
సాక్షి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ గెలుపును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌ను పునః విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ మదన్‌మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించింది.
చదవండి: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. లాభాల బోనస్ ప్రకటన
హైకోర్టు జూన్ 15న మౌఖికంగానే తీర్పు చెప్పిందని పూర్తి తీర్పు ప్రతులు బహిర్గతం చేయకపోవడంతో విచారణ, వాదనలు వినడం వృథా అని ధర్మాసనం స్పష్టంచేసింది. కోర్టు తీర్పునకు వేచి ఉండాలని ఆదేశించలే మని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును పక్కనపెట్టి పునఃవిచారించాలని పేర్కొంది. కేసుపై హైకోర్టు సీజే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అక్టోబర్ 10న అన్ని పార్టీలు హైకోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. ఎన్నికల్లో గెలిచిన పాటిల్ తన అఫిడవిట్‌లో క్రిమి నల్ కేసుల వివరాలు పొందపరచలేదని మదన్‌మోహన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment