచిన 9 మంది ఎంపీలలో ఉన్న బి.బి.పాటిల్, ప్రభాకర్‌రెడ్డి, దయాకర్, నామా నాగేశ్వర్‌రావులో ఒకరికి టీఆర్ఎస్ఎల్పీ నేతగా అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ ముఖ్యలు చెబుతున్నారు. వారంలోపే కొత్త ఎంపీలతో సమావేశం నిర్వహించి లోక్‌సభ పక్షనేత ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. -
‘16 లేదు.. కారు లేదు.. సారు లేడు’
సాక్షి, సంగారెడ్డి : పదహారు లేదు.. కారు లేదు.. సారు లేడు ఇవి జాతీయ ఎన్నికలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజ నరసింహ్మ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావుకు మద్దతుగా సోమవారం రాజ నరసింహ్మ అధ్వర్యంలో పుల్కల్ మండలం శివ్వంపేట నుంచి అల్లాదుర్గం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ నరసింహ్మ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీకి.. నరేంద్ర మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని స్పష్టం చేశారు. చౌకీదార్ నరేంద్ర మోదీ ఒక చోర్ అని ఆరోపించారు. ఈ ప్రాంత సింగూర్ నీటిని దొంగిలించి కొడుకు, కూతురు జిల్లాలకు తీసుకుపోయిన నీటి దొంగ కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ అని.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేసే యువ నాయకుడు రాహుల్ గాంధీ అని ఆయనస స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఓటుతో కేసీఆర్‌కు గుణపాఠం చెబుతారని తెలిపారు. దగాచోర్ బి. బి. పాటిల్ : మదన్ మోహన్ రావు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన బి. బి. పాటిల్ ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఎంపీ హోదాలో ఉండి భూ కబ్జాలు చేసి.. మూడు అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ధగా చోర్ బి. బి. పాటల్ అని ఆరోపించారు -
‘మరోసారి ఆశీర్వదించండి’
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తనను మరోసారి ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ కోరారు. తాడ్వాయిలో ఆదివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పాస్‌పోర్టు కార్యాలయం మంజూరుకు తన వంతు కృషి చేశానన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయిస్తానని హామీ ఇచ్చారు. బీబీపాటిల్‌ను భారి మెజారిటీతో గెలిపించాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలన్నారు. ఎంపీపీ బసంత, జెడ్పీటీసీ మద్ది సావిత్రి, రుద్రమదేవి, రవీందర్‌రెడ్డి సతీమణి మంజుల, పులుగం సాయిరెడ్డి, మహేందర్‌రెడ్డి, శ్యాంరావు, వెంకట్రాంరెడ్డి, సాయిరెడ్డి, గడ్డం రాంరెడ్డి, నర్సారెడ్డి, గోపాల్‌రావు, రఘుపతిరెడ్డి, సంజీవులు, నర్సింలు, జైపాల్‌రెడ్డి, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమానికే పెద్దపీట
సాక్షి, జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావులు అన్నారు. శనివారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని పద్మశాలి కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్‌తో పాటు పలువురికి బీబీ పాటిల్, ఫరీదుద్దీన్, మాణిక్‌రావులు కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సాధిస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై అనేక మంది టీఆర్ఎస్లోకి వచ్చి చేరుతున్నారన్నారు. దీంతో ఆయా పార్టీలు ఖాళీ అవుతున్నాయన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ టీఆర్ఎస్లో చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల నాటికి చేరికలు మరింత ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అంతకుముందు మొగుడంపల్లి మండలంలో మోటారు సైకిల్ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్, మార్కెట్ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఎంపీపీ చిరంజీవిప్రసాద్, జెడ్పీటీసీ కిషన్‌రావుపవార్, పీఏసీఎస్ చైర్మన్ సంజీవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎం.శివకుమార్, ఆర్.దశరథ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మురళికృష్ణాగౌడ్, మంకాల్ సుభాష్, జనార్ధన్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్తోనే కాళేశ్వరానికి జాతీయ హోదా
సాక్షి, అల్లాదుర్గం(మెదక్): కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలంటే టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ అన్నారు. శుక్రవారం సాయంత్రం అల్లాదుర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రం ఇస్తుందని, 10 శాతం రాష్ట్రం నిధులిచ్చి నిర్మిస్తుందని చెప్పారు. జాతీయ రహదారులు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. సంగారెడ్డి నుంచి మంగ్లూర్ వరకు 161 జాతీయ రహదారిగా చేసి నాలుగులైన్ల రోడ్డుకు 3 వేల కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. దీనికి పక్కనే ఉన్న జాతీయ రహదారి పనులే నిదర్శనమన్నారు. బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, అల్లాదుర్గంలో సీఎం కేసీఆర్ సభ విజయవంతం అయిందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా బీబీ పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాశీనాథ్, అనిల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, నారాయణ, టీవీ నటి ఉమా, జాగృతి అధ్యక్షురాలు మల్లిక, స్థానిక సర్పంచ్ అంజయ్య యాదవ్, సుభాశ్‌రావ్ పాల్గొన్నారు. వట్పల్లి మండల కేంద్రమైన వట్పల్లిలో జహీరాబాద్ శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటీల్ అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి రోడ్‌షో చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బుద్దిరెడ్డి, సర్పంచ్‌లు సురేఖ, ఖయ్యుం, ఎంపీటీసీలు శివాజీరావ్, అప్పారావ్, కోఆప్షన్ సభ్యుడు కూత్బొద్దీన్, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ అశోక్‌గౌడ్, నాయకులు మధు, ప్రభాకర్, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
కారు స్పీడ్ మీదుంది: ఎంపీ బీబీ పాటిల్
సాక్షి, భిక్కనూరు: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఆదివా రం మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఎంపీ మాట్లా డుతూ కారు స్పీడ్ మీదుంది.. అడ్డగించడం కూటమి తరం కాదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా పథకం పథకాలు ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయని, ఐక్యరాజ్యసమితి కూడా రైతుబీమా పథకం బేషుగ్గా ఉందని కితాబు ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ పథకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందితే కూటమి నేతలకు అవి కనిపించడం లేదన్నారు. భారీగా కదలి వచ్చిన ప్రజలు మండల కేంద్రలో టీఆర్ఎస్ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు. భిక్కనూరు దళితవాడలో ప్రారంభమైన రోడ్ షో మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. దారి పొడవునా మహళలు గంప గోవర్ధన్‌కు మంగళహారతులతో స్వాగతం పలికారు. మండల కేంద్రానికి చెందని వ్యాపారీ నర్పత్సింగ్ తన కారుపై పెద్ద బతుకమ్మను పెట్టి రోడ్ షోలో పాల్గోనడం పలువురిని ఆకర్షించింది. టీఆర్ఎస్ నేతలు నంద రమేష్, సుదర్శన్, అమృత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, నర్సింహరెడ్డి, బండి రాములు, గంగళ్ల భూమయ్య, పాల రాంచంద్రం, దుర్గారెడ్డి, వెంకట్‌రెడ్డి, వంగేటి చిన్ననర్సరెడ్డి, బల్వంత్‌రావు, కమలాకర్, డాక్టర్ సత్యనారాయణ, తున్కి వేణు, సంజీవరెడ్డి, భగవంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
సాక్షి,బిచ్కుంద(జుక్కల్): టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు, కొత్త మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి అభ్యర్థుల గెలుపునకు కా ర్యకర్తలు కృషి చేయాలని జ హీరాబాద్ ఎంపీ బీబీ పాటి ల్, జెడ్పీ చైర్మన్ దఫెదార్ రా జు అన్నారు. మంగళవారం బిచ్కుందలో కార్యకర్తలో స మావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాల్లో ప్రజల నుంచి సానుకూలంగా స్పందన వస్తుందన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందన్నారు.రూ.17 వేల కోట్లు రైతు రుణమాఫీ చేయడం జరిగిందని టీఆర్ఎస్ కొత్త మేనిఫెస్టో అన్ని వ ర్గాల ప్రజలకు లబ్దిచేకూరే విధంగా ఉందన్నారు. అనంతరం కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర కన్వినర్ రాజేశ్వర్ ఎంపీ బీబీ పాటిల్ సమక్షంలో టీఆర్ఎస్ పా ర్టీలో చేరారు. పదిహేడేళ్లుగా నా వెన్నంటే ఉంటు న్న కార్యకర్తలు, అభిమానుల రుణం ఎన్నటికి తీ ర్చుకోలేనిదని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే అ న్నారు. మంగళవారం బిచ్కుందలో కార్యకర్తల స మావేశం నిర్వహించారు. మరోసారి అవకాశం క ల్పిస్తే బిచ్కుందలో వంద పడకల ఆస్పత్రి, జుక్క ల్, నిజాంసాగర్‌లో 30 పడకల ఆస్పత్రి, పిట్లం లో 50 పడకల ఆస్పత్రి కట్టుకోవాల్సి ఉందన్నా రు. కాళేశ్వరం నీళ్లు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్నాయి అక్కడి నుంచి లెండి కాలువలకు అ నుసంధానం చేస్తామన్నారు. జెడ్పీ చైర్మన్ దఫే దార్ రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జుక్కల్, బిచ్కుంద జెడ్పీటీసీ సభ్యులు సాయిరాం, మాధవరావు దేశాయి, ఏఎంసీ చైర్మ న్లు నా ల్చర్ రాజు, వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్మన్ సాయా గౌడ్, ఎంపీపీ లలిత అశోక్ పటేల్ ఉన్నారు. -
తెలంగాణ శకటానికి అవకాశమివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శనకు అవకాశమివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్ కోరారు. సోమవారం అరుణ్ జైట్లీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసిన ఎంపీలు.. తెలంగాణలో ఎయిమ్స్, ఐఐఎం ఏర్పాటుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి మూడో విడత నిధులు కేటాయించాలని, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు వివిధ దశల్లో ఎంపికైన తెలంగాణ బతుకమ్మ శకటాన్ని చివరి దశలో కేంద్ర రక్షణ శాఖ తిరస్కరించిన విషయం తెలిసిందే. -
భాషరాని వారు..ఏం సేవచేస్తారు!
టీఆర్ఎస్ను వ్యాపారసంస్థగా మార్చిన కేసీఆర్ జహీరాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌షెట్కార్ కోటగిరి, న్యూస్‌లైన్ : భాషరాని బీబీపాటిల్‌కు జహీరాబాద్ లోక్‌సభ టికెట్ ఇచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని వ్యాపార సంస్థగా మార్చారని జహీరాబాద్ కాం గ్రెస్ పార్టీ అభ్యర్థి సురేశ్‌షెట్కార్ విమర్శించారు. శుక్రవారం ఆయన కోటగిరిలో విలేకరులతో మాట్లాడారు. డబ్బులున్న వారికి టికెట్లు ఇస్తూ, జెండాలు మోసిన వారికి అన్యాయం చేసిన కేసీఆర్‌కు ఇతర పార్టీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గతంలో బీబీపాటిల్ బీజేపీలో చేరినట్లు ప్రకటనలు చేసి, ఆ పార్టీ కండువాను కూడా వేసుకున్న ఆయనను కేసీఆర్ దరిచేర్చుకొని డబ్బులకు టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. రెండు లోక్‌సభ సీట్లున్న కేసీఆర్ తెలంగాణ ఎలా సాధిం చారో, ఎవరివల్ల తెలంగాణ వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కృషిచేసిన సోనియాగాంధీని ఆకాశానికి ఎత్తి వారి ఇంటికి వెళ్ళిన కేసీఆర్ అనంతరం సోనియాను దెయ్యం,భూతం అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. డబ్బులిస్తే కేసీఆర్ దేనికైనా సిద్ధమేనని విమర్శించారు. చంద్రబాబు ఊసరవెల్లి తెలంగాణపై రెండు ప్రాంతాల్లో రెం డువిధాలుగా వ్యవహరించిన టీ డీ పీ అధినేత చంద్రబాబు ఊసరవె ల్లి అని విమర్శించారు. అధికార దా హంతో తెలంగాణలో,సీమాంధ్రలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే తపనతో మతతత్వపార్టీ అయిన బీజేపీతో జతకట్టడం శోచనీయమన్నారు. తెలంగాణలో తమ పార్టీ లేఖ ఇవ్వడం వల్లనే తెలంగాణ ఏర్పడిందని చెబుతూ, సీమాంధ్రలో తెలంగాణను అడ్డుకుంది మొదటి నుంచి తమపార్టీయేనని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడన్నారు. చంద్రబాబును రెండు ప్రాంతాల ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఈ ప్రాంత ప్రజలు చేతి గుర్తుకు ఓటేసి కృతజ్ఞతలు తెలుపాలన్నారు. సమావేశంలో బాన్సువాడ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్, కాంగ్రెస్ నాయకులు పవన్,మహ్మద్,రాజ్దేశాయ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.