హైకోర్టులో మాజీమంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పిటిషన్
నేడు విచారణ జరపనున్న హైకోర్టు
సాక్షి, అమరావతి :రేషన్ బియ్యం కేసులో సాక్షులుగా విచారణకు రావాలంటూ బందరు తాలుకా పోలీసులు తమకు జారీచేసిన నోటీసులను సవాలుచేస్తూ మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని సాయి కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులను రద్దుచేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు తమను ఏ విధంగా సాక్షులుగా పరిగణిస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరగనుంది.
మమ్మల్ని ఇరికించి అరెస్టుకు పోలీసుల యత్నం..
బందరులో పేర్ని నాని భార్య జయసుధ ఓ గౌడన్ నిర్మించి దానిని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఇందులో నిల్వచేసిన రేషన్ బియ్యంలో కొంత మాయమైనట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలంటూ నోటీసులివ్వడంతో వాటిపై నాని, ఆయన కుమారుడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బియ్యం మాయం కేసులో తమను అక్రమంగా ఇరికించి, అరెస్టుచేసేందుకు పోలీసులు యత్నిçÜ్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. బియ్యం మాయంతో తమకెలాంటి సంబంధంలేదన్నారు.
గోడౌన్‌ను పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చామని, అందులో ఉన్న బియ్యం మాయమైతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలిగానీ, అద్దెకిచ్చిన యజమానిపై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ కారణాలతోనే పోలీసులు ఈ కేసు నమోదు చేశారన్నారు. తమ నుంచి ఎలాంటి సమాచారం కావాలో పోలీసులు నోటీసుల్లో పేర్కొనలేదన్నారు. బియ్యం మాయంపై కోటిరెడ్డి అనే అధికారి ఫిర్యాదు ఇచ్చారని, దాని ఆధారంగా నమోదుచేసిన కేసులో విచారణకు రావాలని మాత్రమే నోటీసుల్లో పేర్కొన్నారని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment