Petition
-
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరఫు న్యాయవాదుల పిటిషన్
-
సిట్ క్లోజ్.. బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్
న్యూఢిల్లీ, సాక్షి: స్కిల్ కుంభకోణం కేసులో నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ సీఐడీ తరఫున ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతోనే బుధవారం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. స్కిల్ స్కాం(Skill Scam Case) కేసులో దర్యాప్తు దాదాపు పూర్తి అయిందని, కేసును పెండింగ్‌లో ఉంచడం వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు అయిందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల బెయిల్ రద్దు పిటిషన్ చేశారని తెలిపారాయన. ఈ క్రమంలో బెయిల్ రద్దు చేయాలని కోరడం లేదా ? అని ఏపీ ప్రభుత్వాన్ని జస్టిస్ ఎం.బేలా త్రివేది ప్రశ్నించారు. ‘లేదు’ అని ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ తరఫున న్యాయమూర్తికి సూచించారు. అయితే ఈ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉండడంతో.. బెయిల్ షరతులు(Bail Conditions) ఉల్లంఘించినా, విచారణకు సహకరించకపోయినా తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.కూటమి ప్రభుత్వం కొలువు దీరరాక.. స్కిల్ స్కాం కేసులో దర్యాప్తు స్పీడ్ మొత్తం తగ్గిపోయింది. చంద్రబాబు సీఎం కావడంతో ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు అందరూ ఆయన్ని బయటపడేసేందుకు మూకుమ్మడిగా కృషి చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్రద్దు పిటిషన్లో స్వర్ణాంధ్ర పత్రికా విలేకరి బాలాగంగధర్ తిలక్ భాగమయ్యారు. ఆయన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది హరిన్ రావల్ వాదనలు వినిపించారు. చంద్రబాబే(Chandrababu) ప్రభుత్వం కావడంతో తనపై ఉన్న కేసులను కొట్టేయించుకున్నారని హరిన్ రావల్ వాదించారు. ప్రభుత్వం మారగానే సిట్ ఆఫీస్‌ను మూసేయించారని, పైగా అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే స్కిల్ స్కాం కేసులో మీకేం సంబంధమంటూ పిటిషనర్‌ను మందలిస్తూ ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. ఇదిలా ఉంటే.. గతంలో చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ తరఫున ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే ఇప్పుడు అదే దర్యాప్తు సంస్థ ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌పై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం గమనార్హం. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై.. జైలు జీవితం గడిపారు. ఆపై హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.స్కిల్ స్కాం కేసులో ఎప్పుడు ఏం జరిగిందంటే.. 6.9.2023: ‘రేపో మాపో నన్నూ అరెస్టు చేస్తారేమో?’ అనంతపురం జిల్లా రాయదుర్గంలో చంద్రబాబు వ్యాఖ్యలు 9.9.2023: నంద్యాలలో చంద్రబాబు అరెస్టు. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారణ 10.9.2023: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచిన సీఐడీ అధికారులు. రోజంతా కొనసాగిన విచారణ. 14 రోజుల రిమాండు విధించిన కోర్టు. అర్ధరాత్రి 1.16 గంటలకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలింపు 11.9.2023: జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉన్నందున హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని, నైపుణ్యాభివృద్ధి కేసు దస్త్రాలివ్వాలని కోరుతూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ 12.9.2023: హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు 13.9.2023: క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి, సీఐడీ కస్టడీ పిటిషన్‌పై 18 వరకూ ఒత్తిడి చేయొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశం. విచారణ 19కి వాయిదా 14.9.2023: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలుచంద్రబాబును ములాఖత్‌లో కలిసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్. 15.9.2023: బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం 17.9.2023: నైపుణ్యాభివృద్ధి కేసుపై దిల్లీలో సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిల మీడియా సమావేశం 19.9.2023: చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ 21కి వాయిదా 20.9.2023: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ. 21న నిర్ణయం వెల్లడిస్తామన్న ఏసీబీ కోర్టు సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులు భద్రపరచాలని పిటిషన్. కౌంటర్ వేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం 21.9.2023: స్కిల్ కేసు సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పిల్ 22.9.2023: రెండు రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు. రిమాండ్ 24 వరకు పొడిగింపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు బెయిలు పిటిషన్, పీటీ వారంట్ల పిటిషన్‌పై విచారణ 25కి వాయిదా 23.9.2023: చంద్రబాబును తొలిరోజు దాదాపు 5 గంటలపాటు విచారించిన సీఐడీ అధికారులు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయటంతో సుప్రీంకోర్టులో చంద్రబాబు అప్పీలు సీఐడీ కస్టడీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు. అత్యవసర విచారణకు న్యాయస్థానం నిరాకరణ 24.9.2023: రెండో రోజూ చంద్రబాబును విచారించిన సీఐడీ అధికారులు. అక్టోబరు 5 వరకు జ్యుడిషియల్ రిమాండు పొడిగించిన ఏసీబీ కోర్టు 25.9.2023: చంద్రబాబును మరో 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ 26.9.2023: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ సెప్టెంబరు 27కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 27.9.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబరు 3కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు బెయిలు, కస్టడీ పిటిషన్ల విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 28.9.2023: చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం 30.9.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారించే ధర్మాసనం ఖరారు 3.10.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ. హైకోర్టులో సమర్పించిన దస్త్రాలన్నీ ఇవ్వాలంటూ ధర్మాసనం ఆదేశం 4.10.2023: చంద్రబాబు బెయిలు, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ 5.10.2023: చంద్రబాబు బెయిలు, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ చంద్రబాబు రిమాండ్‌ను 19 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు 6.10.2023: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు 9.10.2023: చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ వర్తించేలా కనిపిస్తోందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు 10.10.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ 12.10.2023: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను 17కు వాయిదా వేసిన హైకోర్టు 13.10.2023: కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఉండవల్లి దాఖలు చేసిన పిల్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు 14.10.2023: చంద్రబాబు శరీరంపై తీవ్రమైన దద్దుర్లు, పొక్కులు. చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశం 17.10.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి. తీర్పు రిజర్వు చేసిన సర్వోన్నత న్యాయస్థానం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా 19.10.2023: ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట వర్చువల్‌గా చంద్రబాబు హాజరు 20.10.2023: ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారంట్‌పై చంద్రబాబును నవంబరు 9 వరకు ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచొద్దని, అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశం చంద్రబాబుకు రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లకు అనుమతిచ్చిన ఏసీబీ కోర్టు కాల్‌డేటా పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం 26.10.2023: చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యుల వెల్లడి 27.10.2023: తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకొన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి సీఐడీ కాల్ డేటా రికార్డుపై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు తమ పార్టీ బ్యాంకు లావాదేవీల వివరాలను సీఐడీ కోరడంపై హైకోర్టుకు టీడీపీ 28.10.2023: చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స చేయాలని ప్రభుత్వ వైద్యుడి నిర్ధారణ 30.10.2023: చంద్రబాబు మధ్యంతర బెయిలుపై వాదనలు పూర్తి. తీర్పు రిజర్వు 31.10.2023: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు -
నేడు కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
-
నా భద్రతా బృందంతో బాషాను పంపేలా ఆదేశాలివ్వండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: తన కుమార్తె స్నాతకోత్సవం నిమిత్తం లండన్ వెళుతున్న నేపథ్యంలో... తన భద్రతా బృందంలో గతంలో డీఎస్పీగా వ్యవహరించిన ఎస్.మహబూబ్ బాషాను ప్రస్తుతం తన భద్రతా బృందంతోపాటు పంపేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం అత్యవసరంగా హౌస్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ విచారణ జరిపారు. వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు.మంగళవారం నాడు వైఎస్ జగన్ లండన్ బయలుదేరుతున్నారని, ఈ నెలాఖరు వరకు అక్కడే ఉంటారని శ్రీరామ్ తెలిపారు. లండన్ వెళ్లేందుకు కోర్టు నుంచి చట్ట ప్రకారం అనుమతులు కూడా తీసుకున్నారని ఆయన వివరించారు. జగన్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఆయనకు జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు విదేశాలకు వెళుతున్న నేపథ్యంలో ఎల్లోబుక్ ప్రకారం ఆయనకు సెక్యూరిటీ ప్రొటోకాల్ కింద భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ పలుమార్లు లండన్ వెళ్లారని, అప్పుడు భద్రతా బృందంలో మహబూబ్ బాషా ఉన్నారని కోర్టుకు వివరించారు. తన భద్రతాపరమైన విషయాల గురించి బాషాకు స్పష్టమైన అవగాహన ఉందని, అందువల్ల ఆయనను తన వెంట పంపాలంటూ జగన్ ఈ నెల 9న ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారన్నారు. మంగళవారం లండన్ వెళుతున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ వినతిపత్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ నేపథ్యంలో అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని భద్రతను కల్పించి తీరాల్సి ఉండగా, ప్రభుత్వం ఇప్పటి వరకు చోద్యం చూస్తూ ఉందన్నారు. జగన్ భద్రతను ఈ ప్రభుత్వం భారీగా కుదించిందిరాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఎల్లోబుక్ ప్రకారం తనకు నిర్దిష్ట వ్యక్తినే భద్రతాధికారిగా నియమించాలని కోరడానికి వీల్లేదన్నారు. శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ జగన్‌కు ఉన్న భద్రతను ఈ ప్రభుత్వం భారీగా కుదించిందని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తున్నామని వివరించారు. తమ వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థంకావడం లేదన్నారు. దమ్మాలపాటి స్పందిస్తూ ఆ వినతిపత్రంపై తప్పక పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటామని, ఇందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అందువల్ల విచారణను ఈ నెల 17కి వాయిదా వేయాలని కోరారు. తమకు అభ్యంతరం లేదని శ్రీరామ్ చెప్పారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాల సమర్పణ నిమిత్తం విచారణను 17కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
మరోసారి హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
-
సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్
-
నా కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవానికి వెళ్లాలి
సాక్షి, అమరావతి: తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమం నిమిత్తం వచ్చే వారం లండన్ వెళ్లాల్సి ఉందని, అందువల్ల తనకు తాజా పాస్‌పోర్ట్ జారీ నిమిత్తం నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేలా విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఆయన సోమవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. వ్యక్తిగత పూచీకత్తుతో నిమిత్తం లేకుండా ఐదేళ్ల గడువుతో కూడిన పాస్‌పోర్ట్ జారీ నిమిత్తం ఎన్వోసీ ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించిందని శ్రీరామ్ తెలిపారు. ఎన్వోసీ కావాలంటే స్వయంగా తమముందు హాజరు కావాల్సిందేనని చెప్పారన్నారు.వాస్తవానికి ఏ పరువు నష్టం కేసులో అయితే వ్యక్తిగతంగా హాజరుకావాలని ప్రత్యేక కోర్టు చెబుతుందో... ఆ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్‌కు హైకోర్టు గతంలోనే మినహాయింపునిచ్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల వ్యక్తిగతంగా హాజరై రూ.20 వేలకు పూచీకత్తులు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఐదేళ్ల కాల వ్యవధితో కూడిన పాస్‌పోర్ట్ జారీకి ఎన్వోసీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రత్యేక కోర్టుపై ఉందన్నారు. ఈ నెల 16న లండన్‌లో తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరుకావాల్సి ఉందని, అందువల్ల ఎన్సీవో మంజూరు చేసేలా ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, పరువునష్టం కేసులో విచారణకు మాత్రమే వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. పూచీకత్తులు సమర్పించేందుకు మినహాయింపు ఇవ్వలేదని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం స్వయంగా హాజరై పూచీకత్తులు సమర్పించాల్సిన బాధ్యత జగన్‌పై ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
వాంగ్మూలాలు మార్చేసి.. ‘సుప్రీం’ను ఏమార్చాలి
సాక్షి, అమరావతి : సీఆర్పీసీ 164 వాంగ్మూలాలు మార్చాలి.. సుప్రీంకోర్టును ఏమార్చాలి.. ఏం చేసినా ఈ నెల 21లోగా చేసేయాలి.. అందుకు ఎంతకైనా బరితెగించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రగా స్పష్టమవుతోంది. సీఐడీని అడ్డుపెట్టుకుని ఈ కుతంత్రానికి పాల్పడుతోంది. చంద్రబాబుపై అవీనీతి కేసులను నీరుగార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల సంగతి తేలుస్తామని ఎన్నికల ముందు లోకేశ్ హెచ్చరించినట్టుగానే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ప్రభావితం చేసేలా అక్రమాలకు పాల్పడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించి ఏకంగా సుప్రీంకోర్టునే ఏమార్చేందుకు బరితెగిస్తోంది. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై ప్రస్తుతం సీఐడీ వరుసగా వాయిదాలు కోరుతుండటంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం హడలిపోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయిన చంద్రబాబు.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని గతంలోనే సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పిటిషన్ అంశంలో సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ వరుసగా వాయిదాలు కోరుతుండటం గమనార్హం. గత విచారణకు కూడా ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్‌గా పాల్గొని వాదనలు వినిపించకుండా మరోసారి వాయిదా కోరారు. వరుస వాయిదాలు కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి వాయిదా ఇవ్వమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. దాంతో ఈ నెల 21న సుప్రీంకోర్టు విచారణకు హాజరై చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సీఐడీ తరఫు న్యాయవాది తప్పనిసరిగా తన వాదనలు వినిపించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన కేసునే ఆయన వాదిస్తున్నారు. అంటే నిబంధనల ప్రకారం చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఆయన వాదనలు వినిపించాలి. కానీ ఈ పిటిషన్ వీగిపోయేలా చేసేందుకే ప్రస్తుత సీఐడీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు కుట్రలకు పదును పెడుతున్నారు. ఈ నెల 21లోగా తిమ్మిని బమ్మి చేసేందుకు బరితెగిస్తున్నారు. అబద్ధపు వాంగ్మూలాలతో ‘సుప్రీం’ను ఏమార్చే కుట్ర 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలకు చంద్రబాబే ప్రధాన కుట్రదారు అని ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్, కాంతిలాల్ దండే స్పష్టం చేశారు. ఆమేరకు 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కేసులో ఆ వాంగ్మూలాలు కీలక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందుకే వారిపై టీడీపీ కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలాలకు పూర్తి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలాలను సీఆర్పీసీ 164 కింద మరోసారి నమోదు చేయించేందుకు కుతంత్రం పన్నుతోంది.సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినా సరే ఈ నెల 8న ఆ అధికారులతో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలని సీఐడీ పట్టుబడుతోంది. ఈ నెల 21లోగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించి, ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా సుప్రీంకోర్టును ఏమార్చేందుకు పన్నాగం పన్నింది. అప్పుడే హెచ్చరించిన లోకేశ్సీఆర్పీసీ 164 కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడమన్నది రాజ్యాంగం కల్పించిన అవకాశం. ప్రమాణ పూర్తిగా ఇచ్చే ఆ వాంగ్మూలాలకు న్యాయస్థానం రక్షణ కల్పిస్తోంది. కానీ అంతటి కీలకమైన 164 వాంగ్మూలాలను కూడా నారా లోకేశ్ ప్రశ్నించడం విభ్రాంతికరం. ఎన్నికల ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తూ ఐఏఎస్ అధికారులు 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అందుకే రెడ్‌బుక్ రాస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు.అప్పటికే న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశంపై ఆయన మాట్లాడటం, సాక్షులను బెదిరించడం న్యాయ ధిక్కారమేనని పరిశీలకులు స్పష్టం చేశారు. లోకేశ్ ముందుగా చెప్పినట్టుగానే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను ప్రభుత్వం వేధిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ ద్వారా బరితెగిస్తోంది. ఇది కచ్చితంగా చంద్రబాబుపై అవినీతి కేసుల విచారణను ప్రభావితం చేయడమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. దీన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు. -
సుప్రీమ్ కోర్టులో అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్
-
గ్రూప్-1 అభ్యర్ధుల పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
-
పోలీసుల నోటీసులను రద్దుచేయండి..
సాక్షి, అమరావతి :రేషన్ బియ్యం కేసులో సాక్షులుగా విచారణకు రావాలంటూ బందరు తాలుకా పోలీసులు తమకు జారీచేసిన నోటీసులను సవాలుచేస్తూ మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని సాయి కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులను రద్దుచేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు తమను ఏ విధంగా సాక్షులుగా పరిగణిస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరగనుంది. మమ్మల్ని ఇరికించి అరెస్టుకు పోలీసుల యత్నం..బందరులో పేర్ని నాని భార్య జయసుధ ఓ గౌడన్ నిర్మించి దానిని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఇందులో నిల్వచేసిన రేషన్ బియ్యంలో కొంత మాయమైనట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలంటూ నోటీసులివ్వడంతో వాటిపై నాని, ఆయన కుమారుడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బియ్యం మాయం కేసులో తమను అక్రమంగా ఇరికించి, అరెస్టుచేసేందుకు పోలీసులు యత్నిçÜ్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. బియ్యం మాయంతో తమకెలాంటి సంబంధంలేదన్నారు. గోడౌన్‌ను పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చామని, అందులో ఉన్న బియ్యం మాయమైతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలిగానీ, అద్దెకిచ్చిన యజమానిపై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ కారణాలతోనే పోలీసులు ఈ కేసు నమోదు చేశారన్నారు. తమ నుంచి ఎలాంటి సమాచారం కావాలో పోలీసులు నోటీసుల్లో పేర్కొనలేదన్నారు. బియ్యం మాయంపై కోటిరెడ్డి అనే అధికారి ఫిర్యాదు ఇచ్చారని, దాని ఆధారంగా నమోదుచేసిన కేసులో విచారణకు రావాలని మాత్రమే నోటీసుల్లో పేర్కొన్నారని వారు తెలిపారు. -
మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత!
-
హైకోర్టులో కేటీఆర్ పిటిషన్
-
మోహన్ బాబుకు దక్కని ఊరట.. ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు!
తెలంగాణ హైకోర్టులో సినీనటుడు మోహన్ బాబుకు మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.మోహన్‌బాబు పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు దుబాయ్ వెళ్తున్నారని ప్రతివాదుల తరఫున న్యాయవాది ఆరోపించారు. అయితే అలాంటిదేం లేదంటూ మోహన్ బాబు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఇరు వర్గాలను ఆదేశించింది.అసలేం జరిగిందంటే..మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్‌కు మధ్య వివాదం తలెత్తింది. జల్పల్లిలోని ఇంట్లోకి తనను రానివ్వలేదంటూ మంచు మనోజ్ మీడియా తీసుకుని ఆ ఇంటివద్దకు వెళ్లారు. అదే సమయంలో సెక్యూరిటీ మనోజ్ దంపతులను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలోనే మనోజ్ గేటు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లారు. అక్కడే ఉన్న మోహన్‌బాబును ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆయన ఆగ్రహాని గురయ్యారు. అతని మైక్‌తోనే మీడియా ప్రతినిధిని కొట్టారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. ఇవాళ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. -
క్వాష్ పిటిషన్ పై విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా
-
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్
-
హైకోర్టులో సోషల్ మీడియా యాక్టివిస్ట్ వెంకటరామిరెడ్డి పిటిషన్
-
శంభు సరిహద్దులో హైవేల మూసివేత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
న్యూఢిల్లీ: శంభు సరిహద్దులో హైవేల మూసివేతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతోపాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. హర్యానా, పంజాబ్ రైతులు ఢిల్లీ చలో కార్యక్రమం చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చ నేతృత్వంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు గుండా రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు శంభు సరిహద్దు హైవేలను నిర్బందించారు. రాకపోకల్ని నిలిపివేశారు. హైవేల నిర్బందం, రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమంపై పంజాబ్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో రైతుల నిరసనలతో మూతపడ్డ శంభు సరిహద్దు సహా హైవేలను తిరిగి తెరవాలని, నిరసన తెలుపుతున్న రైతులను హైవేపై నుంచి తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని పిటిషన్లో పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడేలా నిరసన తెలిపే రైతులను కూడా కోర్టు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా హైవేలను అడ్డుకోవడం ప్రజల ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, జాతీయ రహదారి చట్టం భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరమని, హైవేలను దిగ్బంధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పేర్కొన్నారు. -
‘కుట్ర’ కేసు కొట్టేయండి.. హైకోర్టులో హరీష్‌రావు పిటిషన్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ వేశారు. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1న హరీష్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారంటూ హరీష్‌రావు తన పిటిషన్లో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసు పెట్టారంటూ పేర్కొన్న హరీష్ రావు.. కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు.తన, కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రతో అక్రమ కేసులు పెట్టారని... రియల్ ఎస్టేట్ వ్యాపారి జి.చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్‌రావుపై ఈ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి, రిమాండ్‌లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును సైతం నిందితుడిగా చేర్చారు. వివిధ సెక్షన్ల కింద ఆదివారమే ఎఫ్ఐఆర్ నమోదవగా.. ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ‘‘సిద్దిపేటకు చెందిన చక్రధర్‌గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 2022 సెప్టెంబర్ 25న సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్‌లో చక్రధర్.. ఆత్మహత్యలకు పాల్పడ్డ వంద మంది కౌలురైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత మరో 150 మందికి రూ.లక్ష నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో భవిష్యత్తులో చక్రధర్‌గౌడ్ తనకు పోటీ అవుతారని హరీశ్‌రావు భావించారు.అనంతరం సిద్దిపేట జిల్లాలో ‘అగ్గిపెట్టె మచ్చా‘ పేరిట మ్యాచ్బాక్స్ కంపెనీని ప్రారంభించనున్నట్టు చక్రధర్‌గౌడ్ ప్రకటించారు. దీనితో హరీశ్‌రావు చక్రధర్‌పై శామీర్‌పేట పోలీసుస్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేయించి, అరెస్టు చేయించారు. అయితే 2023 మార్చి 15న చక్రధర్ బీజేపీలో చేరారు. అదే ఏడాది ఏప్రిల్ 28న హైదరాబాద్‌లోని పంజగుట్ట నాగార్జున సర్కిల్లో చక్రధర్‌కు చెందిన ‘ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్’ ఆఫీసుకు మఫ్టీలో వచ్చిన పోలీసులు ఆయనను టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా ఉన్న పి.రాధాకిషన్‌రావు ముందు హాజరుపర్చారు.ఆయన చక్రధర్‌ను తీవ్రస్థాయిలో బెదిరించి, హరీశ్‌రావు అనుమతి లేకుండా సిద్దిపేట నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని హెచ్చరించారు. ఒకసారి పోలీసులు చక్రధర్ ఐఫోన్ తీసుకుని, తర్వాత తిరిగిచ్చారు. ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా వివరాలన్నీ తెలుసుకుని చక్రధర్‌ను, అనుచరులను బెదిరించారు. గతంలో మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు అధికార దురి్వనియోగానికి పాల్పడి ఈ చర్యలకు పాల్పడ్డారు’’ అని పోలీసులు ఎఫ్ఆర్లో పేర్కొన్నారు. -
‘హష్ మనీ’ కేసు కొట్టేయండి: ట్రంప్
న్యూయార్క్:ఇటీవలే రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు తనపై ఉన్న క్రిమినల్ కేసుల్లో వరుసగా ఊరట లభిస్తోంది.ఇప్పటికే ట్రంప్‌పై ఉన్న 2020 ఎన్నికల ఫలితం తారుమారు కేసు విచారణను పక్కనపెడుతున్నట్లు కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే శృంగార తార స్టార్మీ డేనియల్స్ తనపై వేసిన హష్మనీ కేసుపై ట్రంప్ తాజాగా దృష్టి సారించారు. తనను ఇప్పటికే దోషిగా ప్రకటించిన ఈ కేసును కొట్టివేయాలని ట్రంప్ తాజాగా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు అధ్యక్ష పదవి నిర్వహించేందుకు తనకు అడ్డంకిగా మారుతుందని పిటిషన్లో పేర్కొన్నారు.నిజానికి ఈ కేసులో ట్రంప్‌కు నవంబర్ 26నే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. శిక్ష ఖరారు అంశాన్ని జడ్జి ఇప్పటికే నిరవధికంగా వాయిదా వేశారు. అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికైన వారికి క్రిమినల్ కేసుల నుంచి రక్షణ ఉంటుంది. ఇది ట్రంప్‌కు ప్రస్తుతం అనుకూలంగా మారింది. -
TG Highcourt: ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసులో అనూహ్య మలుపు.. ప్రభాకర్‌రావు మరో పిటిషన్
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన పాస్‌పోర్టు రద్దు చేయడాన్ని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విదేశాంగ శాఖ వద్ద సవాల్ చేశారు. విదేశాంగశాఖ ద్వారానే ప్రభాకర్ రావును రప్పించే పనిలో పోలీసులు ఇప్పటికే నిమగ్నమయ్యారు.ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్‌పోర్టును పోలీసులు రద్దు చేయించారు. ఇంటర్‌పోల్ ద్వారా ప్రభాకర్‌రావుకు రెడ్‌కార్నర్ నోటీసు ఇప్పించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. మరోవైపు రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్‌రావు పిటిషన్ పెట్టుకున్నారు. కాగా,ఇదే కేసులోమరో నిందితుడు శ్రవణ్‌రావు చికాగోలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
‘మా పాపకు అన్యాయం జరిగింది..’ రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును శుక్రవారం గుంటూరు కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. అయితే సాక్ష్యాలు ఇచ్చినా కూడా వాటిని కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదని, ఈ కేసులో న్యాయం కోసం పోరాడతామని రిషితేశ్వరి తల్లి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది.రిషితేశ్వరి స్వస్థలం వరంగల్. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేసిన ఆమె.. 2015 జులై 14వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అయితే తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికింది. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే.. ర్యాగింగ్ వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలు లేవంటూ గుంటూరు జిల్లా ఐదవ కోర్టు .. తొమ్మిదేళ్ల విచారణ తర్వాత ఇప్పుడు కేసు కొట్టేసింది.‘‘మా పాప కేసులో మాకు అన్యాయం జరిగింది. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మా పాప రాసిన డైరీ ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశాం. మాకు న్యాయం చేయమని అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడిని, అప్పటి ఎస్పీ త్రిపాఠిని కలిశాం. మా పాపను ర్యాగింగ్ పేరుతో ఎలా వేధించారు రాసిన డైరీ ని కూడా ఒక కాపీ ఇచ్చాం. ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు. మా అమ్మాయి రాసిన సూసైడ్ లెటర్‌ను ప్రతీ అధికారికి వాటిని సమర్పించాం. పది సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం.. .. కానీ, మేమిచ్చిన సాక్ష్యాన్ని కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అర్థం కావట్లేదు. న్యాయం కోసం అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంలను కలుస్తాం. మాకు పైకోర్టుల్లో పోరాడే ఆర్థిక శక్తి లేదు. ప్రభుత్వమే సాయం చేయాలి. కేసులో న్యాయం జరగకపోతే మాకు మరణమే శరణ్యం’’ అని రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు పెట్టకుంది.‘‘రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారి పేర్లు డైరీలో ఉన్నాయి. ఆమె ఏ విధంగా వేధింపులకు గురైందో డైరీ ల్లో ఉన్నాయి. అవి అన్నీ కోర్టు ముందు ఉన్నాయి. తోటి విద్యార్థులు, సీనియర్లు ఏ విధంగా వేధించారో స్పష్టంగా ఉంది. ప్రిన్సిపాల్ బాబురావుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. హాయ్ ల్యాండ్ లో ప్రెషర్స్ పార్టీలో లైంగికంగా వేధించారు. నిందితులకు శిక్ష పడుతుందని భావించాం. కానీ, కోర్టు కేసు కొట్టేసింది. ఈ తీర్పు న్యాయమైనది కాదని భావిస్తున్నాం. తీర్పుపై అప్పీల్ కు వెళ్ళాలన్నది నా నిర్ణయం. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేస్తాను.::: రిషితేశ్వరి కేసులో స్పెషల్ పీపీ వైకే -
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు తాజాగా పిటిషన్ పెట్టుకున్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని పిటిషన్లో ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పనిచేశానని తెలిపారు. రాజకీయంగా తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.ప్రస్తుతం తాను ఫ్లోరిడాలోని కుమారుని వద్ద ఉంటున్నానని తెలిపారు.కాగా,మరో వైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.ఈ కేసులో మరో నిందితుడు, టీవీఛానల్ ఎండి శ్రవణ్ రావు అమెరికాలోని చికాగోలో ఉంటున్నట్లు పోలీసులు కనిపెట్టారు. -
నయనతార డాక్యుమెంటరీ.. మరింత ముదిరిన వివాదం..!
కోలీవుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత మొదలైన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే రూ.10 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు పంపించిన హీరో ధనుశ్.. తాజాగా కోర్టులో దావా వేశారు. నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌పై తాజాగా దావా వేశారు. గతంలో నయన్, ధనుశ్ జంటగా నటించిన నానుమ్ రౌడీ దాన్ మూవీలోని మూడు సెకన్ల క్లిప్‌ను అనుమతి లేకుండా వినియోగించారంటూ ధనుశ్ టీమ్ ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. అయితే తాజాగా ఆ మూవీ నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అనుమతించింది. అయితే ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కలిసిన వీరిద్దరు ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోలేదు. అసలేం జరిగిందంటే..ఇటీవల విడుదలైన నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది. కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు.