
సాక్షి, తాడేపల్లి: ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ గుంటూరు యార్డుకు వెళ్లేదాకా చంద్రబాబు ప్రభుత్వం.. మిర్చి రైతుల గురించి పట్టించుకోలేదని.. ఆ తర్వాతే హడావుడిగా రూ.11,781 లకు కొనుగోలు చేస్తామని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ నేటి వరకు ఒక్క కిలో మిర్చి కూడా కొనలేదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.
మిర్చి రైతులు ఇవాళ కూడా గుంటూరులో ధర్నాలు చేశారు. రైతు కంట కన్నీరు వస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఈ ప్రభుత్వం రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు?. వైఎస్ జగన్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది?. మిర్చి రైతులతా ఆందోళనలో ఉన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులంతా ఆవేదన చెందుతున్నారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.
‘‘రైతులను కాదని వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోంది. అచ్చెన్నాయుడు వైఎస్ జగన్‌ను ఎగతాళి చేయటమే పనిగా పెట్టుకున్నారు. దానివలన రైతులకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment