Lella Appi reddy
-
వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు: Lella Appi Reddy
-
‘హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పై అనుమానులున్నాయ్’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తాజా ఘటనే సాక్ష్యమని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో రోజురోజుకీ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. తాము జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనకు సంబంధించి రెండు రోజులు ముందుగానే సమాచారమిచ్చామని, ఈ ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తుందో అర్థమవుతుందని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. రామగిరిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ విరిగిపోయింది. ఇది మీ వైఫల్యం కాదా.. అసలు హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పైన అనేక అనుమానాలున్నాయ్. వైఎస్ జగన్‌కు భద్రతను తగ్గించారుదేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నేత జగన్మోహన్రెడ్డి. పోలీసులు కనీస భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ భద్రత కుదించారు. ఆయన ఇంటివద్ద భద్రత కుదించారు. జగన్ పర్యటనల్లో సరైన భద్రత కల్పించడం లేదు. కూటమి నేతల ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయ్... పోతుంటాయ్ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. కానీ ఏపీలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదుమళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. కూటమి నేతల మాటలు విని తప్పులు చేసే వారిని విడిచిపెట్టం. ఇటీవల జగన్ పర్యటనల్లో భద్రత లోపం తేటతెల్లమైంది. మా కార్యకర్తలే రోప్ పార్టీగా మారి జగన్‌కు భద్రత కల్పించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యయుతమైన పాలన ఏపీలో కొనసాగడం లేదు వైఎస్సార్సీపీ వారిపై దాడులు జరుగుతున్నాయ్.. జగన్ భద్రత పై కేంద్రం జోక్యం చేసుకోవాలి. జగన్‌కు సరైన భద్రత కల్పించాలి. అభిమానుల ముసుగులో అసాంఘికశక్తులుహెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పైన అనేక అనుమానాలున్నాయ్. మా పార్టీ కార్యకర్తల ముసుగులో ప్రత్యర్ధి పార్టీ వర్గీయులే ఈ పని చేసుంటారని మాకు అనుమానం జగన్ భద్రత పై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకమైన బాధ్యత తీసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. పోలీసులు నిస్పక్షపాతంగా పనిచేస్తే శాంతిభద్రతలు ఎందుకు లోపిస్తాయి. మేం పోలీసులందరినీ అనడం లేదుపచ్చచొక్కాలేసుకున్న అధికారుల గురించి మాత్రమే మేం మాట్లాడుతున్నాం. తప్పుచేసిన వారిని మాత్రమే మేం చట్టం ముందు నిలబెడతామంటున్నాం. తప్పుచేసిన వారు తప్పించుకుపోలేరు గుర్తుంచుకోండి’ అంటూ హెచ్చరించారు లేళ్ల అప్పిరెడ్డిఇది చదవండి:మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు -
Appi Reddy: ఏపీలో బీహార్ తరహా పరిస్థితులు
-
రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ గుంటూరు యార్డుకు వెళ్లేదాకా చంద్రబాబు ప్రభుత్వం.. మిర్చి రైతుల గురించి పట్టించుకోలేదని.. ఆ తర్వాతే హడావుడిగా రూ.11,781 లకు కొనుగోలు చేస్తామని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ నేటి వరకు ఒక్క కిలో మిర్చి కూడా కొనలేదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.మిర్చి రైతులు ఇవాళ కూడా గుంటూరులో ధర్నాలు చేశారు. రైతు కంట కన్నీరు వస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఈ ప్రభుత్వం రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు?. వైఎస్ జగన్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది?. మిర్చి రైతులతా ఆందోళనలో ఉన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులంతా ఆవేదన చెందుతున్నారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.‘‘రైతులను కాదని వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోంది. అచ్చెన్నాయుడు వైఎస్ జగన్‌ను ఎగతాళి చేయటమే పనిగా పెట్టుకున్నారు. దానివలన రైతులకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. -
Lella Appi Reddy: యువత పోరు విజయవంతం
-
యువత పోరు విజయవంతం.. ‘కూటమి’పై తిరుగుబాటు మొదలైంది
సాక్షి, తాడేపల్లి: విద్యార్థులు, యువత పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'యువత పోరు' విజయవంతం అయ్యిందని ఆ పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, యువకులు ఈ ఆందోళనల్లో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ పార్టీ ఆధ్వర్యంలో మొద్దు నిద్రలో ఉన్న పాలకుల కళ్ళు తెరిపించేలా చేపట్టిన ఈ కార్యక్రమం కూటమి సర్కార్ గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి గడిచిన 15 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ దివంగత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతోంది. అందుకే వైఎస్సార్సీపీ పక్షాన పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా వైఎస్ జగన్ పాలన, పార్టీ విధానాలతో ఏకీభవించి ఎంతోమంది మేధావులు మాకు అండగా నిలుస్తున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు రాజీలేని పోరాటం చేస్తున్నాం.ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ విద్యార్థులు యువత సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వంపైన పోరాటానికి ముందడుగేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లోనూ నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి స్వచ్ఛందంగా యువత తరలిరావడం చూస్తుంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలికూటమి పార్టీలు మేనిఫెస్టోలో చేర్చిన హామీలకు కనీస గౌరవం ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులు, యువతను ప్రభుత్వం గాలికొదిలేసింది. పేదరికంతో విద్యార్థులు చదువులకు దూరమైపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. విద్యాదీవెన, వసతి దీవెనకు గాను గతేడాదికి సంబంధించి రూ. 3,200 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మరో రూ. 3,900 కోట్లు చెల్లించాలి. మొత్తంగా రూ. 7,100 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్లో కేవలం రూ. 2,644 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ. 3 వేలు చెల్లిస్తామని చెప్పి యువత ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక 9 నెలలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ ఏడాది బడ్జెట్లో సైతం పథకం ఊసెత్తలేదు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారుగత ప్రభుత్వంలో పేదవారికి ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, పేద, మధ్యతరగతి విద్యార్ధులకు వైద్య విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన వైఎస్ జగన్, ఐదేళ్లలోనే 5 కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కూడా ఇచ్చారు. మిగతా కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణం జరుపుకుంటుండగా వాటిని పూర్తి చేయాల్సిన సీఎం చంద్రబాబు సేఫ్ క్లోజ్ పేరుతో పక్కన పెట్టారు. కేంద్రం సీట్లు ఇస్తామని ముందుకొస్తే వద్దని ఐఎంఏకి లేఖలు రాసిన నీచ చరిత్ర చంద్రబాబుది. ఆ విధంగా మెడిసిన్ చదవాలన్న పేద విద్యార్థులను కలను చంద్రబాబు నాశనం చేశాడు. కమీషన్ల కోసం కార్పొరేట్లకు మెడికల్ కాలేజీలను దారాదత్తం చేసే కార్యక్రమానికి తెరలేపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు 9 నెలలకే ప్రజా స్పందన ఈ స్థాయిలో ఉందంటే, హామీలు అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ వ్యతిరేకత ఏ స్థాయికి పెరుగుతుందో కూటమి నాయకులే అంచనా వేసుకోవాలి. ఇప్పటికే వైఎస్సార్సీపీ తరఫున రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్యమం చేశాం. ట్రూ అప్ పేరుతో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పేదల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీశాం. సమస్యలపై ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వం భయపడిపోతోంది. నిరసన కార్యక్రమాలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు.వారం రోజుల నుంచే నిరసన కార్యక్రమానికి సంబంధించి పోలీసులను అనుమతి కోరుతున్నా ఇవ్వకుండా కాలయాపన చేశారు. అడుగడుగునా నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్ని నిర్బంధాలను దాటుకుని ఈ రోజున యువత పోరు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా హామీల అమలుపై దృష్టిసారించాలి. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే జగన్‌కి పేరొస్తుందనే ఆలోచన వీడాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలి. తక్షణం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్‌తో టైం పాస్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు విద్యార్థులు, యువత పక్షాన నిలబడి వైయస్సార్సీపీ పోరాడుతుంది. ప్రభుత్వం కూడా ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలి. -
‘అసలు ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం పని చేస్తోంది?’
తాడేపల్లి : ఏపీలో కూటమి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తోందో తెలియడం లేదన్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ధరలు లేక మిర్చి రైతులు అల్లాడిపోతుంటే.. నేటికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారణుమన్నారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ మిర్చి రైతుల కష్టాలు దారుణంగా ఉన్నాయి. ధరల్లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్ గత నెలలో మిర్చి యార్డును సందర్శించారు. రైతుల కష్టాలు తెలుసుకుని చలించిపోయారు. జగన్ వెళ్లాకనే ప్రభుత్వం సమీక్షలు చేసింది. రూ. 11,781లకు తగ్గితే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అసలు ఆ స్కీం ఉందో లేదో కూడా తెలియదు. ఈక్రాప్, చెక్‌పోస్టు, యార్డులోనూ రైతుల పంటల వివరాలు తెలుస్తాయి కదా?, ఐనా సరే ఎందుకని మిర్చి కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారు?, రైతుల పంట వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాకనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా?, అసలు ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం పని చేస్తోంది? , 150 కోల్డు స్టోరేజీల్లో కోటిన్నర మిర్చి బస్తాలు ఉన్నాయి. మిర్చిని అమ్ముకోలేక రైతులు అల్లాడిపోతున్నారు. మిర్చి రైతుల కష్టాల మీద చర్చించాలని మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చాం. ప్రభుత్వం దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూడటం సిగ్గుచేటు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు ఆలోచింవి రైతులను ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు లేళ్ల అప్పిరెడ్డి. -
‘ప్రధాన ప్రతిపక్ష గుర్తింపుపై చంద్రబాబు సర్కార్ నిరంకుశ వైఖరి’
సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుతూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపునే ఇవ్వకుండా, ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయపరమైన హోదాగా కూటమి పార్టీలు విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత, దీనివల్ల అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం వైఎస్సార్సీపీకి దక్కుతుందన్నారు. దీనిని కూడా వక్రీకరించడం దుర్మార్గమన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీ అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉంటే, దానిలో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. మిగిలిన వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సి ఉంది. పార్లమెంట్ చట్టం 1977 ప్రకారం సభలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రధాన ప్రతిపక్షంను గుర్తించాలి. కూటమి ప్రభుత్వం దీనిని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును వైఎస్సార్సీపీ కోరుతుంటే దీనిని రాజకీయం చేయడం దుర్మార్గం. దీనిపై కూటమి పార్టీలు చేస్తున్న ఈ విమర్శలను చూసి ప్రజాస్వామికవాదులే ఆశ్చర్యపోతున్నారు.ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకుంటున్నారుతొమ్మిది నెలల కూటమి పాలనపై ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడా నెరవేర్చడం లేదు. మరోవైపు గ్రూప్-2 నిరుద్యోగులు, మిర్చి రైతులు, విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేని ప్రజలు బాహాటంగానే ప్రభుత్వం మీద తమ నిరసనను తెలియచేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజల పక్షాన ఎక్కడ వైఎస్సార్సీపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడుతుందోననే భయంతోనే కూటమి ప్రభుత్వం ఉంది. న్యాయంగా వైఎస్సార్సీపీకి దక్కాల్సిన ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును దూరం చేస్తూ, ప్రజా సమస్యలపై ఎక్కడ వైఎస్సార్సీపీ తమను ప్రశ్నిస్తుందోనని కంగారుపడుతోంది. ప్రతిపక్షంగా అడిగే ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. తమ పాలనా వైఫల్యాలను ప్రజాగొంతుకగా వైఎస్సార్సీపీ సభలో వినిపిస్తే తట్టుకోలేమనే ఉద్దేశంతోనే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును నిరాకరిస్తున్నారు.ప్రధాన ప్రతిపక్షంగా శాసనమండలిలో పోరాడుతున్నాంశాసనమండలిలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అనేక ప్రజా సమస్యలపై మాట్లాడుతోంది. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఉండటం వల్ల వైఎస్సార్సీపీ సభ్యులకు ఎక్కువ సమయం లభిస్తోంది. తాజాగా వైస్ చాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం కంగారు పడింది. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన మాటలు, చెప్పించిన అబద్ధాలపై నిలదీయడంతో అధికారపక్షం నీళ్ళు నమిలింది. తమ తప్పులను ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది.ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రధాన ప్రతిపక్షంకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశానికి ప్రతిపక్షంగా చట్టసభల్లో మాట్లాడేందుకు ఎంతో సమయం లభించింది. సభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చలు జరిగితే వాటిని అర్థమవంతమైనవని అంటారా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించే వాటికి ధీటుగా సమాధానం చెప్పగలిగితేనే కూటమి ప్రభుత్వ పాలనా సామర్థ్యం ప్రజలకు తెలుస్తుంది. ఇటువంటి సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ, అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపే లేకుండా, ప్రశ్నించేవారే లేకుండా ఏకపక్షంగా పాలనను సాగించాలని అనుకోవడం నిరంకుశత్వం అవుతుంది. సంఖ్యాబలం రీత్యా మాకే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు వస్తుందంటే, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. -
కూటమి గూండాల దాడులు చేసి ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు
-
దిక్కుమాలిన పాలన.. 40 ఏళ్ల అనుభవం ఇదేనా చంద్రబాబూ?
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసలు ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందని, కూటమి నేతల అరాచకాలపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారాయన. తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం జరగడంపై ఆయన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి. ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసింది. అలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?. ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాం. పోలీసు బలగాలను పెంచాలని కోరాం. మా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?. వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?. ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోంది. ప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారు. మావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారు. బీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారు. ఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారు. తిరుపతి ప్రతిష్టను మళ్లీ దిగజార్చారుతిరుపతి ప్రతిష్టను మరోసారి టీడీపీ నేతలు దిగజార్చారు. మొన్న లడ్డూ వ్యవహారం, గతంలో అమిత్‌షా పై దాడి చేశారు. ఇప్పుడు పట్టపగలే తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరానికి ఉన్న ప్రతిష్టకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది.నిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాం. పోలీసులపై నమ్మకం లేదని చెప్పాం. ఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాం. కూటమి అరాచకాలను అరికట్టాలని కోరతాం అని అప్పిరెడ్డి అన్నారు. -
ఇంతవరకు విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదు
-
వైఎస్ జగన్ పై ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది
-
‘వైఎస్ జగన్ భద్రతపై ఎల్లోమీడియా విషపు రాతలు రాస్తోంది’
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత గురించి ఎల్లోమీడియా విషపు రాతలు రాస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా.. ‘ఎల్లోమీడియా ఏపీలో ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. ఎస్ఆర్సీ కమిటీ సమీక్ష ప్రకారమే వీఐపీల భద్రతను కల్పిస్తారు. కానీ వైఎస్ జగన్ భద్రతకు అధికంగా వ్యయం చేస్తున్నట్టు రోత మీడియా రాసింది. ..సీఎంకి సంబంధించిన భద్రతని ఏ సీఎం కూడా నిర్ణయించుకోరు. ఇంటిలిజెన్స్, పోలీసు అధికారుల నిర్ణయం మేరకు తీసుకుంటారు. చంద్రబాబు కేవలం 120 మంది మాత్రమే భద్రత అంటూ కథలు రాస్తున్నారు. జగన్‌కు కల్పించిన భద్రత రికార్డులు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. సివిల్ పోలీసులు 18 మంది, ఆర్మడ్ 33 మంది,బెటాలియన్ 89 మంది మాత్రమే ఉన్నారు. బయటకు వెళ్లినప్పడు ఆక్టోపస్ 13 మంది ఉంటారు. మొత్తం 196 మంది వైఎస్ జగన్‌కు భద్రత ఉంటారు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇదే విధానం అమలు అవుతుంది. కార్యక్రమాలు, తిరిగే ప్రాంతాలను బట్డి అధికారుల నిర్ణయాలు ఉంటాయి. కానీ ఎల్లోమీడియా తప్పుడు వార్తలు రాస్తోంది...చంద్రబాబు బయటకు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆపటం లేదా?. చంద్రబాబు గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ మా గురించి తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదు. చంద్రబాబు తన మనమడికి కూడా 4+4 సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు?. ప్రభుత్వ ధనాన్ని ఎందుకు వినియోగిస్తున్నారు?. తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం సృష్టించవద్దు. చంద్రబాబు, వైఎస్ జగన్‌లకు ఎంత భద్రత ఉందో అధికారిక రికార్డులను బయట పెట్టాలి. ఆ రికార్డులు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వానికి వారధులుగా ఉండాల్సిన చంద్రబాబుకు తొత్తుగా ఎల్లో మీడియా వ్యవహరిస్తుంది’అని విమర్శలు గుప్పించారు. -
ఆ మహాకవికి నా నివాళి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, నవయుగ కవిచక్రవర్తి, మహాకవి గుర్రం జాషువా జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు ఆయన్ని స్మరించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. తన కవితల ద్వారా గుర్రం జాషువా మూఢాచారాలను ప్రశ్నించారని, దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా కావ్యాలు రాశారని అన్నారు . తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు ఎల్లకాలం గుర్తుంటాయన్న వైఎస్ జగన్.. ఆ మహాకవి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు అని ఎక్స్‌లో ఓ సందేశం ఉంచారు.అప్పటి మూఢాచారాలను తన కవితల ద్వారా ప్రశ్నించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా గారు. దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా ఆయన రాసిన ఎన్నో కావ్యాల్లో ``గబ్బిలం ``ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆ మహాకవి జయంతి సందర్భంగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2024 YSRCP కేంద్ర కార్యాలయంలో.. మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. జాషువా విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు కొమ్మూరి కనకారావు, అడపా శేషు, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయాలపై సాహిత్య ఉద్యమం ఆరంభించిన నవయుగ కవి చక్రవర్తిగా, అప్పటి మూఢాచారాలను తన కవితల ద్వారా ప్రశ్నించిన మహాకవిగా తనదైన ముద్ర వేసుకున్న గుర్రం జాషువాను ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేసుకున్నారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. -
జగన్ నాకు దేవుడితో సమానం.. బొత్సకు ఆ పదవి ఇవ్వమని నేనే చెప్పా..
-
ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేతగా బొత్స సత్యనారాయణ
సాక్షి, గుంటూరు: విశాఖ జిల్లా స్థానిక సంస్ధల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలి ప్రతిపక్షనేతగా ఎంపిక చేసినట్లు పార్టీ కేంద్రకార్యాలయం ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బొత్సకు ఆయన అభినందలు తెలిపారు.విశాఖ జిల్లాలో జరిగిన స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. జడ్పీటీసీలు, ఎంపీటీసీల సహా స్థానిక సంస్థల సభ్యులందరూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నాయకత్వంపై విధేయత, విశ్వాసంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి బొత్సను గెలిపించారన్నారు. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ గతిలేక అభ్యర్థులను కూడా పెట్టలేకపోయిందన్నారు.ప్రస్తుతం పార్టీ కార్యాలయ బాధ్యతలతో పాటు శాసనమండలిలో ప్రతిపక్షనేతగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాను.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శాసనమండలి ప్రతిపక్షనేతగా బొత్స సత్యనారాయణను నియమించాలని అధ్యక్షుడు ముందు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ విషయంలో మరలా తనను ఆలోచించుకోమని చెప్పినప్పటికీ.. సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణనే నియమించాలని కోరామన్నారు. ఈ నేపథ్యంలో తమ అభ్యర్ధనను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆమోదించారని అప్పిరెడ్డి తెలిపారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తాను వైఎస్ జగన్ వెంటే ఉంటూ.. క్రమశిక్షణ కల్గిన కార్యకర్తల్లాగే పని చేశాన్నారు. తాను గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా వైఎస్ జగన్ వలనే నియమితుడయ్యానన్నారు. ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన వలనే వచ్చిందన్నారు. అలాంటి అవకాశాలు వస్తూనే ఉంటాయని.. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పని చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటానని ఆయన స్పష్టం చేశారు. -
జగన్ ని చూసి నేర్చుకో.. ఒక్కసారైనా మాట నిలబెట్టుకో బాబు..
-
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డి
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్ పేరిట సోమవారం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మరోవైపు శాసనసభలో తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదివరకే స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. -
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకొపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు..? అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుంది. అదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పింది.కానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోంది. ఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?. విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారు. చంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్.. నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?’ అని లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. -
పార్టీ ఫిరాయించిన కృష్ణమూర్తిపై విప్ అప్పిరెడ్డి ఫిర్యాదు
-
"రామోజీ.. సిగ్గుందా నీకు.": లేళ్ల అప్పిరెడ్డి
-
24 గంటల్లో తొలగించాలి.. చంద్రబాబుకు ఈసీ నోటీసులు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పోస్ట్ పెట్టింది. దీంతో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఎక్స్(ట్విటర్), ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారం చేస్తున్నారంటూ తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్‌పై అసభ్య పోస్టులు తొలగించాలని సీఈవో ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఈవో ముఖేష్ కుమార్‌మీనా స్పష్టం చేశారు. -
సిద్ధం సభపై ఎల్లో మీడియా దుష్ప్రచారం..మండిపడ్డ లీల అప్పిరెడ్డి
-
రాజధాని ఫైల్స్ ప్రదర్శనను ఆపండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలన్న ఏకైక ఉద్దేశంతో తీసిన ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనను నిలుపుదల చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం ప్రారంభించింది. ఆ సినిమాను థియేటర్లలో ప్రదర్శించేందుకు వీలుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సరి్టఫికేషన్ (సీబీఎఫ్సీ) జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఈ సినిమా వైఎస్సార్సీపీ తరఫున న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. రాజధాని ఫైల్స్ పేరుతో తీసిన సినిమా ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడమేనన్నారు. అవాస్తవాలతో ప్రజలను మ«భ్యపెట్టేందుకే ఈ చిత్రాన్ని నిరి్మంచారని తెలిపారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక ప్రజల్లో వైఎస్సార్సీపీని పలుచన చేయాలన్న ఉద్దేశం కూడా ఉందన్నారు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సహా పార్టీ పెద్దలందరినీ అప్రతిష్ట పాల్జేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని, ఎమ్మెల్యే కొడాలి నాని, ఇతర సభ్యులను పోలి ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పాత్రల పేర్లు కూడా నిజ జీవితంలో ఆయా వ్యక్తుల పేర్లను పోలి ఉన్నాయన్నారు. అమరావతి పేరును ఐరావతి, ప్రధాని పేరును సురేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును రాంబాబు వంటి నిజ జీవితంలో పోలి ఉండే పేర్లను ఆయా పాత్రలకు పెట్టారన్నారు. స్వీయ, రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఈ నెల 5వ తేదీన రాజధాని ఫైల్స్ ట్రైలర్ విడుదల చేశారని, అందులో ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించారని న్యాయవాది ప్రశాంత్ వివరించారు. చిత్ర నిర్మాతలు తమ స్వీయ, రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీని బలి పశువును చేస్తున్నారన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఎప్పుడూ కూడా పరిమితులకు లోబడి ఉంటుందని వివరించారు. వైఎస్సార్సీపీ ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా చిత్ర నిర్మాతలు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రాన్ని నిరి్మంచారని వివరించారు. ఈ చిత్రం నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తులెవరు, వారి ఉద్దేశాలు ఏమిటి తదితర వివరాలను సీబీఎఫ్సీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న మూడు రాజధానుల అంశంపై సినిమా తీయడం ఎంతమాత్రం సరికాదని కూడా వివరించామన్నారు. అయినా తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా రాజధాని ఫైల్స్ చిత్ర ప్రదర్శనకు సీబీఎఫ్సీ అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేశారన్నారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, చిత్ర ప్రదర్శనను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. కించపరిచేలా సన్నివేశాల్లేవు చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. మొదట తమ చిత్రాన్ని ఎగ్జామిన్ కమిటీ చూసి పలు సన్నివేశాలను తొలగించాలని చెప్పిందని, దీనిపై తాము రివిజన్ కమిటీని ఆశ్రయించామని చెప్పారు. రివిజన్ కమిటీ కూడా పలు సన్నివేశాలను తొలగించాల్సిందేనని చెప్పిందని, దీంతో ఆ సన్నివేశాలను తొలగించామన్నారు. ఆ తరువాతే సీబీఎఫ్సీ తమకు చిత్ర ప్రదర్శనకు అనుమతినిస్తూ సరి్టఫికెట్ జారీ చేసిందన్నారు. తమకు గత ఏడాది డిసెంబర్లో సర్టిఫికెట్ ఇస్తే వైఎస్సార్సీపీ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఉత్తర్వులు జారీ చేశారు. -
చంద్రబాబు ఇక ఆటలు సాగవు
-
గుంటూరు బ్రాడీపేటలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
-
వరద బాధితులను ఇలా పరామర్శిస్తారా?
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో అసలు వరద గురించిన ప్రస్తావనే లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముంపు గ్రామాలకు వెళ్లిన చంద్రబాబు వరద బాధితుల గురించి కాకుండా.. శ్రీలంక గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. దారి పొడవునా ఆయన డప్పు తప్ప ఏం లేదన్నారు. ఈ విధంగా ఎవరైనా వరద బాధితులను పరామర్శిస్తారా అని అప్పిరెడ్డి ప్రశ్నించారు. -
అక్రమ కట్టడాలను కూల్చడం తప్పా?
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మతి తప్పిందని, భ్రమల్లో బతికేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్నీ కూల్చేస్తున్నారని, ప్రాజెక్టులు ఆపేస్తున్నారని, ఏదేదో జరిగి పోతోందని ఒక నెగెటివ్ ఇమాజినేషనన్‌లోకి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ఇలాంటి భ్రమలు, ఆలోచనలు వారి మీద వారికే పట్టు కోల్పోయిన వారికి వస్తాయని చెప్పారు. అక్రమ కట్టడాలు కూల్చడం తప్పెలా అవుతుందని చంద్రబాబును ప్రశ్నించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదని తెలిసి కూడా తలలో మొదడు ఉన్నవారు ఎవరైనా ప్రజావేదిక పేరుతో అక్రమ కట్టడాలు నిర్మిస్తారా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఆనాటి టీడీపీ మంత్రి దేవినేని ఉమా చౌదరి కృష్ణా నదిలో బోటు మీద తిరిగి కట్ట మీద ఉన్న వన్నీ అక్రమ కట్టడాలని, తొలగిస్తామని చెప్పారని, ఉమా చెప్పి వదిలేస్తే తాము అధికారంలోకి వచ్చాక తొలిగించామని, ఇది తప్పేలా అవుతుందని నిలదీశారు. -
కొత్త జిల్లాల ఏర్పాటుతో వైఎస్ఆర్ సీపీ శ్రేణుల సంబరాలు
-
ప్రజా సంకల్ప యాత్ర చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగించిన ప్రజా సంకల్ప పాదయాత్ర కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. పాదయాత్ర పూర్తయ్యి నేటికి మూడేళ్లవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించారని చెప్పారు. పాదయాత్ర ఆద్యంతం ప్రజల గుండెల్ని హత్తుకుందన్నారు. పాదయాత్రలో మూడు సంవత్సరాల క్యాలెండర్లు మారాయని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక నవరత్నాల ద్వారా సంక్షేమ ఫలాలను ఇంటింటికీ అందిస్తున్నారని పేర్కొన్నారు. తండ్రి డాక్టర్ వైఎస్సార్‌లా పేదవాడి గుండెల్లో బతకాలన్న కసే వైఎస్ జగన్‌ను ముందుకు నడిపిస్తోందని తెలిపారు. ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు ఎలా ఉంటాడో, వైఎస్ జగన్‌ను చూసి నేర్చుకుంటాయని చెప్పారు. ప్రతిదీ రాజకీయం చేయడం టీడీపీకి అలవాటే ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని కొప్పరపాలెంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోలు పోసి, నిప్పంటించిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని అప్పిరెడ్డి కోరారు. మొన్న పల్నాడులో ఒక తాగుబోతు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడంటూ గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు.. దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహం పట్ల జరిగిన దుశ్చర్యను ఎందుకు ఖండించలేక పోతున్నారని ప్రశ్నించారు. విగ్రహాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం టీడీపీకి మొదటి నుంచీ అలవాటేనని ఆయన « ద్వజమెత్తారు. -
సారా మాటలు డైవర్షన్ కోసమే.. బీజేపీ చీప్ పాలిట్రిక్స్
సాక్షి, అమరావతి/పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): సోము వీర్రాజు మాట్లాడిన ‘సారా మాటల‘ డైవర్షన్ కోసమే బీజేపీ చీప్ పాలిట్రిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. స్వాతంత్య్రానికి పూర్వమే గుంటూరులో నిర్మించిన జిన్నా టవర్‌ను అడ్డం పెట్టుకుని ఇప్పుడు నీచ రాజకీయం చేయాలని చూడటం ఆ పార్టీ సంస్కృతిని తేటతెల్లం చేస్తోందని విమర్శించారు. జీవీఎల్ నుంచి విష్ణు వరకు ఆ పార్టీ నేతలందరికీ సోము వీర్రాజు వ్యాఖ్యల తర్వాతే జిన్నా టవర్ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిన్నా టవర్ పేరు మార్చాలని, లేదంటే తామే కూలుస్తామని బీజేపీ నాయకులు మూకుమ్మడిగా విద్వేష విషం చిమ్మడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిగ్గులేని సారా మాటలు మాట్లాడిందేగాక, డైవర్షన్ రాజకీయాలా? అని దుయ్యబట్టారు. చారిత్రక కట్టడమైన జిన్నా టవర్‌ను అప్పట్లో మత సామరస్యం కోసం కట్టారన్నారు. దేశభక్తి గురించి బీజేపీ నేతలు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. మత ఘర్షణలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో ఉనికిని కాపాడుకునే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో ఉన్న జిన్నా టవర్ గురించి కడపలో ఉండే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ట్వీట్ చేయడం, దాన్ని సమర్థిస్తూ జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజాసింగ్ వంటి వారు గొంతు కలపడం చూస్తుంటే, ఇదంతా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ పథకం ప్రకారం చేస్తున్న కుట్రగా అర్థం అవుతోందని చెప్పారు. ఏపీలో సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నంతకాలం వారి ఆటలు సాగవని చెప్పారు. బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ 2005లో పాకిస్తాన్లో జిన్నా సమాధి వద్ద.. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన లౌకికవాది జిన్నా అని, ఆయన హిందూ–ముస్లింలకు అంబాసిడర్ వంటి వారని మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు అర్థరహితం: ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరులో జిన్నా టవర్‌కు జాషువా, కలాం పేర్లు పెట్టవచ్చు కదా అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా చెప్పారు. బీజేపీ నేతలు ట్విట్టర్ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయలబ్ధి కోసమేనని విమర్శించారు. గుంటూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని కులాలు, మతాల వారు సామరస్యంగా మెలుగుతున్న తరుణంలో విద్వేషాలు సృష్టించేలా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. -
మర్యాద పూర్వకంగా గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: నూతనంగా ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకున్న తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను శనివారం మర్యాద పూర్వకంగా కలిసారు. రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో గవర్నర్ వీరితో ముచ్చటించారు. ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాసన వ్యవస్ధలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన పరిషత్తుకు వన్నె తీసుకురావాలని, అర్ధవంతమైన చర్యలతో ప్రజా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ సూచించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్న తలశిల రఘురామ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ కార్యక్రమాలను గురించి గవర్నర్‌కు వివరించారు. అలాగే పార్టీ కార్యాలయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, ఇతర సేవ కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రఘురామ్, అప్పిరెడ్డి గౌరవ గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!! -
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
గుంటూరు ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు. ►రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇచ్చిన ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరిధర్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విశాఖపట్నం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాస్.. ఎమ్మెల్సీలు వంశీ, కల్యాణి, మేయర్,జడ్పీ చైర్మన్‌తో కలిసి కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లా విజయవాడ సత్యనారాణయపురంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు,.. కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం రోడ్లపై నిద్రిస్తున్న యాచకులకు, వృద్ధులకు.. దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి శంకర నారాయణ పెనుకొండ బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ►పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయి గూడెం మండలం ముప్పిన వారి గూడెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ►సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ►మొక్కలు నాటి, శివాలయంలో పత్యేక పూజలు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం ప్రధానంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పార్టీ నిర్ణయించిందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పుట్టినరోజు పార్టీ శ్రేణులకే కాకుండా ప్రజలందరికీ పర్వదినం వంటిదన్నారు. అందుకే ఆ రోజు సేవా కార్యక్రమాలతోపాటు ప్రత్యేకంగా ప్రజల్లో అవగాహన పెంచే విధంగా ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో గతేడాది కరోనా నేపథ్యంలో రక్త నిల్వల కొరతను నివారించడానికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తద్వారా ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం మొక్కలు నాటడం, రక్తదానం, పేదలకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసరాల పంపిణీ, అన్నదానం తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సీఎం జగన్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారన్నారు. -
సీఎం జగన్ ఎవరితో పోరాడాలి పవన్?: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానిది తప్పు లేదని, సీఎం జగన్ ఏం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాలని అజ్ఞాన వాసి పవన్ కల్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. పవన్ మాట్లాడేది కనీసం ఆయనకు అయినా అర్థమవుతుందా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కేంద్రానిదని, రాష్ట్రానికి చెందినది కాదని పవన్ ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. సోమవారం తాడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దు అంటూ సీఎం జగన్ ఈ సంవత్సరం (2021) ఫిబ్రవరి 6 , మార్చి 10 న ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశారన్నారు. మే 20న అసెంబ్లీలో తీర్మానం చేశారని తెలియజేశారు. సీఎం జగన్, కేంద్రంలో భాగస్వామి కాకపోయినా ఎక్కడా తగ్గకుండా ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కూడా తెలుసునన్నారు. ఢిల్లీలో రాజ్యసభ, పార్లమెంటుల్లో రోజూ హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్ పీపీ నేత వి.విజయ సాయిరెడ్డి నాయకత్వాన వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాడుతున్న విష యం అందరం చూస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ఏబీఎన్ సైతం ప్రసారం చేసిందని, వామపక్ష పత్రిక అయినా ప్రజాశక్తి సైతం వార్తను ప్రచురించిందని గుర్తు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే పవన్ కల్యాణ్ ఏమి ఎరుగనట్లు సినీ డ్రామాను ప్లే చేస్తూ ఆందోళన చేయటం సబబుగా లేదన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి, తొమ్మిది ఏళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉండి విశాఖ స్టీల్ ప్లాంటుకు ఒడిశా లో సొంత ఇనుప గనులు చంద్రబాబు కేటాయింపచేసి ఉంటే నష్టాలూ తగ్గి, లాభాల బాట పట్టేదన్నారు.ఇది అందరూ అంగీకరించే వాస్తవమని తెలిపారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన సుజనా చౌదరిని పట్టుపట్టి కేంద్ర మంత్రిని చేయడంలో చూపిన శ్రద్ధ ఉక్కు గనుల కేటాయింపులో చంద్రబాబు చూపలేదన్నారు. అయినా తన పార్టనర్ బాబుని అనడానికి పవన్‌కు మనసొప్పదని తెలిపారు. బాబు కాలిలో ముళ్ళు గుచ్చుకొంటే పవన్ కంటిలో కన్నీరు వస్తుందన్నారు. బీజేపీ మీద ఉద్యమం చేయకుండా వైఎస్సార్ సీపీ మీద ఉద్యమం చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటన చేస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ ఎప్పుడూ వైఎస్ జగన్ మీద, వైఎస్సార్సీపీ మీద విమర్శలు చేయడం ఆయనకు అలవాటు అయిపోయిందని దుయ్యబట్టారు. సినిమాల్లో డైరెక్టర్ ఏం చెబితే అది చెప్పడం, కమర్షియల్‌గా హిట్ రావాలంటే ఏ డైలాగ్స్ చెబితే బాగుంటుందంటే వాటిని వాడటం, స్క్రిప్ట్ ఏది ఉంటే అది చెప్పడం పవన్‌కు బాగా అలవాటుగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి పవన్ కల్యాణే హానికరం అని ప్రజలు అంటున్నారని దుయ్యబట్టారు. చదవండి: కడుగు.. కడుగు!! బాగా కడుగు.. ఈ దెబ్బతో కారు తళ తళ మెరిసిపోవాలి! -
టీడీపీ అక్రమాలపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు
సాక్షి, అమరావతి: మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు, అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి సోమవారం ఫిర్యాదు చేశారు. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలలో అలజడులు, ఆటంకాలు సృష్టించాలని, శాంతిభద్రతల సమస్య నెలకొనేలా చేయాలని చంద్రబాబు ప్రయత్నించారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందని తెలిపారు. చంద్రబాబు రాబోయే ఓటమికి సాకులు వెదుకుతున్నారని, దానిలో భాగంగా కుప్పంలో దొంగఓట్లు అంటూ కొత్తపల్లవి అందుకున్నారని విమర్శించారు. ఓడిపోయే సమయంలో ఇలాంటి సాకులు రెడీ చేసిపెట్టుకునే అలవాటు చంద్రబాబుకు ఉందనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు అక్రమాలపై తాము చేసిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు కూడా ఎన్నికల కమిషనర్‌కు అందచేశామని చెప్పారు. కమిషనర్‌ను కలిసిన వారిలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణమూర్తి కూడా ఉన్నారు. -
కుప్పంలో టీడీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు
సాక్షి, అమరావతి: కుప్పంలో టీడీపీ అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాలు వైస్ చైర్మన్ నారాయణమూర్తి వినతిపత్రం అందజేశారు. అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ఈ ఎన్నికల్లో చంద్రబాబు పడుతున్న పాట్లు చూస్తే జాలి కలుగుతోంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా 80శాతం ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కడుతున్నారు. కుప్పంలో చంద్రబాబు ఓటుకి రూ. 5వేలు ఇస్తున్నారు. అనేక రకాలుగా ప్రలోభ పెట్టేలా మాట్లాడుతున్నారు. ఏ కేసులో అయినా 48 గంటల్లో స్టే తెచుకుంటామంటూ లోకేష్ న్యాయ స్థానాల్ని అవమానించేలా మాట్లాడుతున్నారు' అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. చదవండి: (తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..) -
ఎయిడెడ్‌ను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి.. వాటిని నిర్వీర్యం చేసిన ఘనుడు చంద్రబాబేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఎలాంటి నియామకాలు చేపట్టడానికి వీలు లేకుండా ఖాళీల భర్తీని తిరస్కరిస్తూ 1999లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ విద్యార్థి యూనియన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నత్ హుస్సేన్‌తో పాటు 200 మంది టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, సభ్యులు వైఎస్సార్సీపీలో చేరారు. శనివారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వారిని లేళ్ల అప్పిరెడ్డి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న ప్రయోజనాలను తెలుసుకోవాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, విద్యా సంస్థలను అభివృద్ధి చేయడమే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు టీడీపీ నేతల ట్రాప్‌లో పడవద్దని కోరారు. ప్రభుత్వంలో విలీనం వల్ల ఫీజులు పెరుగుతాయంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇష్టానుసారం ఫీజులు పెంచేందుకు వీలులేదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు కూడా ఆగకూడదని, అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, నాడు–నేడు.. ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌కు మద్దతుగా నిలవాలని ప్రజల్ని కోరారు. టీఎన్ఎస్ఎఫ్ నేత జన్నత్ మాట్లాడుతూ.. విద్యార్థులు, విద్యా సంస్థల అభివృద్ధి కోసం సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు నారాయణమూర్తి, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ తప్పుడు ప్రచారం.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మిస్డ్ కాల్ ఇస్తే టీడీపీ ప్రభుత్వం రాగానే పన్ను మినహాయింపులు అంటూ ప్రకటనలు ఇస్తోంది. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యలయ ఇన్చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్రకు ఫిర్యాదు చేశారు. ప్రజలను మభ్యపెడుతూ నిబంధనల ఉల్లంఘనకి పాల్పడిన టీడీపీ జాతీయ అధ్యక్షుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ కోరారు. చదవండి: (కుప్పంలో కొత్త నాటకం.. టీడీపీ సానుభూతి డ్రామా) -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం
సాక్షి, అమరావతి: అమాయక ప్రజలను అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేస్తే, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు అండగా నిలిచి ఆదుకున్నారని అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల అగ్రిగోల్డ్ బాధితులు ఆదివారం ‘థ్యాంక్యూ సీఎం సార్’ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అగ్రిగోల్డ్ బాధితులు, సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం తరఫున రూ.905 కోట్ల మేర సహాయం అందించిన సీఎం.. చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా దేశంలో దాదాపు 8 రాష్ట్రాల్లో లక్షలాది మంది నష్టపోయారన్నారు. ఆరేళ్ల క్రితం సంస్థను మూసి వేయడంతో డబ్బు కోసం రోడ్డెక్కి ఆందోళనలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేశామన్నారు. సంస్థ ఆస్తులు విక్రయించడం ద్వారా బాధితులకు న్యాయం చేయవచ్చని గత ప్రభుత్వ హయాంలో కింది స్థాయి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వరకూ ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు అందించినా పట్టించుకోలేదని చెప్పారు. పోలీసులతో లాఠీచార్జ్‌లు చేయించి, కేసులు పెట్టి, జైళ్ల పాలు చేశారని వాపోయారు. ఆ సమయంలో పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు, అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన 10.40 లక్షల మందికి రూ.905 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయ, సాంకేతిక సమస్యల వల్ల కొంత మంది బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి వినతిపత్రం అందచేశారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘ నాయకులు రత్నాచారి, మోజెస్, జడ్ సన్, రాము, నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అచ్చెన్నకు మతి తప్పింది
సాక్షి,అమరావతి: టీడీపీలో ఇంత వరకు చంద్రబాబు, లోకేశ్‌కే పూర్తిగా మతి చెడిందని అనుకున్నామని, అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు చెల్లించడంపై అచ్చెన్నాయుడు చేసిన విమర్శలు చూస్తే అచ్చెన్నకు కూడా పూర్తిగా మతి తప్పిందని అనిపిస్తుందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కో–ఆర్డినేటర్ లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు నగదు చెల్లింపుపై కొన్ని పత్రికలు, కొంతమంది స్వార్థరాజకీయ నాయకులు కువిమర్శలు చేయడంపై అప్పిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అగ్రిగోల్డ్‌లో రూ.20 వేలు లోపు పొదుపు చేసిన వారికి ప్రభుత్వమే ముందుగా చెల్లించి.. ఆ తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులమ్మి తీసుకోవాలని ప్రతిపక్ష నేతగా సీఎం జగన్.. ఆనాడే అసెంబ్లీ సాక్షిగా అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సూచించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కానీ ఆర్బీఐ ఒప్పుకోదన్న కుంటిసాకుతో బాధితుల బలవన్మరణాలకు, వారి కుటుంబాలు రోడ్డున పడడానికీ కారకుడైన చంద్రబాబుకు నేడు అగ్రిగోల్డ్ అన్న పదాన్ని ఉచ్ఛరించడానికి కూడా అర్హత లేదని మండిపడ్డారు. -
అగ్రి గోల్డ్ బాధితులకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పాదయాత్ర సందర్భంగా అగ్రి గోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తూ ఆదుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ఈ నెల 24న రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేయనుందని తెలిపారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 19 వరకూ 7.76 లక్షల మంది డిపాజిట్‌దారులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి ఇప్పటికే రూ.240 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్న 1995లో అగ్రి గోల్డ్ సంస్థ భారీ ఎత్తున డిపాజిట్లను సేకరిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదని అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. డిపాజిట్‌దారులకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 2015లో అగ్రిగోల్డ్ యాజమాన్యం బోర్డు తిప్పేస్తే.. ఆ యాజమాన్యంతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తమ పోరాటాల వల్లే అగ్రి గోల్డ్ బాధితులకు ప్రభుత్వం నగదు చెల్లిస్తోందని చంద్రబాబు, టీడీపీ నేతలు బీరాలు పలుకుతున్నారని విమర్శించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అగ్రి గోల్డ్ కేసును తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిందన్నారు. -
ఈ నెల 24న అగ్రి గోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు అండగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర స్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. ఆర్బీఐ నిబంధనలకి విరుద్ధంగా టిడిపి ప్రభుత్వ హయాంలో అగ్రి గోల్డ్‌ను ప్రారంభించారని తెలిపారు. అగ్రి గోల్డ్ యాజమాన్యంతో టిడిపి ప్రభుత్వం కుమ్మక్కై బాధితులకి అన్యాయం చేశారాని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా ప్రైవేట్ సంస్ధ మూసేస్తే బాధితులకి ప్రభుత్వం న్యాయం చేసిన దాఖలాలు లేవు అని ఆయన అన్నారు. చదవండి:రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు కానీ, అగ్రి గోల్డ్ బాధితుల కష్డాలని నేరుగా చూసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వం తరపున న్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 20 వేల రూపాయిల లోపు డిపాజిట్లు కట్టిన బాధితులకి న్యాయం చేయాలని వైఎస్ జగన్ చంద్రబాబుని డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. ఈనెల 24న 20 వేల రూపాయలలోపు ఉన్న అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు లేళ్ల అప్పిరెడ్డి వివరించారు. ఇప్పటికే రూ.10వేల లోపు డిపాజిట్‌దారులకు రూ.240 కోట్లు చెల్లించామని, 67 ఎకరాల అగ్రిగోల్డ్ స్థలాన్ని కోర్టుకు స్వాధీనం చేశామని ఆయన వెల్లడించారు. చదవండి:వైఎస్సార్సీపీ మహిళా పక్షపాత ప్రభుత్వం: వాసిరెడ్డి పద్మ -
సీఎం జగన్‌పై దుష్ప్రచారం.. సీఐడీ పోలీసులకు ఫిర్యాదు
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై.. ఏపీ సీఐడీ పోలీసులకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్ఫింగ్ కంటెంట్‌తో విద్వేషపూరితమైన ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్న వారిపై.. చర్యలు తీసుకోవాలని సీఐడీ పోలీసులను లేళ్ల అప్పిరెడ్డి కోరారు. టీడీపీ పొలిటికల్ వింగ్, టీడీపీ యాక్టివిస్ట్, రాజ్‌బొడ వంటి పేజ్‌లపై చర్యలు తీసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు. -
నామినేటెడ్ పదవుల్లోనూ సామాజిక న్యాయం: సజ్జల
అమరావతి: నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీల ఎంపికలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయం పాటించారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 4 ఎమ్మెల్సీలను కాపు, ఎస్సీ, ఓసి, బీసీ వర్గాలకు ఇచ్చారని, ప్రతి సందర్భంలోను అన్ని వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి ఊహాగానాలకు తావులేకుండా సీఎం జగన్ స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని గుర్తుచేశారు. ముగ్గురు మైనారిటీలకు, బీసీలకు అధిక ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని తెలిపారు. అలానే ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీలుగా సీఎం జగన్ అవకాశం ఇచ్చారని, నామినేటెడ్ పదవుల్లో కూడా ఇలానే సామాజిక న్యాయం పాటిస్తున్నామని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం సీఎం జగన్ ఎంత కచ్చితంగా నిలబడతారో ఇదే నిదర్శనమని గుర్తుచేశారు. శాసన మండలిలో టీడీపీ అడ్డంకులు ఇక ఉండవని, ప్రభుత్వ పాలసీల అమలు ఇక నుంచి సులభతరం అవుతుందని అన్నారు. శాసన మండలి రద్దు ప్రతిపాదన పెండింగ్‌లో ఉందని తెలిపారు. ప్రమాణ స్వీకారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నూతన ఒరవడి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ మోహన్‌రెడ్డిది అని అన్నారు. పార్టీ జెండా మోసిన నమ్మకాస్తులకు అవకాశాలు ఇచ్చే నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు.2006లో తనను మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారని, 2014లో టికెట్ ఇచ్చి ప్రోత్సహించారని గుర్తుచేశారు. ఈ రోజు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని, అందుకే తనకు సీఎం జగన్ దేవుడు లాంటివారని చెప్పారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నానని, తొలిసారి తమ నాయుకుడు, సీఎం జగన్ శాసన మండలిలో అవకాశం ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ అశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యానని తెలిపారు.అన్ని సామాజికవర్గాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ మోషేన్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయం చేసి చూపిస్తున్నారని అన్నారు.బీసీ, ఎస్సీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. అన్ని విషయాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వాటా దక్కేలా చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్ బోన్ కాస్ట్ అని సీఎం జగన్ నిరూపించారని తెలిపారు. కడప జిల్లాలో తొలిసారి బీసీ యాదవ వర్గానికి సీఎం జగన్ అవకాశం ఇచ్చారని అన్నారు. సమాన్యుడైన తనను చట్టసభలుకు పంపింనందుకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: శ్రీశైలం, కాణిపాక దర్శన వేళల్లో మార్పులు -
సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కార్యక్రమాలసమన్వయకర్త తలశిల రాఘురామ్ హాజరయ్యారు. చదవండి: జూన్ 20 తర్వాత ఏపీలో కర్ఫ్యూ సడలింపులు: సీఎం జగన్ -
తిరుపతిలో టీడీపీ అరాచకం
సాక్షి, అమరావతి: తిరుపతి పుణ్యక్షేత్రంలో భక్తులను భయభ్రాంతులకు గురిచేసి, ఓటర్లకు ఆందోళన కలిగించేలా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుపైన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి శనివారం ఫిర్యాదు చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే టీడీపీ.. తన అనుకూల మీడియాతో కలసి కొత్త డ్రామా ఆడిందని ఫిర్యాదులో వైఎస్సార్సీపీ పేర్కొంది. దైవ దర్శనానికి వచ్చే భక్తులను దొంగ ఓటర్లుగా చిత్రీకరించే ప్రయత్నం దుర్మార్గమంది. తిరుపతిపైనే టీడీపీ దృష్టి ఎందుకు? ‘‘తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కానీ కేవలం తిరుపతినే టీడీపీ లక్ష్యంగా ఎంచుకుంది. బస్సుల్లో వైఎస్సార్సీపీ నేతలు దొంగ ఓటర్లను తరలిస్తున్నారంటూ... టీడీపీ, ఇతర పార్టీలు నానా రభస చేశాయి. పథకం ప్రకారం చంద్రబాబు అనుకూల మీడియా రంగంలోకి దిగి భక్తులను భయపెట్టేలా ప్రవర్తించింది. రకరకాలుగా అవమానపర్చేలా ప్రశ్నలతో వేధించారు. చంద్రబాబు అనుకూల మీడియా తమ చానళ్లలో పదేపదే ప్రసారం చేయడం, టీడీపీ దీన్ని రాద్ధాంతం చేయడం షరా మామూలుగా జరిగింది. తిరుపతి పుణ్యక్షేత్రమైనందున ప్రతి రోజూ 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. ఇతర నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఈ కారణంగానే తిరుపతిని తమ పథకానికి కేంద్రంగా ఎంచుకుని, భక్తుల మనోభావాలతో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఆడుకోవడం క్షమించరాని నేరం. తిరుపతి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య. పక్కా ప్రణాళికతో టీడీపీ హైడ్రామా.. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టింది. అదనపు బలగాలను దించింది. కేంద్ర పరిశీలకులను ఏర్పాటు చేసింది. ఇదిగాక ప్రతీ పార్టీ నుంచి పోలింగ్ బూత్‌ల్లో ఏజెంట్లు ఉంటారు. ఓటరును గుర్తించిన తర్వాతే ఓటు వేయనిస్తారు. కానీ దొంగ ఓట్లు వేయించేందుకే బస్సుల్లో ఇతరులను తరలిస్తున్నారంటూ చంద్రబాబు ఆదేశాల మేరకు అసత్య ప్రచారం చేశారు. ఇది వైఎస్సార్సీపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ పన్నిన కుట్ర. పక్కా ప్రణాళికతో హైడ్రామా ఆడారు. పోలింగ్ సరళిని దెబ్బకొట్టే దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి’’ అని లేఖలో వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, తిరుపతి లోక్‌సభ ఎన్నిక సందర్భంగా భక్తులను కించపర్చేలా వ్యవహరించిన టీడీపీ నేతలపై చర్య తీసుకోవాలని కోరుతూ శనివారం ఉదయం లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర ముఖ్యనేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ ఈ వ్యవహారానికి పాత్రధారులని అందులో పేర్కొన్నారు. -
ఆ ఫేస్బుక్ పేజీని నడిపిస్తుంది లోకేశే.. డీజీపీకి ఫిర్యాదు
సాక్షి, అమరావతి: తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ సోషల్ మీడియా ప్రచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'సాహో చంద్రబాబు' అనే ఫేస్బుక్ పేజీ మీద వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫేస్బుక్ పేజీ నారా లోకేశ్ స్వీయ పర్యవేక్షణలో నడుస్తోందని తెలిపారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా వుంటే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కోవిడ్ నిబంధనలను పటిష్టంగా పాటిస్తూ ఏప్రిల్ 17న జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా పోలింగ్ సాగనుంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చిత్తూరు జిల్లాలోని మూడు, నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 17,11,195 మంది ఓటర్లు ఉండగా, అందులో 8.38 లక్షలమంది పురుష ఓటర్లు, 8.71 లక్షలమంది మహిళా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రం ఎక్కడుందో ఓటరు తెలుసుకునే విధంగా ‘మే నో పోలింగ్ స్టేషన్' యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. చదవండి: ‘తిరుపతి’ పోలింగ్‌కు సర్వం సిద్ధం తిరుపతిలో టీడీపీ డీలా -
భూములను అమ్ముకునేలా దళితులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన టీడీపీ నేతలు
-
గెలుపు ఊపులో వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: మునిసిపల్, నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించడం ఖాయమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనసున్న సీఎంగా వైఎస్ జగన్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థుల గెలుపునకు దోహదం చేశాయని చెప్పారు. ఆ విజయ పరంపర మునిసిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు. ఆదివారం జరగబోయే విజయోత్సవాలను పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద భారీగా సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీకి ప్రజలు పూర్తిగా చరమగీతం పాడినట్టేనని అన్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే సంబరాల ఏర్పాట్లపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి వరకు సంబరాలు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యకర్తల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సంబరాలకు హాజరయ్యే వారు విధిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. సమావేశంలో లేళ్ల అప్పిరెడ్డి, నేతలు ఎ.నారాయణమూర్తి, ఎన్.పద్మజ, న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆ రెండు గాడిదల నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నారు
సాక్షి,అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను జీర్ణించుకోలేక చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాడిదలు కాస్తున్నారా’ అన్న లోకేశ్ ప్రశ్నకు స్పందిస్తూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి రాష్ట్రంలో బరితెగించి తిరుగుతున్న రెండు పెద్ద అడ్డ గాడిదలను కాస్తున్నారని చెప్పారు. వాటిలో ఒకటి చంద్రబాబు కాగా.. రెండోది లోకేశ్ అని ఎద్దేవా చేశారు. వాటి బారినుంచి రాష్ట్రాన్ని జగన్ కాపాడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఈవీఎంల వల్ల మోసం జరిగిందని మాట్లాడిన చంద్రబాబుకు బ్యాలెట్ పేపర్లతోనూ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ‘చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్ విశాఖలో మాట్లాడిన మాటలు వింటే నవ్వొస్తోంది. ఇలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడని కొంత బాధ కూడా కలుగుతోంది. ప్రపంచంలోనే పేరొందిన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నానని చెప్పుకునే లోకేశ్, అక్కడ చదివి నేర్చుకున్న సంస్కారం ఇదేనా’ అని ప్రశ్నించారు. దుష్ప్రచారం, అవాస్తవాలు, అబద్ధాలు, కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, లోకేశ్ లాంటి రెండు గాడిదల నుంచి ప్రజలను రక్షించేందుకు తమ ప్రభుత్వం కాపలా కాస్తోందన్నారు. ‘విశాఖ ఉక్కు.. రాష్ట్ర ప్రజలందరి హక్కు’ విశాఖ ఉక్కు.. మన హక్కు అని, దానిని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు ఎప్పుడు బీజం పడిందో ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. ఫ్యాక్టరీలో పెట్టుబడులు ఉపసంహరిస్తూ 2017లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేశారని, 2017లో చంద్రబాబు భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే ఇలా చేస్తే కనీసం ఒక్క ఉత్తరమైనా కేంద్రానికి ఎందుకు రాయలేదని చంద్రబాబును నిలదీశారు. అప్పట్లో ఆశోక్ గజపతిరాజు కేంద్రంలో మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. పోస్కో ప్రతినిధులను చంద్రబాబు కలిసింది నిజం కాదా పోస్కో సంస్థ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిస్తే దాన్ని వక్రీకరిస్తున్నారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. 2017 డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షిణ కొరియా వెళ్లి.. పోస్కో ప్రతినిధులను కలిశారని గుర్తు చేశారు. అప్పట్లో పోస్కో సంస్థతో చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు టీడీపీ పిలుపునివ్వడం వల్ల ప్రయోజనం లేదని.. ఈ ఆందోళనల కన్నా బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉన్న లోకేశ్ ఆమరణ దీక్ష చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ కొన్ని సూచనలు కూడా చేసిందన్నారు. స్టీల్ ప్లాంట్ సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. -
‘లోకేష్ నువ్వు దీక్ష చేయ్.. ఒళ్లు తగ్గుతుంది’
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు ప్రజా తీర్పును చూసి ఓర్చుకోలేక పోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. లోకేష్ విశాఖలో మాట్లాడిన మాటలు సిగ్గు చేటన్నారు. పంచాయతీ ఎన్నికల మొదటి, రెండో విడత ఫలితాలు చూశాక తండ్రీకొడుకులకు మతిభ్రమించిందని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఈవీఎంలు వద్దు బ్యాలెట్లు పెట్టాలన్న చంద్రబాబుకు పంచాయతీల బ్యాలెట్ ఫలితాలు చెంపపెట్టులా మారాయి. టీడీపీలో ఉంటే మునిగిపోతామని తెలుసుకున్న నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారు. 2017లో ఆర్ధిక మంత్రి జైట్లీ.. విశాఖ ఉక్కు పెట్టుబడుల ఉపసంహరణపై ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ, బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్న నాడు విశాఖ ఉక్కు పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చుట్టారు. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఒక్క లేఖ రాయలేదు. ( స్టీల్‌ప్లాంట్ సెంటిమెంట్ వివరించాం: సోము ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. మూడు ప్రత్యామ్నాయ మార్గాలు చూపారు. విశాఖ ఉక్కు అంశంలో టీడీపీ వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏపీలో ప్రజలు తిరస్కరిస్తారనే చంద్రబాబు హైదరాబాద్‌లో నివాసం కట్టుకున్నారు. జయంతికి, వర్ధంతి తేడా తెలియని...లోకజ్ఞానం లేని వ్యక్తి లోకేష్. గతంలో అనేక సార్లు టీడీపీ వ్యతిరేక విధానాలపై ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి వైఎస్ జగన్. ఎవరి దీక్షకో మద్దతు ఇవ్వడం కాదు లోకేష్! నువ్వు దీక్ష చేయ్.. ఒళ్లు తగ్గుతుంది. ముఖ్యమంత్రి నాయకత్వంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటాము. ప్రజల కోసం వైఎస్సార్ సీపీ ఎటువంటి త్యాగాలకైనా సిద్దంగా ఉంది’’ అని అన్నారు. -
గెలవలేక టీడీపీ నేతల అరాచకాలు
సాక్షి, అమరావతి: మొదటి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసిందని, దీన్ని చూసి తట్టుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలపై బుధవారం ఎస్ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా, కడియపుసావరంలో మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారన్నారు. బుచ్చయ్యచౌదరిని ఎన్నికల ప్రచారం చేయకుండా నిరోధించాలని కోరారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనంతపురం జిల్లా బొమ్మనహళ్‌లో టీడీపీ జెండాలతో, వందలాది మందితో కలిసి ప్రచారం చేస్తున్నారన్నారు. వారు బలపరిచిన, పోటీలో ఉన్న సర్పంచి అభ్యర్థిని, వార్డు మెంబర్లను అనర్హులుగా ప్రకటించాలన్నారు. ఉరవకొండలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శీనప్ప నామినేషన్ వేసిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కౌకుంట్ల పంచాయతీలోని మైలారంపల్లి, వై.రామాపురం గ్రామాల్లోని వార్డు సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుంటే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు సిద్ధారెడ్డి, మల్లకేష్, భీమలింగ, మహేశ్, ఖాశీం తదితరులకు తగిన రక్షణ కల్పించాలన్నారు. -
ఎన్నికల అక్రమాలపై ‘ఈనేత్రం’
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం వైఎస్సార్సీపీ ప్రత్యేకంగా ‘ఈ నేత్రం’ యాప్‌ను తీసుకొచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ యాప్ ద్వారా క్షేత్ర స్థాయిలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. ఫొటోలు, వీడియోలు సైతం అప్లోడ్ చేసే సౌలభ్యంతో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలు, ఇతర సమస్యలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ‘ఈ నేత్రం’ యాప్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఫొటోలు, వీడియోల రూపంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తే, వాటిని ఎన్నికల సంఘానికి అందజేస్తామని తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. టీడీపీకి, ఎన్నికల కమిషనర్‌కు తేడా లేదు ► ఎస్ఈసీ నిమ్మగడ్డ యాప్ అంతా ఒట్టి బూటకం. టీడీపీకి, ఎన్నికల కమిషనర్‌కు తేడా లేదు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ రూపొందించిన ‘సి విజిల్’ యాప్‌ను ఉపయోగించకుండా కొత్త యాప్ ఎందుకు తీసుకొచ్చారో నిమ్మగడ్డ సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎస్ఈసీ ‘ఈ–వాచ్’ యాప్‌ను రూపొందించారు. దీని నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండటంతో మేము ‘ఈ నేత్రం’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాము. ఇది కొత్తది కాదు. 2014 నుంచి ఉన్న యాప్. మళ్లీ వాడుకలోకి తీసుకొచ్చాం. దీన్ని వైఎస్సార్సీపీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు విడదల కుమార స్వామి, ఎ.నారాయణ మూర్తి, ఎన్.పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ–వాచ్ ఉపసంహరించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆవిష్కరించిన ‘ఈ–వాచ్’ యాప్‌పై వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎన్నికల కమిషన్‌ను లిఖిత పూర్వకంగా కోరింది. కేంద్ర ఎన్నికల కమిషన్ లేదా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వ్యవస్థను ఉపయోగించాలని డిమాండ్ చేసింది. పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ‘ఎన్నికల కమిషన్ ప్రైవేట్ వ్యక్తులతో రూపొందించిన యాప్‌ను తీసుకురావడం తగదు. దీనివల్ల ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో డేటా ఉండే అవకాశముంది. ఇది పౌరుల హక్కులను హరించడమే’ అని పేర్కొన్నారు. -
ఆ యాప్ వాడొద్దు: ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
విజయవాడ: ఎస్ఈసీ నిబద్ధతపైన ఈ-వాచ్ యాప్‌తో అనుమానం వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈ-వాచ్ యాప్ డేటా విషయంలో గోప్యత కనిపిస్తోందని ఆరోపించారు. ఇంత గోప్యంగా ఎందుకు అని ప్రశ్నించారు. జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలకు తయారుచేసిన నిఘా యాప్‌ను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన సీ-విజిల్ యాప్‌ను ఎందుకు తేలేదని పేర్కొన్నారు. ప్రభుత్వాలతో, సీఈసీతో సంబంధం లేకుండా కొత్త యాప్ ఎలా తెచ్చారని అడిగారు. టీడీపీ నాయకులు ఈ-వాచ్ యాప్ తయారు చేయడానికి టైం పట్టిందని ఆరోపించారు. ఇప్పటికైనా సీఈసీ తీసుకొచ్చిన సీ-విజిల్ యాప్‌ను వాడాలని కోరినట్లు తెలిపారు. ఈ వాచ్ యాప్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కన్నబాబుకు లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో సీ విజిల్ యాప్ వినియోగించాలని విజ్ఞప్తి చేసినట్లు లేళ్ల తెలిపారు. ఈ వాచ్ యాప్‌పై అనేక అభ్యంతరాలున్నాయని చెప్పారు. ఎస్ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ అని గుర్తుచేశారు. నిమ్మగడ్డ ఇంత రహాస్యంగా యాప్‌ని ఎందుకు తయారుచేయాల్సి వచ్చిందో చెప్పాలని, ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన నిఘా యాప్‌ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. నిఘా యాప్ పక్కన పెడితే సీ విజిల్ యాప్ వినియోగిస్తారనుకుంటే ప్రైవేట్ వ్యక్తులు రూపొందించిన ఈ వాచ్ ఎలా ఉపయోగిస్తారని అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాచ్ యాప్ టీడీపీ కార్యాలయంలో తయారైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అరాచకాలు ఎస్ఈసీకి కనిపించవా అని ప్రశ్నించారు. ఈ వాచ్ ఎక్కడ తయారు చేశారో.. ఎలా తయారు చేశారో.. ఫిర్యాదులు చేరతాయో లేదో కూడా తెలియదని.. దీనిపై ఎన్నో అనుమానాలున్నాయని లేళ్ల అప్పిరెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వైఎస్సార్సీపీకి సర్టిఫికెట్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదానం రికార్డులకెక్కింది. ఈ మేరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సర్టిఫికెట్ అందింది. మంగళవారం ఈ సర్టిఫికెట్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మధుసూధన్‌రెడ్డి, ఆప్కో చైర్మన్ చిల్లపల్లితో కలిసి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. చదవండి: (రక్తం పంచిన అభిమానం) ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ జన్మదినం సందర్భంగా చేసిన రక్తదానం రికార్డులకెక్కింది. మేము రికార్డుల కోసం పనిచేయలేదు. కోవిడ్ సమయంలో రక్తం కొరత దృష్టిలో ఉంచుకొని ఓ మంచి పనిని చేపట్టాం. పార్టీ కార్యకర్తలుగా మాకు గర్వంగా ఉంది. ఈ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు మేము రక్తం అందిస్తున్నాం. భవిష్యత్తులో ప్రజల కోసం మరిన్ని సేవా కార్యాక్రమాలు చేస్తాం' అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి వేడుకలు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, అధికార ప్రతినిధి నారుమల్లి పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఆ ఘనత సీఎం జగన్‌దే: లేళ్ల అప్పిరెడ్డి పూజ కార్యక్రమం అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగడం లేదన్నారు. ఇచ్చిన హామీలన్ని ఏడాదిలోపు పూర్తి చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తలపెట్టే విఘ్నాలు తొలగిపోయేలా సీఎం జగన్‌కు వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. -
టీడీపీ నేతల తీరు అనుమానాస్పదం
పట్నంబజారు (గుంటూరు): కొద్ది కాలంగా జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నేతల తీరు అనుమానాస్పందంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. అను మతి లేనిదే లోనికి ప్రవేశించలేని సచివాలయ పరిసరాలను రాజధాని పర్యటనలో భాగంగా మాజీ మంత్రి లోకేష్, కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు డ్రోన్ల ద్వారా చిత్రీకరించారని, ఇలా చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. గుంటూరు అరండల్‌పేటలోని తన కార్యాలయంలో అప్పిరెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని పర్యటనలో భాగంగా చంద్రబాబు రోడ్లపై తిరుగుతుంటే, చినబాబు లోకేష్ సచి వాలయం వద్ద చక్కర్లు కొట్టారని విమర్శించారు. కృష్ణానదిలో వరదలకు సంబంధించి వస్తున్న నష్టాన్ని అంచనా వేసేందుకు డ్రోన్లను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తే నానా యాగీ చేసిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు అనుమతి లేని సచివాలయ ప్రాంతంలో డ్రోన్లు ఎలా వినియోగించారో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు ఉండే ఆయా ప్రాంతాలకు సంబంధించి డ్రోన్లతో చిత్రీకరించడం అనుమానం కలిగిస్తోందని పేర్కొన్నారు. దీనిపై తాము తుళ్లూరు సబ్ డివిజన్ డీఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అత్యంత భద్రత కలిగిన, వీవీఐపీలు ఉండేప్రదేశంలో అక్రమంగా డ్రోన్లతో చొరబడిన వారిపై కేసులు నమోదుచేయాలని కోరినట్లు తెలిపారు. ఏదైనా కుట్రలో భాగంగా లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతోందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లాల్పురం రాము, అత్తోట జోసఫ్, అంగడి శ్రీను, తోట వీరాంజనేయులు పాల్గొన్నారు. డ్రోన్ కెమెరాల వినియోగంపై డీఎస్పీకి ఫిర్యాదు.. తుళ్లూరురూరల్ (తాడికొండ): మాజీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం చేపట్టిన అమరావతి పర్యటనలో డ్రోన్ కెమెరాలను వినియోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం తుళ్లూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం, అసెంబ్లీ తదితర కీలక ప్రదేశాల్లో అనుమ తులు లేకుండా డ్రోన్ కెమెరాలను వినియోగించి విడియో తీయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ చర్య ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధుల భద్రతకు ముప్పు కలిగించే అంశమని పేర్కొన్నారు. భద్రతకు ముప్పు కలిగే అంశంగా పరిగణించి డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ చేపట్టిన మాజీ మంత్రి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. -
‘ఆయన తిన్నది అరక్క దీక్ష చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి : అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1150 కోట్లు కేటాయించడం పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ కో ఆర్డీనేటర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం లేళ్ళ అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థలు మోసం చేస్తే ప్రభుత్వం డబ్బులు చెల్లించిన దాఖలాలు ఎక్కడ లేవన్నారు. కానీ సీఎం జగన్ మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకుంటున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా బాధితులకు చెక్కులు ఇప్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చంద్రబాబు హయంలోనే ఇసుకు కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తిన్నది అరక్క లోకేష్ రేపు గుంటూరులో దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్‌ను విచారిస్తే ఏయే నదుల్లో ఎంత కుంభకోణం జరిగిందో బయటపడుతుందన్నారు. లోకేష్ నాయకత్వంలో గత ఐదేళ్లలో వేలకోట్ల రూపాయల ఇసుక దోపిడి జరిగిందని ఆరోపించారు. -
‘చంద్రబాబును చూసి సిగ్గుతో చచ్చిపోతున్నాం’
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు తమ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడంతో ఆయన స్పందించారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... తప్పు ఒప్పుకుని తెలుగుజాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసుపై త్వరితగతిన నిష్పక్షపాత విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మనీ, మీడియా, మానిపులేషన్‌లతో చంద్రబాబు మోసాలు చేస్తున్నారని మండిపడ్డారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలంటే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. భారత దేశ చరిత్రలో ఇంత నిసిగ్గుగా డబ్బులతో ఎదుటివారిని కొనేసి రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. నిజంగా చంద్రబాబుకు సిగ్గుండాలా. నాలుగేళ్ల క్రితం ఓటు కోట్లు కేసులో టీడీపీ నాయకులు ఆడియో, వీడియో టేపుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన వైనాన్ని దేశం యావత్తు చూసింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రలోభాలకు దిగడంతో ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకున్నారు. (సార్ ఎవరు?) ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఫలానా నాయకుడు మా ముఖ్యమంత్రి అని గర్వంగా చెప్పుకునేట్టు ఉండాలి. మీ సీఎం ఎవరని అడిగితే చంద్రబాబు అని చెప్పటానికి సిగ్గుపడే పరిస్థితులు ఇవాళ కన్పిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసు ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాయి. తప్పు ఒప్పుకుని తెలుగు జాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. కోర్టులను అడ్డం పెట్టుకుని స్టేలు తెచ్చుకుని చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును విచారణను వేగవంతం చేయాలి. చంద్రబాబు పట్ల కేసీఆర్ ఉదారంగా వ్యహరించడం సరికాదు. చట్టబద్ధంగా నిష్పక్షపాత దర్యాప్తు జరిపాల’ని అప్పిరెడ్డి అన్నారు. (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) -
దురహంకారంతో పేట్రేగిపోతున్నారు
పట్నంబజారు (గుంటూరు)/విజయపురం(చిత్తూరు జిల్లా): టీడీపీ నేతలంతా దురహంకారంతో పేట్రేగిపోతున్నారని వారికి రాజ్యాంగమన్నా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలన్నా గౌరవం లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, గుంటూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. దళితులపై ఎమ్మెల్యే చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం గుంటూరు లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేయటంతో పాటు, ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చింతమనేని వ్యాఖ్యలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..దళితులను కించపరుస్తున్న నాయకులపై చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రానున్న రోజుల్లో అధికార దురంహాకారానికి ఓటుతో బుధ్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. నిరసనలో పార్టీ నేతలు కొలకలూరి కోటేశ్వరరావు, బందా రవీంద్రనాథ్, బత్తుల దేవా, జగన్ కోటి, మేరిగ విజయలక్ష్మీ, అంబేద్కర్, పానుగంటి చైతన్య, షేక్ రబ్బాని, బోడపాటి కిషోర్, బాజీ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన అమృతలూరులో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో తెనాలి– చెరుకుపల్లి ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి చింతమనేని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నగరంపాలెం పీఎస్‌లో ఫిర్యాదు.. చింతమనేనిపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) నగరంపాలెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్టేషన్లో ఎస్హెచ్ఓ కె. వెంకటరెడ్డికి ఫిర్యాదును అందజేశారు. చంద్రబాబు అండతోనే చింతమనేని అరాచకాలు: ఎమ్మెల్యే ఆర్కే రోజా ‘ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఆయనకు కొత్తేమీ కాదు. అసెంబ్లీలో మహిళలపై కూడా దురుసుగా ప్రవర్తించారు’అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. దళితులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా విజయపురం మండలం పన్నూరు సబ్‌స్టేషన్ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పాలాభిషేకం చేశారు. రోజా మాట్లాడుతూ..గతంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేశారని గుర్తుచేశారు. అటవీ శాఖ అధికారులను కొట్టి, అంగన్వాడీ కార్యకర్తలను అసభ్యకరంగా మాట్లాడిన నాడే చింతమనేనిని చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందన్నారు. అలా చేసుంటే ఈ రోజు దళితులపై ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసేవారు కాదన్నారు. టీడీపీ నాయకులు ఎస్సీలను కేవలం ఓటర్లగానే చూస్తున్నానరే తప్ప మనుషులుగా చూడడం లేదని, వారి మనోభావాలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నాయకులు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, చింతమనేనిని పార్టీ నుంచి, ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు. -
బాబూ..ఇంకెంతమందిని పోట్టనబెట్టుకుంటావు?
-
‘మంత్రివర్గ భేటీలో అగ్రిగోల్డ్ బాధితుల ఊసే లేదు’
సాక్షి, గుంటూరు: అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు ప్రకటించడం పచ్చి అబద్ధమని అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ రాష్ట్ర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఏపీ మంత్రివర్గం నిర్ణయాలకు సంబంధించి మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు విడుదల చేసిన ప్రతులే అందుకు ప్రత్యక్ష నిదర్శనం అని పేర్కొన్నారు. అందులో ఎక్కడా కూడా అగ్రిగోల్డ్ ఊసే లేదని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెలలోనే ముగ్గురు అగ్రిగోల్డ్ బాధితులు గుండెలాగి మరణించినా.. ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి 263 మంది బాధితులను పొట్టనబెట్టుకున్నా ప్రభుత్వం దాహం తీరలేదా అని ప్రశ్నించారు. -
ఆగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు కాజేయాలని చూస్తున్నారు
-
అగ్రిగోల్డ్ బాధితుల పేర్లు నమోదు కార్యక్రమం ప్రారంభం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రిగోల్డ్ బాసట కమిటీ రాష్ట్ర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం బాధితుల పేర్లు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల లెక్కలను తగ్గించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. పోలీసుల సర్వేలో 19లక్షల 50వేల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నట్టు తేలిందని.. కానీ ప్రభుత్వం ముందే 10లక్షల మంది మాత్రమే ఉందని చెప్పడం అన్యాయమని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. -
‘చెప్పేది చేయడు.. చేసేది చెప్పడు’
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికినా కేసీఆర్ కేసు పెట్టలేదని, ఇద్దరూ లోపల అండర్ స్టాండింగ్‌తో ఉన్నారని, బయటికి మాత్రమే ఆరోపణలు చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు జూనియర్ రాహుల్ గాంధీ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్, చంద్రబాబుని డర్టీ పొలిటీషియన్ అంటే కూడా చంద్రబాబు నేరుగా స్పందించలేదని గుర్తు చేశారు. చంద్రబాబు మొన్న మోదీతో, ఇప్పుడు రాహుల్‌తో..ఎప్పుడు ఎవరితో ఉంటారో అర్థం కావడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ లెటర్ ఇస్తే ఆహ్వానించాలి కానీ ఇలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు హుందాతనం కోల్పోయారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులను చంద్రబాబు అసెంబ్లీలో పిల్లకుంకలు అన్న విషయాన్ని గుర్తు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుంటే నువ్వెందుకు ముసిముసిగా నవ్వుకున్నావ్..అప్పుడు నీ సంస్కారం ఏమైందని బాబుని అడిగారు. ప్రత్యేక హోదా కోసం జగన్ అనేకసార్లు పోరాడితే వెకిలిగా మాట్లాడిన సంగతి గుర్తు లేదా అన్నారు. హైకోర్టు విభజన కోసం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఎందుకు వేశారని ప్రశ్న సంధించారు. చంద్రబాబు లాంటి పచ్చి మోసకారి సీఎంగా ఉండటం రాష్ట్రానికి శని పట్టిందన్నారు. బాబు చేసిన మోసాలు ప్రజలందరికీ తెలుసునని, బాబు గురించి మాట్లాడాలంటేనే జుగుప్సాకరంగా ఉందని అన్నారు. చంద్రబాబూ నువ్వు ఎవరితోనైనా కలువు కానీ.. మేము మాత్రం ఒంటరిగా పోటీ చేసి 135 నుంచి 140 స్థానాలు తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన కోసం వాదించిన అడ్వొకేట్‌కి రూ.66 లక్షల ఫీజు చెల్లించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబువన్నీ డొంక తిరుగుడు మాటలే..చెప్పేది చేయడు, చేసేది చెప్పడని అన్నారు. బాబులా నీతిమాలిన రాజకీయాలు ఎవరూ చేయరు: అప్పిరెడ్డి చంద్రబాబులా నీతిమాలిన రాజకీయాలు ఎవరూ చేయరని అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. 20 లక్షల మంది బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదన్నారు. 240 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 143 మందికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు దోచుకోవాలన్నదే టీడీపీ నాయకుల లక్ష్యమని చెప్పారు. జనవరి 3న అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా అనగానే టీడీపీ నాయకులు హడావిడి చేస్తున్నారని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులకు విలువ ఉన్నా బాధితులకు చెల్లించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని సూటిగా ప్రశ్నించారు. తాము అడ్డుకుంటున్నామనేది వట్టి మాటని, బాధితులకు న్యాయం చేయాలన్నదే మా డిమాండ్ అని అప్పిరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనవరి 3న అన్ని జిల్లాల్లో ధర్నా చేస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందిచకపోతే స్తంభింపచేస్తామని హెచ్చరించారు. బాధితులకు చివరి రూపాయి అందేవరకు మా పోరాటం కొనసాగుతుందని అప్పిరెడ్డి అన్నారు. -
అగ్రిగోల్డ్‌పై కోర్టులనూ తప్పుదోవ పట్టిస్తున్నారు
గుంటూరు వెస్ట్/సత్తెనపల్లి: అధికారంలో ఉన్న పెద్దలు ప్రజలనే కాకుండా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు గుంటూరు కలెక్టరేట్ ఎదుట శనివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ డైమండ్ బాబు అధ్యక్షత వహించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ హాయ్‌లాండ్ అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించారన్నారు. రాష్ట్రంలో 19.70 లక్షల మంది బాధితులకు చెల్లించాల్సిన మొత్తం రూ.6850 కోట్లు ఉండగా అగ్రిగోల్డ్ ఆస్తులు రూ.10 వేల కోట్లకు పైగానే ఉన్నాయన్నారు. తొలి దశలో రూ.1180 కోట్లు విడుదల చేస్తే దాదాపు 80 శాతం మంది బాధితులకు రుణ విముక్తి కలుగుతుందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు మొహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్యపేరుతో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన 14 ఎకరాలు అడ్డదారిలో కొనుగోలు చేశారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుంటూరులో దీక్షలో పాల్గొన్న లేళ్ళ అప్పిరెడ్డి. ఎమ్మెల్యే ముస్తఫా, వెస్ట్ సమన్వయకర్త ఏసురత్నం తదితరులు అగ్రిగోల్డ్ ఆస్తుల కాజేతకు ప్రభుత్వం కుట్ర అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేసేందుకు ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుట్ర పన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. సత్తెనపల్లిలో తాలూకా సెంటర్లో ఏర్పాటు చేసిన అగ్రిగోల్డ్ బాధితుల రిలే నిరాహార దీక్షలో శనివారం ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ సంస్థకు ఉన్న ఖరీదైన ఆస్తులను కారుచౌకగా కొట్టేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. ఆస్తులను బహిరంగ వేలం వేసి బాధితులకు అణాపైసాతో సహా చెల్లిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. బాధితులకు అన్ని విధాలుగా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. దీక్షలతో ప్రభుత్వం దిగి రాకుంటే ఈ నెల 30న జిల్లా కేంద్రంలో దీక్ష చేపడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మర్రి సుబ్బారెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ మక్కెన అచ్చయ్య, అంబటి మురళి, షేక్ నాగూర్‌మీరాన్ తదితరులు మాట్లాడారు. దీక్ష చేస్తున్న వారికి అంబటి రాంబాబు పండ్ల రసం అందించి దీక్షలను విరమింప చేశారు. -
అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఆఖరిపోరాటం
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా ఆఖరిపోరాటం చేయాలని వైఎస్సార్సీపీ నేతలు నిర్ణయించారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన పోరాటానికి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఆదివారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ, బాధితులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కమిటీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మూడండెల పోరాటం చేయాలని నిర్ణయించారు. బాధితులకు చివరి రూపాయి అందేవరకూ పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తుందని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అండగా ఉంటారని నేతలు చెప్పారు. ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశంలో మాట్లాడారు. బొత్స మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీలోను, బయట అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని అనేక పర్యాయలు డిమాండ్ చేసినట్టు గుర్తుచేశారు. చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. వాటాలు తేలకే అగ్రిగోల్డ్ టేకోవర్ నుంచి ఎస్సెల్ గ్రూపు తప్పుకొందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోతే జగన్ సీఎం కాగానే బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ కుంభకోణంపై కేంద్ర సంస్థలతో సమగ్ర విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్లో శారదా చిట్‌ఫండ్ రూ.3,250 కోట్ల స్కామ్‌ను సీబీఐ విచారణ జరిపించిన కేంద్రం.. దానికి రెండింతలు పెద్దదైన అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు పూర్తి న్యాయం జరిగాక అగ్రిగోల్డ్ భూములు కొట్టేసిన పెద్దల పాత్రపై సీబీఐ విచారణ కోరతామని సుబ్బారెడ్డి ప్రకటించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఒక మాఫియా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో రాష్ట్రంలో టీడీపీ పాలన అద్దం పడుతోందన్నారు. అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల్లో పని పూర్తి చేయవచ్చన్నారు. జగన్ సీఎం అయ్యాక బాధితులకు నిధులు విడుదల చేసి ఆదుకుంటామన్నారు. బాధితులెవరు అధైర్యపడొద్దని, చివరి రూపాయి వచ్చే వరకు జగన్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. మండల స్థాయి నుంచి బాధితుల జాబితాను తయారు చేయాలని కమిటీకి సూచించారు. బాధితులకు తెలిసిన అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను కమిటీకి తెలియజేస్తే వాటిని చంద్రబాబు సర్కార్ మింగేయకుండా కాపాడుకుందామన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను చంద్రబాబు సర్కార్ తక్కువ చేసి చూపడం వెనుక కుట్ర ఉందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, పార్టీ నేతలు బొప్పన భవకుమార్, అడపా శేషు, శ్యామ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా పోరాటం... అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా మూడంచెల పోరాటం చేయాలని బాధిత బాసట కమిటీ సమావేశం నిర్ణయించింది. సమావేశం నిర్ణయాలను బాసట కమిటీ కో ఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు, ఈ నెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో బాధితులతో సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా కేంద్రాల్లోనే సభలు ఏర్పాటు చేసి చర్చించి మూడో దశ ఉద్యమాన్ని తీవ్రరూపంలో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. బాధితులకు వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ శ్రేణులు అండగా ఉన్నారనే భరోసా ఇవ్వడం ద్వారా బాధితుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని సమావేశం సూచించింది. సీఎం హడావుడి సమీక్ష అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం కోరుతూ వైఎస్సార్ సీపీ పోరాటాన్ని ముమ్మరం చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో హడావుడిగా సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ సమస్యలపై అధికారులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. ఈ కేసులో వాస్తవస్థితి నివేదికను న్యాయస్థానానికి సమర్పించాలని అడ్వొకేట్ జనరల్‌కు సూచించారు. కొన్ని శక్తులు బాధితుల్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజడి లేవదీయడానికి కుటిలయత్నాలు చేస్తున్నాయని కోర్టుకు చెప్పాలన్నారు. ప్రభుత్వం దగా చేసింది అగ్రిగోల్డ్ సమస్యపై మాట మార్చి రాష్ట్ర ప్రభుత్వం బాధితులను దగా చేస్తోంది. మొదట్లో అగ్రిగోల్డ్ అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయన్న చంద్రబాబు.. ఆ తర్వాత ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ అని భయపెడుతున్నారు. దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని రూ.7 వేల కోట్లు ఇవ్వడం ప్రభుత్వానికి భారం కాదు. – రంగారెడ్డి, ఆలిండియా అగ్రిగోల్డ్ ఏజెంట్లు, ఖాతాదారుల వెల్ఫేర్ సంఘం గుండెపోటుతో అగ్రిగోల్డ్ బాధితురాలు మృతి రామసముద్రం: అగ్రిగోల్డ్ బాధితురాలు గుండెపోటుతో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. చెంబకూరు గ్రామానికి చెందిన అబ్దుల్ రషీద్ కష్టపడి సంపాదించిన సొమ్ము అగ్రిగోల్డ్‌లో జమ చేశాడు. డబ్బులు తిరిగి రాకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటంతో రషీద్ భార్య దిల్షాద్ (58) తీవ్ర మనోవేదనకు గురయ్యింది. ఈ క్రమంలో శనివారం రాత్రి దిల్షాద్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
‘హాయ్ ల్యాండ్‌ని దోచుకోవడానికి కుట్ర’
విజయవాడ: టీడీపీ నాయకులు హ్యాయ్ ల్యాండ్‌ని దోచుకోవడానికి కుట్ర పన్నారనేది స్పష్టంగా కనిపిస్తోందని అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పి రెడ్డి విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో దాదాపు 20 లక్షల అగ్రిగోల్డ్ బాధితులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టినా చంద్రబాబు వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. 260 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నా ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు తీర్చడానికి వైఎస్సార్సీపీ ప్రత్యక్ష కార్యాచరణకి సిద్ధమవుతోందని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. రేపు(ఆదివారం) విజయవాడలో మరోసారి సమావేశం అయిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని, ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు కూడా హాజరవుతారని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల జాబితా ఇప్పటికీ ఆన్లైన్లో ఎందుకు పెట్టడం లేదని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు..బాధితులకు న్యాయం చేయాలన్నదే తమ ప్రయత్నమని వ్యాక్యానించారు. బహిరంగ మార్కెట్లో అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.10 వేల కోట్లు ఉన్నా ప్రభుత్వ చర్యలు మాత్రం బాధితులకు సహాయం చేసే విధంగా వెళ్లడం లేదన్నారు. బాబు అన్ని వర్గాలను మోసం చేశాడు: జంగా చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసగించారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారని చెప్పారు. అచ్చెన్నాయుడికి వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. బీసీలకు టీడీపీ చేసిందేమీ లేదన్నారు. ఈ నెల 20న అన్ని పార్లమెంటు కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. -
హాయ్‌లాండ్ ఆస్తులు దోచకోవడానికి కుట్ర
-
‘బాధితుల జాబితాను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు?’
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు పార్థసారథి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. 1100 కోట్ల రూపాయలు చెల్లిస్తే.. 16 లక్షల కుటుంబాలకు ఊరట లభిస్తుందని తెలిపారు. విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేస్తున్న చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. చంద్రబాబు సర్కార్‌కు ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన లేదన్నారు. హాయ్‌లాండ్ విషయంలో బాధితులను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే 1100 కోట్ల రూపాయలు చెల్లించి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. హాయ్‌లాండ్ ఆస్తులు దోచకోవడానికి కుట్ర వైఎఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. 206 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వంలో కదలిక లేదని మండిపడ్డారు. సీబీసీఐడీ ద్వారా బాధితులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పటివరకు ఎంతమందికి నష్ట పరిహారం ఇచ్చిందని ప్రశ్నించారు. హాయ్‌లాండ్ ఆస్తులను దోచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం వారిని ఆదుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు. బాధితుల జాబితాను బహిర్గతం చేయాలని కోరినప్పటికీ.. ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని ప్రశ్నించారు. ఆదివారం ఉదయం 13 జిల్లాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం కానున్నట్టు తెలిపారు. వారితో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. బాధితులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. బాధితుల ఆర్తనాదాలు కనిపించడం లేదా? వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్గిగా విఫలమైందని మండిపడ్డారు. బాధితుల ఆత్మహత్యలు, ఆర్తనాదాలు చంద్రబాబుకు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందని తెలిపారు. -
బేషరుతుగా బాబు క్షమాపణలు చెప్పాలి
ఎస్వీఎన్ కాలనీ(గుంటూరు): నాయీబ్రాహ్మణులపై సీఎం చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వాఖ్యలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద నాయీబ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జినంద అధ్యక్షత పలువురు సభ్యులు సోమవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. వారికి దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో రోజులు నెట్టుకొస్తున్న నాయీబ్రాహ్మణులు సీఎం చంద్రబాబును కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే ఆయన తన స్థాయిని మరచి మరీ అనుచితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న చంద్రబాబుకు బీసీల కష్టనష్టాలు పట్టడంలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు, వారికి దేవాలయాల్లో ఉద్యోగ భద్రత కల్పిస్తామని, సెలూన్లకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ ఇస్తామని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇంటూరి బాబ్జీనంద మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణులకు ముఖ్యమంత్రి బేషరుతుగా క్షమాపణ చెప్పేవరకు నిరసన కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బాపట్ల పార్లమెంటరీ జిల్లా నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవరం రోహిత్, కాపు సంఘం నేత వంగవీటి నరేంద్ర, వడ్డెర సంఘం నాయకుడు వెంకట్, కుమ్మర యువసేన నేత లలిత్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
అగ్రిగోల్డ్ బాధితులను చంద్రబాబు పట్టించుకోవడం లేదు
-
‘ఏపీ మంత్రులు కూడా ఒప్పుకున్నారు’
సాక్షి, విజయవాడ : ఏపీ సర్కార్ దుర్మార్గపు ఆలోచనల కారణంగా అగ్రిగోల్డ్ బాధితులు నేటికీ ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాత్రం.. వెంటనే ఆ రోజు మంత్రులు స్పందిస్తారని వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వారి పని స్పందించడం వరకేనని, న్యాయం మాత్రం చేయరంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశమైంది. అనంతరం కమిటీ కన్వినర్ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పదవుల్లో ఉన్న వాళ్లు, మంత్రులు కూడా అగ్రిగోల్డ్ అప్పుల కంటే ఆస్తుల విలువ అనేక రెట్లు ఉందని చెప్పిన విషయాన్ని అప్పిరెడ్డి గుర్తుచేశారు. ‘అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశం సీఎం చంద్రబాబుకు ఏ కోశాన లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇటీవల గుంటూరు జిల్లాలో ఇద్దరు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుంది. ఢిల్లీలో చంద్రబాబును అమర్‌సింగ్ కలిసిన తర్వాతే ఎస్ఎల్ గ్రూపు అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయమని చెప్పింది. కొందరు సంస్థ ఆస్తులను చవకగా కొట్టేయాలని చూస్తున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు కలిసొచ్చిన పార్టీలతో వైఎస్సార్సీపీ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తుందని’ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వినర్ తెలిపారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఐదు రాష్ట్రాల్లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం ఇక్కడ జరిగింది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కార మార్గం కోసం వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేత పార్థసారథి అన్నారు. ప్రజల ఆస్తుల్ని ఎలా కాజేయాలన్న ఆలోచన తప్పా.. వారిని ఆదుకోవాలన్న ఆలోచన ఏపీ ప్రభుత్వానికి రాలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే 1100 కోట్లు ఖర్చు చేస్తే 16 లక్షల మంది బాధితులు సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారని వైఎస్సార్సీపీ సూచించినట్లు తెలిపారు. పుష్కరాలకు వేలకోట్లు, సీఎం క్యాంప్ ఆఫీసు, గెస్ట్‌హౌస్‌లకు, విదేశీ పర్యటనల ఖర్చులతో పోల్చితే ఇదేమంత పెద్ద ఖర్చు కాదని చంద్రబాబుకు పార్థసారథి సూచించారు. చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో ఏ పని అయినా చేస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. అగ్రిగోల్డ్ విలువైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భాదితులకు చెల్లింపులు చేయడం కష్టసాధ్యమేం కాదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులని చవకగా కొట్టేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు చంద్రబాబు మీకు వినిపించడం లేదా అని వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ప్రశ్నించారు. బాధ్యత గల సీఎంగా వ్యవహరించి.. చంద్రబాబు ఇప్పటికైనా బాధితులకు న్యాయం చెయ్యాలని సూచించారు. టీడీపీ సర్కార్ చేస్తున్న భిన్న ప్రకటనలతో అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతున్నాయని మజ్జి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ తగ్గించి చెప్పడం సరికాదన్నారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యలు మాత్రం పరిష్కార మార్గం కాదని హితవు పలికారు. -
కాంట్రాక్టు అధ్యాపకులతో చెలగాటమా ?
♦ ప్రభుత్వంపై మండిపడిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ♦ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా గుంటూరు ఎడ్యుకేషన్ : కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాలతో ప్రభుత్వానికి చెలగాటం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం లక్ష్మీపురంలోని ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ‘కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాల కన్నీటి ఘోష’ పేరుతో నిర్వహించిన రాష్ట్రస్థాయి ధర్నాలో ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్‌బాబు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, వై. శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని హమీ ఇచ్చిన చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నెరవేరుస్తారు అధికారంలోకి రాగానే కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన హామీ నెరవేర్చుతారని అప్పిరెడ్డి చెప్పారు. ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్‌ను అమలు పరిచే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. బాబురెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్స్ ద్వారా జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి పొందినప్పటికీ అధ్యాపక నియామకాలకు ఉపాధ్యాయులు ఏనాడూ వ్యతిరేకం కాదని చెప్పారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఉంది: కేఎస్ లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పెట్టిందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేశు మాట్లాడుతూ నిత్యం విలువలు వల్లించే చంద్రబాబు అతి పెద్ధ మోసకారి అని విమర్శించారు. ధర్నాలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీనివాస యాదవ్, కోశాధికారి హరినాథ రెడ్డి, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాజిత్ బాషా, కార్యదర్శి రాంబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుబ్బారావు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు, ఎస్ఎఫ్ఐ గరల్స్ వింగ్ జిల్లా కన్వీనర్ జ్యోతి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
రేషన్ కార్డులపై ప్రభుత్వం కుయుక్తులు