సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత గురించి ఎల్లోమీడియా విషపు రాతలు రాస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్రం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా.. ‘ఎల్లోమీడియా ఏపీలో ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. ఎస్ఆర్సీ కమిటీ సమీక్ష ప్రకారమే వీఐపీల భద్రతను కల్పిస్తారు. కానీ వైఎస్ జగన్ భద్రతకు అధికంగా వ్యయం చేస్తున్నట్టు రోత మీడియా రాసింది.
..సీఎంకి సంబంధించిన భద్రతని ఏ సీఎం కూడా నిర్ణయించుకోరు. ఇంటిలిజెన్స్, పోలీసు అధికారుల నిర్ణయం మేరకు తీసుకుంటారు. చంద్రబాబు కేవలం 120 మంది మాత్రమే భద్రత అంటూ కథలు రాస్తున్నారు. జగన్‌కు కల్పించిన భద్రత రికార్డులు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. సివిల్ పోలీసులు 18 మంది, ఆర్మడ్ 33 మంది,బెటాలియన్ 89 మంది మాత్రమే ఉన్నారు. బయటకు వెళ్లినప్పడు ఆక్టోపస్ 13 మంది ఉంటారు. మొత్తం 196 మంది వైఎస్ జగన్‌కు భద్రత ఉంటారు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇదే విధానం అమలు అవుతుంది. కార్యక్రమాలు, తిరిగే ప్రాంతాలను బట్డి అధికారుల నిర్ణయాలు ఉంటాయి. కానీ ఎల్లోమీడియా తప్పుడు వార్తలు రాస్తోంది.
..చంద్రబాబు బయటకు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆపటం లేదా?. చంద్రబాబు గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ మా గురించి తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదు. చంద్రబాబు తన మనమడికి కూడా 4+4 సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు?. ప్రభుత్వ ధనాన్ని ఎందుకు వినియోగిస్తున్నారు?. తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం సృష్టించవద్దు. చంద్రబాబు, వైఎస్ జగన్‌లకు ఎంత భద్రత ఉందో అధికారిక రికార్డులను బయట పెట్టాలి. ఆ రికార్డులు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వానికి వారధులుగా ఉండాల్సిన చంద్రబాబుకు తొత్తుగా ఎల్లో మీడియా వ్యవహరిస్తుంది’అని విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment